• facebook
  • whatsapp
  • telegram

తీర్మానాలు

 నిజమని భావించి.. నిర్ధారణకు వస్తే! 

కొన్ని అంశాలను ఇచ్చిన పరిమితులకు లోబడి అర్థం చేసుకొని, వాటి మధ్య ఉన్న తార్కిక సంబంధాన్ని కనిపెట్టి,  కావాల్సిన సమాధానాన్ని రాబట్టడం ‘తీర్మానాలు’ అధ్యాయంలో చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల లోతైన ఆలోచనా విధానాన్ని, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అలాంటి ప్రశ్నలు రీజనింగ్‌లో అడుగుతారు. అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొని, కొద్దిగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సాధించుకోవచ్చు.  

ప్రశ్నలో భాగంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రకటనలు ఇస్తారు. ఇచ్చిన ప్రకటనల ద్వారా ఏ విధమైన నిర్ధారణకు రావచ్చో తెలియజేయాల్సి ఉంటుంది. ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ నిజమని భావించాలి. నిర్ధారణకు వచ్చే సందర్భంలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ అంశాలు కూడా సాధ్యపడవచ్చు. అన్ని సందర్భాల్లో          నిజమయ్యే నిర్ధారణనే సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.

ప్రకటనలు - రకాలు

ప్రశ్నలో భాగంగా ఇచ్చే ప్రకటనలు ప్రధానంగా నాలుగు రకాలు అవి..


1. అన్ని  Sలు P లు (All S are P)


ఉదా: అన్ని పుస్తకాలు పెన్నులు



2. కొన్ని S లుP లు (Some S are P)

ఉదా: కొన్ని పుస్తకాలు పెన్నులు


3. ఏ S కూడా P కాదు (No S is P)

ఉదా: ఏ పుస్తకమూ పెన్ను కాదు  


4. కొన్ని S లు P లు కావు (Some S are not P)

ఉదా: కొన్ని పుస్తకాలు పెన్నులు కావు


నోట్‌: ప్రశ్నలో ‘కాదు’(No) అనే పదం ఉంటే రెండు రకాల వెన్‌ చిత్రాల ఆధారంగా సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ఈ రెండు రకాల వెన్‌ చిత్రాల ద్వారా సత్యమయ్యే నిర్ధారణలను మాత్రమే సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.

1. Basic Diagram
2. Possible Diagram


కింది ప్రశ్నల్లో రెండు ప్రకటనలు(Statements)ఇచ్చారు. వాటికి అనుగుణంగా I, II అనే రెండు నిర్ధారణలు (Conclusions) కూడా ఇవ్వడమైంది. ఆ ఇచ్చిన ప్రకటనలు నిజమని భావించి, ఈ ప్రకటనల ద్వారా ఏ విధమైన నిర్ధారణకు వస్తామో తెలపండి.

నిర్ధారణ- I: నిజమైతే సమాధానం 1 

నిర్ధారణ - II: నిజమైతే సమాధానం 2 

రెండు నిర్ధారణలూ నిజమైతే సమాధానం 3 

ఏ నిర్ధారణ నిజం కాకపోతే సమాధానం ‘4’గా గుర్తించాలి.


1. ప్రకటనలు: అన్ని కుర్చీలు భవనాలు

        కొన్ని భవనాలు బల్లలు

నిర్ధారణ-I: కొన్ని కుర్చీలు బల్లలు

నిర్ధారణ-II: కొన్ని బల్లలు కుర్చీలు

వివరణ:


Basic diagram, Possible Diagram ద్వారా

సమాధానం: 4


2. ప్రకటనలు: అన్ని పువ్వులు చెట్లు

అన్ని చెట్లు పండ్లు

నిర్ధారణ-I: కొన్ని పండ్లు పువ్వులు

నిర్ధారణ-II: అన్ని పువ్వులు పండ్లు

వివరణ:


సమాధానం: 3


 

3. ప్రకటనలు: కొందరు క్రీడాకారులు గాయకులు 

అందరు గాయకులు పొడవైనవారు

నిర్ధారణలు:

I: కొందరు క్రీడాకారులు పొడవైనవారు

II: అందరు క్రీడాకారులు పొడవైనవారు

వివరణ:

సమాధానం: 1



4. ప్రకటనలు: కొన్ని కూరగాయలు పండ్లు.

ఏ పండూ నలుపు కాదు.

నిర్ధారణలు:

I. కొన్ని పండ్లు కూరగాయలు.

II. ఏ కూరగాయ నలుపు కాదు.

వివరణ:

సమాధానం: 1


5. ప్రకటనలు: అన్ని కుక్కలు కోతులు

ఏ కోతి, పిల్లి కాదు

నిర్ధారణలు:

I. ఏ కుక్క పిల్లి కాదు

II. ఏ పిల్లి కుక్క కాదు

వివరణ:

  

సమాధానం: 3

6. ప్రకటనలు: కొన్ని స్కూటర్లు ట్రక్కులు

అన్ని ట్రక్కులు, రైళ్లు

నిర్ధారణలు:

I. కొన్ని స్కూటర్లు రైళ్లు

II. ఏ ట్రక్కు, స్కూటర్‌ కాదు

వివరణ:

సమాధానం: 1

7. ప్రకటనలు: అన్ని పుస్తకాలు పెన్సిళ్లు

కొన్ని పెన్సిళ్లు పెన్నులు

నిర్ధారణలు:

I. అన్ని పెన్నులు పుస్తకాలు

II. కొన్ని పెన్సిళ్లు పుస్తకాలు

వివరణ:


సమాధానం: 2


8. ప్రకటనలు: కొన్ని బస్సులు నాలుగు చక్రాల బండ్లు

అన్ని నాలుగు చక్రాల బండ్లు వ్యాన్‌లు

నిర్ధారణలు:

I. కొన్ని వ్యాన్‌లు బస్సులు

II. అన్ని నాలుగు చక్రాల బండ్లు బస్సులు

వివరణ:

సమాధానం: 1


9. ప్రకటనలు: అన్ని నెమళ్లు సింహాలు

కొన్ని పులులు నెమళ్లు

నిర్ధారణలు:

I. అన్ని పులులు సింహాలు

II. కొన్ని సింహాలు పులులు కావు

వివరణ:

సమాధానం: 2


10. ప్రకటనలు: కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులు

అందరు విద్యార్థులు బాలికలు

ప్రకటనలు:

I. అందరు ఉపాధ్యాయులు బాలికలు

II. కొందరు బాలికలు ఉపాధ్యాయులు

III. కొందరు బాలికలు విద్యార్థులు

IV. అందరు విద్యార్థులు ఉపాధ్యాయులు

1) నిర్ధారణ-II మాత్రమే సత్యం   2) నిర్ధారణ -I, II, III సత్యం

3) నిర్ధారణ-II, IIIసత్యం   4) నిర్ధారణలన్నీ సత్యం

వివరణ:


 సమాధానం: 1     

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి


 


 

Posted Date : 30-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌