వలయంలో సాగే శక్తి ప్రసారం!
ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడెక్కడో బల్బు వెలుగుతుంది, మొబైల్ ఛార్జింగ్ మొదలవుతుంది, టీవీలు, కంప్యూటర్లు ఆన్ అవుతాయి. వైర్ల ద్వారా విద్యుత్తు ఆ వస్తువులకు చేరడంతో అవి పని చేయడం ప్రారంభిస్తాయి. అదే విద్యుత్తు ప్రవాహం. భౌతికశాస్త్రం పరిభాషలో చెప్పాలంటే ఒక వాహకం ద్వారా సాగే శక్తిపూరిత ఎలక్ట్రాన్ల ప్రవాహమే విద్యుత్తు. ఆ విధంగా ప్రసారమయ్యే విద్యుత్తునే ప్రవాహ విద్యుత్తు అంటారు. ఇందులో వాహకాలతోపాటు నిరోధాలు, బంధకాలు, కెపాసిటర్లు తదితరాలు ఉంటాయి. నిత్యజీవితంలో అత్యంత ప్రధాన భాగమైన ఈ ప్రవాహ విద్యుత్తు పనిచేసే విధానం, ఉపయోగించే పరికరాలు, వాటి అనువర్తనాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.
1. ఘటాల్లో రసాయన శక్తి ఏ శక్తిగా మారుతుంది?
జవాబు: విద్యుత్ శక్తి
2. విద్యుత్ నిరోధకత దేనిపై ఆధారపడుతుంది?
1) మధ్యచ్ఛేద వైశాల్యం 2) పదార్థ స్వభావం 3) పొడవు 4) పైవన్నీ
జవాబు: పైవన్నీ
3. మానవ శరీరంలో విద్యుత్ ఘాతం కలగడానికి ప్రధాన కారణం గుర్తించండి.
జవాబు:అధిక ఓల్టేజీ
4. లైటనింగ్ కండక్టర్‌ను ఏ లోహంతో తయారు చేస్తారు?
జవాబు: కాపర్
5. విద్యుత్ బల్బ్‌లు, కంటి అద్దాల్లో ఉపయోగించే గాజు రకం?
జవాబు: ప్లింట్ గాజు
6. ఫొటో విద్యుత్ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది?
జవాబు: కాంతిశక్తి విద్యుత్ శక్తిగా
7. రెక్టిఫయర్ను ఉపయోగించడానికి కారణం?
జవాబు: ఏసీని డీసీగా మారుస్తుంది.
8.కిందివాటిలో విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం?
జవాబు: గ్రాఫైట్
9. ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్‌లో ఉపయోగించే అబ్రకం ఒక
జవాబు: విద్యుత్ బంధకం, ఉష్ణ వాహకం
10. అనంత సంఖ్యలో ఆవేశాలున్న భూమి ఫలిత విద్యుత్ పొటెన్షియల్ ఎన్ని ఓల్ట్‌లు?
జవాబు: శూన్యం
11. నిరోధం, ఓల్టేజీ, కరెంట్లను కొలిచే పరికరం?
జవాబు:మల్టీ మీటరు
12. గృహ అవసరాల కోసం 240 HZ వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం?
జవాబు: 50HZ
13. అధిక ఉష్ణోగ్రత వద్ద అతి వాహకతను ప్రదర్శించే పదార్థం?
జవాబు: పింగాణి
14. వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు?
జవాబు: ఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు
15. ఫ్యూజ్ వైర్‌ను ఏ మిశ్రమ లోహాలతో తయారు చేస్తారు?
జవాబు: తగరం, సీసం
16. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్‌ను దేంతో తయారు చేస్తారు?
జవాబు: సిలికాన్
17. ఒక విద్యుత్ కెటిల్లో నీరు దేనివల్ల వేడెక్కుతుంది?
జవాబు: సంవహనం
18. అర్ధవాహకాన్ని వేడి చేస్తే దాని వాహకత్వంలో జరిగే మార్పును గుర్తించండి.
జవాబు:పెరుగుతుంది
19. విద్యుత్ వలయానికి సమాంతరంగా కలిపే పరికరం?
జవాబు: ఓల్ట్ మీటరు
20. పొడి బ్యాటరీలో ఉపయోగించే ఎలక్ట్రోలైట్లు?
జవాబు: అమ్మోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్
21. డైనమో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జవాబు: విద్యుదయస్కాంత ప్రేరణ
22. కింది వాటిలో ఏ బల్బును వెలుతురు కోసం అత్యధికంగా ఉపయోగిస్తారు?
జవాబు:టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు
23. కిందివాటిలో అధిక వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఎలక్ట్రిసిటీ తయారీ పద్ధతి?
జవాబు: కోల్
24. విద్యుత్ వలయంలో కెపాసిటర్‌ను ఉపయోగించడానికి కారణం?
జవాబు:విద్యుత్‌ను నిల్వ చేయడానికి
25. విద్యుత్ ఫ్యూజ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జవాబు: జౌల్ ఫలితం
26. అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి ఉపయోగించే పరికరం?
జవాబు: గాల్వనో మీటరు
27. ఫిలమెంట్‌ను మందం తక్కువగా, పొడవు ఎక్కువగా ఉండేలా అమర్చడానికి కారణం ఏమిటి?
జవాబు: పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది.
28. ఎలక్ట్రికల్ హీటర్, ఐరన్ బాక్స్, కుక్కర్లలో వాడే ఫిలమెంట్‌ను ఏ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు?
జవాబు:నిక్రోమ్
29. ఫ్యాన్ రెగ్యులేటర్స్, రేడియోల్లో వాల్యూమ్ కంట్రోల్ కోసం ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు?
జవాబు: రియోస్టాట్
30. ఇంట్లో ఓ బల్బు కాలిపోయినప్పటికీ మిగిలిన ఉపకరణాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. వీటిని ఏ సంధానంలో అమరుస్తారు?
జవాబు:సమాంతర సంధానం
31. ట్రాన్సిస్టర్, టార్చిలైట్, గోడ గడియారాలు, రేడియోల్లో ఉపయోగించే ఘటాలు?
జవాబు: అనార్ద్ర ఘటం
32. తీగల ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దానిచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:ఆయిర్స్టెడ్
33. టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, వంతెనలు తుప్పుపట్టకుండా వాటి తలాలపై జింక్ లోహంతో పూతపూసే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:గాల్వనైజేషన్
34. ఛార్జ్ చేసే బ్యాటరీని కనుక్కున్న శాస్త్రవేత్త?
జవాబు: గాస్టన్ ప్లాంటే
35. సూపర్ కండక్టివిటీని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:కామర్లింగ్ ఓమ్స్
36. రిఫ్రిజిరేటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జవాబు:ఫెల్టియర్ ఫలితం
37. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం?
జవాబు:విద్యుత్ మోటార్
38. నిర్దిష్ట ప్రమాణాలతో తయారుచేసిన ఎల్ఈడీ బల్బు జీవితకాలం ఎన్ని గంటలు?
జవాబు: 50,000 గంటలు
39. విశిష్ట నిరోధం ప్రమాణాలు?
జవాబు:ఓమ్ - మీటర్
40. షార్ట్ సర్క్యూట్ (లఘు వలయం) అంటే?
జవాబు:రెండు బిందువుల మధ్య విద్యుత్ సర్క్యూట్‌కు అంతరాయం కలగడం
41. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
1) వెండి మంచి విద్యుత్ వాహకం 2) డైమండ్ మంచి విద్యుత్ బంధకం 3) సిలికాన్ అతి ఉత్తమమైన అర్ధవాహకం
జవాబు: పైవన్నీ
42. ఫ్యూజ్ వైరుకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించండి.
జవాబు: తక్కువ నిరోధం, తక్కువ ద్రవీభవన స్థానం
43. విద్యుత్ పొటెన్షియల్‌ను కొలిచే పరికరం?
జవాబు:ఓల్ట్
44. ఒక తీగచుట్టకు దగ్గరలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త?
జవాబు: మైకెల్ ఫారడే
45. విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కినప్పుడు కాలిపోకుండా ఉండేందుకు వలయంలో వినియోగించే రక్షణ పరికరం?
జవాబు: ఫ్యూజ్
46. 400 ఏళ్ల కిందట ఏ దేశస్థులు విద్యుత్‌పై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు?
జవాబు:బ్రిటన్
47. కిందివాటిలో ఏ లోహం తన ద్వారా విద్యుత్‌ను పాక్షికంగా ప్రసరింపజేస్తుంది?
జవాబు: జర్మేనియం
48. స్వచ్ఛమైన నీరు (స్వేదన జలం) విద్యుత్ పరంగా ఎలా ప్రవర్తిస్తుంది?
జవాబు:విద్యుత్ బంధకం
49. గృహాల్లో ఉపయోగించే కరెంట్‌ను కొలిచే ప్రమాణాలు?
జవాబు:కిలోవాట్ అవర్
50. ఒక హార్స్పవర్ ఎన్ని వాట్స్కు సమానం?
జవాబు: 746