• facebook
  • whatsapp
  • telegram

భారత ద్రవ్య వ్యవస్థ - కరెన్సీ

1. భారతీయ ద్రవ్య యూనిట్‌......

1) రూపాయి      2) వెండి  

3) బంగారం      4) రాగి

 

2. రూపాయికి మూలం....

1) రూపాయి      2) రూబెల్‌  

3) రుపియా      4) వెండి

 

3. భారత ప్రభుత్వానికి కరెన్సీ జారీ చేసే అధికారాన్ని కల్పించిన చట్టం......

1) పేపర్‌ (కాగితం) కరెన్సీ చట్టం, 1861

2) కరెన్సీ విధానం, 1926

3) ఆర్‌బీఐ చట్టం, 1934

4) స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్, 1969

 

4. రుపియా వెండి నాణేన్ని ప్రవేశపెట్టిన చక్రవర్తి?

1) షేర్షా      2) అక్బర్‌  

3) అశోకుడు     4) శ్రీకృష్ణదేవరాయలు

 

5. రుపియా నాణెం ముద్రణకు ఉపయోగించిన లోహం?

1) రాగి         2) నికెల్‌  

3) బంగారం          4) వెండి

 

6. భారత ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సంవత్సరం?

1) 2016, నవంబరు 6   

2) 2016, నవంబరు 7

3) 2016, నవంబరు 8  

4) 2016, నవంబరు 9

 

7. పెద్దనోట్ల రద్దు ప్రధాన లక్ష్యం.....

1) నల్లధనాన్ని నిర్మూలించడం

2) దొంగనోట్లను అరికట్టడం

3) ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం

4) పైవన్నీ

 

8. మన దేశంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2017లో ఒక కమిటీని నియమించింది. దీనికి అధ్యక్షులుగా ఉన్నది ఎవరు?

1) నారా చంద్రబాబు నాయుడు

2) కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు

3) నిర్మలా సీతారామన్‌

4) శక్తికాంతదాస్‌

 

9. 2016లో చేసిన పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య....

1) నగదు కొరత   

2) బంగారం కొరత

3) నిత్యావసరాల కొరత  4్శ పైవన్నీ

 

10. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన భారతీయ రూపాయి యూనిట్‌ విభాగాలు.....

1) రూపాయి, పావలా   2) బేడా, అణా

3) కాణీ, పైసా         4) పైవన్నీ

 

11. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ్శ ఏ సంవత్సరం నుంచి కరెన్సీ నోట్లు జారీ చేయడం ప్రారంభించింది?

1) 1936   2) 1937   3) 1938   4) 1939

 

12. భారతదేశంలో నాణేలు ముద్రించే ముద్రణాలయాలు ఉన్న ప్రదేశాలు....

1) కలకత్తా, ముంబయి, హైదరాబాద్, నోయిడా

2) న్యూదిల్లీ, చెన్నై, పట్నా, కొచ్చిన్‌

3) బెంగళూరు, మైసూర్, మంగళూరు, గుంటూరు

4) కాన్పూర్, ఇండోర్, దేవాస్, నాసిక్‌

 

13. సమీప ద్రవ్యంలో కింది వేటిని పరిగణిస్తారు?

1) ట్రెజరీ బిల్లులు, బాండ్లు

2) డిబెంచర్లు, కాలపరిమితి డిపాజిట్లు

3) ప్రామిసరీ నోట్లు          4) పైవన్నీ

 

14. మనదేశంలో కరెన్సీ ముద్రణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) నాగ్‌పుర్‌         2) నాసిక్‌ 

3) హైదరాబాద్‌         4) దిల్లీ

 

15. దేశంలో ఆధునిక కరెన్సీ ముద్రణ కేంద్రాలను ్బల్న్టీ’౯-i)’్ట ద్యి౯౯’-‘్వ -్న్మ’ ్ప౯’((్శ ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) మైసూర్‌ (కర్ణాటక) 

2) సాల్బోని (పశ్చిమ్‌ బంగ)

3) 1, 2   

4) దేవాస్‌ (మధ్యప్రదేశ్)

 

16. రూపాయి చిహ్నం రూపకర్త.....

1) డి.ఉదయ్‌ కుమార్‌ 

2) హెచ్‌.ఉదయ్‌ భాస్కర్‌

3) పి.ఉషా థోరట్‌    

4) ఎస్‌.రంగరాజన్‌

 

17. బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో లేదా ఇతర సంస్థల్లో డిపాజిట్లుగా ఉన్న లేదా నగదు రూపంలో ఉన్న లెక్క చూపని (Unaccounted) ద్రవ్యాన్ని ప్రకటించడంకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం....

1) పీఎం గరీబ్‌ కల్యాణ్‌ డిపాజిట్‌ పథకం 

2) పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన 

3) పీఎం కేర్‌ పథకం 

4) ఆత్మ నిర్భర్‌ భారత్‌

 

18. డిజిటల్‌ కరెన్సీ అంటే?

1) సంప్రదాయ పేపర్‌ కరెన్సీకి డిజిటల్‌ రూపం

2) బ్లాక్‌చైన్‌ సాంకేతికత ఆధారిత వ్యాలెట్ల ద్వారా డిజిటల్‌ కరెన్సీ మార్పిడి లేదా బదిలీ జరుగుతుంది. 

3) 1, 2    

4) నగదు రహిత విధానం 

 

19. క్రిప్టో కరెన్సీ (Crypto Currency) అనేది ఒక రకమైన.......

1) డిజిటల్‌ కరెన్సీ  

2) ప్రత్యామ్నాయ కరెన్సీ 

3) వర్చువల్‌ కరెన్సీ   

4) పైవన్నీ 

 

20. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ అంటే.....

1) డిజిటల్‌ కరెన్సీని స్టోర్‌ చేయడంతోపాటు చేసిన లావాదేవీలను నమోదు చేసేందుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం.

2) సప్లయ్‌ - చైన్‌ టెక్నాలజీ 

3) డిజిటల్‌ టెక్నాలజీ      4) ఏదీకాదు 

 

21. కాగితం ద్రవ్యాన్ని (Paper Money) మొదటిసారి ఏ దేశంలో ఉపయోగించారు?

1) జపాన్‌          2) చైనా 

3) జర్మనీ         4) బ్రిటన్‌

 

22. దశాంశ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం....

1) 1995     2) 1956 

3) 1957     4) 1958

 

23. 'Money is what money does" అని నిర్వచించింది ఎవరు?

1) వాకర్‌     2) ఫ్రీడ్‌మన్‌ 

3) రాబర్ట్‌సన్‌     4) క్రౌథర్‌

 

24. ద్రవ్యత్వం(Liquidity) అంటే?

1) సత్వరం ద్రవ్యంలోకి మార్చుకోగలిగే ఆస్తి

2) వెంటనే కొనుగోలు చేసే శక్తి

3) ఒక వస్తువు విలువ తగ్గకుండా, సులభంగా తక్కువ కాలంలో ద్రవ్యంగా మార్చగల గుణం

4) పైవన్నీ

 

25. ‘‘దేనికైతే సర్వజన అంగీకారం ఉంటుందో అదే ద్రవ్యం’’ అని పేర్కొంది ఎవరు?

1) సెలిగ్‌మన్‌     2) వాకర్‌ 

3) క్రౌథర్‌     4) రాబర్ట్‌సన్‌

 

26. కరెన్సీ (Currency) అంటే?

1) ఆర్థిక వ్యవస్థలో చలామణి కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు ముద్రించిన నాణేలు, పేపర్‌ నోట్లు

2) బంగారం, వెండి నాణేలు

3) చెక్కులు, వినిమయ బిల్లులు

4) వ్యాపార బిల్లులు, బాండ్లు

 

27. భారతదేశంలో మొట్టమొదట ముద్రించిన నాణేలు......

1) పంచ్‌-మార్క్‌డ్‌ నాణేలు    2) సిర్కా 

3) రాగి           4) బంగారం

 

28. కిందివాటిలో హెలికాప్టర్‌ మనీకి (Helicopter Money) సంబంధించి సరైనవి?

ఎ) నగదును నేరుగా ప్రజలకు అందిస్తారు.

బి) నోట్లను హెలికాప్టర్‌తో జారవిడిచినట్లు అనే అర్థం వచ్చేలా ఈ విధానానికి ఈ పేరు పెట్టారు

సి) దేశంలో సంక్షేమ పథకాలను అమలుచేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి కేటాయించే నగదును హెలికాప్టర్‌ మనీ అంటారు.

1) ఎ, బి      2) బి, సి  

3) ఎ, సి     4) పైవన్నీ

 

29. హెలికాప్టర్‌ మనీ అనే పదాన్ని మొదటిసారి ఎప్పుడు ఉపయోగించారు? (దీన్ని అమెరికన్‌ ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ వాడుకలోకి తెచ్చారు.)

1) 1967     2) 1968  

3) 1969      4) 1970

 

30. క్రీ.పూ. 6వ శతాబ్దానికి ముందు అమల్లో ఉన్న నాణెం...

1) సిర్కా      2) వెండి

3) రాగి      4) బంగారం

 

సమాధానాలు

1 - 1  2 - 3  3 - 1  4 - 1  5 - 4  6 - 3  7 - 4  8 - 1  9 - 1 10 - 4  11 - 3  12 - 1  13 - 4  14 - 2  15 - 3  16 - 1  17 - 1  18 - 3  19 - 4  20 - 1  21 - 2  22 - 3  23 - 1  24 - 4  25 - 1  26 - 1  27 - 1  28 - 4  29 - 3  30 - 1

 

మరికొన్ని...

1. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరాను పెంచేందుకు కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున ఆస్తులు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది.

బి) ఆర్‌బీఐ కరెన్సీని ముద్రించి, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులకు సున్నా వడ్డీకి లేదా తక్కువ వడ్డీ రేట్లకు నిధులు అందిస్తుంది.

సి) జీడీపీలో నిర్దేశించిన శాతం మేరకు ఈ విధానం ద్వారా నిధుల లభ్యతను పెంచుతారు.

1) ఎ, బి    2) బి, సి   3) ఎ, సి    4) పైవన్నీ

 

2. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, నాణేల ముద్రణను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1949    2) 1950    3) 1951   4) 1954

 

3. మూల్య హీనీకరణ ్బదీ’్ర్చః్య్చ్మi్న-్శ అంటే?

1) ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ (బహిర్గత) విలువను తగ్గించడం

2) ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ విలువను పెంచడం

3) కరెన్సీ విలువను బంగారం రూపంలోకి మార్చడం

4) కరెన్సీ విలువను వెండి రూపంలోకి మార్చడం

 

4. ప్రభుత్వం లేదా ప్రభుత్వ విభాగంగా భావించే కేంద్ర బ్యాంకు జారీ చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?

1) చట్టబద్దమైన ద్రవ్యం  2) సమీప ద్రవ్యం

3) కాగిత ద్రవ్యం        4) పరపతి ద్రవ్యం

 

5. వ్యక్తులు తమ ఇష్టానుసారంగా కాగిత ద్రవ్యాన్ని బంగారం లేదా వెండి లోహాల్లోకి మార్చుకోవచ్చు. దీనికి వీలుకలిగించే ద్రవ్యాన్ని ఏమంటారు?

1) పరివర్తనీయ కాగిత ద్రవ్యం

2) అపరివర్తనీయ కాగిత ద్రవ్యం

3) కాగిత ద్రవ్యం    4) పరపతి ద్రవ్యం

 

6. ఒక నాణెం తయారీకి ఉపయోగించే లోహం విలువ కంటే, ఆ నాణెం చలామణి విలువ ఎక్కువగా ఉంటే ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?

1) చిహ్నద్రవ్యం (Token money)

2) ప్రతినిధి ద్రవ్యం

3) ప్రమాణ ద్రవ్యం    4) శాసన ద్రవ్యం

 

7. శాసన ద్రవ్యం అంటే?

1) అత్యవసర పరిస్థితుల్లో జారీచేసే కరెన్సీ

2) నిరంతరం జారీ చేసే కరెన్సీ

3) నిర్ణీత కాలంలో జారీచేసే కరెన్సీ

4) పరిపాలన సంక్షోభం ఏర్పడినప్పుడు జారీచేసే కరెన్సీ

 

8. సామాన్య ద్రవ్యం (Ordinary money) లేదా సంకుచిత ద్రవ్యం (Narrow money) అంటే ఏమిటి?

1) ప్రజల వద్ద చలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, వాణిజ్య బ్యాంకులు సృష్టించే డిమాండ్‌ డిపాజిట్లు

2) బాండ్లు   3) సెక్యూరిటీలు  

4) చెక్కులు

 

9. ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సరఫరా భావనలను ప్రవేశ పెట్టింది. వీటిని ఏమంటారు?

1) ద్రవ్య నిల్వ కొలమానాలు 

2) ద్రవ్య సమష్టి  

3) 1, 2       4) ద్రవ్య విధానం

 

10. మొదటి స్మారక నాణేన్ని ఎప్పుడు ముద్రించారు?

1) 1961      2) 1962 

3) 1963     4) 1964

 

సమాధానాలు

1 - 4  2 - 2  3 - 1  4 - 1  5 - 1   6 - 1  7 - 1  8 - 1  9 - 3 10 - 4

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌