• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలోనూ వేల్స్‌ యువరాజు! 

కేంద్ర కార్యనిర్వాహక శాఖ  అధికారాలు, విధులు

(రాష్ట్రపతులు  ఉపరాష్ట్రపతులు)

మన దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు సమున్నత ఔన్నత్యం ఉంది. ఇప్పటివరకు ఈ పదవులకు ఎన్నికైన వారెందరో రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. తమ వ్యక్తిగత ప్రతిభ, విశిష్టతలతో పదవులకే వన్నె తెచ్చారు. ఆ మహామహుల ప్రస్థానం, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులు, పదవీకాలాల గురించి అభ్యర్థులకు అవగాహన ఉండాలి. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాధాన్యం, సంబంధిత ఆర్టికల్స్‌ గురించి తెలుసుకోవాలి. 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. ప్రతిభా పాటిల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి.

బి) బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత.

సి) రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

డి) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1) ఎ, బి, డి             2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, సి          4) బి, సి, డి


2. ఎ.పి.జె.అబ్దుల్‌ కలాంకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి.

బి) 1997లో భారతరత్న పురస్కారం పొందారు.

సి) ఈయన జన్మదినమైన అక్టోబరు 15ను 'ప్రపంచ విద్యార్థి దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు.

డి) "Ignited Minds" అనే పుస్తకం రాశారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి

3) ఎ, బి, డి         4) ఎ, సి, డి


3. ప్రణబ్‌ ముఖర్జీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి ఎన్నికల్లో పి.ఎ.సంగ్మాపై గెలుపొందారు.

బి) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు.

సి) ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.

డి) రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు.

1) ఎ, సి, డి సరైనవి           2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి           4) బి, సి, డి సరైనవి


4. ప్రణబ్‌ ముఖర్జీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాజ్యసభకు 5 సార్లు ఎన్నికయ్యారు.

బి) లోక్‌సభకు 2 సార్లు ఎన్నికయ్యారు.

సి) భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారు.

డి) ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు పొందారు.

1) ఎ, బి, డి సరైనవి            2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి        4) ఎ, సి, డి సరైనవి


5. రామ్‌నాథ్‌ కోవింద్‌కు సంబంధించి సరైన జవాబు గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్‌పై గెలుపొందారు.    

బి) 2017, జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు.

సి) బిహార్‌ గవర్నర్‌గా పనిచేశారు.

డి) ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

1) ఎ, బి సరైనవి                2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి     4) బి, సి, డి సరైనవి

6. భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి గురించి వివరణ ఎక్కడ ఉంది?

1) 5వ భాగం - ఆర్టికల్‌ 63 నుంచి 70 వరకు

2) 5వ భాగం - ఆర్టికల్‌ 65 నుంచి 71 వరకు

3) 6వ భాగం - ఆర్టికల్‌ 63 నుంచి 72 వరకు

4) 6వ భాగం - ఆర్టికల్‌ 64 నుంచి 70 వరకు

7. కింద అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 63 - భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.

బి) ఆర్టికల్‌ 64 - ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

సి) ఆర్టికల్‌ 65 - రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు.

డి) ఆర్టికల్‌ 66 - ఉపరాష్ట్రపతిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.

1) ఎ, సి, డి                     2) ఎ, బి, సి, డి        

3) ఎ, బి, సి సరైనవి        4) ఎ, బి, డి

8. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలను గుర్తించండి.

ఎ) భారతీయ పౌరుడై ఉండాలి 

బి) పార్లమెంటు సభ్యుడై ఉండాలి

సి) 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

డి) రూ.15 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి.

1) ఎ, బి, డి సరైనవి           2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి           4) ఎ, బి, సి, డి సరైనవి


9. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే 'ఎలక్టోరల్‌ కాలేజ్‌'లో సభ్యులు/ఓటర్లుగా ఎవరుంటారు?

ఎ) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు.

బి) పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు.

సి) పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ్యులు.

డి) పార్లమెంటు ఉభయ సభల సభ్యులు.

1) ఎ, బి, డి సరైనవి           2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి           4) ఎ, బి, సి, డి సరైనవి


10. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) మన దేశ ఉపరాష్ట్రపతి పదవి అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవిని పోలి ఉంటుంది.

బి) ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి.

సి) ఉపరాష్ట్రపతిని పార్లమెంటు 2/3 వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు.

డి) ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ సభలో హెచ్‌.వి.కామత్‌ తన వాదనను బలంగా వినిపించారు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి

3) ఎ, బి, డి            4) ఎ, బి, సి, డి

11. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది.

బి) ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని 'ఎలక్టోరల్‌ కాలేజ్‌'లోని 20 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 20 మంది సభ్యులు బలపరచాలి.

సి) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థులు తిరిగి డిపాజిట్‌ పొందేందుకు అర్హులు.

1) ఎ, సి        2) ఎ, బి        3) బి, సి        4) ఎ, బి, సి

12. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఉపరాష్ట్రపతి పదవీకాలం రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు

బి) ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

సి) ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాలి.

డి) ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా తొలగించగలదు.

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి

3) ఎ, సి, డి         4) ఎ, బి, సి, డి


13. జ్ఞానీ జైల్‌సింగ్‌ అనారోగ్యానికి గురైనపుడు ఏ ఉపరాష్ట్రపతి 25 రోజులపాటు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు?

1) బసప్ప దానప్ప జెట్టి        2) జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా

3) శంకర్‌దయాళ్‌ శర్మ        4) కె.కృష్ణకాంత్‌

14. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1962 నుంచి రహస్య ఓటింగ్‌ విధానంలో ఎన్నిక జరుగుతుంది.

బి) రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

సి) తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

డి) దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు.

1) ఎ, బి, సి         2) ఎ, బి, సి, డి

3) ఎ, సి, డి          4) ఎ, బి, డి

15. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఉపరాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

బి) ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వేతనం పొందుతారు.

సి) ఉపరాష్ట్రపతి వేతనం భారత అసంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

డి) ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతున్నారు.

1) ఎ, సి, డి          2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి         4) ఎ, బి, డి


16. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి అనే విషయాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ వివరిస్తుంది?

1) ఆర్టికల్‌ 67(A)        2) ఆర్టికల్‌ 67(B)

3) ఆర్టికల్‌ 68(A)        4) ఆర్టికల్‌ 68(B)


17. ఉపరాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో జీతభత్యాలు పొందుతారు.

బి) వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

సి) వీరి జీతభత్యాలు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తాయి.

డి) వీరి జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి         4) ఎ, బి, డి

18. ఉపరాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

బి) పదవీ విరమణ తర్వాత పింఛను సదుపాయం ఉంటుంది.

సి) ఆర్టికల్‌ 97 ప్రకారం రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో నెలకు రూ.4 లక్షలు వేతనం పొందుతారు.

డి) వీరి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్‌ ఉంటుంది.

1) ఎ, సి, డి              2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి         4) బి, సి, డి


19. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని 'వేల్స్‌ యువరాజు'తో ఎవరు పోల్చారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌          2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌    

3) అనంతశయనం అయ్యంగార్‌   4) ప్రొమథ్‌ రంజన్‌ ఠాగూర్‌


20. ఉపరాష్ట్రపతులు, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

a) ఎం.వెంకయ్య నాయుడు i) నజ్మాహెప్తుల్లా
b) మహ్మద్‌ హమీద్‌ అన్సారీ ii) సుశీల్‌ కుమార్‌ షిండే
c) బైరాన్‌సింగ్‌ షెకావత్‌ iii) గోపాలకృష్ణ గాంధీ
d) కె.కృష్ణకాంత్‌ iv) సుర్జీత్‌సింగ్‌ బర్నాలా

1) a-iii, b-i, c-ii, d-iv                2) a-iii, b-i, c-iv, d-ii

3) a-iv, b-i, c-ii, d-iii                4) a-i, b-iii, c-ii, d-iv


21. ఏకగ్రీవంగా ఎన్నికకాని ఉపరాష్ట్రపతిని గుర్తించండి.

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌         2) జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా

3) శంకర్‌దయాళ్‌ శర్మ        4) కె.ఆర్‌.నారాయణన్‌


22. ఉపరాష్ట్రపతులు, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

a) జాకీర్‌ హుస్సేన్‌  i) సావత్‌ సింగ్‌
b) వరాహగిరి వెంకటగిరి ii) ప్రొఫెసర్‌ హబీబ్‌
c) గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌ iii) హెచ్‌.వి.కామత్‌
d) బసప్ప దానప్ప జెట్టి iv) ఎన్‌.ఇ.హోరో

1) a-iii, b-i, c-ii, d-iv   2) a-iii, b-i, c-iv, d-ii

3) a-iv, b-i, c-ii, d-iii   4) a-i, b-iii, c-ii, d-iv


23. కింద పేర్కొన్న ఏ ఉపరాష్ట్రపతి రెండు పర్యాయాలు పదవి నిర్వహించారు?

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌ హుస్సేన్‌

2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, బసప్ప దానప్పజెట్టి

3) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహ్మద్‌ హమీద్‌ అన్సారీ

4) ఆర్‌.వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌ శర్మ


సమాధానాలు

11; 21; 33; 41; 52; 61; 73; 82; 94; 103; 114; 121; 132; 141; 154; 162; 174; 182; 191; 201; 214; 224; 233. 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌