• facebook
  • whatsapp
  • telegram

పజిల్‌ టెస్ట్‌-1            

సూచనలు (ప్ర. 1 - 5): కింది సమాచారం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


కిరణ్, దిలీప్, కార్తీక్, కుమార్, శ్యామ్‌ అనే అయిదుగురు స్నేహితులు ఉన్నారు. వారిలో కిరణ్‌ దిలీప్‌ కంటే పొట్టివాడు, శ్యామ్‌ కంటే పొడవైనవాడు. కార్తీక్‌ అందరికంటే పొడవైనవాడు. కుమార్‌ దిలీప్‌ కంటే ఎత్తు తక్కువ, కిరణ్‌ కంటే పొడవు ఎక్కువ. 


1. అందరిలో పొట్టి వ్యక్తి ఎవరు?

ఎ) శ్యామ్‌       బి)  కిరణ్‌    సి) కార్తీక్‌    డి) ఎవరూ కాదు



2. కుమార్‌ కంటే పొడుగ్గా, కార్తీక్‌ కంటే పొట్టిగా ఉన్న వ్యక్తి ఎవరు?

ఎ) కిరణ్‌    బి) కార్తీక్‌    సి)  దిలీప్‌    డి)  కుమార్‌


 

3. అందరిలో పొడవైన వ్యక్తి ఎవరు?

ఎ)  దిలీప్‌    బి) కుమార్‌   సి) కిరణ్‌    డి) కార్తీక్‌



4. వ్యక్తులు వారి ఎత్తుల ప్రకారం ఆరోహణ క్రమంలో వరుసగా నిల్చుంటే మధ్యలో ఉండే వ్యక్తి ఎవరు?

ఎ)  కుమార్‌   బి) కార్తీక్‌    సి) దిలీప్‌    డి) శ్యామ్‌



5. ఆ స్నేహితుల్లో అందరికంటే తక్కువ పొడవు ఉన్న రెండో వ్యక్తి ఎవరు?

ఎ)  కిరణ్‌     బి)  దిలీప్‌    సి) కుమార్‌   డి) శ్యామ్‌

సాధన: ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎత్తుల క్రమం

కార్తీక్‌ > దిలీప్‌ > కుమార్‌ > కిరణ్‌ > శ్యామ్‌ (లేదా)

శ్యామ్‌ < కిరణ్‌  < కుమార్‌  < దిలీప్‌  < కార్తీక్‌

1-ఎ; అందరిలోకి పొట్టి వ్యక్తి శ్యామ్‌.

2-సి; కార్తీక్‌ > దిలీప్‌ > కుమార్‌

3-డి; అందరిలో పొడవైనవాడు కార్తీక్‌

4-ఎ; పైన చూపిన క్రమంలో ఎత్తుల ప్రకారం వరుసలో మధ్య ఉన్న వ్యక్తి కుమార్‌

5-ఎ; కార్తీక్‌ > దిలీప్‌ > కుమార్‌ > కిరణ్‌> శ్యామ్‌

అతి తక్కువ పొడవు కలిగిన మొదటివ్యక్తి శ్యామ్‌. రెండో వ్యక్తి కిరణ్‌.


6. అంగారక గ్రహం కంటే శుక్రుడికి కాంతి ఎక్కువ. బృహస్పతి కంటే అంగారక గ్రహం కాంతిమంతంగా కనిపించదు. బృహస్పతి గ్రహం శుక్రుడి కంటే ఎక్కువ కాంతి, ఫ్లూటో కంటే తక్కువ కాంతి విడుదల చేస్తుంది. అయితే అన్నింటిలో ఎక్కువ కాంతి కలిగి ఉండేది?

ఎ)  ప్లూటో   బి)  అంగారకుడు   సి) శుక్రుడు   డి) బృహస్పతి

సాధన: అంగారకుడు < శుక్రుడు, అంగారకుడు < బృహస్పతి, శుక్రుడు < బృహస్పతి < ప్లూటో 

సమాధానం: ఎ


సూచనలు (ప్ర. 7 - 11): ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒక షెల్ఫ్‌లో 6 పుస్తకాలు ఉన్నాయి. అవి: P, Q,R, S, T, U. అందులో Q, R, T పుస్తకాలకు ఆకుపచ్చ రంగు కవర్‌ ఉంది. మిగతా మూడింటికి పసుపుపచ్చ రంగు కవర్‌ ఉంది. P, Q, S కొత్త పుస్తకాలు, మిగతా మూడు పాత పుస్తకాలు. P, R,Q లు లా నివేదికలు, మిగతా మూడు గెజిట్‌లు.


7. కిందివాటిలో ఏ పుస్తకం పాత గెజిట్‌?

ఎ)  R     బి)  T     సి) P    డి) Q


8. కింది ఏ పుస్తకం పాత గెజిట్‌ అయ్యి, ఆకుపచ్చ రంగు కవర్‌ కలిగి ఉంది?

ఎ)  T   బి)  P     సి) Q    డి) S


9. కింది ఏ పుస్తకం పసుపుపచ్చ కవర్‌ కలిగి, కొత్తగా ఉన్న లా నివేదిక?

ఎ)  P    బి)  Q      సి) R     డి) S


 

10. కింది ఏ పుస్తకం కొత్తది, పసుపుపచ్చ కవర్‌ కలిగిన గెజిట్‌?

ఎ) T      బి)  S      సి) P     డి) R


 

11. కింది ఏ పుస్తకం ఆకుపచ్చ రంగు కవర్‌ ఉన్న పాత లా నివేదిక?

ఎ) P                 బి)  R                సి) S                డి) Q

సాధన:

సమాధానాలు: 7-బి, 8-ఎ, 9-ఎ, 10-బి, 11-బి.  


సూచనలు ( ప్ర.12  13) : B కంటే A ధనవంతుడు. A కంటే C ధనికుడు. C కంటే D డబ్బున్నవాడు. అందరికంటే E  ధనవంతుడు. 

12. కింది వారిలో మధ్య స్థానాన్ని పొందేది ఎవరు?

ఎ)  A     బి)  B    సి) D    డి) C



13. అందరిలో తక్కువ ధనికుడు?

ఎ) B              బి)  C             సి) A           డి) D    

సాధన:A > B : C > A : D > C, E అత్యంత ధనవంతుడు E > D > C > A > B  అవుతుంది.

సమాధానాలు: 12-డి, 13-ఎ 


 

సూచనలు (ప్ర.14 18) : కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

A, B, C, D, E, F అనే ఆరు జట్లు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొన్నాయి. అవి ఒడిస్సీ, భరతనాట్యం, కథక్, భాంగ్రా, కూచిపూడి, రాజస్థానీ, గుమర్‌ నాట్యాలు చేశాయి. అయితే ఇదే వరుసలో కాదు.

C, B జట్ల మధ్య రెండు ప్రదర్శనలు ఉన్నాయి. గుమర్‌ తర్వాత భాంగ్రా జరిగింది.

A తో ప్రారంభమయ్యే రెండు నాట్యాలు, ఒకదానితర్వాత మరొకటి ఉన్నాయి. Bతో ప్రారంభమయ్యే రెండు నాట్యాలు ఒకదాని తర్వాత మరొకటి ఉన్నాయి.

కథక్, గుమర్‌ల మధ్య ఒక నాట్యం ఉంది.

A, E జట్ల మధ్య ఒక జట్టు ఉంది.

A జట్టు Fను అనుసరించింది. D జట్టు తర్వాత B చేసింది.

చివర్లో E జట్టు ఒడిస్సీ నాట్యం చేసింది.

కూచిపూడి, ఒడిస్సీ మధ్య మూడు ప్రదర్శనలు ఉన్నాయి.14. ఒడిస్సీ దేని తర్వాత వెంటనే వస్తుంది?

ఎ) భరతనాట్యం     బి)  కథక్‌    సి) గుమర్‌       డి) భాంగ్రా



15. ఏ జట్టు భాంగ్రాను ప్రదర్శించింది?

ఎ) A     బి)  C     సి) D    డి) C



16. మొదటి ప్రదర్శన ఇచ్చిన జట్టు, అది ప్రదర్శించిన నాట్యం?

ఎ)  B-కూచిపూడి          బి)  F- గుమర్‌ 

సి) C- భరతనాట్యం     డి) D- కథక్‌


 

17. మూడో స్థానంలో ప్రదర్శించిన జట్టుకు ప్రథమ బహుమతి వచ్చింది. అయితే విజేత జట్టు, అది ప్రదర్శించిన నాట్యం?

ఎ) C-భరతనాట్యం  బి) D-కథక్‌    సి) A-భాంగ్రా   డి)  F-గుమర్‌



18. కిందివాటిలో సరికానిది?

ఎ)  గుమర్‌ తరువాత భాంగ్రా వస్తుంది.

బి) C జట్టు భరతనాట్యం ప్రదర్శించింది.

సి) భరతనాట్యం తర్వాత ఒడిస్సీ ప్రదర్శించారు.

డి) B జట్టు కథక్‌ ప్రదర్శించింది.

సమాధానాలు: 14-ఎ, 15-ఎ, 16-డి, 17-డి, 18-డి.  


 

సూచన ( ప్ర. 19 - 21)  : కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


ముగ్గురు విద్యార్థులు - పవన్, కుమార్, ప్రవీణ్‌ వరుసగా బీఏ, బీకాం, బీఎస్సీ చదువుతున్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పానీయాన్ని ఇష్టపడతారు. అవి టీ, కాఫీ, హార్లిక్స్‌.

ప్రవీణ్‌ బీకాం విద్యార్థి కాదు, అతడు హార్లిక్స్‌ ఇష్టపడడు.

పవన్‌ సైన్స్‌ విద్యార్థి కాదు.

ఆర్ట్స్‌ విద్యార్థి కాఫీ తీసుకోడు.

పవన్, బీఏ విద్యార్థి హార్లిక్స్‌ తీసుకోరు.

19. పవన్‌ ఏం చదువుతున్నాడు?

ఎ)  బీఏ    బి)  బీకాం    సి) బీఎస్సీ    డి) ఏదీకాదు


20. కిందివాటిలో ప్రవీణ్‌ దేన్ని ఇష్టపడతాడు?

ఎ) కాఫీ     బి)  హార్లిక్స్‌     సి) టీ     డి) టీ, హార్లిక్స్‌


21. కుమార్‌ ఏం చదువుతున్నాడు?

ఎ)  బీఎస్సీ    బి)  బీఏ    సి) బీకాం    డి) ఏదీకాదు

సాధన: 

పవన్, బీఏ విద్యార్థి హార్లిక్స్‌ తీసుకోరు. అంటే హార్లిక్స్‌ ఇష్టపడని ప్రవీణ్‌ బీఏ విద్యార్థి.


సమాధానాలు: 


19-బి, 20-సి, 21-ఎ

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌