• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర శాసన వ్యవస్థ

ముఖ్యాంశాలు..


బీ తెలంగాణ రాష్ట్ర విధానపరిషత్‌కు మొదటి ఛైర్మన్‌ - స్వామిగౌడ్, మొదటి డిప్యూటీ ఛైౖర్మన్‌ - నేతి విద్యాసాగర్‌.


బీ నవ్యాంధ్రప్రదేశ్‌ విధానపరిషత్‌కు మొదటి ఛైర్మన్‌ - ఎ.చక్రపాణి, మొదటి డిప్యూటీ ఛైర్మన్‌ - సతీష్‌ కుమార్‌రెడ్డి.


బీ విధానపరిషత్‌లో సభ్యుడిగా పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 30 ఏళ్లు.


బీ ఆర్టికల్‌ 169 ప్రకారం పార్లమెంట్‌ ఏదైనా రాష్ట్రంలో విధాన పరిషత్‌ ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్నదాన్ని రద్దు చేయాలన్నా సంబంధిత రాష్ట్ర విధానసభ 2/3  మెజార్టీతో తీర్మానం రూపొందించాలి.


బీ కళలు, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న 1/6వ వంతు సభ్యులను  గవర్నర్‌ విధాన పరిషత్‌కు నామినేట్‌ చేస్తారు.


బీ విధాన పరిషత్‌ సభ్యుల్లో ప్రతి రెండేళ్లకోసారి 1/3వ వంతు పదవీ విరమణ చేస్తారు.


బీ విధానపరిషత్‌ సభ్యుల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌ 58, తెలంగాణ  40, మహారాష్ట్ర  78.

1. ప్రస్తుతం విధానసభ, విధానపరిషత్‌ ఉన్న రాష్ట్రాల సముదాయాన్ని గుర్తించండి.

i) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 

ii) మహారాష్ట్ర, బిహార్‌

iii) ఉత్తర్‌ ప్రదేశ్, కర్ణాటక 

iv) తమిళనాడు, రాజస్థాన్‌

1) i, ii, iii       2) i, iii, iv

3) i, ii, iv      4) పైవన్నీ

2. రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు?

1) Vవ భాగం, ఆర్టికల్స్‌ 164 నుంచి 213

2) VIవ భాగం, ఆర్టికల్స్‌ 168 నుంచి 212

3) VIవ భాగం, ఆర్టికల్స్‌ 172 నుంచి 222

4) VIIవ భాగం, ఆర్టికల్స్‌ 166 నుంచి 211

3. మనదేశంలో తొలిసారిగా ఏ చట్టం ప్రకారం రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు?

1) మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909

2) భారత స్వాతంత్య్ర చట్టం, 1947

3) మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919

4) భారత ప్రభుత్వ చట్టం, 1935

4. విధానసభకు సంబంధించి కింది వాటిలో సరైనవి?

i) విధానసభలో గరిష్ఠంగా ఉండే సభ్యుల సంఖ్య 500

ii) విధానసభలో కనీస సభ్యుల సంఖ్య 60

iii) విధానసభలు ఉన్న రాష్ట్రాలు 28

iv) విధానసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు 

1) i, ii    2) iii, iv   3) i, ii, iii  4) పైవన్నీ

5. ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన స్థానాల సంఖ్య?

1) ఎస్సీ - 21, ఎస్టీ - 7

2) ఎస్సీ - 29, ఎస్టీ - 7

3) ఎస్సీ - 25, ఎస్టీ - 4 

4) ఎస్సీ - 28, ఎస్టీ - 8

6. తెలంగాణ విధానసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన స్థానాల సంఖ్యను గుర్తించండి.

1) ఎస్సీ - 19, ఎస్టీ - 12 స్థానాలు

2) ఎస్సీ - 18, ఎస్టీ - 8 స్థానాలు

3) ఎస్సీ - 17, ఎస్టీ - 13 స్థానాలు

4) ఎస్సీ - 23, ఎస్టీ - 11 స్థానాలు

7. విధానసభకు సంబంధించి కింది వాటిలో సరైనవి?

i) ఆర్టికల్‌ 170 - విధానసభ నిర్మాణం

ii) ఆర్టికల్‌ 171 - విధానసభ సభ్యుల సంఖ్య

iii) ఆర్టికల్‌ 172 - విధానసభ కాలపరిమితి

iv) ఆర్టికల్‌ 173 - విధానసభకు పోటీచేసే సభ్యుల అర్హతలు

1) i, iii, i్ర     2) i, ii, i్ర

3) i, ii, iii     4) పైవన్నీ

8. వివిధ రాష్ట్రాల్లోని విధానసభ సభ్యుల సంఖ్యకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి? 

i) ఉత్తర్‌ ప్రదేశ్‌ - 403, మహారాష్ట్ర - 288

ii) పశ్చిమ్‌ బంగా - 294, తమిళనాడు - 234

iii) ఆంధ్రప్రదేశ్‌ - 175, రాజస్థాన్‌ - 200

iv) తెలంగాణ - 119, బిహార్‌ - 243

1) i, ii     2) ii, iii     30 iii, iv    4) పైవన్నీ

9. విధానసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

1) దిల్లీ, లక్షద్వీప్‌ 

2) చండీగఢ్, దాద్రానగర్‌ హవేలి

3) పుదుచ్చేరి, దిల్లీ  

4) అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌

10. విధానసభ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు ఎంత?  

1) 18 ఏళ్లు        2) 21 ఏళ్లు     

3) 25 ఏళ్లు        4) 30 ఏళ్లు 

11. ఆర్టికల్‌ 174్బ1్శ ప్రకారం, శాసనసభ తప్పనిసరిగా ఏడాదికి ఎన్నిసార్లు సమావేశమవ్వాలి?

1) 2 సార్లు        2) 3 సార్లు    

3) 4 సార్లు        4) 6 సార్లు

12. శాసనసభ సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన కోరం ఎంత?

1) 1/3వ వంతు       2) 1/2వ వంతు

3) 1/10వ వంతు   4) 1/6వ వంతు

13. విధానసభకు సంబంధించి కింది వాటిలో సరైనవి? 

i) దీన్ని దిగువసభ, ప్రజాప్రతినిధుల సభ అంటారు.

ii) దీన్ని అనిశ్చిత సభ అంటారు.

iii) దీని పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

iv) దీన్ని ముఖ్యమంత్రి సిఫార్సుల మేరకు గవర్నర్‌ రద్దుచేయగలరు.

1) i, ii, iii     2) i, iii, iv

3) i, ii, iv    4) పైవన్నీ  

14. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 

1) 1985     2) 1971    3) 1977    4) 1979

15. కింది అంశాల్లో సరైనవి ఏవి?

i) ఆంధ్రరాష్ట్ర విధానసభకు తొలి స్పీకర్‌ - నల్లపాటి వెంకట్రామయ్య

ii) ఆంధ్రరాష్ట్ర విధానసభకు చివరి స్పీకర్‌ - రొక్కం లక్ష్మీనరసింహం దొర

iii) ఆంధ్రప్రదేశ్‌ విధానసభకు ప్రస్తుత స్పీకర్‌ - తమ్మినేని సీతారాం

iv) ఆంధ్రప్రదేశ్‌ విధానసభకు తొలి మహిళా స్పీకర్‌ - ప్రతిభాభారతి

1) i, ii, iii     2) i, iii, iv

3) i, ii, iv         4) పైవన్నీ 

16. హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభకు తొలి, చివరి స్పీకర్‌ ఎవరు?

1) కాశీనాథ్‌రావు వైద్య 

2) అయ్యదేవర కాళేశ్వరరావు

3) కల్లూరి సుబ్బారావు 

4) రంగనాయుడు

17. కింది అంశాల్లో సరికానిది? 

i) తెలంగాణ రాష్ట్ర విధానసభకు తొలి స్పీకర్‌ - మధుసూదనాచారి

ii) తెలంగాణ రాష్ట్ర విధానసభకు తొలి డిప్యూటీ స్పీకర్‌ - పద్మా దేవేందర్‌రెడ్డి

iii) తెలంగాణ రాష్ట్ర విధానసభకు ప్రస్తుత స్పీకర్‌ - పోచారం శ్రీనివాసరెడ్డి

iv) తెలంగాణ రాష్ట్ర విధానసభకు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ - పద్మారావు

1) i, iii, iv     2) i, ii, iii 

3) i, ii, iv     4) పైవన్నీ 

18. భారతదేశంలో విధానసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ?

1) షానో దేవి (హరియాణా) 

2) రంజన్‌దేశాయ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)

3) పి.కె.తత్తరణి (తమిళనాడు) 

4) సుష్మాస్వరాజ్‌ (మహారాష్ట్ర)

19. విధానపరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి?

i) దీన్ని ఎగువసభ, పెద్దలసభ అంటారు.

ii) దీని సభ్యుల పదవీకాలం ఆరేళ్లు.

iii) దీన్ని శాశ్వతసభ, శాసనమండలి అంటారు.

iv) ఇది బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సభ

1) i, ii, iii     2) i, iii, iv

3) i, ii, iv     4) పైవన్నీ

20. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1958లో ఏర్పడిన విధానపరిషత్‌కు తొలి ఛైర్మన్‌?  

1) మాడపాటి హనుమంతరావు 

2) సయ్యద్‌ ముఖ్సిర్‌షా

3) గొట్టిపాటి బ్రహ్మయ్య 

4) తోట రామస్వామి

సమాధానాలు

1 - 1   2 - 2  3 - 4  4 - 3  5 - 2  6 - 1  7 - 1  8 - 4  9 - 3  10 - 3  11 - 1  12 - 3  13 - 3  14 - 1  15 - 4  16 - 1  17 - 4  18 - 1  19 - 4  20 - 1

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రస్తుతం భారతదేశంలోని విధాన పరిషత్‌లలో అత్యధిక, అత్యల్ప సభ్యులు ఉన్న రాష్ట్రాలు? (ఏపీ వార్డు సచివాలయ పరీక్ష, 2019)

1) బిహార్, కర్ణాటక 

2) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌

3) ఉత్తర్‌ ప్రదేశ్, తెలంగాణ 

4) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

2. కాలపరిమితి పూర్తికాకుండా రద్దయిన శాసనసభకు తిరిగి నిర్వహించే ఎన్నికలను ఏమంటారు?     (ఏపీ గ్రూప్‌-II, 2017)

1) ఉప ఎన్నికలు 

2) మధ్యంతర ఎన్నికలు 

3) సాధారణ ఎన్నికలు 

4) అసాధారణ ఎన్నికలు

3. శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల బలమైన కోరిక మేరకు జీవో నెంబర్‌ - 610 అమలు విషయమై 2001లో అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఒక కమిషన్‌ను నియమించారు. ఆ కమిషన్‌ పేరేంటి? (టీఎస్‌ కానిస్టేబుల్, 2019)

1) జస్టిస్‌ భార్గవ కమిషన్‌ 

2) జె.పి.ఎల్‌.గ్విన్‌ కమిషన్‌  

3) గిర్‌గ్లానీ కమిషన్‌ 

4) కె.అచ్యుతరెడ్డి కమిషన్‌

4. రాష్ట్ర శాసనశాఖకు సంబంధించి కింది అంశాల్లో సరైంది?  (టీఎస్, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2019)

i) సాధారణ బిల్లులను ఏ సభలోనైనా  ప్రవేశ పెట్టొచ్చు.

ii) మొదటిసారి శాసనమండలి సాధారణ బిల్లులను మూడు నెలల వరకు ఆలస్యం చేయొచ్చు.

iii) రెండోసారి శాసనమండలి సాధారణ బిల్లులను 15 రోజుల వరకు ఆలస్యం చేయొచ్చు.

iv) శాసనమండలి సాధారణ బిల్లులను 20 రోజుల వరకు ఆలస్యం చేయొచ్చు.

1) పైవన్నీ    2) i, ii    3) i, ii, iii    4) i, ii, iv 

5. ఒక రాష్ట్ర విధానపరిషత్‌ సభ్యుల గరిష్ఠ సంఖ్య ఎంతకు మించకూడదు? (ఏపీ కానిస్టేబుల్స్, 2016)

1) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/2వ వంతు

2) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు

3) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు

4) రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 1/4వ వంతు

6. శాసనమండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లును శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు, అది తిరస్కరిస్తే తర్వాత మార్గం ఏమిటి? (ఏపీ గ్రూప్‌-II, 2016)

1) రెండు సభల ఉమ్మడి సమావేశం

2) శాసనమండలి పునఃపరిశీలన కోసం మళ్లీ శాసనసభకు పంపడం

3) బిల్లును గవర్నర్‌ పరిశీలనకు పంపడం

4) బిల్లు పరిసమాప్తి అవుతుంది

7. ఏ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంట్‌ శాసనమండలిని ఏర్పాటు/ రద్దు చేయొచ్చు? (జూనియర్‌ లెక్చరర్స్, 2007)

1) ఆర్టికల్‌ 167    2) ఆర్టికల్‌ 168   3) ఆర్టికల్‌ 169    4) ఆర్టికల్‌ 166

8. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు మొదటి స్పీకర్‌?  (జూనియర్‌ లెక్చరర్స్, 2007),  (ఏపీ కానిస్టేబుల్స్, 2019)

1) కోకా సుబ్బారావు

2) పట్టాభి సీతారామయ్య

3) మాడపాటి హనుమంతరావు

4) అయ్యదేవర కాళేశ్వరరావు

సమాధానాలు

1 - 3  2 - 2  3 - 3  4 - 2  5 - 3  6 - 4  7 - 3  8 - 4

Posted Date : 29-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌