• facebook
  • whatsapp
  • telegram

ప్రకటనలు - ఊహలు

సూచన (ప్ర.1-8) - కింది ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు లేదా మూడు ఊహలు ఇచ్చారు. 


ఊహ I- ప్రకటనను తృప్తిపరిస్తే సమాధానం ఎ,

ఊహ II- ప్రకటనను తృప్తిపరిస్తే సమాధానం బి,

రెండు ఊహలూ ప్రకటనను తృప్తిపరిస్తే సమాధానం సి,

రెండు ఊహల్లో ఏదీ ప్రకటనను తృప్తిపరచకపోతే సమాధానం డి,

ఊహ I లేదా IIల్లో ఏదైనా ఒకటి ప్రకటనను తృప్తిపరిస్తే సమాధానం ఇ అని గుర్తించండి.


 

1. ప్రకటన: 27 ఏళ్ల కారాగారవాసం నెల్సన్‌ మండేలాను ప్రెసిడెంట్‌ను చేసింది.

ఊహలు 

I. 27 ఏళ్లు కారాగారంలో ఉన్న ఎవరైనా ప్రెసిడెంట్‌ అవుతారు.

II. ప్రెసిడెంట్‌ కావాలంటే కారాగారవాసం ఒక అర్హత.

వివరణ: దేశ స్వాతంత్య్ర సాధన కోసం నెల్సన్‌ మండేలా కారాగారంలో ఉన్నారే తప్ప ఆయన ఎలాంటి నేరం చేయలేదు. ప్రెసిడెంట్‌ కావాలని భావించి ఆయన ప్రత్యేకంగా జైలుకి వెళ్లలేదు. దేశం కోసం చేసిన త్యాగాలు, దేశభక్తి ఆయన్ను ప్రెసిడెంట్‌ను చేశాయి. ఊహలు I, II ప్రకటనను తృప్తిపరచడం లేదు.    

సమాధానం: డి


2. ప్రకటన: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.

ఊహ 

I. పొగ తాగకపోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

II. నిజానికి ఈ హెచ్చరిక అవసరం.

వివరణ: పొగ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పాలి కానీ పొగ తాగకపోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని దాని అర్థం కాదు. ఈ హెచ్చరిక కచ్చితంగా అవసరం. ఎందుకంటే పొగ తాగడం వల్ల అది శరీరంలోని అంతర్భాగాల్లోకి వెళ్లి కేన్సర్‌ను కలిగిస్తుంది. ఇది ప్రాణాంతకం.

ఊహ II ప్రకటనను తృప్తిపరుస్తుంది.

సమాధానం: బి


3. ప్రకటన: కార్మికులందరూ కచ్చితంగా ఉదయం 8.30 కల్లా ఫ్యాక్టరీకి రావాలి.

ఊహ

I . కొంతమంది కార్మికులు ఫ్యాక్టరీకి ఆలస్యంగా రావచ్చు.


II. ఇచ్చిన నోటీసును కార్మికులు అనుసరించాలి.

వివరణ: ఒక సంస్థలో ఇచ్చిన నోటీసు అందరూ పాటించాల్సిందే. ఊహ I తప్పు, ఊహ II సరైంది. 

సమాధానం: బి


4. ప్రకటన: దేశంలో 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగభృతి ఇవ్వాలి.

ఊహ 

 I. దేశంలోని అనేకమంది నిరుద్యోగులు పేదవారే. వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది.


II. నిరుద్యోగ యువకుల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరిపోయే నిధులు ఉన్నాయి.

వివరణ: ప్రభుత్వం దగ్గర ఎక్కువ నిధులు నిల్వ ఉన్నా అవసరం లేకుండా వాటిని ఖర్చు చేయరు. పేదవారికి ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ విధి. 

ఊహ I ప్రకటనను తృప్తిపరుస్తుంది.

సమాధానం: ఎ


5. ప్రకటన: - ఒక స్థలం వద్ద ‘ప్రైవేటు ఆస్తి - ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అనే నోటీసు ఉంచారు.

ఊహ 

I. ఆ నోటీసు చూసిన వారెవరూ ఆ స్థలం జోలికి వెళ్లరు.

II. శిక్షకు భయపడి ప్రజలెవరూ ఆ స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయరు.

వివరణ: ఊహలు I, II ప్రకటనను తృప్తిపరుస్తాయి.

సమాధానం: సి


6. ప్రకటన - ‘‘ఫీజు చెల్లించని విద్యార్థులందరూ ఈ నెల 15 వరకు కచ్చితంగా చెల్లించాలి’’ - ఇది ఒక స్కూలు నోటీసు బోర్డులో విద్యార్థులను ఉద్దేశించి అతికించిన నోటీసు.

ఊహలు

I. 15వ తేదీలోపు ఫీజు చెల్లించని విద్యార్థులు ఆ తర్వాత పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు.


II. 15వ తేదీలోపు ఫీజు చెల్లించకపోతే చెల్లించిన, చెల్లించని విద్యార్థులను వేర్వేరు గదుల్లో ఉంచుతారు.

సాధన: నోటీసు చదివిన పిల్లలందరూ వారి తల్లిదండ్రులకు విషయం తెలియజేసి, సరైన సమయంలో ఫీజులు చెల్లిస్తారనేది స్కూలు యాజమాన్యం భావన.

ఊహలు - I,II ప్రకటనతో సంబంధం లేనివి.

సమాధానం: డి 


7. ప్రకటన - వీణను మీటే వారందరూ గాయకులే

ఊహ 

 I. వీణను మీటే వారందరూ ద్వితీయ స్థానానికి చెందినవారే.


II. మహిళలందరిదీ ద్వితీయ స్థానమే. 

సాధన: ఊహలు I, II ప్రకటనతో సంబంధంలేని అంశాలే. 

సమాధానం: డి

8. ప్రకటన: ప్రస్తుత కాలంలో ఏ దేశం పూర్తిగా స్వయం సమృద్ధి కలిగినది కాదు.

ఊహలు 

 I. దేశ అవసరాలన్నింటినీ పెంపొందించడం, ఉత్పత్తి చేయటం అసాధ్యం.

II. దేశ ప్రజలు సర్వసాధారణంగా సోమరిపోతులు.

వివరణ: ఎలాంటి మద్దతు, ఆధారం లేకుండా ఎవరూ ఏ పనిని పూర్తిగా వారంతట వారే చేయలేరు. కాబట్టి ఊహ I  ప్రకటనను తృప్తిపరుస్తుంది. కానీ ఊహ II తప్పు.

సమాధానం: ఎ


9. ప్రకటన: పరీక్షలో విజయం సాధించాలంటే కష్టపడాలని చందన సిరికి చెప్పింది.

ఊహలు 

 I. చందన సలహాను సిరి పాటిస్తుంది.

II. పరీక్షలో విజయం సాధించడం కావాలి.

III. నిరంతర సాధనే విజయానికి బాటలు వేస్తుంది.

ఎ) I, II మాత్రమే సరైనవి    బి) II, IIIమాత్రమే సరైనవి

సి) I, III మాత్రమే సరైనవి    డి) పైవన్నీ సరైనవి

వివరణ: ఒక సలహాను విన్నంత మాత్రాన పాటించాలని లేదు. అది విన్న వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఊహ I ప్రకటనను తృప్తిపరచదు. ఊహలు II, III ప్రకటనను తృప్తిపరుస్తాయి.      

సమాధానం: బి


10. ప్రకటన: ఎక్కువ మంది విద్యార్థులు వీడియో గేమ్స్‌ ఆడేందుకు ఇష్టపడతారు.=

ఊహలు 

I. పాఠశాలల్లో వీడియో గేమ్స్‌ ఆడించాలి.

II. వీడియో గేమ్స్‌ వల్ల వ్యక్తిత్వం పెరుగుతుంది.

III. ఆటలు ఆడటం పిల్లలకు సరదా.

ఎ) III మాత్రమే సరైంది. 

బి) I, III మాత్రమే సరైనవి.

సి) I, II మాత్రమే సరైనవి.     

డి) II మాత్రమే సరైంది.

వివరణ: ఆటలాడటం పిల్లలకు సరదా. కాబట్టే వారు వీడియో గేమ్స్‌ ఆడటాన్ని ఇష్టపడతారు.

సమాధానం: ఎ

11. ప్రకటన: ‘మా సంస్థ కంప్యూటర్‌ రంగంలో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది’ - ఒక సంస్థ ప్రకటన.

ఊహలు 

I. ప్రజల్లో చాలామంది కంప్యూటర్‌ విద్యపట్ల ఆసక్తి కలిగి ఉన్నారు.

II. ప్రజలు అత్యుత్తమ శిక్షణను కోరుకుంటారు.

III. కంప్యూటర్‌ విద్యలో నిష్ణాతులైనవారు ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు.

ఎ) I మాత్రమే సరైంది   బి) II, III మాత్రమే సరైనవి

సి) పైవన్నీ సరైనవి       డి) ఏదీకాదు 

వివరణ: ఊహలన్నీ ప్రకటనను తృప్తిపరిచే విధంగా ఉన్నాయి.

సమాధానం: సి


12. ప్రకటన: - ఆ ప్రదేశంలో గ్రంథాలయం నిర్మించడం వ్యర్థం.

ఊహలు: 

I. ఆ ప్రదేశంలో నివసించేవారు నిరక్షరాస్యులు.

II. ఆ ప్రదేశంలో నివసించే ప్రజలు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు.

III. ఆ ప్రదేశంలో అంతకుముందే చాలా గ్రంథాలయాలు ఉన్నాయి. 

ఎ) I, II సరైనవి

బి) III మాత్రమే సరైంది

సి) I లేదా II లేదా IIIలలో ఏదో ఒకటి సరైంది

డి) ఏదీకాదు

వివరణ: ఇచ్చిన మూడు ఊహల్లో ఏదో ఒకటి నిజమై ఉండవచ్చు. కానీ స్పష్టత లేదు.

సమాధానం: సి

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌