• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు అధికారాలు 

 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జతపరచండి.
     అంశం                                                                                                                               వ్యక్తి

a) తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి                  1. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా

b) సుప్రీంకోర్టులో పనిచేసిన రెండో ప్రధాన న్యాయమూర్తి                                        2. ఎం. పతంజలి శాస్త్రి

c) 1937 దిల్లీలో ఏర్పడిన ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి                   3. సర్. మారిన్ గోయల్

d) 1774 ఫోర్ట్ విలియంలో ఏర్పడిన సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి      4. వార్డ్ ఎలిజా ఇంపే

జ: a-1, b-2, c-3 d-4

2. జతపరచండి.
a) ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు                                   1. 1774

b) మొదటి జడ్జెస్ కేసు                                                  2. 1982

c) రెండో జడ్జెస్ కేసు                                                     3. 1993

d) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26 కి పెంపు      4. 1986

జ: a-1, b-2, c-3, d-4
 

3. జతపరచండి.
    అంశం                                                                 షెడ్యూల్

a) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు           1. 3వ షెడ్యూల్

b) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం     2. 2వ షెడ్యూల్

c) భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు       3. 10వ షెడ్యూల్

d) పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం                           4. 9వ షెడ్యూల్

జ: a-2, b-1, c-4, d-3

4. జతపరచండి.
     అంశం                                                                                        ప్రకరణలు

a) రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రత్యేక పద్ధతి ద్వారానే
న్యాయమూర్తులను తొలగించాలి                                                       1. 124 (4)

b) సుప్రీంకోర్టుకు సంబంధించిన అన్ని ఖర్చులను 
భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.                                          2. 146 (3)

c) న్యాయమూర్తులు తమ విధి నిర్వహణలో ప్రవర్తించే
తీరును పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభలో చర్చించరాదు        3. 121

d) పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులు
 భారత భూభాగంలో ఏ న్యాయస్థానంలోనూ ప్రాక్టీస్ చేయరాదు          4. 124 (7)

జ: a-1, b-2, c-3, d-4
 

5. జతపరచండి.
    రిట్                                అర్థం

a) హెబియస్ కార్పస్      1. అధికార పృచ్ఛ

b) మాండమస్                2. ఉత్ప్రేషణ

c) సెర్షియోరరీ                3. పరమాదేశం

d) కోవారెంటో                 4. బందీ ప్రత్యక్ష

జ: a-4, b-3, c-2, d-1

6. జతపరచండి.
a) హెబియస్ కార్పస్      1. To have the body of

b) మాండమస్                2. We command

c) సెర్షియోరరీ                 3. To be certified

d) కోవారెంటో                  4. By what authority

జ: a-1, b-2, c-3, d-4
 

7. జతపరచండి.
         అంశం                                                            సంవత్సరం

a) సుప్రీం కోర్టు న్యాయమూర్తుల చట్టం (తొలగింపు)     1. 1973

b) మూడో జడ్జెస్ కేసు                                                   2. 1993

c) కొలీజియం వ్యవస్థ ఏర్పాటు                                     3. 1998 

d) కేశవానంద భారతి కేసు                                            4. 1968

జ: a-4, b-3, c-2, d-1

8. జతపరచండి.
    అంశం                               గ్రహించిన దేశం

a) న్యాయ సమీక్ష                      1. ఇంగ్లండ్

b) సమన్యాయపాలన                2. అమెరికా

c) చట్టం నిర్ధారించిన పద్ధతి      3. జపాన్

d) సమాఖ్య వ్యవస్థ                    4. కెనడా

జ: a-2, b-1, c-3, d-4
 

9. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అంశాలను అమెరికా నుంచి గ్రహించారు.
బి) న్యాయవ్యవస్థకు సంబంధించి సమన్యాయపాలన, ఏకీకృత న్యాయవ్యవస్థ, రిట్స్ జారీ చేయడం లాంటి అంశాలను ఇంగ్లండ్ నుంచి గ్రహించారు.
జ: ఎ, బి

10. జతపరచండి.
          అంశం                                                                     సంవత్సరం

a) స్వాతంత్య్రం తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు                    1. 1950 జనవరి 28

b) రాజ్యాంగ పరిషత్ అధికార చట్టసభ చివరి సమావేశం      2. 1950 జనవరి 24

c) భారత రాజ్యాంగ ఆమోదం                                               3. 1949 నవంబరు 26

d) భారత రాజ్యాంగం అమల్లోకి రావడం                               4. 1950 జనవరి 26

జ: a-1, b-2, c-3, d-4
 

11. కొలీజియంలో ఉండే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
జ: 5

 

12. జతపరచండి.
a) ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి                  1. జస్టిస్ జగదీశ్ ఖేహర్

b) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నాథన్    2. జస్టిస్ రమేష్ రంగ నాథన్

c) ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా                    3. ముఖుల్ రోహద్గీ

d) ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్             4. పి.వేణుగోపాల్

జ: a-1, b-2, c-3, d-4

13. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు ఉంది.
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనను పార్లమెంటు చేస్తుంది.
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
డి) సుప్రీంకోర్టు అధికార పరిధిని పార్లమెంటు పెంచగలదు.
జ: ఎ, బి, సి, డి

 

14. జతపరచండి.
      అంశం                                                      ప్రకరణం

a) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య            1. 124 (2)

b) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం    2. 124 (4)

c) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు        3. 124 (3)

d) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు       4. 124 (1)

జ: a-4, b-1, c-3, d-2

15. కింది రాజ్యాంగ అధికారుల్లో ఎవరిని తొలగించడానికి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సంప్రదింపు అవసరం?
1) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
3) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) ప్రధాన ఎన్నికల కమిషనర్
జ: 1 (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)

 

16. కిందివారిలో ఎవరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు పాటించే విధానాలు, కారణాల ఆధారంగా తొలగిస్తారు?
ఎ) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
బి) భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
సి) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
డి) భారత అటార్నీ జనరల్
సరైన జవాబును గుర్తించండి.
జ: ఎ, బి మాత్రమే

17. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
     ఎ) న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను అభిశంసన అంటారు.
     బి) రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను మహాభియోగం అంటారు.
     సి) దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా న్యాయమూర్తులను తొలగిస్తారు.
     డి) రాజ్యాంగ ఉల్లంఘన కారణంతో రాష్ట్రపతిని తొలగిస్తారు.
జ: ఎ, బి, సి, డి

 

18. కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.
     1) హెబియస్ కార్పస్      2) మాండమస్     3) సెర్షియోరరి      4) ఇంజెంక్షన్
జ: 4 (ఇంజెంక్షన్)

 

19. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
జ: ఎమ్. ఫాతిమా బీబీ

 

20. న్యాయమూర్తి హిదయతుల్లా ఎన్నిసార్లు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించారు?
జ: ఒకసారి

 

21. రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని గురించి వివరిస్తుంది?
జ: 39 (a)

22. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఎక్కడ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయరాదు?
     1) సుప్రీంకోర్టు      2) హైకోర్టు     3) జిల్లా, సెషన్స్ కోర్టులు      4) వీటిలో ఏదైనా
జ: 4 (వీటిలో ఏదైనా)

 

23. సుప్రీంకోర్టు అతి ముఖ్య తీర్పును ఏ సిద్ధాంతం ఆధారంగా వెలువరిస్తుంది?
జ: చట్టం ద్వారా ప్రారంభమైన పద్ధతి

 

24. కిందివాటిలో భారత సుప్రీంకోర్టు పరిధికి సంబంధించి తప్పుగా పేర్కొన్నదేది?
     1) ఒరిజినల్ జూరిస్‌డిక్షన్               2) అప్పిలేట్ జూరిస్‌డిక్షన్
     3) అడ్వయిజరీ జూరిస్‌డిక్షన్           4) అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్‌ఫ్లిక్ట్స్
జ: 4 (అడ్జుడికేటింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్‌ఫ్లిక్ట్స్)

 

25. భారత రాజ్యాంగ ఏ భాగంలో కార్యనిర్వహణ నుంచి న్యాయశాఖను వేరుచేశారు?
జ: ఆదేశిక సూత్రాలు

 

26. 'సామాజిక న్యాయం' అనే భావనను కలిగి ఉన్న అధికరణ ఏది?
జ: 38

27. జతపరచండి.
     అంశం                                      దేశం

a) పాలనా న్యాయం                     1. ఇంగ్లండ్

b) సమన్యాయం                          2. ఫ్రాన్స్

c) డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా              3. అమెరికా

d) ప్రొసీజర్ ఎస్టాబ్లిష్‌డ్ బై లా      4. భారత్

జ: a-2, b-1, c-3, d-4
 

28. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) రాజ్యాంగపరమైన కేసులను విచారించడానికి సుప్రీంకోర్టులో ఉండాల్సిన కనీస
న్యాయ మూర్తుల సంఖ్య (కోరం)- 5
బి) కొలీజియంలో ఉండే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య- 5
సి) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (ప్రధాన న్యాయమూర్తులతో కలిపి)- 31
జ: ఎ, బి, సి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌