మాదిరి ప్రశ్నలు
1. అభివృద్ధి రకాల్లో అతి ప్రాచీనమైంది?
1) ఆర్థికవృద్ధి 2) ఆర్థికాభివృద్ధి 3) ఆర్థిక సంక్షేమం 4) మానవాభివృద్ధి
2. ఆర్థికాభివృద్ధి అంటే?
1) స్వల్పకాలంలో ఉత్పత్తిలో మార్పు
2) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పు
3) స్వల్పకాలంలో ఉత్పత్తితోపాటు సామాజిక మార్పు
4) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పుతో పాటు సామాజిక మార్పు
3. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం దేనికి సంబంధించింది?
1) ధరల తగ్గింపు 2) ఆర్థిక మాంద్యం మదింపు
3) పేదలకు అభివృద్ధి ఫలాలు చేరడం 4) అన్నీ
4. ప్రపంచీకరణలో భాగంగా అమలు చేసిన అభివృద్ధి?
1) ఆర్థిక సంక్షేమం 2) మానవాభివృద్ధి 3) సుస్థిరాభివృద్ధి 4) ఆర్థిక వృద్ధి
5. సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
1) ప్రాంతాల మధ్య సమానాభివృద్ధి 2) ప్రజల మధ్య సమానాభివృద్ధి
3) దేశాల మధ్య సమానాభివృద్ధి 4) తరాల మధ్య సమానాభివృద్ధి
సమాధానాలు: 1-1; 2-4; 3-3; 4-2; 5-4.