• facebook
  • whatsapp
  • telegram

బానిస వంశం కుతుబుద్దీన్‌ ఐబక్‌

తొలి జీవితం 

* ఇతడు క్రీ.శ. 1150లో టర్కిస్థాన్‌లోని ఘురిద్‌లో జన్మించాడు. ఇతడికి కుతుబ్‌-అల్‌-దిన్‌-అయ్‌బెగ్, కుతుబుద్దీన్‌ ఐబక్, కుతుబ్‌-అల్‌-దిన్‌-అయబ్‌ అనే పేర్లు ఉన్నాయి. టర్కీ భాషలో ఐబక్‌ అంటే ‘చంద్రుడికి ప్రభువు’ అని అర్థం. 

 కుతుబుద్దీన్‌  తల్లిదండ్రులు ఇతడ్ని చిన్నతనంలోనే పర్షియాలోని నిషాపూర్‌లో ఖాజీ ఫక్రుద్దీన్‌ అజీజ్‌-కుఫి (న్యాయాధికారి)కి బానిసగా విక్రయించారు. 

అక్కడ ఐబక్‌ విలు విద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత మహమ్మద్‌ ఘోరీ తన దండయాత్రల కోసం కుతుబుద్దీన్‌ను ఖాజీ నుంచి కొనుగోలు చేశాడు. కుతుబుద్దీన్‌ తక్కువ కాలంలోనే ఘోరీ వద్ద అనేక పదవులు చేపట్టాడు. 

క్రీ.శ. 1192లో రెండో తరైన్‌ యుద్ధంలో గెలుపొందాక మహమ్మద్‌ ఘోరీ తన ప్రతినిధిగా కుతుబుద్దీన్‌ను నియమించాడు. ఇతడు తర్వాతి కాలంలో అజ్మీర్, కనౌజ్, గుజరాత్, రాజస్థాన్, బుందేల్‌ఖండ్‌ మొదలైన రాజ్యాలను జయించి, ఉత్తర భారతదేశంలో ఘోరీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఈ యుద్ధాల్లో కుతుబుద్దీన్‌కి ఘోరీ సైన్యంలో జనరల్‌గా ఉన్న తాజ్‌-అల్‌-దిన్‌-యాల్దిజ్‌ సాయం చేశాడు.

క్రీ.శ. 1206లో మహమ్మద్‌ ఘోరీ మరణించాక, వాయవ్య భారతదేశంలోని భూభాగాలపై కుతుబుద్దీన్, తాజ్‌-అల్‌-దిన్‌-యాల్దిజ్‌ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులో కుతుబుద్దీన్‌ విజయం సాధించి, భారతదేశంలోని ఘోరీ భూభాగాలన్నింటికి తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. తన రాజధానిని మొదట లాహోర్‌లో ఏర్పాటు చేశాడు.

రాజప్రతినిధిగా చేసిన దండయాత్రలు

మొదటి తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ చేతిలో ఓటమి పొందినప్పుడు ఘోరీ సైన్యం సాధారణ నిర్వహణ బాధ్యతను కుతుబుద్దీన్‌ చూసుకున్నాడు. రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ విజయం సాధించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. 

హసన్‌ నిజామీ అనే పర్షియన్‌ చరిత్రకారుడు రచించిన ‘తాజూల్‌-మాసిర్‌’ గ్రంథంలో తరైన్‌ యుద్ధం తర్వాత ఘోరీ పంజాబ్, చహమనా ప్రాంతాలకు కుతుబుద్దీన్‌ను గవర్నర్‌గా నియమించాడు అని పేర్కొన్నాడు.

పృథ్వీరాజ్‌ మరణించాక అతడి కుమారుడు గోవిందరాజుని ఘోరీ సామంతుడిగా నియమించాడు.  కొంతకాలం తర్వాత పృథ్వీరాజ్‌ సోదరుడు హరిరాజా రణ్‌థంబోర్‌ కోటపై దాడి చేశాడు. దీన్ని కుతుబుద్దీన్‌ అణచివేశాడు. క్రీ.శ. 1192లో జత్వాన్‌ అనే తిరుగుబాటుదారుడు హంసిని (చహమనా భూభాగంలోనిది) ముట్టడించగా కుతుబుద్దీన్‌ అతడ్ని యుద్ధంలో వధించాడు.

దోబ్‌లో విజయాలు: జత్వాన్‌ను ఓడించాక కుతుబుద్దీన్‌ ఖుహ్రమ్‌కు తిరిగివచ్చి గంగా-యమునా, దోబ్‌ ప్రాంతాలపై దాడిచేశాడు. క్రీ.శ. 1192లో మీరట్, బరన్‌ (బులంద్‌ షహర్‌)ను ఆక్రమించాడు. తర్వాత గహద్వాలుల రాజ్యంపై దండెత్తాడు. 

క్రీ.శ. 1192లో ఢిల్లీని తన అధీనంలోకి తెచ్చుకుని, స్థానిక తోమరా పాలకుడ్ని సామంతుడిగా చేసుకున్నాడు. క్రీ.శ. 1193లో ఢిల్లీని ప్రత్యక్షంగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.

కె.ఎ.నిజామీ అభిప్రాయం ప్రకారం ‘‘భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయమని ఘోరీ కుతుబుద్దీన్‌ను కోరాడు.’’ 

క్రీ.శ. 1194లో యమునా నదిని దాటి కోయిల్‌ (అలీఘర్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌)ను స్వాధీనం చేసుకున్నాడు.

ఇతర దండయాత్రలు: కుతుబుద్దీన్‌ ఐబక్‌ చందావార్‌ విజయం తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. క్రీ.శ. 1195-96లో బాటి బయానా పాలకుడు కుమారపాలను ఓడించాడు. తర్వాత గ్వాలియర్‌పై దాడిచేశాడు. హరిహర పాలకుడు ‘సల్లాఖనాపాల’ ఘోరీ అధికారాన్ని అంగీకరించాడు. ఈ దాడుల్లో ఘోరీకి కుతుబుద్దీన్‌ సాయం చేశాడు.

అజ్మీర్‌లోని మెహెర్‌ తెగ గిరిజనులు చాళుక్యుల (గుజరాత్‌ పాలకులు) మద్దతుతో ఘోరీ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా, దాన్ని కుతుబుద్దీన్‌ అణచివేశాడు.

క్రీ.శ. 1197లో మౌంట్‌అబు వద్ద చాళుక్య సైన్యంపై దాడిచేశాడు. చాళుక్యుల రాజధాని అన్హిల్‌వాడపై దండెత్తి, దాన్ని దోచుకున్నాడు. కుతుబుద్దీన్‌ చేసిన ఈ దాడిని ‘గుజరాత్‌ను జయించడం’గా చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ. 1197-98లో బదౌన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), వారణాసిని ఆక్రమించాడు.

క్రీ.శ. 1198-99లో చంతర్వాల్, కనౌజ్, సిరోహ్‌లను స్వాధీనం చేసుకున్నాడు. కుతుబుద్దీన్‌ క్రీ.శ. 1192లో అజ్మీర్‌లో అదైదిన్‌-కా-జొంప్రా మసీదు కట్టడాన్ని ప్రారంభించాడు. దాని నిర్మాణం క్రీ.శ. 1199 నాటికి పూర్తైంది. 

క్రీ.శ. 1202లో మధ్య భారతదేశంలో చందేలా రాజ్యానికి చెందిన కలింజర్‌ కోటను ముట్టడించాడు. ఆ సమయంలోనే చందేలా పాలకుడు పరమార్థి మరణించాడు. చందేలా మంత్రి అజయదేవ కుతుబుద్దీన్‌తో సంధి చేసుకుని కలింజర్, మెహుబా, ఖజురహో ప్రాంతాలను ఘోరీ సామ్రాజ్యంలో భాగం చేశాడు. 

అదే సమయంలో ఘోరీ మహమ్మద్‌ సైన్యాధిపతి భక్తియార్‌ ఖిల్జీ తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, తూర్పు బెంగాల్‌ను జయించాడు. ఈ దండయాత్రల్లో విక్రమశిల, నలందా, ఉద్ధంతపుర విశ్వవిద్యాలయాలు ధ్వంసమయ్యాయి. తర్వాత నాడియా పాలకుడైన లక్ష్మణసేనుడిపై దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. భక్తియార్‌ ఖిల్జీ క్రీ.శ.1206లో మరణించాడు. 

క్రీ.శ. 1204లో లాహోర్‌లో ఘోరీ మహమ్మద్‌పై ఖోఖర్లు తిరుగుబాటు చేయగా, కుతుబుద్దీన్‌ అణచివేశాడు. క్రీ.శ. 1206, మార్చి 15న ఖోఖర్లు ఘోరీ మహమ్మద్‌ను చంపారు. 

ఘోరీ మరణించే నాటికి భారతదేశంలోని దాదాపు 27 ప్రాంతాలు (ముల్తాన్, సియాల్‌కోట్, లాహోర్, అజ్మీర్, మీరట్, ఢిల్లీ, గ్వాలియర్, బెనారస్, కనౌజ్, కలింజర్, అవధ్, మాళ్వా, బిహార్, బెంగాల్‌ మొదలైనవి) ఘోరీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవని మిన్‌హజ్‌-ఉజ్‌-సిరాజ్‌ తన తబాకత్‌-ఐ-నాసిరి గ్రంథంలో పేర్కొన్నాడు.

చందావార్‌ యుద్ధం

క్రీ.శ. 1194లో మహమ్మద్‌ ఘోరీ భారతదేశంలోని గహద్వాల పాలకుడు జయచంద్రుడిపై దండెత్తాడు. ఇందులో కుతుబుద్దీన్‌ ఐబక్, ఇజుద్దీన్‌-హుస్సేన్‌-ఇబన్‌-కార్మిల్‌ అతడికి సాయంగా ఉన్నారు. వీరు జయచంద్రుడ్ని ఓడించారు. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను నిర్మించడానికి మార్గం సుగమమైంది.

పదవులు 

కుతుబుద్దీన్‌ ఐబక్‌ను ఘోరీ మొదట రాజశాలల అధికారి (Officer of the royal Stables) గా నియమించాడు. దీన్ని అమిర్‌-ఐ-అఖుర్‌ అనేవారు. గుర్రాల సాధారణ నిర్వహణ, వాటి ఆహారం, ఇతర సామగ్రి, వాటి బాగోగులు చూడటం ఇతడి ప్రధాన బాధ్యత. అక్కడి నుంచి ఇతడు అంచెలంచెలుగా ఎదిగి, ఘోరీకి నమ్మిన బంటులా మారాడు.

రచయిత:డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

విద్యా ఉద్యోగ సమాచారం

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌