• facebook
  • whatsapp
  • telegram

క్షార లోహాలు

* ఆధునిక ఆవర్తన పట్టికలో 1వ గ్రూప్‌లోని మూలకాలను ‘క్షార లోహాలు’ అంటారు.

* 1వ గ్రూప్‌లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం మూలకాలు ఉంటాయి.

* 1వ గ్రూప్‌లోని మూలకాలు నీటితో చర్య జరిపి బలమైన క్షార ధర్మాలు కలిగిన హైడ్రాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి. అందుకే వీటిని క్షార లోహాలు అంటారు.

ధర్మాలు

* క్షారలోహాల్లో ఒక ( ఎలక్ట్రాన్‌ బలహీనంగా బంధితమై ఉంటుంది. దీంతో అవి అత్యధిక ధనవిద్యుదాత్మకతను కలిగి ఉంటాయి.

* క్షార లోహాల్లో సోడియం, పొటాషియం ప్రకృతిలో సమృద్ధిగా లభిస్తాయి. ఫ్రాన్షియం రేడియోధార్మికతను ప్రదర్శిస్తుంది.

* క్షారలోహాలు సులభంగా ఒక ఎలక్ట్రాన్‌ను వదులుకుని ఏకసంయోజక అయాన్‌ (M+) లను ఏర్పరుస్తాయి. కాబట్టి, ఇవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించవు.

* Li నుంచి Csవరకు పరమాణు, అయానిక వ్యాసార్ధాలు పెరుగుతాయి.

* క్షారలోహాల అయనీకరణ శక్తి (అయనీకరణ ఎంథాల్పీ) విలువలు చాలా తక్కువగా ఉంటాయి. గ్రూప్‌లో Li నుంచి Cs వరకు అయనీకరణ ఎంథాల్పీ విలువలు తగ్గుతాయి. గ్రూప్‌లో పరమాణు వ్యాసార్ధాలు పెరగడమే దీనికి కారణం.

* లిథియం అయాన్‌ (Li+) కు అత్యధిక హైడ్రేషన్‌ ఎంథాల్పీ విలువ ఉంటుంది. కాబట్టి లిథియం లవణాలన్నీ చాలా ఆర్థ్రీకృతం చెంది ఉంటాయి

* క్షారలోహాలన్నీ తెల్లటి, మెత్తటి, తేలికైన లోహాలు.

* క్షార లోహాలు తక్కువ సాంద్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి

* సోడియం (Na) కంటే పొటాషియం (K) తేలికైంది.

* క్షార లోహాలను, వాటి లవణాలను జ్వాలలో వేడిచేసినప్పుడు, వాటిలోని ఒక వేలన్సీ ఎలక్ట్రాన్‌ ఉష్ణశక్తిని గ్రహించి ఉత్తేజితమవుతుంది. ఈ ఉత్తేజిత ఎలక్ట్రాన్‌ తిరిగి భూస్థాయికి చేరినప్పుడు దృశ్య ప్రాంతానికి (Visible region) చెందిన వికిరణాలను ఉద్గారిస్తుంది. కాబట్టి క్షార లోహ లవణాలు జ్వాలా పరీక్షలో రంగును ప్రదర్శిస్తాయి.

లోహం జ్వాలరంగు
లిథియం కెంపురంగు/ క్రిమ్‌సన్‌ ఎరుపు
సోడియం పసుపురంగు
పొటాషియం ఊదారంగు

* క్షార లోహాలు గాలి, నీటితో అత్యధిక చర్యాశీలతను ప్రదర్శిస్తాయి. అందుకే వీటిని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు.

* క్షార లోహాలను పొడి గాలిలో ఉంచితే లోహ ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి. దీంతో అవి కాంతి హీనమవుతాయి.

ఉపయోగాలు: 

* క్షార లోహాలు నీటితో చర్య జరిపి లోహ హైడ్రాక్సైడ్‌ (Metal hydroxide)లను, హైడ్రోజన్‌ను ఏర్పరుస్తాయి.

ఉదా: సోడియం + నీరు  సోడియం          హైడ్రాక్సైడ్‌ + హైడ్రోజన్‌ (క్షారం)

* క్షారలోహాలు ద్రవ అమ్మోనియం (NH3)లో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాలను ఏర్పరుస్తాయి.

* విద్యుత్‌ రసాయన ఘటాల్లో లిథియంను ఉపయోగిస్తారు.

* లిథియం, సీసంతో కలిసి తయారుచేసే ‘వైట్‌ మెటల్‌’ అనే మిశ్రమ లోహాన్ని మోటార్‌ ఇంజిన్‌లలో బేరింగ్‌లకి ఉపయోగిస్తారు.

* ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌లలో ద్రవ సోడియంను శీతలకారిణిగా వాడతారు.

* కాంతి విద్యుత్‌ఘటాల నిర్మాణాల్లో సీసియంను ఉపయోగిస్తారు.

* సోడియం కార్బొనేట్‌ తెల్లటి, స్ఫటిక పదార్థం. అది డెకా హైడ్రేట్‌  Na2CO3.10H2O గా ఉంటుంది. దీన్ని ‘వాషింగ్‌ సోడా’ లేదా ‘చాకలి సోడా’ అని పిలుస్తారు. దీన్ని వేడిచేస్తే స్ఫటిక జలాన్ని కోల్పోయి తెల్లటి పౌడర్‌గా మారుతుంది. ఈ పౌడర్‌ను ‘సోడాయాష్‌’ (Soda Ash)అంటారు. సోడియం కార్బొనేట్‌ను నీటి కాఠిన్యతను తొలగించడానికి, లాండ్రీల్లోనూ ఉపయోగిస్తారు.

* సోడియం క్లోరైడ్‌ (NaCl)ను టేబుల్‌ సాల్ట్‌ అంటారు. ఇది సముద్ర జలంలో అత్యంత సమృద్ధిగా లభిస్తుంది. దీనిలో 3.5% వరకు లవణభారం ఉంటుంది. హైడ్రోజన్‌ క్లోరైడ్‌ వాయువును ఉపయోగించి అపరిశుద్ధ సోడియం క్లోరైడ్‌ను శుద్ధి చేస్తారు

* సోడియం హైడ్రాక్సైడ్‌ (NaOH)ను ‘కాస్టిక్‌ సోడా’ అని కూడా అంటారు. ఇది చాలా బలమైన క్షారం. దీన్ని సబ్బులు, కాగితం తయారీలో ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్‌ను పెట్రోలియం, బాక్సైట్, కొవ్వులను శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు.

* సోడియం బైకార్బొనేట్‌ (NaHCO3)ను బేకింగ్‌ సోడా లేదా వంట సోడా అని పిలుస్తారు. దీన్ని అగ్నిమాపక పదార్థంగా కూడా ఉపయోగిస్తారు.

* కణం చుట్టూ ఉండే రక్తం ప్లాస్మాలోను, ప్రవాహిక అల్పాంతరాళాల్లోను సోడియం అయాన్‌లు ఉంటాయి. ఇవి నాడీ సంకేతాలను ప్రసారం చేయడానికి, కణపొర ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, కణాల్లోకి చక్కెరను రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. కణ ప్రవాహికల్లో పొటాషియం అయాన్‌లు అత్యంత సమృద్ధిగా ఉంటాయి. ఇవి సోడియం అయాన్‌లతో కలిసి నాడీ సంకేతాలను ప్రసారం చేయడానికి ఉపయోగపడతాయి.

* క్షారలోహాల్లో అధిక చర్యాశీలత కలది: ఫ్రాన్షియం

* క్షారలోహాల్లో తేలికైంది: లిథియం

* కర్బన రసాయనశాస్త్రంలో సల్ఫర్, హాలోజన్, నైట్రోజన్‌లను గుర్తించడానికి ఉపయోగించే లాసైన్‌ పరీక్ష ్బల్చి((్చi్ణ-’్ఠ( ్మ’(్మ్శలో సోడియంను ఉపయోగిస్తారు.

* సోడియం నైట్రేట్‌ ్బవ్చివివీ3్శను ఎరువుగా ఉపయోగిస్తారు.

* సాధారణ నీటి ఉష్ణోగ్రతను వీాది కంటే తక్కువ చేయడానికి సోడియం క్లోరైడ్‌ను కలుపుతారు. ఉప్పు, మంచు ముక్కల మిశ్రమాన్ని హిమీకరణ మిశ్రమం ్బనీ౯’’)i-్ణ లీi్ల్మ్య౯’్శ అంటారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిలో సోడియం బైకార్బొనేట్‌ రసాయన నామం? (ఏపీపీఎస్సీ, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 2020)

1) డిటర్జెంట్‌       2) వంటసోడా 

3) హ్యాండ్‌ శానిటైజర్‌   4) టాల్కం పౌడర్‌

2. గన్‌పౌడర్‌ (తుపాకి మందు) గంధకం (S), కర్రబొగ్గు (C), ..... మిశ్రమం. (ఫారెస్ట్‌బీట్‌ ఆఫీసర్‌ 2019)

1) పొటాషియం నైట్రేట్‌ 

2) సోడియం నైట్రేట్‌ 

3) పొటాషియం క్లోరైడ్‌ 

4) సోడియం క్లోరైడ్‌

3. ‘బ్రైన్‌’ అనేది ఏ లవణం జల ద్రావణం? (యూపీఎస్సీ, ఎన్‌డీఏ 2018)

1) NaCl         2) NaOH
3) NaHCO3    4) Na2CO3

4. బేకింగ్‌ సోడా లేదా వంట సోడా రసాయన ఫార్ములా? (యూపీఎస్సీ, ఎన్‌డీఏ 2017)

1) Na2CO     2) NaHCO3

3) CaCO3     4) NaOH

5. కింది అంశాలను జతపరచండి. (ఏపీపీఎస్సీ, ఎఫ్‌ఆర్‌ఓ 2020)

లవణం ఉపయోగం
i) సోడియం కార్బొనేట్‌ a) లోహాల సంగ్రహణం
ii) సోడియం బెంజోయేట్‌ b) గాజు తయారీ
iii) కాల్షియం కార్బొనేట్‌ c)ఎరువులు
iv) కాల్షియం ఫాస్ఫేట్‌ d) ఆహార పదార్థాల సంరక్షకాలు

1) i-b, ii-d, iii-c, iv-a

2) i-b, ii-d, iii-a, iv-c

3) i-b, ii-a, iii-d, iv-c

4) i-, ii్జ, iii్చ, i్ర‘

6. వాషింగ్‌ సోడా రసాయన ఫార్ములా? (యూపీఎస్సీ, సీడీఎస్‌ 2020)

1) వ్చిబీదివీ3   2) వ్చి2దివీ3.10బీ2వీ 

3) ద్చ్బివీబ్శీ2   4) ద్చివీదిః2

సమాధానాలు

1 - 2     2 - 1     3 - 1     4 - 2      5 - 2     6 - 2

గుర్తుంచుకోండి..

* రేడియోధార్మికతను ప్రదర్శించే క్షారలోహం ఫ్రాన్షియం.

* లాసైన్‌ పరీక్షలో ఉపయోగించే క్షార లోహం సోడియం.

* సోడియం లోహం చల్లటి నీటితో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది.

* సోడియం ఫాటీ ఆమ్ల లవణాన్ని సబ్బు అంటారు.

* మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం లిథియం.

* సోడియం అయాన్‌ (Na+), పొటాషియం అయాన్‌ (K+) లోహ అయాన్‌లు మన శరీరంలో నీటి సమతౌల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

* లిథియం ఘనస్థితిలో ఉన్న బైకార్బొనేట్‌ను ఏర్పరచలేదు.

* లిథియం అయాన్‌ అత్యధిక హైడ్రేషన్‌ తీవ్రతను కలిగి ఉంటుంది.

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌