• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర స్వాతంత్రోద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?
జ: గాజుల లక్ష్మీనరసు

 

2. మద్రాస్ రామమోహన్‌రాయ్ గా పేరొందిన వ్యక్తి-
జ: గాజుల లక్ష్మీనరసు

 

3. 1885లో ఆంధ్రప్రకాశిక అనే తొలి రాజకీయ వారపత్రికను ఎవరు ప్రారంభించారు?
జ: పార్థసారధి నాయుడు

 

4. దారితప్పి రాజకీయాల్లోకి వచ్చిన పండితుడు గా పేరొందిన భారతీయుడు ఎవరు?
జ: తిలక్

 

5. 1886 రెండో జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంత మంది ఆంధ్ర ప్రతినిధులు హాజరయ్యారు?
జ: 21

 

6. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు?
జ: పి. ఆనందాచార్యులు

7. ఆంధ్రదేశంలో ఏర్పడిన తొలి జిల్లా కాంగ్రెస్ సంఘం ఏది?
జ: కృష్ణా

 

8. కిందివారిలో భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసిన ఆంధ్రుడు ఎవరు?
1) కొండా వెంకటప్పయ్య             2) పి. ఆనందాచార్యులు
3) న్యాపతి సుబ్బారావు                4) భోగరాజు పట్టాభి సీతారామయ్య
జ: 3 (న్యాపతి సుబ్బారావు)

 

9. 1905 మద్రాస్ బీచ్ సమావేశంలో దేశభక్తి గీతాలు పాడిన వ్యక్తి-
జ: సుబ్రహ్మణ్య భారతి

 

10. వందేమాతరం ఉద్యమ కాలంలో ఆంధ్ర యువకులను జపాన్ పంపడానికి కృషిచేసింది ఎవరు?
జ: వింజమూరి భావనాచారి

 

11. వందేమాతరం ఉద్యమ కాలంలో రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాలను ఎవరు స్థాపించారు?
జ: న్యాపతి సుబ్బారావు

12. ఆంధ్రలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఎవరు ఏర్పాటు చేశారు?
జ: ముట్నూరి కృష్ణారావు

 

13. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్‌కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు?
జ: మాదెల్ల సారయ్య

 

14. పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తూ 'భరతఖండంబు చక్కని పాడియావు' గీతాన్ని ఆలపించింది ఎవరు?
జ: చిలకమర్తి లక్ష్మీ నరసింహం

 

15. రాజమండ్రి పాల్ సభల్లో వందేమాతరం గీతాన్ని పాడినవారు-
జ: కౌతా శ్రీరామమూర్తి

 

16. మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్‌కు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు?
జ: రామదాసు నాయుడు

 

17. వందేమాతర ఉద్యమకాలంలో ఏర్పడిన సంస్థలు, ప్రదేశాలను జతపరచండి.

1) స్వరాజ్య సమితి a) మచిలీపట్నం
2) బాలభారత సమితి b) కాకినాడ
3) మహిళాభారతి సంఘం c) విశాఖపట్నం
4) రక్షణలీగ్ d) రాజమండ్రి

జ: 1-a, 2-d, 3-c, 4-b

18. బందరు జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపల్ ఎవరు?
జ: కోపల్లె హనుమంతరావు

 

19. మీర్జాపురం జమీందారుపై రైతులు వేసిన కేసులో ఉచితంగా వాదించింది-
జ: వి. రామదాసు పంతులు

 

20. వందేమాతర ఉద్యమ కాలంలో జపాన్ చరిత్ర అనే గ్రంథాన్నిఎవరు రాశారు?
జ: ఆదిపూడి సోమనాథరావు

 

21. హిందూ దేశ దారిద్య్రం గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: అత్తిలి సూర్యనారాయణ
 

22. 'రాజమండ్రి కళాశాల సంఘటన విద్యార్థులు రాజకీయాల్లో చేరడానికి నాంది పలికింది' అని అన్నదెవరు?
జ: సరోజిని రేగాని

 

23. రాజమండ్రి కళాశాలలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఉద్యోగానికి పనికిరాడని టి.సి.పై రాసిన ప్రిన్సిపాల్ ఎవరు?
జ: మార్క్‌హంటర్

 

24. కాకినాడ కొట్లాట కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఎవరు?
జ: న్యాపతి సుబ్బారావు

 

25. కాకినాడ కొట్లాట కేసుకు కారకుడైన ఆంగ్ల అధికారి ఎవరు?
జ: కెప్టెన్ కెంప్

26. కాకినాడ కొట్లాట కేసు అరెస్టులకు నిరసనగా జరిగిన సభకు అధ్యక్షత వహించినదెవరు?
జ: కె. పేర్రాజు

 

27. వందేమాతర ఉద్యమ కాలంలో అరెస్టయిన తొలి ఆంధ్ర రాజకీయ ఖైదీ ఎవరు?
జ: గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

 

28. కోటప్ప కొండ సంఘటన ఎప్పుడు జరిగింది?
జ: 1909, ఫిబ్రవరి 18

 

29. కోటప్ప కొండ సంఘటనలో ఉరితీసిన చిన్నపరెడ్డి స్వగ్రామం
జ: చేబ్రోలు

 

30. తెనాలి బాంబుకేసు ఏ ఉద్యమ కాలంలో జరిగింది?
జ: వందేమాతర ఉద్యమం

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌