• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ కాలుష్యం

1. కిందివాటిలో భౌతిక పర్యావరణం ఏది?

1) జీవావరణం   2) వాతావరణం    3) జలావరణం      4) 1, 3


2. భూమి ఉపరితలం, సముద్ర అడుగు భాగంలో వ్యాపించి ఉన్న మట్టి, ఖనిజాలు, రాతిపొరను ఏమంటారు?

1)  వాతావరణం      2) శిలావరణం    3) జీవావరణం     4) జలావరణం


3. కిందివాటిలో సరైంది?

i) శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు.

ii) అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు మొదలైనవి శిలాజాతుల్లో ముఖ్యమైనవి.

1) i మాత్రమే    2) ii మాత్రమే     3)  i, ii   4) ఏదీకాదు


4. భూమి చుట్టూ వాయువుల మిశ్రమం ఒక పొరలా ఆవరించి ఉంటుంది. దీన్ని ఏమంటారు?

1)  జీవావరణం    2)  శిలావరణం   3)  వాతావరణం     4)  జలావరణం


5. వాతావరణంలో కార్బన్‌ డైఆక్సైడ్‌ శాతం ఎంత?

1)  20.95%     2) 0.04%    3)  0.4%       4) 0.9%


6. వాతావరణంలో ఆర్గాన్‌ వాయువు శాతం ఎంత?

1)  78%    2) 20.95%    3)  0.04%    4) 0.9%


7. కిందివాటిలో సరైంది ఏది?

i)  వాతావరణంలో అధిక శాతం ఉన్న జడవాయువు ఆర్గాన్‌.

ii) వాతావరణ పీడనాన్ని బారోమీటర్‌తో కొలుస్తారు.

iii) వాతావరణంలోని తేమ శాతాన్ని హైగ్రోమీటర్‌తో కొలుస్తారు.

1) i, iii    2)  ii మాత్రమే    3) పైవన్నీ     4) ఏదీకాదు


8. వాతావరణంలోని ఏ ఆవరణల్లో కాలుష్యం ఏర్పడుతుంది?

1) ట్రోపో, స్ట్రాటో     2) మీసో, స్ట్రాటో     3) మీసో, ట్రోపో      4) మీసో, హైడ్రో 


9. వాతావరణంలో ఓజోన్‌ పొర ఎక్కడ ఉంటుంది?

1) స్ట్రాటో ఆవరణం     2)  మీసో ఆవరణం    3) థర్మో ఆవరణం   4) ఏదీకాదు


10. ఎత్తుకు వెళ్లేకొద్దీ వాతావరణ పీడనం.....

1)  పెరుగుతుంది       2) తగ్గుతుంది    3)  స్థిరంగా ఉంటుంది    4) మొదట తగ్గి, తర్వాత పెరుగుతుంది


11. కిందివాటిలో సరికాని జత?

1)  వాతావరణ పీడనం - 76 cm Hg

2) కిరణజన్యసంయోగక్రియ - ఆక్సిజన్‌

3)  గ్రానైట్‌ - ఇగ్నియస్‌ శిలలు

4) భూమిపై మొదటగా ఏర్పడిన శిలలు - రూపాంతర శిలలు


12. భూమిపై లభించే శిలల్లో అధికభాగం ఏ రకం శిలాజాతికి చెందినవి?

1) అగ్నిశిలలు    2) రూపాంతర శిలలు     3) అవక్షేప శిలలు     4)  1, 2


13. కింది ఏ వాతావరణ పొరలో ఉల్కాపాతం సంభవిస్తుంది?

1) థర్మో ఆవరణం    2) స్ట్రాటో ఆవరణం     3) మీసో ఆవరణం    4) ఏదీకాదు


14. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

1) కార్బన్‌ డైఆక్సైడ్‌      2)  సల్ఫర్‌ డైఆక్సైడ్‌      3)  నైట్రిక్‌ ఆక్సైడ్‌    4)  పైవన్నీ


15. కిందివాటిలో ద్వితీయ కాలుష్యకాలు ఏవి?

1)  ఓజోన్‌      2) పెరాక్సీ ఎసైల్‌ నైట్రేట్‌    3) 1, 2      4) కార్బన్‌ మోనాక్సైడ్‌


16. కాలుష్య దుష్ప్రభావానికి లోనయ్యే మాధ్యమాన్ని ఏమంటారు?

1)  సింక్‌      2)  గ్రాహకం     3) 1, 2     4) పరిమాణాత్మక కాలుష్యకాలు


17. కిందివాటిలో కార్బన్‌ డైఆక్సైడ్‌కు సింక్‌లు ఏవి?

1)  సముద్రాలు     2) అడవులు   3) 1, 2    4) మనుషులు


18. కిందివాటిలో వాయుస్థితి గాలి కాలుష్య కారకాలకు ఉదాహరణ?

1) హైడ్రోకార్బన్లు   2) కార్బన్‌ మోనాక్సైడ్‌     3)  నైట్రోజన్‌ ఆక్సైడ్‌     4)  పైవన్నీ


19. కిందివాటిలో కణస్థితి కాలుష్య కారకాలకు ఉదాహరణ?

1) కార్బన్‌ డైఆక్సైడ్‌   2) ఓజోన్‌     3)  దుమ్ము   4)సల్ఫర్‌ డైఆక్సైడ్‌


20. కిందివాటిలో సరైనవి?

i) కార్బన్‌ మోనాక్సైడ్‌  (CO) జేగురు రంగు వాయువు.

ii)  కార్బన్‌ మోనాక్సైడ్‌ వాసనలేని, విష స్వభావం ఉన్న వాయువు.

iii) కార్బన్‌ మోనాక్సైడ్‌ రక్తంలోని హీమోగ్లోబిన్‌తో చర్య జరిపి కార్బాక్సీ హీమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది.

iv) రక్తంలో కార్బాక్సీ హీమోగ్లోబిన్‌ గాఢత అధికమైతే, రక్తం ఆక్సిజన్‌ రవాణా సామర్థ్యం పెరుగుతుంది.

1) i, ii     2) ii, iii     3) i, ii, iii   4) ii, iii, iv


21. కార్బన్‌ మోనాక్సైడ్‌ కాలుష్యానికి గురైన వ్యక్తికి కార్బోజన్‌ను అందించి చికిత్స చేస్తారు. ఇది ఏ వాయువుల మిశ్రమం?

1) 90% ఆక్సిజన్‌ (O​​​​​​2) + 10%కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2 )

2) 70% కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2 ) + 30% ఆక్సిజన్‌(O2)

3) 90% ఆక్సిజన్‌(O2) + 10% కార్బన్‌ మోనాక్సైడ్‌(CO)

4) 50% కార్బన్‌ మోనాక్సైడ్‌(CO) + 50% కార్బన్‌ డైఆక్సైడ్‌


22. వాహనాల్లో ఉపయోగించే ఇంధనాలు అసంపూర్ణంగా మండినప్పుడు, వాతావరణంలోకి వెలువడే కాలుష్యకాలు ఏవి?

1) హైడ్రోకార్బన్లు    2) కార్బన్‌ మోనాక్సైడ్‌      3) 1, 2      4) ఓజోన్‌


23. చిత్తడి నేలల నుంచి ప్రధానంగా వెలువడే హైడ్రోకార్బన్‌ వాయువు ఏది?

1) ఓజోన్‌   2) మీథేన్‌     3) ఎసిటిలీన్‌     4) 1, 3


24. గాలిని ద్రవీకరించి దాని నుంచి ఆక్సిజన్, నైట్రోజన్‌ను కింది ఏ పద్ధతి ద్వారా వేరుచేస్తారు?

1) స్వేదనం   2) వడపోత     3) అంశిక స్వేదనం    4) పైవన్నీ


25. కిందివాటిలో సరికానిది ఏది?

i) ఆక్సిజన్‌ రంగు, వాసన లేని వాయువు.

ii) ఆక్సిజన్‌ వాయువు దహన దోహదకారి కాదు, దహనశీలి.

1) i మాత్రమే    2) ii మాత్రమే    3) i, ii      4) ఏదీకాదు


26. PM10 కణస్థితి కాలుష్యాల పరిమాణం ఎంత?

1) 10 మిల్లీ మీటర్లు    2) 10 మైక్రో మీటర్లు    3) 10 సెంటీ మీటర్లు    4)  10 నానో మీటర్లు


27. స్మాగ్‌ అనేపదం కింది వేటి నుంచి వచ్చింది?

1) స్మోక్, కార్బన్‌     2) స్మోక్, ఫాగ్‌     3) ఫాగ్, కార్బన్‌    4) 1, 3


28. కిందివాటిలో సరైంది?

i) PM10 కణాలు సులభంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయి.

ii) ఫ్లైయాష్‌ కణస్థితి కాలుష్యకారకానికి చక్కటి ఉదాహరణ.

1) i మాత్రమే      2) ii మాత్రమే    3) i, ii     4) ఏదీకాదు


29. కిందివాటిలో ‘కాంతి రసాయన స్మాగ్‌’కు కారణమయ్యేవి?

1) ఓజోన్‌    2) పెరాక్సీ ఎసైల్‌ నైట్రేట్‌      3) 1, 2       4) కార్బన్‌ మోనాక్సైడ్‌


30. కిందివాటిలో దేన్ని ‘ఆమ్లస్మాగ్‌’ అంటారు?

1) కాంతి రసాయన స్మాగ్‌    2)  సంప్రదాయక స్మాగ్‌  3) ఆమ్ల వర్షం    4) 1, 2


31. సల్ఫర్‌ డైఆక్సైడ్, పొగ, మంచు కలిసినప్పుడు ఏర్పడే స్మాగ్‌ రకం ఏది?

1) సంప్రదాయక స్మాగ్‌     2) కాంతి రసాయన స్మాగ్‌      3) నైట్రస్‌ స్మాగ్‌     4) ఏదీకాదు


32. కిందివాటిలో హరితగృహ వాయువు ఏది?

1)  ఆక్సిజన్‌    2)  నైట్రోజన్‌     3)  కార్బన్‌ డైఆక్సైడ్‌        4) 1, 2


33. కిందివాటిలో హరితగృహ వాయువు కానిది?

1) మీథేన్‌       2) నీటి ఆవిరి     3) ఓజోన్‌      4) ఆర్గాన్‌


34. వాతావరణంలో హరితగృహ వాయువుల పరిమాణం ఎక్కువై, భూమి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటారు?

1) ఆమ్ల వర్షాలు       2) గ్లోబల్‌ వార్మింగ్‌       3)  ఓజోన్‌ పొర క్షీణత    4) ఏదీకాదు


35. కిందివాటిలో సరైంది ఏది?

i) గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ధృవ ప్రాంతాల్లోని హిమశిఖరాలు కరిగిపోతాయి.

ii)  గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి, అధిక అకాల వర్షాలు, కరవు సంభవిస్తాయి.

1) i మాత్రమే     2)  ii మాత్రమే      3)  i, ii    4) ఏదీకాదు


36. ఓజోన్‌ పొర క్షీణతకు కారణమయ్యే కాలుష్యకాలు ఏవి?

1) క్లోరోఫ్లోరోకార్బన్లు      2) హాలన్లు      3) 1, 2    4) కార్బన్‌ మోనాక్సైడ్‌


37. కిందివాటిలో సరికాని జత?

1)  నీటి ఆవిరి - H2O     2)  కార్బన్‌ డైఆక్సైడ్‌ - CO2     3) ఓజోన్‌ - O3       4) ఓజోన్‌ - O2


38. భోపాల్‌ సంఘటనకు కారణమైన హానికర వాయువు ఏది?

1) మిథైల్‌ ఐసోసయనైడ్‌     2) ప్రొపైల్‌ ఐసోసయనైడ్‌      3)  స్టైరీన్‌        4) హైడ్రోకార్బన్లు


39. ఓజోన్‌ పరిరక్షక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) సెప్టెంబరు 6    2) సెప్టెంబరు 16      3) మార్చి 23       4)  మార్చి 16


40. ఫ్రియాన్‌ రసాయన నామం?

1)  డైక్లోరోడైఫ్లోరోమీథేన్‌     2) డైక్లోరోడైబ్రోమోమీథేన్‌     3)  డైక్లోరోట్రైఫ్లోరోమీథేన్‌      4) డైబ్రోమోడైఫ్లోరోమీథేన్‌


41. కిందివాటిలో మొక్కల పత్రహరితానికి నష్టం కలిగించే వాయువు ఏది?

1)  నైట్రోజన్‌      2)  కార్బన్‌ మోనాక్సైడ్‌    3) సల్ఫర్‌ డైఆక్సైడ్‌     4) హైడ్రోజన్‌


42. ‘లాఫింగ్‌ గ్యాస్‌’ అని పిలిచే హరితగృహ వాయువు ఏది?

1)  నైట్రోజన్‌    2) నైట్రస్‌ ఆక్సైడ్‌    3)  నైట్రిక్‌ ఆక్సైడ్‌    4) అమ్మోనియా


43. శిలాజ ఇంధనాలను మండించినప్పుడు వెలువడే వాయువు?

1) కార్బన్‌ డైఆక్సైడ్‌      2) సల్ఫర్‌ డైఆక్సైడ్‌      3)  నైట్రోజన్‌ ఆక్సైడ్‌   4) పైవన్నీ


సమాధానాలు
1-4  2-2  3-3  4-3  5-2  6-4  7-3  8-1  9-1  10-2  11-4  12-3  13-3  14-4  15-3  16-2  17-3  18-4  19-3  20-3  21-1  22-3  23-2  24-3  25-2  26-2  27-2  28-3  29-3  30-2  31-1  32-3  33-4  34-2  35-3  36-3  37-4  38-1  39-2  40-1  41-3  42-2  43-4

Posted Date : 01-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌