• facebook
  • whatsapp
  • telegram

జీవసాంకేతిక శాస్త్రం

1. జంతు జీవసాంకేతిక శాస్త్రం కిందివాటిలో దేనికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది?
i)  rDNA సాంకేతికత ద్వారా జంతువుల్లో విలువైన ఉత్పత్తులను వృద్ధి చేయడం.
ii) వాంఛిత లక్షణాలు కలిగిన జన్యురూపాలను ప్రదర్శించే జంతుజాలాన్ని వృద్ధి చేయడం.
iii) జన్యువుల్లో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా వాటి ఉత్పత్తుల్లో వాంఛనీయత పెంచడం.
1) i, iii             2) i, ii              3) ii, iii             4) i, ii, iii 


2. కిందివాటిలో దేన్ని ఉత్పత్తి చేయడానికి జంతు కణవర్ధనాలను విరివిగా ఉపయోగిస్తారు?
1) ఇన్సులిన్‌       2) సొమాటో స్టాటిన్‌

3) మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ 
4) పిండజననాలు


3. జంతు కణవర్ధన ప్రయోగాల ద్వారా అభివృద్ధి చేసిన మొదటి వ్యాక్సిన్‌ ఏది?
1) హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌           2) ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌
3) మశూచి వ్యాక్సిన్‌               4) పోలియో వ్యాక్సిన్‌


4. ఇంటర్‌ఫెరాన్స్‌ అంటే ఏమిటి?
1) యాంటీ బ్యాక్టీరియల్‌ ప్రోటీన్స్‌ 
2) యాంటీ వైరల్‌ ప్రోటీన్స్‌
3) బ్యాక్టీరియోస్టాటిక్‌ ప్రోటీన్స్‌ 
4) యాంటీ హిస్టమిన్స్‌


5. ఇంటర్‌ఫెరాన్స్‌ను ఉత్పత్తి చేయడానికి జరిపే కణవర్ధన ప్రయోగాల్లో సాధారణంగా నష్టపరిచే వైరస్‌ .....
1) సెండాయ్‌ వైరస్‌           2) కరోనా వైరస్‌ 
3) పోలియో వైరస్‌   4) స్మాల్‌పాక్స్‌ వైరస్‌


6. ప్రయోగశాలలో నియమిత వాతావరణ పరిస్థితుల్లో సరైన వర్ధనయానకంలో జంతుకణాలను వృద్ధి చేయడాన్ని ఏమంటారు?
1) జన్యు పరివర్తన   2) కణ పరివర్తన
3) కణవర్ధనం      4) కణజాల వర్ధనం


7. ప్రాథమిక వర్ధకాల ఉపవర్ధకాలను ఏమంటారు?
1) ట్రాన్స్‌ఫార్మింగ్‌ సెల్స్‌           2) సెల్‌ లైన్స్‌
3) కల్చర్‌ సెల్స్‌       4) సెల్‌ రూమ్స్‌


8. మానవుడిలో పిండ సంబంధ ఊపిరితిత్తులకు సంబంధించిన సెల్‌లైన్‌ (కణవరుస) పేరు?
1) HeLa        2) WISH         3) LD         4) MRC - 5 


9. జంతు కణవర్ధన యానకంలో కింది ఏ పదార్థం ఉండదు?
1) స్టార్చ్‌     2) సీరం
3) కర్బన వనరు     4) అకర్బనిక


10.  HeLa అనేది దేనికి సంబంధించిన కణ వరుస పేరు?
1) హ్యూమన్‌ వెర్టిబ్రల్‌ ఆస్టియోమలేసియా
2) హ్యూమన్‌ సర్వైకల్‌ కార్సినోమా
3) హ్యూమన్‌ పాపిలోమా వైరల్‌ రెసిస్టర్స్‌
4) రొడంట్‌ రీప్రొడక్టివ్‌ కంట్రోలింగ్‌ సెల్‌లైన్‌


11. WISH అనేది దేని సెల్‌లైన్‌ పేరు?
1) హ్యూమన్‌ పల్మనరీ టిష్యూ క్లస్టర్‌ 
2) హ్యూమన్‌ ఎంబ్రియోనిక్‌ టిష్యూ డిఫరెన్సియేషన్‌
3) హ్యూమన్‌ ఆమ్నియాన్‌ 
4) హ్యూమన్‌ కనెక్టివ్‌ టిష్యూ


12. జంతు కణవర్ధన యానకంలో ప్రధానంగా ఉండే అనుఘటకాలను గుర్తించండి.
i) సీరం(5 - 20%)           ii) నత్రజని వనరులు
iii) అకర్బన, కర్బన సమ్మేళనాలు 
iv) వృద్ధి కారకాలు     v) బఫర్‌ 
vi) విటమిన్‌లు
1) i, ii, iii, iv         2) iii, iv, v, vi
3) i, iii, v, vi         4) i, ii, iii, iv, v, vi 


13. వర్ధనయానకంలో సీరం ప్రధాన విధి కానిది?
1) ట్యూబర్, బల్బ్‌ల అభివృద్ధి 
2) కణపెరుగుదల ప్రేరేపణ
3) కణాన్ని అంటిపెట్టుకునేలా చేయడం 
4) రవాణా క్రియ జరిపే ప్రోటీన్‌లను అందించడం.


14. క్షీరదాల్లో కణాల పెరుగుదలకు కావాల్సిన నియమిత pH విలువ ......
1) 5.3 - 7.0         2) 6.5 - 7.0          3) 7.2 - 7.4            4) 8.1 - 8.9 


15. వెరో సెల్‌ లైన్‌ను ఏ జంతువు మూత్ర పిండకణాల నుంచి సంగ్రహిస్తారు?
1) గబ్బిలాలు     2) పందులు
3) లేగదూడలు     4) ఆఫ్రికన్‌ గ్రీన్‌మంకీ


16. సర్వసాధారణంగా ఉపయోగించే కణ సంధాయక కారకం.....
1) PEG          2) NaNO3        
3) సెండల్‌ సల్ఫేట్‌   4) PVC


17.  PEG పూర్తి పేరు.....
1) పాలీ ఇథలీన్‌ గ్లైకాల్‌
2) పిరిడిన్‌ ఎపాక్సీ గ్లూకోథాలమేట్‌
3) పాలీహైడ్రాక్సీ ఇథాక్సీ గ్లూకో ఫూరనోజ్‌
4) పిరిడిన్‌ హైడ్రాకీ ఇపాక్సీ గ్లూకోనిక్‌ ఆమ్లం


18. కణవర్ధన వ్యవస్థలో ఉపయోగించే CO2, O2ల మధ్య నిష్పత్తి..
1) 1 : 5           2) 1 : 13           3) 1 : 19           4) 1 : 25


19. పునఃసంయోజక లైంగిక హార్మోన్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సెల్‌లైన్‌ ఏది?
1)  BHK సెల్‌ లైన్‌              2)  CHO సెల్‌ లైన్‌
3) HeLa సెల్‌ లైన్‌             4) లీరో సెల్‌ లైన్‌


20. కణవర్ధన వ్యవస్థలో నిర్మాణాత్మక తంతువుగా పనిచేసేవి?
1) కొల్లాజిన్, గ్లోబ్యులిన్‌ ప్రోటీన్‌లు
2) కొల్లాజిన్, ఫైబ్రినోజన్‌ ప్రోటీన్‌లు
3) కొల్లాజిన్, గ్లోమరూలర్‌ ప్రోటీన్‌లు
4) కొల్లాజిన్, ఎలాస్టిన్‌ ప్రోటీన్‌లు


21. జంతు కణవర్ధన సాంకేతికతకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
i) లాక్టిక్‌ ఆమ్లం కర్బన వనరుగా పనిచేస్తుంది.
ii) కణాలకు లి గ్లుటామిన్‌ అధిక మోతాదుల్లో అవసరం.
iii) కోలైన్‌ అనేది కణాల సంధాయకత్వానికి పనిచేసి, కణ అస్థిపంజరంగా ఉపయోగపడుతుంది.
1) i, ii, iii           2) i, iii            3) ii, iii            4) i, ii


22. కిందివాటిలో చాలా పురాతనమైన సెల్‌లైన్‌ ఏది?
1) షీలా సెల్‌ లైన్‌         2) వెరో సెల్‌ లైన్‌
3) హీలీ సెల్‌ లైన్‌         4) దిబీవీ సెల్‌ లైన్‌


23. కణవర్థన సాంకేతికతకు (సెల్‌కల్చర్‌ టెక్నిక్‌)కు ఆద్యుడు?
1) రొనాల్డ్‌        2) విలియం రాక్స్‌          3) రాస్‌        4) హారిసన్‌


24. జంతువుల్లో కణజాలవర్ధన ప్రక్రియపై మొదటగా పరిశోధనలు చేసింది ఎవరు?
1) రాస్‌ గ్రాన్‌విల్లే హారిసన్‌       2) హారిస్‌ గుల్‌బర్నా  
3) సర్‌ డొనాల్డ్‌ మిస్ట్‌           
4) సర్‌ డేవిడ్‌ ఫ్రెడరిక్‌


25. ట్రాన్స్‌జెనిక్‌ జంతువులు అంటే....
1) ఆడ, మగ జన్యువులు కలిగి ఉన్న జంతువులు.
2) జన్యువులు ఉన్నా అవి సరిగ్గా వ్యక్తం కాని జంతువులు.
3) రవాణాకు అనుకూలంగా శరీరాన్ని కలిగి ఉండే జంతువులు.
4) వాంఛిత లక్షణాన్ని చూపే జన్యువును కృత్రిమంగా కలిగి ఉండేవి.


26. కిందివాటిలో 95% వరకూ ఉన్న ట్రాన్స్‌జెనిక్‌ జంతువులు ఏవి?
1) గొర్రెలు         2) కుందేళ్లు         3) పందులు         4) ఎలుకలు


27. క్లోనింగ్‌ ద్వారా జన్మించిన మొదటి జంతువు?
1) డాలీ షీప్‌     2) లీడా ఫిష్‌
3) స్మార్ట్‌ మైస్‌     4) స్కాటిష్‌ స్నేక్‌


28. జీవసాంకేతిక శాస్త్రంలో ఉన్న ప్రధాన అంశాలు ఏవి?
i) కణవర్ధనం      ii) జెనెటిక్‌ ఇంజినీరింగ్‌
iii) అంతర్నిర్మాణ శాస్త్రం
1) i, iii     2) i, ii     3) ii, iii     4) i, ii, iii


29. వాంఛిత లక్షణాలు ఉన్న జన్యువును వేరే జీవిలోకి చొప్పించడానికి కావల్సింది?
1) జన్యుపరివర్తనం           2) జన్యురూపకం
3) జన్యువాహకం          4) జన్యుపరికరం


30. కిందివాటిలో జన్యు వాహకానికి (జెనిటిక్‌ వెక్టర్‌) ఉదాహరణలు....
i) కాస్మిడ్‌లు          ii) ప్లాస్మిడ్‌లు         
iii) ఈస్ట్‌ ఆర్టిఫిషియల్‌ క్రోమోజోమ్‌ (YAC)

iv) బ్యాక్టీరియల్‌ ఆర్టిఫిషియల్‌ క్రోమోజోమ్‌ (BAC)
1) i, ii, iii           2) ii, iii, iv              3) i, iii, iv         4) i, ii, iii, iv 


31. ప్లాస్మిడ్‌లను ఎక్కడ గుర్తించవచ్చు.
1) బ్యాక్టీరియల్‌ కణద్రవ్యంలో       
2) ఈస్ట్‌ కణద్రవ్యంలో
3) బ్యాక్టీరియల్‌ కేంద్రక ద్రవ్యంలో    
4) ఈస్ట్‌ కేంద్రక ద్రవ్యంలో


32. ప్లాస్మిడ్‌ ఏ జీవ అణువుతో నిర్మితమవుతుంది?
1) కార్బోహైడ్రేట్‌లు       2) RNA         3) DNA          4) ప్రోటీన్‌లు


33. జన్యు వాహకంగా ఉపయోగపడేవి సాదారణంగా ఏ గుణాన్ని ప్రదర్శిస్తాయి?
1) అనువంశికతను ప్రదర్శించే జన్యు సమాచారాన్ని కలిగి ఉండటం.
2) ప్రోటీన్‌తో నిర్మితమైన పోషకాలను కలిగి ఉండటం.
3) ఏ లక్షణాన్నీ ప్రదర్శించకుండా ఉండే గుణాన్ని కలిగి ఉండటం.
4) ఒక జన్యువుతో ఉన్నా కొన్ని కోట్ల లక్షణాలకు కావాల్సిన ప్రోటీన్‌లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం.


34. ఈ.కొలై నుంచి సంగ్రహించిన జన్యు వాహకం...
1) PBR 233           2) PBR 323           3) PBR 322               4) PBR 231 


35.  PBR 322 అనేది దేనికి ఉదాహరణ.
1) ఆర్టిఫిషియల్‌ క్రోమోజోమ్‌        2) కాస్మిడ్‌
3) ఆర్టిఫిషియల్‌ జీనోమ్‌         4) ప్లాస్మిడ్‌


36. DNA పోచను అంతర్గతంగా కత్తిరించడానికి ఉపయోగపడే ప్రోటీన్‌.....
1) ఎక్సోన్యూక్లియేస్‌            2) ఎండోన్యూక్లియేస్‌
3) ఎండోప్రోటియేస్‌           4) ఎక్సోప్రోటియేస్‌


37. నియమిత స్థానాల వద్ద DNA పోచను అంతర్గతంగా కత్తిరించగలిగే లక్షణాన్ని చూపే ఎంజైమ్‌......
1) రిస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేస్‌             2) రిస్ట్రిక్షన్‌ ఎక్సోన్యూక్లియేస్‌
3) DNA సింథటీజ్‌      4) DNA పాలిమరేజ్‌


38. EcoR1 అనేది దేనికి ఉదాహరణ?
1) ఇటీవల కప్పల్లో కనుక్కున్న జీర్ణాశయ ఎంజైమ్‌.
2) ఎశ్చరీషియా ఎంటమీబాలో కనుక్కున్న రిస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌.
3) ఎశ్చరీషియా కొలైలో కనుక్కున్న రిస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌.
4) ఎంటమీబా హిస్టలిటికాపై పనిచేసే ఔషధం.


39. ప్లాస్మిడ్‌ను, తంతుయుత కొలిఫేజ్‌ను సంధానం చేస్తే  ఏర్పడే కొత్త జన్యువాహకం.....
1) కాస్మిడ్‌             2) బ్యాక్టీరియోఫేజ్‌ లాంబ్డా
3) లో కాపీ వెక్టార్‌       4) ఫేజ్‌మిడ్‌


40. కిందివాటిలో ప్లాస్మిడ్‌ రకాలను గుర్తించండి.
i) విరులెన్స్‌ ప్లాస్మిడ్‌లు 
ii) రెసిస్టెన్స్‌ ప్లాస్మిడ్‌లు
iii) కోల్‌ ప్లాస్మిడ్‌లు

1) i, ii         2) ii, iii       3) iii, i       4) i, ii, iii


సమాధానాలు: 1-4; 2-3; 3-4; 4-2; 5-1; 6-3; 7-2; 8-4; 9-1; 10-2; 11-3; 12-4; 13-1; 14-3; 15-4; 16-1; 17-1; 18-3; 19-2; 20-4; 21-1; 22-3; 23-2; 24-1; 25-4; 26-4; 27-1; 28-2; 29-3; 30-4; 31-1; 32-3; 33-1; 34-3; 35-4; 36-2; 37-1; 38-3; 39-4; 40-4.

Posted Date : 25-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌