• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర కార్యనిర్వాహక శాఖ

 భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, విధివిధానాలను  ఆర్టికల్స్ 52 నుంచి 151 మధ్య వివరించారు. మన దేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటు దేశానికి అవసరమైన చట్టాలను రూపొందిస్తే... కార్యనిర్వాహక శాఖ అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చట్టాలను అమలుపరుస్తాయి. న్యాయశాఖ అయిన సుప్రీంకోర్టు శాసన, కార్యనిర్వాహక శాఖలు నిర్వర్తించే విధులు రాజ్యాంగబద్దంగా ఉండేలా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుంది.
 

A. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తున్నాయి. కార్య నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.

రాష్ట్రపతి
  రాజ్యాంగంలోని 52 - 62 వరకు ఉన్న 11 ప్రకరణలు రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు, షరతులు, ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు తదితర అంశాలను వివరిస్తున్నాయి.
* మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణాధికారులు ఉంటారు.
1. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉండి, భారత దేశానికి రాజ్యాంగ రీత్యా అధిపతిగా వ్యవహరిస్తారు.
2. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలు చెలాయిస్తుంది.
* దేశ పరిపాలనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషించినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది.

 

ఆర్టికల్ 52
* భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు.  దేశాధినేత, రాజ్యాంగ అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు.

ఆర్టికల్ 53
* దేశ కార్యనిర్వహణాధికారాలను రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరిట నిర్వహించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు. రాష్ట్రపతి పరిపాలనను స్వయంగా లేదా, ఇతర అధికారుల సహకారంతో నిర్వహిస్తారు.

 

ఆర్టికల్ 54
* రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.

 

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు
* లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు - 543
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు - 233
* దేశంలోని 31 విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ఏలు - 4,120
* 70వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎంఎల్ఏలను ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా చేర్చారు. ఈ చట్టం 1995, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా ఓటును వినియోగించుకున్నారు.

ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
* లోక్‌సభకు నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్లు - 2
* రాజ్యసభకు నామినేట్ అయిన విశిష్ట వ్యక్తులు - 12
* రాష్ట్రాల విధానసభలకు నామినేట్ అయ్యే ఆంగ్లో ఇండియన్లు - 31
* రాష్ట్రాల విధాన పరిషత్‌లకు ఎన్నికైన ఎంఎల్‌సీలు - 7
* రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష విధానంలో నిర్వహిస్తుంది.

 

ఆర్టికల్ 55
* రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది.
* రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
* భారత రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీన్నే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక అని కూడా అంటారు. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు.
* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కొన్ని సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను
నిర్వహించవచ్చు.

* రాష్ట్ర శాసనసభ రద్దవడం, పార్లమెంటులో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణాలతో రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.
*1967లో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఆర్టికల్ 356(1)(C) ప్రకారం రాజస్థాన్ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికీ, ఆ శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వినియోగించుకున్నారు
* 1974లో గుజరాత్ శాసనసభ రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహాను కోరినప్పుడు ఎన్నికను నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది.
* రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
* 1950లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్ వ్యవహరించారు.
* 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.డి.టి.ఆచారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ వి.కె.అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 1971 జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రపతి ఎన్నికలో ఎంఎల్ఏ, ఎంపీల ఓటు విలువను లెక్కిస్తున్నారు.
* ఎక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
   ఉత్తర్‌ప్రదేశ్ = 208, తమిళనాడు = 176, మహారాష్ట్ర = 175
* తక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
    సిక్కిం = 7, అరుణాచల్‌ప్రదేశ్ = 8, మిజోరం = 8, నాగాలాండ్ = 9
*  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్ఏ ఓటు విలువ = 148
*  విభజనానంతరం ఏపీలో ఎంఎల్ఏ ఓటు విలువ = 158
* తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ఏ ఓటు విలువ = 133
*  మన దేశంలో అన్ని రాష్ట్రాల మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474

రాష్ట్రాలవారీగా ఓట్లు, ప్రతి రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ

ఓటు బదలాయింపు పద్ధతి:

* ఓటు బదలాయింపు పద్ధతిని తొలిసారిగా ప్రస్తావించినవారు థామస్ హేర్. అందుకే దీన్ని హేర్ పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిని డెన్మార్క్‌లో ఆండ్రే అనే వ్యక్తి మొదటిసారి అమలు పరచడం వల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ఓటు బదలాయింపు పద్ధతిని ప్రతిపాదించారు.
 


* 2012లో జరిగిన 13వ రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓటు విలువ = 708

* మన దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓట్ల విలువ, మొత్తం ఎంపీల ఓట్ల విలువకు సమానంగా ఉండటం సమాఖ్య విధానాన్ని ప్రతిఫలిస్తోంది.
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల సంఖ్య = 4,120
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474
దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య = 776
* దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల ఓటు విలువ = 5,49,408
* 50 శాతం మించి ఓట్లను అంటే కోటా ఓట్లను ఏ అభ్యర్థీ పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యతా ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
* 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం ద్వారా గెలిచిన వ్యక్తి వి.వి.గిరి. ఈ ఎన్నికలో సి.డి.దేశ్‌ముఖ్ రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం వల్ల వి.వి.గిరి గెలిచారు.
* రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించినవారు హెచ్.వి.కామత్, కె.టి.షా.
* ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని పేర్కొన్నవారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ.
* మన దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించినవారు కె.టి.షా.


రాష్ట్రపతి ఎన్నిక - వివాదాలు - పరిష్కారం
ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది.
* రాష్ట్రపతి ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ ఎలక్టోరల్ కాలేజీలోని కనీసం 25 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేయాలి.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కింద పేర్కొన్న మార్పులను రాష్ట్రపతి ఎన్నిక విధానంలో వచ్చే వివాదాల్లో చేర్చారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయనే కారణంపై ఎన్నికను వాయిదా వేయమని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు.
* పార్లమెంటు ఒక చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగ పరిధికి లోబడి నిర్ణయించవచ్చు.
* సస్పెండ్ అయిన ఎంఎల్ఏ, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనవచ్చు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే, వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి.
* రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు, ఎంఎల్ఏలకు నిర్దేశించిన విధంగా ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. దీనికి కారణం ఈ ఎన్నికలు శాసనసభ బయట జరుగుతాయి. విప్ శాసనసభలో జరిగే తీర్మానాలకు, బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆర్టికల్ 56: రాష్ట్రపతి పదవీ కాలం
* సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ కింది సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చు.
A. మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు
B. దీర్ఘకాలిక అస్వస్థతకు గురైనప్పుడు
C. అకాల మరణం చెందినప్పుడు
D. రాజీనామా చేసినప్పుడు
* భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.
* 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి.


ఇంటరెగ్నం:
* రాష్ట్రపతి పదవీ కాలం ముగిసినప్పటికీ, నూతన రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై, ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తికానప్పుడు అంటే నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఇంటరెగ్నం అంటారు.
ఆర్టికల్ 57: రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నిక కావడం
* భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. మన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు.
ఆర్టికల్ 58: అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* లోక్‌సభకు ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలుండాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* దివాలా తీసి ఉండకూడదు.
* ఎంపీ లేదా ఎంఎల్ఏగా ఉన్న అభ్యర్థి ఆ పదవులకు రాజీనామా చేయకుండానే రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే ఎంపీ లేదా ఎంఎల్ఏ పదవి రద్దవుతుంది. ఓడిపోతే సంబంధిత పదవి కొనసాగుతుంది.
* 1952 నాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.


షరతులు:
*  రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది సభ్యులు బలపరచాలి.
* అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.15,000 ధరావత్తుగా రిజర్వ్ బ్యాంకులో చెల్లించాలి.
*  పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు లభిస్తే డిపాజిట్ (ధరావత్తు) లభిస్తుంది.


ఆర్టికల్ 59: జీతభత్యాలు
* రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్‌లో జీతభత్యాలను పొందుపరిచారు.
* రాష్ట్రపతి వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఐటీ పరిధిలోకి రాదు.
* రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ ప్రవేశపెట్టరాదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూడా రాష్ట్రపతి జీతంలో కోత విధించరాదు.
* ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ.1,50,000.
* పదవీ విరమణ అనంతరం సంవత్సరానికి రూ.9,00,000 పెన్షన్ లభిస్తుంది.
* రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. ఈ భవన రూపకర్తలు ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ ఇక్కడే ఉంది.
* 1921 - 26 మధ్య రాష్ట్రపతి భవన్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలోకి అధికారికంగా మొదట అడుగు పెట్టిన వ్యక్తి లార్డ్ ఇర్విన్.
* రాష్ట్రపతి భవన్‌ను 320 ఎకరాల్లో 340 గదులతో నిర్మించారు. దీన్ని ప్రారంభంలో Vice Regal అని పిలిచేవారు. సామాన్య ప్రజలు దీన్ని లాట్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రైజీనా హిల్స్ (Raisina Hills) అంటారు.
* రాష్ట్రపతికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి.
* విదేశీ పర్యటనల కోసం ఎయిరిండియా వన్ అనే అధికారిక విమానం ఉంది.
* దేశంలో, విదేశాల్లోనూ పర్యటించేటప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు.
* ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి తన పదవీ కాలంలో చేపట్టిన చర్యలకు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
* రాష్ట్రపతిపై క్రిమినల్ కేసు నమోదు చేయకూడదు. సివిల్ కేసు వేయాలన్నా 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి.


ఆర్టికల్ 60: ప్రమాణ స్వీకారం
* రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి లేకపోతే తదుపరి సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తారు.
* రాష్ట్రపతి తన ప్రమాణాన్ని దేవుడి పేరుతో లేదా ఆత్మసాక్షిగా చేస్తారు. రాజ్యాంగ శాసనాన్ని పరిరక్షించి, సంపూర్ణ సామర్థ్యం మేరకు భారత ప్రజల సేవకు, వారి సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు కూడా పైన పేర్కొన్న విధంగానే పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి.


రాష్ట్రపతి రాజీనామా:
* రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు కూడా తెలియజేయాలి. ఇలాంటి పరిస్థితి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ రాజీనామా చేయడంతో ఏర్పడింది.


ఆర్టికల్ 61: మహాభియోగ తీర్మానం
*  రాష్ట్రపతిని రాజ్యాంగ అతిక్రమణ అనే కారణంతో ఆర్టికల్ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు.
*  రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి గ్రహించారు.
*  మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
*  ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే మహాభియోగ ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.
*  తర్వాత మహాభియోగ తీర్మానం రెండో సభకు చేరుతుంది. రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుంచి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.
*  తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ సభ తిరస్కరిస్తే, ఆ తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు.
*  మహాభియోగ తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి, మరొక సభ తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది.
*  రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
*  1971లో వి.వి.గిరిపై తొలిసారిగా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి తర్వాత విరమించుకున్నారు.


ఆర్టికల్ 62
* రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి.
రాష్ట్రపతి అధికారాలు - విధులు
       రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాలను ఎక్కడా వర్గీకరించలేదు. పరిపాలనాంశాల సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను కింది విధంగా విభజించవచ్చు.
1) సాధారణ అధికారాలు     2) అత్యవసర/ అసాధారణ అధికారాలు


1. సాధారణ అధికారాలు
కార్యనిర్వహణాధికారాలు (Executive Powers)
* ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్రపతి దేశ పాలనను స్వయంగా లేదా ఇతర అధికారుల సహాయంతో నిర్వహిస్తారు.
* ఆర్టికల్ 77 ప్రకారం భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదు గానే నిర్వహించాలి. ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
తన కార్యనిర్వహణాధికారాలను నిర్వహించడంలో భాగంగా రాష్ట్రపతి కింద పేర్కొన్న నియామకాలు జరుపుతారు. అవి:
ఆర్టికల్ 75(1) - లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సహచరులను నియమిస్తారు.
ఆర్టికల్ 76(1) - భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌ను నియమిస్తారు.
ఆర్టికల్ 124 - సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 155 - రాష్ట్రాల్లో గవర్నర్లను
ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జరనల్ (కాగ్)ను
ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 263 - కేంద్రం - రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్ రాష్ట్ర మండలిని
ఆర్టికల్ 280 - కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని
ఆర్టికల్ 315 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను
ఆర్టికల్ 316 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 324 - కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర అధికారులను
ఆర్టికల్ 239 - కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను, పరిపాలకులను
ఆర్టికల్ 323 (A) - సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
¤ జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ సమాచార కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


శాసనాధికారాలు:
ఆర్టికల్ 79 - పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు.
ఆర్టికల్ 80 - కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, క్రీడా రంగాల్లో విశిష్ట వ్యక్తులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 331 - లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో  ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తారు. (Summons)
                  పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు.(Prorogue)
                  లోక్‌సభను రద్దు చేస్తారు. (Dissolve)
ఆర్టికల్ 86 - లోక్‌సభ, రాజ్యసభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా సందేశాలను పంపుతారు.
ఆర్టికల్ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ప్రత్యేక/ విశేష ప్రసంగాలను పంపగలరు.
ఆర్టికల్ 99 - పార్లమెంటు సభ్యులు 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతితో నియమితులైన అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆర్టికల్ 103 - పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం.
ఆర్టికల్ 108 - పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన నిర్వహిస్తారు.
ఆర్టికల్ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలుగా మారుతాయి.
ఆర్టికల్ 123 - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌లకు సాధారణ చట్టాలకు ఉండే విలువ ఉంటుంది.
 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం
 పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా)
 6 నెలలు + 6 వారాలు (లేదా)
 7  నెలలు (లేదా) 222 రోజులు.
* పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది.


ఆర్డినెన్స్ - సుప్రీంకోర్టు తీర్పులు
* 1987లో కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ దురుద్దేశంతో జారీ చేసిన ఆర్డినెన్సును న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని పేర్కొంది.
* 1987లో డి.సి.వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన తర్వాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యధాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడి లాంటిదని పేర్కొంది.
ఆర్టికల్ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.
ఆర్టికల్ 95(1) - లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 201 - రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల్లో ఏదైనా రాజ్యాంగబద్ధ సందేహం ఉందని గవర్నర్ భావిస్తే సంబంధిత బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు.


రాష్ట్రపతి వీటో అధికారాలు
* వీటో (Veto) అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫర్బిడ్ (Forbid) అంటారు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం, నిరోధించే అధికారం, నిలుపుదల చేసే అధికారం.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. అవి:


1. అబ్సల్యూట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, కారణంతో లేదా కారణం లేకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు.
ఉదా: 1954లో రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ PEPSU (Pantiala East Punjab States Union) బిల్లు విషయంలో; 1991లో రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లుల విషయంలో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు.
* రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను పార్లమెంట్ లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి ఆమోందించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లుల‌ను గ‌వ‌ర్నర్‌లు రాష్ట్రప‌తి ప‌రిశీల‌నకు రిజ‌ర్వు చేసిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 201 ప్రకారం రాష్ట్రప‌తి వాటిని తిర‌స్కరించ‌వ‌చ్చు. ఈ బిల్లుల‌ను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపిన‌ప్పుడు కూడా వారు దాన్ని త‌ప్పనిసరిగా ఆమోదించాల్సిన అవ‌స‌రం లేదు.


2. సస్పెన్సివ్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా సవరణలు, సూచనలు చేస్తూ, పునఃపరిశీలనకు తిరిగి వెనుకకు పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అంటారు.
* ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2006లో జోడు పదవుల బిల్లుల విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించుకున్నారు.
* కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ రెండోసారి అవే బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడం ద్వారా వాటికి సస్పెన్సివ్ వీటోను రద్దు చేయవచ్చు.


3. పాకెట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినేట్ లేదా పార్లమెంట్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా, ఎలాంటి నిర్ణయం తెలపకుండా వాటిని తన దగ్గరే పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు.
ఉదా: 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్‌ను అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్ పాకెట్‌వీటోకు గురిచేశారు. సుమారు 18 నెలలపాటు బిల్లును తన వద్దే పెట్టుకున్నారు.


4. క్వాలిఫైడ్ వీటో
* ఈ వీటో అధికారం 'భారతరాష్ట్రపతి'కి లేదు.
* అమెరికా అధ్యక్షుడికి ఈ రకమైన అధికారం ఉంటుంది.
* అమెరికా అధ్యక్షుడు వీటో చేసిన అంశాన్ని అమెరికా శాసన వ్యవస్థ 10 రోజుల నిర్ణీత గడువులోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో మాత్రమే రద్దు చేసే వీలుంటుంది.
రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు
* ఆర్టికల్, 3 ప్రకారం - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు.
* ఆర్టికల్, 109 ప్రకారం - ద్రవ్య బిల్లులు
* ఆర్టికల్, 112 ప్రకారం - బడ్జెట్
* ఆర్టికల్, 31(A) ప్రకారం - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
* ఆర్టికల్, 19(1)(G) ప్రకారం - వ్యాపార వాణిజ్య, స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు
* ఆర్టికల్, 117 ప్రకారం - మొదటి రకమైన ఆర్థిక బిల్లులు
* ఆర్టికల్, 349 ప్రకారం - జాతీయ అధికార భాషలో చేసే మార్పులు, చేర్పులకు సంబంధించిన బిల్లులు
* ఆర్టికల్, 368 ప్రకారం - రాజ్యాంగ సవరణ బిల్లులు


ఆర్థిక అధికారాలు:
* ఆర్టికల్, 117 - పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి
* ఆర్టికల్, 112 - ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 151 - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్రప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఆర్టికల్, 292 - భారత ప్రభుత్వం విదేశీరుణాలు సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
* ఆర్టికల్, 265 - నూతన పన్నులు వసూలు చేసే బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 267 - భారత ప్రభుత్వం ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి ఆయన అనుమతితో నగదును తీసుకోవాలి.
* ఆర్టికల్, 280 - మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సిఫారసు చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని  5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.


దౌత్యాధికారాలు:
* భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు కృషిచేయడం.
* అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం.
* మిత్ర దేశాలకు భారతదేశం తరపున రాయబారులను నియమించడం, మిత్రదేశాల నుంచి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరించడం.
* మనదేశం తరపున ప్రతినిధులను ఐక్యరాజ్యసమితి (UNO) కి నియమించడం.
* మనదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులను, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిచడం.


సైనిక అధికారాలు
* ఆర్టికల్, 53(2) ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వసైన్యాధిపతి, త్రివిధ దళాలకు అధిపతి.
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.
* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించేది, శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేసేది రాష్ట్రపతి మాత్రమే.
* మనదేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతుంది.
* రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రిస్తారు. ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని నియమిస్తారు.


న్యాయాధికారాలు:
* ఆర్టికల్, 72 ప్రకారం రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి మొత్తం 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు. అవి:
1. పార్డన్ (Absolving entire Punishment):
* న్యాయ స్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దు చేసి, క్షమాభిక్షను ప్రసాదించడం.
2. రెమిషన్ (Reduction of Sentence)
* శిక్షాస్వభావాన్ని మార్చకుండా శిక్షాకాలాన్ని తగ్గించడం.
3. కమ్యుటేషన్: (Changing Nature of Sentence)
* శిక్షాకాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం.
ఉదా: రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా మార్చారు.
4. రిప్రైవ్: (Postponement of Sentence)
* శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
5. రెస్పైట్: (Providing Relief)
* ముద్దాయి ప్రత్యేక పరిస్థితులను పరిగిణనలోకి తీసుకుని దీన్ని ప్రసాదిస్తారు.
ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యత కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణి అయినప్పుడు ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది.
క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్షకు గురవుతాయా?
* రాష్ట్రపతి గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలను న్యాయ సమీక్షకు గురిచేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గౌరు వెంకట్ రెడ్డి కేసులో ఆర్జిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 2006లో పేర్కొంది.
దేవేందర్‌పాల్ సింగ్ దిల్లార్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా ధరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై భారత రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలుపకపోతే మరణశిక్షను యావజ్జీవ కారగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.
* ఉరిశిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు వర్తించవు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహామేరకు మాత్రమే రాష్ట్రపతి న్యాయాధికారాలను వినియోగించాలి.


రాష్ట్రపతి - ప్రత్యేక రక్షణలు
* ఆర్టికల్, 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు, మినహాయింపులు ఇచ్చారు.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా అతడిని అరెస్ట్ చేయకూడదు, ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు.
* రాష్ట్రపతిపై సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలలు ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై దేశంలో ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు; రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు; రాష్ట్రాల లోకాయుక్తలను నియమించేది గవర్నర్లు అయినప్పటికీ వారిని తొలిగించేది మాత్రం రాష్ట్రపతి.
* ఆర్టికల్, 244 ప్రకారం మనదేశంలో ఆదివాసీ ప్రాంతాలు, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.


రాష్ట్రపతి  అత్యవసర పరిస్థితి  అధికారాలు
* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థతి అధికారాలను వివరించారు.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభత్వ చట్టం నుంచి అత్యవసర పరిస్థితి అధికారాలను గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించేటప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుంచి గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ జీవించే హక్కును రద్దుచేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు.
* రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను పొందుపరచాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. కృష్ణమాచారి ప్రతిపాదించారు.
* అత్యవసర పరిస్థితి అధికారాలను పూర్తిగా వ్యతిరేకించిన వారిలో హెచ్.వి. కామత్, కె.టి. షా, సి.డి. దేశ్‌ముఖ్ కీలకమైనవారు.
* అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణ..... లాంటివి పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
భారత రాజ్యాంగంలో 3 రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్నొన్నారు. అవి:
1. జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ఆర్టికల్, 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (Constitutional Emergency) ఆర్టికల్, 356 (రాష్ట్రపతి పాలన)
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergnecy) ఆర్టికల్, 360


జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352
     జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు. అవి:
A. బాహ్య కారణాలు:
* మన దేశంపై విదేశీ దాడి లేదా మనదేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
B. ఆంతరంగిక కారణాలు:
* దేశంలో ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
* 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆంతరంగిక అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి, సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ 352(7) లో చేర్చి, కేంద్ర కేబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని పేర్కొన్నారు.
* కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు కానీ కేంద్ర కేబినెట్ రెండోసారి అమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయసభలు నెలరోజుల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. (ఇంతకు ముందు పార్లమెంటు 2 నెలల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మోజార్టీతో ఆమోదించాలని ఉండేది.)
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే నాటికి ఒకవేళ లోక్‌సభ రద్దయితే, దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కానీ నూతన లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలలకు ఒకసారి చొప్పున గరిష్ఠంగా ఎన్నిసార్లయినా, ఎంతకాలమైనా విధించవచ్చు, పొడిగించవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - రద్దు
* రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే దీన్ని రద్దు చేయవచ్చు.
* పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా దీన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు మంది సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు/రాష్ట్రపతికి అందజేయాలి.
* 14 రోజుల ముందు ఇచ్చే ఈ నోటీసు ప్రకారం లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధారణ మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దుచేయవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - పరిణామాలు
* రాష్ట్ర జాబితాతోసహా అన్ని జాబితాల్లోని అంశాలపై కేంద్రమే శాసనాలు రూపొందిస్తుంది.
* కేంద్ర కార్యనిర్వహక వర్గం అధికారాలు విస్తృతం అవుతాయి.
* ఆర్టికల్, 353 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసే పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* ఆర్టికల్, 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన చట్టాలు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల అనంతరం ఈ చట్టాలు వాటంతటవే రద్దు అవుతాయి.
* ఆర్టికల్, 354 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థిక పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* లోక్‌సభ, రాష్ట్రాల శాసనభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు.
* 5వ లోక్‌సభ పదవీకాలం 1976, మార్చి 18తో ముగిసింది. అదే సమయంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977, జనవరి 18న రద్దు చేశారు. 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది.
* రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని కూడా పార్లమెంటు ఒక ఏడాది పాటు పొడిగించవచ్చు.
* 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసన సభ పదవీ కాలాన్ని 1977 నుంచి 1978 వరకు ఒక సంవత్సరంపాటు పొడిగించారు.
* ఆర్టికల్, 358 ప్రకారం ఆర్టికల్, 19 సహజంగానే సస్పెండ్ అవుతుంది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విదేశీ కారణాలతో  జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్, 19 సహజంగా రద్దు అవుతుంది. ఆంతరంగిక కారణాల ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్, 19 సహజంగా సస్పెండ్ కాదని, రాష్ట్రపతి జారీచేసే ప్రత్యేక ప్రకటన ద్వారా మాత్రమే సస్పెండ్ చేస్తారని దీన్ని పార్లమెంటు ఆమోదించాలని నిర్దేశించారు.
* ఆర్టికల్, 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్ 20, 21 లలో పేర్కొన్న హక్కులను మినహాయించి, మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.
* ఉన్నత న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకోసం ఆర్టికల్, 32 ప్రకారం సప్రీంకోర్టు; ఆర్టికల్, 226 ప్రకారం హైకోర్టులు రిట్స్ జారీచేసే అధికారాలపై పార్లమెంటు చట్టబద్ధ పరిమితులను విధించవచ్చు.


మనదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు
1. 1962, అక్టోబరు 26 - 1968, జనవరి 10 మధ్య మనదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
2. 1971, డిసెంబరు 3 - 1977, మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి, కొనసాగించారు.
* 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమవడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
3. 1975, జూన్ 25 - 1977, మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, కొనసాగించారు.
* 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నివారించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సంభవించినప్పటికీ ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేదు. దీనికి కారణం 1962లో విధించిన అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగడమే.
* 1975 నుంచి 1977 మధ్య ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు.
* 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352కు సవరణ చేసి, ఒకే సమయంలో రెండు రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే వీలును కల్పించారు.

 

ఆర్టికల్ - 358, ఆర్టికల్ - 359 మధ్య వ్యత్యాసం

ఆర్టికల్, 358 ఆర్టికల్, 359
1. దీని ప్రభావం ఆర్టికల్, 19లో ప్రస్తావించిన
వ్యక్తిగత స్వేచ్ఛలకు మాత్రమే పరిమితం.
1. దీని ప్రభావం అన్ని ప్రాథమిక హక్కులకు వర్తిస్తుంది.
2. దీని ప్రభావం బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితికే పరిమితం. 2. ఇది ఆంతరంగిక, బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.
3. దీని ప్రభావం దేశం మొత్తానికి వర్తిస్తుంది. 3. దీని ప్రభావం దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.
4. అత్యవసర పరిస్థితి ఉన్నంతవరకు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. 4. రాష్ట్రపతి నిర్ణయించిన సమయం వరకు మాత్రమే
ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల అమలు రద్దు చేయకపోవచ్చు.

జ్యాంగ అత్యవసర పరిస్థితి - రాష్ట్రపతి పాలన (ఆర్టికల్, 356)
* ఆర్టికల్, 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగపరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ఆర్టికల్, 356(1) ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్, 356 ద్వారా విధిస్తారు.
రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?
  * ప్రభుత్వం పనిచేయకపోవడం.
  * శాంతిభద్రతలు క్షీణించడం.
  * ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
  * రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడం.
  * ప్రభుత్వమే ఏర్పడకపోవడం.
  * ఆర్టికల్, 365 ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం.
» రాష్ట్రపతి పాలనను పార్లమెంటు 2 నెలల్లోగా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
» ఆర్టికల్, 356(3) ప్రకారం ఒకవేళ రాష్ట్రపతిపాలన విధించే సమయానికి లోక్‌సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పాటైన నెలరోజుల్లోగా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
* పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదం ద్వారా 6 నెలలకు ఒకసారి చొప్పున రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.
» 1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలనను విధించాలని, ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు.
* రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపినప్పుడు కేంద్ర కేబినెట్ అదే అంశాన్ని రెండోసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి.
ఉదా: అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ బిహార్‌లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని చేసిన సిఫారసును రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు. అదే సిఫారసును కేంద్ర కేబినెట్ రెండోసారి పంపడంతో కె.ఆర్. నారాయణన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది.
* రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది.
ఉదా: బిహార్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఆర్టికల్, 356(5) ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగాలంటే..
     44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి:
* దేశంలో లేదా రాష్ట్రాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి.
* సంబంధిత రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడం సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
* 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను పొడిగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదా: పంజాబ్‌లోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 59, 64, 68 రాజ్యాంగ సవరణల ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలనను 5 ఏళ్ల వరకు పొడిగించారు.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా లేదా పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా రాష్ట్రపతి పాలనను రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - పర్యవసానాలు
* రాష్ట్రప్రభుత్వాన్ని (మంత్రి మండలి) రద్దు చేయవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేసినట్లయితే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
* రాష్ట్ర విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచితే, దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంది.
ఉదా: జమ్మూకశ్మీర్ విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఆర్టికల్, 356 ప్రకారం అక్కడ రాష్ట్రపతి పరిపాలనను విధించి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ), బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడంతో రాష్ట్ర శాసనసభను పునరుద్ధరించారు.
* రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
* రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం ఆర్డినెన్స్ రూపంలో వెలువరిస్తారు.
* రాష్ట్రపతి పాలనను గవర్నర్ రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు. గవర్నర్‌కు రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఉంటాయి.
* గవర్నర్‌కు తన విధి నిర్వహణలో సహాయాన్ని, సలహాలను అందించడానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు.
» ఆర్టికల్, 357(2) ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే, అవి రాష్ట్రపతి పాలన రద్దు అయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ చట్టాలను రాష్ట్ర శాసన సభ కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - న్యాయ సమీక్ష
» 38వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్, 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
» మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షకు అతీతం కాదని నిర్దేశించారు.
ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994)
» ఈ కేసులో సుప్రీం కోర్టు రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. అవి
  * భారత సమాఖ్యకు భంగం కలిగించే విధంగా ఆర్టికల్, 356ను ప్రయోగించరాదు.
  * రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర విధాన సభను రద్దు చేయరాదు.
  * రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, విధాన సభను పునరుద్ధరించాలి.
  * రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
  * రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
  * రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభ లోపల మాత్రమే పరీక్షించాలి.
  * లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకిక తత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర  ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయవచ్చు.
  * రాష్ట్రపతి పాలనను దురుద్దేశంగా విధిస్తే, దానికి సమంజసమైన కారణాలు లేకపోతే న్యాయస్థానాలు వాటిని  రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలనా విశేషాలు
* 2015, ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 123 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1951లో పంజాబ్‌లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించారు.
* అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్. 1987, మే 11 - 1992, ఏప్రిల్ 25 వరకు అంటే 4 సంవత్సరాల 9 నెలల 3 రోజులు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రం కర్ణాటక. 1990, అక్టోబరు 10 - 1990, అక్టోబరు 17 వరకు అంటే కేవలం 8 రోజులు మాత్రమే కర్ణాటకలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
* మణిపూర్‌లో 12 , ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 , కేరళలో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
* ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు - ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ.
* 1975 - 77 మధ్య కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 21 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన బి.డి. జెట్టి 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయించారు.
* ఆర్టికల్, 356ను దుర్వినియోగం చేయకుండా 2000 లో వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో అంతర్‌రాష్ట్ర మండలి నుంచి జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పడి పలు సూచనలు చేసింది.
* ఆర్టికల్, 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో ఎం.ఎన్. వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేర్కొంది.

జాతీయ అత్యవసర పరిస్థితికి, రాష్ట్రపతి పాలనకు మధ్య వ్యత్యాసాలు

జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352 రాష్ట్రపతి పాలన - ఆర్టికల్, 356
1. దీన్ని పార్లమెంటు నెలరోజుల్లోగా ఆమోదించాలి. 1. పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాలి.
2. పార్లమెంటు  వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. 2. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా ఆమోదించాలి.
3. దేశం మొత్తం లేదా దేశంలోని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో విధించవచ్చు. 3. రాష్ట్రం మొత్తం విధించాలి.
4. దీన్ని విధిస్తే లోక్‌సభను రద్దు చేయాల్సిన అవసరం లేదు. 4. దీన్ని విధిస్తే రాష్ట్ర శాసనసభను రద్దు చేయ వచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
5. దీన్ని విధిస్తే కేంద్ర మంత్రిమండలి రద్దు కాదు. 5. దీన్ని విధించిన వెంటనే రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవుతుంది.
6. దీన్ని విధిస్తే ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. 6. దీన్ని విధించినప్పటికీ ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయి.
7. గరిష్ఠంగా ఎంతకాలమైనా విధించవచ్చు. 7. గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
1. ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధ విషయంపై టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ సి.ఎం. త్రివేది సిఫారసుల మేరకు 1954, నవంబరు 15 నుంచి 1955, మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
2. ఆంధ్రప్రదేశ్‌లోని జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి. నరసింహా రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ సిఫారసుల మేరకు 1973, జనవరి 11 నుంచి 1973, డిసెంబరు 10 మధ్య 335 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
3. ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం' నేపథ్యంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ సిఫారసుల మేరకు 2014, మార్చి 1 నుంచి 2014 జూన్ 8 మధ్య 3 నెలల 7 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 360
* దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినా, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేకపోయినా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల్లోగా పార్లమెంటు ఆమోదిస్తే ఆరు నెలల వరకు కొనసాగుతుంది. దీన్ని పార్లమెంటు ఆమోదంతో ఆరు నెలలకొకసారి చొప్పున గరిష్ఠంగా ఎంత కాలమైనా విధించవచ్చు.
* లోక్‌సభ, రాజ్యసభల మధ్య ఆర్థిక అత్యవసర బిల్లు ఆమోదం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే అది రద్దవుతుంది. ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన నాటికి లోక్‌సభ రద్దయితే రాజ్యసభ ఆమోదంతో అది కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన , పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రద్దు చేయవచ్చు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - పర్యవసానాలు
* కేంద్రం జారీచేసే ఆర్థిక ఆంక్షలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి.
* కేంద్రం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాల్సిందే.
* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు తగ్గిస్తారు.
* ఆర్టికల్, 275 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించిన చట్టాలు అది రద్దయిన అనంతరం 6 నెలల వరకు అమల్లో ఉంటాయి.
» ఇప్పటి వరకు మనదేశంలో ఒకసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు.

జాతీయ అత్యవసర పరిస్థితి - షా కమిషన్ నివేదిక
* 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి 21 వరకు సుమారు 21 నెలలపాటు ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రతిపక్ష రాజకీయ పార్టీల పట్ల అణిచివేత చర్యలు లాంటివి జరిగాయి.
* వీటిని విచారించేందుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో జయంత్‌లాల్ ఛోటాలాల్ షా
(జె.సి. షా) నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను 1978లో సమర్పించింది.
* ఈ కమిషన్ నివేదికలో తెలిపిన అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* 1980లో 'ఇందిరాను పిలవండి - దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చి, షా కమిషన్ నివేదికను రద్దు చేసింది.


అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యలు
» 'అత్యవసర పరిస్థితులను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపైన జరిపే దోపిడీ లాంటివి' - కె.ఎం. నంబియార్
» 'అత్యవసర పరిస్థితి అధికారాలనేవి మన రాజ్యాంగంలోని అవశ్యక్లేశాలు అంటే అవసరమైన చెడు' -టి.టి. కృష్ణమాచారి
» 'అత్యవసర పరిస్థితులు అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగానికి రక్షక కవచాల లాంటివి' - మహావీర్ త్యాగి
» 'అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగానికి శ్వాసను అందించే మార్గాలు, మృత సంజీవని లాంటివి' - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
» 'భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు' -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఒకవేళ రాష్ట్రపతి అత్యవసర అధికారాలను నిజంగా వినియోగిస్తే, ఆ రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర పరిస్థితి అధికారాల వల్ల రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నియంతగా మారిపోతారు' - అలెన్ గ్రేడ్‌హిల్
» 'డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మరణించారు, కానీ ఆర్టికల్, 356 సజీవంగానే ఉంది' -హెచ్.వి. కామత్
» 'వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కంటే దేశ సార్వభౌమత్వం గొప్పది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఆర్టికల్, 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వులాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేయరు అనే అభిప్రాయాలతో నేను అంగీకరించను. ఆర్టికల్, 356 అనేది మృతాక్షరం (Dead Article)' - డాక్టర్ బి.ఆర్. అంబ్కేడర్
» 'ఆర్టికల్, 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన అనేది కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పావులుగా మారారు' - జస్టిస్ వి. కృష్ణయ్యర్
» 'ఆర్టికల్, 356 అనేది రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం యొక్క కత్తి అంటే ఆ ప్రభుత్వాలను ఎప్పుడైనా వధించవచ్చు' - డి.కె. చటర్జీ

రాష్ట్రపతి - విచక్షణాధికారాలు
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించే సమయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు.
* 1989లో మనదేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్ పార్లమెంట్‌గా అవతరించిన సమయంలో 191 స్థానాలతో కాంగ్రెస్ పెద్దపార్టీగా  ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఏర్పాటుకు  ముందుకు రాకపోవడంతో 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీగా ఏర్పడిన జనతాదళ్‌కు చెందిన వి.పి. సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఆహ్వానించారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. కానీ మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైన వాజ్‌పేయీ 13 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.
» కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశాన్ని కల్పించడం లేదా లోక్‌సభను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునివ్వడం అనేది రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
ఉదా:1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసినప్పుడు చరణ్‌ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చరణ్‌ సింగ్‌ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌సింగ్ పార్లమెంటుకు హాజరుకాకుండానే 23వ రోజున పదవికి రాజీనామా చేశారు.
» చరణ్‌ సింగ్ రాజీనామా అనంతరం బాబూ జగజ్జీవన్‌రామ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు.
» 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం బీజేపీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ 12వ లోక్‌సభను రద్దు చేశారు.
» మన దేశంలో అతి తక్కువ కాలం అంటే 13 నెలలు మాత్రమే పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.
* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రసంగం బదులుగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
* 1999లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలోని 'ఆపద్ధర్మ ప్రభుత్వం' నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ. 125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
* 2006లో లాభదాయక పదవుల బిల్లును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు పంపారు.


రాష్ట్రపతి పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు
» 'మంత్రిమండలి సలహా లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు. రాష్ట్రపతి మంత్రిమండలికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యమైన పాత్రను పోషిస్తారు' - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» 'రాష్ట్రపతి పదవి భారత జాతి నిర్ణయాలను తెలియజేసే ఆమోదముద్ర లాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» '42వ, 44వ రాజ్యాంగ సవరణల అనంతరం రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది' - ఎమ్.పి జైన్
» 'భారత్‌లో పార్లమెంటరీ విధానం ఉండటం వల్ల ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి' - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» 'భారత రాష్ట్రపతులందర్నీ ప్రధానమంత్రి రాష్ట్రపతులుగానే పరిగణించాలి' - టి.ఎన్. శేషన్
» 'భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చింది' - జవహర్‌లాల్ నెహ్రూ
షంషేర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: 1974
» ఈ కేసులో జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని పేర్కొంది.


మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
   పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
* బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
* మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
* ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
* తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
* హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
* రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.


2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
  పదవీకాలం:  1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
* అమెరికా ప్రభుత్వం ప్రసాదించే 'టెంపుల్‌టన్' అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* 8 దేశాల్లో 'విజిటింగ్ ప్రొఫెసర్‌'గా పనిచేశారు.
* ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'ప్రజా దర్బార్‌'ను ఏర్పాటు చేశారు.
*" Hindu View Of Life", "All Idealist View Of Life"అనే గ్రంథాలను రచించారు.
* దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.


3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
  పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
* జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
* మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
* పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
* జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో
(1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
* దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


4. వి.వి. గిరి (1884 - 1980)
  పదవీకాలం:  1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
* వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
* నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
* అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
* రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
* తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
* కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
* బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
* 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
* ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి


5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
  పదవీకాలం:  1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
* ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
* టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
* ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని 'రబ్బర్‌స్టాంప్‌'గా విమర్శకులు పేర్కొన్నారు.
* ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


6. నీలం సంజీవ రెడ్డి (1913 - 1996)
  పదవీకాలం:  1977, జులై 25 నుంచి 1982, జులై 25
* నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
* 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
* లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.


7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 - 1994)
  పదవీకాలం:  1982, జులై 25 నుంచి 1987, జులై 25
* ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై "Pocket Veto"ను వినియోగించారు.
* వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
* 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
* 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non - Aligned Movements) సదస్సు జరిగింది.


8. ఆర్. వెంకట్రామన్: (1910 - 2009)
 పదవీకాలం:  1987, జులై 25 నుంచి 1992, జులై 25
* ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
* అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
* కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
* ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
* పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
* 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
* మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
* 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.


9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 - 1999)
 పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
* ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
* విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
* దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
* 'రాజనీతిజ్ఞ రాష్ట్రపతి'గా పేరుపొందారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.


10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)
   పదవీకాలం:  1997 జులై 25 నుంచి 2002, జులై 25
* ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
* ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
* గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి  కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 - 2015)
  పదవీకాలం:  2002 జులై 25 నుంచి 2007 జులై 25
* ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
* ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
* భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
* భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
* వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
* 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
* డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
* కలాం జన్మదినమైన అక్టోబరు 15న 'స్టూడెంట్స్ డే'గా నిర్వహిస్తున్నారు.
* PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
* కలాం 2015, జులై 27న మరణించారు.


2. ప్రతిభాపాటిల్ (1934)
  పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
* ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
* భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి మహిళా రాష్ట్రపతి.
* రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* సుఖోయ్ యుద్ధ విమానం, టీ - 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
* గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
* ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
* బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
* విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.


13. ప్రణబ్ ముఖర్జీ (1935)
   పదవీకాలం:  2012 జులై 25 నుంచి - ప్రస్తుతం
* ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా 'మిరాటి' గ్రామంలో జన్మించారు.
* పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1982 - 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
* 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
* 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
* 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
* 2011లో 'బెస్ట్ అడ్మినిస్ట్రేటర్' అవార్డును అందుకున్నారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
* 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
* ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 - 2012 మధ్య
వ్యవహరించారు.
* ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
* 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
* లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు:
* The Dramatic Decade
* Midterm
* Off the Track
* కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.


రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు
1. సుమిత్రాదేవి (1962)
2. మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
3. లక్ష్మీ సెహగల్ (2002)
4. ప్రతిభా పాటిల్ (2007)


తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు
1. వి.వి. గిరి
2. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3. బి.డి. జెట్టి


ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు
1. బాబూ రాజేంద్ర ప్రసాద్
2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
3. నీలం సంజీవరెడ్డి
4. జ్ఞానీ జైల్‌సింగ్
5. అబ్దుల్ కలాం
6. ప్రతిభా పాటిల్
7. ప్రణబ్ ముఖర్జీ


ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు
1. జి.ఎస్ పాఠక్
2. బి.డి. జెట్టి
3. జస్టిస్ హిదయతుల్లా
4. కె. కృష్ణకాంత్
5. భైరాన్‌సింగ్ షెకావత్


ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు
1. సర్వేపల్లి రాధకృష్ణన్
2. జాకీర్ హుస్సేన్
3. వి.వి. గిరి
4. ఆర్. వెంకట్రామన్
5. శంకర్ దయాళ్‌శర్మ
6. కె.ఆర్. నారాయణన్


భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు
1. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
2. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
4. వి.వి. గిరి (1975)
5. ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)


ఉపరాష్ట్రపతి

   ప్రారంభ ముసాయిదా రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావించలేదు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన హెచ్.వి. కామత్ పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుంచి 70 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ఉపరాష్ట్రపతి పదవిని గురించి వివరించారు.
* ఆర్టికల్, 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.


ఉపరాష్ట్రపతి అర్హతలు - షరతులు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండరాదు.
* 15 వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది సభ్యులు అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, మరో 20 మంది సభ్యులు బలపరచాలి.
* పోలై చెల్లుబాటయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొంది ఉండాలి.


ఎన్నిక పద్ధతి
* 1962 వరకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్‌ను నిర్వహించడం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు.
* 11వ రాజ్యాంగ సవరణ చట్టం (1962) ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను పార్లమెంటు ఉభయసభల సభ్యుల ద్వారా ఏర్పడిన 'ఎలక్టోరల్ కాలేజీ' ద్వారా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాల శాసన సభ్యులకు అవకాశం లేదు. ఆర్టికల్, 66లో ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పొందుపరిచారు.


పదవీ కాలం
* ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. కానీ ఈ పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని మన తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. దీన్నే అనుసరిస్తున్నారు.
* ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.


తొలగింపు
  అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలతో ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఆర్టికల్, 67(B) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కనీసం 1/4వ వంతు సభ్యుల సంతకాలతో కూడిన తొలగింపు తీర్మాన నోటీసును 14 రోజుల ముందు సభాధిపతికి అందించాలి.
* తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు హాజరుకావచ్చు. కానీ అధ్యక్షత వహించరాదు.
* ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతిని తొలగించలేదు.


జీతభత్యాలు
* ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఆర్టికల్, 97 ప్రకారం రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మాత్రమే ఉపరాష్ట్రపతి నెలకు రూ.1,25,000 వేతనం పొందుతారు.
* ఈ వేతనానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
* వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి వేతనంపై పార్లమెంటులో ఓటింగ్‌కు అవకాశం లేదు.


ఉపరాష్ట్రపతి అధికారాలు - విధులు
   ఆర్టికల్, 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.
* ఆర్టికల్, 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక పదవీ బాధ్యతలను నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో రాష్ట్రపతి పొందే జీతభత్యాలను పొందుతారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు.
* 'భారతరత్న' లాంటి అత్యున్నత పౌరపురస్కారాల ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తారు.
* 'ఉపరాష్ట్రపతి తన మేథోసంపత్తి, వ్యక్తిగతమైన నైతిక విలువలు, హుందాతనంతో వ్యవహరించడం వల్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రులు అనేక విషయాల్లో ఉపరాష్ట్రపతిని సంప్రదించేలా చేయుచున్నారు' - నార్మన్.డి. పామర్
* భారత ఉపరాష్ట్రపతి పదవిని 'వేల్స్ యువరాజు'తో పోల్చవచ్చు - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'భారత రాజ్యాంగం రాష్ట్రపతి పదవికి ఇచ్చినంత గొప్ప గౌరవం ఉపరాష్ట్రపతి పదవికి ఇవ్వక పోయినప్పటికీ ఆ పదవి ఉపయోగకరమైంది, ప్రతిష్ఠాత్మకమైంది' - ఎమ్.వి. పైలీ


కీలకాంశాలు
* మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* మన దేశానికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.
* రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినవారు.
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. హమీద్ అన్సారీ
* తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్.
* పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కె. కృష్ణకాంత్.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారు భైరాన్‌సింగ్ షెకావత్.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* జ్ఞానీ జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు 1982, అక్టోబరు 6 నుంచి 31 వరకు 25 రోజులపాటు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన వారు హిదయతుల్లా.
* అత్యధిక మెజార్టీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ (700 ఓట్లు).
* కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన తాత్కాలిక రాష్ట్రపతి - బి.డి. జెట్టి.
* బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* పదవికి రాజీనామా చేసిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* పదవికి రాజీనామా చేసిన రెండో ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్.
*  ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీరీత్యా 14వ వారు, వ్యక్తులరీత్యా 12వ వారు.
* ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంగా ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి సమర్పించాలి. రాజీనామా పత్రాన్ని మాత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి మాత్రమే రాయాలి.


ముగింపు
  అమెరికా ఉపాధ్యక్ష పదవితో మన ఉపరాష్ట్రపతి పదవిని పోల్చవచ్చు. ఎందుకంటే ఇద్దరూ తమ దేశాల్లో ఎగువసభకు అధ్యక్షత వహిస్తారు. అయితే మనదేశంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు మించి ఉండటానికి వీల్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం తాత్కాలిక అధ్యక్షుడిగానే కాకుండా అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు మిగిలిన అధ్యక్ష పదవీకాలమంతా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

ప్రధానమంత్రి

    ప్రపంచ పార్లమెంటుకు మాతగా పరిగణించే బ్రిటన్ పార్లమెంటరీ విధానం నుంచి స్ఫూర్తి పొందిన జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటివారు మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించారు.
* పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ప్రకారం దేశానికి ఇద్దరు అధిపతులు ఉంటారు. బ్రిటన్‌ మాదిరిగానే  మన దేశంలో కూడా దేశాధినేత అయిన రాష్ట్రపతి డీ - జ్యూరీ సార్వభౌమాధికారి (నామమాత్రపు సార్వభౌమాధికారి)గా, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి డీ - ఫ్యాక్టో సార్వభౌమాధికారి (వాస్తవ కార్యనిర్వహణాధికారి)గా వ్యవహరిస్తారు.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా మారిందని
ఆర్.ఎస్. క్రాస్‌మన్ పేర్కొన్నారు.
* మన దేశంలో కేంద్ర కేబినెట్‌కు నాయకత్వం వహించే ప్రధానమంత్రి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
* కేంద్ర కేబినెట్‌కు కేంద్ర బిందువైన ప్రధానమంత్రి ప్రాధాన్యం పెరగడంతో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగానే పరిగణిస్తున్నారు.
* ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందిన ప్రారంభంలో భారత రాజకీయాల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్రమోదీ లాంటి గొప్ప ప్రజాధరణ ఉన్న ప్రధానుల ఫలితంగా ప్రధానమంత్రి పదవికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
* ప్రధానమంత్రి ప్రభుత్వానికి, పార్లమెంటుకు, ప్రజలకు నాయకుడు. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుడు. దేశప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్స్ 74, 75, 78లలో ప్రధానమంత్రి, మంత్రిమండలి గురించి వివరించారు.
ఆర్టికల్, 74(1)
* దేశ పరిపాలనలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి పరిపాలనను నిర్వహిస్తారు.
* 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, పునఃపరిశీలనకు వెనక్కి పంపవచ్చని, కానీ మంత్రిమండలి పునఃపరిశీలన అనంతరం పంపిన బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నిర్దేశించింది.
ఆర్టికల్, 74(2)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి పదవీకాలం రాష్ట్రపతి లేదా లోక్‌సభ విశ్వాసం ఉన్నంత మేరకే కొనసాగుతుంది.
కింది సందర్భాల్లో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది
* లోక్‌సభలో అధికారపక్షం ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు
* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు
* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే కోత తీర్మానాలు నెగ్గినప్పుడు
* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు
* లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తిరస్కరణకు గురైనప్పుడు
* లోక్‌సభలో అధికారపక్షం వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేట్ బిల్లులు/ తీర్మానం నెగ్గినప్పుడు
ఆర్టికల్, 75(1)
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని లేదా మెజార్టీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు.
* ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.
* లోక్‌సభలో ఏ పార్టీ పూర్తి మెజార్టీ సాధించని పక్షంలో రాష్ట్రపతి తన విచక్షణతో ప్రధానిని నియమిస్తారు.
ఆర్టికల్, 75(1) (A):
* కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్యను లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి.
ఆర్టికల్, 75(1)(B):
* చట్టసభ సభ్యుడిని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సబాధిపతి అనర్హుడిగా ప్రకటించిన తర్వాత అదే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పదవిలోనూ నియమించరాదు.
* ఈ అనర్హత అతడు తిరిగి పార్లమెంటుకు ఎన్నికయ్యే వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఎన్నిక కాకపోతే ఆ సభ పదవీకాలం ముగిసే వరకు కూడా అనర్హత వర్తిస్తుంది.
* ఆర్టికల్, 75(1)(A) , 75(1)(B)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగానికి చేర్చింది.
ఆర్టికల్, 75(2)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగించవచ్చు.
ఆర్టికల్, 75(3)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. లోక్‌సభలో విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రిమండలి అధికారంలో ఉంటుంది.
ఆర్టికల్, 75(4)
* ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది.
ఆర్టికల్, 75(5)
* ప్రధానమంత్రిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమితులవ్వాలంటే పార్లమెంటు ఉభయసభల్లో ఏదైనా ఒక సభలో సభ్యులై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేనివారు నియమితులైతే 6 నెలల్లోగా ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.
* పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక అవడానికి అర్హతలు ఉన్న వారిని మాత్రమే ప్రధానిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమించాలని బి.ఆర్. కపూర్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్, 75(6)
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* ప్రస్తుతం ప్రధానమంత్రికి అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.1,60,000 వేతనం లభిస్తుంది. దీనిలో జీతం రూ.50,000, అలవెన్సులు రూ.1,10,000
* ప్రధాని అధికార నివాసం పేరు పంచవటి.
ఆర్టికల్, 78(1)
ఆర్టికల్, 78(3):
* రాష్ట్రపతి తన ఆమోదముద్ర నిమిత్తం పంపిన ఒక తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలి పరిశీలించలేదని, దాన్ని పునరాలోచన చేసి పంపమని ప్రధానిని కోరవచ్చు.


ప్రధానమంత్రి అధికారాలు - విధులు
* ప్రధాన మంత్రి కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి కేంద్రమంత్రులను నియమిస్తారు, మంత్రులకు శాఖలను కేటాయిస్తారు.
* ప్రధానమంత్రి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే మొత్తం మంత్రిమండలి రద్దు అవుతుంది.
* ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి.
* ప్రధాని లోక్‌సభకు నాయకుడిగా, జాతికి ప్రతిబింబంగా వ్యవహరిస్తారు.
* ఆర్టికల్, 85 ప్రకారం ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తారు.
* భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రధాని ఆధ్వర్యంలోనే రూపొందిస్తారు.
* రాష్ట్రపతి, మంత్రిమండలికి మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తారు.
* విదేశాలతో వ్యవహరించేటప్పుడు ప్రధాని మనదేశానికి నాయకుడిగా వ్యవహరిస్తారు.
* ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్‌సభలో తన ప్రతినిధిగా మరొకరిని నాయకులుగా నియమించుకోవచ్చు.


పదవీ రీత్యా ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరించేవి
* ప్రణాళికా సంఘం (నీతి ఆయోగ్)
* జాతీయ అభివృద్ధి మండలి
* జాతీయ సమైక్యతా మండలి
* అంతర్రాష్ట్ర మండలి
* జాతీయ భద్రతా మండలి
*  జాతీయ జనాభా నియంత్రణ మండలి
* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
* జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ సమాచార కమిషన్, లోక్‌పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ల ఛైర్మన్‌లను నియమించే/ ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షులుగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.


ప్రధానమంత్రి పదవి - వ్యాఖ్యానాలు
* 'ప్రధాని సమానుల్లో ప్రథముడు' (Primus Inter Pares) - లార్డ్ మార్లే
* 'మనదేశ ప్రధాని పదవిని అమెరికా అధ్యక్ష పదవితో పోల్చవచ్చు' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'ప్రధానమంత్రి సూర్యుడు అయితే అతడి మంత్రివర్గ సహచరులందరూ అతడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లాంటివారు' - ఐవర్ జెన్నింగ్స్
* 'ప్రధానమంత్రి రాజ్యమనే నౌకకు కెప్టెన్' - మన్రో
* 'ప్రధాని చుక్కల్లో చంద్రుడు' - విలియం వెర్నార్ కోట్
* 'పార్లమెంటరీ ప్రభుత్వమనే పడవను నడిపే కెప్టెన్ ప్రధాని' - రాంసేమ్యూర్
* 'ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు' - హింటన్
* 'మంత్రులందరూ ప్రధానితోసహా సమానులు అనడం సరికాదు. ప్రధానితప్ప మిగతా మంత్రులందరూ సమానులే అనడం సబబు' - జె.ఎస్. దుగ్గల్
* 'ప్రధానమంత్రికి కల్పించిన అధికారాలు, ప్రాముఖ్యాన్ని పరిశీలించినట్లయితే వారు నియంతగా మారే ప్రమాదముంది' - కె.టి. షా
* 'పార్లమెంటరీ తరహా ప్రభుత్వ జీవన్మరణాల్లో కూడా ప్రధానమంత్రి కీలకపాత్ర పోషిస్తారు' - హెచ్.జె. లాస్కి
* ప్రధాని పదవి దేశ పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషించడం వల్ల అంబేడ్కర్ పార్లమెంటరీ ప్రభుత్వమనే భవనానికి మూలస్తంభం లాంటివారని వర్ణించారు.


ప్రధానులు

జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 1964)
* నెహ్రూ ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు.
* 1947, ఆగస్టు 15 నుంచి 1964, మే 27 మధ్య ప్రధానిగా వ్యవహరించారు.
* 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.
* భారతరత్న పురస్కారం పొందిన తొలిప్రధాని (1955).
* పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.
* ఎర్రకోటపై అత్యధికంగా 17 సార్లు జెండాను ఎగురవేశారు.
* భారత విదేశాంగ విధాన రూపకర్త.
* ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
* అలీనవిధాన రూపకల్పనలో కీలకపాత్ర వహించారు.
* 1948 పారిశ్రామిక విధానం ద్వారా మన దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశారు.
* న్యూదిల్లీలో జరిగిన ఆసియా దేశాల మహాసభలకు అధ్యక్షత వహించారు.
* 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు.
* 1952లో జాతీయాభివృద్ధి మండలిని నెలకొల్పారు.
* 1952లో CDP - Community Development Programme, 1953లో NESS - National Extension Service Scheme లను ప్రారంభించారు.
* 1954లో చైనా ప్రధాని చౌ-ఎన్-లై తో ప్రపంచశాంతి స్థాపనలో భాగంగా పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1953లో కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన తొలి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 1955లో మద్రాస్ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్‌సీ సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తన ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
* 1956లో భారత ఆర్థిక రాజ్యాంగంగా పేరొందిన పారిశ్రామిక తీర్మానాన్ని వెలువరించారు.
* 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించారు.
* 1961లో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు.
* 1962లో చైనాతో యుద్ధం కారణంగా మన దేశంలో మొదటిసారిగా జాతీయ అత్యవర పరిస్థితిని విధించారు.
* 1963లో మొదటి అవిశ్వాస తీర్మానాన్ని నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టారు.
* లౌకికవాద సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా నిరూపించారు.
* డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే గ్రంథాలను రాశారు.
* భారత జాతీయ కాంగ్రెస్‌కు 3 సార్లు అధ్యక్షత వహించారు.
* 1959లో రాజస్థాన్‌లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానానికి శ్రీకారం చుట్టారు.
* రిజర్వాయర్లను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు.


గుల్జారీలాల్ నందా
» జన్మస్థలం హరియాణా.
* నెహ్రూ మరణానంతరం 1946, మే 27 నుంచి 1964 జూన్ 9 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.
* 1997లో భారతరత్న అవార్టును పొందారు.
* కేంద్రమంత్రిగా వ్యవహరించారు


లాల్‌బహదూర్ శాస్త్రి
» ఈయన పదవీకాలం 1964 జూన్ 9 నుంచి 1966 జనవరి 11 వరకు.
* జైజవాన్, జైకిసాన్ అనే నినాదం ఇచ్చారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ఇండియన్ లింకన్‌గా పేరుపొందారు.
* కేంద్రంలో ఎలాంటి పోర్ట్‌పోలియా లేకుండానే కేంద్రమంత్రిగా కొనసాగిన మొదటి వ్యక్తి.
* 1966లో పాకిస్థాన్‌కు చెందిన జనరల్ ఆయూబ్‌ఖాన్‌తో తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
* హరిత విప్లవం, క్షీర విప్లవం కోసం కృషి చేశారు.
* ఇతడి కాలంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ను స్థాపించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.
* పదవిలో ఉండగా మరణించిన రెండో ప్రధాని, విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని.
* 1966లో మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందారు.

గుల్జారీలాల్ నందా
* లాల్‌బహదూర్ శాస్త్రి మరణానంతరం 1966, జనవరి 11 నుంచి 1966, జనవరి 24 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

ఇందిరా గాంధీ
* 1966, జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు; 1980, జనవరి 14 నుంచి 1984, అక్టోబర్ 31 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* ఇందిరా గాంధీ జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్
* భారతదేశ తొలి మహిళా ప్రధాని.
* రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులుగా ఉండి, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి.
* 4 సార్లు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
* ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రధానిగా 15 సంవత్సరాల 303 రోజులు వ్యవహరించారు.
* ప్రధానిగా ఉండి, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
* 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేశారు.
* రాజభరణాలను రద్దు చేశారు.
* ఈమె కాలంలో ఆర్టికల్, 356 అత్యధికంగా 37 సార్లు వినియోగించారు.
ఆర్టికల్ 352 ప్రకారం 1971, 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1971లో గరీబీ హఠావో నినాదం ద్వారా లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించి ఘనవిజయం సాధించారు.
* 1971లో రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1972లో పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టోతో 'సిమ్లా' ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* 1974, మే 18న స్మైలింగ్ బుద్ధా పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో తొలి అణుపరీక్షలను నిర్వహించారు.
* 1983లో న్యూదిల్లీలో జరిగిన 7వ NAM సదస్సుకు అధ్యక్షత వహించారు.
* 1975లో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* 1975లో విధించిన ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అవకతవకలపై ప్రత్యేక కోర్టు విచారణను ఎదుర్కొన్నారు.
* 1971లో Maintenance Internal Security Act ను రూపొందించారు.
* అత్యధికంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.
* 1982లో న్యూదిల్లీలో 9వ ఆసియా క్రీడలు నిర్వహించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ద్వారా రద్దు చేశారు.
* ప్రపంచంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి మహిళ.
* 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక అనంతరం మొదటి మైనార్టీ ప్రభుత్వాన్ని నిర్వహించారు.
* పదవిలో ఉండగా మరణించిన 3వ ప్రధాని, హత్యకు గురైన మొదటి ప్రధాని.
* 1977లో రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి రాజ్‌నారాయణ్ అనే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు.
* ఇందిరా గాంధీ 1971లో రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పుడు అవకతవకలు జరిగాయని, కాబట్టి ఎన్నిక చెల్లదని, 1975లో అలహాబాద్ హైకోర్ట్ తీర్పునిచ్చింది.
* 1984లో అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ అనే సైనిక చర్యను నిర్వహించారు.

మొరార్జీ దేశాయ్
* మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24 నుంచి 1979 జులై 28 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం గుజరాత్ (పూర్వపు బాంబే ప్రెసిడెన్సీ).
* మన దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని.
* పార్లమెంటులో అత్యధికంగా 9 సార్లు సాధారణ బడ్జెట్, 2 సార్లు ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టారు.
* మన దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వమైన జనతా ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
* 1978లో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టారు.
* పాకిస్థాన్ దేశ అత్యున్నత పురస్కారమైన నిషాన్-ఇ-పాకిస్థాన్ ను పొందిన తొలి భారతీయుడు.
* పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని.
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో బి.పి. మండల్ అధ్యక్షతన రెండో  వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించారు.
* ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులు (చరణ్‌సింగ్, బాబూ జగ్జీవన్‌రామ్) ఈయన కాలంలోనే ఉన్నారు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఇతడి కాలంలోనే తొలిగించారు.
* ఉప ప్రధానిగా పనిచేసి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రూపాయి విలువను తగ్గించడాన్ని నిరసిస్తూ ఇందిరా గాంధీ కాలంలో ఉప ప్రధాని పదవికి రాజీనామా  చేశారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం కోసం అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు.

చరణ్‌సింగ్ 
* ఈయన 1979, జులై 28 నుంచి 1980 జనవరి 14 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ఉపప్రధానిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* పార్లమెంటుకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన మొదటి ప్రధాని.
* పార్లమెంటులోకి ప్రవేశించకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి
* రైతు బాంధవుడిగా పేరుపొందారు.
* భారతీయ క్రాంతిదళ్, సంయుక్త విదాయకదళ్ సంస్థలను నెలకొల్పారు.
* లోక్‌దళ్ పార్టీ వ్యవస్థాపకుడు.
* ప్రధానమంత్రిగా 24 రోజులు, ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు.

రాజీవ్ గాంధీ
* ఈయన పదవీకాలం 1984, అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 1.
* జన్మస్థలం ముంబయి.
* 42 ఏళ్ల వయసులోనే ప్రధాని పదవిని చేపట్టారు.
* లోక్‌సభలో అత్యధికంగా 414 స్థానాలు గెలుపొందారు.
5 ఏళ్ల పదవీకాలంలో కేంద్ర మంత్రిమండలిని అత్యధిక సార్లు (13) పునర్వ్యవస్థీకరించారు.
* మన దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు.
* 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు.
* 1986లో ద ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు.
* 1987లో సార్వత్రిక ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించారు.
* 1988లో నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి National Literacy Mission(జాతీయ అక్షరాస్యతా ప్రచార దళం)ను ప్రారంభించారు.
* బికారీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు.
* ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పాటు చేశారు.
* 1989లో జవహర్ రోజ్ గార్ యోజన ను ప్రారంభించారు.
* వివాదాస్పద పోస్టల్ బిల్లును ఆమోదించారు.
* గూర్ఖాలాండ్ ఒప్పందం, పంజాబ్ ఒప్పందం ఈయన కాలంలోనే జరిగాయి.
* శ్రీలంకకు భారతదేశ శాంతి సైనిక దళాల (Indian Peace Keeping Forces - IPKF) ను పంపారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం కోసం ఎల్.ఎం. సింఘ్వీ కమిటీని నియమించారు.
* 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
* మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
* ముస్లిం మహిళల వివాహం, విడాకులు, హక్కుల చట్టం - 1986 ను రూపొందించారు.
* బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.
* ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు.
* 1991, మే 21న ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు.
* మే 21ని ఉగ్రవాద వ్యతిరేకదినంగా పాటిస్తారు.
* 1991లో భారతరత్న పురస్కారం పొందారు.

విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
* ఈయన 1989, డిసెంబరు 2 నుంచి 1990 నవంబరు 10 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* విశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవిని కోల్పోయిన తొలి వ్యక్తి.
* త్రిసభ్య ఎన్నికల సంఘాన్ని ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు.
* 1990లో అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు.
* బి.పి. మండల్ కమిషన్ సిఫారసులను అమలుపరిచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించారు.
* అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు జనమోర్చా అనే సంస్థను స్థాపించారు.
* ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్ గోస్వామి కమిటీని నియమించారు.
* నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించారు.
* 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పించారు.
* 1989లో ఏర్పడిన 9వ పార్లమెంటు మన దేశంలో మొదటి హంగ్ పార్లమెంట్.
* బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ కుంభకోణాలకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వైదొలిగారు.
* అయోధ్య వివాదంలో బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.

చంద్రశేఖర్
* ఈయన 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్.
* 'బోండ్సీ బాబా'గా పేరొందారు.
* మన దేశ రాజకీయాల్లో యంగ్ టర్క్ గా పేరొందారు.
* ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని.
* భారతదేశంలో రాజకీయ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు (కన్యాకుమారి నుంచి వారణాసి వరకు పాదయాత్ర నిర్వహించారు).
* పార్లమెంటులో కనీస కోరం సభ్యుల మద్దతు లేకుండానే జనతాదళ్ పార్టీని చీల్చి, కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
* 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి విమర్శలను ఎదుర్కొన్నారు.
* ఈయన పాలనా కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

పి.వి. నరసింహారావు
* ఈయన 1991, జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* మొదటి దక్షిణాది ప్రధాని, తెలుగు ప్రధాని.
* జన్మస్థలం కరీంనగర్ (తెలంగాణ).
* మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి పదవీకాలం నిర్వహించిన ఏకైక ప్రధాని.
* భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని అయిన 4వ వ్యక్తి
* పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
* దేశ్ బచావో - దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* 14 భాషల్లో ప్రావీణ్యాన్ని పొందారు.
* ఒక పదవీకాలంలోనే అత్యధికంగా 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.
* భారత విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ పాలసీ ని ప్రవేశపెట్టారు.
* " The Insider" అనే ఆత్మకథను రాశారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించారు.
* బాబ్రీ మసీదు విధ్వంసం ఈయన కాలంలోనే జరిగింది.


అటల్ బిహారి వాజ్‌పేయీ
* ఈయన 1996 మే 16 నుంచి జూన్ 1; 1998, మార్చి 19 నుంచి 2004 , మే 22 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం మధ్యప్రదేశ్.
* 1998 మే 11న ఆపరేషన్ శక్తి పేరుతో రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు.
* పాకిస్థాన్‌తో స్నేహం కోసం లాహోర్ బస్సు యాత్రను నిర్వహించారు.
* కేంద్రంలో అత్యధికంగా 24 పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* 1996లో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఓటింగ్ జరగకుండానే రాజీనామా చేశారు.
* 1999లో అవిశ్వాస తీర్మానం ద్వారా కేవలం ఒక ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయారు.
* పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.
* జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు.
* యూఎన్‌వో సాధారణ సభలో హిందీభాషలో ప్రసంగించిన మొదటి వ్యక్తి.
* అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
* మైనార్టీల సంక్షేమంపై రంగనాథ్ మిశ్రా కమిటీని నియమించారు.
* అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన కాంగ్రెసేతర ప్రధాని.
* 2001లో పార్లమెంటుపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి జరిగింది.
* 2002లో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం ద్వారా వివాదాస్పదమైన 'పోటా' చట్టాన్ని రూపొందించారు.
* 2002లో జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

హెచ్.డి. దేవెగౌడ
* ఈయన 1996, జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 20 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
జన్మస్థలం కర్ణాటక.
* దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన రెండో వ్యక్తి.
* 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* విశ్వాస తీర్మానంలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన 2వ ప్రధాని.
* మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటిసారిగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
* అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న (44 మందిని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* సివిల్ సర్వీసెస్‌లో డిప్లమో సాధించారు.

ఐ.కె. గుజ్రాల్
* ఈయన 1997, ఏప్రిల్ 21 నుంచి 1998, మార్చి 18 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం.
* దేవెగౌడ ప్రభుత్వ పతనానంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* జనతాదళ్ నేతృత్వంలోని 14 పార్టీల కూటమి ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* భారత విదేశాంగ విధానంలో గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో నూతన విధానాన్ని ప్రారంభించారు.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు.
* కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో పదవికి రాజీనామా చేశారు.
ఈయన 2012 నవంబరు, 30న మరణించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్
* ఈయన 2004 మే, 22 నుంచి 2014, మే 25 వరకు ప్రధానిగా వ్యవహరించారు.
* జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం తాలూకా ఘా గ్రామం.
* కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టిన 4వ వ్యక్తి (అసోం నుంచి).

* 2004 - 2009 మధ్య 17 పార్టీలతో కూడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రభుత్వాన్ని నడిపారు.
* 2009 - 2014 మధ్య 13 పార్టీలతో కూడిన యూపీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని నడిపారు.
* అమెరికాతో 123 పౌరఅణు ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
* 2005లో జాతీయ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.
* 2005లో బాలల హక్కుల చట్టాన్ని రూపొందించారు.
* 2005లో గృహ హింస నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు.
* 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
* 2007లో ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించారు.
* 2007లో జాతీయ బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* 2009లో ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని రూపొందించారు.
* 2009లో వృద్ధుల సంరక్షణా చట్టాన్ని రూపొందించారు.
* 2009లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించారు.
* 2006లో మైనార్టీల సంక్షేమం కోసం రాజేంద్ర సచార్ కమిటీని ఏర్పాటు చేశారు.
* మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
* 2007లో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన కోసం మదన్ మోహన్ పూంచీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పూర్తి పదవీకాలం నిర్వహించి, వరుసగా 2వ సారి అధికారం చేపట్టిన ప్రధానుల్లో మొదటి వారు.
* 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2012 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రతను కల్పించారు.
* 2013లో నిర్భయ చట్టాన్ని రూపొందించారు.
* 2014లో లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* అంతర్ రాష్ట్ర మండలి నుంచి శివరాజ్ పాటిల్ నేతృత్వంలో శాంతి భద్రతల పరిరక్షణ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
* ఒక పదవీకాలంలో 2 సార్లు విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.
* ఎర్రకోటపై వరుసగా 10 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ
* ఈయన పదవీకాలం: 2014 మే, 26 నుంచి ప్రస్తుతం
* జన్మస్థలం గుజరాత్.
* 1950 సెప్టెంబరు, 17న గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలోని 'వాద్ నగర్‌'లో జన్మించారు.
* నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీ, తల్లి హీరాబెన్.
* నరేంద్ర మోదీ 2001, అక్టోబరు 7న మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
* గుజరాత్‌కు 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
* కాంగ్రెసేతర ప్రధానుల్లో 8వ వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రధాని అయిన 6వ వ్యక్తి.
* స్వాతంత్య్రానంతరం జన్మించిన వ్యక్తుల్లో మొదటి ప్రధాని.
* జాతీయ ప్రణాళికా సంఘం పేరును 'నీతి ఆయోగ్‌'గా మార్చారు.
* బేటీ బచావో - బేటీ పడావో అనే నినాదాన్ని ఇచ్చారు.
* పరిశుభ్రతపై స్వచ్ఛభారత్ అనే నినాదాన్ని ఇచ్చారు.
* గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ నియోజక వర్గం నుంచి 5,70,128 ఓట్ల మెజార్టీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజక వర్గం నుంచి 3,71,784 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానులు
1. జవహర్‌లాల్ నెహ్రూ
2. ఇందిరా గాంధీ
3. రాజీవ్ గాంధీ


రైల్వే శాఖను నిర్వహించిన ప్రధానులు
1. లాల్‌బహదూర్ శాస్త్రి
2. అటల్ బిహారి వాజ్‌పేయీ
3. మన్మోహన్ సింగ్

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ పొందిన ప్రధానులు"
1. అటల్ బిహారి వాజ్‌పేయీ (1994)
2. చంద్రశేఖర్ (1995)
3. మన్మోహన్ సింగ్ (2002)

భారతరత్న పురస్కారం పొందిన ప్రధానులు
1. జవహర్‌లాల్ నెహ్రూ - 1955
2. లాల్‌బహదూర్ శాస్త్రి - 1966
3. ఇందిరా గాంధీ - 1971
4. రాజీవ్ గాంధీ - 1991
5. మెరార్జీ దేశాయ్ - 1991
6. గుల్జారీలాల్ నందా - 1997
7. అటల్ బిహారి వాజ్‌పేయీ - 2015


ప్రధానులు - నినాదాలు
జై జవాన్, జై కిసాన్ - లాల్ బహదూర్ శాస్త్రి
* గరీబీ హఠావో - ఇందిరా గాంధీ
* అన్యాయ్ హఠావ్ - ఇందిరా గాంధీ
* బికారీ హఠావో - రాజీవ్ గాంధీ
* దేశ్ బచావ్ - దేశ్ బనావో - పి.వి. నరసింహారావు
* జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ - అటల్ బిహారి వాజ్‌పేయీ
* బేటీ బచావో - బేటీ పడావో - నరేంద్ర మోదీ

 

ప్రధానులు - వారి సమాధులు
జవహర్ లాల్ నెహ్రూ - శాంతివన్
గుల్జారీలాల్ నందా - నారాయణ్ ఘాట్
లాల్‌బహదూర్ శాస్త్రి - విజయ ఘాట్
ఇందిరా గాంధీ - శక్తిస్థల్
మొరార్జీ దేశాయ్ - అభయ్ ఘాట్
చరణ్‌సింగ్ - కిసాన్ ఘాట్
రాజీవ్ గాంధీ - వీర్ భూమి
చంద్రశేఖర్ - స్మృతిస్థల్
దేవీలాల్ - సంఘర్ష్ స్థల్
పి.వి. నరసింహారావు - జ్ఞాన్ భూమి


ముఖ్యమంత్రులుగా పనిచేసి - ప్రధానులు అయినవారు
మొరార్జీ దేశాయ్ - బొంబాయి రాష్ట్రం
చరణ్‌సింగ్ - ఉత్తరప్రదేశ్
వి.పి.సింగ్ - ఉత్తరప్రదేశ్
పి.వి. నరసింహారావు - ఆంధ్రప్రదేశ్
దేవెగౌడ - కర్ణాటక
నరేంద్ర మోదీ - గుజరాత్

 

ఉత్తర ప్రదేశ్ నుండి అత్యధికంగా ఆరుగురు ప్రధానులు అయ్యారు.
1. జవహర్ లాల్ నెహ్రూ
2. లాల్‌బహదూర్ శాస్త్రి
3. ఇందిరా గాంధీ
4. చరణ్‌సింగ్
5. వి.పి. సింగ్
6. చంద్రశేఖర్


ఉప ప్రధానమంత్రి

* మన రాజ్యాంగంలో ఉప ప్రధాని పదవికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. రాజకీయ కారణాలు, ప్రాంతీయ రాజకీయాలు ఈ పదవి ఏర్పాటుకు కారణమవుతాయి.
* ప్రభుత్వంలో లేదా రాజకీయ పార్టీలో సమానస్థాయి నాయకులున్న సందర్భంలో పరిస్థితులు, సందర్భానుసారం ఏర్పడే రాజకీయ అవసరాల ఆధారంగా ఈ పదవిని ఏర్పాటు చేశారు.
* ఉప ప్రధాని కూడా మంత్రిమండలిలో అంతర్భాగం.  ప్రత్యేక అధికారాలు, విధులు ఉండవు. కేబినెట్ మంత్రిగా తనకు కేటాయించిన శాఖను నిర్వహిస్తారు.

కె.ఎం. శర్మ Vs దేవీలాల్ కేసు (1989)
* ఈ కేసులో దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, సుప్రీంకోర్టు ఉపప్రధాని పదవిని సమర్థిస్తూ, భారత రాజ్యాంగంలో మంత్రుల రకాలను, స్థాయిలను గురించి ఎలాంటి ప్రస్తావన చేయనందున దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానులు
* జవహర్‌లాల్ నెహ్రూ - 17 సార్లు
* ఇందిరాగాంధీ - 16
* మన్మోహన్‌సింగ్ - 10
* వాజ్‌పేయీ - 6 
* రాజీవ్ గాంధీ - 5
* పి.వి. నరసింహారావు - 5
* లాల్‌బహదూర్ శాస్త్రి - 2
* మొరార్జీ దేశాయ్ - 2
* చరణ్ సింగ్ - 1
* వి.పి. సింగ్ - 1
* హెచ్.డి. దేవెగౌడ - 1
* ఐ.కె. గుజ్రాల్ - 1
* నరేంద్ర మోదీ - 3 (2016, ఆగస్ట్ 15 నాటికి)
* చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు.
* పి.వి. నరసింహారావు 1991లో కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి 5,80,295 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధానుల్లో ఇప్పటికీ ఇదే రికార్డుగా కొనసాగుతోంది.
* ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ.

 

కేంద్ర మంత్రిమండలి
 ఆర్టికల్ 74 (1) ప్రకారం రాష్ట్రపతికి పరిపాలనలో సహకరించేందుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. భారత రాజ్యాంగం పార్లమెంటరీ లేదా మంత్రివర్గపాలిత ప్రభుత్వాన్ని ప్రసాదించింది. దీన్ని మనం బ్రిటన్ నుంచి గ్రహించాం. భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రిమండలిలోని మంత్రుల ర్యాంకులను, రకాలను, స్థాయిలను గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
* 1949లో "Government Missionary in India" అనే అంశంపై ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ చేసిన సిఫారసుల మేరకు మంత్రివర్గ రకాలను మూడు వర్గాలుగా పేర్కొన్నారు.

1) కేబినెట్ మంత్రులు
2) సహాయ మంత్రులు
3) డిప్యూటీ మంత్రులు
కేబినెట్ మంత్రులు (Cabinet Ministers)

* సాధారణంగా అధికార పార్టీలో అత్యంత ప్రాబల్యం, పరిపాలనా అనుభవం ఉన్న వారిని కేబినెట్ మంత్రులుగా ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. వీరి సంఖ్య సాధారణంగా 15 నుంచి 20 వరకు ఉంటుంది.
* ప్రభుత్వంలోని కీలక శాఖలను నిర్వహిస్తారు. వారానికి ఒకసారి (ప్రతి శుక్రవారం) కేబినెట్ సమావేశం అవుతుంది.
* కేబినెట్ అనే పదాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా ఆర్టికల్ 352(7)లో చేర్చింది.
* కేంద్ర మంత్రివర్గం తరఫున విధానాలను, నిర్ణయాలను చేసేది కేబినెట్ మాత్రమే.
* కేబినెట్ మంత్రులు ఎంపీలుగా పొందే వేతనంతో పాటు అదనంగా రూ. 10,000 పొందుతారు.

A. సూపర్ కేబినెట్: ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల రూపకల్పనలో కేంద్ర కేబినెట్ నుంచి ఏర్పడే రాజకీయ వ్యవహారాల కమిటీనే 'సూపర్ కేబినెట్‌' గా పేర్కొంటారు.
B. సమాంతర కేబినెట్: ప్రధానమంత్రి కార్యాలయం దేశ పరిపాలనా నిర్వహణలో కీలకమైన పాత్రను పోషిస్తూ, పరిపాలనపై పర్యవేక్షణను కూడా కలిగి ఉండటంతో ప్రధాని కార్యాలయాన్ని 'సమాంతర కేబినెట్‌'గా పేర్కొంటారు.
C. కిచెన్ కేబినెట్: ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రధానమంత్రితో అత్యంత సన్నిహితంగా, విశ్వసనీయంగా ఉండే కేబినెట్‌లోని అత్యంత ముఖ్యమైన మంత్రుల ప్రతినిధి బృందాన్ని 'కిచెన్ కేబినెట్‌'గా పేర్కొంటారు.
D. షాడో కేబినెట్: బ్రిటన్‌లో అధికారానికి వచ్చిన పార్టీ ఏర్పాటుచేసే ప్రభుత్వం అధికారపరమైన పరిపాలన విధాన నిర్ణయాలను నీడలా వెంటాడుతూ అందులోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం కోసం ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసుకునే అనధికార మంత్రిమండలిని 'షాడో కేబినెట్‌'గా పేర్కొంటారు.

సహాయ మంత్రులు/రాష్ట్ర మంత్రులు (State Ministers)
* సహాయ మంత్రులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. స్వయం ప్రతిపత్తి కలిగినవారు: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మంత్రులు వారి శాఖలకు సంబంధించిన పరిపాలనా నిర్ణయాలు అమల్లో కీలక పాత్ర వహిస్తారు. కేబినెట్ ర్యాంకు కలిగిన మంత్రులు లేని శాఖలకు స్వయం ప్రతిపత్తిని కలిగిన సహాయ మంత్రులను ఏర్పాటు చేస్తారు.
స్వయం ప్రతిపత్తి లేనివారు: వీరు కేబినెట్ సమావేశాలకు హాజరు కారు. వీరి శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చకు ప్రధాని ఆహ్వానం మేరకు హాజరు అవుతారు.
* పార్లమెంటు సభ్యుల వేతనంతో పాటు సహాయ మంత్రులు అదనంగా మరో రూ.7,000 వేతనం పొందుతారు.

డిప్యూటీ మంత్రులు: వీరు మంత్రివర్గంలో మూడో అంచెకు చెందినవారు. శాసన, పరిపాలనా వ్యవహారాల్లో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించే మంత్రులను డిప్యూటీ మంత్రులు అంటారు. స్వతంత్రంగా ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత వీరికి ఉండదు. వీరు కేవలం ఏదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే మంత్రివర్గ సమావేశానికి హాజరు అవుతారు.
* పార్లమెంటు సభ్యుల వేతనంతో పాటు డిప్యూటీ మంత్రులు అదనంగా రూ.5,000 వేతనం పొందుతారు.
* భారత రాజ్యాంగంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్యపై ఎలాంటి ప్రస్తావన లేదు.
* 1966 నాటికి మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10 శాతం మించరాదని సిఫారసు చేసింది. రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య కూడా విధానసభ సభ్యుల సంఖ్యలో 10 శాతం మించరాదని సిఫారసు చేసింది.
* చిన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12 మందికి తగ్గరాదని నిర్ణయించారు.
* కేంద్ర మంత్రిమండలిలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 83కు మించరాదు.
* 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 75 (1) (B) ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏదైనా ఒక సభలోని రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడిని Xవ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే ఆ వ్యక్తిని ఆ సభ పదవీకాలం ఉన్నంత వరకు మంత్రిగా నియమించరాదని నిర్దేశించారు.
* 91వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు 2004, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

రహస్య గోపనం
  ప్రధాని అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ మంత్రులందరూ రహస్యంగా ఉంచాలి. ఒకవేళ కేబినెట్ నిర్ణయాలను ఎవరైనా బయటికి వెల్లడిస్తే ప్రభుత్వ రహస్యాలను కాపాడతామని చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించడమే కాకుండా, ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లు అవుతుంది. మంత్రివర్గ నిర్ణయాలు సమష్టిగా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాలు. వీటిని ఏ న్యాయస్థానం ముందు సవాలు చేయరాదు. కేబినెట్ మంత్రులందరూ ఒకరి అభిప్రాయంతో మరొకరు ఏకీభవించి వాటి అమలుకు ప్రయత్నించాలి.

వ్యక్తిగత బాధ్యత
* ఆర్టికల్, 74(2) ప్రకారం మంత్రులందరూ రాష్ట్రపతికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. ఒక శాఖకు నాయకత్వం వహించే మంత్రి తన శాఖ లోటుపాట్లకు తానొక్కడే బాధ్యత వహించాలి. ప్రతి మంత్రిత్వశాఖకు సివిల్ కార్యనిర్వహణాధిపతి ఉంటారు. ఈయన  విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు చేయడంలోమంత్రికి సలహా ఇస్తారు. ఆ విధానాలు, నిర్ణయాలు తప్పుడు ఫలితాలను ఇస్తే దానికి మంత్రిదే బాధ్యత కానీ కార్యదర్శి బాధ్యుడు కాదు.
* ఒక శాఖ చేసిన పనికి మంచైనా, చెడైనా ఆ శాఖకు ఆధిపత్యం వహించే మంత్రిదే  బాధ్యత. సంబంధిత మంత్రి స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే ప్రధాని సిఫారసుల మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.

ఉదాహరణలు
* 1948లో ఆర్థికమంత్రి షణ్ముగం శెట్టిని ఆదాయపు పన్నుకు సంబంధించిన విషయంలో రాజీనామా చేయాలని ప్రధాని నెహ్రూ ఆదేశించారు.
* 1956లో రైల్వేమంత్రి పదవికి లాల్‌బహదూర్ శాస్త్రి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
* 1958లో ముంద్రాస్కాం కేసులో టి.టి. కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అప్పటి రక్షణ మంత్రి వి.కె. కృష్ణమీనన్ ను పదవి నుంచి తొలగించారు.
* 1966లో గోహత్య కారణంగా దిల్లీలో ఆందోళన జరిగినప్పుడు హోంమంత్రి గుల్జారీలాల్ నందా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
* 1968లో అవినీతి, లంచగొండితనం కేసులో కె.డి. మాలవ్యాను గనులు, చమురుశాఖ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించారు.
* 2005లో ఇరాక్ ఆయిల్‌స్కాం విషయానికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రి పదవి నుంచి నట్వర్‌సింగ్‌ను తొలగించారు.

 

సమష్టి బాధ్యత (Collective Responsibility)
* ఆర్టికల్, 75(3) ప్రకారం కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి. దీని ప్రకారం మంత్రులందరూ ఒకేసారి అధికారాన్ని పొంది, ఒకేసారి  కోల్పోతారు. ఒక మంత్రిపై అభియోగం ఉంటే అది అందరిపైనా అభియోగంగా భావించటం జరుగుతుంది.
* ఒక మంత్రికి వ్యతిరేకంగా లోక్‌సభ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఏ మంత్రి ప్రవేశపెట్టినప్పటికీ సభలో అతడు ఇచ్చే జవాబులకు, ప్రవర్తనకు మిగిలిన మంత్రులందరూ సమాన బాధ్యత వహించాలి.
* దీనిలో భాగంగా ప్రతీ మంత్రి, మంత్రివర్గ పరిధిలో అంతర్గత బాధ్యత వహించాలి. ఏదైనా విషయంపై మంత్రివర్గం ఒక నిర్ణయం చేసినప్పుడు ప్రతీ మంత్రి దాన్ని ఆమోదించాలి. ఈ నిర్ణయంతో ఎవరైనా మంత్రి విభేదిస్తే రాజీనామా చేయాల్సిందే.
* ప్రధాని లోక్‌సభలో ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానం వీగిపోయినా, ఏదైనా కారణంతో పదవి కోల్పోయినా, మరణించినా మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే.
* మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి.


సమష్టిబాధ్యతా సూత్రాన్ని ధిక్కరించడం లేదా ఉల్లంఘించడం వల్ల కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన లేదా తొలగించిన మంత్రుల వివరాలు
* 1950లో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ వ్యవహారాల మీద జరిగిన నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని నిరసిస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ, కె.సి. నియోగి రాజీనామా చేశారు.
* 1953లో హిందు కోడ్ బిల్లు విషయమై నెహ్రూతో విభేదించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
* 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ మహావీర్‌త్యాగి తన పదవికి రాజీనామా చేశారు.
* 1967లో త్రిభాషా సూత్రం విషయంలో తలెత్తిన విభేదాలను అనుసరించి ఎం.సి. చాగ్లా తన పదవికి రాజీనామా చేశారు.
* 1969లో రూపాయి విలువను తగ్గించడాన్ని నిరసిస్తూ మొరార్జీదేశాయ్ రాజీనామా చేశారు.
* 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహం, విడాకులు, హక్కుల చట్టం విషయంలో రూపొందించిన విధానాలను వ్యతిరేకిస్తూ అరీఫ్ మహ్మద్‌ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు.
* 1989లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలను నిరసిస్తూ వి.పి. సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
* 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్ల విషయాన్ని నిరసిస్తూ రాంవిలాస్ పాశ్వాన్ వాజ్‌పేయీ ప్రభుత్వానికి రాజీనామా చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ప్రణాళికా సంఘానికి కల్పిస్తున్న ప్రాధాన్యాని నిరసిస్తూ వి.వి.గిరి తన పదవికి రాజీనామా చేశారు.
* తన ఆర్థిక విధానాలు తన సహచరులకు నచ్చలేదనే కారణంతో జాన్‌మత్తాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
* బాంబే రాష్ట్రాన్ని విభజించి, గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సి.డి. దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.
* జనతా ప్రభుత్వ కాలంలో ద్వంద్వ సభ్యత్వం విషయంపై విభేదాలు రావడంతో చరణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
* బాబ్రీమసీద్ విధ్వంసం అనంతరం 4 రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలకు పి.వి. నరసింహారావును విమర్శించడం మూలంగా కుమారమంగళం తన పదవికి రాజీనామా చేశారు.
* ముంబయిపై పాకిస్థాన్ ముష్కరుల దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎ.ఆర్. అంతూలే తన పదవికి రాజీనామా చేశారు.
* 6వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన జనతా ప్రభుత్వం, 9వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 11వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పూర్తికాలం పాటు కొనసాగకపోవడానికి కారణం అప్పటి మంత్రివర్గ సహచరుల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

 

కేంద్ర మంత్రిమండలి అధికారాలు - విధులు
ఎం.వి. పైలి అభిప్రాయం ప్రకారం కేబినెట్ 4 రకాల విధులను నిర్వహిస్తుంది
1. ప్రభుత్వ విధానాలకు అనుగుణమైన బిల్లులను పార్లమెంటుకు సమర్పించేందుకు ఆమోదించడం.
2. ఉన్నతాధికారుల నియామకం.
3. వివిధ మంత్రిత్వశాఖల మధ్య వివాదాలను పరిష్కరించడం.
4. వివిధ శాఖలు చేసే అనేక కార్యక్రమాలను సమన్వయం చేసి, ప్రభుత్వ విధానాల అమలులో జరుగుతున్న ప్రగతిని సమీక్షించడం.

 

ఇతర అధికారాలు - విధులు
* భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలను ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో అమలుపరచడం.
* మనదేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడం.
* పార్లమెంటు రూపొందించిన చట్టాలను అమలుపరిచే సందర్భంలో ఆ శాసనాలు ఆచరణయోగ్యంగా ఉండటం కోసం అవసరమైన నియోజిత శాసనాన్ని రూపొందించడం.
* దేశానికి అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడం, దేశ ఆర్థిక విధానాన్ని సంస్కరించడం.
* పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ పాఠాన్ని రూపొందించడం.
* సమష్టి బాధ్యతా సూత్రాన్ని అనుసరించి లోక్‌సభకు సమష్టి బాధ్యతను వహించడం
* ఆర్టికల్, 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల పరిపాలనను పర్యవేక్షించడం.
* ఆర్టికల్, 72 ప్రకారం రాష్ట్రపతి వినియోగించే క్షమాభిక్ష అధికారాల విషయంలో రాష్ట్రపతికి సూచనలు, సలహాలు ఇవ్వడం.
* రాష్ట్రపతికి దేశ పరిపాలనకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* శాంతిభద్రతల పరిరక్షణ అనేది రాష్ట్రాల బాధ్యత అయినప్పటికీ, రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కేంద్రంపై ఉంది.
* శాంతిభద్రతల పరిరక్షణలో కేంద్రం రాష్ట్రాలకు తన సహకారాన్ని అందించడం.
* విదేశీ దాడులు, దురాక్రమణల నుంచి దేశాన్ని రక్షించేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయడం.
* దేశ పరిపాలనలో అత్యంత కీలకపాత్రను పోషించే రాజ్యాంగ, రాజ్యాంగేతర పదవుల నియామకంలో రాష్ట్రపతికి సలహాను ఇవ్వడం.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆర్టికల్, 123 ప్రకారం దేశ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రపతి ద్వారా 'ఆర్డినెన్స్‌'ను జారీ చేయించడం.


కేంద్ర మంత్రిమండలి సలహామేరకే రాష్ట్రపతి వ్యవహరించాలని సుప్రీంకోర్టు కింద పేర్కొన్న కేసుల్లో తీర్పునిచ్చింది.
1. రామ్‌జువాయ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
2. యు.ఎన్.ఆర్. రావు Vs ఇందిరా గాంధీ కేసు
3. షంషేర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు

 

కేంద్ర కేబినెట్‌కు తన అధికార విధుల నిర్వహణలో సహకరించేందుకు ఒక 'కేబినెట్' సచివాలయం ఉంటుంది. దీనికి అధిపతిగా కేబినెట్ సెక్రటరీ ఉంటారు. దీనికి సీనియర్ సివిల్ సర్వీస్ ఉద్యోగిని నియమిస్తారు.

కేబినెట్ సచివాలయం
*  కేబినెట్ సచివాలయాన్ని 1947లో ఏర్పాటు చేశారు. దీనిలో 3 విభాగాలు ఉంటాయి. అవి:
1. సివిల్ వింగ్
2. మిలటరీ వింగ్
3. ఇంటలిజెన్స్ వింగ్


కేబినెట్ సచివాలయం - విధులు
* కేబినెట్ సమావేశాల ఎజెండాను తయారుచేయడం.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కేంద్ర మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది.
* కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం.
* వివిధ మంత్రిత్వ శాఖలకు సమాచారాన్ని చేరవేయడం.

కేబినెట్ కార్యదర్శి
* ఈయన కేబినెట్ సచివాలయానికి పరిపాలనా అధిపతిగా వ్యవహరిస్తారు.
* సివిల్ సర్వీసుల్లో ఇది అత్యున్నత పదవి.
* ఈ పదవిని 1950లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర సచివాలయంలో ముఖ్య అధికారుల ఎంపిక బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రధానమంత్రికి కళ్లు, చెవులుగా పని చేస్తారు.
* ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం
* 1947లో గవర్నర్ జనరల్‌కు వ్యక్తిగత కార్యదర్శి హోదాలో దీన్ని ఏర్పాటు చేశారు. 1977 నుంచి ప్రధానమంత్రి సచివాలయంగా పేర్కొంటున్నారు. దీనికి ప్రధానమంత్రి అధిపతిగా ఉంటారు. పరిపాలనాపరంగా ప్రిన్సిపల్ కార్యదర్శి ఒకరు ఉంటారు.

అధికారాలు - విధులు
* ఇది స్టాఫ్ ఏజెన్సీ, రాజ్యాంగేతర సంస్థ
* దీన్ని సూపర్ కేబినెట్, మైక్రో కేబినెట్, సూపర్ మినిస్ట్రీ, సూపర్ సెక్రటేరియట్‌గా పేర్కొంటారు.
* ఇతర శాఖలకు కేటాయించని అంశాలను పర్యవేక్షిస్తుంది.
* ప్రధానమంత్రికి థింక్ ట్యాంక్ లేదా వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది.
* దీన్ని అవశిష్టదత్త సంస్థ గా (Residuary Legatee) పేర్కొంటారు.
* దీన్నే ప్రభుత్వం పైన ప్రభుత్వం (The Governament of the Governament of India)గా అభివర్ణిస్తారు.


కేబినెట్ కమిటీలు
* ప్రభుత్వం సమర్థంగా, అభిలషణీయమైన పాలనను సాగించేందుకు కమిటీ పద్ధతి తోడ్పడుతుంది. కేబినెట్ కమిటీల్లో కీలక శాఖలను నిర్వహించే కొద్దిమంది మంత్రులు ఉంటారు. ఈ కమిటీలకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* కేబినెట్ పని భారాన్ని తగ్గించడానికి, సంబంధిత విషయాలపై నిరంతరం పర్యవేక్షణను కొనసాగించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి రాజ్యాంగ భధ్రత లేదు. ఇవి కేవలం సలహా అధికారాలను మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ కేబినెట్ తీసుకునే నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇవి 2 రకాలు.

1. శాశ్వత కమిటీలు (Standing Committees)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)


శాశ్వత స్థాయీ సంఘాలు
* వీటిని విషయ పరంగా ఏర్పాటు చేస్తారు. ప్రతి సంఘంలోనూ 7 మందికి మించకుండా సభ్యులు ఉంటారు.

కీలకమైన కేబినెట్ స్థాయి/ ఉప సంఘాలు



 5. ఆర్థిక వ్యవహారాల కమిటీ
 6. రక్షణ వ్యవహారాల కమిటీ
 7. పెట్టుబడులపై కమిటీ.
* మిగిలిన కమిటీలకు అధ్యక్షులను ప్రధాని నియమిస్తారు.

* 2014, జూన్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 కేబినెట్ కమిటీలను రద్దు చేశారు. అవి:
1. ధరలపై కేబినెట్ కమిటీ
2. ప్రపంచ వాణిజ్య సంస్థ విషయాలపై కమిటీ
3. ఆధార్ వ్యవహారాల కమిటీ
4. విపత్తు నిర్వహణ కమిటీ

 

తాత్కాలిక కమిటీలు
* కొన్ని సార్లు ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు సంబంధిత సమస్యలను పరిశీలించి, నివేదికను సమర్పించిన తర్వాత వాటంతటవే రద్దు అవుతాయి.
ఉదా: అత్యవసర పరిస్థితులు, విదేశీ యుద్ధాల సమయంలో ఏర్పడ్డాయి.
* కేబినెట్ కమిటీల సంఖ్య ఎంత ఉండాలన్నది ఆయా ప్రభుత్వాల ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది.

 

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్
* ప్రభుత్వం రోజువారీ వ్యవహారాలను ఇతర ప్రజా సమస్యలను పరిశీలించడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ ను నియమిస్తుంది. వీరు కేబినెట్ కమిటీలకు సహాయ సహకారాలు అందిస్తారు. వీటిలో సంబంధిత శాఖ మంత్రి, ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. వీటి సంఖ్య ఆయా ప్రభుత్వాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

కేబినెట్ వ్యాఖ్యానాలు
* 'ప్రభుత్వం అనే నావకు కేబినెట్ స్టీరింగ్ లాంటిది' - రాంసేమ్యూర్
* 'కేబినెట్ అనేది ప్రభుత్వ విధానాలకు అయస్కాంతం లాంటిది' - గ్లాడ్‌స్టోన్
* 'కేబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం లాంటిది' - లోవెల్
* 'కేబినెట్ అనేది శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖలను కలిపి ఉంచే వారధి లాంటిది' - బేగ్ హార్ట్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌