• facebook
  • whatsapp
  • telegram

రసాయన చర్యలు

ప్రధానంగా మార్పులు రెండు రకాలు అవి:

1) భౌతిక మార్పులు 

2) రసాయన మార్పులు

భౌతిక మార్పు 

*  పదార్థాల రంగు, ఆకారం, పరిమాణం, స్థితిలో మార్పు వచ్చినా కొత్త పదార్థం ఏర్పడకపోతే ఆ మార్పును ‘భౌతిక మార్పు’ అంటారు. 

* భౌతిక మార్పులో పదార్థాల సంఘటనంలో మార్పు జరగదు.

ఉదాహరణలు:

* మంచు ముక్కలను వేడి చేసినప్పుడు నీరుగా మారడం.

* నీటిని వేడి చేసినప్పుడు నీటిఆవిరిగా మార్పు చెందడం.

* కొవ్వొత్తిని వేడిచేసినప్పుడు కరగడం.

* కొబ్బరినూనె చలికాలంలో గడ్డకట్టడం

* ఒక ఇనుపముక్కను అయస్కాంతంతో రుద్దినప్పుడు అది కూడా అయస్కాంతంగా మారడం.

* తెల్లటి జింక్‌ ఆక్సైడ్‌ను వేడిచేస్తే అది పసుపు రంగులోకి మార్పు చెందడం.

*భౌతిక మార్పు అనేది పదార్థ ధర్మాల్లో మాత్రమే ఏర్పడుతుంది.

*ఇది తాత్కాలికమైంది.

రసాయన మార్పు

* ఒక మార్పుతో ఏదైనా కొత్త పదార్థం ఏర్పడితే ఆ మార్పును ‘రసాయన మార్పు’ అంటారు.

*  పదార్థాల సంఘటనంలో మార్పు జరుగుతుంది.

ఉదాహరణలు:

*  ఇనుము తుప్పు పట్టడం 

ఇనుము + ఆక్సిజన్‌ + నీరు తుప్పు

*  మెగ్నీషియం తీగను ఆక్సిజన్‌ సమక్షంలో మండించడం

మెగ్నీషియం + ఆక్సిజన్‌  మెగ్నీషియం ఆక్సైడ్‌

*  కర్పూరం, బొగ్గును మండించడం

*  కాయలు పండ్లుగా, పాలు పెరుగుగా మారటం

*  ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ

*  కిరణజన్య సంయోగ క్రియ

*  పసుపు, సున్నం కలిపి పారాణి తయారు చేయడం.

*  రసాయన మార్పు జరిగినప్పుడు పదార్థాల ఘటకాల్లో మార్పు కారణంగా కొత్త పదార్థాలు ఏర్పడతాయి. వాటితో పాటు కొన్ని సందర్భాల్లో కింది అంశాలు కూడా జరగవచ్చు.

* రంగు మారడం, స్థితిలో మార్పు రావడం, వాసన మారడం, కొత్త వాసన రావడం, ఉష్ణం లేదా కాంతిని గ్రహించడం.

రసాయన చర్యలు - రకాలు

రసాయన చర్యలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

1. రసాయన సంయోగం

2. రసాయన వియోగం

3. రసాయన స్థానభ్రంశం

4. రసాయన ద్వంద్వ వియోగం

రసాయన సంయోగం: రెండు లేదా అంత కంటే  ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి, ఒకేఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచే రసాయన చర్యను ‘రసాయన సంయోగం’ అంటారు.

ఉదా: i) బొగ్గును మండించడం 

ii) పొడిసున్నానికి నీరు కలిపి తడి సున్నం తయారు చేయడం

రసాయన వియోగం: ఒక క్రియాజనకం రెండు లేదా అంత కంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోయే రసాయన చర్యను ‘రసాయన వియోగం’ అంటారు.


ఉదా: i) సున్నపురాయి వియోగం

వేడి చేయడం వల్ల పదార్థం వియోగం చెందితే అలాంటి చర్యలను ‘‘ఉష్ణ వియోగ చర్యలు’’ అంటారు.


ii) నీటి విద్యుద్విశ్లేషణం

విద్యుత్తును పంపినప్పుడు నీరు హైడ్రోజన్, ఆక్సిజన్‌ వాయువులుగా వియోగం చెందడం వల్ల దీన్ని ‘‘విద్యుత్తు వియోగ చర్య’’ అంటారు.


iii) సిల్వర్‌బ్రోమైడ్‌ వియోగం:

సూర్యకాంతి సమక్షంలో పదార్థం వియోగం చెందినట్లయితే, అలాంటి చర్యలను ‘‘కాంతి రసాయన చర్యలు’’ అంటారు.

రసాయన స్థానభ్రంశం: ఒక సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించే రసాయన చర్యను ‘రసాయన స్థానభ్రంశం’ అంటారు.

పై రసాయన చర్యలో జింక్‌ కాపర్‌ సల్ఫేట్‌లోని కాపర్‌ను స్థానభ్రంశం చెందించింది.

రసాయన ద్వంద్వ వియోగం: రెండు క్రియాజనకాల ధన, రుణావేశ అయాన్‌లు వాటి స్థానాలను పరస్పరం మార్చుకుని రెండు కొత్త పదార్థాలను ఏర్పరిచే రసాయన చర్యలను ‘‘రసాయన ద్వంద్వ వియోగ చర్యలు’’ అంటారు.

పై రసాయన చర్యలో బేరియం, సోడియం అయాన్‌లు తమ స్థానాలను పరస్పరం మార్చుకుని రెండు కొత్త పదార్థాలను ఏర్పరిచాయి.

ఆక్సీకరణం, క్షయకరణం

ఆక్సీకరణ చర్యలు

* ఆక్సిజన్‌ను కలపడం లేదా హైడ్రోజన్‌ను తీసివేయడం ద్వారా జరిగే రసాయన చర్యలను ‘ఆక్సీకరణ చర్యలు’ అంటారు.

* లోహ క్షయం, ఆహార పదార్థాలు ముక్కిపోవడం, దహన చర్యలు మొదలైనవి ఆక్సీకరణ చర్యలకు ఉదాహరణలుక్షయకరణ చర్యలు


క్షయకరణ చర్యలు

* హైడ్రోజన్‌ను కలపడం లేదా ఆక్సిజన్‌ను తీసివేయడం ద్వారా జరిగే రసాయన చర్యలను ‘క్షయకరణ చర్యలు’ అంటారు.

రెడాక్స్‌ చర్యలు

* ఒక క్రియాజనకం ఆక్సీకరణం చెంది, మరో క్రియాజనకం క్షయకరణం చెందే రసాయన చర్యలను ‘‘రెడాక్స్‌ చర్యలు’’ అంటారు.

రసాయన సమీకరణం

* ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పునకు గురవుతాయో వాటిని ‘క్రియాజనకాలు’ అంటారు. 

* రసాయన మార్పులో కొత్తగా ఏర్పడిన పదార్థాలను ‘క్రియాజన్యాలు’ అంటారు.

* రసాయనిక చర్యలో క్రియాజనకాలు, క్రియాజన్యాలుగా మారడాన్ని బాణం గుర్తుతో సూచిస్తారు. క్రియాజనకాలను బాణం గుర్తుకు ఎడమవైపున, క్రియాజన్యాలను బాణం గుర్తుకు కుడివైపున రాస్తారు.

* రసాయన చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు లేదా క్రియాజన్యాలు ఉంటే వాటి మధ్య కూడిక గుర్తు (+) ను ఉంచుతారు.

* ఒక రసాయన చర్యను సంకేతాలతో తెలియజేస్తే దాన్ని ‘రసాయన సమీకరణం’ అంటారు.

* ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం ‘‘ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు, తŸర్వాత సమానంగానే ఉంటుంది’’.

* ఒక రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేం, నాశనం చేయలేం.

* క్రియాజనకాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటే ఆ రసాయన సమీకరణాన్ని ‘తుల్య రసాయన సమీకరణం’ అంటారు.

* రసాయన సమీకరణాల్లో క్రియాజనకాలు, క్రియాజన్యాల భౌతిక స్థితులను (ఘ), (ద్ర), (వా) లాంటి గుర్తులతో సూచిస్తారు.

* ఒక పదార్థం నీటిలో కరిగితే జలద్రావణం అంటారు. దాన్ని (జ.ద్రా) అనే గుర్తుతో సూచిస్తారు.

* ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ‘‘ఉష్ణమోచక చర్యలు’’ అంటారు. వాటిని కింది విధంగా సూచిస్తారు.

* ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే రసాయన చర్యలను ‘‘ఉష్ణగ్రాహక చర్యలు’’ అంటారు. వాటిని కింది విధంగా రాస్తారు.

* ఒక రసాయన చర్యలో వాయువు విడుదల అయితే దాన్ని లేదా (వా) గుర్తుతో సూచిస్తారు.

* ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దాన్ని డౌన్‌ 

గుర్తుతో సూచిస్తారు.

మాదిరి ప్రశ్నలు


1. కింది వాటిలో రసాయన చర్య కానిది?

1) నీరు ఆవిరిగా మారడం 

2) కిరణజన్య సంయోగక్రియ  

3) కాగితం మండటం  

4) ఆహారం జీర్ణం కావడం

2. కింది అంశాల్లో సరైంది?

i) రసాయన మార్పు శాశ్వతమైంది      

ii) రసాయన మార్పు జరిగినప్పుడు శక్తి మార్పిడి జరుగుతుంది.

1్శ ్బi్శ        2్శ ్బii్శ   

3్శ ్బi్శ, ్బii్శ       4్శ ఏదీకాదు

3. భౌతికమార్పునకు ఉదాహరణ?  

1) బొగ్గును మండించటం   

2) మైనం కరగడం    

3) కిరణజన్య సంయోగ క్రియ   

4) ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ

4. కింది వాటిలో రసాయన మార్పులు?

1) నీరు మంచుగా మార్పు చెందడం  

2) నీరు ఆవిరిగా మారడం   

3) ఇనుము తుప్పు పట్టడం    

4) నెయ్యి గడ్డకట్టడం

5. వంట కోసం వాడే ఎల్‌పీజీ సిలిండర్‌లోని గాలి ద్రవస్థితిలో ఉంటుంది. ఇది బయటకు వచ్చినప్పుడు వాయువుగా మారుతుంది (దశ-a), దాన్ని కాల్చినప్పుడు (దశ-b) మండుతుంది.

1) దశ- a భౌతిక మార్పు, దశ- b రసాయన మార్పు

2) దశ- a రసాయన మార్పు, దశ- b భౌతిక మార్పు

3) దశ- a, దశ- b భౌతిక మార్పులు

4) దశ- a, దశ- b రసాయన మార్పులు

6. కిందివాటిలో సరైంది?

i) భౌతిక మార్పు తాత్కాలికమైంది

ii) సాధారణంగా భౌతిక మార్పులు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు.

1) ్బi్శ, ్బii్శ సరైనవి    2్శ ్బi్శ సరైంది

3) ్బi్శ, ్బii్శ సరైనవి కావు   

4) ్బii్శ మాత్రమే సరైంది

7. యాపిల్, వంకాయ, ఆలుగడ్డ, అరటిపండు ముక్కలుగా కోసినప్పుడు వాటిపై ఒక పొర ఏర్పడటం ఏ రకమైన మార్పునకు ఉదాహరణ?

1) భౌతిక మార్పు    

2) రసాయన మార్పు       

3) రెండు రకాల మార్పులు

4) పైవేవీకావు

సమాధానాలు

1 - 1   2 - 3   3 - 2   4 - 3   5 - 1   6 - 1   7 - 2 

Posted Date : 23-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌