1. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొంది?
జ: యూనియన్ ఆఫ్ స్టేట్స్
2. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
జ: ఆర్టికల్ 370
3. కిందివాటిలో రాజకీయ హక్కు?
ఎ) ఎన్నికల్లో ఓటు వేసే హక్కు బి) ఎన్నికల్లో పోటీ చేసే హక్కు
సి) రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)
4. భారత పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?
జ: 1955
5. ప్రవాస భారతీయులకు 2004 నుంచి ఎవరి సిఫారసుల మేరకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు?
జ: ఎల్.ఎం. సింఘ్వీ
6. పీఐఓను విస్తరించండి.
జ: పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్
7. మన దేశంలో ఏ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది?
జ: జమ్ముకశ్మీర్
8. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ఏ తేదీలోపు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం పొందే అవకాశం కల్పించారు?
జ: 1948, జులై 19
9. విదేశాల్లో నివసించే భారత సంతతి పౌరసత్వాన్ని తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది?
జ: ఆర్టికల్ 9