• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం, వాతావరణ కాలుష్యం

1. కింది ఏ వాతావరణ పొర భూఉపరితలానికి దగ్గరగా ఉంటుంది?

1) ట్రోపో ఆవరణం    2) మెసో ఆవరణం      3) స్ట్రాటో ఆవరణం      4) థర్మో ఆవరణం


2. భూవాతావరణంలో జరిగే దృగ్విషయాలకు వాతావరణంలోని ఏ పొర బాధ్యత వహిస్తుంది?

1) థర్మో ఆవరణం    2) మెసో ఆవరణం     3) ట్రోపో ఆవరణం      4) ఎక్సో ఆవరణం


3. కింది ఏ వాతావరణ పొరలో ఓజోన్‌ పొర ప్రధానంగా కేంద్రీకృతమై ఉంటుంది?

1) స్ట్రాటో ఆవరణం    2) థర్మో ఆవరణం   3) ట్రోపో ఆవరణం   4) మెసో ఆవరణం


4. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వాతావరణంలోని ఏ పొరలో పరిభ్రమిస్తుంది?

1) ట్రోపో ఆవరణం   2) థర్మో ఆవరణం    3) ఎక్సో ఆవరణం      4) స్ట్రాటో ఆవరణం


5. కింది వాటిలో సరైన వాక్యం ఏది?

i) ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి ఏ స్థితిలో ప్రవేశిస్తాయో అదే స్థితిలో కాలుష్యానికి కారణమవుతాయి.    ii) కార్బన్‌ డైఆక్సైడ్, సల్ఫర్‌ డైఆక్సైడ్‌ తదితరాలు ప్రాథమిక కాలుష్యకాలకు ఉదాహరణలు.

1) i మాత్రమే      2) ii మాత్రమే      3) i, ii    4) పైవేవీకావు


6. కింది వాటిలో ప్రాథమిక కాలుష్యకాలకు ఉదాహరణ?

1) ఓజోన్‌      2) ఆమ్ల వర్షం      3) 1, 2      4)  PM10 కణాలు


7. ప్రాథమిక కాలుష్యకాల మధ్య రసాయన చర్యల ద్వారా ఏర్పడే పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిని ఏమంటారు?

1) ద్వితీయ కాలుష్యకాలు     2) జీవక్షయీకృతమయ్యే కాలుష్యకాలు     3) ధ్వని కాలుష్యకాలు      4) పైవేవీకావు


8. పొగమంచుతో సంబంధం కలిగి ఉండే కాలుష్య కారకం ఏది?

1) నియాన్‌         2) కార్బన్‌ మోనాక్సైడ్‌     3) ట్రోపో ఆవరణంలోని ఓజోన్‌     4) 1, 2


9. కింది వాటిలో సరికాని జత?

1) ప్రాథమిక కాలుష్యకం - కార్బన్‌మోనాక్సైడ్‌      2) ద్వితీయ కాలుష్యకం - భూమట్టపు ఓజోన్‌     3)  ద్వితీయ కాలుష్యకం - నలుసు పదార్థం (Particulate matter)   4) ప్రాథమిక కాలుష్యకం - సీసం, కాడ్మియం


10. పట్టణ ప్రాంతాల్లో కార్బన్‌ మోనాక్సైడ్‌కు(CO) ప్రాథమిక మూలం ఏమిటి?

1)పారిశ్రామిక ఉద్గారాలు    2) అటవీ మంటలు    3) మోటార్‌ వాహనాల పొగ    4) పైవేవీకావు


11. మానవుల్లో శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కాలుష్య కారకం?

1) సీసం     2) పాదరసం  3) నలుసు పదార్థం      4) భారజలం


12. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జూన్‌ - 5    2) జూన్‌ - 10   3) జూన్‌ - 15      4) జూన్‌ - 20


13. భూవాతావరణంలో అత్యధికంగా లభించే వాయువు ఏది? 

1) ఆక్సిజన్‌(O2)   2) నైట్రోజన్‌(N2)    3) కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2)     4) ఆర్గాన్‌ (Ar)   


14. అరోరాకు (Aurora) కారణమైన అయనో ఆవరణం వాతావరణంలోని ఏ పొరలో ఉంటుంది?

1) ట్రోపో ఆవరణం    2) థర్మో ఆవరణం  3) ఎక్సో ఆవరణం     4) మెసో ఆవరణం


15. -900Cకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే అత్యంత చల్లని వాతావరణ పొర ఏది?

1) ఎక్సో ఆవరణం     2) థర్మో ఆవరణం     3) మెసో ఆవరణం   4) స్ట్రాటో ఆవరణం


16. వాతావరణంలోని ఏ పొర భూఉపరితలం నుంచి సుమారు 80 - 550 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?

1) స్ట్రాటో ఆవరణం   2) ట్రోపో ఆవరణం  3) మెసో ఆవరణం     4) థర్మో ఆవరణం


17. అంతరిక్ష శూన్యంలోకి కలిసిపోయే భూమి బాహ్య వాతావరణ పొర ఏది?

1) స్ట్రాటో ఆవరణం     2) ట్రోపో ఆవరణం   3) థర్మో ఆవరణం     4) ఎక్సో ఆవరణం


18. కింది వాటిని వాతావరణంలో వాటి పరిమాణాన్ని అనుసరించి అవరోహణ క్రమంలో అమర్చండి?

1) నైట్రోజన్‌(N2), ఆక్సిజన్‌ (O2) , కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2), ఆర్గాన్‌ (Ar)          2) నైట్రోజన్‌(N2), ఆక్సిజన్‌ (O2) , ఆర్గాన్‌(Ar)  , కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2)

 3) ఆక్సిజన్‌ (O2), నైట్రోజన్‌(N2), ఆర్గాన్‌ (Ar), కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2)         4) ఆర్గాన్‌ (Ar), నైట్రోజన్‌ (N2), ఆక్సిజన్‌(O2), కార్బన్‌ డైఆక్సైడ్‌(CO2)


19. భూవాతావరణంలో ఆక్సిజన్‌ (O2) ఘనపరిమాణ శాతం ఎంత?

1) 78%       2) 21%   3) 1%       4) 0.04%


20. భూవాతావరణంలో నైట్రోజన్‌ (N2)  ఘనపరిమాణ శాతం ఎంత?

1) 78%       2) 21%    3)1%   4) 0.04%


21. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియకు అవసరమైన వాయువు ఏది?

1) ఆక్సిజన్, కార్బన్‌ డైఆక్సైడ్‌      2) కార్బన్‌ డైఆక్సైడ్, ఆక్సిజన్‌      3) నైట్రోజన్, ఆక్సిజన్‌      4) ఆక్సిజన్, నైట్రోజన్‌


22. భూవాతావరణంలో నత్రజని (N2) ప్రాథమిక మూలం ఏది?

1) అగ్నిపర్వత విస్పోటనాలు 2) మానవ కార్యకలాపాలు     3) జీవప్రక్రియలు        4) పారిశ్రామిక ఉద్గారాలు


23. కింది వాటిలో వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం?

1) పారిశ్రామిక ఉద్గారాలు    2) అగ్నిపర్వత విస్పోటనాలు        3) దుమ్ము తుపానులు   4) పైవన్నీ


24. ఇంటి లోపల లేదా అంతర్గత (Indoor) వాయు కాలుష్యానికి ప్రధాన కారణం?

1) వాహన ఉద్గారాలు    2) వ్యవసాయ కార్యకలాపాలు     3) సిగరెట్‌ పొగ     4) పైవేవీకావు


25. ప్రపంచ వాయుకాలుష్యానికి ఏ రంగం ఎక్కువగా కారణమవుతోంది?

1) నివాస రంగం    2) రవాణా రంగం      3) పారిశ్రామిక రంగం      4) వ్యవసాయ రంగం


26. కింది వాటిలో భూస్థాయి ఓజోన్‌ ఏర్పడటానికి దోహదపడేది?

1) పారిశ్రామిక ఉద్గారా 2) వాహన ఉద్గారాలు    3) అటవీ నిర్మూలన   4) పైవన్నీ


27. బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు దహన చర్యకు గురైనప్పుడు వెలువడే కాలుష్య కారకాలు?

1) కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2)    2) సల్ఫర్‌ డైఆక్సైడ్‌ (SO2)       3) నైట్రోజన్‌ ఆక్సైడ్‌ (NOX)        4) పైవన్నీ 


28. కింది వాటిలో సరైన వాక్యం? 

i) 10 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణం ఉన్న కణస్థితి కాలుష్య కారకాలను  PM10 కణాలు అంటారు.      ii) PM10 కణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తాయి.

1) i మాత్రమే      2) ii మాత్రమే   3) i, ii      4) పైవేవీకావు


సమాధానాలు

1-1         2-3       3-1       4-2           5-3        6-4         7-1         8-3      9-3          10-3       11-3           12-1          13-2           14-2            15-3      16-4     17-4    18-2      19-2  20-1     21-2  22-3      23-4     24-3      25-2        26-4      27-4       28-3

మరికొన్ని...

1. కణస్థితి కాలుష్య కారకాలకు ఉదాహరణలు?

1) దుమ్ము       2) పొగ     3) ఎగిరే బూడిద కణాలు   4) పైవన్నీ


2. కింది వాటిని జతపరచండి.

   జాబితా- I                                        జాబితా-II

ఎ. లండన్‌ స్మాగ్‌                              i) నైట్రోజన్‌ ఆక్సైడ్, హైడ్రోకార్బన్‌లు     

బి. కాంతి రసాయన స్మాగ్‌                  ii) క్లోరోఫ్లోరో   కార్బన్‌లు 

సి. శీతలీకరణ  వాయువులు              iii) సల్ఫర్‌ డైఆక్సైడ్,  పొగమంచు

1) ఎii, బిi, సిiii       2) ఎiii, బిii, సిi       3) ఎi, బిiii, సిii      4) ఎiii, బిi, సిii


3. కింది వాటిలో సహజ హరితగృహ వాయువు ఏది?

1)కార్బన్‌ డైఆక్సైడ్‌    2) మీథేన్‌        3) నైట్రస్‌ ఆక్సైడ్‌     4) నీటి ఆవిరి 


4. వాతావరణంలోని కొన్ని వాయువులు పరిమితికి మించి ఉన్నప్పుడు, భూఉపరితలం సూర్యుడి వేడిని ఎక్కువగా బంధించి ఉంచే ప్రక్రియను ఏమంటారు?

1) హరితగృహ ప్రభావం      2) ఆమ్ల వర్షాలు     3) స్మాగ్‌      4) పైవన్నీ

5. ఉల్కలు (Meteors) భూమి ఏ వాతావరణ పొరలోకి ప్రవేశించినప్పుడు మండిపోతాయి?

1) థర్మో ఆవరణం    2) ట్రోపో ఆవరణం  3) ఎక్సో ఆవరణం   4) మెసో ఆవరణం


6. కింది ఏ వాతావరణ పొరలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది?

1) మెసో ఆవరణం     2) స్ట్రాటో ఆవరణం         3) ట్రోపో ఆవరణం        4) పైవేవీకావు


7. కింది వాటిలో హరితగృహ ప్రభావానికి కారణమయ్యే ప్రధాన వాయువు?

1) ఆక్సిజన్‌      2) నైట్రోజన్‌     3) కార్బన్‌ డైఆక్సైడ్‌     4) హైడ్రోజన్‌


8. వాతావరణంలో హరితగృహ వాయువుల పరిమాణం ఎక్కువై భూమి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటారు?

1) గ్లోబల్‌ వార్మింగ్‌    2) కాంతి రసాయన స్మాగ్‌      3)ఆమ్ల వర్షాలు 4) పైవేవీకావు


9. గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన పరిణామం ఏమిటి?

1) సముద్ర మట్టాలు పెరగడం   2) వర్షపాతం తగ్గడం 3) హిమపాతం పెరగడం   4) బలమైన తుపానులు


10. హరితగృహ ప్రభావానికి ప్రధాన పరిణామం ఏమిటి?

1) ఆమ్ల వర్షాలు   2) ఓజోన్‌పొర క్షీణత    3) వాతావరణ మార్పులు      4) పైవేవీకావు


11. ఆమ్ల వర్ష  PH విలువ ఎంత?

1) 7         2) 5.5       3) 6.5      4) 8


సమాధానాలు

1-4         2-4        3-4      4-1          5-4        6-2          7-3       8-1         9-1          10-3          11-2


* కింది వాటిలో మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ దేనికి సంబంధించింది?

1) హరితగృహ వాయువులను తగ్గించడం  2) ఆమ్ల వర్షాలను తగ్గించడం          3) ఓజోన్‌ పొర క్షీణతను తగ్గించడం      4) పైవన్నీ 

జవాబు: 3

* ఆమ్ల వర్షాలు మానవ ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?

1) శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తాయి         2) చర్మ క్యాన్సర్‌కు దారితీస్తాయి     3) రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి         4) జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి

జవాబు: 2

* కింది వాటిలో ఓజోన్‌ పొర క్షీణతకు దారితీసే పదార్థం కానిదేది?

1) హాలోన్స్‌     2) కార్బన్‌ మోనాక్సైడ్‌     3) మిథైల్‌ క్లోరోఫాం          4) హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్‌లు

జవాబు: 2

Posted Date : 12-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌