• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో సమన్వయం

1. వినాళ గ్రంథులు స్రవించే కొన్ని రసాయన పదార్థాలు రక్తం ద్వారా ప్రయాణించి వివిధ జీవక్రియలను నియంత్రిస్తాయి. ఈ పదార్థాలను ఏమంటారు?
జ: హార్మోన్‌లు

 

2. కిందివాటిలో అంతరస్రావ్య వ్యవస్థలో ప్రధాన భాగాలేవి?
i) అంతరస్రావ్య గ్రంథులు       ii) హార్మోన్‌లు        iii) హృదయం
జ: i, ii

 

3. కిందివాటిలో వినాళ గ్రంథులు ఏవి?
ఎ) ఎక్సోక్రైన్‌ గ్రంథులు          బి) హెటిరోక్రైన్‌ గ్రంథులు    
సి) ఎండోక్రైన్‌ గ్రంథులు         డి) హైపర్‌ట్రోఫిక్‌ గ్రంథులు
జ: సి (ఎండోక్రైన్‌ గ్రంథులు)

 

4. అంతరస్రావ్య వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: ఎండోక్రైనాలజీ

 

5. ఎండోక్రైనాలజీ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: థామస్‌ ఎడిసన్‌

 

6. కిందివాటిలో మానవ అంతరస్రావ్య వ్యవస్థలో భాగమైన గ్రంథులు ఏవి?
i) పీనియల్‌ దేహం   ii) అవటు గ్రంథి   iii) అడ్రినల్‌ గ్రంథి  iv) హైపోథలామస్‌
జ: i, ii, iii, iv

 

7. కిందివాటిలో హార్మోన్‌లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
ఎ) పిట్యూటరీ   బి) కాలేయం  సి) క్లోమం  డి) పారాథైరాయిడ్‌
జ: బి (కాలేయం)

 

8. ‘ఎమర్జెన్సీ హార్మోన్‌’ను స్రవించే గ్రంథి ఏది?
జ: అడ్రినల్‌

 

9. పారాథైరాక్సిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధి?
జ: టెటాని

 

10. కిందివాటిలో మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్‌ ఏది?
 ఎ) ఈస్ట్రోజన్‌  బి) ప్రొజెస్టిరాన్‌   సి) టెస్టోస్టిరాన్‌  డి) థైరాక్సిన్‌
జ: డి (థైరాక్సిన్‌)

 

11. యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమయ్యే హార్మోన్‌ ఏది?
జ: టెస్టోస్టిరాన్

 

12. థైరాక్సిన్‌ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి?
జ: గాయిటర్‌

 

13. థైరాక్సిన్‌ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది?
జ: అయోడిన్‌

 

14. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్‌?
జ: ఆక్సిటోసిన్‌

 

15. మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్‌ ఏది?
జ: ఆల్డోస్టిరాన్‌

 

16. కోపం రావడానికి కారణమయ్యే హార్మోన్‌?
జ: అడ్రినలిన్‌

 

17. పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి (ఫైట్‌ అండ్‌ ఫ్లైట్‌)గా దేన్ని పిలుస్తారు?
జ: అడ్రినల్‌

 

18. మెదడులో ఉండే గ్రంథి ఏది?
జ: పిట్యూటరీ

 

19. ఎపిథలామస్‌లో భాగమైన సీనియర్‌ దేహం లేదా ఎపిఫైసిస్‌ నుంచి స్రవించే హార్మోన్‌లు?
జ: మెలటొనిన్, సెరటొనిన్‌

 

20. అంతరస్రావ్య వ్యవస్థకు, నాడీ వ్యవస్థకు ప్రధాన సంధాన సేతువులా వ్యవహరించేది ఏది?
జ: హైపోథలామస్‌

 

21. హైపోఫైసిస్‌ లేదా హైపోథలామస్‌ సెరిబ్రి అని ఏ గ్రంథిని పిలుస్తారు?
జ: పిట్యూటరీ గ్రంథి

 

22. కిందివాటిని జతపరచండి.

23. సైమండ్స్‌ వ్యాధికి కారణం?
జ: పెరుగుదల హార్మోన్‌ను అధికంగా స్రవించడం

 

24. థైరాయిడ్‌ పరీక్షలో నిర్ధారిస్తున్న T3, T4 లు అంటే
జ: ట్రై అయిడో థైరోనిన్, టెట్రా అయిడో థైరోనిన్‌

 

25. హైపర్‌ పారా థైరాయిడిజమ్‌ కిందివాటిలో దేనితో అనుసంధానమై ఉంటుంది?
i) ఆస్టియో ఫ్లోరోసిస్‌   ii) మూత్రపిండాల్లో రాళ్లు  
iii) అధికంగా దాహం వేయడం   iv) ఆస్టైటిస్‌ ఫైబ్రోసా సిస్టికా
జ: i, ii, iii, iv

 

26. కిందివాటిని జతపరచండి. 

27. స్త్రీలలో గర్భస్రావానికి ప్రధాన కారణం?
జ: ప్రొజెస్టిరాన్‌ తక్కువ స్రవించడం

 

28. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల పసిపిల్లల్లో కలిగే వ్యాధి?
జ: క్రెటినిజమ్‌

1. కిందివాటిలో అంతఃస్రావ్య గ్రంథుల వ్యవస్థకు సంబంధించి సరైనవి ఏవి?
i) అంతఃస్రావ్య గ్రంథులు స్రవించిన రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు.
ii) అంతఃస్రావ్య గ్రంథులు స్రవించిన పదార్థాలు రక్తం ద్వారా ఆయా విధులు నిర్వహించే కణాలకు రవాణా అవుతాయి.
iii) ఇవి వివిధ జీవక్రియలను ప్రభావితం చేస్తాయి.
iv) వీటి ప్రభావం సాధారణంగా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది.
1) i, ii, iii        2) ii, iii, iv       3) i, iii, iv       4) i, ii, iii, iv


2. గొంతు కింద అమరి ఉండి ‘ఆడమ్స్‌ ఆపిల్‌’గా కనిపించే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ గ్రంథి                  2) పీనియల్‌ గ్రంథి
3) థైరాయిడ్‌ లేదా అవటు గ్రంథి       4) హైపోథలామస్‌


3. మూత్రపిండాలకు పైభాగంలో అమరి ఉండే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ        2) అడ్రినల్‌       3) క్లోమం         4) అండాలు


4. క్లోమంలో ఏ రకం కణాలు ఇన్సులిన్‌  హార్మోన్‌ను స్రవిస్తాయి?
1) ఆల్ఫా లేదా A కణాలు      2) బీటా లేదా B కణాలు
3) డెల్టా లేదా D కణాలు        4) ఎప్సిలాన్‌ కణాలు


5. ఇన్సులిన్‌ హార్మోన్‌ ప్రధాన విధి ఏమిటి?
1) రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని తగ్గిస్తుంది.
2) రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది.
3) రక్తంలో గ్లూకగాన్‌ స్థాయిని తగ్గిస్తుంది. 
4) రక్తంలో గ్లూకగాన్‌ స్థాయిని పెంచుతుంది.


6. శరీరంలో దైనందిన దినచర్యను (సర్కేడియన్‌ రిథమ్‌) నియంత్రించే అంతఃస్రావ్య గ్రంథి ఏది?
1) థైమస్‌ గ్రంథి       2. పీనియల్‌ గ్రంథి     
3) పారాథైరాయిడ్‌ గ్రంథి     4) పిట్యూటరీ గ్రంథి


7. కిందివాటిలో అంతఃస్రావ్య గ్రంథి  కానిది ఏది?
1) క్లోమం              2) ముష్కాలు
3) లాలాజల గ్రంథులు     4) పార్శ్వ అవటు గ్రంథి


8. కిందివాటిలో హైపోథలామస్‌ నిర్వహించే విధులు ఏవి?
i) హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది.
ii) శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
iii) జల సమతౌల్యతను ప్రభావితం చేస్తుంది.
iv) FSH హార్మోన్‌ను స్రవిస్తుంది.
1) i, ii, iii        2) ii, iii, iv      3) i, iii, iv       4) i, ii, iii, iv


9. కిందివాటిలో నాళ, వినాళ గ్రంథి  లేదా అంతఃస్రావ్య, బహిస్రావ్య గ్రంథిగా దేన్ని పేర్కొంటారు?
1) థైరాయిడ్‌           2) థైమస్‌      3) పిట్యూటరీ        4) క్లోమం


10. BMR లేదా బేసల్‌ మెటబాలిక్‌ రేటును నియంత్రించే గ్రంథి ఏది?
1) థైరాయిడ్‌ గ్రంథి లేదా అవటు గ్రంథి
2) పారాథైరాయిడ్‌ గ్రంథి లేదా పార్శ్వ అవటు గ్రంథి
3) ముష్కాలు, అండాలు    
4) క్లోమం, పిత్తాశయం


11. రక్తంలో కాల్షియం గాఢతను నియంత్రించే గ్రంథులు ఏవి?
1) థైరాయిడ్, క్లోమం 
2) క్లోమం, పారాథైరాయిడ్‌
3) థైరాయిడ్, పారాథైరాయిడ్‌ 
4) క్లోమం, పిట్యూటరీ


12. మానవుడి శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ్య గ్రంథి ఏది?
1) కాలేయం          2) అడ్రినల్‌  
3) పారాథైరాయిడ్‌       4) థైరాయిడ్‌


13. పోరాడే లేదా పలాయనం చెందే అంతఃస్రావ్య గ్రంథి అని దేనికి పేరు?
1) అడ్రినల్‌          2) థైరాయిడ్‌   
3) బీజగ్రంథులు        4) పిట్యూటరీ


14. కిందివాటిలో మానవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు ఏవి?
i) ఈస్ట్రోజన్‌        ii) ప్రొజెస్టిరాన్‌  
iii) టెస్టోస్టిరాన్‌        iv) థైరాక్సిన్‌
1) i, ii            2) i, ii, iii 
3) i, ii, iii, iv       4) iii, iv

15. గర్భనిరోధక మాత్రల్లో ఉండే  హార్మోన్‌ ఏది?
1) ఈస్ట్రోజన్‌        2) ప్రొజెస్టిరాన్‌
3) ఆక్సిటోసిన్‌        4) గొనడోట్రోపిన్‌


16. వినాళ గ్రంథులను అవి స్రవించే హార్మోన్‌లతో సరిగా జతపరచండి.
వినాళ గ్రంథి          స్రవించే హార్మోన్‌
i) పీయూష గ్రంథి    a) అడ్రినలిన్‌
ii) ముష్కాలు           b) థైరాక్సిన్‌
iii) అవటు గ్రంథి     c) టెస్టోస్టిరాన్‌
iv) అడ్రినల్‌            d) పెరుగుదల హార్మోన్‌
                               e) అడ్రినిన్‌
1) i - c, ii - d, iii -b, iv - e 
2) i - d, ii - c, iii -b, iv - e
3) i - d, ii - c, iii -b, iv - a
4) i - c, ii - d, iii -b, iv - a

 


17. చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థలో కీలకపాత్ర పోషించే గి లింఫోసైట్‌లను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది?
1) అడ్రినల్‌         2) క్లోమం     3) థైమస్‌      4) థైరాయిడ్‌


18. కిందివాటిలో అడ్రినల్‌ గ్రంథి స్రవించే హార్మోన్లు ఏవి?
i) అడ్రినలిన్‌      ii) ఆల్డోస్టిరోన్‌      iii) కార్టిసాల్‌  
iv) DHEA డీ హైడ్రోపియాండ్రో స్టిరోన్‌ సల్ఫేట్‌
1) i, ii, iii           2)  ii, iii, iv     3) ii, iii          4) i, ii, iii, iv


19. ఏ గ్రంథి దెబ్బతినడం వల్ల గ్రేవ్స్‌ వ్యాధి  కలుగుతుంది?
1) థైరాయిడ్‌ గ్రంథి       2) పిట్యూటరీ గ్రంథి
3) అడ్రినల్‌ గ్రంథి        4) క్లోమం


20. అడ్రినల్‌ గ్రంథి స్రవించాల్సిన  హార్మోన్లు తగిన స్థాయిలో లేనప్పుడు సంభవించే వ్యాధి ఏది?
1) డయాబెటిస్‌             2) అడిసన్స్‌ వ్యాధి  
3) కుషింగ్‌ సిండ్రోమ్‌     4) హైపోథైరాయిడిజం


21. ‘మాస్టర్‌ గ్లాండ్‌’ అని ఏ గ్రంథికి పేరు?
1) అవటు గ్రంథి     2) అడ్రినల్‌ గ్రంథి
3) క్లోమం     4) పిట్యూటరీ గ్రంథి


22. నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్‌ హార్మోన్‌ను స్రవించేది ఏది?
1) అండాలు       2) అడ్రినల్‌      3) పీనియల్‌      4) థైరాయిడ్‌


23. ఆక్సిటోసిన్‌ను స్రవించే గ్రంథి ఏది?
1) పీయూష గ్రంథి పరాంత లంబిక
2) పీయూష గ్రంథి పూర్వాంత లంబిక
3) అడ్రినల్‌ గ్రంథి మధ్య భాగం
4) పారాథైరాయిడ్‌ గ్రంథి పరాంత లంబిక


24. కాల్సిటోనిన్‌ను స్రవించే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ         2) థైరాయిడ్‌  
3) పారాథైరాయిడ్‌       4) క్లోమం


25. క్లోమంలో అంతఃస్రావ్య హార్మోన్లను స్రవించే కణజాల భాగం ఏది?
1) ప్లేట్‌లెట్స్‌ ఆఫ్‌ పాంక్రియాస్‌   
2) ఐలెట్స్‌ ఆఫ్‌ లాంగర్‌హాన్స్‌
3) ఐలెట్స్‌ ఆఫ్‌ ఇన్సులిన్‌   
4) ప్లేట్‌లెట్స్‌ ఆఫ్‌ ఇన్సులిన్‌


26. కిందివాటిలో అడ్రినల్‌ కార్టెక్స్‌ లేదా వల్కలం స్రవించని హార్మోన్‌ ఏది?
1) మినరలో కార్టికాయిడ్స్‌        2) గ్లూకోకార్టికాయిడ్స్‌
3) గొనాడల్‌ హార్మోన్లు            4) అడ్రినలిన్‌


27. ఎపినెఫ్రైన్‌కు ఉన్న మరోపేరు ఏమిటి?
1) అడ్రినలిన్‌        2) నార్‌ఎడ్రినలిన్‌  
3) గ్లూకోకార్టికాయిడ్స్‌  4) గ్లూకగాన్‌


28. ఎపినెఫ్రైన్, నార్‌ఎపినెఫ్రైన్‌లను స్రవించే వినాళ గ్రంథి భాగం ఏది?
1) అడ్రినల్‌ గ్రంథి వల్కలం      2) క్లోమం 
3) అడ్రినల్‌ గ్రంథి దవ్వ   4) పీయూష గ్రంథి పరాంతం


29. కిందివాటిలో పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్‌లు ఏవి?
i) ACTH - అడ్రినోకార్టికోట్రోపిక్‌ హార్మోన్‌
ii) LGH  - హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోన్‌
iii) TSH - థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌
iv) LH  - ల్యూటినైజింగ్‌ హార్మోన్‌
1) i, ii, iii          2) ii, iii, iv
3) i, iii, iv         4) i, ii, iii, iv


30. పారాథైరాక్సిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
1) టెటనస్‌       2) టెటాని    3) క్రెటినిజం      4) గాయిటర్‌


31. థైరాక్సిన్‌ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది?
1) ఐరన్‌        2) కాల్షియం      3) పొటాషియం        4) అయోడిన్‌


32. థైరాక్సిన్‌ లోపం వల్ల మానవుల్లో  సాధారణంగా సంభవించే వ్యాధి ఏది?
1) మయోపియా      2) పాలీసిస్టిక్‌ ఓవరీ డిసీజ్‌
3) గాయిటర్‌           4) మూత్రపిండాల వ్యాధి


33. ఫోలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ ్బనీళీబ్శీ నిర్వర్తించే ప్రధాన విధి ఏమిటి?
1) రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
2) స్త్రీలలో అండ కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
3) పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తుంది.
4) ఫాటీ ఆమ్లాల జీర్ణక్రియకు సహకరిస్తుంది.


34. యుక్తవయసులో పురుషుల్లో కంఠస్వరం మారడానికి కారణమైన హార్మోన్‌ ఏది?
1) ఈస్ట్రోజన్‌        2) థైరాక్సిన్‌ 
3) టెస్టోస్టిరాన్‌      4) ప్రొజెస్టిరాన్‌


35. మానవుల్లో ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్‌ ఏది?
1) థైరో ట్రోపిన్‌         2) సొమాట్రోపిన్‌ 
3) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌     4) కార్టిసాల్‌


36. రక్తపీడనం పెరగడానికి కారణమైన హార్మోన్‌ ఏది?
1) అడ్రినో కార్టికాయిడ్‌      2) వాసోప్రెసిన్‌ 
3) ఇన్సులిన్‌       4) సొమాటోట్రోపిక్‌ హార్మోన్‌


37. పిట్యూటరీ గ్రంథి మెదడులోని ఏ భాగంలో ఉంటుంది?
1) పెద్దమెదడు లేదా సెరిబ్రం 
2) చిన్నమెదడు లేదా సెరిబెల్లం
3) మధ్య మెదడు లేదా మెడుల్లా  అబ్లాంగేటా 
4) మెడుల్లా కార్టెక్స్‌


38. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్‌ ఏది?
1) వాసోప్రెసిన్‌              2) టెస్టోస్టిరాన్‌  
3) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌      4) ఆక్సిటోసిన్‌


39. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యానికి కారణమైన వినాళగ్రంథి స్రావకం ఏది?
1) అడ్రినలిన్‌        2) ఆక్సిటోసిన్‌     3) థైరాక్సిన్‌       4) పారాథార్మోన్‌


40. ఏ హార్మోన్‌ లోపం వల్ల ‘మిక్సొడిమా’ వ్యాధి వస్తుంది?
1) ఆక్సిటోసిన్‌        2) పారాథార్మోన్‌     3) అడ్రినలిన్‌      4) థైరాక్సిన్‌


41. కిందివాటిలో దేన్ని బాలగ్రంథి అని  పిలుస్తారు?
1) థైరాయిడ్‌        2) థైమస్‌      3) అడ్రినలిన్‌       4) పిట్యూటరీ


42. థైమస్‌ గ్రంథి మానవుడిలోని ఏ భాగంలో ఉంటుంది?
1) మూత్రపిండాల పైన 
2) మెదడు మధ్య భాగంలో
3) గుండె సమీపంలో  
4) గొంతు పైభాగంలో


43. కాల్సిటోనిన్‌ హార్మోన్‌ నిర్వర్తించే ప్రధాన విధి ఏమిటి?
1) రక్తంలో కాల్షియం గాఢతను తగ్గిస్తుంది.
2) రక్తంలో కాల్షియం గాఢతను పెంచుతుంది.
3) రక్తంలో సోడియం గాఢతను తగ్గిస్తుంది.
4) రక్తంలో సోడియం గాఢతను పెంచుతుంది.


44. కాలేయంలో గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తూ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని పెంచడానికి సహకరించే హార్మోన్‌ ఏది?
1) కాల్సిటోనిన్‌        2) ఇన్సులిన్‌      3) గ్లూకగాన్‌        5) థైరాక్సిన్‌


45. కిందివాటిలో వినాళగ్రంథుల స్రావకాలు రసాయనికంగా  ఏవి?
i) ఎమైన్‌లు      ii) ప్రోటీన్‌లు, పెప్టైడ్‌లు      iii) స్టెరాయిడ్‌లు
1) i, ii      2) i, ii, iii     3) ii, iii     4) ii


సమాధానాలు:  1-4; 2-3; 3-2; 4-2; 5-1; 6-2; 7-3; 8-1; 9-4; 10-1; 11-3; 12-4; 13-1; 14-2; 15-2; 16-3; 17-3; 18-4; 19-1; 20-2; 21-4; 22-3; 23-1; 24-2; 25-2; 26-4; 27-1; 28-3; 29-4; 30-2; 31-4; 32-3; 33-2; 34-3; 35-2; 36-2; 37-1; 38-4; 39-3; 40-4; 41-2; 42-3; 43-1; 44-3; 45-2. 

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌