• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రాలో సాంస్కృతిక వికాసం - వ్యవహారిక భాషోద్యమం

1. కందుకూరి వీరేశలింగం ఎక్కడ జన్మించారు? 

ఎ) కాకినాడ     

బి) ఏలూరు 

సి) బందరు     

డి) రాజమండ్రి

2. వీరేశలింగం పంతులుకు సంస్కృతం నేర్పిన గురువు? 

ఎ) దూసి సోమయాజులు 

బి) వాలెస్‌దొర  

సి) బసవరాజు   

డి) పైడి రామకృష్ణయ్య

3. సంఘసంస్కరణ సమాజాన్ని స్థాపించింది ఎవరు?

ఎ) వీరాస్వామి 

బి) రఘుపతి వెంకటరత్నం 

సి) కందుకూరి వీరేశలింగం  

డి) ఎవరూ కాదు

4. సంఘసంస్కరణ సమాజాన్ని ఎక్కడ స్థాపించారు? 

ఎ) రాజమండ్రి     

బి) కాకినాడ 

సి) ఏలూరు       

డి) తిరువూరు

5. మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని వీరేశలింగం ఎప్పుడు జరిపించారు?

ఎ) 1882 డిసెంబరు 12   

బి) 1881 డిసెంబరు 11 

సి) 1883 డిసెంబరు 11 

డి) 1884 డిసెంబరు 11

6. మొట్టమొదటి వితంతు పునర్వివాహానికి వీరేశలింగానికి ఆర్థిక సాయం చేసినవారు? 

ఎ) పైడి రామకృష్ణయ్య   

బి) దూసి సోమయాజులు 

సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌   

డి) అప్పారావు

7. ధవళేశ్వరంలో బాలికా పాఠశాలను వీరేశలింగం ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 

ఎ) 1873     బి) 1874 

సి) 1875     డి) 1876

8. వివేకవర్ధిని, సతీహితబోధిని అనే పత్రికలు ఎవరివి?

ఎ) రఘుపతి వెంకటరత్నం  

బి) రామస్వామి       

సి) రావ్‌బహదూర్‌  

డి) కందుకూరి వీరేశలింగం

9. ధవళేశ్వరం బాలికల పాఠశాలకు మొదటి ప్రధానోపాధ్యాయుడు ఎవరు? 

ఎ) ఆత్మూరి లక్ష్మీనరసింహం 

బి) కందుకూరి వీరేశలింగం 

సి) మల్లాది అచ్చన్నశాస్త్రి  

డి) గవర్రాజు

10. కిందివారిలో ‘గద్యతిక్కన’ అనే బిరుదు ఎవరికి ఉంది?

ఎ) రఘుపతి వెంకటరత్నం 

బి) కందుకూరి వీరేశలింగం  

సి) వీరస్వామి  

డి) సామినేని ముద్దు నరసింహం

11. హితకారిణి అనే ధర్మసంస్థను స్థాపించింది ఎవరు?

ఎ) కందుకూరి వీరేశలింగం 

బి) రఘుపతి వెంకట‌రత్నం

సి) గిడుగు రామ్మూర్తి   

డి) చిలకమర్తి లక్ష్మీనరసింహం

12. వివేకవర్ధిని పత్రిక శాశ్వత చందాదారుడిగా చేరిన మొదటి ఆంగ్లేయుడు?

 ఎ) సి.పి.బ్రౌన్‌       

బి) వాలెస్‌దొర  

 సి) ఇ.పి.మెట్కాఫ్‌  

డి) లార్డ్‌ కర్జన్‌

13. హాస్యసంజీవని అనే పత్రికను స్థాపించింది?

ఎ) దేశిరాజు పెదబాపయ్య  

బి) వేమూరి రామకృష్ణారావు 

సి) రఘుపతి వెంకటరత్నం  

డి) వీరేశలింగం

14. వీరేశలింగం పంతులు ‘టౌన్‌హాలును’ ఎక్కడ నిర్మించారు?

ఎ) రాజమండ్రి   

బి) ఏలూరు 

సి) కాకినాడ    

డి) విజయనగరం

15. ‘ఆంధ్రభాషా సంజీవని’ అనే పత్రికను ప్రారంభించింది ఎవరు? 

ఎ) కందుకూరి వీరేశలింగం  

బి) కొక్కొండ వెంకటరత్నం పంతులు 

సి) గురజాడ       

డి) శ్రీశ్రీ

16. ‘రాజశేఖర చరిత్ర’ నవలకు ప్రేరణనిచ్చిన ఆంగ్ల నవల ఏది?

ఎ) వికార్‌-ఆఫ్‌-వేక్‌ఫీల్డ్‌ 

బి) కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌

సి) డోరివల్స్‌    

డి) గలివర్‌ ట్రావెల్స్‌

17. వీరేశలింగం ఎక్కడ మరణించారు? 

ఎ) కాకినాడ   

బి) ఏలూరు

సి) రాజమండ్రి   

డి) శ్రీకాకుళం

18. వీరేశలింగం పంతులుకు ‘దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు’ అనే బిరుదును ఎవరు ఇచ్చారు?

ఎ) రాజా రామ్‌ మోహన్‌ రాయ్‌ 

బి) ఎం.జి.రనడే 

సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ 

డి) కేశవ చంద్రసేన్‌

19. తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటారు?

ఎ) రఘుపతి వెంకటరత్నం నాయుడు  

బి) వీరేశలింగం 

సి) సామినేని ముద్దునరసింహం 

డి) ఉన్నవ లక్ష్మీనారాయణ

20. వెంకటరత్నం నాయుడు బ్రహ్మసమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు?

ఎ) కందుకూరి వీరేశలింగం   

బి) పండిత శివనాథశాస్త్రి 

సి) దేశిరాజు పెదబాపయ్య   

డి) వావిళ్ల రామస్వామి


21. ‘సాంఘిక సంస్కరణ’ అనే గ్రంథ రచయిత ఎవరు?

ఎ) దేశిరాజు పెదబాపయ్య   

బి) వేమూరి రామకృష్ణ  

సి) రఘుపతి వెంకటరత్నం నాయుడు   

డి) ఆచార్య రామకృష్ణ


22. ‘Voice of truth’ అనే పత్రికను ప్రచురించింది ఎవరు?

ఎ) వీరేశలింగం 

బి) దేశిరాజు పెదబాపయ్య 

సి) వేమూరి రామకృష్ణ  

డి) అనంత రామశాస్త్రి


23. ‘Voice of India’ పత్రిక ఎక్కడ నుంచి వెలువడింది? 

ఎ) జపాన్‌    బి) జర్మనీ 

సి) లండన్‌  డి) రష్యా


24. ‘Voice of India’ అనే పత్రికను ప్రచురించినవారు?

ఎ) అఘోరనాథ ఛటోపాధ్యాయ   

బి) డాక్టర్‌ మిల్లర్‌ 

సి) దాదాబాయ్‌ నౌరోజీ  

డి) దేశిరాజు పెదబాపయ్య

25. ‘First printing press in Telugu’ గా దేనికి గుర్తింపు లభించింది?

ఎ) హిందూ భాషా సంజీవని 

బి) తెలుగు సంజీవని

సి) హాస్య భాషా సంజీవని 

డి) బ్రహ్మమందిర ప్రెస్‌

26. ‘ది గ్రేట్‌ ప్రైమర్‌’ అనే టైప్‌ రైటింగ్‌ని రూపొందించినవారు?

ఎ) సి.పి.బ్రౌన్‌   

బి) వావిళ్ల రామస్వామి శాస్త్రులు

సి) శ్రీశ్రీ        

డి) అనంత రామశాస్త్రి

27. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎక్కడ జన్మించారు?

ఎ) తెనాలి        బి) ఏలూరు 

సి) రాజమండ్రి   డి) మచిలీపట్నం

28. ‘వేదనివాసం’ ఎవరి గృహం?

ఎ) కొమర్రాజు లక్ష్మణరావు 

బి) ఏనుగుల వీరాస్వామి 

సి) వీరేశలింగం పంతులు 

డి) రఘుపతి వెంకటరత్నం నాయుడు


29. ఆంధ్రాలో మొదటి సాంఘిక వచన నాటకం ఏది?

ఎ) సౌందర్య తిలకం

బి) రాజస్థాన్‌ కథాకళి

సి) కన్యాశుల్కం     

డి) సీతాకల్యాణం


30. కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు?

ఎ) చిలకమర్తి లక్ష్మీనరసింహం 

బి) గురజాడ అప్పారావు 

సి) త్రిపురనేని రామస్వామి

డి) లక్ష్మణరావు

31. కన్యాశుల్కం నాటకాన్ని  ఎవరికి  అంకిత మిచ్చారు?

ఎ) కట్టమంచి రామలింగారెడ్డి 

బి) అబ్బూరు రామకృష్ణారావు

సి) ఆనంద గజపతి      

డి) పిఠాపురం రాజా


32. కన్యాశుల్కం నాటకాన్ని మొదట ప్రదర్శించిన సంస్థ?

ఎ) ఆంధ్రా సాహిత్య పరిషత్‌ 

బి) విజ్ఞాన చంద్రికా మండలి

సి) జగన్నాథ విలాసిని సంస్థ 

డి) మద్రాస్‌ మహాజన సభ


33. తెలుగు సాహిత్యంలో ముత్యాల సరాలు అనే నూతన ఛందస్సును ప్రవేశపెట్టింది? 

ఎ) కందుకూరి వీరేశలింగం  

బి) శ్రీశ్రీ 

సి) చిలకమర్తి లక్ష్మీనరసింహం 

డి) గురజాడ అప్పారావు


34. ‘దేశమాత’ అనే పత్రికను నడిపింది? 

ఎ) చిలకమర్తి లక్ష్మీనరసింహం 

బి) కందకూరి వీరేశలింగం

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ     

డి) శ్రీశ్రీ


35. గయోపాఖ్యానం అనే నాటక రచయిత ఎవరు?

ఎ) త్రిపురనేని రామస్వామి చౌదరి      

బి) చిలకమర్తి లక్ష్మీనరసింహం 

సి) కందుకూరి వీరేశలింగం 

డి) గురజాడ అప్పారావు


36. ‘భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’’ అనే గీతాన్ని రచించింది ఎవరు? 

ఎ) గురజాడ అప్పారావు 

బి) కొమర్రాజు వెంకటలక్ష్మణరావు 

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ 

డి) చిలకమర్తి లక్ష్మీనరసింహం


37. ‘సూతాశ్రమం’ అనే గృహం ఎవరిది? 

ఎ) త్రిపురనేని రామస్వామి చౌదరి       

బి) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ            

డి) బసవరాజు అప్పారావు


38. ‘అసమర్థుని జీవయాత్ర’ అనే నవలను రచించింది ఎవరు? 

ఎ) త్రిపురనేని రామస్వామి చౌదరి   

బి) గిడుగు వెంకట రామ్మూర్తి 

సి) త్రిపురనేని గోపీచంద్‌          

డి) జయంతి రామయ్య పంతులు


39. తెలుగులో మొట్టమొదటి ‘విజ్ఞాన సర్వస్వం’ను రచించింది?

ఎ) ఉన్నవ లక్ష్మీనారాయణ      

బి) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

సి) కొండా వెంకటప్పయ్య       

డి) నండూరి వెంకట సుబ్బారావు


40. ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’ను మొదట ఎక్కడ స్థాపించారు?

ఎ) హైదారాబాద్‌    బి) చెన్నై 

సి) విజయవాడ  డి) రాజమండ్రి

41. విజ్ఞానచంద్రికా మండలి (1906) ప్రచురించిన మొదటి పుస్తకం?

ఎ) మాలపల్లి 

బి) అబ్రహం లింకన్‌ చరిత్ర 

సి) కన్యాశుల్కం     

డి) మృచ్ఛకటికం


42. ఆంధ్ర పరిశోధనా మండలి స్థాపకులు? 

ఎ) ఆదిరాజు వీరభద్రరావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు

బి) చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం

డి) కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు


43. ‘డచ్‌ రిపబ్లిక్‌’ అనే గ్రంథ రచయిత?

ఎ) కొండా వెంకటప్పయ్య 

బి) ఉన్నవ లక్ష్మీనారాయణ

సి) జయంతి రామయ్య పంతులు 

డి) బసవరాజు అప్పారావు


44. కిందివారిలో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన తెలుగు వ్యక్తి ఎవరు?

ఎ) ఉన్నవ లక్ష్మీనారాయణ 

బి) నండూరి వెంకటసుబ్బారావు

సి) బసవరాజు అప్పారావు 

డి) కొండా వెంకటప్పయ్య


45. మాలపల్లి నవలా రచయిత ఎవరు? 

ఎ) గురజాడ అప్పారావు     

బి) శ్రీశ్రీ

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ 

డి) చిలకమర్తి లక్ష్మీనరసింహం


46. విశాలాంధ్ర పటాన్ని తయారుచేసింది?

ఎ) ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం

బి) నండూరి వెంకటసుబ్బారావు, బసవరాజు

సి) జయంతి రామయ్య పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు

డి) వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణ


47. ‘దేశభక్త’ అనే బిరుదు ఎవరిది?

ఎ) కొండా వెంకటప్పయ్య 

బి) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

సి) ఉన్నవ లక్ష్మీనారాయణ    

డి) శ్రీశ్రీ 

సమాధానాలు

1-డి, 2-ఎ, 3-సి, 4-ఎ, 5-బి, 6-ఎ, 7-డి, 8-డి, 9-సి, 10-బి, 11-ఎ, 12-సి, 13-డి, 14-ఎ, 15-బి, 16-ఎ, 17-సి, 18-బి, 19-బి, 20-బి, 21-సి, 22-బి, 23-సి, 24-సి, 25-ఎ, 26-బి, 27-డి, 28-ఎ, 29-సి, 30-బి, 31-సి, 32-సి, 33-డి, 34-ఎ, 35-బి, 36-డి, 37-ఎ, 38-సి, 39-బి, 40-ఎ, 41-బి, 42-డి, 43-ఎ, 44-డి, 45-సి, 46-ఎ, 47-ఎ.


రచయిత: డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 05-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌