• facebook
  • whatsapp
  • telegram

చక్రవాతాలు

1. ఒక చదరపు సెంటీమీటర్‌పై ఒక గ్రామ్ బరువును ఏమంటారు?
జ: మిల్లీబార్

2. సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత?
జ: 1013.25 మిల్లీబార్

3. ప్రమాణ క్షితిజసమాంతర దూరంలో పీడనంలో వచ్చే మార్పు రేటును ఏమంటారు?
జ: పీడన ప్రవణత

4. అశ్వ అక్షాంశాలు ఏవి?
జ: 25º - 30º

5. భూమధ్యరేఖపై సూర్యకిరణాలు లంబంగా ప్రసరించే విషవత్తుల సమయం ఏది?
జ: మార్చి 21, సెప్టెంబరు 22

6. 'పాము చుట్ట' ఆకారంలో సంభవించే విక్షోభం ఏది?
జ: చక్రవాతం

7. ప్రపంచంలో సగటున ఎక్కువ చక్రవాతాలు సంభవించే ప్రాంతం ఏది?
జ: వాయవ్య పసిఫిక్ మహాసముద్రం

8. పిచ్చివాని ప్రవర్తనను పోలి ఉండే ప్రకృతి వైపరీత్యం ఏది?
జ: చక్రవాతాలు

9. శీతల వాయువు, ఉష్ణ వాయువుల మధ్య ఉన్న సరిహద్దుకు ఏమని పేరు?
జ: వాతాగ్రం

10. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులపాటు కదలకుండా స్థిరంగా ఉండే వాతాగ్రాన్ని ఏమంటారు?
జ: స్థిర వాతాగ్రం

11. వాతాగ్రం సందర్భంగా విభిన్న రాశుల మధ్య వ్యత్యాసం ఎందులో కనిపిస్తుంది?
      1) ఉష్ణోగ్రత       2) పీడనం       3) పవన వ్యవస్థ       4) అన్నీ
జ: 4 (అన్నీ)

12. తుపాను కుటుంబాలు కలిగిన చక్రవాతాలు ఏవి?
జ: సమశీతోష్ణ మండల చక్రవాతం

13. వాతావరణంలో విక్షోభాలు ఉన్నప్పుడు గర్జన మేఘాలుగా మారి, భయంకర కల్లోలానికి కారణమయ్యే మేఘాలు ఏవి?
జ: క్యుములస్

14. 'గుర్రంతోక మేఘాలు'గా వేటిని పిలుస్తారు?
జ: సిర్రస్

15. ఏ మేఘాలను మేఘాల రాజుగా గుర్తించారు?
      1) సిర్రో క్యుములస్       2) నింబోస్ట్రాటస్       3) క్యుములస్       4) క్యుములోనింబస్
జ: 4 (క్యుములోనింబస్)

Posted Date : 26-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌