• facebook
  • whatsapp
  • telegram

జైనమతం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అజీవక శాఖకు నాయకుడు ఎవరు?
జ: గోసాల మస్కరిపుత్ర

 

2. జైనుల 22 వ తీర్థంకరుడు ఎవరు?
జ: అరిష్టనేమి

 

3. జైన తీర్థంకరులందరూ ఏ వంశానికి చెందిన వారు?
జ: క్షత్రియ

 

4. వర్థమానుడు ఎక్కడ జన్మించాడు?
జ: కుంద గ్రామం

 

5. మహావీరుడు చెప్పిన దిగంబరత్వాన్ని పాటించాలని కోరిన జైనమత గురువు ఎవరు?
జ: భద్రబాహు

 

6. మొదటి జైనమత కౌన్సిల్ ఎక్కడ జరిగింది?
జ: పాటలీపుత్రం

 

7. రెండో జైన కౌన్సిల్‌కు అధ్యక్షుడు ఎవరు?
జ: దేవర్ది క్సమశ్రమణ

 

8. దక్షిణ భారతదేశంలో జైనుల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: శ్రావణ బెళగొల

 

9. కిందివాటిలో దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని పోషించని రాజవంశం ఏది?
      ఎ) కదంబులు       బి) చాళుక్యులు      సి) రాష్ట్రకూటులు       డి) పల్లవులు
జ: డి (పల్లవులు)

 

10. 'త్రిషష్టి సలక పురుష చరిత' అనే గ్రంథాన్ని రచించిన జైన పండితుడు ఎవరు?
జ: హేమచంద్రుడు

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జైళ్లలో దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా 63 రోజులపాటు నిరాహారదీక్ష చేసి మరణించిన వ్యక్తి?
జ: జతిన్‌దాస్

 

2. రైతులు విదేశీ పాలన నుంచే కాక భూస్వాములు, పెట్టుబడిదారుల పాలన నుంచీ విముక్తి పొందాలన్న వ్యక్తి?
జ: భగత్‌సింగ్

 

3. అఖిల భారత కిసాన్ సభ మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ: స్వామి సహజానంద సరస్వతి

 

4. క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది?
జ: 1942 మార్చి

 

5. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసిన మొదటి మహిళ?
జ: కాదంబిని గంగూలీ

 

6. 'వీపుమీద కొట్టమని ప్రార్థించండి, పొట్టమీద కొట్టొద్దని చెప్పండి' అని పేర్కొన్నది?
జ: దాదాబాయి నౌరోజీ

 

7. 1907 లో లండన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో సర్ కర్జన్ విల్లీని కాల్చి చంపిన వ్యక్తి?
జ: మదన్‌లాల్ డింగ్రా

 

8. ''విభజించి, భారతదేశాన్ని విడిచి వెళ్లు" అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ?
జ: ముస్లింలీగ్

 

9. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నాటి భారత వైస్రాయ్?
జ: వేవెల్

 

10. స్వతంత్ర పార్టీ స్థాపకుడు ఎవరు?
జ: సి. రాజగోపాలాచారి

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

మాదిరి ప్రశ్నలు


1. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకుడు కానిదెవరు?
  ఎ) ఆనందాచార్యులు బి) ఫిరోజ్ షా మెహతా  సి) కె.టి. తెలాంగ్ డి) బద్రుద్దీన్ త్యాబ్జీ
జ: ఆనందాచార్యులు

 

2. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరును ప్రతిపాదించింది ఎవరు?
జ: దాదాబాయి నౌరోజీ

 

3. జాతీయతా భావాలను ప్రచారం చేయడం నేరమని చట్టం రూపొందించిన సంవత్సరం?
జ: 1898

 

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు భారత వైస్రాయి ఎవరు?
జ: లార్డ్ డఫ్రిన్

 

5. 1885 లో కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలోని ఏ ప్రదేశంలో జరిగింది?
జ: తేజ్‌పాల్ సంస్కృత పాఠశాల

 

6. ముస్లింలీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1906

 

7. భారత జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశం జరిగిన ప్రదేశం?
జ: కలకత్తా

 

8. కిందివారిలో మితవాద నాయకుడు కానిదెవరు?
ఎ) ఫిరోజ్ షా మెహతా బి) తిలక్   సి) ఆనందమోహన్ బోస్ డి) ఎస్.ఎన్. బెనర్జీ
జ: తిలక్

 

9. కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య?
జ: 72

 

10. మొదటిసారి కాంగ్రెస్ తరపున స్వపరిపాలన కోసం డిమాండ్ చేసిన వ్యక్తి?
జ: గోపాలకృష్ణ గోఖలే

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమ చరిత్ర

మాదిరి ప్రశ్నలు


1. ఇంగ్లండ్‌ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

2. ‘ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌’ గ్రంథ రచయిత
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

3. 1905లో సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

4. ‘1892 చట్టం భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించినవారు?
జ: ఫిరోజ్‌షా మెహతా

 

5. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యురాలైన తొలి మహిళా పట్టభద్రురాలు
జ: కాదంబిని గంగూలీ

 

6. భారతదేశంలో ఆంగ్ల వ్యయం తగ్గింపు అంశంపై నియమించిన కమిషన్‌?
జ: వెల్సీ

 

7. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘ప్రజారాశిలో ఒక నలుసు’ అని ఎవరు విమర్శించారు?
జ: లార్డ్‌ డప్రిన్‌

 

8. భారత జాతీయ కాంగ్రెస్‌కు కార్యదర్శిగా పనిచేసిన తొలి వ్యక్తి?
జ: ఎ.ఒ. హ్యూమ్‌

 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1929 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
సమాధానం: జవహర్‌లాల్ నెహ్రూ

 

2. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
సమాధానం: మార్చి 12, 1930

 

3. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: సి. రాజగోపాలాచారి

 

4. ఈశాన్య రాష్ట్రాల్లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: రాణి గైడిన్ ల్యూ

 

5. ఖుదై ఖిద్మత్ గార్స్ దళాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
సమాధానం: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

 

6. ఢాకాలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏయే వర్గాలు పాల్గొన్నాయి?
సమాధానం: ముస్లిం నాయకులు, బలహీనవర్గాలు

 

7. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నాయకుడు ఎవరు?
సమాధానం: తేజ్ బహదూర్ సప్రూ

 

8. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
సమాధానం: సుభాష్‌చంద్ర బోస్

 

9. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు?
సమాధానం: మెక్ డొనాల్డ్

 

10. గాంధీజీ, అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు?
సమాధానం: మదన్ మోహన్ మాలవీయ

 

11. గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చింది ఎవరు?
సమాధానం: రవీంద్రనాథ్ ఠాగూర్

 

12. దండి సత్యాగ్రహంతో సంబంధం ఉన్న దండి గ్రామం గుజరాత్‌లోని ఏ జిల్లాలో ఉంది?
సమాధానం: నౌసారి

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం - తొలి రాజకీయ సంస్థలు

మాదిరి ప్రశ్నలు


1. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘‘అల్ప సంఖ్యాకుల సంస్థ, ప్రజారాశిలో ఒక నలుసు’’ అని వ్యాఖ్యానించింది?
జ: లార్డ్‌ ఢప్రిన్‌ 

 

2. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ?
జ: అనిబిసెంటు

 

3. భారతదేశంలో తొలి రాజకీయ సంస్థగా పేరొందింది?
జ: బెంగాల్‌ భూస్వాముల సంఘం

 

4. లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపకులు?
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

5. పుణె సార్వజనిక సభను ఎప్పుడు స్థాపించారు?
జ: 1870

 

6. 1876 నాటి ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపనలో సురేంద్రనాథ్‌ బెనర్జీకి సహాయపడింది?
జ: ఆనంద్‌మోహన్‌ బోస్‌

 

7. భారతదేశంలో రాజకీయ చైతన్యానికి, సంస్కరణలకు కృషి చేసిన తొలివ్యక్తి?
జ: రాజా రామ్మోహన్‌రాయ్‌

 

రచయిత: బొత్స నాగరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతివాద యుగం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను' అని ప్రకటించిందెవరు?
జ:  బాలగంగాధర తిలక్

 

2. భారత అధికార రహస్యాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ:  1904

 

3. బెంగాల్ విభజనను రద్దు చేసిన సంవత్సరమేది?
జ:  1911

 

4. బాలగంగాధర తిలక్ 1893లో ఏ ఉత్సవం ప్రారంభించారు?
జ:  గణపతి ఉత్సవం

 

5. తిలక్ 'శివాజీ ఉత్సవా'న్ని ఎప్పడు ప్రారంభించారు?
జ:  1895

 

6. అతివాద యుగ ఆవిర్భవానికి ఏ దేశ విప్లవ ఉద్యమం కారణం కాదు?
జ:  జపాన్

 

7. తిలక్ ఏ భాషలో 'కేసరి' పత్రికను ప్రచురించారు?
జ:  మరాఠీ

 

8. వందేమాతరం ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి -
జ:  బాలగంగాధర తిలక్

 

9. 'అన్‌హ్యాపీ ఇండియా' పుస్తక రచయిత -
జ:  లాలా లజపతిరాయ్

 

10. ట్రిబ్యూన్, న్యూ ఇండియా పత్రికల స్థాపకుడు -
జ:  బిపిన్ చంద్రపాల్

 

11. బెంగాల్ జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తి-
జ:  అరబిందో ఘోష్

 

12. లాలా లజపతిరాయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
జ:  పంజాబ్

 

13. బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ:  1905 అక్టోబరు 16

 

14. 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే పేరుతో వ్యాసాలు రాసిందెవరు?
జ:  అరబిందోఘోష్

 

15. 'ఆనంద మఠం' గ్రంథ రచయిత-
జ:  బంకించంద్ర ఛటర్జీ

 

16. 1906లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడెవరు?
జ:  దాదాబాయి నౌరోజీ

 

17. 'అమర్ సోనార్ బంగ్లా' గీత రచయిత -
జ:  రవీంద్రనాథ ఠాగూర్

 

18. వందేమాతర ఉద్యమం ప్రారంభం నాటి భారతరాజ్య కార్యదర్శి -
జ:  మోర్లే

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. బెంగాల్‌ సోక్రటీస్‌గా పేరు పొందిన వ్యక్తి?
జ: హెన్రీ డిరోజియో
 

2. భారతదేశంలో తొలి రాజకీయ సంస్థగా పేరు పొందింది?
జ: బెంగాల్‌ భూస్వాముల సంఘం (1838)

 

3. ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపనలో సురేంద్రనాథ్‌ బెనర్జీకి సహాయ చేసినవారు?
జ: ఆనంద్‌ మోహన్‌ బోస్‌

 

4. ‘ఆధునిక జాతీయతాభావ పితామహుడు’గా పేరు పొందింది?
జ: స్వామి వివేకానంద

 

5. 1883లో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసింది?
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

6. భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘అల్ప సంఖ్యాక వర్గాల సంస్థ’ అని వ్యాఖ్యానించినవారు?
జ: డఫ్రిన్‌

 

7. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ?
జ: అనిబిసెంట్‌

 

8. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడు ఎవరు?
జ: ఎ.ఒ.హ్యూమ్‌

 

9. భారత జాతీయ కాంగ్రెస్‌లో మితవాదులకు నాయకుడు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

10. ‘ఎ నేషన్‌ ఇన్‌ ద మేకింగ్‌’ గ్రంథ రచయిత?
జ: సురేంద్రనాథ్‌ బెనర్జీ

 

11. 1895లో ఆంగ్ల ప్రభుత్వం సైనిక వ్యయం తగ్గింపు విషయంపై నియమించిన కమిటీ ఏది?
జ: వెల్సీ కమిటీ

 

12. ఇంగ్లండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు?
జ: దాదాభాయ్‌ నౌరోజీ

 

13. మితవాదులు ఏ చట్టాన్ని ‘ఆంగ్లేయులు నవ్వుతూ చేసిన మోసం’ అని విమర్శించారు?
జ: 1892 చట్టం

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన

         భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు అనేక రాజకీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. అయితే వీటిలో ప్రధానమైంది 1876లో కలకత్తాలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్. ఇది సివిల్ సర్వీస్ వ్యవస్థలో సంస్కరణలు, కౌలుదారుల హక్కుల రక్షణ, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల హక్కులు మొదలైన విషయాలపై పోరాడింది. బెంగాల్‌లోని గ్రామాలు, పట్టణాల్లో, బెంగాల్ రాష్ట్రం బయట అనేక నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త సంస్థగా ఎదగడానికి 1883, 1885లో రెండు జాతీయ సమావేశాలను కూడా నిర్వహించింది.
 

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
 

     భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందున్న సంస్థలన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఏర్పడినవే. అవన్నీ ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, స్థానిక సమస్యల పట్ల దృష్టి సారించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కొందరు జాతీయ నాయకులు గుర్తించారు. దీంతో దూరదృష్టి కలిగిన రాజకీయవేత్తలు దేశవ్యాప్త సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు.
 

* పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ అలాంటి సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు వారంతా ఆయనకు తమ సహకారాన్ని అందించారు. 1883 లో కలకత్తా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు రాసిన బహిరంగ లేఖలో హ్యూమ్ అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.

* 1885 లో భారత జాతీయ యూనియన్ అనే సంస్థను ఏర్పాటు చేసి మూడు ప్రెసిడెన్సీలలో పర్యటించాడు. అదే ఏడాది డిసెంబరులో పూనాలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పూనాలో కలరా వ్యాధి వ్యాపించడంతో సమావేశ వేదికను బొంబాయిలోని తేజ్‌పాల్ సంస్కృత పాఠశాలకు మార్చాల్సి వచ్చింది.
 

* దాదాబాయి నౌరోజీ సూచన మేరకు 'భారత జాతీయ యూనియన్‌'లో యూనియన్‌ను తొలగించి దాని స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చారు.

* కాంగ్రెస్ మొదటి సమావేశం డిసెంబరు 28 న బొంబాయిలో ఉమేశ్‌చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి సమావేశానికి బెంగాల్ నాయకులను దూరంగా ఉంచారు.

*  కాంగ్రెస్ రెండో సమావేశం 1886 లో కలకత్తాలో జరిగింది. 436 మంది ప్రతినిధులు హాజరైన ఈ సభకు దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించారు.

* మూడో సమావేశం 1887 లో మద్రాసులో జరిగింది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించారు. నాలుగో సమావేశం 1888 లో అలహాబాద్‌లో జరిగింది. దీనికి జార్జి యూల్ అధ్యక్షత వహించి, ఆ బాధ్యత చేపట్టిన తొలి విదేశీయుడయ్యారు.

* భారత జాతీయ ఉద్యమం మూడు దశల్లో సాగింది.
1. మితవాద యుగం (క్రీ.శ. 1885 - 1905)
2. అతివాద యుగం (క్రీ.శ. 1905 - 1919)
3. గాంధీయుగం (క్రీ.శ. 1919 - 1947)

మితవాద యుగం
 

      కాంగ్రెస్ మొదట్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శిస్తూ, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ తీర్మానాలు చేసింది. ఏటా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. కాంగ్రెస్ చేపట్టిన మితవాద చర్యల వల్ల ఈ కాలాన్ని మితవాద యుగంగా పిలిచారు. కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా భావించింది. దీంతో 19 వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు వచ్చింది.
 

* ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో మితవాద జాతీయ నాయకులు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోలాగా భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే స్వపరిపాలనకు అనుమతించాలని కోరారు. మొదటిసారిగా 1905 లో గోపాలకృష్ణ గోఖలే, 1906 లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ తరపున ఈ డిమాండ్ చేశారు.
 మితవాద నాయకుల్లో ముఖ్యులు: దాదాబాయి నౌరోజీ, మహదేవ గోవింద రనడే, సురేంద్రనాధ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్‌త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, దీన్ షా వాచా, రాస్ బిహారి ఘోష్, ఆనందమోహన్ బోస్, రమేష్ చంద్రదత్, కె.టి. తెలాంగ్, ఎ.సి. మజుందార్, సుబ్రమణ్య అయ్యర్, ఆనందాచార్యులు, విలియం వెడ్డర్ బర్న్, హెన్రీ కాటన్ మొదలైనవారు.
 

ప్రధానమైన డిమాండ్లు:
 

* భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తూ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌ను విస్తరించడం
* ఉప్పు మీద పన్నును, రక్షణ బడ్జెట్‌ను తగ్గించడం
* భారత వస్త్ర పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడం
* ఆంగ్లేయ అధికారుల స్థానంలో భారతీయ అధికారులను నియమించడం
* భారతీయ పత్రికలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం
* పోలీసు శాఖలో సంస్కరణలను ప్రవేశపెట్టడం
* భూస్వాముల అరాచకాల నుంచి రైతులకు రక్షణ కల్పించడం
* పోటీ పరీక్షలను భారతదేశంలోనూ నిర్వహించడం
* కరవు కాటకాలు సంభవించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం
* రైతులకు రుణ సౌకర్యాలు కల్పించడం
* న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం
* మన దేశం నుంచి ఇంగ్లండ్‌కి సంపద తరలింపును ఆపడం
* భారతదేశంలో సాంకేతిక, పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయడం, మొదలైనవి.

 

మితవాదుల విధానాలు
 

మితవాదుల విధానాలను రాజ్యాంగబద్ధమైన పోరాటంగా పేర్కొనవచ్చు. వారు సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు, తీర్మానాలు చేయడానికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మాత్రమే విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. వారు తమ రాజకీయ కార్యకలాపాలను విద్యావంతులకే పరిమితం చేసి సామాన్య ప్రజలు జాతీయ ఉద్యమంలో పాలుపంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. మితవాద నాయకులు రాజకీయ హక్కులు, స్వయంపాలనను క్రమంగా సాధించాలనుకున్నారే గానీ వెంటనే కావాలని కోరలేదు.
 

విజయాలు
 

* ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించడం
* జాతి, మత, కుల, ప్రాంతీయ సంకుచిత భావాలను తొలగించి ప్రజాస్వామ్య, జాతీయ భావాలను ప్రచారం చేయడం.
* బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానాలతో భారతదేశ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం. ఉదా: దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సంపద తరలింపు సిద్ధాంతం.
* భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం మరింత ఉద్ధృతం కావడానికి అవసరమైన గట్టి పునాదులు నిర్మించడం.
* బ్రిటిష్ ప్రభుత్వం 1892 లో భారత కౌన్సిళ్ల చట్టాన్ని రూపొందించడం.
* 1892 తర్వాత 'కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం' అనే నినాదాన్ని తేవడం.
* అటవీ చట్టాలు, పరిపాలనలో మార్పులు తీసుకురావడం.
* 1878 లో చేసిన ఆయుధాల చట్టాన్ని సవరించడం.
* సైన్యంలో భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించడం.

 

అపజయాలు
 

* సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయకపోవడం.
* చాలాకాలం వరకు బ్రిటిష్‌వారి నిజమైన స్వభావాన్ని గ్రహించలేకపోవడం.
* రాజ్యాంగబద్ధమైన పోరాటం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందకపోవటం.
* కాంగ్రెస్ సభ్యత్వం ప్రధానంగా జర్నలిస్టులు, విద్యావేత్తలు, సంస్కరణవాదులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారులకే పరిమితం కావడం.
* 1892 - 1909 మధ్య కాలంలో కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల్లో 90% మంది హిందువులే ఉండటం.
* బ్రిటిష్ వారి 'విభజించి పాలించు విధానం', అలీగఢ్ ఉద్యమ నాయకులు ముస్లింలను కాంగ్రెస్‌కు దూరంగా ఉండమని కోరడంతో వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా చేరకపోవడం.

 

కాంగ్రెస్ పట్ల బ్రిటిష్ ప్రభుత్వ వైఖరి...
 

     పదవీ విరమణ చేసిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్షించడానికే కాంగ్రెస్‌ను స్థాపించాడనే విమర్శ ఉంది. అప్పటి వైస్రాయ్ డఫ్రిన్ 1886 లో కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ప్రతినిధుల కోసం గొప్ప విందు ఏర్పాటుచేశాడు. అలాగే 1887 లో కాంగ్రెస్ మూడో సమావేశం సందర్భంగా మద్రాసు గవర్నర్ కాంగ్రెస్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి ఇచ్చారు.
 

* అయితే కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఈ సంబంధాలు, సహకారం తాత్కాలికమే. క్రమేణా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సహకరించడానికి బదులు కాంగ్రెస్ పట్ల అనుమానాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ బలం పెరగడం, కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం దీనికి ప్రధాన కారణాలు.
* గవర్నర్ జనరల్ మొదలు ప్రభుత్వ అధికారులంతా జాతీయ నాయకులను అవిధేయులైన బాబులు, కుట్రపూరితమైన బ్రాహ్మణులు, క్రూరమైన ప్రతినాయకులుగా వర్ణించారు.
* 1890 లో బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంపై ఆంక్షలు విధించింది. సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, రాజా శివప్రసాద్, ప్రభుత్వానికి విధేయులైన మరికొంతమందిని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించేలా ప్రోత్సహించింది.
* కాంగ్రెస్‌ను హిందూ సంస్థగా చిత్రించి, 1906 లో ముస్లింలీగ్‌ను ప్రారంభించేలా ముస్లింలను రెచ్చగొట్టింది. దీంతోపాటు ప్రభుత్వం అణిచివేత విధానాలను చేపట్టింది.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

     గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసింది. 1922 మార్చిలో గాంధీజీ అరెస్ట్ తర్వాత జాతీయ నాయకుల్లో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఈ సంధికాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల విషయమై కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలు చివరకు కాంగ్రెస్ చీలిపోవడానికి దారితీశాయి.
 

    చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, హకీం అజ్మల్‌ఖాన్, అలీ సోదరులు తదితరుల నాయకత్వంలోని ఒక వర్గం శాసన మండళ్ల బహిష్కరణకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంది. తద్వారా జాతీయవాదులు మండళ్లలోకి ప్రవేశించి వాటిలో ప్రభుత్వ బలహీనతలను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని భావించాడు. ఈ వర్గాన్ని 'స్వరాజ్యవాదులు', 'మార్పు కోరుకునే వర్గం'గా పేర్కొంటారు.
 

* వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి. రాజగోపాలాచారి, ఎం.ఎ. అన్సారీ నాయకత్వంలోని మరో వర్గాన్ని 'మార్పు కోరని వర్గం'గా పేర్కొంటారు. వీరు శాసన మండళ్లలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు. ఈ వర్గం నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాలను కొనసాగించాలని భావించింది.
 

* అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ, జమ్నాలాల్ బజాజ్, సి. రాజగోపాలాచారిలతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. దేశంలో పర్యటించి శాసనోల్లంఘన ఉద్యమంపై ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం ఈ ఉపసంఘ కర్తవ్యం. ఈ ఉపసంఘం సిఫారసులు గాంధీజీ విధేయులకు, గాంధీజీ వ్యతిరేకవర్గానికి మధ్య భేదాభిప్రాయాలకు దారితీశాయి.

* 1922 డిసెంబరులో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యవాదులు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. 1923 జనవరి 1 న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఈ పార్టీకి చిత్తరంజన్‌దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా వ్యవహరించారు. స్వరాజ్యవాదులు శాసన మండళ్లలో తమ బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో ఉత్సాహం నింపడానికి ఎన్నికలే ప్రధాన సాధనమని వీరు భావించారు.

* 1923 ఫిబ్రవరిలోనే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఈ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలను తగ్గించడానికి యత్నించారు. చివరకు 1923 మేలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'స్వరాజ్య పార్టీ' ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలిపింది.

* 1925 నాటికి గాంధీజీ కూడా ఈ విషయంలో మెతక వైఖరి ప్రదర్శించి, స్వరాజ్య పార్టీని కాంగ్రెస్ రాజకీయ విభాగంగా అంగీకరించారు.

కార్యక్రమాలు

      1923 నవంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ మితవాదులను, ఉదారవాదులను ఓడించింది. కేంద్ర శాసనసభలో 101 సీట్లకు 42 గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సెంట్రల్ ప్రావిన్స్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించి, బెంగాల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాంలలో తగిన సీట్లు గెలుచుకుంది.
 

ప్రధాన డిమాండ్లు: రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పౌర, సైనిక సర్వీసుల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వ్యతిరేకించింది.
 

విజయాలు: 1924 లో కేంద్ర శాసనసభలో ఆర్థిక బిల్లును వ్యతిరేకించింది. స్వరాజ్యపార్టీ నాయకులను శాంత పరిచేందుకు 1924 లో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సంస్కరణల విచార సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్. దీన్నే ముద్దిమాన్ సంఘం అనే పేరుతో కూడా పిలుస్తారు.
 

* 1919 మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారతీయులకు  నష్టం  కలిగించేలా  ప్రభుత్వం 1928 లో ప్రవేశపెట్టిన   ప్రజా రక్షణ బిల్లు  చట్టం  కాకుండా చూడటం స్వరాజ్యపార్టీ సాధించిన మరో విజయం.

* ఉప్పు మీద పన్ను తగ్గించడం, కార్మికుల పరిస్థితులు మెరుగయ్యేలా చర్యలు చేపట్టడం, బెంగాల్‌లో కొన్ని చట్టాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, సెంట్రల్ ప్రావిన్స్‌లో మంత్రులు రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చి ద్వంద్వ ప్రభుత్వం పనిచేయకుండా చూడటం, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉండటం, ప్రభుత్వ విధానాలను బాహాటంగా విమర్శించడం స్వరాజ్యవాదుల ఇతర విజయాలు.

* 1925 లో చిత్తరంజన్‌దాస్ మరణం తర్వాత స్వరాజ్యపార్టీ బలహీనపడింది. లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవీయ, ఎన్.సి. కేల్కర్ హిందువులకు మేలు చేకూరాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి, పదవులు స్వీకరించాలని భావించారు. ఈ వర్గం మోతీలాల్ నెహ్రూపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసింది.

* 1926 లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో 40 సీట్లు, మద్రాసు రాష్ట్ర శాసన మండలిలో సగం సీట్లు సాధించినా, మిగతా రాష్ట్రాల్లో పరాజయాన్ని చవి చూసింది.

* 1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా స్వరాజ్యపార్టీ శాసనసభలను బహిష్కరించి, చివరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైంది.

ప్రాధాన్యం

      బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఉంటూ నిరాశ, నిస్పృహలో ఉన్న సాధారణ ప్రజానీకంలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని మొదట ప్రతిపాదించింది స్వరాజ్యపార్టీనే. సైమన్ కమిషన్ నియామకం దీని కృషి ఫలితమే. శాసన మండళ్లలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిర్గతం చేయడంలో విజయం సాధించింది. వీరి ప్రయత్నాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం చివరకు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి, రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరించింది.
 

సైమన్ కమిషన్ 

బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరు 8 న సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారతీయులకు స్థానం లేకపోవడంతో ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు.
 

* మద్రాసులో 1927 డిసెంబరులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సైమన్ కమిషన్‌ను అన్ని దశలు, అన్ని రూపాల్లో బహిష్కరించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ మొదలైన రాజకీయ పార్టీలు కూడా సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని తీర్మానించాయి.

* అయితే ముస్లింలలో ఒక వర్గం, ఐరోపావారు, ఆంగ్లో-ఇండియన్లు, అణగారిన వర్గాలు ఈ కమిషన్‌ను స్వాగతించాయి. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 న బొంబాయిలో అడుగుపెట్టింది. ఆ రోజున దేశవ్యాప్త హర్తాళ్ పాటించారు. కమిషన్ కలకత్తా, లక్నో, పూనా, విజయవాడ, లాహోర్‌లలో పర్యటించింది. నల్లజెండాల ప్రదర్శన, 'సైమన్ వెనక్కి వెళ్లు' (సైమన్ గో బ్యాక్) నినాదాలతో నిరసన తెలిపారు.

* లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి. పంత్‌లపై లాఠీఛార్జ్ జరిగింది. 1928 అక్టోబరులో లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ని పోలీసులు తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన ఆయన చివరకు అదే ఏడాది నవంబరు 17 న మరణించారు. దీనికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని భగత్‌సింగ్ కాల్చి చంపాడు.

* సైమన్ కమిషన్ 1930, మేలో నివేదిక సమర్పించింది. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ రద్దు, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమైన ప్రతిపాదనలు. సైమన్ కమిషన్ నివేదికపై లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించారు. ఈ చర్చల ఆధారంగా 1935 చట్టాన్ని రూపొందించారు. అయితే ముస్లిం లీగ్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలు సైమన్ నివేదికను వ్యతిరేకించాయి. భారతీయులను సంతృప్తిపరచడానికి అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబరు 31 న (దీపావళి) భవిష్యత్తులో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీన్నే దీపావళి ప్రకటనగా పేర్కొంటారు. 

బట్లర్ కమిటీ

      సైమన్ కమిషన్‌తోపాటు బ్రిటిష్ ప్రభుత్వం 1927 లో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు హార్‌కోర్ట్ బట్లర్, హోల్డ్స్ వర్త్, ఎస్.సి. పీల్. స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను సూచించడమే దీని ప్రధాన బాధ్యత. ఈ సంఘానికి అధికారికంగా పెట్టిన పేరు - భారత రాజ్యాల సంఘం. ఈ సంఘం 16 స్వదేశీ సంస్థానాలను సందర్శించి, 1929 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
 

నెహ్రూ నివేదిక (1928): నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించగలరా అని భారతీయులకు సవాలు విసిరారు. దీనికి జవాబుగా 1928 ఫిబ్రవరిలో దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
 

* 1928 లో బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందు నెహ్రూ నివేదికను ఉంచారు. దీనిపై మహ్మద్ అలీ జిన్నా, ఎం.ఆర్. జయకర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

జిన్నా 14 సూత్రాలు (1929): దిల్లీలో 1929 మార్చిలో జరిగిన ముస్లింలీగ్ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. నెహ్రూ నివేదికను తోసిపుచ్చారు. పద్నాలుగు సూత్రాలను అమలు చేయకుండా భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏ ప్రణాళికా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం

జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 1930 జనవరి 26 న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
 

    గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31 లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గాంధీజీ చేసిన 11 డిమాండ్‌లు ....
1. భూమిశిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీర ప్రాంత షిప్పింగ్‌ను భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా పౌరుల స్వీయరక్షణకు ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలి.

 

* ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2 న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12 న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6 న దండి తీరం నుంచి పిడికెడు ఉప్పును తీసుకురావడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటి చెప్పారు. దండి యాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లోని 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
 

* ఉప్పు సామాన్య మానవుడి భోజనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పు అమ్మకం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. గాంధీజీ మాటల్లో 'గాలి, నీరు తర్వాత బహుశా ఉప్పు జీవితంలో ప్రధాన అవసరం'. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ఉప్పును ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
 

ఉద్యమ వ్యాప్తి

తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)

మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు).

పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్ గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు - బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ). ఇతడు ఎర్రచొక్కా దళాన్ని ఏర్పాటు చేశాడు.
* ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
 

ప్రజల భాగస్వామ్యం

* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్‌లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్‌నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.
 

ఉద్యమంలోని వివిధ దశలు

మొదటి దశ (1930 మార్చి - సెప్టెంబరు): ఈ దశలో పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలకపాత్ర పోషించారు.

రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): ఇందులో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.

మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలను నిర్బంధించింది. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రంపై కూడా పరిమితులను విధించింది. భూమిశిస్తు చెల్లించని వేలాదిమంది రైతుల భూములను, వారి ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 1931 నాటికి సుమారు 24,000 మందిని అరెస్టు చేశారు.
 

రౌండ్ టేబుల్ సమావేశాలు

* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.

* ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, జిన్నా, ఆగాఖాన్ హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ అంబేడ్కర్ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు.

* ఈ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిథ్యం ఇవ్వాలని, తాను ప్రతిపాదించిన 14 సూత్రాలను ఆమోదించాలని మహమ్మద్ అలీ జిన్నా డిమాండు చేశారు. డా|| అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండు చేశారు.

* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.

గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5): గాంధీజీ అప్పటి వైస్రాయి ఇర్విన్‌తో సమావేశమయ్యేలా తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్. శాస్త్రి, యం.ఆర్. జయకర్ మధ్యవర్తిత్వం చేశారు. దాని ఫలితంగా మార్చి 5, 1931 న గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది.

ముఖ్యాంశాలు: శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్‌చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మైనారిటీ రాష్ట్రాలను (వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
 

కమ్యూనల్ అవార్డు - 1932: 1932 ఆగస్టు 16 న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజకవర్గాలను కేటాయించారు.
 

* షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకవర్గాల్లో ఓటువేసే అధికారాన్ని కూడా కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20 న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మదన్‌మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25 న పుణెలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజకవర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇందులో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

         క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.
 

       క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
 

* మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
 

జైనమతం - ఆవిర్భావం 

జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు.

చివరి తీర్థంకరుడు వర్థమానుడు.
 

మహావీరుడి జీవితం, బోధనలు
వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
 

* వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.

* మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.


పంచ మహావ్రతాలు
జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి. 1) అహింస, 2) సత్యం, 3) అస్తేయం (దొంగిలించకూడదు), 4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు), 5) బ్రహ్మచర్యం. అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.

 

* మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

* జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.

రాజుల ఆదరణ 

చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
 

* క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.

* కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.

* క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.

* మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.

* క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.

జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

శాఖలు
జైనమతంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వస్త్రాలు ధరించని వారిని దిగంబరులు అంటారు. వీరికి నాయకుడు భద్రబాహుడు. తెల్లని వస్త్రాలు ధరించే జైనులను శ్వేతాంబరులు అంటారు. వీరికి నాయకుడు స్థూలబాహుడు/స్థూలభద్రుడు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఇరువర్గాల మధ్య తలెత్తిన భిన్నాభిప్రాయాలు చీలికకు కారణమయ్యాయి.
 

 పంచవ్రతాలు
జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
1. అసత్యం: అబద్ధం ఆడకూడదు/సత్యమునే పలకాలి
2. అహింస: జీవహింస చేయరాదు/అహింసను పాటించాలి.
3. అస్తేయ: దొంగతనం చేయకూడదు. 
4. అపరిగ్రాహ:  ఆస్తిని కలిగి ఉండరాదు.
5. బ్రహ్మచర్యం: ప్రతి వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
జైనమత గ్రంథాలను అంగాలు అంటారు. ఇవి మొత్తం 12 కాబట్టి ద్వాదశాంగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను త్రిరత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక. అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. త్రిరత్నాలను జైన, బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు. బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే వాటిని త్రిరత్నాలుగా పేర్కొన్నారు.


 తీర్థంకరులు
      జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరుడు అంటే ‘జీవన స్రవంతిని దాటడానికి వారధి’ లాంటివాడని అర్థం. జైనమత సాహిత్యం, సంప్రదాయంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఇందులో మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 21వ తీర్థంకరుడు నేమినాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.
తీర్థంకరులు    గుర్తు
రుషభనాథుడు  -  ఎద్దు
నేమినాథుడు -    నీలి గులాబి
 అరిష్టనేమి -    శంఖం
 పార్శ్వనాథుడు - పాము
 వర్ధమాన మహావీరుడు -   సింహం|
జినుడు (వర్ధమానుడు) పేరు మీదుగా జైనమతం అనే పేరు వచ్చింది కాబట్టి జైన మత స్థాపకుడు వర్ధమన మహావీరుడు అని చెబుతారు. కానీ జైనమత తొలి తీర్థంకరుడు రుషభనాథుడు అని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటారు. జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు. 
* దీనిలో మొదటి నాలుగు వ్రతాలైన అహింస, అస్థేయ, అసత్య, అపరిగ్రాహలను 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు తెలియజేశాడు కాబట్టి అతడే జైనమతాన్ని స్థాపించాడని మరికొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. అయిదో వ్రతం బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు తెలియజేశాడు.


 పరిషత్తులు
జైనమత అభివృద్ధికి రెండు ముఖ్యమైన సమావేశాలు (పరిషత్తులు) నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే జైనమత గ్రంథంగా ఉన్న 14 పర్వాల స్థానంలో 12 అంగాలను ప్రవేశపెట్టారు.
* రెండో జైన పరిషత్తును వల్లభిలో క్షమశ్రవణుడు/దేవార్థి క్షమపణ నిర్వహించాడు. ఈ సమావేశంలో 12 ఉపాంగాలను సంకలనం చేశారు.


వర్ధమాన మహావీరుడు
* జైనమత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈయన క్రీ.పూ.540లో ప్రస్తుత బిహార్‌లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/అనోజ్ఞ. ఇతడు వైశాలి రాజ్యానికి చెందిన (వజ్జి గణ రాజ్యం) జ్ఞాత్రిక క్షత్రియ వంశస్థుడు. వర్ధమానుడు తన 30వ ఏట ఇల్లు విడిచి 12 ఏళ్లపాటు రిజుపాలిక నదీతీరంలోని జృంభిక అనే గ్రామంలో సాలవృక్షం కింద తపస్సు చేసి 42వ ఏట ‘జినుడు’ అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను/ఇంద్రియాలను జయించినవాడని అర్థం. వర్ధమానుడు మహావీరుడు, కేవలి, నిర్గంగ్రథుడు లాంటి బిరుదులను పొందాడు. తన అనుచరులను జైనమతంగా ఏర్పరిచి, మత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ క్రీ.పూ.468లో బిహార్‌లోని పావాపురి ప్రాంతంలో నిర్యాణం చెందాడు.


 బోధనలు
* పంచవ్రతాల్లో చివరిదైన బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించింది వర్ధమానుడే. ఇతడు ద్వైత సిద్ధాంతాన్ని లేదా సాద్వాదాన్ని విశ్వసించాడు. దీని ప్రకారం సృష్టిలో ఆత్మ, పదార్థం అనే రెండు అంశాలు ఉంటాయని తెలిపాడు. పదార్థం నశించిపోతుంది కానీ కోరికల వల్ల ఆత్మ అనేది జన్మ, పునర్జన్మ చట్రంలో ఇరుక్కుపోయి స్వేచ్ఛను కోల్పోతుందని పేర్కొన్నాడు. ఈ చక్రబంధనం నుంచి విముక్తి పొందడం ఎలా అనే దానికి సమాధానం కనుక్కోవడానికే అతడు పరివ్రాజకుడయ్యాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లడాన్ని పరివ్రాజకుడు అంటారు. వర్ధమానుడు 30వ ఏట, గౌతమ బుద్ధుడు 29వ ఏట పరివ్రాజకులయ్యారు. వేదాలు ప్రామాణికంకాదని, యజ్ఞ యాగాల వల్ల మోక్షం రాదని, జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. ముఖ్యంగా వర్ధమానుడు ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని సల్లేఖన వ్రతం అంటారు. అంటే వ్యక్తి అన్న పానాదులు మాని శరీరం శుష్కించేవరకు కఠోరమైన తపస్సు చేస్తే మోక్షం వస్తుందని బోధించాడు
మహావీరుడికి గణధారులు (పీఠాధిపతులు) అనే 11 మంది సన్నిహితులైన శిష్యులు/ధర్మదూతలు ఉండేవారు. వారిలో ఆర్య సుధర్ముడు వర్ధమానుడి అనంతరం జైనమతానికి ప్రధాన గురువు (థేరా) కాగా ఈయన తర్వాత జంబు మతగురువు అయ్యాడు. ముఖ్యంగా ధననందుడి పాలనాకాలంలో వర్ధమానుడి తర్వాత సంభూత విజయ గొప్ప జైన మతాచార్యుడిగా పేరొందాడు. ఒక వ్యక్తి కేవలం జ్ఞానాన్ని పొందడానికి 14 ఆధ్యాత్మిక దశలు (పూర్వాలు) దాటాలని పేర్కొన్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరో మతగురువు (థేరా)గా పేరొందిన వ్యక్తి భద్రబాహుడు. ఇతడు కల్పసూత్రాలు అనే గ్రంథాన్ని రాశాడు.


వాస్తుకళాభివృద్ధి
జైనమతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళా రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు; కదంబులు, గాంగులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైనమతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్యాభివృద్ధికి కృషిచేశారు. కర్ణాటకలోని శ్రావణబెల్గోళ (గోమఠేశ్వర మఠం), ఒడిశాలోని ఉదయగిరి గుహాలయాలు, రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ పర్వతంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలు జైనమతం వల్ల అభివృద్ధి చెందాయి.
జైనమత ప్రేరణతోనే మధుర శిల్పకళ ఆవిర్భవించింది. ప్రాకృత, సంస్కృత, ప్రాంతీయ భాషల్లో అనేక మంది పండితులు జైన సాహిత్యాన్ని అందించారు. జైనమత గ్రంథాలైన ద్వాదశాంగాలను ప్రాకృత భాషలో రచించారు. భద్రబాహుడి కల్పసూత్రాలు, అమోఘవర్షుడి కవి రాజ మార్గం లాంటి గ్రంథాలు ఈ మతానికి సంబంధించినవే.
* ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కొనగండ్ల, తెలంగాణలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక గొప్ప జైన ఆశ్రమాలుగా పేరొందాయి.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ స్థాపన

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1922 లో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు?
జ: చిత్తరంజన్‌దాస్

 

2. కిందివారిలో మార్పు కోరని వర్గానికి చెందనివారు?
ఎ) వల్లభాయ్ పటేల్      బి) ఎం.ఎ. అన్సారీ    
సి) రాజగోపాలాచారి      డి) విఠల్‌భాయ్ పటేల్
జ: డి (విఠల్‌భాయ్ పటేల్)

 

3. స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి?
జ: మోతీలాల్ నెహ్రూ

 

4. స్వరాజ్యపార్టీ కృషితో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
జ: అలెగ్జాండర్ ముద్దిమాన్

 

5. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి?
జ: బిర్కెన్ హెడ్

 

6. స్వదేశీ సంస్థానాలతో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం?
జ: బట్లర్

 

7. సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
జ: బాల్డ్విన్

 

8. ప్రజారక్షణ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్న పార్టీ?
జ: స్వరాజ్య

 

9. నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగం కానిది?
జ: కుటీర పరిశ్రమలు

 

10. సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారు?
జ: మద్రాసు

 

11. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించింది?
జ: 1928

 

12. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని చంపింది?
జ: భగత్‌సింగ్

 

13. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించమని సవాలు విసిరిన వ్యక్తి?
జ: బిర్కెన్ హెడ్

 

14. నెహ్రూ నివేదికపై జిన్నాతో తీవ్రంగా విభేదించింది?
జ: ఎం.ఆర్. జయకర్

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్య/ వేద నాగరికత

* వేద నాగరికతను రెండు రకాలుగా విభజించారు. క్రీ.పూ.15001000 మధ్యకాలాన్ని ‘తొలివేద కాలం’ అని, క్రీ.పూ.1000600 మధ్యకాలాన్ని ‘మలివేద కాలం’ అని అంటారు.

* ఆర్యుల జన్మస్థానం, వలసల గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రిటన్‌కు చెందిన సర్‌ విలియం జోన్స్‌ మొదటిసారి 1786లో ఆర్యుల గురించి పరిశోధనలు చేశారు.

* ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారత్‌కు వలస వచ్చారని అనేక మంది చరిత్రకారులు భావిస్తారు. వీరు మనదేశానికి వచ్చిన మొదటి విదేశీయులు.

* ఈ కాలంలో ప్రజలు ఆర్యభాషను ఉపయోగించారు. అందుకే దీన్ని ‘ఆర్య నాగరికతగా’ పేర్కొన్నారు. ‘ఆర్య’ అనే పదం భాషకు సంబంధించిందని, జాతికి సంబంధించింది కాదని చాలా మంది చరిత్రకారుల భావన.

* ఆర్య’ అనే పదానికి కొంత మంది జాతి, వర్ణం, భాష అని వివిధ రకాల నిర్వచనాలు ఇచ్చారు. జర్మన్‌ పండితుడు ‘మాక్స్‌ ముల్లర్‌’ ఆర్య అనేది ఒక వర్గం మాట్లాడే భాష అని ప్రచారం చేశాడు. 

* ఇరాన్‌ రాజు మొదటి డేరియస్‌ తనను తాను ‘ఆర్యుడిగా’ , ‘ఆర్యపుత్రుడిగా’ వర్ణించుకున్నాడు. ‘ఆర్య’ అనే పదానికి అర్థం రూపం, జాతి కాదు, భాషల్లోని ఒక భాగం అని పరిశోధకుల వాదన.

* ‘ఆర్య’ అనే మాటను రుగ్వేదంలో 31 సార్లు ఉపయోగించారు.

* ఆర్యుల భాష సంస్కృతం. దీనికి భాషాశాస్త్రజ్ఞులు ‘ఇండో-ఆర్యన్‌’ లేదా ‘ప్రాచీన ఇండో ఆర్యన్‌’ అని పేరు పెట్టారు. ఈ భాషా రూపానికి చారిత్రక ఆధారాలు ఉత్తర సిరియాలో లభించాయి. 

* ఆర్యులు శరీరాకృతి పరంగా పొడవైన తల, ముక్కు, పొడుగ్గా-సన్నగా ఉండే ముఖం, బాగా నునుపుదేలిన అంగసౌష్ఠవం, పొడవైన కాళ్లు కలిగి ఉండేవారని చరిత్రకారుల అభిప్రాయం.

* ఆర్యుల ప్రధాన వృత్తి ‘పశుపోషణ’. వీరు గడ్డి మైదానాల్లో నివసించేవారు. యూరప్‌లోని గడ్డి మైదానాలు ఎండిపోవడం వల్ల, జనాభా పెరుగుదలతో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా వీరు వలసలకు పూనుకున్నారు. ఈ క్రమంలో వారు విభిన్న ప్రాంతాల్లోని స్థానిక సమూహాలు, తెగలను తమ ఆధీనంలోకి తీసుకుని, వారితో కలిసిపోయి తమ ఆధిపత్యాన్ని చలాయించారు.

* ఈ విధంగా వలస వచ్చిన వారిలో గ్రీకులు, హీటైట్‌లు, కాస్మైట్‌లు, మిటానీలు మొదలైన వారు ఉన్నారు. 

* ఇరాన్‌ పీఠభూమిలో స్థిరపడిన ఇండో-ఇరానియన్‌ సంతతి వారు వాయవ్య భారతదేశానికి దశలవారీగా వలస వచ్చారని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం.

* వీరు ఉపయోగించిన భాషకు ‘ఇండో-యూరపియన్‌’, ‘ఇండో-ఇరానియన్‌’ అని పేరు పెట్టారు. 

* ఆర్యులు సప్త-సింధూ, గంగా-యమునా మైదాన మధ్య భాగంలో నివసించారు. దీన్ని ‘ఆర్యావర్తం’ అంటారు. తర్వాత తూర్పు పంజాబ్‌లోని సట్లెజ్‌-యమునా మధ్య ప్రాంతంలో (బ్రహ్మావర్తం) నివసించి వేద సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. ఆర్యులు మొదట ఇక్కడే స్థిరపడ్డారు. తర్వాత ఈశాన్య దిక్కుగా ప్రయాణించి దిల్లీకి ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి వలస వెళ్లారు.

* ఈ విధంగా స్థిరపడిన ఆర్యులు భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు తెచ్చి, నూతన నాగరికతకు నాంది పలికారు.

1. వేదాల్లో పురాతనమైంది?

1) యజుర్వేదం    2) అధర్వణవేదం    

3) రుగ్వేదం    4) సామవేదం

2. భారత్‌-ఐరోపా సమ్మిళిత భాషలో లభించిన మొట్టమొదటి ప్రతి ఏది? 

1) రుగ్వేదం    2) సామవేదం     

3) అధర్వణవేదం    4) యజుర్వేదం

3. రుగ్వేదంలో ఎన్ని మండలాలున్నాయి?

1) 12    2) 10    3) 14    4) 15

4. రుగ్వేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి?

1) 1091   2) 1058   3) 1038   4) 1028

5. కింది ఏ వేదం ప్రకారం ఆర్యన్లు భారతదేశంలో సప్తసింధూ ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు?

1) సామవేదం    2) రుగ్వేదం   

3) యజుర్వేదం    4) గాంధర్వవేదం 

6. వేదాల్లో పేర్కొన్న మొదటి నది ఏది?

1) గంగా        2) యమునా    

3) గోదావరి        4) సరస్వతి

7. వేదాలకు మరో పేరు?

1) సంహితాలు       2) సుభాషితాలు    

3) ఆభరణాలు    4) హితాలు

8. వేదం అంటే?

1) జ్ఞానం       2) భక్తి   

3) ఆచారాలు       4) శ్లోకాలు

9. సంగీతానికి సంబంధించిన వేదం ఏది? 

1) రుగ్వేదం       2) యజుర్వేదం   

3) సామవేదం       4) అధర్వణవేదం

10. శ్రుతులు అంటే?

1) వేదాలు       2) ఉపనిషత్తులు   

3) పురాణాలు       4) బ్రాహ్మణాలు

11. వేదాలను ఏ భాషలో రాశారు?

1) పాళీ       2) ప్రాకృతం    

3) సంస్కృతం       4) తమిళం

12. పురంధరుడు అని ఎవరిని అంటారు? 

1) అగ్ని        2) వరుణుడు    

3) సూర్యుడు        4) ఇంద్రుడు 

13. దశరాజ గణ యుద్ధాన్ని (Battle of ten kings) ఏ వేదంలో ప్రస్తావించారు?

1) యజుర్వేదం       2) సామవేదం   

3) రుగ్వేదం    4) అధర్వణవేదం

14. గోపతి అంటే?

1) మనుషులను రక్షించేవారు   

2) భూమికి అధిపతి   3) గోవులకు రక్షకుడు 

4) అడవుల రక్షకుడు

15. గోవులను చంపడం బ్రహ్మహత్యాపాతకం అని ఏ వేదంలో పేర్కొన్నారు?

1) అధర్వణవేదం     2) సామవేదం     

3) రుగ్వేదం        4) యజుర్వేదం 

16. మంత్ర తంత్రాలతో ఉన్న వేదం? 

1) రుగ్వేదం       2) అధర్వణవేదం   

3) సామవేదం    4) యజుర్వేదం 

17. సంగ్రాహిత్రి అంటే?

1) పన్నులు వసూలు చేసేవాడు   

2) విధేయత చూపేవాడు   

3) శాంతి భద్రతలు కాపాడేవాడు   

4) గోరక్షకుడు

18. వేదకాలంలో అయిదు రుతువులు ఉన్నాయని తెలిపే గ్రంథం ఏది?

1) రుగ్వేదం       2) యజుర్వేదం    

3) సామవేదం    4) ఉపనిషత్తులు

19. యవలు అంటే? 

1) బార్లీ     2) బియ్యం 

3) రాగులు     4) సజ్జలు

20. రుగ్వేదంలో ఆవుల ప్రస్తావన ఎన్నిసార్లు ఉంది?

1) 186    2) 176    3) 195    4)165

21. ‘జన’ అనే పదాన్ని రుగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు?

1) 275    2) 255    3) 265    4) 295

22. కింది అంశాలను జతపరచండి. 

జాబితా - I      జాబితా - II

a)  ఉష         i) ప్రాతఃకాల దేవత

b)  పృథ్వి        ii) తుపాను దేవత

c)  సరస్వతి       iii) నదీదేవత

d) మారుత్స్‌        iv) భూమాత 

1) a-i, b-iv, c-iii, d-ii

2) a-ii, b-iv, c-iii, d-i

3) a-iv, b-i, c-ii, d-iii

4) a-iii, b-iv, c-ii, d-i

23. చాతుర్వర్ణ విభజన ప్రస్తావన కింది ఏ గ్రంథంలో ఉంది?

1) యజుర్వేదం    2) సామవేదం   

3) ఉపనిషత్తులు    4) రుగ్వేదం

24. సోమ, సుర అనేవి వేటి పేర్లు?

1) దేవతలు     2) మత్తుపానీయాలు   

3) గోవులు     4) వర్ణాలు

25. మలివేదకాలం కింది ఏ కాలానికి చెందింది?

1) Painted Grey Ware Culture

2) Black and Red Ware Culture

3) Satone Culture        4) ఏదీకాదు

26. కింది ఏ నదులను రుగ్వేదంలో ప్రస్తావించారు? 

1) గోవాతి      2) సింధు 

3) సతుద్రి     4) పైవన్నీ

27. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I     జాబితా - II

a)  సామ్రాట్‌     i) పశ్చిమ రాజులు

b)  స్వరాట్‌      ii) తూర్పు రాజులు

c)  భోజులు     iii) దక్షిణభారత రాజులు

d)  రాజా      iv) మధ్యప్రాంత రాజులు

1) a-ii, b-i, c-iii, d-iv

2) a-ii, b-iv, c-iii, d-i

3) a-iv, b-i, c-ii, d-iii

4) a-iii, b-iv, c-ii, d-i

సమాధానాలు

1 - 3  2 - 1  3 - 2  4 - 4  5 - 2  6 - 4  7 - 1   8 - 1  9 - 3  10 - 1   11 - 3  12 - 4  13 - 3   14 - 3  15 - 1  16 - 2   17 - 1  18 - 1   19 - 1   20 - 2   21 - 1  22 - 1  23 - 4   24 - 2    25 - 1   26 - 4   27 - 1

మరికొన్ని...

1. క్రిందివాటిలో సరైనవి ఏవి? 

ఎ) రుగ్వేదంలో న్యాయపాలనా అధికారి గురించి ప్రస్తావన లేదు.

బి) ప్రజాపతి అనేవారు భూములపై అధికారం కలిగి ఉన్నారు.

సి) అగ్ని రుగ్వేదంలో రెండో స్థానంలో ఉన్నాడు.

డి) ఉత్తర భారతదేశ రాజులను ‘విరాట్‌’ అంటారు.

1) బి, సి, డి     2) ఎ, సి, డి   

3) సి, డి       4) పైవన్నీ

2. దున్నడం గురించి కింది దేనిలో ప్రస్తావించారు?

1) ఉపనిషత్తులు    2) శతపథ బ్రాహ్మణం   

3) రుగ్వేదం     4) పురాణాలు

3. ‘ఆర్య’ అనే మాటను రుగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు?

1) 35   2) 21   3) 31   4) 41

4. ఆర్యుల జన్మస్థానం ‘టిబెట్‌’ అని ఎవరు అభిప్రాయపడ్డారు?

1) పి.గిల్‌     2) దయానంద సరస్వతి   

3) తిలక్‌      4) మాక్స్‌ముల్లర్‌

5. ‘ఆర్కిటిక్‌ హోం ఆఫ్‌ ది ఆర్యన్స్‌’ గ్రంథ రచయిత ఎవరు?

1) ఎ.సి.దాస్‌           2) గీగర్‌   

3) బాలగంగాధర్‌ తిలక్‌       4) పెంకా

6. ఆర్యుల జన్మభూమి ‘సప్తసింధూ’ ప్రాంతం అని తెలిపింది ఎవరు?

1) పి.గిల్స్‌        2) ఎ.సి.దాస్‌   

3) మాక్స్‌ముల్లర్‌       4) దయానంద

సమాధానాలు: 1 - 1   2 - 2   3 - 3   4 - 2   5 - 3   6 - 2

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హోమ్‌ రూల్‌ ఉద్యమం

స్వరాజ్య సమరం!


  బెంగాల్‌ విభజనపై జరిగిన తిరుగుబాటు భారతీయుల సంఘటిత శక్తిని చాటింది. యుద్ధకాలంలో అండగా ఉంటే సంస్కరణలు అమలు చేస్తామంటూ నమ్మించిన బ్రిటన్, మోసం చేసి వంచన వైఖరిని ప్రదర్శించింది. దాంతో పెరిగిన అసంతృప్తి మళ్లీ ఉద్యమంగా మారింది. విప్లవకారులు విజృంభిచారు. విభేదాలు విడిచి నేతలు ఏకమై పోరాడారు. కష్టనష్టాలను లెక్కచేయకుండా ప్రజలు నాయకుల వెంట నడిచారు. స్వయం పాలన కోసం దేశవ్యాప్తంగా సమరం చేశారు. వలస ప్రభుత్వం వణికిపోయింది. స్వపరిపాలనకు తలొగ్గింది.

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం భారత జాతీయవాద వెల్లువలో ఒక గొప్ప విప్లవ కెరటం. ‘ప్రజలు తరతరాల గాఢ సుప్తావస్థ నుంచి మేల్కొన్నారు. రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. మహాజర్ల (పిటీషన్‌)కు ప్రజామద్దతు ఉండాలని, తమకు కష్టనష్టాలు భరించే శక్తి ఉండాలని గుర్తించారు.’ అని గాంధీ ఆ ఉద్యమం గురించి పేర్కొన్నారు. 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని భారతీయులు సంఘటితంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను తిరస్కరించిన మొదటి ఘట్టంగా వర్ణించవచ్చు.ఆ తర్వాత దేశ స్వాతంత్య్ర సమరంలో హోమ్‌ రూల్‌ ఉద్యమాన్ని (1916-1918) ద్వితీయ ఘట్టంగా పేర్కొనవచ్చు. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం అనంతరం అనేక పరిస్థితులు హోమ్‌ రూల్‌ ఉద్యమానికి (స్వయం పాలన) దారితీశాయి.


దారితీసిన పరిస్థితులు

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమ కాలంలో ప్రభుత్వం అనుసరించిన దమననీతి, క్రూర అణచివేత విధానాలు అంతిమంగా విప్లవ హింసావాదంగా పరిణమించాయి. సంధ్య, యుగాంతర్, కాల్, వందేమాతరం, మరాఠీ, కేసరి లాంటి పత్రికలు విప్లవవాదానికి మద్దతిచ్చాయి. చాపేకర్‌ సోదరులు, సావర్కర్‌ సోదరులు, ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి లాంటి విప్లవకారులు ఆ మార్గాన్ని అనుసరించారు. వారు విదేశాల్లో కూడా తమ కేంద్రాలను స్థాపించారు. శ్యాంజీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా లాంటి వారు ఐరోపాలో, లాలా హర్‌దయాళ్‌ అమెరికాలో తమ రహస్య కార్యకలాపాలను సాగిస్తూ, భారతదేశంలో విదేశీ సామ్రాజ్య శక్తులపై సాయుధ తిరుగుబాటుకు సంసిద్ధమయ్యారు.

వందేమాతర ఉద్యమం 1911లో విజయవంతంగా ముగిసిన తర్వాత, భారత జాతీయోద్యమంలో స్తబ్దత ఏర్పడింది. ఈ మధ్యలో 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. గ్రేట్‌ బ్రిటన్, ఇటలీ, రష్యా, జపాన్, అమెరికా కలిసి ఒక పక్షంగా, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, టర్కీ (తుర్కియే) లు మరో పక్షంగా యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధం (1914 - 18) వల్ల భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో కీలక మార్పులు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రక్రియలో బ్రిటన్‌ భారత నాయకుల మద్దతు కోరింది.  యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయ సమస్యల పట్ల ఉదార వైఖరితో వ్యవహరిస్తుందని విశ్వసించిన కాంగ్రెస్‌ మితవాద వర్గం మద్దతుకు అంగీకరించింది. 1914లో తిలక్‌ జైలు నుంచి విడుదలయ్యారు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, కృతజ్ఞతగా భారతదేశానికి రాజ్యాంగ సంస్కరణలు ప్రకటిస్తారని అతివాదులు కూడా నమ్మి మద్దతు ప్రకటించారు. విప్లవకారులు మాత్రం, ఇది తమకు అందివచ్చిన అవకాశంగా భావించి, బ్రిటన్‌కు శత్రువులైన టర్కీ, జర్మనీ లాంటి దేశాల నుంచి ఆర్థిక, మిలటరీ సహాయం పొందడానికి ప్రయత్నించారు. దాంతో విప్లవకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్రమైన అణచివేత విధానాలు అవలంబించింది. విప్లవ కార్యకలాపాలను నిరోధించేందుకు 1915లో భారతదేశ రక్షణ చట్టం తీసుకొచ్చింది. దాన్ని విచక్షణారహితంగా ప్రయోగించి అనుమానితులను పెద్దసంఖ్యలో ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో బంధించింది.

ఒక లక్ష్యం - రెండు లీగ్‌లు 

అనిబిసెంట్‌ సహకరించడంతో కాంగ్రెస్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు తిలక్‌ వర్గానికి అనుమతి లభించింది. అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశస్థురాలు. ఉన్నత విద్యావంతురాలు, ఆధ్యాత్మికవేత్త, భారతీయ సంస్కృతి పట్ల అభిరుచి, ఇష్టం ఉన్న వ్యక్తి. దివ్యజ్ఞాన సమాజసేవలో భాగంగా ఆమె భారతదేశానికి వచ్చారు. సమాజం ప్రధాన కార్యాలయం మద్రాస్‌లోని అడయార్‌లో ఏర్పాటైంది. ఆమె రాజకీయాల్లో కూడా ప్రవేశించి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1916లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ తమ వార్షిక సమావేశాల కోసం లఖ్‌నవ్‌లో సమావేశమయ్యాయి. అందులో పరస్పర సంప్రదింపుల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియలోనూ అనిబిసెంట్‌ ముఖ్య భూమిక పోషించారు.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడిచిన తర్వాత బ్రిటన్‌కు  అందించిన సహాయ సహకారాలకు బదులుగా దేశంలో స్వపరిపాలన అమలు చేస్తుందనే భ్రమలు భారతీయులకు తొలగిపోయాయి. ఒత్తిడి చేస్తేగాని ప్రభుత్వం రాజకీయ సంస్కరణలు తీసుకురాదని నాయకులు, ప్రజలు గ్రహించారు. అయితే  అప్పటికి నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయింది. కానీ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల ఐక్యత, కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌ మైత్రి మరొక రాజకీయ పోరాటానికి అనువైన వాతావరణాన్ని కల్పించాయి. దాంతో ఈ ఉద్యమాన్ని జాతీయ కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా, జాతీయ నాయకులైన బాలగంగాధర్‌ తిలక్, అనిబిసెంట్‌లు నిర్వహించారు. వీరు దేశానికి స్వయంపాలనను డిమాండ్‌ చేస్తూ 1916లో విడివిడిగా హోమ్‌ రూల్‌ లీగ్‌లు స్థాపించారు. లక్ష్యం ఒక్కటే అవడంతో రెండు లీగ్‌లూ కలిసే పనిచేశాయి.

తిలక్‌ హోమ్‌ రూల్‌ లీగ్‌: దీన్ని తిలక్‌ 1916, ఏప్రిల్‌లో పుణెలో స్థాపించాడు. ఈ లీగ్‌ మహారాష్ట్ర (అప్పటి బొంబాయి మినహా), కర్ణాటక, సెంట్రల్‌ ప్రావిన్స్‌ల్లో కార్యకలాపాలును నిర్వహించింది. తిలక్‌ తన పత్రికలు ‘మరాఠా’, ‘కేసరి’ ద్వారా హోమ్‌రూల్‌ ఉద్యమ లక్ష్యాన్ని వ్యాసాలు, వార్తల రూపంలో తెలియజేసి, ప్రజలను కార్యోన్ముఖులను చేశాడు. ఉద్యమ విశిష్టతను చాటేందుకు కన్నడ, గుజరాతీ, మరాఠి, ఇంగ్లిష్‌ భాషల్లోనూ కరపత్రాలు విడుదల చేశాడు. తిలక్‌ లీగ్‌ స్వపరిపాలనను, భాషా రాష్ట్రాలను, ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను డిమాండ్‌ చేసింది. ‘స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాను’ అని తిలక్‌ ఎలుగెత్తి చాటాడు.

అనిబిసెంట్‌ లీగ్‌: అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశంలో నిర్వహించిన స్వపరిపాలన ఉద్యమం తరహాలో ఇక్కడ కూడా హోమ్‌ రూల్‌ లీగ్‌ (1916, సెప్టెంబరు) స్థాపించి రాజకీయ పోరాటం సాగించారు. ఆమె తన పత్రికలు ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’; కరపత్రాలు, సమావేశాల ద్వారా లీగ్‌ లక్ష్యాలు, కార్యాచరణ గురించి బొంబాయి, కాన్పుర్, అలహాబాద్, బెనారస్, మధుర, కాలికట్, అహ్మద్‌నగర్, లాంటి చోట్ల ప్రచారం చేశారు. అనిబిసెంట్‌ లీగ్‌ ద్వారా స్వపరిపాలనను డిమాండ్‌ చేశారు. జార్జ్‌ అరండల్‌ (లీగ్‌ కార్యదర్శి), వాడియా, ద్వారకాదాస్, శంకర్‌లాల్‌ బంకర్, ఇందూలాల్, సి.పి. రామస్వామి అయ్యర్‌ లాంటి ప్రముఖులు ఉద్యమంలో అనిబిసెంట్‌ అనుయాయులయ్యారు. ఆమె బెనారస్‌లో స్థాపించిన హిందూ కళాశాల 1916 నాటికి మదన్‌ మోహన్‌ మాలవ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయంగా మారింది (1915 చట్టం ప్రకారం).

హోమ్‌రూల్‌ ఉద్యమంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. బ్రిటిష్‌ పాలకులు తమ సామ్రాజ్యవాద ధోరణిని విడనాడేందుకు ఇష్టపడలేదు. స్వపరిపాలన ఉద్యమాన్ని అణచివేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వం ఉద్యమ నేతలపై అప్రజాస్వామ్య భారతదేశ రక్షణ చట్టాన్ని ప్రయోగించింది. ఉద్యమ పత్రికలపై ఆంక్షలను విధించింది. ప్రభుత్వం 1917లో అనిబిసెంట్‌ను ఆమె అనుచరులతో కలిపి అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్టును దేశం యావత్తు వ్యతిరేకించింది. అనిబిసెంట్‌ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, భూలాభాయ్‌ దేశాయ్, చిత్తరంజన్‌ దాస్, మదన్‌ మోహన్‌ మాలవ్య, మహమ్మద్‌ అలీ జిన్నా, లాలా లజపతిరాయ్‌ వంటి నాయకులు హోంరూల్‌ ఉద్యమాన్ని సమర్థించారు. దేశం పోరాటాలతో అట్టుడికిపోయింది. ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకుంది. 1917 ఆగస్టులో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్‌ ‘భారతీయులకు స్వయంపాలన ప్రసాదించడం బ్రిటిష్‌ ప్రభుత్వ లక్ష్యం’ అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన తర్వాత అనిబిసెంట్‌ తన ఉద్యమ తీవ్రతను తగ్గించారు. తిలక్‌ కూడా ‘ఇండియన్‌ అన్‌రెస్ట్‌’ గ్రంథ రచయిత వాలెంటైన్‌ చిరోల్‌పై పరువునష్టం దావా కోసం లండన్‌ వెళ్లడంతో ఉద్యమ తీవ్రత తగ్గింది.


ఉద్యమ ఫలితాలు

హోమ్‌ రూల్‌ ఉద్యమం భౌగోళికంగా దేశమంతా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు విశేషంగా పాల్గొన్నారు. మొదటిసారి అతివాదులు, మితవాదుల మధ్య; కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య ఐకమత్యం ఏర్పడటంతో రాజకీయ ఉత్సాహం తొణికిసలాడింది. చివరకు ప్రభుత్వం జాతీయవాదులను సంతృప్తి పరచడానికి మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను ‘1919, భారత ప్రభుత్వ చట్టం’గా తీసుకొచ్చింది. భారతీయులు తమ డిమాండ్ల సాధనకు ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా వెనుకాడమని రుజువు చేశారు. తర్వాతి కాలంలో గాంధీజీ ప్రజాఉద్యమాలకు వీలుగా  ఈ ఉద్యమం ముందుగానే ప్రజలకు శిక్షణ ఇచ్చి సమాయత్తం చేయడంతో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగరికత

* తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతను, సింధు నాగరికత అంటారు.
* సింధు నాగరికతను నిర్మించింది - ద్రావిడులు.
* సింధు నాగరికత కాలం క్రీ.పూ.2500 - క్రీ.పూ.1750.
* 1921 - 22లో తొలిసారిగా సింధు నాగరికత అవశేషాలు వెలుగు చూశాయి.
* 1922లో హరప్పా వద్ద దయారాం సహాని, మొహెంజొదారో వద్ద ఆర్.డి.బెనర్జీ తవ్వకాలు జరిపారు.
* సింధు నాగరికత వెలికితీతకు కారకుడు - సర్ జాన్ మార్షల్.
* హరప్పా, మొహెంజొదారో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి.
* హరప్పా రావి నదీతీరంలో పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోమరి జిల్లాలో ఉంది.
* మొహెంజొదారో సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలోని లార్ఖాన జిల్లాలో ఉంది.
* కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. ఎ.ఘోష్ ఇక్కడ తవ్వకాలు జరిపారు.
* కాళీభంగన్ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం.
* మొహెంజొదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం.
* లోథాల్ గుజరాత్‌లో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపించింది - ఎస్.ఆర్.రావు.
* సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం - హరప్పా
* హరప్పాలో 6 చిన్న ధాన్యాగారాలు, రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ, కార్మికుల నివాస గృహాలు, ఎక్కాగా పిలిచే ఎడ్లబండి లభించాయి.
* మొహెంజొదారోలో మహాస్నానవాటిక, కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, అతిపెద్ద ధాన్యాగారం లభించాయి.
* సింధు నాగరికత కట్టడాలన్నింటిలోకి పెద్దదైన అనేక స్తంభాలున్న సమావేశపు హాలు బయటపడిన ప్రాంతం - మొహెంజొదారో
* నాగలిచాళ్ల ఆనవాళ్లు, కాలిన మసిగుడ్డ అవశేషాలు లభించిన ప్రాంతం - కాళీభంగన్
* రాతివాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం - ధోలవీర
* గుర్రపు ఎముకల అవశేషాలు లభించిన ప్రాంతం - సుర్కటోడా
* కోటలేని ఏకైక సింధు పట్టణం - చన్హుదారో
* సిరా సీసా (Ink - Well) కనిపించిన పట్టణం - చన్హుదారో
* పూసల పరిశ్రమ ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు - లోథాల్, చన్హుదారో
* వరిపంట ఆనవాళ్లు లభించిన పట్టణాలు - రంగపూర్, లోథాల్
* సింధు ప్రజల ప్రధాన ఓడరేవు - లోథాల్
* రక్షణ కుడ్యంగా రాతిగోడ ఉన్న ఏకైక నగరం - సుర్కటోడ
* మధ్య పట్టణం ఉన్న ఏకైక నగరం - ధోలవీర
* సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత
* సింధు ప్రజల కుటుంబ అధిపతి - తల్లి (మాతృస్వామిక వ్యవస్థ)
* సింధు ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం
* ప్రధాన పంటలు - గోధుమ, బార్లీ
* ప్రధాన దైవం - అమ్మతల్లి, ప్రధాన పురుషదైవం - పశుపతి
* ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది - సింధు ప్రజలు
* తొలిసారిగా కాల్చిన ఇటుకలను వాడింది - సింధు ప్రజలు
* ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవి.
* తూర్పు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే భవనాలు - ప్రభుత్వ భవనాలు
* పశ్చిమ ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి - కోటలు, దుర్గాలు
* సామాన్యుల  గృహాలు తూర్పు పల్లపు ప్రాంతాల్లో ఉండేవి.
* సింధు పట్టణాల్లో రోడ్ల వెడల్పు (వీధుల వెడల్పు) 3 - 10 మీటర్లు.
* పెద్దవీధులు 34 అడుగుల వెడల్పుతో ఉంటే, చిన్నవీధులు 9 అడుగుల వెడల్పుతో ఉండేవి.
* సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి
* సింధు లిపి రాసే విధానం - సర్పలేఖనం
* సింధు లిపిలో మొదటివరుస ఎడమ నుంచి కుడికి, రెండో వరుస కుడి నుంచి ఎడమకు ఉండేది (సర్పలేఖనం).
* సింధు ప్రజలు పూజించిన జంతువు - మూపురం ఉన్న ఎద్దు
* పూజించిన చెట్టు - రావిచెట్టు
* పూజించిన పక్షి - పావురం
* ఎక్కువగా ఉపయోగించిన లోహాలు - రాగి, వెండి
* సింధు ప్రజలకు తెలియని లోహం - ఇనుము
* భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఆర్యులు 1500 BC లో ఉపయోగించారు.
* సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం
* గుర్రం ఎముకలుగా భావిస్తున్న ఆనవాళ్లు సుర్కటోడాలో లభించాయి.
* వీరి కాలంనాటి ముద్రికలను బంకమన్ను, దంతం, స్టిటైట్‌రాయితో తయారుచేశారు.
* సింధు ప్రజలు ఎక్కువగా మెసపటోమియా (ఇరాక్)తో విదేశీ వ్యాపారం నిర్వహించారు.
* బంగారాన్ని కోలార్, అనంతపురం నుంచి దిగుమతి చేసుకునేవారు.
* రాగిని రాజస్థాన్, బెలుచిస్థాన్‌ల నుంచి దిగుమతి చేసుకునేవారు.
* వెండిని అఫ్గనిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* తగరాన్ని బిహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* పర్షియా (ఇరాన్) నుంచి పచ్చలు దిగుమతి చేసుకునేవారు.
* సింధు, మెసపటోమియా రాజ్యాల మధ్య ప్రధాన వాణిజ్య కేంద్రం - మెలూహ
* సింధు నాగరికత కాలం నాటి ఎద్దుబొమ్మ ముద్రిక గురించి 1875 లోనే వ్యాసం రాసిన చరిత్రకారుడు - అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
* సింధు లిపి నుంచే తమిళ భాష పుట్టింది అన్నది - ఫాదర్ హీరాస్
* సింధు లిపి నుంచే బ్రాహ్మీ లిపి పుట్టింది అన్నది - కన్నింగ్ హాం
* ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవారు - వీలర్, గోర్డన్ చైల్డ్
* సింధు నాగరికతపై రోమిలా థాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు:
    1) సింధు నాగరికత మూడు దశలు/అంచెలు ఉన్నాయి.
    2) సింధు ప్రజలకు గుర్రం తెలియదు.
   3) సింధు ప్రజలు వరిని పండించేవారు.
* 'సింధు ప్రజల కాలంలో వరిసాగు లేదు' అన్నది - ఎ.ఎల్. భాషం.
* 'సింధు ప్రజలు యోని - లింగ పూజ చేసేవారు' అన్నది - సర్‌జాన్ మార్షల్.
* సర్ జాన్ మార్షల్ యోని - పూజ సిద్ధాంతాన్ని తిరస్కరించింది - ఎఫ్.డేల్స్.
* భారతదేశంలో అధిక సింధు నాగరికత పట్టణాలు బయటపడిన రాష్ట్రం - గుజరాత్.
* సింధు ముద్రికలపై (270) అధికంగా ముద్రించిన జంతువు - వృషభం.
* కాల్చిన మట్టి బొమ్మలను టెర్రాకోట బొమ్మలుగా పేర్కొంటారు.
* సతీసహగమన ఆచారాన్ని సూచించే ఆనవాళ్లు లభించిన ప్రాంతం లోథాల్.
* టెర్రాకోట బొమ్మలపై కనిపించని జంతువు ఆవు.
* సింధు కాలంనాటి కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి.
* చదరంగం ఆటకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం - లోథాల్.
* నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి.
* నేసిన నూలు వస్త్రం ముక్క (మసిబట్ట) లభించిన ప్రాంతం కాళీభంగన్.
* ఇంగ్లిష్ బాండ్‌గా పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలు.
* స్త్రీలు పెదాలకు రంగులు (లిప్‌స్టిక్) వాడేవారని పేర్కొన్న చరిత్రకారుడు - ఆర్.సి.మజుందార్.
* సింధు ప్రజలు లాపిజ్‌లాజులి అనే ప్రత్యేక రాతిని ఉత్తర అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* నటరాజ విగ్రహాన్ని పోలిన రాతి విగ్రహం లభించిన ప్రాంతం హరప్పా.
* స్త్రీల మర్మాంగాలను పోలిన రాళ్లు హరప్పా పట్టణంలో లభించాయి.
* ఏనుగును మచ్చిక చేసుకున్నట్లు గుజరాత్ ప్రాంతంలో ఆధారాలు లభించాయి.
* జంతు బలి అవశేషాలు లభించిన ప్రాంతం కాళీభంగన్.
* పులిబొమ్మను పోలిన జంతువు ఉన్న టెర్రాకోట ముద్రిక లభించిన ప్రాంతం బన్వాలి.
* సింధు నాగరికతను నిర్మూలించిన వారు ఆర్యులు.


ఆర్య నాగరికత

మలి వేదకాలం క్రీ.పూ. 1000 - 600

* మలి వేదకాలంలో ఆర్యులు గంగా - యమునా అంతర్వేదిలో నివసించేవారు.

* మలివేద ఆర్యుల వలసను బ్రాహ్మణాలు వివరిస్తాయి.
* మలివేద కాలంలో రాజును సామ్రాట్ అని పిలిచేవారు.
* రాజ్యాన్ని మహా జనపథం అనేవారు.
* రాజుకు పాలనలో సహాయపడే ఉద్యోగులను రత్నిన్‌లు అనేవారు.
* పన్ను వసూలు అధికారిని భాగదుషు అనేవారు.
* కోశాధికారిని సంగ్రహితగా పేర్కొనేవారు.
* గణకుడు / గణాంకాధ్యక్షుడిని అక్షవాస అనేవారు (జూద గృహంపై అధిపతి)
* పోలీసు విధులు నిర్వహించే వ్యక్తిని అధికృతగా పేర్కొనేవారు.
* రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయం లాంటి యజ్ఞ యాగాలను మలి వేదకాలంలోనే ప్రారంభించారు.
* మలి వేదకాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయంగా మారింది.
* వరి, గోధుమ, బార్లీ, పత్తి లాంటి పంటలను పండించేవారు.
* వడ్రంగం, లోహపు పని, చర్మాలను శుద్ధి చేయడం, నేత, కుండలు చేయడం లాంటి పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
* మలి వేదకాలంలో దంతపు పని (ట్యానింగ్ పరిశ్రమ) లేదు.
* శతమాన, కర్షాపణ (కృష్ణాలు) లాంటి నాణేలు వాడేవారు.
* వర్ణ వ్యవస్థ క్లిష్టమైంది. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఆవిర్భవించాయి.
* వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు మలి వేదకాలంలో అభివృద్ధి చెందాయి.
* వర్ణాశ్రమ ధర్మాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణం.
* బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం ధర్మాలను ఛాందోగ్యోపనిషత్తు వివరించగా, సన్యాసంతో సహా నాలుగు ఆశ్రమ ధర్మాలను 'జాబాలోపనిషత్తు' వివరించింది.
* గోత్ర వ్యవస్థ మలి వేదకాలంలోనే (అధర్వణ వేదం) ఆవిర్భవించింది.
* స్త్రీ స్థానం దిగజారింది. వంటింటికే పరిమితమైంది. బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి.
* మలి వేదకాలంలో త్రిమూర్తుల ఆరాధన ప్రధానంగా ఉండేది.
* రుగ్వేదంలోనే 33 మంది దేవుళ్ల ప్రస్తావన కనిపిస్తుంది.
* అగ్ని దేవుడిని రెండో అతి ముఖ్యమైన దేవుడిగా పేర్కొన్నారు. 'అగ్ని'ని దేవతలకు, ప్రజలకు మధ్యవర్తిగా ప్రస్తావించారు.
* సోమ, సుర అనే మత్తు పానీయాలను ఆర్యులు సేవించేవారు.
* సోమను యజ్ఞ యాగాల సమయంలో, సురను అన్నివేళలా సేవించేవారు.
* వస, అధివస అనే దుస్తులను ఆర్యులు ధరించేవారు.
* వేదకాలంలో అతిథిని గోఘన అని పిలిచేవారు.
* ధాన్యాన్ని వృహి అని, ఇనుమును అయస్ అని పిలిచేవారు.
* ఆర్య నాగరికతను దక్షిణా పథంలో విస్తరింపజేసింది అగస్త్యుడు.
* 'యుద్ధం ఎల్లప్పుడూ మానవ హృదయాల్లో ప్రారంభమవుతుంది' అని అధర్వణ వేదం పేర్కొంది.
* మలివేద కాలం నాటికి రాజు అధికారాలు బలపడినట్లు శతపథ బ్రాహ్మణం వివరిస్తుంది.
* రుగ్వేద కాలంలో వర్ణం అంటే వర్గం అని అర్థం. కానీ మలి వేదకాలంలో వర్ణం అంటే కులం అని అర్థం.
* మలివేద కాలం నాటి శూద్రుల ప్రత్యేక దైవంగా పుషాన్‌ను పేర్కొంటారు.
* సీతను నాగలి దేవతగా పేర్కొంటారు.
* 'ఉపనయన' క్రతువు గురించి శతపథ బ్రాహ్మణం వివరించింది.
* హిందూ మతంలో 44 సంస్కారాలు ఉండేవి.
* మలి వేదకాలంలో రాజ్యాలు, భూముల ఆక్రమణల కోసం యుద్ధాలు జరిగేవి.
* ఉపనయన సంస్కారం పొందే అర్హత కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలను 'ద్విజులు' అని పిలిచారు.
* వడ్డీ వ్యాపారం గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొన్నారు.
* విధాత అనేది పురాతమైన గిరిజన/ ఆటవిక జాతుల సభ. మలివేద కాలంలో ఈ సభ అదృశ్యమైంది.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం - సాహసవీరులు!

ఛందేల రాజుల కాలంలో నిర్మించిన ఖజురహో దేవాలయాలు హర్షుడి అనంతరం మన దేశంలో అనేక పరిణామాలు సంభవించాయి. రకరకాల రాజవంశాలు ఆవిర్భవించి స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాయి. కానీ వీరందరిలో అనైక్యత కారణంగా ఏర్పడిన పరిస్థితులు అరబ్బుల దాడులకు, యూరోపియన్ల విస్తరణకు దారితీశాయి. భారత దేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్‌ల దండయాత్రలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చివేశాయి. ఆ దాడులు సోలంకీలు, చౌహానుల కాలాల్లో జరిగాయి. అప్పటి పరిస్థితులు, ఆ యుద్ధాలకు కారణాలను మధ్యయుగంలో మన దేశాన్ని పాలించిన రాజపుత్రుల్లో ప్రతీహారులు, పరమారులు, ఛందేలుల అనంతరం మరికొన్ని వంశాల వారు ఉన్నారు. ఆ రాజుల కాలంలో ఎన్నో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. మధ్యయగ అధ్యయనంలో భాగంగా పోటీపరీక్షల అభ్యర్థులు ఈ వివరాలను తెలుసుకోవాలి.


మధ్యయుగ భారతదేశ చరిత్ర - రాజపుత్ర యుగం

  భారతదేశ చరిత్రలో క్రీ.శ.8 నుంచి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మధ్యయుగం అంటారు. ఇది రాజపుత్రులతో ప్రారంభమై ఐరోపావారి రాక వరకు కొనసాగుతుంది. భూస్వామ్య వ్యవస్థ/ ఫ్యూడలిజం నాటి ప్రధాన లక్షణంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ యుగం అధ్యయనంలో భాగంగా ఉత్తర భారతదేశంలో రాజపుత్ర యుగం, మహమ్మదీయ దండయాత్రలు, ఢిల్లీ సుల్తానులు, మొగల్‌ సామ్రాజ్యం; దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, యాదవులు, హొయసాలులు, పాండ్యులు, విజయనగర, బహమనీ సామ్రాజ్యాల గురించి తెలుసుకోవాలి.

రాజపుత్రులు

  హర్షుడి మరణానంతరం ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పరిపాలించారు. వారిలో ప్రతీహారులు, పరమారులు, ఛందేలులు, చౌహానులు, సేన, పాల, గహద్వాలు లాంటి సుమారు 36 రాజ వంశాల వారు ఉన్నారు. వీరు ఉత్తర భారతదేశంలో అనేక దేవాలయాలు, కోటలను నిర్మించి వాస్తు, కళారంగాల అభివృద్ధికి కృషి చేశారు. సంస్కృత భాషను అధికార భాషగా చేసుకుని పాలించారు. అనేకమంది కవి పండితులను పోషించి భాష, సాహిత్యాల వికాసానికి తోడ్పడ్డారు. దేశభక్తి, ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్రులు అనైక్యత కారణంగా మహమ్మదీయుల చేతిలో ఓడి, రాజ్యాలను కోల్పోయారు.

ఎవరు వీరు?

  రాజపుత్రుల జన్మస్థల మూలాల గురించి పరిశోధనలు చేసిన అనేక మంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజపుత్ర రాజులు శాసనాల్లో వారిని సూర్యవంశ, చంద్రవంశ క్షత్రియులుగా ప్రకటించుకున్నారు. కానీ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఆస్థాన కవి చాంద్‌బార్థై తన రచన ‘పృథ్వీరాజ్‌ రాసో’లో రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్నాడు. కల్నల్‌ టాడ్‌ అనే చరిత్రకారుడు రాజపుత్రులపై పరిశోధన చేసి రచించిన ‘రాజస్థాన్‌ కథావళి’ (ఏనల్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌)లో వారిని విదేశీ జాతుల సంతతిగా చెప్పాడు. రాజపుత్రుల కాలంలో క్రీ.శ.712లో జరిగిన అరబ్బుల సింధు దండయాత్రను ప్రామాణికంగా తీసుకున్న చరిత్రకారులు క్రీ.శ.8వ శతాబ్దం నుంచే మధ్యయుగం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

ప్రతీహారులు

  రాజపుత్రుల్లో తొలి వంశంగా ప్రసిద్ధి పొందిన ప్రతీహారులు నేటి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కనోజ్‌ పరిసర ప్రాంతాలను పాలించారు. ప్రతీహారులు అంటే ద్వారపాలకులు అని అర్థం. వీరి చరిత్రకు ప్రధాన ఆధారమైన రాజౌర్‌ (రాజోర్‌) శాసనం ప్రకారం ఈ వంశ మూలపురుషుడు హరిశ్చంద్రుడు. వీరు నేటి మాళ్వా, కనోజ్‌ ప్రాంతాలను పాలించేవారు. ప్రతీహారుల్లో మొదటి నాగభట్టు, మొదటి వత్సరాజు, రెండో నాగభట్టు, మొదటి భోజుడు (మిహిర భోజుడు) ప్రసిద్ధి చెందారు. గ్వాలియర్‌ శాసనం మొదటి నాగభట్టు విజయాలను వివరిస్తుంది. ఇతడి కాలంలోనే కనోజ్‌పై ఆధిపత్యం కోసం పాల, ప్రతీహార, రాష్ట్రకూట వంశాల మధ్య త్రిముఖ పోరాటం ప్రారంభమైంది.

  మొదటి వత్సరాజు కాలంలో ప్రతీహారులకు పాల వంశీయులతో ఘర్షణలు మొదలయ్యాయి. ఇతడు నాటి రాష్ట్రకూట రాజు ధ్రువుడి చేతిలో ఓడిపోయి మాళ్వాను కోల్పోయాడు. మొదటి వత్సరాజు ఆస్థానంలోని ఉద్యోధనుడు అనే కవి ‘కువలయమాల’ గ్రంథాన్ని రచించాడు. ప్రతీహారుల్లో మొదటి మిహిర భోజుడు గొప్పవాడిగా ఖ్యాతి పొందాడు. మిహిర, ఆదివరాహ లాంటి బిరుదులతో పాలించిన ఇతడు చౌహాన్‌ రాకుమారి కళావతిని వివాహం చేసుకున్నాడు. ఇతడి పాలనా కాలంలోనే సులేమాన్‌ అనే అరబ్బు యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఈ వంశానికి చెందిన మహేంద్రపాలుడు తన ఆస్థానంలో రాజశేఖరుడు అనే కవిని పోషించాడు. కర్పూర మంజరి, కావ్య మీమాంస లాంటి ప్రముఖ గ్రంథాలను రాజశేఖరుడు రచించాడు. మహీపాలుడి కాలంలో అరబ్బు యాత్రికుడు అల్‌మసూది వీరి రాజ్యాన్ని సందర్శించాడు. గజనీ మహమ్మద్‌ చేతిలో ఓడిపోయిన రాజ్యపాలుడి అనంతరం విజయపాలుడు, త్రిలోచన పాలుడు రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వంశంలో చివరి పాలకుడు యశపాలుడు.

పరమారులు

  ప్రతీహారులకు సామంతులుగా పరమారులు నేటి మాళ్వా ప్రాంతాన్ని పాలించేవారు. ధార్‌ (ధారా నగరం), ఉజ్జయిని నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యం చేశారు. పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. రాజ్యస్థాపకుడైన వాక్పతిరాజు (ముంజరాజు) నాటి కల్యాణి చాళుక్య రాజు రెండో తైలపుడిని ఓడించాడు. ముంజసాగరం అనే చెరువును తవ్వించాడు. ఇతడి ఆస్థానంలో పద్మగుప్తుడు, ధనుంజయుడు, ధనిక, హలాయుధ కవి పండితులు ఉండేవారు. ధనుంజయుడు దశరూప గ్రంథాన్ని రచించాడు. పరమారుల్లో గొప్పరాజు భోజుడు (పరమార భోజుడు). ఇతడికి కవిరాజు అనే బిరుదు ఉంది. ఈయన తన ఆస్థానంలో ధనపాల, శోభన, శాంతిసేన, ప్రభా చంద్రసూరి, విజ్ఞానేశ్వరుడు లాంటి కవులను పోషించాడు.

  పరమార భోజుడు భోజపురి నగరాన్ని, భోజశాల అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. ఇతడు ఆయుర్వేద సర్వస్వం, సమరాంగణ సూత్రధార (వాస్తు శాస్త్రం) లాంటి 12 గ్రంథాలను రచించాడు. శ్రీకృష్ణ దేవరాయలను పరమార భోజుడితో పోల్చి ఆంధ్రభోజుడిగా కీర్తించారు. ధార్‌ నగరంలోని సరస్వతీ ఆలయం భోజుడి కాలంలో నిర్మించిన గొప్ప దేవాలయం. పరమారుల్లో చివరి పాలకుడైన మహ్లాక దేవుడిని అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఓడించాడు. దీంతో పరమార రాజ్యం పతనమైంది.

ఛందేలులు

  ప్రతీహారులకు సామంతులుగా ఛందేలులు నేటి మధ్యప్రదేశ్‌లోని ఖజురహోను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. ఛందేల వంశ మూలపురుషుడిగా జయశక్తిని పేర్కొంటారు. యశోవర్మ అనే రాజు స్వతంత్ర ఛందేల రాజ్యస్థాపన చేశాడు. ఈయన కుమారుడు ధంగ ఛందేల వంశ రాజుల్లో గొప్ప పాలకుడిగా పేరొందాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలను ధంగ నిర్మించాడు. మొదట యశోవర్మ ఖజురహోలో చతుర్భుజ విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో ఇక్కడ ధంగ మహారాజు విశ్వనాథ, జిననాథ, దిననాథ ఆలయాలను నిర్మించాడు. ధంగ అనంతరం రాజ్యానికి వచ్చిన విద్యాధరుడు గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. ఈ వంశ చివరి పాలకుడు రెండో విక్రమవర్మను ఓడించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్యాన్ని ఆక్రమించాడు.

సోలంకీలు

  ప్రస్తుత గుజరాత్‌లోని అనిహిల్‌వాడ్‌ను రాజధానిగా చేసుకుని సోలంకీలు రాజ్యపాలన చేశారు. వీరినే ‘లాట చాళుక్యులు’ అని పిలుస్తారు. ఈ వంశ, రాజ్య స్థాపకుడు మూలరాజు. మొదటి చాళుక్య భీముడు (సోలంకీ భీముడు) గజనీ మహమ్మద్‌ దండయాత్రలను ఎదుర్కొన్నాడు. క్రీ.శ.1026లో సోలంకీ భీముడిని ఓడించి కథియవాడ్‌లోని సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేశాడు. ఇప్పటి రాజస్థాన్‌లోని మౌంట్‌అబూ పర్వత శిఖరంపై ఉన్న దిల్వారా జైన దేవాలయాలను సోలంకీ భీముడు నిర్మించాడు. సోలంకీ రాజు కర్ణుడు నేటి అహ్మదాబాద్‌ నగరాన్ని నిర్మించాడు. ఈ వంశ రాజుల్లో గొప్పవాడిగా పేరుపొందిన జయసింహ సిద్ధరాజు అనేక మంది కవి పండితులను పోషించాడు. ప్రముఖ జైన పండితుడు హేమచంద్రుడు ఇతడి ఆస్థానంలోనివాడే. హేమచంద్రుడి ప్రముఖ రచన పరిశిష్ఠపర్వం. జయసింహ సిద్ధరాజు సిద్ధపురంలోని రుద్ర మహకాల్‌ ఆలయాన్ని నిర్మించాడు. అనంతరం పాలనకు వచ్చిన కుమారపాలుడు, హేమచంద్రుడి ప్రభావంతో జైనమత పోషకుడిగా మారాడు. కానీ కుమారపాలుడి కుమారుడు అజయపాలుడు జైన దేవాలయాలను కూల్చి, జైన పండితులను హింసించాడు. ఘోరీ మహమ్మద్‌ దండయాత్రల కాలంలో రెండో మూలరాజు బాలుడిగా ఉండటంతో అతడి తల్లి నాయకీదేవి సైన్యాలను నడిపి మౌంట్‌అబూ యుద్ధంలో (క్రీ.శ. 1178) తురుష్కులను ఓడించింది. ఆ తర్వాత పాలనకు వచ్చిన రెండో భీముడు సోమనాథ దేవాలయానికి మరమ్మతులు చేయించాడు. ఇతడు ఘోరీ, కుతుబుద్దీన్‌ ఐబక్‌ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో సోలంకీ రాజ్యం పతనమైంది. బరోడా వద్ద ఉన్న సూర్యదేవాలయం, మౌంట్‌అబూలోని విమల దేవాలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.

చౌహానులు

  నేటి తూర్పు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన ప్రముఖ రాజపుత్ర వంశం చౌహానులు. వీరినే చహమానులు అని వ్యవహరిస్తారు. మొదట ప్రతీహారులకు సామంతులుగా ఉండేవారు. చౌహాన్‌ వంశ స్థాపకుడు సింహరాజు ‘మహారాజాధిరాజు’ బిరుదుతో పాలన చేశాడు. అజ్మీర్‌ ప్రాంతంలోని శాకంభరి (నేటి సాంభర్‌ సరస్సు ప్రాంతం) ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 12వ శతాబ్దంలో రెండో అజయరాజు తన రాజధానిని శాకంభరి నుంచి అజ్మీర్‌కు (అజయమేర్‌) మార్చాడు. చౌహానులు రాజ్య విస్తరణలో భాగంగా నాటి గుజరాత్‌ సోలంకీలు/చాళక్యులతో, మాళ్వా - పరమారులతో, తురుష్క పాలకులైన గజనీ, ఘోరీలతో పోరాడారు. మహారాజు బిరుదుతో పాలించిన వాక్పతిరాజు పుష్కర్‌ వద్ద శివాలయాన్ని కట్టించాడు. చౌహానుల్లో ఒకరైన నాలుగో విగ్రహరాజు విశాలదేవుడు ‘హరకేళి’ అనే ప్రసిద్ధ రచన చేశాడు. ఈ గ్రంథంలోని (నాటకం) కొన్ని అంశాలను అర్హిదిన్‌కా జోంప్రా మసీదు గోడలపై చిత్రించారు. విశాలదేవుడి ఆస్థానంలోని సోమదేవుడు అనే కవి లలిత విగ్రహరాజు అనే నాటకాన్ని రచించాడు. విగ్రహరాజు ‘కవి బాంధవ’ అనే బిరుదును పొందాడు. ఇతడు అజ్మీర్‌లో సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాడు. విశాల్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించాడు. చౌహానుల్లో గొప్పరాజు మూడో పృథ్వీరాజ్‌. క్రీ.శ.1179-1192. ఈయనను ముస్లిం రచనల్లో రాయపితౌరా అని ప్రస్తావించారు.

ఘోరీ మహమ్మద్‌తో ఇతడు రెండు తరైన్‌ యుద్ధాలు చేశాడు. 1191 నాటి మొదటి తరైన్‌ యుద్ధంలో ఘోరీని ఓడించాడు. కానీ 1192 నాటి రెండో తరైన్‌ యుద్ధంలో ఘోరీ చేతిలో మరణించాడు. పృథ్వీరాజ్‌ ఆస్థాన కవి చాంద్‌బార్ధై ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే ప్రముఖ గ్రంథాన్ని హిందీలో రాశాడు.

గహద్వాలులు

  కనోజ్‌ను రాజధానిగా చేసుకుని ప్రతీహారులకు సామంతులుగా పాలించినవారు గహద్వాలులు. వీరి రాజ్య స్థాపకుడు చంద్రదేవుడు. ఈ వంశంలో గొప్పవాడు జయచంద్రుడు. గోవింద చంద్రుడి కాలంలో 14 మంది రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించారు. ఈయన ఆస్థాన కవి లక్ష్మీధరుడు కృత్యకల్పతరు/కల్పద్రుమ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. గోవింద చంద్రుడి భార్య కుమార దేవి బౌద్ధమతాన్ని అవలంబించి సారనాథ్‌లో ఒక విహారాన్ని నిర్మించింది. జయచంద్రుడి కాలంలో అతడి కుమార్తె రాణి సంయుక్తను మూడో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తీసుకుపోవడంతో ఘోరీ మహమ్మద్‌ను ఇతడు భారతదేశ దండయాత్రకు ఆహ్వానించాడు. జయచంద్రుడి ఆస్థాన కవి శ్రీహర్షుడు ‘నౌషధ చరిత్ర’ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. గహద్వాలుల్లో చివరి రాజు హరిశ్చంద్రుడు.

సేన రాజులు: బెంగాల్‌ ప్రాంతాన్ని పాలించిన సేన వంశ స్థాపకుడు సామంత సేనుడు. ధనసాగర, అద్భుతసాగర లాంటి గ్రంథాలను ఈ వంశానికి చెందిన భల్లాలసేనుడు రాశాడు. లక్ష్మణసేనుడి ఆస్థాన కవి జయదేవుడు గీతగోవిందం అనే ప్రసిద్ధ రచన చేశాడు.


తూర్పుగాంగులు: ప్రస్తుత ఒడిశా ప్రాంతాన్ని ఈ రాజులు పాలించారు. ఈ వంశాన్ని అనంతవర్మన్‌ బోడగాంగుడు స్థాపించాడు. భువనేశ్వర్‌ లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ ఆలయాలను వీరి కాలంలోనే నిర్మించారు.


కశ్మీర్‌ పాలకులు: కశ్మీర్‌ను కర్కోట, ఉత్పల, లోహార వంశీయులు పరిపాలించారు. కర్కోట వంశరాజు అనంతవర్మన్‌ తన ఆస్థానంలో రత్నాకరుడు, ఆనంద వర్ధనుడు అనే కవులను పోషించాడు. ఉత్పల వంశ రాజు క్షేమగుప్తుడి భార్య దిడ్డ 50 ఏళ్లు కశ్మీర్‌ను పాలించింది. లోహర వంశ రాజు శ్రీహర్షుడి ఆస్థానంలో ‘కల్హణుడు’ రాజతరంగిణి గ్రంథాన్ని రాశాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

1. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపథం?
జ: అస్మక

2. షోడశ మహాజనపథాల కాలంలో వ్యవసాయ కూలీలను ఏమని పిలిచేవారు?
: భర్తుకా

3. అలెగ్జాండర్‌ దండయాత్ర కాలం క్రీ.పూ.327 - 324 అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు?
జ: అరెల్‌స్టైన్‌

4. భారతదేశంలో తొలి దేశ ద్రోహిగా పేరొందిన వ్యక్తి
జ: అంబి

5. ‘కురు’ జపపథానికి రాజధాని?
జ: ఇంద్రప్రస్థ

6. షోడశ మహాజనపథాల్లోని గణరాజ్యాలు ఎన్ని?
జ: 2

7. రెండో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించారు?
జ: వైశాలి

8.మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినవారు?
జ: మహాకస్యపుడు

Posted Date : 07-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

  భారతదేశ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం మౌలికమైన మార్పులకు కారణమైంది. ఈ కాలంలో షోడశ మహాజనపథాలు ఆవిర్భవించి రెండో పట్టణీకరణకు దోహదం చేయగా అనేక నూతన మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంపై పారశీక, గ్రీకు దండయాత్రలు జరిగాయి. వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారు. మలివేద కాలం చివరినాటికి (క్రీ.పూ.6వ శతాబ్దం) ఉత్తర భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో కొత్తమార్పులు సంభవించాయి. 16 మహాజనపథాలు ఆవిర్భవించి మగధ తొలి సామ్రాజ్యంగా ఏర్పడింది.


షోడశ మహాజనపథాలు

  క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 మహాజనపథాలు ఏర్పడ్డాయి. వీటినే షోడశ మహాజనపథాలు అంటారు. సంస్కృతంలో ‘జన’ అంటే ప్రజలు, ‘పథం’ అంటే నివాసప్రాంతం అని అర్థం. 16 జనపథాల్లో 15 జనపథాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడగా ఒకే ఒక జనపథం ‘అస్మక’ దక్షిణ భారతదేశంలో ఏర్పడింది. వీటిలో 14 జనపథాలు రాచరిక వ్యవస్థను కలిగి ఉంటే వజ్జి, మల్ల అనే రెండు జనపథాల్లో గణరాజ్య వ్యవస్థ లేదా గణపాలన ఉండేది.


తొలి సామ్రాజ్యం

  భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ మహాజనపథాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపథాలను జయించి విశాల సామ్రాజ్యంగా విస్తరించింది. దీని రాజధానులు రాజగృహం (గిరివ్రజం), వైశాలి, పాటలీపుత్ర. మగధను హర్యంక, నందవంశం లాంటి పటిష్ఠమైన రాజవంశాలు; బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు, ధననందుడు వంటి బలమైన రాజులు పరిపాలించారు. విస్తారమైన ఇనుపగనులు మగధ దక్షిణ భాగంలో ఉండటం, సారవంతమైన గంగ, సోన్, గండక్‌ నదులు ప్రవహించడం; అటవీసంపద, ఏనుగులను వినియోగించుకోవడం; నిత్యం విదేశీ దండయాత్రలు జరిగే ఈశాన్య భారతదేశానికి దూరంగా ఉండటం వల్ల ఇది బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది.

  పురాణకాలంలో మగధను రిపుంజయుడు అనే రాజు పరిపాలించేవాడు. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు అతడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువు వైవాహిక సంబంధాలు, యుద్ధ విజయాల ద్వారా మిగిలిన మహాజనపథాలను మగధలో విలీనం చేశాడు. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు. గంగా - సోన్‌ నదుల మధ్య పాటలీపుత్ర దుర్గాన్ని అజాతశత్రువు నిర్మించాడు. మొదటి బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో మహాకస్యపుడి అధ్యక్షతన నిర్వహించాడు. తన మంత్రి వసకార సహాయంతో లిచ్ఛవుల రాజ్యాన్ని ఆక్రమించాడు.
 అజాతశత్రువు తర్వాత ఉదయనుడు రాజ్యానికి వచ్చాడు. హర్యంక వంశస్థులు పితృహంతకులుగా పేరొందారు. ఈ వంశం అనంతరం మగధను శైశునాగ వంశస్థులు పరిపాలించారు. శిశునాగుడు, అతడి కుమారుడు కాలాశోకుడు మగధను పాలించారు. కాలాశోకుడి కాలంలోనే రెండో బౌద్ధ సంగీతిని సబకామి అధ్యక్షతన వైశాలి నగరంలో నిర్వహించారు. 

  మహాపద్మనందుడు మగధలో శైశునాగ వంశాన్ని నిర్మూలించి నందవంశపాలనను ప్రారంభించాడు. ఇతడి బిరుదులు ఉగ్రసేన, ఏకరాట్‌. చివరి నందవంశ పాలకుడైన ధననందుడిని ఓడించి మగధను ఆక్రమించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు.


సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు

  షోడశ మహాజనపథాల కాలాన్ని భారతదేశ చరిత్రలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. (భారతదేశంలో తొలి నగరీకరణ సింధు నాగరికత కాలం). ఈ కాలంలో అయోధ్య, కౌశాంబి, తక్షశిల, కాశీ పట్టణాలు అభివృద్ధి చెందాయి. వైశాలి, బరుకచ్చం, తక్షశిల, ఉజ్జయిని లాంటి రేవు పట్టణాలు విదేశీ వ్యాపారంలో కీలకపాత్రను పోషించాయి. దీంతో అనేక నూతన వ్యాపార రహదారులు ఏర్పడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా నాణేల చలామణీ అమల్లోకి వచ్చింది. నాటి నాణేలను విద్దాంక నాణేలు అనేవారు. వేదకాలంలో నాణేలు వాడినట్లు సాహిత్యంలో పేర్కొన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సమాజంలో రాజు, సైనికులు, వ్యవసాయదారులు, వృత్తిపనివారు, బానిసలు లాంటి అనేక వర్గాలు ఉండేవి. కుటుంబ పెద్దను/వ్యవసాయ అధిపతిని ‘గాహపతి’ (గృహపతి), వ్యవసాయ కూలీలను ‘భర్తుకా’ అనేవారు. వృత్తిపనివారు ఏడాదిలో ఒకరోజు రాజు పొలంలో ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు.

బానిసలు, స్త్రీలు, పిల్లలకు రాజకీయ సభలు, సమావేశాల్లో ప్రవేశం ఉండేది కాదు. ప్రజలు ప్రకృతి శక్తులు, స్త్రీ దేవతలను, వేదకాలం నాటి దేవతలను ఆరాధించేవారు. నేటి హిందూ సమాజంలో అనుసరిస్తున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, సాంఘిక దురాచారాలు ఆ కాలంలోనే ఉన్నాయి. సమాజంలో ధనవంతులకు గ్రామ పెద్దగా ఉండే అవకాశాన్ని కల్పించేవారు.

  వ్యవసాయ ఉత్పత్తులు అధికమవడం, చేతివృత్తులు అభివృద్ధి చెందడం; విదేశీ, దేశీయ వాణిజ్యాలు పెరగడం వల్ల నాటి సమాజం ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేది.


విదేశీ దండయాత్రలు (పారశీక, గ్రీకు)

  భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చి సింధు నాగరికత పతనానికి కారణమయ్యారని అధ్యయనం చేశాం కానీ భారతదేశంపైకి దండెత్తిన తొలి విదేశీ పాలకుడు/రాజుగా సైరస్‌ ది గ్రేట్‌ను పేర్కొంటారు (ఆర్యులు సమూహంగా వచ్చారు, వారి నాయకుడు ఎవరో తెలియదు). పారశీక (పర్షియన్‌/ఇరాన్) చక్రవర్తి అయిన సైరస్‌ ది గ్రేట్‌ క్రీ.పూ.553లో, అతడి వారసుడైన మొదటి డేరియస్‌ క్రీ.పూ.516లో భారతదేశంపై దండెత్తారు. వీటినే పారశీక దండయాత్రలుగా పేర్కొంటారు. ఈ దండయాత్రల వల్ల భారతదేశం, ఇరాన్‌ మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. పారశీకుల నమూనా నాణేలను భారతీయులు వాడుకలోకి తెచ్చారు.


అలెగ్జాండర్‌ దండయాత్ర

  భారతదేశ చరిత్రలో కాల నిర్ణయానికి తోడ్పడింది అలెగ్జాండర్‌ దండయాత్ర. అరెల్‌స్టైన్‌ అనే చరిత్రకారుడి ప్రకారం క్రీ.పూ.327 - 324 మధ్య అలెగ్జాండర్‌ భారతదేశంపైకి దండెత్తాడు. ఈయన గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజ్యానికి చెందిన ఫిలిప్‌ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్న వయసులోనే చక్రవర్తి అయిన అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనే ఆశయంతో విదేశీ దండయాత్రలు చేశాడు. మొదట పారశీకులపైకి దండెత్తి, అర్భేలా యుద్ధంలో పారశీక చక్రవర్తి అయిన మూడో డేరియస్‌ను ఓడించాడు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. జీలం, చీనాబ్‌ నదుల మధ్య గల విశాల సామ్రాజ్యానికి రాజైన పురుషోత్తముడిని (పోరస్) ఓడించలేక తక్షశిల రాజైన అంబి భారతదేశ దండయాత్రకు అలెగ్జాండర్‌ను ఆహ్వానించి తొలి దేశ ద్రోహిగా పేరొందాడు. అయితే అలెగ్జాండర్‌ మొదట అంబినే ఓడించి అతడి సహాయంతో భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై దండెత్తాడు.

  అలెగ్జాండర్‌ దండయాత్రలో అతి ప్రధానమైంది జీలం నది యుద్ధం లేదా హైడాస్ఫస్‌ యుద్ధం. గ్రీకులు తమ గ్రంథాల్లో జీలం నదిని హైడాస్ఫస్‌ నదిగా, పురుషోత్తముడిని పోరస్‌గా పేర్కొన్నారు. క్రీ.పూ.326లో పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ మధ్య హైడాస్ఫస్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరస్‌ ఓడిపోయినప్పటికీ అలెగ్జాండర్‌ అతడి ధైర్య సాహసాలకు మెచ్చి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. అనంతరం నాటి మగధ రాజ్యంపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. కానీ తన సైనికుల అనాసక్తి వల్ల ధననందుడిపై దండెత్తకుండానే వెనుదిరిగాడని చరిత్రకారులు పేర్కొంటారు. భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు సెల్యూకస్‌ నికేటర్‌ను ప్రతినిధిగా నియమించిన అలెగ్జాండర్‌ తిరుగు ప్రయాణంలో క్రీ.పూ.323లో బాబిలోనియాలో మరణించాడు.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.

  క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.

* మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.


జైనమతం - ఆవిర్భావం 

  జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.


మహావీరుడి జీవితం, బోధనలు:

  వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.

  వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.

* మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.


పంచ మహావ్రతాలు:

  జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి. 1) అహింస, 2) సత్యం, 3) అస్తేయం (దొంగిలించకూడదు), 4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు), 5) బ్రహ్మచర్యం. అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి. 

  జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.


రాజుల ఆదరణ 

  చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.

* క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.

* కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.

* క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.

మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.

* క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.


జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
    1. స్తూపం
    2. చైత్యం
    3. విహారం
* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
* మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
* ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
* తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
* ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
* 'నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
* శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
*  'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గాంధీయుగం

  భారత జాతీయోద్యమంలో 1920 - 1947 మధ్యకాలాన్ని గాంధీయుగంగా పేర్కొన్నారు. గాంధీజీ ఈ యుగంలో సత్యం, అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలను నిర్వహించి 1947లో స్వాతంత్య్రం రావడానికి కృషి చేశారు. జుదిత్‌ ఎం.బ్రౌన్‌ అనే చరిత్రకారిణి ‘‘గాంధీజీ అన్ని వర్గాలను జాతీయోద్యమంలో పాల్గొనేలా చేశారు. ప్రాంతీయ అవసరాలు తీర్చుకోవడానికి సత్యాగ్రహ ఆయుధాన్ని ప్రజలకు అందించారు’’ అని పేర్కొన్నారు.


తొలి జీవితం

  గాంధీజీ అసలు పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. ఆయన 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. తండ్రి కరమ్‌చంద్‌గాంధీ, తల్లి పుత్లీబాయి. గాంధీకి తన 12వ ఏటనే కస్తూరీబాయితో వివాహమైంది. 19వ ఏట బారిష్టర్‌ చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. తర్వాత భారతదేశానికి వచ్చి మొదట రాజ్‌కోట్‌లో తర్వాత బొంబాయిలో న్యాయవాదవృత్తిని చేపట్టారు. రాజ్‌చంద్ర రజ్వీభాయి ప్రభావంతో సత్యం, అహింస మార్గాలపై నమ్మకం పెంచుకున్నారు.
1893లో గుజరాత్‌కు చెందిన దాదా అబ్దుల్లా కంపెనీ కేసు నిమిత్తం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1894లో అక్కడే నేటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఫోనిక్స్‌ ఆశ్రమాన్ని, టాల్‌స్టాయ్‌ ఫామ్‌లను ప్రారంభించారు. 1906 నాటి నేటల్‌ జూలూ తిరుగుబాటు కాలంలో ‘‘ప్రపంచ శ్రేయస్సుకే బ్రిటిష్‌ సామ్రాజ్యం నెలకొని ఉంది’’ అని గాంధీ పేర్కొన్నారు. 1907లో ఆంగ్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏషియాటిక్‌ లా ఎమెండ్‌మెంట్‌ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్టయ్యారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. డర్బన్‌ నుంచి ప్రిటోరియాకు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు గాంధీజీని బ్రిటిషర్లు పీటర్స్‌ మారిస్‌బర్గ్‌ అనే ప్రదేశంలో రైలు నుంచి కిందికి నెట్టేశారు. అప్పుడు కోట్స్‌ అనే డచ్‌ జాతీయుడు ఆంగ్లేయులపై కేసు వెయ్యమని, తాను సాక్ష్యం చెబుతానని అన్నప్పటికీ గాంధీజీ కేసు వేయలేదు. మీర్‌ ఆలమ్‌ అనే వ్యక్తి గాంధీపై అసత్య ఆరోపణలు చేసి దాడి చేశాడు. ఆ సంఘటనతో ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికా సంపాదకుడైన జోసెఫ్‌డోక్‌ గాంధీని తన నివాసంలో ఉంచి చికిత్స చేయించాడు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు తన వ్యాసాలను ‘ఇండియన్‌ ఒపీనియన్‌’ పత్రికలో రాసేవారు.


జాతీయ కాంగ్రెస్‌ నాయకుడిగా..

  1919లో ఆంగ్ల ప్రభుత్వం మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడంతో జాతీయ నాయకులు దీన్నివ్యతిరేకించారు. 1919, ఏప్రిల్‌ 6న ఆంగ్ల ప్రభుత్వం రౌలత్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భారతీయుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పూర్తిగా హరించే ఈ  చట్టాన్ని గాంధీ ‘ఒక నల్ల చట్టంగా, విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణంగా’ అభివర్ణించి రౌలత్‌ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. గాంధీ చేపట్టిన తొలి అఖిల భారత సమస్య (తొలి అఖిల భారత ఉద్యమం) రౌలత్‌ సత్యాగ్రహం.
ఏప్రిల్‌ 6వ తేదీని ‘‘జాతిని అవమానించిన దినం’’గా ప్రకటించి ఉద్యమం ప్రారంభించారు. రౌలత్‌ సత్యాగ్రహ సమయంలోనే గాంధీ తొలిసారిగా ఆంధ్రదేశాన్ని సందర్శించారు. విజయవాడలోని రామ్మోహన్‌ రాయ్‌ గ్రంథాలయంలో ప్రసంగించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. ఢిల్లీలో రౌలత్‌ సత్యాగ్రహ సమయంలో పోలీసు కాల్పులకు వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి స్వామి శ్రద్ధానంద.


జలియన్‌వాలా బాగ్‌ దురంతం

  రౌలత్‌ చట్టం ప్రకారం అమృత్‌సర్‌లో డాక్టర్‌ సత్యపాల్, సైఫుద్దీన్‌ కిచ్లూలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ విషయంపై చర్చించడానికి 1919, ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ పార్క్‌లో పంజాబ్‌ ప్రజలు సమావేశమయ్యారు. నాటి పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మైఖేల్‌ ఒ. డయ్యర్‌ ఆజ్ఞ ప్రకారం నాటి అమృత్‌సర్‌ మిలటరీ కమాండర్‌ జనరల్‌ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి సమావేశంపై కాల్పులు జరిపాడు. సుమారు 400 మంది ప్రజలు ఈ కాల్పుల్లో మరణించారు. దీన్నే జలియన్‌వాలా బాగ్‌ దురంతంగా పేర్కొంటారు. ఈ ఘటనకు నిరసనగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తన ‘నైట్‌హుడ్‌’ బిరుదును వదులుకున్నారు. ఆంగ్ల ప్రభుత్వం దీనిపై హంటర్‌ కమిటీని నియమించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ కూడా మోతీలాల్‌ నెహ్రూ, సీఆర్‌ దాస్, ఫజుల్‌ ఉల్‌హక్, అబ్బాస్‌ త్యాబ్జీ, ఎం.ఆర్‌.జయకర్, గాంధీలతో ఒక కమిటీని నియమించింది. జలియన్‌ వాలాబాగ్‌ ఘటనకు నిరసనగానే వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న శంకర్‌ నాయర్‌ రాజీనామా చేశాడు.


ఖిలాఫత్‌ ఉద్యమం

  ఖలీఫా పదవి రద్దుకు నిరసనగా భారతీయ ముస్లింలు ప్రారంభించిన ఉద్యమమే ఖిలాఫత్‌ ఉద్యమం. ప్రపంచ ముస్లిం మతాధిపతిని ఖలీఫా అంటారు. టర్కీ సుల్తాన్‌ ఈ పదవి నిర్వహించేవాడు. కానీ మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీతో సెవర్స్‌ సంధి చేసుకుని సుల్తాన్‌ పదవిని రద్దు చేశాయి. దాంతో ఖలీఫా పదవి కూడా రద్దయింది. దీనికి నిరసనగానే భారతీయ ముస్లింలు షౌకత్‌ అలీ, మహ్మద్‌ అలీ, హకీం హజ్మల్‌ఖాన్‌ల నాయకత్వంతో ఖిలాఫత్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 17ను ఆల్‌ ఇండియా ఖిలాఫత్‌డేగా ప్రకటించారు. ఇదే సమయంలో తిలక్‌ మరణించారు. ఫలితంగా కాంగ్రెస్‌కు నూతన నాయకత్వం అవసరమైంది. గాంధీని కాంగ్రెస్‌ నాయకుడిగా ఆహ్వానించారు. 1920లో నాగ్‌పూర్‌ సమావేశంలో గాంధీని కాంగ్రెస్‌ నాయకుడిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. నాటి కాంగ్రెస్‌ సమావేశానికి సి.విజయరాఘవాచారి అధ్యక్షత వహించారు. 1920 - 47 మధ్య గాంధీ మూడు అతిపెద్ద ఉద్యమాలను నిర్వహించి విజయం సాధించారు.

సహాయ నిరాకరణ

  గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. 1920 నాటి కలకత్తా ప్రత్యేక సమావేశంలోనే ఐ.ఎన్‌.సి. సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలన్న ప్రతిపాదన చేసింది. కానీ 1920, డిసెంబరు నాటి నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. 1919 మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లోని లోపాలను సవరించడం, రౌలత్‌ చట్టాన్ని తొలగించడం, జలియన్‌వాలా బాగ్‌ దురంతం ద్వారా పంజాబ్‌ ప్రజలకు జరిగిన అన్యాయానికి పరిష్కారాలను చూపడం, ఖిలాఫత్‌ ఉద్యమానికి సహాయం చేయడం లాంటి కారణాలతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

  ఈ ఉద్యమంలో భాగంగా బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మొదట బిపిన్‌ చంద్రపాల్, సి.ఆర్‌.దాస్, మదన్‌మోహన్ మాలవ్య లాంటివారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు.  స్వరాజ్య నిధికి కోటి రూపాయలు వసూలు చేయడానికి, కోటిమంది కొత్త సభ్యులను కాంగ్రెస్‌లో చేర్చడానికి, కాంగ్రెస్‌కు అనుబంధంగా ఒక కార్మిక సంస్థను నెలకొల్పడానికి తిలక్ అంగీకరించడంతో సి.ఆర్‌. దాస్‌ స్వయంగా సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రతిపాదించాడు. విదేశీ వస్తువులు, విద్యాలయాలు, ఉద్యోగాలు, బిరుదులు బహిష్కరించడానికి గాంధీ పిలుపునిచ్చారు. ఫలితంగా అనేకమంది భారతీయులు తమ పదవులను వదిలి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీ ఈ ఉద్యమకాలంలోనే తన కైజర్‌-ఎ-హింద్‌ బిరుదును వదులుకున్నారు. చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, రాజగోపాలాచారి, అరుణా అసఫాలీ, పటేల్‌ లాంటివారు తమ న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. ఆంధ్రదేశంలోని కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటివారు తమ శాసనసభల సభ్యత్వాలను వదులుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు శిస్తు చెల్లించకుండా సహాయ నిరాకరణ చేపట్టారు. విదేశీ వస్త్రదుకాణాలను మూసివేశారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో భాగంగా జాతీయ విద్యాలయాల స్థాపన, స్వదేశీ స్టోర్స్, పంచాయతీ న్యాయస్థానాల ఏర్పాటు, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. గాంధీ చరఖాను స్వదేశీ చిహ్నంగా ప్రకటించారు.
బెంగాల్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ తొలి ప్రిన్సిపల్‌గా బెంగాల్‌ జాతీయ కళాశాలను స్థాపించారు. మహ్మద్ అలీ 1921లో ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థను నెలకొల్పారు. కాశీ (బనారస్‌), గుజరాతీ విద్యాపీఠాలను ఈ ఉద్యమ కాలంలోనే స్థాపించారు. 1921, మార్చి 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాలు విజయవాడలో జరిగాయి. పింగళి వెంకయ్య ఈ సమావేశంలోనే జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో చీరాల-పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి.


భారతదేశంలో తొలి ఉద్యమాలు

  గాంధీజీ తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే పిలుపునందుకుని 1915 జనవరి 9న భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చారు. (జనవరి 9న ప్రస్తుతం ప్రవాసీ భారతీయ దివస్‌ నిర్వహించడానికి అదే కారణం). 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. ది క్రిటిక్‌ పత్రికా సంపాదకుడైన పోలక్, గాంధీజీకి జాన్‌రస్కిన్‌ రాసిన ‘అన్‌ టు దిస్‌ లాస్ట్‌’ గ్రంథాన్ని బహుకరించగా గాంధీ ఆ గ్రంథాన్ని ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించారు. 1916 నాటి లక్నో కాంగ్రెస్‌ సమావేశంలో రాజ్‌కుమార్‌ శుక్లా అనే వ్యక్తి చంపారన్‌ నీలి మందు రైతుల సమస్యను గాంధీకి వివరించాడు. ఫలితంగా గాంధీ 1917లో భారతదేశంలో తన తొలి పోరాటాన్ని ప్రారంభించారు. ఆ పోరాటమే చంపారన్‌ నీలిమందు రైతుల ఉద్యమం. బిహార్‌లోని చంపారన్‌ గ్రామంలో నీలి మందు రైతులు ఎదుర్కొంటున్న తీన్‌కథియా సమస్యపై గాంధీ తొలి పోరాటం చేశారు. ఫలితంగా ఆంగ్ల ప్రభుత్వం తీన్‌కథియా పద్ధతిని రద్దుచేసింది. ఈ ఉద్యమ సమయంలోనే బాబూ రాజేంద్రప్రసాద్‌ గాంధీకి ముఖ్య అనుచరుడయ్యాడు.
1918లో గాంధీ ఖేడా/ ఖైరా సత్యాగ్రహాన్ని చేశారు. గుజరాత్‌లోని ఖేడా ప్రాంత రైతులు అధిక భూమిశిస్తుతో బాధపడుతున్న విషయాన్ని మోహన్‌లాల్‌ పాండ్యా అనే వ్యక్తి గాంధీ దృష్టికి తెచ్చాడు. దాంతో ఆయన్ ఈ ఖేడా ఉద్యమాన్ని నిర్వహించి అధిక శిస్తు భారాన్ని తొలగించారు. 1918లోనే గాంధీ అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల ఉద్యమాన్ని నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని వస్త్ర మిల్లుల్లో పనిచేసే కార్మికుల జీతాలు తగ్గించడంతో గాంధీ ఉద్యమం చేసి వారి జీతాలు 35 శాతం పెరిగేలా చేశారు. ఖేడా సత్యాగ్రహ సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గాంధీకి ప్రధాన అనుచరుడయ్యాడు.


సైమన్‌ కమిషన్‌

  గాంధీయుగంలో భారత జాతీయోద్యమంలో చోటు చేసుకున్న మరో ముఖ్య సంఘటన సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమం. 1919 నాటి మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లోని లోపాలను అధ్యయనం చేయడానికి, భారతీయుల సమస్యలను తెలుసుకోవడానికి 1927 నవంబరులో ఆంగ్ల ప్రభుత్వం సైమన్‌ కమిషన్‌ను నియమించింది. 1928, ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌ బొంబాయి చేరుకుంది. ఈ‌ కమిషన్‌లో భారతీయులకు స్థానం కల్పించకపోవడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చింది. నాటి కమిషన్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కానీ భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదు. నాటి లార్డ్స్‌ సభలో సిన్హా, కామన్స్‌ సభలో షాపూర్‌జీ సక్లత్‌వాలా సభ్యులుగా ఉన్నారు. వీరిని కమిటీలో చేర్చుకోకపోవడంతో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమం జరిగింది. 1927 నాటి కాంగ్రెస్‌ సమావేశం మద్రాస్‌లో అన్సారీ అధ్యక్షతన జరిగింది. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
కేంద్ర శాసనసభలో లాలా లజపతిరాయ్‌ సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు (ఆంధ్రకేసరి), లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ (పంజాబ్‌ కేసరి) నాయకత్వంలో వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. మద్రాస్‌కు సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు వ్యతిరేక ఉద్యమానికి టంగుటూరి నాయకత్వం వహించారు. పోలీసు కాల్పుల్లో పార్థసారధి అనే యువకుడు మరణించాడు. అతడిని తీసుకురావడానికి వెళుతున్న ఉద్యమకారులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టగా ‘‘దమ్ముంటే కాల్చమ’’ని టంగుటూరి ప్రకాశం పంతులు వారికి ఎదురెళ్లాడు. అప్పుడే అతడు ‘ఆంధ్రకేసరి’గా పేరొందాడు. పంజాబ్‌లో లాలా లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమం జరుగుతుండగా సాండర్స్‌ అనే ఆంగ్ల అధికారి ఆయన లాఠీతో గాయపరిచాడు. ఈ సమయంలో ‘మనపై పడే ప్రతీ దెబ్బ, ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటిక మీదకు దిగుతున్న ఒక్కో మేకు’ అని లాల్‌ అభివర్ణించాడు. ఈ లాఠీ దెబ్బల వల్లే ఆయన‌ మరణించారు. అందుకే సాండర్స్‌ను భగత్‌సింగ్‌ లాహోర్‌లో కాల్చి చంపాడు. సైమన్‌ కమిషన్‌కు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ‘సైమన్‌ గో బ్యాక్‌’ అని రాసి ఉన్న చీటీని అప్పటి విజయవాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యదేవర కాళేశ్వర రావు తన బంట్రోతుతో పంపాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సైమన్‌ కమిషన్‌ రెండు పర్యాయాలు భారతదేశంలో పర్యటించి తన నివేదికను సమర్పించింది.

నెహ్రూ నివేదిక 

  సైమన్‌ కమిషన్‌లో భారతీయులకు స్థానం కల్పించలేదని భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యతిరేకించిన సమయంలో అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ బిర్కెన్‌హుడ్‌ భారతీయులకు తమకు కావాల్సిన రాజ్యాంగం రూపొందించుకోవడం చేతకాదని ఎగతాళి చేశాడు.
ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్‌ మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షుడిగా, జవహర్‌లాల్‌ నెహ్రూ కార్యదర్శిగా మొత్తం 11 మంది సభ్యులతో ఒక అఖిలపక్ష కమిటీని నియమించింది. ఈ కమిటీలో తేజ్‌బహదూర్‌ సప్రూ, సుభాష్‌ చంద్రబోస్, ఖురేషీ లాంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. 1928, ఆగస్టు 28 - 30 మధ్య ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించి సమర్పించింది. దీన్నే ‘నెహ్రూ నివేదిక’ అంటారు. అయితే ఈ నివేదిక భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాకుండా కేవలం డొమీనియా ప్రతిపత్తిని మాత్రమే కోరడంతో కమిటీలో సభ్యులు ‌ లాంటివారు దాన్ని వ్యతిరేకించారు.


లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశం

  1929 డిసెంబరులో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం లాహోర్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. ఈ సమావేశానికి నెహ్రూను అధ్యక్షుడిగా గాంధీయే ప్రతిపాదించారు. ప్రతి ఏటా జనవరి 26ను స్వాతంత్య్ర దినంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1929లోనే ఇంగ్లండ్‌లో రామ్స్‌ మెక్‌డొనాల్డ్‌ ప్రధానిగా, వెర్డ్‌ ఉడ్‌బెన్‌ భారత రాజ్య కార్యదర్శిగా అధికారంలోకి వచ్చారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.


రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

  సైమన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ఆంగ్ల ప్రభుత్వం లండన్‌లో అఖిలపక్ష సమావేశాలు (రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సెస్‌) జరపడానికి నిర్ణయించింది. 1930 నవంబరులో లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.
భారతదేశం నుంచి ఒక్క భారత జాతీయ కాంగ్రెస్‌ తప్ప మిగిలిన అన్ని పార్టీలు మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరయ్యాయి. కాంగ్రెస్‌ ఉప్పు సత్యాగ్రహాన్ని చేస్తున్నందువల్ల సమావేశానికి హాజరు కాలేదు. ఫలితంగా మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం విఫలమైనట్లు ప్రకటించిన ఆంగ్ల ప్రభుత్వం 1931లో రెండో సమావేశం ఉంటుందని పేర్కొంది. గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం ప్రకారం గాంధీ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైనప్పటికీ ‘కమ్యూనల్‌ అవార్డు’ ప్రకటన వల్ల అక్కడి నుంచి వెనుదిరిగారు. ఫలితంగా 1932లో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిపి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ పత్రంలోని అంశాలనే 1935 భారత ప్రభుత్వ చట్టంగా ప్రవేశపెట్టారు.


గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక 

  గాంధీని రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరయ్యేలా చేయమని నాటి ఆంగ్ల ప్రభుత్వం వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ను కోరింది. అందుకే ఇర్విన్‌ 1931, మార్చి 5న గాంధీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అప్పటివరకూ ఆంగ్ల ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన ఉద్యమకారుల్ని విడిచిపెట్టడానికి, గాంధీ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరుకావడానికి ఒప్పందం కుదిరింది. ఈ సమయంలోనే గాంధీపై ఒక విమర్శ కూడా వచ్చింది. లాహోర్‌ కుట్ర కేసులో ఉరిశిక్ష పడిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను విడిచిపెట్టమని గాంధీ ఇర్విన్‌ను కోరలేదని ఫలితంగా 1931, మార్చి 23న ఆంగ్ల ప్రభుత్వం వారిని ఉరితీసిందని విమర్శకులు పేర్కొన్నారు. గాంధీ 1931 నాటి రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కాంగ్రెస్‌ ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు.

కమ్యూనల్‌ అవార్డు

  రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అంబేడ్కర్‌ కోరిక మేరకు దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయిస్తూ కమ్యూనల్‌ అవార్డును ఆంగ్లేయులు అంగీకరించారు. దీన్ని వ్యతిరేకించిన గాంధీ సమావేశం నుంచి నిష్క్రమించి భారతదేశానికి వచ్చి మళ్లీ ఉప్పుసత్యాగ్రహాన్ని కొనసాగించారు. కానీ ఆంగ్ల ప్రభుత్వం 1932లో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జరిపి దళితులు, సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయిస్తూ అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని రామ్సే మెక్‌ డొనాల్డ్‌ కమ్యూనల్‌ అవార్డును ప్రకటించాడు.

పూనా ఒప్పందం 

  గాంధీ తిరిగి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడంతో ఆంగ్ల ప్రభుత్వం గాంధీని అరెస్ట్‌ చేసి, పూనాలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. కమ్యూనల్‌ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫలితంగా అంబేడ్కర్‌ జైలుకు వెళ్లి గాంధీతో 1932లో పూనా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో ఉమ్మడి నియోజక వర్గాల పద్ధతిని పాటించడానికి, దళితులకు కేటాయించిన స్థానాలను 71 నుంచి 148కి పెంచడానికి అంగీకారం కుదిరింది.

స్వరాజ్య పార్టీ స్థాపన 

  భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం చిత్తరంజన్‌ దాస్‌ (సి.ఆర్‌. దాస్‌) అధ్యక్షతన గయలో 1922 డిసెంబరులో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో గాంధీజీ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. బాబూ రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటివారు అనుకూల వర్గంలో ఉన్నారు.
వారు గాంధీజీ చెప్పిన సహాయ నిరాకరణను కొనసాగించాలన్నారు. మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్‌ లాంటివారు గాంధీ వ్యతిరేక వర్గంలో ఉండి, ప్రభుత్వంలో ప్రవేశించి, శాసనసభల్లో ప్రభుత్వ విధానాలను ఎదుర్కోవాలని వాదించారు. ఎన్నికల్లో పాల్గొనడమంటే ఆంగ్లేయులకు సహకరించడమే అని గాంధీ అనుకూల వర్గం పేర్కొంది. ఈ సమయంలో అఖిల భారత కాంగ్రెస్‌ ఖిలాఫత్‌ స్వరాజ్య పార్టీ (1923) ఏర్పడింది. దీని అధ్యక్షుడిగా సి.ఆర్‌. దాస్, కార్యదర్శిగా మోతీలాల్‌ నెహ్రూను ఎన్నుకున్నారు. ఈ పార్టీ 1923 ఎన్నికల్లో పోటీచేసి కేంద్ర శాసనసభలో సుమారు 48 స్థానాలను పొందింది. స్వరాజ్య పార్టీకి చెందిన విఠల్‌భాయ్‌ పటేల్‌ కేంద్ర శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. జిన్నా నాయకత్వంలోని స్వతంత్రపార్టీతో కలిసి స్వరాజ్య పార్టీ జాతీయ పార్టీగా ఏర్పడి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి.  1919 నాటి మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల పనితీరుపై ఆంగ్ల ప్రభుత్వం నియమించిన ‘మడ్డీమన్‌ కమిటీ’ నివేదికను తిప్పికొట్టాయి. ఉద్యోగుల సౌకర్యాలను మెరుగుపరచడానికి నియమించిన లీ కమిషన్‌ విషయంలో కొన్ని సవరణ ప్రతిపాదనలు చేశాయి. స్వరాజ్య సాధన కోసం కొన్ని తీర్మానాలు కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టాయి. సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో ఇతర పార్టీ మంత్రులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారితో రాజీనామాలు చేయించాయి. కానీ 1925లో సి.ఆర్‌.దాస్‌ మరణించడం, 1926లో మోతీలాల్‌ నెహ్రూ రాజీనామా చేయడంతో స్వరాజ్య పార్టీ బలహీనపడింది.


ఉప్పు సత్యాగ్రహం 

  లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశం తీర్మానం ప్రకారం గాంధీ అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌కు 11 అంశాలతో ఒక లేఖ రాశారు. ఆ లేఖలో భారతీయులకు ఆంగ్లేయులు చేయాల్సిన సంస్కరణలు, తీర్చాల్సిన కోరికలను పేర్కొన్నారు. కానీ ఇర్విన్‌ వాటికి సమాధానం చెప్పకపోవడంతో గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.

  1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో కలిసి యాత్ర ప్రారంభించిన గాంధీ 1930, ఏప్రిల్‌ 6న దండి గ్రామం చేరారు. దీన్నే ‘దండి సత్యాగ్రహం’ అంటారు. 25 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర (240 మైళ్లు) ప్రయాణించి  దండి గ్రామం చేరి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేశారు. కాబట్టి దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం అని పేర్కొంటారు. దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. దండి యాత్ర సమయంలో ఆంధ్రులు గాంధీని జంబూసర్‌లో కలిసి తమ మద్దతును తెలిపారు. 1930, ఏప్రిల్‌ 6న దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. అఖిల భారత స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉద్యమ నిర్వహణకు శిబిరాలను, ఉద్యమ నాయకులను (డిక్టేటర్‌లు) నియమించారు. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహానికి కొండా వెంకటప్పయ్యను డిక్టేటర్‌గా నియమించారు.

  తమిళనాడులోని తిరుచునాపల్లి నుంచి వేదారణ్యం వరకు సి. రాజగోపాలాచారి సత్యాగ్రహ యాత్ర చేపట్టారు. కేరళలో కేలప్పన్‌ కాలికట్‌ నుంచి పాయనూర్‌ వరకు; అస్సాంలోని సిల్హెట్‌ నుంచి నౌఖాళీ వరకు యాత్ర చేశారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో (పెషావర్‌లో) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ (సరిహద్దు గాంధీ) నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. గఫార్‌ఖాన్‌ ఉద్యమ నిర్వహణకు ఖుదాయ్‌ - ఖిద్‌మత్‌ గార్డ్స్‌ అనే ఎర్ర చొక్కాల దళాన్ని ఏర్పాటుచేశాడు. దర్శన్‌ ఉప్పు కొఠారు వద్ద సరోజినీదేవి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.
అమెరికా పత్రికా విలేకరి వెబ్‌ మిల్లర్‌ దర్శన్‌ వద్ద జరిగిన ప్రభుత్వ హింస గురించి పత్రికల్లో ప్రచురించాడు. బార్డోలీ వద్ద సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో సత్యాగ్రహం (బార్డోలీ సత్యాగ్రహం) జరిగింది. ఆంధ్రలో తోట నరసయ్య, కేరళలో కృష్ణన్‌ పిళ్ళై లాంటివారు జెండా పండగలు నిర్వహించారు. కాకినాడ బాంబు కేసు ఈ ఉద్యమ సమయంలోనే ఆంధ్రాలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఉద్యమ అణచివేతకు అనేక చర్యలు చేపట్టింది.


స్వాతంత్రోద్యమ చివరి ఘట్టం

  గాంధీ 1920-22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం, 1930-34 మధ్య ఉప్పు సత్యాగ్రహం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములను చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. దాంతో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి ‘‘డూ ఆర్‌ డై’’ లాంటి నినాదాలిచ్చారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందింది.

  1932 నాటి మూడో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులని అంశాలనే ‘భారత ప్రభుత్వ చట్టం - 1935’గా అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం 1935లో తెచ్చిన చట్టానికి సవరణ చట్టంగా ఆధునిక చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టి, రాష్ట్రాలకు స్వయంపాలన కల్పించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ కేంద్రంలో ద్వంద్వ పాలనను వ్యతిరేకించినప్పటికీ 1937లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ స్వయంగా 7 రాష్ట్రాల్లో, మొత్తంగా 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ఈ ఎన్నికలు ముస్లింలీగ్, ఐఎన్‌సీల మధ్య విభేదాలు పెరగడానికి కారణమయ్యాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.
బ్రిటన్‌తో సంబంధమున్న అన్ని దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించాలని అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని చాంబర్లీన్‌ కోరాడు. నాటి భారతదేశ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో భారతదేశం కూడా బ్రిటన్‌ తరఫున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 1939లో రాజీనామాలు సమర్పించాయి. కాంగ్రెస్‌ మంత్రివర్గాల రాజీనామాలను ముస్లింలీగ్‌ విమోచన దినంగా పాటించింది. యుద్ధంలో ఇంగ్లండ్‌ ఓడిపోతే నాజీ (జర్మనీ)ల నిరంకుశ అధికారం పెరిగిపోతుందని భయపడిన భారత జాతీయ కాంగ్రెస్‌ కొన్ని షరతులతో యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించడానికి తీర్మానించింది. యుద్ధానంతరం సంపూర్ణ స్వాతంత్య్రం ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, ఇలా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం కేంద్ర శాసనసభకు బాధ్యత వహించాలనే షరతులు పెట్టింది.

ఆగస్టు ప్రతిపాదనలు (1940 ఆగస్టు 8)

  భారత జాతీయ కాంగ్రెస్‌ తీర్మానానికి సమాధానంగా నాటి భారత వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో 1940 ఆగస్టు 8న కొన్ని ప్రతిపాదనలు చేశాడు. వాటినే ‘ఆగస్టు ఆఫర్స్‌’ అంటారు. గవర్నర్‌ సలహా మండలిని విస్తృతపరచడం, అందులో భారతీయులకు స్థానం కల్పించడం, యుద్ధసలహా సంఘాన్ని ఏర్పరచడం లాంటి అంశాలు అందులో ఉన్నాయి. ఆగస్టు ప్రతిపాదనల్లో సంపూర్ణ స్వాతంత్య్రం అనే మాట లేకపోవడం లాంటి విషయాలతో విభేదించిన కాంగ్రెస్‌ వ్యక్తి సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది.

వ్యక్తి సత్యాగ్రహాలు (1940 అక్టోబరు 17)

  యుద్ధ సమయంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తే జర్మనీ నాజీ శక్తులు విజృంభించే అవకాశం ఉన్నందువల్ల భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యక్తి సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది. మొదటి సత్యాగ్రహిగా ఆచార్య వినోబాభావేను, రెండో సత్యాగ్రహిగా జవహర్‌లాల్‌ నెహ్రూను గాంధీ ఎంపికచేశారు. ఆ విధంగా 1940 అక్టోబరు 17న ఆచార్య వినోబాభావే ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రహం 1941 డిసెంబరు వరకు కొనసాగింది. జపాన్‌ 1941 డిసెంబరు 7న అమెరికా సైనిక స్థావరం పెరల్‌హార్బర్‌పై బాంబు దాడి చేయడంతో అమెరికా మిత్రరాజ్యాల తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది.

అట్లాంటిక్‌ చార్టర్‌ (1941 ఆగస్టు 12)

  రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టు 12న అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, ఇంగ్లండ్‌ ప్రధాని చర్చిల్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ఒక నౌకపై సమావేశమై 8 అంశాలతో ఒక పథకాన్ని రూపొందించారు. ఈ అంశాలు ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తాయని నాటి అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కార్డెన్‌హల్‌ ప్రకటించాడు. కానీ చర్చిల్‌ కేవలం జర్మనీ ఆక్రమించిన భూభాగాలకే అట్లాంటిక్‌ చార్టర్‌లోని అంశాలు వర్తిస్తాయని ప్రకటించాడు. ఫలితంగా యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించడానికి భారతదేశం నిరాకరించింది.

క్రిప్స్‌ రాయబారం (1942)

  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాటి చైనా అధ్యక్షుడు చాంగ్‌కైషేక్‌ భారతదేశంలో పర్యటించాడు. అమెరికా అధ్యక్షుడు ఎఫ్‌డీ. రూజ్‌వెల్ట్, చాంగ్‌కైషేక్‌ల ఒత్తిడితో ఇంగ్లండ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరపడానికి 1942 మార్చి 11న క్రిప్స్‌ రాయబారానికి అంగీకరించింది.

1942 మార్చి 23న సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ఢిల్లీ చేరుకుని కొన్ని ప్రతిపాదనలు చేశాడు. యుద్ధానంతరం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుచేయడం, రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు సైన్యం, దేశరక్షణపై ఆంగ్ల ప్రభుత్వానికే అధికారం లాంటి అంశాలు క్రిప్స్‌ రాయబారంలో ఉన్నాయి. ‘భారతదేశానికి మీరు చేయగలిగింది ఇదే అయితే వెంటనే బయలుదేరి విమానంలో ఇంగ్లండ్‌కు వెళ్లండి’ అని గాంధీ పేర్కొంటూ దివాళా తీసే బ్యాంకు పేరుమీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా క్రిప్స్‌ ప్రతిపాదనలను అభివర్ణించారు. ఫలితంగా క్రిప్స్‌ రాయభారం విఫలమైంది. ఈ సమయంలోనే అర్ధ నగ్న ఫకీరైన గాంధీ ముందు మనం మోకరిల్లడమా అంటూ చర్చిల్‌ విమర్శించాడు. నాటి భారత రాజ్యాంగ కార్యదర్శిగా అమేరీ ఉన్నారు.

రాజాజీ ప్రణాళిక (1944)

  యుద్ధానంతరం కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు కలిసి ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో రాజగోపాలాచారి రూపొందించిన ప్రణాళికనే రాజాజీ ప్రణాళికగా పేర్కొంటారు. కానీ దీన్ని ఇరుపక్షాలు అంగీకరించలేదు.

వేవెల్‌ ప్రణాళిక (1945)

  1945లో నాటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ కొన్ని ప్రతిపాదనలు రూపొందించాడు. కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు నిర్వహించడం, రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ఏర్పాటు, భారతీయులకు స్వయం పాలననివ్వడం, కార్య నిర్వాహక సంఘం ఏర్పాటు, భారతదేశంలో బ్రిటన్‌ వాణిజ్య ప్రయోజనాల పర్యవేక్షణకు ఒక హైకమిషనర్‌ నియామకం లాంటి ప్రతిపాదనలు చేశాడు. దీన్నే వేవెల్‌ ప్రణాళిక అంటారు. వేవెల్‌ 1945 జూన్‌ 29న సిమ్లాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రూపొందించిన ప్రణాళికను అంగీకరించలేదు.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు (1946 సెప్టెంబరు 2)

  1946 సెప్టెంబరు 2న నాటి వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ విజ్ఞప్తి మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముస్లింలీగ్‌ తరఫున అయిదుగురు మంత్రులుగా చేరారు. అసంతృప్తితో ఉన్న ముస్లింలీగ్‌ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా మత కలహాలు చెలరేగాయి. ఈ సమయంలో దేశవిభజన ప్రక్రియను వేగవంతం చేయాలని లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భావించాడు.

విభజన ప్రణాళిక (జూన్‌ 3 ప్రణాళిక)

  1947 మార్చిలో భారతదేశ వైస్రాయ్‌గా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ వచ్చాడు. భారతదేశంలో పనిచేసిన చివరి బ్రిటిష్‌ ప్రతినిధి ఆయనే. 1947, జూన్‌ 3న మౌంట్‌ బాటన్‌ విభజన ప్రణాళికను రూపొందించాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ అధ్యక్షతన సరిహద్దు కమిషన్‌ను నియమించాడు. చివరికి 1947 ఆగస్టు 14న పాకిస్థాన్, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. జిన్నా పాకిస్థాన్‌ తొలి అధ్యక్షుడిగా, బాబు రాజేంద్రప్రసాద్‌ భారత తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ, తొలి ఉపప్రధానిగా సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ నియమితులయ్యారు. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా భారతీయులు తమ దేశ స్వాతంత్య్రం కోసం మేల్కొని ఉన్నారని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు.

మంత్రిత్రయ రాయబారం (1946)

  1945 జూన్‌లో ఇంగ్లండ్‌లో చర్చిల్‌ స్థానంలో లార్డ్‌ అట్లే (లేబర్‌ పార్టీ) అధికారంలోకి వచ్చాడు. అమేరీ స్థానంలో పెథిక్‌ లారెన్స్‌ భారత రాజ్య కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
అట్లే భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని చెప్పి, రాజ్యాంగ సంస్కరణల అమలు విషయాలు చర్చించడానికి 1946లో ముగ్గురు మంత్రులతో కూడిన బృందాన్ని భారతదేశానికి పంపాడు. దీన్నే కేబినెట్‌ మిషన్‌/ మంత్రిత్రయ రాయబారం అని పేర్కొంటారు. దీనిలో పెథిక్‌ లారెన్స్, సర్‌స్టాఫర్డ్‌ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లు సభ్యులు. 1946 మార్చి 23న భారతదేశానికి వచ్చిన కేబినెట్‌ మిషన్‌ సభ్యులు అనేక ప్రతిపాదనలు చేశారు. బ్రిటిష్‌ ఇండియా, స్వదేశీ సంస్థానాలతో యూనియన్‌ ప్రభుత్వం ఏర్పాటు, కేంద్రానికి రక్షణ, విదేశీ వ్యవహారాలు, రవాణా శాఖలపై అధికారం అప్పగింత, A, B, C గ్రూపులుగా రాష్ట్రాల ఏర్పాటు, రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ నిర్మాణసభ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు మంత్రిత్రయ రాయబారంలో చేశారు.


క్విట్‌ ఇండియా ఉద్యమం

  క్రిప్స్‌ రాయబారం విఫలం కావడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ 1942 జులై 14న  అహ్మదాబాద్‌లో సమావేశమై క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని రూపొందించింది. 1942 ఆగస్టు 8న బొంబాయి సమావేశంలో క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. గాంధీ ‘డూ ఆర్‌ డై’ (సాధించు లేదా మరణించు) అనే నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ‘భారతదేశాన్ని వదిలి వెళ్లండి’ (క్విట్‌ ఇండియా) అంటూ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆంగ్ల ప్రభుత్వం జాతీయ నాయకులందర్నీ అరెస్టు చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారిపోయింది.

  దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియాలో బిట్టూ పాండే, మధ్యప్రదేశ్‌లోని సతారాలో వైబీ చవాన్‌ నాయకత్వాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బొంబాయిలోని బాందేల్‌ నుంచి రామ్‌ మనోహర్‌ లోహియా, ఉషా మెహతాలు రహస్య రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిస్ట్‌లు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రాలో చండ్ర పుల్లారెడ్డి ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. మహ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లింలీగ్‌ కూడా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అనే నినాదాన్నిచ్చింది. 1942 ఆగస్టు 12న తెనాలి రైల్వే స్టేషన్‌పై దాడి సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పోలీస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు తగలబెట్టండి లాంటి నినాదాలు మిన్నంటాయి. గాంధీ యుగంలో జరిగిన అత్యంత హింసాత్మక ఉద్యమం క్విట్‌ ఇండియా ఉద్యమమే.

  ఈ ఉద్యమ సమయంలోనే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ ద్వారా ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో క్రమంగా విజయం సాధిస్తున్న ఇంగ్లండ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే విషయంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలోనే కొన్ని రాజ్యాంగ నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.
 

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

   క్రీ.శ.19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్నే 'సాంస్కృతిక పునరుజ్జీవనం' అంటారు. ఈ ఉద్యమాలు, సంస్కరణలు భారతీయుల్లో అంకురిస్తున్న జాతీయవాద స్పృహ, పాశ్చాత్య ఉదారభావ ధోరణిని ప్రతిబింబిస్తాయని ఎ.ఆర్. దేశాయ్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణమిషన్ లాంటి సంస్థలు మత సంస్కరణలతో పాటు సాంఘిక సంస్కరణలకూ కృషి చేశాయి. మన దేశ సంస్కృతిని పునరుద్ధరించడానికి, భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించడానికి రాజా రామ్మోహన్‌రాయ్, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి భారతీయులతోపాటు ఐర్లాండ్‌కు చెందిన అనిబిసెంట్ కూడా ఎంతో కృషి చేశారు. 'భారతీయ సాంస్కృతిక పునర్వికాస పితామహుడి'గా రాజా రామ్మోహన్‌రాయ్ పేరొందారు. 'ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పునర్వికాస పితామహుడి'గా కందుకూరి వీరేశలింగం ప్రసిద్ధిచెందారు.


బ్రహ్మ సమాజం

  రాజా రామ్మోహన్‌రాయ్ 1815లో ఆత్మీయ సభను స్థాపించారు. దాన్నే 1828లో బ్రహ్మ సమాజంగా మార్చారు. ఏకేశ్వరోపాసన, వర్ణ వ్యవస్థ రద్దు, విగ్రహారాధన నిర్మూలన లాంటి లక్ష్యాలు, సిద్ధాంతాలతో బ్రహ్మ సమాజం పనిచేసింది. పురోహితులు, పూజారుల అవసరంలేదని, వర్ణాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు, బహు భార్యత్వం, దేవదాసీ వ్యవస్థ, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాలను నిర్మూలించాలని బ్రహ్మ సమాజం పిలుపునిచ్చింది.
రాజా రామ్మోహన్‌రాయ్ మరణానంతరం రామచంద్ర విద్యా వాగీష్ బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించారు. ఇది ద్వారకానాథ్ ఠాగూర్ ఆర్థిక సహాయంతో నామమాత్రంగా నడిచేది. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో  తిరిగి బలపడింది. కేశవచంద్రసేన్ రాకతో దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించింది. 1866లో బ్రహ్మ సమాజం సిద్ధాంత విభేదాల వల్ల ఆదిబ్రహ్మ సమాజం, నవ వర్షీయ భారత బ్రహ్మ సమాజంగా విడిపోయింది. ఆదిబ్రహ్మ సమాజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్, నవబ్రహ్మ సమాజానికి కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించారు. తారాచంద్ అనే చరిత్రకారుడు బ్రహ్మ సమాజ కార్యదర్శిగా పనిచేశారు. బ్రహ్మ సమాజీకులు ప్రతి శనివారం సాయంత్రం సమావేశాలు నిర్వహించేవారు. 1878లో ఆనంద్‌బోస్ సాధారణ బ్రహ్మసమాజం అనే మరో శాఖను ఏర్పాటు చేశారు. కేశవ చంద్రసేన్ ప్రభావంతో మద్రాస్‌లో రాజగోపాలాచారి, సుబ్బరాయలు శెట్టి మొదలైనవారు వేద సమాజాన్ని స్థాపించారు. దీని పేరును తర్వాతి కాలంలో దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మార్చారు. ఆంధ్రదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వేంకటరత్నం నాయుడు, పిఠాపురం రాజా లాంటి వారు బ్రహ్మ సమాజ సేవలను విస్తరించారు.


దేవేంద్రనాథ్ ఠాగూర్

  ఈయన 1817లో బెంగాల్‌లో జన్మించారు. 1838లో బ్రహ్మ సమాజంలో చేరి 1839లో తత్త్వబోధిని సభ,  పత్రిక, పాఠశాలను స్థాపించారు. 'బ్రహ్మధర్మం' అనే గ్రంథాన్ని కూడా రాశారు. 'మహా నిర్యాణ తంత్ర' అనే గ్రంథ సూత్రాలను అనుసరించి బ్రహ్మ సమాజ సభ్యులకు 'ప్రమాణ కర్మ' విధానాన్ని ఏర్పాటు చేశారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ వేదాల అమోఘత్వ సిద్ధాంతాన్ని అక్షయ్ కుమార్ దత్తా లాంటి సమకాలీనులు వ్యతిరేకించారు.
దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు శిష్యుడైన కేశవ చంద్రసేన్‌తో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల 1866లో బ్రహ్మ సమాజంలో చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఆది బ్రహ్మ సమాజం ఏర్పడింది. ఈయన మరణానంతరం రాజనారాయణ్ బోస్ ఆది బ్రహ్మ సమాజానికి నాయకుడయ్యాడు.


కేశవ చంద్రసేన్

  బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి కేశవ చంద్రసేన్. ఈయన 1857లో బ్రహ్మ సమాజంలో చేరారు. సంగత్ సభను (సంగీత సభ) ఏర్పాటు చేశారు. 1866లో నవ భారత వర్షీయ బ్రహ్మ సమాజానికి నాయకుడయ్యాడు. ఈయన కృషి ఫలితంగానే 1872లో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని (నేటివ్ సివిల్ మ్యారేజ్ యాక్ట్) చేశారు. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 12, బాలుర వివాహ వయసును 14 సంవత్సరాలుగా నిర్ణయించారు. కానీ తన కుమార్తెకు బాల్య వివాహం చేసి విమర్శల పాలయ్యారు. సేన్ తన కుమార్తె రమాబాయిని కూచ్ బిహారీ యువరాజుకిచ్చి బాల్య వివాహం చేశారు. ఫలితంగా 1878లో శివనాథశాస్త్రి, ఆనంద మోహన్ బోస్‌లు సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. కేశవ చంద్రసేన్ భారత సంస్కరణ సమాజాన్ని స్థాపించి, దాని తరపున 'సులభ్ సమాచార్' పత్రికను నడిపారు. ఆ రోజుల్లో ఆ పత్రిక ఖరీదు ఒక పైసా మాత్రమే.


రాజా రామ్మోహన్‌రాయ్

  రాజా రామ్మోహన్‌రాయ్ 1774లో బెంగాల్‌లోని బర్ధ్వాన్ జిల్లాలో ఉన్న రాధానగర్‌లో జన్మించారు. కానీ రాయ్ జీవిత చరిత్రను రాసిన సోఫియా డాబ్సన్ కోవెట్ 1772లో జన్మించినట్లు రాశారు. రాయ్ కాశీలో సంస్కృత భాషను అభ్యసించారు. ఈయన గొప్ప రచయిత. బహుభాషా కోవిధుడు.
ఈయన 'ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక' (తుహఫత్-ఉల్-మువాహద్దీన్ లేదా A Gift to monothies) అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఇంకా జీసస్ బోధనలు, శాంతి సంతోషాలకు మార్గం అనే గ్రంథాలు కూడా రచించారు. నాటి రంగపూర్ కలెక్టర్ విలియం డిగ్బే వద్ద దివాన్‌గా పనిచేశారు. హరిహరానంద తీర్థస్వామి సహాయంతో తాంత్రిక గ్రంథాలను అధ్యయనం చేశారు. 1815లో ఆత్మీయ సభను, 1825లో వేదాంత కళాశాలను, 1828లో బ్రహ్మ సమాజాన్ని, 1830లో బ్రహ్మ మందిరాన్ని స్థాపించారు. విలియమ్ ఆడమ్స్ అనే బాప్టిస్ట్ మతాచార్యుడు రాయ్ ఏకేశ్వరవాదాన్ని స్వీకరించారు. రాజా రామ్మోహన్‌రాయ్ గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన 'సంవాద కౌముది' అనే బెంగాలీ వార పత్రిక, 'మిరాతువ్ అక్బర్' అనే పారశీక పత్రికను ప్రచురించారు. రాయ్ కృషి ఫలితంగానే 1829లో విలియం బెంటింక్ సతీ సహగమన పద్ధతిని రద్దు చేశాడు. ఆంగ్ల విద్యను భారతీయులకు అందుబాటులోకి తేవాలని రాయ్ వాదించారు. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించిన సనాతన హిందువులు రాధాకాంత్ దేవ్ నాయకత్వంలో ధర్మసభను నెలకొల్పి 'సమాచార చంద్రిక' అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో రాజా రామ్మోహన్‌రాయ్ ఉద్యమ విధానాన్ని విమర్శించేవారు. నాటి మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ 1832లో రామ్మోహన్‌రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చి, తన తరపున ఇంగ్లండ్ పంపించాడు. కానీ 1833లో రాయ్ ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ నగరంలో మరణించారు.


ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (1820 - 91)

  ఈయన 1820లో బెంగాల్‌లోని వీరసింఘ అనే గ్రామంలో జన్మించారు.  సంస్కృత సాహితీ ప్రతిభ వల్ల కలకత్తా సంస్కృత కళాశాల నుంచి 'విద్యాసాగర్' అనే బిరుదును పొందారు. స్త్రీ విద్యాభివృద్ధికి, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేశారు. కలకత్తా మెట్రో పాలిటన్ కళాశాలను స్థాపించారు. 'వితంతు వివేకము' అనే గ్రంథాన్ని రచించారు. తన కుమారుడికి వితంతువుతో వివాహం జరిపించారు. ఇతడి కృషి ఫలితంగానే 1856లో వితంతువును వివాహం చేసుకున్న వ్యక్తికి ఆస్తి హక్కును కల్పించే చట్టాన్ని డల్హౌసీ చేశారు. విద్యా సాగరుడు 'బెంగాల్ చరిత్ర', 'సత్పురుషుల చరిత్ర', 'సీతా వనవాసము' గ్రంథాలను రాశారు. ఈయన రూపొందించిన బెంగాలీ ప్రాథమిక వాచకం ఇప్పటికీ వాడుకలో ఉంది. 1856, డిసెంబరు 7న దేశంలోనే మొదటి వితంతు వివాహాన్ని కలకత్తాలో జరిపించారు. 1856-60 సంవత్సరాల మధ్య ఈయన సుమారు 20 వితంతు వివాహాలను జరిపించారు. 1849లో స్త్రీ విద్యాభివృద్ధికి స్థాపించిన బెథూనిన్ పాఠశాలకు కార్యదర్శిగా కూడా పనిచేశారు.


ప్రార్థనా సమాజం (1867)

  ఆత్మారాం పాండురంగ 1867లో బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఎం.జి. రనడే, ఆర్.జి. భండార్కర్‌లు స్థాపక సభ్యులుగా ఉన్నారు. వీరు మతోద్ధరణ కంటే సంఘ సంస్కరణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్మికులు, మహిళలకు రాత్రి పాఠశాలలను నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఎం.జి. రనడే 'దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ'ని స్థాపించి, వితంతు వివాహ సంఘాన్ని నెలకొల్పారు.
ఎం.జి.రనడే ప్రార్థనా సమాజం మూల సూత్రాలకు వివరణ కల్పించారు.  ప్రార్థనా సమాజం మహిళా విభాగంలో పండిత రమాబాయి సరస్వతి విశేష కృషి చేశారు. కోస్తా ఆంధ్రాలో కూడా ప్రార్థనా సమాజం ప్రాచుర్యాన్ని పొందింది. (తారాచంద్ రాసిన గ్రంథంలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది 1867 అని, తెలుగు అకాడమీ పుస్తకాల్లో 1869 అని ప్రచురితమై ఉంది.)

  వాస్తవానికి బొంబాయిలో మత సంస్కరణకు 1840లోనే శ్రీకారం చుట్టిన సంస్థ పరమహంస మండలి. పశ్చిమ భారతదేశంలో మొదటి సంఘ సంస్కర్తగా పేరొందిన గోపాల్ హరిదేశ్‌ముఖ్‌ ఈ సంస్థ ద్వారా సంఘ సంస్కరణకు కృషిచేశారు. ఈయన లోకహితవాది అనే బిరుదును పొందాడు.  విగ్రహారాధన, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. 'పురోహితులు మహా అపవిత్రులు. పండితులు పురోహితులకంటే భ్రష్టులు, అజ్ఞానులు, అహంకారులు. మానవులంతా సమానులు, ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని సంపాదించే హక్కు ఉంది' అని ఎలుగెత్తిచాటారు.


ఆర్య సమాజం

  ఆర్య సమాజాన్ని 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. దయానందుడి అసలు పేరు మూల్ శంకర్. ఈయన 1824లో గుజరాత్‌లో ఉన్న మొర్వి ప్రాంతంలో టంకార్ గ్రామంలో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన పరమానంద సరస్వతి వద్ద దీక్ష స్వీకరించి, సన్యాసిగా మారి, దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నారు. మధురలోని విరజానంద స్వామి వద్ద వేదాల్లోని సత్యాన్ని తెలుసుకున్నారు.
ఎం.జి.రనడే ప్రార్థనా సమాజం మూల సూత్రాలకు వివరణ కల్పించారు.  ప్రార్థనా సమాజం మహిళా విభాగంలో పండిత రమాబాయి సరస్వతి విశేష కృషి చేశారు. కోస్తా ఆంధ్రాలో కూడా ప్రార్థనా సమాజం ప్రాచుర్యాన్ని పొందింది. (తారాచంద్ రాసిన గ్రంథంలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది 1867 అని, తెలుగు అకాడమీ పుస్తకాల్లో 1869 అని ప్రచురితమై ఉంది.)

  వాస్తవానికి బొంబాయిలో మత సంస్కరణకు 1840లోనే శ్రీకారం చుట్టిన సంస్థ పరమహంస మండలి. పశ్చిమ భారతదేశంలో మొదటి సంఘ సంస్కర్తగా పేరొందిన గోపాల్ హరిదేశ్‌ముఖ్‌ ఈ సంస్థ ద్వారా సంఘ సంస్కరణకు కృషిచేశారు. ఈయన లోకహితవాది అనే బిరుదును పొందాడు.  విగ్రహారాధన, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. 'పురోహితులు మహా అపవిత్రులు. పండితులు పురోహితులకంటే భ్రష్టులు, అజ్ఞానులు, అహంకారులు. మానవులంతా సమానులు, ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని సంపాదించే హక్కు ఉంది' అని ఎలుగెత్తిచాటారు.
ఆర్య సమాజం
           ఆర్య సమాజాన్ని 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. దయానందుడి అసలు పేరు మూల్ శంకర్. ఈయన 1824లో గుజరాత్‌లో ఉన్న మొర్వి ప్రాంతంలో టంకార్ గ్రామంలో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన పరమానంద సరస్వతి వద్ద దీక్ష స్వీకరించి, సన్యాసిగా మారి, దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నారు. మధురలోని విరజానంద స్వామి వద్ద వేదాల్లోని సత్యాన్ని తెలుసుకున్నారు.
స్వామి రామానందతీర్థ హైదరాబాద్ కేంద్రంగా ఆర్య సమాజాన్ని నడిపారు. హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఆర్య సమాజం సాంఘిక, మత సంస్కరణలతోపాటు జాతీయ చైతన్యాన్ని కూడా ప్రచారం చేసింది. స్వామి వివేకానందుడు ఉపనిషత్తులకు, దయానంద సరస్వతి వేదాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు.


ఆంధ్రాలో బ్రహ్మ సమాజం

  బ్రహ్మ సమాజ సేవలను దక్షిణ భారతదేశానికి కేశవ చంద్రసేన్ విస్తరించినట్లుగా పేర్కొంటారు. 1878లో మన్నవ బుచ్చయ్య పంతులు బ్రహ్మ సమాజంలో చేరారు. ఉత్తర సర్కారు ప్రాంతానికి చెందిన రాజా గజపతిరావు ధన సహాయంతో బ్రహ్మసమాజ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్. కళాశాల) ప్రధానాచార్యుడిగా పనిచేసి అక్కడ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు, సంస్కరణలను ప్రచారం చేశారు. బ్రహ్మధర్మ ప్రచారక నిధిని ఏర్పాటు చేశారు. కాకినాడలో బ్రహ్మ మందిరం, అనాథ శరణాలయాలను స్థాపించారు. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించి దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. ఆంధ్రదేశంలో రాజమండ్రి కేంద్రంగా బ్రహ్మ సమాజ సేవలను అందించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ఈయన గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, పాత్రికేయుడు. స్త్రీ విద్యాభివృద్ధికి, వితంతువుల ఉద్ధరణకు జీవితాంతం కృషి చేశారు. హితకారిణీ సమాజం, వితంతు శరణాలయం, బాలికా పాఠశాలలు నెలకొల్పి ఆంగ్ల ప్రభుత్వంతో 'రావు బహద్దూర్' బిరుదును పొందారు. ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహాన్ని 1881, డిసెంబరు 11న రాజమండ్రిలో జరిపించారు.


రామకృష్ణ మిషన్

  1897లో స్వామి వివేకానంద కలకత్తాలోని బేలూర్‌లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించాడు. తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడానికే ఈ సంస్థను స్థాపించాడు. (వాస్తవానికి 1897లో కాశీపూర్ సమీపంలోని బరానగర్‌లో వివేకానందుడు తొలి ఆశ్రమాన్ని స్థాపించి, 1899లో కలకత్తా సమీపంలోని బేలూరులో రామకృష్ణ మఠాన్ని నెలకొల్పాడు). 'మానవ సేవే మాధవ సేవ' అనే రామకృష్ణ పరమహంస సందేశం రామకృష్ణ మిషన్ నినాదమైంది. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసిన స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.


రామకృష్ణ పరమహంస

  రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ లేదా గదాధరుడు. 1833లో బెంగాల్‌లోని కామర్‌కుర్/కామర్పకూర్ గ్రామంలో జన్మించాడు. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌లో రాసమణీదేవి నిర్మించిన కాళికామాత ఆలయంలో తన అన్న రామకుమార్ ఛటర్జీ అనంతరం అర్చకుడిగా చేరాడు. రామకృష్ణుడి గురువు తోతాపురి. గదాధరుడికి అయిదేళ్ల వయసున్న శారదామణి (శారదామాత)తో బాల్య వివాహం జరిగింది. రామకృష్ణుడు సాంఘిక, మత సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. 'వివిధ మతాలు భగవంతుడిని చేరుకోవడానికి ఉన్న వివిధ మార్గాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లే, మతాలన్నీ భగవంతుడిలో విలీనమవుతాయి' అని ప్రచారం చేశాడు. వర్ణ వ్యవస్థను, కులపరమైన విభేదాలను ఖండిస్తూ సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టాడు. రామకృష్ణ పరమహంస 1886లో అనారోగ్యంతో కాశీపూర్‌లో మరణించాడు.


పార్శీ మత సంస్కరణోద్యమం

ప్రాచీన కాలంలోనే పారశీకులు భారతదేశంపై దండెత్తి వచ్చారు. ఫలితంగా భారతీయులతో పారశీకులకు సంబంధాలు ఏర్పడ్డాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో అనేకమంది పారశీకులు (ఇరానియన్లు) గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు వచ్చారు. కానీ ఎక్కువగా బొంబాయిలో స్థిరపడ్డారు. హిందూ మత సంస్కరణ ఉద్యమ ప్రభావంతో పారశీకులు కూడా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చదివిన పారశీక విద్యావంతులు ఆధునిక భావాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. 1851లో నౌరోజీ ఫరందోజీ 'రహ్న మాయెమస్ దయానన్' సంస్కరణ సంఘాన్ని స్థాపించాడు. 1858లో పార్శీ బాలికా పాఠశాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీబోధ్, దస్త్ గఫ్తర్ లాంటి పత్రికలను స్థాపించి సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. దాదాభాయి నౌరోజీ, షాపూర్‌జీలు వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు. 1910లో పార్శీ మహాసభను నిర్వహించారు. దాదాభాయ్ నౌరోజీ రచించిన 'పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకంతో సంపద తరలింపు సిద్ధాంతం/ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రచురించారు. ఖుర్షీద్ నారీమన్ బొంబాయిలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన తొలి బొంబాయి పౌరుడిగా ప్రసిద్ధి చెందాడు. బొంబాయి రాష్ట్రం (ప్రెసిడెన్సీ)లో బద్రుద్దీన్ త్యాబ్జీ, సంయుక్త పరగణాలు(యూపీ)లో షేక్ అబ్దుల్ హలీల్ షరార్ సంస్కరణ ఉద్యమాలను ప్రచారం చేశారు. ఈ విధంగా భారతదేశంలోని అనేకమంది పారశీక సంఘ సంస్కర్తలు సంస్కరణ ఉద్యమాలను నడిపారు.


అలీఘర్ ఉద్యమం

  వాస్తవంగా ముస్లింల సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్ని అలీఘర్ ఉద్యమంగా పేర్కొంటారు. దీన్ని ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్. ఈయన భారతీయ ముస్లిం సంఘ సంస్కర్తల్లో ముఖ్యమైన వ్యక్తి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ మత సత్యాలు, సంప్రదాయాలను హేతువాదంతో సమన్వయ పరచడం, సచ్ఛీలతను - నైతిక ప్రవర్తనను పెంపొందించడం, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించడం లాంటి లక్ష్యాలతో మూడంచెల విద్యా వ్యవస్థలను స్థాపించాడు. 1875లో అలీఘర్ కేంద్రంగా ఆంగ్లో - ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. అది తర్వాతి కాలంలో అలీఘర్ విశ్వవిద్యాలయంగా మారింది. అలీఘర్ కేంద్రంగా అహ్మద్‌ఖాన్ నడిపిన ఉద్యమమే అలీఘర్ ఉద్యమంగా పేరొందింది. మొదట్లో జాతీయవాదిగా ఉన్న అహ్మద్‌ఖాన్ 'సుందర భారత వధువుకు హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటివారు' అని ప్రకటించాడు. కానీ అలీఘర్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడైన థియోడర్ బెక్ ప్రభావంతో ముస్లిం మతవాదిగా మారిపోయిన అహ్మద్‌ఖాన్ హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని (మీరట్ ఉపన్యాసంలో) ప్రకటించాడు.

  1859లో అహ్మద్‌ఖాన్ విధేయులైన భారతీయ ముస్లింలు, సిపాయిల తిరుగుబాటుకు కారణాలు అనే గ్రంథాలు రాశాడు. 'ఖురాన్ వైపు మరలండి' అనే నినాదాన్ని ఇచ్చాడు. 'తహరీక్ ఉల్ అబ్లాఖ్' అనే పత్రికను ప్రారంభించాడు. థియోడర్‌ బెక్ ప్రోత్సాహంతో అలీఘర్‌లో 1893లో 'మహ్మదీయ రక్షణ సమితి'ని స్థాపించాడు. 'భావ స్వాతంత్య్రం వికసించనంత వరకు నాగరిక జీవితమనేది ఉండదు' అని వ్యాఖ్యానించాడు. 'మూసిన మనసు సామాజికమైన, మేధా సంబంధమైన వెనకబాటుతనానికి ప్రతీక' అని చాటాడు. అన్ని మతాల్లో ఒకానొక అంతర్గతమైన ఏకత్వం ఇమిడి ఉందని పలికిన వ్యక్తి చివరికి ముస్లిం మతవాదిగా మారిపోయాడు.


ముస్లింల మత సంస్కరణ ఉద్యమం

  హిందూ మతంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం ఇస్లాం మతంపై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ముస్లింలు తమ మతం, సంఘంలో ఉన్న బహు భార్యత్వం, పరదా పద్ధతి, కులవ్యవస్థ లాంటి  దురాచారాలను తొలగించడానికి, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బెంగాల్ కేంద్రంగా షరియతుల్లా నాయకత్వంలో ఫెరైజీ ఉద్యమాన్ని నిర్వహించారు. 1830 - 57 మధ్య బిహార్, బెంగాల్ ప్రాంతాల్లో ముస్లింలు వహాబీ ఉద్యమాన్ని నడిపారు. షా వలీయుల్లా, షా అబ్దుల్ అజీజ్, సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హహరాన్‌పూర్ జిల్లాలో ఉన్న దేవ్‌బంద్ కేంద్రంగా దర్శ్‌నిజామీ దేవ్‌బంద్/ దియోబంద్ ఉద్యమాన్ని నడిపారు. 1867లో స్థాపించిన విద్యా సంస్థలో దర్శ్‌నిజామీ రూపొందించిన సంప్రదాయ విద్యాప్రణాళికను అమలు చేశారు. ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలని దేవ్‌బంద్ అధ్యక్షుడైన రషీద్ అహ్మద్ గంగోహి పిలుపునిచ్చాడు. రషీద్ అహ్మద్ గంగోహీ (గంగోవాలా), మహ్మద్ ఖాసిం నానాతాపీలు లక్నోలో దారుల్ ఉలూమ్ పాఠశాలను స్థాపించారు. ప్రాచ్య-పాశ్చాత్య భాషలతో కూడిన ఉమ్మడి విద్యా ప్రణాళికను హిబ్లీ నుమానీ ప్రవేశపెట్టాడు. 1863లో నవాబ్ అబ్దుల్ లతీఫ్ 'మహ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను స్థాపించి ముస్లింల విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. సంప్రదాయక ముస్లింలు షా వలీయుల్లా నాయకత్వంలో దిల్లీలో ఒక మదరసాను నెలకొల్పారు. అతడి కుమారుడు షా అబ్దుల్ అజీజ్ ఆంగ్లేయులపై జిహాద్ ప్రకటించాడు. షిబ్లి, నుమానీ మహ్మద్ హసన్, ఉబైదుల్లా సింధీ లాంటి ముస్లిం సంఘ సంస్కర్తలు హిందూముస్లిం ఐక్యతకు కృషి చేశారు.


స్వామి వివేకానంద

  స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్. 1863, జనవరి 12న కలకత్తాలో జన్మించాడు. కలకత్తా రాష్ట్రీయ కళాశాలలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. మొదట బ్రహ్మ సమాజికులతో చేరి విగ్రహారాధనను ఖండించాడు. కానీ రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారిన తర్వాత విగ్రహారాధనలో విశేషార్థమున్నదని గ్రహించాడు. విజ్ఞాన శాస్త్రానికి, బాహ్య జ్ఞానానికి వర్తింపజేసే పరిశోధనా పద్ధతులనే మతం అనే శాస్త్రానికి కూడా అనువర్తింపజేయాలని స్వామి వివేకానంద పేర్కొన్నాడు. భారతీయ ఉపనిషత్తుల్లోని బోధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి హైందవ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశాడు. 'నేను సోషలిస్ట్‌ను' అని ప్రకటించుకున్న తొలి భారతీయుడు వివేకానందుడే. ఈయన ప్రబుద్ధ భారత్ (ఆంగ్లం), ఉద్బోధ (బెంగాలీ) అనే పత్రికలను ప్రారంభించాడు. నా గురువు, రాజయోగ, కర్మయోగ, భక్తియోగ గ్రంథాలను రాశాడు. 'మన మాతృదేశానికి హిందూ-ఇస్లాం మహా వ్యవస్థల కూడలి ఏకైక ఆశాకిరణం' అని పేర్కొన్నాడు. 'మనం ప్రపంచంలోని ఇతర జాతులతో సంబంధం పెట్టుకోకుండా వేరుపడిపోవడమే మన దౌర్భాగ్యానికి కారణమని, మనం మళ్లీ మిగతా ప్రపంచపు వెల్లువలో కలవడమే తరుణోపాయం' అని ప్రకటించాడు. 'అన్ని జాతుల్లో ఉన్న పేదలే నేను విశ్వసించే ఏకైక దైవం' అని పేర్కొన్నాడు. భారతదేశ యువతను జాతీయ చైతన్యం పెంపొందించుకునేలా చేసి 'ఆధునిక జాతీయతా పితామహుడు'గా పేరొందాడు. వివేకానందుడు అతి చిన్న వయసులోనే 1902, జులై 4న మరణించాడు. ఇప్పటికీ భారతదేశంలో సేవలను అందిస్తున్న ఏకైక సంస్థ రామకృష్ణ మిషన్.


దివ్యజ్ఞాన సమాజం

  అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడం బ్లావెట్‌స్కీ, కల్నల్ ఆల్కాట్ 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని (థియోసోఫికల్ సొసైటీ) స్థాపించారు. థియోస్ అంటే దైవం, సోఫియా అంటే జ్ఞానం. అందుకే దీన్ని తెలుగులో 'దివ్యజ్ఞాన సమాజం'గా పిలిచారు. ఈ సమాజ ప్రధాన కేంద్రాన్ని 1879లో బొంబాయికి, 1882లో మద్రాస్ వద్ద ఉన్న అడయార్‌కు మార్చారు. బ్లావెట్‌స్కీ 'రహస్య సిద్ధాంతం' అనే గ్రంథాన్ని రాశారు. ఆమె మరణానంతరం కల్నల్ ఆల్కాట్ ఈ సమాజానికి నాయకత్వం వహించాడు. 1907లో కల్నల్ ఆల్కాట్ మరణానంతరం అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. ఈ సమాజం సాంఘిక, మత సంస్కరణతోపాటు రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి కూడా కృషి చేశారు. ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో దివ్యజ్ఞాన సమాజ శాఖను నెలకొల్పారు. అనిబిసెంట్ 1888లోనే ఇంగ్లండ్‌లో దివ్యజ్ఞాన సమాజంలో చేరారు.

సిక్కు మత సంస్కరణ ఉద్యమం

  గురునానక్ స్థాపించిన సిక్కు మతం క్రమంగా రాజకీయంగా ఏకమై రంజిత్‌సింగ్ నాయకత్వంలో స్వతంత్ర సిక్కు రాజ్యంగా రూపాంతరం చెందింది. సిక్కులు కూడా తమ మతం, సంఘంలో ఉన్న లోపాలను తొలగించడానికి సంస్కరణ ఉద్యమాలను నడిపారు. భాయి దయాళ్ సింగ్ రావల్పిండి ప్రధాన కేంద్రంగా నిరంకారీ ఉద్యమాన్ని నడిపాడు.

  విగ్రహారాధన, కర్మకాండలను విడిచిపెట్టమని, ఆనంద్ పద్ధతిలో వివాహాలు జరుపుకోవాలని, నిరాకారుడైన భగవంతుడిని మాత్రమే పూజించాలని ప్రబోధించాడు. అతడి కుమారుడైన భాయి దర్బార్‌సింగ్ నిరంకారీ ఉద్యమానికి నాయకుడై ఆనంద్ వివాహ పద్ధతిని ప్రోత్సహించాడు. భాయి రాంసింగ్ 'నామ్‌ధారీ' ఉద్యమాన్ని నడిపాడు. సిక్కుల్లోని మరో వర్గం గోవధను వ్యతిరేకిస్తూ, కసాయివారిని హత్య చేస్తూ, దేవాలయాలు, సమాధులు, శ్మశానాలు నాశనం చేస్తూ 'కూకా' ఉద్యమాన్ని ప్రారంభించింది. 1873లోనే సిక్కులు తొలి సింగ్‌ సభను ఏర్పాటు చేసుకున్నారు. 1920లో రాజకీయ పార్టీగా అకాళీదళ్‌ను స్థాపించారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని ఏర్పాటు చేశారు.

  ఆధునిక భారతదేశంలో క్రీ.శ. 19వ శతాబ్దంలో ప్రారంభమైన వివిధ మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలనే సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ ఉద్యమాల వల్ల అటు మతంలో ఇటు సంఘంలో అనేక సంస్కరణలు జరిగాయి. అనుకూల అంశాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నిమ్న వర్గాల, కుల వ్యతిరేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. అనేక సాంఘిక దురాచారాలను నిషేధించారు.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

1. 1815లో రాజా రామ్మోహన్‌రాయ్ స్థాపించిన సంస్థ?
జ: ఆత్మీయసభ

2. బ్రహ్మసమాజంలో ఎప్పుడు చీలిక ఏర్పడింది?
జ: 1866

3. 'వేదాలకు మరలండి' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద సరస్వతి

4. 'ఖురాన్ వైపునకు మరలండి' అని ఎవరు అన్నారు?
జ: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

5. 'మానవసేవే మాధవసేవ' అనేది ఏ సంస్థ నినాదం?
జ: రామకృష్ణ మిషన్

6. 'భారతదేశం భారతీయులకే' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద

7. రాజా రామ్మోహన్‌రాయ్ జీవిత చరిత్రను ఎవరు రాశారు?
జ: సోఫియా డాబ్సన్‌కోలెట్

8. 'బాల్య వివాహాల రద్దు' చట్టం చేయడానికి కృషి చేసినవారు?
జ: కేశవచంద్రసేన్

9. కింది అంశాలను జతపరచండి.
i) ప్రార్థనా సమాజం               ఎ) 1897
ii) ఆర్యసమాజం                   బి) 1867
iii) రామకృష్ణ మిషన్             సి) 1875
iv) బ్రహ్మసమాజం                డి) 1828
జ: i-బి, ii-సి, iii-ఎ, iv-డి

10. సంగత్ సభ/ సంగీత సభను ఎవరు స్థాపించారు?
జ: కేశవ చంద్రసేన్

11. ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహం ఎప్పుడు జరిగింది?
జ: 1881, డిసెంబరు 11

12. బెంగాలీ ప్రాథమిక వాచకాన్ని రాసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

13. భారతదేశంలో వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

14. కింది అంశాలను జతపరచండి.
i) గదాధరుడు                   ఎ) రామకృష్ణ పరమహంస
ii) మూల్ శంకర్               బి) స్వామి శ్రద్ధానంద్
iii) మున్షీరాం                    సి) స్వామి వివేకానంద
iv) నరేంద్రనాథ్‌దత్            డి) స్వామి దయానంద
జ: i-ఎ; ii-డి; iii-బి; iv-సి

15. 'వితంతు వివేకము'  గ్రంథ రచయిత?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

16. 'బ్రహ్మ ధర్మము' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్

17. రాజా రామ్మోహన్‌రాయ్ నడిపిన బెంగాలీ పత్రిక ఏది?
జ: సంవాద కౌముది

18. భారతదేశంలో తొలి వితంతు వివాహాన్ని జరిపించింది ఎవరు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Posted Date : 07-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

1. స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడెవరు?
జ: సాదతుల్లా ఖాన్

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

3. హైదర్ ఆలీ ఏ మైసూర్ యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో మైసూరు యుద్ధం

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలాను బంధించి, చంపిన వ్యక్తి ఎవరు?
జ: మిరాన్

5. బక్సర్ యుద్ధ హీరో ఎవరు?
జ: హెక్టార్ మన్రో

6. చీకటిగది ఉదంతంగా పేర్కొనే సంఘటన జరిగిన ప్రదేశం ఏది?
జ: కలకత్తా

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

8. పోర్టో నోవో యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1781

9. టిప్పు సుల్తాన్ మరణించిన సంవత్సరం?
జ: 1799

10. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

11. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైన సంవత్సరం?
జ: 1756

12. బక్సర్ యుద్ధంలో పాల్గొనని భారతీయ పాలకుడు ఎవరు?
       ఎ) మీర్ ఖాసిం     బి) షూజా ఉద్దౌలా     సి) రెండో ఆలం షా    డి) అన్వరుద్దీన్
జ: డి) అన్వరుద్దీన్

13. వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ ఎవరి చేతిలో ఓడిపోయాడు?
జ: సర్ ఐర్‌కుట్

14. ప్లాసీ యుద్ధంలో ప్రేక్షకపాత్ర వహించిన సిరాజుద్దౌలా సేనానులు?
ఎ) మీర్ జాఫర్              బి) యార్ లుతుఫ్ ఖాన్             సి) రాయ్ దుర్లబ్             డి) పై ముగ్గురూ
జ: డి (పై ముగ్గురూ)

15. బక్సర్ యుద్ధానికి ప్రధాన కారణం?
ఎ) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.
బి) నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
సి) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
డి) ఏదీకాదు
జ: 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం

Posted Date : 11-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 సిపాయిల తిరుగుబాటు

1. డల్హౌసీ ప్రవేశ పెట్టిన విధానం ఏది?
జ: రాజ్యసంక్రమణ విధానం

2. 1856లో సామాన్య సేవా నియుక్త చట్టం చేసింది ఎవరు?
జ: కానింగ్

3. ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించిన ఆంగ్లేయ సేనాని ఎవరు?
జ: సర్ హ్యురోజ్

4. మొదటి భారత రాజ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు?
జ: ఛార్లెస్ ఉడ్

5. నానాసాహెబ్ అసలు పేరేంటి?
జ: దోండుపంత్

6. భారతదేశంలో మొదటి వైస్రాయిగా నియమితుడైన వ్యక్తి?
జ: కానింగ్

7. 1857 తిరుగుబాటుకు కారణం/ కారణాలు...?
     1) రాజ్య సంక్రమణ సిద్ధాంతం           2) ఆంగ్లేయుల భూమి శిస్తు విధానం
     3) ఆంగ్లేయుల ఆర్థిక విధానాలు      4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)

8. క్రైస్తవ మిషనరీలను భారతదేశంలోకి ఎప్పుడు అనుమతించారు?
జ: 1813

9. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
జ: ఎన్‌ఫీల్డ్ తుపాకులు

10. 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి?
జ: మంగళ్‌పాండే

11. 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
జ: మీరట్

12. 1857 తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1857 మే 10

13. 1858లో భారతదేశ పరిపాలనను స్వీకరించిన బ్రిటిష్ రాణి?
జ: మొదటి విక్టోరియా

14. రెండో బహదూర్ షా ఎప్పుడు మరణించాడు?
జ: 1862

15. 1856లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకు వచ్చింది ఎవరు?
జ: లార్డ్ డల్హౌసీ

16. 1857 తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏది?
     1) ఈస్టిండియా కంపెనీ పాలన రద్దు      2) బ్రిటిష్ ప్రభుత్వం భారతపాలన చేపట్టింది
     3) భారతీయులపట్ల బ్రిటిష్ విధానాలు, దృక్పథాలు మారాయి      4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
 

Posted Date : 11-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

  క్రీ.శ.18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనతో భారతదేశంలో ఆధునిక యుగం ప్రారంభమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ.1453లో తురుష్కులు కాన్‌స్టాంట్‌నోపుల్‌ను ఆక్రమించుకున్నారు. ఫలితంగా తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఏకైక భూమార్గం మూసుకుపోయింది. నూతన మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నించిన తొలి ఐరోపా దేశం పోర్చుగల్.
పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా సముద్రంపై ప్రయాణించి, సముద్ర మార్గాన్ని భౌగోళిక పటంగా (పోర్టోలనీ) రూపొందించాడు. స్వయంగా నావికా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు. కాబట్టి హెన్రీని 'ది నావిగేటర్' బిరుదుతో పిలుస్తారు.
హెన్రీ ఆర్థిక సహాయంతో బార్తోలోమ్యూ డియాస్ (Bartolomeu Dias) తుపానుల అగ్రం/ కేప్ ఆఫ్ స్ట్రామ్స్‌ను కనుక్కున్నాడు.
తర్వాత హెన్రీ కుమారుడు రెండో జాన్ కేప్ ఆఫ్ స్ట్రామ్స్ వరకూ వెళ్లి, దానికి కేప్ ఆఫ్ గుడ్‌హోప్ అనే పేరు పెట్టాడు.


పోర్చుగీసువారు

1498, మే 17న వాస్కోడిగామా భారతదేశానికి వచ్చి, కాలికట్ పాలకుడు జామెరిన్‌ను కలిసి వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు.
వాస్కోడిగామాకు అబ్దుల్ వాజిద్ (అబ్దుల్ అజీజ్) అనే గుజరాత్ నావికుడు సహాయపడ్డాడు.
ఆధునిక యుగంలో భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశంగా పోర్చుగల్‌ను పేర్కొంటారు.
కాలికట్‌లో పోర్చుగీసువారు తమ తొలి వర్తక స్థావరాన్ని స్థాపించారు.
వాస్కోడిగామా రెండోసారి 1502లో భారతదేశానికి వచ్చాడు.
పోర్చుగల్ దేశ ప్రతినిధిగా/అధికారిగా వచ్చిన కాబ్రల్ కొచ్చిన్, క్రాంగనూర్ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
1505 - 09 మధ్య గవర్నర్‌గా పనిచేసిన డీ ఆల్మడా నౌకా వ్యాపార అభివృద్ధి కోసం నీలి నీటి విధానాన్ని (Blue water policy) ప్రవేశ పెట్టాడు. కన్ననూర్ వద్ద ఒక కోటను నిర్మించాడు.
ఆల్బూకర్క్ అనే పోర్చుగీసు గవర్నర్ సొకొట్ర, ఆర్ముజ్, డయ్యూ, మలక్కా, గోవా, మాకోలు రేవులను ఆక్రమించి ''భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత''గా పేరుగాంచాడు.
1510లో ఆల్బూకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని బీజపూర్ పాలకుడిని ఓడించి, గోవాను ఆక్రమించాడు.
భారతదేశంలో పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరం గోవా.

పోర్చుగీసువారు ఆక్రమించిన వివిధ ప్రాంతాలు

                 సంవత్సరం       ప్రాంతం పేరు
                1511                   మలక్కా
                1515                   ఆర్ముజ్
                1518                   కొలంబో
                1534                   డయ్యూ
                1538                   డామన్, నాగపట్నం

చిట్టగాంగ్, హుగ్లీ, శాంథోమ్ లాంటి ప్రాంతాల్లో కూడా వర్తక స్థావరాలను స్థాపించారు.
గోవాకు వెళ్లిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు సర్ ఫ్రాన్సిస్ జేవియర్ పోర్చుగీసు వాడే.
భారతదేశంలో 1556లో తొలి అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టింది కూడా పోర్చుగీసువారే.
పొగాకు, మిరప, మొక్కజొన్న లాంటి పంటలను భారతీయులకు పరిచయం చేసింది పోర్చుగీసువారే.
1534లో గుజరాత్ పాలకుడు బహదూర్‌షా నుంచి బొంబాయిని పొందిన పోర్చుగీసువారు 1661లో దాన్ని ఆంగ్లేయులకు అద్దెకు ఇచ్చారు. (ఏడాదికి 10 పౌండ్లు).
పోర్చుగీసు వారి సహాయంతోనే విజయనగర రాజులు అశ్విక దళాన్ని, గుజరాత్ పాలకులు ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నారు.
16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై వాణిజ్య ఆధిపత్యాన్ని పొందిన పోర్చుగీసువారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి, క్రమంగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.
షాజహాన్ 'హుగ్లీ' స్థావరాన్ని, ఔరంగజేబ్ 'చిట్టగాంగ్' స్థావరాన్ని పోర్చుగీసు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
1961లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ విజయ్' పేరుతో సైనిక చర్య జరిపి, పోర్చుగీసు వారి నుంచి గోవాను ఆక్రమించుకుంది.
భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశీయులుగా, భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపా దేశీయులుగా పోర్చుగీసువారు గుర్తింపు పొందారు.

డచ్‌వారు (నెదర్లాండ్స్/ హాలెండ్)
 

డచ్‌వారు 1602లో 'యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్‌'ను స్థాపించారు.
1605లో డచ్‌వారు మచిలీపట్నం వచ్చి, నాటి గోల్కొండ పాలకుడు మహ్మద్ కులీకుతుబ్‌షా సహాయంతో భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
వీరు పులికాట్ (1610), సూరత్ (1616), భీమునిపట్నం (1641), చిన్సురా (1653); కాశింబజార్, నాగపట్నం, కొచ్చిన్‌ల‌లో వర్తక స్థావరాలను స్థాపించారు.
భారతదేశంలో డచ్‌వారి తొలి ప్రధాన వర్తక కేంద్రం పులికాట్. కానీ 1690లో వారు తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని నాగపట్నానికి మార్చుకున్నారు. (నోట్: భారతదేశంలో డచ్‌వారి ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నం అని గుర్తించాలి.)
1658లో డచ్‌వారు పోర్చుగీసు వారిని ఓడించి, సింహళాన్ని (శ్రీలంక) ఆక్రమించారు.
1623 నాటి అంబోయినా వధ ఆంగ్లేయులకు, డచ్చివారికి మధ్య వైరాన్ని పెంచింది.
అంబోయినా వధ కాలంలో డచ్ గవర్నర్ హెర్మన్ వాన్‌స్పెల్ట్ (Herman van Speult).
డచ్‌వారు వాన్‌లిచ్చ్‌టన్ అనే అన్వేషకుడి రాతలు/రచనల వల్ల ప్రభావితమై భారతదేశానికి వచ్చారు.
చివరికి డచ్‌వారు ఇండోనేషియాను తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు.
సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి వస్త్ర వ్యాపారం దిశగా దృష్టి మరల్చిన తొలి ఐరోపా దేశం డచ్ నెదర్లాండ్స్.

డేన్‌లు (డెన్మార్క్)

  డెన్మార్క్‌వారు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని తమిళనాడులోని ట్రాంక్వీబార్‌లో ఏర్పాటు చేసుకున్నారు.
  భారతదేశంలో డేన్‌ల ప్రధాన వర్తక స్థావరం బెంగాల్‌లోని సేరాంపూర్.
  క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేసిన ప్రధాన ఐరోపా దేశం డెన్మార్క్ (డేన్స్).
  డేన్‌లు 1845లో భారతదేశంలోని తమ వర్తక స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు అమ్మేసి తమ దేశం వెళ్లిపోయారు.

ఆంగ్లేయులు (ఇంగ్లండ్)

 ఫాదర్ స్టీఫెన్స్ అనే క్రైస్తవ మతాచార్యుడు ఎలిజబెత్ రాణి కాలంలో తొలిసారిగా భారతదేశానికి వచ్చాడు (1579).
 ఆంగ్లేయులు 1600లో 'ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లండ్‌'ను స్థాపించుకున్నారు.
 ఎలిజబెత్ రాణి రాయల్ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని మంజూరు చేసింది.
 అక్బర్ కాలంలో జాన్‌న్యూబెరి, విలియం రీడ్స్ అనే నగల వ్యాపారులు; జేమ్స్‌స్టోరీ అనే చిత్రకారుడు, రాల్ఫ్‌పిఛ్ అనే రాయబారి భారతదేశాన్ని సందర్శించారు.
 1599 - 1605 మధ్య జాన్‌మిండెన్ హాల్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో ఉన్నాడు.
 1608లో విలియం హాకిన్స్ అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు.
 1611లో 'గ్లోబ్' నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో ఆంగ్లేయులు మచిలీపట్నం వచ్చి మహ్మద్ కులీకుతుబ్‌షా అనుమతి పొందారు (స్థావరం ఏర్పాటు చేయలేదు).
1615 - 16 మధ్య సర్ థామస్ రో అనే ఆంగ్లేయుడు జహంగీర్ ఆస్థానానికి వచ్చి, వ్యాపార అనుమతి పొందాడు. ఫలితంగా ఆంగ్లేయులు 1616లో తమ తొలి వర్తక స్థావరాన్ని సూరత్‌లో ప్రారంభించారు.
 ఆంగ్లేయులు 1626లో గోవాలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు.
 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్ల ప్రతినిధి 2 గ్రామాలను దామెర్ల సోదరుల నుంచి కొనుగోలు చేసి, సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. ఆ ప్రాంతమే చెన్నపట్నంగా ప్రసిద్ధి చెందింది.
 1633లో ఆంగ్లేయులు రాల్ఫాకార్ట్‌రైట్ కృషి వల్ల ఒరిస్సాలోని హరిహరపురంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు.
 బ్రాడ్‌మన్ అనే ఆంగ్లేయుడి కృషి ఫలితంగా 1651లో హుగ్లీలో ఆంగ్లేయుల వర్తక స్థావరం ఏర్పాటైంది.
 గాబ్రియల్ బౌటన్ అనే ఆంగ్ల వైద్యుడు షాజహాన్ నుంచి పొందిన ప్రాంతంలో జాబ్ చార్నక్ 'పోర్టు విలియం కోట'ను నిర్మించాడు (1699).
 ఆంగ్లేయులు మొగలుల నుంచి సుతనుతి, కాశీఘట్టం, గోవింద్‌పూర్ గ్రామాలను పొంది, వాటిని కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు.
 కడలూరు (తమిళనాడు)లో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు.
 ఆంగ్లేయులు 1682లో విశాఖపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
 1717లో విలియం హామిల్టన్ అనే ఆంగ్ల వైద్యుడు మొగల్ చక్రవర్తి అయిన ఫరూక్ షియర్ వ్యాధిని నయంచేసి, గోల్డెన్ ఫర్మానా ద్వారా అనేక రాయితీలు పొందాడు.
 జెరాల్డ్ ఆంగియర్ అనే ఆంగ్లేయుడు బొంబాయిని గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చాడు.
 భారతదేశంలో ఆంగ్లేయులు మద్రాస్‌లోని సెయింట్ జార్జికోటను తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు.


ఫ్రెంచివారు (ఫ్రాన్స్)

1656లో బెర్నియార్ అనే ఫ్రెంచి యాత్రికుడు ఔరంగజేబ్ రాజ్యాన్ని, ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు.

 ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో 14వ లూయీ అనుమతితో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు.
 1668లో ఫ్రాంకోయిస్ కరోన్ అనే వ్యక్తి ఔరంగజేబ్ అనుమతితో సూరత్‌లో తొలి వర్తక స్థావరాన్ని స్థాపించాడు.
 1669లో ఫ్రెంచివారు మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని స్థాపించారు.
 ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అధికారి వాలి కొండాపురం ప్రాంతాన్ని పొంది అక్కడ పుదుచ్చేరి/పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు.
 భారతదేశంలో ఫ్రెంచివారి ప్రధాన వర్తక స్థావరం పుదుచ్చేరి/పాండిచ్చేరి.
 ఫ్రెంచివారు షయిస్తాఖాన్ నుంచి పొందిన బాలాసోర్, కాశింబజార్, చంద్రనగర్ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను నిర్మించారు.
 భారతదేశంలో ఫ్రెంచి ప్రతినిధులుగా లె నోయిర్, డ్యూమాస్, డూప్లే లాంటి వ్యక్తులు పనిచేశారు.
 లె నోయిర్ మాహె, యానాం (1729) ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు.
 డ్యూమాస్ మొగల్ చక్రవర్తి నుంచి 'నవాబ్' అనే బిరుదును పొందాడు.
 డూప్లే భారతదేశంలో ఫ్రెంచి వలస రాజ్య నిర్మాతగా పేరుపొందాడు.
 కానీ ఆంగ్లేయులు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచివారిని ఓడించి భారతదేశాన్ని ఆక్రమించారు.
 ఫ్రెంచివారి అధీనంలో ఉన్న యానాం, పాండిచ్చేరి ప్రాంతాలను భారత ప్రభుత్వం 1956లో ఆక్రమించుకుంది.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు

సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


నవీన చోళులు
 

* విజయాలయుడు క్రీ.శ.846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి, కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు.
* ఒరైయూర్‌కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదిని దేవాలయాన్ని నిర్మించాడు.
* నవీన చోళుల రాజధాని తంజావూరు.
* విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి, పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు.
* మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు (చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు).
* ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది.
* మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి, మధురైకొండ అనే బిరుదు పొందాడు.
* మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీ.శ.949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు.
* నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటిరాజరాజు (క్రీ.శ.985 - 1014).
* మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలి వర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది.
* బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
* మొదటి రాజరాజు పొలోన్నరావాలో (సింహళం) శివాలయాన్ని నిర్మించాడు.
* తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.
* భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. (బిరుదులు జయంగొండ, చోళమార్తాండ, ముమ్మిడి చోళ)
* ఇతడు సింహళంపై (శ్రీలంక) దండెత్తి ఉత్తర సింహళాన్ని ఆక్రమించాడు.
* మాల్దీవులను ఆక్రమించాడు.
* రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్యరాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌఢామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే
* మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్రచోళ అధికారంలోకి వచ్చాడు.
* నవీన చోళుల్లో ప్రసిద్ధిచెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు (1014 - 1044)
* మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండితచోళ లాంటి బిరుదులను పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* గంగానది వరకు వెళ్లి పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి, ''గంగైకొండ'' అనే బిరుదు పొందాడు.
* నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు.
* శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదును పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' అనే నూతన రాజధానిని, 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు.
* తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి.
* మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని, 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు.
* సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు.
* అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటిరాజేంద్రచోళుడు (చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు.)
* ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు.
* మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాధిరాజు ''విజయ రాజేంద్ర' బిరుదుతో రాజ్యపాలన చేశాడు.
* కానీ మొదటి రాజాధిరాజు క్రీ.శ.1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు.
* రాజాధిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు.
* రెండో రాజేంద్రుడు క్రీ.శ.1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు, ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు.
* రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ''కులోత్తుంగ చోళుడు'' అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు.
* కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన ఏడో విజయాదిత్యుడి మరణానంతరం 'చోళ చాళుక్య రాజ్యాల'ను కలిపి పాలన ప్రారంభించాడు.
* విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే.
* కళింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయంగొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు.
* మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు
 

* చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* వ్యవసాయాభివృద్ధి కోసం పెద్దసంఖ్యలో చెరువులను తవ్వించారు.
* చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది
* నాటి భూస్వాములను మువ్వేందవేలన్, అరయ్యార్ అని పిలిచేవారు.
* మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి
* అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం.
* చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని శెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది.
* పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు.
* మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి రెండు రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు.
* చోళుల కాలంలో ద్రవిడ/ దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది.


పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు
 

* చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలై
* నాగేశ్వరస్వామి ఆలయం కుంభకోణం
* కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు
* మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
* చోళుల కాలంనాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది.
* చోళుల అధికార మతం శైవం. (శివారాధకులు)
* కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* తంజావూరు జిల్లాలోని దారాసురాం వద్ద అయితేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* సిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబ రామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
* చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
* అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు.
* కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్లి, వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు.

చోళుల కాలంలో దానం చేసిన భూములు  - పేర్లు

బ్రహ్మదేయ  - బ్రాహ్మణులకు దానం చేసిన భూమి
వెల్లన్ వాగై - బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి
దేవమేయ/ తిరునాముత్తక్కని - దేవాలయానికి దానం చేసిన భూమి
శాలభోగ - పాఠశాలలకు ఇచ్చిన భూమి
పళ్లిచ్చరిదం - జైన సంస్థలకు దానం చేసిన భూమి.

బృహదీశ్వర ఆలయం

తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది. ఈ దేవాలయ గోపురంపై అతి పెద్ద విమానాన్ని నిర్మించారు.

పరిపాలనా విశేషాలు

* చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు - వలనాడులు - నాడులు - గ్రామాలుగా విభజించారు.
* చోళుల పాలనలో అత్యంత విశిష్టమైంది గ్రామపాలన/ స్థానిక పాలన.
* మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది.
* నాటి గ్రామాలను ''కుర్రం, కొట్టం'' అని కూడా పిలిచేవారు.
* గ్రామాల సముదాయాన్ని 'నాడు' అనేవారు. ప్రతినాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి
* నాడుల పాలన ధనవంతులైన 'వెల్లాలు' అనే రైతుల ఆధీనంలో ఉండేది.
* గ్రామాన్ని కుటుంబాలు / కుడుంబాలు అనే వార్డులుగా విభజించేవారు.
* గ్రామ కమిటీని వరియం / వారియం అనేవారు.
* గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు.

అర్హతలు:
   1. సొంత ఇల్లు కలిగి ఉండాలి.
   2. శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి.
   3. 35 - 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
   4. వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి
   5. నిజాయతీపరుడై ఉండాలి.

అనర్హతలు:
   1. గతంలో వరుసగా మూడు సంవత్సరాలు గ్రామకమిటీ సభ్యుడిగా పని చేసి ఉండకూడదు.
   2. గతంలో పని చేసి లెక్కలు చూపనివారై ఉండకూడదు.
* అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను / కమిటీని ప్రకటిస్తారు.
* ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు.
* వారియం మళ్లీ ఆరు ఉపకమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది.
* లాటరీద్వారా ఎన్నికైన సభ్యుడిని ఆలుముముక్కల్ అంటారు.
* కుండలో వేసే పేర్ల చీటీలను 'కుడవోలై' అంటారు.
* ఎన్నుకున్న గ్రామకమిటీ సభ్యుల పదవీకాలం సంవత్సరం మాత్రమే
* చోళుల గ్రామపాలనలో ఉర్, సభ, నగరం/ నకరం అనే మూడు సభలు ప్రధాన పాత్ర పోషించేవి.
* రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు.
* బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది ''సభ''.
* వ్యాపార/ వాణిజ్య/ వైశ్య ప్రతినిధులతో కూడిన సభను నగరం/ నకరం అనేవారు.
* ఉన్నత అధికారులను ''ఉదంకుట్టమ్'' అని పిలిచేవారు
* గ్రామసభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది.
* నాటి సైనిక పటలాలను కడియాలు అనేవారు.
* నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులు.
* పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థలను 'తాన్‌కుర్రమ్'' అనేవారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
* కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
* గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
* వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
* వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
* శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
* విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
* అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
* పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
* కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
* బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
* రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
* రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
* దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
* పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
* గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
* వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
* నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.


శాస్త్ర విజ్ఞానం

* గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
* ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
* వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
* వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
* భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
* వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
* గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
* ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
* వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
* గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు

గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు

నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
* దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
* ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
* గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
* సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
* నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
* వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
* గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
* గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
* నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
* సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
* అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
* అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
* గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
* 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
* ''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


హర్షవర్ధనుడు

* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.
* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647
* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.
* యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
* నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.
* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.


వాస్తు, కళారంగాలు

* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం

  గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.

గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.


శాసనాలు

మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.


సాహిత్యం

మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.


చివరి గుప్త చక్రవర్తులు

  మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.


పాలనా విశేషాలు

  గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.


రెవెన్యూ పాలన

  గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.

  భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.

ఆర్థిక విషయాలు

  గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.

  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.

సాంఘిక, మత పరిస్థితులు

  వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.

రాజకీయ చరిత్ర

గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.

  హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.

  ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.

నాణేలు

  గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభం

* మధ్యయుగంలో క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య జరిగిన మత యుద్ధాలను 'క్రూసేడులు' అంటారు.
* క్రైస్తవులు, మహమ్మదీయులకు పవిత్ర స్థలాలైన పాలస్తీనా, జెరూసలెం, బెత్లెహం ప్రదేశాలను ఆక్రమించడానికి ఈ యుద్ధాలు జరిగాయి.
* క్రీ.శ.1453లో అప్పటి టర్కీ సుల్తాన్ మహమ్మద్ - II గ్రీకు సంస్కృతికి నిలయమైన కాన్‌స్టాంటినోపుల్ నగరంపై దండెత్తి ఆక్రమించాడు. ఆ సమయంలో గ్రీకు పండితులు తమ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలతో యూరప్‌ దేశాలకు వెళ్లారు.
* ఈ విద్వాంసులు యూరప్ అంతటా పాఠశాలలు, మఠాలను స్థాపించి ప్రాచీన గ్రీకు సంస్కృతి, సాహిత్యాలను పునరుద్ధరించడానికి వారు తెచ్చిన గ్రంథాలను బోధించారు.
* ఈ ప్రాచీన సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరనను 'సాంస్కృతిక పునరుజ్జీవనం' లేదా 'రినేజాన్సు' అంటారు.
* కాన్‌స్టాంటినోపుల్ పతనం కంటే ముందుగానే ఇటలీ సాహిత్య రంగంలో రినేజాన్సు ప్రారంభమైంది.
* పెట్రార్క్, డాంటే, బాకాషియో లాంటి రచయితలు తమ రచనల ద్వారా వర్జిల్, సిసిరో, లెవీ, హోరాస్ లాంటి ప్రాచీన రచయితల సాహిత్యాన్ని చదవమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యా విధానాన్ని సంస్కరించవచ్చని సూచించారు.
* రోమన్‌ల ప్రాచీన భాష 'లాటిన్' కూడా ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.
*  క్రీ.శ.15వ శతాబ్దపు యూరోపియన్ రచయితలు తమ దేశాల్లో ప్రజలు వాడే ప్రాంతీయ భాషలోనే రచనలు చేయడం ప్రారంభించారు. అనేక దేశాల రచయితలు బైబిల్‌ను తమ దేశ భాషల్లోకి అనువదించారు.
* శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం లాంటి రంగాల్లో పరిశోధనలు జరిగాయి.
* అచ్చుయంత్రాన్ని కనుక్కోవడం, పేపరు తయారుచేయడం వల్ల సైన్స్, సాహిత్య రంగాల్లో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ప్రజలు చదవగలిగారు.
* నావికా దిక్సూచిని కనుక్కోవడం వల్ల సముద్ర ప్రయాణాలు సులభమయ్యాయి.
* కాన్‌స్టాంటినోపుల్ నగరాన్ని తురుష్కులు స్వాధీనం చేసుకున్నారు.
* క్రీ.శ.15వ శతాబ్దం వరకు యూరోపియన్ వర్తకులు కాన్‌స్టాంటినోపుల్ ద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలతో వర్తకం చేయడానికి ప్రయాణించిన భూమార్గాన్ని తురుష్కులు మూసివేశారు. ఫలితంగా వారు సముద్ర మార్గాలను అన్వేషించి ఆసియా, ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం కొనసాగించారు. అదే సమయంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని,  కొలంబస్ అమెరికాను కనుక్కున్నారు.
* సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా అప్పటి యూరోపియన్ ప్రజలు ప్రతి విషయాన్ని ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం ఏర్పడి వారి నిరంకుశాధికారాన్ని ప్రజలు ధిక్కరించారు.
* రాజకీయ, సామాజిక, మత రంగాల్లో వచ్చిన ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాంది పలికాయి.  ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ క్షీణించి దాని స్థానంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది.
* పెట్టుబడిదారీ విధానాన్ని ప్రయివేటు వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానంగా నిర్వచించారు.


పారిశ్రామిక విప్లవం

* విప్లవం అంటే ఏదైనా రంగంలో వచ్చే ఆకస్మికమైన మార్పు.
* పరిశ్రమల్లో ఉపయోగపడే కొత్త యంత్రాలను కనిపెట్టి వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని 'పారిశ్రామిక విప్లవం' అని అంటారు. పరిశ్రమల్లో యంత్రాల వాడకం మొదట ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది.
* స్పిన్నింగ్ జెన్నీ అనే కొత్త యంత్రాన్ని వస్త్రాల నేతకు ఉపయోగించడం, ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడంతో ఇంగ్లండ్‌లో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
* ఇతర పరిశోధనలు అంటే బ్లాస్ట్‌ఫర్నేస్ గనుల్లో ఉపయోగించే రక్షిత దీపం, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో లాంటివి పారిశ్రామిక విప్లవాన్ని మరింత శక్తిమంతం చేశాయి.

సామ్రాజ్యవాదం ఆవిర్భావం
 

* బ్రిటిష్ సామ్రాజ్యం బర్మాకి కూడా విస్తరించింది. ఆఫ్రికాలోని చాలా భాగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూరోపియన్‌ల సామ్రాజ్యవాదం వ్యాపించింది.
ప్రపంచంలోని ముఖ్య సంఘటనలు - భారతదేశంపై వాటి ప్రభావం

అమెరికా, ఫ్రాన్స్‌లో విప్లవాలు

* 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో వచ్చిన అమెరికా స్వాతంత్య్ర యుద్ధం, ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగినవి.

* బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో 13 వలస రాజ్యాలను స్థాపించింది. ఆ రాజ్యాల్లోని ప్రజలంతా ఇంగ్లండ్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇంగ్లండ్‌ ప్రజలు అనుభవించే హక్కులను కల్పించలేదు.
* ఇంగ్లండ్, ఫ్రాన్స్‌కు చెందిన తత్వవేత్తలు తమ రచనల ద్వారా మానవుడికి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించే హక్కు ఉందని ఉద్ఘాటించారు.
* బ్రిటిష్ ప్రభుత్వం ఈ హక్కులను తిరస్కరించడం, గుర్తించకపోవడం అమెరికా స్వాతంత్య్ర యుద్ధానికి కారణమైంది. ఫలితంగా అమెరికాలోని ఆంగ్ల వలసలు స్వాతంత్య్రం పొందాయి. క్రీ.శ.1783లో అమెరికా సర్వసత్తాక రాజ్యంగా ఏర్పడింది.
* ఫ్రాన్స్‌లో సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. వీరంతా అమెరికా స్వాతంత్య్ర యుద్ధం నుంచి స్ఫూర్తిని పొందారు. ఫలితంగా అప్పటి ఫ్రెంచి చక్రవర్తి లూయీ XVIకి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో తిరుగుబాటు జరిగింది.
* క్రీ.శ.1789, జులై 14న ఫ్రాన్స్‌లో విప్లవం ప్రారంభమైంది. విప్లవకారులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేశారు. పారిస్‌లోని బాస్టిలు జైలు తలుపులు పగులగొట్టి ఖైదీలందర్నీ విడిపించారు.
* ఫ్రాన్స్‌లో ఏటా ఈ రోజును జాతీయదినంగా జరుపుకుంటారు.
* మానవులంతా పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు స్వేచ్ఛగానే జీవిస్తారని, వారందరికీ అన్ని హక్కులు సమానమేనని ఈ విప్లవం ప్రకటించింది. ఈ రెండు విప్లవాలు ప్రపంచమంతటా జాతీయ భావాలను బలపడేలా చేశాయి.
* జాతీయభావం అంటే ఒకే భాష మాట్లాడుతూ, ఒకే మతాన్ని పాటించే, ఒకే జాతికి చెందిన ప్రజలు ఒకే ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరుకోవడం.
* 19వ శతాబ్దంలో జర్మన్, ఇటలీలు తమ దేశాల ఏకీకరణ కోసం ఆయా భాషలు మాట్లాడే ప్రజలు ఒకే ప్రభుత్వం కిందకు వచ్చేందుకు పోరాడి సఫలమయ్యారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర)

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.

* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.

ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి.

చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.


పురావస్తు శాస్త్రం

ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.


మానవశాస్త్రం

* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.
భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:
* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.
మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు

ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.


పాతరాతియుగం

* క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
* ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.

మధ్య శిలాయుగం

* పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
* మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.

కొత్తరాతియుగం

* ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
* మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
* ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.


ఆర్థిక జీవనం

* ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
*  'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.


మతవిశ్వాసాలు

* ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.


రాజకీయ జీవనం

* ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
* ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.


కాంస్యయుగపు నాగరికత

* సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
* అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
* నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
* పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
* ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.

కాంస్య యుగం

* భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
* రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.

ప్రాచీన నాగరికతలు

* ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
* ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
* ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
* అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.

నదీలోయ నాగరికతలు

* మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
* ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
* ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
* శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.

సామాజిక లక్షణాలు

* ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
* గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
* వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
* నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
* 'చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

రాజకీయ మతజీవనంపై నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం

* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
* నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
* మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.

మత జీవనం

* ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
* 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
* ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
* సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.

భాషాకళల విశిష్టత
 

* ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
* ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
* కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
* ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
* కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అసఫ్‌జాహీ యుగం - నిజాం పాలన

క్రీ.శ.1724లో నిజాం ఉల్‌ముల్క్ మొగలుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి వంశీయులు క్రీ.శ.1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలాన్నే అసఫ్‌జాహీయుగం లేదా నిజాంల పాలనగా పేర్కొంటారు.


నిజాం ఉల్‌ముల్క్

  ఇతడు నిజాంల మొదటి పాలకుడిగా పేరు పొందారు. అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. మొగలుల కొలువులో పని చేస్తున్న సమయంలో ఔరంగజేబ్ 'చిన్ - ఖిలిజ్ - ఖాన్' అనే బిరుదిచ్చాడు. చిన్ - ఖిలిజ్ - ఖాన్ అంటే కుర్రకత్తి వీరుడు అని అర్థం. అనంతరం మొగల్ చక్రవర్తి ఫరూక్‌షియర్ నిజాం ఉల్‌ముల్క్, ఫతేజంగ్ బిరుదులను ప్రదానం చేశాడు. మరో మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా ఇతడికి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్‌ముల్క్ ముబారిజ్‌ఖాన్ సైన్యాలను 1724 నాటి షక్కర్‌ఖేడ యుద్ధంలో ఓడించి, ఔరంగాబాద్ రాజధానిగా అసఫ్‌జాహీ పాలనను ప్రారంభించాడు. తన రాజ్యాన్ని ఆరు సుబాలు (బీరర్, బీదర్, బీజాపూర్, ఖాందేష్, హైదరాబాద్, ఔరంగాబాద్)గా విభజించాడు. షాకిర్ (సంతృప్తుడు) అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. 1748, మే 22న బర్దాన్‌పూర్ వద్ద మరణించాడు.

నాజర్‌జంగ్

నిజాం ఉల్‌ముల్క్ మరణానంతరం అతడి కుమారుడు నాజర్‌జంగ్ పాలనాధికారాలు చేపట్టాడు. కానీ నిజాం ఉల్‌ముల్క్ కుమార్తె పుత్రుడు (మనవడు) ముజఫర్‌జంగ్ వారసత్వ పోరులో కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్‌తో నాజర్‌జంగ్‌ను హత్య చేయించాడు. ఈ పోరులో ఫ్రెంచి వారు ముజఫర్‌జంగ్‌కు సహాయపడగా, ఆంగ్లేయులు నాజర్‌జంగ్ పక్షం వహించారు.

ముజఫర్‌జంగ్
 

  ఫ్రెంచివారి సాయంతో పాలకుడైన ముజఫర్‌జంగ్ వారికి మచిలీపట్నం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో అధికారం కల్పించాడు. తన ఆస్థానంలో ఉండే ఫ్రెంచి అధికారికి హైదర్‌జంగ్ అనే బిరుదు ఇచ్చాడు. డూప్లేను తన ఏడు వేల అశ్వికదళానికి మున్సబ్‌దారుగా నియమించాడు. కానీ కడప, కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్ చేతిలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వద్ద హత్యకు గురయ్యాడు.

సలాబత్‌జంగ్
 

  ముజఫర్‌జంగ్ హత్యకు గురవడంతో ఫ్రెంచివారు సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్ నిజాంగా నియమించారు. అందుకే సలాబత్ ఫ్రెంచివారికి ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సలాబత్‌జంగ్‌కు రక్షణ కల్పించింది. ఇందుకు కొండవీడు, నిజాంపట్నం, నరసాపురం ప్రాంతాలను ఫ్రెంచివారికిచ్చి రూ.24 లక్షలు సైనిక ఖర్చుగా చెల్లించాడు. ఖజానాను గోల్కొండ నుంచి ఔరంగాబాద్‌కు మార్చాడు. మూడో కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవడంతో ఇతడు ఆంగ్లేయుల వైపు చేరి వారికి ఉత్తర సర్కారులను అప్పగించాడు. తన సోదరుడైన నిజాం అలీఖాన్‌ను ఖైదు నుంచి విడుదల చేసి, బీదర్ సుబేదారుగా నియమించాడు. కానీ 1761లో నిజాం అలీఖాన్ సలాబత్‌జంగ్‌ను తొలగించి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో రెండో నిజాం పాలకుడిగా గుర్తింపు పొందిన నిజాం అలీఖాన్ పాలన ప్రారంభమైంది. (వారసత్వ యుద్ధాల్లో మునిగి తేలిన నాజర్, ముజఫర్, సలాబత్‌జంగ్‌లను మొగల్ చక్రవర్తులు నిజాం పాలకులుగా గుర్తించలేదు.)

నిజాం అలీఖాన్
 

  నిజాం అలీఖాన్ (రెండో అసఫ్‌జా/ రెండో నిజాం) ఉత్తర సర్కారులపై ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. అయితే ఆంగ్లేయులు దుబాసీ కాండ్రేగుల జోగిపంతులును రాయబారిగా పంపి, 1766 నాటికి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నారు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించి కడప, బళ్లారి, గుత్తి  ప్రాంతాలను పొందాడు. కానీ మహారాష్ట్రుల చేతిలో ఓడిపోయి (1767 ఖర్ధా యుద్ధంలో) దౌలతాబాద్ దుర్గాన్ని కోల్పోయాడు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్ (1798). 1800లో కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తత ఇచ్చాడు. అందుకే వాటిని దత్త మండలాలుగా పేర్కొంటారు. నిజాం తన రాజాధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకుఇచ్చాడు. కిర్క్‌పాట్రిక్‌ను తన రాజధానిలో బ్రిటిష్ రెసిడెంట్‌గా నియమించాడు.
 రేమండ్ అనే ఫ్రెంచి నిపుణుడి సహాయంతో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ వద్ద ఆయుధాగారాన్ని నెలకొల్పాడు. నేటి మూసారాంబాగ్‌లో రేమండ్ సమాధి ఉంది. కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమకు చిహ్నంగా నిర్మించిన కట్టడంలోనే ప్రస్తుతం కోఠిలోని మహిళా కళాశాలను నిర్వహిస్తున్నారు.

సికిందర్ ఝా

  మూడో నిజాం/అసఫ్ జాగా పేరొందిన పాలకుడు. ఇతడి పాలనా కాలంలోనే రెండో ఆంగ్ల - మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం సైన్యాన్ని బీరర్ గవర్నర్ రాజా మహీపతిరామ్ నడిపాడు. ఆంగ్లేయులు మహీపతి రామ్ స్థానంలో దివాన్ చందూలాల్‌ను పేష్కార్‌గా నియమించారు. సికిందర్ ఝా ప్రధాని మీర్ ఆలం కూడా ఆంగ్ల వ్యతిరేకి. 1811లో రెసిడెంట్‌గా వచ్చిన హెన్రీ రస్సెల్ నాయకత్వంలో దళాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రస్సెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కంటింజెంట్‌గా పేర్కొన్నారు. విలియం పామర్ అనే వ్యక్తి పామర్ అండ్ కో కంపెనీని స్థాపించాడు. నిజాం ప్రభుత్వం పామర్ కంపెనీ నుంచి 25 శాతానికి అప్పు తీసుకుంది. సికిందర్ ఝా పేరు మీదే నేటి సికింద్రాబాద్‌ను నిర్మించారు. ఇతడి కాలంలోనే మెట్‌కాఫ్ సంస్కరణలను ప్రవేశపెట్టారు.

నాసిర్ - ఉద్ - దౌలా

  ఇతడు నాలుగో నిజాం/ అసఫ్‌జా గా పేరొందాడు. ఇతడి కాలంలోనే ఆంగ్లేయులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. 1829లో నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్‌కు వారి సంఖ్యను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తన రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. హైదరాబాద్ రాజ్యంలో సతీసహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడి కాలంలోనే వహాబీ ఉద్యమం జరిగింది. సయ్యద్ అహ్మద్ బ్రైల్వీ సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమం నిజాం కాలంలో ఆంగ్ల వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం సోదరుడు ముబారిజ్ - ఉద్ - దౌలా నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో ఉద్యమం జరిగింది. కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1843లో దివాన్ చందూలాల్ రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్‌ముల్క్‌ను ప్రధానిగా నియమించాడు. 1853లో మొదటి సాలార్‌జంగ్‌ను ప్రధానిగా నియమించాడు. నాసిరుద్దౌలా కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది (కానీ తిరుగుబాటును ఎదుర్కొన్నది మాత్రం అఫ్జల్ - ఉద్ - దౌలా). హైదరాబాద్ కంటింజెంట్ ఖర్చుల నిమిత్తం రూ.64 లక్షలు అప్పు చేయడంతో, నిజాం తన రాజ్యంలోని రాయచూర్, ఉస్మాన్‌బాద్, బీరర్ ప్రాంతాలను ఆంగ్లేయులకు స్వాధీనం చేయాల్సి వచ్చింది.

అఫ్జల్ - ఉద్ - దౌలా

  1857, మే 18న అయిదో నిజాంగా పాలన చేపట్టాడు. ఇతడి కాలంలోనే 1857, జులై 17న హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. (భారతదేశంలో తిరుగుబాటు ప్రారంభం మే 10, నాటి నిజాం నాసిరుద్దౌలా). మొగల్ చక్రవర్తి పేరు మీద కాకుండా నిజాం పేరు మీద కుత్బా చదవడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆంగ్ల రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్ దాడి చేశాడు. తిరుగుబాటును అణచడంలో ఆంగ్లేయులకు తోడ్పడినందుకు నాటి బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్‌సన్, సైన్యాధికారి మేజర్ బ్రిగ్స్ నిజాంకు 'స్టార్ ఆఫ్ ఇండియా' బిరుదుతో పాటు రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగిచ్చారు. అతడు చెల్లించాల్సిన రూ.50 లక్షల రుణాన్ని రద్దు చేశారు. నిజాం రాజ్య ప్రధానమంత్రి నవాబ్ తురాబ్ అలీఖాన్‌కు 'సాలార్‌జంగ్' అనే బిరుదు ఇచ్చారు. ప్రధాని సాలార్‌జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1865లో జిలాబందీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. హాలిసిక్కా అనే నూతన వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ - వాడి రైలు మార్గాన్ని నిర్మించాడు.

మీర్ మహబూబ్ అలీఖాన్
 

  అఫ్జల్ - ఉద్ - దౌలా మరణించే నాటికి ఇతడు రెండున్నర సంవత్సరాల బాలుడు. మీర్జా గాలీబ్ మనవడైన మీర్జా ఆషాబేగ్‌ను ఇతడికి సంరక్షకుడిగా నియమించారు. 1884 నాటికి పూర్తి అధికారాలను స్వీకరించాడు. ఖానున్‌చా - ఇ - ముబారక్ పేరుతో క్యాబినెట్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. చట్టాల నిర్మాణం కోసం 1893లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. బీరర్‌పై నిజాం సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు. హైదరాబాద్ కంటింజెంట్‌ను రద్దు చేసి, బ్రిటిష్ సైన్యంలో విలీనం చేశాడు. 1905లో రాజ్యాన్ని నాలుగు సుబాలుగా విభజించాడు. అవి: వరంగల్, మెదక్, గుల్బర్గా, ఔరంగాబాద్. ఇతడి కాలంలోనే కిషన్‌రావు అనే న్యాయవాది ముల్కీ నిబంధనలను రూపొందించాడు. చాందా రైల్వే పథకం ఆందోళన ఇతడి కాలంలోనే జరిగింది. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా అఘోరనాథ చటోపాధ్యాయను నియమించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్‌ను ఆంగ్లేయులు నియమించిన తొలి నిజాం నవాబుగా పేర్కొంటారు. మొదటి సాలార్‌జంగ్ మరణంతో మీర్ లాయక్ అలీని (రెండో సాలార్‌జంగ్) ప్రధానిగా నియమించాడు. ఇతడు 1887లో నిజాం కళాశాలను స్థాపించాడు. మూడో సాలార్‌జంగ్‌గా పేరొందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ మ్యూజియానికి విదేశాల నుంచి అనేక వస్తువులు తెప్పించాడు.
 1884లో లార్డ్ రిప్పన్ హైదరాబాద్ వచ్చి నిజాంకు సర్వాధికారాలు అప్పగించాడు. అదే సంవత్సరం నిజాం ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టాడు. మంత్రివర్గం, ద్విసభా విధానం ఏర్పాటు చేశాడు.
 మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఆంగ్లేయులు 'గ్రాండ్ కమాండర్' బిరుదును ప్రదానం చేశారు. ఇతడు 1909లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మూసీ నదిపై వంతెన నిర్మించాడు. ఇతడి కాలంలోనే యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ అసోసియేషన్‌ను స్థాపించారు. 1882లో థియోసాఫికల్ సొసైటీశాఖ, 1892లో ఆర్యసమాజ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.

మీర్ ఉస్మాన్ అలీఖాన్
 

  చివరి, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతడి కాలంలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్ చెరువులను తవ్వించాడు. న్యాయశాఖను ఇతర శాఖల నుంచి వేరు చేశాడు. 1919లో సర్ అలీ ఇమామ్‌ను ప్రధానిగా నియమించాడు. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
 సిర్పూర్ పేపరు మిల్లు, అజంజాహీ దుస్తుల మిల్లు, బోధన్ చక్కెర కర్మాగారం, చార్మినార్ సిగరెట్ కంపెనీ, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీలను స్థాపించాడు. 1932లో అరవముదు అయ్యంగార్ నాయకత్వంలో రాజకీయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశాడు. రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు. తొలిసారి ఆదాయ, వ్యయ పద్దులను పునర్విభజించాడు. 1938లో 85 మంది సభ్యులతో ఒక శాఖను ఏర్పాటు చేసి, అందులో హరిజనులకు కూడా స్థానం కల్పించాడు.
 భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు విరాళాలు అందించేవాడు. నాందేడ్‌లో గురుద్వారాను నిర్మించాడు.
 ఆంగ్లేయులకు విశ్వసనీయుడైన మిత్రుడిగా (ఫెయిత్‌ఫుల్ అలై) గుర్తింపు పొందాడు. 1918లో కింగ్‌జార్జ్ నిజాంను 'హిజ్ ఎగ్జాల్టెడ్ హైనస్‌'గా కీర్తించాడు.
 స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాల, జనానా పాఠశాల, శాలిబండ మిడిల్ స్కూల్, హన్మకొండ ప్రభుత్వ మిడిల్ స్కూలు లాంటి విద్యాలయాలను ప్రారంభించాడు. రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థలను ఏర్పాటు చేశాడు.
 భారత ప్రభుత్వం 1948లో సెప్టెంబరు 13 17 మధ్య 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసింది. 1950, జనవరి 2న హైదరాబాద్ భారత యూనియన్‌లో చేరినట్లు ప్రకటించి, నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు.

యుగ విశేషాలు
 

* మొదటి సాలార్‌జంగ్ ప్రధానిగా హైదరాబాద్ రాజ్య అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టాడు.
* 1853 నుంచి 1883 వరకు ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా మొదటి సాలార్‌జంగ్ పని చేశాడు.
* ఇతడు రాజ్యాన్ని 5 సుబాలు, 17 జిల్లాలుగా విభజించారు.
* సుబా అధిపతిని సుబేదార్, తాలుకా అధిపతిని తహసీల్దార్, జిల్లా అధిపతిని తాలూక్‌దార్ అనేవారు.
* 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు.
* సదర్ - ఉల్ - మహమ్ పేరుతో పోలీసు, రెవెన్యూ, న్యాయ, విద్య, ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేశారు.
* భూమి శిస్తును జమ అని, కౌలును ఇజారా అని పిలిచేవారు.
* అవల్ తాలూక్‌దార్ నేటి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారి. దోయం తాలూక్‌దార్‌ను సబ్‌కలెక్టర్ హోదాతో, సోయం తాలూక్‌దార్‌ను తహసీల్దార్ హోదాతో సమానంగా భావించేవారు.
* పోలీసు సూపరింటెండెంట్‌ను ముహతామీన్ అని, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను అమీన్ అని పిలిచేవారు.
* వసూలు చేసిన శిస్తులో జమీందార్ల వాటాను రుసుం అనేవారు.
* శిస్తు వసూలు అధికారులను బిల్ మక్తదారులు అనేవారు.
* చివరి నిజాం పాలనా కాలంలో కింది పట్టణాల పేర్లను మార్చారు.
* ఎలగండల - కరీంనగర్, మహబూబ్‌నగర్ - పాలమూరు, ఇందూరు - నిజామాబాద్, మానుకోట - మహబూబబాద్, భోన్‌గిరి - భువనగిరి
* హైదరాబాద్ పాఠశాలల్లో డబ్ల్యూ.హెచ్. విల్కిన్‌సన్ అనే విద్యాశాఖ కార్యదర్శి నూతన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాడు.
* 1871లో హైదరాబాద్‌లో తపాలా శాఖను ఏర్పాటు చేశారు.
* 1856లో డాక్టర్ స్మిత్ హైదరాబాద్‌లో వస్తు ప్రదర్శన (పారిశ్రామిక) ఏర్పాటు చేశాడు.
* బ్రిటిష్ రెసిడెంటైన జేమ్స్ పాట్రిక్ ఖైరున్నీసా బేగం అనే ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు.
* భద్రాచలం రాముడికి తలంబ్రాలు పంపే ఆచారాన్ని నాసిరుద్దౌలా ప్రవేశ పెట్టాడు.
* రాజ్య కేంద్ర ద్రవ్య ముద్రణాలయం హైదరాబాద్‌లో, జిల్లా ద్రవ్య ముద్రణాలయాలు గద్వాల్, నారాయణపేట్‌ల్లో ఏర్పాటు చేశారు.
* కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లోని దక్కన్ హౌస్‌లో ఉంటూ 'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా' అనే గ్రంథాన్ని రచించారు.
* 1918లో ఏర్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1919, ఆగస్టు 28 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లాఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగలు సుభాగా, హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో సంభవించిన అంతర్యుద్ధంలో బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌వారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిష్‌వారు ఫ్రెంచ్‌వారిపై ఆధిపత్యం సాధించారు.


మొదటి కర్ణాటక యుద్ధం (1745-48)

  ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో ఆంగ్లేయులకు, ఫ్రెంచ్‌వారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచ్ పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం మద్రాసును ఆక్రమించింది.

  ఆంగ్లేయులు తమను ఫ్రెంచ్‌వారి నుంచి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచ్‌వారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచ్‌వారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతోపాటు భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.


రెండో కర్ణాటక యుద్ధం (1749-54)

  వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్‌లో నాజర్ జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్ తర్వాత అతడి కుమారుడు మహ్మద్ అలీకి మద్దతిచ్చారు.

* 1749 లో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహ్మద్ అలీ వశమైంది.


మూడో కర్ణాటక యుద్ధం (1758-63)

ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760 లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు.

* ఫ్రెంచ్‌వారి స్థానంలో బ్రిటిష్‌వారు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763 లో ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌వారి మధ్య సంధి కుదిరింది.


ప్లాసీ యుద్ధం - 1757 (బెంగాల్ ఆక్రమణ)

కారణాలు:

* కంపెనీ అధికారులు దస్తక్/ ఉచిత పాసులను దుర్వినియోగం చేయడం.

* యువ నవాబు సిరాజుద్దౌలా తన పూర్వీకుల్లా తాను కూడా ఆంగ్లేయులపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

* బ్రిటిష్‌వారు నవాబు ఆజ్ఞలకు విరుద్ధంగా కలకత్తాలో కోటలు నిర్మించడం.

* ప్లాసీ (పలాసీ) అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ 1757 జూన్ 23 న బ్రిటిష్ సైన్యానికి, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజుద్దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్‌మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు - మీర్ జాఫర్, యార్ లుతుఫ్ ఖాన్, రాయ్ దుర్లబ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రేక్షకపాత్ర వహించారు.
 ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి భారతదేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది.


బక్సర్ యుద్ధం (1764)

కారణాలు:

* సార్వభౌమాధికారం కోసం ఆంగ్లేయులు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం మధ్య తలెత్తిన పోరు.

* 1717 లో మొగలులు జారీచేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.

* నవాబు అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.

* నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదకరంగా ప్రవర్తించడం.

* బక్సర్ అనే ప్రదేశం పట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ 1764 అక్టోబరు 22 న మేజర్ హెక్టార్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు, మీర్ ఖాసిం, అవధ్ నవాబు షూజా ఉద్దౌలా, రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య యుద్ధం జరిగింది.

* ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిష్‌వారి విజయానికి ప్రధాన కారణం.

ఫలితాలు:
* బెంగాల్, బిహార్, ఒడిశాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన.
*  అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారడం.
* మొగల్ చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు.
* కంపెనీ ఔన్నత్యం పెరిగింది.

మైసూరు యుద్ధాలు

* మొదటి మైసూరు యుద్ధం (1766-69): మైసూరు పాలకుడు హైదర్ ఆలీ బ్రిటిష్‌వారిని కర్ణాటక ప్రాంతం నుంచి, చివరకు భారతదేశం నుంచి తరిమివేయాలని భావించాడు. హైదర్ ఆలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిష్‌వారు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిష్‌వారిపై విజయం సాధించిన హైదర్ ఆలీ మద్రాసుకు 5 కి.మీ దూరం వరకు దండయాత్ర కొనసాగించాడు. 1769 లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

రెండో మైసూరు యుద్ధం (1780 - 84):

* మరాఠాలు 1771 లో హైదర్ ఆలీపై దాడి చేసినప్పుడు బ్రిటిష్‌వారు హైదర్ ఆలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.
*  అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదరాలీ మిత్రదేశమైన ఫ్రాన్స్‌కు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ ఆలీ ఆధీనంలోని ఫ్రెంచ్ భూభాగమైన మహేను బ్రిటిష్‌వారు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు.
*  ఈ యుద్ధంలో 1780 లో కల్నల్ బైలీని హైదర్ ఆలీ ఓడించాడు. 1781 లో పోర్టో నోవో యుద్ధంలో ఐర్‌కూట్ చేతిలో హైదర్ ఆలీ పరాజయం పొందాడు.
*  1782 లో హైదర్ ఆలీ కల్నల్ బ్రైత్‌వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం 1784 లో జరిగిన మంగళూరు సంధితో ముగిసింది.

మూడో మైసూరు యుద్ధం (1790 - 92):

* అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం, టర్కీ, ఫ్రాన్స్‌లకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం, బ్రిటిష్‌వారి మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను టిప్పుసుల్తాన్ ఆక్రమించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు.
* ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు.
* 1792 లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో మూడో మైసూరు యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పుసుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాలను బ్రిటిష్‌వారికి ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి, రూ.1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.

నాలుగో మైసూరు యుద్ధం (1799):

* తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టిప్పు సుల్తాన్ భావించడం, కొత్త బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలని భావించడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు.
 ఈ యుద్ధం సందర్భంగా 1799 మేలో శ్రీరంగ పట్టణంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నర్ జనరల్ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815 లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి వడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి, మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 సిపాయిల తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.


రాజకీయ కారణాలు

భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులు అనుసరించారు. యుద్ధాలు, సైన్య సహకార పద్ధతి, పరిపాలన సరిగా లేదనే నెపంతో సామ్రాజ్యాన్ని విస్తరించారు. డల్హౌసీ మరో అడుగు ముందుకువేసి రాజ్యసంక్రమణం సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్‌పూర్, ఝూన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్‌కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులు రద్దు చేశాడు. మొగలు చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్‌మీనార్‌కు దగ్గరగా మార్చాలని, బహదూర్ షా తర్వాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దు చేయాలని ప్రతిపాదించాడు. దీంతో స్వదేశీ రాజుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన మొదలైంది. ఆంగ్లేయుల జాతి వివక్ష, వారు తమ పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఇలాంటి వారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.


ఆర్థిక కారణాలు

రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వీరంతా పని లేక, తినడానికి తిండి లేక అలమటించారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది. కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. క్షీణించిన ఆర్థిక పరిస్థితి తిరుగుబాటుకు పురికొల్పింది.


సాంఘిక కారణాలు

1829లో విలియం బెంటింక్ సతీసహగమనం నిషేధ చట్టం చేశాడు. లార్డ్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. 1856లో మతం మార్చుకున్న వారికి ఆస్తి హక్తులను పరిరక్షిస్తూ భారతీయ వారసత్వ చట్టం వచ్చింది. బాల్యవివాహాల నిషేధ చట్టం లాంటి సంస్కరణలు తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. 1853లో లార్డ్ డల్హౌసీ రైల్వే, తంతి తపాల లాంటి ఆధునికీకరణ విధానాలు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. తమ ఆచారబద్ధమైన జీవన విధానాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టారని కొందరు భావించారు. ప్రభుత్వం చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తోందని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

మత కారణాలు

క్రైస్తవులైన ఆంగ్లేయులు హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మారుస్తారనే అనుమానం ప్రజల్లో ఏర్పడింది. క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. 1853 ఛార్టర్ చట్టంలో క్రైస్తవ మిషనరీలకు సౌకర్యాలు కల్పించటం, ఇంగ్లిష్ విద్యావ్యాప్తికి నిధులను కేటాయించడం లాంటివి ప్రజల్లో ఆందోళన కలిగించాయి. మత మార్పిడులను ప్రోత్సహించి భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి బిట్రిష్‌వారు ప్రయత్నిస్తున్నారనే భావన భారతీయుల్లో ఏర్పడింది. దీంతో ప్రజలు కంపెనీ పాలన పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

సైనిక కారణాలు

ఈస్టిండియా కంపెనీలో రెండు రకాల సైనికులున్నారు. బతుకు తెరువు కోసం కంపెనీలో సైనిక ఉద్యోగులుగా చేరిన భారతీయులను సిపాయిలు అని పిలిచేవారు. ఆంగ్లేయులను సైనికులుగా పిలిచేవారు. వీరిద్దరి మధ్య హోదాలు, జీతభత్యాల్లో చాలా తేడా ఉండేది. సిపాయి, సైనికుల నిష్పత్తి 4 : 1 గా ఉండేది. 1856లో లార్డ్ కానింగ్ సామాన్య సేవా నియుక్త చట్టం (జనరల్ సర్వీసెస్ ఎన్‌లిస్ట్‌మెంట్ యాక్ట్) ప్రవేశపెట్టి సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు సిపాయిలను మరింత భయాందోళనకు గురిచేశాయి.

* కొన్నేళ్లుగా తీవ్ర అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తారస్థాయికి చేరుకుంది.

* మొదటి అఫ్గన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమి చూసి వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమేమీ కాదని సిపాయిలు భావించారు.

తక్షణ కారణం

  ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం 1856లో ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటాల చివరి భాగాన్ని సైనికులు నోటితో కొరికి తుపాకిలో అమర్చాల్సి ఉండేది. ఆ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూసినట్లు ప్రచారం జరిగింది. ఆవు హిందువులకు పవిత్రమైంది. ముస్లింలు పందిని అపవిత్రంగా భావిస్తారు. దీంతో ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ పని చేశారని సిపాయిలు విశ్వసించారు.

తిరుగుబాటు ప్రారంభం

  1857 ఫిబ్రవరి 26న బరాక్‌పూర్‌లోని 19వ పటాలం సైనిక కవాతులో పాల్గొనలేదు. 1857 మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండే అనే సిపాయి తూటాలను వాడటానికి నిరాకరించాడు. లెఫ్టినెంట్ బాగ్ అనే ఆంగ్లేయ సైనిక అధికారిని కాల్చిచంపాడు. దీంతో మంగళ్ పాండేని ఉరితీశారు. సిపాయిలు కొత్త రకం తూటాలను ఉపయోగించడానికి నిరాకరించడంతో అధికారులు వారందరినీ శిక్షించారు. ఆరుగురిని సైనిక న్యాయస్థానంలో విచారించి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.

* 1857 మే 10న మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆనాటి బిట్రిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. సిపాయిలు దిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సిపాయిలు వీరోచితంగా పోరాడినా తిరుగుబాటు విఫలమైంది.

తిరుగుబాటు కాలంలో వివిధ ప్రాంతాల నుంచి సిపాయిలకు మద్దతుగా తమ హక్కులు, వారసత్వం కోసం పోరాడినవారు:
ప్రదేశం

ప్రదేశం నాయకత్వం బ్రిటిష్ సేనాని
దిల్లీ భక్త్‌ఖాన్ నికోల్‌సన్
కాన్పూర్, ల‌ఖ్‌న‌వూ నానాసాహెబ్ హేవ్‌లాక్, క్యాంప్‌బెల్
ల‌ఖ్‌న‌వూ హజ్రత్ మహల్ హేవ్‌లాక్, క్యాంప్‌బెల్
గ్వాలియర్ తాంతియా తోపే విండ్‌హామ్
ఝాన్సీ లక్ష్మీబాయి సర్ హ్యురోజ్
బరేలి ఖాన్‌బహదూర్‌ఖాన్ క్యాంప్‌బెల్
బిహార్ కున్వర్‌సింగ్ విలియం టేలర్
ఫైజాబాద్ మౌల్వీ అహ్మదుల్లా విలియం టేలర్
Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం (1930 - 34)

జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి రావి నది ఒడ్డున ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాల మధ్య కొత్తగా ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 1930 జనవరి 26 న అన్నిచోట్లా మొదటి స్వాతంత్య్ర దినంగా పాటించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
గాంధీజీ తన 11 డిమాండ్లను 1930 జనవరి 31 లోగా ఆమోదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గాంధీజీ చేసిన 11 డిమాండ్‌లు ....
1. భూమిశిస్తు 50 శాతం తగ్గించాలి.
2. ఉప్పుపై పన్ను నిషేధించాలి.
3. తీర ప్రాంత షిప్పింగ్‌ను భారతీయులకు కేటాయించాలి.
4. రూపాయి - స్టెర్లింగ్ మారకం నిష్పత్తి తగ్గించాలి.
5. స్వదేశంలోని దుస్తుల పరిశ్రమను రక్షించాలి.
6. సైనిక ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
7. పౌర పరిపాలన ఖర్చులో 50 శాతం తగ్గించాలి.
8. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి.
9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
10. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖలో మార్పులు చేయాలి.
11. ఆయుధాల చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా పౌరుల స్వీయరక్షణకు ఆయుధాలను కలిగి ఉండటానికి అనుమతించాలి.
* ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలని గాంధీజీని కోరింది. 1930 మార్చి 2 న గాంధీజీ తన కార్యాచరణ ప్రణాళికను వైస్రాయి ఇర్విన్‌కు తెలియజేశారు. మార్చి 12 న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది సభ్యులతో అరేబియా తీరంలోని దండి యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 240 మైళ్లు నడిచి 1930 ఏప్రిల్ 6 న దండి తీరం నుంచి పిడికెడు ఉప్పును తీసుకురావడం ద్వారా ఉప్పు చట్టాన్ని అతిక్రమించారు. దీని ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలకు, పాలనకు భారత ప్రజలు వ్యతిరేకమని చాటి చెప్పారు. దండి యాత్ర, దాని పురోగతి, ప్రజలపై దాని ప్రభావం గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. గాంధీజీ పిలుపు మేరకు గుజరాత్‌లోని 300 మంది గ్రామాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
* ఉప్పు సామాన్య మానవుడి భోజనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పు అమ్మకం ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. గాంధీజీ మాటల్లో 'గాలి, నీరు తర్వాత బహుశా ఉప్పు జీవితంలో ప్రధాన అవసరం'. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ఉప్పును ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం.


ఉద్యమ వ్యాప్తి

* తమిళనాడు: సి. రాజగోపాలాచారి (తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు పాదయాత్ర చేశారు.)
* మలబార్: కె. కేలప్పన్ (కాలికట్ నుంచి పొయన్నూర్ వరకు పాదయాత్ర చేశారు).
* పెషావర్: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఖుదై ఖిద్మత్ గార్స్ దళం ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు - బాద్షాఖాన్, సరిహద్దు గాంధీ). ఇతడు ఎర్రచొక్కా దళాన్ని ఏర్పాటు చేశాడు.
* ఈశాన్య భారతదేశంలో మణిపూర్ ప్రజలు రాణి గైడిన్ ల్యూ, ఆమె నాగా అనుచరులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.


ప్రజల భాగస్వామ్యం

* ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని గాంధీజీ స్త్రీలను ప్రత్యేకంగా కోరారు. స్త్రీలతోపాటు యువకులు, విద్యార్థులు విదేశీ దుస్తులు, మద్యపాన బహిష్కరణలో ప్రధాన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ ప్రావిన్స్, మహారాష్ట్ర, కర్ణాటకలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, షోలాపూర్‌లో కార్మికులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్‌లో రైతులు భాగస్వాములయ్యారు. బిహార్, దిల్లీ, లఖ్‌నవూలో ముస్లిం నేత పనివారు పాల్గొన్నారు. ఢాకాలో ముస్లిం నాయకులు, బలహీనవర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
* ఉప్పు సత్యాగ్రహం భారతదేశంపై అధిక ప్రభావాన్ని చూపింది. గుజరాత్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారీగా భారతదేశమంతా విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతోపాటు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం అమ్మే షాపులను మూయించడం, విదేశీ బట్టలను దహనం చేయడం, పన్నుల చెల్లింపు నిరాకరణ, అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించడం మొదలైన కార్యక్రమాలను చేపట్టారు.

ఉద్యమంలోని వివిధ దశలు:

* మొదటి దశ (1930 మార్చి - సెప్టెంబరు): ఈ దశలో పట్టణాల్లో బూర్జువా వర్గం, గ్రామాల్లో రైతులు కీలకపాత్ర పోషించారు.
* రెండో దశ (1930 అక్టోబరు - 1931 మార్చి): ఇందులో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం తగ్గింది. వీరు ప్రభుత్వం కాంగ్రెస్ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. వీరి కృషి ఫలితంగా 1931 మార్చిలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
* మూడో దశ (1932 జనవరి - 1934 ఏప్రిల్): ఈ దశలో ప్రభుత్వం అణచివేత విధానాన్ని అనుసరించింది. శాసనోల్లంఘన ఉద్యమం ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూలను నిర్బంధించింది. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రంపై కూడా పరిమితులను విధించింది. భూమిశిస్తు చెల్లించని వేలాదిమంది రైతుల భూములను, వారి ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 1931 నాటికి సుమారు 24,000 మందిని అరెస్టు చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు


* మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో 1930 నవంబరు 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. ఈ సమావేశానికి మూడు బ్రిటిష్ రాజకీయ పక్షాలకు చెందిన 16 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థానాల నుంచి 16 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. శాసనోల్లంఘన ఉద్యమం కొనసాగుతుండటంతో కాంగ్రెస్ ఈ సమావేశంలో పాల్గొనలేదు.
* ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీ, జిన్నా, ఆగాఖాన్ హిందూ మహాసభకు చెందిన మూంజీ, జయకర్, ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌కు చెందిన తేజ్‌బహదూర్ సప్రూ, సి.వై. చింతామణి, శ్రీనివాస శాస్త్రి, అణగారిన కులాలకు ప్రాతినిథ్యం వహించిన డాక్టర్ అంబేడ్కర్ ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు.
* ఈ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిథ్యం ఇవ్వాలని, తాను ప్రతిపాదించిన 14 సూత్రాలను ఆమోదించాలని మహమ్మద్ అలీ జిన్నా డిమాండు చేశారు. డా|| అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండు చేశారు.
* కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా భారతదేశ రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన చర్చ జరపడం వృథా అని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.
* గాంధీ - ఇర్విన్ ఒప్పందం (1931 మార్చి 5): గాంధీజీ అప్పటి వైస్రాయి ఇర్విన్‌తో సమావేశమయ్యేలా తేజ్‌బహదూర్ సప్రూ, వి.ఎస్. శాస్త్రి, యం.ఆర్. జయకర్ మధ్యవర్తిత్వం చేశారు. దాని ఫలితంగా మార్చి 5, 1931 న గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది.
* ముఖ్యాంశాలు: శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. కాంగ్రెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అంగీకరించింది. ఉద్యమం సందర్భంగా అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. సముద్రతీరం నుంచి నిర్ణీత దూరంలో నివసించే ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉప్పు తయారు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కాంగ్రెస్‌లోని యువనాయకులు ముఖ్యంగా సుభాష్‌చంద్ర బోస్, జవహర్‌లాల్ నెహ్రూతోపాటు ఇతర నాయకులు ఉద్యమం ఆపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
* రెండో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1931 సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధిగా గాంధీజీ ఒక్కరే హాజరయ్యారు. ముస్లింలతోపాటు షెడ్యూల్డ్ కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ రెండు ముస్లిం మైనారిటీ రాష్ట్రాలను (వాయవ్య సరిహద్దు రాష్ట్రం, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
* కమ్యూనల్ అవార్డు - 1932: 1932 ఆగస్టు 16 న మెక్‌డొనాల్డ్ రాష్ట్ర చట్టసభల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం గురించి బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. దీన్నే కమ్యూనల్ అవార్డు లేదా మెక్‌డొనాల్డ్ అవార్డు అంటారు. దీని ద్వారా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి వేర్వేరు నియోజకవర్గాలను కేటాయించారు.
* షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ మిగిలిన సాధారణ నియోజకవర్గాల్లో ఓటువేసే అధికారాన్ని కూడా కల్పించారు. అయితే షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించి, 1932 సెప్టెంబరు 20 న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మదన్‌మోహన్ మాలవీయ కృషితో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య 1932 సెప్టెంబరు 25 న పుణెలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హిందువులందరికీ సాధారణ నియోజకవర్గాలు కొనసాగుతాయి. కమ్యూనల్ అవార్డులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు 71 సీట్లకు బదులు 148 సీట్లు కేటాయించారు.
* మూడో రౌండ్ టేబుల్ సమావేశం: ఈ సమావేశం 1932 నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఇందులో 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లోని చర్చల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాని ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర రాజుల సాంస్కృతిక సేవ

  క్రీ.శ. 14వ శతాబ్దం ప్రథమార్థంలో స్థాపితమైన విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 16 శతాబ్దం నాటికి అత్యున్నత దశకు చేరుకుని, 17వ శతాబ్దానికి అంతమైంది. విజయనగర రాజులు సామాజిక, ఆర్థిక సుస్థిరతను పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మత సామరస్యం, విద్య, సాహిత్యం, కళలు, చిత్రలేఖనం, వాస్తు శాస్త్రం అభివృద్ధికి కృషి చేశారు. భారతదేశ చరిత్రలో హిందూ సాంస్కృతిక వికాసంలో చివరిదశగా విజయనగర యుగాన్ని పేర్కొనవచ్చు.

  విజయనగర కాలంలోనూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చతుర్వర్ణ విధానమే కొనసాగింది. విజయనగర రాజులు వర్ణవ్యవస్థను పరిరక్షించడానికి తమ వంతు కృషి చేశారు. అయితే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాన మంత్రులు, రాజగురువులు, దండ నాయకులుగా వారిని నియమించేవారు. సాళువ తిమ్మరుసు, అతని కొడుకు కృష్ణదేవరాయల ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షులుగా వ్యవహరించారు. సమాజంలో ఉన్నత కులాలకు చెందిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సామరస్యంతో జీవించేవారు.
* స్త్రీల స్థాయి: విజయనగర కాలంలో స్త్రీలు సమాజంలో గొప్పస్థానాన్ని ఆక్రమించారు. వారు సామాజిక, రాజకీయ, మత జీవితంలో ప్రధానపాత్ర పోషించారు. విజయనగర కాలంలో స్త్రీలు జ్యోతిష్కులు, గణాంక అధికారులు, చరిత్రకారులు, సంగీత విద్వాంసులు, న్యాయమూర్తులు, రాజప్రసాద రక్షకులుగా పనిచేసినట్లు నూనిజ్ పేర్కొన్నాడు. రాజులు, ఉన్నతోద్యోగులు బహుభార్యత్వాన్ని ఆచరించినట్లు నికోలో డి కాంటె పేర్కొన్నాడు. ఈ కాలంలో బాల్యవివాహాలు సాధారణం.
పెళ్లి సమయంలో భారీగా వరకట్నం తీసుకునేవారు. సతీసహగమనం కూడా సర్వసాధారణం. అయితే ఇది ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రమే పరిమితమైంది. రాజు మరణించినప్పుడు అతని భార్యలు సతీసహగమనం చేయడాన్ని గౌరవంగా భావించేవారు. స్త్రీలు రాజకీయ, సాహిత్యరంగాల్లో పాలుపంచుకున్నారు. కొంతమంది రాణులు కవయిత్రులుగా ప్రసిద్ధి చెందారు. గంగాదేవి, తిరుమలదేవి దీనికి నిదర్శనం.
* నగర జీవనం: విజయనగరంలో రాజులు, ఉన్నతోద్యోగుల విలాసవంతమైన జీవనం గురించి అబ్దుల్ రజాక్ చక్కగా వర్ణించాడు. విజయనగరం లాంటి నగరాన్ని భూమి మీద ఇంతవరకు చూడలేదని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు.
* వినోదాలు: విజయనగర రాజులు, ఉన్నతోద్యోగులు శాంతి సమయాల్లో అనేక పండుగలను జరుపుకుంటూ, వినోదాల్లో పాల్గొనేవారు. నికోలో డి కాంటె, అబ్దుల్ రజాక్ రాజులు, ఉన్నతోద్యోగులు అట్టహాసంగా జరుపుకొనే కొన్ని పండుగల గురించి ప్రస్తావించారు. వాటిలో ప్రధానమైంది - మహార్ణవమి పండుగ. ఈ పండుగను సాధారణంగా తొమ్మిది రోజులపాటు జరుపుకునేవారు. ఈ పండుగ గురించి అబ్దుల్ రజాక్ ఇలా పేర్కొన్నాడు. ''విజయనగర రాజు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రభువులు, ఉన్నతోద్యోగులు విజయనగరంలో సమావేశం కావలసిందిగా ఆదేశించేవాడు".
* నికోలో డి కాంటె అభిప్రాయం ప్రకారం విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ దీపావళి. ఈ పండుగ సందర్భంగా అనేక నూనె దీపాలు రాత్రింబవళ్లు వెలుగుతూ ఉండేవి.
* విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ వసంతోత్సవం. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వీధుల్లో వెళ్లేవారిపై (రాజు, రాణితో సహా) పసుపు నీళ్లు చల్లేవారు. ఈ ఉత్సవాల సందర్భంగా సామాన్య ప్రజలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
 * శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నువ్వుల నూనె తాగి ఆ నూనె చెమట రూపంలో బయటకు వచ్చేవరకు మట్టితో కూడిన బరువులు ఎత్తి, కత్తితో వ్యాయామం చేసేవాడని తర్వాత కుస్తీ పోటీలో పాల్గొని, స్నానానికి ముందు గుర్రపు స్వారీ చేసేవాడని పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పేస్ పేర్కొన్నాడు.
* బలులు: విజయనగర కాలంలో భారీగా బలులు ఇచ్చేవారు. కొన్ని పండుగల సందర్భంగా నిర్వహించే జంతు బలులను రాజు స్వయంగా వీక్షించేవాడని, మహార్ణవమి పండుగ చివరి రోజున 250 దున్నపోతులు, 450 గొర్రెలను బలి ఇచ్చేవారని పేస్ పేర్కొన్నాడు.
* మానవులను బలి ఇచ్చే దురాచారం విజయనగర కాలంలో సాధారణం. చెరువులు, రిజర్వాయర్లు, దేవాలయాల ప్రారంభోత్సవం సమయంలో యుద్ధ ఖైదీలను బలి ఇచ్చేవారు.


మతం

విజయనగర రాజులు మతసామరస్యాన్ని పాటించారు. కృష్ణదేవరాయలు శైవులు, వైష్ణవులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీల పట్ల ఆదరణ చూపాడని బార్బోసా పేర్కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. హంపిలో ప్రసిద్ధి చెందిన విఠలస్వామి దేవాలయం, హజారరామ దేవాలయాలను నిర్మించాడు.

* అచ్యుతదేవరాయలు కూడా విష్ణుభక్తుడే. అయితే కంచి, లేపాక్షిలలోని శివాలయాలకు ఇతడు భారీగా దానధర్మాలు చేశాడు. రామరాయలు కూడా పరమత సహనాన్ని పాటించాడు. ముస్లిం ప్రజలు, సైనికులు విధేయపూర్వకంగా తనని కలవడానికి వచ్చినప్పుడు రామరాయలు ఖురాన్ ప్రతిని తన ముందు ఉంచేవాడు.


ఆర్థిక పరిస్థితులు

  విదేశీ యాత్రికుల రచనలను బట్టి విజయనగర కాలంలో ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు తెలుస్తోంది. విజయనగర రాజుల వద్ద లెక్కకు మించిన సంపద ఉండేదని, విజయనగరంలోని ప్రజలు విలువైన రాళ్ల వ్యాపారం చేసేవారని, అక్కడ వస్తువులు ఎక్కువ సంఖ్యలో, చౌకగా లభించేవని డోమింగో పేస్ పేర్కొన్నాడు.

* తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజు ఓటమి తర్వాత జరిగిన రెండు సంఘటనలను బట్టి విజయనగర రాజుల వెలకట్టలేని సంపదను అర్థం చేసుకోవచ్చు. మొదటిది - రామరాయల కొడుకు తిరుమలరాయలు విజయనగరంలోకి ప్రవేశించి, సదాశివరాయల ఖజానాలోని మొత్తం సంపదను 1550 ఏనుగులపై ఎక్కించి పెనుగొండకు తరలించాడు. రెండవది- యుద్ధం తర్వాత విజయనగరాన్ని ధ్వంసం చేసిన ముస్లింలు 10 కోట్ల స్టెర్లింగ్‌ల విలువైన బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లతోపాటు, విలువైన రాళ్లతో చేసిన రాజ సింహానాన్ని 550 ఏనుగులపై తరలించారని రాబర్ట్ సెవెల్ 'ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్' (A forgotten Empire) అనే గ్రంథంలో పేర్కొన్నారు.


వర్తక వాణిజ్యాలు

  అభివృద్ధి చెందిన వర్తక, వాణిజ్యాలు విజయనగర కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణం. ఈ వ్యాపారం భూమార్గం, తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ద్వారా జరిగేది. విజయనగర సామ్రాజ్యంలో కాలికట్, కొచ్చిన్, భట్కల్, మంగుళూరు మొదలైనవి ప్రధాన ఓడరేవులు. కోరమాండల్, మలబార్ తీరాలను వర్తక వాణిజ్యాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యాపారం పోర్చుగీసు, అరబ్ వ్యాపారుల ద్వారా జరిగేది.

హిందూ మహాసముద్రంలోని దీవులు- మలయ, బర్మా, చైనా, అబీసీనియా, దక్షిణాఫ్రికా, పర్షియా లాంటి దేశాలతో విజయనగర ప్రజలకు వర్తక సంబంధాలు ఉండేవి. విజయనగర సామ్రాజ్యం నుంచి వస్త్రాలు, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, బియ్యం లాంటివి ఎగుమతయ్యేవి. గుర్రాలు, ఏనుగులు, పగడాలు, పాదరసం, చైనా పట్టు మొదలైనవి ప్రధాన దిగుమతులు.


సాహిత్యం

  విజయనగర రాజులు తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ కవులను ఆదరించారు. కొంతమంది చక్రవర్తులు, రాణులు సాహిత్యరంగంలో ప్రసిద్ధి చెందారు.


సంస్కృతం

  విజయనగర కాలం నాటి తొలి రోజుల్లో ముఖ్యంగా మొదటి బుక్కరాయల కాలంలో శయనుడి ఆధ్వర్యంలో అనేకమంది పండితులు ఉండేవారు. వారు నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలపై వ్యాఖ్యానాలు రచించారు. దేవరాయలు 15వ శతాబ్దంలో శ్రీరంగంలో రచించిన 'నిఘంటు వ్యాఖ్య' అనే గ్రంథం ప్రముఖమైంది. రామాయణం, మహాభారతంపై వ్యాఖ్యానాలు రచించిన గోవిందరాజ (ఇతడు కాంచీపురం వాస్తవ్యుడు) శ్రీకృష్ణదేవరాయలు, రామరాయలకు సమకాలీకుడు.

* మొదటి బుక్కరాయల రెండో కుమారుడు కుమార కంపన విజయాలను అతడి రాణి గంగాదేవి తన 'మధురా విజయం'లో వివరించింది. అచ్యుత దేవరాయల ఆస్థానకవి రాజనాథుడు 'సాళువాభ్యుదయం, భాగవత చంపూ, అచ్యుతాభ్యుదయం' అనే గ్రంథాలు రచించాడు.
అచ్యుతాభ్యుదయంలో అచ్యుత దేవరాయల పాలన గురించిన వర్ణన ఉంటుంది. తిరుమలాంబ రచించిన వరదాంబిక పరిణయం అనే చారిత్రక గ్రంథంలో వరదాంబికతో అచ్యుతరాయల వివాహాన్ని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత, తెలుగు భాషల్లో గొప్ప కవి, పండితుడు. ఇతడు సంస్కృతంలో రచించిన జాంబవతి కల్యాణం అనే నాటకం ప్రసిద్ధి చెందింది.


కన్నడం

  విజయనగర కాలం నాటి లింగాయత్ సాహిత్యంలో సంస్కర్తలు, భక్తుల కథలు ప్రధానమైనవి. క్రీ.శ. 1369లో భీమకవి రచించిన బసవ పురాణం ఇందులో ముఖ్యమైంది. బసవేశ్వరుని జీవితం గురించి రచించిన మరో గ్రంథం మాల బసవరాజ చరిత. దీన్ని సింగిరాజు క్రీ.శ. 1500లో రచించాడు. దీనికే మరోపేరు సింగిరాజు పురాణం. ఇందులో బసవేశ్వరుని 84 అద్భుతాల గురించి పేర్కొన్నారు.

* రెండో దేవరాయల ఆస్థానంలోని చామరసుడు 'ప్రభు లింగతాల' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని దేవరాయలకు చదివి వినిపించగా దేవరాయలు దీన్ని తెలుగు, తమిళంలోకి అనువదించేలా చర్యలు తీసుకున్నాడు. చామరసుడు రాజు సమక్షంలో వైష్ణవులతో వాగ్వాదాలు చేసేవాడు. కన్నడ భారతాన్ని రచించిన కుమార వ్యాసుడు చామరసుడికి ప్రధాన పోటీదారుడు. క్రీ.1584లో విరూపాక్ష పండితుడు చెన్న బసవ పురాణాన్ని రచించాడు.
* శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వైష్ణవ ఉద్యమం కన్నడ సాహిత్యం మీద గొప్ప ప్రభావం చూపింది. మహాభారతంలోని మొదటి పది పర్వాలను నరసప్ప కన్నడంలోకి అనువదించాడు. మిగిలిన పర్వాలను క్రీ.శ. 1510లో తిమ్మన్న కృష్ణరాయల పేరు మీదుగా కృష్ణరాయభారతం అనే పేరుతో అనువదించాడు. కృష్ణదేవరాయలు, అచ్యుత రాయల ఆస్థానంలోని చటు విఠలనాథుడు భాగవతాన్ని కన్నడంలోకి అనువదించాడు.


తెలుగు

  తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ఇంగ్లండ్‌లో ఎలిజబెత్ యుగంతో, గ్రీసులో పెరిక్లస్ యుగంతో రాయల కాలాన్ని పోల్చవచ్చు. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే ఎనిమిది మంది కవులుండేవారు. కృష్ణదేవరాయలు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని పేర్కొన్నాడు. ఈ కాలాన్ని ప్రబంధ యుగంగా పిలుస్తారు.

* అష్టదిగ్గజాల్లో మనుచరిత్రను రచించిన అల్లసాని పెద్దన సాటిలేని మేటికవిగా ప్రసిద్ధి చెందాడు. మనుచరిత్రకే స్వారోచిష మనుసంభవం అనే పేరు కూడా ఉంది. కృష్ణదేవరాయలు పెద్దనకు 'ఆంధ్ర కవితా పితామహుడు' అనే బిరుదునిచ్చి సత్కరించాడు. పెద్దన మనుచరిత్రను కృష్ణదేవరాయలకు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా రాయలు పెద్దన కాలికి గండపెండేరాన్ని తొడిగి, పెద్దన ఎక్కిన పల్లకీని స్వయంగా మోశాడు. కోకట గ్రామాన్ని పెద్దనకు దానంగా ఇచ్చాడు.
* నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించి రాయలకు అంకితమిచ్చాడు. భట్టుమూర్తికి రామరాజ భూషణుడు అనే పేరు కూడా ఉంది. ఇతని గ్రంథాల్లో ముఖ్యమైంది వసుచరిత్ర. ఇందులో రాకుమారుడు వసు, రాకుమారి గిరికల వివాహం గురించి పేర్కొన్నారు.
* ధూర్జటి 'కాళహస్తి మాహాత్మ్యం', అతని కుమారుడు కుమార ధూర్జటి 'కృష్ణదేవరాయ విజయం' రచించారు. కృష్ణదేవరాయ విజయంలో చక్రవర్తి యుద్ధ విజయాల గురించి పేర్కొన్నారు. పింగళి సూరన రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం గ్రంథాలను రచించాడు. సూరన తన రచనల్లో ఉత్తమమైందిగా ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని పేర్కొన్నాడు. ఈ గ్రంథం దైత్యరాజును శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఓడించిన తీరును, దైత్యరాజు కుమార్తె ప్రభావతితో ప్రద్యుమ్నుడి వివాహాన్ని వివరిస్తుంది.
తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మాహాత్మ్యం అనే గ్రంథాలను రచించాడు. మాదయగారి మల్లన 'రాజశేఖర చరితం' అనే గ్రంథాన్ని, అయ్యలరాజు రామభద్రుడు 'రామాభ్యుదయం' అనే గ్రంథాన్ని రచించారు.
* శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, పండితుడు. ఇతడు తెలుగులో ఆముక్తమాల్యద లేదా విష్ణుచిత్తీయం అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని తెలుగు సాహిత్యంలో అయిదు గొప్ప కావ్యాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇది తెలుగు సాహిత్యంపై వైష్ణవ మత ప్రభావం ప్రారంభమవడాన్ని సూచిస్తుంది. ఇది ఆళ్వార్ విష్ణుచిత్తుడి జీవితం గురించి, అతడి వైష్ణవ తత్వాన్ని గురించి వివరిస్తుంది.
* మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్ల ఈ కాలానికి చెందిందే. ప్రజాకవి, గొప్ప సామ్యవాది అయిన వేమన ఈ కాలం వాడే. వేమన సామాజిక దురాచారాలైన కులవ్యవస్థ, విగ్రహారాధన మొదలైన వాటిని తన పద్యాల ద్వారా విమర్శించాడు.

వాస్తు కళలు, చిత్రలేఖనం

  విజయనగర కాలంలో వాస్తు కళలు, చిత్రలేఖనం బాగా అభివృద్ధి చెందాయి. విజయనగర రాజుల తొలి రాజధాని హంపిలోని అవశేషాలు గొప్ప కట్టడాలకు నిదర్శనం. రాజులతోపాటు రాణులు, ఉన్నతోద్యోగులు, భవన నిర్మాణ కార్యకలాపాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. హంపిలోని విఠల, పంపావతి, విరూపాక్ష, హజారరామ ఆలయాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మితమయ్యాయి. లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం, సోంపాలెంలోని చెన్నకేశవ దేవాలయం, యెల్లూరులోని జలకంఠేశ్వర దేవాలయం, చిదంబరంలోని పార్వతి దేవాలయం, కంచిలోని వరదరాజ, ఏకాంబర నాథ దేవాలయాలు ద్రావిడ, విజయనగర వాస్తు శైలికి ఉదాహరణలు.
* లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలోని చిత్రలేఖనం నాటి సామాజిక జీవితానికి అద్దం పడుతోంది. ఇందులో శిరోజాల అలంకరణలు, దుస్తులు, ఆభరణాలు, సంగీత వాయిద్యాలు, గొడుగులు, ఆటలు మొదలైన అంశాలను చక్కగా చిత్రించారు.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహాయ నిరాకరణ ఉద్యమం

భారత జాతి ధిక్కారం!

ఆ ఉద్యమంలో భారత జాతి చాటిన ధిక్కారం ఆంగ్లేయులను ఆశ్చర్యానికి గురిచేసింది. విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఉద్ధృతంగా జరిగిన పోరు దేశాన్ని మరింత బలంగా ఏకం చేసింది. జాతీయవాదులందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. అన్నింటికీ మించి మొదటిసారి గాంధీజీ సారథ్యంలో సాగిన సహాయ నిరాకరణ సమరం, అహింసా మార్గంలో పోరాటాల శక్తిని నిరూపించింది. కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు అందులో భాగమయ్యాయి.

భారతదేశ స్వాతంత్య్ర సమర చరిత్రలో గాంధీజీ నాయకత్వంలో నిర్వహించిన ‘సహాయ నిరాకరణ ఉద్యమం (1920 - 22)’ అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టం. మన జాతి ఉవ్వెత్తున ఉద్యమించి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన ప్రజా పోరాటం. 


జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ: 1919లో ఆంగ్లేయులు చేసిన భారత ప్రభుత్వ చట్టం - 1919 ప్రజలకు నిరాశను మిగిల్చింది. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న తీవ్ర వ్యతిరేకతను కఠినంగా అణచి వేసేందుకు తెచ్చిన రౌలత్‌ చట్టంపైనా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పౌర హక్కులను హరించే సైతాన్‌ చట్టంగా గాంధీజీ దానిని అభివర్ణించారు. ప్రజలంతా చైతన్యవంతులై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం విముక్తి పొందుతుందని పిలుపునిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 6న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. హర్తాళ్లు, సమ్మెలు ఉద్ధృతంగా సాగాయి. హిందూ-ముస్లిం ఐక్యత పరిఢవిల్లింది. విదేశీ పాలన పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమైంది. 


ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. ప్రజలపై దమనకాండకు దిగింది. పంజాబ్‌ ప్రాంతం కల్లోలంగా మారింది. ప్రజా నాయకులైన డాక్టర్‌ సైౖఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌ జలియన్‌వాలా బాగ్‌ మైదానంలో ఏప్రిల్‌ 13న సమావేశమైన నిరాయుధ జనసమూహంపై, సైనికాధికారి డయ్యర్‌ తన సైనికదళాలతో కాల్పులు జరిపించాడు. వందలాది మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ దారుణంతో దేశ వ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడింది. నాగరీకులమని ప్రకటించుకునే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వికృత హింసా ధోరణి ప్రపంచానికి బహిర్గతమైంది. భారతీయ రచయితలూ, మేధావులు, మానవతావాదులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదులూ, హోదాలను త్యాగం చేసి, సామాన్య ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఆ తీవ్ర నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం విచారణ కోసం హంటర్‌ కమిషన్‌ను నియమించింది. అది నామమాత్రంగా పని చేసి డయ్యర్‌ను ఆరోపణల నుంచి విముక్తుడిని చేసింది. కాంగ్రెస్‌ నియమించిన గాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్, జయకర్, అబ్బాస్‌ త్యాబ్జిలతో కూడిన విచారణ సంఘం సాక్ష్యాధారాలను పరిశీలించి, హింసాకాండకు డయ్యర్‌ పూర్తి బాధ్యుడని తేల్చింది. పంజాబ్‌ మారణకాండ దేశప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది.

ఖిలాఫత్‌ సమస్య: భారత దేశంలోని ముస్లింలు టర్కీ (ప్రస్తుత తుర్కియే) దేశాధినేత సుల్తాన్‌ను తమ మత గురువుగా (ఖలీఫా) గౌరవిస్తారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ, జర్మనీ పక్షాన చేరి, మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వ్యతిరేకంగా పోరాడి ఓడింది. మిత్ర రాజ్యాలు టర్కీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా, ఖలీఫా పదవి రద్దు చేయడానికి నిశ్చయించాయి. ఈ పరిస్థితుల్లో  టర్కీ సామ్రాజ్యానికి, ఖలీఫా వైభవానికి భంగం కలిగించవద్దని బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయ ముస్లింలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మౌలానా మొహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ సోదరుల నాయకత్వంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పడింది. హకీమ్‌ అఫ్జల్‌ఖాన్, హస్రత్‌ మొహాని, మౌలానా ఆజాద్‌ లాంటివారు ఈ కమిటీలో సభ్యులు. ఖలీఫా స్థానాన్ని భంగపరిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కమిటీ నిర్ణయించింది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీపై విధించిన షరతుల్లో ఖలీఫా పదవి పునరుద్ద్ధరణ ప్రస్తావన లేదు. దాంతో మన దేశంలోని ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమానికి సిద్ధమయ్యారు.  


1920, మే 28న బొంబాయిలో జరిగిన సమావేశంలో గాంధీజీ సూచనతో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఖిలాఫత్‌ కమిటీ ఆమోదించింది. జూన్‌ మొదటి వారంలో అలహాబాదులో జరిగిన హిందూ-ముస్లింల సమావేశంలో ఆ పోరాటానికి హిందువుల సహకారాన్ని కోరుతూ కమిటీ విజ్ఞప్తి చేసింది. హిందూ-ముస్లింలను ఏకం చేయడానికి ఖిలాఫత్‌ ఉద్యమం ఒక సువర్ణావకాశమని గాంధీజీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులూ భావించారు. 1920, జూన్‌లో అలహాబాదులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమం జరపాలని నిర్ణయించి, ఇందుకు సారథ్యం వహించాలని గాంధీజీని కోరారు. ఈ ఉద్యమం 1920, ఆగస్టులో ప్రారంభమైంది. 1920, సెప్టెంబరులో కలకత్తాలో లాలా లజపతిరాయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వరాజ్య సాధనకు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది డిసెంబరులో సి.విజయరాఘవాచారి అధ్యక్షతన నాగ్‌పుర్‌ వార్షిక సమావేశంలో కాంగ్రెస్‌ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.

సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమం: బహిష్కరణలు, స్వదేశీ నినాదం, జాతీయ విద్య ఈ ఉద్యమంలో ప్రధాన అంశాలు. బహిష్కరణ అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు, విదేశీ వస్తువులను బహిష్కరించడం. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను వదులుకోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వైదొలగడం. కేంద్ర రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం ఉద్యమంలో భాగం. జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం, వివాదాల  పరిష్కారం కోసం పంచాయతీల పేరుతో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం. స్వదేశీ భావనను పెంపొందిస్తూ, ఖాదీ తయారీకి చేతులతో నూలు వడకడం. హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టడం. అహింసను సంపూర్ణంగా అమలు చేయాలని గాంధీజీ ఉద్బోధించారు. ఒక సంవత్సరంలో స్వరాజ్యం సిద్ధిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


లక్ష్యాలు: పంజాబ్‌ దురాగతాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం  క్షమాపణ చెప్పడం, స్వరాజ్యం, టర్కీ సుల్తాన్‌ పూర్వస్థితిని పునరుద్ధరించడం ఉద్యమ డిమాండ్లు.

ఉద్యమ గతి: 1921 - 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ప్రజల్లో అమితమైన ఉత్సాహం వ్యక్తమైంది. విదేశీ వస్త్రాల బహిష్కరణ విజయవంతమైంది. వాటిని కుప్పలుగా పోసి వీధుల్లో తగలబెట్టారు. విదేశీ వస్త్ర దిగుమతులు పడిపోయాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించారు. అనేకమంది ప్రసిద్ధ న్యాయవాదులైన ఎంఆర్‌ జయకర్, ప్రకాశం పంతులు, సీఆర్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ, సైఫుద్దీన్‌ కిచ్లూ, వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, అసఫ్‌ అలీ తదితరులు  తమ ప్రాక్టీస్‌లను వదులుకున్నారు. విదేశీ కోర్టులను బహిష్కరించారు. భారతదేశ సందర్శనకు వస్తున్న వేల్స్‌ రాకుమారుడి పర్యటనను ఉద్యమకారులు బహిష్కరించారు. మద్యపానాన్ని నిషేధించాలంటూ కల్లు దుకాణాల ముందు ఉద్ధృతంగా ధర్నాలు చేశారు. దాంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తిలక్‌ స్వరాజ్య నిధి సేకరణ రూ.కోటి లక్ష్యాన్ని దాటింది. జాతీయోద్యమానికి ఖాదీ ఒక యూనిఫామ్‌గా మారిపోయింది. గాంధీజీ పిలుపుతో కార్యకర్తలు స్వచ్ఛందంగా జైళ్లకు వెళ్లడానికీ సిద్ధమయ్యారు. ఖిలాఫత్‌ నాయకులైన అలీ సోదరులతో కలిసి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. తీవ్రరూపం దాల్సిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఉద్యమకారులను విచక్షణారహితంగా అరెస్ట్‌ చేసింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో చీరాల - పేరాల సత్యాగ్రహం, పల్నాడులో అటవీ సత్యాగ్రహం, పెదనందిపాడులో పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగాయి.

చౌరీ చౌరా సంఘటన (1922): సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922, ఫిబ్రవరి 5న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో చోటుచేసుకున్న ఒక  సంఘటన ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపేసేందుకు కారణమైంది. 

ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు, పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని వెంటనే ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యను నాటి కాంగ్రెస్‌ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ 1922, ఫిబ్రవరి 12న బార్డోలీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గాంధీజీ నిర్ణయాన్ని ఆమోదించింది. ఉద్యమం నిలిచిపోయింది. ప్రభుత్వం గాంధీజీపై దేశద్రోహం నేరం మోపి అరెస్టు చేసింది. టర్కీలో ముస్తఫా కెమల్‌ పాషా ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగి, సుల్తాన్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో ఖిలాఫత్‌ ఉద్యమం కూడా ఆగిపోయింది.


సహాయ నిరాకరణ ఉద్యమ ఫలితాలు: ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్న డిమాండ్లను సాధించలేకపోయినప్పటికీ, కొన్ని మంచి ఫలితాలను అందించింది. అప్పటి వరకు భిన్న వర్గాల ప్రజలు తమ ప్రయోజనాల కోసం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు సాగించారు. కానీ గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం  జాతీయోద్యమంగా మారింది. దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమనే ప్రజల కృత నిశ్చయం సంపూర్ణంగా వ్యక్తమైంది. హిందూ ముస్లిం ఐక్యతను సాధించింది. జాతీయవాద భావం, జాతీయోద్యమం దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వ్యాపించాయి. తర్వాత దశలో జరిగిన శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ప్రజల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యశక్తిని ఎదిరించగలమనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. 

ర‌చ‌యిత‌:  వి.వి.ఎస్‌.రామావ‌తారం

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సమరశీల భావాలు - సాయుధ పోరాటాలు

ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

  జాతీయోద్యమ కాలంలో భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలు, అతి క్రూరమైన అణచివేతలు అధికమయ్యాయి. మన వాళ్లకు కనీస హక్కులు  లేకుండా పోయాయి. స్వేచ్ఛ ఉండేది కాదు. పరిష్కారాల కోసం మితవాదులు చేసిన పోరాటాలతో ఆశించిన ప్రయోజనాలు అందలేదు. ఆ దశలో ఉద్యమకారుల్లో అసహనం ప్రబలింది. అది సాయుధ పోరాటంగా మారింది. దేశ, విదేశాల్లో ఎంతోమంది వీరులు నిరంకుశ పాలనపై అసమాన ధైర్య సాహసాలతో అనేక రకాలుగా తిరుగుబాటు సమరాన్ని సాగించారు. కొందరు దుర్మార్గులైన ఇంగ్లిష్‌ అధికారులను తుదముట్టించారు. దొరికిపోయినవారు జైళ్లలో చిత్రహింసలు అనుభవించారు. ప్రాణాలు కోల్పోయారు. కానీ స్వాతంత్రోద్యమ గతిని మార్చి చరిత్రలో అమరవీరులై చిరస్థాయిగా నిలిచిపోయారు. 

  భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విప్లవవాదులకు విశిష్ట స్థానం ఉంది. తరతరాలుగా బ్రిటిష్‌ ప్రభుత్వ వలసవాద విధానాలు భారత జాతిని ఆర్థికంగా కుంగదీశాయి. నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం దేశమంతా విలయతాండవం చేశాయి. దీనికితోడు ఆంగ్లేయుల జాత్యహంకార ధోరణి, దురుసుతనం, భారత జాతీయోద్యమాన్ని మొగ్గ దశలోనే అణచివేసేందుకు ప్రయత్నించిన తీరు కొందరు ఉద్యమకారుల్లో ద్వేషభావాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ మితవాదులు సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలు, ఫలితాలు సాధించలేని వారి పోరాటశైలి పట్ల ఈ వర్గం విసుగు చెందింది. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం కూడా దేశంలో విప్లవభావం పెరిగేందుకు దోహదపడింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్‌ విప్లవం, చిన్న దేశమైన జపాన్‌ అతిపెద్దదైన రష్యాపై విజయం సాధించడం వంటి అంతర్జాతీయ సంఘటనలు విప్లవ భావజాలానికి ఉత్ప్రేరకాలుగా నిలిచాయి. బ్రిటిషర్ల బలప్రయోగ వ్యూహాలను అదే రీతిలో ఎదుర్కొంటేనే వారిని దేశం నుంచి సాగనంపడం సాధ్యమని సమరశీల నేతలు భావించారు. 

విధానాలు

విప్లవవాదులు లేదా సమరశీల జాతీయవాదులు అచంచల దేశభక్తులు. తొలి దశలో భారతదేశంలో, దేశం వెలుపలా రహస్య విప్లవ సంఘాలు, పత్రికలు స్థాపించి సదస్సులు,  సమావేశాలు నిర్వహించి, పుస్తకాలు ప్రచురించి విప్లవభావాలను ప్రచారం చేశారు. ఐరిష్‌ ఉగ్రవాదులు, రష్యన్‌ నిహిలిస్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. భారతీయుల పట్ల క్రూర విధానాలను అవలంబించిన ఇంగ్లిష్‌ అధికారుల హత్యలకు సిద్ధమయ్యారు. ఆంగ్లేయులను వ్యతిరేకించే దేశాల సహాయంతో సైనిక కుట్రలు చేశారు. తమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు, ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ ఆయుధగారాలపై దాడులకు పాల్పడ్డారు.

  బెంగాల్‌ విభజనకు ముందే విప్లవ సంఘాల స్థాపన ఉన్నప్పటికీ, బెంగాల్‌ విభజనతో ఉగ్రజాతీయవాదం పెరిగింది. బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలు విప్లవ సంఘాల కార్యకలాపాలకు అడ్డాగా (కేంద్రంగా) మారాయి. ఈ సంస్థల్లో బరీంద్రకుమార్‌ ఘోష్, జతీంద్రనాథ్‌ బెనర్జీలు కలిసి స్థాపించిన ‘కలకత్తా అనుశీలన సమితి’, పుళిందాస్‌ స్థాపించిన ‘ఢాకా అనుశీలన సమితి’ ప్రధానమైనవి. ఇవి ఉనికిలో ఉన్నంతకాలం కేవలం మన దేశంలోని ఇతర విప్లవ సంస్థలతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలతోనూ సంబంధాలను కొనసాగించేవి. సమరశీల, విప్లవవాద సిద్ధాంతాల ప్రచారంలో అవి ముందంజలో ఉండేవి.

  1905 బెంగాల్‌ విభజన తర్వాత దేశంలో అనేక తీవ్రవాద సంస్థలు పత్రికలను స్థాపించి తమ భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. అలాంటి వాటిలో బెంగాల్‌లోని సంధ్య, యుగాంతర్, కాల్‌ ముఖ్యమైనవి. 1899లో సావర్కర్‌ సోదరులు మహారాష్ట్రలో ‘మిత్రమేళా’ పేరుతో రహస్య సంఘాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఈ సంస్థ గణేష్‌ సావర్కర్‌ స్థాపించిన ‘అభినవ్‌ భారత్‌’తో కలిసి పశ్చిమ భారతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యక్రమాలను నిర్వహించింది. 1905లో అశ్వినీకుమార్‌ దత్త స్థాపించిన ‘స్వదేశీ బాంధవ్‌ సమితి’ బెంగాల్‌ విభజన ఉద్యమకాలంలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఇలా అనేక విప్లవ సంఘాలు దేశమంతా ఏర్పాటయ్యాయి. పంజాబ్‌లో పలు రహస్య సంఘాలు అజిత్‌ సింగ్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేశాయి. తమిళ ప్రాంతంలో చిదంబరం పిళ్లై, సుబ్రమణ్య శివ తదితరులు బ్రిటిష్‌ వ్యతిరేక విప్లవ ఉద్యమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 1924లో సచింద్రనాథ్‌ సన్యాల్, జేజి ముఖర్జీ నేతృత్వంలో ‘హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ సంస్థ ఏర్పడింది. ఆగ్రా, అలహాబాద్, బెనారస్, కాన్పుర్, లఖ్నవూల్లో శాఖలను ఏర్పాటు చేసింది. బ్రిటిషర్లపై ప్రయోగించడానికి కలకత్తాలో బాంబుల తయారీని ప్రారంభించింది. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈ సంస్థ పేరును ‘హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’గా మార్చారు. 

  విప్లవ కార్యక్రమాల నిర్వహణకు విదేశాల్లో కూడా సంఘాలు/సంస్థలను భారతీయులు స్థాపించారు. అలాంటి వారిలో శ్యామ్‌జీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, లాలా హర్‌దయాళ్‌ ముఖ్యులు. బ్రిటిష్‌ పాలకుల సొంతగడ్డ లండన్‌లోనే ఇండియా హౌస్‌ను శ్యామ్‌జీ కృష్ణవర్మ స్థాపించారు. ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికనూ స్థాపించారు. వీర్‌ సావర్కర్‌ కూడా లండన్‌లోనే తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి ఆంగ్లేయుల వ్యతిరేక పోరాటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన గ్రంథం ‘ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావాన్ని విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టింది. యూరప్‌లో భారత స్వాతంత్య్ర కాంక్షను ప్రచారం చేసిన వీర వనిత భికాజీ రుస్తుం కామా.

  అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోలో 1913లో ‘గదర్‌ పార్టీ’ ఆవిర్భవించింది. లాలా హర్‌దయాళ్, భాయ్‌ పరమానంద, సోహన్‌ సింగ్, మహమ్మద్‌ ఇక్బాల్, భగవాన్‌ సింగ్, కర్తార్‌ సింగ్, అబ్దుల్‌ హఫీజ్, మహమ్మద్‌ బర్కతుల్లా తదితర పంజాబీయులు ఇందులో కీలక సభ్యులు. ఆయుధాలను సేకరించి, యువతకు శిక్షణ ఇచ్చి, ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయడం ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం. పంజాబ్, తూర్పు ఆసియా దేశాల్లో గణనీయంగా అనుచరులను సిద్ధం చేసింది. బెంగాల్‌లో రాస్‌ బిహారీ బోస్‌ ఈ సంస్థ నాయకుడు. అయితే ఈ రహస్యాలను తెలుసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసింది. వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ్, భూపేంద్రనాథ్‌ దత్త తదితరులు 1915లో ‘బెర్లిన్‌ కమిటీ’ని స్థాపించి బ్రిటిషర్ల అకృత్యాలను ఐరోపా దేశాల్లో ఎండగడుతూ, సాయుధ పోరాటానికి కార్యకర్తలను తయారుచేశారు. 1915లో మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా తదితరులు కాబూల్‌లో ‘ప్రొవిజనల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఫ్రీ ఇండియా’ను నెలకొల్పారు.

  ఆంగ్లేయుల సామ్రాజ్యవాద దాష్టీకాలకు, సాయుధ పోరాటంతో జవాబు చెప్పి, వారిని దేశం నుంచి తరిమికొట్టడం ఈ విప్లవకారుల ప్రధాన లక్ష్యం. భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులను హత్య చేయడం వంటి కార్యక్రమాలను చాపేకర్‌ సోదరులైన దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్‌ ప్రారంభించారు. వీరు పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులైన రాండ్, ఆయన మిలిటరీ సహాయకుడు లెఫ్టినెంట్‌ ఐరెస్ట్‌ను 1897లో కాల్చి చంపారు.  పరమక్రూరుడిగా పేరు పొందిన బెంగాల్‌ లఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫుల్లర్‌ హత్యకు 1907లో ‘అనుశీలన సమితి’ కార్యకర్తలు చేసిన ప్రయత్నం విఫలమైంది. 1908లో ముజఫర్‌పుర్‌ న్యాయమూర్తి కింగ్స్‌ ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బాంబు విసిరారు. 1912లో అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ హార్డింజ్‌ దిల్లీలో ఏనుగుపై ఊరేగింపుగా వస్తుండగా రాస్‌ బిహారి బోస్, సచింద్ర సన్యాల్‌లు బాంబు విసిరారు. కానీ హార్డింజ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు.

  సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో జరిగిన ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమానికి లాలా లజపతి రాయ్‌ నాయకత్వం వహించారు. పోలీస్‌ అధికారి సాండర్స్‌ కొట్టిన లాఠీ దెబ్బలకు లజపతి రాయ్‌ మరణించారు. ఇందుకు ప్రతిగా భగత్‌సింగ్, ఆజాద్, రాజ్‌గురులు 1928లో సాండర్స్‌ను హత్య చేశారు.

  నిధులు, ఆయుధాల కోసం 1920 నాటికి పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులపై స్వాతంత్రోద్యమ విప్లవకారులు చేసిన దాడులు వెయ్యికి పైగా ఉండవచ్చని అంచనా. ఆంధ్రాలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోలీస్‌స్టేషన్లకు ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేసేవాడు. బాంబులు తయారు చేస్తున్నారనే కారణంతో కలకత్తాలో 1908లో అనేకమంది విప్లవకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనినే అలీపూర్‌ కుట్ర కేసు అంటారు. 1925లో కకోరి రైలు దోపిడీ కేసులో రాంప్రసాద్‌ బిస్మిల్, రోషన్‌ సింగ్, రాజేంద్ర లాహిరి, అష్ఫాక్‌ ఉల్లాలను ఉరి తీశారు. 1930లో సూర్యసేన్‌ నాయకత్వంలో చిట్టగాంగ్‌ విప్లవకారులు ప్రభుత్వ ఆయుధగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భగత్‌ సింగ్, బి.కె.దత్‌లు ‘అప్రజాస్వామిక’ ప్రజా రక్షణ బిల్లును నిరసిస్తూ కేంద్ర శాసనసభలోకి బాంబులు విసిరారు. దాంతో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు 1931, మార్చి 23న లాహోర్  సెంట్ర‌ల్ జైలులో ఉరిశిక్ష విధించారు.

  ఒకవైపు గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్‌ అహింసాయుత రాజ్యాంగబద్ధ రాజకీయ పోరాటం చేస్తుంటే, మరోవైపు జరుగుతున్న విప్లవ సాయుధ పోరాటాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేలమందికి జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించినప్పటికీ విప్లవ యోధుల్లో ధైర్యం సడలలేదు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి వారు అవలంబించిన విధానాలకు పెద్దగా ప్రజామోదం లేనప్పటికీ, స్వాతంత్రోద్యమ గతిని మార్చడంలో గణనీయమైన పాత్ర పోషించారు. అచంచల దేశభక్తి, దేశం కోసం మరణానికి కూడా భయపడని మనోధైర్యం, త్యాగాలు, స్వతంత్ర పోరాట చరిత్రలో వారికి విశిష్ట స్థానం కల్పించాయి.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 16-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం

 స్వరాజ్య సాధనలో శాసన ధిక్కారం!

  పౌర హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం సత్యాగ్రహం రూపంలో తెలిపే శాంతియుత నిరసనల శక్తిని లోకానికి చాటింది. స్వరాజ్య సాధన లక్ష్యంగా బ్రిటిష్‌ శాసనాలను ధిక్కరించి ఉజ్జ్వల సమరంగా సాగింది.  ఆ సమయంలో సంపూర్ణ స్వాతంత్య్రమే అంతిమ ధ్యేయమని నెహ్రూ వంటి నాయకులు ఇచ్చిన పిలుపు భారతీయులను చైతన్యవంతం చేసింది. ఉప్పు తయారీపై తెల్లవారి గుత్తాధిపత్యాన్ని ఎదిరిస్తూ దండి దారిపట్టిన మహాత్ముడికి జనం అపూర్వ నీరాజనాలు పలికారు. ఫలితంగా కాంగ్రెస్‌ డిమాండ్లకు ఆంగ్లేయులు తలొగ్గాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 

  ఇరవయ్యో శతాబ్దం రెండో దశకం చివరి సంవత్సరాలు స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప మైలురాళ్లు. సైమన్‌ కమిషన్‌ భారతదేశ పర్యటనను భారతీయులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కమిషన్‌ తన పని తాను చేసుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయింది. కానీ సైమన్‌ బహిష్కరణ ఉద్యమం రూపంలో బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను భారతజాతి తిరస్కరించింది. స్వయంపాలిత రాజ్యాంగం కావాలనే ఆకాంక్షను ముక్తకంఠంతో వ్యక్తం చేసింది. అంతకు ముందే భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ ‘‘వివిధ జాతులు, మతాలు ఉన్న భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా?’’ అని భారతీయులకు సవాలు విసిరాడు. ఆ విధంగా ఎవరైనా రూపొందిస్తే తాను ఆమోదింపజేస్తానని ప్రకటించాడు.

నెహ్రూ నివేదిక - 1928: బిర్కెన్‌హెడ్‌ విసిరిన సవాలును భారత జాతీయ నాయకులు స్వీకరించారు. ముఖ్య రాజకీయ పార్టీలు, నాయకులు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకోసం దిల్లీ, పుణెలలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. మోతీలాల్‌ అధ్యక్షతన ఒక ఉపసంఘం ఏర్పాటైంది. ఛైర్మన్‌గా మోతీలాల్‌ నెహ్రూ, ముఖ్య సభ్యులుగా సర్‌ అలీ ఇమామ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. కొంతకాలానికి ఎంఆర్‌ జయకర్, అనీబిసెంట్‌ ఈ కమిటీలో చేరారు. మోతీలాల్‌ కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేదిక అంటారు. దీన్ని చట్టపరమైన శైలిలో రాశారు. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) నిర్ద్వంద్వంగా ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి, కార్యనిర్వాహక మండలి శాసనసభలకు బాధ్యత వహించడం, వయోజన ఓటింగ్‌ వంటివి ఉన్నాయి. పౌరుల ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కమిటీ నివేదికలో ఆ అంశాన్ని పొందుపరిచింది.

ముస్లిం లీగ్‌ అభ్యంతరాలు: కలకత్తాలో 1928, డిసెంబరులో జరిగిన అఖిలపక్ష సమావేశం నెహ్రూ నివేదికను ఆమోదించలేదు. మహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లింలీగ్‌ 14 డిమాండ్లను ప్రతిపాదించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు, కేంద్ర శాసనసభలో మూడో వంతు స్థానాలు, బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన  సీట్ల కేటాయింపు వంటివి ముస్లింలీగ్‌ డిమాండ్లు. ఫలితంగా అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

  అనంతరం 1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వరాజ్యం స్థాపిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నాటి సమావేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌లు సైతం అధినివేశ ప్రతిపత్తిని వ్యతిరేకించారు. అయితే గాంధీజీ వారిని సమన్వయపరిచారు. ఒక ఏడాదిలోగా బ్రిటిష్‌ ప్రభుత్వం అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని సాధనకు శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు.

  ఇదే సమయంలో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంక్షోభాన్ని సృష్టించింది. రైతులు, కార్మికుల్లో అశాంతి తలెత్తి బ్రిటిషర్లపై తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్వహించిన బార్డోలీ సత్యాగ్రహం రైతులను సంఘటితం చేసింది. విప్లవవాదులైన భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ల కార్యక్రమాలు, సాండర్స్‌ హత్య, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీపై బాంబు దాడి మొదలైనవి భారతీయుల్లో ధైర్యాన్ని పెంచాయి. దేశసేవలో నిమగ్నత, త్యాగబుద్ధి, కర్తవ్యం వంటి సుగుణాలను విప్లవవాదులు భారతీయుల్లో పెంచి, భారత స్వాతంత్య్రోద్యమాన్ని చైతన్యం చేశారు. సహాయ నిరాకరణోద్యమం తర్వాత గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలైన అస్పృశ్యతా నివారణ, మహిళాభ్యుదయ పద్ధతులు, మద్యపాన నిషేధం, కుష్ఠు నివారణ వంటివి గాంధీ నాయకత్వం పట్ల నమ్మకాన్ని పెంచాయి.

లాహోర్‌ కాంగ్రెస్‌ (1929) - పూర్ణ స్వరాజ్‌ తీర్మానం:  లాహోర్‌లో 1929, డిసెంబరులో రావి నది ఒడ్డున పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన, సమరశీల రాజకీయ చైతన్యానికి, నిర్ణయాలకు కేంద్రమైంది. సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ ధ్యేయమని, దాన్ని సాధించడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలని నెహ్రూ ఇచ్చిన పిలుపు భారతీయులను ఉత్తేజపరిచింది. 1929, డిసెంబరు 31న లాహోర్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న నెహ్రూ ఆవిష్కరించారు. 1930, జనవరి 26న సంపూర్ణ సాతంత్య్ర దినంగా సంబరాలు జరపాలని నిర్ణయించారు. పూర్ణ స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడానికి కాంగ్రెస్‌వాదులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాలని, వచ్చే ఎన్నికల్లో పాల్గొనరాదని తీర్మానించారు. స్వాతంత్య్ర సాధనకు ఉద్యమం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలనే విషయాల్లో కాంగ్రెస్‌ గాంధీజీకి పూర్తి స్వేచ్ఛ, అధికారం ఇచ్చింది. అయితే గాంధీజీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇవ్వాలనుకున్నారు. 11 డిమాండ్లతో కూడిన పత్రాన్ని నాటి భారత గవర్నర్‌ జనరల్‌ (వైస్రాయ్‌) ఇర్విన్‌కు సమర్పించారు. వాటిని అంగీకరిస్తే శాసనోల్లంఘన ఉద్యమాన్ని వాయిదా వేస్తానని ప్రకటించారు.

  * గాంధీ డిమాండ్లలో మద్యపాన నిషేధం, రూపాయికి పూర్వపు మారకపు రేటు ఇవ్వడం, భూమి శిస్తు తగ్గింపు, సైనిక వ్యయం తగ్గింపు, సివిల్‌ ఉద్యోగుల వేతనాల తగ్గింపు, ఉప్పుపై పన్ను రద్దు, విదేశీ వస్త్రాలపై పన్ను విధించడం, రాజకీయ ఖైదీల విడుదల, సీఐడీ శాఖ రద్దు వంటివి ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లను లార్డ్‌ ఇర్విన్‌ తిరస్కరించారు. దీంతో శాసనోల్లంఘన ఉద్యమం అనివార్యమైంది. గాంధీజీ ప్రజలతో ‘‘ప్రభుత్వం ఎలాంటి హింసాయుత విధానం అనుసరించినా హింసకు ప్రతి హింస చెయ్యను’’ అని ప్రతిజ్ఞ చేయించారు. శాసనోల్లంఘన ప్రారంభ కార్యక్రమంపై పలువురు నాయకులు పలు విధాలుగా చెప్పినప్పటికీ, గాంధీజీ తన అంతర్వాణి ప్రకారం ఉప్పుపై పన్ను నిరాకరణతో ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు.

శాసనోల్లంఘన ప్రారంభం (1930): ఉప్పు భారతీయులందరికీ నిత్యావసర ఆహార పదార్థం. అయితే ఉప్పు తయారీపై ప్రభుత్వానికే గుత్తాధిపత్యం ఉండేది. పౌరులెవరూ దీన్ని తయారు చేయకూడదు. దానిపై పన్ను కూడా ఉంది. దీన్ని భారతీయులందరూ తప్పనిసరిగా వినియోగించడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించిన తర్వాత తగిన మార్గనిర్ణయం చేయమంటూ గుజరాత్‌ భౌగోళిక పరిస్థితులు బాగా తెలిసిన సర్దార్‌ పటేల్‌ను గాంధీజీ కోరారు. 1930, మార్చి 12న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో బయలుదేరారు. గాంధీజీకి ఆయన సతీమణి కస్తూర్బా తిలకం దిద్ది, స్వయంగా వడికిన నూలు దండ వేశారు. ప్రార్థనా గీతం తర్వాత యాత్ర ప్రారంభమైంది. దారిపొడవునా స్వాగతాలు హోరెత్తాయి. సత్యాగ్రహులు రోజూ నిర్దేశించిన మైళ్లు నడవాలి, నిత్యం రాట్నం వడకాలి, ప్రార్థన చేయాలి, డైరీ రాయాలి, స్వయం వంట, సాధారణ భోజనం వంటి మార్గనిర్దేశాలు ఉన్నాయి. ఈ మహత్తర యాత్రను, గాంధీని ప్రత్యక్షంగా చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరేవారు. మహా నాయకుడిగా గాంధీజీ ముందు నడుస్తుంటే సత్యాగ్రహులు ఆయన్ను అనుసరించేవారు. దారిలో గ్రామం వస్తే చిన్న సభ జరిగేది. గాంధీ ప్రసంగించేవారు. ఈ యాత్ర అంతా అద్భుత దృశ్యం. నిర్ణయించిన విధంగా యాత్ర గుజరాత్‌ తీరంలో ఉన్న ‘దండి’ గ్రామం చేరింది. 1930, ఏప్రిల్‌ 6న ఉప్పు తయారు చేయడంతో ఒక మహా ప్రజా ఉద్యమానికి (శాసనోల్లంఘన ఉద్యమం) తెరలేచింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 31-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హర్షవర్ధునిది కాలం నాటి పరిస్థితులు


సాంఘిక పరిస్థితులు

* సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. 

* బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారి సంప్రదాయాలను ఆచరించారు. వీరిలో ఎన్నో కులాలు, ఉపకులాలు ఉండేవి. ప్రతి వృత్తి ఒక కులంగా ఏర్పడింది. 

* బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నతస్థానం ఉండేది. కసాయి, నిషాదులు, మత్స్య, చండాలురిని అపరిశుభ్ర వృత్తులుగా భావించి, ఊరికి దూరంగా ఉంచేవారు. వీరిని అంటరానివారిగా పరిగణించారు.

* కులాంతర, వర్ణాంతర వివాహాలు; సహపంక్తి భోజనాలు లేవు. బాల్యవివాహాలు ఉండేవి. వితంతు వివాహాలు లేవు. సతీసహగమనం ఉండేది. స్త్రీలకు స్వాతంత్య్రం లేదు. 

* ప్రజలు ధర్మసూత్రాలు పాటించి, ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. 
* ఎరాన్‌ శాసనంలో (క్రీ.శ. 510) ‘జోహార్‌’ అనే పదం ఉంది. దీని అర్థం యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు ఉమ్మడిగా అగ్ని ప్రవేశం చేసే ఆచారం.


ఆర్థిక పరిస్థితులు

* ఆనాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతులు తృణధాన్యాలు, వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, చెరకు, కూరగాయలు, మామిడి, అరటి, పుచ్చ, నారింజ, దానిమ్మ, గుమ్మడి, వెలగ, చింత, కొబ్బరి, అల్లం, ఆవాలు పండించేవారు.

* పూంచ్, మధుర ప్రాంతాలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. మగధలో సువాసన బియ్యాన్ని సాగుచేసేవారు. 

* హర్షుడి కాలంలో దేశం సిరిసంపదలతో తులతూగిందని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. 

* సంపన్నులు విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించి పెద్దభవనాల్లో నివసిస్తే, మిగిలినవారు సాధారణ జీవితం గడిపారు.

* ప్రాచీన నగరాలు తక్షశిల, పురుషపురం, పాటలీపుత్రం శిథిలమవ్వగా; కనౌజ్, వారణాసి, ప్రయాగ మొదలైన పట్టణాలు అభివృద్ధి చెందాయి. కనౌజ్‌ నగరం 5 మైళ్ల పొడవు, 4 మైళ్ల వెడల్పుతో సర్వాంగ సుందరంగా ఉండేదని హుయాన్‌ త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* పరిశ్రమల విభజన కులాలవారీగా జరిగేది. కౌశేయ(silk), క్షామ(linen), కంబళ (wollen) మొదలైనవారు విలువైన వస్త్రాలు నేసేవారు. మధుర, వారణాసి, కామరూప ప్రధాన నూలుపరిశ్రమ కేంద్రాలు. 

* కర్తన(spinning), జాతి కాకరణ(lace making), సూగేవానకర్మ(tailoring) లాంటి వృత్తులు ఉండేవి. వితంతువులు ఎక్కువగా ఈ పనులు చేసేవారు. 

* లోహ, దారు, దంత పరిశ్రమలు ఉండేవి. సౌరాష్ట్రలో ఇత్తడి; వంగదేశంలో తగరం; సూర్పారక, అంగ, సింధూ రాష్ట్రాల్లో ఖడ్గాలు తయారుచేసేవారు. 

వర్తక - వ్యాపారం

* హర్షుడి కాలంలో ఆగ్నేయాసియా దేశాలతో వర్తకం నిర్వహించేవారు. రేవుపట్టణాల్లో తామ్రలిప్తి (బెంగాల్‌), బరుకచ్చ, చారిత్ర (ఒడిశా) ప్రధానమైనవి. శ్రీలంక, ఇండోనేసియా, చైనాలకు తామ్రలిప్తి నుంచి నౌకలు వెళ్లేవి. 

* కశ్మీర్‌ కుంకుమపువ్వు, హిమాలయ ఔషధాలు, దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన ముత్యాలు, సుగంధద్రవ్యాలు ముఖ్యమైన ఎగుమతులు. రాగి, గుర్రాలు, దంతాలు, మరకతం ప్రధాన దిగుమతులు. 

* ప్రతి కుటీర పరిశ్రమ ఒక శ్రేణిగా (guild) ఏర్పడింది. వీటికి కొన్ని నిబంధనలు ఉండేవి. ఇవి సంఘ శ్రేయస్సు, వ్యాపారాభివృద్ధికి కృషిచేసేవి. వీటికి సలహాలు ఇవ్వడానికి ‘నిగమసభలు’ ఉండేవి. ఆ శ్రేణులు ప్రస్తుత బ్యాంకులుగా పనిచేసేవి. 

* ఆ కాలంలో చేనేత, అల్లిక, దంత, దారు, చందన, వెండి బంగారు, కుట్టు, పోత, ఆయుధ పరిశ్రమలు ఉండేవి. 


మత పరిస్థితులు 

* హర్షుడి కాలంలో మతంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బౌద్ధమతం క్షీణదశలో ఉండగా, హిందూమతం అభివృద్ధి చెందింది. 

* హర్షుడు బౌద్ధమతం స్వీకరించి, దాని అభివృద్ధికి కృషి చేసినప్పటికీ, ఆ మతం కనౌజ్‌ లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా జలంధర్, నలందా, కంచి, ధాన్యకటక ఆరామాల్లో బౌద్ధమతం అభివృద్ధి చెందింది.

* గౌడశశాంకుడు, హూణులు లాంటివారు బౌద్ధారామాలను ధ్వంసం చేసి నష్టం కలిగించారు. 

* క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి వర్తక, వ్యాపారం క్షీణించడం వల్ల బౌద్ధమతానికి చేయూతనిచ్చే వర్తకవర్గం ప్రాధాన్యం తగ్గింది. 

* బౌద్ధమతం అంతర్గతంగా శాఖోపశాఖలుగా విడిపోవడం (18 బౌద్ధశాఖలు), వాదోపవాదాల కారణంగా మత ప్రచారం తగ్గింది. సాంఘిక దురాచారాలు, బౌద్ధభిక్షువుల వ్యవహారశైలి, తాంత్రిక సంప్రదాయాలతో కూడిన పూజలు, దుష్టాచారాల వల్ల బౌద్ధమతం క్షీణించింది.

* హిందూమతం ‘భక్తి’ భావంతో ప్రజాదరణ పొందింది. శైవ, వైష్ణవ శాఖలు ఆదరణ పొందాయి. శైవంలో కాపాలిక, కాలముఖ శాఖలు ముఖ్యమైనవిగా ఆవిర్భవించాయి. వీరు మానవాతీత శక్తులు సాధించడానికి జంతు, నర బలులు ఇచ్చేవారని హర్షచరిత్ర, మాలతీమాధవ గ్రంథాల్లో ఉంది. వారణాసి, శ్రీశైలం శైవక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మూఢనమ్మకాలు పెరిగాయి. 

* వైశాలి, పౌండ్రవర్ధన, సమతట, కళింగ ప్రాంతాల్లో జైనమత ప్రభావం ఉండేది.

* క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి ‘వజ్రయాన’ బౌద్ధమతం ఆవిర్భవించి, మంత్రతంత్రాలతో కూడిన పూజావిధానాలు ప్రారంభమయ్యాయి.

* హర్షుడు ‘సమ్మతీయ శాఖను’ ప్రోత్సహించినట్లు; ఆ కాలంలో చంద్రకీర్తి, ధర్మపాలుడు, సంతిదేవుడు లాంటి బౌద్ధ పండితులు ఉండేవారని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు.

హర్షుడి తర్వాతి రాజవంశాలు

* క్రీ.శ. 647లో హర్షుడు మరణించాక భారతదేశంలో రాజపుత్ర వంశాలు రాజకీయ అధికారం పొందాయి. వీరు హిందూ మత సంస్కృతిని అనుసరిస్తూ పాలించారు. 

* క్రీ.శ. 7వ శతాబ్దం మధ్యభాగం నుంచి క్రీ.శ.13వ శతాబ్దం ప్రారంభం 

(క్రీ.శ. 1206) వరకు ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు పాలించారు. ఆ కాలాన్ని ‘రాజపుత్రయుగం’గా చరిత్రకారులు పేర్కొంటారు. 

* హర్షుడి తర్వాత మొట్టమొదట రాజకీయ అధికారాన్ని చేపట్టిన రాజపుత్ర వంశం ‘ప్రతిహారులు’. వీరు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను, మాళ్వాను పాలించారు. 

* గహాద్వాలులు లేదా రాథోర్‌లు కనౌజ్‌ను తమ రాజ్యంగా ప్రకటించుకున్నారు. 

* చౌహాన్‌లు ‘అజ్మీర్‌’ కేంద్రంగా పాలించారు. చందేలులు ‘బుందేల్‌ఖండ్‌’ ప్రాంతంలో రాజ్యపాలన చేశారు.

  * మాళ్వాను ‘పరమారులు’, గుజరాత్‌ను ‘సోలంకీలు’, త్రిపురను (ఛేది) ‘కాలాచూరీలు’, బెంగాల్‌ను ‘పాలవంశం’ వారు  పాలించారు.


విద్య - సాహిత్యాభివృద్ధి

హర్షుడి కాలంలో సంస్కృతం, ప్రాకృత భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది. ఇతడు స్వయంగా కవి, కవిపోషకుడు, విద్యాభిమాని.

* హుయాన్‌త్సాంగ్‌ రచనలు, బాణుడి హర్షచరిత్ర ప్రకారం హర్షుడి కాలం నాటి రాజభాష ‘సంస్కృతం’. సాహిత్యాన్ని ఈ భాషలోనే రాశారు. 

* వాక్పతిరాజు ప్రాకృతంలో ‘గౌడవాహో’ అనే కావ్యం రాశాడు. 

* హర్షుడి ఆస్థానంలో బాణుడు, మయూరుడు, దివాకరుడు, భర్తృహరి మొదలైన కవులు ఉండేవారు. బాణుడు ‘హర్షచరిత్ర’, ‘కాదంబరి’ నాటకాలు రచించగా; హర్షుడు ‘రత్నావళి’, ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’ అనే నాటకాలు రాశాడు. 

* జైనమతాన్ని ఆచరించిన మాతంగ దివాకరుడు  అనే కవి ఇతడి ఆస్థానంలో ఉండేవాడు.

* మయూరుడు ‘సూర్యశతకాన్ని’, భర్తృహరి ‘సుభాషిత శతకాన్ని’ రచించారు. కామాందకుడు ‘నీతిసారం’, ‘కుమిలుడు’, ‘శ్లోకవర్తిక’, ‘తంత్రవర్తిక’, ‘తుప్తిక’ అనే గ్రంథాలు రచించారు. భవభూతి ‘ఉత్తరరామ చరిత్ర’, ‘మహావీర చరిత్ర’, ‘మాలతీమాధవ’ నాటకాలు రాశాడు.

* హర్షుడు తన ఆదాయంలో 1/4 వంతు విద్యాభివృద్ధికి ఖర్చు చేసేవాడు. బౌద్ధవిహారాలు, హిందూ గురుకులాల్లో విద్యాబోధన జరిగేది. 

* లౌకిక విద్య బోధించేవారు. జైన, బౌద్ధ, హిందూ గ్రంథాలు; తర్కం, వ్యాకరణం, గణితం, ఖగోళ, వైద్యశాస్త్రాలను బోధించేవారు. 

* ఆచార్య నాగార్జునుడి ‘సుహృల్లేఖ’ గ్రంథం విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేది. తాళపత్ర గ్రంథాలుండేవి. 

* హర్షుడి కాలంలో నలందా, వల్లభి, తక్షశిల, ఉజ్జయిని ప్రముఖ విద్యాపీఠాలు. ఈ కేంద్రాల్లో విద్యను అభ్యసించడానికి దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఈ పీఠాల్లో ప్రవేశాలకు పోటీపరీక్షలు నిర్వహించేవారు.


నలందా విశ్వవిద్యాలయం 

* నలందా విశ్వవిద్యాలయాన్ని బౌద్ధులు నిర్వహించేవారు. క్రీ.పూ.5వ శతాబ్దంలో గుప్తరాజైన మొదటి కుమారగుప్తుడు దీన్ని స్థాపించాడు. హర్షుడు దీనికి అనేక దానాలు ఇచ్చాడు. హర్షుడి కాలంలో దీనికి ‘శిలభద్రుడు’ ప్రధానాచార్యుడిగా( vice cancellor) ఉండేవాడు. చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ నలందలో బౌద్ధమతానికి చెందిన ‘యోగాచార’ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి, దీనిపై ‘సిద్ధి’ అనే గ్రంథాన్ని రచించాడు. ఆ సమయంలో నలందలో 1500 మంది ఉపాధ్యాయులు, 10 వేల మంది విద్యార్థులు ఉన్నారని హుయాన్‌త్సాంగ్‌ పేర్కొన్నాడు. 

* చైనా, టిబెట్, జావా, సింహళ రాజులు కూడా దీని పోషణకు గ్రామాలు దానం చేశారు. నలందలో ‘ధర్మగంజ్‌’ అనే గ్రంథాలయం ఉండేది. ఇందులో కొన్ని వేల గ్రంథాలు ఉండేవి. 

* నలందలో 8 విహారాలు, ఒక సంఘారామం, ప్రకారగోడ, మామిడితోటలు, జలాశయాలు ఉండేవి. ఇందులో తర్క, ఖగోళ పరిశోధనలు జరిగేవి. 1 : 6 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండేవారు. 

* మూల మాధ్యమిక గ్రంథానికి భాష్యమైన ‘ప్రసన్నపద’ను రాసిన ‘చంద్రకీర్తి’ ఇందులో మఠాధికారి.

వల్లభి విశ్వవిద్యాలయం: 

* సౌరాష్ట్రలో నలందకు దీటుగా మౌఖరీ వంశస్థులు ‘వల్లభి’ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇక్కడ 6000 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండేవారు. ఆ కాలంలో దీనికి స్థిరమతి, గుణమతి అధికారులుగా ఉన్నారు. అన్ని మతాల వారు ఇందులో విద్యను అభ్యసించేవారు. దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు.

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసన ఉల్లంఘన ఉద్యమం - 2

విముక్తి కాంక్ష‌ను ర‌గిలించిన పోరాటం!

  అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, ఆస్తుల స్వాధీనాలు, అన్యాయమైన ఆంక్షలు, అమానుష కాల్పుల మధ్య అత్యంత కఠినంగా ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రబలమైన ప్రజల జాతీయవాద శక్తికి తల వంచాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఒప్పందం కుదుర్చుకొని, సమావేశాలకు మహాత్ముడిని స్వాగతించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే శాసనోల్లంఘన ఉద్యమం. తర్వాతి దశలో పలు కారణాలతో బలహీన పడినప్పటికీ, పరాయి పాలన నుంచి విముక్తి పొంది తీరాలనే కాంక్షను బలంగా ప్రజల్లో రగిలించింది. పోరాటాల కష్టాలను తట్టుకొని నిలబడగలిగే సహనాన్ని వారికి సమకూర్చింది. ఈ పరిణామాలను, వాటి ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. ప్రజాక్షేమం దృష్ట్యా 11 కనీస చర్యలను ప్రకటించి, ప్రభుత్వం వాటికి సమ్మతించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అప్పటి వైస్రాయ్‌ (రాజప్రతినిధి) ఆ డిమాండ్లలో వేటికీ స్పందించకపోవడంతో శాసనోల్లంఘనకు ఉపక్రమించారు. ఉప్పుపై పన్ను శాసనాన్ని తొలుత ఉల్లంఘించాలని నిర్ణయించారు. 1930, మార్చి 12న 78 మంది సుశిక్షితులైన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరిన గాంధీజీ గుజరాత్‌ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి ఏప్రిల్‌ 6న చేరుకున్నారు. అక్కడ ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక యాత్రలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎర్నేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాంధీజీ దండి యాత్రకు దారి పొడవునా జనసందోహం జయజయధ్వానాలతో మద్దతు తెలిపారు. ప్రజల్లో స్వాతంత్య్ర దీక్ష వెల్లివిరిసింది. 

  ఉద్యమంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను గాంధీÅజీ నిర్దేశించారు. అవన్నీ అహింసా పద్ధతిలోనే జరగాలన్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం ఉప్పు సత్యాగ్రహం, చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేయడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ-ముస్లిం ఐక్యత, పన్నుల చెల్లింపు నిరాకరణ, అంటరానితనం నిర్మూలనను పాటించాలని సూచించారు. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. ఆ తర్వాత ఉద్యమానికి అబ్బాస్‌ థ్యాబ్జి, సరోజినీ నాయుడు వరుసగా నాయకత్వం వహించారు. సరోజినీ నాయుడు నాయకత్వంలో మే 21న సత్యాగ్రహులు ప్రభుత్వ ఉప్పు డిపోపై దాడి చేశారు.

ఉద్యమ వ్యాప్తి: శాసనోల్లంఘన ఉద్యమం దేశమంతా త్వరగా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు, శ్రామికులు, రైతులు ముఖ్యంగా మహిళలు విశేషంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిచోటా హర్తాళ్లు, విదేశీ వస్త్ర బహిష్కరణ, పన్నుల నిరాకరణ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. చక్రవర్తి రాజగోపాలాచారి తంజావూర్‌ తీరంలో తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు; మలబారు తీరంలో కెల్లప్పస్‌ కాలికట్‌ నుంచి పయన్నూర్‌ వరకు సత్యాగ్రహులతో పాదయాత్ర చేసి, ఉప్పు తయారుచేసి శాసనాన్ని ఉల్లంఘించారు. వాయవ్య ప్రాంతంలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ ‘ఖుదాయి కిద్‌మత్‌గార్‌’ అనే ప్రతిఘటన సంస్థను స్థాపించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంస్థ సభ్యులను ప్రజలు ‘రెడ్‌ షర్ట్స్‌’ అనేవారు. నాగాలాండ్‌కు చెందిన రాణి గైడెన్‌ అనే ధీర వనిత 13 ఏళ్ల ప్రాయంలోనే గాంధీజీ పిలుపునకు స్పందించి, విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్ష అనుభవించింది.

ఆంధ్రాలో ఉద్యమం: ఆంధ్ర ప్రాంతంలో శాసనోల్లంఘన ఉద్యమ బాధ్యతలను కాంగ్రెస్‌ కొండా వెంకటప్పయ్యకు అప్పగించింది. ఆయన ప్రతి జిల్లాలో నాయకుడిని నియమించి, శిబిరం ఏర్పాటు చేసి, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య; గుంటూరు జిల్లాలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీబాయమ్మ; గోదావరి జిల్లాల్లో బులుసు సాంబమూర్తి, విశాఖ జిల్లాలో తెన్నేటి విశ్వనాథం, నెల్లూరు జిల్లాలో బెజవాడ గోపాలరెడ్డి, రాయలసీమలో కల్లూరి సుబ్బారావు, మద్రాసు నగరంలో టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు తదితర నాయకులు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేశారు.

ప్రభుత్వ వైఖరి: ఉద్యమకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. లాఠీఛార్జీలు, అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, నిరాయుధులైన ఉద్యమకారులపై కాల్పులు నిత్యకృత్యం అయ్యాయి. కాంగ్రెస్‌ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు. జాతీయవాద పత్రికలపై ఆంక్షలు విధించారు. 1930 చివరి నాటికి దేశవ్యాప్తంగా లక్షల మంది నిర్బంధంలో ఉన్నారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు: ఈలోగా బ్రిటన్‌లో సైమన్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భవిష్యత్తులో చేపట్టబోయే రాజ్యాంగ సంస్కరణల గురించి భారత నాయకులతో చర్చించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసింది. 1930, నవంబరు 12న నాటి బ్రిటిష్‌ చక్రవర్తి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పార్టీల నుంచి 16 మంది, భారత రాష్ట్రాల నుంచి 16 మంది, బ్రిటిష్‌ ఇండియా నుంచి 57 మంది వివిధ రాజకీయ పక్షాలకు/సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ బహిష్కరించింది. దాంతో రాజకీయ సంస్కరణల విషయంలో ఈ సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. భారతదేశంలో అత్యధిక ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ పాల్గొనని ఆ సమావేశం నిష్ప్రయోజనమని భావించింది. 1931, జనవరి 19న సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది.

గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక: కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రహించింది. తేజ్‌బహదూర్‌ సప్రూ, డాక్టర్‌ ఎం.ఆర్‌.జయకర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలకు రాజీ కుదిరింది. దీని ఫలితంగా గాంధీతో సహా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ విడుదల చేశారు. 1931, మార్చి 5న వైస్రాయ్‌ ఇర్విన్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది.

ముఖ్యాంశాలు: * హింసకు బాధ్యులైన వారిని తప్ప, మిగతా రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు. జప్తు చేసిన వారి ఆస్తులు పునరుద్ధరిస్తారు. 

* సారాయి, నల్లమందు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ప్రశాంతంగా పికెటింగ్‌కు, నిబంధనలకు లోబడి ఉప్పు తయారీకి అనుమతిస్తారు. 

* కాంగ్రెస్‌ కూడా తన వంతుగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 1931, మార్చిలో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం దీన్ని ఆమోదించింది.

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. కాంగ్రెస్‌ ప్రతినిధిగా మహాత్మాగాంధీ పాల్గొన్నారు. జాతీయవాదుల ప్రధాన డిమాండ్లను, తక్షణ అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) ఇచ్చే అంశాన్ని ఈ సమావేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విస్మరించి అజెండాను పక్కదారి పట్టించింది. భారతదేశ రాజకీయ సంస్కరణల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గ్రహించిన గాంధీ స్వదేశానికి తిరిగివచ్చారు. వచ్చీ రావడంతోనే రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిష్ప్రయోజనమైందని ప్రకటించారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరించారు.

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: ఇది 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సాధించేదేమి ఉండదని భావించి కాంగ్రెస్‌పార్టీ దీన్ని బహిష్కరించింది.  

  ఇంతలో భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ స్థానంలో లార్డ్‌ వెల్లింగ్టన్‌ నియమితులయ్యారు. ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.  ఉద్యమకారులను అణచివేసేందుకు పోలీసులు హింసాత్మక చర్యలకు దిగారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, మతతత్వ రాజకీయాలు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఐకమత్య లోపం, ప్రభుత్వ అణచివేత విధానాలతో ఉద్యమం బలహీనమైంది. కాంగ్రెస్‌ ఈ ఉద్యమాన్ని 1933, మేలో నిలిపేసింది. 1934లో అధికారికంగా ఉపసంహరించుకుంది.

ఉద్యమ ఫలితాలు: సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. భారతీయులు పరాయి పాలనను, వలసవాదుల చట్టాలను భరించే స్థితిలో ఏమాత్రం లేరని చాటింది. వాటి నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పానికి ప్రతిరూపమే శాసనోల్లంఘన ఉద్యమం. స్వరాజ్య భావన, పోరాట స్వభావం ప్రజల్లో నాటుకుపోయింది. సమాజంలోని అనేక వర్గాలతో పాటు, రైతులు, వ్యాపారులు, పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొని ఉద్యమ సామాజిక పరిధిని విస్తృతం చేశారు. ఉద్యమకారులు కేవలం బ్రిటిష్‌ చట్టాలకు సహాయ నిరాకరణ మాత్రమే కాకుండా, బ్రిటిష్‌ చట్టాలను ఉల్లంఘించి తమ స్వరాజ్య కాంక్షను విస్పష్టం చేశారు. ఈ ఉద్యమం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చింది. రాజకీయ పోరాటాల్లో బాధలు తట్టుకునే శక్తిని, సహనాన్ని భారతీయులకు అలవాటు చేసింది. తర్వాతి రోజుల్లో క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు వారిని సిద్ధం చేసింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమ చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే భారత జాతీయోద్యమ చరిత్రగా పేర్కొంటారు. 1885 నుంచి 1947 మధ్య మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులతో పాటు విప్లవవాదులు దేశ స్వాతంత్య్రం కోసం చేసిన కృషి, ఆంగ్లేయులు ఆంగ్లేయులు భార‌తీయ ఉద్య‌మాల‌ను అణ‌చివేసిన‌ తీరు, ఆంధ్రదేశంలో జరిగిన ఉద్యమాల గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
చరిత్రకారులు భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు ముఖ్యమైన యుగాలు(దశలు)గా వర్గీకరించారు.

 

అవి: 1) మితవాదయుగం (1885 - 1905)
       2) అతివాదయుగం (1905 - 1920) 
       3) గాంధీయుగం (1920 - 1947) 

 

మితవాదులు ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన విధానాల ద్వారా సుమారు ఇరవై ఏళ్లు భారత జాతీయోద్యమాన్ని నడిపారు. అతివాదులు ఆంగ్లేయుల పరుష విధానాలనే పాటిస్తూ ‘స్వరాజ్యం మా జన్మహక్కు’, దాన్ని సాధించి తీరుతామంటూ వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించారు. గాంధీజీ శాంతి, సత్యం, అహింస, పద్ధతులను అనుసరించి సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించారు.

మితవాదయుగం (1885 - 1905)

భారత జాతీయోద్యమంలోని 1885 నుంచి 1905 వరకు గల తొలిదశను మితవాదయుగంగా పేర్కొంటారు. మితవాదుల నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు విజ్ఞప్తి - ప్రార్థన - నిరసన అనే పద్ధతులను పాటించారు. భారతీయుల సమస్యలపై విజ్ఞాపనలు ఇవ్వడం, వాటిని పరిష్కరించమని ఆంగ్లేయులను ప్రార్థించడం, అమలు చేయకపోతే నిరసన తెలియజేయడం లాంటి సాధారణ పద్ధతులను అనుసరించారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారిగా, న్యాయం తెలిసినవారిగా, మిత్రులుగా భావించి, వారు మాత్రమే తమ సమస్యలను పరిష్కరిస్తారనే విశ్వాసంతో ఉండేవారు. ఈ మితవాద విధానాల వల్ల వారేమీ సాధించలేకపోయారనేది అతివాదుల విమర్శ. మితవాదయుగంలో ఎ.ఒ. హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, పి.ఆనందాచార్యులు, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా లాంటి నాయకులు ప్రధానపాత్ర పోషించారు.

మితవాదుల ఆశయాలు 

* దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య మిత్రభావాన్ని, ఐక్యతను పెంచడం, వారంతా దేశ సౌభాగ్యానికి పాటుపడేలా కృషి చేయడం.
* భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులు, విద్యావంతులు చర్చించి పరిష్కారానికి కృషి చేయడం.
* ప్రజల్లో దేశ సమైక్యతను, జాతీయతాభావాన్ని పెంపొందించడం.
* భారతీయులకు ప్రభుత్వోద్యోగాలు కల్పించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ఆంగ్లేయులను ఒప్పించడం.
* ఆంగ్లేయులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం, బ్రిటిష్‌ సామ్రాజ్యాధినేతల పట్ల కాంగ్రెస్‌ పూర్తి విశ్వాసంతో వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించడం.

మితవాదుల కోర్కెలు

* భారత శాసన సభల విస్తరణ, భారత రాజ్య కార్యదర్శి సలహామండలిని రద్దుచేయడం, భూమి శిస్తును తగ్గించడం, ప్రజాప్రతినిధి సంస్థలను నెలకొల్పడం.
* భారతీయులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం, జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడం, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన.
* విదేశాల్లో ఉన్న భారతీయులకు తగిన రక్షణ కల్పించడం, రైతులకు రుణ సౌకర్యాలను మెరుగుపరిచి వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడం.

మితవాదుల విజయాలు

1885 నుంచి 1905 మధ్య మితవాదులు భారత జాతీయోద్యమాన్ని బలపరిచారు. శాంతియుత, మితవాద పద్ధతులను అనుసరించినప్పటికీ, భారతీయుల సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. 1885లో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశంలో 72 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. 1886లో జరిగిన రెండో  సమావేశానికి సుమారు 436 మంది, 1889 నాటి మూడో సమావేశానికి 1889 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంటే మితవాదుల కృషి వల్లనే భారత జాతీయ కాంగ్రెస్‌ విస్తరించి జాతీయోద్యమం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. 1890 నాటి కాంగ్రెస్‌ సమావేశంలో కాదంబిని గంగూలీ ప్రసంగించారు (ఈమె కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌). మితవాదుల కృషి ఫలితంగానే అనేక రాజ్యాంగ, ఆర్థిక, పాలనాపరమైన సంస్కరణలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు.
 

మితవాదులు సాధించిన విజయాల్లో ముఖ్యమైనవి:
* 1886లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పబ్లిక్‌ సర్వీసు కమిషన్లను ఏర్పాటుచేసింది.
* 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
* ఇంగ్లండ్‌తో పాటు భారత్‌లో కూడా ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షలు నిర్వహించడానికి కామన్స్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు (1893). కానీ ఇది 1923 నుంచి అమల్లోకి వచ్చింది.
* మితవాదుల కృషి ఫలితంగానే భారతదేశంలో ఆంగ్ల వ్యయం తగ్గింపు విషయంపై 1897లో వెల్సీ కమిషన్‌ ఏర్పాటైంది.
* మితవాదులు తమ రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా జాతీయతా భావాన్ని పెంపొందించారు. 
కానీ అతివాదులు మిత‌వాద విధానాల‌ను వ్య‌తిరేకించేవారు. ‘సుమారు 20 ఏళ్ల పాటు ఆంగ్లేయులతో రొట్టె కోసం పోరాడి, చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని అతివాద నాయ‌కుడు లాలాలజపతి రాయ్‌ మితవాదులను విమర్శించారు.

మితవాద నాయకులు

ఎ.ఒ. హ్యూమ్‌ (1829 - 1912)
ఆంగ్లేయుడైన అలెన్‌ ఆక్టేవియన్‌ హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై సివిల్‌ అధికారిగా భారతదేశానికి వచ్చాడు. 1882లో పదవీ విరమణ చేశారు. అనంతరం 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1884లో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని స్థాపించి రిప్పన్‌ వీడ్కోలు సభలను విజయవంతంగా నిర్వహించాడు. 1884లో ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌గా మారింది. ఈ ఏడాదిలోనే భారత తంతి సమాచార సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు.  1885, డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశాన్ని బొంబాయిలో డబ్ల్యు.సి. బెనర్జీ అధ్యక్షతన నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడిగా, తొలి కార్యదర్శిగా పేరొందాడు. వాస్తవానికి ఆంగ్లేయుడైన హ్యూమ్‌ ‘రక్షణ కవాట సిద్ధాంతం’ అనుసరించి, కాంగ్రెస్‌ను స్థాపించాడని ఆధునిక భారతీయ చరిత్రకారుల అభిప్రాయం.
 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
ఈయన భారతదేశ కురువృద్ధుడి (గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా)గా పేరొందాడు. బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1853లో బాంబే అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1865లో ఇంగ్లండ్‌లో తూర్పు ఇండియా సంఘాన్ని స్థాపించి, 1866లో దాన్ని లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా మార్చాడు. కలకత్తా (1886), లాహోర్‌ (1893), కలకత్తా (1906) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1906 నాటి కలకత్తా సమావేశంలో తొలిసారిగా స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. నౌరోజీ 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌లోని కామన్స్‌ సభకు ఎన్నికైన తొలి భారతీయుడు. 1892 - 95 మధ్య బ్రిటిష్‌ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని రచించి అందులో సంపద తరలింపు సిద్ధాంతాన్ని (డ్రైన్‌ సిద్ధాంతం) తెలియజేశాడు. హోంఛార్జీల రూపంలో భారతదేశ సంపద ఇంగ్లండ్‌కు ఏ విధంగా తరలిపోతుందో వివరించాడు. ఆంగ్ల పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా అభివర్ణించాడు.
 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 ఈయన మితవాదుల నాయకుడు, గాంధీ రాజకీయ గురువు, మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరొందాడు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. గోఖలే వాస్తవంగా ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితుడయ్యాడు. 1905 నాటి బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ (భారత సేవా సంఘం)’ని స్థాపించాడు. 1912లో గాంధీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి వివక్షతా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ గోఖలేను పవిత్రమైన గంగానది లాంటి వాడని పేర్కొనగా, తిలక్‌ భారతదేశపు వజ్రంగా వ్యాఖ్యానించాడు.
* మహారాష్ట్ర మాకియవెల్లిగా నానా ఫడ్నవీస్, బెంగాల్‌ సోక్రటీస్‌గా హెన్రీ డెరోజియో పేరుగాంచారు.

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
మకుటం లేని బొంబాయి మహారాజుగా పేరొందిన మితవాది ఫిరోజ్‌షా మెహతా. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించాడు. వందేమాతర ఉద్యమకాలంలో లాల్‌ - బాల్‌ - పాల్‌ విధానాలను వ్యతిరేకించాడు. 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు నాయకత్వం వహించాడు.
 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
ఇండియన్‌ బర్క్, సిల్వర్‌ టంగ్‌ ఆరేటర్‌గా పేరొందిన మితవాది సురేంద్రనాథ్‌ బెనర్జీ. 1876 జులై 26న ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను (కలకత్తా) స్థాపించాడు. డబ్ల్యు.సి. బెనర్జీ స్థాపించిన ‘బెంగాలీ’ పత్రికను నడిపాడు. హ్యూమ్‌ కంటే ముందే ఒక జాతీయ సంస్థ స్థాపనకు కృషిచేశాడు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశాలను నిర్వహించాడు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమం చేసి జైలుకు వెళ్లాడు. పూనా (1895), అహ్మదాబాద్‌ (1902) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమకాలంలో అతివాదులతో కలిసి పనిచేశాడు. సురేంద్రనాథ్‌ బెనర్జీ సేవలను హెన్రీ కాటన్, విలియం వెడ్డర్‌ బర్న్‌ లాంటి ఆంగ్లేయులు సైతం కొనియాడారు.  ఈయన ‘ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

ఆంగ్ల సామ్రాజ్య విస్తరణ విధానాలు, వారు సాధించిన రాజకీయ ఐక్యత, ఆంగ్ల పాలన, ఆంగ్ల విద్య, ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన, ఆంగ్లేయులు అనుసరించిన జాతి, వర్ణ వివక్షా విధానాలు, ఆర్థిక దోపిడీ విధానాలతోపాటు సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు, వార్తాపత్రికలు, సాహిత్య రచనలు, ఇల్బర్ట్‌ బిల్లు వివాదం లాంటి సంఘటనలు భారతీయుల్లో జాతీయోద్యమ భావాలను పెంపొందించాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా దేశాన్ని ఆక్రమించడానికి అనేక సామ్రాజ్యవాద విధానాలను అనుసరించారు.  రాజ్యాలను కోల్పోయిన భారతీయ పాలకులు, ఆయా రాజ్యాల్లో ఉపాధి పోగొట్టుకున్న ఉద్యోగులు ఆంగ్లేయుల పట్ల ద్వేష భావాన్ని పెంచుకున్నారు. అనేక భూభాగాలు, రాజ్యాలుగా విడిపోయి ఉన్న భారతదేశాన్ని ఆంగ్లేయులు ఒకే పాలన కిందికి తెచ్చి, ఐక్యతా భావాన్ని పెంచడానికి తోడ్పడ్డారు. ఆంగ్లేయులు కల్పించిన ఆధునిక రవాణా సౌకర్యాలు కూడా దేశంలోని ప్రజల మధ్య పరస్పర అవగాహనకు ఉపకరించాయి. 

1835లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య భారతీయుల్లో జాతీయ చైతన్యం మరింత పెరగడానికి దోహదం చేసింది. ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయులు మిగిలిన భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం లాంటి అంశాలను తెలియజేశారు.
 

19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తిని, జాతీయవాద స్ఫూర్తిని పెంచాయి. భారతదేశం భారతీయులకే అని స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు ఆధునిక జాతీయతకు పితామహుడిగా పేరుగాంచారు. వార్తాపత్రికలు ఆంగ్లేయుల జాతి వివక్ష విధానాలను, ఆర్థిక దోపిడీ విధానాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేసి జాతీయ చైతన్యాన్ని పెంచాయి. ముఖ్యంగా లార్డ్‌ రిప్పన్‌ కాలంలో ప్రవేశపెట్టిన ఇల్బర్ట్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేసిన ఉద్యమం భారతీయుల్లో జాతీయ భావాలను మరింత పెంచి, 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు దారితీసింది. భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రగా పేర్కొంటారు.
 

తొలి రాజకీయ సంస్థలు

ఆధునిక భారతదేశ చరిత్రలో రాజకీయ సంస్థల ఏర్పాటుకు కారకులు కూడా ఆంగ్లేయులే. బెంగాల్‌ రాష్ట్రంలో 1828లో హెన్రీ డిరోజియో నాయకత్వంలో 'అకడమిక్‌ అసోసియేషన్‌' అనే సంస్థ ఏర్పడింది. డిరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా అభివర్ణిస్తారు.  1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘం ఏర్పాటైంది. భారతదేశ చరిత్రలో దీన్ని తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. అనంతరం 1843లో బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. 1851లో బెంగాల్‌ భూస్వాముల సంఘం, బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘం కలిసి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి. దీని తొలి అధ్యక్షుడిగా రాధాకాంత్‌దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ పని చేశారు. 1852 లో దాదాభాయ్‌ నౌరోజీ, పర్థూన్‌జీ జగన్నాథ్‌ లాంటి వారు బాంబే అసోసియేషన్‌ను స్థాపించారు. 1853లో గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
 

దాదాభాయ్‌ నౌరోజీ 1865లో లండన్‌ కేంద్రంగా 'లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌'ను ప్రారంభించారు. ఇదే తర్వాతి కాలంలో ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌గా మారింది. 1870లో జి.వి. జోషి, చిప్లూంకర్‌ పూనా సార్వజనిక సభను స్థాపించారు. దీని తొలి సమావేశం 1871లో ఎం.జి. రనడే అధ్యక్షతన జరిగింది. (పూనా సార్వజనిక సభ స్థాపకుడిగా ఈయన్ను పేర్కొంటారు). 1875లో శిశిర్‌ కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో ఇండియన్‌ లీగ్‌ (బెంగాల్‌) ఏర్పడింది. 1876 జులై 26న సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలసి ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచారి, పి. ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి వల్ల 1884లో మద్రాస్‌ మహాజనసభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, కె.టి. తెలాంగ్‌ లాంటి వారు బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. అయితే ఈ తొలి తరం రాజకీయ సంస్థలన్నీ ఆయా ప్రాంతాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి.
 

 భారతదేశంలో జాతీయోద్యమ భావాలు, ఆందోళనలు రాజా రామ్మోహన్‌రాయ్‌తో ప్రారంభమయ్యాయని ఆధునిక చరిత్రకారులు పేర్కొంటారు. స్వామి వివేకానంద బోధనలు యువకుల్లో దేశభక్తిని పెంపొందించాయి. సురేంద్రనాథ్‌ బెనర్జీ తొలిసారిగా ఒక అఖిల భారత రాజకీయ సంస్థను స్థాపించడానికి కృషి చేశారు. ఇల్బర్ట్‌ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మరచిపోరని థాంప్సన్, గారట్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 1867లోనే డబ్ల్యూసీ బెనర్జీ తన ఇంగ్లండ్‌ ఉపన్యాసంలో ప్రాతినిధ్య ప్రభుత్వ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. క్రిస్టోదాస్‌ పాల్‌ తన హిందూ పేట్రియాట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో ‘‘ఆంగ్లేయులు ఆఫ్రికా, ఆసియా వలసల్లో రాజ్యాంగబద్ధ స్వపరిపాలన ప్రవేశపెట్టి, భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు’’ అని ప్రశ్నించారు.
 

లిట్టన్‌ ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు పంపిన తీర్మానాన్ని గ్లాడ్‌స్టన్‌ (నాటి ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత) కామన్స్‌ సభలో ప్రవేశపెట్టాడు. భారతీయులకు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల అర్హత వయసును తగ్గించడంపై లాల్‌ మోహన్‌ ఘోష్‌ కామన్స్‌ సభలో మాట్లాడాడు. ఇల్బర్ట్‌ బిల్లు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నాటి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేసినందుకు సురేంద్రనాథ్‌ బెనర్జీకి జైలుశిక్ష విధించారు. ఈ విధంగా తొలితరం నాయకులు జాతీయోద్యమ భావాలను ప్రచారం చేయడం ద్వారా భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని పెంపొందింపజేశారు. 1883లో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తొలి మహాసభను కలకత్తాలో నిర్వహించారు. 
 

భారత జాతీయ కాంగ్రెస్‌

1885 డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ అనే ఆంగ్లేయుడి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటైంది. దీని తొలి సమావేశం బొంబాయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పూనాలో జరపాలని భావించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో బొంబాయిలో నిర్వహించారు. విద్యావంతులైన భారతీయులతోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వచ్చే ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో హ్యూమ్ రక్షణ కవాటా సిద్ధాంతాన్ని అనుసరించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన నాటి వైస్రాయ్‌ లార్డ్‌ డఫ్రిన్‌ ఈ‌ చర్యను కొనియాడాడు. కానీ తర్వాతి కాలంలో కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాలవారి సంస్థ (మైక్రోస్కోపిక్‌ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్‌) అంటూ విమర్శించాడు. భారతదేశంపై రష్యా దండెత్తుతుందనే  భయంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని ఛటర్జీ లాంటి పండితులు పేర్కొన్నారు. ‘భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం’ అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నారు.
 

1886లో ఐఎన్‌సీ రెండో సమావేశం కలకత్తాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సుమారు 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1887లో మద్రాస్‌లో బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగిన మూడో సమావేశానికి సుమారు 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్‌ త్యాబ్జీ. నాలుగో సమావేశం 1888లో జార్జియూలె అధ్యక్షతన అలహాబాద్‌లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడు జార్జియూలె. 5వ సమావేశం 1889లో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. ప్రముఖ ఆంగ్లేయ ప్రతినిధి చార్లెస్‌బ్రాడ్‌లా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇతడిని ఇంగ్లండ్‌లో ‘భారత ప్రతినిధి’ సభ్యుడిగా పేర్కొంటారు. కాంగ్రెస్‌ కోరికలను నెరవేర్చడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లేనని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. విలియం వెడ్డర్‌బ‌ర్న్‌ అధ్యక్షతన ఇంగ్లండ్‌లో ఏర్పడిన ‘బ్రిటిష్‌ కమిటీ’కి విలియం డిగ్బీని కార్యదర్శిగా నియమించారు. దాదాభాయ్‌ నౌరోజీని ఇంగ్లండ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచారకర్తగా నియమించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వదేశంలో, ఇంగ్లండ్‌లో భారత జాతీయోద్యమ అభివృద్ధికి కృషి చేసింది. నౌరోజీ ఉద్యమ ప్రచారానికి ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు. కానీ తర్వాతి కాలంలో ఆంగ్లేయులు కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా లార్డ్‌ కర్జన్‌ ‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే నా ప్రధాన ఆశయం’ అని పేర్కొన్నాడు.     
 

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి.ఆనందాచార్యులు. 1891 నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంట్‌. ఈమె 1917 కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు.  
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. గాంధీజీ తన జీవితకాలంలో ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం సమావేశం గాంధీ అధ్యక్షతన జరిగింది. 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జె.బి.కృపలానీ.
 

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి: 
 

       1) మితవాద యుగం (1885 - 1905) 
       2) అతివాద యుగం (1905 - 1920) 
       3) గాంధీ యుగం (1920 - 1947)

 

మితవాద యుగం 
 

భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి దశను మితవాద యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో భారతీయులు మితవాద విధానాలను అనుసరించారు. మితవాదులకు నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు ప్రార్థన - విజ్ఞప్తి - నిరసన (విజ్ఞప్తి, ప్రార్థన, నిరసన - సరైన క్రమంగా భావించాలి) అనే విధానాలను అనుసరించారు.
 

భారతీయులకు ఉన్నతోద్యోగాలు, శాసనసభల్లో ప్రశ్నించే హక్కు కల్పించాలని, శాసనసభలను విస్తృతపరచాలని, సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును పెంచాలని కోరారు. ఇంగ్లండ్‌తోపాటు భారతదేశంలో కూడా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు నిర్వహించాలని, భారతదేశంలో ఆంగ్లేయుల సైనిక వ్యయం,  భూమి శిస్తు, ఇతర పన్నులను తగ్గించాలని మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్‌ ద్వారా ఆంగ్లేయులను కోరారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారుగా, తమ స్నేహితులుగా భావించేవారు. ఆంగ్లేయులకు న్యాయం తెలుసని, వారు మాత్రమే  సమస్యలను పరిష్కరించగలరని విశ్వసించేవారు.
 

ఆంగ్లేయులు ప్రారంభంలో మితవాదుల కోర్కెలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించేవారు. దాంతో అతివాదులు మితవాదులను తీవ్రంగా విమర్శించేవారు. ‘ఇరవై సంవత్సరాలపాటు రొట్టె కోసం పోరాడిన మితవాదులు చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని లాలాలజపతిరాయ్‌ మితవాదులను విమర్శించారు. అయితే మితవాదులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పలేం. విద్యావంతులైన భారతీయులు ఇరవై సంవత్సరాలపాటు అనేక మందిని భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరేలా కృషిచేశారు. తొలి కాంగ్రెస్‌ సమావేశానికి కేవలం 72 మంది ప్రతినిధులు హాజరైతే 1888 నాటి నాలుగో కాంగ్రెస్‌ సమావేశానికి 1,888 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మితవాదుల కృషి ఫలితంగానే ఆంగ్ల ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. 1892 భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా భారతదేశంలో పరోక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చ జరపడానికి శాసనసభ్యులను అనుమతించారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 19 నుంచి 21 సంవత్సరాలకు పెంచారు. 1886లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్, ఇండియాలలో ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షల నిర్వహణకు అనుమతించారు.
 

మితవాదుల కోరిక మేరకే భారతదేశంలో సైనిక వ్యయం తగ్గింపు విషయంలో సూచనలు చేయడానికి ఆంగ్ల ప్రభుత్వం 1895లో వెల్సీ కమిషన్‌ను నియమించింది. ఈ విధంగా మితవాదులు 1885 నుంచి 1905 మధ్య సుమారు 20 సంవత్సరాల పాటు జాతీయోద్యమ అభివృద్ధికి కృషిచేశారు.
 

ఎ.ఒ.హ్యూమ్‌ (1829 - 1912) 
 

హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షలు రాసి ఒక సివిల్‌ సర్వెంట్‌గా భారతదేశానికి వచ్చాడు. 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1885లో భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించాడు. లార్డ్‌ రిప్పన్‌ పదవీ విరమణ సమయంలో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, రిప్పన్‌కు ఘనంగా వీడ్కోలు సభలను నిర్వహించాడు. హ్యూమ్‌ రక్షణ కవాట సిద్ధాంతాన్ని అనుసరించి 1885 డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. వాస్తవానికి 1884లోనే హ్యూమ్‌ ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ అనే సంస్థను స్థాపించాడు. దానికే 1885లో దాదాభాయ్‌ నౌరోజీ కాంగ్రెస్‌ అనే పేరును సూచించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన తెలుగు అకాడమీ పుస్తకంలో కాంగ్రెస్‌ అనే పేరును సూచించింది డబ్ల్యూసీ బెనర్జీగా పేర్కొన్నారు.) ఎ.ఒ.హ్యూమ్‌ ‘భారత జాతీయ కాంగ్రెస్‌ పితామహుడి’గా గుర్తింపు పొందాడు.
 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
 

భారతదేశ కురు వృద్ధుడిగా (Grand Oldman of India) పేరొందిన ప్రముఖ మితవాది దాదాభాయ్‌ నౌరోజీ. ఈయన బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1865లో లండన్‌ ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. అదే తర్వాతి సంవత్సరంలో ‘బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది.
 

1886 నాటి రెండో కాంగ్రెస్‌ సమావేశానికి (కలకత్తా), 1893 (లాహోర్‌), 1906 (కలకత్తా) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి కామన్స్‌ సభకు ఎన్నికై, ఇంగ్లండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడిగా కీర్తి పొందారు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని వెలువరించారు. ఆ గ్రంథంలోనే డ్రైన్‌ సిద్ధాంతాన్ని (సంపద తరలింపు సిద్ధాంతం) వివరించారు. ఆంగ్లేయులు భారతదేశ సంపదను ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలించుకుపోతున్నారో తెలిపారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన స్వదేశీ తీర్మానం చేశారు. వెల్సీ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. బ్రిటిష్‌ పాలనను ‘భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర’గా అభివర్ణించారు. బ్రిటిష్‌ నియంతృత్వంలో శాంతి భద్రతల నడుమ మనిషి ప్రశాంతంగా ఆకలిని అనుభవిస్తున్నాడని, ప్రశాంతంగా సర్వనాశనమవుతున్నాడని నౌరోజీ పేర్కొన్నారు. ఈయనే భారతదేశంలో తొలిసారిగా జాతీయాదాయాన్ని అంచనా వేశారు.
 

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
 

మకుటంలేని బొంబాయి మహారాజు, బొంబాయి సింహంగా ప్రసిద్ధి చెందిన మితవాద నాయకుడు ఫిరోజ్‌షా మెహతా. ఈయన నాయకత్వంలోనే 1884లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ ఏర్పాటైంది. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించారు. మితవాదులు 1892 చట్టాన్ని ఆంగ్లేయులు నవ్వుతూ చేసిన మోసంగా అభివర్ణించారు. వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదత్రయంగా పేరొందిన లాల్‌-బాల్‌-పాల్‌ విధానాలను ఫిరోజ్‌షా మెహతా వ్యతిరేకించారు. ముఖ్యంగా 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు ముఖ్య నాయుకుడిగా ఉన్నది ఫిరోజ్‌షా మెహతానే.
 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
 

ఇండియన్‌ బర్క్, సిల్వర్‌టంగ్‌ ఆరేటర్‌ లాంటి బిరుదులను పొందిన ప్రముఖ మితవాద నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ. ఈయన 1869లో ఐసీఎస్‌ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. 1876, జులై 26న ఆనంద్‌ మోహన్‌బోస్‌తో కలిసి కలకత్తాలో ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను స్థాపించారు. డబ్ల్యూ.సి. బెనర్జీ స్థాపించిన బెంగాలీ పత్రికను ఈయన నిర్వహించారు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమించి, జైలుకు వెళ్లారు. 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటనను తర్వాతి కాలంలో ‘భారతదేశంలో మానవ హక్కుల ప్రకటన (మాగ్నాకార్ట్‌)’గా వ్యాఖ్యానించారు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 1895 (పూనా), 1902 (అహ్మదాబాద్‌) భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదులతో చేయి కలిపారు. బెంగాల్‌ విభజన అమల్లోకి వచ్చిన 1905, అక్టోబరు 16న కలకత్తాలోని బహిరంగ సభల్లో ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ప్రసంగించారు. ఈయన వ్యక్తిత్వాన్ని హెన్రీకాటన్, విలియం వెడ్డర్‌బర్న్‌ లాంటి ఆంగ్లేయులు కూడా కొనియాడారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘ఎ నేషన్‌ ఇన్‌ ద మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు.
 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 

మితవాద వర్గానికి ముఖ్య నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. ఈయనను గాంధీజీకి రాజకీయ గురువుగా పేర్కొంటారు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేశారు. గోఖలే ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ రాజకీయంగా ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితమయ్యారు. ఈయన 1905లో బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ’ అనే సంస్థను స్థాపించారు.
 

గోరక్షక ఉద్యమాన్ని కూడా నడిపారు. ‘మహారాష్ట్ర సోక్రటీస్‌’గా పేరొందారు. 1912 లో గాంధీజీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి జాతి వివక్షా విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. గోఖలేను పవిత్రమైన గంగానది లాంటివారని గాంధీజీ, భారతదేశపు వజ్రం లాంటివారని బాలగంగాధర తిలక్‌ పేర్కొన్నారు. గోఖలేను ఆధునిక భారతదేశ ప్రథమ రాజనీతిజ్ఞుడిగా కె.ఎం. ఫణిక్కర్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు. మితవాదులు సుమారు 20 సంవత్సరాల పాటు గోఖలే నాయకత్వంలోనే ఆంగ్లేయులతో పోరాడారు.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం ఆవిర్భావం - విస్తరణ

సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఐరోపావారు క్రమంగా భారతదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని వలస, వాణిజ్య, సామ్రాజ్యవాదంతో వ్యవహరించారు. ఈ క్రమంలో ఆంగ్లేయులు మిగతా ఐరోపా దేశాలను అధిగమించి భారతదేశాన్ని ఆక్రమించుకుని, తమ ప్రధాన వలస రాజ్యంగా మార్చుకున్నారు. 1757 నాటి ప్లాసీ యుద్ధం వారి రాజకీయ అధికారానికి పునాది వేసింది. 1764 నాటి బక్సార్‌ యుద్ధానంతరం ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. 1773 నాటి రెగ్యులేంటిగ్‌ చట్టం ద్వారా ఆంగ్లేయులు పాలనా సంస్కరణలను ప్రారంభించారు. తమ దేశ పాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక దోపిడీ విధానాల ద్వారా భారతదేశ వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలను నాశనం చేశారు. వారు అనుసరించిన బలవంత మత మార్పిడి, జాత్యాహంకార విధానాలతో పాటు వారు ప్రవేశపెట్టిన సాంఘిక సంస్కరణలు భారతీయులకు ఆంగ్లేయుల పట్ల వ్యతిరేక భావాలు రావడానికి కారణమయ్యాయి. వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యే వారిని భారతదేశం నుంచి పంపించడానికి కారణమైంది.


కారణాలురాజకీయ ఐక్యత

ఆంగ్లేయులు రాకముందు భారతదేశం మొఘలు చక్రవర్తుల పాలనలో ఉండేది. వారి బలహీనతల వల్ల దేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. కానీ ఆంగ్లేయుల యుద్ధాలు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి లాంటి విధానాలు; బిరుదులు, భరణాలను రద్దు చేయడం; దుష్పరిపాలన నెపంతో రాజ్యాలను ఆక్రమించడం ద్వారా మొత్తం భారతదేశాన్ని ఒకే పాలన కిందకు తెచ్చారు. ఇది భారతీయుల్లో రాజకీయ ఐక్యతకు కారణమై, తామంతా ఒకటే అనే భావన తలెత్తి జాతీయోద్యమం ఆవిర్భవించడానికి దోహదపడింది. ఆంగ్లేయులు మొదట 1740 - 1763 మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాల ద్వారా ఫ్రెంచివారిని ఓడించి, కర్ణాటక, హైదరాబాదు రాజ్యాలపై ఆధిపత్యం సాధించారు. ప్లాసీ (1757), బక్సార్‌ (1764) యుద్ధాల తర్వాత బెంగాల్‌పై పట్టు సాధించారు. మైసూర్‌ యుద్ధాల ద్వారా టిప్పుసుల్తాన్‌ రాజ్యాన్ని, మరాఠా యుద్ధాల ద్వారా మహారాష్ట్రుల స్వరాజ్యాన్ని, సిక్కు యుద్ధాల ద్వారా సిక్కు రాజ్యాన్ని జయించి దేశంలో రాజకీయ ఐక్యత తెచ్చారు. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి ద్వారా, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మిగిలిన రాజ్యాలను జయించి మొత్తం దేశాన్ని ఏకపాలన కిందకు తెచ్చారు. ఇదే జాతీయోద్యమ భావాలు రావడానికి దోహదపడింది.
బ్రిటిష్‌వారు రావడానికి ముందే భారతదేశంలో జాతీయతావాదం ఉన్నప్పటికీ, వారి కాలంలోనే అది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ జాతీయతా భావమే భారత స్వాతంత్య్ర పోరాటానికి దారితీసింది.


ఆర్థిక దోపిడీ విధానాలు

  ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించి, వలస రాజ్యంగా మార్చుకుని దేశ సంపదను దోపిడీ చేశారు. బ్రిటిష్‌ పాలన కారణంగా భారతదేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. వారు భారత వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ వాణిజ్యీకరణ విధానాలు, తీన్‌కథియా పద్ధతులు, భూమిశిస్తు విధానాలు భారత రైతాంగాన్ని దోపిడీ చేయడానికి కారణమయ్యాయి. ప్రభుత్వం వడ్డీ వ్యాపారులకు, వర్తకులకు మాత్రమే మేలు చేకూరుస్తుందనే వాస్తవాన్ని గ్రహించిన రైతాంగం ఆంగ్ల వ్యతిరేక భావాలను పెంచుకుంది. ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య, వలసవాద విధానాలు భారత వాణిజ్య రంగాన్ని దెబ్బతీశాయి. పారిశ్రామిక విప్లవం కారణంగా మన దేశంలో చేనేత, కుటీర, చిన్న తరహా పరిశ్రమలు నాశనమయ్యాయి. ఫలితంగా దేశంలోని కార్మికులు, వృత్తి పనివారు తమ దైన్య స్థితికి ఆంగ్లేయులే కారణమని తెలుసుకొని జాతీయతా భావాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా ఆధునిక విజ్ఞానాన్ని పొందిన భారతీయ విద్యావంతులు ఆంగ్లేయుల ఆర్థిక, దోపిడీ విధానాలను ప్రజలకు వివరించి వారిని జాతీయోద్యమం వైపు నడిపించారు. దాదాభాయ్‌ నౌరోజీ తన డ్రైన్‌ సిద్ధాంతం (సంపద తరలింపు) ద్వారా భారతదేశ సంపద హోంఛార్జీల రూపంలో ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలిపోతుందో వివరించాడు. రమేష్‌చంద్ర దత్‌ (ఆర్‌.సి.దత్‌) ఆంగ్లేయులు అనుసరించిన వాణిజ్య ప్రధాన దశ, స్వేచ్ఛా వాణిజ్య దశ, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం లాంటి వలసవాద దశల గురించి ప్రచారం చేశాడు. ఫలితంగా భారతీయులు తమ పేదరికానికి, నిరుద్యోగానికి ఆంగ్లేయులే కారకులని గ్రహించి వారిపై పోరాటానికి సిద్ధపడ్డారు.


ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన

  ఆంగ్లేయులు తమ ప్రయోజనం కోసమే భారతదేశంలో ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించారు. 1853లో డల్హౌసీ కాలంలో భారతదేశంలో తొలి రైల్వేలైన్‌ వేశారు. తంతి తపాలా వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ముడి సరుకులను ప్రధాన పట్టణాలకు, తర్వాత ఓడరేవులకు అక్కడి నుంచి ఇంగ్లండ్‌కు తరలించడానికి రైలు, రోడ్డు, జల రవాణా మార్గాలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరగడం, ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలుసుకోవడం, సుదూర ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం జాతీయతా భావం పెరగడానికి దోహదపడింది. తంతి తపాలా వ్యవస్థల ద్వారా ప్రజలు ఒకరి సమాచారాన్ని మరొకరు తెలుసుకుని ఐక్యంగా ఉద్యమించే అవకాశం ఏర్పడింది.


ఆంగ్ల విద్య 

  మెకాలే కమిటీ సిఫారసుల మేరకు 1835లో విలియం బెంటింగ్‌ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఫలితంగా అనేకమంది భారతీయులు ఆంగ్ల విద్యను నేర్చుకుని హేతువాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం అనే ఆధునిక పాశ్చాత్య భావాలను తెలుసుకోగలిగారు. ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లో విప్లవాలు రావడానికి గల కారణాలను గ్రహించారు. భారతీయ విద్యావంతులు స్వేచ్ఛ, సమానత్వం లాంటి భావాల ప్రాధాన్యాన్ని, వాటిని పొందడానికి మనం చేయాల్సిన పోరాటం గురించి సామాన్యులకు వివరించారు.
ఫలితంగా భారతదేశంలో ఆంగ్ల విద్య కారణంగా జాతీయతా భావాలు పెరిగి స్వాతంత్య్రోద్యమం సాధ్యపడింది. ‘పాశ్చాత్య విద్య (ఆంగ్ల విద్య) ద్వారా భారతీయులు స్వపరిపాలనా వ్యవస్థల విలువను గ్రహించి, వారు మనల్ని భారతదేశం నుంచి వెళ్లగొట్టవచ్చు’ అని లయోనల్‌ స్మిత్‌ కామన్స్‌ సభ సెలక్ట్‌ కమిటీలో చెప్పిన అభ్రిపాయం నిజమైంది. విద్యావంతులందరిలో ఒకే రకమైన భావాలు, అనుభూతులు, ఆశలు, ఆదర్శాలు పెంపొందడం వల్ల జాతీయోద్యమ భావాలు అభివృద్ధి చెందాయి.


సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాల ప్రభావం

  భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణోద్యమ సంస్థలైన బ్రహ్మ, ఆర్య సమాజాలు, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజాల సంస్కర్తలైన రాజా రామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారి బోధనలు భారతీయుల్లో జాతీయతా భావాలు పెంపొందడానికి దోహదపడ్డాయి. ఫలితంగా భారతీయుల్లో దేశభక్తి, ఆత్మ విశ్వాసం లాంటివి అభివృది ్ధచెందాయి. స్వామి దయానాంద సరస్వతి ‘భారతదేశం భారతీయులకే’ అనే నినాదానిచ్చారు. స్వామి వివేకానంద తన బోధనల ద్వారా యువతలో జాతీయతా భావాలు, దేశభక్తి, హిందూమతం పట్ల అభిమానాన్ని పెంచి ‘ఆధునిక జాతీయతా పితామహుడి’గా పేరొందాడు. దివ్యజ్ఞాన సమాజం ద్వారా అనిబిసెంట్‌ రాజకీయ చైతన్యాన్ని పెంపొందింపజేశారు. అన్ని మతాలు ఒకటే అని చెప్పడం ద్వారా మత సమైక్యతను పెంచి తద్వారా జాతీయోద్యమంలో అందరూ పాల్గొనేలా చేశారు.


1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం

  1857 నాటి సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి మరో ముఖ్య కారణమైంది. ఆంగ్ల సైన్యంలో పనిచేసే భారతీయ సిపాయిలు తమపై ఆంగ్లేయులు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా 1857, మే 10న మీరట్‌లో తిరుగుబాటు ప్రారంభించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు జరిగినప్పటికీ ఆంగ్ల ప్రభుత్వం దీన్ని అతి త్వరగానే అణచివేసింది. ఈ తిరుగుబాటు వైఫల్యమే భారతీయుల్లో జాతీయతా భావాలు పెరగడానికి దోహదపడింది. ఆంగ్ల ప్రభుత్వం ఈ తిరుగుబాటు కారణంగానే ‘1858 భారత ప్రభుత్వ చట్టం’ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా లేకపోవడం వల్లే తిరుగుబాటు విఫలమైందని, భవిష్యత్తులో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమిస్తే స్వాతంత్య్రం లభిస్తుందని భారతీయులు గ్రహించారు. కాబట్టే వి.డి. సావర్కర్‌ 1857 సిపాయిల తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం’ అని పేర్కొన్నారు.

పత్రికల పాత్ర

  భారత జాతీయోద్యమ అభివృద్ధికి, వ్యాప్తికి వార్తా పత్రికలు కూడా ప్రధాన కారణమయ్యాయి. దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ఆధునిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ భావాలు ¨, చైతన్యాన్ని పెంచడానికి పత్రికలు ప్రధాన సాధనాలుగా ఉపయోగపడ్డాయి. వాస్తవానికి పత్రికల చరిత్ర కూడా ఆంగ్ల పాలనతోనే ప్రారంభమైంది. భారతదేశంలో తొలి పత్రిక బెంగాల్‌ గెజిట్‌ను 1780లో జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ ప్రారంభించాడు.
హిందూ పేట్రియాట్, ఇండియన్‌ మిర్రర్, అమృతబజార్, ది హిందూ, స్వదేశమిత్రన్, ఆంధ్రప్రకాశిక లాంటి అనేక పత్రికలు జాతీయతా భావాలను, ఆంగ్లపాలనా లోపాలను, ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీ విధానాలను ప్రజలకు తెలిపేవి. ఫలితంగా భారతీయులు జాతీయతా భావాలను పెంపొందించుకొని, స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.


ఆంగ్లేయుల జాత్యాహంకార విధానాలు:
భారతీయుల పట్ల ఆంగ్లేయులు అనుసరించిన జాత్యాహంకార ధోరణి కూడా జాతీయోద్యమ ఆవిర్భావానికి దోహదపడింది. భారతీయులు నల్లవారని, నాగరికత తెలియనివారని, వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించరాదని లార్డ్‌ కారన్‌వాలీస్‌ లాంటి ఆంగ్ల అధికారులు బహిరంగంగానే విమర్శించేవారు. భారతీయుల్ని హింసించి, చంపినప్పటికీ తెల్లవారు తప్పించుకున్న అనేక సంఘటనలను పత్రికలు తరచూ ప్రచురించేవి. భారత న్యాయమూర్తుల విషయంలో కూడా ఇలాంటి వివక్ష ఉండేది. భారతదేశంలో ఆంగ్ల న్యాయమూర్తుల న్యాయ నిర్ణయాన్ని (తీర్పును) గురించి ఆంగ్ల చరిత్రకారుడైన ట్రెవిలియన్‌ ‘న్యాయస్థానంలో ఒక ఆంగ్ల వ్యక్తి సాక్ష్యానికి, అనేక మంది భారతీయుల సాక్ష్యం కంటే ఎక్కువ విలువ ఉంది. అధర్మ, భీతిలేని, దురాశాపరుడైన ఆంగ్ల వ్యక్తి చేతుల్లో ఒక భయంకరమైన అధికారాన్ని పెట్టే పరిస్థితి ఆంగ్లేయులది’ అని 1864లోనే పేర్కొన్నాడు. భారతీయ విద్యావంతులను సైతం ఆంగ్లేయులు బహిరంగంగా అవమానపరిచేవారు. ఈ జాతి వివక్షా విధానాలను సహించలేని అనేకమంది భారతీయ యువకులు ఉగ్రవాద చర్యలకు సైతం పూనుకున్నారు.


లార్డ్‌ లిట్టన్‌ చర్యలు
 

  1876 - 80 మధ్య వైస్రాయ్‌గా పనిచేసిన లార్డ్‌ లిట్టన్‌ అనుసరించిన విధానాలు భారతీయుల్లో జాతీయతా భావం రావడానికి కారణమయ్యాయి. భారతదేశానికి దిగుమతి అయ్యే ఆంగ్లేయుల వస్త్రాలపై సుంకాలు రద్దు చేశాడు. 1878లో ఆయుధ చట్టాన్ని దేశ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టి భారతీయులు ఎలాంటి ఆయుధాలు ధరించరాదని, ప్రాంతీయ భాషల్లో పత్రికలు ప్రచురించరాదని ఆంక్షలు పెట్టాడు. సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 21 నుంచి 19 సంవత్సరాలకు తగ్గించాడు. ఈ చర్యల గురించి పేర్కొంటూ ‘లిట్టన్‌ చర్యలు నిర్లిప్తంగా ఉన్న భారతీయులను మేల్కొల్పి ప్రజల్లో చురుకు పుట్టించాయి’ అని సురేంద్రనాథ్‌ బెనర్జీ అన్నారు.


 

ఇల్బర్ట్‌ బిల్లు వివాదం

భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి, భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు తక్షణ కారణం ఇల్బర్ట్‌ బిల్లు వివాదమని చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఈ వివాదం లార్డ్‌ రిప్పన్‌ కాలంలో చోటుచేసుకుంది. భారతీయ న్యాయమూర్తులు ఐరోపా నేరస్తులను విచారించకూడదనే వివక్ష నాటి న్యాయస్థానాల్లో ఉండేది. లార్డ్‌ రిప్పన్‌ ఈ అంశంపై ఇల్బర్ట్‌ కమిటీని నియమించాడు. ఆ కమిటీ సూచన మేరకు భారతీయ న్యాయమూర్తులు కూడా ఐరోపా నేరస్థులను విచారించవచ్చని బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతదేశంలోని ఐరోపావారు ఉద్యమం చేపట్టగా, ప్రభుత్వం బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ సంఘటన భారతీయులకు కనువిప్పు కలిగించింది. కొంతమంది ఐరోపావారు ఉద్యమం చేస్తేనే ఇల్బర్ట్‌ బిల్లును రద్దు చేసినప్పుడు, భారతీయులంతా ఐక్యంగా ఉద్యమం చేసి ఆంగ్లేయులను వెళ్లగొట్టగలమని భావించి జాతీయోద్యమాన్ని ప్రారంభించారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించి మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులుగా పనిచేసి చివరగా 1947లో స్వాతంత్య్రాన్ని పొందగలిగాం.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతివాద యుగం

మితవాద నాయకులు క్రీ.శ. 1905 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. వీళ్లు రాజ్యాంగబద్దమైన విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావించి విఫలమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు డిమాండ్లను పోరాడి సాధించుకోవాలన్న ఉద్దేశంతో అతివాద యుగ ప్రారంభానికి కారకులయ్యారు.


అతివాద యుగం ఆవిర్భవానికి కారణాలు:
i) బ్రిటిష్ పరిపాలకుల ఆర్థిక దోపిడీని భారతీయులు గ్రహించారు. ఆంగ్లేయులు అవలంబించిన ఆర్థిక విధానాలతో భారతదేశంలో 1896-1900 సంవత్సరాల మధ్య తీవ్ర కరవులు సంభవించాయని అర్థం చేసుకున్నారు.
 

ii) మితవాదులు అవలంబించిన విధానాలు విఫలం కావడం, 1892లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఇండియా కౌన్సిళ్ల చట్టం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
 

iii) బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలు: జాతీయవాదాన్ని ప్రచారం చేయడం నేరమంటూ 1898లో చేసిన చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించడానికి 1904లో చేసిన భారత అధికార రహస్యాల చట్టం, బాలగంగాధర తిలక్, ఇతర పత్రికా సంపాదకులను జాతీయవాదాన్ని ప్రచారం చేసినందుకు జైలులో నిర్బంధించడం దీనికి ఉదాహరణలు.
 

iv) సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఏడాదికోసారి సమావేశాల నిర్వహణకు బదులు, నిరంతర రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు.
 

v) భారతీయుల్లో ఆత్మగౌరవం పెంపొందించడం. స్వరాజ్యం ప్రతి భారతీయుడి జన్మ హక్కని తిలక్ ప్రకటించడం, వివేకానందుడు 'బలహీనత పాపం, బలహీనతే మరణం' అని బోధించడం.
 

vi) అంతర్జాతీయ సంఘటనల ప్రభావం: జపాన్ గొప్ప శక్తిగా ఎదగడం, 1905లో జపాన్, రష్యాను ఓడించడం, 1896లో ఇథియోపియా చేతిలో ఇటలీ సైన్యం ఓటమి, ఐర్లాండ్, రష్యా, ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాల్లో విప్లవ ఉద్యమాలు భారతీయులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముమ్మరం చేయడానికి తోడ్పడ్డాయి.


తక్షణ కారణం: అతివాదం ఆవిర్భవించడానికి తక్షణ కారణం కర్జన్ దుష్టపరిపాలన, బెంగాల్ విభజన.


అతివాదుల లక్ష్యాలు: స్వరాజ్య సాధనే తమ లక్ష్యమని అతివాదులు ప్రకటించారు. వీరి దృష్టిలో స్వరాజ్యం అంటే బ్రిటిష్ వలసలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాదిరి స్వపరిపాలన కాదు. స్వరాజ్యం అంటే పూర్తి స్వాతంత్య్రం.


అతివాద నాయకులు: పంజాబ్‌కు చెందిన లాలా లజపతిరాయ్, మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర తిలక్, బెంగాల్‌కు చెందిన బిపిన్ చంద్రపాల్ ముఖ్యమైన అతివాద నాయకులు. వీరే లాల్-బాల్-పాల్‌గా, అతివాదత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వీరితోపాటు బెంగాల్‌కు చెందిన అరబిందోఘోష్ కూడా ప్రముఖ అతివాద నాయకుడు.
 


బాలగంగాధర తిలక్: ఈయన్ను భారతీయులు లోకమాన్య అని కీర్తించగా, బ్రిటిషర్లు ''భారత అశాంతి పితామహుడి"గా పేర్కొన్నారు. మితవాదిగా రాజకీయ జీవితం ప్రారంభించిన తిలక్, ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం నాటికి అతివాదిగా మారారు.

సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయడానికి 1893లో గణపతి ఉత్సవాన్ని, 1895లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. 1896-97లో కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రముఖ సభ్యుడు. న్యూ ఇంగ్లిష్ స్కూల్ స్థాపనకు కృషి చేశారు. ఇదే తర్వాతి కాలంలో ఫెర్గుసన్ కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆంగ్ల భాషలో మహారట్ట (Maharatta), మరాఠీ భాషలో కేసరి పత్రికలను స్థాపించారు. తిలక్ 1916 ఏప్రిల్‌లో హోం రూల్ లీగ్‌ను ప్రారంభించారు.


లాలా లజపతిరాయ్: పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఆర్య సమాజంలో 'కళాశాల' విభాగానికి నాయకుడు. సామాజిక, విద్యా సంస్కరణల కోసం కృషి చేశారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు 1907లో బ్రిటిష్‌వారు బర్మా దేశానికి పంపించారు.లజపతిరాయ్ 'పంజాబీ' అనే వార్తా పత్రికకు సంపాదకత్వం వహించారు. 'అన్‌హ్యాపీ ఇండియా' అనే పుస్తకాన్ని రచించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని, పోలీసుల దెబ్బలకు గాయపడి, మరణించారు.
 

బిపిన్ చంద్రపాల్: భారత విప్లవ భావాల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన పారిదర్శక్ (Paridarshak) అనే వార పత్రికను ప్రారంభించారు. అలాగే బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ట్రిబ్యూన్ పత్రికలకు సహ సంపాదకుడిగా వ్యవహరించారు.
క్రీ.శ. 1901లో 'న్యూ ఇండియా' అనే పత్రికను ప్రారంభించారు. క్రీ.శ. 1906లో అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్ ప్రారంభించిన వందేమాతరం పత్రిక అతివాద భావాలను ప్రచారం చేయడంలో కీలకపాత్ర వహించింది. అరబిందో ఘోష్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనందుకు బ్రిటిష్ ప్రభుత్వం బిపిన్ చంద్రపాల్‌కు 1907లో ఆరునెలల కారాగార శిక్షను విధించింది. ఆ శిక్ష అనుభవించాక 1908-11 మధ్యకాలంలో ఇంగ్లండ్‌లో గడిపారు. తర్వాత 20 ఏళ్లపాటు జాతీయోద్యమంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర వహించలేదు.

 

అరబిందో ఘోష్: బరోడాలో ఉపన్యాసకుడిగా పనిచేస్తూ 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే వ్యాసాల ద్వారా మితవాద రాజకీయాలను విమర్శించారు. వందేమాతర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా 1906లో కలకత్తాలో ప్రారంభించిన బెంగాల్ జాతీయ కళాశాలకు అరబిందో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు- 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఈయన్ను అరెస్ట్ చేసింది. క్రీ.శ. 1910లో పాండిచ్చేరికి వెళ్లి ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలపై దృష్టి సారించారు. సావిత్రి, ది లైఫ్ డివైన్ అనే రెండు గ్రంథాలు ఈయన రచనల్లో ప్రధానమైనవి.


వందేమాతరం ఉద్యమం

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన ఉద్యమమే వందేమాతర ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో బంకించంద్ర చటర్జీ రచించిన 'ఆనందమఠం' అనే గ్రంథం నుంచి స్వీకరించిన 'వందేమాతరం' నినాదాన్ని భారతీయులంతా ఎలుగెత్తి చాటారు. క్రీ.శ. 1905లో కర్జన్ (అప్పటి వైస్రాయి) ఢాకా, చిట్టగాంగ్, అస్సాం, మైమెన్‌సింగ్ ప్రాంతాలతో కూడిన తూర్పుబెంగాల్, అస్సాం రాష్ట్రాన్ని సృష్టించాడు. దీనికి ఢాకా రాజధాని. పరిపాలన సౌలభ్యం కోసమే బెంగాల్‌ను విభజించినా దీనికి ప్రధాన కారణం బెంగాల్‌లో జాతీయ ఉద్యమాన్ని బలహీన పరచడమే అనే నగ్నసత్యాన్ని బెంగాలీయులు గ్రహించారు.
విభజన తర్వాత బెంగాల్‌లో బెంగాలీలు మైనారిటీలుగా మిగిలారు. ఈ విధంగా హిందూ-ముస్లింలను విభజించి జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని బ్రిటిష్‌వారు భావించారు. 

వందేమాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తు వినియోగం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలను చేపట్టారు. 1905 ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్ హాల్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఆమోదించారు. 1905లో గోపాల కృష్ణగోఖలే అధ్యక్షతన జరిగిన బెనారస్ సమావేశంలో కాంగ్రెస్ 'స్వదేశీ' ఉద్యమానికి పిలుపునిచ్చింది. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజైన 1905 అక్టోబరు 16ను జాతీయ దుర్దినంగా పాటించారు. ఆ రోజు కలకత్తాలోని అన్ని కార్యాలయాలు మూసివేశారు. జనపనార మిల్లులు, రైల్వే కర్మాగారాల్లో సమ్మెను పాటించారు. బాలగంగాధర్ తిలక్ ఈ ఉద్యమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా పూనా, బొంబాయిలకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. అజిత్‌సింగ్, లాలాలజపతిరాయ్ పంజాబ్‌లో, సయ్యద్ హైదర్ రజా ఢిల్లీలో, చిదంబరం పిళ్లై మద్రాసు రాష్ట్రంలో, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వందేమాతర ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. 
 

క్రీ.శ. 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటితమైంది. అతివాదులు, మితవాదుల మధ్య నెమ్మదిగా విబేధాలు ప్రారంభమయ్యాయి. మితవాదులు విదేశీ వస్తు బహిష్కరణను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని భావించగా, అతివాదులు బహిష్కరణ ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు, బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణకు కూడా ఉపయోగించాలని భావించారు. బ్రిటిష్‌వారు మితవాదులను తమవైపుకు తిప్పుకోవడానికి లెజిస్లేటివ్ కౌన్సిళ్ల సంస్కరణకు హామీ ఇచ్చారు.
క్రీ.శ. 1907 డిసెంబరు 26న సూరత్‌లో కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అధ్యక్షుడిగా మితవాదులు రాస్ బిహారి ఘోష్ పేరును ప్రకటించడంతో, అతివాదులు వ్యతిరేకించారు. దీంతో సుమారు 1600 మంది ప్రతినిధులు హాజరైన సభలో గందరగోళం నెలకొంది. ఇది చివరికి కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోవడానికి దారితీసింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అనిబిసెంట్ ప్రయత్నాల వల్ల మితవాదులు, అతివాదులు మళ్లీ కలిశారు. అలాగే తిలక్ కృషితో కాంగ్రెస్, ముస్లింలీగ్ కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.


విధానాలు
i) ప్రభుత్వ సర్వీసులు, న్యాయస్థానాలు, పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం పట్ల సహాయ నిరాకరణ ప్రకటించడం.
ii) స్వదేశీ వస్తు వినియోగాన్ని పెంచడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం.
iii) జాతీయ విద్యను ప్రవేశపెట్టి, ఆచరించడం.


విజయాలు
* స్వరాజ్యం భారతీయుల జన్మహక్కు అని ప్రకటించారు.
* సామాన్య ప్రజలను కూడా జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేశారు.
* జాతీయస్థాయిలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు.


అపజయాలు
* ఉద్యమాన్ని రైతులు, వ్యవసాయ కార్మికుల చెంతకు తీసుకెళ్లలేకపోయారు.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం - తొలి రాజకీయ సంస్థలు

  భారతదేశంలో రాజకీయ చైతన్యానికి, రాజకీయ సంస్కరణలకు కృషిచేసిన తొలి వ్యక్తి రాజా రామ్మోహన్‌రాయ్‌. పత్రికా స్వేచ్ఛ, న్యాయ సంఘం ద్వారా విచారణలు, పరిపాలనా విభాగం నుంచి న్యాయ వ్యవస్థను వేరుచేయడం ఉన్నత పదవుల్లో భారతీయులకు ప్రవేశం కల్పించడం లాంటి అంశాలపై రాజా రామ్మోహన్‌రాయ్‌ పోరాడారు. ఆయన తర్వాత బెంగాల్‌లో ఉగ్రవాద భావాలున్న యువకులు హెన్రీ డెరోజియో నాయకత్వంలో రాజకీయ చైతన్యం, భారతీయుల హక్కుల కోసం పోరాటాలు మొదలుపెట్టారు. 1828లో వీరంతా కలిసి అకడమిక్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. డెరోజియన్లుగా వీరు పేరొందారు. హెన్రీ డెరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా పిలిచారు. డెరోజియన్లు రాజకీయ చైతన్యం కోసమే కాకుండా సాంఘిక, నైతిక సమస్యలపై కూడా పోరాడేవారు. కానీ వీరి విప్లవ భావాల వల్ల ఎక్కువగా ప్రజలను ఆకర్షించలేకపోయారు. 1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘాన్ని స్థాపించారు. దీన్నే భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. ఈ సంస్థ కూడా కేవలం బెంగాల్, బిహార్, ఒడిశా ప్రాంతాల్లో ఉన్న భూస్వాముల ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా పేరొందింది.

  1843లో జార్జి థాంప్సన్, డేనియల్‌ ఒకానల్‌ లాంటి ఆంగ్లేయులు బెంగాల్‌లో బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. ద్వారకానాథ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ సంఘంలో సభ్యులుగా పనిచేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన రాజకీయ సంస్థ 1851లో బెంగాల్‌ ఏర్పడింది. అదే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌. ఇంతకుముందు ఉన్న బెంగాల్‌ భూస్వాముల సంఘం (1838), బ్రిటిష్‌ ఇండియా సంఘం (1843) కలిసి ఏర్పడిందే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌.

  బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాథాకాంత్‌ దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌లు పనిచేశారు. శాసనసభల ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలని ఈ సంఘమే తొలిసారిగా ప్రతిపాదించింది. 1852లో బొంబాయి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను దాదాభాయ్‌ నౌరోజీ, జగన్నాథ్, నౌరోజీ పర్థూన్‌జీ లాంటి వారు స్థాపించారు. (గమనిక: బొంబాయి అసోసియేషన్‌ను 1852లో స్థాపించినట్లు చాలా పుస్తకాల్లో పేర్కొన్నారు. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోషియేషన్‌ స్థాపించారు. ఈ తేడాను అభ్యర్థులు గమనించాలి.) 1853లో గాజుల లక్ష్మీనరసుశెట్టి లాంటివారు మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన భారత జాతీయోద్యమ చరిత్ర 3వ భాగంలో 1853 అని ఉండగా బిపిన్‌చంద్ర రాసిన ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకంలో 1852లో అని ఉంది). బొంబాయి అసోసియేషన్‌ భారతీయుల విద్యాభివృద్ధికి, భారతీయ ప్రతినిధులతో కూడిన శాసనసభల ఏర్పాటుకు, భారతీయుల ఉన్నతోద్యోగాల కల్పనకు ఆంగ్లేయులు కృషిచేయాలని కోరితే, మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ రైతులు, కార్మికులు, కూలీ పనివారి సమస్యల సాధన కోసం కృషిచేసింది. ఈ విధంగా 1858కి పూర్వం ఏర్పడిన సంస్థలన్నీ కేవలం అయా ప్రాంతీయ ప్రాతిపదికపై ఏర్పడినవే. అందుకే అవి ఆయా ప్రాంతాల సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యమిచ్చేవి.

  1858 తర్వాత ఏర్పడ్డ సంస్థలు అఖిల భారత స్థాయి సమస్యల సాధన కోసం కొంతమేర కృషి చేశాయి. 1865 మార్చి 24న దాదాభాయ్‌ నౌరోజీ, డబ్ల్యూసీ బెనర్జీ లాంటివారు ఇంగ్లండ్‌లో లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ 1866 నాటికి ‘ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది. భారతీయుల పరిస్థితులను ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి, ఇంగ్లండ్‌ ప్రజలకు తెలిసేలా ఈ సంస్థ కృషి చేసింది. దాదాభాయ్‌ నౌరోజీ ఈ సంస్థ శాఖలను భారతదేశంలో కూడా నెలకొల్పారు. పూనాలో (1870) జీవీ జోషీ, చిప్లూంకర్‌ ‘పూనా సార్వజనిక సభ’ను స్థాపించారు. ఈ సంస్థ తొలి సమావేశం 1971లో మహదేవ గోవింద రనడే అధ్యక్షతన జరిగింది. భారతీయులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ విక్టోరియా మహారాణికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

  బెంగాల్‌లో శిశిర్‌కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో బెంగాల్‌ ఇండియన్‌ లీగ్‌ (1875) అనే సంఘం ఏర్పడింది. 1876 జులై 26న కోల్‌కతాలో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌మోహన్‌ బోస్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. సివిల్‌ సర్వీసు పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టాలని ఈ సంస్థ తన ఆందోళనను ప్రారంభించింది. అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందిన మొదటి ఆధునిక భారతీయుడిగా సురేంద్రనాథ్‌ బెనర్జీ పేరొందారు. జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారులు హక్కుల పరిరక్షణ, తేయాకు తోట కార్మికుల హక్కుల కోసం విదేశీ తేయాకు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఇండియన్‌ అసోసియేషన్‌ పోరాడింది.

  1884లో సుబ్రహ్మణ్య అయ్యర్, వీర రాఘవాచారి, ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి కారణంగా మద్రాస్‌ మహాజన సభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌ షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జి. కె.టి. తెలాంగ్‌ లాంటి వారి కృషి ఫలితంగా బాంబే ప్రెసెడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ విధంగా 1885కు ముందు స్థాపించిన సంస్థలన్నీ ఎక్కువగా ఆయా ప్రాంతాల సమస్యల కోసమే పోరాడేవి తప్ప అఖిల భారత స్థాయి ప్రాతినిధ్య సంస్థలుగా ఎదగలేదు. ఆ సంస్థలో సభ్యత్వం, నాయకత్వం ఆయా నగరాలకే పరిమితమై ఉండేది. సురేంద్రనాథ్‌ బెనర్జీ, 1883, 1885లో రెండుసార్లు కోల్‌కతాలో జాతీయసభ సమావేశాలను నిర్వహించినప్పటికీ అది జాతీయ ప్రాతినిధ్య సంస్థగా మారలేకపోయింది. సురేంద్రనాథ్‌ బెనర్జీ సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే అభ్యర్థుల అర్హత వయసును లార్డ్‌ లిట్టన్‌ 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించి వేయడంపై దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యంగా విద్యార్థులను జాతీయోద్యమంలో భాగస్వాములను చేయడానికి విద్యార్థి సంఘాలను స్థాపించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు ముందు స్థాపించిన సంస్థలు, నాయకులు జాతీయోద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన (1885)

భారత జాతీయోద్యమ చరిత్రలో అతి ప్రధాన ఘట్టం భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన. మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థను స్థాపించాలని అనేకమంది భారతీయ నాయకులు ఆలోచించినప్పటికీ ఆ ఆలోచనకు తుది రూపు ఇచ్చింది ఆంగ్లేయుడైన ఏవో హ్యూమ్‌. 1885, డిసెంబరు 28న హ్యూమ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. దీని తొలి సమావేశం ముంబయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ తొలి కాంగ్రెస్‌ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహిస్తే మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనలో హ్యూమ్‌ రక్షక కవాట సిద్ధాంతాన్ని అనుసరించాడని ఆధునిక భారతీయ చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులు చేస్తున్న ఆందోళనలను భారతీయుల సహాయంతోనే అణచివేయాలనే భావంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని వారి భావన. ‘‘మన నిర్వాకం వల్ల ఉప్పొంగే మహాశక్తిని ఉపశమింపజేయడానికి అనువైన మార్గాన్ని చూడటం మన తక్షణ అవసరం’’ అని హ్యూమ్‌ పేర్కొన్నాడు. కాంగ్రెస్‌ స్థాపన కాలంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ డఫ్రిన్‌ తర్వాతి కాలంలో అదే కాంగ్రెస్‌ను ‘మైక్రోస్కోపిక్‌ మైనారిటీ సంస్థ’గా విమర్శించాడు. భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రసరించిన ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నాడు.

భారత జాతీయ కాంగ్రెస్‌ను నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. మొత్తం భారతీయులకు ప్రాతినిధ్య సంస్థగా పనిచేయడం, అందరి మధ్యా స్నేహబంధాన్ని పెంచి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం, భారతీయుల అవసరాలు, కోర్కెలను బ్రిటిష్‌వారికి విన్నవించి పరిష్కరించడం, ప్రజాభిప్రాయాన్ని సుశిక్షితం చేసి, సమీకరించి ప్రజాస్వామ్య భావాలను పెంపొందించడం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పుణెలో జరపాలని నిర్ణయించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో ముంబయిలో నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ రెండో సమావేశం 1886, డిసెంబరులో కోల్‌కతాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడో సమావేశం మద్రాస్‌లో (1887) బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. దీనికి మొత్తం 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం బద్రుద్దీన్‌ త్యాబ్జీ. 1888లో నాలుగో సమావేశం అలహాబాద్‌లో జార్జి యూలె అధ్యక్షతన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడిగా జార్జి యూలె పేరొందారు. 1889లో అయిదో సమావేశం ముంబయిలో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చార్లెస్‌ బ్రాడ్‌లా లాంటి ఆంగ్లేయులు హాజరయ్యారు.

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి పి. ఆనందాచార్యులు. 1891 నాటి నాగపూర్‌ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంటు, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. 1917 నాటి కోల్‌కతా సమావేశానికి అనిబిసెంటు అధ్యక్షత వహిస్తే 1925 కాన్పూర్‌ సమావేశానికి సరోజినీనాయుడు అధ్యక్షత వహించారు. గాంధీజీ ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం కాంగ్రెస్‌ సమావేశం గాంధీజీ అధ్యక్షతన జరిగింది. 1947 నాటికి అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి జె.బి. కృపలానీ. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎక్కువసార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర గ్రంథాన్ని రచించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్‌ చరిత్రకారుడిగా పేరొందారు. కాంగ్రెస్‌ ఆశయాలను ప్రచారం చేయడానికి దాదాభాయ్‌ నౌరోజీ ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు.

ఆంగ్లేయులు ప్రారంభించిన భారత జాతీయ కాంగ్రెస్‌ క్రమంగా బలపడటంతో కాంగ్రెస్‌ పట్ల ఆంగ్లేయుల దృక్పథం మారిపోయింది. లార్డ్‌ డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను అల్పసంఖ్యాక వర్గాల సంస్థగా పేర్కొన్నాడు. ‘కాంగ్రెస్‌ కోర్కెలను మన్నించడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లే’ అని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నాయకుల ఆశయాన్ని ‘అంతగా లోతు తెలియని గొయ్యిలోకి అడుగువేస్తున్న అవివేక చర్య’గా డఫ్రిన్‌ అభివర్ణించాడు. కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా ఆంగ్లేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం పైన విశ్వాసంలేని వాళ్లనీ, రాజద్రోహపూరిత బ్రాహ్మణులనీ, తీవ్ర దుర్మార్గులనీ కాంగ్రెస్‌ నాయకులను విమర్శించేవారు.

డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను ‘‘ప్రజారాశిలో ఒక నలుసని’’ గేలి చేశాడు. లార్డ్‌ కర్జన్‌ ‘‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే తన ప్రధాన ధ్యేయం’’ అని పేర్కొన్నాడు. 1900లో లార్డ్‌ కర్జన్‌ భారత రాజ్య కార్యదర్శికి లేఖ రాస్తూ ‘‘కాంగ్రెస్‌ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కన్నుమూయడానికి సహాయపడాలని నా కోరిక’’ అని పేర్కొన్నాడు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపి భారతదేశం నుంచి ఆంగ్లేయులను తరిమివేసింది.

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

      లార్డ్ వేవెల్ 1945లో తన ప్రణాళికను చర్చించడానికి భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేవెల్ ప్రణాళిక ప్రకారం వైస్రాయ్ పాలకమండలిలో సర్వ సైన్యాధ్యక్షుడు మినహా మిగిలినవారంతా భారతీయులే ఉంటారు. పాలకమండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుంది. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ వైస్రాయ్ పాలక మండలిలోని ముస్లిం సభ్యులను ముస్లింలీగ్ మాత్రమే ఎంపిక చేయాలని పట్టుబట్టింది. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
 

మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక (1946): ఇంగ్లండ్‌లో 1945లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చర్చిల్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది. లేబర్ పార్టీ మొదటి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. ఇంగ్లండ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సి.ఆర్. అట్లీ, వేవెల్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
 

1946 మార్చి 24న లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లతో కూడిన ముగ్గురు క్యాబినెట్ మంత్రుల బృందం భారతదేశానికి వచ్చింది. దేశానికి వీలైనంత తొందరగా స్వాతంత్య్రం ఇవ్వడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ మంత్రుల బృందం అయిదు వారాలపాటు స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపింది. చివరగా 1946 మే 5న సిమ్లాలో కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

1946 మే 16న మిషన్ తన సిఫారసులను ఒక ప్రకటన రూపంలో ప్రకటించింది. దీన్ని 'క్యాబినెట్ మిషన్ ప్రణాళిక' అంటారు.

1946 ఆగస్టు 12న వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరాడు. ప్రారంభంలో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి ముస్లింలీగ్ అయిష్టత చూపింది.

తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులు (9 మంది కాంగ్రెస్, అయిదుగురు ముస్లింలీగ్) ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు.

ప్రత్యక్ష చర్యా దినోత్సవం

ముస్లింలీగ్ 1946 జులై 30న సమావేశమై 1946 ఆగస్టు 16న భారతదేశమంతటా ప్రత్యక్ష చర్యాదినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.
 

ముస్లింలీగ్ కలకత్తాలో ఆగస్టు 16న ప్రదర్శనలు, హర్తాళ్‌లు నిర్వహించడం గొడవలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. బెంగాల్‌లో హెచ్.ఎస్. సుహ్రావర్డి ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ ప్రభుత్వం ఆగస్టు 16ను సెలవుదినంగా ప్రకటించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వం పరిస్థితి చేయిదాటేంత వరకు సైన్యాన్ని పిలవకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది.

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947 మార్చిలో వేవెల్ స్థానంలో మౌంట్ బాటన్ వైస్రాయ్‌గా నియమితుడయ్యాడు. ఇతడు ఇంగ్లండ్ రాజుకు దగ్గరి బంధువు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియా ప్రాంతానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు. మౌంట్ బాటన్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 1947 జూన్ 3న ఒక రాజీ సూత్రాన్ని రూపొందించి, ప్రకటించాడు. దీన్నే జూన్ 3 ప్రణాళిక అంటారు. దీని ప్రకారం భారతదేశాన్ని భారత యూనియన్, పాకిస్థాన్‌గా విభజించి స్వాతంత్య్రం ఇస్తారు.

భారత స్వాతంత్య్ర చట్టం (1947): జూన్ 3 ప్రణాళిక ఆధారంగా ఒక బిల్లును రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 12 రోజుల స్వల్ప వ్యవధిలో (జులై 4 - జులై 16) పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది. జులై 18న బ్రిటిష్ రాజు కూడా ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. భారత భూభాగాల విభజన, పంజాబ్, బెంగాల్‌లలో రెండు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. రెండు దేశాలకు ప్రత్యేక గవర్నర్ జనరల్, శాసనశాఖల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

దేశ విభజన అనేక అనర్థాలకు దారితీసింది. సుమారు 1.5 కోట్ల మంది హిందూ ముస్లింలు బలవంతంగా తమ ఇళ్లు, గ్రామాలు, నగరాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇది వారిలో కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చింది. రెండు నుంచి అయిదు లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు. మత ఘర్షణలకు కేంద్రమైన తూర్పు బెంగాల్‌లోని నోఖాలిలో 1947 ఆగస్టు 15న పర్యటించిన గాంధీజీ శాంతిని పునరుద్ధరించడానికి కృషిచేశారు. గాంధీజీ 1947 సెప్టెంబరు 9న ఢిల్లీకి చేరుకున్నారు. వాయవ్య భారతదేశంలో మతఘర్షణలను, ప్రజల భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. కొంతమంది మతోన్మాదులు గాంధీజీ నిర్వహించే సర్వమత ప్రార్థనలకు ఇబ్బందులు సృష్టించారు.

గాంధీజీ 1948 జనవరిలో చివరిసారిగా నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయి పటేల్ మతపరమైన వైఖరిని నిరసించారు. గాంధీజీ మరణానికి రెండు రోజుల ముందు ఆయన హత్యకు విఫలయత్నం జరిగింది. 1948 జనవరి 28న గాంధీజీ మాట్లాడుతూ - 'ఒక పిచ్చివాడి బుల్లెట్‌కు నేను మరణించవలసి వస్తే, నేను చిరునవ్వుతో మరణిస్తాను. నాలో ఎలాంటి కోపం లేదు. దేవుడు నా హృదయంలోను, పెదాలపై ఉన్నాడు' అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోపే 1948 జనవరి 30న సర్వమత ప్రార్థనకు వెళ్తున్న గాంధీజీ నాథూరామ్ గాడ్సే తుపాకి గుళ్లకు బలయ్యారు.

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు

భారత జాతీయ రాజకీయాల్లో విభజనవాదానికి ప్రధాన కారణం - అధిక సంఖ్యాకులైన హిందువులు అల్ప సంఖ్యాకులైన ముస్లింలపై (వ్యాపారం, పరిశ్రమలు, ప్రభుత్వ సర్వీసులు, విద్య లాంటివి) పలు విషయాల్లో ఆధిపత్యం వహించడం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కాలం నుంచే బ్రిటిషర్లకు, ముస్లింలకు మధ్య మంచి సంబంధాలు లేవు. బ్రిటిషర్లు తమ నుంచి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ముస్లింలు భావించారు. ముస్లింలు తమ సామ్రాజ్యానికి ప్రధాన శత్రువులని బ్రిటిషర్లు భావించారు.
 

బ్రిటిషర్లు హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. 1857 విప్లవం తర్వాత ఈ పరిస్థితి తారుమారైంది. హిందువులు ఆంగ్ల విద్యను అభ్యసించి, పాశ్చాత్య భావాలను అంగీకరించారు. వారిలో క్రమంగా జాతీయతాభావం అభివృద్ధి చెందింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి గొప్ప ఆటంకంగా పరిణమించింది. దీంతో ముస్లింల సహాయంతో హిందువులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్‌వారు విభజించి, పాలించు విధానాన్ని అవలంబించారు.

1871లో సర్ విలియం హంటర్ రచించిన 'ది ఇండియన్ ముసల్మాన్స్' అనే గ్రంథం ప్రచురితమైంది. ముస్లింలతో విరోధాన్ని కొనసాగించడం కంటే వారితో స్నేహంగా ఉండటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మేలు చేస్తుందనే భావన ఈ గ్రంథంలో వ్యక్తమైంది. అలీగఢ్‌లోని ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ బెక్ ముస్లింలు బ్రిటిషర్లకు దగ్గరవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలు పాశ్చాత్య విద్యను అభ్యసించేలా, బ్రిటిషర్లకు విధేయులుగా ఉండేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

1906 డిసెంబరులో ఢాకాలో నవాబు వికార్ ఉల్‌ముల్క్ ముస్లింలీగ్ పార్టీని స్థాపించి, మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ పార్టీ స్థాపనలో ఆగాఖాన్ ప్రముఖ పాత్ర వహించాడు. 1906 నుంచి 1910 వరకు ముస్లింలీగ్ కేంద్ర కార్యాలయం అలీగఢ్ ఉండేది. ఆ కాలంలో దాని ప్రభావం పెద్దగా లేదు. పార్టీ ప్రధాన కార్యాలయం లక్నోకు మారడంతో, దీని రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి.

ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాలు

1906లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో వ్యక్తిగత కార్యదర్శి స్మిత్ భారతీయ ముస్లింల ప్రతినిధులకు వైస్రాయ్‌ని కలవమని సలహా ఇచ్చాడు. ఆగాఖాన్ నేతృత్వంలోని ఈ బృందం మింటోను కలిసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని కోరింది. దీని ఫలితంగా రూపొందిన 1909 చట్టం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది.

భారతదేశం లోపల, వెలుపల సంఘటనలు కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు చేరువకావడానికి దోహదం చేశాయి. ఖిలాఫత్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సహాయం అవసరమని ముస్లింలీగ్ గుర్తించింది. ఇది 1916లో లక్నో ఒడంబడికకు దారితీసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ముస్లింల సానుభూతిని సంపాదించాలని ప్రయత్నించారు. అయితే ఈ ఉద్యమం నిలిపివేయడంతో హిందూ-ముస్లిం ఐక్యత బలహీనపడింది.

1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికను కాంగ్రెస్ అంగీకరించగా, జిన్నా ముస్లింల కనీస డిమాండ్లుగా తన పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు. 1930లో ప్రసిద్ధ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలీగ్ అలహాబాద్ సమావేశంలో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వాయవ్య భారత ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.

1933లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విద్యార్థి చౌదరి రెహమత్ అలీ పాకిస్థాన్ పేరును మొదటగా ప్రతిపాదించాడు. పంజాబ్, అఫ్గన్, కశ్మీర్, సింధుల నుంచి మొదటి అక్షరాలు, బెలూచిస్థాన్‌లో చివరి పదంతో ఈ పేరును రూపొందించాడు.

1937లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలకు కేటాయించిన 482 సీట్లలో ముస్లింలీగ్ 102 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 58 ముస్లిం స్థానాలకు పోటీచేయగా, 26 స్థానాలను గెలుచుకుంది. ముస్లింలీగ్ మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.

యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాసులలో సీట్లు సాధించిన ముస్లింలీగ్ బెంగాల్, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. సింధు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. అయితే 1946లో కేంద్ర, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముస్లిం సీట్లు గెలుచుకోవడంలో సఫలీకృతమైంది.

యునైటెడ్ ప్రావిన్స్‌లో ముస్లింలీగ్ తగినన్ని సీట్లు సాధించినా, దాంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నిరాకరించింది. కాంగ్రెస్‌లోని సభ్యులు ముస్లింలీగ్ సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధించింది. దీన్ని కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు వ్యతిరేకించడంతో 1938లో కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యత్వం కలిగి ఉండకూడదని పేర్కొంది.

విమోచ‌న దినం

1939 డిసెంబరు 22న బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. జిన్నా ఈ రోజును విమోచన దినంగా ప్రకటించారు.

1940, మార్చి 23న ముస్లింలీగ్ ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానంలో దేశ విభజన లేదా పాకిస్థాన్ గురించి ఎక్కడా పేర్కొనలేదు. తర్వాతి రోజుల్లో ఈ తీర్మానం పాకిస్థాన్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది.

1942లో కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ముస్లింలీగ్‌ను బలపరిస్తే ఇస్లాంను బలపరిచినట్లేనని బహిరంగంగా ప్రకటించారు. 1940-46 మధ్య ముస్లిం సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక దేశం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి ముస్లింలీగ్ అవగాహన కల్పించింది. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను జైళ్లలో నిర్బంధించింది. ఈ సమయాన్ని ముస్లింలీగ్ తనకు అనుకూలంగా మలచుకుని బలపడింది.

సి. రాజగోపాలాచారి ఫార్ములా (1944), గాంధీజీ - జిన్నా చర్చలు (1944), భులాబాయ్ దేశాయ్, లియాఖత్ అలీఖాన్ ఒప్పందం (1945) కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. సిమ్లా సమావేశం కూడా మహమ్మద్ అలీ జిన్నా మొండివైఖరి వల్ల విఫలమైంది.

1946 సాధారణ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందగా, ముస్లింలీగ్ ముస్లింలకు కేటాయించిన 30 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ 923 సీట్లు, ముస్లింలీగ్ 425 సీట్లు గెలుచుకున్నాయి. ముస్లింలీగ్ ఈ ఎన్నికల్లో 86 శాతం సీట్లు దక్కించుకోవడం విశేషం.

ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌ను అంగీకరించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది. చివరకు మౌంట్‌బాటన్ 1947 జూన్-3 ప్రణాళికను అనుసరించి భారత్‌ను భారత్ యూనియన్, పాకిస్థాన్‌గా విభజించారు.

Posted Date : 22-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక సంస్కరణల కోసం మహమ్మదీయుల ఉద్యమాలు

* మహమ్మదీయుల్లోని కులవ్యవస్థ, పరదా పద్ధతి లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని బెరైలికి చెందిన సయ్యద్ అహ్మద్ ఖాన్, బెంగాల్‌కు చెందిన షరియతుల్లా కృషిచేశారు.
* షరియతుల్లా ఫైరైజి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
* నవాబ్ అబ్దుల్ లతీఫ్ (1828 - 1893) 'మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈ సంస్థ కూడా మహమ్మదీయుల సంస్కరణల కోసం కృషి చేసింది.
* అబ్దుల్ లతీఫ్ హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు; మహమ్మదీయల్లో విద్యావ్యాప్తికి కృషిచేశాడు.
* సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 - 1898) మొగల్ దర్బారుకు చెందిన గొప్ప వంశస్థుడు. ఇతడు 1875లో అలీఘర్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇది తర్వాతి కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.
* మహమ్మదీయుల్లో సాంఘిక జాగృతి కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో చేసిన ఉద్యమాన్ని 'అలీగఢ్ ఉద్యమం' అంటారు. ఇతడు హిందువులు, ముస్లింలు భారతీయులేనని విభేదాలు ఉండకూడదని బోధించాడు.


ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820 - 1891):
* ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1820లో బెంగాల్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సంస్కృతాన్ని అభ్యసించిన గొప్పవిద్వాంసుడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతడికి 'విద్యాసాగర్' అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. సమాజానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి బెంగాలీ పత్రికల్లో ఉత్తేజపరిచే రచనలు చేశాడు.
* అనేక మంది సంఘ సంస్కర్తలు వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యకు కృషి చేశారు. వారిలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919), నారాయణ గురు (కేరళ) ముఖ్యమైనవారు.


సాంస్కృతిక జాగృతీ ప్రభావం:
* యూరోపియన్ విద్వాంసులు భారత సాహిత్యాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో విలియం జోన్స్ మార్గదర్శకత్వం వహించి 'ఏషియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు.
* విలియం జోన్స్ కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలాన్ని' ఆంగ్లంలోకి అనువదించాడు.
* 19వ శతాబ్దపు విద్వాంసులు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి శాసనాలను అనువదించారు.
* ఏషియాటిక్ సొసైటీ ఈ రచనలన్నింటినీ ముద్రించింది. భారతీయులు ఈ గ్రంథాలను చదివి ప్రాచీన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోగలిగారు.


సాహిత్యం, భాష, కళలు:
* మనదేశంలో 19వ శతాబ్దంలోని సాహిత్యం ప్రాచీన సాహిత్యం కంటే భిన్నమైంది.
* ప్రాచీన సాహిత్యం పద్య, శ్లోకాల రూపంలో ఉండేది. 19వ శతాబ్దంలో గద్య రచనలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది.
* భరతేందు హరిశ్చంద్ర (1850 - 1885) ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.
* బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారు బెంగాలీ సాహిత్యంలో మార్గదర్శకులు.
* రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' స్వతంత్ర భారతదేశానికి జాతీయ గీతం అయ్యింది. ఠాగూర్ సాహిత్య కృషికి 1913లో అత్యున్నత అంతర్జాతీయ నోబెల్ పురస్కారం లభించింది.
* బంకించంద్ర రాసిన 'వందేమాతరం', మహమ్మద్ ఇక్బాల్ రచించిన 'సారేజహాసే అచ్ఛా' గేయాలను ప్రజలు దేశభక్తి ప్రబోధకాలుగా పాడుకుంటున్నారు.
* గురజాడ అప్పారావు - తెలుగు, హరినారాయణ - మరాఠీ, సుబ్రమణ్య భారతి - తమిళం, హేమచంద్ర బారువా - అసోం, ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా, కె.వి. పుట్టప్ప - కన్నడ; కుమరన్ ఆసన్, వి.కె. నారాయణ మీనన్ - మళయాళం భాషల్లో ప్రసిద్ధ రచయితలు. వీరంతా 19వ, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో రచనలు చేసి సొంత భాషల్లో సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
* భారతదేశ గ్రామాల్లోని పేదరికాన్ని ప్రేమ్‌చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు.
* రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. దీనికోసం బెంగాల్‌లో పాఠశాలను స్థాపించాడు.
* రాజారామ్మోహన్ రాయ్ రామాయణ, మహాభారత గాథలను; అమృతా షేర్గిల్ భారతీయుల నిత్యజీవితాలను, నందలాల్ బోస్ వృత్తి పనుల వారి నిత్యజీవితాలను, ప్రాచీన గాథలను, స్వాతంత్య్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో చూపారు.


పత్రికల అభివృద్ధి, వాటి పాత్ర:
* ది హిందూ, అమృత్‌బజార్, ది మరాఠా, ది ఇండియన్ మిర్రర్, ది స్వదేశ్ మిత్రన్, ది ప్రభాకర్, ది ఇందు ప్రకాశ్ లాంటి పత్రికలు భారత ప్రజలను ఉత్తేజపరచి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాయి.
 

సైన్సు అభివృద్ధి:
* ప్రాచీన భారతదేశ విద్యావిధానంలో సైన్సును బోధించేవారు కాదు.
* రాజారామ్మోహన్ రాయ్ లాంటివారు ఆంగ్ల విద్యను అభ్యసించాలని, తద్వారా సైన్సు చదవడంతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావించారు.
* 19వ శతాబ్దపు ఆరంభంలో సైంటిఫిక్ సొసైటీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా భారతదేశంలో సైన్సు అభివృద్ధి చెందింది.
* మహేందర్‌లాల్ సర్కార్ మొదటి వైద్య విద్యార్థి. ఇతడు 1876లో సైన్సు అభివృద్ధికి 'ఇండియన్ అసోసియేషన్' అనే సంస్థను ఏర్పాటు చేశాడు.
* 20వ శతాబ్దంలో 'ఇండియన్ సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌'ను స్థాపించారు.
* 1930లో సర్ సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగానూ ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
* శ్రీనివాస రామానుజన్ గణితంలో; మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులు.
* విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేసి, దేశానికి విశిష్ట సేవలందించారు. జల విద్యుదుత్పత్తి, ఆనకట్టల నిర్మాణం, పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.
* ప్రఫుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్, డి.ఎన్. వాడియా, బీర్బల్ సహాని, మేఘనాథ్ సాహ లాంటివారు సుప్రసిద్ధ శాస్త్ర విజ్ఞానవేత్తలు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రాలో సంఘ సంస్కరణోద్యమాలు

కందుకూరి వీరేశలింగం యుగం

* కందుకూరి వీరేశలింగం యుగం 19వ శతాబ్దం అర్ధభాగంలో ప్రారంభమైంది. ఈయన జీవించిన కాలాన్ని (1848-1919) ఒక యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో కవులు, పండితులు, కళాకారులు తమ రచనల ద్వారా సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు.
* రాజా రామ్మోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటి బ్రహ్మసమాజ నాయకుల బోధనలతో అనేక మంది ప్రభావితులయ్యారు. ఆ కాలంలో కందుకూరి వీరేశలింగం ఆంధ్రాలో సంస్కరణలకు పాటుపడి ‘యుగ పురుషుడు’, ‘ఆంధ్రా నవయుగ వైతాళికుడి’గా పేరొందారు.
* వీరేశలింగం 1848, ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కె.సుబ్బారాయుడు, పూర్ణమ్మ.
* వీరి పూర్వికులది ప్రకాశం జిల్లాలోని కందుకూరి గ్రామం. అక్కడి నుంచి రాజమండ్రికి వలస వెళ్లి స్థిరపడ్డారు. దీంతో వారి ఇంటిపేరు కందుకూరిగా మారింది.
* వీరేశలింగం రాజమండ్రి వీధి బడిలో చదవడం, రాయడం నేర్చుకున్నారు. నాలుగో ఏటే తండ్రి  మరణించడంతో పెదనాన్న, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు.
* అయిదేళ్ల వయసులోనే బాలరామాయణం, అమరం, ఆంధ్రనామసంగ్రహం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం నేర్చుకున్నారు.
* దూసి సోమయాజుల వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే అన్ని తరగతుల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 12వ ఏట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లం నేర్చుకున్నారు. 
* 13వ ఏట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ)ను బాల్యవివాహం చేసుకున్నారు.
* చిన్నతనం నుంచే విగ్రహారాధనను, లంచగొండితనాన్ని, అవినీతిని, అబద్ధాలు చెప్పడాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకించారు.
* విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా సమ్మె చేసి, ఆయన్ను బదిలీ చేయించారు. మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసై రాజమండ్రి పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరారు.
* కేశవ చంద్రసేన్, పాశ్చాత్య నాగరికతకు చెందిన పుస్తకాల ప్రభావం ఈయనపై ఎక్కువగా ఉండేది. 
* 1872లో కోరంగి ఆంగ్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. చివరి వరకు అదే వృత్తిలో కొనసాగారు. ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని, సంస్కరణాభిలాషకు వృత్తి కొంతమేర దోహదపడుతుందని నమ్మారు.
* విద్యార్థులు, అధ్యాపక వృత్తి సంస్కరణ రచనా వ్యాసంగానికి తోడ్పడ్డాయి. ఆయన రచనలే సమాజ సంస్కరణకు సాధనాలుగా మారాయి. 

 

సంస్కర్తగా.. వీరేశలింగం విద్యార్థి దశ నుంచే హేతువాదాన్ని నమ్మి, బ్రహ్మసమాజ సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యారు. నాటి  సమాజంలో మూఢ నమ్మకాలు ఎక్కువ. వితంతువులకు పునర్వివాహాలు లేవు. బాల్యవివాహాలు ఉండేవి. స్త్రీలకు విద్య లేదు. అందుకే ఈ యుగాన్ని ఆంధ్రాలో ‘చీకటియుగం’గా పేర్కొంటారు. సమాజంలో వచ్చే విప్లవాత్మక మార్పు ద్వారానే వీటిని అధిగమించవచ్చని వీరేశలింగం అభిప్రాపపడ్డారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడానికి సాహిత్యం, పత్రికలు ఉపయోగపడతాయని గ్రహించి అనేక రచనలు చేశారు.
* మూఢనమ్మకాలపై పోరాడి నూతన సంస్కరణలకు నాంది పలికారు. శకునాలు, మంత్రతంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, దేవుని అవతారాలను నమ్మలేదు. వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించలేదు. వేదాలు, బైబిల్, ఖురాన్‌లలో రాసిన మహిమలన్నీ నమ్మశక్యాలు కావని పేర్కొన్నారు.
* స్త్రీ విద్య కోసం ఉద్యమించి, వారి కోసం బాలికా పాఠశాలను స్థాపించారు. స్త్రీ, పురుష లింగభేదం లేకుండా సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అణగారిన కులాలకు చెందిన పిల్లలను బడిలో చేర్చుకుని సమాన అవకాశాలు కల్పించారు.
* పోలీసులు, న్యాయవాదుల దౌర్జన్యాలను తన రచనల ద్వారా విమర్శించారు.
* అప్పట్లో న్యాయస్థానాల్లో తీర్పు చెప్పేందుకు న్యాయమూర్తులు డబ్బు ఆశించేవారు. ఆ విధానాన్ని తన వివేకవర్ధిని పత్రికలో విమర్శించారు.

 

నాటకాలు: వీటిని వీరేశలింగం సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. అవి: అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం.
 

పౌరాణిక గ్రంథాలు: సత్యవతి చరిత్ర, చంద్రమతి, దశకుమార చరిత్ర అనే గ్రంథాలను రచించారు.


చారిత్రక గ్రంథాలు: ఏసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర.


నవలలు: అలీవర్‌ గోల్డ్‌ స్మిత్‌ రాసిన ‘వికార్‌ ఆఫ్‌ వేక్‌ ఫీల్డ్‌’ గ్రంథం ఆధారంగా వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ అనే నవలను రచించారు. దీన్ని ‘Fortune of Wheels’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన తొలి నవల ఇదే.
* లంకాద్వీపం, అడుమలయాళం అనే రెండు భాగాలతో సత్యరాజా పూర్వదేశ యాత్రలు అనే పేరుతో హాస్య నవలను రచించారు. స్విఫ్ట్‌ రాసిన గలివర్‌ ట్రావెల్స్‌ గ్రంథం దీనికి ఆధారం.

ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన  వీరేశలింగం గ్రంథాలు:
1. Comedy of Errors -  చమత్కార రత్నావళి
2.  Sheridens duese  - రాగమంజరి
3. Dorivals - కల్యాణ కల్పవల్లి
4. Cowpers Jungism - దుర్మార్గపు చరిత్ర
* బ్రిటిష్‌ ప్రభుత్వం ఈయనకు ‘రావు బహద్దూర్‌’ అనే బిరుదును ఇచ్చింది. 
* 1919, మే 27న కొమర్రాజు లక్ష్మణరావు నివాస గృహం (వేద నివాసం)లో వీరేశలింగం మరణించారు. ఈయన సమాధిని రాజమండ్రిలోని స్వగృషంలో నిర్మించారు.
* ఈయన ఆంధ్ర సంస్కరణ ఉద్యమ పితామహ, ఆంధ్ర పునర్వికాస పితామహ, ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, యుగకర్త, గద్య వాజ్మయ బ్రహ్మ అనే బిరుదులు పొందారు.
* ఎం.జి.రనడే అనే సంఘసంస్కర్త వీరేశలింగానికి ‘దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు’ అనే బిరుదును ఇచ్చారు.
* ఈ విధంగా కందుకూరి వీరేశలింగం ఆంధ్ర సమాజంలో నూతన ఒరవడిని సృష్టించారు. ఈయన పుట్టినరోజును ‘తెలుగు నాటక రంగ దినోత్సవం’గా జరుపుకుంటారు.


వితంతు పునర్వివాహం

బాల్య వివాహాలకు వ్యతిరేకించారు. కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా ‘వివేకవర్ధిని’లో అనేక వ్యాసాలు ప్రచురించారు. ఆయన చేపట్టిన వితంతు పునర్వివాహాలు ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి 1881, డిసెంబరు 11న తన ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం చేశారు.
* తిరువూరు తాలూకా రేవూడికి చెందిన 9 ఏళ్ల బాలవితంతువు గౌరమ్మకు, గోగులపాటి శ్రీరాములుతో వివాహం జరిపించారు. ఇది ఆందోళనలకు దారితీసింది. పెళ్లిలో పాల్గొన్న వారిని సమాజం నుంచి వెలేశారు. దీని తర్వాత సుమారు 40 వితంతు వివాహాలు చేశారు. వీటికి పైడా రామకృష్ణయ్య ధన సహాయం చేశారు. ఈయన కాకినాడలో వ్యాపారి.
* కందుకూరి వీరేశలింగం చేపట్టిన కార్యక్రమాలకు ఆయన మిత్రులైన పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు, విద్యార్థులు అండగా ఉండేవారు.
* ఆయన స్త్రీల కోసం సతీహితబోధిని అనే పత్రికను నడిపారు. వితంతు శరణాలయాన్ని స్థాపించారు. స్త్రీ విద్య కోసం 1874లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పారు. మల్లాది అచ్చనశాస్త్రి  దీనికి మొదటి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించారు. పిఠాపురం రాజా ఇచ్చిన రూ.పదివేలతో స్త్రీ విద్య కోసం రాజమండ్రిలో ఒక ఉన్నత పాఠశాలను స్థాపించారు. 
* సమాజంలోని దురాచారాలను రూపుమాపి, తన భావాలను ప్రచారం చేయడానికి ‘వివేకవర్ధిని’ అనే పత్రికను ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యాలు సమాజంలోని రుగ్మతలను, ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతిని ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన.
* హాస్య సంజీవిని (1876) అనే హాస్య పత్రికను ప్రారంభించారు. తెలుగులో మొదటి ప్రహసనాన్ని ఇందులోనే ప్రచురించారు. వ్యంగ్య రూపకాలనూ అచ్చువేశారు.
* సమాజసేవ కోసం 1905లో ‘హితకారిణి’ అనే ధర్మ సంస్థను స్థాపించి తన ఆస్తిని దానం చేశారు.
* యుగకర్తగా పేరొంది, గద్య తిక్కన అనే బిరుదుపొందారు.


స్త్రీల పట్ల సానుభూతి

* 1887లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. దీనిద్వారా స్త్రీల స్థితిగతులను మెరుగుపరచడానికి, వారి దుస్థితిని తొలగించడానికి నిర్విరామంగా కృషి చేశారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, భోగం వారికి కట్నాలు ఇవ్వడం మొదలైన దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

సాహిత్యసేవ

సంఘసేవకే కాకుండా  వీరేశలింగం సాహిత్యానికీ ఎనలేని సేవ చేశారు. చదువుకునే రోజుల నుంచే వ్యాసాలు రాయడం, వ్యవహారిక భాషలో రచనలు చేయడాన్ని అలవరుచుకున్నారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల్లో ఈయన ఒకరు. 
* ఆంగ్ల, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం)లోని సంధి, విగ్రహ భాగాలను పరవస్తు చిన్నయసూరి వదిలేయగా వీరేశలింగం పూర్తిచేశారు.

 

ఇతర విశేషాలు...
* స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి వివేకవర్ధిని (1874), స్త్రీజనోద్ధరణ కోసం సతీహిత బోధిని (1883), సత్యసంవర్ధిని, సత్యదూత, చింతామణి, తెలుగు జనానా (1904), సత్యవాదిని (1905) పత్రికలను నిర్వహించారు. 
* వివేకవర్ధినికి శాశ్వత చందాదారుడిగా ఇ.పి.మెట్కాఫ్‌ అనే ఆంగ్లేయుడు సభ్యత్వం తీసుకున్నారు. దీనికి చందాదారుడిగా చేరిన తొలి విదేశీయుడూ ఈయనే.
* రాజమండ్రిలో టౌన్‌హాల్‌ను నిర్మించారు.
* కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కందుకూరి వీరేశలింగం సామాజిక సంస్కరణలు నచ్చక తన ‘ఆంధ్రభాషా సంజీవని’ పత్రికలో ‘వీరిగాడు’ అనే పాత్రను సృష్టించి, కందుకూరిని అవహేళన చేశారు. పంతులు దానికి పోటీగా ‘హస్య సంజీవని’ పత్రికలో ‘కొ.కొ.కొ.క్కొండ’ అనే నత్తిపాత్రను సృష్టించి వెంకటరత్నాన్ని విమర్శించారు. వెంకటరత్నం తెలుగులో వెండి అనే పేరుతో సంతాన ఛందస్సును ప్రవేశ పెట్టారు. ఈయనకు మహా మహోపాధ్యాయ అనే బిరుదు ఉంది.
* వీరేశలింగం 1875లో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించారు. 
* వితంతు పునర్వివాహ సంఘానికి 1880లో మానింగ్‌ అనే బ్రిటన్‌ మహిళ 50 పౌండ్లను ఇచ్చారు.
* వీరేశలింగం తెలుగు సాహిత్యంలో స్వీయ చరిత్రలు, గద్య, నవలా రచనలు, ప్రకృతి-స్త్రీ రచనలు, ప్రహసన రచనలకు నాంది పలికారు.

వీరేశలింగం తర్వాతి యుగం

రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939)

* ఈయన్ను ‘దివాన్‌ బహదూర్‌’, ‘సర్‌’ అని పిలిచేవారు.
* విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మసమాజ ప్రచారకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
* వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1న మచిలీపట్నం (కృష్ణా జిల్లా)లో జన్మించారు. తల్లిదండ్రులు అప్పాయనాయుడు,  శేషమ్మ. తండ్రి మద్రాస్‌ సైనికదళంలో సుబేదారుగా విధులు నిర్వహించారు. వీరి పూర్వీకులు మద్రాస్, తూర్పు ఇండియా వర్తకసంఘ సైన్యంలో కమాండర్లుగా పనిచేశారు.
* తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల ఈయన విద్యాభ్యాసం అనేకచోట్ల జరిగింది. ప్రాథమిక విద్య చంద్రాపూర్‌ (మహారాష్ట్ర)లో, మాధ్యమిక విద్య హైదరాబాద్‌లోని నిజాం ఉన్నత పాఠశాలలో  అఘోరనాథ్‌ ఛటోపాధ్యాయ వద్ద పూర్తిచేశారు.
* మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు.


సంఘ సంస్కరణ సేవ: 
19వ శతాబ్దం నాటికి ఆంధ్రాలో అనేక ఆచార సంప్రదాయాలు, సాంఘిక దురాచారాలు ఉండేవి. వాటిని రూపుమాపడానికి వెంకటరత్నం ఎంతో కృషి చేశారు. సమాజం, మతంలోని లోపాలను విమర్శిస్తూ సాంఘిక సంస్కరణలకు పూనుకున్నారు.
* వెంకటరత్నం కాకినాడలో సంఘ సంస్కరణోద్యమాన్ని ప్రచారం చేశారు.
* ఈయన వేశ్యావృత్తిని వ్యతిరేకించారు. అప్పట్లో ‘భోగం’ కులానికి చెందిన స్త్రీలను దేవదాసీలుగా మార్చేవారు. దీన్ని పూర్తిగా రూపుమాపారు. 
* పిల్లల కోసం కాకినాడలో ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించారు. దీనికి పిఠాపురం మహారాజు ఆర్థికసాయం అందించారు. 
* మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇది మద్రాస్‌లో ప్రారంభమై ఆంధ్రా అంతటా వ్యాపించింది. 
* కాకినాడలో అనాథ శరణాలయాన్ని, హరిజన బాలికల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఆదాయంలో ఎక్కువభాగం పేద విద్యార్థులకే ఖర్చు చేశారు.
* దేవేంద్రనాథ్‌ ఠాగూర్, కేశవ్‌ చంద్రసేన్‌ల వల్ల బ్రహ్మసమాజ సాహిత్యానికి ఆకర్షితుడై 1885లో బ్రహ్మసమాజంలో చేరారు.
* 189495లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో బ్రహ్మసమాజ సిద్ధాంతాలపై అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.
*  పిఠాపురం రాజా సహకారంతో కాకినాడలో బ్రహ్మోపాసన మందిరాన్ని నిర్మించారు. ఇవే కాకుండా ధర్మ ప్రచారక నిధి, ఆంధ్ర బ్రహ్మ అనే సంస్థలను స్థాపించారు.
* బెంగాల్‌ భాషలోని బ్రహ్మసమాజ గ్రంథాలను తెలుగులోకి అనువదించేందుకు   పిఠాపురం రాజా బ్రహ్మప్రచారకులకు లక్షరూపాయల మూలధనంతో ఒక నిధిని కేటాయించారు.
* 1891లో ‘సాంఘిక శుద్ధి' (Social Purity Association)' అనే సమాజాన్ని స్థాపించారు. నిజాయతీగల పౌరులను తయారుచేయడం దీని లక్ష్యం.
* వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.
* 1932లో బ్రహ్మసమాజం ఈయనకు ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఇచ్చింది.
* కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్యలను ‘బ్రహ్మసమాజ త్రయం’గా పిలుస్తారు.
* ఈయన ‘బ్రహ్మప్రకాశిక’, ‘ఫెల్లోవర్కర్‌’, ‘పీపుల్స్‌ ఫ్రెండ్‌’ అనే పత్రికలను స్థాపించారు. ఇవి సాంఘిక సంస్కరణకు, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు దోహదం చేశాయి.
* ఈయనకు 1884లో వివాహం జరిగింది. 1889లో భార్య మరణించినా, పునర్వివాహం చేసుకోకుండా తెల్ల దుస్తులు ధరించారు. అందుకే ఆయన్ను ‘శ్వేతాంబర రుషి’ అని పిలిచేవారు.


విద్య కోసం కృషి- సంస్కరణలు: 
* William words worth, ఎమర్సర్, Mincobert వంటి ఆంగ్లకవులకు వెంకటరత్నం ఆకర్షితులయ్యారు.
* మద్రాసులోని పుచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల ఆచార్యునిగా మొదలుపెటి, 1899-1904 వరకు సికింద్రాబాద్‌ మహబూబ్, ముంబయి కాలేజీల్లో పనిచేశారు.
* 1904లో కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలకు(పి.ఆర్‌.కళాశాల) ప్రిన్సిపాల్‌గా చేశారు.
* 1911లో మొదటిసారిగా మహిళలను కళాశాలలో చేర్చుకుని సహవిద్యను ప్రోత్సహించారు.
* 1925-28లలో మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి(వైస్‌ఛాన్సలర్‌)గా వ్యవహరించారు.
* మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడుగా నాయుడు ప్రసిద్ధి చెందారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన బిల్లు(ఆంధ్ర విశ్వకళా పరిషత్‌)ను రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు. ఈ విశ్వవిద్యాలయానికి వి.సి.గా పనిచేశారు.
* విజ్ఞానాభివృద్ధికి తన గురువైన డాృృ మిల్లర్‌ పేరిట మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో 10వేల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు.
* 1923లో మద్రాస్‌ శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు, మద్యపాన నిషేధం బిల్లు ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.
* 1924లో బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి విద్య, సంఘ సంస్కరణ కృషికి ‘నైట్‌హుడ్‌’ పురస్కారాన్ని పొందారు. ఒక అనధికార విద్యావేత్తకు ఈ బిరుదు దక్కడం ఇదే ప్రథమం.
* 1927లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ మొదటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.
* భాషావేత్తలకు డాక్టరేట్‌ డిగ్రీలను ఇచ్చే సంప్రదాయాన్ని మొదటగా నాయుడు ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతోంది.
* తమిళ సాహిత్యంలో డాక్టరేట్‌ అందుకున్న మొదటి వ్యక్తిగా స్వామినాథ్‌ అయ్యర్‌ గుర్తింపు పొందారు.
* రఘుపతి వెంకటరత్నం నాయుడు అపర సోక్రటీస్, కులపతి, కైజర్‌-ఇ-హింద్‌’ అనే బిరుదులు కూడా ఉన్నాయి.
* ఉర్దూ, పర్షియన్, హిందీ భాషలలో కూడా మంచి ప్రావీణ్యం పొందారు.
* ‘సాంఘిక సంస్కరణ’ అనే గ్రంథం రచించారు.
* గురు-శిష్యుల జంటగా నాయుడుని- వేమూరి రామక్రిష్ణారావులను పేర్కొంటారు.
* రఘుపతి వెంకటరత్నం సోదరుడు - రఘుపతి వెంకయ్యనాయుడు. ఇతను ఆంధ్రాలో ప్రముఖ సినీ నిర్మాతగా, పంపిణీదారుగా పేరొందారు.
* వెంకటరత్నం గౌరవార్థం ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పారు.
* ఆంధ్రదేశ సాంఘిక వైతాళికులలో అగ్రగణ్యుడుగా నిలిచారు.
* 1939 మే 26న, 76 సంవత్సరాల వయసులో మరణించారు.


దేశిరాజు పెదబాపయ్య (1877-1903)

* ఈయన 1877లో మచిలీపట్నంలో జన్మించారు. 
* కందుకూరి వీరేశలింగానికి ఆత్మబంధువుగా ఈయన్ను పేర్కొంటారు. 
* స్త్రీ విద్యను, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. 
* బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల ప్రభావితుడై, సంఘ సంస్కరణకు కృషి చేశారు.
* ‘వాయిస్‌ ఆఫ్‌ ట్రూత్‌’ అనే పత్రికను నడిపారు. 
* టెంపరెన్స్‌ సోషల్‌ ప్యూరిటీ, యంగ్‌ మెన్స్‌ ప్రియర్‌ యూనియన్‌’ సంస్థలను స్థాపించారు. 


వేమూరి రామకృష్ణారావు (1876-1939)

* ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడు శిష్యుడు. వెంకటరత్నం ఈయన్ను తన నీడగా అభివర్ణించారు.
* వెంకటరత్నం ప్రవచనాలను, అధ్యక్షోపన్యాసాలను, ఉపన్యాసాలను 8 వాల్యూమ్స్‌గా ప్రచురించారు.


వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1812-91)


* ఈయన 1812లో నెల్లూరులోని విదవలూర్‌లో జన్మించారు.
* ‘సరస్వతి ముద్రాలయం’ అనే తెలుగు పబ్లిషింగ్‌ హౌస్‌ను స్థాపించారు. తర్వాత, దీని పేరు ‘వావిళ్ల ప్రెస్‌’గా  మార్చారు.
* 1854లో చెన్నపట్నంలో ‘హిందూ భాషా సంజీవని’ పేరుతో మరో ప్రెస్‌ను స్థాపించారు. ఇది తెలుగులో ఏర్పాటైన మొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌.
* ఈయన 50కి పైగా తెలుగు, సంస్కృత గ్రంథాలను ముద్రించారు.
* 1860లో ‘ది గ్రేట్‌ ప్రైమర్‌’ అనే టైప్‌ రైటింగ్‌ను రూపొందించారు.
* తెలుగు భాషకు ఈయన చేసిన కృషికి సి.పి. బ్రౌన్‌ అభినందించారు. 
* ‘ఆది సరస్వతి నిలయం’ అనే సంస్థను స్థాపించారు.
* రామస్వామి అనంతరం ఆయన కుటుంబసభ్యులు ఈ ప్రెస్‌ను కొనసాగించారు.

 

కందుకూరి వీరేశలింగం పంతులు యుగం తర్వాత 19, 20 శతాబ్దాల్లో ఆంధ్రాలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. వారిలో గురజాడ వెంకట అప్పారావు ముఖ్యులు. 


గురజాడ అప్పారావు (1862-1915)

* ఈయన 1862, సెప్టెంబరు 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలుకా ఎస్‌ రాయవరంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట రామదాసు, కౌసల్యమ్మ.  
* ప్రముఖ రచయిత, మహాకవి, సాహితీవేత్త, సంఘసంస్కర్త, హేతువాది, అభ్యుదయ వాదిగా గుర్తింపు పొందారు.
* తన రచనల ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు. తెలుగు వ్యాసాంగాన్ని సంప్రదాయ శైలి నుంచి ఆధునిక శైలికి మార్చారు.
* ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా గురజాడ గ్రామం. అందుకే వీరి ఇంటిపేరు గురజాడగా మారింది. తర్వాత విశాఖపట్నానికి వలస వచ్చారు.
* వెంకట రామదాసు విజయనగర సంస్థానంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
* అప్పారావు తన పదేళ్ల వయసు వరకు చీపురుపల్లిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తర్వాత ఎం.ఆర్‌.కాలేజీ ప్రిన్సిపల్‌ సి.చంద్రశేఖర శాస్త్రి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. 
* 1882లో మెట్రిక్యులేషన్, 1884లో ఎఫ్‌ఏ పూర్తిచేసి ఎం.ఆర్‌. హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు.
* విజయనగరంలో బీఏ పూర్తి చేశారు. అక్కడే వాడుకభాష/ వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులుతో పరిచయం ఏర్పడింది.
* 1885లో నరసమ్మతో వివాహం జరిగింది.
* 1889లో ఆనంద గజపతి డిబేటింగ్‌ క్లబ్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకుడిగా పనిచేశారు.
* 1886లో డిప్యూటీ కలెక్టర్‌ హెడ్‌ ఆఫీస్‌లో హెడ్‌ క్లర్క్‌గా; 1887లో మహారాజ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 
* 1887లో విజయనగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో పాల్గొని సామాజిక చైతన్యం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. 
* విశాఖపట్నం వాలంటరీ సర్వీసుల్లో చేరారు.
* 1882లో మొదటిసారిగా ‘ది - కాకు’ అనే కవితను రాశారు. ‘ఇండియన్‌ లీజర్‌  అవర్‌’ పత్రిక దీన్ని ప్రచురించింది. 
* ఆనంద గజపతి మరణించాక, ఆయన సోదరి దేవా మహారాణి అప్పల కొండాయమ్మ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆమె అభీష్టం మేరకు 1907లో నీలగిరి పాటలను రచించారు.
* గురజాడ తన తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్ల పద్యాలను రాశారు. ‘సారంగధర’ (1883) కవిత వీరికి మంచి పేరు తెచ్చింది. ఇది ఇండియన్‌ లీజర్‌ అవర్‌ పత్రిక విజయనగరం ఎడిషన్‌లో అచ్చయ్యింది. ఆ సమయంలో దీని సంపాదకులుగా గుండుకుర్తి వెంకట రమణయ్య ఉన్నారు.
* 1896లో ‘ప్రకాశిక’ పత్రికను ప్రారంభించారు.
* 1910లో ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా’ అనే ప్రముఖ గేయాన్ని రచించారు.
* 1911లో మద్రాస్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం పొందారు.
* గురజాడ తన స్నేహితులతో కలిసి ‘ఆంధ్రాసాహిత్య పరిషత్‌’ను ప్రారంభించారు.
* 20వ శతాబ్దం తొలినాళ్లలో గిడుగు రామ్మూర్తి పంతులుతో కలిసి వ్యవహారిక భాషోద్యమంలో పాల్గొన్నారు. 
* 1913లో అప్పారావు అధ్యాపకుడిగా పదవీ విరమణ చేశారు. 
* 1915, నవంబరు 30న 53 ఏళ్ల వయసులో మరణించారు. ఈ సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఆయన చనిపోలేదు, జీవించడం ప్రారంభించారు’ అని వ్యాఖ్యానించారు.
* మద్రాస్‌ విశ్వవిద్యాలయం అప్పారావును ‘ఫెల్లో’ బిరుదుతో సత్కరించింది.


రచనలు


కన్యాశుల్కం: ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యంగా విజయనగర సంస్థానంలో కన్యాశుల్కం, వేశ్యావృత్తి, బాల్యవివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండేవి. వీటికి వ్యతిరేకంగా  కన్యాశుల్కం పేరుతో గురజాడ తెలుగు వాడుక భాషలో నాటకాన్ని రచించారు. ఆంధ్రా ప్రాంతంలో తొలి సాంఘిక వచన నాటకం ఇదే. దీన్ని విజయనగరం రాజైన ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. 
* కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు 1897లో జరిగింది. దీన్ని అయిదు అంకాలు, 132 రంగాలు, 109 పేజీలతో పూర్తిచేశారు.
* శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం (సంస్కృత నాటకం) స్ఫూర్తితో గురజాడ కన్యాశుల్కాన్ని రచించారు. ఇందులోని శకారునితో గిరీశం పాత్రను; వసంత సేనతో మధురవాణి పాత్రను సృష్టించారు. ఈ నాటకంలో శ్రీకాకుళం మాండలికాన్ని తొలిసారి వాడారు. 
* ఈ నాటకం రెండో కూర్పు 1909లో ఉదక మండలంలో జరిగింది. ఇందులో ఏడు అంకాలు, 133 రంగాలు, 199 పేజీలు ఉన్నాయి. 
* ఈ నాటకాన్ని మొదట 1892లో జగన్నాథ విలాసిని సంస్థ ప్రదర్శించింది. 
* ఈ నాటకంలో సత్యకాలపు వితంతువుగా బుచ్చమ్మ, సంస్కారం ఉన్న వేశ్యగా మధురవాణి, చదువుకున్న వంచకుడిగా గిరీశం, ఛందస్సు పండితుడిగా అగ్నిహోత్రావధానులు, సంస్కర్తగా సౌజన్యరావు, ఢాంబికుడిగా రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఉన్నాయి.
* కట్టమంచి రామలింగా రెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటకాన్ని మహాకావ్యంగా, ఆంధ్రా సాహిత్యంలో శాశ్వత స్థానం పొందిందని వ్యాఖ్యానించారు.
* గిడుగు రామ్మూర్తి పంతులు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఈ నాటకం విలువలను ఎంతో ప్రశంసించారు.
* 1897లో కన్యాశుల్కం నాటకాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్స్‌ (మద్రాస్‌) వారు ప్రచురించారు.
* కన్యాశుల్కం నాటకాన్ని కన్నడ, తమిళం, హిందీ, ఫ్రెంచ్, రష్యన్, ఆంగ్ల (రెండుసార్లు) భాషల్లోకి అనువదించారు.
* 100 ప్రదర్శనలు పూర్తిచేసుకున్న మొదటి  తెలుగు సాంఘిక నాటకం ఇదే.
* గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకానికి సాటి వచ్చే రచన భారతీయ సాహిత్యంతో మృచ్ఛకటికం తప్ప మరొకటి లేదని శ్రీశ్రీ వ్యాఖ్యానించారు. ఇది బీభత్సరస ప్రధాన విషాదాంత నాటకమని పేర్కొన్నారు.
* ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అనే సుప్రసిద్ధ గేయాన్ని గురజాడ రాశారు. ఇందులోని ఇతివృత్తం కూడా కన్యాశుల్కమే. ఇందులో బాల్యవివాహ వ్యవస్థ వల్ల జరిగే అనర్థాలను వివరించారు.
* కొండుభట్టీయం, ముత్యాలసరాలు (1910), కన్యక, సత్యవతి శతకం, సుభద్ర, లంగరెత్తుము (1915), దించులంగరు (1914), లవణరాజు కల, కథానికలు, సౌదామిని, మీపేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతం-విమతం, పుష్పాలవికలు మొదలైన రచనలు చేశారు. 
* తెలుగు సాహిత్యంలో ముత్యాలసరాలు అనే నూతన ఛందస్సును ప్రవేశపెట్టారు.
* ‘బిల్హణీయం’ అనే గ్రంథం అసంపూర్ణ రచనగా మిగిలింది.
* కొండుభట్టీయం అనే గ్రంథంలో గిరీశం పాత్రను రెండోసారి ప్రవేశపెట్టారు.
* లవణరాజు కల అనే కథలో కుల వ్యవస్థను ఖండించారు.
* దిద్దుబాటు, సంస్కర్త హృదయం రచనల్లో వేశ్యావృత్తిని వివరించారు.
* చారిత్రక గ్రంథాలైన పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగరాజుల చరిత్ర మొదలైనవి ఈయన రచనలే.


చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1940)

* ఈయన 1867, సెప్టెంబరు 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకయ్య, తల్లి రత్నమ్మ.
* నరసాపురం, రాజమండ్రిలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 
* సంఘ సంస్కరణలో కేశవ చంద్రసేన్, ఎం.జి.రనడే లాంటి వారి నుంచి స్ఫూర్తి పొందారు.
* కవిగా, రచయితగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా, సంఘ సంస్కరణవాదిగా, విద్యావేత్తగా, సాహిత్యకారుడిగా, దేశభక్తుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.
* 1889లో రాజమండ్రిలోని ఆర్య పాఠశాలలో, ఇన్నీసుపేట మున్సిపల్‌ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
* 1899లో హిందూ లోయర్‌ సెకండరీ పాఠశాలను స్థాపించారు. తర్వాత దీన్ని వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చారు.
* 30 ఏళ్ల వయసులో ఈయనకు రేచీకటి వ్యాధి వచ్చింది.


రచనలు: 1889లో మొదటిసారి ‘కీచకవధ’ అనే నాటకాన్ని రచించారు. 188990 మధ్య కాలంలో  ద్రౌపది పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకల్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటకాలు రాశారు. 1922లో చతుర చంద్రహాసం అనే రచన చేశారు.

నవలలు: రామచంద్ర విజయం (1894), హేమలత (1896), అహల్యాబాయి (1897), సుధా శరచ్ఛంద్రం, సౌందర్య తిలక (1898-1900), పార్వతీ పరిణయం.
* ఈయన రాసిన గణపతి అనే హాస్య నవల బాగా ప్రాచుర్యం పొందింది. 
* 1893లో న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీల్లో రామచంద్ర విజయం ఉత్తమ నవలగా ఎంపికైంది. సుబ్బారావు నిర్వహించిన చింతామణి పత్రికలో హేమలత, గణపతి, అహల్యాబాయి నవలలు ప్రచురితమయ్యాయి.
* కల్నల్‌ టాడ్‌ రాసిన రాజస్థాన్‌ కథాకళిని చిలకమర్తి తెలుగులోకి అనువదించారు. ఇది ఒక చారిత్రక గ్రంథం.
* లులాయి అనే శతకాన్ని రచించారు.
* పోలవరం జమీందారు స్థాపించిన సరస్వతి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
* 1906లో మనోహర, 1907లో దేశమాత పత్రికలను నడిపారు.

సంఘసంస్కర్తగా..: 

* 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. నిమ్నవర్గాల వారి కోసం మరో హరిజన పాఠశాలను నెలకొల్పారు.
* బ్రహ్మసమాజం, హితకారిణి నిర్వహించే సమాజ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
* దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు.
* దళితులకు చేసిన సేవలకు అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్డ్‌ పెంట్‌లాండ్‌ ఈయన్ను ప్రశంసించారు.
* పండిత శివనాథ శాస్త్రి ఈయన్ను ‘లోకల్‌ షేక్‌స్పియర్‌’ అని ప్రశంసించారు. ‘చిలకమర్తిది ఫొటోజెనిక్‌ మెమొరీ’ అని వాసురాయ కవి పేర్కొన్నారు.
* చిలకమర్తి రాసిన ‘గయోపాఖ్యానం’ నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడయ్యాయి.
* స్వాతంత్రోద్యమ సమయంలో ఈయన ‘భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’  అనే గేయాన్ని రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
* 21 అధ్యాయాలతో చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర రాసుకున్నారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
* 1907, ఏప్రిల్‌ 19న రాజమండ్రిలో జరిగిన సభలో బిపిన్‌ చంద్రపాల్‌ ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు.
* చతురకవి, ఆంధ్రా స్కాట్, ఆంధ్రుల అంధకవి అనే బిరుదులు పొందారు.
* ఆంధ్రా తొలి తెలుగు జాతీయకవిగా చిలకమర్తి గుర్తింపు పొందారు.
* ఈయన 1940, జూన్‌ 17న మరణించారు.
* 1943లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ పురస్కారంతో ఈయన్ను సత్కరించింది.


మాదిరి ప్రశ్నలు

1. ‘కరుణాలయం’ అనే శరణాలయాన్ని స్థాపించింది ఎవరు?
1) వీరేశలింగం పంతులు  
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) వీరస్వామి        4) ఎవరూకాదు


2. ‘సాంఘిక శుద్ధి’ అనే సమాజాన్ని స్థాపించింది ఎవరు?
1) రఘుపతి వెంకటరత్నం నాయుడు
2) అనంత రామశాస్త్రి
3) వీరేశలింగం       4) వీరసామయ్య


3. ‘బ్రహ్మర్షి’ అనే బిరుదు ఎవరికి ఉంది?
1) వీరసామయ్య    2) లక్ష్మీ నరసింహం
3) వీరేశలింగం       4) రఘుపతి వెంకటరత్నం నాయుడు


4. కింది ఎవరిని బ్రహ్మసమాజ త్రయంగా పిలుస్తారు?
1) కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదబాపయ్య
2) లక్ష్మీ నరసింహం, కందుకూరి వీరేశలింగం, దేశిరాజు పెదబాపయ్య
3) సామినేని ముద్దు నరసింహం, అనంత రామశాస్త్రి, కందుకూరి వీరేశలింగం
4) ఎవరూకాదు


5. శ్వేతాంబర రుషి అని ఎవరిని పిలుస్తారు?
1) వీరేశలింగం పంతులు         2) గాజుల లక్ష్మీనరసుశెట్టి
3) దేశీరాజు పెదబాపయ్య         4) రఘుపతి వెంకటరత్నం


6. బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్‌ ఫ్రెండ్‌ పత్రికలను స్థాపించిన వారు?
1) దేశిరాజు పెదబాపయ్య           2) వీరేశలింగం
3) రఘుపతి వెంకటరత్నం నాయుడు      4) శ్రీనివాస పిళ్లై


7. మద్రాస్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడు? 
1) రఘుపతి వెంకటరత్నం నాయుడు
2) అనంత రామశాస్త్రి
3) వీరేశలింగం పంతులు
4) శివనాథ శాస్త్రి


సమాధానాలు: 1-2;  2-1;  3-4;  4-1; 5-4;  6-3;  7-1.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు

రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది.
           భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.

పరిపాలనా విధానం

  రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

సామాజిక వ్యవస్థ

  రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

మత పరిస్థితులు

  రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.

 

ఆర్థిక పరిస్థితులు

   రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం - అతివాద యుగం

  1905 నుంచి 1920 వరకు గల జాతీయోద్యమ దశను అతివాద యుగంగా పేర్కొంటారు. బాలగంగాధర్‌ తిలక్‌ నాయకత్వంలో అతివాదులు వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించి విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఆంగ్లేయులు అనుసరిస్తున్న దౌర్జన్యకర విధానాలను ఎదుర్కోవాలంటే మరింత దృఢ వైఖరితో పోరాడాలన్నదే వీరి లక్ష్యం.

అతివాదం తలెత్తడానికి గల కారణాలు

  గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో మితవాదులు ప్రార్థన - విజ్ఞప్తి - నిరసన లాంటి విధానాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధించలేదని, వారి వైఫల్యం కారణంగానే అతివాదం తలెత్తిందని చరిత్రకారుల భావన. 1905లో అతివాదం తలెత్తడానికి తక్షణ కారణం బెంగాల్‌ విభజన. 1896లో ఆఫ్రికా ఖండానికి చెందిన అబిసీనియా (ఇథియోపియా) చేతిలో ఐరోపాకు చెందిన ఇటలీ ఓడిపోవడం, రష్యాలో జార్‌ చక్రవర్తుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శూన్యవాదం తలెత్తడం, 1905లో రష్యా ఆసియాలోని చిన్న దేశమైన జపాన్‌ చేతిలో ఓడిపోవడం లాంటి అంతర్జాతీయ కారణాలు కూడా భారతదేశంలో అతివాదం తలెత్తడానికి దోహదపడ్డాయి. వీటితో పాటు ఆంగ్లేయుల జాతి వివక్ష, విభజించు - పాలించు విధానాలు; అణచివేత చర్యలు అతివాదం ఏర్పడటానికి ప్రధాన కారణాలు.

బెంగాల్‌ విభజన

  1905లో అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ పరిపాలనా సౌలభ్యం పేరుతో బెంగాల్‌ను విభజించాడు. 1903లోనే బెంగాల్‌ విభజనను ప్రకటించినప్పటికీ, 1905 జులై 19న విభజన జరిగింది. కానీ ఇది 1905 అక్టోబర్‌ 16 నుంచి అమల్లోకి వచ్చింది. నేటి బిహార్, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, బంగ్లాదేశ్‌లతో కూడినదే అప్పటి బెంగాల్‌. నాటి బెంగాల్‌ జనాభా 78 మిలియన్లు. అందుకే కర్జన్‌ ‘పరిపాలనా సౌలభ్యం’ కోసం బెంగాల్‌ను విభజిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ వాస్తవానికి జాతీయతా భావాన్ని అణచివేయడానికి, విభజించు - పాలించు విధానంతో హిందూ ముస్లింలను విడదీయడానికే కర్జన్‌ బెంగాల్‌ను విభజించాడు. అందుకే భారతీయులు దీనికి వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించారు.

వందేమాతర ఉద్యమం (1905 - 1911)

  ఇది అతివాదులు చేపట్టిన తొలి అఖిల భారత ఉద్యమం. దీన్నే స్వదేశీ ఉద్యమం అని కూడా పేర్కొంటారు. లార్డ్‌ కర్జన్‌ చేసిన బెంగాల్‌ విభజన 1905 అక్టోబరు 16న అమల్లోకి వచ్చింది. జాతీయ నాయకులు ఆ రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించి వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే రోజు కలకత్తాలో జరిగిన రెండు బహిరంగ సమావేశాల్లో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్‌లు ప్రసంగించారు.

  అతివాద త్రయంగా పేరొందిన లాల్‌ - బాల్‌ - పాల్‌లు దేశమంతటా ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. తిలక్‌    ‘ఇది యాచన కాదు - శూరత్వం (బిచ్చమెత్తడం కాదు - శివమెత్తడం)’ అని పేర్కొంటూ పూనాలో స్వదేశీ నేత కంపెనీని స్థాపించి, సహకార విక్రయ కేంద్రాలను ప్రారంభించాడు. ఢిల్లీలో సయ్యద్‌ హైదర్‌రజా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చిదంబరం పిళ్లై మద్రాస్‌ రాష్ట్రంలోని ట్యుటికోరన్‌ రేవులో స్వదేశీ స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని స్థాపించాడు.

  1905 సెప్టెంబరులో జి. సుబ్రహ్మణ్య అయ్యర్‌ అధ్యక్షతన మద్రాస్‌ బీచ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గీతాలను ఆలపించాడు. కృష్ణా పత్రిక సంపాదకుడైన ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రదేశంలో పర్యటించి వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాజమండ్రి సమావేశంలో పాల్‌ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంలోనే చిలకమర్తి ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అనే సుప్రసిద్ధ పద్యాన్ని ఆలపించారు. ఈ ఉద్యమ కాలంలోనే ఆంధ్రదేశంలో కాకినాడ కొట్లాట, తెనాలి బాంబు కేసు; రాజమండ్రి కళాశాల, కోటప్ప కొండ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కరణం గున్నేశ్వరరావు ఇచ్చిన విరాళంతో గోదావరి స్వదేశీ స్టోర్స్‌ను ఏర్పాటుచేశారు. గుంటూరులో భావనాచార్యులు అనే వ్యక్తి చందాలు వసూలు చేసి పారిశ్రామిక శిక్షణ కోసం యువకులను విదేశాలకు పంపే ఏర్పాట్లు చేశాడు. మల్లాది వెంకట సుబ్బారావు (కాకినాడ), ఎస్‌.రామారావు (బళ్లారి) జపాన్‌ వెళ్లి శిక్షణ పొందారు. ఈ ఉద్యమ సమయంలోనే బందరు జాతీయ కళాశాల (మచిలీపట్నం)ను ఏర్పాటు చేశారు.
బెంగాల్‌లో 1906లో వంగలక్ష్మీ కాటన్‌ మిల్లును; జాతీయ శిక్షా పరిషత్‌ను, అరవింద్‌ ఘోష్‌ అధ్యక్షుడిగా (ప్రిన్సిపల్‌) బెంగాల్‌ జాతీయ కళాశాలను స్థాపించారు. పీసీ రే బెంగాల్‌ స్వదేశీ కెమికల్‌ స్టోర్స్‌ను ప్రారంభించారు. బెంగాల్‌ యువకులను విదేశాలకు పంపడానికి జోగేంద్ర చంద్ర ఘోష్‌ విరాళాలు సేకరించాడు. సుబోధ్‌ చంద్ర మల్లిక్‌ విద్యాభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. వందేమాతర ఉద్యమ కాలంలోనే
లాలాలజపతిరాయ్, అజిత్‌ సింగ్‌లను దేశం నుంచి బహిష్కరించారు. ప్రభుత్వం ఉద్యమ అణచివేతకు అనేక చర్యలు చేపట్టింది. 1906లో అప్పటి వైస్రాయ్‌ రెండో మింటో సిమ్లాలో ముస్లింలను సమావేశపరచి ముస్లిం లీగ్‌ స్థాపనను ప్రోత్సహించాడు.

  సలీముల్లా నాయకత్వంలో సిమ్లా వెళ్లిన ముస్లింలు ఆగాఖాన్‌ అధ్యక్షతన ముస్లిం లీగ్‌ను స్థాపించారు. 1907లో సూరత్‌ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. దీన్నే ‘సూరత్‌ చీలిక’ అంటారు. 1907 నాటి సూరత్‌ సమావేశానికి రాస్‌ బిహారి ఘోష్‌ అధ్యక్షత వహించారు. సూరత్‌ చీలికలో మితవాదులు ఫిరోజ్‌షా మెహతాను, అతివాదులు లాలాలజపతిరాయ్‌ను తమ నాయకులుగా ఎన్నుకున్నారు. ఆంగ్లేయులు అతివాదులను సంతృప్తి పరచడానికి 1909లో మింటో - మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడాన్ని అతివాదులు వ్యతిరేకించారు. రెండో మింటోను భారతదేశంలో మతపరమైన నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొంటారు. 

  1911లో భారతీయులు వందేమాతర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఫలితంగా అప్పటి వైస్రాయ్‌ రెండో హార్డింజ్‌ ఢిల్లీ దర్బార్‌ను ఏర్పాటు చేసి బెంగాల్‌ విభజనను రద్దు చేస్తున్నట్లు, భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వందేమాతర ఉద్యమాన్ని నిలిపివేశారు. ఇది అతివాదుల తొలి విజయం.

హోంరూల్‌ ఉద్యమం (1916 - 17)

  అతివాదులు నిర్వహించిన రెండో అఖిల భారత ఉద్యమమే హోంరూల్‌ ఉద్యమం. స్వయంపాలన (హోంరూల్‌) అనేది ఐర్లాండ్‌ దేశ భావన. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో అతివాదులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. తిలక్, అనిబిసెంట్‌ ఈ ఉద్యమ ప్రచారానికి ఎంతో కృషిచేశారు. 1916 ఏప్రిల్‌లో తిలక్‌ పూనా కేంద్రంగా, సెప్టెంబరులో అనిబిసెంట్‌ మద్రాస్‌ (అడయార్‌)లో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించారు. 1916 నాటి లక్నో ఒడంబడిక ద్వారా అనిబిసెంట్‌ అతివాదులు - మితవాదులను, కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌లను కలిపి హోంరూల్‌ ఉద్యమం విజయవంతం కావడానికి కృషి చేశారు. 1916 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ లక్నో సమావేశానికి అంబికా చరణ్‌ మజుందార్‌ (ఎ.సి. మజుందార్‌) అధ్యక్షత వహించారు. హోంరూల్‌ ఉద్యమ కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.ఎస్‌. అరుండేల్‌ను నియమించారు. తిలక్‌ తన కేసరి, మరాఠా పత్రికలు; అనిబిసెంట్‌ న్యూ ఇండియా, కామన్‌ వీల్‌ పత్రికల ద్వారా ప్రచారం చేశారు. ఈ ఉద్యమ కాలంలోనే తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మహక్కు - దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించాడు. అనిబిసెంట్‌ 1917లో ఆంధ్రదేశంలో ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. ఇక్కడ ఆమె 52 హోంరూల్‌ లీగ్‌ శాఖలను స్థాపించారు. అదే ఏడాది మేలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో అనిబిసెంట్‌ ఒక జాతీయ కళాశాలను స్థాపించి, హెచ్‌.సి. కజిన్స్‌ను తొలి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆంధ్రాలో హోంరూల్‌ ఉద్యమానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వం వహించారు.

  బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమ అణచివేతకు అనేక హింసాత్మక చర్యలను చేపట్టింది. తిలక్‌ను పంజాబ్, ఢిల్లీలో పర్యటించకుండా ఆంక్షలు విధించింది. అనిబిసెంట్, ఆమె అనుచరులను ఊటీలో అరెస్ట్‌ చేసి కోయంబత్తూర్‌ చెరసాలలో నిర్బంధించారు. అనిబిసెంట్‌ అరెస్ట్‌కు నిరసనగా సుబ్రహ్మణ్య అయ్యర్‌ తన ‘సర్‌’ బిరుదును త్యజించి, అమెరికా అధ్యక్షుడికి సైతం లేఖ రాశాడు. తిలక్‌ 'ఇండియన్‌ అన్‌రెస్ట్'  గ్రంథ రచయిత వాలెంటైన్‌ చిరోల్‌ (సిస్టర్‌ నివేదిత)పై ఉన్న కేసు వాదించడానికి ఇంగ్లండ్‌ వెళ్లడం, అనిబిసెంట్‌ అరెస్ట్‌ లాంటి కారణాలతో ఈ ఉద్యమం క్షీణించింది. ముఖ్యంగా అప్పటి భారత రాజ్య కార్యదర్శి ఎడ్విన్‌ మాంటేగ్‌ 1917 ఆగస్టు 20న మొదటి ప్రపంచ యుద్ధానంతరం దశల వారీగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇస్తామని ప్రకటించడంతో ఉద్యమాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీన్నే మాంటేగ్‌ ప్రకటన అంటారు. ఈ ప్రకటనను అనుసరించి బ్రిటిష్‌ ప్రభుత్వం మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలను 1918లోనే ప్రకటించినప్పటికీ 1919లో అమల్లోకి వచ్చాయి. అందుకే దాన్ని 1919 చట్టం లేదా మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు అని పేర్కొంటారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ దీన్ని కూడా తిరస్కరించింది. ఈ విధంగా అతివాదులు వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించి జాతీయోద్యమ అభివృద్ధికి కృషిచేశారు.

అతివాదనాయకులు

బాలగంగాధరతిలక్‌ (1856 - 1920)

  లోకమాన్య, దేశభక్తుల్లో రాజు, భారత అశాంతి జనకుడు లాంటి బిరుదులు పొందిన బాలగంగాధర్‌ తిలక్‌ 1856లో పూనాలో జన్మించాడుకేసరి (మరాఠా భాష), మరాఠా (ఆంగ్ల భాష) పత్రికలు ప్రారంభించి, వాటి ద్వారా జాతీయతా భావాలను ప్రచారం చేశాడు. సామాన్య ప్రజలకు చేరువగా ఉంటూ రాజద్రోహ నేరం కింద అరెస్టైన తొలి భారతీయుడిగా పేరొందాడు. హిందూమతంతో జాతీయోద్యమాన్ని ముడిపెట్టి 1893లో గణపతి, 1895లో శివాజీ ఉత్సవాలను నిర్వహించాడు. 1896లో మహారాష్ట్రలో కరవు సంభవించినప్పుడు భూమిశిస్తు నిరాకరణ ఉద్యమాన్ని నడిపాడు. 1905 నాటి బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రసంగిస్తూ బిచ్చమెత్తడం కాదు - శివమెత్తాలి, యాచన కాదు - శూరత్వం చూపాలంటూ మితవాదుల విధానాలను విమర్శించాడు. వందేమాతర ఉద్యమ కాలంలో (1906) లాలాలజపతిరాయ్‌తో కలిసి బెంగాల్‌ వెళ్లి కలకత్తాలో శివాజీ ఉత్సవాలను, స్వదేశీ మేళాను నిర్వహించాడు. తిలక్‌ దీన్ని రాజకీయ పండుగగా వర్ణించాడు. స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరతానని నినదించాడు. భారతదేశంలోని పరిశ్రమల అభివృద్ధికి తిలక్‌ పైసా ఫండ్‌ను ఏర్పాటుచేశాడు. కేసరి పత్రికలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసినందుకు 1908లో తిలక్‌ను అరెస్టు చేసి 1914 వరకు ఆరేళ్ల పాటు మాండలే జైలులో బంధించారు. ఈ సమయంలోనే తిలక్‌ గీతారహస్యం, ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ది ఆర్యన్స్‌ అనే ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. 1916లో అనిబిసెంట్‌తో కలిసి హోంరూల్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1916 ఏప్రిల్‌లో పూనాలో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించాడు. 1920 ఆగస్టు 1న మరణించాడు.

లాలాలజపతిరాయ్‌ (1865 - 1928)

  పంజాబ్‌ కేసరిగా పేరొందిన లాలాలజపతిరాయ్‌ 1865, జనవరి 1న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న ఘడికే అనే గ్రామంలో జన్మించాడు. లాల్‌ ఆర్యసమాజ సభ్యుడిగా కళాశాల వర్గంలో చేరి దయానంద్‌ ఆంగ్లో - వేదిక్‌ కళాశాల స్థాపనలో ప్రధాన పాత్ర పోషించాడు. వందేమాతర ఉద్యమకాలంలో మాండలే జైలులో శిక్ష అనుభవించాడు. అనంతరం దేశ బహిష్కరణకు గురయ్యాడు. 1888 అలహాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొని విద్యా, పారిశ్రామిక సంబంధ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రసంగించాడు. సమైక్య భారతదేశానికి స్వదేశీ ధర్మమే మత ధర్మంగా ఉండాలని ప్రకటించాడు. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. లాలాలజపతిరాయ్‌ మాజినీని తన రాజకీయ గురువుగా పేర్కొన్నాడు. న్యూయార్క్‌ కేంద్రంగా 1917లో ఇండియన్‌ హోంరూల్‌ లీగ్‌ను స్థాపించి అక్కడి నుంచే హోంరూల్‌ ఉద్యమాన్ని నడిపాడు. ఆంగ్లంలో పీపుల్, ఉర్దూలో వందేమాతరం పత్రికలను నడిపాడు. 1921లో సర్వెంట్స్‌ ఆఫ్‌ పీపుల్‌ సొసైటీని స్థాపించాడు. 1922లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని లాలాలజపతిరాయ్‌ తీవ్రంగా విమర్శించాడు. ఒక గ్రామంలో జరిగిన పొరపాటుకు దేశం మొత్తాన్ని శిక్షించడం నేరమని పేర్కొన్నాడు. 1925లో స్వరాజ్య పార్టీలో చేరి కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యాడు, హిందూ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. 1926లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశానికి భారతదేశ శ్రామిక వర్గ ప్రతినిధిగా హాజరయ్యాడు.
1928 అక్టోబరులో లాహోర్‌లో జరిగిన సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే సాండర్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి కొట్టిన లాఠీ దెబ్బల వల్ల 1928 నవంబరు 17న మరణించాడు. లాల్‌ ‘మనపై (నాపై) పడే ప్రతి దెబ్బ ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటికపై దిగుతున్న ఒక్కో మేకు’ అని ఆ సందర్భంలోనే అభివర్ణించాడు. ఇతడి మరణం పంజాబ్‌లో సమరశీల జాతీయోద్యమానికి, విప్లవవాదానికి ఆజ్యం పోసింది. 1928 డిసెంబరు 17న భగత్‌ సింగ్‌ లాహోర్‌లో సాండర్స్‌ను కాల్చి చంపాడు. ఆ సంఘటనే లాహోర్‌ కుట్రకేసుగా పేరొందింది. లాలాజీ లాంటి వ్యక్తులు భూమిపై సూర్యుడు ప్రకాశించినంత కాలం మరణించరని గాంధీజీ పేర్కొనగా, ఆయన మరణం జాతికి విపత్తు అని సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నాడు.

బిపిన్‌ చంద్రపాల్‌ (1858 - 1932)

బెంగాల్‌ డాంటన్‌గా పేరొందిన బిపిన్‌ చంద్రపాల్‌ 1858, నవంబరు 7న ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హాట్‌లో జన్మించాడు. 1876లో పండిట్‌ శివనాథ శాస్త్రి సలహాతో బ్రహ్మసమాజంలో చేరాడు. 1901లో ‘న్యూ ఇండియా’ అనే ఆంగ్ల వారపత్రిక, అరబిందో ఘోష్‌తో కలిసి ‘వందేమాతరం’ పత్రికను నడిపాడు (అనిబిసెంట్‌ కూడా న్యూ ఇండియా పత్రికను నడిపారు). 1907లో వందేమాతరం పత్రికలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం వల్ల ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. 1887 నాటి మద్రాస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో లిట్టన్‌ ప్రవేశపెట్టిన ఆయుధాల చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. భారత జాతీయవాదం (ఇండియన్‌ నేషనలిజమ్‌), జాతీయతా సామ్రాజ్యం అనే గ్రంథాలను రాశాడు.

అరబిందో ఘోష్‌ (1872 - 1950)

  ఈయన 1872, ఆగస్టు 15న కలకత్తాలో జన్మించాడు. 1890లో ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై బరోడా సంస్థానంలో పనిచేశాడు. వందేమాతర ఉద్యమకాలంలో కలకత్తాలో నెలకొల్పిన జాతీయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1902లో అనుశీలన్‌ సమితి స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. జాతీయత అనే మతానికి దేశమాత దైవమని పలికాడు. 1909 నాటి అలీపూర్‌ బాంబుకేసులో అరెస్టయినప్పుడు చిత్తరంజన్‌దాస్‌ ఇతడిని నిర్దోషిగా నిరూపించాడు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పలికిన తొలి భారతీయ వ్యక్తి ఈయనే. కర్మయోగిన్, ధర్మ అనే పత్రికల ద్వారా ఆధ్యాత్మికతతో కూడిన స్వాతంత్య్రోద్యమాన్ని ప్రచారం చేశాడు. 1910లో పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని నిర్మించి ‘పాండిచ్చేరి యోగి’గా మారాడు. ది లైఫ్‌ డివైన్, సావిత్రి లాంటి గ్రంథాలను రచించాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక భారతదేశ చరిత్ర - ఆంగ్ల వ్యతిరేక తిరుగుబాట్లు

  ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆర్థిక, సాంఘిక సంస్కరణలు వివిధ వర్గాలను అసంతృప్తికి గురిచేశాయి. ఫలితంగా దేశంలో అనేక చోట్ల గిరిజన, రైతాంగ, సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. వీటిలో ముఖ్యమైంది 1857 సిపాయిల తిరుగుబాటు. దేశ చరిత్ర గతిని మార్చేసిన ఈ తిరుగుబాటుకు కారణాలు, ఫలితాలను వివిధ పోటీ పరీక్షల అభ్యర్థులు అధ్యయనం చేయాలి.

  వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా దేశ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని దేశాన్ని ఆక్రమించుకున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. కుటిల రాజకీయ సిద్ధాంతాలు, పద్ధతులను అవలంబించారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలు, సాంఘిక సంస్కరణలు భారత సమాజాన్ని, వివిధ వర్గాలను అసంతృప్తికి గురి చేశాయి. ఫలితంగా అధికారాన్ని కోల్పోయిన రాజులు, సామంతులు, దోపిడీకి గురైన భూస్వాములు, జమీందార్లు, ప్రాధాన్యం కోల్పోయిన కులీన వర్గాలు, అధిక శిస్తు భారంతో కుంగిపోయిన రైతాంగం, గిరిజనులు, అసమానత, జాతి వివక్షత, తక్కువ జీతాలు లాంటి అసౌకర్యాలకు గురవుతున్న సిపాయిలు మొదలైనవారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు.
* 1763 - 1800 మధ్య ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సన్యాసి ముఠాల తిరుగుబాట్లు జరిగాయి.
* 1783లో బిష్ణుపూర్, ఒరిస్సా పాలకులు తిరుగుబాట్లు చేశారు.
* 1799 దళ్ భమ్, 1800 - 1805 మధ్య కేరళ వర్మ తిరుగుబాట్లు జరిగాయి.
* 1798 - 1802 మధ్య కట్ట బొమ్మన్ తిరుగుబాటు జరిగింది.
* 1824లో కిట్టూరు, 1844లో గడ్కారీ తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.
* బెంగాల్‌లోని ముస్లింలు షరియతుల్లా నాయకత్వంలో ఫెరైజీ ఉద్యమాన్ని నడిపారు.
* 1830 - 1857 మధ్య బిహార్, బెంగాల్‌లోని ముస్లింలు వహాబీ ఉద్యమం చేశారు.


గిరిజన, రైతాంగ తిరుగుబాట్లు

* ఆంగ్లేయులు అటవీ భూములను ఆక్రమించుకుని ఆదివాసీలు, గిరిజనులపై అనేక నిర్బంధాలను, అధిక పన్నులను విధించడం ప్రారంభించారు.
* 1864లో అటవీ శాఖను ఏర్పాటు చేశారు. అటవీ ఉత్పత్తులను వాడుకోవడానికి గిరిజనుల నుంచి 'పుల్లరి' అనే పన్నును వసూలు చేసేవారు. ఫలితంగా ఆదివాసీలు, గిరిజనులు తమ స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు చేశారు.
* మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలోని భిల్లులు, బీహార్, బెంగాల్‌లోని సంతాలులు, కోలులు, ఒరిస్సాలోని కోలులు, రాజస్థాన్‌లోని మేర్‌లు అనేక తిరుగుబాట్లు చేశారు.
* 1817 - 31 మధ్య భిల్లులు సేవారాం నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు.
* 1831 - 32 మధ్య కోవ్‌లు చిరో తెగకు చెందిన పితాంబర్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
* 1846 - 48 మధ్య గోండులు సామ్ బిసాయ్ నాయకత్వంలో, 1855 - 56 మధ్య సంతాలులు సిధు, కన్హూల నాయకత్వంలో, 1822లో రమోసే తెగవారు చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు.
* ఈశాన్య భారతదేశంలోని గిరిజన తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఊట్‌రోట్ సింగ్‌ను ఆంగ్లేయులు ఉరితీశారు.
* 1822లో సతారా పరిసర ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లోని రమోసే తెగవారు చిత్తూరు సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
* గోండుల తిరుగుబాటు మొదటి హార్డింగ్ కాలంలో, సంతాలుల తిరుగుబాటు లార్డ్ డల్హౌసీ కాలంలో చోటు చేసుకున్నాయి.
* ఆంగ్లేయుల విధానాలను వ్యతిరేకిస్తూ జమీందారులు కూడా తిరుగుబాటు చేశారు.
* ఆంధ్ర ప్రాంతంలో (ఉత్తర సర్కారుల్లో) తలెత్తిన గంజాం, పర్లాకిమిడి తిరుగుబాట్లను అణచడానికి ఆంగ్ల ప్రభుత్వం రస్సెల్ దళాన్ని ఏర్పాటు చేసింది.
* 1879లో గోదావరి జిల్లాల్లో రంపా విప్లవం జరిగింది. పులికంటి సాంబయ్య, చంద్రయ్య, తమ్మన్న దొర, అంబుల్‌రెడ్డి లాంటివారు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
* 1922 - 24 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంపా పితూరీ విప్లవం జరిగింది.
* 1879 నాటి రంపా విప్లవాన్ని అణచడానికి ఆంగ్ల ప్రభుత్వం సల్లీవన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది.


సిపాయిల తిరుగుబాట్లు

* బ్రిటిష్ సైన్యంలో పనిచేసే భారతీయులను సిపాయిలుగా పిలిచేవారు.
* బ్రిటిష్ సైనికులతో సమానంగా పనిచేసినప్పటికీ సిపాయిలకు వారితో సమాన వేతనం, పదోన్నతులు లభించేవి కాదు.
* వివక్ష విధానం, పదోన్నతులు లేకపోవడం, తక్కువ జీతాలు ఇవ్వడం లాంటి వాటికి వ్యతిరేకంగా సిపాయిలు అనేకసార్లు తిరుగుబాట్లు చేశారు.
* 1764లో బెంగాల్ సిపాయిలు, 1780లో విశాఖపట్నంలోని సిపాయిలు తిరుగుబాటు చేశారు.
* 1806లో వెల్లూరు సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పటి సైన్యాధికారి జాన్ క్రేడర్.
* 1824లో బారక్‌పూర్ సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు కారణంగా 47వ దేశీయ పటాలాన్ని రద్దు చేశారు.
* ఆంగ్లేయులకు సిపాయిల నుంచి ఎదురైన అతిపెద్ద తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు.

1857 సిపాయిల తిరుగుబాటు

* 1857 సిపాయిల తిరుగుబాటుకు లార్డ్ డల్హౌసీ విధానాలు ప్రధాన కారణం.
* డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టి (1848) సతారా, జైపూర్, సంబల్‌పూర్, భగత్, ఉదయ్‌పూర్, నాగ్‌పుర్, ఝాన్సీ లాంటి రాజ్యాలను ఆక్రమించాడు. దుష్పరిపాలన నెపంతో 1856లో డల్హౌసీ అయోధ్యను ఆక్రమించాడు.
* పీష్వా రెండో బాజీరావు దత్త పుత్రుడైన నానాసాహెబ్ (దోండూపంత్) 8 లక్షల భరణాన్ని రద్దు చేశాడు.
* ఆంగ్లేయుల మత మార్పిడి విధానాలు కూడా తిరుగుబాటుకు కారణమయ్యాయి.
* 'భారతదేశపు ఒక చివరి నుంచి మరో చివరి వరకు క్రైస్తవ పతాకం ఎగరవేయడానికి దేవుడు హిందూస్థాన్ రాజ్య విస్తరణను ఇంగ్లాండ్‌కు అప్పగించాడు' అని కంపెనీ డైరక్టర్స్ అధ్యక్షుడైన మాజెల్స్ ప్రకటించాడు.
* 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశారు.
* 1850లో వారసత్వ చట్టం ద్వారా మతం మార్చుకున్న భారతీయులకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందని పేర్కొనడం భారతీయులు సహించలేకపోయారు.
* భారతదేశంలో రైల్వే, తంతి - తపాలా లాంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టడాన్ని సనాతనులైన భారతీయులు వ్యతిరేకించారు.
* 1856లో లార్డ్ కానింగ్ 'సామాన్య సేవానియుక్త చట్టాన్ని' ప్రవేశపెట్టి సిపాయిలు మతపరమైన చిహ్నాలను వాడకూడదని ఆదేశించాడు.
* 'ఇండియా ఖర్చుతో భారతీయ సిపాయిలే భారతదేశాన్ని ఆంగ్లేయుల బానిసత్వంలో అణచి ఉంచుతారు' అని 1853లో కారల్‌మార్క్స్ పేర్కొన్నాడు. అప్పటి సైన్యంలో సిపాయిలు 2 లక్షల 32 వేల మంది ఉండగా, బ్రిటిష్ సైనికులు కేవలం 45 వేల మంది మాత్రమే ఉన్నారు.
* సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఆవు, పంది కొవ్వును పూసిన తూటాలు.
* 1856లో లార్డ్ కానింగ్ పాత బ్రౌన్‌బేస్ తుపాకుల స్థానంలో ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టాడు. ఎన్‌ఫీల్డ్ తుపాకులు ఇంగ్లండ్‌లోని వూద్‌వూచ్ ఆయుధాగారంలో తయారయ్యేవి.
* 1857, జనవరి 23న డమ్‌డమ్‌లోని (కలకత్తా) సిపాయిలు కొత్త తుపాకుల విషయంపై ఆందోళన చేశారు.
* 1857, ఫిబ్రవరి 26న బెర్హాంపూర్‌లోని 19వ పదాతిదళం నూతన తుపాకులను ఉపయోగించడానికి నిరాకరించింది.
* 1857, మార్చి 29న బరాక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ్‌పాండే తన పై అధికారి అయిన కెప్టెన్ బాగ్‌ను కాల్చి చంపాడు. ప్రభుత్వం వెంటనే 19, 34 దళాలను రద్దు చేసింది.
* వాస్తవంగా సిపాయిల తిరుగుబాటు 1857, మే 10న మీరట్‌లో ప్రారంభమైంది.
* మీరట్‌లోని 3వ అశ్వికదళం తమ పైఅధికారి కల్నల్ స్మిత్‌పై తిరుగుబాటు చేసింది.
* సిపాయిలు ఢిల్లీకి వెళ్లి రెండో బహదూర్‌షా జాఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా చేశారు.
* ఢిల్లీలో తిరుగుబాటులకు నాయకత్వం వహించినవాడు - భక్తఖాన్.

తిరుగుబాటు ప్రాంతం - నాయకత్వం వహించినవారు

బీహార్ - కున్వర్‌సింగ్

లక్నో - మౌల్వీ అహ్మదుల్లా

బరేలీ - ఖాన్ బహదూర్ ఖాన్

కాన్పూర్ - నానాసాహెబ్, తాంతియాతోపే

అయోధ్య - బేగం హజరత్ మహల్

ఝాన్సీ, గ్వాలియర్ - ఝాన్సీ లక్ష్మీబాయ్

హైదరాబాద్ - తుర్రేబాజ్ ఖాన్

* రెండో బహదూర్‌షా జాఫర్ సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ఉంటూనే రహస్యంగా ఆంగ్లేయుల వద్దకు రాయబారిగా అమానుల్లా అనే ప్రతినిధిని పంపి రాజీ ప్రయత్నాలు చేశాడు.
* తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో నికల్సన్, లక్నోలో లారెన్స్, నీల్ అనే ఆంగ్ల సైనికాధికారులు మరణించారు.
* రెండో బహదూర్‌షా జాఫర్‌ను బంధించిన బ్రిటిష్ సేనాధిపతి కెప్టెన్ హడ్సన్. కాన్పూర్‌లో బ్రిటిష్ సైన్యాధికారి వీలర్.
* నానా సాహెబ్ రాజకీయ సలహాదారుడైన అజీముల్లా మోసం చేసి కాన్పూర్ రక్షణ దళాన్ని అంతమొందించాడు.
* 'మాతృదేశ స్వాతంత్య్రం కోసం కుట్రపన్ని యుద్ధం చేసే మనిషి దేశభక్తుడైనట్లయితే మౌల్వీ అహ్మదుల్లా (లక్నో) నిజంగా దేశభక్తుడే' అని కల్నల్ మావెసన్ పేర్కొన్నాడు.
* ఝాన్సీ లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక (మనూబాయ్).
* ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ పాలకుడైన గంగాధరరావును వివాహం చేసుకుని దామోదరరావు అనే బాలుడిని దత్తత తీసుకుంది.
* తిరుగుబాటు కాలంలో దిబైన్‌బాగ్ హత్యాకాండ జరిగింది. ఝాన్సీ కోటలో అనేక మంది ఆంగ్లేయులు ఈ సంఘటనలో మరణించారు (దీనికి ఝాన్సీ కారకురాలని ఆంగ్లేయులు ఆరోపించారు).
* 1858, జూన్ 18న లక్ష్మీబాయ్‌ని బ్రిటిష్ సైన్యాధిపతి సర్ హ్యూరోస్ తిరుగుబాటులో అంతమొందించాడు.
* 'తిరుగుబాటు దారుల్లో ఏకైక పురుషుడు ఝాన్సీ లక్ష్మీబాయ్' అని సర్ హ్యూరోస్ పేర్కొన్నాడు.
* ఝాన్సీ లక్ష్మీబాయ్ 'ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్‌'గా పేరుపొందింది.
* 'మా స్వహస్తాలతో మేము మా స్వతంత్య్ర పాలనను సమాధికానివ్వం' అని లక్ష్మీబాయ్ తన అనుచరులతో ప్రమాణం చేయించింది.
* 1857 తిరుగుబాటు విఫలం అయ్యేందుకు అనేక కారణాలున్నాయి. తిరుగుబాటు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగకపోవడం, అన్ని ప్రాంతాలకు విస్తరించకపోవడం, సమర్థులైన నాయకులు లేకపోవడం, ఉమ్మడి లక్ష్యం లేకపోవడం, స్వదేశీ పాలకులు ఆంగ్లేయులకు సహకరించడం, ఆధునిక ఆయుధ సంపత్తి, రవాణా సాధనాలు ఆంగ్లేయుల చేతిలో ఉండటం లాంటి అనేక కారణాల వల్ల తిరుగుబాటు విఫలమైంది.
* 'సంస్థానాదీశులు తుపాను అలల తీవ్రతని తగ్గించే అడ్డు గోడలుగా ఉపయోగపడ్డారు. లేకపోతే ఆ తుపాను మనల్ని మూకుమ్ముడిగా ఊడ్చి పారేసి ఉండేది' అని లార్డ్ కానింగ్ పేర్కొన్నాడు.
* 'క్రమశిక్షణను చిన్నాభిన్నం చేసి, తమ పై అధికారులను హత్యచేసి, తిరగబడే సిపాయిలు తమను నడిపించగల నాయకుడిని ఎలా ఎంచుకోగలరు' అని కారల్‌మార్క్స్ పేర్కొన్నాడు.
* 1857 సిపాయిల తిరుగుబాటును వినాయక్ దామోదర్ సావర్కర్ 'ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం' అని పేర్కొన్నారు.
* 1909లో వి.డి. సావర్కర్ 'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' అనే పుస్తకాన్ని రచించారు.
* నెహ్రూ తన 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో 'సిపాయిల తిరుగుబాటును కేవలం భూస్వాముల తిరుగుబాటు' అని రాశారు.
* 'నాగరిక, అనాగరిక జాతుల మధ్య జరిగిన తిరుగుబాటు' అని టి.ఆర్. హోమ్స్ అనే ఆంగ్లేయుడు పేర్కొన్నాడు.
* 'హిందువులు, ముస్లింలు కలిసి పన్నిన కుట్ర' అని సర్ జేమ్స్ ఔట్రామ్ పేర్కొన్నాడు.
* బెంజిమన్ డిస్రేలీ సిపాయిల తిరుగుబాటును 'జాతీయ తిరుగుబాటు'గా వ్యాఖ్యానించాడు.
* '1857 తిరుగుబాటు సిపాయిల పితూరీ కాదని, గొప్ప జాతీయ విప్లవం' అని కె.ఎం. ఫణిక్కర్ పేర్కొన్నాడు.
* కె.ఎం. మున్షీ, ఆర్.సి. మజుందార్, ఎస్.ఎన్. సేన్ లాంటి వారు ఈ తిరుగుబాటును జాతీయ సమరానికి ప్రథమ సోపానంగా పేర్కొన్నారు.
* 'తిరుగుబాటుకి కారణాలు' అనే గ్రంథాన్ని సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ రచించాడు.
* 1858, నవంబర్ 1న కానింగ్ అలహాబాద్ దర్బారులో విక్టోరియా మహారాణి ప్రకటనను చదివాడు. ఈ ప్రకటన ఆధారంగా 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు.
* భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైంది. భారతదేశం బ్రిటిష్ రాజు / రాణి/ పార్లమెంటు ప్రత్యక్ష పాలనలోకి వెళ్లింది.
* భారత గవర్నర్ జనరల్ పదవిని వైశ్రాయ్/ రాజప్రతినిధిగా మార్చి లార్డ్ కానింగ్‌ను ఈ పదవిలో తొలిసారిగా నియమించారు.
* ఇంగ్లండ్ పార్లమెంటులో మంత్రిగా ఉన్న సభ్యుడిని 'భారత రాజ్య కార్యదర్శి' పదవిలో నియమించారు. (1858 చట్టం ద్వారా 'భారత రాజ్య కార్యదర్శి' పదవిని ఏర్పాటుచేశారు).
* దేశీయ, విదేశీ సైనికుల నిష్పత్తిని మార్చారు. బెంగాల్‌లో 2 : 1గా, మద్రాస్, బొంబయి ప్రెసిడెన్సీల్లో 3 : 1గా నిర్ణయించారు.
* రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దత్తతను అంగీకరించారు.
* రెండో బహదూర్‌షా 1861లో రంగూన్ జైల్లో మరణించడంతో మొగల్ వంశం అంతరించిపోయింది.
* '1857 సిపాయిల తిరుగుబాటు ఢిల్లీలోని మొగల్ సంస్కృతిని నాశనం చేసిందని, అది తిరిగి కోలుకోలేదని' సి.ఎఫ్. ఆండ్రూస్ పేర్కొన్నాడు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన

  లార్డ్ వేవెల్ 1945లో తన ప్రణాళికను చర్చించడానికి భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేవెల్ ప్రణాళిక ప్రకారం వైస్రాయ్ పాలకమండలిలో సర్వ సైన్యాధ్యక్షుడు మినహా మిగిలినవారంతా భారతీయులే ఉంటారు. పాలకమండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుంది. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ వైస్రాయ్ పాలక మండలిలోని ముస్లిం సభ్యులను ముస్లింలీగ్ మాత్రమే ఎంపిక చేయాలని పట్టుబట్టింది. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.


* మంత్రిత్రయ రాయబారం లేదా క్యాబినెట్ మిషన్ ప్రణాళిక (1946): ఇంగ్లండ్‌లో 1945లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చర్చిల్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది. లేబర్ పార్టీ మొదటి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడం పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. ఇంగ్లండ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సి.ఆర్. అట్లీ, వేవెల్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
* 1946 మార్చి 24న లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లతో కూడిన ముగ్గురు క్యాబినెట్ మంత్రుల బృందం భారతదేశానికి వచ్చింది. దేశానికి వీలైనంత తొందరగా స్వాతంత్య్రం ఇవ్వడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ మంత్రుల బృందం అయిదు వారాలపాటు స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపింది. చివరగా 1946 మే 5న సిమ్లాలో కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
* 1946 మే 16న మిషన్ తన సిఫారసులను ఒక ప్రకటన రూపంలో ప్రకటించింది. దీన్ని 'క్యాబినెట్ మిషన్ ప్రణాళిక' అంటారు.
* 1946 ఆగస్టు 12న వేవెల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరాడు. ప్రారంభంలో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి ముస్లింలీగ్ అయిష్టత చూపింది.
* తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 మంది సభ్యులు (9 మంది కాంగ్రెస్, అయిదుగురు ముస్లింలీగ్) ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఉపాధ్యక్షుడిగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు.

ప్రత్యక్ష చర్యా దినోత్సవం

ముస్లింలీగ్ 1946 జులై 30న సమావేశమై 1946 ఆగస్టు 16న భారతదేశమంతటా ప్రత్యక్ష చర్యాదినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.

* ముస్లింలీగ్ కలకత్తాలో ఆగస్టు 16న ప్రదర్శనలు, హర్తాళ్‌లు నిర్వహించడం గొడవలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతలు నాలుగు రోజులపాటు కొనసాగాయి. బెంగాల్‌లో హెచ్.ఎస్. సుహ్రావర్డి ఆధ్వర్యంలోని ముస్లింలీగ్ ప్రభుత్వం ఆగస్టు 16ను సెలవుదినంగా ప్రకటించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వం పరిస్థితి చేయిదాటేంత వరకు సైన్యాన్ని పిలవకపోవడం సమస్యను మరింత జఠిలం చేసింది.


* మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947 మార్చిలో వేవెల్ స్థానంలో మౌంట్ బాటన్ వైస్రాయ్‌గా నియమితుడయ్యాడు. ఇతడు ఇంగ్లండ్ రాజుకు దగ్గరి బంధువు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియా ప్రాంతానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు. మౌంట్ బాటన్ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 1947 జూన్ 3న ఒక రాజీ సూత్రాన్ని రూపొందించి, ప్రకటించాడు. దీన్నే జూన్ 3 ప్రణాళిక అంటారు. దీని ప్రకారం భారతదేశాన్ని భారత యూనియన్, పాకిస్థాన్‌గా విభజించి స్వాతంత్య్రం ఇస్తారు.


* భారత స్వాతంత్య్ర చట్టం (1947): జూన్ 3 ప్రణాళిక ఆధారంగా ఒక బిల్లును రూపొందించి బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది 12 రోజుల స్వల్ప వ్యవధిలో (జులై 4 - జులై 16) పార్లమెంట్ ఆమోదముద్ర పొందింది. జులై 18న బ్రిటిష్ రాజు కూడా ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 14న పాకిస్థాన్‌కు, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. భారత భూభాగాల విభజన, పంజాబ్, బెంగాల్‌లలో రెండు రాష్ట్రాల ఏర్పాటు గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. రెండు దేశాలకు ప్రత్యేక గవర్నర్ జనరల్, శాసనశాఖల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
* దేశ విభజన అనేక అనర్థాలకు దారితీసింది. సుమారు 1.5 కోట్ల మంది హిందూ ముస్లింలు బలవంతంగా తమ ఇళ్లు, గ్రామాలు, నగరాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇది వారిలో కోపాన్ని, ద్వేషాన్ని రగిల్చింది. రెండు నుంచి అయిదు లక్షల మంది ప్రజలు హత్యకు గురయ్యారు. మత ఘర్షణలకు కేంద్రమైన తూర్పు బెంగాల్‌లోని నోఖాలిలో 1947 ఆగస్టు 15న పర్యటించిన గాంధీజీ శాంతిని పునరుద్ధరించడానికి కృషిచేశారు. గాంధీజీ 1947 సెప్టెంబరు 9న ఢిల్లీకి చేరుకున్నారు. వాయవ్య భారతదేశంలో మతఘర్షణలను, ప్రజల భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. కొంతమంది మతోన్మాదులు గాంధీజీ నిర్వహించే సర్వమత ప్రార్థనలకు ఇబ్బందులు సృష్టించారు.
* గాంధీజీ 1948 జనవరిలో చివరిసారిగా నిరాహారదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయి పటేల్ మతపరమైన వైఖరిని నిరసించారు. గాంధీజీ మరణానికి రెండు రోజుల ముందు ఆయన హత్యకు విఫలయత్నం జరిగింది. 1948 జనవరి 28న గాంధీజీ మాట్లాడుతూ - 'ఒక పిచ్చివాడి బుల్లెట్‌కు నేను మరణించవలసి వస్తే, నేను చిరునవ్వుతో మరణిస్తాను. నాలో ఎలాంటి కోపం లేదు. దేవుడు నా హృదయంలోను, పెదాలపై ఉన్నాడు' అన్నారు.
* స్వాతంత్య్రం వచ్చిన ఆరునెలల్లోపే 1948 జనవరి 30న సర్వమత ప్రార్థనకు వెళ్తున్న గాంధీజీ నాథూరామ్ గాడ్సే తుపాకి గుళ్లకు బలయ్యారు.


దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు

భారత జాతీయ రాజకీయాల్లో విభజనవాదానికి ప్రధాన కారణం - అధిక సంఖ్యాకులైన హిందువులు అల్ప సంఖ్యాకులైన ముస్లింలపై (వ్యాపారం, పరిశ్రమలు, ప్రభుత్వ సర్వీసులు, విద్య లాంటివి) పలు విషయాల్లో ఆధిపత్యం వహించడం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కాలం నుంచే బ్రిటిషర్లకు, ముస్లింలకు మధ్య మంచి సంబంధాలు లేవు. బ్రిటిషర్లు తమ నుంచి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ముస్లింలు భావించారు. ముస్లింలు తమ సామ్రాజ్యానికి ప్రధాన శత్రువులని బ్రిటిషర్లు భావించారు.

* బ్రిటిషర్లు హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. 1857 విప్లవం తర్వాత ఈ పరిస్థితి తారుమారైంది. హిందువులు ఆంగ్ల విద్యను అభ్యసించి, పాశ్చాత్య భావాలను అంగీకరించారు. వారిలో క్రమంగా జాతీయతాభావం అభివృద్ధి చెందింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి గొప్ప ఆటంకంగా పరిణమించింది. దీంతో ముస్లింల సహాయంతో హిందువులను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్‌వారు విభజించి, పాలించు విధానాన్ని అవలంబించారు.
* 1871లో సర్ విలియం హంటర్ రచించిన 'ది ఇండియన్ ముసల్మాన్స్' అనే గ్రంథం ప్రచురితమైంది. ముస్లింలతో విరోధాన్ని కొనసాగించడం కంటే వారితో స్నేహంగా ఉండటం బ్రిటిష్ సామ్రాజ్యానికి మేలు చేస్తుందనే భావన ఈ గ్రంథంలో వ్యక్తమైంది. అలీగఢ్‌లోని ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ బెక్ ముస్లింలు బ్రిటిషర్లకు దగ్గరవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలు పాశ్చాత్య విద్యను అభ్యసించేలా, బ్రిటిషర్లకు విధేయులుగా ఉండేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.
* 1906 డిసెంబరులో ఢాకాలో నవాబు వికార్ ఉల్‌ముల్క్ ముస్లింలీగ్ పార్టీని స్థాపించి, మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ పార్టీ స్థాపనలో ఆగాఖాన్ ప్రముఖ పాత్ర వహించాడు. 1906 నుంచి 1910 వరకు ముస్లింలీగ్ కేంద్ర కార్యాలయం అలీగఢ్ ఉండేది. ఆ కాలంలో దాని ప్రభావం పెద్దగా లేదు. పార్టీ ప్రధాన కార్యాలయం లక్నోకు మారడంతో, దీని రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి.


ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాలు

* 1906లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో వ్యక్తిగత కార్యదర్శి స్మిత్ భారతీయ ముస్లింల ప్రతినిధులకు వైస్రాయ్‌ని కలవమని సలహా ఇచ్చాడు. ఆగాఖాన్ నేతృత్వంలోని ఈ బృందం మింటోను కలిసి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని కోరింది. దీని ఫలితంగా రూపొందిన 1909 చట్టం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది.
* భారతదేశం లోపల, వెలుపల సంఘటనలు కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు చేరువకావడానికి దోహదం చేశాయి. ఖిలాఫత్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సహాయం అవసరమని ముస్లింలీగ్ గుర్తించింది. ఇది 1916లో లక్నో ఒడంబడికకు దారితీసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ముస్లింల సానుభూతిని సంపాదించాలని ప్రయత్నించారు. అయితే ఈ ఉద్యమం నిలిపివేయడంతో హిందూ-ముస్లిం ఐక్యత బలహీనపడింది.
* 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నివేదికను కాంగ్రెస్ అంగీకరించగా, జిన్నా ముస్లింల కనీస డిమాండ్లుగా తన పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు. 1930లో ప్రసిద్ధ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ముస్లింలీగ్ అలహాబాద్ సమావేశంలో అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ వాయవ్య భారత ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.
* 1933లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ విద్యార్థి చౌదరి రెహమత్ అలీ పాకిస్థాన్ పేరును మొదటగా ప్రతిపాదించాడు. పంజాబ్, అఫ్గన్, కశ్మీర్, సింధుల నుంచి మొదటి అక్షరాలు, బెలూచిస్థాన్‌లో చివరి పదంతో ఈ పేరును రూపొందించాడు.
* 1937లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలకు కేటాయించిన 482 సీట్లలో ముస్లింలీగ్ 102 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 58 ముస్లిం స్థానాలకు పోటీచేయగా, 26 స్థానాలను గెలుచుకుంది. ముస్లింలీగ్ మొత్తం ముస్లిం ఓట్లలో 4.4 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది.
* యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాసులలో సీట్లు సాధించిన ముస్లింలీగ్ బెంగాల్, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. సింధు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. అయితే 1946లో కేంద్ర, రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ముస్లిం సీట్లు గెలుచుకోవడంలో సఫలీకృతమైంది.
* యునైటెడ్ ప్రావిన్స్‌లో ముస్లింలీగ్ తగినన్ని సీట్లు సాధించినా, దాంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నిరాకరించింది. కాంగ్రెస్‌లోని సభ్యులు ముస్లింలీగ్ సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధించింది. దీన్ని కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు వ్యతిరేకించడంతో 1938లో కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యత్వం కలిగి ఉండకూడదని పేర్కొంది.


విమోచ‌న దినం

* 1939 డిసెంబరు 22న బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి. జిన్నా ఈ రోజును విమోచన దినంగా ప్రకటించారు.
* 1940, మార్చి 23న ముస్లింలీగ్ ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానంలో దేశ విభజన లేదా పాకిస్థాన్ గురించి ఎక్కడా పేర్కొనలేదు. తర్వాతి రోజుల్లో ఈ తీర్మానం పాకిస్థాన్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది.
* 1942లో కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ముస్లింలీగ్‌ను బలపరిస్తే ఇస్లాంను బలపరిచినట్లేనని బహిరంగంగా ప్రకటించారు. 1940-46 మధ్య ముస్లిం సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక దేశం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి ముస్లింలీగ్ అవగాహన కల్పించింది. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను జైళ్లలో నిర్బంధించింది. ఈ సమయాన్ని ముస్లింలీగ్ తనకు అనుకూలంగా మలచుకుని బలపడింది.
* సి. రాజగోపాలాచారి ఫార్ములా (1944), గాంధీజీ - జిన్నా చర్చలు (1944), భులాబాయ్ దేశాయ్, లియాఖత్ అలీఖాన్ ఒప్పందం (1945) కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. సిమ్లా సమావేశం కూడా మహమ్మద్ అలీ జిన్నా మొండివైఖరి వల్ల విఫలమైంది.
* 1946 సాధారణ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో కాంగ్రెస్ 57 స్థానాల్లో గెలుపొందగా, ముస్లింలీగ్ ముస్లింలకు కేటాయించిన 30 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ 923 సీట్లు, ముస్లింలీగ్ 425 సీట్లు గెలుచుకున్నాయి. ముస్లింలీగ్ ఈ ఎన్నికల్లో 86 శాతం సీట్లు దక్కించుకోవడం విశేషం.
* ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌ను అంగీకరించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ముస్లింలీగ్ 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష చర్యా దినంగా పాటించింది. చివరకు మౌంట్‌బాటన్ 1947 జూన్-3 ప్రణాళికను అనుసరించి భారత్‌ను భారత్ యూనియన్, పాకిస్థాన్‌గా విభజించారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వరాజ్య పార్టీ - క్రియాశీలక రాజకీయాలు


మార్పు కోరిన మరో పోరాటం!

సహాయ నిరాకరణ సమరోత్సాహంతో సాగుతున్న సమయంలో సంభవించిన చౌరీ చౌరా సంఘటన వల్ల మొత్తం ఉద్యమం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దేశమంతా రాజకీయ స్తబ్ధత ఆవరించింది. పోరాటాన్ని నిలిపివేయాలనే గాంధీజీ నిర్ణయాన్ని కొందరు జాతీయ నాయకులు తీవ్రంగా నిరసించారు. కొత్త పార్టీ పెట్టి, శాసనసభల్లో ప్రవేశించి, ఆంగ్లేయుల అరాచక పాలనను అడ్డగించే లక్ష్యంతో మరో సమరానికి సిద్ధమయ్యారు. ఎంతమంది కాదన్నా ముందుకే వెళ్లారు. ఎన్నికల్లో విజయాలను సాధించారు. చట్టసభల్లో తెల్లవారికి చుక్కలు చూపించారు. ప్రజలను మళ్లీ పోరాట పథంలోకి  నడిపించారు. జాతీయోద్యమంలోని ఈ ముఖ్యఘట్టాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 


  అప్పట్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ స్ఫూర్తి దేశమంతా విస్తృతంగా వ్యాపించి పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది. అప్పుడే  ఎక్కడో చౌరీచౌరాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గాంధీజీని కలచివేసింది. సత్యాగ్రహ విధానంలో పోరాడటానికి ప్రజలు సిద్ధంగా లేరనే భావన ఆయనకు కలిగింది. మొత్తం ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపేశారు. ఆ నిర్ణయం కొంతమంది జాతీయోద్యమ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. అదే అదనుగా బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీపై రాజద్రోహం నేరం మోపి, కారాగార శిక్ష విధించింది. ఈ పరిణామాలు, గాంధీజీ అరెస్ట్‌ ప్రజలను నైరాశ్యంలోకి నెట్టేశాయి. దేశంలో తాత్కాలిక రాజకీయ స్తబ్ధత నెలకొంది. కొంతమంది స్వాతంత్య్ర ఉద్యమకారులు స్వరాజ్య సాధనకు దౌర్జన్య విధానాన్ని అవలంబించాలనే ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించడానికి 1922లో ఏఐసీసీ ఒక కమిటీని వేసింది. అందులోని ఎం.ఎ.అన్సారీ, రాజగోపాలాచారి, కస్తూరి రంగ అయ్యంగార్‌లు గాంధేయ గ్రామీణ నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.


  సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడం మోతీలాల్‌ నెహ్రూ, హకీమ్‌ అజ్‌మల్‌ ఖాన్, విఠల్‌ భాయ్‌ పటేల్, చిత్తరంజన్‌ దాస్‌ లాంటి నాయకులకు రుచించలేదు. ఉద్యమంలో భాగంగా నిర్వహించిన శాసన సభల బహిష్కరణను విరమించి, మళ్లీ పోటీ చేసి ఆ సభలోకే ప్రవేశించి సహాయ నిరాకరణను కొనసాగించాలనుకున్నారు. బ్రిటిష్‌ పాలన లోపాలను ఎండగట్టి, ప్రభుత్వం చేసిన శాసనాలకు ఫలితం లేకుండా చేయాలని భావించారు. అప్పట్లో రాబోయే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి గెలవాలని నిర్ణయించారు. సభాకార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని స్తంభింప చేయాలనుకున్నారు. అందుకే వీరిని ‘మార్పుకోరే వారు’ అంటారు. ఈ ఆలోచనలను గాంధీజీ అనుచరులైన డాక్టర్‌ రాజగోపాలాచారి, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కస్తూరి రంగ అయ్యంగార్‌  తదితరులు వ్యతిరేకించారు. శాసన సభ రాజకీయాలు జాతీయావేశాన్ని నిర్వీర్యపరుస్తాయని, నాయకుల మధ్య స్పర్థలు వస్తాయని వారు హెచ్చరించారు. వీరంతా గాంధీజీ నిర్ణయించిన కార్యక్రమంలో ‘మార్పు కోరని వారు’. ఈ పరిణామాల సమయంలోనే 1922, డిసెంబరులో గయలో వార్షిక సమావేశాలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి.శాసన సభలో ప్రవేశించి  ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించాలనే విషయాన్ని ‘మార్పు కోరే వారి’ తరఫున తమ వైఖరిని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు సి.ఆర్‌.దాస్‌ స్పష్టం చేశారు. కానీ వారి అభిప్రాయాన్ని గాంధీజీ అనుకూల వర్గం  ఆమోదించలేదు. నూలు వడకడం, నేత నేయడం, అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం సఖ్యత లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు మార్పు కోరని వర్గం ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సి.ఆర్‌.దాస్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, మోతిలాల్‌ నెహ్రూ, మరికొంతమంది నాయకులతో కలిసి ‘స్వరాజ్య పార్టీ’ని స్థాపించారు. కొత్త పార్టీ శాసన సభలో పునఃప్రవేశానికి సంబంధించిన అంశం మినహా మిగతా కార్యక్రమం మొత్తాన్ని కాంగ్రెస్‌ యథాతథంగా ఆమోదించింది. ఆ విధంగా స్వర్యాజ్య వాదులు, గాంధీజీ అనుకూల వర్గానికి మధ్య తీవ్ర రాజకీయ అంతరాలు పెరిగాయి. 1924, ఫిబ్రవరిలో అనారోగ్య కారణాలతో గాంధీజీని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. అప్పుడు రెండు పక్షాల మధ్య రాజీకి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.అయితే ఆయన సలహా మేరకు ఇరు పక్షాలు కాంగ్రెస్‌లోనే ఉండి, ఎవరికి నచ్చిన మార్గంలో వారు కృషి చేయడానికి అంగీకరించారు.


పార్టీ కార్యక్రమాలు

స్వాతంత్య్ర సాధనే ఇరువర్గాల అంతిమ లక్ష్యం. కానీ సత్యాగ్రహం ప్రభుత్వంపై అంతగా ప్రభావం చూపదని స్వరాజ్య పార్టీ భావన. శాసన సభల్లో ప్రవేశించి, ప్రభుత్వ విధానాలను నిరంతరం విమర్శిస్తూ, ప్రజాకంటక చర్యలకు అవరోధం కల్పించాలని ఆ పార్టీ భావించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని ముఖ్యమైన బిల్లులు, బడ్జెట్‌ను నిరోధించి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింజేయాలనేదే వీరి ఆలోచన. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా సామాన్య జనంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలనుకున్నారు. కౌన్సిల్‌ కార్యకలాపాలను అడ్డుకొని, ఆంగ్లేయులతో మరికొన్ని సంస్కరణలను ఆమోదింపజేసే విధంగా ఒత్తిడి చేయవచ్చని యోచించారు. ఈ నేపథ్యంలో 1923 నవంబరులో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ గణనీయమైన విజయాలను సాధించింది. కేంద్ర శాసన సభలోని 101 స్థానాలకు 42 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర శాసన సభల్లో కూడా అనుకున్న స్థాయిలో స్థానాలను సంపాదించుకుంది.మధ్య పరగణాల రాష్ట్రం (ప్రస్తుత మధ్యప్రదేశ్‌)లో స్వరాజ్యపార్టీకి విజయం లభించింది. బెంగాల్‌లోనూ ఎక్కువ స్థానాలను పొందింది.


విజయాలు

1925, మార్చిలో కేంద్ర శాసన సభ సభాపతి పదవికి విఠల్‌ భాయ్‌ పటేల్‌ను పోటీకి నిలిపి, స్వరాజ్య పార్టీ నేతలు గెలిపించారు. నేషనలిస్ట్‌ పార్టీ, మరికొందరు  స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ బిల్లులను కొంతవరకు నిరోధించగలిగారు. శాసన సభల్లో భారత ప్రభుత్వ చట్టం 1919 పనితీరును ఎండగట్టారు. వీరి డిమాండ్‌ మేరకే రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ పనితీరుపై విచారణకు ‘మడ్డి మాస్‌ కమిటీ’ని బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేసిన తర్వాత దేశంలో రాజకీయ నిర్లిప్తత నెలకొన్న సమయంలో, శాసనసభల్లో ప్రభుత్వ విధానాలను స్వరాజ్యపార్టీ దుయ్యబట్టిన తీరు ప్రజలను ఆకర్షించింది. ఆ విధంగా ఆ పార్టీ తమ కార్యకలాపాల ద్వారా దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడకుండా చేయగలిగింది. జాతికి మహోన్నత మేలు చేసింది, సైమన్‌ కమిషన్‌ నియామకం కూడా వీరి వల్లే జరిగిందని చెప్పవచ్చు.

తర్వాత కొంతకాలానికి కొందరు నాయకుల మతతత్వ వైఖరి వల్ల స్వరాజ్య పార్టీలో చీలికలు వచ్చాయి. మదన్‌మోహన్‌ మాలవ్య, లాలా లజపతిరాయ్, ఎన్‌.సి కేల్కర్‌లతో సహా మరికొందరు నాయకులు ‘సమాధానవాదులు’ అనే పేరుతో ఒక బృందంగా  ఏర్పడ్డారు. వీరు ప్రభుత్వానికి సహకారం అందించారు. 1925లో స్వరాజ్య పార్టీ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్‌ దాస్‌ మరణంతో పార్టీ బలహీన పడింది.

దేశంలో 1923 నుంచి రాజ్యాంగ సంస్కరణల పట్ల స్వరాజ్యవాదుల ఒత్తిడి ఎక్కువవుతోంది. మరోవైపు మతకల్లోల ఉద్రిక్తత అగ్ని పర్వతంలా ఉన్న ప్రజల అసంతృప్తి పరిస్థితులను బ్రిటిష్‌ ప్రభుత్వం గమనించింది. అంతేకాకుండా బ్రిటన్‌లో 1928 సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. అందుకే 1927లో సర్‌ జాన్‌ సైమన్‌ అధ్యక్షతన భారత ప్రభుత్వ చట్టం, 1919 పనితీరును సమీక్షించడానికి, భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల సమస్యను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి విచారణ సంఘాన్ని నియమించింది. ఆ సంఘం దాని అధ్యక్షుడి పేరుమీదుగా సైమన్‌ కమిషన్‌గా ప్రసిద్ధిగాంచింది. ఇది చట్టబద్ధ కమిషన్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం విచారణ సంఘం పేరుతో ఉపశమన కార్యంగా కాలయాపన చేసి, శాశ్వతంగా అధికారం అనుభవించడం అనేది దీని లోగుట్టు. సైమన్‌ కమిషన్‌లోని ఏడుగురు సభ్యులు బ్రిటన్‌ దేశ పార్లమెంట్‌ సభ్యులే. ఇందులో భారతీయులు ఎవరూ లేరు. అలాంటి చిత్తశుద్ధి కూడా ప్రభుత్వానికి లేదు. అసలు భారతీయులు స్వపరిపాలనకు అర్హులా, కాదా అనే అంశాన్ని బ్రిటిష్‌వారు నిర్ణయించడం భారతీయులకు తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. భారతీయుల స్వయం పాలన హక్కు పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్న బ్రిటిష్‌ విధానాలు భారతీయులను అవమాన పరిచాయి. భారతదేశ ప్రతినిధి లేని సైమన్‌ కమిషన్‌ను 1927లో ఇంగ్లండ్‌లో నియమించిన వెంటనే మద్రాసులో ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారీ (ఎం.ఎ.అన్సారీ) అధ్యక్షతన నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో తీవ్రంగా ఖండిస్తూ ఆ విచారణ సంఘాన్ని బహిష్కరించాలని తీర్మానించారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌ లాంటి వివిధ రాజకీయ పార్టీలు బలపర్చాయి. ఈ విధంగా సైమన్‌ కమిషన్‌ నిరసన కార్యక్రమం రూపొందింది. 

1928 ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌ బొంబాయిలో అడుగుపెట్టగానే దేశవ్యాప్తంగా హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. సైమన్‌ కమిటీ పర్యటించిన ప్రతి ఊరిలో హర్తాళ్‌ ప్రకటించి నల్ల జెండాలతో ‘సైమన్‌ వెనక్కి వెళ్లు’ (సైమన్‌ గో బ్యాక్‌) అనే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. 

లాహోర్‌లో లాలాలజపతి రాయ్, లక్నోలో గోవింద్‌ వలభ్‌ పంత్, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, మద్రాస్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి నాయకులు సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చారు. ప్రభుత్వం దమనకాండకు పూనుకుంది. ఉద్యమకాలంలో లాలాలజపతి రాయ్‌ పోలీసులు లాఠీ దెబ్బలు తిని తర్వాత గాయాలతో మరణించాడు. మద్రాసులో ప్రకాశం పంతులు పోలీసుల తుపాకీలకు ఎదురొడ్డి తన ఛాతిని చూపిస్తూ కాల్చివేయండని గర్జించాడు. ప్రకాశం పంతులు ‘ఆంధ్రకేసరి’గా పేరొందాడు. ఆంధ్రదేశంలో కొండా వెంకటప్పయ్య, టంగుటూరి, బులుసు సాంబమూర్తి, పట్టాభి, దండు నారాయణ రాజు లాంటి నాయకులు నల్ల జెండాలతో ‘సైమన్‌ వెళ్లిపో’ అనే నినాదాలతో ఉద్యమాన్ని నిర్వహించారు. ఉద్యమకారులు బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను తిరస్కరిస్తూ భారతదేశానికి స్వపరిపాలిత రాజ్యాంగం కావాలనే ఆకాంక్షను ఏకకంఠంతో వెల్లడించారు. 

సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల తర్వాత దేశంలో రాజకీయ కార్యక్రమ శూన్యత లేకుండా స్వరాజ్యపార్టీ తన పాత్రను ప్రతిభావంతంగా నిర్వహిస్తే, ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమంతో భారత అవనిపై రాజకీయ శక్తులు పునరేకీకరణ చెంది బ్రిటిష్‌ సామ్రాజ్య శక్తితో తలబడటానికి బలోపేతమయ్యాయి. 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయవాద రాజకీయాలు

స్వరాజ్య కాంక్షను రగిలించిన రాజకీయం!


  త్యాగాలతో కూడిన భారతీయుల పోరాటాలు, నిజాయతీ నిండిన రాజకీయాలు తెల్లవారిని ఆలోచనలో పడేశాయి. వారిలోని ఉదారత్వాన్ని మేల్కొలిపాయి. తదనంతర కాలంలో దేశంలో పాలనకు మూలమైన ఒక చట్టాన్ని చేయడానికి ప్రేరణగా మారాయి. ఆ కొత్త చట్టం కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతగా ప్రభావం చూపలేకపోయిన ముస్లింలీగ్‌ అవకాశవాద చర్యలతో ఆంగ్లేయుల వైపు చేరింది. బలవంతంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగిన బ్రిటన్‌ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా నిరసించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వైఖరి మార్చుకున్న వైస్రాయ్, ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపి ప్రత్యేక దేశ విభజన డిమాండ్లను ప్రోత్సహించాడు. సంగ్రామ కాలంలో సంభవించిన పరిణామాలతో రగిలిన స్వాతంత్య్రకాంక్ష తర్వాతి దశ జాతీయోద్యమంపై అత్యంత ప్రభావాన్ని ప్రదర్శించింది.


  గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. మనవాళ్ల ప్రగాఢ స్వాతంత్య్రాభిలాషను విభిన్న నిరసనలతో ప్రదర్శించింది. స్వాతంత్య్రం కోసం భారతీయులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని లోకానికి తెలియజేసింది ఈ క్రమంలో బ్రిటిషర్లలో కొంత ఉదారవాద చైతన్యం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమం, నైతిక విలువలతో కూడిన గాంధీజీ రాజకీయాల వల్ల ఆంగ్లేయ ప్రభుత్వంలోనూ కొంత మార్పును తీసుకొచ్చింది. అయినా రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతలో సైమన్‌ కమిషన్‌ నివేదిక, మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన సూచనలు కలిపి 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. ఈ సూత్రాలను పరిశీలించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్‌ లిన్‌లిత్‌గో నాయకత్వంలో పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.


భారత ప్రభుత్వ చట్టం-1935 ముఖ్యాంశాలు: * ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌-గవర్నర్‌ జనరల్‌కు కట్టబెట్టింది.


* కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్‌ లెజిస్లేచర్‌) చట్టాలను చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. 


* కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ల నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని (అటానమీ) కల్పించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. 


* భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలను ఇవ్వడానికి లండన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ చట్టానికి జాతీయోద్యమ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 


* భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలోని అనేక అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించింది. 


భారత ప్రభుత్వ చట్టం-1935 కింద ఎన్నికలు: బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లో ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ వివరణాత్మకమైంది, సుదీర్ఘమైంది. 1937, ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముస్లింలీగ్‌ అతికష్టం మీద ఇతర పార్టీల సహాయంతో రెండు రాష్ట్రాల్లో గెలిచింది. అధిక సంఖ్యాక ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారని తేటతెల్లం కావడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.* ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారానే మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల అధికార పరిధిలోకి బదిలీ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు. బొంబాయి, మద్రాసు, సెంట్రల్‌ ప్రావిన్స్, ఒరిస్సా, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఈ ప్రభుత్వాలు తమకున్న పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చడానికి, పౌర హక్కులు కల్పించడానికి కృషి చేశాయి. పత్రికలపై ఆంక్షల తొలగింపు, కొన్ని సంస్థలపై బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన బహిష్కరణలను ఎత్తివేయడంతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేశాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రజానుకూల శాసనాలను తీసుకొచ్చాయి. ఖాదీని ప్రోత్సహిస్తూ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాయి. పారిశ్రామికవేత్తలు, కార్మికుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. మంత్రులు వేతనాలు, ఖర్చులను తగ్గించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు నిజాయతీతో వ్యవహరించిన కాంగ్రెస్‌ మంత్రివర్గాలు ప్రజాసేవలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి.


రెండో ప్రపంచ యుద్ధం

 
  జర్మనీ నియంత హిట్లర్‌ రాజ్య విస్తరణ కాంక్షతో పోలెండ్‌పై యుద్ధం ప్రకటించడంతో 1939, సెప్టెంబరులో రెండో ప్రపంచ సంగ్రామం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోలెండ్‌కు మద్దతుగా జర్మనీతో తలపడాల్సి వచ్చింది. జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఒక వైపు; బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా మరో వైపు యుద్ధానికి దిగాయి.  మన జాతీయ నాయకులు, కేంద్ర శాసనసభ సభ్యులెవరినీ సంప్రదించకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి దింపింది. నాజీ, ఫాసిస్ట్‌ వంటి ప్రపంచ నియంతృత్వ శక్తులతో పోరాటానికి కాంగ్రెస్‌ నాయకులు సుముఖంగానే ఉన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటన్‌ అవలంబిస్తున్న పద్ధతుల పట్ల విముఖత చూపారు. దేశంలో రాజ్యాంగబద్ధ అసెంబ్లీ, కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు వంటి కనీస షరతులను ఆమోదిస్తేనే బ్రిటన్‌ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలను రాజప్రతినిధి లిన్‌లిత్‌గో తోసిపుచ్చాడు. ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. మరోవైపు మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ఇండియన్‌ ముస్లింలీగ్‌ మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. 1939, డిసెంబరు 22ను ముస్లింలీగ్‌ ‘విమోచన దినం’గా నిర్వహించింది.


ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ 


  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజీనామా చేయడంతో వైస్రాయ్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపుతూ, దాని డిమాండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా ముస్లింలీగ్‌ మారింది. 1940, మార్చిలో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ సమావేశంలో హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అనే ఒక అశాస్త్రీయ సిద్ధాంతాన్ని జిన్నా ప్రచారం చేశాడు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్‌ మొదటిసారిగా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ‘పాకిస్థాన్‌’ కావాలని తీర్మానం జరిగింది. యుద్ధ కాలంలో భారతదేశ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. రెండో ప్రపంచ సంగ్రామం హోరుగా సాగుతున్న సమయంలోనే, ఐరోపా వలస రాజ్యాల్లో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికి ప్రజా పోరాటాలు పుంజుకున్నాయి. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో తదుపరి స్వాతంత్య్ర పోరాట గతిని అనూహ్యంగా మార్చేసింది.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారత రాజకీయాలు ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ మిషన్‌ (1942)

 దిగివచ్చిన తెల్లదొరలు!


బ్రిటిష్‌ సామ్రాజ్య ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన రెండో ప్రపంచ యుద్ధం భారతీయులకు మంచి అవకాశాన్ని అందించింది. ముప్పు ముంచుకు రావడంతో మన నాయకుల మద్దతు కోసం తెల్లవారు దిగివచ్చారు. రాజ్యాంగాన్ని స్వయంగా రాసుకునే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయం ప్రతిపత్తికి ఒప్పుకున్నారు. కానీ పూర్తి అధికారాలను బదిలీ చేయడానికి అంతగా ఇష్టపడని ఆంగ్లేయులు చేసిన ప్రతిపాదనలు, రాయబారాలు ఆఖరికి విఫలమయ్యాయి. కానీ ఈ పరిణామాలన్నీ ప్రజల్లో జాతీయ భావం, స్వరాజ్య సంకల్పం మరింత పటిష్ఠమయ్యేందుకు దోహదపడ్డాయి. మరో మహోద్యమానికి అందరూ సంసిద్ధులయ్యేందుకు సాయపడ్డాయి.

జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ సామ్రాజ్యకాంక్ష రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. జర్మనీ, జపాన్, ఇటలీ, హంగేరీ, రొమేనియా, బల్గేరియా లాంటి దేశాలు అక్ష రాజ్య కూటమిగా; బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాలు మిత్ర రాజ్య కూటమిగా యుద్ధంలో హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ కాంగ్రెస్‌తో లేదా కేంద్ర శాసనసభకు ఎంపికైన సభ్యులతో కనీసం సంప్రదించకుండా యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం భాగస్వామి కావడాన్ని భారతీయులు వ్యతిరేకించారు. తదనంతర పరిణామాల్లో బ్రిటన్‌ యుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ, బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజీనామాలు చేశాయి. ఐరోపా, ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయుల సహాయ సహకారాలు అత్యంత అవసరమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌ క్లిష్ట పరిస్థితిని గమనించిన భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. యుద్ధ లక్ష్యాలను బ్రిటన్‌ స్పష్టంగా ప్రకటించాలని, కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తొలుత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మారిపోవడంతో భారతీయుల సహకారం కోసం నాటి వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌ గో ద్వారా 1940, ఆగస్టు 8న ఒక ప్రకటన చేయించింది. దీనినే ఆగస్టు ప్రతిపాదన (ఆగస్టు ఆఫర్‌) అంటారు.


ఆగస్టు ప్రతిపాదన ముఖ్యాంశాలు: * జాతి జీవన పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో రాజ్యాంగ సమస్యలు పరిష్కారం కావని, యుద్ధానంతరం భారతీయులు తమ ఆశయాలు, ఆశలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేసుకునే విధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

* అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించే లేదా వారు అంగీకరించని అంశాలతో కూడిన ఏ రాజ్యాంగమైనా బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని ప్రకటించారు. 

* యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తూ ఒక బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

* యుద్ధ సమయంలో తాత్కాలిక చర్యగా రాజప్రతినిధి (వైస్రాయ్‌) కార్యనిర్వహణ మండలిలో భారతీయ ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు.
* యుద్ధకాలంలో బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల ప్రతినిధులతో కూడిన ఒక యుద్ధ సలహా మండలి ఏర్పాటవుతుంది.


ఆగస్టు ప్రతిపాదన విశిష్టత: మొదటిసారిగా భారతీయులకు తమ రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు కల్పించింది. కానీ ఈ ప్రతిపాదనలు భారతీయుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వయంపాలనను నెరవేర్చలేదు. అల్పసంఖ్యాక వర్గాల పట్ల శ్రద్ధ పేరుతో, భారతీయులకు అధికార బదిలీ నిలుపుదల చేసే అంతరార్థం వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనలు అధిక సంఖ్యాక భారతీయులకు ఆశాభంగం కలిగించాయి. దాంతో వైస్రాయ్‌ ప్రతిపాదనలను జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.


రెండో ప్రపంచ యుద్ధ పురోగతి: ఐరోపా యుద్ధరంగంలో హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ కూటమి రెచ్చిపోయింది. పశ్చిమ దేశాల్లో అనూహ్య విజయాలు సాధించింది. ఫ్రాన్స్‌ ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాలను ఆక్రమించింది. రష్యాపై దాడి చేసింది. తూర్పు యూరప్‌ రాజ్యాలు హిట్లర్‌కు లొంగిపోయాయి. ఆసియా యుద్ధరంగంలో జపాన్‌ వీరవిహారం చేసింది. ఆగ్నేయాసియాలోని బ్రిటన్‌ వలస రాజ్యాలైన ఫిలిప్పీన్స్, ఇండోచైనా, ఇండొనేసియా, మలేసియాలను ఒక్కొక్కటిగా జపాన్‌ సైన్యం ఆక్రమించి, బర్మాలోకి ప్రవేశించింది. యుద్ధం దాదాపు భారతదేశపు ముంగిట్లోకి వచ్చేసింది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆందోళన కలిగించింది. పెర్ల్‌ హార్బర్‌ దీవుల్లో అమెరికా నౌకా శ్రేణిపై జపాన్‌ మెరుపుదాడి చేసింది. ఈ పరిణామాలు బ్రిటన్, దాని మిత్ర రాజ్యాలకు మింగుడు పడలేదు. జపాన్‌ సేనల విజృంభణను నిలువరించేందుకు భారతీయుల సహకారం అవసరమని అమెరికా, రష్యా భావించాయి. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ భారతదేశంలో రాజకీయ సంస్కరణల కోసం బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చాడు. బ్రిటిష్‌ ఇండియా అభివృద్ధి నిరోధక రాజకీయాలకు విన్‌స్టన్‌ చర్చిల్‌ మద్దతు, ప్రోత్సాహం ఉండేవి. కానీ యుద్ధకాలం నాటి స్థితి భిన్నంగా ఉంది. భారత్‌లో ప్రజాభిప్రాయాన్ని తమకు అనువుగా మలుచుకోవడానికి బ్రిటిషర్లు కొన్ని సానుకూల చర్యలు చేపట్టక తప్పలేదు. అందులో భాగమే సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ రాయబారం (1942).


క్రిప్స్‌ మిషన్‌: భారత నాయకులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటన్‌ ప్రభుత్వం క్రిప్స్‌ను రాయబారిగా పంపింది. 1942, మార్చిలో అతడు సంప్రదింపులు ప్రారంభించాడు. కాంగ్రెస్‌ తరఫున జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.


క్రిప్స్‌ ప్రతిపాదనలు: * యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తారు. భారత్‌కు కామన్‌వెల్త్‌ నుంచి వైదొలిగే హక్కు కూడా ఉంటుంది.

* యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. 

* కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్‌గా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. స్వదేశీ సంస్థానాలకు కూడా కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి, లేకపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. 

* బ్రిటిష్‌ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించడానికి రాజ్యాంగ పరిషత్తు, బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక  ఒప్పందం కుదుర్చుకోవాలి.

* నూతన రాజ్యాంగం సిద్ధమయ్యే లోపు తాత్కాలికంగా దేశ రక్షణ విషయాలపై బ్రిటిష్‌ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వైస్రాయ్‌ అధికారాలు యథాతథంగా ఉంటాయి.


క్రిప్స్‌ ప్రతిపాదనల్లో డొమినియన్‌ ప్రతిపత్తి కల్పించి భారత యూనియన్‌ ఏర్పాటు చేయడం, కామన్‌వెల్త్‌ నుంచి విడిపోయే హక్కు ఉండటం మంచి విషయాలే. కానీ భారత యూనియన్‌ నుంచి బ్రిటిష్‌ రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలు విడిపోయే అవకాశం ఇవ్వడం ప్రమాదకర అంశం. వివిధ భారతీయ ప్రతినిధుల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకావాలని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే రాజప్రతినిధి ఉండాలనేది భారతీయుల కోరిక. అందుకే కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  ప్రత్యేక పాకిస్థాన్‌ గురించి స్పష్టత లేదంటూ ముస్లింలీగ్‌ కూడా వ్యతిరేకించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వివిధ కారణాలతో అసంతృప్తిని వెల్లడించాయి. క్రిప్స్‌ ప్రతిపాదనలను ‘పతనం అవుతున్న బ్యాంకు పేరిట అనంతర తేదీతో ఇచ్చిన బ్యాంకు చెక్కు వంటిది’ అని గాంధీ విమర్శించారు. భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడానికి బ్రిటిషర్లలో ఉన్న తీవ్ర అయిష్టతే క్రిప్స్‌ ప్రతిపాదనలు, అతడి రాయబారం విఫలమవడానికి ప్రధాన కారణం.


రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1940 ఆగస్టు ప్రతిపాదనలు, 1942 క్రిప్స్‌ ప్రతిపాదనలు విఫలం కావడంతో భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం ఆవహించాయి. ఇంతలోనే ప్రపంచ యుద్ధం భారతదేశం గుమ్మం వరకు చేరింది. భారతీయులు తమకు శత్రువులు కాదని, అక్కడున్న ఆంగ్లేయులే తమ లక్ష్యమని జపాన్‌ స్పష్టం చేసింది. ఇలాంటి స్థితిలో మన దేశానికి యుద్ధ ప్రమాదం తప్పించాలంటే బ్రిటిషర్లు భారత్‌ నుంచి వెళ్లిపోవాలని గాంధీజీ తన ‘హరిజన్‌’ పత్రికలో రాశారు. భారత జాతీయోద్యమంలో మరో చారిత్రాత్మక ఘట్టం ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి నాంది పలికారు.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 20-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)

ప్రజలే సారథులై.. పోరాట యోధులై!


 

రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అది తప్పిపోవాలంటే ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లాలని గాంధీజీ డిమాండ్‌ చేశారు. అప్పటికే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ అంటూ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో మరింత విజృంభించారు. అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం నేతలందరినీ అరెస్టు చేసింది. అయినా జనంలో రగిలే అసంతృప్తి జ్వాలలు ఆరలేదు, అదుపులోకి రాలేదు. నింôకుశ నిర్బంధాలను ధిక్కరించి, నాయకత్వం లేకపోయినా ప్రజలే సారథులై, పోరాట యోధులై పెద్ద ఎత్తున ఉద్యమించారు. క్విట్‌ ఇండియా నినాదం దేశమంతా మారుమోగింది. అణచివేతకు ప్రభుత్వం ప్రజలపై దమనకాండను సాగించింది. తిరగబడిన ఉద్యమకారులు సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారు. యుద్ధం ఆగిపోవడంతో ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రమే భారతీయుల ఉక్కు సంకల్పమనే వాస్తవం తెల్లవారి తలకెక్కింది. 

దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం జాతికి స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఘట్టం. 1942, ఆగస్టులో గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునివ్వడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించాయి. తక్షణం అధికార బదిలీ జరగాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. రాజకీయ సంస్కరణల కోసం భారత నాయకులతో సంప్రదింపులు సాగించిన అనంతరం క్రిప్స్‌ చేసిన ప్రతిపాదనలు భారతీయులను మెప్పించలేకపోయాయి. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశంలో ఆహార పదార్థాల కృత్రిమ కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి. కష్టకాలంలో ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజాజీవితం దుర్భరంగా మారింది. మరోవైపు యుద్ధంలో అక్షరాజ్య కూటమి తరఫున జపాన్‌ సైన్యం ఆసియా ఖండంలో విజృంభించింది. ఆంగ్లేయులను మలయా, సింగపూర్, బర్మాల నుంచి తరిమేసి బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జపాన్‌ సైన్యం భారత్‌ పొరుగు దేశమైన అప్పటి బర్మాలోకి ప్రవేశించింది. ఆ యుద్ధాగ్ని జ్వాలలు భారతదేశాన్నీ తాక వచ్చనే భయం ప్రజల్లో వ్యాపించింది.

1942లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను, ప్రజల ఆగ్రహావేశాలను గాంధీ గ్రహించారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలివెళ్లడం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వానికి తన ‘హరిజన’ పత్రిక ద్వారా సూచించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై ఆ తీర్మానాన్ని ధ్రువీకరించింది. అహింసాయుతంగా, గాంధీ నాయకత్వంలో పోరాడాల్సిందిగా ఈ తీర్మానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ప్రభుత్వం దమననీతికి పాల్పడి ఉద్యమ నాయకులను అరెస్ట్‌ చేస్తే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రగాఢంగా కోరుకునే ప్రతి భారతీయుడు ఉద్యమస్ఫూర్తితో స్వయంగా కార్యక్రమం రూపొందించుకోవాలని కోరింది.


   బొంబాయిలోని గోవలియ ట్యాంక్‌ మైదానంలో (క్రాంతి మైదానం) ఆగస్టు 8న గాంధీజీ ఉపన్యసిస్తూ స్వాతంత్య్రానికి తక్కువైంది ఏదీ అంగీకరించడం కుదరదని స్పష్టం చేశారు. దానికోసం ఒక మంత్రం ఉపదేశించారు. అదే ‘విజయమో.. వీరస్వర్గమో’ (డూ ఆర్‌ డై), దేశాన్ని విముక్తి చేయడమో లేదా ఆ ప్రయత్నంలో మరణించడమో ఏదో ఒకటి జరగాలని ఉద్వేగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలను అహింసాయుతంగా ధిక్కరించాలని చెప్పారు. అయితే ఈ ఉద్యమ నిర్వహణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పటికి ఇంకా ఖరారు చేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఫార్వర్డ్‌ బ్లాక్, జయప్రకాష్‌ నారాయణ్, అచ్యుత్‌ పట్వార్దన్, రామ్‌ మనోహర్‌ లోహియా మొదలైనవారు స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వంటి రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియన్‌ ముస్లింలీగ్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. తర్వాత ముస్లింలీగ్‌ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అని డిమాండ్‌ చేసింది.


ప్రభుత్వ చర్య: బొంబాయిలో కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పట్నాలో అరెస్టయ్యారు.


ప్రజా ప్రతిఘటన: 1942, ఆగస్టు 9 నాటికి దాదాపు నాయకులంతా అరెస్టయ్యారు. అప్పటికే బ్రిటిషర్ల నిరంకుశ, అణచివేత విధానాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిక్షిప్తంగా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉద్యమ నాయకులను ప్రభుత్వం నిర్బంధించినా, ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించారు. అందుకే క్విట్‌ ఇండియా గొప్ప ప్రజా ఉద్యమంగా మారింది. అయితే ప్రజల ముందు ఒక స్పష్టమైన అజెండా లేదు. గాంధీ జైలులో నిర్బంధంలో ఉండటంతో ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేకపోయారు. తొలి దశలో చాలాచోట్ల నిరసనలు, హర్తాళ్లు, శాంతియుత సమావేశాలు నిర్వహించారు. దిల్లీ, బొంబాయి, కాన్పుర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, బెంగళూరు, మద్రాసు, అహ్మదాబాద్‌ లాంటి ప్రముఖ నగరాలు, పట్టణాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి వారు, చేతివృత్తులవారు క్విట్‌ ఇండియా నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులతో, సైన్యంతో ఘర్షణకు దిగారు. ఉద్యమానికి బొంబాయి కేంద్రంగా మారింది. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా ఉక్కు కార్మికులు జాతీయ ప్రభుత్వం ఏర్పడే వరకు విధుల్లో చేరేది లేదంటూ సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. క్విట్‌ ఇండియా ఒక్కటే ఉద్యమకారులందరి డిమాండ్‌గా మారింది.


ప్రభుత్వ చర్య - ప్రతిచర్య: ప్రభుత్వం ఈ ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ దమనకాండ ప్రజల ఆగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హింసకు ప్రతిహింసను సృష్టించింది. ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించారు. కార్మికులు, స్త్రీలు, చేతివృత్తులవారు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు వారి లక్ష్యమయ్యాయి. టెలిగ్రాఫ్‌ లైన్‌లు తెగిపడ్డాయి. రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వార్దన్, జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు తెరచాటు సహాయం అందించారు. విప్లవభావాలతో ఉన్న నాయకులు మిడ్నపూర్‌లోని తామ్రలుక్, మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు లాంటి చోట్ల రహస్య పోటీ ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ఉద్యమం ప్రారంభమైన మూడు నెలల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికార గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.

ఉద్యమ ప్రాముఖ్యం: ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి చాటారు. ఈ మహా ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. కాంగ్రెస్‌ విధానాల పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడింది. చిరకాలంగా ప్రభుత్వ ఎజెండాగా ఉన్న ‘డొమినియన్‌ ప్రతిపత్తి’ ఆగస్టు ఉద్యమంలో ఆహుతైంది. ప్రజల నినాదమైన సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరేదీ అంగీకారం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

నోట్‌: క్విట్‌ ఇండియా నినాదాన్ని మొదటిసారి రూపొందించినవారు యూసుఫ్‌ మెహర్‌ అలీ. ఈయన 1942 నాటి బొంబాయి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బోస్‌ ప్రత్యక్ష పోరాటం (సుభాష్‌ చంద్రబోస్‌ - భారత జాతీయ సైన్యం)

 సాహసవీరుడి స్వతంత్ర సమరం!

నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, ఆయన నిర్ణయాలతోనే నిర్మొహమాటంగా విభేదించి బోస్‌ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుగా వచ్చే ఈ అధ్యాయంపై అభ్యర్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్, చిత్తరంజన్‌ దాస్‌ స్థాపించిన బెంగాల్‌ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, కలకత్తా నగర మేయర్‌గా విధులు నిర్వర్తించాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్‌ వేల్స్‌ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్‌ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవాడు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్‌ తప్పుబట్టాడు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆ తర్వాత చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశాడు.

1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్‌ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించాడు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశ అధ్యక్ష పదవికి బోస్‌ పోటీ చేశాడు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నాడు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. అది కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించాడు. 1940లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం: 1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్‌ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్‌ మీదుగా జర్మన్‌ నగరం బెర్లిన్‌ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్‌ ట్రాప్‌ లాంటి జర్మన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్‌ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్‌ చేరాడు.


జపాన్‌లో బోస్‌: అగ్రరాజ్య కూటమిలో సభ్య దేశమైన జపాన్, జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండో ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్‌ వలస రాజ్య సైన్యాలు విలవిలలాడాయి. జపాన్‌ సైన్యం మలయాలో బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది. భారత బ్రిటిష్‌ సైన్యాధికారి కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ జపాన్‌ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన భారత-బ్రిటిష్‌ సైనికులు యుద్ధఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధఖైదీలు సహా కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ను ఒప్పించి, అతడి నేతృత్వంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి 1942లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని జపాన్‌ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌ అప్పటికే జపాన్‌ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం చేశాడు. ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ను స్థాపించి, దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్‌ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతు తెలిపారు. అన్నివిధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్‌ బిహారీ భావించాడు. భారత జాతీయ సేన, జపాన్‌ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు సాధించే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌కు చేరిన సుభాష్‌ చంద్రబోస్, అక్కడి ప్రధాని టోజో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలకు ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు.


భారత జాతీయ సైన్యం: సుభాష్‌ చంద్రబోస్‌కు జపాన్‌ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943, జులైలో రాస్‌ బిహారీ బోస్‌ నుంచి భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌) బాధ్యతలను, కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నుంచి భారత జాతీయ సైన్యం బాధ్యతలను (ఐఎన్‌ఏ) స్వీకరించాడు. ఆ తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’గా మార్చాడు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్‌ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్‌ రెజిమెంట్‌ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్‌కు లక్ష్మీ సెహగల్‌ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్‌ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. ‘నాకు రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతిపోరాటంలో ఉత్తేజితులను చేశాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ 1943, అక్టోబరు 21న సింగపూర్‌లో ‘ఆజాద్‌ హింద్‌’ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆర్థికమంత్రిగా ఎ.సి.ఛటర్జీ, ప్రచార సారథిగా ఎస్‌.ఎ.అయ్యర్‌ వ్యవహరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను బోస్‌ ప్రవాస ప్రభుత్వానికి జపాన్‌ బదిలీ చేసింది. బోస్‌ వాటికి షహీద్‌ దీవులు (అండమాన్‌), స్వరాజ్య దీవులు (నికోబార్‌) అని నామకరణం చేశాడు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించాôడు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్‌ను, భారత జాతీయ సేన కమాండ్‌ను రంగూన్‌కు (బర్మా) తరలించాడు. జపాన్‌ సైనికులతో పాటు బోస్‌ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాలవైపు దూసుకొచ్చింది. మౌడాక్, కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్‌ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్‌ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్‌ జపాన్‌ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్‌ రేడియో ప్రకటించింది. మహావీరుడిని కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాస్‌ చంద్రబోస్‌ రచనల్లో ఒకటి ఇండియన్‌ స్ట్రగుల్‌. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది.  దేశ స్వాతంత్య్ర సమస్యను బ్రిటిష్‌ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని, బోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయసేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్య్ర సాధన వేగవంతమైంది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 17-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రైతులు, గిరిజనుల తిరుగుబాట్లు            

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆంగ్లేయులపై తిరగబడిన అన్నదాతలు.. అడవి బిడ్డలు!

ఆంగ్లేయులు అడుగు పెట్టడంతోనే భారతదేశంలో అలజడులు మొదలయ్యాయి. సుభిక్షంగా, స్వయంసమృద్ధితో సాగిపోతున్న సమాజం చిన్నాభిన్నమైంది. అరాచక భూమి శిస్తు విధానాలతో అన్నదాతలు అల్లాడిపోయారు. అడవుల్లోకి చొరబడి వనరులు కొల్లగొట్టడంతో గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలకు విఘాతం కలిగింది. అడవి బిడ్డలపై వలస పాలకుల అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ విధానాల్లో జీవనం సాగించే రైతులు, తెగల ప్రజల్లో విప్లవాత్మక ధోరణులు పెరిగి తిరుబాట్లకు దారితీసింది. బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేసిన ఆ పోరాటాల వివరాలు, నాయకత్వం వహించిన యోధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. రైతులు, గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు?

1) రాజకీయ కారణాలు      2) ఆర్థిక కారణాలు   3) గిరిజనుల అసంతృప్తి       4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


2. ప్రకటన-A: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. 

ప్రకటన-B: ఈస్టిండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు.

జవాబు: ప్రకటన A, B లు సరైనవి



3.  ప్రకటన-A: వలస పాలనలో చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు. 

 కారణం- R: ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం.

జవాబు: ప్రకటన A కి కారణం R సరైన వివరణ.


4.  కిందివాటిని జతపరచండి.

రాష్ట్రాలు   -    గిరిజన తెగలు 

1) మహారాష్ట్ర     ఎ) కోలి

2) గుజరాత్‌      బి) నాయక్‌ 

3) ఒడిశా        సి) ఖోండ్‌ 

4) బిహార్‌      డి) సంతాలీలు

జవాబు: 1-ఎ; 2-బి; 3-సి; 4-డి


5.  బ్రిటిష్‌వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది?

జవాబు: గిరిజనుల ఆదాయం పెంచాయి.


6.     నరబలి, శిశుహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి?

జవాబు: ఖోండ్‌ 


7.  బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1855-56  


 


8.     తమల్‌ గిరిజన తెగ ఉన్న ప్రాంతం?

జవాబు:  ఛోటానాగ్‌పుర్‌    


9.     1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న ‘చిరో’ తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?

జవాబు: పితాంబర్‌

10. ‘బిల్‌’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇది 1817 - 19 మధ్య జరిగింది.

బి) ఈ తిరుగుబాటు మార్కోస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో జరిగింది.

సి) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో ఉంటారు. 

డి) వీరికి సహాయం చేసినవారు పీష్వా రెండో బాజీరావు.

జవాబు: ఎ, బి, సి, డి 


11. రమోసే తెగ వారు చిత్తూర్‌ సింగ్‌ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు?

జవాబు: 1822 


12. రమోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం?

జవాబు: సతారా 


13. కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం?

జవాబు: 1831 - 32   


14. సిర్దార్‌ అంటే

జవాబు:  గిరిజన నాయకుడు  


15. కోల్‌ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది?

జవాబు: రాంచీ    


16. కిందివాటిలో భిన్నమైంది?

 జవాబు: బెవార్‌ 


17. 1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశం?


జవాబు: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం


18. సంతాల్‌ తిరుగుబాటు ఏ గవర్నర్‌ జనరల్‌ చివరి కాలంలో జరిగింది?

జవాబు: లార్డ్‌ డల్హౌసీ


19. సంతాల్‌ తిరుగుబాటుకు నాయకుడు?

1) సిధు    2) కన్హూ    3) 1, 2   4) బిర్సా

జవాబు:  1, 2  


20. కోల్‌ తిరుగుబాటుకు సంబంధించి సరైంది?

ఎ) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

బి) ఈ తిరుగుబాటుకు నాయకుడు బుద్ధో భగత్‌.

జవాబు: బి మాత్రమే   


 

21. అహోమ్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణం?

జవాబు: అస్సాంలో బ్రిటిష్‌ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు


22. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1832  


23. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి.    

ఎ) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ జమీందారీలలో జరిగింది.

బి) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జి రుస్సెల్‌.

సి) 1839లో ప్రభుత్వం XXIV చట్టం చేసింది.

డి) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.

జవాబు: ఎ, బి, సి, డి 


24. ప్రకటన-A: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్‌ ఇంటరెస్ట్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను రూపొందించింది.

ప్రకటన-B ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని రద్దు చేసింది.

జవాబు:  ప్రకటన A, B లు సరైనవి   


25. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి?

ఎ) దీని నాయకుడు కొమురం భీం.

బి) దీని నినాదం జల్, జంగిల్, జమీన్‌.

సి) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం.

జవాబు: ఎ, బి, సి   


26. ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటిష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు?

జవాబు: ఖాసీ 


27. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం?

జవాబు: మణిపుర్‌  

28. రంప ఏజెన్సీ అధిపతి మన్సబ్‌దార్‌కు సహాయపడినవారు?

జవాబు: ముత్తాదార్లు   


29. 1835లో మరణించిన రంప మన్సబ్‌దారు?

జవాబు:రామ భూపతిదేవ్‌  


30. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు?

జవాబు: సల్లెవన్‌  


31. గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు?

1) తినడానికి    2) మద్యం తయారీకి     3) 1, 2      4) అలంకరణకు

జవాబు: 1, 2  


32. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు. 

బి) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు.

జవాబు: ఎ, బి సరైనవి


33. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) పంజాబ్‌ - వాన్‌ గుజ్జర్లు - ఆవులను మేపేవారు 

బి) కులూ - గద్దీలు - గొర్రెలు మేపేవారు

సి) కశ్మీర్‌ - బకర్వాలాలు - మేకల కాపరులు

డి) ఆంధ్రప్రదేశ్‌ - లంబాడీలు - పందులను పోషిస్తారు

జవాబు: డి మాత్రమే   


34. గిరిజన పంట కాలాలను జతపరచండి.

1) జేత్‌     ఎ) కుత్కి పక్వానికి వస్తుంది 

2) కార్తిక్‌    బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు

3) కౌర్‌     సి) విత్తడం ప్రారంభిస్తారు

4) మాగ్‌    డి) బీన్స్‌ పక్వానికి వస్తుంది

జవాబు:  1-సి; 2-ఎ; 3-డి; 4-బి


35. నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం?

జవాబు: అరుణాచల్‌ ప్రదేశ్‌ 


36. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు?

జవాబు: 1900 


37. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది?

జవాబు: బిర్సాను 1897లో అరెస్ట్‌ చేశారు.

38. గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు:  కొల్హాపుర్‌


39. ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియా మిలిటెంట్‌ నేషనలిజమ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే 


40. భూగాన్‌ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

జవాబు: ఒరిస్సా 


41. ఖాసిస్‌ తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు: మేఘాలయ


42. బాలగంగాధర్‌ తిలక్‌ గురువు ఎవరు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే


43. భిల్లుల తిరుగుబాటుకు (1818 - 36) నాయ‌క‌త్వం వ‌హించిన‌వారు?

జవాబు: సేవారం

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చోళులు

భారతదేశ చరిత్ర


దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో చోళులు ప్రముఖులు. వీరు క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు తమిళ రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ సామ్రాజ్యం రాజరాజ, రాజేంద్ర చోళుల కాలంలో గొప్పగా విరాజిల్లింది. వీరు అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పటిష్ట పాలనను అందించారు. చోళులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. స్థానిక స్వపరిపాలనా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేశారు.

చారిత్రక నేపథ్యం

చోళుల గురించిన ప్రస్తావన మొదటగా ‘సంగం యుగ’ సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రాచీనకాలంలోనే మహాభారతం, అశోకుడి శిలాశాసనాలు, మెగస్తనీస్‌ రచనల్లో వీరి గురించి ఉంది.

బౌద్ధ గ్రంథాలైన మహావంశం, దీపవంశం; టాలమీ రచనలు; ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథాల్లో చోళుల ప్రస్తావన ఉంది. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచే చోళులు రాజకీయంగా అనేక మంది రాజుల వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి ‘కరికాల చోళుడు’ ప్రాచీన చోళసామ్రాజ్యాన్ని స్థాపించి, గొప్ప వీరుడిగా పేరొందాడు. 

ఇతడు ‘వెన్ని’ యుద్ధంలో చేర-పాండ్య కూటమిపై గెలిచాడు. తర్వాత సింహళ రాజును ఓడించి, 1200 మందిని యుద్ధ ఖైదీలుగా బంధించాడు. వారితో కావేరీ నదిపై ఆనకట్టలు కట్టించాడు.

ఇతడి తర్వాత ‘నెడుమికిల్లి’ రాజయ్యాడు. ఇతడి కాలంలో కలభ్రులు, సముద్రపు దొంగలు, పల్లవులు, కేరళీయులు, పాండ్యులు చోళ రాజధానిపై దాడి చేశారు. దీంతో ప్రాచీన చోళసామ్రాజ్యం పతనమైంది. 

క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో చోళ పాలన పునరుద్ధరణ జరిగింది.

రాజకీయ చరిత్ర

విజయాలయ చోళుడు

క్రీ.శ. 850 నుంచి క్రీ.శ. 870 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు.

విజయాలయుడు క్రీ.శ. 850లో పాండ్య సామంతుడు ‘ముత్తరయార్‌’ను ఓడించి, తంజావూరును ఆక్రమించాడు. అక్కడ ‘విసంభసూధిని’ అనే దేవాలయాన్ని కట్టించాడు.

ఆ సమయంలో పల్లవులు, పాండ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకున్న విజయాలయ చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

మొదటి ఆదిత్య చోళుడు 

క్రీ.శ. 870 నుంచి క్రీ.శ. 907 వరకు రాజ్యపాలన చేశాడు. 

పల్లవరాజు నందివర్మ మరణించాక అతడి కుమారులైన నృపతుంగవర్మ, అపరాజితవర్మ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. దీనికి ‘శ్రీపురంజియం’ యుద్ధం అని పేరు. ఇందులో ఆదిత్య చోళుడు అపరాజితవర్మకు సహాయం చేయగా, నృపతుంగవర్మకు పాండ్యరాజు వరగుణవర్మ సాయం చేశాడు.

ఆదిత్య చోళుడు వరగుణవర్మను ఓడించి అపరాజితవర్మ విజయానికి సాయం చేశాడు. దీంతో అతడు తంజావూరు పరిసర ప్రాంతాలను పొందాడు. తర్వాత ఆదిత్య చోళుడు అపరాజితవర్మను ఓడించి కంచిని ఆక్రమించి, తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

పాండ్యుల నుంచి కోయంబత్తూరు, సేలంను ఆక్రమించాడు. ఇతడు రాతితో ఎత్తయిన శివాలయాలు నిర్మించాడు.

పరాంతక చోళుడు 

క్రీ.శ. 907 నుంచి క్రీ.శ. 955 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదటి ఆదిత్య చోళుడి కుమారుడు. 

క్రీ.శ. 910లో పాండ్యరాజు మారవర్మ రెండో రాజసింహుడ్ని ఓడించి, మధురైను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇతడికి ‘మధురై కొండ’ అనే బిరుదు వచ్చింది.

ఇతడి కాలంలో రాష్ట్రకూటులతో వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు పశ్చిమ గాంగుల సాయంతో పరాంతకుడిపై దండెత్తాడు. పరాంతక చోళుడు వారిని ‘పల్లాల యుద్ధం’లో ఓడించాడు. దీనికి గుర్తుగా ఇతడు చిదంబరంలోని నటరాజ దేవాలయ పైకప్పుకి బంగారుపూత పూయించాడు. 

క్రీ.పూ. 949లో మూడో కృష్ణుడు తక్కోళం యుద్ధంలో పరాంతకుడ్ని ఓడించాడు. ఇతడి జైత్రయాత్ర రామేశ్వరô వరకు సాగింది. అక్కడ మూడో కృష్ణుడు విజయస్తంభం వేయించాడు.

పరాంతకుడు మరణించాక (క్రీ.శ. 955985్శ చోళ సామ్రాజ్యం బలహీనమైంది. 

పరాంతకుడి తర్వాత గండరాదిత్య, అరింజయ, రెండో పరాంతక, రెండో ఆదిత్య ఉత్తమ చోళులు రాజ్యపాలన చేశారు. 

ఉత్తమ చోళుడి కుమారుడు రాజరాజ - 1 కాలంలో చోళ సామ్రాజ్యం మళ్లీ శక్తిమంతమైంది. ఉత్తమ చోళుడికి మరో పేరు సుందర చోళుడు.

మొదటి రాజేంద్ర చోళుడు

క్రీ.శ. 1014 నుంచి క్రీ.శ. 1044 వరకు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు. 

కల్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి, వేంగి రాజ్యంపై చోళప్రాబల్యం పెంచాడు. 

క్రీ.శ.1018లో సింహళరాజు అయిదో మహేంద్రుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు.

వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె ‘అమ్మంగదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజనరేంద్రుడికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు.

బెంగాల్‌ పాలకుడు ‘మహిపాలుడ్ని’ ఓడించి ‘గంగైకొండన్‌’ అనే బిరుదు పొందాడు. 

వ్యాపారాభివృద్ధి కోసం మలయా, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీవిజయోత్తమవర్మను ఓడించాడు. క్రీ.శ. 1025లో అతని రాజధాని ‘కడారం’ను ఆక్రమించి, ‘కడారం కొండ’ అనే బిరుదు పొందాడు. 

క్రీ.శ. 1041లో శ్రీలంకను ఆక్రమించాడు. దీంతో ఇతడికి బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. ‘త్రి సముద్రాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.

రాజేంద్ర చోళుడు ‘గంగైకొండ చోళపురం’ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. 

నౌకాబలాన్ని అభివృద్ధి చేసి, చైనాకు వ్యాపారాభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. 

ముడికొండ (కేరళ, పాండ్య, సింహళ రాజులను జయించినవాడు), గంగైకొండ (గంగాపరీవవాహ ప్రాంతాన్ని జయించినవాడు), కడారకొండ (శ్రీవిజయరాజ్య రాజధాని ‘కడారం’ విజేత) అనే బిరుదులు ఇతడి విజయాలను సూచిస్తున్నాయి. 

ఇతడికి రాజాధిరాజు ఖి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజాధిరాజు - I

క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1052 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది.

ఇతడు వేంగిపై దండెత్తి, పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుడ్ని ‘ధాన్యకటక’ యుద్ధంలో ఓడించి, ‘కొల్లిపాక’ను ధ్వంసం చేశాడు. 

చాళుక్య సామంతులను ఓడించి, ‘కంపిలి’పై అధికారం చెలాయించాడు. యాతగిరి (యాగ్గిరి) ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా ‘పులిగుర్తుతో’ స్తంభాన్ని వేయించాడు. 

కల్యాణి పట్టణాన్ని ఆక్రమించి ‘విజయరాజేంద్ర’ అనే బిరుదు పొందాడు. ఇక్కడి నుంచే ‘ద్వారపాలక’ ప్రతిమను తెచ్చి తంజావూరులోని ‘ధారాసురం’ దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. 

ఈ సమయంలో మధుర, సింహళంలో తిరుగుబాట్లు చెలరేగగా, వాటిని అణచివేశాడు. క్రీ.శ. 1052లో చాళుక్యులతో జరిగిన ‘కొప్పం యుద్ధం’లో మరణించాడు.

రెండో రాజేంద్ర చోళుడు 

క్రీ.శ. 1052 నుంచి క్రీ.శ.1064 వరకు రాజ్యపాలన చేశాడు. కొప్పం యుద్ధంలో రాజాధిరాజు మరణించినప్పటికీ, రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి, విజయం సాధించాడు. 

ఇతడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు ‘కొల్లాపురం’లో విజయస్తంభం వేయించాడు. 

క్రీ.శ. 1062లో ‘కూడలి సంగం’ యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు.

చివరి చోళ రాజులు

రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని పేర్కొంటారు.

రెండో రాజేంద్రుడి తర్వాత వీరరాజేంద్ర 

క్రీ.శ.1064-70, ఆదిరాజేంద్ర (క్రీ.శ. 1070), కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070-1120) పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి.

చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్రచోళుడు. ఇతడు క్రీ.శ. 1256-70 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతిదేవుడ్ని ఓడించాడు. 

పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యం పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది.

రాజరాజ చోళుడు - 

క్రీ.శ. 985 నుంచి క్రీ.శ. 1014 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాకాలంలో చోళ సామ్రాజ్య కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. 

రాజరాజ చోళుడు గొప్పయోధుడు. ఇతడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడిచేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూర్, విలినమ్‌ యుద్ధాల్లో ఓడించాడు. 

ఇతడు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళరాజు అయిదో మహేంద్రను ఓడించి, అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు. సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి ‘పోలోన్నరువ’ను రాజధానిగా చేశాడు. 

క్రీ.శ. 991లో గాంగవాడి, నోళంబవాడి, తడిగైపవాడి, మైసూరును జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

తూర్పు చాళుక్యులను ఓడించి, వేంగిని  ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముడ్ని 

క్రీ.శ. 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ, చాళుక్య రాజ్యాల మధ్య మైత్రి బలపడింది.

కల్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు క్రీ.శ. 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడ్ని ఓడించాడు. 

క్రీ.శ.1003లో చాళుక్య తైలపుడ్ని ఓడించి, కట్టవాడిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు తన నౌకాబలంతో మాల్దీవులను జయించాడు.

ఇతర విషయాలు.. 

రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమేకాక, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి, గ్రామపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

రాజరాజ శివభక్తుడు. ఇతడికి ‘శివపాదశేఖర’ అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు:‘జయంగోడ’, ‘చోళమార్తాండ’, ‘ముమ్మడిచోళ’, ‘కేరళాంతక’.

ఇతడ్ని మొదట్లో ‘రాజకేసరి అరుమోళివర్మన్‌’ అనే పేరుతో పిలిచేవారు. 

ఇతడు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీన్నే ‘రాజరాజేశ్వరాలయం’ అంటారు. 

శ్రీవిజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశ రాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధవిహార నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. క్రీ.శ 1006లో ఆ విహారానికి ‘అనైమాంగలం’ అనే గ్రామాన్ని దానం చేశాడు.

మాదిరి ప్రశ్నలు

1. ‘సౌత్‌ ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని అంటారు?

1) రాజరాజ - I   2) రాజేంద్ర చోళుడు   3) రాజరాజ - II    4) నరేంద్ర చోళుడు

2. ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అనే బిరుదు ఎవరిది?

1) సముద్రగుప్త   2) రెండో చంద్రగుప్త  3) కుమారగుప్త   4) స్కందగుప్త

3. ‘గంగైకొండ’ అనే బిరుదు ఎవరిది?

1) రాజరాజ    2) అనంత చోళుడు 3) రాజాధిరాజ    4) రాజేంద్ర చోళుడు

4. ఉత్తర మేరూర్‌ శాసనం ఎవరి పాలనా విధానాన్ని తెలుపుతుంది?

1) చోళులు    2) చాళుక్యులు 3) మౌర్యులు    4) రాష్ట్రకూటులు

5. ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చోళరాజు ఎవరు?

1) రాజేంద్రచోళ - I  2) మొదటి రాజరాజు   3) మొదటి పరాంతక      4) ఆదిత్య చోళుడు

సమాధానాలు

1-2  2-1  3-4  4-1  5-1

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చోళులు

భారతదేశ చరిత్ర


దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో చోళులు ప్రముఖులు. వీరు క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు తమిళ రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ సామ్రాజ్యం రాజరాజ, రాజేంద్ర చోళుల కాలంలో గొప్పగా విరాజిల్లింది. వీరు అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పటిష్ట పాలనను అందించారు. చోళులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. స్థానిక స్వపరిపాలనా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేశారు.

చారిత్రక నేపథ్యం

చోళుల గురించిన ప్రస్తావన మొదటగా ‘సంగం యుగ’ సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రాచీనకాలంలోనే మహాభారతం, అశోకుడి శిలాశాసనాలు, మెగస్తనీస్‌ రచనల్లో వీరి గురించి ఉంది.

బౌద్ధ గ్రంథాలైన మహావంశం, దీపవంశం; టాలమీ రచనలు; ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథాల్లో చోళుల ప్రస్తావన ఉంది. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచే చోళులు రాజకీయంగా అనేక మంది రాజుల వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి ‘కరికాల చోళుడు’ ప్రాచీన చోళసామ్రాజ్యాన్ని స్థాపించి, గొప్ప వీరుడిగా పేరొందాడు. 

ఇతడు ‘వెన్ని’ యుద్ధంలో చేర-పాండ్య కూటమిపై గెలిచాడు. తర్వాత సింహళ రాజును ఓడించి, 1200 మందిని యుద్ధ ఖైదీలుగా బంధించాడు. వారితో కావేరీ నదిపై ఆనకట్టలు కట్టించాడు.

ఇతడి తర్వాత ‘నెడుమికిల్లి’ రాజయ్యాడు. ఇతడి కాలంలో కలభ్రులు, సముద్రపు దొంగలు, పల్లవులు, కేరళీయులు, పాండ్యులు చోళ రాజధానిపై దాడి చేశారు. దీంతో ప్రాచీన చోళసామ్రాజ్యం పతనమైంది. 

క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో చోళ పాలన పునరుద్ధరణ జరిగింది.

రాజకీయ చరిత్ర

విజయాలయ చోళుడు

క్రీ.శ. 850 నుంచి క్రీ.శ. 870 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు.

విజయాలయుడు క్రీ.శ. 850లో పాండ్య సామంతుడు ‘ముత్తరయార్‌’ను ఓడించి, తంజావూరును ఆక్రమించాడు. అక్కడ ‘విసంభసూధిని’ అనే దేవాలయాన్ని కట్టించాడు.

ఆ సమయంలో పల్లవులు, పాండ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకున్న విజయాలయ చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

మొదటి ఆదిత్య చోళుడు 

క్రీ.శ. 870 నుంచి క్రీ.శ. 907 వరకు రాజ్యపాలన చేశాడు. 

పల్లవరాజు నందివర్మ మరణించాక అతడి కుమారులైన నృపతుంగవర్మ, అపరాజితవర్మ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. దీనికి ‘శ్రీపురంజియం’ యుద్ధం అని పేరు. ఇందులో ఆదిత్య చోళుడు అపరాజితవర్మకు సహాయం చేయగా, నృపతుంగవర్మకు పాండ్యరాజు వరగుణవర్మ సాయం చేశాడు.

ఆదిత్య చోళుడు వరగుణవర్మను ఓడించి అపరాజితవర్మ విజయానికి సాయం చేశాడు. దీంతో అతడు తంజావూరు పరిసర ప్రాంతాలను పొందాడు. తర్వాత ఆదిత్య చోళుడు అపరాజితవర్మను ఓడించి కంచిని ఆక్రమించి, తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

పాండ్యుల నుంచి కోయంబత్తూరు, సేలంను ఆక్రమించాడు. ఇతడు రాతితో ఎత్తయిన శివాలయాలు నిర్మించాడు.

పరాంతక చోళుడు 

క్రీ.శ. 907 నుంచి క్రీ.శ. 955 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదటి ఆదిత్య చోళుడి కుమారుడు. 

క్రీ.శ. 910లో పాండ్యరాజు మారవర్మ రెండో రాజసింహుడ్ని ఓడించి, మధురైను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇతడికి ‘మధురై కొండ’ అనే బిరుదు వచ్చింది.

ఇతడి కాలంలో రాష్ట్రకూటులతో వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు పశ్చిమ గాంగుల సాయంతో పరాంతకుడిపై దండెత్తాడు. పరాంతక చోళుడు వారిని ‘పల్లాల యుద్ధం’లో ఓడించాడు. దీనికి గుర్తుగా ఇతడు చిదంబరంలోని నటరాజ దేవాలయ పైకప్పుకి బంగారుపూత పూయించాడు. 

క్రీ.పూ. 949లో మూడో కృష్ణుడు తక్కోళం యుద్ధంలో పరాంతకుడ్ని ఓడించాడు. ఇతడి జైత్రయాత్ర రామేశ్వరô వరకు సాగింది. అక్కడ మూడో కృష్ణుడు విజయస్తంభం వేయించాడు.

పరాంతకుడు మరణించాక (క్రీ.శ. 955-985 చోళ సామ్రాజ్యం బలహీనమైంది. 

పరాంతకుడి తర్వాత గండరాదిత్య, అరింజయ, రెండో పరాంతక, రెండో ఆదిత్య ఉత్తమ చోళులు రాజ్యపాలన చేశారు. 

ఉత్తమ చోళుడి కుమారుడు రాజరాజ - 1 కాలంలో చోళ సామ్రాజ్యం మళ్లీ శక్తిమంతమైంది. ఉత్తమ చోళుడికి మరో పేరు సుందర చోళుడు.

మొదటి రాజేంద్ర చోళుడు

క్రీ.శ. 1014 నుంచి క్రీ.శ. 1044 వరకు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు. 

కల్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి, వేంగి రాజ్యంపై చోళప్రాబల్యం పెంచాడు. 

క్రీ.శ.1018లో సింహళరాజు అయిదో మహేంద్రుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు.

వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె ‘అమ్మంగదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజనరేంద్రుడికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు.

బెంగాల్‌ పాలకుడు ‘మహిపాలుడ్ని’ ఓడించి ‘గంగైకొండన్‌’ అనే బిరుదు పొందాడు. 

వ్యాపారాభివృద్ధి కోసం మలయా, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీవిజయోత్తమవర్మను ఓడించాడు. క్రీ.శ. 1025లో అతని రాజధాని ‘కడారం’ను ఆక్రమించి, ‘కడారం కొండ’ అనే బిరుదు పొందాడు. 

క్రీ.శ. 1041లో శ్రీలంకను ఆక్రమించాడు. దీంతో ఇతడికి బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. ‘త్రి సముద్రాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.

రాజేంద్ర చోళుడు ‘గంగైకొండ చోళపురం’ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. 

నౌకాబలాన్ని అభివృద్ధి చేసి, చైనాకు వ్యాపారాభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. 

ముడికొండ (కేరళ, పాండ్య, సింహళ రాజులను జయించినవాడు), గంగైకొండ (గంగాపరీవవాహ ప్రాంతాన్ని జయించినవాడు), కడారకొండ (శ్రీవిజయరాజ్య రాజధాని ‘కడారం’ విజేత) అనే బిరుదులు ఇతడి విజయాలను సూచిస్తున్నాయి. 

ఇతడికి రాజాధిరాజు ఖి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజాధిరాజు - i 

క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1052 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది.

ఇతడు వేంగిపై దండెత్తి, పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుడ్ని ‘ధాన్యకటక’ యుద్ధంలో ఓడించి, ‘కొల్లిపాక’ను ధ్వంసం చేశాడు. 

చాళుక్య సామంతులను ఓడించి, ‘కంపిలి’పై అధికారం చెలాయించాడు. యాతగిరి (యాగ్గిరి) ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా ‘పులిగుర్తుతో’ స్తంభాన్ని వేయించాడు. 

కల్యాణి పట్టణాన్ని ఆక్రమించి ‘విజయరాజేంద్ర’ అనే బిరుదు పొందాడు. ఇక్కడి నుంచే ‘ద్వారపాలక’ ప్రతిమను తెచ్చి తంజావూరులోని ‘ధారాసురం’ దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. 

ఈ సమయంలో మధుర, సింహళంలో తిరుగుబాట్లు చెలరేగగా, వాటిని అణచివేశాడు. క్రీ.శ. 1052లో చాళుక్యులతో జరిగిన ‘కొప్పం యుద్ధం’లో మరణించాడు.

రెండో రాజేంద్ర చోళుడు 

క్రీ.శ. 1052 నుంచి క్రీ.శ.1064 వరకు రాజ్యపాలన చేశాడు. కొప్పం యుద్ధంలో రాజాధిరాజు మరణించినప్పటికీ, రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి, విజయం సాధించాడు. 

ఇతడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు ‘కొల్లాపురం’లో విజయస్తంభం వేయించాడు. 

క్రీ.శ. 1062లో ‘కూడలి సంగం’ యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు.

చివరి చోళ రాజులు

రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని పేర్కొంటారు.

రెండో రాజేంద్రుడి తర్వాత వీరరాజేంద్ర 

క్రీ.శ.1064-70, ఆదిరాజేంద్ర (క్రీ.శ. 1070), కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070-1120) పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి.

చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్రచోళుడు. ఇతడు క్రీ.శ. 1256-70 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతిదేవుడ్ని ఓడించాడు. 

పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యం పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది.

రాజరాజ చోళుడు - 

క్రీ.శ. 985 నుంచి క్రీ.శ. 1014 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాకాలంలో చోళ సామ్రాజ్య కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. 

రాజరాజ చోళుడు గొప్పయోధుడు. ఇతడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడిచేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూర్, విలినమ్‌ యుద్ధాల్లో ఓడించాడు. 

ఇతడు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళరాజు అయిదో మహేంద్రను ఓడించి, అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు. సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి ‘పోలోన్నరువ’ను రాజధానిగా చేశాడు. 

క్రీ.శ. 991లో గాంగవాడి, నోళంబవాడి, తడిగైపవాడి, మైసూరును జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

తూర్పు చాళుక్యులను ఓడించి, వేంగిని  ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముడ్ని 

క్రీ.శ. 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ, చాళుక్య రాజ్యాల మధ్య మైత్రి బలపడింది.

కల్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు క్రీ.శ. 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడ్ని ఓడించాడు. 

క్రీ.శ.1003లో చాళుక్య తైలపుడ్ని ఓడించి, కట్టవాడిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు తన నౌకాబలంతో మాల్దీవులను జయించాడు.

ఇతర విషయాలు.. 

రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమేకాక, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి, గ్రామపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

రాజరాజ శివభక్తుడు. ఇతడికి ‘శివపాదశేఖర’ అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు:‘జయంగోడ’, ‘చోళమార్తాండ’, ‘ముమ్మడిచోళ’, ‘కేరళాంతక’.

ఇతడ్ని మొదట్లో ‘రాజకేసరి అరుమోళివర్మన్‌’ అనే పేరుతో పిలిచేవారు. 

ఇతడు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీన్నే ‘రాజరాజేశ్వరాలయం’ అంటారు. 

శ్రీవిజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశ రాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధవిహార నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. క్రీ.శ 1006లో ఆ విహారానికి ‘అనైమాంగలం’ అనే గ్రామాన్ని దానం చేశాడు.

మాదిరి ప్రశ్నలు

1. ‘సౌత్‌ ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని అంటారు?

1)రాజరాజ - I   2)రాజేంద్ర చోళుడు   3) రాజరాజ - II    4) నరేంద్ర చోళుడు

2. ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అనే బిరుదు ఎవరిది?

1)సముద్రగుప్త   2)రెండో చంద్రగుప్త  3)కుమారగుప్త   4)స్కందగుప్త

3. ‘గంగైకొండ’ అనే బిరుదు ఎవరిది?

1)రాజరాజ    2)అనంత చోళుడు 3)రాజాధిరాజ    4)రాజేంద్ర చోళుడు

4. ఉత్తర మేరూర్‌ శాసనం ఎవరి పాలనా విధానాన్ని తెలుపుతుంది?

1)చోళులు    2)చాళుక్యులు 3)మౌర్యులు    4)రాష్ట్రకూటులు

5. ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చోళరాజు ఎవరు?

1)రాజేంద్రచోళ - I  2)మొదటి రాజరాజు   3)మొదటి పరాంతక      4)ఆదిత్య చోళుడు

సమాధానాలు

1-2  2-1  3-4  4-1  5-1

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చేరువైన స్వాతంత్య్రం (1944-45)

అందరూ ఏకమై.. అంతిమ లక్ష్యం వైపు!

 రాయబారాలు, రాజకీయ సంస్కరణల పేరుతో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయోజనం లేని ప్రతిపాదనలను భారత జాతీయ నేతల ముందుకు తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వాటిని చేసినప్పటికీ, ముస్లిం లీగ్‌ మంకుపట్టుతో మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి. దాంతో గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం భారతీయుల చేజారిపోయింది. నేతాజీ నేతృత్వంలో ఆంగ్లేయులను హడలెత్తించిన జాతీయ సైన్యంపై గవర్నమెంటు కఠిన చర్యలకు తెగబడటంతో దేశం మరోసారి భగ్గుమంది. పరిస్థితులను పసిగట్టిన రాజప్రతినిధి శిక్షలను రద్దు చేశాడు. ఈ పరిణామాలు ప్రజల్లో ఐక్యతను పెంచి, దేశభక్తిని రగిలించాయి. అంతిమ లక్ష్యమైన సంపూర్ణ స్వాతంత్య్రం దిశగా వడి వడిగా అడుగులు వేయించాయి. 


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయులను సానుకూలం చేసుకోవడానికి ఆంగ్లేయులు ప్రకటించిన ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ రాయబారం (1942) విఫలమయ్యాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యమని ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియన్‌ ముస్లింలీగ్‌ ప్రత్యేక పాకిస్థాన్‌ తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని సృష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు వర్గాల మధ్య సామరస్యం లేకపోవడంతో భారత రాజకీయ సంస్కరణల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. వాటి మధ్య సయోధ్యకు కొందరు జాతీయ నాయకులు ప్రయత్నించారు.


రాజగోపాలచారి ఫార్ములా (1944): అనారోగ్య కారణాలతో 1944 మేలో గాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో దేశంలో అశాంతి, అలజడి అలముకొని ఉన్నాయి. గాంధీజీ 1944 సెప్టెంబరులో జిన్నాను కలిసి దేశ సమైక్యతను కాపాడేందుకు హిందూ-ముస్లిం ఐక్యత గురించి చర్చించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ నాయకుడు చక్రవర్తుల రాజగోపాలచారి దేశ స్వాతంత్య్ర సాధనలో హిందూ-ముస్లిం ఐక్యత, సామరస్యం ఆవశ్యకత ప్రాధాన్యంగా ఒక పథకాన్ని సూచించారు.



రాజాజీ ఫార్ములాలోని ముఖ్యాంశాలు:  


* దేశ స్వాతంత్య్ర సాధనలో ఇండియన్‌ ముస్లింలీగ్, భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించి అధికార బదిలీకి ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలి. 



* యుద్ధానంతరం ముస్లింలు అధికసంఖ్యలో ఉన్న దేశ ఈశాన్య, వాయవ్య ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దానికి అనుగుణంగా దేశ విభజన లేదా సమైక్యత ప్రక్రియను నిర్ణయించాలి.



* ఒకవేళ విభజనకు అనుగుణంగా నిర్ణయం జరిగితే దేశ రక్షణ, వాణిజ్యం, సమాచార సౌకర్యాలు వంటి అంశాలపై ఉభయులు ఒడంబడిక కుదుర్చుకోవాలి. అవన్నీ బ్రిటిషర్లు అధికారాన్ని పూర్తిగా బదిలీ చేసిన తర్వాతే అమల్లోకి వస్తాయి.



ముస్లింలీగ్‌ మొండివైఖరి కారణంగా రాజాజీ ఫార్ములా విఫలమైంది. 1945 ఏప్రిల్‌లో జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధ జ్వాలలు సద్దుమణిగాయి. అయినా ఆసియా ఖండంలో జపాన్‌ ముప్పు తొలగలేదు. ఇంగ్లండ్‌లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న లేబర్‌ పార్టీ క్లిమెంట్‌ అట్లీ నేతృత్వంలో (ప్రధానమంత్రిగా) అధికారంలోకి వచ్చింది. భారత రాజకీయ సమస్య పరిష్కారం కోసం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అప్పటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ లండన్‌ వెళ్లి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాడు. 1945 జూన్‌లో, రాజ్యాంగ ప్రతిష్టంభన తొలగించడానికి తన ప్రణాళికను  ప్రకటించాడు.



వేవెల్‌ ప్రణాళిక:


* ఈ ప్రణాళిక భారతదేశ గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణానికి ఉద్దేశించింది.



* నూతన కార్యనిర్వాహక మండలిలో గవర్నర్‌ జనరల్, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ తప్ప మిగతా వారంతా భారతీయులే నియమితులవుతారు.


* కార్యనిర్వాహక మండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తారు. ఇతర మతాల వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం ఉంటుంది. 


* విదేశీ వ్యవహారాల శాఖ గవర్నర్‌ జనరల్‌ నుంచి భారత మంత్రికి బదిలీ (రక్షణ వ్యవహారాలు మినహా) అవుతుంది.


* కార్యనిర్వాహక మండలి ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం (1935 భారత ప్రభుత్వ చట్టం) పనిచేస్తుంది. యుద్ధానంతరం నూతన రాజ్యాంగ రచనకు చర్చలు జరుగుతాయి.



ఈ ప్రకటన విడుదల తర్వాత లార్డ్‌ వేవెల్‌ సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటుచేసి భారత రాజకీయ నాయకులను ఆహ్వానించాడు. సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ రాజకీయ పరిష్కారం విషయంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ముస్లింలీగ్, జిన్నాల మొండివైఖరేనని పలువురు విమర్శించారు. కాంగ్రెస్‌ తరఫు నుంచి కార్యనిర్వాహక మండలిలోకి ముస్లిం సభ్యులను ఎంపిక చేసేందుకు లీగ్‌ అంగీకరించలేదు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ముస్లిం లీగ్‌ మాత్రమేనని, గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులనంతా ముస్లింలీగ్‌ సభ్యుల నుంచే తీసుకోవాలని పట్టుబట్టింది. కాంగ్రెస్‌ కూడా తనను హిందూ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాన్ని అంగీకరించలేదు. కార్యనిర్వాహక మండలిలోని స్థానాలకు తమ తరఫున అన్ని మతాల వారిని ప్రతిపాదించే హక్కు ఉందని వాదించింది. గవర్నర్‌ జనరల్‌ కూడా ఉదాసీన వైఖరి అవలంబించడంతో చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం జిన్నా వాదనకు లొంగిపోయిందని పలువులు విమర్శించారు.



భారత జాతీయ సైనికుల విచారణ:
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియాలో సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) అప్రతిహతంగా విజృంభించింది. బోస్‌ ప్రవాసంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. అయితే జపాన్‌ సైనిక సహాయం అందకపోవడం, ఈశాన్య భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితి, బోస్‌ విమాన ప్రమాదంలో మరణించడం వంటి కారణాలతో ఐఎన్‌ఏ బ్రిటిషర్లకు లొంగిపోయింది. ఐఎన్‌ఏలో ప్రముఖపాత్ర వహించిన సైనికాధికారులపై రాజద్రోహ నేరారోపణ చేసి, ప్రభుత్వం బహిరంగంగా విచారించేందుకు నిశ్చయించింది. దీనికి కారణం వారికి వేసే శిక్షలతో భారతీయులను భయానికి గురి చేయాలని భావించడమే. 1945, నవంబరులో దిల్లీలోని ఎర్రకోటలో విచారణ ప్రారంభమైంది. జాతీయ సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను ప్రభుత్వం విచారిస్తున్న విషయాన్ని వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించి దేశ ప్రజలను జాగృతం చేశాయి. ఆ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. హర్తాళ్లు, బంద్‌లు జరిగాయి. 1945, నవంబరు 5 నుంచి 11 మధ్య ‘భారత జాతీయ సైన్య వారం’గా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాదులు భూలాభాయ్‌ దేశాయ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ తదితరులు ఐఎన్‌ఏ యుద్ధ ఖైదీల తరఫున వకాల్తా తీసుకుని వాదించారు. దేశం ఇంతటి ఆగ్రహావేశాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోయింది. మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్ సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను దేశద్రోహులుగా నిర్ణయించి ఉరిశిక్ష విధించడంతో దేశం ఒక్కసారిగా భగ్గుమంది. దేశ ప్రజల మానసిక స్థితిని గమనించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ వీరికి విధించిన శిక్షను రద్దు చేశాడు. స్వాతంత్రోద్యమ గతిని ప్రభావితం చేసిన ఈ ఉదంతం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికను పంపింది.



భారత జాతీయ సైన్యం ఒకప్పుడు ఆంగ్లేయుల అధీనంలోని సైన్యమే. వీరు ఆగ్నేయాసియాలో జపాన్‌కి పట్టుబడి, యుద్ధ ఖైదీలైన తర్వాత సంభవించిన పరిణామాల వల్ల భారత జాతీయ సైన్యంగా మారారు. వీరు మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం చూసిన అనంతరం వారి విధేయతపై బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసం సడలింది. ఐఎన్‌ఏ స్ఫూర్తి బ్రిటిష్‌ భారతీయ సైన్యంలోకి పాకడం పట్ల కూడా అధికారులు ఆందోళన చెందారు. ఆ త్యాగధనుల పోరాటం భారత జాతీయవాద పార్టీల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఐక్యతను పెంచింది. ఐఎన్‌ఏ పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భారతీయుల్లో దేశభక్తిని మరింతగా ఇనుమడింపజేసి, స్వాతంత్య్ర సాధన లక్ష్యాన్ని మరింత చేరువ చేసింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 29-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్వాతంత్య్ర దినోత్సవం

 సంకెళ్లను తెంచుకొని.. స్వేచ్ఛా లోకంలోకి!




 

ఆ అర్ధరాత్రి దేశంలో సరికొత్త సూర్యుడు ఉదయించాడు. జాతి కల సాకారమైంది. పరాయి పాలనలో రెండు వందల సంవత్సరాలకుపైగా అణచివేతలు, దోపిడీలు, దారుణాలకు గురైన గడ్డ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆగస్టు పండగ తెచ్చిన ఉత్సాహం జన హృదయాల్లో నిండిపోయింది. అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఐకమత్యానికి ప్రతిరూపంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కష్టాలు, కన్నీళ్లు, కఠిన శిక్షలతో సాగిన సుదీర్ఘ పోరాటాల ప్రయాణం ముగిసింది. బానిస సంకెళ్లు తెంచుకొని ప్రజలు స్వతంత్ర ప్రపంచంలోకి పరుగులు పెట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసింది. ఈ పరిణామక్రమంలో చివరి ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనలను పోటీ పరీక్షార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ మధ్య ఏర్పడిన సైద్ధాంతిక సంఘర్షణ, దేశంలో చెలరేగిన మత కలహాలు, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విధానం, స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో బ్రిటిష్‌ పాలకులు వ్యవహరించిన తీరు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.  స్వాతంత్య్రంతోపాటు మాయని గాయంగా మిగిలిన దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలి.


ప్రత్యక్ష కార్యాచరణ దినం: మంత్రిత్రయ ప్రణాళికకు ఇండియన్‌ ముస్లింలీగ్‌ మొదట ఆమోదం తెలిపినప్పటికీ, తర్వాత తిరస్కరించింది. అయినా ప్రభుత్వం మంత్రిత్రయ ప్రణాళికను అనుసరించి 1946 జులైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించింది. అందులో భారత జాతీయ కాంగ్రెస్‌ 208 స్థానాలు సాధిస్తే, లీగ్‌ 73 స్థానాలను గెలుచుకుంది. సిక్కులు నాలుగు స్థానాల్లో నెగ్గారు. లీగ్‌ రాజ్యాంగ సభలో ప్రవేశించకుండా 1946 ఆగస్టు 16న ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఆ రోజు బెంగాల్‌లో, ముఖ్యంగా కలకత్తా నగరంలో హిందూ, ముస్లిం మత సంఘర్షణలు చెలరేగాయి. ఇరు పక్షాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది క్షతగాత్రులయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. దీనినే ‘కలకత్తా మారణకాండ’గా అభివర్ణిస్తారు. కలకత్తా మతకలహాలు బిహార్, యూపీ, మహారాష్ట్రలోని బొంబాయి, దిల్లీ ప్రాంతాలకు వేగంగా పాకడంతో పరిస్థితులు విషమించాయి.

తాత్కాలిక ప్రభుత్వం: క్యాబినెట్‌ మిషన్‌ నివేదిక మేరకు భారత్‌లోని బ్రిటిష్‌ రాజప్రతినిధి, జవహర్‌లాల్‌ నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్‌ కూడా దానిని ఆమోదించడంతో 1946, సెప్టెంబరు 2న నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.


తాత్కాలిక ప్రభుత్వంలో: * నెహ్రూ - విదేశీ వ్యవహారాలు, కామన్‌వెల్త్‌ విషయాలు; * సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ - హోం శాఖ, * బల్‌దేవ్‌ సింగ్‌ - రక్షణ, * జాన్‌ మత్తాయ్‌ - పరిశ్రమలు, * రాజగోపాలచారి - విద్య, *హోమీ బాబా - గనులు, విద్యుత్తు; * డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ - వ్యవసాయం, ఆహారం; * జగ్జీవన్‌ రామ్‌ - కార్మిక శాఖ, * ఆసఫ్‌ అలీ - రైల్వే శాఖలను నిర్వహించారు. ముస్లిం లీగ్‌ రాజ్యాంగ పరిషత్తులో భాగస్వామి కావడానికి నిరాకరించినప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. లీగ్‌ తరఫున లియాఖత్‌ అలీఖాన్‌ - ఆర్థిక శాఖ, ఇబ్రహీం ఇస్మాయిల్‌ - వాణిజ్యం, అబ్దుల్‌ నిష్టర్‌ - వార్తా ప్రసారాలు, ఘజాఫర్‌ అలీఖాన్‌ - ఆరోగ్యం, జోగీంద్ర నాథ్‌ మండల్‌ - న్యాయశాఖ నిర్వహించారు.

రాజ్యాంగ పరిషత్‌ సమావేశం: 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం నిర్వహించింది. ఆనాటి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, ఆచార్య కృపలానీ, పండిట్‌ గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ లాంటి వారు పరిషత్తుకు ఎంపికయ్యారు. బిహార్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సుదీర్ఘకాలంగా సెంట్రల్‌ లెజిస్లేచర్‌ సభ్యుడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తర్వాత డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ను శాశ్వత అధ్యక్షుడిగా సభ ఎన్నుకుంది. ముస్లిం లీగ్‌ తాత్కాలిక ప్రభుత్వంలో చేరినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో భాగస్వామి కాలేదు. దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగింది. మత సంఘర్షణలు, హింసాకాండ దేశంలో నిత్యకృత్యమయ్యాయి.

బ్రిటిష్‌ ప్రధాని చర్చలు: ముస్లిం లీగ్‌ మొండి వైఖరి బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. చివరి ప్రయత్నంగా బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ క్లెమెంట్‌ అట్లీ, భారత నాయకులు జవహర్‌లాల్‌ నెహ్రూ, బల్‌దేవ్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), మహమ్మద్‌ అలీ జిన్నా, లియాఖత్‌ అలీఖాన్‌ (లీగ్‌)లను లండన్‌కు పిలిపించాడు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన అధికార నివాసంలో సమావేశం ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి.

అట్లీ ప్రకటన: లీగ్‌ ప్రభుత్వంలో చేరి మంత్రివర్గ కార్యకలాపాలను అడ్డుకుంటూ, ప్రతిష్టంభన సృష్టించింది. ప్రత్యేక పాకిస్థాన్‌ దేశం ఏర్పాటును డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్‌-లీగ్‌ మధ్య సామరస్యం కుదరకపోగా, సంఘర్షణ అనివార్యమైంది. భారతదేశంలోని ఈ ఉద్రిక్త రాజకీయ పరిస్థితులను బ్రిటిష్‌ ప్రభుత్వం గమనించింది. ఆ దశలో నాటి బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ అట్లీ బ్రిటిష్‌ పార్లమెంటులో 1947, ఫిబ్రవరి 20న చరిత్రాత్మక ప్రకటన చేశాడు.


ప్రకటన సారాంశం: * బ్రిటిష్‌ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 1948, జూన్‌ 30 లోపు భారతదేశం నుంచి వైదొలుగుతుంది.


* ఈలోగా భారత రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగాన్ని రచిస్తే దాని ఆధారంగా ఏర్పడే ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేస్తుంది లేదా అప్పుడు అధికారంలో ఉన్న బాధ్యతాయుత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని అప్పగిస్తుంది.

* అధికార బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడానికి అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ స్థానంలో లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భారత రాజ్య ప్రతినిధిగా నియమితుడయ్యాడు.

లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ - భారత స్వాతంత్య్రం: లార్డ్‌ క్లెమెంట్‌ అట్లీ ప్రకటనతో దేశ ప్రజల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మరోవైపు బెంగాల్, పంజాబ్, దిల్లీ ప్రాంతాల్లో మతఘర్షణలు ఎక్కువయ్యాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ కూడా నిత్యం ఈ ఘర్షణలతో బతకడం కంటే, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండటం మేలని భావించింది. గాంధీజీకి దేశ విభజన ఇష్టం లేదు. జరుగుతున్న తతంగం చూసి వేదనకు గురయ్యారు. లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ 1947, మార్చిలో అధికార బాధ్యతలను స్వీకరించాడు. దేశ ప్రముఖ రాజకీయ నాయకులతో పలుసార్లు చర్చలు జరిపాడు. చివరికి బ్రిటిష్‌ మంత్రిత్రయ ప్రణాళిక అమలు చేయడం సాధ్యంకాదని, దేశ విభజన తప్ప ప్రత్యామ్నాయం లేదనే నిర్ణయానికి వచ్చాడు. తానే ఒక ప్రణాళికను రూపొందించి 1947, జూన్‌ 3న ప్రకటించాడు.


బాటన్‌ ప్రణాళిక ముఖ్యాంశాలు: * ఇది ప్రధానంగా దేశ విభజన అమలు కోసం రూపొందించిన ప్రణాళిక. 


* భారతదేశం ఇండియా, పాకిస్థాన్‌ అనే రెండు డొమినియన్‌లుగా విడిపోతుంది. 


* పంజాబ్, బెంగాల్‌ అసెంబ్లీల నిర్ణయానుసారం ఆ రాష్ట్రాలను విభజిస్తారు. 


* అస్సాంలోని సిల్‌హెట్‌ జిల్లాలో, పశ్చిమోత్తర రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దానికి అనుగుణంగా భారత్‌ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.


* కొత్తగా ఏర్పడే రెండు దేశాల మధ్య సరిహద్దు నిర్ణయించడానికి ఒక కమిషన్‌ ఏర్పాటవుతుంది.


* భారత సంస్థానాలపై బ్రిటిష్‌ సార్వభౌమాధికారం ఉండదు. అవి తమ ఇష్టానుసారం కొత్తగా ఏర్పడిన ఇండియా, పాకిస్థాన్‌లలో దేనిలోనైనా చేరవచ్చు.

ప్రణాళిక అమలు-భారతదేశ స్వాతంత్య్రం: రాజప్రతినిధి ప్రకటించిన జూన్‌ ప్రణాళికను భారత రాజకీయ పార్టీలు భారమైన హృదయంతో ఆమోదించాయి. తూర్పు పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లు భారత యూనియన్‌లో ఉంటే, పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్, అస్సాంలోని సిల్‌హెట్‌ జిల్లా పాకిస్థాన్‌లో కలిశాయి. సింధ్‌ రాష్ట్రం పాకిస్థాన్‌లో కలవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశ విభజనకు వీలుగా బెంగాల్, పంజాబ్‌లను విభజించేందుకు సర్‌ రాడ్‌క్లిఫ్‌ నాయకత్వంలో సరిహద్దు కమిషన్‌ ఏర్పాటైంది. రాజప్రతినిధి ప్రణాళికను అనుసరించి 1947 జులై మొదటి వారంలో భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అది ‘భారత స్వాతంత్య్ర చట్టం 1947’గా జులై 18న ఆమోదం పొందింది. 1947, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం ఇచ్చారు. భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దయింది. బ్రిటిష్‌ రాజు ధరిస్తున్న ‘భారతదేశ సార్వభౌముడు’ బిరుదు రద్దయింది. అఖండ భారతదేశం ఇండియా, పాకిస్థాన్‌లుగా విడిపోయింది. సంస్థానాలపై బ్రిటిష్‌ సార్వభౌమాధికారం రద్దయింది. కొత్త డొమినియన్‌ల భూభాగాలను నిర్వచించారు. శాసనరీత్యా ఏర్పడిన పార్లమెంటు ఉభయ డొమినియన్‌లలో లేకపోవడం వల్ల ఆయా భూభాగాల్లోని రాజ్యాంగ పరిషత్తులే శాసన, రాజ్యాంగ రచనా విధులు నిర్వహిస్తాయి.


ఆగస్టు 15వ తేదీ భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. కోట్లాది భారతీయుల సుందర స్వప్నం సాకారమైన రోజు. లక్షలాది త్యాగమూర్తుల తరతరాల అవిశ్రాంత పోరాటాలు, త్యాగాలు ఫలించిన రోజు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు శ్వాసించే వేళ  దిల్లీలోని పార్లమెంటు భవనం విశాలమైన హాలులో భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే అధికార పత్రాన్ని రాజప్రతినిధి చదివాడు. జాతి పులకించిపోయింది. దేశం యావత్తు జయజయధ్వానాలతో నిండిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 22-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశం - భౌతిక అమరిక

భారతదేశం - ద్వీపకల్పం  (India as Peninsula)


మూడు వైపులా జలభాగం, ఒకవైపు భూభాగం ఉన్న ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటారు.


 భారతదేశానికి వాయవ్య, ఉత్తర, ఈశాన్య దిశల్లో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి.


 సుమారు 22 ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ భూభాగ విస్తీర్ణం తగ్గుతూ హిందూ మహాసముద్రం వైపు విస్తరించింది. ఆ భూభాగం దాన్ని రెండు సముద్రాలుగా - పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది.


 భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపకల్పంగా పేరొందింది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం.

భారతదేశంలోని ద్వీపకల్పాలు:


1. దక్కన్‌ ద్వీపకల్పం  - దక్షిణ భారతదేశం


2. కన్యాకుమారి ద్వీపకల్పం  - తమిళనాడు


3. కథియావార్‌ ద్వీపకల్పం - గుజరాత్‌


4. కచ్‌ ద్వీపకల్పం - గుజరాత్‌ ( gujarat )


5. కొలాబా ద్వీపకల్పం - ముంబయి


ప్రపంచంలో భారతదేశం


భారతదేశం అక్షాంశాల ఆధారంగా ఉత్తరార్ధ గోళంలో, రేఖాంశాలపరంగా పూర్వార్థగోళం (East Part) లో ఉంది.


 తూర్పు, పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండానికి దక్షిణ దిశలో విస్తరించిన ప్రాంతమే భారతదేశం.


 హిందూ మహాసముద్రం మీదుగా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది.


 దక్కన్‌ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చింది. దీనివల్ల భారతదేశ పశ్చిమతీరం పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపాలతో; తూర్పుతీరం ఆగ్నేయ, తూర్పు ఆసియాలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది.


 భారతదేశం హిందూ మహాసముద్రంతో సుదీర్ఘ తీరప్రాంతాన్ని పంచుకుంటుంది. 


 1869లో సూయజ్‌ కాలువను తెరవడంతో ఐరోపా నుంచి భారతదేశానికి మధ్య సుమారు 7000 కి.మీ./ 4500 మైళ్ల దూరం తగ్గింది. సూయజ్‌ కాలువ మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది.


వాణిజ్య సంబంధాలు:


అనేక యుగాలుగా భారత్‌ బయటి ప్రపంచంతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోంది. సముద్ర మార్గాల కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలే ప్రాచీనమైనవి.


 పర్వత కనుమల నుంచి ప్రయాణ మార్గాలను ఏర్పాటు చేసి, వర్తక వాణిజ్యాన్ని కొనసాగించారు.


 ప్రాచీన కాలం నాటి భావాలు, వస్తు మార్పిడికి ఈ వ్యాపార మార్గాలు దోహదపడ్డాయి.


 ఉపనిషత్తులు, రామాయణాల సందేశాలు; పంచతంత్ర కథలు; భారతీయ సంఖ్యామానం, దశాంశ పద్ధతి మనదేశం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. 


 సుగంధ ద్రవ్యాలు, మస్లిన్‌ వస్త్రం, ఇతర సరకులు భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి.


భారతదేశానికి వివిధ పేర్లు


జంబూద్వీపం: మార్కండేయ పురాణం, సూర్య సిద్ధాంతం గ్రంథాల్లో మన దేశాన్ని జంబూద్వీపంగా పేర్కొన్నారు.


 జంబుక అంటే నేరేడు వృక్షం.


హిందుస్థాన్‌: పర్షియన్‌ భాషలో ‘స’ అక్షరాన్ని ‘హ’గా పిలుస్తారు. ఉదాహరణకు సప్తసింధును హప్తహింధు అంటారు. వారు సింధు స్థానంలో హిందు అనే పదాన్ని వినియోగించారు.


 మధ్యయుగానికి చెందిన మిన్హజ్‌ ఇ సిరాజ్‌ అనే పర్షియన్‌ చరిత్రకారుడు తన గ్రంథాల్లో మన దేశాన్ని హిందుస్థాన్‌ అనే పేరుతో పిలిచాడు.


తియాన్‌జు/ తెన్‌జికు: ప్రాచీన కాలంలో చైనా వర్తకులు మన దేశాన్ని ఈ పేరుతో పిలిచారు.


నభీవర్షం: మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుడి తండ్రి పేరు మీదుగా మన దేశాన్ని నభీవర్షం అని పిలిచారు.


ఆర్యావర్తనం, ద్రవిడదేశం: ఆర్యులు దండయాత్ర చేసి ఆక్రమించుకున్న భారతదేశ ఉత్తర ప్రాంతాన్ని ఆర్యావర్తం అని, దక్షిణ ప్రాంతాన్ని ద్రవిడ దేశం అని పిలుస్తారు.


 మనుస్మృతి గ్రంథంలో వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఆర్యావర్తనం అని, దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ద్రవిడ దేశంగా పేర్కొన్నారు.


హిమవత్‌ ప్రదేశ్‌: మహా భారతంలో భారతదేశాన్ని ఈ పేరుతో పేర్కొన్నారు. మన దేశానికి ఉత్తర సరిహద్దులో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల పేరు మీదుగా మన దేశాన్ని ‘హిమవత్‌ ప్రదేశ్‌’ అని పిలిచారు.


హొదూ: మన దేశం పేరును బైబిల్‌లో ‘హొదూ’గా పేర్కొన్నారు. హిబ్రూ భాషలో రాసిన ‘ఎస్తేరు’ అనే క్రైస్తవ కథల్లో ఈ పేరు ఉపయోగించారు.


భరతవర్షం: పురాణాల్లో (వాయుపురాణం, విష్ణుపురాణం), మహాభారత ఇతిహాసంలో భరతుడు అనే చక్రవర్తి (శకుంతల - దుష్యంతుల కుమారుడు) మన దేశాన్ని పాలించినట్లు ఉంది. అందుకే దీనికి భరతవర్షం అనే పేరు వచ్చింది.


ఇండియా: భారతదేశానికి వచ్చిన గ్రీకులు వాయవ్య భారతదేశంలో ప్రవహిస్తున్న సింధూ నదిని ‘ఇండస్‌’ అని పేర్కొన్నారు. దాని పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇండోయిలు అని పిలిచారు. ఈ కారణంగానే మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.


భారత్‌: ప్రస్తుతం మన దేశాన్ని అధికారికంగా భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణలో “india that is Bharat, shall be a Union of States.”(ఇండియా అంటే భారత్‌)గా పేర్కొన్నారు.


భూభాగ సరిహద్దు - పొరుగు దేశాలు


భారతదేశానికి మొత్తం 15,200 కి.మీ. పొడవైన భూభాగ సరిహద్దు ఉంది. దీన్ని దేశంలోని 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 7 దేశాలతో కలిసి పంచుకుంటున్నాయి.


బంగ్లాదేశ్‌: భారతదేశంతో పొడవైన (4096 కి.మీ) భూభాగ సరిహద్దును కలిగిన పొరుగు దేశం బంగ్లాదేశ్‌. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు అయిదు. అవి: పశ్చిమ్‌ బంగా, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం.


చైనా: చైనా భారతదేశంతో సుమారు 3916 కి.మీల సరిహద్దును కలిగి ఉంది. ఈ దేశంతో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు నాలుగు. అవి: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 చైనాతో భూభాగ సరిహద్దును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌.


 చైనాతో పొడవైన భూభాగ సరిహద్దు కలిగిన భారత భూభాగం లద్దాఖ్‌.


పాకిస్థాన్‌: బంగ్లాదేశ్, చైనాల తర్వాత పొడవైన సరిహద్దు కలిగి ఉన్న పొరుగుదేశం పాకిస్థాన్‌.


 పాకిస్థాన్, భారతదేశంలోని 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి సుమారు 3300 కి.మీల సరిహద్దు కలిగి ఉంది.


 పాకిస్థాన్‌తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు - గుజరాత్, రాజస్థాన్‌ (పొడవైన సరిహద్దు), పంజాబ్‌; కేంద్రపాలిత ప్రాంతాలు - జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌.


నేపాల్‌: నేపాల్‌ భారతదేశంతో సుమారు 1752 కి.మీ. సరిహద్దు కలిగి ఉంది. నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న భారత రాష్ట్రాలు అయిదు. అవి. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌ బంగా, సిక్కిం.


 నేపాల్‌తో పొడవైన సరిహద్దు పంచుకునే రాష్ట్రం - ఉత్తర్‌ ప్రదేశ్‌.


మయన్మార్‌: భారతదేశంతో సుమారు 1458 కి.మీ. భూ సరిహద్దు కలిగి ఉంది.


 మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు నాలుగు. అవి: అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం.


 మయన్మార్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌.


భూటాన్‌: భూటాన్‌ భారతదేశంతో సుమారు 598 కి.మీ. పొడవైన సరిహద్దును కలిగి ఉంది.


 భూటాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు నాలుగు. అవి: సిక్కిం, పశ్చిమ్‌ బంగా, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 భూటాన్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అసోం.


ఆఫ్గనిస్థాన్‌: భారతదేశంతో అతి తక్కువ భూభాగ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్గనిస్థాన్‌. కేవలం 80 కి.మీ.ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది.


 ఆఫ్గనిస్థాన్‌తో లద్దాఖ్‌ (కేంద్రపాలిత ప్రాంతం) మాత్రమే సరిహద్దును కలిగి ఉంది.


 మూడు వైపులా మూడు దేశాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు - సిక్కిం, పశ్చిమ్‌ బంగా, అరుణాచల్‌ ప్రదేశ్‌.


 సముద్రతీర రేఖను, పొరుగు దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు - గుజరాత్, పశ్చిమ్‌ బంగా.

భూపరివేష్టిత రాష్ట్రాలు (Land Locked States)


ఇతర దేశాలతో భూభాగ సరిహద్దు లేదా సముద్ర తీరం లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు.


* మన దేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు 5, కేంద్రపాలిత ప్రాంతాలు 2 ఉన్నాయి.


అవి: రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హరియాణా, తెలంగాణ.


కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, చండీగఢ్‌.


రచయిత

పి.కె. వీరాంజనేయులు

విషయ నిపుణులు 

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌