• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
జ: ఆర్టికల్స్‌ 25 - 28

 

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

 

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
    1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
    2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
    3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
    4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

 

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

 

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
     1) హిందువులు   2) జైనులు, బౌద్ధులు  3) సిక్కులు   4) అందరూ
జ: 4 (అందరూ)

 

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

 

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

 

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

 

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

 

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

 

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

 

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

 

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

 

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

 

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
      1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
      2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
      3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
      4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

 

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                                      
2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

 

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

 

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

 

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

 

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
 1) సెర్షియోరరీ   2) ప్రొహిబిషన్‌   3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌  4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

 

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

 

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

 

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

 

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

 

27. PIL అంటే?
జ: Public Interest Litigation

 

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

 

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

 

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర ఎన్నికల సంఘం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కేంద్ర ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో వివరించారు?
జ: XVవ భాగం, ఆర్టికల్‌ 324 - 329

 

2. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1950, జనవరి 25

 

3. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ నినాదంతో నిర్వహిస్తున్నారు?
జ: Proud to be voter - Ready to vote

 

4. రాష్ట్రపతి నియమించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్‌ల పదవీ కాలం?
జ: 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు

 

5. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు?
జ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 

6. 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చిన ప్రధాని ఎవరు?
జ: రాజీవ్‌గాంధీ

 

7. బహుళ సభ్య ఎన్నికల సంఘాన్ని అప్పటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ఎప్పుడు ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు?
జ: 1990 జనవరి

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు - ఉద్యమాలు

     భారత రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని ‘రాష్ట్రాల సముదాయం’ (Union of States) గా పేర్కొన్నారు. వీరు దేశాన్ని పాలనాపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు కానీ సిద్ధాంతపరమైన సమాఖ్యగా పేర్కొనలేదు. దీనివల్ల దేశం నుంచి రాష్ట్రాలు విడిపోయే అవకాశం లేదు. ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో అసమానతలకు గురైనవారు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, దేశంలోనే అంతర్భాగంగానే కొనసాగుతున్నారు. ఇది భారత ఉపఖండం విశిష్టతను తెలియజేస్తుంది.


కారణాలు


* కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాల వెనుక సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత సహజవనరులను ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకుండా మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు కొత్త రాష్ట్రం కోసం డిమాండ్‌లు వస్తాయి.
* ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పట్ల మిగిలిన ప్రాంతాల ఆధిపత్యం పెరిగినప్పుడు; ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యానికి గురై, మిగిలిన ప్రాంతాలు వాటిని పొందడంలో ఆధిక్యం ప్రదర్శించినప్పుడు ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.

* ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర రాజధాని చుట్టూ కేంద్రీకృతమై, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబాటుకు గురైనప్పుడు; నదీజాలలు, ఖనిజ సంపద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలినప్పుడు కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు వస్తాయి.

* ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్ని ప్రాంతాలు కొత్త రాష్ట్రంగా ఏర్పడాలని భావిస్తాయి.

* రాజకీయ నాయకులూ తమ మనుగడ కోసం కొన్ని సముదాయాలను ఏకీకృతం చేసి కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలు, బడ్జెట్‌ కేటాయింపులు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు నష్టపోతున్న ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమిస్తారు.


1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు


  ఫజల్‌ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ ్బళీళిద్శి సిఫార్సుల మేరకు 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో భారత రాజకీయ చిత్రపటంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా నిలిచాయి. భాష ప్రాతిపదికన లేదా సాంస్కృతిక సజాతీయత కారణాలపై ఏర్పడిన డిమాండ్‌ల వల్ల రాష్ట్రాలను తిరిగి విభజించాల్సి వచ్చింది.


15. గుజరాత్‌: భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో ‘మరాఠా’ ప్రాంతం మరాఠీయులకే చెందాలని కోరుతూ గుజరాతీ భాష మాట్లాడేవారిని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బాంబేలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 1960లో ద్విభాషా రాష్ట్రమైన బాంబేని విభజిస్తూ గుజరాతీయుల కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్రను కలిపి గుజరాత్‌ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బొంబాయిని మహారాష్ట్రగా పేరు మార్చారు.


16. నాగాలాండ్‌: ఎ.జి.పి.జో నేతృత్వంలోని నాగాలు, అసోంను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని ఉద్యమించారు. దీంతో నాగాహిల్స్, ట్యూన్‌సాంగ్‌లను వేరు చేసి 1963లో నాగాలాండ్‌ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


17. హరియాణా: మాస్టర్‌ తారాసింగ్‌ నాయకత్వంలో అకాళీదళ్‌ ప్రత్యేక ‘సిక్కుల మాతృభూమి’ (పంజాబ్‌ సుబా) అనే డిమాండ్‌తో పంజాబ్‌ రాష్ట్రం పంజాబీయులకే (సిక్కులు) చెందాలని, హిందీ మాట్లాడేవారిని వేరు చేయాలని ఉద్యమించింది. 1966లో షా కమిషన్‌ సూచనల మేరకు పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌ రాష్ట్రంగా ఉంచి, హిందీ మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి హరియాణా పేరుతో 17వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌ను నిర్ణయించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.


18. హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ ఫలితంగా 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌కు బిలాస్‌పూర్‌ ప్రాంతాన్ని కలిపి 1971లో దాన్ని 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


19. మణిపూర్‌: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన మణిపూర్‌ను 1972లో 19వ రాష్ట్రంగా మార్చారు.


20. త్రిపుర: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న త్రిపురను 1982లో 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


21. మేఘాలయ: ప్రజా ఉద్యమం కారణంగా అసోం రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తూ 1972లో ఉప ప్రాంతంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ట్రంగా నిర్ణయించారు. ఈ సందర్భంలోనే మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.


22. సిక్కిం: బ్రిటిషర్ల పాలనా కాలంలో ‘సిక్కిం’ చోగ్యాల్‌ అనే వారసత్వపు రాజు నియంత్రణలో ఉండేది. 35వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కిం భారత్‌లో ‘సహరాష్ట్ర హోదా’ (Associate State) గా విలీనమైంది. ఇది విమర్శకు దారి తీయడంతో కేంద్ర ప్రభుత్వం 36వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


23. మిజోరం: రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో (1986) మిజో నేషనల్‌ ఫ్రంట్‌తో జరిగిన ‘మిజోరం శాంతి ఒప్పందం’ ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న మిజోరంను 1987లో 53వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


24. అరుణాచల్‌ప్రదేశ్‌: కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో 24వ రాష్ట్రంగా మార్చింది.


25. గోవా: ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పోర్చుగీసు వారి నుంచి 1961లో విముక్తి పొందిన గోవా, డయ్యూ డామన్‌లను 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేసి డయ్యూ డామన్‌లను కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగించారు.
 

* అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారత్‌లో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అవి చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఝార్ఖండ్‌.


26. చత్తీస్‌గఢ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 1న చత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


27. ఉత్తరాంచల్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 9న ఉత్తరాంచల్‌ను 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


28. ఝార్ఖండ్‌: బిహార్‌ను పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 15న ఝార్ఖండ్‌ను 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


29. తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి 2014 జూన్‌ 2న తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.
 

ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్న ప్రాంతాలు: మహారాష్ట్ర - విదర్భ; అసోం - బోడోలాండ్‌; కర్ణాటక - కొడుగు; ఉత్తరప్రదేశ్‌ - హరితప్రదేశ్, బుందేల్‌ఖండ్‌; పశ్చిమ్‌ బంగ - గూర్ఖాలాండ్‌; గుజరాత్‌ - సౌరాష్ట్ర.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం - చారిత్రక పరిణామం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారతదేశంలో ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
జ: మింటో-మార్లే సంస్కరణల చట్టం - 1909

 

2. భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడని ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్‌ మింటో

 

3. మన దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

4. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఏ చట్టంలో పేర్కొన్నారు?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

5. కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

6. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
జ: సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా

 

7. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919ను ‘సూర్యుడులేని ఉదయం’ అని ఎవరు అభివర్ణించారు?
జ: బాలగంగాధర్‌ తిలక్‌

 

8. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919కు సంబంధించి సరైంది?
1) కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.               
2) లండన్‌లో భారత హైకమిషనర్‌ పదవిని ఏర్పాటు చేశారు.
3) సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేశారు.         
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

9. రాష్ట్రాల్లోని ‘ద్వంద్వ ప్రభుత్వ’ విధానాన్ని ఏ చట్టం రద్దు చేసింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

 

10. భారత ప్రభుత్వ చట్టం - 1935కు సంబంధించి సరైంది.
     1) కేంద్రం, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొటుంది.
     2) రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.
     3) దిల్లీలో ఫెడరల్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది.
     4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు

భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంత పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.

* మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి:
1) శాసన సంబంధాలు - 11వ భాగంలోని 245 - 255 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
2) పరిపాలన సంబంధాలు - 11వ భాగంలోని 256 - 263 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
3) ఆర్థిక సంబంధాలు - 12వ భాగంలోని 264 - 300 (A) వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.


శాసన సంబంధాలు


రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న 11 ప్రకరణల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన సంబంధాలను వివరించారు.


ఆర్టికల్ 245
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని వివరిస్తుంది.


ఆర్టికల్ 245 (1)
దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక రాష్ట్రం మొత్తానికి లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.


ఆర్టికల్ 245 (2)
పార్లమెంటు చేసిన శాననాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. (Extra Territorial Operations)


ఆర్టికల్ 246
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య అధికారాల విభజన, చట్టాలకు సంబంధించిన విషయాలు.


ఆర్టికల్ 246 (1)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.


ఆర్టికల్ 246 (2)
* 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
* ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర శాసనమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్స్ అంటారు.


ఆర్టికల్ 246 (3)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.


ఆర్టికల్ 246 (4)
రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపల ఉన్న భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి శాసనాలనైనా రూపొందించవచ్చు.


ఆర్టికల్ 247
కేంద్ర జాబితాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.


ఆర్టికల్ 248
* అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు అప్పగించారు. ఒక అంశం అవశిష్ట అధికారమా? కాదా? అనేది సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.


ఆర్టికల్ 249
* జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందించగలదు.


ఆర్టికల్ 249 (1)
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన శాసనం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.


ఆర్టికల్ 250
భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
¤ ఈ విధంగా రూపొందిన శాసనం అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.


ఆర్టికల్ 251
ఆర్టికల్ 249, 250 లను అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలు రాష్ట్ర శాసనాలతో వైరుధ్యం కలిగి ఉంటే పార్లమెంటు రూపొందించిన శాసనాలే చెల్లుతాయి. పార్లమెంటు చేసే చట్టాలకు కాల పరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు తిరిగి అమల్లోకి వస్తాయి.


ఆర్టికల్ 252
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ప్రయోజనార్థం శాసనాలను రూపొందించాలని కోరితే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: ఎస్టేట్ సుంకం చట్టం, 1955
     ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1955
     వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972
     జల కాలుష్య నివారణ చట్టం, 1974
     పట్టణ ఆస్తుల పరిమితి చట్టం, 1976


ఆర్టికల్ 253
భారత ప్రభుత్వం విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులను అమలు చేయడానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదా: ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం - 1947
     జెనీవా ఒప్పంద చట్టం - 1960
    హైజాకింగ్ వ్యతిరేక చట్టం - 1982


ఆర్టికల్ 254
* పార్లమెంటు చేసిన చట్టానికి, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
* రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తే ఆ అంశంపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం ఉండదని 1990లో బిహార్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.


ఆర్టికల్ 255
* ఏదైనా అంశానికి సంబంధించి శాసనం చేయాలంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి ముందుగా అనుమతి పొందకుండానే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించి ఉండవచ్చు.
* ఈ విధంగా రూపొందించిన శాసనానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే 'ముందస్తు అనుమతి లేకుండా శాసనం చేశారనే' కారణంపై చెల్లకుండా పోదు.


ఆర్టికల్ 201
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది.


ఆర్టికల్ 352
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని పాలనాంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.


ఆర్టికల్ 356
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ తరఫున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది.


ఆర్టికల్ 31 (ఎ)
* రాష్ట్రాల్లో ఆస్తులను జాతీయం చేసే బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.


Doctrine of Pith and Substance:


      కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగిన సందర్భంలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరచిన అంశం మరో జాబితాలో పొందుపరచిన అంశంతో సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా ఆ చట్టాలు చెల్లుతాయి. దీన్నే Pith and Substance అంటారు.


బెంగాల్ vs బెనర్జీ కేసు:


      ఈ కేసులో మనీ లెండింగ్ (అప్పులు) అనే అంశంపై శాసనం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని ప్రామిసరీ నోట్లు అనే అంశం కూడా ఇమిడి ఉండటం వల్ల అది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని సార్లు అనుకోకుండా ఒక జాబితాలోని అంశంపై శాసనం చేసే సందర్భంలో మరో జాబితాలోకి చొచ్చుకుని రావడమే Pith and Substance అంటారు.


బల్లార్‌షా vs స్టేట్ ఆఫ్ ముంబయి కేసు:


      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముంబయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ సందర్భంలో కేంద్ర జాబితాలో పేర్కొన్న విదేశీ మద్యం అనే అంశాన్ని అనుకోకుండా చేర్చడం వల్ల ఆ చట్టం చెల్లుతుందని, అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.


కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు:


      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను జాతీయం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని 'షుగర్ ఫ్యాక్టరీ'ని కూడా జాతీయం చేస్తూ చట్టం చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఈ చట్టం చెల్లుతుందని పేర్కొంది.
      సదరన్ ఫార్మాస్యూటికల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, చావ్లా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సింథటిక్ కెమికల్స్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసుల్లో Pith and Substance గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


Colourable Legislation:


* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత, అవే శాసనాలను మరో రూపంలో తీసుకొచ్చినప్పుడు అవి కూడా చెల్లవని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే Colourable Legislation గా పేర్కొంటారు.
* ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏదీ పరోక్షంగా కూడా ఒప్పు కాదని, ఒక రూపంలో తప్పుగా భావించిన దాన్ని మరో రూపంలో కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్నే Colourable Legislation అంటారు.
* కె.సి.జి. నారాయణ్‌దేవ్ vs స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు Colourable Legislation సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
* కామేశ్వరీ సింగ్ vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో Colourable Legislation సిద్ధాంతాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తొలిసారిగా తీర్పు ఇచ్చింది.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు రూపొందిస్తే, కేంద్ర శాసనమే చెల్లుతుందని చెప్పడాన్ని Doctrine of Repugnancy అంటారు.
* కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు ముందుగా శాసనం రూపొందిస్తే రాష్ట్ర శాసనమే అమల్లో ఉంటుంది.


కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు


* భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలను వివరిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణాధికారాలను నిర్వహించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉంటాయి.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేయగా, ఆర్టికల్ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేస్తుంది.


ఆర్టికల్ 256
* రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు.
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం కేంద్రానికి ఆర్టికల్ 256 ప్రకారం ఉన్న అధికారం లేకపోయినట్లయితే పార్లమెంటు చేసే చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.


ఆర్టికల్ 257
* రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణాధికారాలను కేంద్రం నియంత్రిస్తుంది. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అవి కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండకూడదు.
* కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు లాంటి వాటిని రాష్ట్రాలు పరిరక్షించాలి. జాతీయ ఆస్తుల సంరక్షణ విషయమై కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.


ఆర్టికల్ 258
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు లాంటి నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించవచ్చు. వాటి నిర్మాణ ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని ఏవైనా అంశాలను కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు షరతులతో లేదా షరతులు లేకుండా అప్పగించవచ్చు. అయితే దీనికి కేంద్రం అంగీకరించాలి. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చారు.


ఆర్టికల్ 259
* శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాల్లో మోహరించవచ్చు. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు.


ఆర్టికల్ 260
* భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలపై శాసన, కార్యనిర్వాహక, న్యాయాధికారాలను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒప్పందం భారతదేశానికి విదేశాలతో ఉండాలి. సంబంధిత ఒప్పందం విదేశీ భూభాగపు పరిపాలనకు సంబంధించి అమల్లో ఉన్న శాసనానికి అనుగుణంగా ఉండాలి.


ఆర్టికల్ 261
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలను భారతదేశమంతా గౌరవించాలి.
* సివిల్ న్యాయస్థానాలు వెలువరించే అంతిమ తీర్పులను భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా చట్ట ప్రకారం అమలుచేయవచ్చు.


ఆర్టికల్ 262
* అంతర్‌రాష్ట్ర నదీ జలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రైబ్యునల్ తీర్పును అనుసరించి పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే, దాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి, న్యాయ సమీక్షకు గురి చేయడానికి వీల్లేదు.
* అయితే నదీ జలాల పంపకంపై పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని ఏదైనా రాష్ట్రం ఉల్లంఘిస్తే దానిపై సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
* భారత పార్లమెంటు 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డ్ చట్టాన్ని రూపొందించింది.


ఇప్పటివరకు మన దేశంలో 8 అంతర్‌రాష్ట్ర నదీ జలాల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అవి:


1. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.


2. గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.


3. నర్మదా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.


4. రావి, బియాస్ నదీ జలాల ట్రైబ్యునల్ (1986)
    దీని పరిధిలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి.


5. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ (1990)
    దీని పరిధిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఉన్నాయి.


6. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ - II (2004)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.


7. వంశధార నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.


8. మహదాయి (మాండవి నది) నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.


ఆర్టికల్ 263
¤ అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది.
¤ వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను విచారించి పరిష్కరించడానికి; అవసరమైన సలహాలు, సిఫార్సులు చేయడానికి రాష్ట్రపతి అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు.


అంతర్‌రాష్ట్ర మండలి నిర్మాణం


* 1990, మే 28న వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ అంతర్‌రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేశారు.
* అంతర్‌రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రితో సహా ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* దిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు సభ్యులుగా ఉంటారు.

* అంతర్‌రాష్ట్ర మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశం కావాలి.
* 1991లో అంతర్‌రాష్ట్ర మండలి విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు.
* సెక్రటేరియట్ 2011 నుంచి జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహించే విధులను నిర్వర్తిస్తోంది.
* అంతర్‌రాష్ట్ర మండలికి సంబంధించి 1996లో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాయీ సంఘానికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, అయిదుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.


2015, డిసెంబర్ 18న అంతర్‌రాష్ట్ర మండలి సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ నియమించారు. వారు
1. రాజ్‌నాథ్ సింగ్
2. వెంకయ్యనాయుడు
3. సుష్మాస్వరాజ్
4. అరుణ్ జైట్లీ
5. నితిన్ గడ్కరీ
* 2013, డిసెంబర్ 12న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ అంతర్‌రాష్ట్ర మండలిని పునర్వ్యవస్థీకరించారు. దీని ప్రకారం కొత్తగా రైల్వే శాఖ మంత్రికి అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించారు.


అంతర్‌రాష్ట్ర మండలి విధులు


* వివిధ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు, సూచనలు, సలహాలు ఇవ్వడం.
* కేంద్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య వివాదాలను పరిష్కరించడం.
* రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి, ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం.
* 1990 నుంచి 2005 వరకు అంతర్ రాష్ట్ర మండలి 9 సమావేశాలను నిర్వహించింది.
* 2006, డిసెంబర్ 9న అంతర్ రాష్ట్ర మండలి 10వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.
* 2016, జులై 16న అంతర్ రాష్ట్ర మండలి 11వ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, కర్ణాటక ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అంశాలతో పాటు ఎం.ఎం.పూంచీ కమిషన్ సిఫారసులపై చర్చించారు.


రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు


ఆర్టికల్ 155
    రాష్ట్రాల పరిపాలనలో కీలక పాత్రను పోషించే గవర్నర్లను నియమించేది, నియంత్రించేది, బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి.


ఆర్టికల్ 312
   అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిలో పరిపాలనా విధులను నిర్వహిస్తారు.


ఆర్టికల్ 315
  రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను కేంద్రమే నియమిస్తుంది.


ఆర్టికల్ 339
    షెడ్యూల్డ్ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేయవచ్చు.


ఆర్టికల్ 340
   వెనుకబడిన తరగతుల స్థితిగతులను దర్యాప్తు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సిఫారసులు చేయడానికి ఒక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు.


ఆర్టికల్ 341
   షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సిన ఇతర ప్రభావ వర్గాల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి రాష్ట్రపతి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు.


ఆర్టికల్ 355
   రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. కేంద్రం అనేక సందర్భాల్లో రాష్ట్రాల కోరికపై తన సాయుధ బలగాలను రాష్ట్రాలకు సహాయంగా పంపుతుంది.


కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు


* భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300 (A) వరకు ఉన్న ఆర్టికల్స్‌లో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలను పొందుపరిచారు.
* ప్రొఫెసర్ అమల్ రే అభిప్రాయం ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మిగిలిన వాటి కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువ వివాదానికి కారణమవుతున్నాయి.


ఆర్టికల్ 264

కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి కచ్చితమైన విభజన చేశారు. కేంద్ర ప్రభుత్వం 15 రకాల పాలనాంశాలపై పన్ను విధించగలదు. అవి:
1. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
2. ఎగుమతి, దిగుమతి సుంకాలు
3. పొగాకుపై ఎక్సైజ్ పన్ను
4. కార్పొరేషన్ పన్ను
5. మూలధన విలువపై పన్ను
6. వ్యవసాయేతర ఎస్టేట్‌లపై పన్ను
7. వారసత్వ పన్ను
8. అంతర్ రాష్ట్ర రవాణా పన్ను
9. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను
10. చెక్స్, ప్రామిసరీ నోట్లు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను
11. అంతర్ రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకం పన్ను
12. వార్తా పత్రికలపై అమ్మకపు, ప్రకటనలపై పన్ను
13. అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో సరకులపై విధించే పన్ను
14. సర్వీసులపై పన్ను
15. వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను


రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 20 రకాల పాలనాంశాలపై పన్నులు విధిస్తాయి


1. భూమి శిస్తు
2. వ్యవసాయ ఆదాయంపై పన్ను
3. వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
4. వ్యవసాయ భూములపై ఎస్టేట్ పన్ను
5. స్థిరాస్తులపై పన్ను (భూములు, భవనాలు)
6. ఖనిజాలపై పన్ను
7. మద్యపానంపై పన్ను
8. ఆక్ట్రాయ్ పన్ను (స్థానిక ప్రాంతాల్లోకి రవాణా అయ్యే వస్తువులపై పన్ను)
9. విద్యుత్ వినియోగం, అమ్మకంపై పన్ను
10. వాణిజ్య పన్ను
11. ప్రకటనలపై పన్ను
12. రోడ్డు, జల రవాణాపై పన్ను
13. మోటారు వాహనాలపై పన్ను
14. పశువులపై పన్ను
15. టోల్ ట్యాక్స్
16. వృత్తి పన్ను
17. కస్టడీ పన్నులు
18. వినోదపు పన్నులు
19. కేంద్ర జాబితాలోని డాక్యుమెంట్లు మినహా మిగతావాటిపై స్టాంపు డ్యూటీ
20. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన ఇతర ఫీజులు


అవశిష్ట వన్నులు: కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధించే పన్నులు


1. బహుమతి పన్ను
2. సంపద పన్ను
3. వ్యయంపై పన్ను


సేవా పన్ను


రాజా చెల్లయ్య కమిటీ సిఫారసుల మేరకు 1994 నుంచి సేవా పన్ను అమల్లోకి వచ్చింది. సేవలపై విధించే పన్నును సేవా పన్నుగా వ్యవహరిస్తారు. కేంద్ర స్థాయిలో ఇది విలువ అధారిత పన్నులో అంతర్భాగంగా ఉంది.

* ప్రస్తుతం సేవా పన్ను రేటు 12%. సేవా పన్నుపై అదనంగా 2% విద్యా సెస్, 1% సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ విధించారు. కాబట్టి ప్రస్తుతం మొత్తం సేవా పన్ను రేటు 12.36%.


ఆర్టికల్ 265
 మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయనిదే ఎలాంటి పన్నులు విధించకూడదు.
* పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా పన్నులు విధిస్తారు.
* రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయాలి.


ఆర్టికల్ 266
   సంఘటిత నిధి, ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేస్తుంది.


ఆర్టికల్ 266 (1)
   కేంద్ర ప్రభుత్వం పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రుణాలు, ఇతర రుణాలు, అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి లభించే మొత్తాలన్నింటినీ భారత సంఘటిత నిధి (Consolidated Fund of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు లభించే మొత్తాలన్నింటినీ సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి (Consolidated Fund of State) లో జమ చేయాలి.


ఆర్టికల్ 266 (2)
 కేంద్ర ప్రభుత్వం స్వీకరించే ఇతర ప్రభుత్వ ధనాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతా (Credited to the Public Account of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి.


ఆర్టికల్ 266 (3)
    కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధిలో జమ చేసిన మొత్తాలను రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మాత్రమే శాసనబద్ధంగా వినియోగించాలి.


ఆర్టికల్ 267 (1)
   పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఆగంతుక నిధి (Contingency Fund) ని ఏర్పాటు చేయవచ్చు. ఈ నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ కార్యదర్శి నిర్వహిస్తారు.
* 1950, ఆగస్టు 14న ఏర్పడిన ఆగంతుక నిధికి కేంద్ర సంఘటిత నిధి నుంచి రూ.50 కోట్లను బదిలీ చేశారు.
* ప్రస్తుతం కేంద్ర ఆగంతుక నిధిని రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.


ఆర్టికల్ 267 (2)
రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా రాష్ట్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేయవచ్చు. ఇది సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది.
* ఊహించని, ఆకస్మికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు లాంటి సందర్భాల్లో ఖర్చులు ఎదురైనప్పుడు పార్లమెంటు అనుమతి పొందడానికి ముందే ఆగంతుక నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు. తర్వాత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే నియమం రాష్ట్ర ఆగంతుక నిధికి కూడా వర్తిస్తుంది.


ఆర్టికల్ 268:
    కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు వసూలు చేసి వినియోగించుకుంటాయి.
ఉదా: స్టాంపు డ్యూటీలు, అలంకరణ వస్తవులు, మందులు, పాలసీ మార్పిడులు, చెక్కులు.


ఆర్టికల్ 268 (A)
* సేవలపై పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ వసూలు చేసి వినియోగించేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.
* 10వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 29% వాటా ఇవ్వాలి. ఈ పద్ధతినే ప్రత్యామ్నాయ నిధుల బదిలీ అంటారు. ఇది 1996, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్ర పన్నులైన కార్పొరేషన్ టాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
* 88వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఆర్టికల్ 268 (A) సర్వీస్ టాక్స్‌ను చేర్చారు.


ఆర్టికల్ 269
కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. వీటిని కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది.
* వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నును; వస్తువుల కన్‌సైన్‌మెంట్‌పై పన్నును కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేస్తుంది. అయితే వీటిని 1996, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలి.
ఉదా: టెర్మినల్ ట్యాక్స్, విమానయానం, నౌకాయానం, రైల్వేలు.


ఆర్టికల్ 270
    కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నుల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్ 270 (1)
    కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఆ విధంగా వచ్చిన మొత్తం రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది.
ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్ను.


ఆర్టికల్ 270 (2)
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్టికల్ 270 (1)లో పేర్కొన్న పన్నులు లేదా డ్యూటీల ద్వారా లభించే నికర మొత్తంలో కొంత శాతం కేంద్ర సంఘటిత నిధిలో కలపరు. ఏ రాష్ట్రాల నుంచి ఆ పన్ను వసూలైందో ఆ మొత్తం సంబంధిత రాష్ట్రాలకే లభిస్తుంది.


ఆర్టికల్ 270 (3)
ఆర్థిక సంఘం ఏర్పాటయ్యే వరకు రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధానంలో ఆర్థిక వనరుల పంపిణీ జరుగుతుంది.
* ఆర్థిక సంఘం ఏర్పాటైన తర్వాత దాని సూచనల మేరకు పంపిణీకి సంబంధించి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు.


ఆర్టికల్ 271
ఆదాయపు పన్నుపై విధించే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వినియోగించుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండదు.


ఆర్టికల్ 272
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయాల్సిన పన్నులు. దీన్ని 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000 ద్వారా తొలగించారు.


ఆర్టికల్ 273
అసోం, బిహార్, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలకు సంబంధించి జనుము, జనుము ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చే ఎగుమతి సుంకాల్లో ఆ రాష్ట్రాలకు వాటా కేటాయించే బదులు ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత విధానం ప్రకారం సహాయక గ్రాంటుగా సంఘటిత నిధి నుంచి క్రేంద్ర ప్రభుత్వం చెల్లించాలి.


ఆర్టికల్ 274
రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరం.


ఆర్టికల్ 274 (1)
కింద పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
1. ఏదైనా ఒక పన్నును విధించడానికి లేదా సవరించడానికి సంబంధించిన బిల్లు (లేదా)
2. ఆదాయ పన్ను సంబంధిత చట్టాలకు చెందిన వ్యవసాయ ఆదాయం అనే పదానికి అర్థాన్ని సదరు బిల్లు సవరించే అవకాశం ఉన్నప్పుడు


ఆర్టికల్ 275
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.


ఆర్టికల్ 275 (1)
ఏవైనా కొన్ని రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం అందించడం అవసరమని పార్లమెంటు భావించినట్లయితే, తనకు అవసరమని తోచిన మొత్తాన్ని సహాయక గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందజేయవచ్చు. ఈ సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయక గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
* ఏదైనా ఒక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిపాలనతో సమానంగా ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన మొత్తాన్ని కూడా సహాయక గ్రాంట్ల రూపంలో పార్లమెంటు అందజేయవచ్చు. ఉదా: అసోం.


ఆర్టికల్ 275 (2)
     సహాయక గ్రాంట్లకు సంబంధించి పార్లమెంటు శాసనం చేసే వరకు ఆయా అధికారాలను రాష్ట్రపతి కలిగి ఉంటారు. అయితే ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత దాని సలహా లేనిదే రాష్ట్రపతి సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయకూడదు.


ఆర్టికల్ 276
     వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500కు మించకుండా పన్ను విధించి వసూలు చేయవచ్చు.


ఆర్టికల్ 277: ఆర్థిక వనరులకు సంబంధించిన మినహాయింపులు.


ఆర్టికల్ 278: వివిధ రాష్ట్రాల ఆర్థిక ఒప్పందాలు.


ఆర్టికల్ 279: నికర ఆదాయం గురించి వివరణ, నిర్వచనం.


ఆర్టికల్ 279 (1)
     పన్నుల ద్వారా వసూలైన నికరాదాయం అంటే పన్ను వసూలుకు అయిన ఖర్చులు పోను మిగిలింది అని అర్థం. ఏ ప్రాంతం నుంచి ఎంత పన్ను వసూలైంది, అందులో నికరాదాయం ఎంత అనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి ధ్రువీకరించాలి. దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రమే అంతిమమైంది.


ఆర్టికల్ 279 (2)
     రాష్ట్రపతి లేదా పార్లమెంటు పన్ను ద్వారా వసూలైన మొత్తాన్ని రాష్ట్రాలకు గ్రాంట్లుగా మంజూరు చెయ్యాలి.


ఆర్టికల్ 280
* కేంద్ర ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలు, ఆర్థిక వనరులు సమానంగా లేవన్నది స్పష్టం. రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చిందని, రాష్ట్రాలు కేవలం వాటి పరిధిలోని సొంత వనరులకే పరిమితమయ్యాయనే విమర్శ ఉంది. అందువల్ల సమాఖ్య ఆర్థిక విధానంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధమైన సమన్వయాన్ని సాధించడానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.


ఆర్టికల్ 280 (1)
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోపు, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* ఆర్థిక సంఘానికి ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


ఆర్టికల్ 280 (2)
ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలను, వారి ఎంపిక విధానాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయిస్తుంది.


ఆర్టికల్ 280 (3)
ఆర్థిక సంఘం విధులు కింది విధంగా ఉంటాయి.
* భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో సహాయం చేయడానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను సూచించడం.
* రాష్ట్రపతి ఆదేశం మేరకు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* పన్నుల ద్వారా వచ్చిన నికర రాబడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హేతుబద్దంగా పంపిణీ చేయడం. సంబంధిత రాబడులను రాష్ట్రాల మధ్య వారి వాటాలకు అనుగుణంగా కేటాయించడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.


ఆర్టికల్ 280 (4)
    ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇది తన పని విధానాన్ని రూపొందించుకోవడంతో పాటు పార్లమెంటు ద్వారా తనకు సంక్రమించిన అధికార విధులను కూడా నిర్వహించాలి.


14వ ఆర్థిక సంఘం

     ఆర్టికల్ 280 ప్రకారం 2015 - 2020 మధ్య కాలానికి సిఫారసులు చేసేందుకు 2013, జనవరి 2న డాక్టర్ వై.వేణుగోపాల రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని నియమించారు.
ప్రధాన సిఫారసులు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచారు.
* రాష్ట్రాలకు మొత్తం గ్రాంట్లు రూ.5.37 లక్షల కోట్లు.
* విపత్తుల నిర్వహణకు రూ.55,000 కోట్లు.


గ్రాంట్ల మంజూరు కోసం 14వ ఆర్థిక సంఘం చేసిన/ అనుసరించిన ప్రామాణికాలు


ఆర్టికల్ 281
    రాష్ట్రపతి ఆర్థిక సంఘం సిఫారసులను, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించే నోట్‌తో సహా పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించాలి.


ఆర్టికల్ 282
    ప్రజా ప్రయోజనం నిమిత్తం శాసనం చేసే అధికారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు లేకపోవచ్చు. అయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి అలాంటి ప్రయోజనాల నిమిత్తం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.


ఆర్టికల్ 283
    ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలుపుతుంది.


ఆర్టికల్ 283 (1)
    భారత ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్మును జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలియజేస్తుంది.


ఆర్టికల్ 283 (2)
    రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్ము జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలుపుతుంది.


ఆర్టికల్ 284
    కోర్టులు స్వీకరించే పిటిషనర్ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము భారత ప్రభుత్వ ఖాతాకు లేదా సందర్భానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.
* వివిధ వర్గాల నుంచి సేకరించిన డిపాజిట్లపై నియంత్రణను తెలుపుతుంది.


ఆర్టికల్ 285
    కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించకూడదు.


ఆర్టికల్ 286
    సరకుల క్రయవిక్రయాలపై పన్ను మినహాయింపులు.


ఆర్టికల్ 286 (1)
    రాష్ట్రం వెలుపల జరిగే వస్తువుల క్రయవిక్రయాలు లేదా భారతదేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకునే లేదా ఎగుమతి చేసే క్రమంలో జరిగే క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్ 286 (2)
    వస్తువుల క్రయవిక్రయాలను నిర్ధారించే క్రమాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.


ఆర్టికల్ 287
    కేంద్ర ప్రభుత్వం వినియోగించిన విద్యుత్ లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు. కేంద్ర ప్రభుత్వ రైల్వేల నిర్మాణం, నిర్వహణలపై ఉపయోగించే విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు చట్టరీత్యా పన్ను విధించకూడదు.


ఆర్టికల్ 288
    కొన్ని సందర్భాల్లో నీరు, విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించడం నుంచి మినహాయింపులు.


ఆర్టికల్ 288 (1)
    కొన్ని సందర్భాల్లో అంతర్ రాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధికి పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించకూడదు.


ఆర్టికల్ 288(2)
    రాష్ట్ర శాసనసభ పన్ను విధించడానికి అధికారం కల్పించే శాసనం చేయవచ్చు. ఇలాంటి శాసనం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది.


ఆర్టికల్ 289
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై, ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం నుంచి మినహాయింపు.


ఆర్టికల్ 289 (1)
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.


ఆర్టికల్ 289(2)
    రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని తరఫున నిర్వహించే ఆర్థిక, వాణిజ్య లావాదేవీలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.


ఆర్టికల్ 290
    కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్లను తెలియజేస్తుంది.


ఆర్టికల్ 290(A)
    కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం ట్రావెన్‌కోర్ దేవస్థాన నిధికి కేరళ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఏటా రూ.46,50,000 చెల్లించాలి.
* హిందూ దేవస్థానాలు, గుడుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఆ రాష్ట్ర దేవస్థాన నిధికి ఏటా రూ.13,50,000 చెల్లించాలి.
* ఈ నిబంధనను 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ద్వారా చేర్చారు.


ఆర్టికల్ 291
    మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజభరణాల గురించి తెలియజేస్తుంది.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం (1971) ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడం వల్ల ఆర్టికల్ 291ని రాజ్యాంగం నుంచి తొలగించారు.


ఆర్టికల్ 292
    పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలను పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటుంది.


ఆర్టికల్ 293
    రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణ.


ఆర్టికల్ 293 (1)
    రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి దేశం లోపల ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటాయి.


ఆర్టికల్ 293 (2)
    పార్లమెంటు నిర్ణయించిన షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వగలదు.


ఆర్టికల్ 293 (3)
    ఇచ్చిన రుణాలు తీరక ముందే కేంద్ర అనుమతి లేకుండా ఒక రాష్ట్రం కొత్తగా అప్పులు చేయకూడదు.


ఆర్టికల్ 293 (4)
    కేంద్రం కొన్ని షరతులతో అంతకు ముందు ఇచ్చిన రుణాలను పూర్తిగా తీర్చకముందే కొత్త రుణాలను పొందడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వవచ్చు.


ఆర్టికల్ 294
    కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యత.


ఆర్టికల్ 295
    ఇతర వివాదాలకు సంబంధించి వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతలు.


ఆర్టికల్ 296
    స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు.


ఆర్టికల్ 297
 * సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి అధికారం.
 *  ఆర్టికల్ 298 వాణిజ్య కార్యకలాపాలు, అధికారాలు.
*  ఆర్టికల్ 299 ఆస్తి ఒప్పందాలు.
* ఆర్టికల్ 300 వాజ్యాలు, ఇతర అంశాలు


ఆర్టికల్ 300 (A)
    చట్ట ప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు.


ఇతర అంశాలు


గాడ్గిల్ ఫార్ములా:
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి ఉద్దేశించిన ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అని పేర్కొంటారు. 4వ ఆర్థిక సంఘం సూచనలు మొదలు 8వ ఆర్థిక సంఘం సూచనల వరకు ఈ ఫార్ములానే అనుసరించారు.


ముఖర్జీ ఫార్ములా
     8వ ఆర్థిక సంఘం సూచనల నుంచి నేటి వరకు దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి దీన్నే వినియోగిస్తున్నారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి జనాభా, విస్తీర్ణం, తలసరి ఆదాయం, అభివృద్ధి, పన్నుల వసూలు సామర్థ్యం లాంటి అంశాలను ఆధారం చేసుకుంటున్నారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు

1. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాల గురించి ఎక్కడ పేర్కొన్నారు?

1) 10వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
2) 11వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 246 నుంచి 256 వరకు


2. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు
3) 13వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 300 వరకు
4) 14వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 262 వరకు


3. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 244 నుంచి 261 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 263 నుంచి 290 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 300 నుంచి 322 వరకు

 

4. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు అనే మూడు రకాల అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 5          2) 6               3) 7              4) 8


5. భారత ప్రభుత్వం అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డ్‌ చట్టాలను ఎప్పుడు రూపొందించింది?

1) 1956        2) 1958         3) 1959         4) 1963


6. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో ఎవరి అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది?

1) ఫజుల్‌ అలీ       2) కేదారనాథ్‌      3)  మొరార్జీ దేశాయ్‌       4) జయప్రకాష్‌ నారాయణ్‌


7. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎవరి అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది?

1) ఎం.సి. సెతల్‌వాడ్‌        2) నరహరిరావు      3)  అశోక్‌బింద్రా        4) సందీప్‌ వాఘేలా


8. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ‘అంతర్‌ రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 261        2) ఆర్టికల్‌ 262         3)  ఆర్టికల్‌ 263          4) ఆర్టికల్‌ 264


9. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 1969లో తమిళనాడులోని కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?

1) పి.వి. రాజమన్నార్‌       2) పి.కె.తుంగన్‌        3)  వి.కె.అన్నామలై         4) దత్తుమిశ్రా


10. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) నానీపాల్కీవాలా కమిటీ            2)రంగరాజన్‌ కమిటీ 
3)  పి.వి. రాజమన్నార్‌ కమిటీ     4) చంద్రశేఖర్‌ కమిటీ


11. పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో రూపొందించిన ‘ఆనందపూర్‌ సాహెబ్‌’ తీర్మానంలో కేంద్రం యొక్క అధికార పరిధి దేనికి పరిమితం కావాలని సిఫారసు చేసింది?

1) రక్షణ, కరెన్సీ        2) అంతర్జాతీయ సంబంధాలు 
3)  కమ్యూనికేషన్ల వ్యవస్థ         4) అన్నీ


12. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది? 

1) రంజిత్‌ సింగ్‌ సర్కారియా  2) రంగనాథ్‌ మిశ్రా 
3)  గోపాల ద్వివేది              4) నానీపాల్కీవాలా


13. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసు? 

1) ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు. 
2) క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్‌గా నియమించకూడదు.
3)  గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
4) పైవన్నీ


14. రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిషన్‌ 247 సిఫారసులతో 1987లో తన నివేదికను ఎవరికి సమర్పించింది?

1) ఇందిరా గాంధీ   2) రాజీవ్‌ గాంధీ     3)  వి.పి.సింగ్‌  4) చంద్రశేఖర్‌


15. కిందివారిలో సర్కారియా కమిషన్‌లోని సభ్యులు? 

1) బి. శివరామన్‌                       2) ఎస్‌.ఆర్‌. సేన్‌     
3)  బి. శివరామన్, ఎస్‌.ఆర్‌. సేన్‌  4) ఎల్‌.ఎన్‌.సిన్హా


16. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 2007లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది?

1) మదన్‌మోహన్‌ పూంచీ  2) రఘురాం రాజన్‌   3)  వినీత్‌ బ్రిజ్‌లాల్‌   ) రాజేంద్రసచార్‌


17. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం చొరవతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై రాజకీయ తీర్మానాన్ని ఎక్కడ చేశారు? 

1) హైదరాబాద్‌   2) విశాఖపట్నం    3)  విజయవాడ   4) కర్నూలు


18. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న జరిగిన సమావేశానికి ఎన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు హాజరయ్యాయి? 

1) 9            2) 14           3)  16              4) 18


19. విజయవాడలో 1983 మే 28న జరిగిన సమావేశంలో పాల్గొన్నవారు?

1) అటల్‌ బిహారి వాజ్‌పేయీ       2) చంద్రశేఖర్‌ 
3)  ఫరూక్‌ అబ్దుల్లా                4) పైవారందరూ


20. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చర్చించడానికి 1983లో ప్రతిపక్షాల రెండో సమావేశం ఫరూక్‌ అబ్దుల్లా అధ్యక్షతన ఎక్కడ జరిగింది?

1) శ్రీనగర్‌        2) సిమ్లా          3)  గాంధీనగర్          ‌     4) అలహాబాద్‌


21. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్న సమావేశం 1984 జనవరి 13న ఎక్కడ జరిగింది?

1) మద్రాసు         2) మైసూరు              3)  కలకత్తా          4) హైదరాబాద్‌


22. రాష్ట్ర జాబితాలోని ఏ అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘ఉమ్మడి జాబితా’లోకి మార్చింది?

1) విద్య            2) తూనికలు, కొలతలు         3)  కుటుంబ నియంత్రణ      4) అన్నీ


23. 1967లో జరిగిన ఎన్నో లోక్‌సభ సాధారణ ఎన్నికల అనంతరం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి?

1) 3వ       2) 4వ           3)  5వ           4) 6వ


24.  సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల సక్రమ పంపిణీకి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన ఏ కమిటీ 1971లో తన నివేదికను  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?

1) డి.ఆర్‌.గాడ్గిల్‌        2) దంతెవాలా        3)  రిజువరై        4) భిమల్‌జలాన్‌


25. గవర్నర్‌లకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని, వారిని 5 ఏళ్లపాటు పదవిలో కొనసాగించాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం     
2) రాజమన్నార్‌ కమిటీ 
3)  మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌     
4) లక్డావాలా కమిషన్‌


26. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని సిఫారసు చేసిన కమిషన్‌? 

1) సర్కారియా కమిషన్‌         2) మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌ 
3)  రంగరాజన్‌ కమిషన్‌          4) రాగ్యానాయక్‌ కమిషన్‌


27. రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని 2005లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?

1) జయప్రకాష్‌ నారాయణ్‌   2) వీరప్ప మొయిలీ  3)  చంద్రలాల్‌ మిశ్రా  4) ఉషా మెహ్రా


సమాధానాలు
1-2; 2-1; 3-3; 4-3; 5-1; 6-3; 7-1; 8-3; 9-1; 10-3; 11-4; 12-1; 13-4; 14-2; 15-3; 16-1; 17-3; 18-2; 19-4; 20-1; 21-3; 22-4; 23-2; 24-1; 25-3; 26-1;  27-2. 

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర మంత్రిమండ‌లి

 రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి. అయితే మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థ. రాజ్యాంగం ప్రకారం విధినిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహకశాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహం.


కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ : 

  భారతదేశంలో 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి 'మంత్రిమండలి' ఏర్పాటయినప్పుడు దాన్ని మంత్రిపరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు. నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం మంత్రిమండలిని మూడు వర్గాలుగా విభజించి, ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి, హోదా కల్పించి, తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులను పూర్తిగా కాకున్నా, చాలావరకు పాటించి మూడు అంచెలలో కేంద్ర మంత్రిమండలిని ఏర్పరచారు. అవి:
1. క్యాబినెట్ మంత్రులు
2. స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు

3. డిప్యూటీ లేదా సహాయ మంత్రులు.


క్యాబినెట్ మంత్రులు :


*    కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదాగల మంత్రులు వ్యవహరిస్తారు.
*    క్యాబినెట్ మంత్రులు తమ మంత్రిత్వశాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
*    కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది.
*    అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు.
*    క్యాబినెట్‌మంత్రులు అధికారపార్టీలో అత్యంత ప్రాబల్యం, విశేష పరిపాలనానుభవం పొందినవారై ఉంటారు.


రాజ్య మంత్రులు లేదా స్టేట్ మంత్రులు:

క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వశాఖల్లో ఒక శాఖను స్టేట్‌మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వీరు తమ మంత్రిత్వశాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు. కొన్ని మంత్రిత్వశాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు రాజ్య మంత్రులు ఉండవచ్చు.


డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు:

*    మంత్రిత్వశాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయమంత్రులు. బ్రిటన్‌లో వీరిని జూనియర్ మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులని పిలుస్తారు.
*    డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు.
*    పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారు.
*    ఈ విధంగా కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఉంటారు. మొత్తం కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి అధినేత.


మంత్రిమండలి నియామకం :

75(1) ప్రకరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు.
మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం.
*    ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి వారిని నియమిస్తారు.
*    సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు.

*    సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీలవారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరు కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడచుకోవాలి.


మంత్రుల సంఖ్య :

*    మంత్రిమండలిలో ఎందరిని నియమించాలి? కనిష్ఠ, గరిష్ఠ సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాజ్యాంగంలో వివరణలేదు.
*    మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 16కు మించరాదని, మొత్తం మంత్రుల సంఖ్య 45కు మించరాదని సిఫారసు చేసింది. కానీ ఈ నియమం ఆచరణలో లేదు.
*    2003లో రాజకీయపార్టీల్లో చీలికల నిరోధానికిగాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు. దీనికోసం 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువసభ అంటే లోక్‌సభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు.


మంత్రుల అర్హతలు: కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులయ్యేవారికి కొన్ని అర్హతలుండాలి.
1. పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి.
2. ఒకవేళ సభ్యత్వం లేనిపక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరునెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది.


పదవీ ప్రమాణం: రాష్ట్రపతి మంత్రులతో పదవీప్రమాణం చేయిస్తారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో పదవీ ప్రమాణ స్వీకార నమూనా పత్రం ఉంటుంది.


మంత్రి మండలి కాలపరిమితి: కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు. 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి ప్రకారం మంత్రిమండలి అయిదేళ్లు ఉండవచ్చు.


మంత్రుల తొలగింపు: మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవినుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి తనకు ఇష్టంలేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతిచే తొలగించబడతారు. దీనినే 'మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం' అంటారు.

మంత్రిమండలి సమష్టి బాధ్యత:
రాజ్యాంగ నిబంధన 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సమష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సమష్టి బాధ్యత అంటే, కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడం. మంత్రిమండలి తమవల్ల జరిగే తప్పొప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది.
సమష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదలుకుంటారు.
సమష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు, అమలులో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు.
కార్య నిర్వాహకశాఖ సమష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకు పార్లమెంటు, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది.
సమష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్‌సభకు సంబంధించిన అంశం. శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, సదవగాహనతో వ్యవహరించేందుకు సమష్టి బాధ్యత దోహదపడుతుంది.
సమష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వశాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతోపాటు తన సహచర మంత్రుల మంత్రిత్వశాఖ విధానాలు, పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు.


మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సంప్రదాయాలు - సూత్రాలు:


1. రాష్ట్రపతి పేరిట పరిపాలనా నిర్వహణ:  రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి దేశాధినేత. రాష్ట్రపతి స్వయంగాగానీ, అధికారుల ద్వారాగానీ విధులు, బాధ్యతలు నెరవేరుస్తారు.74(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి బాధ్యతల నిర్వహణలో సలహాలు, సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
* రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా భిన్నంగా భావించిన పక్షంలో మంత్రిమండలి సలహాను కేవలం ఒక్క పర్యాయం మాత్రమే పునః పరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలించిన నిర్ణయం తన ఆమోదంకోసం వస్తే రెండోసారి తప్పకుండా ఆమోదముద్ర వేయాలి.


2. మంత్రులు లోక్‌సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం పొందాలి: మంత్రులుగా నియమితులయ్యేవారు పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొందడం తప్పనిసరి. ఒకవేళ సభ్యులుకానివారిని మంత్రిపదవిలో నియమిస్తే, పదవీ స్వీకారం తేదీ మొదలుకుని ఆరునెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి.


3. మంత్రులు ఉభయసభలకు బాధ్యులు: మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ వారు ఉభయసభలకు జవాబుదారీగా ఉంటారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తమకు సభ్యత్వం లేని సభల్లో ఓటు వేయరు.


4. లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రుల పదవీకాలం: మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే పదవిలో ఉంటుంది. లోక్‌సభ ప్రధానమంత్రికి వ్యతిరేకంగాగానీ లేదా మంత్రిమండలికి వ్యతిరేకంగాగానీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మంత్రిమండలి పతనం అవుతుంది.


5. మంత్రులమధ్య సామరస్య భావన - సమైక్యత: మంత్రులందరూ సాధారణంగా ఒకే రాజకీయపార్టీకి చెందినవారై ఉంటారు. మంత్రిమండలి ఒక జట్టుగా పని చేస్తుంది. పార్టీలో క్రమశిక్షణ మూలంగా వారి మధ్య ఐక్యత ఉంటుంది.


6. మంత్రిమండలిపై పార్లమెంటు నియంత్రణ: పార్లమెంటు ప్రశ్నలు, తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం, విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు మొదలైనవాటిద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండే విధంగా చేస్తుంది.


7. ప్రధానమంత్రి నాయకత్వం: మంత్రిమండలి ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తుంది. లోక్‌సభలో అధికారపార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి మంత్రిమండలిమీదా, పార్లమెంటులోనూ మంచి పట్టు ఉంటుంది.


మంత్రిమండలి - క్యాబినెట్ పాత్ర: 

* మంత్రిమండలిలో క్యాబినెట్ అతి ముఖ్యమైంది. భారత రాజ్యాంగంలో మొదట క్యాబినెట్ అనే పదం లేదు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు.
* కేంద్ర మంత్రిమండలిలోని సీనియర్ మంత్రులు క్యాబినెట్‌లో సభ్యులుగా ఉంటారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతలు, పాలనా సామర్థ్యం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగిన కొందరు వ్యక్తులను సాధారణంగా ప్రధానమంత్రి క్యాబినెట్ సభ్యులుగా ఎంపిక చేస్తారు.
* భారత రాజకీయ వ్యవస్థలో క్యాబినెట్ కింది సూత్రాల ప్రాతిపదికపై పనిచేస్తుంది.
1. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అధికార విధులను క్యాబినెట్ నిర్వర్తిస్తుంది.
2. పార్లమెంటులోని దిగువసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
3. క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
4. క్యాబినెట్ సభ్యులు కనీసం వారానికోసారి లేదా అనివార్యమైతే ముందుగానే సమావేశమవుతారు.
5. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ రహస్యంగా, విశ్వసనీయంగా ఉంచుతుంది.
6. పార్లమెంటులోని దిగువసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటుంది.


క్యాబినెట్ విధులు:
1. కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి అంతర్గత, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తర్వాత ఖరారు చేస్తుంది.
2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతి విధుల నిర్వహణలో క్యాబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.
3. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరమని భావిస్తే ఆర్డినెన్స్‌లను జారీచేయాల్సిందిగా రాష్ట్రపతికి సలహాలిస్తుంది. ఆర్డినెన్స్ అంటే పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టం లేదా శాసనం.
4. భూకంపం, వరదలు, అనావృష్టి, తుపాను మొదలైన ప్రకృతి ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధిత ప్రజలను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది.


క్యాబినెట్‌పై ప్రముఖుల వ్యాఖ్యానాలు:


రామ్‌సేమ్యూర్: రాజ్యమనే నౌకకు క్యాబినెట్ అనేది చోదక చక్రం వంటిది.

జాన్‌మారియట్: మొత్తం రాజకీయ వ్యవస్థ క్యాబినెట్ చుట్టూనే పరిభ్రమిస్తుంది.

సర్ ఐవర్ జెన్నింగ్స్: రాజ్యాంగ ప్రధాన భూమికయే క్యాబినెట్.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం:

  ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతి పెద్దది. సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని అత్యంత సుదీర్ఘమైంది అని అభివర్ణించగా హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ చిహ్నమైన ఐరావతంతో పోల్చాడు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రారంభంలో ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా విభజించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి.

* రాజ్యాంగం నుంచి 7వ భాగాన్ని తొలగించి 4(A), 9(A), 9(B), 14(A) అనే భాగాలను చేర్చారు.

* భిన్నత్వంలో ఏకత్వమున్న భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, వివిధ పరిమితులు, మినహాయింపులను సంపూర్ణంగా వివరించడం వల్ల మన రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రూపొందించారు.

* కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో శాసన, ఆర్థిక, పరిపాలనా సంబంధాలను విస్తృతంగా వివరించారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించడం, కొన్ని అంశాలను తొలగించడం, మరికొన్ని అంశాలను చేర్చడం వల్ల మన రాజ్యాంగం సువిశాలంగా రూపొందింది.

* 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.

* 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.

* 11వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.

* 12వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.

* మన దేశానికి సర్వోన్నత శాసనం రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు, విధులు రాజ్యాంగం నుంచే సంక్రమిస్తాయి.

* అధికారం ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియమిత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా బదిలీ అవుతుంది. కాబట్టి మనదేశంలో అధికారానికి మూలం ప్రజలు.


పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం


* భారత రాజ్యాంగం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రసాదించింది. ఈ విధానంలో కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నాయకత్వంలోని మంత్రిమండళ్లు వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తాయి.

* కేంద్రంలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి.

* రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండళ్లు వ్యక్తిగతంగా గవర్నర్లకు, సమష్టిగా విధానసభలకు బాధ్యత వహించాలి.


సార్వజనీన వయోజన ఓటుహక్కు


* ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, జన్మ, భాష, ప్రాంత, ఆస్తి సంబంధ వివక్ష లేకుండా వయోజన ఓటుహక్కును ప్రసాదించడమైంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే వారి కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలుగా నిర్ణయించారు.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా వయోజన ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.

* ప్రపంచంలో మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్.

* అమెరికాలో 1965 నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.

* స్విట్జర్లాండ్‌లో 1971 తర్వాత నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.

* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశ ఓటర్లు 83 కోట్ల మంది.


ఏక పౌరసత్వం

* భారతదేశ సమగ్రత, సుస్థిరతల దృష్ట్యా భారత ప్రజలకు రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల ప్రజలకు ఒకే పౌరసత్వం ఉంటుంది. వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.

* అయితే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల ఆ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.

* అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.


లౌకిక రాజ్యం

* మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు.

* భారత రాజ్యాంగ ప్రవేశికలో 'లౌకిక' అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం రాజ్యం మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. రాజ్యం ఏ ఒక్క మతానికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు.

* లౌకికతత్వ పరిధిని మరింత విస్తృతపరుస్తూ ప్రాథమిక హక్కుల్లో భాగంగా మత స్వాతంత్య్రపు హక్కును ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించారు. దీని ప్రకారం భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు.

* ప్రభుత్వ విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్ విద్యాలయాల్లోనూ మతబోధన నిషిద్ధిం.


దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం

* దృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి కష్టమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజార్టీ 2/3 లేదా 3/4 వంతుతో సవరించేది.

ఉదా: అమెరికా రాజ్యాంగం.


* అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి సులభమైంది లేదా సరళమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది.

ఉదా: బ్రిటన్ రాజ్యాంగం.


* భారత రాజ్యాంగం అమెరికా మాదిరి దృఢమైందీ కాదు, బ్రిటన్‌లా అదృఢమైందీ కాదు. దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం.


* భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం 3 పద్ధతుల్లో సవరించవచ్చు. అవి:


1. సాధారణ మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను పార్లమెంటుకు హాజరై ఓటు వేసిన వారి సాధారణ మెజార్టీతో సవరించవచ్చు.

    1. ఆర్టికల్ - 2 ప్రకారం కొత్త రాష్ట్రాల విలీనం, ఏర్పాటు

    2. ఆర్టికల్ 3 - రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ

    3. ఆర్టికల్ 169 - రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ల ఏర్పాటు, రద్దు.

    4. 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు

    5. ఆర్టికల్ 100(3) - పార్లమెంటు కోరం నిర్ణయించడం

    6. ఆర్టికల్ 105 - సభా హక్కులు

    7. ఆర్టికల్ 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు

    8. ఆర్టికల్ 118 (12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు

    9. ఆర్టికల్ 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం

    10. ఆర్టికల్ 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం

    11. ఆర్టికల్ 348 - అధికార భాషా విషయం

    12. ఆర్టికల్ 11 - పౌరసత్వాన్ని పొందే విధానాలు, రద్దు చేసే పద్ధతులు

    13. ఆర్టికల్ 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం

    14. ఆర్టికల్ 81 - నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)

    15. ఆర్టికల్ 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం

    16. 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనా విషయాలు

    17. 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పరిపాలన

    18. ఆర్టికల్ 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం.


2. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని మరికొన్ని నిబంధనలను (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు.

ఉదా: ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు


3. ద్విపక్ష మెజార్టీ పద్ధతి

* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతోపాటు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ అవసరం. అవి:

1. ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

2. ఆర్టికల్ 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ,

ఆర్టికల్ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని విస్తృతం చేయడం.

3. 5వ భాగం 4వ అధ్యాయం ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు - సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు

4. 6వ భాగం 5వ అధ్యాయం ఆర్టికల్స్ 214 నుంచి 232 వరకు - హైకోర్టుకు సంబంధించిన అంశాలు

5. 7వ షెడ్యూల్ - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన

6. 4వ షెడ్యూల్‌ - రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు

7. ఆర్టికల్ 368 - రాజ్యాంగ సవరణ అంశాలు


అర్ధ సమాఖ్య:

* రాజ్యాంగ రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగే వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.

* కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య (Quasi Federal)గా పేర్కొన్నాడు.

భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అవి:

    1. లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం

    2. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన

    3. దృఢ రాజ్యాంగం

    4. స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ

    5. న్యాయ సమీక్ష విధానం

    6. ద్విసభా విధానం

భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అవి:

    1. ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం

    2. ఏకీకృత న్యాయవ్యవస్థ

    3. అఖిల భారత సర్వీసుల భర్తీకి ఒకే యూపీఎస్సీ

    4. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒకే కేంద్ర ఎన్నికల సంఘం

    5. ఒకే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

    6. రాష్ట్రపతితో కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం

    7. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం

    8. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను కలిగి ఉండటం

ఉదా: ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం

     ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం

     ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం

     ఆర్టికల్ 365 - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం

     ఆర్టికల్ 248 - అవశిష్టాధికారాలను కేంద్రమే కలిగి ఉండటం

ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.

* ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లు గవర్నరు సంతకంతో చట్టంగా మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ బిల్లును గవర్నరు ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేస్తారు. అలాంటి సందర్భంలో ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖపై అధికారాన్ని కలిగి ఉంటారు.

* పైన పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాల సమ్మేళనం.


స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ:


మన దేశ న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి గలది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. కానీ వారిని తొలగించేది పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారానే. దీనివల్ల న్యాయవ్యవస్థ పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉందని తెలుస్తోంది.


న్యాయ సమీక్ష అధికారం:


* భారత న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాధికారాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశమే


న్యాయ సమీక్ష:

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించింది.

* న్యాయ సమీక్ష అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.

* 1803లో మార్బురీ Vs మాడిసన్ వివాదంలో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఇచ్చిన తీర్పు ప్రపంచంలో న్యాయ సమీక్ష భావనకు పునాదులు వేసింది.

అల్ట్రా వైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవనీ, రాజ్యాంగ విరుద్ధమని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని అల్ట్రా వైర్స్‌గా పేర్కొంటారు.

ఇంట్రావైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నట్లయితే అవి చెల్లుతాయనీ, అవి రాజ్యాంగబద్ధమేనని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఇంట్రావైర్స్ అంటారు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు.

* 1951 నాటి శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మొదలు 2007 నాటి అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకుంది.

* 1980లో మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368లో చేర్చిన 4, 5 క్లాజులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసింది.


ఏకీకృత న్యాయ వ్యవస్థ:


* భారతదేశం న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.

* భారతదేశం అనుసరించే న్యాయ వ్యవస్థను ఏకీకృత, సమీకృత న్యాయ వ్యవస్థగా పేర్కొంటారు.

* జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, డివిజనల్ స్థాయిలో మున్సిఫ్ కోర్టులు న్యాయ విధులను నిర్వహిస్తున్నాయి.

* ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటాయి.

* ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా అమలుపరచాల్సి ఉంటుంది.

* న్యాయమూర్తుల నియామకంలో ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాల్సి ఉంటుంది.


ద్విసభా విధానం:


* 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్రంలో లోక్‌సభ, రాజ్యసభలతో ద్విసభా విధానానికి దారితీసింది.

* రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పాటు విషయమై రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల అభిమతాలకే వదిలిపెట్టారు. ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే, పార్లమెంటు సాధారణ తీర్మానంతో రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ను ఏర్పాటు చేయగలదు లేదా ఉన్నదాన్ని రద్దు చేయగలదు.


పబ్లిక్ సర్వీస్ కమిషన్లు:

* కారన్ వాలీస్ మన దేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు.

* 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులకు సివిల్ సర్వీసుల్లో అవకాశం కల్పించారు.

* 1926 నాటి లీ కమిషన్ సిఫార్సుల మేరకు మన దేశంలో సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.

* భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో సివిల్ సర్వీసుల నిర్మాణానికి విశేష కృషి చేశారు. ప్రస్తుత ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ), ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ బ్రిటిష్ వారసత్వం నుంచే మనకు సంక్రమించింది.


స్వయం ప్రతిపత్తి ఉన్న కమిషన్లు:

* ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 280 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల పంపిణీకి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 315 - మన దేశంలో ప్రతిభావంతులను పాలనలో భాగస్వామ్యం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగులను ఎంపిక చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.

* ఆర్టికల్ 324 - దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత, ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 124 - రాజ్యాంగ సంరక్షణకు, వ్యాఖ్యానానికి, అర్థ వివరణకు సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

అధికారాల విభజన: భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు రకాలైన అధికారాల విభజన గురించి పేర్కొన్నారు.

1. కేంద్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.

2. రాష్ట్ర జాబితా: ఈ జాబితా ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.

3. ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.

పై మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఇవి కేంద్రానికి చెందుతాయి.

ప్రాథమిక హక్కులు:

రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ప్రకరణలను 7 వర్గాల ప్రాథమిక హక్కులుగా కల్పించారు. వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రాథమిక హక్కుల సంఖ్య 7 వర్గాలుగా ఉండగా ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300 (A)లో ఒక సాధారణ చట్టబద్ధ హక్కుగా మార్చింది.

ఆదేశిక సూత్రాలు:

రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల గురించి పేర్కొంటున్నాయి. సంక్షేమ రాజ్య స్థాపన, పరిపాలనా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన వీటిని మన దేశ రాజ్యాంగంలో చేర్చారు.

ప్రాథమిక విధులు:

భారత రాజ్యాంగంలోని 4(A) భాగంలో 51(A) ఆర్టికల్‌లో ప్రాథమిక విధులను ప్రస్తావించారు. మొదట్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. జస్టిస్ స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా రష్యా నుంచి 10 ప్రాథమిక విధులను గ్రహించి రాజ్యాంగానికి చేర్చింది.

* ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య: 11

* 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం - 2002 ద్వారా చేర్చారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపం:

భారతదేశానికి అత్యున్నత శాసనం రాజ్యాంగం. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా మాత్రమే సవరించాలని పేర్కొంది.

* రాజ్ నారాయణ్ Vs ఇందిరాగాంధీ, మినర్వా మిల్స్, ఎల్ఐసీ, ఎస్.ఆర్.బొమ్మై కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పునరుద్ఘాటించింది.

రాజ్యాంగ విహంగ వీక్షణం

భాగం విషయం ఆర్టికల్స్
1వ భాగం భారత భూభాగ పరిధి 1 నుంచి 4 వరకు
2వ భాగం పౌరసత్వం 5 నుంచి 11 వరకు
3వ భాగం ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు
4వ భాగం ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు
4(A) భాగం ప్రాథమిక విధులు 51(A)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా కొత్తగా చేర్చారు.

వ భాగం కేంద్ర ప్రభుత్వం 52 నుంచి 151 వరకు
మొదటి అధ్యాయం కేంద్ర కార్య నిర్వాహక శాఖ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని,
మంత్రిమండలి, అటార్నీ జనరల్
52 నుంచి 78 వరకు
రెండో అధ్యాయం కేంద్ర శాసన నిర్మాణ శాఖ (పార్లమెంటు) 79 నుంచి 122 వరకు
మూడో అధ్యాయం రాష్ట్రపతి - శాసన నిర్మాణ అధికారాలు 123
నాలుగో అధ్యాయం కేంద్ర న్యాయశాఖ (సుప్రీంకోర్టు) 124 నుంచి 147 వరకు
అయిదో అధ్యాయం కాగ్ 148 నుంచి 151 వరకు
6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 వరకు
ఒకటో అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం 152
రెండో అధ్యాయం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గవర్నర్, ముఖ్యమంత్రి,
మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్
153 నుంచి 167 వరకు
మూడో అధ్యాయం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ (విధాన సభ, విధాన పరిషత్) 168 నుంచి 212 వరకు
నాలుగో అధ్యాయం గవర్నర్ శాసన నిర్మాణ అధికారాలు 213
అయిదో అధ్యాయం రాష్ట్ర న్యాయశాఖ (హైకోర్టు) 214 నుంచి 232 వరకు
ఆరో అధ్యాయం దిగువ కోర్టులు 233 నుంచి 237 వరకు
7వ భాగం B - రాష్ట్రాలు 238

» 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం - 1956 ద్వారా తొలగించారు.

8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు 239 నుంచి 242 వరకు
9వ భాగం పంచాయతీరాజ్ 243, 243 (A) నుంచి 243(O) వరకు

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

9(A) భాగం పట్టణ ప్రభుత్వాలు 243(P), 243(Z, G) వరకు

» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

10వ భాగం షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు 244 నుంచి 244(A) వరకు
11వ భాగం కేంద్ర, రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263 వరకు
ఒకటో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (శాసన సంబంధాలు) 245 నుంచి 255 వరకు
రెండో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (పరిపాలక సంబంధాలు) 256 నుంచి 263 వరకు
12వ భాగం కేంద్ర, రాష్ట్రాల మధ్య (ఆర్థిక సంబంధాలు) 264 నుంచి 300 (A)
ఒకటో అధ్యాయం ఆర్థికం 264 నుంచి 291 వరకు
రెండో అధ్యాయం అప్పులు 292 నుంచి 293 వరకు
మూడో అధ్యాయం ఆస్తి, ఒప్పందాలు, దావాలు, వివాదాలు 294 నుంచి 300 వరకు
నాలుగో అధ్యాయం ఆస్తి హక్కు 300(A)

» 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978 ప్రకారం ఈ 4వ అధ్యాయాన్ని 12వ భాగంలో చేర్చారు.

13వ భాగం వ్యాపారం, వాణిజ్యం 301 నుంచి 307 వరకు
14వ భాగం కేంద్ర, రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు
ఒకటో అధ్యాయం అఖిల భారత సర్వీసులు 308 నుంచి 314 వరకు
రెండో అధ్యాయం యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 315 నుంచి 323 వరకు
14(A) భాగం ట్రైబ్యునళ్లు 323(A), 323 (B)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా నూతనంగా చేర్చారు.

15వ భాగం ఎన్నికల సంఘం, ఎన్నికలు 324 నుంచి 329 వరకు
16వ భాగం ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు ప్రత్యేక సదుపాయాలు 330 నుంచి 342 వరకు
17వ భాగం అధికార భాష 343 నుంచి 351 వరకు
18వ భాగం అత్యవసర పరిస్థితులు 352 నుంచి 360 వరకు
19వ భాగం ఇతర అంశాలు 361 నుంచి 367 వరకు
20వ భాగం రాజ్యాంగ సవరణ విధానం 368
21వ భాగం తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు (జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలు)
369 నుంచి 392 వరకు
22వ భాగం హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా, రాజ్యాంగం అమల్లోకి రావడం 393 నుంచి 395 వరకు.
Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - స్వభావం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కింది వాక్యాల్లో సత్యమైన వాటిని గుర్తించండి.
(A) భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
(B) రాజ్యాంగంలోని 3వ, 4వ భాగాల మధ్య అనుసంధానం ఉండాలని మినర్వామిల్స్ కేసులో పేర్కొన్నారు.
(C) రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు న్యాయ సమీక్ష ఉంది.
(D) ప్రస్తుతం 7 ప్రాథమిక హక్కులు పౌరులకు అమల్లో ఉన్నాయి.
జ: A, B

 

2. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
 1) భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు
 2) భారత ప్రభుత్వ చట్టం 1909 - బాధ్యతాయుత ప్రభుత్వం
 3) భారత ప్రభుత్వ చట్టం 1919 - ప్రాదేశిక స్వాతంత్య్రం
 4) భారత ప్రభుత్వ చట్టం 1935 - రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం
జ: 1 (భారత ప్రభుత్వ చట్టం 1892 - ఎన్నికల నియమాలు)

 

3. కిందివాటిలో ఏ పదాల వరుస క్రమాన్ని భారత రాజ్యాంగ పీఠిక లో పొందుపరిచారు?
1) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, స్వతంత్ర, సర్వసత్తాక, సౌభ్రాతృత్వ రాజ్యం
2) భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
3) భారతదేశం ఒక ప్రజాస్వామ్య, సర్వసత్తాక రాజ్యం
4) భారతదేశం ఒక స్వతంత్ర, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
జ: 2 (భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం)

 

4. మనదేశంలో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి రాజ్యాంగబద్ద హక్కుగా మార్చారు ఎందుకంటే...
జ: ఆస్తిహక్కు న్యాయ వ్యవస్థ, పార్లమెంటుకు మధ్య వివాదాస్పదంగా మారడం వల్ల

 

5. ఫిబ్రవరి 21, 1948న రాజ్యాంగ సదస్సుకు సమర్పించిన భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, షెడ్యూల్స్ వరుసగా...
జ: 295, 8

 

6. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలనను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన బ్రిటిష్ మొదటి చట్టం ఏది?
జ: రెగ్యులేటింగ్ చట్టం - 1773

 

7. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ విధంగా రాశారు?
జ: భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ అసెంబ్లీలో ఆమోదించి మా రాజ్యాంగాన్ని మాకు మేమే ఇస్తున్నాం.

8. భారతదేశంలో ప్రాథమిక హక్కులకు రక్షకుడు ఎవరు?
జ: సుప్రీంకోర్టు

 

9. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ: వార్న్‌హేస్టింగ్స్

 

10. కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మాగ్నాకార్టాగా పేర్కొంటారు?
1) క్రిప్స్ ప్రతిపాదన    2) విక్టోరియా రాణి ప్రకటన  
3) క్యాబినెట్‌మిషన్ ప్రతిపాదన   4) వేవెల్ ప్రతిపాదన
జ: 2 (విక్టోరియా రాణి ప్రకటన)

 

11. 1883 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కిందివాటిలో లేనిది-
1) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను రద్దుచేసింది.
2) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది.
3) కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చింది.
4) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు.
జ: 4 (గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు)

 

12. భారత రాజ్యాంగ తయారీకి రాజ్యాంగసభ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1946, డిసెంబరు 6

 

13. కుల, మత ప్రాతిపదికగా ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన మొదటి చట్టం ఏది?
జ: ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1909

14. క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశాన్ని దేనికోసం సందర్శించింది?
జ: రాజ్యాంగ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికి

 

15. ఏ చట్టం ద్వారా భారతదేశ పాలనా వ్యవహారాలు ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతికి వెళ్లాయి?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1858

 

16. 1949, నవంబరు 26వ తేదీన అమల్లోకి వచ్చిన రాజ్యాంగ నిబంధనలు ఏవి?
I) పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు
II) ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు
III) తాత్కాలిక పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు
IV) ప్రాథమిక హక్కులు
జ: I, II, III

 

17. కిందివాటిలో దేనికి ప్రభుత్వ శాఖలను వ్యవస్థీకరించే అధికారం ఉంది?
1) పార్లమెంటు       2) లోక్‌సభ        3) కార్యనిర్వాహక వర్గం       4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
జ: 3 (కార్యనిర్వాహక వర్గం)

 

18. కిందివాటిలో ఏ దేశ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పవచ్చు?
1) అమెరికా       2) భారతదేశం       3) కెనడా       4) బ్రిటన్
జ: 1 (అమెరికా)

 

19. భారత రాజ్యాంగం ఏ తరహాకు చెందిన రాజ్యాన్ని ప్రకటిస్తుంది?
జ: ఏకీకృత, సమాఖ్య లక్షణాలున్న రాజ్యాంగం

 

20. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ-
జ: 1949, నవంబరు 26

 

21. భారత రాజ్యాంగం ముసాయిదా రచన మీద ప్రభావం చూపింది-
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

 

22. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

A) మొదటి షెడ్యూల్  I) ప్రమాణ స్వీకార విధానం
B) మూడో షెడ్యూల్       II) అధికార విభజన
C) ఏడో షెడ్యూల్   III) భారత దేశంలోని రాష్ట్రాల-కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక పరిధి
D) ఎనిమిదో షెడ్యూల్     IV) భాషలు

జ: A - III,  B - I,   C - II,  D - IV
 

23. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడంలో ఎవరికి అధికారం ఉంది?
జ: సుప్రీంకోర్టు

 

24. కెనడా రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాలేవి?
1) సమాఖ్య పద్ధతి  2) భారత యూనియన్  3) కేంద్రానికి అవశిష్ట అధికారాలు  4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

25. భారత రాజ్యాంగం మనదేశాన్ని ఏవిధంగా వర్ణించింది?
జ: రాష్ట్రాల కలయిక

 

26. వివిధ రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగానికి గ్రహించిన అంశాల్లో సరైన జతను గుర్తించండి.
 

I) రాజ్యాంగ సవరణ పద్ధతి   A) ఐర్లాండు
II) ఉమ్మడి జాబితా   B) జపాన్
III) చట్టం నిర్ధారించిన పద్ధతి       C) ఆస్ట్రేలియా
IV) రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం   D) దక్షిణాఫ్రికా

జ: I-D, II-C, III-B, IV-A
 

27. భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, భావాలను ప్రతిబింబించేది ఏది?
జ: రాజ్యాంగ ప్రవేశిక

 

28. కింది లక్షణాల్లో మన రాజ్యాంగం ఏ అంశాల్లో అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంది?
1) ప్రాథమిక హక్కులు  2) అధ్యక్ష పాలన  3) ఏకీకృత పాలన   4) ద్వంద్వ పౌరసత్వం
జ: 1 (ప్రాథమిక హక్కులు)

 

29. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
జ: కేశవానంద భారతి కేసు

 

30. కిందివాటిలో ఏకకేంద్ర లక్షణం కాని అంశాన్ని గుర్తించండి.
1) దేశం మొత్తానికీ ఒకే రాజ్యాంగం ఉండటం      
2) రాష్ట్రానికి, దేశానికి ఒకే పౌరసత్వం ఉండటం
3) గవర్నర్ నియామకం                             
4) అన్నీ సరైనవే
జ: 4 (అన్నీ సరైనవే)

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్ర గవర్నర్

 మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రాల్లో కూడా అదే విధానాన్ని అమలుచేశారు. కేంద్రంలో రాజ్యాధికారి అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా, ప్రభుత్వాధికారం ఉన్న ప్రధాని, మంత్రిమండలి వాస్తవ అధికారాలు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రాల్లో రాజ్యాధికారి అయిన గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వాస్తవ అధికారాలు ముఖ్యమంత్రి, మంత్రిమండలికి ఉంటాయి.
* రాజ్యాంగంలో 6వ భాగంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసనసభ నిర్మాణం, అధికారాలు మొదలైన వాటిని వివరించారు (జమ్మూకశ్మీర్ మినహాయించి).
* ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిబంధన 153 సూచిస్తుంది. కానీ 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు.
* ప్రపంచంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోన్న ఎక్కువ దేశాల్లో రాష్ట్ర గవర్నర్లను ప్రజలు ఎన్నుకుంటారు.
ఉదా: యూఎస్ఏ. మన దేశంలో గవర్నర్లను నిబంధన 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కెనడాలో కూడా నామినేషన్ పద్ధతినే అనుసరిస్తున్నారు.
* మన దేశంలో రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ ఉండాలనీ, గవర్నర్‌ను కూడా ప్రజలే ఎన్నుకుంటే రెండు అధికార కేంద్రాలు (ముఖ్యమంత్రి, గవర్నర్) ఏర్పడతాయనే కొన్ని కారణాల వల్ల గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే పద్ధతిని అనుసరిస్తున్నారు.
* నిబంధన 156 ప్రకారం గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసమున్నంత వరకూ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి గవర్నర్‌ను తొలగించినప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని 1983లో సూర్యనారాయణ Vs భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* గవర్నర్ వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ నెల వేతనం రూ.3,50,000. ఇతర సౌకర్యాలుంటాయి. గవర్నర్‌కు అధికార నివాసముంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉంది. చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌లో వేసవి విడిది గృహం కూడా ఉంది.
* ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉంటే ఏ రాష్ట్రం ఎంత వేతనం చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గవర్నర్ వేతనాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* గవర్నర్‌గా నియమించడానికి నిబంధన 157 ప్రకారం భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సభ్యుడై ఉండకూడదు. ఉంటే నియమించిన తర్వాత రాజీనామా చేయాలి.
* సంప్రదాయం ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించకూడదు. ఒక రాష్ట్ర గవర్నర్‌ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం, రాష్ట్రేతరుడిని గవర్నర్‌గా నియమించడం మంచి సంప్రదాయం.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా పాటించాలి. నియమించే అధికారిని (రాష్ట్రపతి) సంతృప్తి పర్చాలి. దాంతో కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ విధి నిర్వహణ క్లిష్టతరమవుతుంది.
* గవర్నర్ పదవి గౌరవప్రదమైంది. గవర్నర్‌ను రాజ్యపాల్ అని కూడా అంటారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి. గవర్నర్ తన అధికారాలను వినియోగించుకున్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాను పాటించాలి. కాబట్టి గవర్నర్ నామమాత్రపు అధికారి మాత్రమే.
* 'గవర్నర్ పదవి బంగారు పంజరంలో చిలుక లాంటిది' అని సరోజిని నాయుడు వ్యాఖ్యానించారు.


అధికారాలు విధులు


కార్య నిర్వాహణాధికారాలు:
     గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన నిర్వహణకు కేంద్రంలో రాష్ట్రపతిలా కొంతమంది ఉన్నతాధికారులను నియమిస్తారు.
* నిబంధన 164 ప్రకారం రాష్ట్ర విధాన సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి అతడి సలహాతో మంత్రిమండలిని నియమిస్తారు.
* చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖా మంత్రులను నియమించే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంటుంది.
* నిబంధన 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను, నిబంధన 233 ప్రకారం జిల్లా కోర్ట్ న్యామూర్తులను, నిబంధన 233 (I), 243 (Y) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నిబంధన 243 (K), 243 (2A), ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు.
* రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. పై నియామకాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే చేయాలి.


శాసన నిర్మాణాధికారాలు

  రాష్ట్రపతి కేంద్ర పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా, అంతర్భాగం. అలాగే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకపోయినా శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.
* రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదంతో శాసనాలు అవుతాయి (నిబంధన 200).
* గవర్నర్ తిరస్కరిస్తే ఆ బిల్లులు రద్దవుతాయి. దీన్నే 'నిరపేక్ష వీటో' అంటారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపవచ్చు. Suspensive veto అంటారు. బిల్లు తిరిగి యథాతథంగా వస్తే తప్పనిసరిగా ఆమోదించాలి. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా బిల్లును తన వద్దే ఉంచుకునే 'Pocket Veto' అధికారం గవర్నర్‌కు లేదు.
* నిబంధన 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పునః పరిశీలనకు రాష్ట్ర శాసనసభకు పంపవచ్చు. బిల్లు యథాతథంగా తిరిగి వస్తే తప్పనిసరిగా ఆమోదించాలని లేదు. కానీ 'Pocket Veto' వినియోగించి రాష్ట్రపతి తన వద్ద ఉంచుకోవచ్చు. నిబంధన 143 ప్రకారం ఆ బిల్లుపై సుప్రీంకోర్టు  సలహా కోరవచ్చు.
* రాష్ట్ర గవర్నర్ నిబంధన 331 ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను, నిబంధన 171 ప్రకారం విధానసభకు (ఉంటే) 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. నిబంధన 332 ప్రకారం గవర్నర్ విధానసభలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయిస్తారు.
* నిబంధన 174 ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడం, వాయిదా వేయడం చేయవచ్చు.
* నిబంధన 175 ప్రకారం శాసనసభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు.
* నిబంధన 176 ప్రకారం గవర్నర్ శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు.
* నిబంధన 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు 'ఆర్డినెన్స్‌లు' జారీ చేయవచ్చు.
* విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒకేసారి ఖాళీ ఏర్పడితే సభా కార్యక్రమాల నిర్వహణకు నిబంధన 180 ప్రకారం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు.
* పార్లమెంట్ ఉభయ సభలకు ఏదైనా బిల్లు విషయంలో భేదం ఏర్పడితే, అలాంటి పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రపతి నిబంధన 108 ప్రకారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్ర గవర్నర్‌కు ఆ అధికారం లేదు.


ఆర్థిక అధికారాలు

  రాజ్యాంగ నిబంధన 202 ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్‌ది.
* నిబంధన 199 ప్రకారం ఆర్థిక బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ పూర్వానుమతి ఉండాలి.
* నిబంధన 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే ఏ విధమైన కేటాయింపులూ చేయకూడదు.
* బడ్జెట్ సమావేశాల ఆరంభంలో గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.


న్యాయాధికారాలు

  నిబంధన 161 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వర్తించే విషయాల్లో న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దుచేయవచ్చు. మరణశిక్షను రద్దుచేసి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్‌కు లేదు కానీ వాయిదా వేయవచ్చు.
* రాష్ట్రపతి సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలకు కూడా క్షమాబిక్ష పెట్టవచ్చు. రాష్ట్రంలో గవర్నర్‌కు అలాంటి అధికారాలు ఉండవు. ఎందుకంటే రాష్ట్రాలకు సైన్యం ఉండదు.
* నిబంధన 217 ప్రకారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్‌ను సంప్రదించాలి.
* రాష్ట్రపతికి ఉన్న సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు గవర్నర్‌కు ఉండవు.


విచక్షణాధికారాలు

  రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు తన అధికారాలను వినియోగించుకోవాలి. కింద పేర్కొన్న కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా లేకుండా తనకు తానే నిర్ణయాలు చేయవచ్చు. వాటినే 'విచక్షణాధికారాలు' అంటారు. అందులో రాజ్యాంగబద్ధమైనవి:
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు.
* రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడంలో విఫలమై, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని భావించినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని (నిబంధన 356) రాష్ట్రపతికి నివేదిక పంపవచ్చు.
* నిబంధన 371 ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో (నాగాలాండ్, అసోం, మణిపూర్ మొదలైనవి) గవర్నర్‌కు స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
* నాగాలాండ్ గవర్నర్‌కు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
* మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను  ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
* గవర్నర్ కొన్ని సందర్భోచితమైన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదం అవుతున్నాయి.
* రాష్ట్రంలో పరిపాలన నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రిని, విధానసభలో మెజారిటీ కోల్పోయారనే కారణంగా రద్దుచేసి, వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.
ఉదా: 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరారు అప్పటి గవర్నర్ రామ్‌లాల్. ఈ చర్య వివాదాస్పదం కావడంతో ఆయన్ను గవర్నర్ పదవి నుంచి 'రీకాల్' చేశారు.
* 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (పార్టీలో చీలిక కారణంగా) విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించి, ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరారు.
* విధాన సభలో ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం, మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించడం లాంటి గవర్నర్ అధికారాలు వివాదాస్పదం అవుతున్నాయి.
* నిబంధన 371 ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో (నాగాలాండ్, అసోం, మణిపూర్ మొదలైనవి) గవర్నర్‌కు స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
* నాగాలాండ్ గవర్నర్‌కు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
* మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను  ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
*  గవర్నర్ కొన్ని సందర్భోచితమైన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదం అవుతున్నాయి.
* రాష్ట్రంలో పరిపాలన నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రిని, విధానసభలో మెజారిటీ కోల్పోయారనే కారణంగా రద్దుచేసి, వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.
ఉదా: 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరారు అప్పటి గవర్నర్ రామ్‌లాల్. ఈ చర్య వివాదాస్పదం కావడంతో ఆయన్ను గవర్నర్ పదవి నుంచి 'రీకాల్' చేశారు.
* 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (పార్టీలో చీలిక కారణంగా) విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించి, ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరారు.
* విధాన సభలో ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం, మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించడం లాంటి గవర్నర్ అధికారాలు వివాదాస్పదం అవుతున్నాయి.
* ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సి.ఎం. త్రివేది.
* ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ.
* రెండో మహిళా గవర్నర్ కుముద్‌బెన్ జోషి.
* ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ఈయన గవర్నర్‌గా 2009 డిసెంబరు నుంచి కొనసాగుతున్నారు.
* మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కె.రోశయ్య తమిళనాడు గవర్నర్లుగా పనిచేశారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్ర శాసనసభ

విధాన నిర్ణయాల విశిష్ట వేదిక!

  ఒక శాసనం ప్రజల అవసరాలను ప్రతిబింబిచాలి. సంక్షేమాన్ని కాంక్షించాలి. అందుకోసం ఎన్నో సమాలోచనలు సాగాలి. చర్చలు జరగాలి. అందరి అభిప్రాయాలు వ్యక్తం కావాలి. సమతౌల్యత సాధించాలి. అంతిమంగా అత్యుత్తమైన నిర్ణయం వెలువడాలి. ఈ ప్రక్రియకు జాతీయస్థాయిలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధానంగా విధానసభ అలాంటి విధాన నిర్ణయాలకు విశిష్ట వేదికగా నిలిచింది. ఆ అత్యున్నత సభ నిర్మాణం, సభ్యుల ఎన్నిక, ఇతర రాజ్యాంగపరమైన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

రాష్ట్రస్థాయిలో రాష్ట్రానికి అవసరమైన శాసనాలను రూపొందించే అత్యున్నత వ్యవస్థ శాసన సభ. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రజాస్వామ్య విధానాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 168 నుంచి 212 మధ్య రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అధికారాలు, విధులు, సభ్యుల ఎన్నిక, అర్హతలు, అనర్హతల గురించి పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 168: ప్రతి రాష్ట్రానికి ఒక శాసన సభ ఉంటుంది. అదే రెండు సభలు ఉన్నప్పుడు గవర్నర్‌ + విధాన సభ + విధాన పరిషత్‌గానూ, ఒకే సభ ఉన్నప్పుడు గవర్నర్‌ + విధానసభగానూ ఉంటుంది. గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా కొనసాగుతారు. కానీ శాసన సభలో సభ్యత్వం ఉండదు.

విధానసభ

దీన్ని దిగువసభ, ప్రజాప్రతినిధుల సభ, శాసనసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 విధానసభ గురించి వివరిస్తుంది.

* 1950 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర విధానసభలో ఉండాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 60. గరిష్ఠ ఎమ్మెల్యేల సంఖ్య 500.

* జనాభా తక్కువ ఉన్న చిన్న రాష్ట్రాల్లో కనీస ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.

ఉదా: సిక్కిం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 32. గోవా విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40. మిజోరం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40.

* రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు) సంబంధిత రాష్ట్ర జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

* ప్రస్తుతం మనదేశంలో విధానసభల సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా నిర్ణయించింది.

* ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014’లోని సెక్షన్‌ 26 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేల సంఖ్యను 225కి, తెలంగాణ విధానసభలో ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల సంఖ్యను 153కి పెంచే అవకాశం కల్పించారు. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేదు.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 29 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 7 స్థానాలు రిజర్వు చేశారు.

* ప్రస్తుతం తెలంగాణ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 119. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 19 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 12 స్థానాలు రిజర్వు చేశారు.

సభ్యుల అర్హతలు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 173 రాష్ట్ర విధానసభ/శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటుంది. అవి 

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 25 ఏళ్లు నిండి ఉండాలి.

* లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* కాలానుగుణంగా పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.

* సభ్యులు దివాలా తీసినట్లుగా న్యాయస్థానం ప్రకటించి ఉండకూడదు.

* మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ జరిగి ఉండకూడదు.

ఎన్నికల ప్రక్రియ: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధాన సభలకు కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతాయి. ఏ రాజకీయ పక్షానికి చెందనివారు కూడా ‘స్వతంత్ర అభ్యర్థులు’గా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

ఎలక్షన్‌ మేనిఫెస్టో: ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని (ఎలక్షన్‌ మేనిఫెస్టో) ప్రకటిస్తాయి. ఈ మేనిఫెస్టోలో తాము ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో, ఏయే వాగ్దానాలను నెరవేరుస్తారో తమ నియోజక వర్గ ప్రజలకు తెలియజేస్తూ హామీ ఇస్తారు. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునేందుకు ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ దోహదం చేస్తుంది.

పోలింగ్‌ నిర్వహణ: ఎన్నికల రోజు ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ఓటు వేస్తారు. పోలింగ్‌ బూత్‌ అధికారి (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ - పీఓ) ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. సాధారణంగా ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. ఓటు హక్కును ఓటర్లు రహస్యంగా వినియోగించుకోవాలి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌

కంట్రోల్‌ యూనిట్‌: కంట్రోల్‌ యూనిట్‌లో ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలట్‌ బటన్‌ నొక్కగానే ఓటు వేసేందుకు ఈవీఎమ్‌ సిద్ధంగా ఉంటుంది. బ్యాలట్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగానే కంట్రోల్‌ యూనిట్‌పై ఉన్న బల్బు ఆగిపోయి, అదే సమయంలో ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి, ఓటు నమోదవుతుంది.

బ్యాలట్‌ యూనిట్‌: ఇది మూడు విధాలుగా ఉంటుంది.

ఎ) యంత్రం మీద ‘ఆకుపచ్చ రంగు బల్బు’ వెలుగుతున్నట్లయితే ఓటు వినియోగించుకోవడానికి ఈవీఎం సిద్ధమని అర్థం.

బి) ఓటరు అభ్యర్థి గుర్తుకి ఎదురుగా ఉన్న ‘నీలం రంగు బటన్‌’ను గట్టిగా నొక్కాలి.

సి) నీలం రంగు బటన్‌ను నొక్కగానే దానికి ఎదురుగా ఉన్న ‘ఎరుపు రంగు బల్బు బటన్‌’ వెలిగి, ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి ఓటు నమోదవుతుంది.

ప్రమాణ స్వీకారం: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 188 పేర్కొంటుంది. వీరు గవర్నర్‌ సమక్షంలో లేదా గవర్నర్‌ నియమించిన వ్యక్తి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో ఉదహరించిన విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రొటెం స్పీకర్‌: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా గవర్నర్‌ నియమిస్తారు. ఆ వ్యక్తి గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.  మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో జరుగుతుంది.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌: * విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 178 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉంటారు. విధానసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తప్పనిసరిగా విధానసభలో సభ్యులై ఉండాలి.

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ స్పీకర్‌ - తమ్మినేని సీతారాం

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ డిప్యూటీ స్పీకర్‌ - కోలగట్ల వీరభద్రస్వామి

* హైదరాబాద్‌ రాష్ట్ర విధానసభకు తొలి, చివరి స్పీకర్‌ - కాశీనాథ్‌రావు వైద్య

* మన దేశంలో విధానసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ - షాణోదేవి (హరియాణా)

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తొలగింపు: * రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు ప్రక్రియను వివరిస్తుంది.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే తీర్మానాన్ని ఎమ్మెల్యేలు 14 రోజుల ముందస్తు నోటీసుతో విధాన సభలో ప్రవేశపెడతారు. విధాన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు) సాధారణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ విధానసభ/ శాసనసభలో సభ్యత్వం కోల్పోతే పదవులను కూడా కోల్పోతారు.

* స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

* విధానసభ స్పీకర్‌పైన గానీ, డిప్యూటీ స్పీకర్‌పైనగానీ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరిపై తీర్మానం ప్రవేశపెడతారో వారు సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అవిశ్వాస తీర్మానంపై/ తొలగింపు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో వీరు విధానసభ సమావేశాలకు హాజరుకావచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. సాధారణ సభ్యుల్లా సభలో ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

సభలో సభ్యత్వం కోల్పోవడం

ఆర్టికల్‌ 191(1) ప్రకారం కింది సందర్భాల్లో శాసన సభ్యులు తమ పదవిని కోల్పోతారు. 

* విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత స్పీకర్‌ దాన్ని ఆమోదించినప్పుడు.

నోట్‌: విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పంపిన రాజీనామా పత్రాన్ని సంబంధిత వ్యక్తి స్వచ్ఛందంగా రాసింది కాదని, విశ్వసించదగినది కాదని స్పీకర్‌ భావిస్తే అలాంటి రాజీనామాను ఆమోదించరు. ఈ నియమాన్ని 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విధానసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగితే స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

* విధానసభ సభ్యులు ఎవరైనా సభాధ్యక్షుడి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సభా సమావేశాలకు గైర్హాజరైతే వారు పదవి కోల్పోతారు.

* ఆర్టికల్‌ 190 ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో విధానసభలో ఎమ్మెల్యేగా, విధాన పరిషత్తులో ఎమ్మెల్సీగా ఉండకూడదు. అంటే ద్వంద్వ సభ్యత్వానికి అనుమతి లేదు.

* ఆర్టికల్‌ 193 ప్రకారం చట్టసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా సభా సమావేశాల్లో పాల్గొనడం, ఓటు వేయడం నిషేధం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి సభలో ఎన్ని రోజులు ప్రవేశించారో అన్నిరోజులకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.

స్పీకర్‌ అధికారాలు - విధులు

* విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులను శిక్షించడం.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యుల అనర్హతలను ప్రకటించడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అని ధ్రువీకరించడం.

* అర్థన్యాయాధికారాలను కలిగి ఉండటం.

* సభా వ్యవహారాల కమిటీ, రూల్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించడం.

* సభా కార్యక్రమాల నిర్వహణ, వాయిదా వేయడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తన నిర్ణాయక ఓటు/ కాస్టింగ్‌ ఓటు/ కొసరు ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

* విధానసభ సభ్యులకు రక్షణ కల్పించడం. విధాన సభ్యులను పోలీసులు అరెస్టు చేయాలంటే ముందుగా స్పీకర్‌ నుంచి అనుమతి పొందాలి.

* సభా సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన ‘కోరం’ను స్పీకర్‌ ధ్రువీకరిస్తారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విధానసభల్లో ఎమ్మెల్యేల సంఖ్య 


1. ఉత్తర్‌ప్రదేశ్‌ - 403 


2. పశ్చిమ బెంగాల్‌ - 294


3. మహారాష్ట్ర - 288


4. బిహార్‌ - 243


5. తమిళనాడు - 234


6. మధ్యప్రదేశ్‌ - 230


7. కర్ణాటక - 224


8. రాజస్థాన్‌ - 200


9. గుజరాత్‌ - 182


10. ఆంధ్రప్రదేశ్‌ - 175


11. ఒడిశా - 147


12. కేరళ - 140


13. అస్సాం - 126


14. తెలంగాణ - 119


15. పంజాబ్‌ - 117


16. హరియాణా - 90


17. ఛత్తీస్‌గఢ్‌ - 90


18. ఝార్ఖండ్‌ - 81


19. ఉత్తరాఖండ్‌ - 70


20. హిమాచల్‌ప్రదేశ్‌ - 68


21. మేఘాలయ - 60


22. మణిపుర్‌ - 60


23. నాగాలాండ్‌ - 60


24. అరుణాచల్‌ ప్రదేశ్‌ - 60


25. త్రిపుర - 60


26. గోవా - 40


27. మిజోరం - 40


28. సిక్కిం - 32

కేంద్రపాలిత ప్రాంతాలు


1. దిల్లీ- 70


2. పుదుచ్చేరి - 30


3. జమ్ము-కశ్మీర్‌ - 83


 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలియన్‌ వాలాభాగ్‌ దురాగతం

తెల్ల రాక్షసుడి నరమేధం!


ప్రపంచానికి నాగరికత నేర్పించామని గర్వంగా ప్రగల్భాలు పలికే తెల్లదొరలు జలియన్‌ వాలాభాగ్‌లో జరిపిన నరమేధం మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిలిగిపోయింది. శాంతియుత నిరసనల్లో, పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలపై డయ్యర్‌ అత్యంత రాక్షసంగా సాగించిన దమనకాండలో వందలమంది దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ గుళ్ల వర్షంతో క్షణాల్లో శవాల కుప్పలుగా మారిపోయారు. వేలమంది ప్రాణభీతితో పరుగులు పెట్టారు. హంటర్‌ కమిటీ డయ్యర్‌ను తప్పు పట్టినా, ఆంగ్లేయ సమాజం అతడిని వీరుడిగా కొనియాడి సంస్కార హీనతను చాటుకుంది. గాంధీజీ వైఖరిని, జాతీయోద్యమం తీరును గొప్ప మలుపు తిప్పిన ఈ సంఘటనపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. 


గోపాలకృష్ణ గోఖలే అభిమతం మేరకు గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చారు. అప్పటికే ఆయన దక్షిణాఫ్రికాలో తెల్లదొరల జాత్యాహంకార పాలనకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడిన యోధుడు. భారత్‌కు చేరిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు దేశ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేటాయించారు. అనంతరం 1917-18 మధ్య చంపారన్‌లో (బిహార్‌) ఆంగ్లేయ భూస్వాముల చేతిలో బాధితులైన ఇండిగో రైతుల దుస్థితిపై, గుజరాత్‌లోని ఖేదా జిల్లాలోని బాధిత రైతుల కోసం, అహ్మదాబాద్‌లోని వస్త్ర మిల్లు కార్మికుల జీతభత్యాల పెంపు కోసం సత్యాగ్రహ పోరాటాలు చేశారు. వాటిలో విజయం సాధించి దేశ ప్రజల దృష్టి ఆకర్షించారు.


మొదటి ప్రపంచ యుద్ధ కాలం (1914-18)లో భారతీయుల సహకారం కోసం అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్‌ అనేక హామీలిచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు, యుద్ధకాలంలో మాంటేగ్‌ హామీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత జాతీయవాద నాయకత్వం వీటిని మందకొడి సంస్కరణలుగా, అచేతన వ్యవస్థలుగా, నామమాత్రపు అధికారంగా విమర్శించింది. ఒక పరాయి ప్రభుత్వం తమ స్వపరిపాలన యోగ్యతను నిర్ణయించడాన్ని జాతీయ నేతలు అంగీకరించలేదు. ‘‘భారతీయులకు యోగ్యమైన సంస్కరణలు లభించే వరకు ప్రాణాలకు తెగించి పోరాడటం కంటే గత్యంతరం లేదు’’ అన్నారు గాంధీజీ. 1918, ఆగస్టులో సయ్యద్‌ హాసన్‌ ఇమాం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వపరిపాలన వ్యవస్థ తప్ప మరే విధమైన పరిపాలన తమకు ఆమోదం కాదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమై సమరశీల జాతీయవాద కార్యకలాపాలు ఉద్ధృతమయ్యాయి.


రౌలత్‌ చట్టం     

యుద్ధకాలంలో వలస ప్రభుత్వం ఒక వైపు భారతీయుల సహాయం అర్ధిస్తూనే, మరో వైపు తీవ్ర అణచివేత చర్యలకు దిగింది. ఎందరో ఉద్యమకారులను ఉరితీసింది. ఈ క్రమంలోనే దేశంలో ఆందోళనలను ఉక్కుపాదంలో అణచివేసేందుకు జస్టిస్‌ రౌలత్‌ కమిటీ నివేదిక ఆధారంగా, 1919లో "Anarchical and Revolutionary Crimes Act 1919" తీసుకొచ్చింది. దీనినే రౌలత్‌ చట్టం అంటారు. భారతీయుల తీవ్ర నిరసనలను పట్టించుకోకుండా ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ దాన్ని ఆమోదించింది. దీంతో 1919, మార్చిలో నివేదిక చట్టరూపం దాల్చింది. దేశంలో రాజకీయ ఉద్యమాలను అణచివేయడానికి, బ్రిటిష్‌ ప్రభుత్వం 1915లో తీసుకొచ్చిన ‘డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా చట్టం’ కంటే క్రూరమైన చట్టం ఇది. పౌర హక్కులను కాలరాస్తూ పోలీసులకు విశేష అధికారాలు కల్పించింది. ఏ వ్యక్తినైనా విచారణ, నేర నిరూపణ లేకుండా నిర్బంధించేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. రాజకీయ సంస్కరణల రూపంలో తమకు ఆమోదయోగ్యమైన పాలనను ఆంగ్లేయలు జాతీయవాదులు భావించారు. కానీ ప్రభుత్వం రౌలత్‌ చట్టం అనే పైశాచిక అస్త్రాన్ని ప్రయోగించడంతో అందరూ హతాశులయ్యారు.అప్పటివరకు ప్రాంతీయ సమస్యలపై సత్యాగ్రహాలు జరిపిన గాంధీజీ, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఈ రౌలత్‌ చట్టం కల్పించింది. భారత జాతీయోద్యమ నాయకత్వాన్ని గాంధీజీ స్వీకరించారు. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ సభ’ స్థాపించి 1919, ఏప్రిల్‌ 6న దేశవ్యాప్తంగా అహింసాయుతంగా నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సభ సభ్యులు రౌలత్‌ చట్టాన్ని ధిక్కరించడానికి, దాని వల్ల ఎదురయ్యే పర్యవసానాలకు సిద్ధమయ్యారు. గాంధీజీ పిలుపుతో దేశం యావత్తు స్పందించి హర్తాళ్‌ పాటించింది. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి వెల్లువలా పెల్లుబికింది. హిందూ- ముస్లిం ఐక్యత వికసించింది. బొంబాయి ప్రభుత్వం అప్పటికే నిషేధించిన గాంధీజీ పుస్తకాలు ‘హింద్‌ స్వరాజ్‌’, ‘సర్వోదయ’లను ఈ ఉద్యమకాలంలో వీధుల్లో పెట్టి మరీ అమ్మడం ప్రారంభించారు. ప్రజలు వాటిని ఎక్కువ ధరకు కొని, ఉద్యమానికి నిధిని సమకూర్చేవారు. ఉద్యమ కార్యాచరణలో ప్రజలు నూతనోత్సాహంతో పాల్గొన్నారు. క్రమంగా దిల్లీ, పంజాబ్‌లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గాంధీని నిర్బంధించడంతో, ప్రజల ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి.


డయ్యర్‌ దమనకాండ      

రౌలత్‌ చట్ట వ్యతిరేక సత్యాగ్రహయోధులను కఠినంగా అణచివేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ సందర్భంలో జలియన్‌ వాలాభాగ్‌ (అమృతసర్‌)లో జరిగిన అమానుష సంఘటన మానవజాతి చరిత్రకే మచ్చగా మిగిలింది. నాగరికులమని ప్రకటించుకునే తెల్లదొరల వికృత స్వరూపాన్ని బహిర్గతం చేసింది. పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్‌ సత్యపాల్, సైఫుద్దీన్‌ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. ఈ వార్తతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృతసర్‌లో మార్షల్‌ లా విధించింది. నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్‌ డయ్యర్‌కు ఇచ్చింది. ఆ రోజు ఏప్రిల్‌ 13వ తేదీ. వైశాఖీ పర్వదినం. అమృతసర్‌లోని వాలాబాగ్‌ మైదానంలో నిరసన సభకు, అలాగే వైశాఖీ వేడుకల కోసం గ్రామీణులు, పట్టణ వాసులు సమావేశమయ్యారు. డాక్టర్‌ సత్యపాల్, డాక్టర్‌ కిచ్లూలాంటి నాయకులను ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని ప్రజలంతా కోపంగా ఉన్నారు. మరోవైపు సభలకు, సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. ఈ సమాచారాన్ని మొక్కుబడిగా చాటింపు వేయించారు. నిషేధాజ్ఞల విషయం మైదానానికి వచ్చినవారిలో చాలామందికి తెలియదు. మైదానం చుట్టూ ఎత్తైన గోడ. ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఒక్కటే ఉంది. ప్రశాంతంగా సాగుతున్న ఆ సమావేశ మైదానాన్ని జనరల్‌ డయ్యర్‌ సాయుధ దళం చుట్టుముట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జన సమూహంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. మైదానం శవాల దిబ్బలా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం వందల మంది మరణించారు. వేల మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హఠాత్పరిణామానికి దేశమంతా నివ్వెరపోయింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ను త్యజించారు. దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ధం సందర్భంగా బ్రిటిషర్లు ఇచ్చిన ‘కైజర్‌’ బిరుదును గాంధీజీ త్యజించారు. శంకరన్‌ నాయర్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్షుణ్ణంగా విషయ సేకరణ చేసి 92 ప్రశ్నలను సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు పంపించాడు. ఈ అమానుష సంఘటనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొక్కుబడిగా లార్డ్‌ హంటర్‌ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని నియమించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ కమిటీని బహిష్కరించి, తన సొంత విచారణ కమిటీని వేసింది. అందులో గాంధీజీ, చిత్తరంజన్‌ దాస్, ఫజుల్‌ హాక్, అబ్బాస్‌ థ్యాబ్జీ, యం.ఆర్‌.జయకర్‌లు సభ్యులు. ఈ కమిటీ వందలమంది సాక్ష్యులను విచారించి, వార్తలు సేకరించి జనరల్‌ డయ్యర్, అతడి అధికారుల దమనకాండను ఎండగట్టింది. డయ్యర్‌ను శిక్షించాలని కోరింది.


హంటర్‌ విచారణ సంఘం 1920, మే 20న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పంజాబ్‌ సంఘటనలో స్థూలంగా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని నిర్ణయించింది. పైగా డయ్యర్‌ బుద్ధిపూర్వకంగా కాల్పులు జరపలేదని, కాని అతడి నిర్ణయంలో పెద్ద పొరపాటు (Grave error of judgement) దొర్లిందని చెప్పింది. హంటర్‌ నివేదిక రాకముందే డయ్యర్‌ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. బ్రిటిష్‌ సమాజం అతడి ప్రభుభక్తిని కొనియాడింది. ‘బ్రిటిష్‌ సామ్రాజ్య పరిరక్షకుడు’ అన్న బిరుదునిచ్చి సత్కరించింది.


సామ్రాజ్యవాదం, విదేశీపాలకుల దుర్మార్గం, అరాచకత్వాన్ని ప్రజలు గమనించారు. పంజాబ్‌ దురాగతాలకు ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం, బాధ్యులపై చర్య తీసుకోకపోవడం గాంధీజీని కలచివేసింది. ఆయన వైఖరిలో కూడా తీవ్ర మార్పు వచ్చింది. ఆంగ్లేయులపై, వారి పాలనా వ్యవస్థలపై ఆయన పెంచుకున్న నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఆ విధంగా జలియన్‌ వాలాబాగ్‌ సంఘటన, జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 13-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌

1. జాతీయ ఎస్టీ కమిషన్‌ గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 338(A)

2. కిందివాటిలో జాతీయ ఎస్టీ కమిషన్‌ ప్రాంతీయ కార్యాలయం లేని సముదాయాన్ని గుర్తించండి.
     1) భోపాల్, భువనేశ్వర్‌      2) భద్రాచలం, బస్తర్‌      3) షిల్లాంగ్, రాంచీ      4) జైపూర్, రాయ్‌పూర్‌
జ: 2 (భద్రాచలం, బస్తర్‌)

3. PESA ను విస్తరించండి.
జ: Panchayats Extension to the Scheduled Areas

4. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, దాన్ని రాష్ట్రపతి ఎవరికి అందజేస్తారు?
జ: పార్లమెంట్‌

5. భారత ప్రభుత్వం నేషనల్‌ ట్రైబల్‌ పాలసీని ఎప్పుడు ప్రకటించింది?
జ: 2010

6. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ మొదటి ఛైర్మన్‌?
జ: కున్వర్‌ సింగ్‌

7. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ ప్రస్తుత ఛైర్మన్‌?
జ: నందకుమార్‌ సాయి

8. కిందివారిలో జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించనివారు?
     1) కున్వర్‌ సింగ్‌      2) ఊర్మిళా సింగ్‌      3) రామేశ్వర్‌ ఓరాన్‌      4) నందగోపాల్‌
జ: 4 (నందగోపాల్‌)

9. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ ఛైర్మన్‌ వేతనం ఎవరి వేతనానికి సమానంగా ఉంటుంది?
జ: కేంద్ర కేబినెట్‌ మంత్రి
 

Posted Date : 13-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌరులు - పౌరసత్వం

1. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొంది?
జ: యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌

2. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ఏది?
జ: ఆర్టికల్‌ 370

3. కిందివాటిలో రాజకీయ హక్కు?
ఎ) ఎన్నికల్లో ఓటు వేసే హక్కు                                               బి) ఎన్నికల్లో పోటీ చేసే హక్కు
సి) రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు                 డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

4. భారత పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు రూపొందించింది?
జ: 1955

5. ప్రవాస భారతీయులకు 2004 నుంచి ఎవరి సిఫారసుల మేరకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు?
జ: ఎల్‌.ఎం. సింఘ్వీ

6. పీఐఓను విస్తరించండి.
జ: పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌

7. మన దేశంలో ఏ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది?
జ: జమ్ముకశ్మీర్‌

8. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం ఏ తేదీలోపు పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం పొందే అవకాశం కల్పించారు?
జ: 1948, జులై 19

9. విదేశాల్లో నివసించే భారత సంతతి పౌరసత్వాన్ని తెలియజేస్తున్న ఆర్టికల్‌ ఏది?
జ: ఆర్టికల్ 9

Posted Date : 13-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏ కమిటీ.. ఏ సిఫార్సులు?

  భారత రాజకీయ వ్యవస్థలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఒక ముఖ్యమైన అంశం. దీని కోసం కేంద్రం వివిధ కమిటీలను నియమించింది. అవి పలు సిఫార్సులు చేశాయి. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.

  భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1956లో మనదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొనసాగుతున్నాయి.

ఎవరు, ఎలా చేస్తారు?

  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పునర్‌వ్యవస్థీకరణ జరిగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని నిర్ణీత గడువు లోగా తెలపాలని కోరవచ్చు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం ఏదైనప్పటికీ రాష్ట్రపతి గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్రప్రభుత్వం సొంత నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. పార్లమెంటు అంగీకారం అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ కమిటీలు సిఫార్సులు చేశాయి. వాటిలో ముఖ్యమైన అంశాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి.

భాషాప్రయుక్త ప్రావిన్స్‌ల కమిటీ

  భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి సరోజ్‌కుమార్‌ థార్‌ (ఎస్‌.కె.థార్‌) అధ్యక్షతన పన్నాలాల్‌, జగత్‌నారాయణ్‌లాల్‌ సభ్యులుగా ఒక కమిటీని 1948 జూన్‌లో అప్పటి రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1948 డిసెంబరులో సమర్పించింది.

సిఫార్సులు:
* భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు.
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జరగాలి.

జేవీపీ కమిటీ

  ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర నిరసనలకు దారితీయడంతో 1948 డిసెంబరులో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణపై జేవీపీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో J- జవహర్‌లాల్‌ నెహ్రూ, V - వల్లభాయ్‌పటేల్‌, P - పట్టాభి సీతారామయ్యలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్‌లో సమర్పించింది.

సిఫార్సులు:
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత వంటి అంశాలు ప్రాతిపదిక కావాలి.
* భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలి.
* ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి.

ఫజల్‌ అలీ కమిషన్‌

  కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ‘ఆంధ్ర రాష్ట్రం’ అవతరించింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఇతర భాషాప్రయుక్త రాష్ట్రాలకు డిమాండ్లు తలెత్తాయి. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నెహ్రూ ప్రభుత్వం 1953 డిసెంబరులో ఫజల్‌ అలీ అధ్యక్షతన కె.ఎమ్‌.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో సమర్పించింది.

సిఫార్సులు:
* పార్టు - ఎ, బి, సి, డి రాష్ట్రాల వర్గీకరణను రద్దుచేయాలి.
* ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే నినాదం సమంజసం కాదు.

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అంటే?

* కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడం
* రాష్ట్రాల సరిహద్దులను మార్చడం
* రాష్ట్రాల విస్తీర్ణంలో మార్పులు చేయడం
* రాష్ట్రాల పేర్లు మార్చడం

సుప్రీంకోర్టు తీర్పు
 

బాబూలాల్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ - రాష్ట్రపతి పంపిన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు కేంద్రప్రభుత్వం ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేస్తే మళ్లీ శాసనసభ అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌

షెడ్యూల్డు తెగల సంక్షేమాన్ని పెంపొందించేందుకు, రాజ్యాంగంలో వారికి కల్పించిన రక్షణలు, సౌకర్యాలను పరిరక్షించే లక్ష్యంతో జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ఆర్టికల్‌ 338(A) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా ఏర్పరిచారు. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. దీనికి భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, జైపూర్, రాయ్‌పూర్, రాంచీల్లో ఆరు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. భారత ప్రభుత్వం జాతీయ ట్రైబల్‌ పాలసీని 2010లో ప్రకటించింది.


ఎస్టీ కమిషన్‌ అధికారాలు - విధులు


* షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రణాళికా ప్రక్రియలో పాల్గొనడం. దీనికి సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* గిరిజనులు అనుసరిస్తున్న పోడు వ్యవసాయ పద్ధతిలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయడం.
* PESA Act (Panchayats Extension to the Scheduled Areas)ను షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపజేయడానికి కృషిచేయడం.
* షెడ్యూల్డు తెగల హక్కులు, రక్షణలను ఆటంకపరిస్తే వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
* షెడ్యూల్డు తెగల రాజ్యాంగ పరిరక్షణల పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. దీన్ని రాష్ట్రపతి పార్లమెంటుకు అందజేస్తారు.
* జాతీయ ఎస్టీ కమిషన్‌ నివేదికలోని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే ఆ కాపీని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలి. గవర్నర్‌ దాన్ని శాసనసభలో ప్రవేశపెడతారు.
* అభివృద్ధి కార్యక్రమాల మూలంగా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు కృషిచేయడం.
* షెడ్యూల్డు తెగలపై ప్రభావం చూపే అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ కమిషన్‌ను సంప్రదించాలి.
* గిరిజనులకు చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా నివారించడం, వారికి జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం.
* చట్టరీత్యా ఆదివాసీలకు ఖనిజ, జలవనరులపై హక్కులను కల్పించడం.
* ఏదైనా న్యాయస్థానం లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి పబ్లిక్‌ రికార్డును లేదా దాని కాపీని పొందవచ్చు.
* షెడ్యూల్డు తెగలకు చెందిన వివిధ రకాల అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించడం, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించమని సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలకు ఉత్తర్వులు జారీచేయడం.
* షెడ్యూల్డు తెగల హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా విచారణ జరపడం.


ముఖ్యమైన కమిటీలు
 

     భారత ప్రభుత్వం షెడ్యూల్డు తెగల సంక్షేమంపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి కొన్ని కీలక కమిటీలను నియమించింది.


ఎం.ఎస్‌. చౌదరి కమిటీ (1961)

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నియమించిన ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది. 
* గిరిజనులకు లభిస్తున్న హక్కులు, రాయితీలను పునఃసమీక్షించి అటవీ ప్రాంతానికి 8 కి.మీ. పరిధిలో ఉన్న గిరిజన, ఇతర వర్గాల వారికి మాత్రమే హక్కులు, రాయితీలు కల్పించాలి.
* అటవీ పరిమాణాన్ని అనుసరించి అందులో పశువులు మేపుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
* చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా చేపట్టి, శాఖాపరమైన డిపోల ద్వారా గిరిజనులకు పంపిణీ చేయాలి.

రాయ్‌ బర్మన్‌ కమిటీ (1971)


గిరిజన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది. 
* గిరిజన జీవన విధానంలో అడవుల ప్రాధాన్యతను గుర్తించాలి.
* ఉచిత వంటచెరకు, పశుగ్రాసం, గృహనిర్మాణం కోసం కలప మాత్రమే కాకుండా గిరిజనులకు చిన్న తరహా అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో మూడో వంతు కేటాయించాలి.
* త్రికోణ అటవీ విధానంలో గిరిజన వ్యక్తి, గిరిజన సముదాయం, జాతీయ ప్రయోజనాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.


వర్జీనియస్‌ జాక్సా కమిటీ (2013) 


ఈ కమిటీ గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసి కింది సిఫార్సులు చేసింది.
* గిరిజనులకు సమగ్రమైన పునరావాస విధానాలను రూపొందించాలి.
* PESA చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలి. 
* గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
* గిరిజన వర్గాలకు ఆరోగ్య ఉప ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలి.
* గిరిజనులు వివిధ కేసుల రీత్యా జైళ్లలో ఉన్నప్పుడు వారికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ కమిషన్లను ఏర్పాటు చేయాలి.


ఛైర్మన్, సభ్యుల సదుపాయాలు, జీతభత్యాలు


  జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాతో సమానమైన హోదా కలిగి ఉంటారు. డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రితో సమానమైన, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సదుపాయాలు, జీతభత్యాలను పొందుతారు.


రాజ్యాంగ వివరణ
 

ఆర్టికల్‌ 338(A)(1): షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేయాలి.


ఆర్టికల్‌ 338(A)(2): జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిషన్‌లో కచ్చితంగా ఒక మహిళ ఉండాలి. పదవీకాలం మూడేళ్లు.


ఆర్టికల్‌ 338(A)(3): జాతీయ ఎస్టీ కమిషన్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు.


ఆర్టికల్‌ 338(A)(4): జాతీయ ఎస్టీ కమిషన్‌ స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ తన పని విధానాన్ని నియంత్రించుకుంటుంది.


ఆర్టికల్‌ 338(A)(5): కమిషన్‌ అధికార విధులను తెలియజేస్తుంది.


ఇతర మౌలికాంశాలు
 

* 1988 నాటి జాతీయ అటవీ విధానం మొదటిసారిగా అడవుల్లో నివసించే గిరిజన వర్గాల అవసరాలను గుర్తించింది. 1996 వరకు 16 రాష్ట్రాలు సంయుక్త అటవీ నిర్వహణ చర్యలు చేపట్టాయి.
* 1974లో ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభించారు.
* 1987లో న్యూదిల్లీ కేంద్రంగా గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను (TRIFED) ప్రారంభించారు.
* 1999లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను, 2001లో జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
* షెడ్యూల్డు తెగల, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల చట్టాన్ని 2006, డిసెంబరు 15న పార్లమెంటు ఆమోదించింది.
* ఆదివాసులు ప్రతి ఏడాది డిసెంబరు 15న అటవీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌరులు - పౌరసత్వం

  ఒక వ్యక్తిని చట్టబద్ధంగా దేశపౌరుడిగా గుర్తించడాన్నే ‘పౌరసత్వం’ అంటారు. సాధారణంగా సమాఖ్య దేశాల్లోని పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. మనదేశ రాజ్యాంగం భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’గా పేర్కొంది. ఇది అనేక సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది. అయినప్పటికీ భారత పౌరులకు ఏకపౌరసత్వం మాత్రమే ఉంది. ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉన్నందున ఆ రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.


ప్రజలు - వర్గీకరణ


ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
* రాజకీయ హక్కులను కలిగి ఉండేవారిని పౌరులంటారు. ఆ హక్కులు లేనివారిని విదేశీయులంటారు.
రాజకీయ హక్కులంటే..
* ఎన్నికల్లో పోటీచేసే హక్కు
* ఎన్నికల్లో ఓటు వేసే హక్కు
 * రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే హక్కు
* ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు


భారత రాజ్యాంగం - పౌరసత్వ వివరణ


 రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి వివరిస్తున్నాయి.


ఆర్టికల్‌ 5

* 1950, జనవరి 26 నాటికి ఉన్న రాజ్యాంగం ఆరంభంలోని పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.
* 1950, జనవరి 26 లోపు భారతదేశంలో జన్మించి, శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
* 1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, అతడి తల్లి/తండ్రి ఆ సమయానికి భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
* 1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం కలిగి ఉంటే ఆ వ్యక్తికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది.


ఆర్టికల్‌ 6
* పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వలస వచ్చినవారి పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుంది.
* 1948, జులై 19 కంటే ముందు పాకిస్థాన్‌ నుంచి భారతదేశానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్నవారంతా భారతీయ పౌరసత్వానికి అర్హులు.


ఆర్టికల్‌ 7
* 1947, మార్చి 1 తర్వాత భారతదేశం నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ ఇమడలేక 1948, జులై 19 నాటికి భారత్‌కు వలస వచ్చినవారి పౌరసత్వ హక్కులను గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 8
* విదేశాల్లో నివసించే భారత సంతతి పౌరసత్వాన్ని గురించి ఉంటుంది.


ఆర్టికల్‌ 9
* భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు.


ఆర్టికల్‌ 10
* భారతీయ పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే భారతీయుడు ఎప్పటికీ భారతీయుడే.


ఆర్టికల్‌ 11
* భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలు  లేవు. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అత్యున్నత అధికారం పార్లమెంటుకు ఉంది.


భారత పౌరసత్వ చట్టం, 1955

భారత పార్లమెంటు పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలను నిర్దేశిస్తూ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రెండు ప్రధాన నియమాలపై ఆధారపడి ఉంది.  అవి:


1. Jus Soli (Right of the Soil): జన్మతః పౌరసత్వం


2. Jus Sanguinis (By Descent): రక్త సంబంధం/వారసత్వ రీత్యా పౌరసత్వం 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అవి:

జన్మతః పౌరసత్వం (Citizenship by Birth)

 1950, జనవరి 26 తర్వాత భారత్‌లో జన్మించి, స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ భారతీయ పౌరసత్వాన్ని పొందగలరు.


పరిమితులు

* మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయ ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.
* శత్రు దేశాల దంపతులకు జన్మించిన పిల్లలు, భారతదేశానికి విహారయాత్ర నిమిత్తం వచ్చిన విదేశాలకు సంబంధించిన దంపతులకు జన్మించిన పిల్లలు భారతీయ పౌరసత్వానికి అనర్హులు.


వారసత్వరీత్యా పౌరసత్వం (Citizenship by Descent)


* 1950, జనవరి 26 తర్వాత ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ, ఆ వ్యక్తి తల్లి/ తండ్రి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తిని కూడా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు.
ఉదా: శశిథరూర్‌ (లండన్‌లో జన్మించారు), రాహుల్‌ గాంధీ (అమెరికాలో జన్మించారు), విదేశాల్లోని భారత రాయబార ఉద్యోగులకు జన్మించిన పిల్లలు.


నమోదు ద్వారా పౌరసత్వం (Citizenship by Registration)


* విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(a) ప్రకారం నమోదు ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.
* భారత పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 5(1)(c)ద్వారా భారత పౌరసత్వాన్ని పొందగలరు.
ఉదా:జన్మతః ఇటలీ దేశస్థురాలైన సోనియాగాంధీ రాజీవ్‌గాంధీని వివాహం చేసుకోవడంతో 1983లో భారత పౌరసత్వాన్ని పొందారు.


సహజీకృతం ద్వారా పౌరసత్వం (Citizenship by Naturalisation)


* విదేశీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ, ప్రేమాభిమానాలతో భారత పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6(1) ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.

అర్హతలు
 

* కనీసం 18 సంవత్సరాలు నిండి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏదైనా ఒక భారతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండి, భారత్‌లో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు సహజీకృత పౌరసత్వానికి అర్హులు.
ఉదా: మదర్‌ థెరిసా (యుగోస్లావియా).

ఒక భూభాగం శాశ్వతంగా భారత్‌లో కలిసిపోవడం ద్వారా పౌరసత్వం (Citizenship by Incorporation of territory)

* 1950, జనవరి 26 తర్వాత ఒక కొత్త ప్రాంతం/ భూభాగం/ రాష్ట్రం/ దేశం భారత్‌లో శాశ్వతంగా కలిసిపోతే ఆ భూభాగంలోని ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
ఉదా: 1954లో ఫ్రెంచ్‌వారి నుంచి పాండిచ్చేరి, 1961లో పోర్చుగీసువారి నుంచి గోవా, 1975లో చోగ్యాల్‌ రాజు నుంచి సిక్కిం విముక్తి చెంది భారత్‌లో విలీనమయ్యాయి.


రద్దు పద్ధతులు


* 1955 భారత పౌరసత్వ చట్టం కింద 3 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వం రద్దు అవుతుంది. అవి:


1. పరిత్యాగం (Renunciation): ఎవరైనా భారతీయ పౌరుడు విదేశీ పౌరసత్వాన్ని పొందాలనుకున్నప్పుడు భారతీయ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించవచ్చు.


2. రద్దు చేయడం (Termination): ఎవరైనా భారతీయ పౌరుడు భారతీయ పౌరసత్వాన్ని త్యజించకుండా, విదేశీ పౌరసత్వాన్ని పొందినప్పుడు భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.


3. అనివార్యపు రద్దు(By Deprivation): ఏ వ్యక్తి అయినా భారత పౌరసత్వాన్ని అక్రమంగా లేదా మోసపూరితంగా సంపాదించినా లేదా భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, భారతీయ సంస్కృతిని అవమానిస్తే అలాంటివారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు.


భారత పౌరసత్వ సవరణ చట్టం, 1986

  విదేశీయులు అక్రమంగా భారతీయ పౌరసత్వాన్ని పొందడాన్ని నిరోధించే లక్ష్యంతో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ 1986లో భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా కింది మార్పులు జరిగాయి.

 నమోదు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి భారత్‌లో 5 సంవత్సరాల శాశ్వత స్థిరనివాసం కలిగి ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 6 నెలలే)
 ఈ చట్టంలో ‘స్త్రీలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయుడిని వివాహమాడిన విదేశీ మహిళ అని ఉండేది.)
 సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే వ్యక్తి ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం ఉండాలి. (1955 పౌరసత్వ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు ఉండేది). 
 భారత పౌరసత్వ చట్టాన్ని 1992, 2003, 2005లో కూడా సవరించారు.


భారత పౌరసత్వ సవరణ చట్టం, 2003

  ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ సిఫారసుల మేరకు ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించే లక్ష్యంతో భారత పార్లమెంటు 2003లో ఈ చట్టాన్ని రూపొందించింది.

* ఈ చట్టం ప్రకారం 2004లో ప్రపంచంలోని 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించింది.


16 దేశాలు

  *  2006, జనవరి 9న జరిగిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తప్ప మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు.


ద్వంద్వ పౌరసత్వం - ప్రయోజనాలు

* ప్రవాస భారతీయులు భారత్‌లో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు.
* విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు పొందవచ్చు.
* ప్రవాస భారతీయులు భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు.

పరిమితులు
 

* ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదు.

* రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టే అవకాశం లేదు.

* ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు లేదు.

* 2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించారు.

* భారతీయ సంతతి వ్యక్తుల పథకం  (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ - పీఐఓ

* 1999, మార్చిలో ప్రవేశపెట్టిన పీఐఓ కార్డు పథకాన్ని భారత ప్రభుత్వం పునః సమీక్షించి, 2002, సెప్టెంబరు 15 నుంచి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ముఖ్యాంశాలు

* పీఐఓ కార్డు పొందాలనుకునే ప్రవాస భారతీయులు పెద్దలయితే రూ.15000, 18 సంవత్సరాల లోపువారైతే రూ.7500 చెల్లించాలి.
* ఈ కార్డు కాలపరిమితి 15 సంవత్సరాలు.
* అఫ్గానిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, పాకిస్థాన్‌లోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు జారీ చేయరు.
* పీఐఓ కార్డు పొందినవారు మన దేశంలో వ్యవసాయ సంబంధ ఆస్తులను సంపాదించుకోవడాన్ని మినహాయించి, ఆర్థిక, వాణిజ్య, విద్యారంగాల్లో అన్ని రకాల అవకాశాలను పొందవచ్చు. వీరికి రాజకీయ హక్కులు ఉండవు.


ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం


* భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 ప్రకారం ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ముఖ్యాంశాలు
 

* ఓసీఐ కార్డును పొందేందుకు 275 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలి.
* ఓసీఐ కార్డు ఉన్నవారు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా పొందాల్సిన అవసరం లేదు. ఈ కార్డు కాలపరిమితి జీవితకాలం కొనసాగుతుంది.
* ఓసీఐ కార్డుపై బహుళ ప్రయోజన, బహుళ ప్రవేశిక వీసాలు మంజూరు చేస్తారు.
* 5 సంవత్సరాల పాటు ఓసీఐ నమోదైన వ్యక్తి 2 సంవత్సరాలు భారత్‌లో సాధారణ జీవితాన్ని గడిపితే అతడికి భారత పౌరసత్వం ఇస్తారు.
* 1950, జనవరి 26 తర్వాత భారత్‌ నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు.


ప్రవాసీ భారతీయ దివస్‌


* మహాత్మా గాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా 2003, జనవరి 9 నుంచి ఏటా జనవరి 9న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ను జరుపుతున్నారు.
*  ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖను భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు

* డేవిడ్‌ జాన్‌ హాప్‌కీన్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - 1997
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశ పౌరసత్వాన్ని విదేశీయులకు ప్రసాదించే విషయంలో మన దేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మన దేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించరాదని పేర్కొంది.


నూతన పౌరసత్వ బిల్లు  - ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు


* ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లు 2018ను లోక్‌సభ 2019, జనవరి 8న ఆమోదించింది.
* దీని ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వాలని ప్రతిపాదించారు. భారత్‌లో పౌరసత్వాన్ని పొందేందుకు కనీస నివాస కాలాన్ని 12 నుంచి 6 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్మానించారు.
* దీనికి తీవ్రంగా స్పందించిన అసోం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.

అసోం ఒప్పందం - 1985
 

* 1971, మార్చి 24 తర్వాత అసోం రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో అసోం ఒప్పందం కుదిరింది.
* 1985 నాటి అసోం ఒప్పందాన్ని నూతన పౌరసత్వ బిల్లు ఉల్లంఘిస్తుందని అసోంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సామాజిక వికాస పథకాలు

భారతదేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, వాటి ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగంలో దీనికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఆర్టికల్‌ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది.


సామాజిక వికాస పథకాల ఆవశ్యకత


* 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశం ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
* భారత ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించింది.
* మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధికి అవసరమైన సిఫారసులను సూచించాలని వి.టి. కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటుచేశారు. 
* వి.టి. కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 సమితుల్లో (బ్లాక్స్‌) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP - Community Development Programme)ను ప్రారంభించారు.


సమాజ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) 


* భారతదేశ అభివృద్ధికి నమూనాగా అమెరికాలో అమల్లో ఉన్న బ్లాక్‌ వ్యవస్థను తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాకు చెందిన ‘ఫోర్డ్‌ ఫౌండేషన్‌’ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు.
* సమాజ అభివృద్ధి కార్యక్రమం అమలుకు అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అయిదు మిలియన్‌ డాలర్ల ఆర్థిక తోడ్పాటును అందించింది. ఈ ఫౌండేషన్‌ నుంచి సీడీపీ 1971 నాటికి సుమారు 104 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని పొందింది.

లక్ష్యాలు:

* సమాజ వనరుల ఆధారంగా వివిధ ప్రణాళికల రూపకల్పన.
* దేశ సమగ్రాభివృద్ధిలో గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములను చేయడం.
* ప్రజలే సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం.
* వ్యక్తి సంక్షేమాన్ని సాధించడం ద్వారా సమాజ సంక్షేమానికి కృషి చేయడం. 
* ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన సహాయాన్ని అందించడం.

ముఖ్యాంశాలు:

* సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంపికచేసిన 50 జిల్లాలోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. తర్వాతి కాలంలో సీడీపీ 5011 బ్లాకులకు విస్తరించింది. ప్రతి బ్లాకులో 100 గ్రామాలు, సుమారు 70,000 జనాభా ఉంటుంది. 
* ప్రతి బ్లాకుకు బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (బీడీవో) కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తారు.


సీడీపీ ద్వారా సమగ్రాభివృద్ధికి ఎంపిక చేసిన అంశాలు

* వ్యవసాయం, కుటీర పరిశ్రమలు
*  ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం
* ఆర్థిక ప్రగతి, గృహవసతి
* సామాజిక సేవ, సాంఘిక సంక్షేమం
* గ్రామీణ సమాచార వ్యవస్థ
* పేదరిక, నిరుద్యోగ నిర్మూలన
* గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వయం స్వావలంబన, సాముదాయక దృక్పథం, పరస్పర సహకారం అలవరచుకోవడానికి ఈ పథకం ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారం లభించింది. దీనికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
* సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామ స్థాయిలో ‘గ్రామసేవక్‌’ అనే అధికారిని నియమించారు.


జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme - NESS)

* సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ప్రారంభించారు.
* సీడీపీని ముందుగా మూడేళ్ల కాలపరిమితికి, ఎన్‌ఈఎస్‌ఎస్‌ను శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు.
* ఈ పథకం ద్వారా వ్యవసాయం, విద్య, గ్రామీణ పరిశ్రమలను సమగ్రాభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 
* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం లాంటిదని ఎస్‌.కె.డే పేర్కొన్నారు. ఈయన సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లకు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు.
*  ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారత్‌లో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.


సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లపై వి.టి. కృష్ణమాచారి తెలిపిన వివరాలు

* సహకార సిద్ధాంతాలను సాధ్యమైనంతవరకు విస్తృతం చేసి, గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలను కల్పించడం.
* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, సమాజసేవా కార్యక్రమాలను చేపట్టడం; నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం.
* శాస్త్రీయ విద్య, విధానాలను అనుసరించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తులను సాధించడం.


ఎన్‌ఈఎస్‌ఎస్‌ వివిధ స్థాయిల్లో అమలు

i) కేంద్రస్థాయి:
* కేంద్ర స్థాయిలో ఈ పథకం సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. ఇది కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన విధానాలను అమలు చేస్తుంది.

ii) రాష్ట్రస్థాయి:
* రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంఘంలో రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖా మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యదర్శిగా ఉంటారు.

iii) జిల్లాస్థాయి:
* జిల్లా స్థాయిలో ఈ పథకం అమలు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉంటుంది.

iv) బ్లాకుస్థాయి:
* బ్లాకు స్థాయిలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాడు.

v) గ్రామస్థాయి:
* గ్రామ స్థాయిలో ఈ పథకం అమలుకు విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (VLW) ను నియమిస్తారు. వీరికి సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇస్తారు కాబట్టి వీరిని మల్టీ పర్పస్‌ వర్కర్స్‌గా పేర్కొంటారు.


బల్వంతరాయ్‌ మెహతా కమిటీ


* సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు, వాటి లక్ష్యాలను అవి ఎంతమేరకు సాధించాయో సమీక్షించేందుకు జాతీయాభివృద్ధి మండలి (NDC) 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. 
* బల్వంతరాయ్‌ మెహతా కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న నివేదికను సమర్పించింది. ఈ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది.


ప్రధాన సిఫారసులు:

* దేశం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ‘మూడంచెల పంచాయతీరాజ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది కింది విధంగా ఉండాలి.
1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ
2) మధ్య/బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి
3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌
* ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* ప్రభుత్వం అభివృద్ధి పథకాలను సమర్థంగా నిర్వహించాలంటే వాటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.
* స్థానిక సంస్థలకు ప్రతి అయిదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ ప్రాతిపదికన కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు జరగాలి. 
* స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి. భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలు కల్పించాలి.
* దిగువ స్థాయిలో మినహాయించి మాధ్యమిక, ఉన్నతస్థాయిలో అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షక అధికారాలను కల్పించాలి.
* మొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఉన్న సికార్‌ ప్రాంతంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ ‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ, జాతి నిర్మాణంలో కీలకపాత్రను పోషిస్తూ, భవిష్యత్‌ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’ అని వ్యాఖ్యానించారు.
* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. ఈ విధానాన్ని 1959, నవంబరు 1న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.


అశోక్‌ మెహతా కమిటీ

1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం దేశంలో సమగ్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేయడానికి 1977 డిసెంబరులో అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫారసులతో నివేదికను సమర్పించింది.

ప్రధాన సిఫారసులు:

* దేశంలో రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
అవి: 1) బ్లాకు స్థాయిలో - మండల పరిషత్‌
        2) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్‌
* వీటిలో మండల పరిషత్‌ అతికీలకమైన అంచె. 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటుచేయాలి. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటిస్థానంలో గ్రామ కమిటీలను ఏర్పరచాలి. 
* అభివృద్ధి పథకాల విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటుచేయాలి.
* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రిని నియమించాలి.
* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి.
* స్థానిక సంస్థల పదవీకాలం నాలుగేళ్లు ఉండాలి.
* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి.
* షెడ్యూల్డు కులాలు, తెగలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
* స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి తగిన అధికారాలు, ఆర్థిక వనరులను కల్పించాలి.
* సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఖర్చుచేసే విధానంపై సామాజిక తనిఖీ జరగాలి.
* స్థానిక ప్రభుత్వాలను బలమైన కారణం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని కల్పించాలి.
* మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి.
* 1979లో నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అశోక్‌ మెహతా కమిటీ సిఫారసులను చర్చించారు. వీటిని కొన్ని రాష్ట్రాలు స్వల్ప మార్పులతో అమలుచేశాయి. 
* మొదటిసారిగా మండల పరిషత్‌ విధానాన్ని 1985, అక్టోబరు 2న కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ప్రారంభించారు. 
* మండల పరిషత్‌ విధానాన్ని అమలుచేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఈ విధానాన్ని ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను 1985లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ప్రారంభించింది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌పాల్, లోకాయుక్త

పౌరుల ఫిర్యాదులను పరిష్కరించి అవినీతిని ఎంతమేరకు అరికట్టారనేదానిపై ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం; సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిల్లో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు సంస్థాగతమైన ఏర్పాట్లుచేశారు.
అవి: 1) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ
       2) పాలనా న్యాయస్థానాల వ్యవస్థ
       3) ప్రొక్యురేటర్‌ సిస్టం
* ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవుల్లోని వ్యక్తులపై ఉన్న అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను ‘అంబుడ్స్‌మన్‌’ పేరుతో తొలిసారిగా స్వీడన్‌ (1809)లో ఏర్పాటు చేశారు. అంబుడ్స్‌మన్‌ అంటే ప్రజల న్యాయవాది అని అర్థం.
* స్వీడిష్‌ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేళ్ల కాలపరిమితితో నియమిస్తుంది. ఈయన పార్లమెంట్, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అతీతుడు. ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యపరమైన వ్యవస్థ.
* 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో నార్వే దేశాలు అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొదటి కామన్వెల్త్‌ దేశం న్యూజిలాండ్‌. అక్కడ 1962లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ పేరుతో, బ్రిటన్‌లో 1967లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* సోషలిస్టు దేశాలైన సోవియట్‌ రష్యా, చైనా, పోలెండ్, హంగేరి, చెకోస్లోవేకియా, రుమేనియాలు ‘ప్రొక్యురేటర్‌ వ్యవస్థ’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.


భారతదేశంలో...

* భారతదేశంలో అత్యున్నతస్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు ‘లోక్‌పాల్‌’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి. దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.
* పార్లమెంటు సభ్యుడైన లక్ష్మీమాల్‌ సింఘ్వీ 1963లో ‘లోక్‌పాల్‌’ అనే పదానికి రూపకల్పన చేశారు.
* 1966లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
* ‘లోక్‌’ అంటే ప్రజలు, ‘పాల్‌’ అంటే సంరక్షకుడు అని అర్థం.


లోక్‌పాల్, లోకాయుక్త లక్షణాలు


* వీటి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.
* ఇవి స్వతంత్రత, నిష్పాక్షికతను ప్రదర్శించాలి.
* వీటి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలి.
* వీటి నుంచి అధికార పక్షం వారు ఎలాంటి ప్రయోజనాలను ఆశించకూడదు.
* తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి అధికారం ఉండాలి.


లోక్‌పాల్‌ బిల్లు - పార్లమెంటు


* 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించి రాజ్యసభలో పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయింది. దీంతో బిల్లు కూడా రద్దయింది. ఈ బిల్లు పార్లమెంటులో 8 సార్లు విఫలమైంది.
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో విశేష కృషి చేసింది. ఈ బిల్లుకు 2014 జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపడంతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంగా అమల్లోకి వచ్చాయి.
* జాతీయ స్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను విచారించేందుకు స్వయంప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను ‘లోక్‌పాల్‌’గా, రాష్ట్ర స్థాయిలో ‘లోకాయుక్త’గా పేర్కొన్నారు.


లోక్‌పాల్‌ నిర్మాణం


* లోక్‌పాల్‌లో ఒక ఛైర్మన్, ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యుడీషియల్‌ పరిజ్ఞానం గల సభ్యులు; మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గానికి చెందినవారై ఉండాలి.

నియామకం

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన వ్యక్తి సభ్యులుగా ఉంటారు.

ఛైర్మన్, సభ్యుల అర్హతలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడై ఉండాలి.
* లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
* నాన్‌ - జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యే వారికి పరిపాలన, అవినీతి నిర్మూలన లాంటి అంశాల్లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.

పదవీకాలం - జీతభత్యాలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు వరకు. వీరు పదవీ విరమణ అనంతరం 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయరాదు.
* ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
* లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* ఏడేళ్ల కాలపరిమితి దాటిన ఫిర్యాదులను లోక్‌పాల్‌ విచారణకు స్వీకరించదు. సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి వర్తిస్తాయి.

అధికారాలు - విధులు

* లోక్‌పాల్‌కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్‌ విభాగం ఉంటుంది. ప్రధానమంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఇది విచారిస్తుంది.
* కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) విచారించిన అంశాలను, తీసుకున్న చర్యలను లోక్‌పాల్‌కు తెలియజేయాలి.
* సీబీఐతో పాటు దేశంలోని అన్ని విచారణ సంస్థలు లోక్‌పాల్‌ పరిపాలనా నియంత్రణలోకి వస్తాయి.
* జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.
* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరచుకోవడానికి, వారిని సస్పెండ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఎవరినైనా విచారించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ ఫిర్యాదులపై ఆరు నెలల్లోగా విచారణ ముగించాలి.
* అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థలకు సిఫారసు చేస్తుంది. విదేశాల నుంచి డొనేషన్లు తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తాయి.
* కేసుల విచారణకు ఎలాంటి డాక్యుమెంట్లు, అఫిడవిట్లనైనా పరిశీలించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. ఫిర్యాదులపై దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో ముగించాలి. విచారణను దర్యాప్తు నుంచి మినహాయించాలి. న్యాయవ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్‌పాల్‌కు లేదు.
* ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్‌పాల్‌ విచారణను మెజారిటీ సభ్యుల అనుమతితో జరపాలి. ఛైర్మన్‌ సహా మొత్తం సభ్యుల్లో 3/4వ వంతు మంది సభ్యులు విచారణ జరిపేందుకు ఆమోదించాలి.
* అన్నాహజారే నేతృత్వంలోని పౌరసమాజం ‘జన్‌ లోక్‌పాల్‌’ సాధన కోసం విశేష కృషి చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయింది.
* లోక్‌పాల్‌ 2014 జనవరిలో చట్టంగా మారినప్పటికీ, ఇప్పటివరకు దాని నిర్మాణం జరగలేదు.


లోకాయుక్త

* రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను ‘లోకాయుక్త’ అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* మనదేశంలో మొదటిసారిగా ఒడిశా 1970లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించింది. కానీ అది 1983 నుంచి అమల్లోకి వచ్చింది.
* మహారాష్ట్ర 1971లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించి అమలు చేసింది. ఈ చట్టాన్ని అమలుచేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర.
* ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983 సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనదేశంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన న్యూదిల్లీలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.

లోకాయుక్తను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు
 

లోకాయుక్తను ఏర్పాటుచేయని రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌
2) జమ్ముకశ్మీర్‌
3) మణిపూర్‌
4) మేఘాలయ
5) మిజోరం
6) నాగాలాండ్‌
7) సిక్కిం
8) తమిళనాడు
9) త్రిపుర
10) పశ్చిమ్‌బంగ

లోకాయుక్త నియామకం - పదవీకాలం

* హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని ‘లోకాయుక్త’గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని ‘ఉప లోకాయుక్త’గా గవర్నర్‌ నియమిస్తారు.
* లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
* లోకాయుక్త పాలనాధిపతి ‘రిజిస్ట్రార్‌’. ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
* లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి.


ఏపీ, తెలంగాణలో లోకాయుక్త విచారణ పరిధిలోకి వచ్చే అంశాలు

* ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
* బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు.
* లోకాయుక్తకు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
* ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్నిలోకాయుక్తకు తెలియజేయాలి.

* లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.


నిర్మాణాత్మక వ్యత్యాసాలు

* లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు.
* రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు.
* ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికీ లోకాయుక్తను ‘లోక్‌పాల్‌’గా పిలుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లోకాయుక్తను ‘లోక్‌ ఆయోగ్‌’గా పిలుస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాలు తమ శాసనసభ్యులను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చాయి.
* మహారాష్ట్రలో మాజీ మంత్రులు, సివిల్‌ సర్వెంట్స్‌ను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చారు.
* లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణలో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని తీసుకుంటుంది.


సుప్రీంకోర్టు తీర్పు:

* లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఏఆర్‌ మెహతాను అప్పటి గవర్నర్‌ కమలా బేణీవాల్‌ నియమించిన వివాదంలో ఈ తీర్పును వెలువరించింది.
 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సమాచార హక్కు చట్టం

ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది.


నేపథ్యం:
* పారదర్శక ప్రభుత్వ పాలనే లక్ష్యంగా 1776లో స్వీడన్‌ తన దేశ రాజ్యాంగంలో తొలిసారిగా సమాచార హక్కును పొందుపరిచి మిగిలిన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
* 1951లో ఫిన్‌లాండ్, 1966లో అమెరికా, 1970లో డెన్మార్క్, నార్వే దేశాలు సమాచార హక్కును చట్టబద్ధం చేశాయి.
* 1923లో ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో ‘అధికార రహస్యాల చట్టాన్ని (The Official Secrets Act, 1923)' రూపొందించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయరాదని నిర్ణయించారు.


సుప్రీంకోర్టు తీర్పు

  1976లో రాజ్‌ నారాయణ్‌ Vs ఇందిరా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు సార్వభౌములని, ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాల్సిందేనని, సమాచార హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.
* రాజ్యాంగంలోని స్వేచ్ఛా స్వాంతంత్య్రపు హక్కును తెలిపే ఆర్టికల్‌ 19 (1)(a) లోనే సమాచార హక్కు కూడా ఉంది.
* రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీతలు సందీప్‌ పాండే (సామాజికవేత్త), అరుణారాయ్‌ (మాజీ ఐఏఎస్‌ అధికారి) కృషి ఫలితంగా మనదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.
* అటల్‌ బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2002లో ‘సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టంలోని లోపాలను సవరించి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ సమాచార హక్కు చట్టాన్ని 2005, అక్టోబరు 12 నుంచి జమ్ముకశ్మీర్‌ మినహా దేశవ్యాప్తంగా అమలుచేసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ చట్టం 2009 నుంచి అమల్లోకి వచ్చింది.


ముఖ్యాంశాలు:

 ఈ చట్టంలో మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి.
 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(J) ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించిన 17 రకాల సమాచారాలను పౌరులు పొందవచ్చు.
అవి:
1) రికార్డులు
2) పత్రాలు
3) సలహాలు
4) అభిప్రాయాలు
5) ఈ - మెయిల్స్‌
6) నివేదికలు
7) మెమోలు
8) కాంట్రాక్టులు
9) ఆర్డర్లు
10) లాగ్‌ పుస్తకాలు
11) సర్క్యులర్లు
12) పత్రికా ప్రకటనలు
13) రాతపుస్తకాలు
14) నమూనాలు
15) మోడల్స్‌
16) ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న గణాంకాలు
17) అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారికి అందుబాటులో ఉండే ప్రైవేట్‌ సంస్థల వివరాలు రికార్డులు, సర్టిఫైడ్, జిరాక్స్‌ కాపీలు; డాక్యుమెంట్లు, వీడియో టేపులు, సీడీలు, ఫొటోలు, ప్లాపీల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.


సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాని అంశాలు (సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8, 24 ప్రకారం)


* భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు
* దేశ రక్షణకు సంబంధించిన, గూఢచార సంస్థలు అందించే సమాచారం
* విదేశాలు, అంతర్జాతీయ సంస్థలతో భారతదేశం కుదుర్చుకునే ఒప్పందాలు
* రాష్ట్రపతికి పరిపాలనలో కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు
* గవర్నర్‌కు పరిపాలనలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు
* న్యాయ విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అంశాలు
* కేరళ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్నింటినీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసింది. సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని, వాటిని ప్రభుత్వ సంస్థలుగా పరిగణించలేమని జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ రాధాకృష్ణన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సమచారాన్ని పొందడం

* సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 5(1) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి/సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటాడు. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డును ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. దీని ఆధారంగా సంబంధిత అధికారి నుంచి సమాచారాన్ని పొందవచ్చు.

దరఖాస్తు నమూనా - దరఖాస్తు రుసుము

* సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.
* సమాచారం కోసం తెల్ల కాగితంపై విన్నపం అని రాసి ఇస్తే సరిపోతుంది.
* గ్రామస్థాయి సంస్థలకు దరఖాస్తు రుసుము ఉచితం. మండల స్థాయిలో రూ.5; జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిలో రూ.10 చెల్లించాలి.
* సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(5) ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దరఖాస్తు రుసుము ఉచితం.
* సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(2) ప్రకారం సమాచారాన్ని ఎందుకు కోరుతున్నారని దరఖాస్తుదారుడిని అడిగే అధికారం ప్రభుత్వ అధికారికి లేదు.


సమచారం ఇచ్చేందుకు గడువు

* వ్యక్తి జీవించే హక్కు, స్వేచ్ఛలకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటల్లోగా ఇవ్వాలి.


సమాచారం కోసం అప్పీలు

* నిర్దేశించిన గడువులోగా ఏ విషయాన్ని తెలియజేయకపోతే సమాచారం ఇవ్వడానికి తిరస్కరించినట్లుగానే భావించాలి.
* సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయ ఉన్నత అధికారికి మొదట అప్పీలు చేయాలి. అప్పుడు సంబంధిత అధికారి 30 - 45 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు 90 రోజుల వ్యవధిలో అప్పీలు చేస్తే, తదుపరి గడువును సమాచార కమిషన్‌ నిర్ణయిస్తుంది.


సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా, శిక్షలు

* దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించిన, ఎక్కువ దరఖాస్తు రుసుము కోరిన; అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినా, కోరిన సమాచారాన్ని ధ్వంసం చేసినా, ఇవ్వడాన్ని అడ్డుకున్నా సమాచార హక్కు చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 20(1) ప్రకారం రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25000 జరిమానా విధిస్తారు. తరచూ ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అధికారులపై సెక్షన్‌ 20(2) ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడతారు.
 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(6) ప్రకారం 30 రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాలి.

సమాచారం - స్వచ్ఛంద వెల్లడి

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన విధులు, బాధ్యతలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, జవాబుదారీతనం, ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు, బడ్జెట్‌ కేటాయింపు, రికార్డుల పట్టికలు, రాయితీల వివరాలు, ప్రజా సమాచార అధికారి వివరాలు, సలహా సంఘాల సమాచారాన్ని కార్యాలయాల్లో స్వచ్ఛందంగా వెల్లడించాలి.
 జి.ఒ.ఎం.ఎస్‌. నెం.454 ప్రకారం సమాచారాన్ని పొందేందుకు A3/A4 కాగితానికి రూ.2, ప్లాపీకి రూ.50, సీడీకి రూ.100, డీవీడీకి రూ.200 చెల్లించాలి.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(3) ప్రకారం దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు చెందనట్లయితే సంబంధిత P.I.O. (Public Information Officer) సంస్థకు పంపాలి. దరఖాస్తు అందిన అయిదు రోజుల్లోపు విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. అతడు కోరిన రూపంలోనే సమాచారాన్ని అందించాలి.
 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(9) ప్రకారం ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చయ్యే, రికార్డు భద్రత ప్రమాదంలో ఉన్న సందర్భంలో తప్ప, దరఖాస్తుదారుడు కోరిన రూపంలో సమాచారాన్ని ఇవ్వాలి.
 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 21 ప్రకారం దరఖాస్తుదారుడిపై ఎలాంటి దావాలు, న్యాయవిచారణ, చట్టపరమైన చర్యలు తీసుకోరాదు.
 నిర్ణీత గడువులోగా సమాచారం లభించనప్పుడు సమాచార కమిషన్‌కు వెళ్లాల్సివస్తే, సమాచార చట్టంలోని సెక్షన్‌ 19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.
 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం సమాచార కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలపై దావాను వేయరాదు. ఇతర విచారణను ఏ న్యాయస్థానాలు చేపట్టరాదు, ప్రశ్నించకూడదు.

చట్టం - ప్రచార బాధ్యత

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం దీని ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి.
 కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ‘ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పోర్టల్‌’ను 2013, ఆగస్టు 21న ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


కేంద్ర సమాచార కమిషన్‌

 సమాచార హక్కు చట్టంలోని అధికార విధులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2005, అక్టోబరు 13న న్యూదిల్లీ కేంద్రంగా ‘సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. దీనిలో ఒక ప్రధాన సమాచార కమిషనర్, పది మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు.
 ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి సమాచార కమిషనర్లను నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వరకు (ఏది ముందయితే అది వర్తిస్తుంది). జీతభత్యాలు, సర్వీసు నియమాలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటాయి.
 ప్రధాన, ఇతర సమాచార కమిషనర్లను సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఆరోపణలు రుజువైతే రాష్ట్రపతి తొలగిస్తారు.
 సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న 57వ దేశం భారత్‌.

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్లు


 క్ర.సం.     ప్రధాన సమాచార కమిషనర్‌ పేరు     పదవీకాలం
 1     వజాహత్‌ హబీబుల్లా     2005 - 2010
 2     ఎ.ఎన్‌. తివారి     2010 - 2010
 3     సత్యానంద మిశ్రా     2010 - 2013
 4     దీపక్‌ సంధు     2013 - 2013
 5     సుష్మా సింగ్‌     2013 - 2014
 6     రాజీవ్‌ మాథూర్‌     2014 - 2014
 7     విజయ్‌ శర్మ     2014 - 2015
 8     ఆర్‌.కె. మాథూర్‌     2016 - 2018
 9     సుధీర్‌ భార్గవ     2019 - ప్రస్తుతం


విజిల్‌ బ్లోయర్స్‌ రక్షణ చట్టం, 2014

 ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే వ్యక్తులకు బెదిరింపులు ఎదురైనప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సమాచార హక్కు కార్యకర్తలకు పరిరక్షణ బిల్లు (విజిల్‌ బ్లోయర్స్‌)ను తీసుకువచ్చింది. దీన్ని రాష్ట్రపతి 2014, మే 9న ఆమోదించగా, 2014 మే, 12న ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.


ముఖ్యాంశాలు

  సమాచార హక్కుకు సంబంధించిన కార్యకర్తలకు రక్షణ కల్పించడం.
  సమాచార హక్కు కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టే అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50,000 జరిమానా విధిస్తారు.
  అవినీతి అధికారుల వివరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం.
  కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమాచారం పొందే వ్యక్తులు ‘కాంపిటెంట్‌ అథారిటీ’ అంటే సంబంధిత కేంద్ర పాలిత ప్రాంత పాలకుడి లేదా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంబోధిస్తూ దరఖాస్తులో సమాచారాన్ని కోరాలి.
 రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి పరోక్షంగా నిధులు పొందడంతో పాటు ప్రజావిధుల్లో పాల్గొంటాయి కాబట్టి అవి ప్రజాసంస్థల కిందకే వస్తాయని 2013 జూన్, 3న కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టం చేసింది. జాతీయ రాజకీయ పార్టీలు ఆరు వారాల్లోగా సమాచార అధికారులు, అప్పిలేట్‌ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.
అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951’ కింద నమోదైన రాజకీయ పార్టీలను ప్రజా సంస్థలుగా భావించరాదని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాయి.
 సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు.
  సమాచార హక్కు చట్టం - 2005లో పొందుపరిచిన అధికార విధులను అమలు చేయడానికి ఈ చట్టంలోని సెక్షన్‌ 15(1) ప్రకారం రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర సమాచార కమిషన్‌’ను ఏర్పాటు చేయాలి.
 ఆంధ్రప్రదేశ్‌లో 2005, అక్టోబరు 13న రాష్ట్ర సమాచార కమిషన్‌ అమల్లోకి వచ్చింది.
  రాష్ట్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు పది మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్‌ నియమిస్తారు.
 సమాచార హక్కు చట్టంపై కేవలం 23% మంది ప్రజలకు మాత్రమే అవగాహన ఉందని ‘ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించడం కుదరదు. ఇంటర్వ్యూ చేసినవారి పేర్లను వెల్లడిస్తే వారి భద్రతకు అపాయం కలుగుతుందని బిహార్‌ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉద్యోగాల ఇంటర్వ్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ఆర్థిక సంఘం

  ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తారు. ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం రాష్ట్రాలతోపాటు మరెవరికీ లేదు.

  భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధ న్యాయ సంస్థ (Quasi-federal). ఇది ఒక సలహా సంస్థ. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సమాఖ్యలో ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న సహకార సమాఖ్యలో ఆర్థిక సంఘం సిఫారసులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు సమకూరతాయి. రాష్ట్రాలు ప్రజలకు సన్నిహితంగా ఉంటూ తక్కువ వనరులతో, అధిక వ్యయంతో కూడిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయ వనరుల విషయంలో కేంద్రం - రాష్ట్రాల మధ్య (Verticle), రాష్ట్రాల మధ్య (Horizontal) అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని వనరులను పునఃపంపిణీ చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన సంస్థ మరొకటి లేదు.


రాజ్యాంగ హోదా

  
  రాజ్యాంగంలోని XII వ భాగంలో 280 నుంచి 281 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, విధులు, సిఫారసులను సమర్పించడం లాంటి అంశాలను వివరిస్తాయి.


నియామకం - అర్హతలు


  ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. 280(1) నిబంధన ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అవసరమని భావించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంస్థ. ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా ప్రజా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారిని నియమిస్తారు. ఉదాహరణకు 2017, నవంబరు 27న 15వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా నియమితులైన ఎన్.కె. సింగ్ మాజీ రాజ్యసభ సభ్యుడు. పదవీ విరమణ పొందిన కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు. ఆర్థిక సంఘంలో సభ్యులుగా నియమితులు కావడానికి కిందివాటిలో ఏదో ఒక అర్హత ఉండాలి.
*హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అవసరమైన అర్హతలు ఉండాలి.
*ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఖాతాలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
*ఆర్థిక పాలనా వ్యవహారాల్లో విస్తృతమైన అనుభవం ఉండాలి.
* అర్థశాస్త్ర నిపుణుడై ఉండాలి. అయితే నియమించే సభ్యుడి వ్యక్తిగత ప్రయోజనాలు ఆర్థిక సంఘం విధులను ప్రభావితం చేసే అవకాశం ఉండకూడదు. ఈ మేరకు రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. రాష్ట్రపతి కోరిన సమాచారాన్ని అందించాలి.


అనర్హతలు:
  1) మానసిక బలహీనత ఉండకూడదు.
  2) ఆర్థికంగా దివాలా తీసి ఉండకూడదు.
  3) దుర్మార్గమైన కార్యకలాపాల్లో పాల్గొని నేరస్తుడై ఉండకూడదు.
  4) ఆర్థిక సంఘం విధి నిర్వహణను ప్రభావితం చేసే వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకూడదు.


ఆర్థిక సంఘం నిర్మాణం

  ఆర్థిక సంఘం బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి నియామకానికి కావాల్సిన అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ 'ఆర్థిక సంఘ చట్టం' (ఇతర నిబంధనలు) 1951 (Finance Commission (Miscellaneous Provisions) Act 1951) ని రూపొందించింది. ఇందులో ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యుల నియామకం, అర్హతలు, అనర్హతలు, పదవీ కాలం, అధికారాలు లాంటి అంశాలను పేర్కొన్నారు.


పదవీ కాలం:

  ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు. కాబట్టి దీనికి నిర్ణీత పదవీ కాలం ఉండదు. ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు నియామక పత్రంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్న కాలం వరకు విధులు నిర్వహిస్తారు. నిర్దేశించిన కాలపరిమితి లోపల నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబరులో నియమించారు. 2019 అక్టోబరు లోపల నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్రపతి ఆదేశించారు. అయితే ఆర్థిక సంఘం నివేదిక నిర్ణీత కాలవ్యవధి వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 14వ ఆర్థిక సంఘం నివేదిక 2015 నుంచి 2020 వరకు, 15వ ఆర్థిక సంఘం నివేదిక 2020 నుంచి 2025 వరకు అమల్లో ఉంటాయి.
¤ ఒకసారి ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో నియమించవచ్చు. ఆర్థిక సంఘం సభ్యులు రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పేరుమీద రాసి, రాష్ట్రపతికి సమర్పించాలి. ఆర్థిక సంఘంలోని సభ్యులు పూర్తికాలం (Full time) లేదా పాక్షిక కాలం (Part time) రాష్ట్రపతి కోరిన విధంగా విధులను నిర్వహిస్తారు. ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.


ప్రత్యేక అధికారాలు

* భారత ఆర్థిక సంఘం అర్ధ న్యాయ సంస్థ కాబట్టి విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఈ సంఘానికి ఉంటాయి.

* భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి లేదా సంస్థనైనా సాక్ష్యంగా తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగలదు.
* తనకు కావాల్సిన సాక్ష్యాధార పత్రాలను (Documents) సమర్పించాలని ఆదేశించగలదు.
* ప్రభుత్వ రికార్డులు ఇవ్వాలని ఏ కోర్టును లేదా ప్రభుత్వ కార్యాలయాన్నైనా కోరవచ్చు.


విధులు

  రాజ్యాంగంలోని నిబంధన 280(3) ప్రకారం కింది అంశాలకు సంబంధించి తగిన సూచనలు చేయాలి    

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ అయ్యే లేదా పంపిణీ చేయాల్సిన పన్నుల (Divisible pool)నికర రాబడులను, కేంద్రం - రాష్ట్రాల మధ్య కేటాయించడానికి అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సిఫారసు చేయడం.
* భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను ఇవ్వడానికి తగిన నియమాలను (Principles) సూచించడం (275వ రాజ్యాంగ నిబంధన).
* రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లోని పంచాయతీల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం (73వ రాజ్యాంగ సవరణ చట్టం).
* రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి రాష్ట్ర సంఘటిత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలను సూచించడం (74వ రాజ్యాంగ సవరణ చట్టం).
* భారతదేశ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం రాష్ట్రపతి కోరిన అంశంపై తగిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను రూపొందించడం.


పనితీరు

ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల నియామకం జరిగి, దాని విధి, విధానాలను నిర్ణయించాక రాబోయే అయిదేళ్లకు సాధారణ వ్యయం, రెవెన్యూ వివరాలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తారు.

* రెవెన్యూ, వ్యయానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అందిన వివరాలను, అందులోని విశ్వసనీయతను పరిశీలించి, సంబంధిత రాష్ట్రాల అధికారులను సమావేశపరచి అసాధారణమైన, ఆచరణకు సాధ్యం కాని వాటిని తొలగిస్తుంది.
* తర్వాతి దశలో ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలను సందర్శించి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రాలకు కావాల్సిన ఆర్థిక సహాయం గురించి వారి వాదనలను వింటుంది.
* ఆర్థిక సంఘం చివరగా దిల్లీలో సమావేశమై చర్చించి, తుది నివేదికను రూపొందించి, రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి ఆ నివేదికను కేంద్ర కేబినెట్‌కు పంపిస్తారు. చివరగా ఆర్థిక సంఘం సిఫారసులు, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వివరించే నోట్‌తో సహా రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ఎదుట ఉంచేలా చూస్తారు. పార్లమెంట్‌లో చర్చించి, ఆమోదించాక ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయడం లేదా సవరణలు చేయడం జరుగుతుంది.


ఆర్థిక సంఘాలు, పేర్కొన్న ముఖ్యాంశాలు

* మొదటి ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 55 శాతం, ఎక్సైజ్ సుంకంలో 40 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 80 శాతం, పన్ను వసూళ్లను 20 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు.

* రెండో ఆర్థిక సంఘం ఆదాయ పన్నులో 66 శాతం, ఎక్సైజ్ సుంకంలో 25 శాతం రాష్ట్రాలకు కేటాయించింది. కేటాయింపులకు జనాభాను 90 శాతం, పన్ను వసూళ్లను 10 శాతం ప్రాతిపదికగా తీసుకున్నారు. నిధుల కేటాయింపునకు జనాభానే ప్రధానాంశంగా పరిగణించారు. కొద్దిపాటి మార్పులతో ఇదే విధానం 4వ ఆర్థిక సంఘం వరకు కొనసాగింది.
* 5వ ఆర్థిక సంఘం మొదటిసారిగా మూడు రాష్ట్రాలకు (జమ్మూ కశ్మీర్, అసోం, నాగాలాండ్) ప్రత్యేక హోదా కల్పించాలని సూచించింది. జాతీయాభివృద్ధి మండలి సిఫారసు మేరకు (అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్) ఈ సంఖ్య 11కు పెరిగింది.
* ఏడో ఆర్థిక సంఘం జనాభాతోపాటు తలసరి ఆదాయం (25 శాతం), వెనుకబడినతనం లేదా పేదరికం, రెవెన్యూ వ్యయాలను ప్రామాణికంగా తీసుకుని 50 శాతం నిధులను కేటాయించింది.
* 12వ ఆర్థిక సంఘం మార్కెట్ల నుంచి నేరుగా రుణాలను సేకరించే స్వేచ్ఛ రాష్ట్రాలకు కల్పించాలని సిఫారసు చేసింది. అలాగే నిధులను నేరుగా పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలని సూచించింది.
* ప్రస్తుతం (2015 - 20) 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు కేటాయింపులు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని సూచించింది. స్థానిక సంస్థలకు నిధులను 2011 జనాభా ప్రాతిపదికన బదిలీ చేయాలని పేర్కొంది. ఆంధ్రపదేశ్ సహా రెవెన్యూ లోటు ఉన్న 11 రాష్ట్రాలకు రూ.1.94 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.22,113 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. నిధుల కేటాయింపునకు మొదటిసారిగా పర్యావరణం అనే అంశాన్ని (అటవీ విస్తీర్ణం) ప్రాతిపదికగా తీసుకుంది.
* వస్తు, సేవల పన్ను (GST) అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలకు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని 100 శాతం కేంద్రం భరించాలని, నాలుగో సంవత్సరం 75 శాతం, అయిదో సంవత్సరం 50 శాతం భరించాలని సూచించింది. దీనికోసం 'వస్తు, సేవల పన్ను నిధి'ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘం సభ్యులు: శక్తికాంతదాస్ (ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి), రమేష్ చాంద్ (నీతిఆయోగ్ సభ్యులు), అశోక్ లాహిరి (మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు), అనూప్ సింగ్ (జార్జి టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్).
* ఇది సహకార సమాఖ్య లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీతో పాటు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై 'వస్తు సేవల పన్ను' ప్రభావంపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. రుణస్థాయులు, నగదు నిల్వలు, కేంద్ర రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ లాంటివి పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది. సమర్పించాల్సి ఉంది

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ సంస్థలు

  భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం (Indirect Democracy) అమల్లో ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే పాలకులు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా లభించే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా నిర్ణీత కాలానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సకాలంలో సక్రమంగా జరిగే ఎన్నికలు వెన్నెముక, చుక్కాని లాంటివి.


ఎన్నికల సంఘం

ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడానికి అవసరమైన పరిస్థితుల్లో నిర్ణీత కాలానికి జరిగే ఎన్నికలు ముఖ్యమైనవి. అలాంటి ఎన్నికల నిర్వహణకు మన దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ ఎన్నికల సంఘం.
* రాజ్యాంగం 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న నిబంధనలు ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తున్నాయి.
* నిబంధన 324(2) ప్రకారం ఎన్నికల సంఘంలో ప్రధానాధికారితోపాటు రాష్ట్రపతి నిర్ధారించినంత మంది ఎన్నికల అధికారులుంటారు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రధానాధికారిని లేదా అధికారులను నియమిస్తారు.
* 1950 నుంచి 1989 వరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (Chief Election Commissioner) మాత్రమే ఉండేవారు. 1989, అక్టోబరు 16న త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. 1990 జనవరిలో ఏకసభ్య సంఘంగా మార్చారు. 1993, అక్టోబరు 1 నుంచి త్రిసభ్య సంఘంగా కొనసాగుతోంది. ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* ఎన్నికల సంఘం నిర్ణయాధికారంపై సుప్రీంకోర్ట్ తీర్పు చెబుతూ ముగ్గురు కమిషనర్లకు సమాన అధికారాలుంటాయని, సమన్వయం కుదరకపోతే మెజారిటీ నిర్ణయం చెల్లుబాటవుతుందనీ వెల్లడించింది.
* ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటి నుంచి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకూ అధికారంలో కొనసాగుతారు. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేస్తారు.
* ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్ధ. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిని అభిశంసించే పద్ధతినే ఎన్నికల సంఘం కమిషనర్‌ను అభిశంసించడానికి అనుసరించాలని నిబంధన 324(5) సూచిస్తుంది. నిబంధన 324(6) ప్రకారం ఎన్నికల అధికారులను, ప్రాంతీయ ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సిఫారసు లేకుండా తొలగించడానికి వీలులేదు.
* జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు.


విధులు

  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాను తయారుచేయడం, ఎన్నికల తేదీలు నిర్ణయించడం ఎన్నికల సంఘం విధులు.
* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించి,  సక్రమంగా నిర్వహించడం. శాంతియుతంగా అక్రమాలు లేకుండా జరగడానికి పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవడం.
* రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, పార్టీలకు గుర్తులు కేటాయించడం, కొన్ని పరిస్థితుల్లో రద్దు చేయడం మొదలైనవి కూడా ఎన్నికల సంఘం విధులు.
* ఒక పార్టీకి ఏదైనా ఒక రాష్ట్ర ఎన్నికల్లో కనీసం 4% ఓట్లు వస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా, 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు వస్తే జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
* ఎన్నికల వివాదాల్లో న్యాయస్థానాల్లో పాల్గొని పరిష్కరించడం, డిపాజిట్ల నిర్వహణ ఈ సంఘం ముఖ్య విధులు.
* స్వేచ్ఛాపూరిత వయోజన ఓటింగ్ పద్ధతి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటిది. 326 నిబంధన ప్రకారం మన దేశంలో పౌరులందరికీ కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సార్వజనీన వయోజన ఓటింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
* 325 నిబంధన ప్రకారం కుల, మత, వర్గ విచక్షణతో ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో 21 సంవత్సరాల వయోపరిమితి నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దేశంలో యువతకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.


కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

* ఇది బ్రిటిష్‌వారి పాలనాంశాల నుంచి మన దేశానికి సంక్రమించిన పాలనా వ్యవస్థ (Controller and Auditor General - CAG). 1753లో భారత్‌లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్‌మెంట్‌ను మొదటిసారిగా ప్రారంభించారు. వివిధ ప్రావిన్స్‌లు ఖాతాల నిర్వహణకు అకౌంటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
* 1857లో లార్డ్ కానింగ్ చర్యల వల్ల బొంబాయి, మద్రాస్, బెంగాల్‌ను ఒక అకౌంటెంట్ జనరల్ ఆధిపత్యంలోకి తెచ్చారు. 1919లో ఆడిటర్ జనరల్‌కు భారత ప్రభుత్వం నుంచి స్వతంత్రత కల్పించారు. 1935 చట్టం ద్వారా ఇతడికి ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి హోదా కల్పించారు.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆడిటర్ జనరల్‌కు 1950లో 'కంప్ట్రోలర్' అనే పదాన్ని చేర్చి, ప్రభుత్వ ఖాతాల తనిఖీ, వ్యయ సఫలత, అక్రమాలు బయటకు తీసే అవకాశం కల్పించారు.
* 'రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో అత్యంత ముఖ్యుడు కాగ్' - అంబేడ్కర్.
* రాజ్యాంగ నిబంధన 148 ప్రకారం కాగ్‌ని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఇతడి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకు. కాగ్ రాజీనామా చేయాలంటే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తికి లభించిన వేతనం కాగ్‌కు లభిస్తుంది. అవినీతి, అసమర్థత ఆరోపణలుంటే కాగ్‌ను పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా తొలగించవచ్చు. (సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన మాదిరిగా.)

విధులు

  నిబంధన 149లో కాగ్ విధులను తెలియజేశారు. 1976 వరకు కాగ్ ఖాతాల నిర్వహణకు కూడా అధిపతిగా ఉండేవారు. ఖాతాల నిర్వహణకు ఒక కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌ను (CGA)నియమించిన తర్వాత ఖాతాల నిర్వహణ బాధ్యతల నుంచి కాగ్‌కు విముక్తి లభించింది.
* 'బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తనకు తానుగా విషయాలను క్షుణ్నంగా పరిశీలించి తీర్పునిచ్చే సుప్రీం మాస్టర్ కాగ్' - పట్టాభి సీతారామయ్య.
* ప్రభుత్వ ఖాతాల సంఘానికి హితుడిగా వ్యవహరించే కాగ్ కింది విధులను నిర్వర్తిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆడిట్ చేయడం.
* ప్రభుత్వం చేసిన వ్యయం చట్టబద్దంగా జరిగిందా లేదా నిర్దేశిత అధికారి ద్వారా జరిగిందా లేదా అని పరిశీలించడం.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను ఆడిట్ చేయడం, రాష్ట్రపతికి, గవర్నర్లకు నివేదికలు ఇవ్వడం.
* కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసిన ధనం వ్యయాన్ని పరిశీలించడం. ప్రభుత్వ రంగ సంస్థల, అన్ని ప్రభుత్వ విభాగాల ఖాతాలను ఆడిట్ చేయడం.
* కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల విడుదలకు కాగ్ ప్రమేయం ఉండదు.
* కాగ్ ఆదాయ వ్యయాలనే కాకుండా గోదాముల్లో నిల్వలను కూడా ఆడిట్ చేయవచ్చు.
* కాగ్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా కొన్ని రక్షణలను కల్పించారు.
* పదవి నుంచి తొలగించడానికి అభిశంసన తీర్మానం ఆమోదించడం ఒక్కటే మార్గం. పదవీ కాలంలో జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించకూడదు. పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. జీత భత్యాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* మన దేశంలో తొలి కాగ్ వి. నరసింహారావు
* ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి.
* తొలి ఎన్నికల ప్రదానాధికారి టి. సుకుమార సేన్
* ప్రస్తుత ఎన్నికల సంఘ కమిషనర్లు (త్రిసభ్య సంఘం) ప్రధానాధికారి ఓంప్రకాష్ రావత్; సునీల్ ఆరోరా, అశోక్ లావాసా.


ఆర్థిక సంఘం


  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఆర్థిక సంఘం.
* రాజ్యాంగం 12వ భాగం 280, 281 నిబంధనలు ఆర్థిక సంఘం నిర్మాణం, విధులను తెలియజేస్తున్నాయి. నిబంధన 280(1) ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఈ సంఘాన్ని నియమిస్తారు.
* 1951 సంవత్సరం విత్త చట్టం ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడింది. 1959 సంవత్సరం సవరణ ప్రకారం ఈ సంఘం రాష్ట్రపతికి సలహాలివ్వాలని కూడా నిర్ణయించారు.
* ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ సాధారణంగా కింది అర్హతలు ఉండాలి.
* ఛైర్మన్‌కు ప్రజా సంబంధ విషయాల్లో విషయ పరిజ్ఞానం ఉండాలి.
* నలుగురు సభ్యులు అర్థశాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి. అకౌంటింగ్, ఆడిటింగ్‌లలో అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తికి కావలసిన అర్హతలుండాలి.
* విత్తపాలనలో నిష్ణాతులై ఉండాలి.


విధులు

  కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సూచనలు ఇవ్వడం. పంపిణీ చేసిన పన్నులను, రాబడులను రాష్ట్రాల మధ్య కేటాయించడం. భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల మీద నియమాలు రూపొందించడం.
* రాష్ట్రపతి కోరిన ఇతర విషయాలపై సూచనలివ్వడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ నివేదికకు విశ్లేషణ జతపరిచి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చేస్తుంది. ఆర్థిక సంఘం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్ కె.సి. నియోగి.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై విచారణ సంఘం ఛైర్మన్‌గా పని చేసింది పి.వి. రాజమన్నార్.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి 6వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పని చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి.
* బొంబాయి ముఖ్యమంత్రి, 8వ ఆర్థిక సంఘం ఛైర్మన్ వై.బి. చవాన్.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, ఏపీ తాత్కాలిక గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా సేవలందించింది సి. రంగరాజన్.
* ప్రస్తుత ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె. సింగ్.


పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)

  కార్యనిర్వహణ శాఖను రెండు భాగాలుగా విభజించుకుంటే మొదటిది రాజకీయ కార్యనిర్వాహక వర్గం. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, వీరు తీసుకున్న నిర్ణయాలు వాస్తవంగా అమలు చేసేది రెండో భాగం - ప్రభుత్వ ఉద్యోగులు.
* అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సమర్థులను ఎంపిక చేయడానికి రాజ్యాంగం ఏర్పాటుచేసిన స్వతంత్ర సంస్థ 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్' .
* భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం యూపీఎస్సీ ఏర్పడింది. 1926లో లీ కమిషన్ సిఫారసుల మేరకు నిర్మాణం చేశారు. 1935 చట్టంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు రాష్ట్ర సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. రెండు మించిన రాష్ట్రాలకు ఉమ్మడి సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు.
* యూపీఎస్సీలో ఒక ఛైర్మన్, రాష్ట్రపతి నిర్ణయం మేరకు 9 - 11 మంది సభ్యులుంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను రాజ్యాంగంలో సూచించలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిపాలన అనుభవం ఉన్నవారిని నియమించాలి. మిగిలినవారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఛైర్మన్, పది మంది సభ్యులున్నారు.
* వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయోపరిమితి వచ్చేవరకు ఏదిముందుగా వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
* యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి కొన్ని చర్యలు చేపట్టారు. వీరి వేతనాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేతనాలను తగ్గించకూడదు.
* అవినీతి, అసమర్థ ఆరోపణలుంటే 317 నిబంధన ప్రకారం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరిపించి, అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించడం ద్వారా అధికారం నుంచి తొలగించవచ్చు. ఏ కారణంతో తొలగించినా సుప్రీంకోర్ట్ సలహా తీసుకోవాలి. తొలగింపు, అభిశంసన రాజ్యాంగపరమైన ప్రక్రియ.

విధులు: అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేయడానికి అభ్యర్థులను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం.
* ఈ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు మొదలైన సర్వీసు నిబంధనల్లో సలహాలివ్వడం.
* తొలి యూపీఎస్సీ ఛైర్మన్ హెచ్.కె. కృపలానీ, ప్రస్తుత ఛైర్మన్ వినయ్ మిట్టల్

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ - రాజ్యసభ - సభాధ్యక్షులు

* స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తటస్థ వ్యక్తిగా వ్యవహరించడం సంప్రదాయం.
* ఈ సత్సంప్రదాయాన్ని పాటించిన ఘనత నీలం సంజీవరెడ్డికే దక్కుతుంది. ఆయన తర్వాత మరెవరూ దీన్ని పాటించలేదు.
* పార్లమెంటు ముఖ్యవిధి శాసన నిర్మాణం.
* శాసన నిర్మాణంతోపాటు, పాలక వర్గంపై అజమాయిషీ లాంటి మరికొన్ని విధులు కూడా పార్లమెంటు నిర్వహిస్తుంది.
* పార్లమెంటు ఉభయసభలు ఒక ప్రత్యేక ప్రక్రియ (శాసన నిర్మాణ ప్రక్రియ) ద్వారా సభా సమావేశాల్లో అనేక విధాలుగా చర్చించి శాసనాలను తయారుచేస్తాయి.
* సభా సమావేశాల్లో అనేక రకాల తీర్మానాలు ప్రశ్నలు మొదలైన వాటి ద్వారా పాలక వర్గంపై అజమాయిషీ చేస్తూ పాలకవర్గం నియంతృత్వ పోకడలను నివారిస్తుంది.
* పార్లమెంటు ఉభయ సభలు తమ విధులను 'సభా సమావేశాల' ద్వారా నిర్వహిస్తాయి.
* సభా సమావేశాల నిర్వహణకు, సభా సమావేశాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి సభాధ్యక్షులు ఉంటారు.
* లోక్‌సభ అధ్యక్షుడిని 'స్పీకర్' అంటారు.
* రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ అధ్యక్షుడిని ఛైర్మన్ అని వ్యవహరిస్తారు.


లోక్‌సభ స్పీకర్

 భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం, శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు సర్ ఫ్రెడరిక్‌వైట్‌ను అధ్యక్షుడిగా 1921లో గవర్నర్ జనరల్ నియమించారు.

* 1947 వరకు సభాధ్యక్షుడు అని వ్యవహరించేవారు.
* 1950 భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ పదవికి 'స్పీకర్' అని నామకరణం చేశారు.
* మొదటి లోక్‌సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్.
* రాజ్యాంగ నిబంధన 93 ప్రకారం లోక్‌సభ కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను  ఏర్పాటు చేశారు.
* లోక్‌సభ ఎన్నికల అనంతరం మొదటి సమావేశంలోనే సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా వేరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
* లోక్‌సభ గడువు ఉన్నంత వరకు (అయిదేళ్లు) అతడు పదవిలో కొనసాగుతాడు. గడువుకు ముందే లోక్‌సభ రద్దయితే కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు అతడు పదవిలో కొనసాగుతాడు.
* నిబంధన 94 ప్రకారం స్పీకర్‌ను ముందుగా పదవి నుంచి తొలగించాలంటే 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు ఇచ్చి, లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
* మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్‌ను పదవి నుంచి తొలగిస్తారు.
* తీర్మానాన్ని సభలో చర్చించినప్పుడు అతడు సభాధ్యక్షుడిగా ఉండకూడదు.
* స్పీకర్ పదవి చాలా గౌరవప్రదమైంది.
* ఇంతవరకు ఎవరినీ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించలేదు.
* 1954లో జి.వి. మావలంకర్‌పై, 1966లో సర్దార్ హుకుంసింగ్‌పై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
* వేతనం: స్పీకర్‌కు నెలకు రూ.1,40,000 గౌరవ వేతనంతోపాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, టెలిఫోన్, వైద్య సదుపాయాలు, ఉచిత నివాస గృహం మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు.
* స్పీకర్ వేతనాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు ప్రత్యేక సచివాలయం, సిబ్బంది ఉంటారు.
* Rules of Procedure and Conduct of Business in Parliment Act 1950 - 51 - 19 శీర్షికలో స్పీకర్ అధికారాలు, విధులను వివరించారు.


సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి:

* లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం.
* సభా నాయకుడిని (ప్రధాని) సంప్రదించి, సభ్యుల ప్రసంగాలకు సమయాన్ని కేటాయించడం.
* సమావేశాల్లో వివిధ తీర్మానాలకు, వాటిపై చర్చకు, బిల్లుల పరిశీలనకు కార్యక్రమాన్ని నిర్ణయించి, అమలు చేయడం.
* సభా నియమాలకు సరైన అర్థ వివరణ చేయడం స్పీకర్ బాధ్యత. స్పీకర్ వివరణ నిర్వివాదమైందని సభ్యులు ఆమోదించాలి.
* సభా కార్యక్రమాలు క్రమశిక్షణతో జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది. క్రమశిక్షణకు భంగం కలిగించే పరిస్థితులను నివారించాలి.
* సభా కార్యక్రమాల నిర్వహణలో గందరగోళ పరిస్థితి ఏర్పడితే కార్యక్రమాలను తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా, నిరవధికంగా వాయిదా వేయొచ్చు (ఎడ్జర్న్ చేయడం Sign die).
* హద్దుమీరి క్రమశిక్షణను అతిక్రమించిన సభ్యులను అదుపు చేయాలి. అదుపు చేయడం సాధ్యం కాకపోతే సార్జెంట్ ఇన్ ఆర్మ్ సహాయంతో సభ్యులను బహిష్కరించడం, సస్పెండ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవచ్చు.
* సభలో కనీస సభ్యుల హాజరు 'కోరం' లేకపోతే సభను వాయిదా వేయొచ్చు.
* బిల్లుల, తీర్మానాలపై అవసరమైతే ఓటింగ్ జరిపించి ఫలితాలను సభకు తెలపాలి.
* ఓటింగులో స్పీకర్ పాల్గొనరాదు. ఏదైనా అంశంపై సమానమైన ఓట్లు వస్తే స్పీకర్ నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసి సందిగ్ధ పరిస్థితిని నివారించవచ్చు.
* సభా కార్యక్రమాల్లో సభ్యులందరూ పాల్గొని, మాట్లాడే అవకాశాన్ని నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా కల్పించాలి.
* రాజ్యసభ ఆమోదంతో వచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపడం.


స్పీకర్‌కు ఉన్న పర్యవేక్షణ అధికారాలు:


* వివిధ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేసి, వాటి పనిని పర్యవేక్షించడం.
* సభా వ్యవహారాల కమిటీ, సభా నియమాల కమిటీలకు స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* సభా సంఘాలు సకాలంలో నివేదికలు సమర్పించేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది.
* సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన సమాధానాలు రాబట్టాలి. సరైన సమాధానం ఇవ్వని మంత్రిని మందలించవచ్చు.
* సభా హక్కులకు భంగం కలిగించే సభ్యుల, ఇతరులపై తగిన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది.
* స్పీకర్ అనుమతి లేనిదే సభ్యులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు.
* సభా కార్యక్రమాలను, సభ్యుల ప్రసంగాలను రికార్డు చేయించడం. సభా మర్యాదకు, సంప్రదాయాలకు విరుద్ధమైన వాటిని రికార్డుల నుంచి తొలగించడం మొదలైనవి కూడా స్పీకర్ విధులు.
* స్పీకర్‌కు విధి నిర్వహణలో సహాయపడటానికి లోక్‌సభ సచివాలయం ఉంటుంది. సచివాలయ సిబ్బంది కార్యకలాపాలపై స్పీకర్‌కే నియంత్రణ ఉంటుంది.
* 'ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం' నెపంతో ఏదైనా సమాచారాన్ని సభకు లేదా కమిటీలకు  అందించకపోతే సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. బోఫోర్స్, ఫేర్‌ఫాక్స్ విషయాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
* లోక్‌సభ సభ్యులు ఎవరైనా రాజీనామా చేస్తే ఆమోదించడం, సభ్యులకు గృహవసతి మొదలైన సౌకర్యాలు సమకూర్చడం స్పీకర్ విధి.
* పార్టీ ఫిరాయింపుల వల్ల లేదా ఏ ఇతర కారణాల వల్ల సభ్యుల అనర్హతలను నిర్ణయించేది స్పీకర్. ఆయన నిర్ణయం తిరుగులేనిది.
* లోక్‌సభకు - రాజ్యసభకు - మంత్రిమండలికి - రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా స్పీకర్ వ్యవహరిస్తారు.
* ఏదైనా బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఏదైనా బిల్లు ఆర్థిక బిల్లా - సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది.
* అఖిల భారత స్పీకర్ల మహాసభకు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
* బ్రిటన్‌లో ఒకసారి స్పీకర్‌గా ఎన్నికైతే ఇష్టమైనంత కాలం కొనసాగవచ్చు. మన దేశంలో అధికార పార్టీని కాదన్నవారు స్పీకర్‌గా కొనసాగలేరు.
* అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం వల్ల జి.వి. మౌలాంకర్ సర్దార్ హుకుంసింగ్‌లపై అభిశంసన తీర్మానానికి ప్రయత్నించి, దాన్ని ఉపసంహరించుకున్నారు.
* స్పీకర్ ఒక న్యాయస్థానంలో న్యాయనిర్ణేత కాకపోయినా సభా కార్యక్రమాల నిర్వహణ సందర్భాల్లో తీర్మానాలను అనుమతించడం, తోసిపుచ్చడం, సభానియమాలకు అర్థం చెప్పడం లాంటి విషయాల్లో, అతడి నిర్ణయాలు న్యాయనిర్ణయాలతో సమానమైనవి. వాటికి తిరుగులేదు.
* మన దేశంలో అధికార హోదాలో లోక్‌సభ స్పీకర్‌ది 7వ స్థానం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమాన గౌరవం ఉంటుంది.
* స్పీకర్ లేని సమయంలో సభకు అధ్యక్షత వహించడానికి డిప్యూటీ స్పీకర్‌గా ఒకరిని ఎన్నుకుంటారు.


ఇప్పటి వరకు స్పీకర్లుగా పని చేసిన వ్యక్తులు...

* ఒకటో లోకసభ స్పీకర్ - జి.వి.మౌలాంకర్, అనంతశయన అయ్యంగార్
* రెండో లోక్‌సభ స్పీకర్ - అనంతశయన అయ్యంగార్
* మూడో లోక్‌సభ స్పీకర్ - సర్దార్ హుకుంసింగ్
* నాలుగో లోక్‌సభ స్పీకర్ - నీలం సంజీవరెడ్డి (రాష్ట్రపతిగా పోటీచేయడానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గురుదయాళ్‌సింగ్ స్పీకర్ పదవిని చేపట్టారు).
* అయిదో లోక్‌సభ - గురుదయాళ్‌సింగ్ ధిల్లాన్, బలిరామ్‌భగత్.
* ఆరో లోక్‌సభ - నీలం సంజీవరెడ్డి (రాష్ట్రపతి పదవికి పోటీ చేయగా కె.ఎస్. హెగ్డే స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు).
* ఏడో లోక్‌సభ స్పీకర్ - బలరాం జక్కర్
* ఎనిమిదో లోక్‌సభ - బలరాం జక్కర్
* తొమ్మిదో లోక్‌సభ - రబీ రే
* పదో లోక్‌సభ - శివరాజ్ పాటిల్
* పదకొండో లోక్‌సభ స్పీకర్ - పి.ఎ. సంగ్మా
* పన్నెండో లోక్‌సభ స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి
* పదమూడో లోక్‌సభ స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి, మనోహర్ గజానన్ జోషి
* పద్నాలుగో లోక్‌సభ స్పీకర్ - సోమనాథ్ ఛటర్జీ
* పదిహేనో లోక్‌సభ స్పీకర్ - మీరాకుమార్ (మొదటి దళిత మహిళా స్పీకర్)
* పదహారో లోక్‌సభ స్పీకర్ - సుమిత్రా మహాజన్


రాజ్యసభ అధ్యక్షుడు


  లోక్‌సభలో 'స్పీకర్' నిర్వహించే విధులను రాజ్యసభలో 'ఛైర్మన్' హోదాలో ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. పదవిరీత్యా ఉపరాష్ట్రపతికి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో నెలకు రూ.1,40,000 వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. రాజ్యసభ ఛైర్మన్ సభలో సభ్యుడు కాదు. కాబట్టి తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. కానీ బిల్లుల ఆమోదంపై సమాన ఓట్లు వచ్చినప్పుడు 'కాస్టింగ్ ఓటు' వేసి, ఆమోదింపజేయడమో, తిరస్కరించడమో చేయొచ్చు. రాజ్యసభ ఆమోదించిన బిల్లును లోక్‌సభకు పంపడం, రాజ్యసభ సమావేశాల నిర్వహణకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించడం, సభానియమాల ఉల్లంఘన విషయాలు పరిశీలించడం, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను నియమించడం మొదలైనవి రాజ్యసభ ఛైర్మన్ విధులు. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ వర్మ.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైకోర్ట్ - రాష్ట్ర న్యాయ వ్యవస్థ

* భారతదేశంలో తొలి మహిళా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్ - హిమాచల్‌ప్రదేశ్.
* హైకోర్ట్‌లో ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసింది - బి.పి.ఝా.
* హైకోర్ట్ తొలి న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ - అన్నా చాంది (కేరళ).
* ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేసిన తొలి మహిళా జస్టిస్ న్యాయమూర్తి  - అమరేశ్వరి.
* భారత రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. దాన్నే హైకోర్ట్ అంటారు
* మన దేశంలో హైకోర్ట్ చట్టాన్ని 1861లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం తొలి హైకోర్ట్‌ను 1862 జులైలో కలకత్తాలో ప్రారంభించారు. 1862, అక్టోబరు 26న బొంబాయి, మద్రాసులో హైకోర్ట్‌లను ప్రారంభించారు.
* రాజ్యాంగంలోని VI భాగంలో ఉన్న 214 నిబంధన నుంచి 237 నిబంధన వరకు, హైకోర్ట్ నిర్మాణం, అధికారాలు, అధికార పరిధి మొదలైనవి వివరించారు.
* పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఒక రాష్ట్రానికి లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేయవచ్చని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. (ఆర్టికల్ 231) ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఈ నాలుగింటికి కలిపి గౌహతిలో ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
*  2013లో ఏర్పడిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్ట్‌లతో కలిపి ప్రస్తుతం దేశంలో 24 హైకోర్ట్‌లున్నాయి. 1966లో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్ట్‌ను 1953లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 11 మంది ఇతర న్యాయమూర్తులతో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 34 మంది ఇతర న్యాయమూర్తులతో హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం నూతన హైకోర్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
* రాజ్యాంగ నిబంధన 216 ప్రకారం హైకోర్ట్‌లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ మంది న్యాయమూర్తులు అలహాబాద్ హైకోర్టులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ (1 + 57). అతి తక్కువ మంది న్యాయమూర్తులున్న హైకోర్ట్‌లు మేఘాలయ, మణిపూర్, త్రిపుర (1 + 2).
* నిబంధన 217 ప్రకారం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే భారత పౌరుడై ఉండాలి, కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా, ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తులు 62 సంవత్సరాలు వచ్చేంతవరకు పదవిలో కొనసాగవచ్చు. వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన 114వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందలేదు.
* రాజ్యాంగం 3వ షెడ్యూల్‌లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి వివరించారు. 219 నిబంధన ప్రకారం గవర్నర్ లేదా అతడి ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* హైకోర్ట్ న్యాయమూర్తుల వేతనాలను నిబంధన 221 ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వేతనాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* రాజ్యాంగ నిబంధన 222 ప్రకారం హైకోర్ట్ న్యాయమూర్తులను ఒక కోర్ట్ నుంచి వేరొక కోర్ట్‌కు బదిలీచేయవచ్చు.
* ఏదైనా హైకోర్ట్ న్యాయమూర్తులు తాత్కాలికంగా విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిబంధన 223 ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించవచ్చు. వీరు 65 సంవత్సరాల వయోపరిమితి నిండిన తర్వాత పదవిలో కొనసాగడానికి వీలులేదు.
* ఏదైనా హైకోర్ట్‌లో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధన 224 ప్రకారం రాష్ట్రపతి అదనపు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రధాన న్యాయమూర్తి టి. బి. రాధాకృష్ణన్.
* అవినీతి, అధికార దుర్వినియోగం, అసమర్థత, ఆరోపణలున్న న్యాయమూర్తులను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.
అభిశంసన ఎదుర్కొన్న హైకోర్ట్ న్యాయమూర్తులు
* 2010లో కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి షమిత్ ముఖర్జీని పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించారు.
* 2011, ఆగస్టు 18న రాజ్యసభ కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభలో చర్చకు రాకముందే సెప్టెంబరు 1న ఆయన రాజీనామా చేశారు.
* తమిళనాడు హైకోర్ట్ న్యాయమూర్తి పి.డి. దినకరన్‌పై 2009లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించడంతో 2011, జులై 29న ఆయన రాజీనామా చేశారు.
* 2016 - 17లో దళితుడైన సుంకు రామకృష్ణను హింసించారనే ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి సి.వి. నాగార్జున రెడ్డిపై అభిశంసనకు ప్రయత్నించి విరమించుకున్నారు.
* సుప్రీంకోర్ట్ సమన్లు ధిక్కరించినందుకు కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్‌పై నిషేధాన్ని విధించారు.


ఇతర అంశాలు

* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా హైకోర్ట్ న్యాయమూర్తులు కూడా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి కొన్ని రక్షణలను కల్పించారు. అభిశంసన తీర్మాన చర్చ సమయంలో తప్ప వీరి ప్రవర్తనపై చర్చించకూడదు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్ట్‌లో, పనిచేసిన హైకోర్ట్‌లో కాకుండా ఇతర హైకోర్ట్‌లలో వాదించవచ్చు.
* పదవీకాలంలో జీతభత్యాలు తగ్గించకూడదు.
* హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదిస్తారు. ఇతర న్యాయమూర్తుల నియామక సమయంలో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు.
* ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2,50,000 ఇతర న్యాయమూర్తులకు రూ.2,25,000 చెల్లిస్తారు.


అధికారాలు - విధులు


* ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని వివాదాలు హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వివాదాలు, హిందూ వివాహం, విడాకులు, ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి.
* జిల్లా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై వచ్చిన అప్పీళ్లను హైకోర్ట్ విచారిస్తుంది. సివిల్ వివాదాల్లో ఆస్తి విలువ ఎక్కువ ఉంటే హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* దిగువ స్థాయి కోర్ట్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జిల్లా కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు, హైకోర్ట్‌లో రెండో అప్పీలు చేసుకోవచ్చు. రెండో అప్పీలు విషయంలో కేవలం చట్టానికి సంబంధించిన అంశాలనే పరిశీలిస్తారు.
* క్రిమినల్ కేసుల విషయంలో (7 సంవత్సరాలకు మించి శిక్ష పడినట్లయితే) సెషన్స్ కోర్ట్ తీర్పుపై హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ట్రైబ్యునల్ తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని భావించినప్పుడు హైకోర్ట్‌లో అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్ట్‌కు ట్రైబ్యునల్‌పై సాధారణ నియంత్రణ కూడా ఉంటుంది.
* దిగువ స్థాయి న్యాయస్థానాల నిర్వహణ, తీరుతెన్నులపై హైకోర్ట్‌కు అజమాయిషీ ఉంటుంది. కింది కోర్ట్‌ల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను హైకోర్ట్ రూపొందించవచ్చు.
* హైకోర్ట్ ప్రత్యేక ఉత్తర్వులతో కింది న్యాయస్థానాల్లోని వివాదాలను ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకు బదిలీచేయవచ్చు లేదా స్వయంగా విచారణకు స్వీకరించవచ్చు.
* పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు, సాధారణ హక్కుల రక్షణకు నిబంధన 226 ప్రకారం ప్రత్యేక రిట్‌లను జారీచేయవచ్చు.

లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)

  కొన్ని కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో సత్వర పరిష్కారానికి, శాశ్వత ప్రాతిపదికన లోక్ అదాలత్‌లకు వీలుకల్పించే లీగల్ సర్వీసెస్ ఆర్బిట్రేషన్ చట్టాన్ని 2002లో రూపొందించారు. సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ 'లోక్ అదాలత్' పేరుతో ప్రజా న్యాయస్థానాల వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* ఈ వ్యవస్థ పేదలకు ఉచితంగా న్యాయం అందించడానికి కూడా కృషిచేస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 70 లోక్ అదాలత్‌లు పనిచేస్తున్నాయి.
* సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయ మూర్తులు లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు సత్వరమే, సంతృప్తికరమైన న్యాయాన్ని అందించడమే వీటి ముఖ్య ఉద్దేశం.
* మోటారు వాహనాల వివాదాలు, ఇన్సూరెన్స్ క్లైమ్‌లు మొదలైన విషయాల్లో లోక్ అదాలత్ తీర్పుతో సంతృప్తి చెందనివారు సాధారణ న్యాయస్థానాలకు వెళ్లవచ్చు.
* వినియోగదారుల ఫోరాలు 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేశాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ ఫోరంలను ఏర్పాటు చేశారు.
* ఇవి మూడు స్థాయుల్లో పనిచేస్తాయి. 20 లక్షల రూపాయల విలువ ఉన్న కేసులు జిల్లా స్థాయిలో జిల్లా ఫోరంల పరిధిలోకి వస్తాయి. 20 లక్షలు దాటిన, కోటి రూపాయల్లోపు రాష్ట్ర ఫోరంల పరిధిలోకి వస్తాయి. కోటి రూపాయల విలువ దాటిన కేసులను జాతీయ స్థాయుల్లో ఉన్న ఫోరాలు పరిష్కరిస్తాయి.
* వినియోగదారులు రూ.100 ఫీజు చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. సాధారణ న్యాయస్థానాల మాదిరిగా న్యాయ ప్రక్రియలు ఉంటాయి.
* 1987లో కుటుంబంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలు - పరిశీలన

1. భారత సమాఖ్య కింది ఏ సందర్భంలో ఏకకేంద్రంగా మారుతుంది?
జ‌: జాతీయ అత్యవసర పరిస్థితిలో
     1) రాష్ట్ర‌శాస‌న‌స‌భ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు
     2) సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో
     3) పార్ల‌మెంటు నిశ్చ‌యించిన్న‌ప్పుడు
     4)జాతీయ అత్య‌వ‌స‌ర ప‌రిస్ధితిలో

2. కిందివాటిలో ఏది ఏకకేంద్ర లక్షణం?
     1) ఏక రాజ్యాంగం      2) దృఢ రాజ్యాంగం      3) లిఖిత రాజ్యాంగం     4) రాజ్యాంగ ఔన్నత్యం
జ‌: 1(ఏక రాజ్యాంగం)

3. భారత సమాఖ్యను 'బలమైన కేంద్రీకృత ధోరణులు గల సమాఖ్య' అని ఎవరు వ్యాఖ్యానించారు?
జ‌: ఐవర్ జెన్నింగ్స్

4. కిందివాటిలో భారత సమాఖ్య ఏకకేంద్ర లక్షణం కానిది?
      1) రాజ్యాంగ అదృఢత్వం                                 2) అఖిల భారత సర్వీసులు
      3) సమగ్ర న్యాయశాఖ                                    4) రాజ్యాంగ ఔన్నత్యం
జ‌: 4(రాజ్యాంగ ఔన్నత్యం)

5. ''రాజ్యాంగంలో ఏకకేంద్రతత్వం ఏర్పాటు కావడానికి ఆర్థిక రంగంలో కేంద్ర ఆధిపత్యం, కేంద్ర గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటంకారణం'' అని పేర్కొన్నది ఎవరు?
జ‌: కె.సంతానం

6. భారత రాజ్యాంగ స్వరూపం ...
జ‌: స్వరూపంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏకకేంద్ర రాజ్యం

7. భారతదేశం లాంటి దేశాలకు సరిపడే ఉత్తమ సమాఖ్య నమూనా?
జ‌: సహకార సమాఖ్య

8. భారత రాజ్యాంగానికి లోబడి అవశేష అధికారాలు ఎవరికి ఉన్నాయి?
జ‌: పార్లమెంటు

9. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించే మూడు జాబితాలను పొందుపరిచారు?
జ‌: ఏడో షెడ్యూల్

Posted Date : 21-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని (NESS) ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1953

2. స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో ఉంటాయి?
జ: రాష్ట్ర జాబితా

3. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటుచేశారు?
జ: మద్రాసు

4. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం?
జ: మేయో తీర్మానం

5. స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించారు?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

6. కిందివాటిని జతపరచండి.
1) సామాజిక అభివృద్ధి పథకం

ఎ) 1959, అక్టోబరు 2

2) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం

బి) 1993, ఏప్రిల్ 24

3) పంచాయతీ రాజ్ వ్యవస్థ

సి) 1952, అక్టోబరు 2

4) నూతన పంచాయతీ రాజ్ వ్యవస్థ

డి) 1953, అక్టోబరు 2

జ: 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

7. కిందివాటిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రం?
          1) కేరళ          2) అసోం          3) నాగాలాండ్        4) త్రిపుర
జ: 3 (నాగాలాండ్)

8. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ?
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

9. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది?
జ: 40వ ప్రకరణ

10. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ
జ: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? (గ్రూప్ 4, 1996)

జ: పంచాయతీలు

2. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ చేసిన సిఫారసు? (గ్రూప్ 4, 1998)
జ: గ్రామ పంచాయతీలను సృష్టించడం

3. భారత స్థానిక స్వపరిపాలనా పితామహుడు (వీఆర్‌వో, 2014)
జ: లార్డ్ రిప్పన్

4. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు? (వీఆర్‌వో, 2014)
జ: 73వ

5. పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంటుంది. అయితే కిందివాటిలో దీనిలో భాగం కానిది? (గ్రూప్ 2, 2016 టీఎస్‌పీఎస్సీ)
జ: అగ్నిమాపక సేవలు

6. భారత్‌లో మొదటిసారి పంచాయతీ రాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 1959, అక్టోబరు 2

7. అశోక్ మెహతా కమిటీ కిందివాటిలో దేన్ని సిఫారసు చేసింది? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: రెండంచెల వ్యవస్థ

8. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో ఎన్ని విషయాలను తెలియజేశారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: 29

9. సాముదాయక అభివృద్ధి కార్యక్రమ అధ్యయనం కోసం నియమించిన కమిటీ? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

10. స్వతంత్ర భారతదేశంలో సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించినవారు? (పంచాయతీ సెక్రటరీ, 2017 ఏపీ)
జ: ఎస్.కె. డే

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు

1. ఆధునిక రాజ్యం అనేది ఒక ....
జ: సంక్షేమ రాజ్యం

2. భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచిన 'గణతంత్ర పదానికి సంబంధించి వాస్తవం ఏది?
1) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
2) దీని అర్థం రాజ్యాధినేతను ప్రజలు ఎన్నుకోవడం.
3) ఇది రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉంది.
4) న్యాయస్థానాలు ఈ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించవచ్చు.
జ: 2(దీని అర్థం రాజ్యాధినేతను ప్రజలు ఎన్నుకోవడం.)

3. భారతదేశం ఒక ...
జ: అర్ధ సమాఖ్య

4. విదేశీ దురాక్రమణలు జరిగినప్పుడు ఏ నిబంధన ద్వారా అత్యవసర పరిస్థితిని విధిస్తారు?
జ: 352

5. మనదేశంలో ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితి ఏది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి
3) రాజ్యాంగబద్ధ అత్యవసర పరిస్థితి
4) పైవేవీ కాదు
జ: 3(రాజ్యాంగబద్ధ అత్యవసర పరిస్థితి)

6. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనదేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయసు ఎంత?
జ: 21 సంవత్సరాలు

7. భారతదేశంలో రాజ్యాధినేత ఎవరు?
జ: రాష్ట్రపతి

8. 'సామ్యవాదం పదం దేన్ని సూచిస్తుంది?
జ: ఆర్థిక విధానాల్లో ప్రభుత్వ కీలక పాత్ర

9. ఇప్పటివరకు రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
జ: ఒకసారి

10. భారతదేశంలో పౌరసత్వం స్వభావం ఏమిటి?
జ: ఏక పౌరసత్వం

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగ హోదా

   ప్రజాస్వామ్య ఆచరణలో విజయం సాధించడానికి, స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికి, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించడానికి, సంక్షేమ పథకాల అమలుకు లబ్ధిదారులను ఎంపికచేయడానికి, నిధులను సక్రమంగా సద్వినియోగం చేయడానికి స్థానిక ప్రభుత్వాలు విశేషమైన కృషిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పాలనకు ఉద్దేశించిన స్థానిక సంస్థలను పంచాయతీరాజ్ వ్యవస్థగా పేర్కొంటారు.

  భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందనేది మహాత్ముడి అభిప్రాయం. గ్రామ స్వరాజ్యం సాధించాలనే గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఉన్న 40వ నిబంధనను చేర్చారు. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న రాష్ట్ర జాబితాలోని 5వ అంశానికి గ్రామ, పట్టణ ప్రాంతాల నిర్మాణం, అధికారాలను చేర్చి, వీటికి సంబంధించిన శాసనాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు.


చారిత్రక నేపథ్యం

  భారతదేశంలో గ్రామ పాలన ప్రాచీన కాలం నుంచి బ్రిటిష్ పాలన కంటే ముందు వరకూ నిరాటంకంగా కొనసాగింది. దీనికి వేదకాలం, మౌర్యులు, చోళుల పాలనా కాలాలను ఉదాహరణగా చెప్పవచ్చు. భారతదేశంలోని స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థను నాశనం చేయకుండా, తమ అధికారాన్ని సుస్థిరం చేయడం సాధ్యంకాదని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆర్థిక, విద్యా విధానాల ద్వారా పథకం ప్రకారం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.


బ్రిటిష్ పాలనాకాలం

  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక అవసరాల రీత్యా 1687లో మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను స్థాపించింది. దీంతో భారతదేశంలో బ్రిటిష్ తరహా స్థానిక ప్రభుత్వాల పాలన ప్రారంభమైంది. 1793 చార్టర్ చట్టం ద్వారా మద్రాసుతో పాటు బొంబాయి, కలకత్తా నగరాల్లో మున్సిపల్ పాలనా వ్యవస్థను ప్రారంభించారు. 1870లో వెలువడిన లార్డ్ మేయో తీర్మానం ప్రకారం స్థానిక సంస్థలకు నిధులతోపాటు, భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు.

* ఆధునిక భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు పితామహుడిగా పేరొందిన లార్డ్ రిప్పన్ 1882లో స్థానిక ప్రభుత్వాలకు పరిపాలనాపరమైన విధులతో పాటు, ఆర్థిక నిధులకు సంబంధించిన అధికారాలను కల్పించారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లాంటి భావాలతో ఉన్న విద్యావంతులైన యువకులు స్థానిక సంస్థల్లో రాజకీయ, పరిపాలనా అనుభవం గడించడానికి ఇది పునాది వేసింది. స్థానిక సంస్థలో అనధికారులకు ఆధిక్యత కల్పించారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1919 స్థానిక సంస్థలను రాష్ట్ర జాబితాలో చేర్చింది. భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా భారతీయులతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడటంతో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడింది.


స్వాతంత్య్రానంతర భారతదేశం

  గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా, వి.టి. కృష్ణమాచారి కమిటీ సిఫారసులకు అనుగుణంగా సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (Community Development Programme) అప్పటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. దీనికి 'ఫోర్డ్ ఫౌండేషన్' అనే సంస్థ ఆర్థిక సహాయం చేసింది. దీన్ని 1952, అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రయోగాత్మకంగా కేవలం 55 బ్లాకుల్లో అమలుచేశారు. ఇదే స్ఫూర్తితో 1953లో 'జాతీయ విస్తరణ సేవ' అనే పేరుతో మరో పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే పైన పేర్కొన్న రెండు కార్యక్రమాలు ఆచరణలో తమ లక్ష్యాలను కొంతమేరకు మాత్రమే సాధించగలిగాయి. సమగ్ర గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రెండు పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడానికి కారణాలను తెలియజేయడానికి, ప్రజలను భాగస్వాములను చేయడానికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి బల్వంత్‌రాయ్ మెహతా అధ్యక్షతన 1957లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో తన నివేదికను 1957 నవంబరులో సమర్పించింది. ఈ కమిటీ సిఫారసులను జాతీయాభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది. ఈ కమిటీ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పాటుచేయాలని పేర్కొంది. వీటికి నిర్ణీత కాలానికి ఎన్నికలు జరగాలని, గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థల ద్వారానే అమలుచేయాలని సూచించింది.

* ఈ కమిటీ సూచనల ఆధారంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లాలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది మూడంచెల వ్యవస్థను ఏర్పాటుచేసింది. అదే స్ఫూర్తితో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మూడంచెల పంచాయతీ వ్యవస్థను ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. అయితే రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన విధానాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో కొన్ని రాష్ట్రాలు నాలుగు అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ఏర్పరచుకున్నాయి. ఉదాహరణకు పశ్చిమ్ బంగ, తమిళనాడులో రెండంచెల వ్యవస్థ, కేరళ లాంటి రాష్ట్రాలు, గోవా, సిక్కిం, త్రిపురల్లో ఒకే అంచె పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో జిల్లా పరిషత్‌కు ప్రాధాన్యమిస్తే, మరికొన్ని రాష్ట్రాలు పంచాయతీ సమితికి ప్రాధాన్యమిచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాధాన్యమివ్వకపోవడం, నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగకపోవడం, అసమర్థత పెరిగిపోవడంతో దేశంలో స్థానిక ప్రభుత్వాల పరిస్థితి గందరగోళంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటుచేశారు.
* పంచాయతీరాజ్ వ్యవస్థలోని లోపాలను సమగ్రంగా పరిశీలించి, పునర్వ్యవస్థీకరించడానికి 1977 డిసెంబరులో అప్పటి జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించింది. ఇది 132 సిఫారసులతో కూడిన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. ఇది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాకు స్థాయిలో మండల పంచాయతీలను (15,000 - 20,000 జనాభా) ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలని సూచించింది. పంచాయతీరాజ్ సంస్థల కాలపరిమితి 4 సంవత్సరాలుగా ఉండాలని, వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించాలని సూచించింది. ఈ కమిటీని నియమించిన జనతా ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం దీని సిఫారసులను పట్టించుకోలేదు. అయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బంగ లాంటి రాష్ట్రాలు కమిటీ సిఫారసులకు అనుగుణంగా రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి.


* ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ సంస్థలను పునరుద్ధరించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఎల్.ఎం.సింఘ్వీ అధ్యక్షతన 1986లో ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి:


* స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించి, కాపాడాలి. దీని కోసం రాజ్యాంగంలో ఒక ప్రత్యేక భాగాన్ని ఏర్పరిచి, గుర్తింపు కల్పించి, వాటి ఉనికిని కాపాడాలి. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్దిష్ట కాల వ్యవధుల్లో ఎన్నికలు నిర్వహించేటట్లు రాజ్యాంగంలో తగిన ఏర్పాట్లు చేయాలి.


* గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీలను ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైన 'గ్రామసభ' ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామ పంచాయతీలకు మరింత ఎక్కువ ఆర్థిక నిధులను సమకూర్చాలి.


* పంచాయతీరాజ్ సంస్థల రద్దు లేదా విధి నిర్వహణకు సంబంధించి ఎదురయ్యే వివాదాలను పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో 'జ్యుడీషియల్ ట్రైబ్యునల్స్‌'ను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది.

1993 తర్వాత స్థానిక సంస్థలు - రాజ్యాంగ హోదా

  73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న 'పంచాయతీరాజ్ దినోత్సవం'  నిర్వహిస్తున్నారు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం: స్థానిక సంస్థలు అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అధికారాలను అతిక్రమించకుండా, గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆశయాలకు ప్రతిరూపమైన 40వ నిబంధనను అమల్లోకి తెచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 'ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం', 'భాగస్వామ్య ప్రజాస్వామ్యం'గా ఆచరణలోకి తేవడానికి అవకాశం కల్పించింది. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు, ఉనికి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై కాకుండా రాజ్యాంగబద్ధ సంస్థలుగా రూపాంతరం చెందడానికి తోడ్పడింది. ప్రాథమిక హక్కుల మాదిరిగా న్యాయార్హమైన జాబితాలో చేరాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్మాణంతో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన బాధ్యతైంది. రాజ్యాంగంలోని IX భాగంలో 'పంచాయతీలు' పేరుతో 243 నుంచి 243(O) వరకు 16 నిబంధనలను ప్రస్తావించారు. దీంతోపాటు రాజ్యాంగానికి XI వ షెడ్యూల్‌ను ఏర్పరిచి, అందులో 243(G) ద్వారా పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించాల్సిన అధికారాలు, బాధ్యతలను తెలిపే 29 అంశాలను పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

  మూడంచెల వ్యవస్థ: మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మధ్య స్థాయి, జిల్లా స్థాయి అనే మూడు అంచెలను ఏర్పరిచారు. అయితే ఏది మధ్య స్థాయి అనేది సంబంధిత రాష్ట్ర గవర్నర్ నోటిఫై చేస్తారు. జిల్లా స్థాయి అంటే రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.

గ్రామసభ

  పంచాయతీరాజ్ వ్యవస్థకు మూల స్తంభమైన 'గ్రామసభ'ను ఏర్పాటు చేస్తారు. ఇందులో గ్రామ పంచాయతీ ప్రాదేశిక పరిధిలో ఉన్న రిజిస్టర్డ్ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన విధులను నిర్వహిస్తుంది. అంతేకాకుండా వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడం దీని ముఖ్య విధి.


సభ్యులు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక


  గ్రామ పంచాయతీ, మధ్య స్థాయి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మండల స్థాయి), జిల్లా స్థాయి సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక (ప్రత్యక్ష/ పరోక్ష) విధానాన్ని సంబంధిత రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. అయితే మధ్య స్థాయికి ఎన్నికైన ప్రాదేశిక సభ్యులు తమలో నుంచి ఒకరిని మధ్య స్థాయి ఛైర్‌పర్సన్‌గా (పరోక్ష ఎన్నిక) ఎన్నుకుంటారు. జిల్లా పరిధిలో ఉన్న ఎన్నికైన జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తమ నుంచి ఒకరిని జిల్లా స్థాయి ఛైర్‌పర్సన్‌గా (పరోక్ష ఎన్నిక) ఎన్నుకుంటారు.

రిజర్వేషన్లు

  మూడు అంచెల్లో ఆయా పంచాయతీల (గ్రామ, మధ్య, జిల్లా స్థాయి) ప్రాదేశిక పరిధిలో ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభాను బట్టి రిజర్వేషన్లను కల్పిస్తారు. సభ్యులు, ఛైర్‌పర్సన్ స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళలకు మొత్తం సభ్యుల స్థానాలు, ఛైర్‌పర్సన్ స్థానాల్లో 1/3వ వంతు తక్కువ కాకుండా రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం ఆయా రాష్ట్రాల విచక్షణకి వదిలేశారు.

కాలపరిమితి

  మూడంచెల్లో పంచాయతీ (గ్రామ, మధ్య, జిల్లా స్థాయి) సంస్థల కాల పరిమితిని 5 సంవత్సరాలుగా నిర్దేశించారు. ఏ కారణంతోనైనా అర్ధాంతరంగా రద్దుచేస్తే తిరిగి 6 నెలల లోపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించి నూతన పంచాయతీని ఏర్పాటుచేయాలి. నిర్దిష్ట కాల పరిమితికి 6 నెలల ముందు రద్దైతే ఈ నిబంధన వర్తించదు. అయితే మధ్యంతరంగా రద్దై దాని స్థానంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ కేవలం మిగిలిన కాలానికి మాత్రమే కొనసాగుతుంది.

అనర్హతలు

పంచాయతీ ఎన్నికలకు (గ్రామ, మధ్య, జిల్లా స్థాయి) పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలుగా చట్టం ద్వారా నిర్ణయించారు. అయితే రాష్ట్ర శాసనసభకు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనర్హతలను నిర్ణయించే అధికారం ఉంటుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం

పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా, ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పరిధిలో జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక కమిషనర్ ఉంటారు. కమిషనర్ పదవీ కాలపరిమితి, సర్వీసు నిబంధనలను రాష్ట్ర శాసనసభ చట్టానికి లోబడి రాష్ట్ర గవర్నర్ నిర్ణయిస్తారు.

ఆర్థిక కమిషన్ 

  ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘం ఛైర్‌పర్సన్, సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఇది రాష్ట్రం, పంచాయతీ సంస్థల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కోసం తగిన మార్గదర్శకాలను రూపొందిస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీ సంస్థలకు గ్రాంట్ఇన్ఎయిడ్ నిర్ణయిస్తుంది. పంచాయతీ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేస్తుంది. అంతేకాకండా గవర్నర్ కోరిన అంశాలపై తగిన సిఫారసులను చేస్తుంది.

మినహాయింపు

  73వ రాజ్యాంగ సవరణ చట్టం, జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు వర్తించదు. అదేవిధంగా మణిపూర్‌లోని జిల్లా కౌన్సిల్, పశ్చిమ్ బంగలోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న గూర్ఖాహిల్ కౌన్సిల్ పంచాయతీ విధులను నిర్వహిస్తాయి.

* పంచాయతీ సంస్థలు నిర్వహించాల్సిన 29 విధులను XIవ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలు - పరిశీలన

  స్వభావాన్ని బట్టి జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాలను ఏకకేంద్ర ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వంగా రాజనీతిజ్ఞులు పేర్కొన్నారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ జాతీయ ప్రభుత్వానికే ఉంటాయి. ఒకవేళ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్న పక్షంలో వాటికి అధికారాన్ని కేంద్రమే ఇస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో రాజ్యాంగమే జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజిస్తుంది. రెండు ప్రభుత్వాలు స్వతంత్రంగా తమతమ పరిధుల్లో పనిచేస్తాయి.
* భారత సమాఖ్య స్వభావం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కె.సి.వేర్ భారత సమాఖ్యను
 'అర్ధ సమాఖ్య' అన్నారు. పాల్ ఆపిల్ బి 'తీవ్రమైన సమాఖ్య'గా అభిప్రాయపడ్డారు.
* మోరిస్ జోన్స్ 'బేరసారాల సమాఖ్య' అని పేర్కొన్నారు. గ్రాన్‌విల్ ఆస్టిన్ 'సహకార సమాఖ్య' గా తెలిపారు.
అలెగ్జాండ్రో విక్జ్ 'సుయిజెనరీస్' (వినూత్న స్వభావం ఉన్నది) అని నిర్వచించారు.
* ఐవర్ జెన్నింగ్స్ 'బలమైన కేంద్రీకృత ధోరణులు ఉన్న సమాఖ్య' అని చెప్పారు. భారత రాజ్యాంగంలో సమాఖ్య మూలసూత్రాన్ని ఉపేక్షించారని కె. సంతానం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల స్వేచ్ఛను మరిచి, ఏకకేంద్ర రాజ్యాన్ని ఏర్పరిచారని సి.రాజగోపాలాచారి విశ్లేషించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.


ఏక కేంద్ర లక్షణాలు


యూనియన్ అనే పదబంధాన్ని ఉపయోగించడం
భారత రాజ్యాంగంలోని మొదటి ప్రకరణలో 'యూనియన్' అనే పదం (Union of States) వాడారు. 'సమాఖ్య' పదం వాడలేదు. ఈ పదం వాడకపోవడానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు.  అవి..
1) దేశ విభజన ఫలితంగా ఏర్పడిన మత వైషమ్యాల కారణంగా రాజ్యాంగ నిర్మాతలు 'యూనియన్' పదప్రయోగమే సముచితమని భావించారు. ఫలితంగా దేశంలో ఒకే విధమైన మానసిక ప్రయోజనం చేకూరుతుందని వారు విశ్వసించారు.
2) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సమాఖ్య పదం ఎందుకు ఉపయోగించలేదో శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఇతర సమాఖ్యల్లా వేర్వేరు రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఏకీకృతం కావడం వల్ల భారత సమాఖ్య ఏర్పడలేదు. ఈ రాష్ట్రాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి కాదు. అన్ని రాష్ట్రాలూ ఆంగ్లేయుల ఆధీనంలోని భారతదేశంలో భాగంగా ఉండేవి. ఇవి భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం ఏర్పడిన భారత సమాఖ్యలో అంతర భాగాలుగా ఉన్నాయి. ఈ వాస్తవాలను స్పష్టం చేయడానికి 'సమాఖ్య' కాకుండా 'యూనియన్' పదాన్ని రాజ్యాంగంలో ఉపయోగించినట్లు అంబేడ్కర్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం రూపొందించే నాటికే ఈ రాష్ట్రాలన్నీ భారతదేశ భూభాగంలో అంతర భాగాలై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాధికారం ఎక్కువై రాష్ట్రాల అధికారం తగ్గడానికి దీన్ని ప్రధాన కారణంగా గుర్తించవచ్చు.


బలమైన కేంద్రం

  రాజ్యాంగంలో అధికార విభజన కేంద్రానికే మొగ్గుచూపుతుంది. రాష్ట్ర జాబితా కంటే కేంద్ర జాబితాలోనే ఎక్కువ అంశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైన అంశాలన్నింటికీ కేంద్ర జాబితాలోనే చోటు దక్కింది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైనా కేంద్రానిదే పైచేయి. చివరగా అవశిష్ట అధికారాలు కూడా కేంద్రానికే చెందుతాయి. అమెరికాలో అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చారు. ఈ అధికార విభజన సమాఖ్య దృష్ట్యా అసమానమైంది.


రాష్ట్రాలు అవిచ్ఛిన్నమైనవి కావు

  ఇతర సమాఖ్యల్లా కాకుండా, భారతదేశంలోని రాష్ట్రాలకు ప్రాదేశిక సమగ్రత హక్కు లేదు. రాష్ట్రాల భూభాగం, సరిహద్దులను పార్లమెంటు ఏకపక్ష చర్యతో మార్చగలదు. ఇలా మార్చడానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రకరణ 3 ప్రకారం ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. కాబట్టి భారత సమాఖ్యను 'విచ్ఛిన్నం కాగల రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న యూనియన్' (an indestructible union of destructible states) గా పేర్కొనవచ్చు. అదే అమెరికా సమాఖ్యనైతే 'అవిచ్ఛిన్న రాష్ట్రాలతో కూడిన అవిచ్ఛిన్న యూనియన్' (an indestructible union of indestructible states) అని వర్ణించవచ్చు.


ఏక రాజ్యాంగం

  సాధారణంగా సమాఖ్యలో కేంద్రంతోపాటు రాష్ట్రాలకు కూడా తమ రాజ్యాంగాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది. కానీ భారతదేశంలో రాష్ట్రాలకు ఈ హక్కు ఇవ్వలేదు. అయితే జమ్మూ- కశ్మీర్ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక రాజ్యాంగం (ప్రకరణం 370) ఉంది.


రాజ్యాంగ అదృఢత్వం

  ఇతర సమాఖ్యల్లా కాకుండా, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368) తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంది. సాధారణ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు ఏకపక్ష చర్యతో రాజ్యాంగంలోని పలు అంశాలను సవరించగలుగుతుంది. పైగా ఈ సవరణలను ప్రారంభించేది కేంద్రమే. కానీ అమెరికాలో రాష్ట్రాలు కూడా సవరణలను ప్రతిపాదించవచ్చు.


రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేదు

  భారత రాజ్యసభలో రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించారు. అమెరికాలోని ఎగువసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్య సూత్రం ఉంది. దీంతో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి చొప్పున అమెరికన్ సెనేట్‌లో 100 మంది సభ్యులు ఉంటారు. ఈ సూత్రం చిన్న రాజ్యాల ప్రయోజనాలను కాపాడుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే భారత రాష్ట్రపతి కళలు, సాహిత్యం, విద్య, సాంఘిక సేవా రంగాలకు సంబంధించి 12 మందిని రాజ్యసభకు నియమించవచ్చు
(ప్రకరణ 80 (3)). ఇది కూడా సమాఖ్య సూత్రాలకు విరుద్ధమే.


ఏక పౌరసత్వం

  ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ, కెనడా మాదిరి భారత రాజ్యాంగం ఏక పౌరసత్వ విధానాన్ని
(ప్రకరణ 5 నుంచి 11) రూపొందించింది. భారతీయ పౌరసత్వం మాత్రమే పౌరులకు ఉంటుంది. ప్రత్యేకంగా రాష్ట్ర పౌరసత్వాలు ఉండవు. దేశంలో ఏ రాష్ట్రంలో జన్మించినా, నివసిస్తున్నా వారికి దేశమంతా సమాన హక్కులు, ఒకే పౌరసత్వం ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి సమాఖ్య రాజ్యాల్లో పౌరులకు ద్వంద్వ పౌరసత్వం అంటే జాతీయ, రాష్ట్ర పౌరసత్వాలు ఉంటాయి.


అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు

  భారత రాజ్యాంగం జాతీయ (ప్రకరణ 352), రాష్ట్ర (ప్రకరణ 356), ఆర్థిక (ప్రకరణ 360) అత్యవసర పరిస్థితులను పేర్కొంది. ఈ అత్యవసర పరిస్థితుల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు సంక్రమిస్తాయి. రాష్ట్రాలు కేంద్ర ఆధిపత్యం కిందకు వస్తాయి. ఇతర సమాఖ్యల్లో ఇలాంటి విధానం లేదు.


అఖిల భారత సర్వీసులు

  అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీసులను కలిగి ఉన్నాయి. భారత్‌లో కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రత్యేక పబ్లిక్ సర్వీసులు ఉన్నాయి. వీటితోపాటు రాజ్యసభకు అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారాన్ని ఇచ్చారు (ఆర్టికల్ 312). ఇవి కేంద్రం, రాష్ట్రాలకు కూడా చెందిన సర్వీసులు. ఈ సర్వీసుల్లోని వ్యక్తుల నియామకానికి సంబంధించిన భర్తీ, శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉంటాయి. నియంత్రణ కూడా కేంద్రానికే ఉంటుంది. గమనించదగ్గ విషయమేమిటంటే రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేసుకుని వాటి నిబంధనలను తయారుచేసుకోవచ్చని 309 ప్రకరణ పేర్కొంది. కానీ 312 వ ప్రకరణ ఈ అధికారాన్ని హరించివేస్తుంది.


రాష్ట్రాలపై కేంద్ర ఆర్థిక నియంత్రణ

  వివిధ పన్నులు కేంద్రం, రాష్ట్రాలకు ఏ విధంగా చెందాలో భారత రాజ్యాంగంలో వివరించారు. ఎక్కువ ఆదాయం లభించే అంశాలను కేంద్ర జాబితాలో చేర్చారు. ఆర్థిక సంఘం (ప్రకరణ 280) రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేస్తుంది. అయితే ఆర్థిక సంఘాన్ని నియమించేది కేంద్రమే. కేంద్రం నుంచి రాష్ట్రాలకు డబ్బు కేటాయించే మరో వ్యవస్థ ప్రణాళికా సంఘం (ప్రస్తుతం దీన్ని రద్దుచేసి,నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు) ఇది కూడా కేంద్ర నియంత్రణలో ఉంటుంది. రాజ్యాంగంలో ఏక కేంద్రతత్వం ఏర్పాటు కావడానికి - ఆర్థిక రంగంలో కేంద్ర ఆధిపత్యం, కేంద్ర గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటం కారణమని కె. సంతానం పేర్కొన్నారు.

సమగ్ర న్యాయశాఖ

  భారతదేశంలో కేంద్ర - రాష్ట్ర చట్టాలను ఏకీకృత న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానిస్తుంది. సుప్రీంకోర్టు అగ్రభాగంగా, దాని కింద హైకోర్టులతో ఒక సమగ్ర న్యాయవ్యవస్థను భారత రాజ్యాంగం ఏర్పరచింది. అయితే అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థ ఉంది. ఫెడరల్ చట్టాలను ఫెడరల్ న్యాయస్థానం, రాష్ట్ర చట్టాలను రాష్ట్ర న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తాయి.

సమగ్ర ఎన్నికల యంత్రాంగం

  భారతదేశంలో ఎన్నికల కమిషన్ (ఆర్టికల్ 324) కేంద్ర శాసనసభ (పార్లమెంట్), రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థను రాష్ట్రపతి పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర లేదు. సభ్యులను తొలగించే విషయంలో కూడా ఇదే పరిస్థితి. అయితే అమెరికాలో ఫెడరల్, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలను నిర్వహించడానికి ప్రత్యేక యంత్రాంగాలు ఉంటాయి.

గవర్నర్ నియామకం

  రాష్ట్రానికి అధినేత గవర్నర్. రాష్ట్రపతి నియమించడం వల్ల గవర్నర్ కేంద్ర ప్రతినిధిగా పనిచేస్తారు. గవర్నర్‌ని తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంది. కేంద్రం గవర్నర్ ద్వారా రాష్ట్రాలను నియంత్రిస్తుంది. మామిడిపూడి వెంకట రంగయ్య, శివయ్య అభిప్రాయంలో 'గవర్నర్ తాను కేంద్రం ప్రతినిధిగా నిర్వహించే పాత్ర ఫలితంగా సమాఖ్య సమతౌల్యాన్ని సాధారణ పరిస్థితుల్లో కేంద్రానికి అనుకూలంగా, అత్యవసర పరిస్థితుల కాలంలో దాన్ని తలకిందులుగాను చేసే అవకాశం కలిగి ఉంటారు'.

సమగ్ర ఆడిట్ యంత్రాంగం

  కేంద్ర ప్రభుత్వ లెక్కలు/ ఖాతాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు/ ఖాతాలను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (ప్రకరణ 148) ఆడిట్ చేస్తారు. ఈ వ్యక్తిని నియమించడం, తొలగించే అధికారం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. అమెరికన్ కంప్ట్రోలర్ జనరల్‌కి రాష్ట్రాల లెక్కలను పర్యవేక్షించే అధికారం లేదు.

రాష్ట్ర బిల్లులపై వీటో

  రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కొన్ని నిర్దిష్టమైన బిల్లులను రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించవచ్చు (ప్రకరణ 201). రాష్ట్రపతి ఆ బిల్లులను మొదటిసారే కాకుండా రెండోసారి కూడా నిలుపుదల చేయవచ్చు. అంటే రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి సస్పెన్షన్ వీటోయే కాకుండా అబ్సల్యూట్ వీటో కూడా ఉంటుంది. కానీ అమెరికా, ఆస్ట్రేలియాల్లోని రాష్ట్రాలకు వాటి పరిధుల్లో స్వయం ప్రతిపత్తి కారణంగా ఇలాంటి ప్రత్యేకమైన అంశం లేదు.

గమనిక: సస్పెన్షన్ వీటో అంటే శాసనసభ సాధారణ మెజారిటీతో తిరిగి పంపిన బిల్లును ఆమోదించడం అబ్సల్యూట్ వీటో అంటే శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉండటం.


రాష్ట్ర జాబితాపై పార్లమెంటు అధికారం


  జాతీయ ప్రయోజనం దృష్ట్యా పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయవచ్చని, రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదిస్తే, పార్లమెంటు సంబంధిత అంశంపై చట్టం చేసే అధికారాన్ని పొందుతుంది (ఆర్టికల్ 249). ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే పార్లమెంటు తన శాసనపరమైన సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేని కాలంలో కూడా పార్లమెంటు ఈ అధికారాన్ని నిర్వహించగలుగుతుంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు

 భారతదేశ ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్లోని విశిష్ట అంశాలను గ్రహించి, వాటిని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి కాలానుగుణంగా సవరణలు చేశారు.


లిఖిత రాజ్యాంగం


  భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. కాబట్టి భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.


అతిపెద్ద రాజ్యాంగం

  ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నింటిలోకి భారత రాజ్యాంగమే అతి పెద్దది, సుదీర్ఘమైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 395 నిబంధనలు లేదా అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణల కారణంగా వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ఐవర్ జెన్నింగ్స్ అభిప్రాయంలో ''భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద వివరణాత్మక రాజ్యాంగం''.


భారత రాజ్యాంగ ఆధారాలు

  భారత రాజ్యాంగ రచనకు అనేక రాజ్యాంగాలు, ఇతర చట్టాలు, రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఆలోచనలు ఆధారాలు అయ్యాయి. అయితే అందులో 2/3వ వంతుకు పైగా కొద్దిపాటి మార్పులతో, యథాతథంగా భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించారు. దీంతో పాటు అనేక ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను స్వీకరించారు.


అమెరికా రాజ్యాంగం: అమెరికా రాజ్యాంగం నుంచి లిఖిత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ ఆధిక్యత, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారం, రాష్ట్రపతి ఎన్నిక, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగింపు, దృఢ రాజ్యాంగ లక్షణం, ఉపరాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షత వహించడం మొదలైనవి గ్రహించారు.


బ్రిటిష్ రాజ్యాంగం: బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వం, సమ న్యాయపాలన, మంత్రివర్గ నిర్మాణం, శాసన నిర్మాణం, శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలు, నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, స్పీకర్ వ్యవస్థ, ఏక పౌరసత్వం, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యుల ప్రత్యేక హక్కులు మొదలైనవి గ్రహించారు.
ఆస్ట్రేలియా రాజ్యాంగం: ఉమ్మడి జాబితా, పార్లమెంట్‌లోని ఉభయ సభల సంయుక్త సమావేశం, వర్తక వాణిజ్యం, అంతర్ రాష్ట్ర రవాణా.


కెనడా రాజ్యాంగం: 'యూనియన్ ఆఫ్ స్టేట్స్', బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వానికి అవశిష్టాధికారాలు ఉండటం మొదలైనవి.


ఐర్లాండ్ రాజ్యాంగం: ఆదేశ సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయడం, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం.


సోవియట్ రష్యా రాజ్యాంగం: ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాల్లోని సామ్యవాద నియమాలు.


దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక.


జపాన్ రాజ్యాంగం: జీవించే హక్కు, చట్టం నిర్ధారించిన పద్ధతి.


ఫ్రెంచ్ రాజ్యాంగం: రిపబ్లిక్, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.


జర్మనీ రాజ్యాంగం: అత్యవసర పరిస్థితి నిబంధనలు.


ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య వ్యవస్థ


  భారత రాజకీయ వ్యవస్థను స్వభావంలో ఏక కేంద్ర ప్రభుత్వంగా, స్వరూపంలో సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని కె.సి.వేర్ 'అర్ధ సమాఖ్య'గా వర్ణించారు. బలమైన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసే అధికారం, రాష్ట్రాల సరిహద్దులను, పేర్లను మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండటం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏక పౌరసత్వం, అధృడ రాజ్యాంగం, ఒకే రాజ్యాంగం, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహించడం, రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం నియమించడం, తొలగించడం, అఖిల భారత సర్వీసులు, రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేకపోవడం, రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్‌కు అధికారం ఉండటం మొదలైన ఏకకేంద్ర లక్షణాలను పొందుపరచడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలు దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అదే విధంగా సమాఖ్య లక్షణాలైన కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార విభజన, రెండు స్థాయుల్లో ప్రభుత్వాలు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర న్యాయశాఖ ద్విసభా విధానం లాంటి వాటిని రాజ్యాంగంలో చేర్చారు.


దృఢ, అదృఢ రాజ్యాంగం

   భారత రాజ్యాంగాన్ని మూడు పద్ధతుల్లో సవరిస్తారు.

1. అదృఢ రాజ్యాంగ పద్ధతిలో సాధారణ మెజారిటీతో సవరించడం: రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, సరిహద్దులు, పేర్లను మార్చడం, పౌరసత్వం మొదలైన అంశాలను పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీతో, సాధారణ చట్టాన్ని సవరించినట్లుగా పార్లమెంట్ సవరించగలదు.
* రాజ్యాంగంలోని XX వ భాగంలోని 368వ నిబంధన రెండు పద్ధతులను సూచించింది. ఇది దృఢ రాజ్యాంగ లక్షణాన్ని పోలి ఉంటుంది.
2. పార్లమెంట్‌కు మెజారిటీ సభ్యులు హాజరై, 2/3వ వంతు సభ్యుల ఆమోదంతో సవరించడం. ఉదాహరణకు ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు మొదలైనవి.
3. పార్లమెంట్‌కు మెజారిటీ సభ్యులు హాజరై వారిలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోపాటు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరించడం. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక, కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్రాల అధికారాలు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అధికారాలు, కేంద్రరాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజ్యాంగ సవరణ విధానం మొదలైనవి.


ప్రవేశిక లేదా పీఠిక

  భారత రాజ్యాంగ మూలతత్వం, సారాంశాన్ని ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు. భారత ప్రజలు సార్వభౌములు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, వివిధ రకాల స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల మధ్య సౌభ్రాతృత్వం కల్పించడమే లక్ష్యంగా రాజ్యం పనిచేస్తుందని అర్థమవుతుంది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ప్రవేశికకు 'లౌకిక, సామ్యవాద, సమగ్రత' అనే మూడు పదాలను చేర్చారు. మథోల్కర్ అభిప్రాయంలో ప్రవేశిక 'రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం'. జస్టిస్ హిదయతుల్లా అభిప్రాయంలో ప్రవేశిక 'రాజ్యాంగానికి ఆత్మ లాంటిది'.


పార్లమెంటరీ ప్రభుత్వం

   భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కార్యనిర్వాహక వర్గం మనుగడ పార్లమెంట్ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గంపై పార్లమెంట్/ శాసనసభకు నియంత్రణ ఉంటుంది. మంత్రిమండలికి సమష్టి బాధ్యత ఉంటుంది.


సార్వజనీన వయోజన ఓటుహక్కు

  భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఉన్న 326వ నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఓటుహక్కు లభిస్తుంది. (61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు పొందడానికి కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు).


ఏక పౌరసత్వం


  రాజ్యాంగంలోని రెండో భాగంలో 5 నుంచి 11 వరకు ఉన్న నిబంధనలు పౌరసత్వం గురించి వివరిస్తాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లోని భారతీయులందరికీ ఒకే పౌరసత్వం (భారతీయ పౌరసత్వం), ఒకే రకమైన హక్కులు ఉంటాయి. దేశ సమైక్యత, సమగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఏక పౌరసత్వం కల్పించారు.


ప్రజాస్వామ్య సామ్యవాదం

  ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా సామ్యవాదాన్ని సాధించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయం. సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఆశయం.


ద్విసభా విధానం

  పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ అనే రెండు సభలు ఉన్నాయి. దిగువ సభ ప్రత్యక్షంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఏక సభా విధానం అమల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్‌ల్లో (7 రాష్ట్రాలు) ద్విసభా విధానం అమల్లో ఉంది.


ఆదేశ సూత్రాలు

  శ్రేయో రాజ్యం లేదా సంక్షేమ రాజ్య స్థాపన భారత రాజ్య ఆశయం. ఈ ఆశయ సాధనకు రాజ్యాంగంలోని Iవ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనల్లో వీటిని పొందుపరచారు. ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు శాసన నిర్మాణం, వాటి అమల్లో మార్గదర్శకంగా ఉంటాయి. అయితే ఇవి న్యాయార్హమైనవి కావు. వీటిని ప్రభుత్వాలు అమలు చేయకపోతే న్యాయస్థానాల ద్వారా పొందలేం.


ప్రాథమిక విధులు

  ఇవి దేశం, సమాజం, పర్యావరణం పట్ల వ్యక్తి నిర్వర్తించాల్సిన విధులను సూచిస్తాయి. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు రాజ్యాంగంలోని IV - A భాగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు. ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. కాబట్టి ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఇవి న్యాయార్హమైనవి కావు.


ఏకీకృత, స్వతంత్ర న్యాయ వ్యవస్థ

  భారతదేశంలో దేశమంతటికీ ఒకే రకమైన న్యాయ చట్టాలు అమల్లో ఉన్నాయి. సుప్రీంకోర్ట్‌కు ఆధిపత్యం కల్పించారు. అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్ట్‌కు, రాష్ట్ర స్థాయిలో హైకోర్ట్‌కు ఆధిపత్యం ఉంటుంది. జిల్లా స్థాయి నుంచి దిగువ కోర్టులు న్యాయ నిర్వహణ చేస్తాయి. అయితే అన్ని కోర్టులూ సుప్రీంకోర్ట్ ఆదేశాలను శిరసావహించాలి. అదేవిధంగా శాసన, కార్యనిర్వాహక శాఖలు విధి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడానికి కావాల్సిన నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్ట్, హైకోర్ట్‌లకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. పైన తెలిపిన అనేక లక్షణాలతో పాటు లౌకిక రాజ్యం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు, స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా లాంటి అనేక విశిష్ట లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలనా సంస్థలు

  గత గ్రూప్−4, వీఆర్‌వో, వీఆర్ఏ, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ తదితర ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు 73, 74 రాజ్యాంగ సవరణలకు ముందున్న కమిటీలు, సిఫారసులు; స్వాతంత్రోద్యమ కాలం నాటి సమాజ వికాస కార్యక్రమాలతోపాటు బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు; నూతన పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోవాలి.


సమాజ వికాస ప్రయోగం - 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు

* స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలే స్థానిక ప్రభుత్వాలు. వీటినే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democracy Decentralisation) అంటారు.
* భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది.
* 'గ్రామ స్వరాజ్యమే రామ రాజ్యం' - గాంధీజీ
* 'దేశ వనరులన్నింటిలో గ్రామీణ వనరులు అతి ముఖ్యమైనవి' - జవహర్‌లాల్ నెహ్రూ
* కేంద్ర ప్రభుత్వం ఎల్.ఎమ్. సింఘ్వీ కమిటీ సూచనల మేరకే పంచాయతీ రాజ్, నగరపాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల (1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది.


చారిత్రక నేపథ్యం


* రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది.
* కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామ కూటమి అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు.
* గ్రామాధికారిని గ్రామణి అని, పది గ్రామాలకు అధిపతిని దశగ్రామణి అని పిలిచేవారు.
* మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వం గురించి ప్రస్తావించాడు.
* చోళుల పరిపాలనా వ్యవస్థను 'ఉత్తర మేరూర్' శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని వేయించిన చోళ చక్రవర్తి మొదటి పరాంతక చోళుడు. ఉత్తర మేరూర్ అనేది తమిళనాడులోని ఒక గ్రామం. చోళులు తాటాకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బాక్సులుగా ఉపయోగించేవారని ఈ శాసనం తెలియజేస్తుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారానికి అయిదుగురు సభ్యులతో కూడిన 'పంచాస్' అనే ఒక మండలి ఉండేది. పంచాస్ అనే పదం తర్వాతి కాలంలో పంచాయతీగా మారిందని ప్రతీతి.
* ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామస్థాయిలో పంచాయతీలు ఉండేవి. భూమిని కొలిచి, దాని ఆధారంగా శిస్తు విధించే విధానాన్ని షేర్షా ప్రారంభించాడు.
* మొగలుల కాలంలో పట్టణ పాలనకు కొత్వాల్ అనే అధికారిని నియమించేవారు. కొత్వాల్‌కు, సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు.


బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలు


* రెండో జేమ్స్ చక్రవర్తి జారీ చేసిన చార్టర్ (1687) ద్వారా పన్నుల వసూలు కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను స్థాపించింది. పన్ను విధింపును ప్రజలు వ్యతిరేకించడంతో 1726లో కార్పొరేషన్ స్థానంలో 'మేయర్ కోర్టుల'ను ఏర్పాటుచేశారు.
* బ్రిటిష్‌వారు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకొని 1772, మే 11న కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు. దీన్ని వారన్‌హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా ఉన్న సమయంలో చేపట్టారు.
* 1793లో మద్రాసు, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు.
* భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన చార్లెస్ మెట్‌కాఫ్ (1835 − 1836) గ్రామీణ సమాజాలను 'లిటిల్ రిపబ్లిక్స్‌'గా అభివర్ణించాడు.
* 1870లో భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
* లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనా పరమైన అధికారాలను బదలాయిస్తూ 1882, మే 18న ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు దీన్ని 'మాగ్నాకార్టా'గా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడు (The father of local self government) అంటారు.
* 1882 − 1884 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం రిప్పన్ మూడంచెల పాలనను సూచించాడు. అవి:
     » కిందిస్థాయిలో గ్రామ పంచాయతీలు
     » మధ్యస్థాయిలో − తాలుకా బోర్డులు
     » పైస్థాయిలో − జిల్లా బోర్డులు
* వీటికి మౌలిక స్వరూపాన్ని కల్పిస్తూ, అభివృద్ధి చేయడం వల్ల లార్డ్ రిప్పన్‌ను స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పేర్కొంటారు.
* స్థానిక ప్రభుత్వాలకు తొలిసారిగా 1884లో మద్రాసు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి.


రాయల్ కమిషన్ (1907)

* స్థానిక సంస్థల పనితీరును సమీక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చార్లెస్ హబ్ హౌస్ నేతృత్వంలో రాయల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ 1909లో నివేదికను సమర్పిస్తూ స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని సూచించింది.
* 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. అవి:
     » జిల్లా బోర్డులు − 207
     » తాలుకా బోర్డులు − 584
* 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించారు.


స్వాతంత్రోద్యమ కాలంలో సమాజ వికాస కార్యక్రమాలు


1) గుర్గావ్ ప్రయోగం (1920)
* 1920లో పంజాబ్‌లోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఎఫ్.ఐ. బ్రేయన్ గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. వ్యవసాయ ఉత్పత్తి, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం; అభివృద్ధి ఫలాలను వ్యవస్థీకరించడం, ఉత్సవాలు, వివాహాలకు అయ్యే ఖర్చును తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం లాంటివి ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935 − 36లో కోటి రూపాయలను దీనికి కేటాయించింది.


2) మార్తాండం ప్రయోగం (1921)
* తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం అనే ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడు స్పెన్సర్ హచ్ నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసి YMCA (Young Mens Christian Association) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ తద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఈ ప్రయోగం చేశారు.

3) శ్రీనికేతన్ ప్రయోగం (1921)
* విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యా బోధనలో భాగంగా సమాజ వికాసానికి కృషి చేశాడు. 1921లో 'ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం' అనే అంశంతో ఒక ప్రయోగాన్ని చేశాడు. దీని ద్వారా చిన్నతరహా కుటుంబ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

4) బరోడా ప్రయోగం (1932)
* బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి ఈ ప్రయోగాన్ని నిర్వహించాడు. రోడ్లు వేయడం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమాభివృద్ధి మొదలైన రంగాల్లో గ్రామీణ యువతను చైతన్యవంతుల్ని చేసి స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాడు.

5) సేవాగ్రామ్ ప్రయోగం (1933)
* మహారాష్ట్రలోని వార్ధాలో ప్రయోగాత్మకంగా సేవాగ్రామ్‌ను స్థాపించారు. ఈ సంస్థ సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలను అనుసరిస్తుంది. ఆచార్య వినోబాభావే, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.

6) ఫిర్కా ప్రయోగం (1946)
* 1946లో అప్పటి మద్రాసు సీఎం టంగుటూరి ప్రకాశం తాలుకాలను ఫిర్కాలుగా విభజించి, వాటి అభివృద్ధికి కొన్ని ప్రయోగాలను చేశాడు. వీటినే ఫిర్కా ప్రయోగాలు అంటారు. 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.

7) ఇటావా ప్రయోగం (1948)
* ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న మహేవా ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే విదేశీ ఇంజినీర్ సహాయంతో 97 గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నించారు. కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను; వ్యవసాయం, చేనేత, పాడి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది.

8) నీలోఖేరి ప్రయోగం (1948)
* ఈ ప్రయోగం ద్వారా హరియణాలోని కర్నాల్ జిల్లాలో ఉన్న నీలోఖేరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా నిరాశ్రయులైన దాదాపు 7 వేల మందికి పునరావాసం కల్పించారు. స్వయంశక్తితో అభివృద్ధి చెందేలా ఎస్.కె. డే నాయకత్వంలో వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్ వర్క్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.

స్వాతంత్య్రం తర్వాత సమాజ వికాస కార్యక్రమాలు

* స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉంది.
* భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలని Grow more food అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (Community Development Programme − CDP) ఏర్పాటుచేసింది.
* ఈ కార్యక్రమాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1952, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* CDP ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో CDPని ప్రారంభించారు.
* కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే భావనను అమెరికా నుంచి స్వీకరించారు.
* ఈ పథకం అమలుకు నాటి అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాడు. 1971 నాటికి ఈ ఫౌండేషన్ భారత్‌కు దాదాపు 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.

CDP ముఖ్యాంశాలు:
* దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో దాదాపు 100 గ్రామాలను చేర్చారు. దీన్ని మొదట 55 బ్లాకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తర్వాత 5011 బ్లాకులకు విస్తరించారు. 70 వేల జనాభాకు ఒక బ్లాకు చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాకుకు ఒక బ్లాకు డెవలప్‌మెంట్ అధికారి (BDO)ని నియమించారు. ఇతడు బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి.
* వ్యవసాయం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహవసతి, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం, గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* CDP కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ సేవక్ అనే అధికారి ఉండేవాడు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extention Service Scheme - NESS):
* జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ఏర్పాటుచేశారు.
* ఈ కార్యక్రమాన్ని మిగిలిన 1700 బ్లాకుల్లో ఏర్పాటుచేశారు.
* CDP, NESS రెండు కార్యక్రమాల ఉద్దేశం, లక్ష్యం ఒకటే. వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది.
* NESS ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి.
* CDP కార్యక్రమాన్ని 3 సంవత్సరాల కాలపరిమితికి, NESS ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేశారు.

CDP, NESS కింద పనిచేసే పాలనా విభాగాలు:
1. కేంద్ర స్థాయి: కేంద్ర సమాజ అభివృద్ధి శాఖ, సహకార మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. కేంద్ర క్యాబినేట్ వీటి విధానాలను రూపొందిస్తుంది.
2. రాష్ట్రస్థాయి: రాష్ట్ర అభివృద్ధి మండలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. దీనిలో రాష్ట్ర సమాజ అభివృద్ధి మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి కమిషనర్ కార్యదర్శిగా (సెక్రటరీ), కమిషనర్ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు.
3. జిల్లాస్థాయి: జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తాడు.
4. బ్లాకుస్థాయి: గ్రామాలను కొన్ని బ్లాకులుగా విభజిస్తారు. ఇది BDO పర్యవేక్షణలో ఉంటుంది.
5. గ్రామస్థాయి: విలేజ్ లెవల్ వర్కర్స్‌ని నియమిస్తారు.

CDP, NESS కి సంబంధించిన వ్యాఖ్యానాలు:
* 'సుశిక్తుడైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం' - ఎస్.కె. డే (NESS, CDP కేంద్ర అడ్మినిస్ట్రేటర్)
* 'నిశ్శబ్ద విప్లవం' - జవహర్‌లాల్ నెహ్రూ
* ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల CDP, NESS కార్యక్రమాలు విఫలమయ్యాయి.
* ప్రజల భాగస్వామ్యం 'ఆర్థిక వికేంద్రీకరణ' పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా కమిటీని నియమించింది.

బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ

* కేంద్రప్రభుత్వం 1957, జనవరి 16న బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని నియమించింది. ఇది 1957, నవంబరు 24న తన నివేదికను సమర్పించింది. జాతీయాభివృద్ధి మండలి (NDC) 1958, జనవరిలో ఈ కమిటీ సిఫారసులను ఆమోదించింది.

ముఖ్యమైన సిఫారసులు:
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
     » గ్రామ స్థాయిలో − గ్రామ పంచాయతీ
     » మండల స్థాయిలో − పంచాయతీ సమితి
     » జిల్లా స్థాయిలో − జిల్లా పరిషత్
* ఈ మూడంచెల మధ్య పరోక్ష ఎన్నికల ద్వారా అంతర్గత సంబంధం ఉండాలని సూచించింది.
* ఎన్నికలను గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా, జిల్లా పరిషత్‌కు పరోక్షంగా నిర్వహించాలి. పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగాలి.
* జిల్లా పరిషత్‌కు కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక, జిల్లా పరిషత్‌కు పర్యవేక్షణ అధికారాలను ఇవ్వాలి.
* మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటిసారిగా రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా సికార్ గ్రామంలో 1959, అక్టోబరు 2న జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 1959, అక్టోబరు 11న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ (ప్రస్తుతం తెలంగాణ), తర్వాత 1959, నవంబరు 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ప్రారంభించారు.
* రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తమిళనాడులో ఏర్పాటుచేశారు.
* నాలుగంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం పశ్చిమ్ బంగ.

పంచాయతీ రాజ్ వ్యవస్థ వర్తించని రాష్ట్రాలు

1) నాగాలాండ్
2) మేఘాలయ
3) జమ్మూ కశ్మీర్ (గూర్ఖా అటానమస్ ప్రాంతాలు)
4) పశ్చిమ్ బంగ (కొండ ప్రాంతాలు)
5) అరుణాచల్‌ప్రదేశ్
6) న్యూదిల్లీ

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - అధికరణలు

* భారత రాజ్యాంగంలోని మొదటి భాగం... అధికరణలు ఒకటి నుంచి నాలుగు వరకు, భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి భూభాగాల పరిధిని గురించి పేర్కొంటాయి. ఈ నాలుగు అధికరణల్లోని అంశాలు, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ, పరిణామక్రమం గురించి తెలుసుకుందాం.

ఒకటో అధికరణ: నామధేయం, భారత భూభాగం
* ఇండియా అంటే భారత్. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. భారతదేశం సమాఖ్య స్వభావాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడా సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించలేదు.

* డా. బి.ఆర్. అంబేడ్కర్ ప్రకారం 'భారత రాజ్యాంగం సమాఖ్య నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ భారతదేశాన్ని యూనియన్‌గా వర్ణిస్తారు.ఎందుకంటే ఇది అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. కాబట్టి భారతదేశాన్ని విభాజిత రాష్ట్రాలున్న అవిభాజ్యమైన యూనియన్‌గా పేర్కొనవచ్చు. భారత యూనియన్ నుంచి విడిపోయే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు.

* ఈ అధికరణం ప్రకారం భారత భూభాగాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు.
* రాష్ట్రాలు, వాటి భూభాగాలు
* కేంద్ర పాలిత ప్రాంతాలు
* భారత ప్రభుత్వం ఆర్జించబోయే ఇతర భూభాగాలు.
* అయితే ఈ యూనియన్‌ను రాష్ట్రాలుగా విభజన అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే అని అర్థమవుతుంది.


రెండో అధికరణ: కొత్త రాష్ట్రాల ఏర్పాటు - విలీనం

* ఈ అధికరణ ప్రకారం ఏదైనా ఒక కొత్త రాష్ట్రం లేదా దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకునే అధికారం భారత పార్లమెంటుకు ఉంది.అంటే భారత భూభాగంలో అంతర్భాగంకాని ప్రాంతాలను విలీనం, ఏర్పాటు గురించి ఈ అధికరణ పేర్కొంటుంది.
* ఈ అధికరణ ప్రకారమే 1954 లో పాండిచ్చేరి, 1961 లో గోవా, 1975 లో సిక్కిం భారతదేశంలో విలీనం అయ్యాయి
మూడో అధికరణ: రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారాకొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పు
* ఈ అధికరణం భారతదేశంలో అంతర్గతంగా మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఈ కింది విధంగా ఉంటుంది.

a) నూతన రాష్ట్రాల ఏర్పాటు.
* ఏ రాష్ట్రం నుంచి అయినా విడిపోయి కొత్త రాష్ట్రంగా అవతరించడం. ఉదా: తెలంగాణ రాష్ట్రం.
* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కొన్ని భాగాలు కలిపి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయడం.

b) రాష్ట్రాల పేర్లు మార్చడం.

c) రాష్ట్రాల సరిహద్దులు మార్చడం.

d) రాష్ట్రాల విస్తీర్ణాన్ని మార్చడం.
* పై విధంగా పునర్‌వ్యవస్థీకరణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశ పెట్టేముందు కింది నిబంధనలను అనుసరించాలి.
* రాష్ట్రపతి పూర్వ సిఫార్సు తర్వాత మాత్రమే ఈ బిల్లును ప్రవేశపెట్టాలి.
* రాష్ట్రపతి ఆ విధంగా సిఫార్సు చేయడానికి ముందుగా దీన్ని సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం నిర్ణీత గడువుతో పంపించాలి.ఆ రాష్ట్ర అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు.
* తర్వాత ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి సాధారణ మెజారిటీతో (హజరై పాల్గొన్న వారితో) చట్టాన్ని రూపొందించవచ్చు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అంటే సిద్ధాంతపరంగా చెప్పాలంటే భారత సమాఖ్యలోని రాష్ట్రాల సమగ్రతకు రాజ్యాంగ రక్షణలేదు.


నాలుగో అధికరణ: షెడ్యూల్ సవరణ, 368 ద్వారా రాజ్యాంగ సవరణ


* 2, 3 అధికరణల ప్రకారం చేసిన చట్టాలు అధికరణ 368 కింద చేసే రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావని పేర్కొంది. అలాగే 2, 3 అధికరణలకు సవరణ చేస్తే ఒకటి, నాలుగో షెడ్యూళ్లకు సవరణ చేయాలని చెబుతోంది.
* అయితే భారత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం అధికరణ-3లో భాగమా? భాగమైతే సాధారణ చట్టం ద్వారా బదిలీ చేయవచ్చా? అనేవి ముఖ్యం. ఈ సందేహం బెరుబరి ప్రాంతాన్ని భారతదేశం బదిలీ చేసే సందర్భంలో వచ్చింది. ఈ సమయంలో సుప్రీంకోర్టు భారత భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం అధికరణ-3 కిందకు రాదనీ, అది అధికరణ 368 ద్వారా మాత్రమే జరగాలనీ నిర్దేశించింది. అంటే ఇలాంటి విషయాలు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరగాలి.
భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం:
* స్వదేశీ సంస్థానాల విలీనం
* బాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థకరణ


స్వదేశీ సంస్థానాల విలీనం:


* భారత స్వాతంత్య్ర చట్టం - 1947 ప్రకారం స్వదేశీ సంస్థానాలకు పాకిస్థాన్ లేదా భారతదేశంలో కలవడానికి కానీ, స్వతంత్రంగా ఉండటానికి కానీ వీలుకల్పించారు. వివిధ పద్ధతుల ద్వారా భారత భూగోళ పరిధిలో ఉన్న 552 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యాయి.


భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ:


* భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనం అనేది తాత్కాలిక పరిణామం. అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలని డిమాండ్లు మొదలయ్యాయి.
* భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అనేది స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే ఉంది. మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ (1919) సంస్కరణల కాలంలోనే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ 1945 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇచ్చింది.
* వీటికి అనుగుణంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందా? లేదా? అనే అంశాలను పరిశీలించడానికి 1948 లో రాజ్యాంగ పరిషత్ ఎస్.కె. థార్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించి, పాలనా సౌలభ్యం మొదలైన అంశాల ప్రాతిపదికపై మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు జరగాలని సూచించింది.
* ఈ నివేదిక పట్ల తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో, భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణను పరిశీలించడానికి నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్యలతో మరో కమిటీని నియమించింది. ఈ కమిటీ పరోక్షంగా భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరిస్తూనే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రత్యేక దృష్టితో చూడాలని పేర్కొంది.
* దీనికి అనుగుణంగా అనేక సంఘటనల తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు భాష మాట్లాడే ప్రాంతంతో, కైలాస్‌నాథ్ వాంఛూ సూచనల ఆధారంగా 1953, అక్టోబరు 1న ''ఆంధ్ర రాష్ట్రం" ఏర్పాటైంది.


రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ - 1953


* భాషాప్రాతిపదికతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు అధికమయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు తగిన సూచనల కోసం ఫజల్ అలీ నాయకత్వంలో కమిషన్‌ను నియమించింది.
* ఈ కమిషన్ తన నివేదికలో 'ఒకే భాష - ఒకే రాష్ట్రం' నినాదాన్ని వ్యతిరేకించింది. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నప్పటికీ, రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించేటప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.
* భారతదేశ సమగ్రత, భద్రతకు భంగం వాటిల్లకూడదు.
* సంస్కృతి, చరిత్రతోపాటు భాషను ఒక అంశంగా మాత్రమే పరిగణించాలి.
* ఆర్థిక, పాలనాంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
* దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* అంతేకాకుండా అంతవరకు ఉన్న నాలుగు రకాల రాష్ట్రాలు (Part - A, B, C, D) లను రద్దుచేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని సూచించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 7 వ రాజ్యాంగ సవరణ ద్వారా 7 వ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది.
* అయితే భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండుతో కాకుండా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధిలో వెనుకబాటు, సంస్కృతి పరిరక్షణ మొదలైన నూతన ధోరణులతో రాష్ట్రాల డిమాండ్లు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. 2014 లో నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో భారతదేశం 29 రాష్ట్రాల యూనియన్ అయింది.
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రత్యేక రాష్టాల డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి....

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో - స్థానిక స్వపరిపాలన - అభివృద్ధి క్రమం

ప్రజల చేతికే పాలనాపగ్గాలు!


ఒక పంచాయతీలో పరిశుభ్రతను ప్రధాని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు. మారుమూల పల్లెకు మంచినీటిని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించలేరు. వేల గ్రామాల్లో విద్యుత్తు, రహదారుల వంటి సౌకర్యాల కల్పన, నిర్వహణ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు కుదిరేపని కాదు. అందుకే ఆ బాధ్యతలన్నింటినీ స్థానిక ప్రజలకే ఇచ్చేశారు. తమను తామే పాలించుకునే రాజ్యాంగబద్ధ అధికారాన్ని అప్పగించేశారు. ఈ పరిణామాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. అందుకోసం ఏర్పాటైనవే స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ద్వారా పాలనాపగ్గాలు ప్రజల చేతుల్లోనే ఉంటాయి. 


స్థానిక సంస్థల ఆవశ్యకత

* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.

* పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.

* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.

* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.


అభివృద్ధి క్రమం


ప్రాచీన భారతదేశంలో: * రుగ్వేదంలో ‘సభ’, ‘సమితి’ అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ద్వారా ప్రజాసంక్షేమ పాలన నిర్వహించేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని పరిపాలనాపరమైన ‘కవలలు’గా పేర్కొన్నారు. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయపరమైన విధులను నిర్వర్తించేవి.

* ఆది కావ్యంగా పేరుపొందిన ‘రామాయణం’లో ‘జనపదం’ అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.

* మహాభారతంలోని ‘శాంతి పర్వం’ ప్రకారం గ్రామీణ పరిపాలనను ‘గ్రామసంఘాలు’ నిర్వహించేవి.

* శుక్రాచార్యుడు రచించిన ‘నీతిశాస్త్రం’ గ్రంథంలో ‘గ్రామాల కామన్వెల్త్‌’ గురించి పేర్కొన్నారు.

* ‘బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన వర్ధిల్లింది’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

* కౌటిల్యుడు తన ‘అర్థశాస్త్రం’ గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించారు. ఈ గ్రంథంలో గ్రామ పరిపాలన అధికారిని ‘గ్రామణి’ అని, పది గ్రామాల పరిపాలనా అధికారిని ‘దశ గ్రామణి’గా పేర్కొన్నారు.

* మన దేశంలో గ్రామీణ పాలనకు ప్రణాళికాబద్ధమైన పునాదులు వేసి, అభివృద్ధి వైపు అడుగులు వేయించారు చోళులు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ‘ఉత్తర మెరూర్‌’ శాసనం ప్రకారం చోళులు కుండలకు రంధ్రం చేసి వాటిని బ్యాలెట్‌ బాక్సులుగా, రంగులు వేసిన తాటి ఆకులను బ్యాలెట్‌ పత్రాలుగా ఉపయోగించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించేవారు.

* చోళుల పాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం ‘పంచాస్‌’ అనే అయిదుగురు సభ్యులతో ఒక మండలి ఉండేది. ‘పంచాస్‌’ పదమే ‘పంచాయతీ’గా పరిణామం చెందింది.


మధ్యయుగంలో: * క్రీ.శ.712లో మహ్మద్‌ బిన్‌ ఖాసిం ‘సింధు’ ప్రాంతాన్ని జయించడం, భారత్‌పై తరచూ మహ్మదీయుల దండయాత్రలు జరగడం వంటి పరిణామాలతో ఇక్కడి స్థానిక స్వపరిపాలనకు విఘాతం కలిగింది.

* దిల్లీ సుల్తాన్‌ల పరిపాలనా కాలంలో గ్రామీణ ప్రాంతాల పాలనకు ‘పంచాయతీలు’ ఉండేవి. కానీ అవి పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తితో కొనసాగలేదు.

* షేర్షా పాలనా కాలంలో భూమిని కొలిచి దాని ఆధారంగా శిస్తు విధించే విధానం, గ్రామీణ స్థానిక సంస్థల పరిపాలన కొనసాగేవి.

* మొగలుల హయాంలో స్థానిక పాలనకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ‘పంచాయతీలు’ తీసుకునేవి. వీరి పాలనా కాలంలో పట్టణ పాలనాధికారి ‘కొత్వాల్‌’. అతడికి సహకరించేందుకు ‘మున్సబ్‌’ అనే అధికారి ఉండేవారు.

* ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, ఫ్రెంచివారు, డచ్‌వారు వర్తకం కోసం భారత్‌లోకి ప్రవేశించడం, వారి మధ్య జరిగిన ఘర్షణలు, వారు భారతీయులతో చేసిన యుద్ధాలు తదితరాలన్నీ భారత్‌లో స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన దుష్ప్రభావం చూపాయి.


ఆంగ్లేయుల పాలనా కాలంలో: * ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలంలో ప్రజల నుంచి పన్నుల వసూళ్లే లక్ష్యంగా 1687లో మద్రాసులో తొలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. పన్నుల విధింపును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1726లో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదులుగా ‘మేయర్‌’ కోర్టులను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కోర్టులు పాలనా వ్యవహారాల కంటే న్యాయ సంబంధ విధులకే ప్రాధాన్యం ఇచ్చేవి.

* 1772లో వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ‘జిల్లా’ను ఒక పరిపాలనా యూనిట్‌గా చేసుకుని, భూమిశిస్తు వసూలు లక్ష్యంగా ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ప్రవేశపెట్టారు.

* 1793 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం బొంబాయి, మద్రాసు, కలకత్తా పట్టణాల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు చట్టబద్ధత కల్పించారు.

* 1813 నాటి చార్టర్‌ చట్టం ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు.

* 1861 నాటి ‘ఇండియన్‌ కౌన్సిల్‌’ చట్టం ప్రకారం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు.

* 1870లో లార్డ్‌ మేయో ప్రవేశపెట్టిన ‘ఆర్థిక వికేంద్రీకరణ’ విధానం, మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు పునాదిగా నిలిచింది.

* చార్లెస్‌ మెట్‌కాఫ్‌ భారతదేశ గ్రామీణ సమాజాలను ‘లిటిల్‌ రిపబ్లిక్స్‌’గా అభివర్ణించారు.


లార్డ్‌ రిప్పన్‌ చొరవ


* 1882, మే 18న లార్డ్‌ రిప్పన్‌ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఒక తీర్మానాన్ని వెలువరిస్తూ ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను వాటికి బదిలీ చేశారు. ఈ తీర్మానాన్ని భారతదేశ స్థానిక స్వపరిపాలన చరిత్రలో ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. దాని ద్వారా భారత్‌లోని స్థానిక స్వపరిపాలనకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. అందుకే లార్డ్‌ రిప్పన్‌ను ‘భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు’గా పేర్కొంటారు.

రిప్పన్‌ తీర్మానం ప్రకారం స్థానిక సంస్థలను వర్గీకరించారు. అవి 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీలు 2) మధ్య స్థాయి - తాలుకా బోర్డులు 3) ఉన్నత స్థాయి - జిల్లా బోర్డులు.

స్థానిక సంస్థలకు సంబంధించి బెంగాల్‌ మున్సిపాలిటీల చట్టం - 1884, బెంగాల్‌ స్థానిక ప్రభుత్వాల చట్టం - 1885, బెంగాల్‌ స్థానిక గ్రామీణ స్వయంపాలన చట్టం - 1919 లాంటివి కీలకమైనవి.


రాయల్‌ కమిషన్‌ (1907)


  భారత్‌లో స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును సమీక్షించి, తగిన సిఫార్సులు చేయడానికి 1907లో చార్లెస్‌ హబ్‌హౌస్‌ అధ్యక్షతన ‘రాయల్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ 1909లో నివేదిక సమర్పించింది. ఇందులోని అంశాలు:

- ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలి. మూడు స్థాయుల్లో ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.

- ప్రాథమిక విద్య (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) బాధ్యతను పురపాలక సంఘాల (మున్సిపాలిటీ)కు అప్పగించాలి.

- ప్రతి గ్రామానికీ ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి.

- జనాభా ఆధారంగా పురపాలక సంస్థలను ఏర్పాటు చేయాలి.

- పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టంగా అమలుచేయాలి.


మింటో - మార్లే సంస్కరణలు (1909)


  రాయల్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.స్థానిక పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 


మాంటేగ్‌-ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం (1919)


* ఈ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ‘స్థానిక స్వపరిపాలన’ను రాష్ట్ర జాబితాలోకి మార్చారు.

* స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లభించింది.

* 1919 నాటికి మన దేశంలోని జిల్లా బోర్డుల సంఖ్య 207. తాలుకా బోర్డుల సంఖ్య 584.


భారత ప్రభుత్వ చట్టం-1935


* ఈ చట్టం ద్వారా మన దేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ‘స్వయంప్రతిపత్తి’ కల్పించారు. వాటి పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ సంస్థలకు సభ్యులు ‘నామినేట్‌’ అయ్యే విధానాన్ని రద్దు చేశారు. ‘జిల్లా బోర్డు’లో రాష్ట్రాలకు పూర్తిస్థాయి స్వాతంత్య్రం కల్పించడంతో స్థానిక స్వపరిపాలన సంస్థల స్వావలంబన సాధ్యమైంది.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం 1937లో రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవడం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిస్థితి అయోమయంగా మారింది.


స్వాతంత్య్రానంతరం


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన సమయంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

గాంధీజీ - ఆలోచనలు

* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని గాంధీజీ పేర్కొన్నారు. భారతదేశ ప్రగతికి గ్రామాలు పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని ఆయన అన్నారు. * ప్రాచీన భారతంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న రిపబ్లిక్‌లుగా కొనసాగేవన్నారు.

ప్రారంభ రాజ్యాంగంలో 

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం IVవ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో (ఆర్టికల్‌ 40) గ్రామ పంచాయతీల ఏర్పాటును పేర్కొన్నారు. వీటి ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పేర్కొన్నారు. దీనిలో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.


పీవీ హయాంలో రాజ్యాంగ హోదా

* పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా ‘పంచాయతీరాజ్‌ వ్యవస్థ’కు రాజ్యాంగ భద్రత కల్పించారు. ఈ చట్టంతో రాజ్యాంగానికి IXవ భాగం చేర్చి, దానిలో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు పంచాయతీరాజ్‌/గ్రామీణ స్థానిక స్వపరిపాలనా సంస్థల విధివిధానాలను పేర్కొన్నారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను వివరించారు.

* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగానికి IX(A) భాగాన్ని చేర్చి దానిలో ఆర్టికల్, 243(P) నుంచి  243(ZG) వరకు పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థల పరిపాలనను వివరించారు.

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగానికి కొత్తగా 12వ షెడ్యూల్‌ను చేర్చి, అందులో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ - రాజ్యాంగ భద్రత

సుపరిపాలనకు.. సుస్థిర ప్రగతికి!

పాలనలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసే లక్ష్యంతో, గ్రామాలకు సాధికారతను సమకూర్చే ఉద్దేశంతో, అధికార వికేంద్రీకరణ ప్రధానంగా ఒక విశిష్ట వ్యవస్థ ఆవిర్భవించింది. దానికి రాజ్యాంగ భద్రతను కల్పించారు. పాలకుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు, పల్లె సీమల్లో సుస్థిరాభివృద్ధిని, సుపరిపాలనను నెలకొల్పేందుకు ఆ వ్యవస్థ దోహదపడుతోంది. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు దాని పూర్వాపరాలు, రాజ్యాంగ సవరణ చట్టంతో అందులో వచ్చిన మార్పుల వివరాలను తెలుసుకోవాలి. 

స్థానిక స్వపరిపాలనా సంస్థలు సమర్థంగా పనిచేయాలంటే వాటికి రాజ్యాంగ భద్రత అవసరం. రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట నియమాలను రూపొందించి, తగిన అధికారాలు, విధులు, ఆర్థిక వనరులను అందిస్తే గ్రామాల పాలన సక్రమంగా సాగుతుంది. గ్రామీణుల ఆకాంక్షలు నెరవేరతాయి. ఈ మహోన్నత లక్ష్య సాధన దిశలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు విశేష కృషి జరిగింది.

గాంధీజీ భావనలు

గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని, భారతదేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని గాంధీజీ సూచించారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న ‘రిపబ్లిక్‌’ల తరహాలో వర్ధిల్లేవని పేర్కొన్నారు.

* గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 40 ‘గ్రామ పంచాయతీల’ ఏర్పాటును పేర్కొంటుంది. వీటిద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరిగి, ప్రజల భాగస్వామ్యం పెంపొందుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పొందుపరిచారు. స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటు బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.

రాజ్యాంగ భద్రత ప్రయత్నాలు

ఎల్‌.ఎం.సింఘ్వీ, పి.కె.తుంగన్‌ కమిటీల సిఫార్సు మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించింది. కానీ రాజ్యసభలో బిల్లు వీగిపోవడంతో చట్టరూపం దాల్చలేదు. * విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్‌) ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు 70వ రాజ్యాంగ సవరణ బిల్లును 1990, సెప్టెంబరు 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో బిల్లు వీగిపోయింది.

పీవీ హయాంలో సాకారం:  పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న ఈ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. దీనికి దేశంలో 17 రాష్ట్రాల శాసనసభలు కూడా అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ 1993, ఏప్రిల్‌ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ‘ఏప్రిల్‌ 24’ను ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 ద్వారా రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు జరిగాయి.1) రాజ్యాంగానికి 9వ భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు (మొత్తం 16 ఆర్టికల్స్‌) పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధివిధానాలను సమగ్రంగా నిర్దేశించారు. 2) రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 243: పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించిన నిర్వచనాల గురించి వివరిస్తాయి. వీటిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెలువరిస్తారు. 

ఆర్టికల్‌ 243 (ఎ)- గ్రామసభ: గ్రామ పంచాయతీ పరిధిలోని రిజిస్టరైన ఓటర్లందరూ ‘గ్రామసభ’లో సభ్యులవుతారు. గ్రామసభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. సర్పంచి అందుబాటులో లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామసభ సమావేశాలను సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.

* గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్‌ 14, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అందులో విఫలమైతే ‘సర్పంచి’ తన పదవిని కోల్పోతారు. అలా పదవి కోల్పోయిన వ్యక్తికి సంవత్సరం పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు ఉండదు.* గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 మంది లేదా కనీసం 10 శాతం మంది గ్రామసభ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా కోరితే ‘సర్పంచి’ తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయాలి. * భారత ప్రభుత్వం 2009-10 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించి దేశవ్యాప్తంగా గ్రామసభల ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

గ్రామసభ - అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక నివేదికలను పరిశీలిస్తుంది.

* గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.

* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా నిలుస్తుంది.

* వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

* గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.

* మన గ్రామసభను పోలిన వ్యవస్థ స్విట్జర్లాండ్‌లోనూ ఉంది. దాని పేరు ‘ల్యాండ్స్‌ గెమెండ్‌’

ఆర్టికల్‌ 243(బి)(1)- పంచాయతీ రాజ్‌ వ్యవస్థాపన:  దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) మధ్య/ బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్తు.

ఆర్టికల్‌ 243(బి)(2):  ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక/బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితుల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆర్టికల్‌ 243(సి):- సభ్యుల, అధ్యక్షుల ఎన్నిక విధానం: * మూడు స్థాయిల్లో (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు) సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగుతో ఎన్నుకుంటారు. * గ్రామ పంచాయతీ (దిగువ స్థాయి) అధ్యక్ష/ సర్పంచి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించుకోవచ్చు. ఎలా నిర్వహించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * పంచాయతీ సమితి/బ్లాకు (మాధ్యమిక స్థాయి), జిల్లా పరిషత్తు (ఉన్నత స్థాయి) అధ్యక్షుల ఎన్నిక విధానం పరోక్షంగా ఉండాలి. * గ్రామ పంచాయతీ అధ్యక్షులు/ సర్పంచులు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ లేని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ అధ్యక్షులు/సర్పంచులు ‘జిల్లా పరిషత్తు’లో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ (పంచాయతీ సమితి) ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక వ్యవస్థ/బ్లాకు కు చెందిన అధ్యక్షులు జిల్లా పరిషత్తులో సభ్యులుగా కొనసాగుతారు. * లోక్‌సభ సభ్యులు, విధానసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలోని మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్తుల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.* రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు తాము ఓటరుగా నమోదైన జిల్లాలోని జిల్లా పరిషత్తు, మాధ్యమిక వ్యవస్థలలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.

ఆర్టికల్‌ 243(డి)- రిజర్వేషన్లు: * పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వారికి ఇచ్చిన రిజర్వేషన్లలో ఆయా వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేయాలి.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.

* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం - బిహార్‌

* కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2022, మార్చి 31 నాటికి మన దేశంలో 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లున్నాయి. 

* స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఇప్పటివరకు ఆమోదించలేదు.

సుప్రీంకోర్టు తీర్పు: అబ్దుల్‌ అజీజ్‌ అసాద్‌ జు( స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రపదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మహిళలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 1/3వ వంతు స్థానాలను రిజర్వ్‌ చేయడం అనేది ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు’ అనే నిబంధనకు వ్యతిరేకం కాదు అని పేర్కొంది.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వారికి (ఓబీసీ) రిజర్వేషన్లు నిర్దేశించలేదు. ఈ వర్గాల వారికి ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభల అభీష్టానికి వదిలిపెట్టారు.

* ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* అరుణాచల్‌ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జనాభా లేని కారణంగా ఆ రాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేశారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మండల పరిషత్‌

 సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

మండల స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థే మండల పరిషత్‌. స్థానిక స్వపరిపాలనలో ఇది కీలక అంచె. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గ్రామాల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ, ఎగువ సంస్థలైన పంచాయతీలు, జిల్లా పరిషత్‌కు అనుసంధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు మండల పాలన జరిగే విధానాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రెండో అంచె మండల పరిషత్‌. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న ‘మాధ్యమిక వ్యవస్థ’ ఇది.

నేపథ్యం: 1978లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్‌ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. అవి మండల పరిషత్, జిల్లా పరిషత్‌. దీనిలో మండల పరిషత్‌ అత్యంత కీలకమైన అంచె.

* మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబరు 2).

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1986లో ‘ఏపీ మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం’ రూపొందించింది. అది 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు.

వివరణ: ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్‌.  ప్రతి మండల పరిషత్‌లో సుమారు 35 వేల నుంచి 50 వేల జనాభా, 25 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

ఎంపీటీసీ: 

* ప్రతి మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా (ఎంపీటీసీ) విభజిస్తారు.

* ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

* ప్రతి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలు సుమారు 3,500 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

* మండల పరిషత్‌లో ఉండాల్సిన కనీస ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సంఖ్య 23.

* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో ఆప్టెడ్‌ సభ్యుడిగా (ఎంపీటీసీ) నామినేట్‌ చేస్తారు.

* ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి వేరే మండల పరిషత్‌ నుంచి పోటీ చేయకూడదు.

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక: ఎంపీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ఎంపీపీ) పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి.

రిజర్వేషన్లు: 

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్దేశించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గం మహిళలకు 1/3వ వంతు కల్పించాలి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

* వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ఆధారంగా నిర్ణయిస్తారు.

* ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

ఎన్నికలు: 

* ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఎంపీటీసీ ఎన్నికల బ్యాలట్‌ పత్రం రంగు - గులాబీ.

అర్హతలు-అనర్హతలు:

 * ఎంపీటీసీగా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సంబంధిత మండల పరిషత్‌ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* స్థానిక సంస్థలకు బకాయిపడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులు పోటీకి అనర్హులు.

కాలపరిమితి: 

మండల పరిషత్‌ కాలపరిమితి 5 సంవత్సరాలు. 

* ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల కాలపరిమితి 5 సంవత్సరాలు. 
* ఏదైనా కారణంతో ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించి, సంబంధిత ఖాళీలను భర్తీ చేయాలి.

రాజీనామా: ఎంపీటీసీలు, కో-ఆప్టెడ్‌ సభ్యుడు, మండల అధ్యక్షుడు (ఎంపీపీ), మండల ఉపాధ్యక్షుడు (వైస్‌ ఎంపీపీ) తమ రాజీనామాలను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)కి సమర్పించాలి.

మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు:

* మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు)

* మండల పరిషత్‌ పరిధిలోని శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)

* మండల పరిషత్‌ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)


మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు:

1) జిల్లా కలెక్టర్‌

2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు

3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌

4) మండల పరిషత్‌ పరిధిలోని సర్పంచ్‌లు.

మండల పరిషత్‌ - అధికారాలు - విధులు:

* గ్రామ పంచాయతీల సాధారణ విధుల నియంత్రణ

* పశు సంపద అభివృద్ధి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం

* వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు కృషి

* ప్రజల సహకారంతో వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు

* మండల పరిషత్‌ నిధులతో వివిధ రకాల ట్రస్టులను నిర్వహించడం

* రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సమర్పించడం

* గ్రామీణ పారిశుద్ధ్య వసతుల పెంపుదలకు కృషి

* వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం

* మండల పరిషత్‌ పరిధిలో రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి

* స్వయంసహాయక పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు

* ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ

* అగ్నిప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణ

* సమాచార కేంద్రాలు, రైతు కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు

* సహకార రంగ పటిష్టతకు కృషి

* సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు

* మహిళా, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* అంటరానితనం నిర్మూలన, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి

* సాంఘిక సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పథకాలు అమలు పరచడం

మండల పరిషత్‌ అధ్యక్షుడు-అధికారాలు-విధులు

* మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* ఈయన మండల పరిషత్‌కు ప్రథమ పౌరుడు, రాజకీయ అధిపతి.

* మండల పరిషత్‌ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

* మండల పరిషత్‌ తీర్మానాల అమలులో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)పై నియంత్రణ ఉంటుంది.

* ప్రజాసంక్షేమం దృష్ట్యా అత్యవసర పనులు చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశిస్తారు.

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు-అధికారాలు-విధులు:

* అధ్యక్షుడు మండల పరిషత్‌కు హాజరుకానప్పుడు ఆ బాధ్యతలను నిర్వహించడం.

* మండలాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం.

* అధ్యక్షుడు లిఖితపూర్వకంగా బదిలీ చేసిన అధికార విధులు నిర్వహించడం.

అవిశ్వాస తీర్మానం, తొలగింపు:  

* ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అవిశ్వాస తీర్మానంతో తొలగించొచ్చు.

* మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇలా వైదొలిగినవారు రెండేళ్ల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయలేరు.

మండల పరిషత్‌ - ఆర్థిక వనరులు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.

* భూమి శిస్తు, వినోదపు పన్ను.

* ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డు మొదలైన సంస్థలు సమకూర్చే గ్రాంట్లు.

* సాముదాయక అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లు.

* మండల పరిషత్‌ విధించే ఫీజులు, సెస్సులు.

* గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్‌ వసూలు చేసే మొత్తం.

* మండల పరిషత్‌లోని జనాభా సంఖ్య లెక్కన ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

* జిల్లా పరిషత్‌ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా.

* మండల పరిషత్‌ విధించే పన్నులు, సర్‌ఛార్జీలు.

* వివిధ వర్గాల నుంచి లభించే విరాళాలు.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)

* ఎంపీడీఓ మండల పరిషత్‌కు పరిపాలనా అధిపతి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్‌-1 స్థాయి అధికారి.

* మండల పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* మండల పరిషత్‌ తీర్మానాలను అమలు చేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వుల అమలు కోసం కృషి చేస్తారు.

* నెలకోసారి మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

* మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు ఉంటాయి.

* మండలాధ్యక్షుడిని సంప్రదించి మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

* మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

* మండల పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కానీ తీర్మానాల విషయంలో ఓటు హక్కు ఉండదు.

* మండల పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఎంపీడీవోపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భార‌త రాజ్యాంగ స్వ‌భావం

రాజ్యాంగం అంటే
ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టం. దీనిలో ప్రభుత్వ విభాగాలు, దాని స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అనేది లేకపోతే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.


రాజ్యాంగం - మూలాలు

ప్రపంచంలో రాజనీతిని శాస్త్రీయంగా మొదటిసారిగా అధ్యయనం చేసినవారు గ్రీకు దేశీయులు. రాజనీతిశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించి, వివరించాడు.


ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. అయితే ఇది పరిణామాత్మక రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం అవతరించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటారు.


దృఢ రాజ్యాంగం

ఏదైనా రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3వ లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.


అదృఢ రాజ్యాంగం

ఏదైనా రాజ్యాంగాన్ని సాధారణ మెజార్టీ ద్వారా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం.
రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు క్రీ.శ.1787 నాటి అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్.
మన దేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించిన భారతీయుడు ఎమ్.ఎన్. రాయ్ (1934) కాగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును ప్రతిపాదించిన తొలి రాజకీయ పార్టీ స్వరాజ్యపార్టీ. 1942 నాటి క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా ప్రతిపాదించింది. 1918 డిసెంబరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


గాంధీజీ అభిప్రాయం


గాంధీజీ 1922, జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు ఇచ్చే భిక్షకాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు" అని అన్నారు. 'రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించగలదు' అని పేర్కొన్నారు. 1937లో ఫైజాపూర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.


రాజ్యాంగ అభివృధ్ధి క్రమం


భారత రాజ్యాంగ అభివృధ్ధి క్రమాన్ని బి.సి. రావత్ అనే పండితుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. అవి:
    1. మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    2. రెండో దశ: క్రీ.శ.1773 నుంచి 1858 వరకు
    3. మూడో దశ: క్రీ.శ.1858 నుంచి 1909 వరకు
    4. నాలుగో దశ: క్రీ.శ.1909 నుంచి 1935 వరకు
    5. అయిదో దశ: క్రీ.శ.1935 నుంచి 1947 వరకు
    6. ఆరో దశ: క్రీ.శ.1947 నుంచి 1950 వరకు


మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు


క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని దక్కించుకుంది.
ఈస్టిండియా కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా క్రీ.శ.1773 నాటికి 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది.
అవి: 1) మద్రాసు
     2) బొంబాయి
     3) బెంగాల్
క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయం సాధించి, భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. క్రీ.శ.1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్లేయులు మొగల్ చక్రవర్తి నుంచి దివానీ హక్కులు పొందారు. ఈస్టిండియా కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడేది.
ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈస్టిండియా కంపెనీలో భారీగా అవినీతి జరగుతుందని పేర్కొంటూ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేసింది.


రెండో దశ: 1773 నుంచి 1858 వరకు


రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం చేయడం అని అర్థం. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి మనదేశంలో బ్రిటిష్‌వారు మొదటగా చేసిన చట్టం ఇది.


రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యాంశాలు


* ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773, మే 18న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.
* ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ (E.I.C.)కి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది.
* ఈ చట్టాన్ని అనుసరించి మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకువచ్చారు.
* బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు.
* వారన్ హేస్టింగ్స్ 1773 అక్టోబరు 20న బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
* వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే మనదేశంలో 1772లో కలెక్టర్ పదవిని సృష్టించారు.
* ఈ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
* ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులను నియమించారు. వారు:

 

* బెంగాల్ గవర్నర్ జనరల్‌కు సలహా ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అందులో క్లావెరింగ్, బార్‌వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్‌సన్ ఉన్నారు.


సెటిల్‌మెంట్ చట్టం - 1781


* ఈ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్‌వారు అధికారికంగా మనదేశంపై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు.


పిట్స్ ఇండియా చట్టం - 1784


* ఈ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ప్రయత్నించారు.
* ఈ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ కాలంలో 1784లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టం అనే పేరు వచ్చింది.
* బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ఉన్న సమయంలో ఈ చట్టాన్ని చేశారు.


పిట్స్ ఇండియా చట్టంలోని ముఖ్యాంశాలు


* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనాంశాలను 2 రకాలుగా విభజించారు.

 

1. వ్యాపార వ్యవహారాలు:


* వీటి నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.


2. రాజకీయ వ్యవహారాలు


* వీటి నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ పాలన, న్యాయం, శాంతిభద్రతలు లాంటి వ్యవహారాలను ఇది నియంత్రిస్తుంది.
* ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డ్ ఆదేశాలను భారతదేశానికి తెలియజేసేది.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.


చార్టర్ చట్టం - 1793


* చార్టర్ అంటే 'ఒప్పందం' అని అర్థం.
* ఈ చట్టాన్ని గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కాలంలో చేశారు.
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను మరోసారి 20 సంవత్సరాలు పొడిగించారు.
* గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించేవారు.
* కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో సభ్యుడు కాదు.


చార్టర్ చట్టం - 1813


* ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
* ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా) బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపార అవకాశాలను కల్పించారు.
* స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని అప్పగించారు.
* భారతదేశంలో విద్యావ్యాప్తికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేటాయించారు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు.
* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
* ఇది మనదేశంలో మతమార్పిడులకు కారణమైంది.
* కంపెనీ ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించారు.
* ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిని మరింత విస్తృతపరచారు.


చార్టర్ చట్టం - 1833


* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లపాటు పొడిగించారు.
* బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు.
* దీని ఫలితంగా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా మారారు.
* ఇతడికి సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు.
* రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి, కార్యనిర్వహణ అధిపతియైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలను అప్పగించారు.
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులను నాలుగుకు పెంచి, అందులో ఒక న్యాయ సభ్యుడు ఉండేలా సవరణ చేశారు.
* మొదటి న్యాయ సభ్యుడిగా మెకాలేను నియమించారు.
* తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కంపెనీ ఆధీనంలో నుంచి తొలగించారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్‌బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు; భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పించారు.
* దీని వల్ల బ్రిటిష్ వలస రాజ్య స్థాపనకు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను ఏర్పరిచారు. దీని మొదటి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలేను నియమించారు.
* భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో ప్రతిభ ఉన్న భారతీయులను నియమించాలని రాజా రామ్ మోహన్‌ రాయ్ మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
* ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు.


చార్టర్ చట్టం - 1853


* ఈస్టిండియా కంపెనీ పాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం.
* ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరుచేశారు.
* శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పరిచారు.
* ఇది బ్రిటిష్ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని మినీ పార్లమెంటు అంటారు.
* సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా భారతీయులకు అనుమతి కల్పించి సార్వజనీన పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో నలుగురిని మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
* శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయాధికారం మాత్రం గవర్నర్ జనరల్‌దే.
* వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
* కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధిని పేర్కొనక పోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఈ చార్టర్ చట్టం అవకాశం కల్పించింది.
* 1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
* 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ సమర్థవంతంగా అణిచివేయలేదని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. 1858 నుంచి బ్రిటిష్ రాజు / రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం ప్రారంభమైంది. అందుకే 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పేరొందాయి.


మూడో దశ: 1858 నుంచి 1909 వరకు


భారత ప్రభుత్వ చట్టం: 1858


*1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేత అనంతరం 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది.


అందులోని మఖ్యాంశాలు:


* ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు ప్రకారం ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు.
* భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయిగా మార్చారు.
* భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి అనే పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తారు. మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ కానింగ్.
* బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయిగా ఆ వ్యక్తి వ్యవహరిస్తారు.
* వైస్రాయి దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి. ఇతడు దేశ పాలనను బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తాడు.
* ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయింది.
* భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
* ఇంగ్లండ్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు.
* భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ కేబినెట్‌లో భాగంగా భారతదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తాడు.
* భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని (కౌన్సిల్) ఏర్పాటు చేశారు.
* మొదటి భారత రాజ్య కార్యదర్శి: చార్లెస్ ఉడ్.
* భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారు.
* ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా లాంటిదిగా అభివర్ణించింది.
* ఈ చట్టం ద్వారా మనదేశంలో 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయ్యింది.
* ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది.
* భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానంలో భాగంగా క్రమానుగత శ్రేణి పద్ధతి కింది విధంగా ఉంది.


కౌన్సిల్ చట్టం: 1861


* ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది.
* 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. దీనిలో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు.
* భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరుమీద చట్టాలను రూపొందిచడం వల్ల ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు.
* 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మనదేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్దత కల్పించారు.
* ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్‌ఫోలియో విధానం అంటారు.
* 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1866లో అలహాబాద్‌లో నాలుగో హైకోర్టును ఏర్పాటు చేశారు.
* 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేసిన బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు బీజాలు వేశారు.
* గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం కల్పించారు.
* 1862లో వైస్రాయి లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు దేవ్ నారాయణ్‌సింగ్, పాటియాలా రాజు నరేంద్రసింగ్, సర్ దినకర్ రావు ఉన్నారు.
* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.

కౌన్సిల్ చట్టం: 1892


* 1885లో మనదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ (I.N.C.) ఏర్పడి జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో పోరాడి ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
* మితవాదులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ భారతీయ మేధావులను చైతన్యపరచి ప్రజాఉద్యమాన్ని నిర్మించారు. వీరిని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులు 1892 కౌన్సిల్ చట్టాన్ని చేశారు.


ఈ చట్టంలోని ముఖ్యాంశాలు


* ఈ చట్టం ద్వారా మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, 16 మందికి మించకుండా, అలాగే రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
* లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయి, గవర్నర్ల కౌన్సిళ్లలో స్థానం కల్పించారు. కౌన్సిల్‌లో ఆరుగురు భారతీయులకు ప్రాతినిధ్యం దక్కింది. వారు:
     1. సురేంద్రనాథ్ బెనర్జీ
     2. దాదాభాయ్ నౌరోజీ
     3. గోపాలకృష్ణ గోఖలే
     4. ఫిరోజ్‌షా మెహతా
     5. రాస్‌బిహారి ఘోష్
     6. బిల్‌గ్రామీ

* ఈ చట్టం ద్వారా శాసనమండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు.
* ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ప్రశ్నలు అడగడానికి గవర్నర్, గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమే అని భావించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.

 

ఈ దశలోని మరికొన్ని ముఖ్యాంశాలు
* లార్డ్ మెకాలే కృషి వల్ల భారత్‌లో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.
* మెకాలే లా కమిషన్ చైర్మన్‌గా అనేక చట్టాలను క్రోడీకరించారు.

* 1854 నాటి ఉడ్స్ డిస్పాచ్ భారత్‌లో ఆంగ్ల విద్యావిధానానికి మాగ్నాకార్టాగా పేరొందింది.
* కారన్ వాలీస్ భారత్‌లో సివిల్ సర్వీసులకు ఒక రూపం తీసుకొచ్చారు.
* లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది.
* 1906లో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ ఢాకాలో ముస్లింలీగ్‌ను ఏర్పరిచాడు. దీని మొదటి అధ్యక్షుడు ఆగాఖాన్.
* 1907లో సూరత్‌లో రాస్‌బిహారి ఘోష్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

నాలుగో దశ: 1909 - 1935

భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో - మార్లే సంస్కరణలు: 1909
* 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం, భారత్‌లో ఉద్ధృతమవుతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడం, మితవాదులను సంతృప్తిపరచడం అనే లక్ష్యాల సాధనగా 1909లో మింటో మార్లే సంస్కరణలు చేశారు.
* ఆనాటి భారత వైస్రాయి మింటో, భారత రాజ్య కార్యదర్శి మార్లే పేర్లతో ఈ చట్టాన్ని చేయడం వల్ల దీన్ని మింటో - మార్లే సంస్కరణల చట్టం అంటారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
* వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు.
* మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్లలో సభ్యత్వ సంఖ్యను 50కి; పంజాబ్, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
* గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు:
     1. నామినేటెడ్ అధికార సభ్యులు
     2. నామినేటెడ్ అనధికార సభ్యులు
     3. హోదారీత్యా సభ్యులు
     4. ఎన్నికైన సభ్యులు
* వైస్రాయి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా (న్యాయసభ్యుడు).
* 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ కృషి మేరకు మనదేశంలో ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునేందుకు వీలైంది. అందుకే లార్డ్ మింటోను భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు. ఈ విధానం 1947లో దేశ విభజనకు పునాది వేసింది.
* శాసనసభలో బడ్జెట్‌తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని భారతీయులకు కల్పించారు.
* ఈ చట్టం ద్వారా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను నిర్దేశించారు.
* 1911లో రెండో లార్డ్ హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిగా కలకత్తాకు బదులు దిల్లీని నిర్దేశించారు.
* మింటో మార్లే చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఇది కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించింది. ఈ చట్టం హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.

 

మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం: 1919
* భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫర్డ్ ఈ చట్టాన్ని రూపొందిచడం వల్ల దీనికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని పేరు వచ్చింది.

 

ఈ చట్టం రూపొందించడానికి కారణాలు
* 1916 ఏప్రిల్‌లో పుణె కేంద్రంగా బాలగంగాధర తిలక్, సెప్టెంబరులో మద్రాస్ కేంద్రంగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత జాతీయోద్యమాన్ని బలోపేతం చేయడం.
* 1909 నాటి మింటో మార్లే సంస్కరణల చట్టం భారతీయులను సంతృప్తి పరచలేకపోవడం.
* 1919, ఏప్రిల్ 13న పంజాబ్‌లో జనరల్ డయ్యర్ వికృత చేష్ట జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలను చల్లబరచడం.
* రౌలత్ చట్టాన్ని గాంధీజీ BLACK ACT (నల్ల చట్టం)గా అభివర్ణించి 1919, ఏప్రిల్ 6న జాతిని అవమానించిన దినంగా పాటించాలని భారతీయులకు పిలుపు నివ్వడం.

మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టంలోని ముఖ్యాంశాలు
* భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ విధానం ప్రారంభమైంది.
* భారత రాజ్య కార్యదర్శి వేతనాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటన్ నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి:

 

1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ)
* దీనిలో 60 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 34 మంది ఎన్నికైనవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేసినవారు ఉంటారు.
* వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
* దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
* దీనికి గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

2. లెజిస్లేటివ్ కౌన్సిల్ (దిగువ సభ)
* ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికైనవారు కాగా, 41 మంది నామినేటెడ్ సభ్యులు.
* ఈ సభ పదవీకాలం 3 సంవత్సరాలు.
* ఈ సభకు తొలి అధ్యక్షుడు - విఠల్‌భాయ్ పటేల్, తొలి ఉపాధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా.
* కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలను 1921లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలుగా విభజించారు.

1. కేంద్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 47 అంశాలను చేర్చారు.
* జాతీయ ప్రాముఖ్యం గల అంశాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ఉదా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, రక్షణ, కరెన్సీ, ఎగుమతులు, దిగుమతులు.

 

2. రాష్ట్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 51 అంశాలను చేర్చారు.
* ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
ఉదా: ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, రోడ్డు రవాణా, నీటిపారుదల.
* ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy)ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. అవి:

 

1. రిజర్వ్‌డ్ జాబితా
* దీనిలో మొత్తం 28 పాలనాంశాలను నిర్దేశించారు.
* అత్యంత ప్రాధాన్యం ఉన్న అధికారాలు, ఆదాయమున్న విత్తం, భూమిశిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
* ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనాంశాలను కార్యనిర్వాహక మండలి సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

 

2. ట్రాన్స్‌ఫర్డ్ జాబితా
* దీనిలో మొత్తం 22 అంశాలు ఉంటాయి.
* అధికారాలు లేని, ప్రాముఖ్యం లేని కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలను దీనిలో చేర్చారు.
* స్థానిక పాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం దీనిలో ఉన్నాయి.
* రాష్ట్ర గవర్నర్లు ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. వీరు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
* చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
* చట్టసభల్లో క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతపరిచారు.
* ఆస్తి, పన్నులు చెల్లించే ప్రాతిపదికపై పరిమిత ఓటుహక్కును కల్పించారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటుచేశారు.
* లండన్‌లో భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు. లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
* 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) ఏర్పాటు చేశారు.
* కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య; అంతర్ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇచ్చారు.
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి లీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 1926లో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి.
* రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేశారు.
* మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం కేవలం మనదేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.


1919 చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా పరిపాలన కింది విధంగా ఉంది.


 

1919 చట్టంపై ఉన్న విమర్శ:
* ''నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కరూ నేరుస్థులే" - గాంధీజీ.
* ఈ చట్టం సూర్యుడు లేని ఉదయం లాంటిది అని బాలగంగాధర్ తిలక్ అభివర్ణించారు.
* 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
* ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
* భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది చాలావరకు దూషించే మాట అయింది. ''ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నీవు డైయార్కివి అని అనడం విన్నాను" అని సర్ బట్లర్ అనే రచయిత పేర్కొన్నాడు.
* ద్వంద్వ పాలనను ఎప్పుడూ ఆదర్శంగా భావించలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే (రచయిత) పేర్కొన్నాడు.
* ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీ మాన్ కమిటీ సమర్థించింది.

 

సైమన్ కమిషన్: 1927
* 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించేందుకు నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్ 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను నియమించాడు.
* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
* సైమన్ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
    1) 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు
    2) 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్ 6 వరకు
* సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.

 

సైమన్ కమిషన్ నివేదికలో ముఖ్యాంశాలు:
* భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
* 1919లో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
* మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించాలి.
* భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పరచాలి.
* భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
* సార్వత్రిక వయోజన ఓటుహక్కు సాధ్యం కాదు.
* ప్రాథమిక హక్కులను నిరాకరించారు.
* కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించాలి.
* అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్)తో కూడుకున్న స్వాతంత్య్రాన్ని తిరస్కరించాలి.
 సైమన్ కమిషన్ నివేదిక అనేది భారతదేశ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనం అని కూప్లాండ్ (రచయిత) పేర్కొన్నాడు.
 1935లో చేసిన భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫారసులను పొందుపరిచారు.

 

నెహ్రూ నివేదిక : 1928
* సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించడంతో... భారతరాజ్య క్యార్యదర్శి లార్డ్ బిర్కెన్‌హెడ్ 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువ సభలో ప్రసంగిస్తూ ''భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా'' అని భారతీయులకు సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు:
* భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి.
* కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించాలి.
* ఇందులో 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు.
* దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* పంజాబ్, బెంగాల్‌లోని ప్రత్యేక మత నియోజక వర్గాలను రద్దు చేయాలి.
* అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి.

 

దీపావళి ప్రకటన:
* సైమన్ కమిషన్ నివేదికపైనా, భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపైనా చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని... భారత్‌కు త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న ఒక ప్రకటన చేశాడు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.
* 1929లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లేబర్ పార్టీ గెలుపొంది రామ్‌సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్‌తో సంప్రదింపులు జరిపాడు. సైమన్ కమిషన్‌ను భారతీయులు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాడు. లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.

 

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. దీనిలో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
* ఈ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున ఎమ్.ఆర్ .జయకర్, మూంజే; ఉదారవాదుల తరఫున తేజ్‌బహదూర్ సప్రూ, చింతామణి, బి.ఆర్. అంబేడ్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా హాజరయ్యారు.
* ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీని ఇవ్వనందున భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. కాంగ్రెస్ పాల్గొనక పోవడం వల్ల ఈ సమావేశం విఫలమైంది. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటించాడు.

 

గాంధీ - ఇర్విన్ ఒప్పందం:
* కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే తాము నిర్వహించే సమావేశాలు సఫలం కావని గుర్తించిన ఆంగ్లేయ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీని ఒప్పించాలని వైస్రాయి ఇర్విన్‌ను ఆదేశించింది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీని విడుదల చేయడంతో 1931, మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు.

 

దీనిలోని ముఖ్యాంశాలు:
* రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
* కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
* తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
* శాసనోల్లంఘన ఉద్యమంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం.

 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీజీ హాజరయ్యారు. స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది ప్రతినిధులు, మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరఫున బి.ఆర్.అంబేడ్కర్ పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆంగ్లేయులు విభజించు -  పాలించు సూత్రాన్ని పాటించడం వల్ల గాంధీ సమావేశం నుంచి ఉపసంహరించుకుని భారత్‌కు రావడంతో ఆంగ్లేయులు అతడిని అరెస్ట్ చేశారు.

కమ్యూనల్ అవార్డు: 1932
* ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ కారాగారంలో 1932, సెప్టెంబరు 20న ఆమరణ నిరాహర దీక్షకు పూనుకున్నారు. దీంతో గాంధీజీ - అంబేడ్కర్ మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం - 1932 అంటారు. దీని ఫలితంగా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డు కులాలకు అవకాశాలు లభించాయి. కమ్యూనల్ అవార్డు షెడ్యూల్డ్ కులాలను దళితులుగా పేర్కొంది.

 

మూడో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిన్నా, అంబేడ్కర్‌లతో సహా మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్‌లిత్‌గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటుకు చెందిన సెలెక్ట్ కమిటీ పరిశీలించి... 1934, నవంబరు 11న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించింది. ముస్లిం లీగ్ సమాఖ్య అనే భావనను తిరస్కరించి, ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించింది.

5వ దశ: 1935 - 1947

భారత ప్రభుత్వ చట్టం - 1935
* బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో సమగ్రమైంది, భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైంది.
* 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదం పొందిన అతిపెద్ద చట్టం.
* ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
* ఈ చట్టం 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 70 శాతం పైగా అంశాలను ఈ చట్టం నుంచి గ్రహించారు. అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదని హస్రత్ మొహాని పేర్కొన్నాడు.
* భారతదేశంలో బాధ్యతాయుతమైన పాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా ప్రకటించారు.

 

చట్టంలోని ముఖ్యాంశాలు:

అఖిల భారత సమాఖ్య ఏర్పాటు:
* సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మనదేశంలో ఆంగ్లేయులు సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికార విభజన జరిగింది.
ఎ) కేంద్ర జాబితా: దీనిలో రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న 59 అంశాలు ఉన్నాయి.
బి) రాష్ట్ర జాబితా: దీనిలో నీటిపారుదల, వ్యవసాయం, విద్య, స్థానిక పాలన లాంటి ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 54 అంశాలు ఉన్నాయి.
సి) ఉమ్మడి జాబితా: దీనిలో వివాహం, విడాకులు, వారసత్వం లాంటి 36 అంశాలు ఉన్నాయి.
పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్‌కు బదలాయించారు.
రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలను రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
ఎ) రిజర్వ్‌డ్ జాబితా: దీనిలో ప్రాధాన్యం గల అధికారాలు, ఆదాయమున్న అంశాలు చోటుచేసుకున్నాయి. వీటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్‌కు అధికారం కల్పించారు.
బి) ట్రాన్స్‌ఫర్డ్ జాబితా: అధికారాలు, ఆదాయం లేని; అంతగా ప్రాధాన్యం లేని అంశాలను ఈ జాబితాలో చేర్చారు. దీనిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీటిని భారతీయ మంత్రులకు అప్పగించారు.
కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు.

ఎ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్:
  ఎగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 260. దీనిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు.

 

బి) లెజిస్లేటివ్ అసెంబ్లీ:
* దిగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 375.

 

రాష్ట్రాల్లో ద్విసభా విధానం
* ఈ చట్టం ద్వారా భారత్‌లోని రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
* భారత్‌లోని మొత్తం 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
అవి: 1. అస్సాం
     2. బెంగాల్
     3. బీహార్
     4. ఉత్తర్‌ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్)
     5. మద్రాస్
     6. బొంబాయి

* 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దుచేశారు.
* రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి... రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.


 

ఫెడరల్ కోర్టు:
* ఢిల్లీలో 1935, అక్టోబరు 1న ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇది 1937 నుంచి పని విధానాలను ప్రారంభించింది.
* మనదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టినందున కేంద్రం - రాష్ట్రాలు; దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది.
* దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
* మొదటి ప్రధాన న్యాయమూర్తి - మారిస్ గ్వేయర్.
* ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్‌లోని ప్రీవి కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ఓటు హక్కును విస్తృతపరిచి, జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపజేశారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరుచేశారు.
* ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
* భారతదేశంలో ఆర్థిక విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
* కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్‌కు పంపే అధికారాన్ని కల్పించారు.
* సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
* భారత రాజ్య కార్యదర్శికి సలహాను ఇచ్చే భారత కౌన్సిల్‌ను రద్దు చేశారు.
* 1937 నుంచి భారత ప్రభుత్వ చట్టం - 1935 అమల్లోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.
* 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* 1939, అక్టోబరులో బ్రిటిష్ వైఖరికి నిరసనగా 8 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన అంశం ప్రాంతీయ స్వపరిపాలన.

 

1935 చట్టంపై విమర్శలు
''ఇది పొట్టి మనుషులు (పిగ్మీస్) కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం (రాక్షస స్తంభం)" - విన్‌స్టన్ చర్చిల్
''భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం" - కె.టి. షా
''మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది" - మహ్మద్ అలీ జిన్నా
''ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం" - సుభాష్ చంద్రబోస్

 

లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు: 1940
* భారత గవర్నర్ జనరల్, వైస్రాయి అయిన లార్డ్ లిన్‌లిత్‌గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆగస్టు ప్రతిపాదనలు అంటారు.

ముఖ్యాంశాలు:
* రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనే విషయాన్ని పరిశీలించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
* రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించాలి.
* అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
* వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతపరచడం.
* ఆగస్టు ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

 

క్రిప్స్ ప్రతిపాదనలు: (1942)
    రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ యుద్ధంలో భారతీయ సైన్యాల సహకారం పొందేందుకు క్రిప్స్ ప్రతిపాదనలు అనే పేరుతో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తన కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారత్‌కు పంపాడు. 1942, మార్చి 22న భారత్‌కు వచ్చిన క్రిప్స్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

* భారత ప్రజల ప్రతిపాదన అయిన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
* బ్రిటిష్‌వారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ, దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరించాలని అని పేర్కొన్నారు.
* భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి (పాక్షిక స్వాతంత్య్రం) కల్పిస్తామని ప్రకటించారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
* 1942, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ Do or Die నినాదాన్ని ఇచ్చారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ''దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేది వేసి ఇచ్చిన ఒక చెక్కు లాంటిది" అని వ్యాఖ్యానించారు. (Post - dated cheque drawn on the crashing bank).

సి.ఆర్.ఫార్ములా: 1944
* 1944 మార్చిలో కాంగ్రెస్ తరఫున ముస్లిం లీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం, సమష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిధ్ధిస్తుంది అనే భావనతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ఫార్ములాను రూపొందించారు.
ఈ సూత్రాన్ని రాజగోపాలాచారి తన The way out pamphlet అనే కరపత్రాల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

 

సి.ఆర్.ఫార్ములాలోని ముఖ్యాంశాలు
* భారతదేశం స్వాతంత్య్రం కోరడాన్ని ముస్లిం లీగ్ ఆమోదించాలి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలి.
* దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పాకిస్థాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనీ, మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి.ఆర్.ఫార్ములాలో పేర్కొన్నారు.
* ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) ను చేపట్టే ముందుగానే అన్ని పార్టీలకు దేశ విభజనపై వారి అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కల్పిస్తారు.
* విభజన కారణంగా ప్రజలు తరలిపోవాల్సి వస్తే అది వారి అభీష్టం మేరకే జరగాలి.
* ఒకవేళ విభజన సంభవిస్తే దేశ రక్షణకు, వాణిజ్యానికి, ఇతర ముఖ్య ప్రయోజనాలకు పరస్పర ఒడంబడికలు జరగాలి.
* పాకిస్థాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను వ్యతిరేకించాయి.

 

అమేరి - వేవెల్ ప్రణాళిక: 1945
  భారత వ్యవహారాల కార్యదర్శి అమేరి, భారత వైస్రాయి లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి, రూపొందించిన ప్రతిపాదనలను అమేరి - వేవెల్ ప్రణాళిక అంటారు.
దీనిలోని ముఖ్యాంశాలు:
* గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఇచ్చారు.
* దేశ సార్వభౌమ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఉంటూ మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు కల్పించడం.
* భారతదేశంలో బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక హై కమిషనర్‌ను నియమించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయుడితో నింపడం.
* ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయడం.

సిమ్లా సమావేశం (Simla Conference): 1945
* వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు వైస్రాయి వేవెల్ 1945, జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
* కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడం కోసం భూలాభాయ్ దేశాయ్ (కాంగ్రెస్), లియాఖత్ అలీఖాన్ (ముస్లిం లీగ్) మధ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* భారత ముస్లింలకు ప్రతినిధిగా ముస్లిం లీగ్‌ను మాత్రమే పరిగణించాలని... లీగ్ సభ్యులు కాని ముస్లింలను రాజ ప్రతినిధి కార్యనిర్వాహక కౌన్సిల్‌లో చేర్చుకోరాదని మహ్మద్ అలీ జిన్నా పట్టు పట్టారు.
* పాకిస్థాన్ ఏర్పాటు గురించి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్, స్వాతంత్య్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుంచి నిష్క్రమించాయి.

 

కేబినెట్ మిషన్ (మంత్రిత్రయ రాయబారం): 1946
   రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధాని అయ్యారు. 1946, మార్చిలో బ్రిటన్ ప్రధాని అట్లీ పార్లమెంటులో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అందులోని సారాంశం:
1. అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు గుర్తింపు ఉంది.
2. అల్ప సంఖ్యాకులు నిర్భయంగా జీవించాల
3. అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా అనుమతించలేం.

క్లెమెంట్ అట్లీ భారత్‌కు పంపిన మంత్రిత్రయ రాయబారం లోని సభ్యులు:
     1. సర్ పెథిక్ లారెన్స్ (ఛైర్మన్)
     2. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ (సభ్యుడు)
     3. ఎ.వి. అలెగ్జాండర్ (సభ్యుడు)
* కేబినెట్ మిషన్ 1946, మే 16న తన ప్రణాళికను వెలువరించింది.

 

కేబినెట్ మిషన్‌లోని ముఖ్యాంశాలు:
* భారతీయులు తమను తాము పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి భారతీయులతో ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
* బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర శాసనసభలతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారు.
* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తు‌కు తమ ప్రతినిధులను పంపే అవకాశం కల్పించారు.
* ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి.
* కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
* ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటవుతాయి.
* పాకిస్థాన్ దేశ ఏర్పాటును తిరస్కరించింది.
* అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని 14 మంది సభ్యులతో ఏర్పాటుచేయడం జరుగుతుంది.
* 1946, సెప్టెంబరు 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్ 1946, అక్టోబరు 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది.

 

1946 నాటి తాత్కాలిక ప్రభుత్వంలోని మంత్రులు - శాఖలు


 

క్లెమెంట్ అట్లీ ప్రకటన: 1947
  బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1947, ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948, జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు.
  ఈ ప్రకటనను మహాత్మాగాంధీ బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా ప్రశంసించారు.


 

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947
* లార్డ్ వేవెల్ స్థానంలో 1947, మార్చి 22న గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియమితుడయ్యాడు.
* ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకుని మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు.
* భారతదేశం రెండు డొమినియన్లుగా ఏర్పాటవుతుంది. హిందువులు ఎక్కువగా నివసించేవారు ఇండియన్ యూనియన్‌గా, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం పాకిస్థాన్‌గా అవతరిస్తాయి.
* స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.
* అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా బెంగాల్, పంజాబ్‌లను మతప్రాతిపదికపై విభజించారు.
* బెలుచిస్థాన్, వాయవ్య ప్రాంతాలు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
* బ్రిటన్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్థాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
* మౌంట్‌బాటన్ పథకాన్ని ముస్లిం లీగ్ స్వాగతించగా, భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంలో జిన్నా ఒక ప్రకటన చేస్తూ దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకుంటే ధ్వంసం చేస్తాం అని వ్యాఖ్యానించాడు. జిన్నా ప్రకటనతో దేశంలో తీవ్ర హింస చెలరేగి, దేశ విభజన అనివార్యమైంది.
* ఈ సందర్భంలో ఢిల్లీలో జరిగిన మత సంఘర్షణ, హింస, రక్తపాతాలు గాంధీజీని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. మహాత్ముడు బాధాతప్త హృదయంతో దేశ విభజనకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు.
* సింధు రాష్ట్రం పాకిస్థాన్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* అస్సాంలోని సేలట్ జిల్లాలో వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాకిస్థాన్‌లోనే విలీనం కావాలని అభిప్రాయం వచ్చింది.
* జునాగఢ్‌లో రెఫరెండం నిర్వహించగా భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్‌ను పాకిస్థాన్‌లోనూ, పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లోనూ విలీనం చేయాలని తీర్మానించింది.
* మౌంట్ బాటన్ పథకాన్ని డిక్కి బర్డ్ పథకమని అంటారు.

భారత స్వాతంత్య్ర చట్టం: 1947
  ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చివరి చట్టం ఇది. లార్డ్ మౌంట్ బాటన్ సలహామేరకు భారత స్వాతంత్య్ర బిల్లును 1947, జులై 4న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా జులై 15న బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. 1947, జులై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించగా 1947, ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.

 

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* 1947, ఆగస్టు 14న గురువారం పాకిస్థాన్ ఏర్పడింది.
* 1947, ఆగస్టు 15న శుక్రవారం భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
* ఇండియా, పాకిస్థాన్ దేశాల కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటయ్యాయి.
* మౌంట్ బాటన్ భారతదేశానికి, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్‌కు గవర్నర్ జనరల్స్‌గా నియమితులయ్యారు.
* రెండు దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్‌లు తాత్కాలిక పార్లమెంట్లుగా వ్యవహరిస్తాయి.
* సొంత రాజ్యాంగాలను రూపొందించుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి, పరిపాలన ఉంటుంది.
* రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్ క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది.
* ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు.
* క్లెమెంట్ అట్లీ ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఉదాత్తమైంది, ఉత్తమమైందిగా అభివర్ణించాడు.
* భారత స్వాతంత్య్రాన్ని దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతజాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ద ట్రిస్ట్ విత్ డిస్టినీ (విధితో ఒప్పందం) అంటారు.
* స్వాతంత్య్రం నాటికి దేశంలో 562 సంస్థానాలుండగా, వాటిలో 554 భారత్‌లో విలీనం అయ్యాయి.
* స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దయింది.
* భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దయింది.
* బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
* ట్రావెన్‌కోర్ సంస్థానం ఎలాంటి షరతులు విధించకుండా భారత్‌లో విలీనమైంది.
* జునాఘడ్, జమ్మూకశ్మీర్ సంస్థానాలు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయం) ద్వారా భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనమైంది.

 

వ్యాఖ్యానాలు:
    ''ప్రపంచం ఆదమరచి నిద్రిస్తున్న ఈ అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ, భారతజాతి మేల్కొంటోంది. ఈ మేల్కొలుపు ఏనాడో విధితో చేసుకున్న ఒప్పందం" - నెహ్రూ
ఇలా జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ఈ ఉపన్యాసాన్ని ఆనాడు ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

''మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా, ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయ సిద్ధి కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి" - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

 

1947, ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం



     నెహ్రూ ప్రజాస్వామిక స్వభావం మొదటి మంత్రిమండలి కూర్పులో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందని ప్రముఖులను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారు:
    1. డా.బి.ఆర్. అంబేడ్కర్
    2. సీహెచ్. బాబా
    3. జాన్ ముత్తాయ్
    4. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ
    5. షణ్ముగం షెట్టియార్

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ నిర్మాణం

   భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా పరోక్షంగా ఎన్నికైనవాళ్లే. జాతీయోద్యమంలో భాగంగా ఏర్పడిన విలువలకు అద్దం పడుతూ, భారత ప్రజల చిరకాల వాంఛ అయిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, న్యాయం లాంటి రాజనీతి భావాలకు ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగ రచన కొనసాగింది. భారతదేశ ప్రజలు 'రాజ్యాంగ పరిషత్' ఏర్పరచుకుని, తద్వారా రాజ్యాంగ రచన కొనసాగించాలని తొలుత ఎం.ఎన్.రాయ్ అభిప్రాయపడ్డారు.
       1930 - 32 మధ్యకాలంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయులకు ప్రత్యేక రాజ్యాంగం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1940 ఆగస్టులో (ఆగస్టు ప్రతిపాదన) భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును బ్రిటన్ సూచనప్రాయంగా అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ అధినేత అట్లీ భారత దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అంగీకరించారు. అంతకు ముందే, అంటే 1942లో క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిషర్లు తమ ఉద్దేశాలను మార్మికంగా తెలిపారు. ఆ తర్వాత 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్ సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.


రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు...


       1946 జూన్‌లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. దేశ జనాభాలో సుమారుగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిధ్యం కల్పించారు. 
కేబినెట్ మిషన్ ప్లాన్ సూచన అనుసరించి బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలకు 93 మందిని కేటాయించారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం సభ్యులు 389 మంది. అయితే దేశ విభజన కారణంగా ముస్లింలీగ్ సభ్యులు రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలగడంతో సభ్యుల సంఖ్య 299కి పడిపోయింది. వీరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు 229 మంది, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు.


రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు...


       రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని డిసెంబరు 9, 1946న నిర్వహించారు. ముస్లింలీగ్ ఈ సమావేశంలో పాల్గొనలేదు. సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా, హెచ్.సి.ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుగా బి.ఎన్.రావు వ్యవహరించారు. మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కాబట్టి రాజ్యాంగ పరిషత్తులోనూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.

 

  
 


రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలు


* రాజ్యాంగ పరిషత్ కార్యకలాపాల్లో భాగంగా ఎన్నో కమిటీలను నియమించింది. ఇందులో ప్రధానమైనవి ఎనిమిది. ఈ కమిటీలు, వాటి ఛైర్మన్‌ల వివరాలు.....
కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
ముసాయిదా కమిటీ - డా.బి.ఆర్.అంబేడ్కర్
ప్రాథమిక హక్కులు, మైనారిటీ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
(ఇందులో రెండు ఉప కమిటీలు ఉన్నాయి.)

అవి: a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ - జె.బి.కృపలానీ
      b) మైనారిటీ ఉప కమిటీ - హెచ్.సి.ముఖర్జీ
నియమ నిబంధనల కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
సారథ్య కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
 పై కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది ముసాయిదా కమిటీ. రాజ్యాంగాన్ని క్షుణ్నంగా పరిశీలించి, రూపొందించాల్సిన గొప్ప బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పారు. ఇందులో ఏడుగురు సభ్యులు....
* డా.బి.ఆర్.అంబేడ్కర్ (ఛైర్మన్)
* ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
* అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
* డా.కె.ఎం.మున్షి
* సయ్యద్ మహ్మద్ సాదుల్లా
* ఎన్.మోహనరావు (బి.ఎల్.మిట్టల్ స్థానంలో)
* టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ స్థానంలో)

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగ రచన

        బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత దేశం తన జాతీయ పునర్నిర్మాణం, సాంఘిక, ఆర్థిక, మార్పు సాధన, అనువైన నిర్మాణాల కోసం విశేషమైన కృషి జరిపింది. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు). ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (1787 నాటిది).


 ''ప్రజల జీవితానికి, వారి ఆశయాలకు అనుగుణంగా లేని రాజ్యాంగం ప్రజలను అధోగతి పాలుచేస్తుంది". అని జవహర్ లాల్ పేర్కొన్నారు.

రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు)


        1918, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో భారతీయ ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించారు.

     1922, జనవరి 5న గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు" అని పేర్కొంటూ... రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి, ప్రజల అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగాన్ని రూపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
* స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది: దాదాభాయ్ నౌరోజీ.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించిన భారతీయుడు: ఎం.ఎన్. రాయ్.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ: స్వరాజ్య పార్టీ
* 1927, మే 17న బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను గురించి మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించారు. భారతరాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ నాయకులు 1928, ఫిబ్రవరి, 28న ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని 29 పార్టీలతో కలిసి ఏర్పాటు చేశారు. 1928, మే 19న డాక్టర్ ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.


ఈ ఉపసంఘంలోని సభ్యులు:
1. లాలా లజపతిరాయ్
2. తేజ్ బహదూర్ సప్రూ
3. సుభాష్ చంద్రబోస్
4. ఎం.ఆర్. జయకర్
5. షోయాబ్ ఖురేషి
6. సర్దార్ మంగళ్‌సింగ్
7. ఎం.ఎన్. అణే
8. సర్.అలీ. ఇమాం
9. జి.ఆర్. ప్రధాన్

      మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928, ఆగస్టు 10న సమర్పించింది. దీన్ని భారతీయులు రాజ్యాంగ రచన కోసం చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
* 1925లో అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్‌లో "Common Wealth of India" అనే బిల్లును ప్రతిపాదించి ''ఐర్లాండ్" ప్రజల మాదిరిగానే భారత్ ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని సూచించారు.
* 1936లో జవహర్‌లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ ''భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కారం ఉంది. అది భారత్ ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు తమను తాము పాలించుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే స్వేచ్ఛను కల్పించాలి".
* 1937లో ఫైజ్‌పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది.
* 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన 'హరిపుర' వద్ద జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది.
* 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా రూపొందించాలని ప్రతిపాదించారు.
* 1939, నవంబరు 12న గాంధీజీ 'భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది' అని హరిజన్ పత్రికలో వ్యాఖ్యానించారు.
* 1940, ఆగస్టు ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును గుర్తించారు. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా గుర్తించారు.
* 1945, సెప్టెంబరు 19న లార్డ్ వేవెల్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారని ప్రకటించాడు.
* 1946 జనవరి, ఫిబ్రవరి నెలల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ రిచర్డ్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యులతో ఒక ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి పంపింది. ఈ బృందం 'భారతీయులు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు' అని నివేదించింది.
* 1946, మార్చి 24న మనదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం సిఫార్సులను అనుసరించి, 1946 జూన్, జులై నెలల్లో రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి.
* ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. రాష్ట్రాల్లో కేవలం 28.5% ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికైన మొత్తం సభ్యులు: 389.
* రాజ్యాంగ పరిషత్‌లో ప్రాంతాలవారీగా కేటాయించిన స్థానాలు

* 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన 292 మంది వివరాలు

నాలుగు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాలు

రాజకీయ పార్టీల వారీగా రాజ్యాంగ పరిషత్తు-ఎన్నికల ఫలితాలు

* డిసెంబరు 9, 1946 నాటి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైనవారు - మతాలు, సామాజిక వర్గాల వారీగా మొత్తం సభ్యులు: 208

ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌తో రాజ్యాంగ పరిషత్తు సమావేశాలను బహిష్కరించింది. ఇలా జరగక ముందు జాతీయ కాంగ్రెస్‌కు రాజ్యాంగ పరిషత్తు‌లో 69% ప్రాతినిధ్యం ఉంది. సమావేశాల నుంచి ముస్లింలీగ్ వైదొలగడంతో దాని ప్రాతినిధ్యం 82%కి పెరిగింది.

* 1947 ఆగస్టులో భారతదేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తు‌ను కూడా విభజించారు. స్వాతంత్య్రనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య: 299
* స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తు‌లోని 299 మంది సభ్యుల్లో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు/ఇండియన్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నిక కాగా, 70 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
* 1947, డిసెంబరు నాటికి భారత రాజ్యాంగ పరిషత్తులోని 299 మంది సభ్యుల వివరాలు



స్వాతంత్య్రానంతరం - స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ పరిషత్తు‌కు ప్రాతినిధ్యం

రాజ్యాంగ పరిషత్తులో - వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించినవారు

రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వంలేని ప్రముఖులు:
    1. భారత జాతిపిత: మహాత్మగాంధీ
    2. పాకిస్థాన్ జాతిపిత : మహ్మద్ అలీ జిన్నా
* రాజ్యాంగ పరిషత్తుకు బెంగాల్ నుంచి ఎన్నికైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయి, తర్వాత బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయ్యారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పోటీచేయకుండా, అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయినవారు:
    1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
    2. కె.టి. షా
    3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యాంగ పరిషత్తుకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సోమనాథ్‌లహరి దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిషత్తులో సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహిళలు: 15 మంది
    1. విజయలక్ష్మి పండిట్
    2. సరోజినీ నాయుడు
    3. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    4. రాజకుమారి అమృతకౌర్
    5. హంసా మెహతా
    6. అమ్ము స్వామినాథన్
    7. ఆన్ మస్కార్నే నాథ్
    8. బేగం అజీజ్ రసూల్
    9. సుచేతా కృపలాని
    10. రేణుకారే
    11. పూర్ణిమా బెనర్జీ
    12. లీలా రే
    13. మాలతీ చౌదరి
    14. కమలా చౌదరీ
    15. దాక్షాయణి వేలాయుధన్

రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు:
    1. టంగుటూరి ప్రకాశం పంతులు
    2. నీలం సంజీవరెడ్డి
    3. భోగరాజు పట్టాభిసీతారామయ్య
    4. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    5. కళా వెంకట్రావు
    6. ఎన్.జి.రంగా
    7. కల్లూరి సుబ్బారావు
    8. మోటూరి సత్యన్నారాయణ
    9. బొబ్బిలి రాజ రామకృష్ణ రంగారావు
    10. సి. దానయ్య


రాజ్యాంగ పరిషత్తు తొలిసమావేశం


* గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశం మేరకు రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946, డిసెంబరు 9 (సోమవారం)న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి 9 మంది మహిళలతో సహా మొత్తం 211 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జె.బి.కృపలాని సూచన మేరకు ఫ్రెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

* 1946, డిసెంబరు 11న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
* ''సహకార ప్రాతిపదికపై భారతదేశం కామన్వెల్త్ రాజ్యం కావాలని, కుల, మత, వర్గరహిత సమాజం ఏర్పడే దిశగా పయనించాలని" డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
* 1946, డిసెంబరు 13న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని (Objectives & Resolutions) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానం మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ' అని జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానాన్ని భారతజాతి జాతక చక్రం'గా కె.ఎం. మున్షీ అభివర్ణించారు.
* అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకూ, అమెరికా రాజ్యాంగానికి ఏవిధమైన సంబంధం ఉందో; అదేవిధమైన సంబంధం లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి, భారత రాజ్యాంగానికి ఉందని పేర్కొంటారు.


లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని సారాంశం


* భారతదేశం స్వతంత్య్ర, సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్యం అవుతుంది.
* సార్వభౌమ-స్వతంత్య్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే.
* రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగ మూలశాసనం భారత ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి.

* ప్రజలందరికీ చట్టరీత్యా సమానత్వాన్నీ, స్వేచ్ఛను కల్పించడానికి హామీ ఇవ్వడం.
* భారత ప్రజలందరికీ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం.
* రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్, ముఖ్య లేఖకుడిగా ఎన్.సి.ముఖర్జీ, సలహాదారుడిగా బి.ఎన్.రావు వ్యవహరించారు.
* సువిశాల భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బ్రిటిష్ సంప్రదాయ రీతిలో కమిటీ పద్ధతిని అనుసరించి, రాజ్యాంగ పరిషత్తు రెండు రకాల కమిటీలను ఏర్పరిచింది.

 

I. విషయ నిర్ణాయక కమిటీలు (Committees on Substantive Affairs)
ఇవి మొత్తం 12 కమిటీలు: అవి

II. విధాన నిర్ణాయక కమిటీలు: (Committees on Procedural Affairs)
ఇవి మొత్తం 10 కమిటీలు. అవి:

* రాజ్యాంగ పరిషత్తు విధులపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు: జి.వి. మౌలాంకర్

* రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలన్నింటిలోకి పెద్దది - సలహా సంఘం. వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఏర్పడిన ఈ కమిలోని సభ్యులు 1 + 54 = 55 రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి: డాక్టర్ సచ్చిదానంద సిన్హా
* 1947, జులై 22న రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ జెండాను ప్రదర్శించి, ప్రతిపాదించినవారు: హంసా మెహతా
* రాజ్యాంగ రచనా ప్రక్రియ, ఆమోదంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు జరిపిన మొత్తం సమావేశాల సంఖ్య: 11
* చివరి సమావేశమైన 12వ సమావేశం 1950, జనవరి 24న జరిగింది.
* దేశ విభజన జరిగి ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు కావడంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో 'కేంద్ర అధికారాల కమిటీ' తన నివేదికను పునఃపరిశీలన చేసి, తన రెండో నివేదికలో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది.
* వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు సలహాదారుడైన బెనగల్ నరసింగరావు 1947, అక్టోబరు నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇతడు రూపొందించిన తొలి ముసాయిదా రాజ్యాంగంలో 243 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి.


రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947, ఆగస్టు 29


* రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీల్లో అత్యంత కీలకమైంది 1947, ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రముఖ వ్యక్తులకు సభ్యత్వం కల్పించారు.

వారి వివరాలు:
     1. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ - అధ్యక్షులు
     2. ఎ. కృష్ణస్వామి అయ్యర్ - సభ్యులు
     3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ - సభ్యులు
     4. మహ్మద్ సయ్యద్ సాదుల్లా - సభ్యులు
     5. కె.ఎం. మున్షీ - సభ్యులు
     6. బి.ఎల్. మిట్టల్ - ఇతడు దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడంతో ఇతడి స్థానంలో 1947, డిసెంబరు 5న ఎన్. మాధవరావు నియమితులయ్యారు.
     7. డి.పి. ఖైతాన్ - ఇతడు 1948లో మరణించడంతో ఇతడి స్థానంలో టి.టి. కృష్ణమాచారిని నియమించారు.
* ముసాయిదా కమిటీలో న్యాయ విద్యను అభ్యసించని ఏకైక సభ్యులు టి.టి. కృష్ణమాచారి.


రాజ్యాంగ పరిషత్తు పని విధానం - 3 దశలు


మొదటి దశ: డిసెంబరు 9, 1946 నుంచి ఆగస్టు 15, 1947 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది.


రెండో దశ: ఆగస్టు 15, 1947 నుంచి నవంబరు 26, 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులతోపాటు, దేశ పాలనకు అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది.


మూడో దశ: నవంబరు 26, 1949 నుంచి మే 13, 1952 వరకు. ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్తు కేవలం శాసనవిధులను మాత్రమే నిర్వహిస్తూ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.


* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను నిర్వహించేటప్పుడు బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు.


* రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించేటప్పుడు అధ్యక్షులుగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షులుగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు.


రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందిన రాజ్యాంగం


* 1949, నవంబరు 26న (శనివారం) రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
* ప్రతి సంవత్సరం నవంబరు, 26ను జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహిస్తారు.
* రాజ్యాంగ తయారీకి అయిన వ్యయం: 64 లక్షల రూపాయలు
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదాను చర్చించి, ఆమోదించడానికి 165 రోజులు పట్టింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్న సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
* రాజ్యాంగ పరిషత్తు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది.
* రాజ్యాంగ రాతప్రతికి సంబంధించి, రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు రాగా, వాటిలో 2,473 ప్రతిపాదనలను చర్చించి పరిష్కరించింది.
* రాజ్యాంగ పరిషత్తు ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు: హెచ్.వి. కామత్.

* రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు:
       1) పౌరసత్వం
       2) ఎన్నికలు
       3) తాత్కాలిక పార్లమెంటు
       4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు.
* 1950, జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో మొత్తం 299 మంది సభ్యులకు, 284 మంది రాజ్యాంగ రాత ప్రతిపై సంతకాలు చేశారు.
రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.
* 'జనగణమన'ను జాతీయగీతంగా ఆమోదించడం
* 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఆమోదించడం
* డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను 'రాష్ట్రపతి'గా ఎన్నుకోవడం
    1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించిన రాజ్యాంగం, 1950, జనవరి, 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి కారణం 1929, డిసెంబరు 31న లాహోర్‌లోని రావి నది ఒడ్డున జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది.

  ఈ తీర్మానం ప్రకారం 1930, జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ విధంగా జనవరి 26కు ఉన్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా నూతన రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది 1950, జనవరి 26. రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసినవారు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.
* కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం 1949, మేలో రాజ్యాంగ పరిషత్తు అంగీకరించింది.
* రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు (ఐరావతం)ను నిర్ణయించారు.
* రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఎన్నికైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశ మొదటి రాష్ట్రపతిగా 1950, జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల జనవరి 26న మనం 'గణతంత్ర దినోత్సవం'గా జరుపుకుంటున్నాం.
* స్వాతంత్య్రానంతరం 1948, జూన్ 21 వరకు మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు.
* 1948, జూన్ 22 నుంచి బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు భారత గవర్నర్ జనరల్‌గా
సి. రాజగోపాలాచారి వ్యవహరించారు.
* అంబేడ్కర్ బృందం 1948, ఫిబ్రవరి 21 నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగంలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.


రాజ్యాంగ సభ - చర్చలు


      అంబేడ్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగసభలో జరిగిన అనేక చర్చలు, వ్యాఖ్యానాలు కింది విధంగా ఉన్నాయి.
      'ఈ రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీలా ఉంది'. - మౌలానా హ్రస్రత్ మొహాని
      'సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదు. భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారు'. - దామోదర్ స్వరూప్ సేథ్
      'కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు'.   - ప్రొమథ్ రంజన్ ఠాగూర్
      'మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు'. - శ్రీ రోహిణి కుమార్ చౌదరి
      'గతంలో మనం ప్రజలకు చేసిన ప్రతిజ్ఞ, ఈ రోజు మనం ప్రజలకు చేస్తున్న ప్రతిజ్ఞ నెరవేర్చాలి. ఈ రోజు నుంచి మనం విశ్రాంతి భవనాల్లో సుఖశాంతులతో ఉండే రోజులు పోయాయి. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులోని కోట్లాది మంది వ్యథార్థులకు సేవ చేయడమే'. - జవహర్‌లాల్ నెహ్రూ
      'తన ప్రాచీన కాలం నాటి సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని పరిత్యజించి, నూతన వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ పరిషత్తు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఉంది'. - జవహర్‌లాల్ నెహ్రూ

      ఈ రోజు నుంచి (1950, జనవరి 26) మనం వైరుధ్యాలతో కూడిన సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. 'రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది'.  - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
      ఎం.వి. పైలీ "Constitutional Government in India" అనే గ్రంథంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను 'భారత రాజ్యాంగ పితగా, ఆధునిక మనువు'గా కీర్తించారు.
      భారత రాజ్యాంగాన్ని ఆంగ్లంలో అందంగా చేతితో రాసింది ప్రేమ్ బిహారి నారాయణరైజ్దా. దీనికి ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ తన పేరును, చివరి పేజీలో తన పేరుతోపాటు తన తాత పేరును రాసుకుంటానని కోరగా దానికి నెహ్రూ సమ్మతించారు.
* భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దింది నందలాల్ బోస్. ఇతడికి సహకరించింది శాంతినికేతన్‌లోని చిత్రకారులు.
* సాంఘిక, ఆర్థిక విప్లవ సాధనే రాజ్యాంగ సభకు మూలాధారమని చెప్పవచ్చు. ఈ లక్ష్యసాధన కోసం రాజ్యాంగ సభలో మూడు రకాల వ్యూవహాలపై చర్చ జరిగింది. అవి:

 

ఎ. గాంధేయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని స్వయంప్రతిపత్తి ఉండేదిగా రూపొందించాలి. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలు మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పగించాలి.

* గ్రామీణ ప్రజానీకానికి తమను తాము పునర్ నిర్మించుకోవడానికి తగిన చొరవ, తెలివితేటలు లేవని భారతదేశ సమగ్రత, రక్షణ లాంటి అవసరాలను తీర్చడానికి గాంధేయ సిద్ధాంతం సరిపోదని దీన్ని తిరస్కరించారు.
 

బి. సోవియట్ సామ్యవాద నమూనా: ఇది ఏకపార్టీ వ్యవస్థ మీద ఆధారపడింది. అత్యధిక కేంద్రీకరణతో కూడుకొని, అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాంగాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. దీన్ని కూడా తిరస్కరించారు.
 

సి. యూరో-అమెరికన్ నమూనా: కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు, ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత, అధికారానికి మూలం ప్రజలు అనేదానిపై ఇది (ఈ నమూనా) ఆధారపడింది.
* రాజ్యాంగ సభ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు పాశ్చాత్య ఉదారవాద సంప్రదాయం పట్ల నమ్మకం ఉంది. భారతదేశ ఆధునికీకరణ కోసం పాశ్చాత్య నమూనా అయిన యూరో-అమెరికన్ నమూనానే స్వీకరించారు.


రాజ్యాంగ రచన కోసం - రాజ్యాంగ పరిషత్తు ఉపయోగించిన పద్ధతి


* ఒ.పి.గోయెల్ తన గ్రంథం "Indian Government and Politics"లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతి (Method of Adoption)ని ఎక్కువగా అనుసరించింది అని తెలిపారు. 
* సర్ధుబాటు పద్ధతిలో పరిస్థితులకు అనుగుణంగా రాజీపడటం, కొన్ని విభేదాలు ఉన్నట్లయితే వాటిని అలాగా ఉండనీయడం ఈ పద్ధతి విధానం.

రాజ్యాంగ పరిషత్తుపై వ్యాఖ్యానాలు:
''రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది" - విన్‌స్టన్ చర్చిల్
''రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు నియంత్రణ మండలిగా వ్యవహరించారు" - గాన్ విల్ ఆస్టిన్
* ''రాజ్యాంగ పరిషత్తు‌పై ప్రజాభిప్రాయ నీడలు లేవు" - కె. సంతానం
* ''రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యం వహించింది" - లార్డ్ సైమన్
* ''రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారింది"  - జయప్రకాష్ నారాయణ్


భారత రాజ్యాంగానికి ఆధారాలు


      ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైంది భారత రాజ్యాంగం. సుమారు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950, జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు మన దేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.
 

1. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి:
* దీన్ని భారత రాజ్యాంగానికి నకలు (Xerox copy)గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని సుమారు 70%కి పైగా అంశాలు ఈ చట్టం నుంచే గ్రహించారు.


భారత ప్రభుత్వ చట్టం - 1935 నుంచి గ్రహించిన అంశాలు


* సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; అత్యవసర అధికారాలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, పరిపాలనాంశాలు.


2. బ్రిటన్ రాజ్యాంగం నుంచి:


* పార్లమెంటరీ ప్రభుత్వ విధానం - ద్విసభా విధానం
* ఏక పౌరసత్వం - సమన్యాయ పాలన - కేబినెట్ ప్రభుత్వం
* శాసనసభ్యుల హక్కులు - ఎన్నికల వ్యవస్థ - శాసన నిర్మాణ ప్రక్రియ
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
* అటార్నీ జనరల్ - రిట్స్ జారీ విధానం - దిగువ సభ ఆధిక్యత
* ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థ - దిగువ సభకు మంత్రిమండలి బాధ్యత వహించడం
* ఉద్యోగుల ఎంపిక పద్ధతులు - ఉద్యోగి స్వామ్యం
* దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం


3. అమెరికా రాజ్యాంగం నుంచి:


* లిఖిత రాజ్యాంగం
* ప్రాథమిక హక్కులు
* రాజ్యాంగ ఆధిక్యం - ప్రవేశిక - న్యాయ సమీక్షాధికారం
* స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
* రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం
* న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ
* ఉపరాష్ట్రపతి పదవి
* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం
* దేశాధినేత పేరు మీదుగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించడం
* ప్రజాప్రయోజన వ్యాజ్యం (public interest litigation)


4. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి:


* ఉమ్మడి జాబితా
* ఉభయ సభల సంయుక్త సమావేశం
* స్వేచ్ఛా వాణిజ్య, వ్యాపార చట్టాలు

* అంతర్ రాష్ట్ర వాణిజ్యం
* భాషలకు సంబంధించిన అంశాలు
* కేంద్ర ఆర్థిక సంఘం


5. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి:


* ఆదేశిక సూత్రాలు
* రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం
* నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నిక పద్ధతి


6. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి:


* ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం
* రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం


7. సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి:


* సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలు
* సామ్యవాద సూత్రాలు
* ప్రాథమిక విధులు
* దీర్ఘకాలిక ప్రణాళిక


8. జపాన్ రాజ్యాంగం నుంచి:


* చట్టం నిర్ధారించిన పద్ధతి
* ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు


9. కెనడా రాజ్యాంగం నుంచి:


* అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం
* ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం
* కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం
* బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య విధానం.


10. జర్మనీ రాజ్యాంగం నుంచి:


* అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం.


11. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి:


* ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు
* గణతంత్ర (Republic) విధానం
* తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం


భారత రాజ్యాంగంపై - వ్యాఖ్యానాలు


''భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైంది, తలమానికమైంది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం ఇంద్రుడి వాహనమైన ఐరావతం లాంటిది" - హెచ్.వి. కామత్
''భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత" - గాన్‌విల్ ఆస్టిన్
''భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది" - జవహర్‌లాల్ నెహ్రూ
''భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం లాంటిది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య" - కె.సి. వేర్
''భారత రాజ్యాంగం సహకార సమాఖ్య" - డి.ఎన్. బెనర్జీ, గాన్‌విల్ ఆస్టిన్
''ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అని ఎవరైనా అంటే అందుకు నేను గర్విస్తాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
''భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది"   - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం

    విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.
 

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.


సమాఖ్య లక్షణాలు
 

ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ: మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.


రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.


లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.
 

భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్


అధికారాల విభజన
 

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.

 

రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.


ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.


సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.


ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క‌మిటీలు - సిఫార్సులు

  భారత రాజకీయ వ్యవస్థలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఒక ముఖ్యమైన అంశం. దీని కోసం కేంద్రం వివిధ కమిటీలను నియమించింది. అవి పలు సిఫార్సులు చేశాయి. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.  
  భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1956లో మనదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొనసాగుతున్నాయి.


ఎవరు, ఎలా చేస్తారు?

   భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పునర్‌వ్యవస్థీకరణ జరిగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని నిర్ణీత గడువు లోగా తెలపాలని కోరవచ్చు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం ఏదైనప్పటికీ రాష్ట్రపతి గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్రప్రభుత్వం సొంత నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. పార్లమెంటు అంగీకారం అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ కమిటీలు సిఫార్సులు చేశాయి. వాటిలో ముఖ్యమైన అంశాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి.


భాషాప్రయుక్త ప్రావిన్స్‌ల కమిటీ

  భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి సరోజ్‌కుమార్‌ థార్‌ (ఎస్‌.కె.థార్‌) అధ్యక్షతన పన్నాలాల్‌, జగత్‌నారాయణ్‌లాల్‌ సభ్యులుగా ఒక కమిటీని 1948 జూన్‌లో అప్పటి రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1948 డిసెంబరులో సమర్పించింది.


సిఫార్సులు:


* భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు.
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జరగాలి.


జేవీపీ కమిటీ


ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర నిరసనలకు దారితీయడంతో 1948 డిసెంబరులో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణపై జేవీపీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో J- జవహర్‌లాల్‌ నెహ్రూ, V - వల్లభాయ్‌పటేల్‌, P - పట్టాభి సీతారామయ్యలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్‌లో సమర్పించింది.


సిఫార్సులు:


* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత వంటి అంశాలు ప్రాతిపదిక కావాలి.
* భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలి.
* ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి.


ఫజల్‌ అలీ కమిషన్‌

  కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ‘ఆంధ్ర రాష్ట్రం’ అవతరించింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఇతర భాషాప్రయుక్త రాష్ట్రాలకు డిమాండ్లు తలెత్తాయి. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నెహ్రూ ప్రభుత్వం 1953 డిసెంబరులో ఫజల్‌ అలీ అధ్యక్షతన కె.ఎమ్‌.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో సమర్పించింది.


సిఫార్సులు: 


* పార్టు - ఎ, బి, సి, డి రాష్ట్రాల వర్గీకరణను రద్దుచేయాలి.
* ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే నినాదం సమంజసం కాదు.

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అంటే?
* కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడం
* రాష్ట్రాల సరిహద్దులను మార్చడం
* రాష్ట్రాల విస్తీర్ణంలో మార్పులు చేయడం
* రాష్ట్రాల పేర్లు మార్చడం


సుప్రీంకోర్టు తీర్పు

  బాబూలాల్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ - రాష్ట్రపతి పంపిన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు కేంద్రప్రభుత్వం ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేస్తే మళ్లీ శాసనసభ అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ భూభాగంలో ఏకత్వాన్ని సాధించడంలో ఎలాంటి కృషి జరిగింది..? ఈ అంశాలను పాలిటీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

        స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. మొదటిది బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోని ప్రావిన్సులు. రెండోది బ్రిటిష్‌ సర్వసమున్నతాధికారం కింద స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. స్వాతంత్య్రానంతరం పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.

         భారత యూనియన్‌ కంటే భారత భూభాగం అనే భావన చాలా విస్తృతమైంది. యూనియన్‌లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. కానీ భారత భూభాగంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించిన ఇతర ప్రాంతాలూ ఉంటాయి. కేంద్రంతో రాష్ట్రాలు అధికారాలను పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి.


రాజ్యాంగం ప్రారంభంలో..

1950 జనవరి, 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు.


1) పార్ట్‌ - A రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి అసోం, బిహార్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, ఒడిశా, పంజాబ్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, పశ్చిమ్‌బంగ.


2) పార్ట్‌ - B రాష్ట్రాలు: శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి జమ్మూ-కశ్మీర్‌, మధ్యభారత్‌, హైదరాబాద్‌, మైసూర్‌, పాటియాలా అండ్‌ తూర్పు పంజాబ్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌, వింధ్యప్రదేశ్‌.


3) పార్ట్‌ - C రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 10. అవి అజ్మీర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌ కూంచ్‌, కూచ్‌-బిహార్‌, కూర్గ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కచ్‌, త్రిపుర, మణిపూర్‌.


4) పార్ట్‌ - D రాష్ట్రాలు: ఈ విభాగంలో అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చారు.


రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌


  1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఉద్యమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కర్ణాటకలోని బెల్గాంను సందర్శించినప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి ఫజల్‌ అలీ ఛైర్మన్‌గా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు:

* పార్ట్‌ - A, B, C, D లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ రద్దుచేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.
* ఒకే భాష - ఒకే రాష్ట్రం అనే వాదన సమంజసం కాదు.
* దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి.
* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ మండళ్లు (Zonal Councils) గా ఏర్పాటుచేయాలి.
* దిల్లీలో జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి.


పార్లమెంటు - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం


ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫారసుల్లో కీలకమైన వాటిని 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు ఆమోదించింది. దీంతో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏర్పడి, మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి.

1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: అసోం, బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌, కేరళ, మైసూర్‌, ముంబయి, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌.

1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, అమోని, మినికాయ్‌, లాక్‌దీవులు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, త్రిపుర, మణిపూర్‌.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర ఎన్నికల సంఘం

       భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించారు. మనదేశంలో 1950, జనవరి 25 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చింది. న్యూదిల్లీలోని ‘నిర్వాచన్‌ సదన్‌’ దీని ప్రధాన కార్యాలయం.


జాతీయ ఓటర్ల దినోత్సవం 

కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడి 2011, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు. యువత ఓటర్ల జాబితాలో చేరడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. 'Proud to be Voter - Ready to Vote '  అనేది ఓటర్ల దినోత్సవ నినాదం.


ఓటర్ల ప్రతిజ్ఞ: ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని... కుల, మత, జాతి, వర్గ, భాష లాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని’ ప్రతిజ్ఞ చేస్తున్నాం.


ఏకసభ్య - బహుళ సభ్య ఎన్నికల సంఘం


     1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో ఏకసభ్య ఎన్నికల సంఘంగా కొనసాగింది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళ సభ్య ఎన్నికల సంఘం’గా మార్చింది. దీనిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. 1990 జనవరిలో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తిరిగి ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చగా పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1993, అక్టోబరు 1న బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చింది.
 

ఆర్టికల్‌ 325: ఎన్నికల నిర్వహణ విషయంలో ఓటర్ల జాబితాను తయారుచేసేటప్పుడు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఒకే జాబితాను రూపొందించాలి.


ఆర్టికల్‌ 326: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలన్నీ సార్వజనీన వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై జరుగుతాయి. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వయోజన ఓటుహక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు. దీన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.


ఆర్టికల్‌ 327: రాజ్యాంగ నియమాలకు లోబడి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలను పార్లమెంటు రూపొందిస్తుంది.


ఆర్టికల్‌ 328: శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను పార్లమెంటు రూపొందించనప్పుడు రాష్ట్ర శాసనసభలు రూపొందించుకోవచ్చు.


ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన శాసనాల రాజ్యాంగ బద్ధత, వివిధ నియోజకవర్గాల సీట్ల కేటాయింపును న్యాయస్థానంలో సవాలు చేయకూడదు.


డిపాజిట్‌ కోల్పోవడం


     రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థులు రూ.15000ను డిపాజిట్‌గా జమచేయాలి. లోక్‌సభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12500; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.10,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5000ను డిపాజిట్‌గా జమచేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్‌ను చెల్లిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. దీన్నే ‘డిపాజిట్‌ కోల్పోవడం’ అంటారు.
 

వ్యయ పరిమితి: అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితిని లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా; రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఎన్నికల వ్యయపరిమితికి 2014, ఫిబ్రవరి 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 

తొలగింపు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలో అంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా మాత్రమే తొలగిస్తారు. ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.


అధికారాలు, విధులు

* ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం పరిపాలనా, సలహారూపకమైన, అర్ధన్యాయ సంబంధమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
* కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది, సవరణ చేస్తుంది.
* పార్లమెంటు రూపొందించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చట్టం ప్రకారం దేశంలోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
* వివిధ రాజకీయ పార్టీలను గుర్తించి, వాటికి ఎన్నికల గుర్తులను కేటాయించడం. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తేదీలను నిర్ణయించడం.
* ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి, అమలుచేయడం.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్లకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* వివిధ రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలు విని పరిష్కరించడం.


అభ్యర్థులను ఓటర్లు బలపరచడం

* రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాలి.
* ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 20 మంది బలపరచాలి.
* జాతీయ లేదా రాష్ట్ర పార్టీల తరఫున టికెట్‌ పొందిన వ్యక్తి లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయాలంటే కనీసం ఒక ఓటరు బలపరచాలి.
* స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ తరఫున లోక్‌సభ లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రానికి సంబంధిత నియోజకవర్గంలోని కనీసం పది మంది ఓటర్ల మద్దతు ఉండాలి.
* లోక్‌సభకు పోటీ చేయాలంటే దేశంలోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* రాష్ట్ర శాసనసభకు గవర్నర్‌ నామినేట్‌ చేసే వ్యక్తి తప్పనిసరిగా అదే రాష్ట్రానికి చెంది ఉండాలి.


సుప్రీంకోర్టు తీర్పులు


మక్కాల్‌ శక్తి కచ్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం: ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే అధికారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.


మహేందర్‌సింగ్‌ గిల్‌ Vs భారత ప్రభుత్వం: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు లేదా శాసనసభలు రూపొందించకపోతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని తెలిపింది.


ఎన్నికల యంత్రాంగం

కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్‌లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంటుంది. వర్గ స్థాయిలో ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా; పోలింగ్‌బూత్‌ స్థాయిలో ప్రభుత్వోద్యోగి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ముఖ్యమంత్రి - రాష్ట్ర మంత్రిమండలి

సమస్తం.. సమున్నతం!

  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమం, పురోగతి పూర్తిగా మంత్రిమండలి పరిధిలోనే ఉంటుంది. అందులో ఒకరు నాయకులై నిర్దేశిస్తే, సలహాలు-సూచనలతో సభ్యుల బృందం సమష్టిగా యంత్రాంగాన్ని నడిపిస్తుంది. ఆ నిర్ణయాలకు తిరుగు ఉండదు. అధికారానికి అడ్డులేదు. విధానాల రూపకల్పన నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు సమస్త విషయాల్లోనూ వాస్తవ అధికారంతో సమున్నత పాలనాకేంద్రంగా క్యాబినెట్‌ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ అంశాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. 

  రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ అధిపతి ముఖ్యమంత్రి. ఆ పదవిని చేపట్టే వారి సమర్థత, పనితీరు, వ్యక్తిత్వంపై ప్రగతి ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడిగా వ్యవహరిస్తూ, పరిపాలనను నిర్వహిస్తారు.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 163, 164, 167 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్‌) గురించి వివరిస్తాయి. జాతీయ స్థాయిలో ఉన్నట్లే, రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని  రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం రాష్ట్రస్థాయిలో రాష్ట్రాధినేత అయిన గవర్నర్‌కు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటే, ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.


ఆర్టికల్, 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది.


ఆర్టికల్, 163(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి పదవీకాలం గవర్నర్‌/విధానసభవిశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి కింది కారణాల వల్ల పదవి కోల్పోతుంది.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు.

* విధానసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఓడిపోయినప్పుడు.

* ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరణించినా, పదవికి రాజీనామా చేసినా, ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించినా మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

నియామకాలు

ఆర్టికల్‌ 164(1): విధానసభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని/రాజకీయ పార్టీల కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.

ఆర్టికల్‌ 164(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.

ఆర్టికల్‌ 164(3): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమష్టిగా బాధ్యత వహింస్తుంది.

ఆర్టికల్‌ 164(4): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు గవర్నర్‌ సమక్షంలో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.

ఆర్టికల్‌ 164(5): ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులు కావాలంటే శాసనసభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యత్వం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులైతే 6 నెలల్లోగా శాసనసభలో సభ్యత్వం పొందాలి. లేకపోతే వారు పదవిని కోల్పోతారు.

ఆర్టికల్‌ 164(6): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.

ఆర్టికల్‌ 167(1): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను, మంత్రిమండలి జరిపిన తీర్మానాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలియజేయాలి.

ఆర్టికల్‌ 167(2): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తనకు తెలియజేయాలని గవర్నర్‌ ముఖ్యమంత్రిని కోరవచ్చు. గవర్నర్‌కు, రాష్ట్ర మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 167(3): గవర్నర్‌ ఆమోదం కోసం ఏదైనా బిల్లు/ తీర్మానం వచ్చినప్పుడు దాన్ని మొత్తం మంత్రిమండలి సమగ్రంగా పరిశీలించలేదని గవర్నర్‌ భావిస్తే సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని మంత్రిమండలి పునఃపరిశీలనకు పంపవచ్చు. మంత్రిమండలి సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని పునఃసమీక్షించి/సమీక్షించకుండా రెండోసారి గవర్నర్‌ ఆమోదముద్రకు పంపితే, తప్పనిసరిగా ఆమోదించాలి. 

ముఖ్యమంత్రి అధికారాలు - విధులు

* రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తారు.

* రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటులో తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటారు. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీల్లో కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసి, వారు మంత్రులుగా నియమితులయ్యే విధంగా చూస్తారు. మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు సలహా ఇస్తారు. రాష్ట్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్దేశిస్తారు.

* శాసనసభకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను శాసనసభలో ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాల్లో, శాసనసభ బయట ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం ఉంటుంది.

* రాష్ట్ర పరిపాలనకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మంత్రిమండలికి, గవర్నర్‌కు మధ్య వారధిగా ఉంటారు. 

పదవీరీత్యా కింద పేర్కొన్న సంస్థల్లో ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంటారు.

* జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమగ్రతా మండలి

* నీతి ఆయోగ్‌ 

* జాతీయ జనాభా కమిషన్‌

* అంతర్‌ రాష్ట్ర మండలి

* జోనల్‌ కౌన్సిల్‌ (ప్రాంతీయ మండలి)

* రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

రాష్ట్ర మంత్రిమండలి

రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉంటారు.

* ఆర్టికల్‌ 164(1)(ఎ) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య 12 మంది కంటే తక్కువ ఉండకూడదు.

* ఆర్టికల్‌ 164(1)(బి) ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన శాసనసభ్యులను ఎలాంటి లాభదాయక పదవిలోనూ నియమించకూడదు.

* ఆర్టికల్స్‌ 164 (1)(ఎ), 164(1)(బి)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2003) రాజ్యాంగానికి చేర్చారు.

మంత్రిమండలి - అధికారాలు, విధులు

ప్రభుత్వ విధానాల రూపకల్పన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, అమలుచేసే బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం రూపొందించే విధానాలపై మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.


రాష్ట్ర పరిపాలన: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర మంత్రిమండలి నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన సాగిస్తారు. ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకుమించిన శాఖల పరిపాలనపై నియంత్రణ, బాధ్యత కలిగి ఉంటారు.


సమన్వయ సాధన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య మంత్రిమండలి సమన్వయాన్ని పెంపొందిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన లోపభూయిష్టంగా మారుతుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించి, అమలు చేస్తారు.


శాంతి భద్రతల పరిరక్షణ: ఇది రాష్ట్ర జాబితాలోని అంశం. ప్రజల ప్రాణాలను పరిరక్షించి శాంతిభద్రతలను నెలకొల్పడం, సాధారణ ప్రజానీకం శాంతియుత సహజీవనాన్ని సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

శాసన నిర్మాణంలో పాత్ర: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనలో రాష్ట్ర మంత్రిమండలి కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ మంత్రిమండలి నిర్ణయిస్తుంది. శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసనాల రూపకల్పనలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, దీర్ఘకాలిక వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు సలహాలిస్తుంది.

నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ గవర్నర్‌ పేరుతో మంత్రిమండలి నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి ద్వారా జరిగే నియామకాల్లో అడ్వకేట్‌ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త మొదలైన కీలక పదవులు ఉంటాయి.

సమష్టి బాధ్యతా సూత్రాన్ని పాటించడం: ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభ/ విధానసభకు సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర మంత్రిమండలి ఒక సమష్టి జట్టుగా వ్యవహరిస్తుంది. శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతుంది.

గవర్నర్‌కు వ్యక్తిగత బాధ్యతను వహించడం: రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై గవర్నర్‌కు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగించే ఉపన్యాస సారాంశాన్ని మంత్రిమండలి రూపొందిస్తుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సలహాలు, సహాయాన్ని గవర్నర్‌కు అందిస్తుంది.

ఆర్థికపరమైన విధులు: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రగతికి అవసరమైన వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, విద్యావిధానం, ప్రణాళికల రూపకల్పన మొదలైన బాధ్యతలను మంత్రిమండలి నిర్వహిస్తుంది. శాసనసభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలుచేస్తుంది.

కొన్ని ముఖ్యాంశాలు 

* తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి - కె. చంద్రశేఖర్‌రావు (టీఆర్‌ఎస్‌)

* దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి - సుచేత కృపలానీ (ఉత్తర్‌ప్రదేశ్‌) (ఐఎన్‌సీ) 

* దేశంలో రెండో మహిళా ముఖ్యమంత్రి - నందినీ శతపతి (ఒడిశా) (ఐఎన్‌సీ)

* మొదటి కాంగ్రెసేతర మహిళా ముఖ్యమంత్రి - శశికళా గురుదత్‌ కకోద్కర్‌ (గోవా) (మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ)

* దక్షిణాదిలో తొలి మహిళా ముఖ్యమంత్రి - జానకీ రామచంద్రన్‌ (తమిళనాడు) (ఏఐఏడీఎంకే)

* ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మహిళా ముఖ్యమంత్రి - సయ్యద్‌ అన్వర్‌ తైమూర్‌ (అస్సాం) (ఐఎన్‌సీ)

* దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి (ఉత్తర్‌ప్రదేశ్‌) (బీఎస్పీ)

* దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)

* దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినవారు - పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (25 ఏళ్లు) (సిక్కిం)

* అతి తక్కువకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించింది - జగదాంబికా పాల్‌ (2 రోజులు) (ఉత్తర్‌ప్రదేశ్‌)

* పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి - షేక్‌ అబ్దుల్లా (జమ్ము-కశ్మీర్‌)

* రాష్ట్ర శాసనసభలో ‘సీఎం అవర్‌’ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి - దిగ్విజయ్‌ సింగ్‌ (మధ్యప్రదేశ్‌)

* హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి, చివరి ముఖ్యమంత్రి - బూర్గుల రామకృష్ణారావు

* ప్రస్తుతం పదవిలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి - మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)

* శాసనసభలో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, తర్వాత జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోయి పదవి కోల్పోయినవారు - త్రిభువన్‌ నారాయణ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌),  శిబూ సోరెన్‌ (ఝార్ఖండ్‌)

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత పార్లమెంట్ - లోక్‌సభ

  కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత శాసన నిర్మాణ సంస్థ భారత పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ (79వ అధికరణ) అంటారు. రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి వివరిస్తాయి.


  పార్లమెంట్‌లోని దిగువ సభను లోక్‌సభ House of the People అంటారు. ఇందులో రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 552 మంది ఉండవచ్చు. 550 మందిని జనాభా ఆధారంగా విభజించిన ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు 543 మంది, ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఆ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుతం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 80 మందికి, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన జాతీయ రాజధాని దిల్లీకి ఏడుగురు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి నియమించిన ప్రోటెం స్పీకర్ (Pro Tem Speaker) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంప్రదాయం ప్రకారం సభలో అత్యధిక అనుభవం ఉన్న సీనియర్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రోటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ 10 మంది సభ్యులతో ప్యానల్ స్పీకర్ల జాబితాను రూపొందిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకపోతే సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించుకుంటారు.

* ప్రధానమంత్రి లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే ఆయన రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తూ, లోక్‌సభలో సభ్యత్వం ఉన్న తన మంత్రివర్గ సహచరుడిని లోక్‌సభ నాయకుడిగా నియమిస్తారు.

* ప్రస్తుత లోక్‌సభలో (16వ లోక్‌సభ) 38 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కనీసం 10 శాతం స్థానాలు పొందలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను పొందలేకపోయాయి. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే.

* లోక్‌సభలోని సభ్యులు ఎన్నుకున్న స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ఉపసభాపతి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా, యం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు రాయాల్సి ఉంటుంది. స్పీకర్ సంతృప్తి మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

* స్పీకర్ అనుమతి లేకుండా సభ సమావేశాలకు 60 రోజులు గైర్హాజరు అయితే వారి సభ్యత్వం రద్దవుతుంది.


నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ: 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత పార్లమెంట్ నియమించే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజక వర్గాల సంఖ్యను పెంచడం లేదా ప్రాదేశిక సరిహద్దులను మార్చడం, షెడ్యూల్డ్ కులాలు, తెగల నియోజక వర్గాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47, మొత్తం 131 (24.03%) స్థానాలను రిజర్వు చేశారు.
లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు.

లోక్‌సభ స్పీకర్

  రాజ్యాంగంలో 93 నుంచి 97 వరకు ఉన్న అధికరణలు స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. లోక్‌సభకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1921 వరకు కేంద్ర శాసన మండలికి గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించేవారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ప్రెసిడెంట్ (స్పీకర్), డిప్యూటీ ప్రెసిడెంట్ (డిప్యూటీ స్పీకర్) పదవులను ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఫ్రెడరిక్ వైట్ ప్రెసిడెంట్‌గా, సచ్చిదానంద సిన్హా (వైస్ ప్రెసిడెంట్)డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కేంద్రశాసన మండలికి విఠల్‌భాయ్ జె. పటేల్ మొదటిసారిగా ఎన్నికైన ప్రెసిడెంట్ (స్పీకర్). 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చాయి.
* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రమాణ స్వీకారం అనేది ప్రత్యేకంగా ఉండదు.
* లోక్‌సభ రద్దు అయినప్పటికీ తిరిగి లోక్‌సభ ఏర్పడేంతవరకూ స్పీకర్ పదవిలో కొనసాగుతారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు లోక్‌సభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది.
* స్పీకర్ లోక్‌సభను తాత్కాలికంగా వాయిదా వేయగలరు.
* పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఒక బిల్లును ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయించే అంతిమ అధికారం లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుంది.
* లోక్‌సభ సభ్యులకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అయితే స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్ట్ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు

భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ కసరత్తు పూర్తవడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి, పొరుగుదేశాల్లో మాదిరిగా మనదేశంలో అంతర్గత తిరుగుబాట్లు, రాజ్యాంగ వ్యవస్థల పతనం జరగకపోవడానికి ప్రధాన కారణం... రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలే!

  భారత రాజ్యాంగ కీలక లక్షణం... దేశాన్ని 'సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం. ఇందులోని ప్రతి పదానికి విస్తృతమైన అర్ధం ఉంది.


సార్వభౌమత్వం: ప్రతి స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన ముఖ్యలక్షణం సార్వభౌమత్వం. ఎలాంటి విదేశీ లేదా స్వదేశీ శక్తుల నియంత్రణలో ప్రభుత్వం లేకపోవడమే సార్వభౌమత్వం. భారత్ తన విధానాలను తాను రూపొందించుకుంటుంది.


సామ్యవాద: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదం లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను చేర్చారు. సామ్యవాదం అనే పదం ముఖ్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రాజ్యాంగం ప్రకటించింది.


సామ్యవాద: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పదం లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను చేర్చారు. సామ్యవాదం అనే పదం ముఖ్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనలో ప్రభుత్వ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని  అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రాజ్యాంగం ప్రకటించింది.


లౌకిక: భారతదేశంలో ఎలాంటి అధికారిక మతం లేదు. రాజ్యం ఏ మతాన్నీ అనుసరించదు. దేశంలోని ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన మతాన్ని నమ్మవచ్చు, ఆచరించవచ్చు. రాజ్యం ఏ వ్యక్తీ లేదా సంస్థ పట్ల మతప్రాతిపదికన వివక్ష చూపదు.
 ప్రజాస్వామ్య, గణతంత్ర: రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారత రాజ్యాంగాన్ని ప్రజలు రూపొందించుకున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మూలకారణం ప్రజలే. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వయోజన ఓటు హక్కు, ఎన్నికలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు రూపంలో రాజ్యాంగంలో పొందుపరచారు.
 భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధినేత (అధ్యక్షుడు) బ్రిటిష్ రాజు మాదిరిగా వంశపారంపర్యంగా కాకుండా, పరోక్షంగా ప్రజల చేత ఎన్నికవుతారు. ఇది గణతంత్ర రాజ్యానికి ఉండే ప్రధాన లక్షణం.


ఇతర ముఖ్య లక్షణాలు


సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా అతి పెద్దది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్.వి. కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు దగ్గర్నుంచి, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ పాలన, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, తదితర అంశాలను రాజ్యాంగంలో విపులంగా చర్చించారు.
 దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం: భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని బట్టి దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా విశ్లేషకులు వర్ణించారు. కొన్ని అంశాల్లో సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.
 మరికొన్ని అంశాలను సవరించడానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగానికిపైగా రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది అదృఢ రాజ్యాంగ లక్షణం. రాజ్యాంగంలోని 368వ నిబంధన రాజ్యాంగ సవరణ విధానాన్ని విశదీకరిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు మార్చడం, విధాన పరిషత్‌ను రద్దు చేయడం, ఏర్పాటు చేయడం, పౌరసత్వానికి సంబంధించిన అంశాలు మొదలైనవాటిని సాధారణ మెజారిటీ ద్వారా సవరించవచ్చు.
 ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల సవరణ, నూతన రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటుకు రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం.
 రాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు, తదితర కీలక అంశాల్లో సవరణలు చేయాలంటే పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీతోపాటు దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల్లో కూడా మూడొంతుల మెజారిటీ అవసరం.


ఏకకేంద్ర లక్షణాలు ఉన్న సమాఖ్య: మనదేశంలో బ్రిటన్‌లో మాదిరిగా పూర్తి ఏకకేంద్ర లక్షణాలుగానీ, అమెరికాలో మాదిరిగా పూర్తి సమాఖ్య వ్యవస్థ లక్షణాలుగానీ లేవు. అనేక అంశాల్లో సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ, దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు ఏకకేంద్ర వ్యవస్థ వైపు మొగ్గుచూపారు. అందుకే రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. భారతదేశాన్ని రాష్ట్రాల సముదాయంగానే పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ లక్షణాన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.


ఏకకేంద్ర లక్షణాలు: ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు కేంద్రం అధీనంలో ఉండటం, ఏకీకృత న్యాయవ్యవస్థ మొదలైనవి.


సమాఖ్య లక్షణాలు: లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్వంద్వ సభా విధానం మొదలైనవి.


పార్లమెంటరీ ప్రభుత్వ విధానం: బ్రిటన్ మాదిరిగా భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్లమెంటరీ పద్ధతిలో ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. దీని ప్రకారం ప్రభుత్వంలో నామమాత్ర, వాస్తవ కార్యనిర్వాహకులు ఉంటారు.
 కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్‌లు నామమాత్ర అధిపతులుగా, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు వాస్తవ అధిపతులుగా వ్యవహరిస్తారు.

ఏకీకృత న్యాయవ్యవస్థ: రాజ్యాంగం దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, అమలు చేయడం, దిగువ కోర్టులపై నియంత్రణ సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది.
 రాజ్యాంగంలోని 50వ నిబంధన న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేస్తుంది. తద్వారా న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు.
  భారత రాజ్యాంగంలోని మరో విశిష్ట లక్షణం న్యాయ సమీక్ష. శాసనశాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు కట్టబెట్టారు. దీన్ని న్యాయ సమీక్ష అంటారు. ఈ విధానాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

సార్వజనీన వయోజన ఓటుహక్కు:భారత రాజ్యాంగంలోని 326వ నిబంధన సార్వజనీన ఓటు హక్కును కల్పిస్తుంది. నిర్ణీత వయసు వచ్చిన తర్వాత కులం, మతం, లింగ, ప్రాంత, వర్గ వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు లభిస్తుంది.
 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

ప్రాథమిక హక్కులు: రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధన వరకు ప్రాథమిక హక్కులను వివరించారు. ప్రస్తుతం సమానత్వ హక్కు, స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య - సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి.
 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.

ప్రాథమిక హక్కులు: రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 నిబంధన వరకు ప్రాథమిక హక్కులను వివరించారు. ప్రస్తుతం సమానత్వ హక్కు, స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య - సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి.

  ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చారు. 32వ నిబంధనలో పొందుపరచిన రాజ్యాంగ పరిహారపు హక్కు అత్యంత కీలకమైంది. పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు దీన్ని ఉపయోగించి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.

ఆదేశిక సూత్రాలు: భారత రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాలను వివరిస్తుంది. వీటిని మన రాజ్యాంగ వేత్తలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. వీటిని అమలు చేయడం ద్వారా శ్రేయో రాజ్యం లేదా సంక్షేమ రాజ్యం స్థాపించాలనేది రాజ్యాంగవేత్తల అభిలాష.
  విధానాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలు మార్గదర్శకంగా పనిచేస్తాయి. కానీ వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.ప్రాథమిక విధులు: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవు. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసులతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు.
 రాజ్యాంగంలోని 4ఎ భాగంలో 51ఎ నిబంధన కింద వీటిని పొందుపరచారు.
 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6-14 ఏళ్ల మధ్య పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించడాన్ని 11వ ప్రాథమిక విధిగా చేర్చారు. అందువల్ల ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి.


అత్యవసర పరిస్థితులు


దేశంలో అవాంఛిత సంఘటనలు జరిగినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. మూడు రకాల అత్యవసర పరిస్థితులను రాజ్యాంగంలో పొందుపరచారు...


352వ నిబంధన: దేశం మీద యుద్ధం లేదా విదేశీ దురాక్రమణలు సంభవించినప్పుడు, దేశంలో లేదా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఈ నిబంధనను ఉపయోగించి అత్యవసర పరిస్థితి విధించవచ్చు. దీన్ని జాతీయ అత్యయిక పరిస్థితి అంటారు.


356వ నిబంధన: ఏదైనా ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. దీన్ని రాజ్యాంగబద్ధ అత్యయిక పరిస్థితి అంటారు.


360వ నిబంధన: దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ నిబంధన ద్వారా అత్యవసర పరిస్థితి విధిస్తారు. దీన్ని ఆర్థిక అత్యయిక పరిస్థితి అంటారు.

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక వికాస ప్రయోగాలు

పల్లెసీమల్లో నవోదయం!


పల్లె సీమల్లో ప్రగతి వెలుగులు నింపి, గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో శతాబ్దంపైగా సామాజిక వికాస ప్రయోగాలు సాగుతున్నాయి. సమాజంలో సమానత్వాన్ని, చైతన్యాన్ని పెంపొందించి, స్వయం సమృద్ధిని సాధించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వ్యక్తులు, సంస్థలు మొదలు ప్రభుత్వాల వరకు ఎందరో కృషి చేశారు. అనేక విధానాలు, పథకాలను అమలు చేశారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

   

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యమే ధ్యేయంగా స్వాతంత్య్రానికి పూర్వం పలువురు వ్యక్తుల ఆధ్వర్యంలో అవి జరిగాయి. స్వాతంత్య్రానంతరం అదే తరహాలో ఉపాధి, ఇల్లు, ఇతర మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.


సుందర్బన్స్‌ ప్రయోగం(1903): పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్స్‌’ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 1903లో ‘డేనియల్‌ హామిల్టన్‌’ శ్రీకారం చుట్టారు. గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించారు.


గుర్గావ్‌ ప్రయోగం (1920): 1920లో పంజాబ్‌లోని ‘గుర్గావ్‌’ జిల్లాలో ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ అనే డిప్యూటీ కమిషనర్‌ గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1933 నుంచి ‘గుర్గావ్‌ గ్రామీణాభివృద్ధి ఉద్యమం’ విస్తృతంగా కొనసాగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935-36లో రూ.కోటి కేటాయించి ప్రోత్సహించింది.


కీలకాంశాలు: 1) అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం. 2) వివాహం, ఉత్సవం, విందు, వినోదాల్లో జరిగే ధనవ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి వినియోగించడం. 3) వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం. 4) మహిళా విద్య, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం.


మార్తాండం ప్రయోగం(1921): తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం ప్రాంతంలో అమెరికన్‌ వ్యవసాయ రంగ నిపుణుడు ‘స్పెన్సర్‌ హాచ్‌’ దీనికి ఆద్యుడు. సుమారు 70 గ్రామాలకు చెందిన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం వైఎంసీఏ (యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌)ను ఏర్పాటు చేసి, ఈ ప్రయోగం నిర్వహించారు. 


కీలకాంశాలు: 1) అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. 2) గ్రామీణ పునర్నిర్మాణం. 3) మౌలిక రంగాల్లో ప్రజలకు తర్ఫీదునివ్వడం. 4) అధునిక సాగు పద్ధతులను అవలంబించడం. 5) పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం.

శ్రీనికేతన్‌ ప్రయోగం (1922): విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కలకత్తాలోని శాంతినికేతన్‌లో దీన్ని ప్రారంభించారు. సామాజిక వికాస ప్రయోగాల్లో ఆత్మగౌరవాన్ని కీలకాంశంగా తీసుకున్నారు.

కీలకాంశాలు: 1) చిన్నతరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 2) ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధి సాధించడం. 3) వయోజన విద్య, ప్రజల ఆరోగ్య సంరక్షణ.

బరోడా ప్రయోగం (1932):  బరోడా సంస్థానంలో ‘దివాన్‌’గా పనిచేసిన వి.టి.కృష్ణమాచారి 1932లో సమాజ అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.

కీలకాంశాలు: 1) గ్రామీణ యువతీ యువకులను చైతన్యపరచి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. 2) రోడ్ల నిర్మాణం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా సమాజ ప్రగతికి కృషి చేయడం.

సేవాగ్రామ్‌ ప్రయోగం(1933):  మహారాష్ట్రలోని ‘వార్ధా’ ప్రాంతంలో మహాత్మాగాంధీ 1933లో దీన్ని ప్రారంభించారు. ఆచార్య వినోబా భావే, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు విస్తృతపరిచారు.

కీలకాంశాలు: 1) సర్వోదయ, నవోదయ సిద్ధాంతాల ఆధారంగా సమాజాన్ని నిర్మించడం. 2) ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేయడం.3) ప్రాతిపదిక విద్య (Basic Education)లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజల స్వయంసమృద్ధికి పాటుపడటం.

ఫిర్కా ప్రయోగం (1946): టంగుటూరి ప్రకాశం మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ‘ఫిర్కా’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

కీలకాంశాలు: 1) తాలుకాలను ఫిర్కాలుగా విభజించి వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయడం. 2) వెనుకబాటుతనం ఆధారంగా ఫిర్కాలను ఎంపిక చేయడం. 3) కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 4) సహకార సంస్థల ఏర్పాటు. 5) అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం.

* 1952లో భారత ప్రభుత్వం ‘సమాజ అభివృద్ధి పథకం’ (Community Development Programme - CDP) ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను ‘బ్లాకు’ల్లో విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం(1948): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ‘మహేవా’ ప్రాంతంలో ఆల్బర్ట్‌ మేయర్‌ దీన్ని ప్రారంభించారు. సుమారు 97 గ్రామాలను ఎంపిక చేసుకుని పౌర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు.

కీలకాంశాలు: 1) కళారూపాలతో ప్రజల్లో సామాజిక చైతన్యం పెంచడం. 2) వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహం. 3) పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి.


నీలోఖరి ప్రయోగం (1948):  హరియాణాలోని కర్నాల్‌ జిల్లా ‘నీలోఖరి’ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. దేశ విభజన సందర్భంగా నిరాశ్రయులైన సుమారు 7 వేల మందికి పునరావాసం కల్పించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుడు సురేంద్ర కుమార్‌ డే (ఎస్‌కే డే). 


కీలకాంశాలు: 1) స్వయంశక్తితో అభివృద్ధి చెందే విధంగా ప్రజలను ప్రోత్సహించడం. 2) వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో శిక్షణ ఇవ్వడం. 3) గృహ వసతి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం.


గ్రో మోర్‌ ఫుడ్‌ కాంపెయిన్‌ (1942): క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్‌లో కరవు, తుపానుల ఫలితంగా ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా బ్రిటిషర్లు 'Grow More Food Campaign'ను 1942లో ప్రారంభించారు. కానీ ఆశించిన ఫలితాలివ్వలేదు.

* 1947, ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ లక్ష్యంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధిపై వి.టి.కృష్ణమాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. దాని సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో (సమితులు) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP) ప్రారంభించారు.

సమాజ అభివృద్ధి కార్యక్రమం (1952): అమెరికాలో అమలైన ‘బ్లాక్‌’ (Block) ను అభివృద్ధికి నమూనాగా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందించింది. అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్లు సమకూర్చింది. 1971 నాటికి ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అందించిన ఆర్థిక సహకారం సుమారు 104 మిలియన్‌ డాలర్లు.


ఎంపిక చేసిన అంశాలు: 1) పేదరికం, నిరుద్యోగం నిర్మూలన. 2) గ్రామీణ సమాచార వ్యవస్థ, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు. 3) ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం. 4) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, గృహవసతి.


సీడీపీ లక్ష్యాలు: 1) ప్రజలు సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం. 2) వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం. 3) దేశ ప్రగతిలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడం.


కీలకాంశాలు:  1) ఈ పథకాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ప్రతి బ్లాకులో సుమారు 100 గ్రామాలు, 70 వేల జనాభా ఉంటుంది.  2) ప్రతి బ్లాకుకు కార్యనిర్వహణాధికారిగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వ్యవహరిస్తారు. 3) సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో ‘గ్రామ్‌సేవక్‌’ అనే అధికారిని నియమించారు. 4) ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 5) సీడీపీ తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించింది.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme n- NESS)’ ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. సీడీపీని మూడేళ్ల కాలపరిమితితో రూపొందించగా, ‘ఎన్‌ఈఎస్‌ఎస్‌’ను శాశ్వత ప్రాతిపదికన చేపట్టారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ ద్వారా వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, విద్యా రంగాలు అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

వివిధ స్థాయుల్లో అమలు:


కేంద్ర స్థాయి: సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అమలవుతుంది.


రాష్ట్ర స్థాయి: ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ పర్యవేక్షణలో అమలవుతుంది.


జిల్లా స్థాయి: కలెక్టర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.


బ్లాకు స్థాయి: బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.


గ్రామ స్థాయి: విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (వీఎల్‌డబ్ల్యూ) పథకం అమలుకు కృషి చేస్తారు.


* సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌.కె.డే వ్యవహరించారు. ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం ‘సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం వంటిది’ అని ఆయన పేర్కొన్నారు.


* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారతదేశంలో ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు.


* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం అమలులో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించేది విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌.  వీరికి అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. అందుకే వీరిని మల్టీపర్పస్‌ వర్కర్స్‌గానూ పిలిచేవారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాలు

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951

ఈ చట్టంలో చట్టసభలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధమైన వివరాలు, ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులోని కీలకమైన సెక్షన్లు, వాటి వివరణ.

సెక్షన్‌ 8 (3):

* నేరం రుజువై రెండేళ్ల జైలుశిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీ¨కి అనర్హులు. వీరు జైలు  నుంచి విడుదలైన తర్వాత కూడా ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

సెక్షన్‌ 8 (4):

* ఏ చట్టసభ సభ్యుడినైనా దిగువ న్యాయస్థానం ‘దోషి’గా నిర్ధారించినప్పుడు, వారు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయొచ్చు. 

* దిగువ న్యాయస్థానం తీర్పు వెలువరించిన తేదీ నుంచి 3 నెలల వరకు సంబంధిత సభ్యుడికి అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది (ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి వీలుగా). 

* ఆ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నాక, అది పెండింగ్‌లో ఉన్నంతకాలం అనర్హత వేటు నుంచి రక్షణ పొందుతాడు.


సెక్షన్‌ 29 (A): రాజకీయ పార్టీల నమోదు.


సెక్షన్‌ 29 (B): విరాళాల స్వీకరణకు రాజకీయ పార్టీలకు అనుమతి.


సెక్షన్‌ 29 (C): రాజకీయ పార్టీల విరాళాలపై ధ్రువీకరణ.


సెక్షన్‌ 62 (5): చట్టసభల్లో సభ్యుడిగా కొనసాగాలంటే వారికి ఓటు హక్కు ఉండాలి. 


సెక్షన్‌ 75(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ధ్రువీకరించి, ప్రకటించాలి.


సెక్షన్‌ 77: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు.


సెక్షన్‌ 78: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయం వివరాలను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు సమర్పించాలి.


సెక్షన్‌ 80 (A): పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల పిటిషన్లపై విచారణ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది.


సెక్షన్‌ 102: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు, హైకోర్టు పర్యవేక్షణలో లాటరీ ద్వారా ఎన్నిక ఫలితాన్ని నిర్ణయిస్తారు.


సెక్షన్‌ 116 (A): ఎన్నికల వివాదాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేయొచ్చు.


సెక్షన్‌ 123: అవినీతి చర్యలకు పాల్పడిన వారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.


సెక్షన్‌ 125(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పిస్తే వారు శిక్షార్హులు అవుతారు.


సెక్షన్‌ 126: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు నిర్వహించడం నేరం.


సెక్షన్‌ 126(A): ఎన్నికలు జరిగే తేదీకి 48 గంటల ముందు ఆ ప్రాంతాలలో సభలు,సమావేశాలునిర్వహించడం;దృశ్య,శ్రవణ సాధనాల ద్వారా ప్రచారం చేయడం నిషేధం.


సెక్షన్‌ 128: ఎన్నికల ప్రకియలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు అవుతారు.


సెక్షన్‌ 134(A): ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తే శిక్షకు గురవుతారు.


సెక్షన్‌ 134(B): ఎన్నికల సమయంలో పోలింగ్‌ ౠత్‌ల వద్ద ఆయుధాలతో సంచరించడం నేరం.


సెక్షన్‌ 146: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 103 ప్రకారం పార్లమెంట్‌ సభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో రాష్ట్రపతి; ఆర్టికల్‌ 192 ప్రకారం శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.


సెక్షన్‌ 158: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తాము చెల్లించిన ‘డిపాజిట్‌’ (ధరావత్తు)ను తిరిగి పొందాలంటే పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతు చెల్లుబాటయ్యే ఓట్లు పొందాలి. లేకపోతే డిపాజిట్‌ కోల్పోతారు.


సుప్రీంకోర్టు తీర్పులు


* ‘‘శిక్షకు గురైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. హైకోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉందనే కారణంతో చట్టసభల సభ్యుల అనర్హతకు వాయిదా కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) రాజ్యాంగ విరుద్ధం’’ - సుప్రీంకోర్టు

* క్రిమినల్‌ నేరాల్లో దోషులుగా నిర్ధారణై, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్షకు గురైన పార్లమెంట్‌ లేదా రాష్ట్రాల శాసనసభల సభ్యులు తక్షణమే అనర్హులవుతారని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

* క్రిమినల్‌ కేసుల్లో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షకు గురైన ప్రజాప్రతినిధులుపై తక్షణమే అనర్హత వేటు పడుతుందని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే డా.మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిపై ఒక బిల్లును రూపొందించింది. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

* దీంతో ఈ బిల్లుకు ప్రత్యామ్నాయంగా 2013, సెప్టెంబరు 24న ‘ఆర్డినెన్స్‌’ జారీకి అప్పటి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* దీని ప్రకారం, దోషులుగా నిర్ధారణ అయిన చట్టసభల సభ్యులు 90 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకోవచ్చు. అక్కడి నుంచి ‘స్టే’ తెచ్చుకుంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు.
* ఈ ఆర్డినెన్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్డినెన్స్‌తో పాటు సంబంధిత బిల్లును మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 


ప్రజాప్రాతినిధ్య (సవరణ) చట్టం, 2013


* ఈ చట్టం ప్రకారం, ఇతర దేశాల పౌరసత్వం స్వీకరించకుండా భారతదేశం బయట (విదేశాల్లో) నివసిస్తున్న భారతీయులు ఆన్‌లైన్‌లో లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఇది 2011, ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.


ప్రజాప్రాతినిధ్య (సవరణ, ధ్రువీకరణ) చట్టం, 2013


* ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి పోలీసు కస్టడీలో లేదా జైలులో ఉంటే, ఆ కారణంతో తన ఓటుహక్కు కోల్పోడు. జైలులో ఉన్నవారి ఓటుహక్కును తాత్కాలికంగానే నిలిపివేస్తారు. ఓటరుగా వారి గుర్తింపు కొనసాగుతుంది.
* పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా రాజకీయ నేతల అనర్హత అంశంపై అధ్యయనం చేసి, నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను కోరింది.
* ఇది ‘ఎలక్టోరల్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌’ అనే పేరుతో కీలకమైన సిఫార్సులు చేసింది. అవి:
*  అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు భావించాలి. వారికి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలి.
* ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించే సమయానికి ఏడాది ముందు నమోదైన అభియోగాల ఆధారంగా సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయకూడదు.
* అభియోగాలపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు సంబంధిత చట్టసభ సభ్యుడిపై శిక్ష ఖరారు చేస్తే, అది పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల వరకు సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి.
* పదవిలో కొనసాగుతున్న పార్లమెంట్, శాసనసభ్యులపై నమోదయ్యే అభియోగాలపై రోజువారీ విచారణ చేపట్టి,సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేయాలి.


రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ సిఫార్సులు

* జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ చట్ట సభల సభ్యుల అర్హతలు, అనర్హతలపై కొన్ని సిఫార్సులు చేసింది. అవి:
* అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధించే నేరాభియోగం ఎదుర్కొంటున్నవారు పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించాలి.
* హత్య, అత్యాచారం, అక్రమ రవాణా లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా శాశ్వతంగా నిరోధించాలి.
రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు
* వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల సంఘం ప్రజాప్రతినిధుల అనర్హతలకు సంబంధించి ముఖ్య సిఫార్సు చేసింది. 


అది: తీవ్రమైన నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 8ని సవరించాలి.
సభ్యత్వం కోల్పోయిన వారు


రషీద్‌ మసూద్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈయన ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అనర్హతకు గురయ్యారు. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తి.


లాలూ ప్రసాద్‌యాదవ్‌: ఆర్‌జేడీ పార్టీకి చెందిన ఈయన బిహార్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పశుగ్రాస కుంభకోణంలో నేరం రుజువు కావడంతో అనర్హత వేటు పడింది. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన రెండో వ్యక్తి.


జయలలిత: ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నేరం రుజువు కావడంతో ఈమె తన శాసనసభ్యత్వాన్ని (ఎంఎల్‌ఏ), తత్ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.


రాహుల్‌ గాంధీ: 2019 నాటి పరువునష్టం కేసులో ఈయనకు రెండేళ్లు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈయన కాంగ్రెస్‌ తరఫున వయనాడ్‌ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.


అనర్హతకు గురయ్యే సందర్భాలు

చట్టసభల సభ్యులు/ ప్రజాప్రతినిధులు కింది సందర్భాల్లో అనర్హతకు గురువుతారు.

* కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష ప్రాతిపదికగా ఓట్లను అభ్యర్థించడం.
* ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్‌ ౠత్‌ను ఆక్రమించడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం.

* వివిధ వర్గాల ప్రజల మధ్య భావోద్వేగాలను ప్రేరేపించి, అల్లర్లను ప్రోత్సహించడం.

* ఆహార ఔషధ కల్తీ నిరోధక చట్టం కింద శిక్షకు గురైనప్పుడు. 

* ఎన్నికల వ్యయం పరిమితికి మించి  చేసినప్పుడు

* ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా లంచం ఇవ్వడం.

* ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC)లోని సెక్షన్ల ప్రకారం క్రిమినల్‌ నేరం నిరూపితమైనప్పుడు.

* ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమైనప్పుడు.

* నిమ్నవర్గాలకు చెందిన వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురైనప్పుడు.

* చట్టసభకు ఎనికైన సభ్యుడికి ఎన్నికైన తేదీ నాటికి తగిన అర్హతలు లేవని రుజువైనప్పుడు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైనప్పుడు.
 

Posted Date : 29-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మహిళా సంక్షేమం

1. మనదేశంలో 1953లో ఏర్పాటు చేసిన ‘కేంద్ర] సాంఘిక సంక్షేమ మండలి’కి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?


1) విజయలక్ష్మి పండిట్‌    


2) దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌


3) సరోజినీ నాయుడు


4) పూర్ణిమా శ్రీవాణి


2. కింది వాటిలో కేంద్ర] సాంఘిక సంక్షేమ మండలి నిర్వహించే విధులకు సంబంధించి సరైంది?


ఎ) సాంఘిక సంక్షేమ సంస్థలు లేనిచోట నూతనంగా వాటిని ఏర్పాటు చేయడం


బి) ఈ సంస్థల అవసరాలపై సర్వే నిర్వహించడం


సి) కేంద్రం, రాష్ట్రాల్లో వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడం


డి) మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం


1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

3. రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన రక్షణకు సంబంధించి సరైంది?


ఎ) ఆర్టికల్, 15్బ3్శ - మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడం చట్టరీత్యా సమంజసం


బి) ఆర్టికల్, 39 (డి) - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం


సి) ఆర్టికల్, 243  స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేయడం


డి) ఆర్టికల్, 51 (ఎ)(ఇ) - మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు


1) ఎ, బి, డి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, సి     4) పైవన్నీ


4. హిందూ వివాహ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?


1) 1954        2) 1955 


3) 1957        4) 1959

5. పురుషులతో సమానంగా స్త్రీలకు వారసత్వ హక్కును కల్పిస్తున్న హిందూ వారసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?


1) 1952        2) 1953 


3) 1954        4) 1956


6. హిందూ దత్తత, పోషణ చట్టం, 1956కి సంబంధించి కింది వాటిలో సరైంది?


ఎ) భార్య ఒప్పుకుంటేనే బాలుడు లేదా బాలికను దత్తత తీసుకునే వీలుంటుంది


బి) హిందూ స్త్రీ పోషణ బాధ్యత ఆమె భర్తదే


సి) భర్తకు ఆస్తి ఉన్నా, లేకున్నా పోషించే బాధ్యత అతనిదే


డి) భర్త ఆస్తి నుంచి ఖర్చులు పొందే హక్కు భార్యకు ఉంటుంది


1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

7. హిందూ మైనర్ల, సంరక్షకుల చట్టం, 1956 ప్రకారం వివాహం కాని బాలబాలికలకు సంరక్షకులుగా ఎవరుంటారు?


1) మొదట తండ్రి, తరువాత తల్లి 


2) మొదట తల్లి, తరువాత తండ్రి 


3) తల్లిదండ్రులు సమానంగా 


4) పిల్లల అభీష్టం మేరకు

8. కింది వాటిలో ప్రసూతి సౌకర్యాల చట్టానికి సంబంధించి సరైంది?


ఎ) దీన్ని 1961లో రూపొందించారు


బి) ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే స్త్రీలకు ప్రసూతి సౌక్యరాలు కల్పిస్తారు


సి) గర్భం దాల్చిన స్త్రీలకు ప్రసవానికి ముందు, తరువాత వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు


డి) ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానికి ఇచ్చారు

1) ఎ, సి, డి     2) ఎ, బి, డి 


3) ఎ, బి, సి     4) పైవన్నీ


9. కింది వాటిని జతపరచండి.


  జాబితా - తి            జాబితా - తీ


ఎ) వరకట్న నిషేధ చట్టం    i. 1971


బి) గర్భవిచ్ఛిత్తి చట్టం         ii. 1984


సి) మహిళలు, బాలల అక్రమ iii. 1961

వ్యాపార నిరోధక చట్టం 

డి) కుటుంబ కోర్టుల చట్టం    iv.1956

1) ఎ-i, బి-ii, సి-iii, డి-iv  


2) ఎ-iii, బి-i, సి-iv, డి-ii


3) ఎ-iii, బి-ii, సి-iv, డి-i  


4) ఎ-iv, బి-ii, సి-i, డి-iii

10. కింది వాటిలో ఏ సంఘటన 1987లో సతీసహగమన నిరోధక చట్టం రూపకల్పనకు కారణమైంది?


1) రూప్‌కన్వర్‌ సతీసహగమనం         


2) అనితాదేశాయ్‌ సతీసహగమనం 


3) పూర్ణిమా మిశ్రా సతీసహగమనం   


4) రాజేశ్వరి బెనర్జీ సతీసహగమనం

11. కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?


1) 2005, అక్టోబరు 3 


2) 2006, అక్టోబరు 3  


3) 2006, అక్టోబరు 26 


4) 2005, అక్టోబరు 26

12. మహిళలు పనిచేసే కార్యాలయాలు/పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వెలువరించింది?


1) ఎస్‌.ఆర్‌. బొమ్మై జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు  vs1994


2) విశాక జు( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు vs1997


3) నందినీ శతపతి జు( స్టేట్‌ ఆఫ్‌ ఒడిశా కేసు vs1995


4) మినర్వా మిల్స్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు vs1980

13. కింది వాటిలో నేర న్యాయ (సవరణ) చట్టం, 2013కి సంబంధిచి సరైంది?


ఎ) ఈ బిల్లు 2013, మార్చి 19న లోక్‌సభ ఆమోదం పొందింది


బి) 2013, మార్చి 21న రాజ్యసభ ఆమోదం పొందింది 


సి) 2013, ఏప్రిల్‌ 2న రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది


డి) ఈ చట్టమే నిర్భయ చట్టంగా పేరొందింది. 


1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

14. మహిళలకు చట్టసభల్లో 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు?


1) 107వ        2) 108వ 


3) 109వ         4) 110వ 


15.POCSO ACT  అంటే ఏమిటి?


1) Protection Children Social Offences Act

2) Protection of Children from Sexual Offences Act

3) Prevention of Children Social Offences Act

4) Previlage of Children from Sexual Offences Act

16. కింది వాటిలో బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టానికి(POCSO ACT) సంబంధించి సరైంది?


ఎ) 18 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు ఈ చట్టం ద్వారా లైంగిక వేధింపుల నుంచి రక్షణ లభిస్తుంది


బి) బాలుడు/బాలికను రాత్రిపూట పోలీసు స్టేషన్‌లో ఉంచరాదు


సి) ఈ చట్టాన్ని 2012లో రూపొందించారు


డి) ఈ చట్టాన్ని 2014లో సుప్రీంకోర్టు రద్దు చేసింది


1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి     4) పైవన్నీ

17. బేటీ బచావో - బేటీ పడావో పథకాన్ని 2015, జనవరి 22న ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?


1) పానిపట్‌ - హరియాణా    


2) సేలం - తమిళనాడు


3) పూరీ - ఒడిశా  4) వికారాబాద్‌-తెలంగాణ


సమాధానాలు

1-2  2-4   3-4  4-2   5-4   6-4   7-1   8-3  9-2  10-1

11-3    12-2   13-4   14-2  15-2   16-1   17-1

మరికొన్ని...


1. గ్రామీణ మహిళల సామాజిక, ఆర్థిక హోదాను పెంచే ఉద్దేశంతో మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?


1) 1991, ఆగస్టు 2  


2) 1992, సెప్టెంబరు 2 


3) 1993, అక్టోబరు 2     


4) 1992, నవంబరు 16


2. డ్వాక్రా ్బదీజూదిళిత్శి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?


1) 1967        2) 1971 


3) 1974         4) 1982 


3. మహిళా సాధికారత జాతీయ మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?


1) 2010, మార్చి 8 


2) 2012, మార్చి 8     


3) 2013, మార్చి 8    


4) 2014, మార్చి 8

4. కష్టాల్లో ఉన్న మహిళలు, అత్యాచార బాధితులు తదితరులకు ఆత్మస్థైర్యం కల్పించేందుకు కుటుంబ కౌన్సిల్‌ కేంద్రాలు ఎప్పుడు స్థాపించారు?


1) 1979        2) 1981 


3) 1984        4) 1987


5. ఆడపిల్లల ఆర్థిక స్వావలంబన కోసం 2015, జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం ఏది?


1) సుకన్య సమృద్ధి యోజన


2) ఆరోగ్యలక్ష్మి


3) ఆసరా           4) కళ్యాణలక్ష్మి


6. పాఠశాల విద్య కొనసాగించే విద్యార్థినులు సులభంగా సాంకేతిక విద్యారంగంలోకి ప్రవేశించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?


1) సరళ్‌        2) విదూత్‌


3) ఉడాన్‌        4) వెన్నెల


7. ‘మహిళా సాధికారతే భారతదేశ సాధికారత’ అనే నినాదంతో కేవలం మహిళలతోనే నిర్వహించే ‘భారతీయ మహిళా బ్యాంక్‌’ను 2013, నవంబరు 19న అప్పటి భారత ప్రధానమంత్రి డా.మన్మోహన్‌సింగ్‌ ఎక్కడ ప్రారంభించారు?


1) దిల్లీ        2) మీరట్‌ 


3) ముంబయి    4) చెన్నై


8. కింది వాటిలో జాతీయ మహిళా కమిషన్‌కు సంబంధించి సరైంది? 


ఎ) జాతీయ మహిళా కమిషన్‌ చట్టం 1990, ఆగస్టు 30న రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందింది.


బి) 1992, జనవరి 31న జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పడింది


సి) ఈ కమిషన్‌ ఒక చట్టబద్ధమైన సంస్థ


డి) దీని చైర్మన్‌ పదవీకాలం మూడేళ్లు.


1) ఎ, బి, సి         2) ఎ, సి, డి 


3) ఎ, బి, డి         4) పైవన్నీ


సమాధానాలు

1-3  2-4  3-1  4-3   5-1   6-3   7-3  8-4


 


 


 


 


 


 

Posted Date : 08-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు

ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు


ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


1989లో నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 


దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి సమగ్రాభివృద్ధిని సాధించాలని సంకల్పించారు. 


 2001లో ఈ కార్పొరేషన్‌ను విభజించి ఎస్సీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.


కార్పొరేషన్‌ - విధులు: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం నిధులు కేటాయించడం.


యువతకు సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.


 విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందించడం.


 సంబంధిత వర్గాల వారికి సూక్ష్మరుణ సదుపాయం కల్పించడం.


 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం.


జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ

ప్రభుత్వ కంపెనీల చట్టం, 1956లో సెక్షన్‌ 25 ప్రకారం ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ’ను స్థాపించారు. ఇది ఎస్సీ వర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.


స్టాండప్‌ ఇండియా: ప్రధాని నరేంద్రమోదీ 2016 ఏప్రిల్‌ 5న ‘స్టాండప్‌ ఇండియా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 


ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం దీని ఉద్దేశం. 


దీని ప్రకారం వ్యవసాయేతర రంగంలో నూతన పరిశ్రమలను స్థాపించడానికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం అందిస్తారు. 


ఈ రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. 


 స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SIDBI) పరిశ్రమలకు రూ.10,000 కోట్లతో రీఫైనాన్స్‌ చేస్తుంది. 


షెడ్యూల్డ్‌ కులాల ఉపప్రణాళిక (sc-subplan)ఎస్సీ వర్గాల వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే 1979లో  SC-Sub planకు నిర్దిష్ట రూపం ఇచ్చారు.


అల్పసంఖ్యాక వర్గాలు (Minorities):

( మనదేశంలో మతపరమైన మైనార్టీలను నిర్ధారించేందుకు దేశాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. 


( జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టం 1992 లోని సెక్షన్‌ 2(C)ని అనుసరించి 5 మతవర్గాలను మైనార్టీలుగా పరిగణించారు. 


అవి: 1. ముస్లిం     2. క్రైస్తవ    3. బౌద్ధ 


       4. సిక్కు     5. పార్శీ


( 2014లో జైనమతానికి మైనార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది.


మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ: మైనార్టీ వర్గాల సమగ్రాభివృద్ధిని సాధించే లక్ష్యంతో మనదేశంలో 2006, జనవరి 29న ‘‘మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ’’ను ఏర్పాటు చేశారు. 


( ఇది మైనార్టీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక రంగాల ప్రగతి కోసం కృషి చేస్తుంది.

మౌలానా ఆజాద్‌ ఫౌండేషన్‌: దీన్ని 1989, జులై 6న న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. 


( మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఇది స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ.


USTTAD: 2015, మే 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ USTTADను ప్రారంభించారు. 


( USTTAD  అంటే  Upgrading the Skill & Training in Traditional Arts/ crafts for Development.   


( దీని ద్వారా మైనార్టీ వర్గాలకు చెందిన సంప్రదాయ కళలు, హస్తకళలు, ఇతర కళలను పరిరక్షించేందుకు కృషి జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.


కేంద్ర వక్ఫ్‌ మండలి: ఇస్లాం మతానికి చెందిన మతధార్మిక సంస్థ. దీన్ని 1964 డిసెంబరులో ఏర్పాటు చేశారు. 


 ఇది మనదేశంలో వక్ఫ్‌ పాలనకు సంబంధించిన అంశాల్లో సలహాలను ఇస్తుంది. దీనిలో 20 మంది సభ్యులు ఉంటారు. 


 ఇది వక్ఫ్‌ ఆస్తుల అభివృద్ధికి కృషి చేస్తుంది. నేషనల్‌ వక్ఫ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(NAWADCO)ను 2014, జనవరి 29న ఏర్పాటు చేశారు.


DBT స్కాలర్‌షిప్‌ పథకం: ప్రత్యక్ష లాభ బదిలీ(Direct Benefit Transfer) పథకం ద్వారా మైనార్టీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నారు. 


పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్, మెరిట్‌- కమ్‌- మీన్స్‌ స్కాలర్‌షిప్, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ పథకాల కింద నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని బదిలీ చేస్తున్నారు.

ముస్లిం మైనార్టీల అభివృద్ధికి- 15 సూత్రాల పథకం: రాజేంద్రసింగ్‌ సచార్‌ కమిటీ సిఫార్సుల మేరకు డా. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింల సమగ్రాభివృద్ధి కోసం 15 సూత్రాల పథకాన్ని 2006, సెప్టెంబరు 10న ప్రకటించింది. అవి:


1. మైనార్టీ వర్గాలు నివసించే ప్రదేశంలో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు.


2. మదర్సాలను ఆధునికీకరించి మెరుగ్గా నిర్వహించడం,


3. ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు.


4. మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్యారంగంలో మౌలిక సదుపాయాలకు కృషి.


5. ముస్లిం విద్యార్థులు ఎక్కువ ప్రవేశం పొందే విద్యాలయాల్లో ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం.


6. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ అభివృద్ధి పథకం కింద మౌలిక సదుపాయాల కల్పన.


7. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న ఉపాధిహామీ పథకాల్లో 15 శాతం నిధులు, వనరులను కేటాయించడం.


8. చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రుణ సదుపాయాలు కల్పించడం.


9. సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.


10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక కోసం పోటీ పరీక్షార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం.


11. మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్భా గాంధీ విద్యాలయాల ఏర్పాటు.


12. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనే ప్రాంతాల్లో సమర్థులైన ప్రభుత్వ అధికారులను నియమించి, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడం.

13. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం ద్వారా గృహ సదుపాయాల కల్పన.


14. మత కల్లోలాల బాధితులకు తగిన నష్టపరిహారాన్ని అందజేసి, పునరావాసం కల్పించడం.


15. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన వారిని ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించి, అమలు చేయడం.


జియో పార్శీ పథకం: మనదేశంలో మైనార్టీ వర్గమైన పార్శీల జనాభా భారీగా క్షీణిస్తుండటంతో 2013, సెప్టెంబరు 23న మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జియో పార్శీ పథకాన్ని చేపట్టింది. 


 దీని ద్వారా పార్శీల జనాభా సంఖ్యను పెంచేందుకు కృషి జరుగుతుంది.


జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


దేశంలో వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను 1992లో ఏర్పాటు చేశారు. 


 ఈ సంస్థ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.


వ్యవసాయం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, సంప్రదాయ వృత్తులు, సేవారంగం, సాంకేతిక రంగాల్లో ఓబీసీ (వీతీది) వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం.


1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.


 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘‘జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌’’కు రాజ్యాంగబద్ధతను కల్పించారు.


జాతీయ మైనార్టీ ఆర్థికాభివృద్ధి సంస్థ 


 గోపాల్‌సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ‘‘జాతీయ మైనార్టీల ఆర్థికాభివృద్ధి సంస్థ’’ను 1994లో ఏర్పాటు చేశారు. 


ప్రారంభంలో ఈ సంస్థ సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. 


2005లో ఈ సంస్థను మైనార్టీల వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.


ఆశయాలు: మైనార్టీల ఉన్నత విద్యను ప్రోత్సహించడం.వారికి ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారాన్ని కల్పించడం,


వివిధ రకాల చేతివృత్తులు, చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన రుణ సదుపాయాలను కల్పించడం.


గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్య

గిరిజన వర్గాల (ఎస్టీ) ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు 1987లో ‘‘ట్రైబల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా TRIFED)'ను దిల్లీలో స్థాపించారు. ఇది మనదేశంలో అతిపెద్ద సహకార సంస్థ.


 గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ అటవీ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా సరైన ధరలకు విక్రయించడానికి ఇది సహకరిస్తుంది.


షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక (ST-Sub plan)


షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక (st-subplan)ను 5వ పంచవర్ష ప్రణాళికా కాలం 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించింది. 


గిరిజనుల సమగ్రాభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం. 


 ఇందులోని అంశాలు: కనీసం 10,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న 259MADA ప్రాంతాల గుర్తింపు. 


(MADA అంటే Modified Area Development Agency

50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీల(ITDA) స్థాపన.


 


 


 


 

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చట్టాలు - క్రిమినల్‌ కేసులు

రాజ్యాంగ వివరణ:

* భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 233 నుంచి 237 మధ్య అధీన న్యాయస్థానాలు (Subordinate Courts), జిల్లా కోర్టులు, డివిజినల్‌ కోర్టుల గురించి వివరణ ఉంది. 


 జిల్లా న్యాయమూర్తుల ఎంపిక, నియామకం, పదోన్నతి విషయాల గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్‌ సంప్రదిస్తారు.

జిల్లా న్యాయమూర్తి - అర్హతలు:

ఏడు సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో అధికారిగా పనిచేసి ఉండాలి. హైకోర్టు సిఫార్సు చేసిన వ్యక్తిని గవర్నర్‌ న్యాయమూర్తిగా నియమిస్తారు.


తొలి సమాచార నివేదిక (FIR)


ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌ నివేదికను తయారు చేస్తారు. దీన్నే ‘తొలి సమాచార నివేదిక’ (First Information Report - FIR) అంటారు.


* పోలీస్‌ స్టేషన్‌ అధికారిని ఎస్‌.హెచ్‌.ఒ.(Station House Officer)అంటారు. ఇతనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (S.I).


* ఎఫ్‌.ఐ.ఆర్‌.ఆధారంగా ఎస్‌.హెచ్‌.ఒ.పోలీస్‌ స్టేషన్‌లోని రిజిస్టర్‌లో నేరం వివరాలను నమోదు చేసి, ఎటువంటి రుసుము తీసుకోకుండా ప్రతిని ఫిర్యాదుదారుడికి ఇవ్వాలి.


* ఒకవేళ ఫిర్యాదును తీసుకోవడానికి ఎస్‌.హెచ్‌.ఒ. తిరస్కరిస్తే నేరుగా DSP లేదా మెజిస్ట్రేట్‌ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును పోస్టు ద్వారా కూడా పంపవచ్చు.


ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేసిన తర్వాత కేసును పరిశోధించి, పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్‌ అధికారులదే.


విచారణ, అరెస్టులో పోలీసుల పాత్ర


నేరానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా విచారించడం పోలీసుల ముఖ్య కర్తవ్యం. విచారణలో భాగంగా రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్షులు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. విచారణలో సాక్ష్యాలు సేకరించిన తరువాత పోలీసులు న్యాయస్థానంలో ‘‘చార్జ్‌షీట్‌’’ దాఖలు చేయాలి. నిందితుడిని శిక్షించే పని పోలీసులది కాదు. నిందితుడు దోషి అవునో, కాదో.. ఒకవేళ దోషి అని నిర్ధారణ అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు లేదా న్యాయస్థానమే నిర్ణయిస్తుంది.


ఫిర్యాదు చేయడం ఎలా?


ప్రభుత్వాలు చట్టాలను రూపొందించి, అమలు చేస్తాయి. చట్టాలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులవుతారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లే వ్యక్తులు తమ ఫిర్యాదులో కింద పేర్కొన్న వివరాలు తప్పక తెలియజేయాలి.


1. పోలీస్‌ స్టేషన్‌ అధికారిని (S.H.O.) సంబోధిస్తూ ఫిర్యాదు రాయాలి


2. ఫిర్యాదు వివరాలు


3. నేరం జరిగిన తేదీ, సమయం, చోటు    

4. ఏం జరిగింది?


5. నిందితుల పేరు, లింగం, చిరునామా


6. సాక్షుల పేర్లు (నేరం ఎవరి సమక్షంలో జరిగింది)


7. విన్నపం (నిందితులను చట్ట ప్రకారం శిక్షించమని కోరడం, తెలిసి ఉంటే వర్తించే IPC సెక్షన్‌ సంఖ్యను సూచించాలి)


8. ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు


బెయిల్‌: బెయిల్‌ అనేది నిందితుడి హక్కు. నేర తీవ్రత, సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి మంజూరు చేస్తారు. అదే సమయంలో నిందితుడిని విడుదల చేస్తే సమాజానికి, సాక్షులకు, ఫిర్యాదుదారుడికి ఏమైనా హాని జరుగుతుందేమోనని న్యాయస్థానం పరిశీలిస్తుంది. బెయిల్‌ ఇవ్వగలిగే నేరాల్లో ఎస్‌.హెచ్‌.ఒ. బెయిల్‌ మంజూరు చేస్తారు. మిగిలిన నేరాల్లో నిందితుడు సంబంధిత న్యాయస్థానంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.


అప్పీలు విధానం: దిగువస్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందనివారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్చు. మనదేశంలో న్యాయస్థానాలు మూడు స్థాయుల్లో ఉన్నాయి.


1. చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలను ‘సబార్డినేట్‌’ లేదా జిల్లా న్యాయస్థానాలు అంటారు. ఇవి సాధారణంగా జిల్లా లేదా డివిజన్‌ స్థాయిలో ఉంటాయి. 


2. ప్రతి రాష్ట్రంలో ‘హైకోర్టు’ ఉంటుంది. 


3. దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు దిల్లీలో ఉంది.


సివిల్, క్రిమినల్‌ నేరాలు


సివిల్‌ వివాదాలు: భూమి, ఆస్తి, ఆదాయాలపై ప్రజల హక్కులు, వారి మధ్య ఉన్న లావాదేవిలకు సంబంధించినవి. సివిల్‌ వివాదాల్లో జైలుశిక్ష వేయకపోవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన లేదా మోసం వల్ల నష్టపోయాననుకున్న వ్యక్తే స్వయంగా సివిల్‌ కేసు దాఖలు చేస్తాడు.


క్రిమినల్‌ వివాదాలు: దొంగతనం, దోపిడీ, లంచం ఇవ్వడం, కల్తీ మందులు తయారు చేయడం, గొడవలు క్రిమినల్‌ వివాదాలు. ఈ కేసులన్నింటినీ పోలీసులు పరిశీలిస్తారు. సాధారణంగా ఈ తరహా కేసుల్లో దోషులకు జైలుశిక్ష విధిస్తారు.


ప్రభుత్వ న్యాయవాది పాత్ర


* క్రిమినల్‌ నేరాన్ని ప్రజలపై జరిగిన అపరాధంగా భావిస్తారు. అంటే ఈ నేరం బాధితులపైనే కాకుండా సమాజంపైనా జరిగిందని భావిస్తారు. 


* న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రజల ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటారు. పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం దాఖలు చేసిన తరువాత ప్రభుత్వ న్యాయవాది పాత్ర మొదలవుతుంది.


* విచారణలో ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఉండదు. అతడు ప్రభుత్వం తరపున వాదిస్తాడు. న్యాయస్థాన అధికారిగా అతడు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సాక్షులను, రుజువులను న్యాయస్థానం ముందుంచి కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తారు.


* చట్టం ముందు అందరూ సమానులేనని చట్టం చెబుతుంది. నేర విచారణ అమాయకులు అనే భావనతో మొదలవుతుంది 



న్యాయమూర్తి పాత్ర 


న్యాయమూర్తి ఆటలో ‘అంపైర్‌’ లాంటివారు. ఈయన విచారణ నిష్పక్షపాతంగా, బహిరంగంగా నిర్వహిస్తారు. నిందితుడు దోషి అని తేలితే శిక్ష విధిస్తూ తీర్పులిస్తారు. చట్టం ఏం చెబుతుంది అనే దాన్ని బట్టి శిక్ష విధిస్తారు. లేదా జరిమానా వేయవచ్చు లేదా రెండూ విధించవచ్చు.
 

  నేర (క్రిమినల్‌) చట్టం    పౌర (సివిల్‌) చట్టం
ఇది నేరంగా పరిగణించే చర్యలకు సంబంధించింది.
ఉదా: దొంగతనం, వరకట్నం, హత్య.
ఇది ఒక వ్యక్తి ఒప్పం దాన్ని ఉల్లంఘించడం వల్ల మరో వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించింది.
ఉదా: అద్దె, సరకుల కొనుగోలు, విడాకులు
సాధారణంగా ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదైన తరువాత పోలీస్‌ విచారణతో మొదలవుతుంది. ఆ తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు.

నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి.

ఉదా: అద్దె వివాదంలో యజమాని లేదా కిరాయిదారు.

దోషి అని రుజువైతే జరిమానాతో పాటు జైలుకూ పంపించవచ్చు.  నష్టానికి గురైన వ్యక్తి కోర్టు ద్వారా ఉపశమనం పొందుతారు.


 

Posted Date : 19-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కార్మికుల సంక్షేమం - చట్టాలు

కార్మికుల ఆవశ్యకత


ఏ దేశ ప్రగతినైనా నిర్దేశించే సత్తా కార్మిక వర్గానికి ఉంటుంది. దేశ విధానకర్తలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించలేరు. కార్మికులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని వాతావరణం, వేతనాలు అందిస్తే వారు దేశ ప్రగతికి మరింత తోడ్పాటు అందిస్తారు. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక కార్మికులు ఉన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని అంచనా.


రాజ్యాంగంలో - ప్రస్తావన


భారత రాజ్యాంగంలోని IV వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల్లో కార్మిక సంక్షేమం గురించి పేర్కొన్నారు.


* ఆర్టికల్‌ 39 (D): స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.


ఆర్టికల్‌ 39 (E): కార్మికులు వారి శారీరక దారుఢ్యానికి మించి పనిచేయకుండా చూడాలి.


* ఆర్టికల్‌ 42: కార్మికులకు పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీ కార్మికులకు తగిన ప్రసూతి సౌకర్యాలు అందించాలి.


* ఆర్టికల్‌ 43: కార్మికులకు కనీస వేతనం అందించాలి. కార్మికులకు విరామం, విశ్రాంతి, మానసిక వికాసాన్ని కల్పించేందుకు ప్రయత్నించాలి.


* ఆర్టికల్‌ 43(A): పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.


కార్మిక సంక్షేమ పథకాలు

అటల్‌ పెన్షన్‌ యోజన

* ఈ పథకాన్ని  కేంద్రం 2015లో ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం దీని లక్ష్యం. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా కలిగి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. కనీసం 20 ఏళ్లు ఈ పథకంలో కొనసాగాలి. 


60 ఏళ్లు నిండాక వారు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్‌ లభిస్తుంది.


ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన


* ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఇది జీవిత బీమా పథకం. వార్షిక ప్రీమియం రూ.330. రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా ఉండి, 18 సం. నుంచి 50 సం.లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. దీన్ని ఏటా రెన్యువల్‌ చేసుకోవాలి. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే, 55 సం.లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లిస్తే, బీమా సదుపాయం లభిస్తుంది.


స్వావలంబన్‌


దీన్ని 2010లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికుల్లో పొదుపు అలవాటును పెంపొందించడం దీని లక్ష్యం. ఈ పథకంలో చేరిన ప్రతి కార్మికుడికి కేంద్ర ప్రభుత్వం రూ. 1000 చొప్పున తన వాటాగా చెల్లిస్తుంది.


ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన


ఇది వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. 2015లో ప్రారంభించారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. బ్యాంక్‌లో పొదుపు ఖాతా కలిగి, 18 - 70 ఏళ్ల మధ్య వయసు వారు దీనికి అర్హులు. 


పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల పరిహారం నామినీకి లభిస్తుంది.


అసంఘటిత రంగ వాటా పెరుగుదల


మనదేశ ఉపాధిరంగంలో అసంఘటిత రంగ కార్మికుల వాటా 1977-78 నాటికి 92.2 శాతంగా ఉంది. అప్పటికి ఇంకా ప్రపంచీకరణ ప్రభావం మొదలుకాలేదు. National Commission for Enterprises in the Unorganised Sector - NCEUS అధ్యయనం ప్రకారం, వ్యక్తులు లేదా కుటుంబాల యాజమాన్యంలో లేదా భాగస్వామ్యంలో ఉండి, ఉత్పత్తి, అమ్మకాల్లో నిమగ్నమై పదికంటే తక్కువ మందితో పనిచేసే సంస్థలన్నీ అసంఘటిత సంస్థలే.


E-Shram Card

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పించడంతోపాటు సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం 'E-Shram Portale’ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందిస్తారు. దీని కోసం కార్మికులకు (E-Shram Cards)ను ఇస్తారు. 


ప్రయోజనాలు: - దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు.


* ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పూర్తి అంగవైకల్యానికి గురైతే రూ.2 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష పరిహారం అందిస్తారు.


అసంఘటిత రంగంలో పనిచేసే 16 - 59 ఏళ్ల వయసు వారు E-Shram Card కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఉచితం. 


ఈ కార్డుదారులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్‌ పథకం, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రజాపంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి ప్రయోజనాలు పొందొచ్చు.


కార్మిక చట్టాలు


కర్మాగారాల చట్టం, 1948


ఈ చట్టం ప్రకారం, సంస్థ ప్రతి 150 మంది కార్మికులకు ఒక ప్రథమ చికిత్స పేటిక (బాక్స్‌)ను, 500 మందికి మించి కార్మికులు ఉంటే, అంబులెన్స్‌ సౌకర్యాన్ని కల్పించాలి. 


కార్మికులకు విశ్రాంతి గదులు, భోజనశాలను ఏర్పాటు చేయాలి. 500 కంటే ఎక్కువ కార్మికులు ఉంటే వారి యోగక్షేమాల పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. 30 మందికి మించి మహిళా కార్మికులు పనిచేస్తుంటే శిశు సంరక్షణా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 250 మందికి మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.
 

ప్లాంటేషన్‌ కార్మికుల చట్టం, 1951

ఈ చట్టం ప్రకారం, 300 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేస్తుంటే, వారి సంక్షేమ పర్యవేక్షణకు ఒక సంక్షేమ అధికారిని నియమించాలి. కార్మికులతోపాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య, వినోద సౌకర్యాలను కల్పించాలి. మహిళా కార్మికులకు ‘ప్రసూతి భత్యాన్ని’ ఇవ్వాలి. 150 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ కల్పించాలి.


గనుల చట్టం, 1952


ఈ చట్టం ప్రకారం, గనుల్లో పనికోసం బాలబాలికలను కార్మికులుగా నియమించకూడదు. 50 మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా కార్మికులు ఉంటే తప్పనిసరిగా ‘శిశు సంరక్షణా కార్యాలయాన్ని’ ఏర్పాటు చేయాలి. 500 లేదా అంతకు మించి కార్మికులు ఉంటే వారికి భోజనశాల, విశ్రాంతి గదుల సౌకర్యాన్ని కల్పించాలి. 250 మంది లేదా అంతకు మించి కార్మికులు ఉంటే ‘క్యాంటీన్‌ వసతి’ అందించాలి. 150 మంది కార్మికులు ఉంటే వారికి ప్రథమ చికిత్స పేటికలు అందుబాటులో ఉంచాలి.


బోనస్‌ చెల్లింపు చట్టం, 1965


యాజమాన్యం కార్మికులకు వేతనాలతో పాటు అదనంగా చెల్లించే ఆర్థిక ప్రయోజనమే ‘బోనస్‌’. దీని ద్వారా కార్మికులకు అదనపు ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. సంస్థ లాభ-నష్టాలతో సంబంధం లేకుండా బోనస్‌ను చెల్లించాలి. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యంపై బోనస్‌ చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత ఉంది. ప్రతి యజమాని తన సంస్థలో పనిచేసే కార్మికుడికి సంవత్సరంలో తను సంపాదించుకునే వేతనంలో 8.33% ఆర్థిక వనరును కనీస బోనస్‌గా చెల్లించాలి.


అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1979


ఈ చట్టం ప్రకారం, వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులకు చట్టపరమైన రక్షణ, సదుపాయాలను కల్పించాలి. కార్మికులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వారికి సరైన పని పరిస్థితులను, నివాస వసతి కల్పించాలి.


మోటార్‌ రవాణా కార్మిక చట్టం, 1961


ఈ చట్టం ప్రకారం, రవాణా వాహనంలో తప్పనిసరిగా ప్రథమ చికిత్స పెట్టెను (First Aid Box) ను ఉంచాలి.


ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన


దీన్ని 2015లో ప్రారంభించారు. దీని ద్వారా 20కి పైగా కేంద్ర మంత్రిత్వశాఖలు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ, కార్మికులను ఉన్నత స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. 


నూతన వ్యాపారాలను ప్రారంభించడాన్ని మరింత సులభతరం చేస్తూ భారత్‌లో తయారీ, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ లాంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా కార్మికులకు వివిధ రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. 


స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, ముద్ర లాంటి పథకాలతో కార్మికుల్లో సృజనాత్మక ఆలోచనాధోరణులను పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, 1986


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 24 ప్రకారం మన దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలను కర్మాగారాల్లో, గనుల్లో పనుల కోసం నియమించకూడదని నిర్దేశించారు.


బాల కార్మిక నిషేధ చట్టం, 1986 ప్రకారం బాలలు అంటే 14 ఏళ్లలోపు వయసువారు. 


ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం 13 వృత్తులు, 57 ప్రక్రియల్లో  పనుల కోసం పిల్లలను ఉపయోగించడం నేరం.


ఈ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి ఏ వ్యక్తి అయినా బాలలను పనుల కోసం ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తికి 3 నెలలకు తక్కువ కాకుండా ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.


బాల కార్మిక వ్యవస్థ నిషేధ సవరణ చట్టం, 2016


కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధ సవరణ చట్టాన్ని 2016లో రూపొందించింది. ఇందులోని అంశాలు 2016, సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, 18 ఏళ్లలోపు కౌమార దశలో ఉన్న పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమిస్తే సంబంధిత యజమానులకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు.


ఈ చట్టం ప్రకారం, కార్మిక - ఉపాధి మంత్రిత్వశాఖ జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్‌ (NCLP) పథకాన్ని అమలుచేస్తోంది. ఇందులో ప్రతి జిల్లాకు ఒక సొసైటీ ఉంటుంది. వీటిని జిల్లా ప్రాజెక్ట్‌ సొసైటీలు అంటారు. ఇవి బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తాయి. వీటికి జిల్లా మెజిస్ట్రేట్‌ అధ్యక్షత వహిస్తారు.


రచయిత 

బంగారు సత్యనారాయణ విషయ నిపుణులు 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్రపాలిత ప్రాంతాలు - ప్రాంతీయ మండళ్లు

సమన్వయంతో సమర్థ పాలన!
 

దేశంలో పరిపాలన పరంగా పూర్తిగా లేదా పాక్షికంగా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రాంతాలే కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలతో పోలిస్తే వీటి పరిపాలన భిన్నంగా సాగుతుంది. పరిపాలనా సౌలభ్యం, రాజకీయ ప్రాధాన్యం, సాంస్కృతిక భిన్నత్వం, రక్షణ, వ్యూహాత్మక అంశాల ప్రాతిపదికన కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. వీటి పరిణామక్రమం, క్రమానుగతంగా జరిగిన మార్పుచేర్పులు, సంబంధిత రాజ్యాంగ అంశాలతో పాటు దిల్లీకి సంబంధించి ఉన్న వివాదం గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. సహకార సమాఖ్యను బలోపేతం చేసే విధంగా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రాంతీయ మండళ్ల స్వరూపం, పరిధి, పనితీరు గురించి తెలుసుకోవాలి.


వ్యూహాత్మక, పరిపాలనా పరమైన, చారిత్రక కారణాలతో కొన్ని ప్రాంతాలను రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంచారు. వాటినే కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ఇవి కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలో జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేంద్రాలుగా పని చేస్తాయి. వీటికి రాష్ట్రాలకు ఉన్న స్వయంప్రతిపత్తి ఉండదు. 

రాష్ట్రాల్లో నిర్దిష్ట స్థానిక సమస్యలను పరిష్కరించుకోడానికి ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అభివృద్ధి, సాంస్కృతిక సంరక్షణ, వనరుల నిర్వహణ తదితర అంశాల్లో స్థానిక ప్రాతినిధ్యాన్ని అందిస్తారు.

భారత రాజకీయ పరిపాలనలో కేంద్రం అధికారాన్ని ప్రాంతీయ ప్రయోజనాలతో సమన్వయం చేయడంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడంలో, దేశ వ్యాప్తంగా సమర్థ పాలనను అందించడంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ మండళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. 

కేంద్రపాలిత ప్రాంతాలు:  రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్‌ 239 నుంచి 241 మధ్య కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరణ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8.

ఆర్టికల్‌ 239(1): కేంద్రపాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రపతి పరిపాలన కింద ఉంటాయి. రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులను నియమించి వారి ద్వారా పరిపాలిస్తారు. కేంద్రపాలిత ప్రాంత పరిపాలనకు సంబంధించిన శాసనాన్ని పార్లమెంటు ప్రత్యేకంగా రూపొందిస్తే సంబంధిత శాసనమే చెల్లుతుంది.

ఆర్టికల్‌ 239(2): ఒక రాష్ట్ర గవర్నర్‌ను దానికి సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి పరిపాలకుడిగా రాష్ట్రపతి నియమించవచ్చు. ఇలా నియమించిన గవర్నర్‌ సంబంధిత కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

ఆర్టికల్‌ 239(A): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. 14వ రాజ్యాంగ సవరణ చట్టం, 1962 ద్వారా దీన్ని రాజ్యాంగానికి చేర్చారు.

ఆర్టికల్‌ 239(A)(1): పుదుచ్చేరికి శాసనసభ, మంత్రి మండలిని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు శాసనాన్ని రూపొందించవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(a): పుదుచ్చేరి శాసనసభలోని సభ్యులను ఓటర్లు ఎన్నుకోవచ్చు, నామినేట్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 239(A)(1)(b): పుదుచ్చేరి శాసనసభ, మంత్రిమండలి నిర్మాణం, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన అంశాలపై పార్లమెంటు శాసనం రూపొందించవచ్చు. పార్లమెంటు రూపొందించిన శాసనం ప్రకారం 1963లో పుదుచ్చేరికి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA: కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి గురించి వివరిస్తుంది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991 ద్వారా దీనిని నిర్దేశించారు. ఇది 1992 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 239AAs(1): దిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత హోదా కల్పించింది.

ఆర్టికల్‌ 239AA(2)(a): కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి శాసనసభను ఏర్పాటు చేశారు.

ఆర్టికల్‌ 239AA(2)(b): దిల్లీకి సంబంధించిన శాసనసభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల పునర్విభజన, శాసనసభ కార్యనిర్వహణాధికారాలు మొదలైన వాటికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 239AA(2)(c): ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు ఉన్న ఎన్నికల నిబంధనలు దిల్లీ శాసనసభ్యులకు కూడా వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 239AA(3)(a): రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాజ్యాంగ పరిధికి లోబడి చట్టాలు చేసే అధికారం దిల్లీ శాసనసభకు ఉంది. అయితే రాష్ట్ర జాబితాలోని 1, 2, 18, 64, 65, 66 అంశాలకు సంబంధించిన వాటిపై శాసనాలు రూపొందించే అధికారం దిల్లీ శాసనసభకు లేదు.

ఆర్టికల్‌ 239AA(3)(b): కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన శాసనాలను రూపొందించే అంతిమ అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(3)(c) : దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం, పార్లమెంటు రూపొందించిన చట్టం మధ్య విభేదాలు ఏర్పడితే పార్లమెంటు చట్టమే అమలవుతుంది. దిల్లీ శాసనసభ రూపొందించిన చట్టం రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చినప్పటికీ, దాన్ని సవరించే/రద్దు చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది.

ఆర్టికల్‌ 239AA(4): దిల్లీ శాసనసభలోని శాసనసభ్యుల సంఖ్యలో 10% మించకుండా ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనలో సహకరిస్తుంది.

* దిల్లీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సంబంధిత విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదించి, రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరించాలి.

ఆర్టికల్‌ 239AB: దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత పరిపాలనకు అవసరమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టవచ్చు. అంటే అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

సుప్రీంకోర్టు తీర్పు: లెఫ్టినెంట్‌ గవర్నర్ vs దిల్లీ ప్రభుత్వం కేసు-2018

2016లో దిల్లీ హైకోర్టు కీలక తీర్పునిస్తూ దిల్లీ పరిపాలనకు సంబంధించిన సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఉంటాయని పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదు మంది సభ్యుల ధర్మాసనం 2018, జులై 4న దిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పులోని కీలక అంశాలు- * దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలి. * దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు ఉండవు. * దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేదు.* దిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య అభిప్రాయభేదాలు వస్తే రాష్ట్రపతి పరిష్కరించాలి. * పరిపాలనకు సంబంధించిన రోజువారీ వ్యవహారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకుండానే దిల్లీ ప్రభుత్వం పని చేయవచ్చు. * భూమి, శాంతిభద్రతలు, పోలీస్‌ వంటి విషయాలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో దిల్లీ మంత్రిమండలి సలహాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తప్పనిసరిగా అనుసరించాలి.

సుప్రీంకోర్టు తీర్పును అధిగమించేందుకు 2021లో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం 1991 నాటి నేషనల్‌ కాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ యాక్ట్‌ను 2021, మార్చిలో సవరించింది. దీనిప్రకారం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు విస్తృత అధికారాలను కల్పించారు.

ఆర్టికల్‌ 239 (B): పుదుచ్చేరి పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీ చేసే విధానాన్ని వివరిస్తుంది.

ఆర్టికల్‌-239(B)(1): పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు జరగకపోతే దాని ‘అడ్మినిస్ట్రేటర్‌’ ఆర్డినెన్స్‌ జారీ చేయాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి ఆమోదంతో జారీ చేసే ఆర్డినెన్స్‌కు చట్టంతో సమాన విలువ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన 6 వారాల్లోపు ఆర్డినెన్స్‌ను శాసనసభ ఆమోదించాలి. లేకపోతే రద్దవుతుంది.

ఆర్టికల్‌ - 240: కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన రెగ్యులేషన్స్‌ను రాష్ట్రపతి జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ - 241: కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. దీన్ని పార్లమెంట్‌ చట్టం ద్వారా నిర్దేశించవచ్చు. ఆర్టికల్‌ 214 ప్రకారం ఏర్పడిన హైకోర్టుకు ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయో ఈ హైకోర్టుకు కూడా అలాంటి అధికారాలు, విధులు ఉంటాయి.

కేంద్రపాలిత ప్రాంతాల పరిణామక్రమం: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అవి: దిల్లీ, అండమాన్‌ - నికోబార్‌ దీవులు, లక్షదీవులు, హిమాచల్‌ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర.

* 2019లో జమ్ము - కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో దాని రాష్ట్ర హోదా రద్దయింది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ల పేరుతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.

* 2019లో భారత పార్లమెంట్‌ రూపొందించిన చట్టం ప్రకారం డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇది 2020, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

* ప్రస్తుతం మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య: 8 అవి 1) దిల్లీ 2) పుదుచ్చేరి 3) లక్షదీవులు 4) డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలీ. 5) అండమాన్, నికోబార్‌ దీవులు 6) చండీగఢ్‌ 7) జమ్ము-కశ్మీర్‌  8) లద్దాఖ్‌.

* కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి ప్రతినిధులుగా వ్యవహరించే పరిపాలకులను చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పేర్కొంటారు.

* చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్, లక్షదీవులు, చండీగఢ్‌.

* లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌.

ప్రాంతీయ మండళ్లు: ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1956లో దేశంలో 5 ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల మండలి చట్టాన్ని రూపొందించి ‘ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి’ని ఏర్పాటు చేసింది. ఇది 1972 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలోని ప్రాంతీయ మండళ్ల సంఖ్య 6. ఇవి చట్టబద్ధమైన సలహా సంస్థలు. సిక్కిం భారత్‌లో విలీనం అయినప్పుడు తూర్పు మండలిలో ఉండేది. 2002లో సిక్కింను ఈశాన్య రాష్ట్రాల మండలికి బదిలీ చేశారు.


ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ మండళ్ల - స్వరూపం:

1) ఉత్తర ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం దిల్లీ. దీనిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు; దిల్లీ, చండీగఢ్, జమ్ము- కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.

2) పశ్చిమ ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం ముంబయి. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలు; డయ్యూ డామన్, దాద్రానగర్‌ హవేలి కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

3) దక్షిణ ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం చెన్నై. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు; పుదుచ్చేరి, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

4) మధ్య ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం అలహాబాద్‌. ఇందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలున్నాయి.

5) తూర్పు ప్రాంతీయ మండలి: ప్రధాన కేంద్రం కోల్‌కతా. ఇందులో బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు; అండమాన్‌ నికోబార్‌ దీవులు ఉన్నాయి.

6) ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి: దీని ప్రధాన కేంద్రం గువాహటి. ఇందులో అస్సాం, మణిపుర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌ రాష్ట్రాలున్నాయి.

* ప్రాంతీయ మండలి సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు జరగాలి. వాటికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులుగా ఉంటారు.



రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు 

 (వివిధ కమిటీల సిఫార్సులు)

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట సూచనలు!
 

ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ఎన్నికలు అతిముఖ్యమైన ప్రక్రియ. భారత కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, తరచూ అనేక రకాల అవరోధాలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిణామాలు సంభవిస్తున్నాయి. వాటిని పరిహరించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చేసిన పలు సూచనలు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు దోహదపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఎన్నికల సంస్కరణల కోసం ఏర్పాటైన అధికారిక కమిటీలు, వాటి సిఫార్సులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. అమలవుతున్న తీరునూ అర్థం చేసుకోవాలి. 


భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో ఎన్నికలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2024లో జరగబోయే 18వ సార్వత్రిక ఎన్నికల  వరకు దేశ ఎన్నికల వ్యవస్థ సందర్భానుసారం సంస్కరణలకు గురైంది. సమర్థంగా కొనసాగుతోంది. 


సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు (1972): దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం, శాసనసభలకు ఎన్నికలు జరపడం తదితర అంశాలన్నింటినీ ఒకే వ్యక్తి పర్యవేక్షించడం, నియంత్రించడం శ్రమతో కూడిన పని. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళసభ్య ఎన్నికల సంఘంగా’ మార్పు చేయాలి.


తార్కుండే కమిటీ సిఫార్సులు (1982): ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలి. ఓటుహక్కు పొందేందుకు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి.

* కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన బహుళసభ్య ఎన్నికల సంఘంగా, పూర్తి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థగా కొనసాగాలి. పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా నియమించకూడదు.


దినేష్‌ గోస్వామి కమిటీ (1990): నాటి వి.పి.సింగ్‌ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న దినేష్‌ గోస్వామి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలకు ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం నగదు రూపంలో కాకుండా వస్తురూపంలో ఇవ్వాలి. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల పరిశీలనకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి.

* పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌ వంటి నేరాలు జరిగినప్పుడు ఓట్ల లెక్కింపును నిలిపేసి, ఫలితాలు వెల్లడించవద్దని ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించాలి.

రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను నియమిత కాలాల్లో మారుస్తూ, రిజర్వేషన్‌ లేని అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.

* ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లను ఉపయోగించాలి.


ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ (1998):

* రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలను చెక్కుల రూపంలో మాత్రమే స్వీకరించాలి.

* ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.


టి.ఎస్‌.కృష్ణమూర్తి కమిటీ: ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టి.ఎస్‌.కృష్ణమూర్తి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది వివిధ సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలు (అంతర్గత ఎన్నికలు) నిర్వహించాలి.

* 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించదగిన నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్న వ్యక్తులను నిర్దోషులుగా రుజువయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి.

*  ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడానికి అనుమతించాలి. టెలివిజన్‌లో ప్రకటనలకు సంబంధించిన విషయాలపై నియమావళిని రూపొందించాలి. 

* ఓటరుకి ఏ ఒక్కరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం కల్పించాలి. దానికోసం బ్యాలెట్‌ పేపర్‌లో ఒక కాలమ్‌ను ఏర్పాటు చేయాలి.

* ఎగ్జిట్‌పోల్స్‌ను నియంత్రించాలి.

సంతానం కమిటీ (1963): రాజకీయ అవినీతిని అంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ‘విజిలెన్స్‌ కమిషన్ల’ను ఏర్పాటు చేయాలి.

వోహ్రా కమిటీ (1993):  నేరమయ రాజకీయాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఈ కమిటీ పేర్కొంది.

15వ లా కమిషన్‌ సిఫార్సులు (2000):  జస్టిస్‌ జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది.

* ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిస్తే కొత్త అభ్యర్థి పేరును సూచించడానికి వారం రోజులు సమయం ఇవ్వాలి.

* పార్టీ ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి.

* అభ్యర్థి నేరచరిత్ర  తెలిసి కూడా ఏదైనా రాజకీయ పార్టీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి.

* ప్రతి పార్టీ తమ సంస్థాగత ఎన్నికల్లో 30 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అనుమతించకూడదు.

* ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఫిరాయింపుదారులు వేసే ఓట్లు చెల్లవని ప్రకటించాలి.

* రెండంచెల బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలి.

* పార్టీ విరాళాల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించాలి.

* అభ్యర్థులు చెల్లించే డిపాజిట్‌ను పెంచి, లక్ష్యరహితంగా పోటీచేసే వారిని నిరోధించాలి.


రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ సిఫార్సులు: వాజ్‌పేయీ ప్రభుత్వకాలంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ ఏర్పాటు చేశారు. 

సిఫార్సులు:

* ఓటర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పంచాయతీ స్థాయి నుంచి సేకరించాలి. అన్ని నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా ఈవీఎంలను ప్రవేశపెట్టాలి.

* ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 50 శాతం +1 ఓట్లు సాధించిన అభ్యర్థులనే గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికిగాని స్పష్టమైన మెజార్టీ రాకపోతే స్పీకర్‌ను ఎన్నుకునే పద్ధతిలోనే సభానాయకుడిని కూడా చట్టసభల సభ్యులే ఎన్నుకోవాలి.

* సభానాయకుడైన ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే సమయంలోనే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా ప్రతిపాదించాలి.

* ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను రొటేషన్‌ పద్ధతిలో మార్పు చేస్తూ ఉండాలి.


రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు: మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పడింది. 

సిఫార్సులు:

* ఎన్నికల వివాదాలను 6 నెలల్లోపు పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి.

* ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చులో కొంతభాగాన్ని ప్రభుత్వమే భరించాలి.

* అధికార కూటమి నుంచి ఏదైనా రాజకీయ పార్టీ అర్థంతరంగా వెళ్లిపోతే, ఆ పార్టీ విధిగా తిరిగి ప్రజల తీర్పు కోరే విధంగా చట్టంలో మార్పులు చేయాలి. 

* ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరగాలి. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి.

* పార్టీలు ఎన్నికల కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్నికల కంటే ముందుగానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత గానీ, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాలి.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పార్లమెంటు సభ్యులను, రాష్ట్రాల శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇవ్వాలి.

* ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్‌ నిలిపివేయాలి. 

* హత్య, అత్యాచారం, దొంగతనం, అపహరణ మొదలైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలు టికెట్లు ఇవ్వకూడదు.


టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సులు: భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సుల్లో కొన్నింటిని ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అమలుచేశారు.

* ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికను వాయిదా వేయాలి, రద్దు చేయకూడదు. పోలింగ్‌ బూత్‌ సమీపంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం నేరంగా పరిగణించాలి. 

* ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం 10 మంది అతడి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి.

* నేరం నిరూపణ జరిగి, కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే, ఆ వ్యక్తి 6 సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు.

* నామినేషన్ల  ఉపసంహరణ తేదీ నుంచి ప్రచార సమయాన్ని 14 రోజులుగా నిర్ణయించాలి (1997 నుంచి అమల్లోకి వచ్చింది).

* ఎన్నికల ప్రచార సమయం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యపానం, మత్తుపానీయాల అమ్మకాలు, పంపిణీ చేయడం నేరంగా పరిగణించాలి.
 

  దినేష్‌ గోస్వామి     
   ఇంద్రజిత్‌ గుప్తా    
  జస్టిస్‌ జీవన్‌రెడ్డి      
   జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య 

    

   సంతానం    
   టి.ఎన్‌.శేషన్‌     
   టి.ఎస్‌.కృష్ణమూర్తి      
  వోహ్రా      

  వీరప్ప మొయిలీ 

   


 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌