• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం - ముఖ్యాంశాలు  

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు - 2013 ఏ తేదీన చట్టంగా మారింది?
జ: మార్చి 1, 2014

2. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1972

3. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని అంశాలు
జ: 12 భాగాలు, 13 షెడ్యూళ్లు, 108 అధికరణలు

4. ఏపీ పునర్విభజన చట్టంలో హైకోర్టు గురించి వివరిస్తున్న భాగం
జ: 4వ

5. ఏపీ పునర్విభజన బిల్లుపై చర్చ ప్రారంభించిన తొలివ్యక్తి (ఏపీ శాసనసభలో)
జ: వట్టి వసంత్ కుమార్

6. కిందివాటిలో సరికాని అంశం
     1) రాజ్యసభ సీట్లలో ఆంధ్రాకు 11, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
     2) పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల విభజన గురించి రెండో షెడ్యూల్ వివరిస్తుంది.
     3) శాసనమండలి స్థానాలను ఏపీ, తెలంగాణకు 45 + 45గా విభజించారు.
     4) నదీ జలాల నిర్వహణ బోర్డుల ఏర్పాటు గురించి 11వ షెడ్యూల్ పేర్కొంటుంది.
జ: 3(శాసనమండలి స్థానాలను ఏపీ, తెలంగాణకు 45 + 45గా విభజించారు.)

7. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 175 శాసనసభ స్థానాల్లో ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానాల సంఖ్య
జ: 7

8. ఉమ్మడి రాజధాని పరిధిని వివరించే అధికరణ
జ: 5వ

9. 31వ అధికరణ ప్రకారం ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలనే అంశాన్ని నిర్ణయించేది ఎవరు?
జ: రాష్ట్రపతి

10. 84వ అధికరణ ప్రకారం కృష్ణానదీజలాల నిర్వహణ బోర్డు ఎక్కడుంది?
జ: ఆంధ్రప్రదేశ్

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం - ముఖ్యాంశాలు

1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1955లో వచ్చిన విశాలాంధ్ర ఉద్యమం ప్రభావంతో 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ద్వారా కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలన్నీ కలిసి 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, పెద్దమనుషుల ఒప్పందం సక్రమంగా అమలుకావడం లేదనే కారణాలతో తెలంగాణ ప్రాంతంవారు 1969లో జై తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారు. 1972లో ఆంధ్రులు కూడా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమాలను సమన్వయంతో నిలువరించగలిగింది. 1973లో 33వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని అమలుచేసి జోనల్ వ్యవస్థకు పునాది వేసింది. ఇన్ని జరిగినా తెలంగాణ ప్రజల్లో అసంతృప్తిని తొలగించలేకపోయారు.

2001, ఏప్రిల్ 27న కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రసమితి (TRS) పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. 2009, నవంబరు 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఫలితంగా 2009, డిసెంబరు 9న అప్పటి కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీనికి నిరసనగా ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. 2010, డిసెంబరు 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించింది. కమిటీ ఆరు పరిష్కార మార్గాలను సూచించింది. తెలంగాణలో ఉద్యమం తీవ్రత కారణంగా కేంద్రం 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది' అని 2013, జులై 30న ప్రకటించింది. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన్పటికీ ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 ప్రకారం 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014
  కేంద్రం 2013, జులై 30న ఆంధ్ర, తెలంగాణాలను విభజించడానికి నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన బిల్లును రాష్ట్ర శాసనసభలో 2013, డిసెంబరు 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో శాసన సభావ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబును తప్పించి శైలజానాథ్‌కు ఆ పదవి ఇచ్చారు. ఫలితంగా శ్రీధర్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. శాసన సభలోని సంఘటనలకు నిరసనగా తెలంగాణ జేఏసీ జనవరి 7, 2014న ఇందిరా పార్కులో సంపూర్ణ తెలంగాణా సాధన దీక్షను నిర్వహించింది. 2014, జనవరి 8న సభలో బిల్లుపై మంత్రి వట్టి వసంత్‌కుమార్ చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రూల్ 77 కింద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. శాసనసభ, శాసన మండళ్లు తిరస్కరించినప్పటికీ బిల్లు చెల్లుబాటవుతుందని కేంద్రహోంశాఖ ప్రకటించింది. 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించిన పునర్ విభజన బిల్లుపై 2014, మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. 2014, జూన్ 2ను విభజన తేదీ (అపాయింటెడ్ డే)గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014లో 12 భాగాలు (పార్టులు), 108 అధికరణలు (సెక్షన్‌లు), 13 షెడ్యూళ్లు ఉన్నాయి. 
 
చట్టంలోని 12 భాగాలు
1. ప్రవేశిక
* ఇందులో 1, 2 అధికరణలు ఉన్నాయి.
2. రెండోభాగం - ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ
* ఇందులో 3 నుంచి 11 అధికరణలను పొందుపరిచారు.

3. మూడో భాగంలో చట్టసభల్లోని ప్రాతినిధ్య వివరాలు ఉన్నాయి.
* 12 నుంచి 29 వరకు గల (18) అధికరణలు వాటి గురించి వివరిస్తాయి.
4. నాలుగో భాగం హైకోర్టు గురించి వివరిస్తుంది.
* 30 నుంచి 43 వరకు అధికరణలను దీనిలో పొందుపరిచారు.
5. అయిదో భాగంలో వ్యయానికి అధికారం, ఆదాయ పంపిణీలకు సంబంధించిన అంశాలున్నాయి.
* 44 నుంచి 46 వరకు ఉన్న అధికరణలు ఇందులో ఉన్నాయి.
6. ఆరో భాగంలో ఆస్తులు, అప్పుల పంపిణీ గురించి పేర్కొన్నారు.
* 47 నుంచి 67 వరకు ఉన్న అధికరణలు ఇందులో ఉన్నాయి.
7. ఏడో భాగంలో కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలున్నాయి.
* 68 నుంచి 75 అధికరణలు వాటి గురించి వివరిస్తాయి.
8. ఎనిమిదో భాగంలో అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అంశాలున్నాయి.
* 76 నుంచి 83 వరకు గల అధికరణలు ఇందులో ఉన్నాయి.
9. తొమ్మిదో భాగంలో జల వనరుల అభివృద్ధి, నిర్వహణ సంబంధ విషయాలు పేర్కొన్నారు.
* 84 నుంచి 91 వరకు గల అధికరణలు ఇందులో ఉన్నాయి.

10. పదో భాగంలో మౌలిక వనరులు, ప్రత్యేక ఆర్థిక చర్యల గురించి వివరణలున్నాయి.
* 92 నుంచి 94 వరకు గల అధికరణలు ఇందులో పేర్కొన్నారు.
11. పదకొండో భాగంలో ఉన్నత విద్యావకాశాల గురించి పేర్కొంటూ 95వ అధికరణ చేర్చారు.
12. 12వ భాగంలో న్యాయసంబంధ నియమాలను 96 నుంచి 108 వరకు గల అధికరణల్లో పొందుపరిచారు.

చట్టంలోని 13 షెడ్యూళ్లు
1వ షెడ్యూల్: (13వ అధికరణ)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో ఉన్న 18 స్థానాల్లో ఏడు స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానాన్ని వివరిస్తుంది.

2వ షెడ్యూల్: (14 - 17 అధికరణలు)
ఇందులో 2008 నాటి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉత్తర్వులకు ప్రతిపాదించిన సవరణలను పేర్కొన్నారు. 42 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణకు 17 స్థానాలు కేటాయించారు. ఏపీలోని 25 స్థానాల్లో 4 స్థానాలు ఎస్సీలకు, 2 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. తెలంగాణలోని 17 స్థానాల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 స్థానాలు కేటాయించారు. 294 అసెంబ్లీ స్థానాల్లో ఏపీకి 175, తెలంగాణకు 119 స్థానాలు కేటాయించారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీలకు, 7 ఎస్టీలకు కేటాయించగా తెలంగాణలో అవి 19 + 12గా ఉన్నాయి.

3వ షెడ్యూల్: (24వ అధికరణ)
రెండు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్గాల గురించి ఈ షెడ్యూల్‌లో వివరించారు.

4వ షెడ్యూల్: (22(2) అధికరణ)
ఇరు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాలు 90. వీటిని ఏపీకి 50, తెలంగాణకు 40గా కేటాయించారు.

5వ షెడ్యూల్: (28వ అధికరణ)
 తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల గురించి వివరిస్తుంది.

6వ షెడ్యూల్: (29వ అధికరణ)
తెలంగాణలోని షెడ్యూల్డ్ తెగల గురించి వివరిస్తుంది.

7వ షెడ్యూల్: (52వ అధికరణ)
 ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, బీమా ఫండ్, సింకింగ్ ఫండ్, రిజర్వ్ ఫండ్ లాంటి ఫండ్స్, నిధుల గురించి వివరిస్తుంది.

8వ షెడ్యూల్: (59వ అధికరణ)
పింఛన్ చెల్లింపులు, జీతభత్యాల గురించి తెలియజేస్తుంది.

9వ షెడ్యూల్: (68, 71 అధికరణలు)
ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌ల జాబితాలను గురించి వివరించారు.

10వ షెడ్యూల్: (75వ అధికరణ)
     ఇందులో కొన్ని రాష్ట్ర సంస్థల జాబితా, ఆయా సంస్థల్లో కొనసాగింపు లాంటి అంశాలను ప్రస్తావించారు.

11వ షెడ్యూల్: (85(7) అధికరణ)
నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్దారించే సూత్రాలను పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలిగొండ, ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలి.

12వ షెడ్యూల్: (92వ అధికరణ)
బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్ లాంటి రంగాల గురించిన వివరణలు పేర్కొన్నారు.

13వ షెడ్యూల్: (93వ అధికరణ)
విద్యారంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను గురించిన వివరణలు ఇందులో పొందుపరిచారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న IIT, NIT, IIM, పెట్రోలియం, వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయాల స్థాపనకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుంది. తెలంగాణలో మాత్రం గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయాలను కేంద్రమే ఏర్పాటు చేస్తుంది.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు.
* దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు ఏర్పాటు.
* ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలు నెలకొల్పడం.
* విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను ఆధునికీకరించడం.
* విశాఖ, విజయవాడ, గుంటూరు మెట్రో రైలు సౌకర్యాల కల్పన.
    పై పనులన్నింటినీ కేంద్రమే చేపడుతుందని ఈ షెడ్యూల్‌లో వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 108 సెక్షన్‌లు/ ఆర్టికల్స్‌లో కొన్ని ముఖ్యాంశాలు:
* 1, 2 అధికరణల్లో చట్టం పేరు, కొన్ని పదాల నిర్వచనాలు వివరించారు.
* 3వ అధికరణ తెలంగాణ రాష్ట్ర అవతరణ, భూభాగాల గురించి వివరిస్తుంది.
* 5వ అధికరణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది.
* 8వ అధికరణ ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణకు గవర్నరు బాధ్యతల గురించి వివరిస్తుంది.
* 10వ అధికరణ రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 3వ అధికరణలో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాల్సిందిగా పేర్కొంది.
* 12, 13 అధికరణలు రాజ్యసభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యుల కేటాయింపు, పదవీకాలాల గురించి వివరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు 11 స్థానాలు, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
* 17వ అధికరణ శాసన సభ స్థానాల విభజనను పేర్కొంటుంది. 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు, 119 స్థానాలు తెలంగాణకు కేటాయించారు.
* 18వ అధికరణ గవర్నరు 333 రాజ్యాంగ‌ అధికరణ ప్రకారం ఆంధ్రా తెలంగాణా శాసన సభల్లో ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను నియమించాలని తెలుపుతుంది.
* 20వ అధికరణ శాసన సభల పదవీకాలం గురించి వివరిస్తుంది.
* 22వ అధికరణ శాసన మండలి సభ్యుల విభజన గురించి పేర్కొంటుంది. (ఏపీ 50, తెలంగాణ 40)

* 26వ అధికరణ నియోజక వర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన) గురించి వివరిస్తుంది. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలను 119 నుంచి 135కు పెంచాలని పేర్కొంటుంది.
Note: ఏపీలో 50, తెలంగాణలో 16 పెంచవచ్చు.
30వ అధికరణ: ఉమ్మడి హైకోర్టు గురించి పేర్కొంటుంది. న్యాయమూర్తుల జీత భత్యాలు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు భరించాలి.
31వ అధికరణ: హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌ల గురించి వివరిస్తుంది. ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలనే అంశాన్ని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తెలియజేస్తారని ఈ అధికరణ పేర్కొంటుంది.
46వ అధికరణ: 13వ ఆర్థిక సంఘం నిధులను ఇరు రాష్ట్రాలకు పంచే విధానం గురించి వివరిస్తుంది.
47వ అధికరణ: లాభాలు, అప్పుల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే కాగ్‌ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఒక ఉత్తర్వు ద్వారా పరిష్కరించాలని వివరిస్తుంది.
54వ అధికరణ: ప్రజా రుణం గురించి వివరిస్తుంది.
58వ అధికరణ: ప్రావిడెంట్ ఫండ్‌ల గురించి వివరిస్తుంది.
59వ అధికరణ: పెన్షన్లు.
67వ అధికరణ: సంచిత నిధి (కన్సాలిడేటడ్ ఫండ్)
76వ అధికరణ: అఖిలభారత సర్వీసులు
83వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు

84వ అధికరణ: గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డు, కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం చూస్తుందని (60 రోజుల్లో) తెలుపుతుంది. గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డు తెలంగాణాలో, కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి.
90వ అధికరణ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే పూర్తి చేస్తుంది.
91వ అధికరణ: తుంగభద్ర నదీ బోర్డులో ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు సభ్యులుగా ఉంటాయని తెలియజేస్తుంది.
95వ అధికరణ: రాజ్యాంగం 371(D) ప్రకారం అన్ని రకాల విద్యావ్యవస్థల్లో, సంస్థల్లో 10 సంవత్సరాలపాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పిస్తారని వివరిస్తుంది.
96వ అధికరణ: రాజ్యాంగ 168(1)(A)లో తమిళనాడు, తెలంగాణ అనే పదాలు చేర్చాలని పేర్కొంటుంది.
98వ అధికరణ: ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 15కు సవరణ తేవాలని చెబుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రం, శాసన పరిషత్ ఏర్పాటు పదాలు చేకూర్చాలని పేర్కొంది.
99వ అధికరణ: రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956, సెక్షన్ 15కు సవరణ చేయాలని చెబుతుంది. 15(B)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పదానికి బదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పదాలు చేర్చాలని పేర్కొంటుంది.

విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు
2014, మార్చి 1న ఆమోదించిన రెండో రోజునే అంటే మార్చి 2వ తేదీన రెండు ప్రధానమైన సవరణలను కేంద్రం తీసుకువచ్చింది. మొదటిది పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం కాగా, రెండోది ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం, మిగిలిన 15 శాతం విద్యుత్‌ను గత 5 సంవత్సరాల వాస్తవ వినియోగ గణాంకాల ఆధారంగా పంపిణీ చేయడం. 
లోక్‌సభ కూడా తర్వాత 38 సవరణలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి:
* తెలంగాణ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో 25వ రాష్ట్రంగా పేర్కొనడం.
* నిధుల జాబితాలో మొదటి బిల్లులో 41 సంస్థలుండగా వాటిని 69కి పెంచడం.
* కార్పొరేషన్లు, ఇతర సంస్థలను 44 నుంచి 89కి పెంచడం.
* రాష్ట్రస్థాయి సంస్థల సంఖ్యను 42 నుంచి 101కి పెంచడం.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏపీ విభజన సమస్యలు

ఉమ్మడి సచివాలయ భవంతుల అప్పగింత

అప్పటి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నిర్ణయం ప్రకారం సచివాలయం బ్లాకుల్లో జె, కె, ఎల్‌, ఉత్తర హెచ్‌ బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారు. ఏపీ ప్రభుత్వం మొదట ఈ బ్లాకుల నుంచే 13 జిల్లాల పరిపాలన కొనసాగించింది. ప్రజల వద్దకు పరిపాలన తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో 2016లో ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన భవంతులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వినియోగించుకోకుండానే కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను, నీటి సరఫరా వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ బ్లాక్‌లను తమకు ఇస్తే సచివాలయాన్ని పునర్నిర్మించుకుంటామని అభ్యర్థనలు చేసింది. కేవలం సచివాలయ ఆస్తుల విషయంలోనే కాదు షెడ్యూల్‌ 9, 10 సంస్థల ఆస్తులు, నిధుల పంపిణీ, ఉద్యోగుల విభజన జరిపినప్పుడే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని గత ప్రభుత్వం పేర్కొంటూ భవంతుల అప్పగింతకు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సహకారం, సఖ్యత ప్రధానమని భావించి అప్పగింతకు సిద్ధమైంది.
అప్పగింత ప్రక్రియ: తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి గవర్నర్‌ని ఏపీ భవనాలను తమకు అప్పగించాలని మొదట కోరింది. ఆయన మద్దతు తెలపడంతో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 8, 2014 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ గవర్నర్‌ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన భవంతులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు. మొదటి దశలో కే, ఉత్తర హెచ్‌ బ్లాకులను అప్పగించారు. రెండో దశలో మిగతా బ్లాకులను అప్పగించారు.

షెడ్యూల్‌ 9, 10 వివాదాలు

షెడ్యూల్‌ 9 లో పేర్కొన్న 91 సంస్థలకుగానూ 44 సంస్థల విభజన పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ 9, 10 సంస్థలకు చెందిన వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్యలు ప్రారంభించాయి. షెడ్యూల్‌ తొమ్మిది ఆస్తుల విషయంలో ఒక ముగింపు పలకాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ 38 సంస్థల విషయంలో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రులు ఇరువురు ఈ విషయాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని చెప్పారు.
మొదట కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆగస్టు 8, 2019న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ప్రతిపాదించారు. దీనిలో ఎనిమిది అంశాలపై చర్చించాలనుకున్నారు. వాటిలో ప్రధానమైంది 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల వివాదం. అందులో భాగంగా ఏపీ భవన్‌ విభజనకు సంబంధించిన విషయాలను చర్చించాలని భావించారు. విద్యుత్తు బకాయిల చెల్లింపు, ఏపీహెచ్‌ఎంఈఎల్‌ వివాదం లాంటి ఇతర అంశాలూ ఉన్నాయి. పాలనా పరమైన కారణాల వల్ల ఆ మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.

నదీజలాల సహకారం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్ట్‌ 9లో సెక్షన్‌ 84 నుంచి 91 వరకు నదీ జలాల నిర్వహణకు సంబంధించిన విషయాలను పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరిలోని మిగులు జలాలను కృష్ణానదికి తరలించి కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ భూములకు తగిన నీటి సరఫరా చేయాలనే ఆలోచనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. ఆ దిశగా అధికారులు చర్చలు జరుపుతున్నారు.

అమరావతి నిర్మాణం నుంచి తొలగిన సంస్థలు

అమరావతి సస్టెయినబుల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగినట్లు ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా 715 మిలియన్‌ డాలర్లు (రూ.4922 కోట్లు). ఇందులో 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,066 కోట్లు) ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు మొదట సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్రం సూచనల మేరకు నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ 200 మిలియన్‌ డాలర్ల ఆర్థిక మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌ నిధుల్లో రూ. 500 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం 2019 -20 సంవత్సరానికి కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014, సెక్షన్‌ 7 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ఒకరే గవర్నర్‌ ఉంటారు. ఈ నిబంధన ప్రకారమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగారు. జులై 24 2019న నవ్యాంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి పూర్తి స్థాయి గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ హితమైన 6/4 లైన్‌లతో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నిధులు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతుంది. హైవే పొడవు 557 కిలోమీటర్లు.

బకాయిల కోసం తెలంగాణ డిమాండ్‌

అయిదు సంవత్సరాలుగా రాజ్‌భవన్‌, హైకోర్టు నిర్వహణకు సంబంధించి రూ.290 కోట్లు చెల్లించాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ని కోరింది. జనాభా శాతం ఆధారంగా ఈ లెక్కలు తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్‌భవన్‌ నిర్వహణలో వాటాగా రూ.25 కోట్లు, హైకోర్టు నిర్వహణలో వాటాగా రూ.230 కోట్లు, మిగతా చట్టబద్ధ సంస్థల నిర్వహణ కింద మరో రూ.35 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ చెల్లించాలని తెలంగాణ కోరింది. తెలంగాణ డిస్కమ్‌లకు రూ.2,406 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది.

విభజన సమస్యల పర్యవేక్షణ కమిటీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి (ముఖ్యమంత్రికి ప్రజా వ్యవహారాల సలహాదారు), రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా గత కమిటీ నుంచి కొనసాగుతున్న ఎల్‌. రామచంద్రారెడ్డి కొనసాగుతారు.

శాసన సభ, శాసన మండలి భవనాలు

రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు శాసన ప్రక్రియలో అవరోధాలను తొలగించేందుకు ఉమ్మడి రాష్ట్రాల పాత అసెంబ్లీ హాలుని ఆంధ్రప్రదేశ్‌కు, కొత్త అసెంబ్లీ హాల్‌ను తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సమావేశాలు జరిపిన హాల్‌ని ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల కోసం జూబ్లీ హాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ భవనాలనూ తెలంగాణకు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలి భవనాల్లోనే గత రెండు సంవత్సరాలుగా సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసన మండలి కార్యదర్శికి ఈ భవంతులను అప్పగించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌: ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లనూ తెలంగాణ ఎస్టేట్‌ ఆఫీసర్‌కి అప్పగించారు.
డైరెక్టరేట్‌, కమిషనరేట్లు: రెండు రాష్ట్రాల మధ్య సంబంధిత అధికారుల మధ్య అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి డీజీపీ భవంతిని, ఇతర ప్రభుత్వ సేవలు అందిస్తున్న విభాగాలకు హెర్మిటేజ్‌ భవనాన్ని కేటాయించారు. ఈ రెండు భవంతుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
ఉమ్మడి రాజధాని: హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 ద్వారా సంక్రమించిన అధికారాలను బట్టి జూన్‌ 1, 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ

మాదిరి ప్రశ్నలు

1. గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించారు?
a) 50          b) 100            c) 150           d) 200

2. వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కిందివాటిలో సరైంది?

a) ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
b) ప్రతి 75 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
c) ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.
d) ప్రతి 150 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ ఉంటారు.

3. గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?

a) 2019 జులై 15   b) 2019 జులై 31    c) 2019 ఆగస్టు 1    d) 2019 ఆగస్టు 15

4. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?

a) 1992         b)1993          c) 1994           d) 1998

5. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య?

a) 11,065          b) 12,065             c) 13,065             d) 14,065

6. గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?

a) ప్రభుత్వ పథకాలు/ కార్యక్రమాలను ప్రజల ఇంటి వద్దే అందించడం.
b) సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి అక్రమాలను నిరోధించడం.
c) ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడం.
d) పైవన్నీ

7. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్ని రకాల అధికారాలు/విధులను కేటాయించారు?

a) 18             b) 21                c) 27              d) 29

8. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే గ్రామ వాలంటీర్లకు కన్వీనర్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

a) పంచాయతీ కార్యదర్శి             b) గ్రామ రెవెన్యూ అధికారి
c) మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ అధికారి         d) తహసీల్దార్‌

9. గ్రామ సచివాలయ వ్యవస్థలో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య విధులను ఎవరు నిర్వహిస్తారు?

a) పంచాయతీ కార్యదర్శి           b) గ్రామ రెవెన్యూ అధికారి
c) డిజిటల్‌ అసిస్టెంట్‌             d) సర్వే అసిస్టెంట్‌

10. గ్రామ సచివాలయ వ్యవస్థలో సచివాలయ సిబ్బంది బాధ్యతల్లో భాగంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి?

a) ఒక సంవత్సరం      b) 2 సంవత్సరాలు       c) 3 సంవత్సరాలు     d) 5 సంవత్సరాలు

11. రాష్ట్రంలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా?

a) తూర్పు గోదావరి           b) పశ్చిమ గోదావరి
c) అనంతపురం              d) చిత్తూరు

12. వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎంతమంది జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు?

a) 2,000              b) 4,000               c) 6,000              d) 7,000

13. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలకు భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూలు ద్వారా దఖలుపడిన 18 అంశాలు/ విధులను తాజాగా వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎన్ని కేటగిరీలుగా గుర్తించారు?

a) 18            b) 15              c) 13               d) 10

14. వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ఒక్కో వార్డు సచివాలయానికి ఎంతమంది వార్డు కార్యదర్శులను నియమించారు?

a) 5                b) 8                c) 10                 d) 12

15. వార్డు కార్యదర్శుల విధులు/ బాధ్యతలకు సంబంధించి సరైంది?

a) వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించడం
b) లైన్‌ డిపార్టుమెంట్‌లను ప్రజలతో సమన్వయపరచడం
c) వార్డులోని కుటుంబాల్లో అవగాహన కల్పించడం కోసం వార్డు వాలంటీర్ల ద్వారా విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం
d) పైవన్నీ

16. వార్డు సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ను కేటాయించారు?

a) రూ.180 కోట్లు      b) రూ.280 కోట్లు       c) రూ.380 కోట్లు        d) రూ.480 కోట్లు

17. గ్రామ సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ను కేటాయించారు?

a) రూ.400 కోట్లు   b) రూ.500 కోట్లు    c) రూ.600 కోట్లు       d) రూ.700 కోట్లు

18. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం?

a) విజయవంతంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేయడం
b) ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగాలను ఒకేచోట అందుబాటులో ఉంచడం
c) ప్రజా సమస్యల్ని పరిష్కరించి నిర్దేశిత గడువులోగా పౌరసేవలు అందించడం
d) పైవన్నీ

సమాధానాలు: 1-a, 2-c, 3-d, 4-c 5-c, 6-d, 7-d, 8-a, 9-a, 10-d, 11-d, 12-b, 13-d, 14-c, 15-d, 16-a, 17-d, 18-d.

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ

నూతన రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే దీని ప్రధాన ధ్యేయం.

వాలంటీర్లు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ/ మున్సిపల్‌ సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. 2019 జూన్‌ 22న గ్రామ వాలంటీర్లు, 23న వార్డు వాలంటీర్లకు సంబంధించిన రెండు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.

గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను, పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్‌ను నియమించారు. వారు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సేవలను అందిస్తారు. మైదాన ప్రాంతాల్లోని గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్‌ లేదా సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వార్డు వాలంటీర్లకు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. వాలంటీర్‌గా నియమితులయ్యే వారు కచ్చితంగా సంబంధిత గ్రామ/ గ్రామ పంచాయతీ/ పట్టణ స్థానిక సంస్థలకు చెందినవారై ఉండాలనే నిబంధనను విధించారు. గ్రామ/ వార్డు వాలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా రూ.5,000 చెల్లిస్తారు. ఈ వేతనాలకు సంవత్సరానికి రూ.1200 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ

* విజయవంతంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒకేచోట అందుబాటులో ఉంచడం, ప్రజా సమస్యల్ని పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించడం గ్రామ/ వార్డు సచివాలయాల ముఖ్య ఉద్దేశం.

1. గ్రామ సచివాలయ వ్యవస్థ:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం - 1994’ను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా భారత రాజ్యాగంలోని 11వ షెడ్యూల్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి 29 రకాల అధికారాలను పేర్కొన్నారు. వీటిలో పదింటిని గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007, 2008 సంవత్సరాల్లో వివిధ ఉత్తర్వులను జారీచేసింది. అయితే ఈ అధికారాల నిర్వహణకు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. నవరత్నాల పథకాలను అర్హులందరికీ సమర్థంగా అందజేసే లక్ష్యంతో గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిలో భాగంగా పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను సమర్థంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ 2019 జులై 19న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయను న్నారు. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా 95,088 ఉద్యోగాల నియామకాలను చేపట్టనున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి ప్రజలకు సేవలు అందిస్తారు.

 మొదట 2,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయంగా నిర్ణయించారు. ప్రతి గ్రామ పంచాయతీని గ్రామ సచివాలయంగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. (మొదట గిరిజన ప్రాంతాల్లో 2000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు). పెద్ద పంచాయతీల్లో 2,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే అక్కడ 2 వేల మందికి ఒకటి చొప్పున అనుబంధ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అదనపు సచివాలయాల్లో కూడా సహాయ కార్యదర్శితో కలిపి 10 మంది చొప్పున ఉద్యోగ బృందాలు సేవలు అందిస్తాయి. ఈ అనుబంధ సచివాలయాలు పంచాయతీ ప్రధాన సచివాలయ కార్యదర్శి పరిధిలోనే పనిచేస్తాయి. గ్రామ సచివాయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు దాని పరిధిలోని వాలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి పేరు మీదగానే జీతాలు చెల్లిస్తారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు ఇచ్చారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్‌ డిపార్ట్‌మెంట్‌లతో కలిపి అయిదేళ్లకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసి అమలుచేస్తారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* గ్రామ సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండు సంవత్సరాలపాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావిస్తారు. ఆ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున వేతనంగా చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత సంబంధిత శాఖల నిబంధనల మేరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు - బాధ్యతలు

గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభల నిర్వహణ, అయిదేళ్లకు ఒకసారి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ, నిర్దేశించిన గడువులోగా ప్రజలకు పౌరసేవలు అందించడాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది ప్రధాన బాధ్యతలుగా నిర్ణయించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ 2019 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వస్తుంది. 2019-20 సంవత్సరానికి గ్రామ సచివాలయాల కోసం రూ.700 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1372, అత్యల్పంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 791 ఉన్నాయి.

2. వార్డు సచివాలయ వ్యవస్థ:

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, బడ్జెట్‌ కేటాయింపు, విధి విధానాలపై 2019 జులై 20న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3,775 వార్డు సచివాలయాల్లో 37,750 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు సచివాలయాల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి కనీసం 3,000 నుంచి గరిష్ఠంగా 5,000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. 5000 కంటే అధిక జనాభా ఉన్న డివిజన్లలో 4,000కు ఒకటి చొప్పున, జనాభాను బట్టి రెండు, మూడు వార్డు సచివాలయాలను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వేల కంటే తక్కువ జనాభా ఉంటే రెండు మూడు డివిజన్లను కలిపి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటుచేస్తారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన అధికారాలన్నీ వార్డు సచివాలయాలకు బదలాయిస్తారు.

పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలకు 12వ షెడ్యూలు ద్వారా దఖలుపడిన 18 అంశాలను 10 విభాగాలుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని వార్డు సచివాలయాల్లో నియమిస్తారు. వీరు తమ పరిధిలోని వార్డు వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువస్తారు. ఒక్కో వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య, ఆరోగ్య శాఖ, ఆదాయానికి సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీసు శాఖ పర్యవేక్షించనుంది. మిగిలిన సేవలన్నింటినీ (7 సేవలు) మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తుంది. వార్డు సచివాలయాల నిర్వహణ, కొత్తగా నియమించ నున్న వార్డు కార్యదర్శుల శిక్షణ, వేతనాల కోసం ప్రస్తుత సంవత్సరంలో రూ.629.99 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణ కాలంలో 2 సంవత్సరాల వరకు నెలకు రూ.15,000 స్టైఫండ్‌ను చెల్లిస్తారు. తర్వాత సంబంధిత శాఖల సర్వీసు రూల్స్‌ ప్రకారం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వార్డు సచివాలయం కోసం వార్డులోని వార్డు కార్యాలయం, అంగన్‌వాడీ భవనం, పాఠశాల భవనం, సామాజిక రిసోర్స్‌ కేంద్రం, కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ కార్యాలయంలో సరిపోయే ప్రదేశాన్ని గుర్తించి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేస్తారు. వార్డులో ప్రభుత్వ భవనంలో సరైన స్థలం లేకపోతే రెండు, మూడు వార్డు సచివాలయాలను కలిపి ఒక భవనంలో నిర్వహించవచ్చు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే వార్డు సచివాలయాల కోసం ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటారు.

వార్డు కార్యదర్శి(సెక్రెటరీ) విధులు, బాధ్యతలు:

* వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి.
* లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను ప్రజలతో సమన్వయం చేయాలి.
* అత్యవసరమైన సేవలను గుర్తించాలి.
* అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలి.
* ప్రజల నుంచి వినతులను స్వీకరించి, ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
* వార్డులోని కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* పౌరులకు ఇంటి వద్దే వివిధ ప్రభుత్వ సేవలు అందేలా చూడాలి.

వార్డు సచివాలయంలోని 10 మంది వార్డు కార్యదర్శులు - విధులు

* వార్డు సచివాలయాల కోసం 2019-20 సంవత్సరానికి మొత్తం రూ.180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.

పట్టణ స్థానిక సంస్థల (ULB) అధికార పరిధి:

* 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 అంశాలకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలు అధికార పరిధిని కలిగి ఉన్నాయి. వీటినే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వార్డు సచివాలయాల కోసం 10 కేటగిరీలుగా విభజించి వీటి నిర్వహణ కోసం 10 మంది కార్యదర్శులను నియమిస్తుంది.
1. పట్టణ/ నగర ప్రణాళికీకరణ
2. భూ వినియోగం, భవనాల నిర్మాణం, నియంత్రణ
3. ఆర్థిక, సాంఘికాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం.
4. రోడ్లు, వంతెనలు
5. గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా
6. ప్రజారోగ్యం, పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ
7. అగ్నిమాపక సేవలు
8. పట్టణ అడవులు; పర్యావరణం, జీవావరణ పరిరక్షణ
9. సమాజంలోని జలహీన వర్గాలు; శారీరక, మానసిక వికలాంగుల ప్రయోజనాలు, పరిరక్షణ
10. మురికివాడల అభివృద్ధి
11. పట్టణ పేదరిక నిర్మూలన
12. పార్కులు, తోటలు, ఆటస్థలాలు లాంటి వసతులను పట్టణాల్లో ఏర్పాటుచేయడం.
13. సాంస్కృతిక విద్యను ప్రోత్సహించడం
14. శ్మ‌శాన వాటికల ఏర్పాటు, నిర్వహణ, వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం.
15. పశువులకు తాగునీటి కోసం నీటి కుంటలను ఏర్పాటు చేయడం, క్రూర జంతువులను సంరక్షించడం.
16. జనన, మరణ లెక్కల జాబితాను తయారు చేయడం.
17. వీధి దీపాలు, పార్కింగ్‌ స్థలాలు, బస్టాప్‌లు, ఇతర ప్రజా సౌకర్యాలు, సేవలను అందించడం.
18. జంతు వదశాలలను క్రమబద్ధీకరించడం.

గ్రామ పంచాయతీల అధికార పరిధి:

* 73వ రాజ్యాంగ సవరణలో భాగంగా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో గ్రామ పంచాయతీలకు కేటాయించిన విధులు/ అధికారాలు కిందివిధంగా ఉన్నాయి.
1. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ పనులు
2. భూసారాన్ని మెరుగుపరచడం, భూసంస్కరణల అమలు, భూములను సాగులోకి తీసుకురావడం.
3. చిన్నతరహా సాగునీటి పథకాలు, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి
4. పశువుల సంరక్షణ, పాడిపరిశ్రమ, పాల ఉత్పత్తులు, కోళ్ల పరిశ్రమ
5. చేపల పెంపకం
6. సామాజిక అడవులు, వ్యవసాయ అడవులు
7. చిన్న తరహా అటవీ ఉత్పత్తులు
8. ఆహారశుద్ధి పరిశ్రమలతో కలిపి చిన్న తరహా పరిశ్రమలు
9. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు
10. గ్రామీణ గృహ నిర్మాణం
11. తాగునీటి సౌకర్యం
12. ఇంధనం, దాణా
13. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలు, పెర్రీలు, జలమార్గాలు, ఇతర ప్రసార మార్గాలు.
14. విద్యుత్‌ సరఫరాతోపాటు గ్రామీణ విద్యుదీకరణ
15. సంప్రదాయేతర ఇంధన వనరులు
16. పేదరిక నిర్మూలనా పథకం
17. విద్య, (ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు)
18. సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య
19. వయోజన, అనియత విద్య
20. గ్రంథాలయాలు
21. సాంస్కృతిక కార్యకలాపాలు
22. మార్కెట్లు, సంతలు
23. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రులు (ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిస్పెన్సరీలు)
24. కుటుంబ సంక్షేమం
25. మహిళా, శిశు అభివృద్ధి
26. సాంఘిక సంక్షేమం (వికలాంగులు, మానసిక వికలాంగుల సంక్షేమంతో కలిపి)
27. అణగారిన వర్గాల సంక్షేమం, ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సంక్షేమం
28. ప్రజా పంపిణీ వ్యవస్థ
29. సామాజిక ఆస్తుల నిర్వహణ 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన - చట్టం

12 భాగాలు.. 13 షెడ్యూళ్లు.. 108 సెక్షన్లు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ విభజన హామీలు నెరవేరలేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర విభజన ప్రక్రియ ఎలా సాగింది? ఆ చట్టంలో ఏముంది? సిలబస్‌ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన, సమస్యలు-సవాళ్లు’ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను తెలుసుకోవాలి.  

కేంద్ర ప్రభుత్వం అనేక తర్జనభర్జనల అనంతరం 2013, జులై 30న ఆంధ్రప్రదేశ్‌ విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. సంబంధిత ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. అదే ఏడాది డిసెంబరు 12న రాష్ట్ర విభజనపై రూపొందించిన రాష్ట్రపతి బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పంపింది. బిల్లుపై అభిప్రాయం తెలియజేసేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.

* రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును 2013, డిసెంబరు 16న అప్పటి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై 2014, జనవరి 30 నాటికి వివిధ క్లాజులకు సంబంధించి 9,072 సవరణలు సభ్యుల నుంచి రాతపూర్వకంగా వచ్చాయి. శాసనమండలిలోనూ ఈ బిల్లుపై 1,157 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రంలోని రెండు చట్టసభలు తిరస్కరించాయి. (రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర చట్ట సభలు ఇలాంటి బిల్లును తిరస్కరించినప్పటికీ పార్లమెంట్‌ వాటికి కట్టుబడాల్సిన పని లేదు)

* ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014కు లోక్‌సభ 2014, ఫిబ్రవరి 18న, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపాయి. అనంతరం మార్చి 1న రాష్ట్రపతి ఆమోదంతో భారత గెజిట్‌ నంబరు ‘6’ ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014’ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

* కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2014, మార్చి 4న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌ 2(ఎ) ప్రకారం 2014, జూన్‌ 2ను ‘అపాయింటెడ్‌ డే’ (అవతరణ దినం/నియామక దినం)గా నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

* 2014, మార్చి 28న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్‌-6 ప్రకారం తెలంగాణ విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం సూచనలు చేయడానికి ‘శివరామకృష్ణన్‌’ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తన నివేదికను 2014, ఆగస్టు 27న కేంద్ర హోం శాఖకు అందించింది.

- 2014, జూన్‌ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అనంతరం 2014, జులై 17న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్‌-3కి సవరణ చేసి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను (పూర్తిగా 5, పాక్షికంగా 2) నూత‌న‌ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఆ మండలాలను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  చేర్చారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014

ఈ చట్టంలో మొత్తం 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూళ్లు ఉన్నాయి.

1. మొదటి షెడ్యూల్‌ (సెక్షన్‌ 13): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యసభలోని 18 స్థానాల్లో 7 స్థానాలు తెలంగాణకు కేటాయించడం గురించి వివరిస్తుంది.

2. రెండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 15): ఇందులో 2008 నాటి పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల సర్దుబాటు ఉత్తర్వులకు ప్రతిపాదించిన మార్పుల గురించి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 25 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాలు షెడ్యూల్డ్‌ కులాలకు, ఒక స్థానం షెడ్యూల్డ్‌ తెగలకు కేటాయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో తమిళనాడు సీరియల్‌ నంబరు ‘24’ తర్వాత 25వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం వివరాలు చేర్చారు. తెలంగాణకు కేటాయించిన 17 లోక్‌సభ స్థానాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు 3 స్థానాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 2 స్థానాలు కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు 29 స్థానాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 7 స్థానాలు కేటాయించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 19 షెడ్యూల్డ్‌ కులాలకు, 12 స్థానాలు షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేశారు.

3. మూడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 24): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజకవర్గాల వివరాలను పేర్కొన్నారు.

4. నాలుగో షెడ్యూల్‌ (సెక్షన్‌ 22(2)): దీంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శాసనమండలి సభ్యుల గురించి వివరించారు. 

5. ఐదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 28): ఈ షెడ్యూల్‌లో రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ కులాలు)లో మార్పుల గురించి పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల గురించి వివరణ.

6. ఆరో షెడ్యూల్‌ (సెక్షన్‌ 29): రాజ్యాంగ ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ తెగలు) లో మార్పుల గురించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ తెగల గురించి వివరిస్తుంది.

7. ఏడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 52): ప్రావిడెంట్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్, బీమా ఫండ్స్, సింకింగ్‌ ఫండ్స్, గ్యారెంటీ రిజంప్సన్‌ ఫండ్స్, రిజర్వ్‌ ఫండ్స్, ఇతర నిధుల గురించి చెప్పారు.

8. ఎనిమిదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 59): రెండు రాష్ట్రాలకు సంబంధించి పింఛను చెల్లింపు బాధ్యతల పంపిణీ.

9. తొమ్మిదో షెడ్యూల్‌ (68, 71 సెక్షన్లు): ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల జాబితా. ఇందులో మొత్తం 89 సంస్థలున్నాయి.

10. పదో షెడ్యూల్‌ (సెక్షన్‌ 75): సౌకర్యాలు కొనసాగించాల్సిన సంస్థల జాబితా. ఇందులో మొత్తం 142 సంస్థలున్నాయి.

11. పదకొండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 85(7)): ఈ సెక్షన్లో నదీ జలాల నిర్వహణ బోర్డుల పనివిధానాన్ని నిర్దేశించే సూత్రాల గురించి పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను అనుకున్నట్టుగానే పూర్తి చేయాలి. వాటి నీటి కేటాయింపు ఏర్పాట్లలో మార్పు ఉండదు.

12. పన్నెండో షెడ్యూల్‌ (సెక్షన్‌ 92): ఇందులో బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్తు విభజన గురించి పేర్కొన్నారు.

13. పదమూడో షెడ్యూల్‌ (సెక్షన్‌ 93): విద్య, మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యమున్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌; పెట్రోలియం, వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకరిస్తుంది. అలాగే తెలంగాణలో గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తుంది.

* ఓడరేవులు, ఉక్కు పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్‌లు, విమానాశ్రయాలు, మెట్రో రైలు సౌకర్యాలు, విద్యుత్తు ప్లాంటు లాంటి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని దుగ్గిరాజపట్నంలో భారీ ఓడరేవును నిర్మిస్తుంది. ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలను నెలకొల్పుతుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు విస్తరిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మహానగర- అభివృద్ధి సంస్థ పరిధిలో మెట్రో రైలు సౌకర్యం కల్పించే విషయమై అధ్యయనం చేసి, ఏడాదిలోగా కేంద్రం నిర్ణయం వెలువరిస్తుంది.

చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు

సెక్షన్‌-1: విభజన చట్టం పేరు గురించి చెబుతుంది.

సెక్షన్‌-3: తెలంగాణ రాష్ట్ర అవతరణ, తెలంగాణ భూభాగాల గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-5: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది.

సెక్షన్‌-6: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటును చెబుతుంది.

సెక్షన్‌-8: ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణ, గవర్నరు బాధ్యతలను తెలియజేస్తుంది.

సెక్షన్‌-9: రెండు రాష్ట్రాలకు కేంద్ర బలగాల సాయం గురించి పేర్కొంటుంది.

సెక్షన్‌-10: రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌-3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాలని పేర్కొంటుంది. అలాగే ఎంట్రీ ‘28’ తరువాత ఎంట్రీ ‘29’గా తెలంగాణను చేర్చి విభజన చట్టంలోని సెక్షన్‌-3లో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాలి.

సెక్షన్‌-12: రాజ్యాంగం నాలుగో షెడ్యూల్‌లో ఇరు రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యులకు సంబంధించి మార్పుల గురించి పేర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు 11 మంది, తెలంగాణకు 7 మంది రాజ్యసభ సభ్యులను కేటాయించారు.

సెక్షన్‌-14: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాతినిథ్యం గురించి పేర్కొంటోంది. మొత్తం 42 స్థానాల్లో ఏపీకి 25, తెలంగాణకు 17 స్థానాలను కేటాయించారు. ఆ మేరకు ప్రజాప్రాతినిథ్య చట్టం -1950 మొదటి షెడ్యూల్‌ను సవరించినట్లు పరిగణించాలి.

సెక్షన్‌- 17: ఇరు రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాల కేటాయింపు గురించి చెబుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 స్థానాలు కేటాయించి ప్రజా ప్రాతినిధ్య చట్టం -1950లో మార్పులు చేయాలి.

సెక్షన్‌-22: ఇందులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన వేర్వేరు శాసనమండళ్లు, సభ్యుల గురించి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 50 మంది సభ్యులకు మించకుండా, తెలంగాణకు 40 మందికి మించకుండా ఉండాలి.

సెక్షన్‌-26: అసెంబ్లీ నియోజక వర్గాల డీలిమిటేషన్‌ గురించి పేర్కొంటుంది. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225 స్థానాలకు, తెలంగాణలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెంచాలని సూచిస్తుంది.

సెక్షన్‌-28: రాజ్యాంగం ఉత్తర్వు -1950 (షెడ్యూల్డ్‌ కులాలు) సవరణ గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-29: రాజ్యాంగం ఉత్తర్వు-1950 (షెడ్యూల్డ్‌ తెగలు) సవరణ గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-30: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడే వరకూ హైదరాబాద్‌ హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. ఈ కాలంలో న్యాయమూర్తుల జీతభత్యాలను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలు భరించాలి.

సెక్షన్‌-31: ఇందులో ఇరు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల గురించి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఎక్కడ ఉండాలనేది రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తెలియజేస్తారు.

సెక్షన్‌-45: ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఖాతాల నివేదికలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) రెండు రాష్ట్రాల గవర్నర్‌లకు అందించాలి.

సెక్షన్‌-46: 13వ ఆర్థిక సంఘం నిధులను ఇరు రాష్ట్రాలకు పంచే విధానాన్ని వివరిస్తుంది.

సెక్షన్‌-47: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, అప్పులకు సంబంధించిన ఇరు రాష్ట్రాల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. లాభాలు, అప్పుల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాలు మధ్య వివాదం తలెత్తితే కాగ్‌ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి.

సెక్షన్‌-50: ఇరు రాష్ట్రాలకు ‘పన్ను బకాయిలు’ వసూలు అధికారాన్ని వివరిస్తుంది.

సెక్షన్‌-51: ఇరు రాష్ట్రాలకు ‘రుణాలు, అడ్వాన్సులు వసూలు చేసే హక్కు’ గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-53: ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వాణిజ్య లేదా పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పులను ఆ సంస్థలున్న ప్రధాన కార్యస్థానంతో సంబంధం లేకుండా ఆ సంస్థలున్న ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో చేర్చారో ఆ రాష్ట్రానికి అందజేయాలి.

- అయితే ఆ సంస్థ కార్యకలాపాలు అంతర్రాష్ట్రానికి చెందినవి అయితే వాటి ఆపరేషన్‌ యూనిట్ల ఆస్తులు, అప్పులను ప్రాదేశిక ప్రాతిపదికపైన కొత్త రాష్ట్రాల మధ్య పంచాలి. ఆ సంస్థ ప్రధాన కార్యస్థానం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికపై పంపకం చేయాలి.

సెక్షన్‌-54: ‘ప్రజారుణం’ను ఇరు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలి.

సెక్షన్‌-68, 71: 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న కొన్ని కార్పొరేషన్లు (సెక్షన్‌-68), కంపెనీలు (సెక్షన్‌-71) ఇరు రాష్ట్రాల్లో కొనసాగింపు, పంపిణీ గురించి వివరిస్తుంది.

సెక్షన్‌-84: గోదావరి, కృష్ణా నదీ జల యాజమాన్య మండలి ఏర్పాటు, కూర్పు.

సెక్షన్‌-85(1): అపాయింటెడ్‌ డే నుంచి 60 రోజుల్లోగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వివరిస్తుంది.

సెక్షన్‌-85(2): గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోను, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంటాయి.

సెక్షన్‌-90: పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు. ప్రాజెక్టు అభివృద్ధి, నిర్మాణాల బాధ్యతను కేంద్రం స్వీకరించాలి. నిర్మాణానికి కావాల్సిన పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ అనుమతులన్నింటినీ కేంద్రమే సంపాదించాలి.

సెక్షన్‌-91: తుంగభద్ర బోర్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్థానాన్ని రెండు కొత్త రాష్ట్రాలు భర్తీ చేయాలి. ఎగువ గట్టు కాలువ, దిగువ గట్టు కాలువ, రాజోలిబండ మళ్లింపు పథకం నుంచి నీటి విడుదలను తుంగభద్ర బోర్డు పర్యవేక్షిస్తుండాలి.

సెక్షన్‌-92: బొగ్గు, చమురు - సహజవాయువు, విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మొదలైన 12వ షెడ్యూల్‌ అంశాలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను రెండు రాష్ట్రాలు పాటించాలి.

సెక్షన్‌-93: 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా అవతరణ రోజు నుంచి పదేళ్లలోగా రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధాన, అవస్థాపన  సౌకర్యాల ఏర్పాటు కోసం అన్ని చర్యలు తీసుకోవాలి.

సెక్షన్‌-94: రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధితోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం పన్ను ప్రోత్సాహకాలతోపాటు అన్నిరకాల ఆర్థిక చర్యలు తీసుకోవాలి.

సెక్షన్‌-95: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371(డి) ప్రకారం అన్నిరకాల విద్యాసంస్థల్లో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయి.

సెక్షన్‌-96: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168, ఆర్టికల్‌ 168(1) (ఎ) లో ‘తమిళనాడు’ అనే పదానికి బదులు ‘తమిళనాడు, తెలంగాణ’ అనే పదాలు చేర్చాలి.

సెక్షన్‌-99: రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం -1956 లోని సెక్షన్‌ 15(బి)లో ‘ఆంధ్రప్రదేశ్‌’ అనే పదానికి బదులు ‘ఆంధ్రప్రదేశ్‌’, ‘తెలంగాణ’ అనే పదాలు చేర్చాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన - ముఖ్య ఘట్టాలు

- 1948 సెప్టెంబరు 13-17: హైదరాబాద్‌ రాజ్యంపై సైనిక చర్య.

- 1950 జనవరి 26: హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటు.

- 1956 ఫిబ్రవరి 20: పెద్దమనుషుల ఒప్పందం.

- 1956 నవంబరు 1: ఆంధ్ర - హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనం, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ.

- 1969 జై తెలంగాణ ఉద్యమం.

- 1972 - 1973: జై ఆంధ్ర ఉద్యమం.

- 1975 ఆరు సూత్రాల పథకం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ.

- 2009 డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటన.

- 2010 ఫిబ్రవరి 3: తెలంగాణ ఏర్పాటుపై అధ్యయనానికి 5 మంది సభ్యులతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు.

- 2013 అక్టోబరు 3: ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, మంత్రుల బృందం ఏర్పాటు.

- 2014 ఫిబ్రవరి 7: విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.

- 2014 ఫిబ్రవరి 13: విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.

- 2014 ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.

- 2014 ఫిబ్రవరి 20: కొన్ని సవరణలతో పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.

- 2014 మార్చి 1: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014కి రాష్ట్రపతి ఆమోదం, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల.

- 2014 జూన్‌ 2: అపాయింటెడ్‌ డే (నియామక/ అవతరణ దినం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా ఏర్పాటు.

రచయిత: కరుణ 

Posted Date : 09-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్ర‌స్తుత‌ ఆంధ్రప్రదేశ్‌పై పునర్‌ వ్యవస్థీకరణ ప్రభావం

ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!

  ఉమ్మడి రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీరని నష్టమే జరిగింది. తెలంగాణతో పోల్చుకుంటే గణనీయమైన ప్రతికూల పరిస్థితులు మిగిలాయి. విలువైన ఆస్తుల్లో అధికభాగం తెలంగాణకు దక్కితే, అప్పుల్లో ఎక్కువ భారం సరికొత్త ఆంధ్రపై పడింది. ఆర్థికం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల్లో జరిగిన పంపకాలు నేటి రాష్ట్ర భవితకు, ప్రగతికి ప్రతిబంధకాలుగా నిలిచాయి.ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014 అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనిశ్చిత పరిస్థితి  కల్పించింది. నవ్యాంధ్ర, తెలంగాణ మధ్య ఆర్థిక వనరుల పంపిణీలో తీవ్రమైన లోపాలు, స్థూల అన్యాయాలు, పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అభివృద్ధి, క్రియాశీలతల పరంగా అసమతౌల్యత ఏర్పడింది. కీలక రంగాలపై ప్రభావం చూపి రాష్ట్రాన్ని పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేసింది.

ఆర్థిక పరిస్థితి: అవశేష ఆంధ్రప్రదేశ్‌కు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచే ఆర్థిక సవాళ్లు   మొదలయ్యాయి. రెవెన్యూ రాబడి, వ్యయాల లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

* రాష్ట్ర సొంత రెవెన్యూ సహా మొత్తం  రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, మార్కెట్‌ రుణాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే రాబడుల్లో 50 శాతం కంటే తక్కువే ఉండవచ్చని తేలిపోయింది. అయితే రుణం, జీతాలు, పింఛన్లు, రాయితీలను జనాభా   నిష్పత్తిపై కేటాయించడంతో ఉమ్మడి     ఆంధ్రప్రదేశ్‌ ఖర్చులో దాదాపు 60 శాతం   అవశేష ఆంధ్రప్రదేశ్‌ భరించాల్సి వచ్చింది.

* నవ్యాంధ్రకు మునుపెన్నడూ లేనివిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో అధిక రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు ఏర్పడింది. గతంలో ఎప్పుడూ ఆర్థిక లోటు జీఎస్‌డీపీలో 3 శాతం దాటలేదు. కానీ 2014-15లో రెవెన్యూ లోటు 4.8%, ఆర్థిక లోటు 7.18%కు చేరాయి.

* నవ్యాంధ్రలో జీతాలు, పింఛన్లు, ఇతర ఖర్చు రాష్ట్ర సొంత రాబడిలో 73 శాతానికి చేరింది (ఉమ్మడి రాష్ట్రంలో ఇది 58 శాతం మాత్రమే). దీంతో మూలధన వ్యయానికి వెసులుబాటు తగ్గిపోయింది.

* అవశేష ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ ఉమ్మడి రాష్ట్ర జీఎస్‌డీపీలో 55.7%. అలాగే రాష్ట్ర  తలసరి ఆదాయం తెలంగాణ కంటే చాలా తక్కువ. ఉదాహరణకు 2013-14 ఆర్థిక   సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.88,876 ఉండగా, అవశేష  ఆంధ్రప్రదేశ్‌లో రూ.85,797, తెలంగాణలో  రూ.93,151 ఉంది.

* నూతన ఆంధ్రప్రదేశ్‌కు సొంత రెవెన్యూ రాబడులు తెలంగాణ కంటే చాలా తక్కువ. జనాభాలో 58.32%తో ఉన్న కొత్త ఆంధ్రప్రదేశ్,  ఉమ్మడి రాష్ట్రంలోని వ్యాట్‌ (జుతిగి)లో 46.6% మాత్రమే పొందగలుగుతోంది.

* రాష్ట్రాల మధ్య రుణ పంపిణీకి జనాభా నిష్పత్తే ఏకైక ప్రాతిపదికగా ఉండటంతో   తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌పై అధిక రుణభారం పడింది. రుణం/జీఎస్‌డీపీ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్‌కు 19.4 శాతం ఉండగా     తెలంగాణకు 18.1 శాతం వచ్చింది.

* 2014-15 ఆర్థిక సంవత్సరానికి వనరుల అంతరాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.18,236 కోట్లుగా అంచనా వేశారు. దీన్ని దాదాపు 4.84 శాతం రెవెన్యూ లోటు, 7.18 శాతం ఆర్థిక లోటుగా చెప్పవచ్చు. ఇదేకాలంలో తెలంగాణలో రెవెన్యూ మిగులు ఉంది. విభజనకు ముందు వరకు మార్కెట్‌ రుణాలను మూలధన వ్యయం కోసం వినియోగించారు. అయితే రాబడి ఇవ్వని మూలధన ఆస్తుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు నవ్యాంధ్ర చాలా మొత్తం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యవసాయాభివృద్ధి: రాష్ట్ర విభజన నష్టాల్లో వ్యవసాయ పరిశోధన అభివృద్ధి అంశం మరొకటి. ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది. రాష్ట్రస్థాయి శిఖరాగ్ర వ్యవసాయ శిక్షణ సంస్థ (ళీతిలీనిగిఖి) కూడా అక్కడే ఉంది. అవి తెలంగాణలో అంతర్భాగమయ్యాయి. దీంతో నవ్యాంధ్రలో కొత్తతరం వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ సంస్థ అంటూ లేకుండా పోయింది.

* డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్, టిష్యూ కల్చర్, ఆయిల్‌ అనాలసిస్‌ ల్యాబొరేటరీలు వంటి ముఖ్యమైన వ్యవసాయ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ధాన్యం   ఉత్పత్తిలో తెలంగాణ జిల్లాలే ప్రధానంగా ఉండేవి. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని 309 యూనిట్లతో పోలిస్తే తెలంగాణలో 969 ప్రైవేటు విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లున్నాయి. దీంతో నవ్యాంధ్రలో వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు      అవసరమైన విత్తన ఉత్పత్తి ప్రాసెసింగ్‌            సామర్థ్యం తగ్గిపోయింది.

* అవశేష ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక స్వభావం రీత్యా వరదలు, తుపానులు, కరవు పీడిత ప్రాంతం. 2008-09 నుంచి 2013-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూమి 20.18 లక్షల హెక్టార్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే 15.16 లక్షల హెక్టార్లున్నాయి. అంటే 75 శాతం కంటే ఎక్కువ ప్రభావిత ప్రాంతం ఇక్కడే ఉంది.

సాగునీటి రంగం: తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందించే కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్వహణను విభజన చట్టం నదీ యాజమాన్య మండళ్ల నియంత్రణ కిందకు తెచ్చింది. దీంతో రాష్ట్రాల అధికార పరిధిలో ఉన్న జలవనరుల నిర్వహణను మొదటిసారిగా కేంద్రం తన చేతిలోకి తీసుకున్నట్లయింది. ఫలితంగా నీటి విడుదల పరిమాణం, సమయం వంటి అంశాల్లో రెండు రాష్ట్రాల అధికారం, విచక్షణ తగ్గిపోయాయి.

* శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల క్రమబద్ధీకరణ అంతర్రాష్ట్ర అంశంగా, క్లిష్టతరంగా మారింది.

విద్యుత్తు రంగం: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో విద్యుత్తు రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. 2014, మే 8 నాటి జీఓ నంబరు 20లో పేర్కొన్న ఏపీ జెన్‌కో స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తి లెక్కల ఆధారంగా కేటాయింపులు చేశారు. మొత్తం ఉత్పాదక సామర్థ్యంలో (నిర్మాణంలో ఉన్నవాటితో సహా)  కేవలం 46.11% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ వాటాగా నిర్ణయించారు.

* విద్యుదుత్పత్తి కేంద్రాలపై యాజమాన్యపు హక్కులు, వాటిని ఏర్పాటు చేసిన భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు. అయితే విద్యుత్తును కేటాయించడంలో భౌగోళిక ఉనికిని పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ 1,142 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కోల్పోయింది. ఏటా 8,700 మి.యూనిట్ల విద్యుత్తు కొరత తలెత్తింది. ఈ కొరతను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలుకు ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

పాడి పశుగణాభివృద్ధి:  వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చ్‌ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి చెందడంతో పాడిపశువుల టీకా మందుల ఉత్పత్తి, వ్యాధి నిర్ధారణ సదుపాయాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయాయి.

* పాడిపశువుల రంగం, వృద్ధికి చెందిన అనేక జాతీయ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్, సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్, సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్, కోళ్ల పెంపకం రంగానికి చెందిన ప్రాజెక్ట్‌ డైరెక్టరేట్‌ మొదలైనవన్నీ ఏపీకి లేకుండా పోయాయి.

స్థూలంగా..

రాష్ట్ర విభజనలో వివిధ విభాగాలకు వేర్వేరు ప్రాతిపదికలను ప్రమాణాలుగా తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రమైన అన్యాయం జరిగింది.

1) 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 46 శాతం ఆదాయమే ఉండేలా విభజించారు. దీన్ని 14వ ఆర్థిక సంఘం    నిర్ధారించింది.

2) భౌగోళిక ప్రాతిపదికన ఆస్తుల విభజన చేయడంతో విలువైన ఆస్తులన్నీ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే  ఉండిపోయాయి.

3) జనాభా ప్రాతిపదికన అప్పులు     పంచడంతో అధిక జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అధిక అప్పులు మిగిలాయి.

4) వినియోగం ప్రాతిపదికన విద్యుత్తు   కేటాయింపులు చేయలేదు.

5) తిరిగి చెల్లించాల్సిన పన్నుల భారం (టాక్స్‌ రిఫండ్‌) జనాభా ప్రాతిపదికన అంటే ఆంధ్రప్రదేశ్‌కు 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం కేటాయించారు. అదే సమయంలో వసూలు  కావాల్సిన పన్నులను భౌగోళిక ప్రాతిపదికన నిర్ణయించారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,800 కోట్ల నష్టం వచ్చింది.

6) తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థ అయిన  సింగరేణి కాలరీస్‌లో తెలంగాణకు  భౌగోళిక ప్రాతిపదికన 51 శాతం వాటా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’ కూడా తొమ్మిదో షెడ్యూల్‌ కంపెనీ  అయినప్పటికీ అదే భౌగోళిక      ప్రాతిపదికను పాటించలేదు.

7) మొత్తం రూ.లక్షా ముప్పై వేల కోట్ల అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఖాతాకు బదలాయించారు. దీనికితోడు ఉమ్మడి రాష్ట్ర అవిభాజ్య అప్పు రూ.24 వేల కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్‌ ఖాతా పుస్తకాల్లో ఉంచి తీరని భారం మోపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ వనరుల సమీకరణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం)పై తీవ్ర ప్రభావం చూపింది.

8) అవిభాజ్య అప్పులపై వడ్డీని ఆంధ్రప్రదేశ్‌ చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక   పరిస్థితులు మరింత దిగజారాయి.

9) ఉమ్మడి రాష్ట్రం చెల్లించాల్సిన పింఛన్లను జనాభా ప్రాతిపదికన విభజించడం నవ్యాంధ్రపై పెనుభారం మోపింది.

రచయిత: వి.కరుణ

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉమ్మడి సంస్థల విభజన

కొలిక్కిరాని పంపకాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయినా ఉమ్మడి ఆస్తులు, సంస్థల విభజన కొలిక్కి రావడం లేదు. అశాస్త్రీయంగా, హడావిడిగా సాగిన విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఆర్థికంగా శరాఘాతంగా మారింది. విభజన చట్టంలో ఉన్న లోపాలకు తోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సయోధ్య కుదరకపోవడం, సమస్యల పరిష్కారంలో కేంద్రం మెతక వైఖరి అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలు. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన పంపకాల తీరు, ఇన్నేళ్లుగా నెలకొన్న స్తబ్ధత, ప్రస్తుత పరిస్థితిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ నుంచి విభజన వరకు అంటే 1956 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన, ఆర్థిక, మానవాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన కంపెనీలు, కార్పొరేషన్లు ఉమ్మడి సంస్థల కిందికి వస్తాయి. వీటి గురించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్నారు.

* 9వ షెడ్యూల్‌లో రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సిన 89 కంపెనీలు, కార్పొరేషన్ల జాబితాను పేర్కొన్నారు. తర్వాత మరో రెండు రాష్ట్ర స్థాయి సంస్థలను చేర్చడంతో మొత్తం 91 సంస్థలయ్యాయి.

* 10వ షెడ్యూల్‌లో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగించే శిక్షణా సంస్థలు, కేంద్రాల జాబితాను పొందుపరిచారు. మొదట్లో 107 సంస్థలను చేర్చగా, 2015, మే 7న మరో 35 సంస్థలను ఆ జాబితాలో కలిపారు. దీంతో మొత్తం సంఖ్య 142కు చేరింది.

* 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న కొన్ని సంస్థల్లో ఉద్యోగులు, చరాస్తుల విభజన జరిగినప్పటికీ స్థిరాస్తులు, అప్పుల విభజన అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌తో పాటు స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ్బదీఖిల్శి, మినరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి సంస్థల విభజనపై గందరగోళం నెలకొంది. మరికొన్ని సంస్థల్లో ఉమ్మడి ఖాతాల కింద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా స్పష్టత లేదు.

* 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ సుమారు 31 సార్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు.

* విభజన చట్టంలోని సెక్షన్‌ 64 ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా  58 : 42 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ అంగీకరించడం లేదు.

* 9, 10 షెడ్యూళ్ల సంస్థలతో పాటు ఏ షెడ్యూల్‌లో చేర్చని 12 ఉమ్మడి సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నాయి. మొత్తం ఉమ్మడి సంస్థలు 245 (91 + 142 + 12). వీటి మొత్తం ఫిక్స్‌డ్‌ ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లని అంచనా.

విభజన చట్టంలో ఏముంది?

* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజన గురించి విభజన చట్టంలోని 68, 71 సెక్షన్లలో పేర్కొన్నారు. 

* సెక్షన్‌ 68లో కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలున్నాయి. సెక్షన్‌ 68(1) ప్రకారం ‘‘9వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం ఏర్పాటైన కంపెనీలు, కార్పొరేషన్లు అవతరణ తేదీన, ఆ తేదీ నుంచి అంతకుముందు రోజున ఏవిధంగా పనిచేస్తున్నాయో, ఈ సెక్షన్‌లోని నియమాలకు లోబడి అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పని కొనసాగించాలి.’’

అలాగే సెక్షన్‌ 68(2) ప్రకారం ‘‘సెక్షన్‌ 68(1)లో సూచించిన కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తులు, హక్కులు, బాధ్యతలను సెక్షన్‌ 53లో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.’’

* సెక్షన్‌ 71లో కంపెనీల కోసం కొన్ని నిబంధనలను పొందుపరిచారు. సెక్షన్‌ 71 ప్రకారం ‘‘ఈ భాగంలో ఉన్న దేనితోనూ నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న కంపెనీల కోసం కొన్ని ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఎ) కంపెనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, వాటాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి ఆదేశించవచ్చు.

బి) కంపెనీ డైరెక్టర్ల బోర్డులో రెండు రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేయవచ్చు.

* 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల్లో సౌకర్యాల కొనసాగింపు గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ - 75లో పేర్కొన్నారు.

* సెక్షన్‌ 75(1) ప్రకారం ‘‘ఈ చట్టం 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విషయంలో సందర్భాన్ని బట్టి కొత్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేదా తెలంగాణ సర్కారు ఆ రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాష్ట్ర ప్రజలకు సేవలు కొనసాగించాలి. అవతరణ తేదీ ముందునాటికి (2014, జూన్‌ ముందు నాటికి) సమకూర్చిన సేవల కంటే ఆ సేవలు తక్కువ అనుకూలంగా ఉంటాయి. ఈ సేవలను ఎంతకాలం, ఏ షరతులతో కొనసాగించాలనే అంశంపై పరస్పర అంగీకారం ఆధారంగా అవతరణ దినం నుంచి ఏడాదిలోగా నిర్ణయం తీసుకోవాలి. ఆ లోపు ఒప్పందం కుదరకపోతే సేవలను కొనసాగించే కాలపరిమితిని కేంద్రం నిర్ణయించాలి. అలాగే సెక్షన్‌ 75(2) ప్రకారం ‘‘కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్‌ డే నుంచి ఒక సంవత్సరం లోపల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏదైనా ఇతర సంస్థను 10వ షెడ్యూల్‌లో చేరుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చు’’.

9, 10 షెడ్యూళ్ల సంస్థలపై విభజన ప్రభావం: 

* ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో 89 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినట్లు సెక్షన్‌ - 68 సూచిస్తుంది. అలాగే సెక్షన్‌ - 53 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం గురించి సూచిస్తుంది.

* 9వ షెడ్యూల్‌లో 89 రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను చేర్చినప్పటికీ నమోదైన సొసైటీలు/కంపెనీలు 70 మాత్రమే. మిగిలినవి అనుబంధ సంస్థలు.

* ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం రూపొందించేటప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సంస్థల పునర్‌వ్యవస్థీకరణ, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన సూత్రాలు, విధానంపై తగినంత శ్రద్ధ చూపలేదు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ కోసం ‘షీలా బిడే’ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన్పటికీ, ఆ కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలుకాలేదు.

* రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణలో అనిశ్చితి ఏర్పడింది.

* 10వ షెడ్యూల్‌లోని జాబితాలో చేర్చిన 142 సంస్థల విషయంలో నిశితంగా విశ్లేషిస్తే 22 ప్రభుత్వ శాఖలు, 10 శాసనబద్ధ సంస్థలు, 17 సొసైటీలు, మరో రెండింటిని బోర్డు/కౌన్సిల్‌గా వర్గీకరించారు. అలాగే 142 సంస్థల్లో 4 సంస్థలు నిర్వహణలో లేవు. వీటిలో 55 సంస్థలు వాటి సమగ్రత విషయంలో రెండు రాష్ట్రాలకు అవసరమవుతాయి. వాటిని రెండు రాష్ట్రాల మధ్య పంచడం కుదరదు. 142 సంస్థల్లో 9 విశ్వవిద్యాలయాలు కాగా, 16 సంస్థలు ప్రభుత్వ శాఖల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్ర చట్టాలు, కేంద్ర చట్టాల కింద ఏర్పాటైన అనేక ఇతర సంస్థలను మినహాయిస్తూ, ప్రతి రాష్ట్ర పరిపాలనకు అంతర్భాగంగా ఉన్న శాఖాధిపతులు, రెగ్యులేటరీ ఏజెన్సీలను 10వ షెడ్యూల్డ్‌లో చేర్చడం ద్వారా ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య 10వ షెడ్యూల్‌ సంస్థల సిబ్బంది, ఆస్తుల పంపిణీపై విభజన చట్టం ఏమీ చెప్పలేదు.

* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న మెజారిటీ సంస్థల ప్రధాన కార్యస్థానం హైదరాబాద్‌. వీటిని అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి ఏర్పాటు చేయడానికి చాలా కాలం పడుతుంది.

* చట్టబద్ధంగా ఏర్పాటైన సమాచార కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, లోకాయుక్త, మావన హక్కుల కమిషన్‌ లాంటి అనేక సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించలేదు.

షీలా బిడే కమిటీ: ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజన కోసం సిఫార్సులు చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, మే 30న డాక్టర్‌ షీలా బిడే (రిటైర్డ్‌ ఐఏఎస్‌) అధ్యక్షతన ఎ.కె.గోయెల్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌), కె.వి.రావు (రిటైర్డ్‌ ఐఏఎస్‌), కె.నరసింహమూర్తి (ఆర్థిక నిపుణులు)తో కమిటీని ఏర్పాటు చేసింది.

* తొలుత 9వ షెడ్యూల్‌లో చేర్చని మరో రెండు రాష్ట్రస్థాయి సంస్థలను తెలంగాణ ప్రభుత్వ సమ్మతితో ఈ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ 9వ షెడ్యూల్‌కు చెందిన మొత్తం 91 (89 + 2) సంస్థల్లో 90 సంస్థల విభజనకు సిఫార్సు చేసింది. అందులో 55 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను ఇరురాష్ట్రాలు సమ్మతించాయి. 15 సంస్థలకు సంబంధించి తెలంగాణ ఆమోదం తెలియజేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకిస్తోంది. 22 సంస్థలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండూ విముఖత చూపాయి. ఈ 22 సంస్థల ఆస్తుల విలువే మొత్తంలో దాదాపు 89% ఉంటాయని అంచనా.

* ఉమ్మడి సంస్థల విభజన, షీలా బిడే కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో 31 సార్లు సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసింది. చివరకు కమిటీ చేసిన సిఫార్సులన్నీ యథాతథంగా అంగీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ అంగీకరించలేదు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా ‘డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌’ ఆస్తుల విభజనకు కమిటీ సిఫార్సులు చేసిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. చాలావరకు ఉమ్మడి సంస్థల విభజనకు ప్రధాన కార్యస్థానం (హెడ్‌క్వార్టర్‌) అంశమే చిక్కుముడిగా మారింది.

ప్రధాన కార్యస్థానంపై చట్టంలో వివరణ: విభజన చట్టంలోని సెక్షన్‌ - 53లో పేర్కొన్న విధంగా 9వ షెడ్యూల్‌ ఉమ్మడి సంస్థల్లోని ఆస్తులు, అప్పులను విభజించాలి. ఈ సెక్షన్‌ ప్రకారం అలాంటి సంస్థ లేదా దాని విభాగం ఉన్న ప్రాంతం లేదా దాని కార్యకలాపాలు పరిమితమైన ప్రాంతం ఉన్న రాష్ట్రానికే సంస్థ ఆస్తులు చెందుతాయి. ఆ సంస్థ నిర్వహణ అంతర్రాష్ట్ర అంశమైనప్పుడు నిర్వహణ యూనిట్‌ ఆస్తులు, అప్పులను ప్రాంతం ప్రాతిపదికపై విభజించాలి. ప్రధాన కార్యస్థానాల్లో ఉన్నవాటిని జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాలకు విభజించాలి. అయితే విభజన చట్టంలో ప్రధాన కార్యస్థానం అనే పదాన్ని నిర్వచించలేదు.

* ప్రధాన కార్యస్థానం అనే పదానికి అర్థం ప్రధాన కార్యాలయానికి చెందిన ఆస్తులు, అప్పులు. అలాగే ఉమ్మడి రాష్ట్రం వినియోగం కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి కేంద్రాలు, సదుపాయాలను జనాభా నిష్పత్తి ఆధారంగా విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయపడింది. ప్రధాన కార్యస్థానం మాత్రమే అంటే వారు పనిచేసే ప్రదేశం నుంచి రిజిస్టరైన ప్రాంతం అని, అందులో ఇతర ఆస్తులు ఉండవని తెలంగాణ అభిప్రాయపడింది. దీంతో ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి ప్రధాన కార్యస్థానం అంశం ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే సుమారు 94 శాతం ఉమ్మడి సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయి.

* విభజన చట్టంలో నిర్దేశించిన 9వ షెడ్యూల్‌ సంస్థల విభజనకు సంబంధించి 2017, మేలో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా 9వ షెడ్యూల్‌ ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు కీలకంగా మారిన ప్రధాన కార్యస్థానం (హెడ్‌క్వార్టర్‌) విభజనపై స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. దీని ప్రకారం ప్రధాన కార్యాలయం ఒక్కదానికి సంబంధించే జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 58 : 42 నిష్పత్తిలో పంచాలి. మిగిలిన కార్యాలయాలు, విభాగాలు, ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి.

* 9వ షెడ్యూల్‌ సంస్థల విభజన సందర్భంగా హైదరాబాద్‌లోని ఆస్తుల విభజనపై చాలాకాలంగా ప్రతిష్ఠంభన నెలకొంది. ఉమ్మడి రాజధానిలోని ప్రధాన కార్యాలయాలతో పాటు అక్కడున్న ఇతర కార్యాలయాలు, వర్క్‌షాపులు, అతిథి గృహాలు వంటివాటిని కూడా జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ వ్యతిరేకించింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌తోపాటు కల్యాణ మండపం, మియాపూర్‌లోని వర్క్‌షాప్, తార్నాకలోని ఆసుపత్రి, హకీంపేటలో ఉన్న వర్క్‌షాప్‌లు, ఆగ్రోస్, విజయ డెయిరీ, ఏపీ ఫుడ్స్‌ లాంటి ఆస్తుల విషయమై తీవ్ర స్థాయిలో వివాదం నడిచింది.

* 2017, మే లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం (ప్రిన్సిపల్‌ ఆఫీసు)ను మాత్రమే జనాభా నిష్పత్తిలో విభజించాలి. ఇతర నిర్వహణ విభాగాల (ఆపరేషనల్‌ యూనిట్స్‌)పై స్థానికత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక సంస్థకు ప్రధాన కార్యాలయాలతో పాటు వర్క్‌షాప్‌లు, అతిథిగృహాలు, ఇతర నిర్వహణ విభాగాలు ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయం మాత్రమే కేంద్రం (హెడ్‌ క్వార్టర్‌)గా ఉంటుంది. మిగిలిన విభాగాలు, కార్యాలయాల విభజన చట్టంలోని సెక్షన్‌ - 53ని అనుసరించి ఉంటాయి.

సయోధ్య కుదిరేనా?: షీలా బిడే కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉమ్మడి సంస్థలను విభజించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. 9వ షెడ్యూల్‌లోని దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ ్బదీఖిల్శి కు కేటాయించిన 5 వేల ఎకరాల భూములపై ఆంధ్రప్రదేశ్‌ రిట్‌ పిటిషన్‌ వేసి స్టే తీసుకొచ్చింది. అదేవిధంగా ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన సుమారు 250 ఎకరాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్‌ స్టే తెచ్చుకుంది.

* 10వ షెడ్యూల్‌లో ఉన్న ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌కు సంబంధించి రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ కోర్టు కేసులు తేలేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ వాదిస్తోంది.

* విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది.

* 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ షెడ్యూల్‌లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని కోరుతోంది.

సుప్రీంను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్‌: ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజనపై ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం 2023, మే 12న విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై రిజాయిండర్‌ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువిచ్చింది. విచారణను 2023, జులై చివరి వారానికి వాయిదా వేసింది.

రచయిత: వి.కరుణ
 
Posted Date : 08-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉమ్మడి సంస్థల విభజన 

(మరికొన్ని ఆస్తులు)

వాటాల కేటాయింపు సంక్లిష్టం! 

అడుగు పడదు, గొడవ ముగియదు అన్నట్లుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆస్తుల విభజన. ముఖ్యంగా తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన సంక్లిష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులను విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుంటే, కొన్నింటికి జనాభా, మరికొన్నింటికి స్థానికత ఆధారం చేసుకోవాలని తెలంగాణ వాదిస్తోంది. ప్రధాన సంస్థలైన సింగరేణి, ఆర్టీసీ, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, దిల్లీలోని ఏపీ భవన్‌ల విభజన ఎంతకూ తెగడం లేదు. ఈ సంస్థల పంపకంపై విభజన చట్టం ఏం చెబుతోంది, రెండు రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నాయి, కేంద్రం సూచనలు ఏమిటి అనే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి సంస్థల విభజన తీవ్ర వివాదానికి దారితీసింది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ కింద 91, పదో షెడ్యూల్‌ కింద 142 ఉమ్మడి సంస్థలను పేర్కొన్నారు. చట్టంలో పొందుపరచని రాష్ట్రస్థాయి ఉమ్మడి సంస్థలు మరో 12 ఉన్నాయి. మొత్తంగా 245 సంస్థలు విభజించాల్సి ఉండగా వీటిలో కీలక సంస్థల విభజన అపరిష్కృతంగా ఉంది.

మొత్తం 245 సంస్థల ఆస్తుల విలువ రూ.1,42,601 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ సుమారు రూ.24,018.53 కోట్లు. వీటిలో రూ.22,556.45 కోట్లు అంటే 93.9 శాతం విలువైన ప్రధాన కార్యాలయాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల ప్రధాన కార్యాలయాల ఆస్తుల విలువ రూ.34,642.77 కోట్లు కాగా అందులో రూ.30,530.86 కోట్లు అంటే 88 శాతం విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ఆ రెండు షెడ్యూళ్లలో పేర్కొనని 12 ఉమ్మడి సంస్థల విలువ రూ.1,759 కోట్ల వరకు ఉండగా, అవన్నీ తెలంగాణలోనే ఉన్నాయి.

* ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఆర్టీసీ, విశ్వవిద్యాలయాల ఆస్తులు, ఉన్నత విద్యామండలి, ఏపీ భవన్, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ భూములు, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆస్తుల విభజన విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL): ఈ సంస్థను ఏపీ విభజన చట్టం-2014లోని 9వ షెడ్యూల్‌ కింద వరుస సంఖ్య-7లో చేర్చారు. అందువల్ల 53, 68 సెక్షన్లు వర్తిస్తాయి. వీటికి అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలు అంతర్రాష్ట్ర వ్యవహారంగా మారడంతో ఈ సంస్థ ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది.

విభజన చట్టంలోని సెక్షన్‌-92 ‘మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు’ గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్‌కు 12వ షెడ్యూల్‌ను చేర్చారు. ‘బొగ్గు, చమురు-సహజ వాయువు, విద్యుత్తు ఉత్పత్తి-పంపిణీ’కి సంబంధించిన అంశాలను ఈ షెడ్యూల్‌ పరిష్కరిస్తుంది. ‘బొగ్గు’ పద్దు కింద ఈ షెడ్యూల్‌లో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మొత్తం ఈక్విటీగా 51 శాతం తెలంగాణ ప్రభుత్వం వద్ద, 49 శాతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. అందువల్ల సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన రెండు నిబంధనలు ఉన్నాయి. అందులో ఒకటి.. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల కేటాయింపుతో షెడ్యూల్‌-9 వ్యవహరిస్తుంది. మరొకటి.. ‘బొగ్గు’ కు సంబంధించి స్థూల పద్దు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన 51 శాతం ఈక్విటీని తెలంగాణకు అప్పగించడంతో షెడ్యూల్‌-12 వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో సామరస్యపూర్వక నిర్మాణ సూత్రాన్ని వర్తింపజేస్తూ, కంపెనీ ప్రధాన స్థానాల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో విభజించాలి. అయితే బొగ్గు నిల్వలు తవ్వి నిర్వహించే హక్కులన్నీ తెలంగాణకే ఉన్నాయి.

* విభజన చట్టం సెక్షన్‌-66లోని నిబంధనలకు అనుగుణంగా 2017, మే 30న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాదనకు పూర్తి ఆధారాలు చూపిస్తూ సింగరేణి కాలరీస్‌ ఆస్తులు పంచాలని కేంద్రానికి తెలిపింది. అలాగే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆస్తులు, అప్పుల విభజన అంశాన్ని చేపట్టాలని 2018, జనవరి 29న రాష్ట్ర ప్రభుత్వం ‘షీలా బిడే’ నిపుణుల కమిటీని కోరింది. అయితే సింగరేణిని విభజించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51 శాతం వాటాను తెలంగాణకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపరిచిన విషయాన్ని గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’నే విభజించాలని స్పష్టం చేసింది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీకి సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు, భవనాలు, వర్క్‌షాపుల రూపంలో 11 విలువైన ఆస్తులున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బస్సు డిపోలను ఏపీఎస్‌ఆర్టీసీ నడపగా, తెలంగాణలోని డిపోలను కొత్తగా ఏర్పడిన టీఎస్‌ఆర్టీసీ నడిపిస్తోంది. అయితే ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడంతో టీఎస్‌ఆర్టీసీకి సాంకేతికంగా గుర్తింపు లేదని గతంలో కేంద్రం ప్రకటించింది. ఏపీఎస్‌ఆర్టీసీని 9వ షెడ్యూల్‌లోని వరుస సంఖ్య 26లో చేర్చారు.

* ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న ఆస్తులన్నింటినీ లెక్కగట్టి జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తుండగా, హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని బస్‌భవన్‌లోని వాటాను మాత్రమే తెలంగాణ అంగీకరించింది.

దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (DILL): ఉమ్మడి రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు, పారిశ్రామిక అభివృద్ధి అవసరాల కోసం వివిధ సంస్థలకు భూములు కేటాయించడానికి దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీఐఎల్‌ఎల్‌)ను ఏర్పాటు చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డుకు అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసి, 2007లో 5 వేల ఎకరాలు ఈ సంస్థకు కేటాయించారు. ఈ భూముల్లో ఎలాంటి ప్రాజెక్టులు మొదలు కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం 2015, ఆగస్టు 22న G.O.MS.NO: 143 కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 4,999.14 ఎకరాలను రద్దు చేసింది (ఈ భూములు ఉమ్మడి మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉన్నాయి.)

* విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లోని వరుస సంఖ్య-47 కింద నమోదై ఉన్న ఈ సంస్థ భూములపై తెలంగాణ ప్రభుత్వ చర్యపై ఆంధ్రప్రదేశ్‌ ‘హైకోర్టు’ను ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

* తెలంగాణ ప్రభుత్వం డీఐఎల్‌ఎల్‌ ఆస్తుల విభజనపై అభ్యంతరం తెలిపినప్పటికీ ఈ సంస్థ ఆస్తులను హెడ్‌క్వార్టర్‌ ఆస్తులుగా పరిగణిస్తూ వాటిని విభజించాలని ‘షీలా బిడే’ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (APSFC): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2007, ఆగస్టు 16న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి రంగారెడ్డి జిల్లా గాజులరామారంలో సర్వే నంబరు 308లో 33.11 ఎకరాలు, సర్వే నంబరు 307/1లో 238.28 ఎకరాలు మొత్తంగా 271.39 ఎకరాలను, ఎకరాకు రూ.40 లక్షల చొప్పున 99 ఏళ్లకు లీజుకిచ్చింది.

* రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2015, అక్టోబరు 29న G.O.MS.NO: 195 కింద ఉత్తర్వులు జారీ చేసింది. APSFCకి కేటాయించిన భూమి నిరుపయోగంగా మారి, అన్యాక్రాంతం అవుతోందని పేర్కొంటూ గాజులరామారంలో గతంలో కేటాయించిన సర్వే నంబరు 308లో 33.11 ఎకరాలు, సర్వే నంబరు 307/1లో 220.23 ఎకరాలు మొత్తంగా 253.34 ఎకరాలను రద్దు చేసింది. W.P.NO:18442/2011కి సంబంధించిన కేసులో స్టేటస్‌ కో ఉండటంతో సర్వే నంబరు 307/1లో 18 ఎకరాలను పక్కనపెట్టారు. APSFC భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌.. హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుంది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.

APSFC అప్పటి బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొంటూ బోర్డును పునర్నిర్మించాలని 2016 మేలో తెలంగాణ, కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం ఎలాంటి బోర్డును ఏర్పాటు చేయలేదు. APSFC అంశం కూడా ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్‌) నిర్వచనానికి సంబంధించింది. వివాదంలో ఉన్న భూములను ప్రధాన కార్యాలయ ఆస్తిలో భాగంగా పరిగణిస్తారా లేదా అనే విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APDDC): హెడ్‌క్వార్టర్‌ నిర్వచనం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తమకే చెందుతుందని తెలంగాణ పేర్కొంటోంది. తమ రాష్ట్ర ప్రాంతం నుంచి కూడా పాలసేకరణ జరిగింది కాబట్టి, వాటా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ వాదించింది. APDDC కి చెందిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి పూర్తిగా బదిలీ చేసుకుంది. దీంతో విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో వరుస సంఖ్య 70లో జాబితా పరిచిన APDDC ఆస్తుల విభజన పంచాయతీ కోర్టులకు చేరింది. ఈ కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 9వ షెడ్యూల్‌ సంస్థల విభజనలో ఎలాంటి అధికార పరిధి లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని తెలంగాణ తెలియజేయడంతో, దానిపై న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఏపీ భవన్‌ ఆస్తులు: దిల్లీలోని ఏపీ భవన్‌ స్థలంపై తెలంగాణకే పూర్తి హక్కుందని, తెలంగాణ భవన్‌ నిర్మాణానికి ఆ స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి 2016, జూన్‌ 23న కేంద్రానికి లేఖ రాశారు. అలాగే నిజాం నవాబుకు చెందిన హైదరాబాద్‌ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు పరిహారంగా కేటాయించిన 7 ఎకరాల స్థలాన్ని కూడా తెలంగాణకే ఇవ్వాలని కోరారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్‌-48లో ‘భూమి, వస్తువుల పంపకం’ గురించి పేర్కొన్నారు. దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హద్దులకు అవతల ఆస్తులు ఉంటే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు పంచాలి. ఏదైనా ఆస్తులను వాటి ఉనికి ఆధారంగా కాకుండా, మరోవిధంగా నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడితే ఆ మేరకు బదిలీ అవుతాయి. అదేవిధంగా ఆస్తులు లేదా వస్తువుల పంపిణీలో వివాదాలు వస్తే కేంద్రం రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.’

ఏపీ భవన్‌ ఆస్తుల విభజనలో భాగంగా 2023, ఏప్రిల్‌ 26న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటైంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు/ప్రతిపాదనలను రెండు రాష్ట్రాలకు 2023, మే 4న మినిట్స్‌ రూపంలో పంపించారు. దీనిలో భాగంగా దిల్లీలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆస్తి అయిన ఏపీ భవన్‌ పరిధిలోని 19.73 ఎకరాల విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేంద్రం కూడా తన ప్రతిపాదనను తెలిపింది.

* కేంద్రం తన ప్రతిపాదనలో భాగంగా 12.09 ఎకరాల్లోని ఏపీభవన్‌ (శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాక్‌)ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ తీసుకోవాలని; పటౌడీ హౌస్‌లోని 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని పేర్కొంది. ఆస్తులను జనాభా నిష్పత్తిలో (58:42) రెండు రాష్ట్రాలు పంచుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భూమి దక్కితే, ఆ విలువ మేరకు తెలంగాణ, ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించింది.

* తాజా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మినిట్స్‌ ప్రకారం ఏపీ భవన్‌ ఆస్తుల పంపకం ప్రతిపాదనలు/ఆప్షన్లు అయిదు రకాలుగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు

ఆప్షన్‌-ఎ : తెలంగాణకు శబరి బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం, ఆంధ్రప్రదేశ్‌కు పటౌడీ హౌస్‌లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు. 

ఆప్షన్‌-బి : ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు.

ఆప్షన్‌-సి : తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు; ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు, పటౌడీ హౌస్‌.

తెలంగాణ ప్రతిపాదన:

ఆప్షన్‌-డి : తెలంగాణకు శబరి బ్లాకు, గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ (12.09 ఎకరాలు), ఆంధ్రప్రదేశ్‌కు పటౌడీ హౌస్‌ (7.64 ఎకరాలు). ఇది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాకు విరుద్ధంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయే దానికి విలువకట్టి ఆ మొత్తాన్ని తెలంగాణ చెల్లిస్తుంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఆప్షన్‌-సి ని పరిశీలించాలి.

కేంద్రం ప్రతిపాదన:

ఆప్షన్‌-ఇ : గోదావరి, శబరి బ్లాకులు; నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకుతో ఉన్న 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ తెలంగాణకు.

ఈ ప్రతిపాదనల్లో భాగంగా సి, డి, ఇ లను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.

ఇంకా అనేక ఉమ్మడి సంస్థల విభజనకు సంబంధించిన వివాదాలు అలాగే ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSCSCL)కు చెందిన, తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వినియోగించుకున్న రూ.354 కోట్లు తిరిగి చెల్లింపు చేయలేదు. అలాగే విభజన చట్టం ప్రకారం విద్యుత్తు బకాయిలను కూడా ఏపీకి తెలంగాణ చెల్లించలేదు.

* 10వ షెడ్యూల్‌లోని ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ మొదలు మొత్తం 142 సంస్థలను జనాభా నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. కానీ తెలంగాణ మాత్రం 10వ షెడ్యూల్‌ సంస్థల నగదును జనాభా నిష్పత్తిలో, ఆస్తులను స్థానికత ఆధారంగా పంచాలని వాదిస్తోంది. ఆ విధంగా ఉమ్మడి సంస్థల విభజన సమస్యలతో నిండిపోవడంతో, అవశేష ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రచయిత: వి.కరుణ
 
Posted Date : 28-08-2023

ఉద్యోగుల విభజన - స్థానికత సమస్య

అస్తవ్యస్త పంపకాలతో అవస్థలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనేక చిక్కుముళ్లను సృష్టించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగుల విభజన, స్థానికత అత్యంత కీలకమైనవి. విభజనతో ఎదురైన సమస్యలతో అష్టకష్టాలు పడుతున్న నవ్యాంధ్రకు ఉద్యోగుల పంపిణీ ఏళ్ల తరబడి సాగడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. విద్యుత్తు ఉద్యోగుల విషయంలో తెలంగాణతో సమన్వయం కుదరకపోవడం, పరిష్కారం చూపాల్సిన కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవడంతో సమస్య సంక్లిష్టమై కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అధ్యయనంలో ప్రధానమైన ఈ అంశాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. పంపకాల తీరు, వివాద పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలతో పాటు, ఉద్యోగులకు తలెత్తిన అవస్థలనూ అర్థం చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014, 8వ భాగంలోని 76 నుంచి 83 వరకు ఉన్న సెక్షన్లు రెండు రాష్ట్రాల మధ్య స్థానిక, జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్ర కేడర్లలోని అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ/విభజన గురించి వివరిస్తాయి. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు నియామక తేదీ (అపాయింటెడ్‌ డే) రోజున లేదా ముందుగా వారి సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో ఆ విధంగా జరగలేదు.

నియామక తేదీ నాటికి రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారులను కూడా పంపిణీ చేయలేదు. 10,000 మందికి తక్కువ కాకుండా రాష్ట్ర కేడరు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి పనిచేయాలని తాత్కాలికంగా ఆదేశించారు. ఇది పాలనా వ్యవస్థ పటిష్టతపై రెండు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం ప్రతిస్పందనపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అలాగే ఉద్యోగుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించే అధికారాన్ని ఇస్తూ, మార్గదర్శక సూత్రాలను రాష్ట్రాలు పాటించాలని, కేంద్రానిదే తుది నిర్ణయమని విభజన చట్టంలోని నిబంధనలు తెలుపుతున్నాయి. ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, స్థానికత ప్రాతిపదికన జరపాలని తెలంగాణ అభ్యర్థించింది.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కారణంగా విభజన సమస్యలు/సవాళ్లు/అవస్థలు ఉద్యోగుల విషయంలో అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విషయంలో సొంతూరు ఒక రాష్ట్రంలో; ఉద్యోగం మరొక రాష్ట్రంలో; భార్య ఒక రాష్ట్రంలో, భర్త మరో రాష్ట్రంలో; తండ్రి లోకల్‌ స్టేటస్‌ ఒక రాష్ట్రంలో; పిల్లల లోకల్‌ స్టేటస్‌ ఇంకో రాష్ట్రంలో ఉండే విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఒక్కరూ తమ ఉద్యోగాలు వదులుకోలేరు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలు తమ సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో స్థానికత (లోకల్‌ స్టేటస్‌) కలిగి ఉండటంతో వారు పెద్దయిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి.

* 2014, జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉద్యోగుల విభజన అంతా గందరగోళంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రస్థాయి ఉన్నత ఉద్యోగులను విభజించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహా సంఘాలు కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోలేదు. దాంతో వారంతా ఇబ్బందులు పడ్డారు.

* మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో సుమారు 60 వేల మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగులను విభజించి కేంద్రం చేతులు దులిపేసుకుంది. మిగిలిన సిబ్బందిని ఎక్కడివారిని అక్కడే అన్నట్లు వదిలేశారు. దీంతో నియామక సమయంలో తమ జోన్‌ పరిధి దాటి వేరే జోన్, వేరే జిల్లాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో నియమించారు. ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం వచ్చినవారు, సబ్జెక్టు పోస్టులు ఖాళీ లేనివారు తదితర కారణాలతో రెండు రాష్ట్రాల్లోనూ స్థానికేతర ఉద్యోగులున్నారు. ఉద్యోగుల విభజన సరిగా జరగకపోవడంతో వారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య విభజనకు దారితీసిన పరిస్థితుల్లో ‘ఉద్యోగాలు/నియామకాలు’ కూడా ఒక కారణం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ అంశంలో కేంద్రం జోక్యం నామమాత్రంగా మిగిలింది. రాష్ట్ర స్థాయి పోస్టులను మాత్రమే విభజించింది. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుని జిల్లా, జోన్, మల్టీజోన్‌ పోస్టుల పంపిణీ చేసుకోవాలని చెప్పింది. వాటి విషయంలో కూడా కొన్ని శాఖలకు సంబంధించి సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.

* రెండు రాష్ట్రాల మధ్య ముందస్తుగా అఖిలభారత సర్వీసు అధికారులను, రాష్ట్ర కేడర్‌ ఉద్యోగులను విభజించాలని నిర్ణయించారు. ముందుగా పోస్టులను విభజించి తర్వాత అధికారులు, ఉద్యోగులను విభజించారు. రాష్ట్ర కేడర్‌ పోస్టుల విభజన జనాభా ప్రాతిపదికన జరిగింది. కానీ స్థానికత ఆధారంగా జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కోరాయి.

* అఖిలభారత సర్వీసులు, రాష్ట్ర స్థాయి, సచివాలయ ఉద్యోగుల విభజన కోసం వివిధ కమిటీలను నియమించారు.

ప్రత్యూష్‌ సిన్హా కమిటీ: రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిలభారత సర్వీసు ఉద్యోగులను కేటాయించడానికి కేంద్రం ప్రత్యూష్‌ సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కూడా రాష్ట్ర కేడరు ఉద్యోగుల విభజన విషయంలో అనుసరించిన మార్గదర్శకాలనే అనుసరించింది. ఐఏఎస్‌ కేడర్‌ పోస్టులను ఆంధ్రప్రదేశ్‌కు 211, తెలంగాణకు 163 కేటాయించింది. ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు ఏపీకి 144, తెలంగాణకు 112 కేటాయించగా, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) కేడర్‌ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌కు 82, తెలంగాణకు 65 చొప్పున పంపిణీ చేశారు.

కమలనాథన్‌ కమిటీ: తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విభజన, పంపిణీ కోసం 2014, మార్చి 29న సి.ఆర్‌.కమలనాథన్‌ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది 2014, మార్చి నుంచి 2017 మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి మొత్తం 153 యూనిట్ల (శాఖలు, ఉపశాఖలు)కు చెందిన ఉద్యోగులను పంపిణీ చేసింది. సచివాలయ ఉద్యోగుల విభజననూ ఈ కమిటీనే చేపట్టింది. జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో కేటాయించి పంపిణీ చేసింది.

ఉద్యోగుల పంపిణీలో జాప్యం: రాష్ట్ర విభజన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏడాదిలోకి అడుగుపెట్టినప్పటికీ కొన్ని యూనిట్లకు సంబంధించి ఉద్యోగుల విభజనలో జాప్యం జరిగింది. మరికొన్నింట్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (IPM):  వైద్య ఆరోగ్య శాఖలో భాగంగా పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎమ్‌) ఉద్యోగుల విభజనకు దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ లేక ఆహార కల్తీ నమూనాల పరీక్షలు ఆలస్యమయ్యేవి. కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలోనూ జాప్యం జరిగేది. 2022, మే నెలలో ఐపీఎమ్‌లోని మొత్తం 607 ఉద్యోగులను జనాభా నిష్పత్తిలో విభజించి ఆంధ్రప్రదేశ్‌కు 350, తెలంగాణకు 257 మందిని కేటాయించారు.

వైద్యులు: ఇరు రాష్ట్రాల మధ్య వైద్యుల విభజనకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఉమ్మడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని 6,298 మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య విభజిస్తూ 2017, ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 3,828; తెలంగాణకు 2,470 మందిని కేటాయించారు.

సంక్లిష్టంగా విద్యుత్తు ఉద్యోగుల విభజన: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు సంస్థలు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దీనిలో భాగంగా విద్యుత్తు కంపెనీల పని సాఫీగా జరగడం కోసం ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ ప్రకారం 2014, జూన్‌ 2న రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను విభజించారు. అయితే 2015, జులైలో తెలంగాణ ప్రభుత్వం సర్వీస్‌ రిజిస్టర్‌లోని జన్మస్థలం, విద్యార్హత, నియామకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ స్థానికతకు చెందిన 1,157 మంది విద్యుత్తు ఉద్యోగులను రిలీవ్‌ చేసింది. ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. వివాద పరిష్కారానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎం.ధర్మాధికారితో సుప్రీంకోర్టు 2018, నవంబరు 28న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌కు కూడా మధ్యవర్తిత్వం సాధ్యపడలేదు. చివరికి ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగానే తన పని చేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు రిలీవ్‌ చేసిన 1,157 మందిలో 655 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 502 మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే థ్రెషోల్డ్‌ పరిమితి మించిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 655 మంది కేటాయింపుపై ఏపీ విద్యుత్తు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రెండుపక్షాల వివరణాత్మక విచారణ తర్వాత ఆర్థిక సమతౌల్యతను కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు కూడా సమాన సంఖ్యలో 655 మందిని కేటాయిస్తూ జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ తుది నిర్ణయం తీసుకుంది.

* ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసిన 655 మందిలో 571 మందికి మాత్రమే పోస్టింగులు ఇచ్చి, మిలిగిన 84 మందికి ఇచ్చేందుకు తెలంగాణ నిరాకరించింది. ఈ విషయమై సుప్రీంకోర్టు 2022, అక్టోబరు 11న తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక, దానిలోని సిఫార్సులే అంతిమమని, వాటిని అమలుచేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

ఉద్యోగుల పంపిణీలో రాష్ట్రాల చొరవ:  విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువమంది ఆయా జోన్లను మూడు లేదా నాలుగో ఆప్షనల్‌గా ఎన్నుకుని నియామకం పొందినవారే ఉన్నారు. వారు ఒకవేళ సొంత రాష్ట్రానికి తిరిగి వెళితే అక్కడ సర్వీసు కోల్పోయి, ప్రమోషన్లలో వెనుకబడతారు. అయినప్పటికీ ఇలాంటి వారి కోసం 2017లో మ్యూచువల్, స్పౌజ్‌ కోటాల్లో ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి అవకాశం కల్పించారు. అయితే ఇందులో క్లిష్టమైన నిబంధనల కారణంగా ఈ ఏర్పాటు పెద్దగా ఉపయోగపడలేదు.

* ఉద్యోగుల విభజన సందర్భంగా తెలంగాణలో ఉండటానికి ఆప్షన్‌ ఇచ్చినప్పటికీ కొంతమందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణ స్థానికత కలిగిన అలాంటి 698 మంది 3వ, 4వ తరగతి ఉద్యోగుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందాయి. వారిని రిలీవ్‌ చేసి పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విజ్ఞప్తి చేసింది. దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2021లో వారంతా ఏపీ నుంచి రిలీవ్‌ అయ్యారు.

* రాష్ట్ర విభజన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాజాగా  తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లడానికి ఆసక్తిని ప్రదర్శించారు. తెలంగాణలో పనిచేస్తున్న 1,369 మంది ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి సంబంధించి ఇరురాష్ట్రాలు నో ఆబ్జెక్షన్‌ సరిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది.

* రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగుల కోణంలో చూస్తే ఈ అంశం ఉద్యోగుల జీవితాలు, వృత్తితో పాటు పని, జీత సమతౌల్యతలను ప్రభావితం చేశాయి. భార్యాభర్తల ఉద్యోగాలు, పిల్లల చదువులు, వైద్య సదుపాయాలు లాంటి అనేక కారణాల వల్ల ఒక నిర్దిష్ట రాష్ట్రంలో ఉండాలనుకునే చాలామంది ఉద్యోగులు అనుకోకుండా స్థానభ్రంశం చెందారు.

రచయిత: కరుణ వారాద

Posted Date : 01-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులపై విభజన ప్రభావం

 ఆదుకోవడంలో అంతులేని ఆలస్యం! 

శాస్త్రీయత లేకుండా జరిగిన రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర అన్నివిధాలుగా దెబ్బతింది. ఆస్తులను ప్రాంతాల ప్రాతిపదికన కేటాయించడంతో తెలంగాణ లాభపడింది. అప్పులను జనాభా ఆధారంగా లెక్కగట్టడంతో ఏపీ నష్టపోయింది. ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన రెవెన్యూ వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పడే ఆర్థిక లోటును కేంద్రం భర్తీ చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ నిధుల మంజూరులో దాదాపు దశాబ్ద కాలం ఆలస్యం జరిగింది. ఆదాయం తగ్గి, అప్పులు పెరిగిపోయిన పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక అవస్థలు, వనరుల పంపకంలో ఏర్పడిన నష్టం, లోటు భర్తీలో కేంద్ర ప్రభుత్వ తాత్సారం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంబంధిత గణాంకాలను గుర్తుంచుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు ప్రధాన ఆదాయ వనరులు. విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయ వనరుల పరంగా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు కారణం రాబడి, వ్యయాల్లో తీవ్రమైన వ్యత్యాసాలే. అలాగే ఆస్తులు, అప్పుల పంపకం కోసం తీసుకున్న హేతుబద్ధత లేని నిర్ణయాలు కూడా కారణంగా పేర్కొనవచ్చు. ఆస్తులను భౌగోళిక ప్రదేశం ఆధారంగా, అప్పులను జనాభా నిష్పత్తిలో పంచారు. అన్నిరకాల ముఖ్యమైన ఆస్తులు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రధాన ఆస్తులను కోల్పోయింది. ఇది నవ్యాంధ్ర ఆర్థిక వనరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

 నవ్యాంధ్రప్రదేశ్‌ సొంత ఆదాయం, కేంద్ర పన్నుల వాటా; గ్రాంట్లు, మార్కెట్‌ నుంచి రుణాలు సహా మొత్తం రెవెన్యూ వసూళ్లు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి కంటే 50 శాతం పైగా తగ్గిపోయాయి. అయితే జనాభా నిష్పత్తి ఆధారంగా అప్పులు, జీతాలు, రాయితీలు కేటాయించడంతో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి కంటే 60 శాతానికి మించి వ్యయం పెరిగింది. దీంతో అసాధారణమైన రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు ఏర్పడ్డాయి.

రాబడిలోనూ తెలంగాణ కంటే ఏపీ చాలా వెనుకబడి ఉంది. ఈ విషయాన్ని 14వ ఆర్థిక సంఘం ధ్రువీకరించింది. మొత్తం పన్ను వసూళ్లలో వ్యాట్‌ (జీఎస్టీ అమలుకు ముందు) వాటా, పన్నేతర ఆదాయం కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌కు చాలా తక్కువగా ఉంది. కేవలం 47% రాష్ట్ర ఆదాయంతో విభజన ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర జనాభా (58.32%) అవసరాలను 2014-15 విభజన సంవత్సరంలో తీర్చాల్సి వచ్చింది. జీతాలు, పింఛన్లకే రాష్ట్ర రాబడిలో 73 శాతం ఖర్చు చేయాల్సి రావడంతో ఉమ్మడి రాష్ట్రంలోని 58 శాతం ఖర్చుతో పోలిస్తే ఇది చాలా అధికం. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై వ్యయానికి అవకాశం లేకుండా పోయింది.

చట్టంలో ఏముంది?: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-46లో ఆదాయం, పంపిణీ గురించి పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఎదుర్కొనే ఆర్థిక లోటును పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి ఆర్థిక వెసులుబాటు చర్యలు తీసుకోవాలని ఇదే చట్టంలోని సెక్షన్‌-46(2)లో పేర్కొన్నారు. ఏపీ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఇదే హామీ ఇచ్చారు. నవ్యాంధ్రలో తొలి ఏడాది (అపాయింటెడ్‌ డే నుంచి 14వ ఆర్థిÄక సంఘం సిఫార్సులు ఆమోదం పొందే రోజు వరకు) తలెత్తే ఆర్థిక లోటును కేంద్రం 2014-15 బడ్జెట్‌లో భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు.

ఆర్థికలోటుపై జాయింట్‌ కమిటీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు ఎదుర్కొనే ఆర్థిÄక సంక్షోభం గురించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రపతి పాలన సమయంలోనే 2015, మార్చి 20న కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ 2014, జూన్‌ 2 నుంచి 2014, మార్చి 31 వరకు ఎదుర్కొనే ఆర్థిక లోటు అంచనాకు, కేంద్ర బడ్జెట్‌ 2014-15లో ఈ లోటు భర్తీకి నిధులు కేటాయించే విధంగా తగిన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి, హోంమంత్రి, ప్రణాళిక సంఘం ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో ఒక జాయింట్‌ కమిటీని నియమించాలని ఆ లేఖలో గవర్నర్‌ కోరారు. అపాయింటెడ్‌ డే 2014, జూన్‌ 2 నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌ 2014-15 ఆర్థిక సంవత్సరం పది నెలల్లో రూ.15,691 కోట్ల లోటులో ఉంటుందని పేర్కొన్నారు.

గవర్నర్‌ అభ్యర్థనకు స్పందించిన కేంద్ర హోంశాఖ ఒక జాయింట్‌ కమిటీని అప్పటి ప్రణాళికా శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ ప్రతినిధులతో నియమించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక లోటును లెక్కించాలని ఈ కమిటీకి సూచించింది. అయితే ఆ కమిటీలో ఏపీ ప్రతినిధులను భాగస్వాములను చేయలేదు. వనరులకు సంబంధించిన సమాచారమంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అపాయింటెడ్‌ డే, ఎన్నికలకు ముందే 2014 ఏప్రిల్, మేలో జాయింట్‌ కమిటీకి అందించింది. నవ్యాంధ్ర రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర బడ్జెట్‌ 2015లో రూ.15,691 కోట్లు కేటాయించాలని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్‌-46(2)లో పేర్కొన్నట్లుగా ఆర్థిక లోటు భర్తీకి 2014-15 కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. దీంతో వనరుల కొరతను అధిగమించడానికి సొంత ప్రభుత్వ ఖాతాలపై ఆధారపడటం, బహిరంగ మార్కెట్‌లో అప్పులు తేవడం మినహా ఆంధ్రప్రదేశ్‌కు మరో మార్గం లేకుండాపోయింది.

నవ్యాంధ్ర ఆర్థిక ఖాతాలపై కాగ్‌ నివేదిక: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఖాతాలను తనిఖీ చేసి, లోటు భర్తీకి 2014-15లో కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక నిధి (అడ్‌హాక్‌ గ్రాంటు)గా రూ.2,303 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత 2014, జూన్‌ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఇంకా రూ.13,775.76 కోట్ల రెవెన్యూ లోటు ఉందని నిర్ధారించింది. అంటే రాష్ట్ర విభజన వల్ల పది నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం రూ.16,078.76 కోట్ల లోటులో ఉందని నిర్ధారించింది. ఈ మొత్తం రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రపతి పాలన సమయంలో అప్పటి గవర్నర్‌ రాసిన లేఖలో పేర్కొన్న లోటు అంచనా రూ.15,691 కోట్లకు ఇంచుమించు సమానంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంత తీవ్రమైన ఆర్థిక లోటు ఉండటంతో కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడింది.

కేంద్రం నుంచి లభించిన మద్దతు: ఆర్థిక లోటు భర్తీకి గ్రాంటు కింద 2014-15లో కేంద్ర ప్రభుత్వం రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం కలిపినా రూ.3979.50 కోట్లు మాత్రమే. 2016, సెప్టెంబరు 8న కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం ప్రకారం, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు భర్తీ చేస్తామన్న హామీని ఆ ఏడాదిలో జరిగిన నిర్దిష్ట ఖర్చుల ప్రాతిపదికన నెరవేరుస్తామన్నారు. పింఛన్‌ పథకాలు తదితరాలను తాత్కాలికంగా అంచనా  వేసి ఆర్థిక లోటును లెక్కించడం వల్ల వాటిని మరింత దిద్దుబాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్థిక లోటు కింద రూ.3979.50 కోట్లు అందించినట్లు, మిగిలింది వార్షిక వాయిదాల్లో చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

2017, మే 4న కేంద్ర ఆర్థికమంత్రి కొత్త పథకాలైన రుణ ఉపశమనం (రూ.7,069.67 కోట్లు), వృద్ధాప్య పింఛన్లు (రూ.3,391.20 కోట్లు), విద్యుత్తు పంపిణీ సంస్థలైన డిస్కంలకు ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీ (రూ.1500 కోట్లు) కింద చేసిన మొత్తం వ్యయం రూ.11,960.87 కోట్లను మొత్తం ఆర్థిక లోటు అయిన రూ.16,078.76 కోట్ల నుంచి మినహాయించడంతో మిగిలిన ఆర్థిక లోటు రూ.4,117.89 కోట్లలో 2014-15, 2015-16, 2016-17ల్లో కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.3,979.50 కోట్లు మినహాయిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇంకా కేవలం రూ.138.39 కోట్లు మాత్రమే ఆర్థిక లోటు కింద విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే కొత్త పథకాలపై ఖర్చు చేశామని, వాటిని లోటు భర్తీ కింద పరిగణించకూడదని నాటి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి 2017, సెప్టెంబరు 25న కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక లోటు సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది.

తొమ్మిదేళ్ల తర్వాత: రాష్ట్ర విభజన జరిగి దాదాపు 9 సంవత్సరాల తర్వాత నవ్యాంధ్రకు రావాల్సిన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వనరుల అంతరం పూడ్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ 2023, మే 19న ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ లెక్కించిన మొత్తం ఆర్థిక లోటు రూ.16,078.76 కోట్లలో గతంలో ఇచ్చిన రూ.3979.50 కోట్లు, 2013 మే నెలలో మంజూరు చేసిన రూ.10,460.87 కోట్లతో కలిపి మొత్తం రూ.14,440.37 కోట్లను కేంద్రం నుంచి నవ్యాంధ్రకు వనరుల అంతరం పూడ్చేందుకు సహాయంగా అందింది.

ఇక్కడ లోటు, అక్కడ మిగులు:  14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసేసరికి అంటే 2019-20 చివరి నాటికి ప్రత్యేక హోదా రాష్ట్రాలతో పాటుగా ఆర్థిక లోటు ఉండే రాష్ట్రం విభజిత ఏపీ మాత్రమేనని 14వ ఆర్థిక సంఘం నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర పన్నుల్లో వాటా (డివాల్యూషన్‌) తీసివేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటు రూ.31,646 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.47,240 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా లెక్కలోకి తీసుకుంటే ఏపీ రెవెన్యూ లోటు (2015-16 నుంచి 2019-20 వరకు) రూ.22,112 కోట్లు ఉండవచ్చని అంచనా. అయితే తెలంగాణ మాత్రం ఇందుకు విరుద్ధంగా డివాల్యూషన్‌ ముందున్న రాబడి మిగులు 2015-16లో రూ.818 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.8,900 కోట్లకు పెరిగింది. డివాల్యూషన్‌ తర్వాత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మిగులు 2015-16 నుంచి 2019-20 నాటికి రూ.1,18,678 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిని బట్టి విభజన ప్రభావం విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వనరులపై ఎంత ప్రతికూల ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు నవ్యాంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు 2021-22 (ఖాతాలు)లో రూ.8,160 కోట్లు, 2022-23 (సవరించిన అంచనాలు)లో రూ.29,107 కోట్లు, 2023-24 (బడ్జెట్‌ అంచనాలు)లో రూ.22,316 కోట్లుగా ఉండగా; తెలంగాణలో 2022-23 (సవరించిన అంచనాలు)లో రూ.2,979.93 కోట్లు రెవెన్యూ మిగులులో ఉంది. అదేవిధంగా 2013-24 (బడ్జెట్‌ అంచనాలు)లో రూ.4,881.74 కోట్లు మిగులుతో ఉంది.

రచయిత: వి.కరుణ

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నదీ జలాల పంపిణీ(సంబంధిత అంశాలపై విభజన ప్రభావం)

 నీటి వాటాలో తెగని తగవులు!

ఉమ్మడి ఆంధ్ర]ప్రదేశ్‌ విభజన సృష్టించిన క్లిష్టమైన, దీర్ఘకాలిక సమస్యల్లో నదీ జలాల పంపిణీ ప్రధానమైనది.  ముందు నుంచే నీళ్ల విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య వివాదాలు ఉన్నాయి. విభజనతో అవి మరింత తీవ్రమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, ప్రాజెక్టులపై పోలీసులు ఘర్షణకు దిగడం తదితర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్న అంశాలు, వాటి పూర్వాపరాలు, విభజన చట్టంలో ఉన్న పరిష్కారాలు, విభజన అనంతర పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కృష్ణా జల వివాద ట్రైబ్యునళ్లు ఇచ్చిన అవార్డులు, వాటిపై తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు, కేంద్రం పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవాలి.

  ఉమ్మడి రాష్ట్రంలోనే గోదావరి, కృష్ణా, నాగావళి, పెన్నా, వంశధార, తుంగభద్ర తదితర నదులకు సంబంధించి అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన నదీజలాల పంపిణీకి సంబంధించి మరిన్ని సంక్లిష్ట పరిస్థితులను సృష్టించింది. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ వివాదాలకు దారితీసింది. 

నవ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నీరందించే కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, అమలును ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014’.. ‘నదీ యాజమాన్య మండళ్ల’ నియంత్రణ కిందకు తెచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రాల ప్రత్యేక అధికార పరిధిలో ఉన్న జలవనరుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల అంశాల్లో రెండు రాష్ట్రాల అధికారాన్ని, విచక్షణను గణనీయంగా తగ్గించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల క్రమబద్ధీకరణ అంతర్‌ రాష్ట్ర అంశంగా మారింది. ముఖ్యంగా కరవు కాలంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో లభ్యమయ్యే నీటి పరిమాణంలో క్రమబద్ధీకరణ, నిర్వహణ అత్యంత క్లిష్టతరంగా మారాయి. 

* రాష్ట్ర విభజనకు ముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలకు సంబంధించి వివాదాలున్నాయి. రాష్ట్రవిభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రకు కృష్ణానదిపై ఉమ్మడిగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణ, అమలు విషయంలో వివాదాలు మరింత పెరిగాయి.

విభజన చట్టంలో ఏముంది?

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014’లోని 9వ భాగంలో ‘జలవనరుల నిర్వహణ, పంపిణీ, అభివృద్ధి’కి సంబంధించిన అంశాలు సెక్షన్‌-84 నుంచి 91 వరకు ఉన్నాయి. సెక్షన్‌-84లో గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య మండలి అవతరణ తేదీ నుంచి రెండు నదీ జలాల యాజమాన్య బోర్డుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక శిఖరాగ్ర మండలి (అపెక్స్‌ కౌన్సిల్‌)ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షులుగా, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలి ఏర్పాటుతో రాష్ట్ర అంశంగా ఉన్న నదీజలాల నిర్వహణ, అమలు కేంద్రం చేతుల్లోకి వెళ్లింది.

* సెక్షన్‌-89 (ఎ), (బి)ల్లో నీటివనరుల కేటాయింపునకు సంబంధించి ‘అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956’ కింద ఏర్పాటైన ట్రైబ్యునల్, ప్రాజెక్టుల వారీగా నీటిజలాలు కేటాయించకపోతే తాజాగా కేటాయింపులు జరుపుతుంది. తక్కువ నీటి ప్రవాహం సందర్భాల్లో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేయడానికి విధివిధానాలను రూపొందించడంతో పాటు విచారణాంశాల కోసం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ కాలాన్ని కేంద్రం పొడిగిస్తుంది.

---------------

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్‌ రాష్ట్ర నదీజల వివాదాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య గోదావరి నదీజలాల వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 1969, ఏప్రిల్‌ 10న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా ‘గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌’ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైబ్యునల్‌ 1980, జులై 7న తుది అవార్డును అందజేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటివాటాను తిరిగి తెలంగాణ, నవ్యాంధ్ర మధ్య విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు పంపిణీ చేశారు.

* కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా నదీజలాల వివాద పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 1969, ఏప్రిల్‌ 10న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.బచావత్‌ ఛైర్మన్‌గా ‘కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-I ఏర్పాటు చేసింది.ఈ ట్రైబ్యునల్‌ 1976, మే 27న అవార్డు ప్రకటించింది.

గమనిక: 1969, ఏప్రిల్‌ 10న గోదావరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం ఉమ్మడిగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.

* కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-I అవార్డు విషయంలో రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో భారత ప్రభుత్వం 2004, ఏప్రిల్‌ 2న జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ఛైర్మన్‌గా ‘కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-I ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలను విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. ఈ పంపిణీ విషయంలోనూ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన కృష్ణానది జలాల కేటాయింపు:  అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌-3 కింద తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యర్థనతో 2023, అక్టోబరు 4న ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-I.. ‘టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ జారీకి ఆమోదం తెలిపింది. కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ -II కు కొత్త విధివిధానాలను ప్రతిపాదిస్తూ 2023, అక్టోబరు 6న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం - 1956లోని సెక్షన్‌-3, 5(1), 12లను అనుసరించి ఈ ట్రైబ్యునల్‌కు రెండు విధి విధానాలను కేంద్రం నిర్దేశించింది.

* కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలు, దానికి మించి కేటాయించిన అదనపు జలాలు, పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రైబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు విధివిధానాలను రూపొందించింది. 

1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగి కొనసాగుతున్నాయి. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపు చేయాలి.

2) కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఉమ్మడి కేటాయింపులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సూచించిన విధంగా పంపిణీ/కేటాయింపు చేయాలి.

(i) కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-I ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలతో పాటు, దానికి మించి ఏదైనా అదనపు కేటాయింపులు జరిపి ఉంటే వాటి పంపిణీ/ కేటాయింపు జరగాలి.

(ii) పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించేందుకు వీలుగా గత ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాటాను, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా పంపిణీ చేయాలి.

దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-II’ కాలపరిమితిని 2023, అక్టోబరు 6న ఇచ్చిన నోటిఫికేషన్‌లో 2024, మార్చి 31 వరకు పొడిగించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి తన అభ్యంతరం తెలిపింది. తాజా విధివిధానాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను మినహాయించి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తాజా విధివిధానాలపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ట్రైబ్యునల్‌ ద్వారా జరిగిన కేటాయింపులకు భంగం కలగకుండా చట్టపరంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని పునరుద్ఘాటించింది.

కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II నేపథ్యం: ‘అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం-1956’లోని సెక్షన్‌-3 ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారం కోసం భారత ప్రభుత్వం 2004, ఏప్రిల్‌ 2న కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II ని ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్, సభ్యులుగా అలహాబాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.పి.శ్రీవాస్తవ, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.సేథ్‌లను నియమించింది. (శ్రీవాస్తవ మరణించడంతో అతడి స్థానంలో జస్టిస్‌ బి.పి.దాస్‌ నియమితులయ్యారు) ఈ ట్రైబ్యునల్‌-II 2010, డిసెంబరు 30; 2011, మార్చి 29; 2013, నవంబరు 29 తేదీల్లో మూడు నివేదికలను కేంద్రానికి సమర్పించింది. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్‌-12 ప్రకారం తుది నివేదిక సమర్పించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను నిలిపివేయాలి. అయితే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌-89 ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పొడిగించేందుకు అవకాశం కల్పించింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వివాదంపై 2014, జులై 14న భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2015లో మరోసారి ఉమ్మడి రాష్ట్రంలోని నీటి కేటాయింపులను పరిశీలించి మళ్లీ కేటాయింపులు చేసే విధంగా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అయిదు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీ) దాఖలయ్యాయి. అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 5(2) ప్రకారం ట్రైబ్యునల్‌ నివేదికను పక్కన పెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్లన్నీ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. 2011, సెప్టెంబరు 16న బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

* ఈ ట్రైబ్యునల్‌ 2016, అక్టోబరు 19న ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అవార్డునే కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలు పంచుకోవాలని తీర్పునిచ్చింది. దీనిలో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన 811 టీఎంసీలలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలుగా నిర్ణయించింది.

* కృష్ణా జలాల పంపకాల్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తించే విధంగా కృష్ణాజల వివాదాల ట్రైబ్యునల్‌-ఖిఖి తో పునఃసమీక్ష చేయించాలని తెలంగాణ 2018లో కేంద్రాన్ని కోరింది.

* 2020లో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన విషయాన్ని చర్చించారు. ఈ చర్చల నేపథ్యంలో 2021లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపులపై పునఃపరిశీలన కోసం తాజాగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌-II కి రెండు విధివిధానాలను ప్రతిపాదించి, ట్రైబ్యునల్‌ కాలపరిమితిని 2024, మార్చి 31 వరకు పెంచింది. ఏపీ విభజన చట్టం-2014లోని సెక్షన్‌-89(a)(b) ల కింద ప్రతిపాదించిన అంశాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ పునఃపరిశీలన చేస్తుంది.

* 2004లో ఏర్పాటు చేసిన కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-II కాలపరిమితిని 2012, మార్చి 29న, 2012 సెప్టెంబరు 28, 2013 ఏప్రిల్‌ 2, 2013 సెప్టెంబరు 27, 2013 నవంబరు 27న, 2014 ఫిబ్రవరి 5, 2014 మే 15, 2016 జులై 18, 2017 జులై 31, 2018 ఆగస్టు 9, 2019 ఆగస్టు 29, 2020 జులై 23, 2021 జులై 20, 2022 జూన్‌ 27న పొడిగించగా, తాజాగా 2024 మార్చి 31 వరకు పొడిగించారు.

రచయిత: వి.కరుణ

Posted Date : 07-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నాటి ప్రధాని హామీలు-అమలు (ఏపీ విభజన చట్టం)

చట్టంలో భరోసా.. ఆచరణలో నిరాశ!

అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో అష్టకష్టాలపాలై, అన్నివిధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదు. ఆర్థిక చేయూతతో పాటు, అవస్థాపనా సౌకర్యాల కల్పనలోనూ రాష్ట్రానికి గత పదేళ్లుగా నిరాశే ఎదురవుతోంది. చట్టంలో పేర్కొన్న హామీలతో పాటు, పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన భరోసాలెన్నో ఆచరణకు నోచుకోలేదు. ఈ పరిస్థితిని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. విభజన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమైన హామీల అమలు తీరు, దానికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య నడిచిన సంప్రదింపులు, అవసరమైన గణాంకాలను గుర్తుంచుకోవాలి.

  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం - 2014లోని వివిధ నిబంధనల కింద, విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, అవస్థాపనా మద్దతు కల్పించే విధంగా ఎన్నో హామీలున్నాయి. వీటికితోడు నాటి ప్రధాని రాజ్యసభలో మరిన్ని వాగ్దానాలిచ్చారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అసెంబ్లీ స్థానాల పెంపు, గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థికసాయం, రైల్వే జోన్‌ ఏర్పాటు, పలు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం, వైజాగ్‌ - చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైలు, వనరుల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, నూతన రాజధాని నగరానికి కేంద్ర సాయం, గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం, క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుతో పాటు పలు పన్ను ప్రోత్సాహకాలు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా, కొన్ని నామమాత్రంగా అమలయ్యాయి.

వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ: ఈ అంశం గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2), 46(3), 94(2)ల్లో ఉంది. ఏపీ విభజన బిల్లుపై 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చ సందర్భంగా వెనుకబడిన జిల్లాల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమలోని నాలుగు జిల్లాలు (కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం); ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం) ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని బిల్లులో చేరుస్తామని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఒడిశాలోని ‘కోరాపుట్‌- బొలంగేర్‌- కలహండి’ (కె.బి.కె.) ప్రత్యేక ప్రణాళిక; మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ఉండే విధంగా విభజన చట్టాన్ని సవరించాలని నవ్యాంధ్రలో ఏర్పాటైన తొలి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 7 జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కోరుతూ 2014, అక్టోబరు 16న కేంద్ర ప్రణాళికా సంఘానికి నివేదిక సమర్పించింది. అయితే కేంద్రం మాత్రం నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.350 కోట్లను అయిదేళ్లలో (2014-15 నుంచి 2020-21) మొత్తం రూ.1,750 కోట్లను ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా ఇచ్చింది. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ కింద వెనుకబడిన ప్రాంతాలకు తలసరి రూ.4,115 లెక్కన కేటాయించిన కేంద్రం ఏపీకి రూ.426.57 మాత్రమే ఇచ్చింది.

ఏపీ అసెంబ్లీ స్థానాల పెంపు: విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌-170లోని నియమాలకు లోబడి, విభజన చట్టంలోని సెక్షన్‌-15లోని నియమాలకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225కు పెంచాలి. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను నిర్ధారిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ హామీని అమలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2016, ఫిబ్రవరి 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరింది. నాటి ముఖ్యమంత్రి 2017, జులై 24న ప్రధానికి లేఖ కూడా రాశారు. ఈ విషయమై 2018, డిసెంబరు 19న పార్లమెంట్‌లో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. ఆర్టికల్‌-170 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్ల పునర్విభజన 2026 తర్వాత చేపట్టే జనాభా లెక్కల సేకరణ అనంతరమే చేయాల్సి ఉంటుందని సమాధానమిచ్చింది. ఆ విధంగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో పడిపోయింది.

గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సాయం:  వామపక్ష, తీవ్రవాద సమస్య ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర విభజనతో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం లేకుండా పోయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9(2)లో హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రమే ఉమ్మడి శిక్షణ కేంద్రంగా ఉంటుందని పేర్కొనడంతో సమస్య మరింత జఠిలమైంది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చోట గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సాయం చేస్తుందని ఉంది. దీని ప్రకారం గత రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో భూమిని ఎంపికచేసింది. గ్రేహౌండ్స్‌కు మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటుకు రూ.858.37 కోట్ల వ్యయమవుతుందనే ప్రతిపాదనను కేంద్రం హోం శాఖకు గత రాష్ట్ర ప్రభుత్వం పంపింది. దీంతో కేంద్రం ఏపీలో గ్రేహౌండ్స్‌ కేంద్రం ఏర్పాటును ఆమోదిస్తూ 2018, ఏప్రిల్‌లో రూ.219.16 కోట్లు మంజూరుచేసింది. చివరికి రూ.9.08 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆ ప్రతిపాదన పెండింగ్‌లో పడిపోయింది. ఏపీ నూతన ప్రభుత్వం 2020, జూన్‌లో గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, జగన్నాథపురం గ్రామ పరిధిలో 385 ఎకరాలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021, నవంబరు 14న జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశంలో ఈ అంశంపై కేంద్రం స్పందించింది. కొత్తగా ఏర్పాటయ్యే గ్రేహౌండ్స్‌ కేంద్రంలో భారత ప్రభుత్వ ఏజెన్సీలకు 50 శాతం ట్రైనింగ్‌ స్లాట్‌లను కేటాయించాలని, అప్పుడైతే మొత్తం ఖర్చును భరిస్తామంటూ మెలిక పెట్టింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.385 కోట్ల భూ వ్యయం, రూ.27.54 కోట్ల వార్షిక నిర్వహణ వ్యయంతో 2022, అక్టోబరులో సవరించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు: విభజన చట్టంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే 7 మండలాలను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంచి రాష్ట్రాన్ని విభజించారు. దీనిపై ఏపీ నుంచి అభ్యంతరం రావడంతో మళ్లీ 2014, జులై 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా విభజన చట్టాన్ని సవరించి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా రిజర్వాయర్, స్పిల్‌వే, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అనే మూడు భాగాలున్నాయి. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మార్చడం, నిర్వహణ, కేంద్ర సహాయం లాంటి అంశాలను విభజన చట్టంలోని సెక్షన్‌ 90లో పేర్కొన్నారు. సెక్షన్‌ 90(1) ప్రకారం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. సెక్షన్‌ 90(2) ప్రకారం ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణ, అభివృద్ధి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. సెక్షన్‌ 90(3) ప్రకారం పోలవరం నిర్మాణానికి కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లే భావించాలి. సెక్షన్‌ 90(4) ప్రకారం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టడంతో పాటుగా దానికి అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులు, పునరావాసం సమకూర్చే బాధ్యతలన్నీ కేంద్రమే తీసుకోవాలి. రి 2014, ఏప్రిల్‌ 29నాటి కేంద్ర కేబినెట్‌ నోట్‌ ప్రకారం ‘‘ప్రస్తుత సత్వరనీటి పారుదల ప్రయోజనాల కార్యక్రమం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు బాధ్యతలను పర్యవేక్షిస్తుంది’’ అని పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2010-11 లెక్కల ప్రకారం రూ.16,010.45 కోట్లు కాగా, ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి పెరిగే అదనపు ఖర్చులు, భూసేకరణ, ఆయకట్టు అభివృద్ధి పనులు, ముంపు బాధితులకు మెరుగైన పరిహారం వంటివన్నీ భూసేకరణ, పునరావాస చట్టం - 2013 ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతాయని కూడా నోట్‌లో ఉంది. దీన్ని 2014, మే 1న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. రి పోలవరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం 2017-18 నాటి ధరల ప్రాతిపదికపై రూ.57,297 కోట్లుగా సవరించి పోలవరం ప్రాజెక్టు ఆథారిటీకి సమర్పించింది. సాంకేతిక సలహా కమిటీ సూచనలతో అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి రూ.55,548 కోట్లుగా పేర్కొంది. సాంకేతిక సలహా కమిటీ ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తూనే కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలనకు పంపింది. అక్కడ అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు కుదించి తుది ఆమోదం కోసం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. 2013-14 నాటి అంచనాల్లోని తాగునీటి అంశాన్ని, విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణాన్ని తాము పరిగణన లోకి తీసుకోమని, కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే పూర్తిచేస్తామని, దానికి తగ్గట్టుగా మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.20,418 కోట్లకు పరిమితం చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఖరిని ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. రి పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి 2022, మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా తక్షణం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి 2022, జులై 15న లేఖ రాశారు. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణంలో 41.15 మీటర్లు (వాస్తవ ఎత్తు 45.72 మీటర్లు) వరకు నీటిని నిల్వ చేసేందుకు, మిగిలిన పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.17,144.06 కోట్లు వ్యయం అవుతుందని 2023, జూన్‌ 5న మరో లేఖ పంపారు. దాంతో కేంద్రం ఇంతవరకు ఇచ్చిన నిధులకు అదనంగా రూ.12,911.55 కోట్లు (మొదటి దశలో 41.15 మీటర్ల నీటి నిల్వకు, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.10,911.15 కోట్లు, వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు రూ.2,000 కోట్లు) కేటాయిస్తున్నట్లు తెలిపింది.

నోట్‌: 2023, మే వరకు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.14,969.39 కోట్లు విడుదల చేసింది. మరో 12,911.15 కోట్లకు ఆమోదం వచ్చినా ఇంకా విడుదల కాలేదు.

ప్రాజెక్టు జాప్యానికి కారణాలు:  ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడంతో, విభజన వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి కష్టంగా మారింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన సొంత నిధులను ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే కేంద్రం రీయంబర్స్‌మెంట్‌ చేస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ దాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఏమీ లేదు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో అనేక ప్రశ్నలు వేస్తూ, అవాంతరాలు సృష్టిస్తోంది. 2013 నాటి భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 90(4)లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. చాలావరకు బహుళార్థక సాధక ప్రాజెక్టుల విషయంలో మూడు రకాల విభాగాలు (నీటిపారుదల, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి) ఉంటాయి. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింట్లో ఇవి ఉంటాయి. కానీ పోలవరం విషయంలో అందుకు భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ (నీటిపారుదల) వ్యయానికే మాత్రమే నిధులు మంజూరు చేస్తామంటోంది. దీంతో పోలవరం నిర్మాణం ఆలస్యమవుతూ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది.

నోట్‌: పోలవరం ప్రాజెక్టు తొలి ప్రతిపాదన 1941లో జరిగింది. నాడు ప్రాజెక్టు పేరు శ్రీరామపాద సాగర్‌ ప్రాజెక్టు. 2005లో ఇందిరాసాగర్‌ పేరుతో పనులు ప్రారంభమయ్యాయి. విభజన చట్టం-2014 ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు.

ప్రాజెక్టు జాప్యానికి కారణాలు:  ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడంతో, విభజన వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి కష్టంగా మారింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన సొంత నిధులను ఖర్చు చేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే కేంద్రం రీయంబర్స్‌మెంట్‌ చేస్తుంది. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ దాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఏమీ లేదు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో అనేక ప్రశ్నలు వేస్తూ, అవాంతరాలు సృష్టిస్తోంది. 2013 నాటి భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 90(4)లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. చాలావరకు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల విషయంలో మూడు రకాల విభాగాలు (నీటిపారుదల, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తి) ఉంటాయి. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింట్లో ఇవి ఉంటాయి. కానీ పోలవరం విషయంలో అందుకు భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ (నీటిపారుదల) వ్యయానికే మాత్రమే నిధులు మంజూరు చేస్తామంటోంది. దీంతో పోలవరం నిర్మాణం ఆలస్యమవుతూ ఖర్చు విపరీతంగా పెరుగుతోంది.

నోట్‌: పోలవరం ప్రాజెక్టు తొలి ప్రాతిపాదన 1941లో జరిగింది. ప్రాజెక్టు పేరు శ్రీరామపాద సాగర్‌ ప్రాజెక్టు. 2005లో ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు పేరుతో పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు.

- రచయిత వి. కరుణ
 
Posted Date : 18-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక హోదా ప్రతిపత్తి

మాట తప్పి.. సాయంతో సరిపెట్టి!

ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు కాస్తంత అండగా నిలుస్తుందనుకున్న ‘ప్రత్యేక హోదా’ హామీ ఎప్పటికీ అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఆదుకుంటామని స్పష్టంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట నిలబెట్టుకోలేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను కారణంగా చూపి ప్రత్యేక హోదాను కాస్తా ప్రత్యేక ఆర్థిక సాయంగా మార్చేసింది. ఆ సాయంతో ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా, వడ్డీల చెల్లింపులకు పరిమితం చేయడంతో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశమైన ప్రత్యేక హోదాపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దాని వల్ల లభించే ప్రయోజనాలు, హామీ పూర్వాపరాల నుంచి ప్రస్తుత స్థితి వరకు పరిణామాలను పూర్తిగా తెలుసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014పై చర్చ సందర్భంగా 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రసంగిస్తూ విభజిత ఆంధ్రపదేశ్‌కు 6 రకాల హామీలిచ్చారు. వాటిలో కీలకమైంది ‘ప్రత్యేక హోదా’ అంశం. ‘‘కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి sSpecial Category Statuszని విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఇస్తాం. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడేందుకు దోహదపడుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వాలని సూచిస్తూ 2014, మార్చిలో కేంద్ర మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. కానీ నేటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు.

ఆర్థిక సంఘాల సిఫార్సులతో సంఘర్షణ:  కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంలో 2014, ఫిబ్రవరి 20న ప్రధానమంత్రి ఇచ్చిన 6 రకాల హామీల్లోని 5 హామీల విషయంలో వివాదం లేదు. అయితే మొదటి హామీగా పేర్కొన్న ‘ప్రత్యేక హోదా ప్రతిపత్తి’పై అప్పటి ప్రధాని ప్రకటనకు, తర్వాత వచ్చిన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మధ్య సంఘర్షణ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం నివేదికలోని పేరా 2.29, పేరా 2.30లో ‘‘ఆర్థిక వనరుల పంపిణీపై ప్రతిపాదనలు, సిఫార్సులు చేయడంలో ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. రాష్ట్ర వనరులను అంచనా వేయడంలో, ఒక్కో రాష్ట్రానికి ఉన్న బలహీనతలను, అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని వాటికి కావాల్సిన ఆర్థిక వ్యయ అవసరాలను అంచనా వేశాం. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు మధ్య భౌతిక సారూప్యతలు అనేకం (ఎక్కువ) ఉండటాన్ని గమనించాం. ఆర్థిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం, వెనుకబాటుతనం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్ల వాటి ద్రవ్యవనరులపై ప్రభావం ఉండటంతో, వ్యయ అవసరాలు అధికంగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం ఆర్థిక లోటును సాధ్యమైనంతగా పన్నుల పంపకం ద్వారా భర్తీ చేయాలనేదే మా లక్ష్యం. అయితే అంచనా వేసిన లోటును పూడ్చలేని రాష్ట్రాలకు, పన్ను పంపకాలకు అదనంగా (పోస్ట్‌ డివల్యూషన్‌) రెవెన్యూ లోటు గ్రాంట్లు ప్రతిపాదించాం. అంతర్రాష్ట్ర అసమానతలు ఆయా రాష్ట్రాలు విధానాల పరిధిలోనివే అయినప్పటికీ, పన్నుల పంపకం ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం సమకూర్చి తద్వారా అంతర్రాష్ట్ర అసమానతలను రాష్ట్రాలే సమర్థవంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించాం’’ అని పేర్కొంది.

పన్నుల పంపకం (ట్యాక్స్‌ డివల్యూషన్‌)కు ప్రతిపాదనల తయారీలో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినప్పటికీ రాష్ట్ర ద్రవ్య సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ‘‘ఆంధ్రప్రదేశ్‌ 2019-20లో కూడా ఆర్థికలోటులోనే ఉంటుంది’’ అని చెబుతూ 2015-16 నుంచి 2019-20 వరకు అయిదేళ్ల పాటు ప్రత్యేక ఆర్థిక లోటు గ్రాంటును ప్రకటించింది.

 2018, అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది.

ప్రత్యేక ఆర్థిక సహాయంపై కేంద్రం ప్రకటన: ప్రజాఉద్యమాలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2016, సెప్టెంబరు 8న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ దీనిద్వారా సమకూరతాయని, ‘ప్రత్యేక హోదా’కు, ‘ప్రత్యేక ఆర్థిక సహాయం’కు పేరులో తప్ప ఇంకెందులోనూ తేడా ఉండదని చెప్పింది. ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రిమండలి 2017, మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక ఆర్థిక సహాయం (pecial Assistance Measure) ఆమోదించింది. దీనిలో భాగంగా ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు (EAP)కు నిధులు సమకూర్చడంలో ప్రత్యేక మినహాయింపు, వెసులుబాటు కల్పించింది.

 కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాని ప్రకారం ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలు 90:10 నిష్పత్తిలో అమలుచేసి ఉంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి అయిదేళ్లకు (2015-20) అదనంగా రావాల్సిన మొత్తాన్ని అదనపు సాయంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని 2015-16 నుంచి 2019-20 వరకు అయిదేళ్లలో విదేశీ సాయంతో నడిచే EAP ప్రాజెక్టులకు రుణవడ్డీ చెల్లింపుల రూపంలో ఇస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014, ఏప్రిల్‌ 1 నుంచి అయిన వ్యయాన్ని 100 శాతం కేంద్రం సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది.

 ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా 2015-16 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య 17 విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (AIIB), ప్రపంచబ్యాంకు (IBRD), ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA), IFAD, GODE(జర్మనీ), GOJP (జపాన్‌)ల ద్వారా రూ.7,797.69 కోట్ల రుణం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS)కు 90:10 నిష్పత్తిలో కేంద్రం అదనపు వాటా కింద 5 సంవత్సరాల పాటు అంటే 2015 నుంచి 2020 వరకు రూ.16,447 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2019-20 వరకు చేసుకున్న EAPలకు సంబంధించిన రుణాలు, వడ్డీలను మాత్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం కింద కేంద్రం చెల్లిస్తుందని చెప్పింది. FRBM నిబంధనల మేరకే EAP రుణాలు అందజేస్తుందని, రుణాల చెల్లింపులు లాంటి వాటికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఉండదని కేంద్రం పేర్కొంది. కేంద్రం పేర్కొన్న 5 సంవత్సరాలు (2015-20) గడువు ముగిసినప్పటికీ, ఇంతవరకు నిధులు అనుకున్న స్థాయిలో అందలేదు.

నాబార్డు/హడ్కో/బ్యాంకుల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయం సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కానీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (SPV) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, అప్పు భారాన్ని రాష్ట్రంపై పెట్టింది. ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలు వేటికీ కేంద్ర సహాయాన్ని అందించేందుకు ఈ విధంగా SPV ఏర్పాటును కోరలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంలోనూ పూర్తి సహకారం అందించలేదు.

ప్రత్యేక హోదా ప్రతిపత్తి: 1969లో 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించే విధానం ప్రవేశపెట్టారు.1969లో తొలుత జమ్ము-కశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లకు ప్రత్యేక హోదా కల్పించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు మరో 8 రాష్ట్రాలకు (అరుణాచల్‌ ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌) ప్రత్యేక హోదా కల్పించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. (చివరగా 2010లో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా వచ్చింది). గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. బిహార్‌కు ప్రత్యేక ప్రణాళిక అమలవుతోంది.

 ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి సలహా మేరకు ప్రత్యేక హోదా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేటప్పుడు ఆ రాష్ట్రంలోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి         1) పర్వత ప్రాంతాలు ఉండి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం 2) జనసాంద్రత తక్కువగా ఉండి, గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం 3) ఆర్థిక వనరులు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు  4) పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలు 5) ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతం.

ప్రత్యేక హోదా అనేది నిధులు కేటాయింపునకు సంబంధించింది కావడంతో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు కూడా కీలకమవుతుంది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టంగా చెప్పడంతో ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని గతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల్లో 90 శాతం నిధులు గ్రాంట్లుగా, 10 శాతం నిధులు రుణంగా ఇస్తుంది. కేంద్రప్రభుత్వ నిధుల్లో ప్రాధాన్యం ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ రాష్ట్రాలు రుణమార్పిడి, రుణ ఉపశమన పథకాల ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు   ఆకర్షించడం కోసం కస్టమ్స్‌ డ్యూటీ, కార్పొరేట్‌ టాక్స్, ఇతర పన్నుల నుంచి మినహాయింపులు ఉంటాయి.

రచయిత: వి.కరుణ 

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

విద్యా ఉద్యోగ సమాచారం

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌