• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

విష్ణుకుండినులు క్రీ.శ.5, 6 శతాబ్దాల్లో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలను పాలించారు. వీరి వంశ స్థాపకుడు ఎవరనే విషయంలో చరిత్ర

కారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి, మల్లికార్జునుడు అని కొందరు పేర్కొంటారు.  అయితే, వీరిద్దరూ ఒకటేనని కీల్‌హారన్‌ అనే పండితుడు తెలిపాడు. శ్రీపర్వతస్వామి అంటే బుద్ధ భగవానుడని నేలటూరు వెంకటరమణయ్య అభిప్రాయపడ్డారు. 

* విష్ణుకుండినులు క్రీ.శ.358 నుంచి క్రీ.శ.569 వరకు సుమారు 210 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. వీరు ప్రధానంగా కృష్ణా నదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించారు. 

* వీరి రాజధానులు అమరపురం (అమరావతి), ఇంద్రపాలనగరం, దెందులూరు. అమరపురం ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండల కేంద్రం.  ఇంద్రపాలనగరాన్ని శుక్రపురం అని కూడా అంటారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం, తుమ్మలగూడెం గ్రామ శివార్లలో ఉంది. దెందులూరు పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి దగ్గర ఉంది. వీరు  కొంతకాలం ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడ (విజయవాడ)ను రాజధానిగా చేసుకుని పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 

* గోవింద వర్మ ఇంద్రపాలనగరంలో తామ్ర శాసనాన్ని వేయించాడు. అందులో మహా రాజేంద్ర వర్మ క్రీ.శ.358లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించినట్లు ఉంది. మహా రాజేంద్ర వర్మ ఇంద్రపాల నగరాన్ని  నిర్మించి, రాజధానిగా చేసుకున్నాడు. ఇతడు రామతీర్థ శాసనాన్ని వేయించాడు. 

మొదటి మాధవ వర్మ

ఇతడు రాజేంద్రవర్మ కుమారుడు. తన రాజ్యాన్ని అమరపురం, కీసర, భువనగిరి ప్రాంతాలకు  విస్తరింపజేశాడు. ఇతడికి విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉండేదని పొలమూరు శాసనంలో పేర్కొన్నారు.

గోవింద వర్మ

ఇతడు మొదటి మాధవ వర్మ కుమారుడు. ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, విజేత, బౌద్ధ మత పోషకుడు. అనేక బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. 

* ఇతడి భార్య పరమమహాదేవి. ఈమె పేరున ఇంద్రపురిలో బౌద్ధ భిక్షువుల కోసం చాతుర్దశౌర్య  మహావిహారాన్ని నిర్మించారు. 

* దీని పోషణ కోసం గోవింద వర్మ పెణ్కపర గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. హైదరాబాద్‌ నగర సమీపంలో ఉన్న చైతన్యపురిలోని మూసీనది తీరంలో ప్రాకృత శాసనం లభించింది. అందులో ఇతడి పేరుపై ఉన్న గోవిందరాజ విహారం, చైత్యాలయాల గురించి ఉంది. అయితే ఈ నిర్మాణాలు శిథిలం కాగా, శాసనం మిగిలిఉంది.

గోవింద వర్మ కాలంలో ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, వర్దమానుకోట, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, రామిరెడ్డిపల్లి మొదలైన ప్రాంతాల్లో బౌద్ధారామ విహారాలు ప్రసిద్ధి చెందాయి.

* హైదరాబాద్‌ శివారులోని కీసరగుట్ట (కేసరిగుట్ట)పై ఉన్న విష్ణుకుండిన కోట, దేవాలయాన్ని నిర్మించాడు. కీసరగుట్ట కింద కేసరి వాగు ఉంది. దీని గట్టున ఉన్న ప్రాంతం పేరు గట్టు కేసరి. దీన్ని ప్రస్తుతం ఘట్‌కేసర్‌ అని పిలుస్తున్నారు. 

* కేసరి అంటే సింహం. ఇది విష్ణుకుండినుల రాజచిహ్నం. ఆ రాజముద్ర ఒకటి కీసరగుట్టపై లభించింది.

రెండో మాధవ వర్మ

ఇతడు విష్ణుకుండినుల్లో గొప్పవాడు. రాజ్యాన్ని నర్మదా నది వరకు విస్తరింపజేశాడు. తన రాజధానిని ఇంద్రపురి నుంచి అమరపురానికి (అమరావతి) మార్చాడు. 

* సరిహద్దు రక్షణ కోసం తన కుమారుడైన దేవవర్మను దక్షిణాన త్రికూట మలయానికి (కోటప్పకొండ) రాజప్రతినిధిగా నియమించాడు. 

* ఇతడు వైదిక మతాభిమాని. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, అగ్నిష్టోమ, నరమేధ మొదలైన క్రతువులు నిర్వహించాడు. ఇతడు కీసరలో పురుషమేధ యజ్ఞాన్ని నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. 

* రెండో మాధవ వర్మ వందకు పైగా యుద్ధాలు చేసి అన్నింటిలోనూ గెలుపొందాడు. తన ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్టపై ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. విజయం సాధించిన ప్రతి చోటా రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. 

* ఇతడి శాసనం ఒకటి మహారాష్ట్రలోని ఖానాపూర్‌లో దొరికింది. విష్ణుకుండినుల నాణేలు మహారాష్ట్ర అంతటా దొరికాయి. 

* రెండో మాధవ వర్మకు ‘త్రివరనగర భవనగత సుందరీ హృదయనందన’, ‘త్రిసముద్రపతి’ అనే బిరుదులు ఉన్నాయి.

నాలుగో మాధవవర్మ 

ఇతడికి జనాశ్రయ అనే బిరుదు ఉంది. ఇతడు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి భక్తుడు. ఇతడి న్యాయపాలన ప్రశంసనీయమైంది. 

విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు మంచభట్టారకుడు. చాళుక్యులు ఇతడ్ని యుద్ధంలో ఓడించి, వీరి రాజ్యాన్ని ఆక్రమించారు. 

* విష్ణుకుండినుల రాజలాంఛనం సింహం. వీరి శాసన కడియాలపై ఉన్న రాజముద్రికల్లో లంఘించే సింహాన్ని ముద్రించారు. వీరి నాణేల్లో కూడా ఈ చిహ్నం కనిపిస్తుంది.

పరిపాలన - అధికారులు

* భూములను పగ్గాలతో కొలిచి ఆయకట్టు నిర్ణయించడానికి ‘రజ్జుక’ అనే అధికారి ఉండేవాడు. 

* ‘ఫలదారుడు’ పంటను అంచనా వేసి, భూమి శిస్తును నిర్ణయించేవాడు. 

* ‘గుల్మికుడు’ సరిహద్దు రాష్ట్రాలపై నియమితుడైన సైనిక ప్రతినిధి. 

* ప్రభుత్వానికి చెందాల్సిన రాజ్య ఆదాయాన్ని కొలవడానికి ‘సెట్టి’ అనే అధికారి ఉండేవాడు. 

* రాజాజ్ఞలను రాయించే అధికారిని ‘అక్షపటలాధికృతుడు’ లేదా ‘అక్షపటలాధికారి’ అని పిలిచేవారు. 

రాజు తరఫున దానాలు చేయడానికి ‘హస్తికోశుడు’, ‘వీరకోశుడు’ అనే సైనికాధికారులు ఉండేవారు. 

ఆర్థిక పరిస్థితులు

* ఇక్ష్వాకుల తర్వాత నాణేలు ముద్రించింది విష్ణుకుండినులే. రాగి మలామా చేసిన ఇనుముతో వీటిని తయారు చేశారు. దీంతో వీటి నాణ్యత లోపించింది.

* ఇది పరిశ్రమలు, వాణిజ్యం క్షీణతకు కారణమైంది. ప్రాచీన నగరాలు, వాటిని అనుసంధానం చేసే రహదారులు అస్తవ్యస్తమయ్యాయి. విదేశీ వాణిజ్యం తగ్గడంతో ఓడ గుర్తు నాణేలను ముద్రించలేకపోయారు. 

లంఘించే సింహం గుర్తు ఉన్న నాణేలు అచ్చువేశారు. విక్రమేంద్ర వర్మ వేయించిన నాణేలు ఏలేశ్వరంలో లభించాయి. ఇందులోని నాణేలు రాగి, సత్తుల మిశ్రమం. కుంభం, సింహం దాని మీది సంకేతాలు. వీటిలో కొన్నింటి మీద ‘వి-క-ర-మ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. 

* భువనగిరి, సుల్తానాబాద్‌ తాలుకాలో రాగి నాణేలు దొరికాయి. వీటితో బర్మా, సయాం, కాంబోడియా, చీనా, జపాన్, సిలోన్‌ దేశాలతో విదేశీ వ్యాపారం జరిపినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

* రెండో మాధవ వర్మ రాజ్యానికి ఉత్తారాన రేవానది ఉండేది. నదుల్లో స్వదేశీ వ్యాపారం జరిగేది. 

అలంపురంలోని సంగమేశ్వరంలో రోమన్‌ కాన్‌స్టాంటైన్‌ బంగారు నాణెంతో పాటు ఇతర నాణేలు దొరికాయి.

* వీరి రాజ్యంలో గవ్వలు ద్రవ్యంగా చలామణి అయినట్లు చైనా యాత్రికుడు పాహియాన్‌ పేర్కొన్నాడు. మరో చైనా యాత్రికుడైన హుయాన్‌త్సాంగ్‌ శ్రీపర్వతంపై బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని తెలిపాడు. 

* బుద్ధ విగ్రహాలు బుద్ధాం, అమరావతిలో దొరికాయి. కీసరగుట్టపై 7 సెం.మీ. పరిమాణంలో ఉన్న నశ్యం డబ్బీ (పోత ఇనుములతో మామిడి పిందె ఆకారంలో చేసింది) దొరికింది.

* పన్ను వసూలు చేసే యంత్రాంగంలో  సామంత రాజులను భాగం చేయడం మొదట వీరి కాలంలోనే ప్రారంభమైంది.

సాంఘిక పరిస్థితుల

విష్ణుకుండినులు వైదిక మతాన్ని ఆచరించి, దాని అభివృద్ధికి పాటుపడ్డారు. వీరు బ్రాహ్మణులు. వైదిక మతంతో పాటు బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరిలో చాలా మందికి పరమ మహేశ్వర, పరమ భాగవత అనే బిరుదులున్నాయి. 

* గోవింద వర్మకు వర్ణాశ్రమ ధర్మాల పట్ల భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉండేవని ఇంద్రపాలనగర శాసనం ద్వారా తెలుస్తోంది. ఇతడి ఆస్థానంలో దశబలబలి అనే పండితుడు ఉండేవాడు. ఈయనకు 18 మత శాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలుసని, మానవులను మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాది కర్మలు చేసేవాడని చరిత్రకారులు పేర్కొన్నారు. గోవింద వర్మ దశబలబలి పండితుడికి పెంకపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

* మాధవ వర్మ గణపతిని ప్రతిష్ఠించినట్లు వేల్పూరు శాసనం తెలుపుతుంది.

బౌద్ధమతం

* గోవింద వర్మ బౌద్ధమతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు.

* హైదరాబాద్‌ సమీపంలోని చైతన్యపురిలో బౌద్ధమతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది. అక్కడ కొసగుండ్ల నరసింహస్వామి గుహాలాయం దగ్గర ఉన్న పెద్ద బండరాయిపై ఆరు వరుసల ప్రాకృత శాసనం ఉంది. 

* కీసరగుట్టపై మహాయాన బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడి లోహ విగ్రహం దొరికింది. 

బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు. ఈ మతానికి సంబంధించిన చివరి తత్వవేత్తలు వీరి రాజ్యంలో నివసించారు. 

* తర్కపండితుడైన దిజ్నాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిగా రచయిత అయిన ఈశ్వర కృష్ణుడితో వాగ్వాదాలు జరిపాడు. 

దిజ్నాగుడు కొంతకాలం కరీంనగర్‌ జిల్లాలోని రామగిరి (రామగుండం), మునులగుట్ట ప్రాంతంలో జీవించాడు. ఈ విషయం కాళిదాసు రచించిన మేఘసందేశం ద్వారా తెలుస్తోంది. 

* దిజ్నాగుడు వందకుపైగా రచనలు చేశాడు. ‘ప్రమాణ సముచ్చయం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. యోగాచార పంథను బోధించాడు. తెలుగు ప్రాంతాలకు చెందిన బౌద్ధ మహాపండితుల్లో ఈయన చివరివాడు. ఈయన బాసరలోనూ కొంతకాలం ఉన్నారు. అక్కడ ఒక స్తూపం, కొన్ని చిన్న శిలాఫలకాలు లభించాయి. 

* బౌద్ధమతంలో వజ్రయాన శాఖ వ్యాపించింది. దీని నుంచి తాంత్రికాచారాలు, శక్తి పూజలు వచ్చాయి. ఈ శాఖ వారి దుర్నీతి, నీతిబాహ్య చర్యల వల్ల బౌద్ధమతం ప్రజాదరణ కోల్పోయింది.

మూడో మాధవ వర్మ 

ఇతడు బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను దానం చేశాడు. అమరపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతడు ఇంద్రశర్మ, అగ్నిశర్మ అనే బ్రాహ్మణులకు మ్రోతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది. 

ఇంద్రభట్టారక వర్మ

ఇతడు అనేక ఘటికాస్థానాలను (హిందూ విద్యా కేంద్రాలు) స్థాపించాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం (ఘట్‌కేసర్‌) ఇతడు నెలకొల్పిందే. ఇతడికి సత్యాశ్రయుడు అనే బిరుదు ఉంది.

విక్రమేంద్ర భట్టారక 

ఇతడు తన రాజధానిని అమరపురం నుంచి దెందులూరు (లెందులూరు)కు మార్చాడు. బ్రాహ్మణులకు తుండి (తుని) గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

* ఇతడికి ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉంది. ఇతడు తన 11వ రాజ్య సంవత్సరంలో ఇంద్రపాలనగరంలోని పరమమహాదేవి విహారానికి ఇరుందెర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 

రచయిత: డా. ఎం. జితేందర్‌ రెడ్డి, విషయ నిపుణులు 

Posted Date : 05-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనులు 

       శాతవాహన వంశం శ్రీముఖుడితో ఆరంభమై చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో అంతరించింది. శాతవాహనులు ఆంధ్రులే అనడానికి ఆధారాలు, వాటిని సమర్థిస్తూ లభించిన స్తూపాలు, శాసనాలు, నాణేలు; గ్రంథాలు; రచయితలు, చరిత్రకారుల అభిప్రాయాలు... ఇంకా శాతవాహన కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు; విద్యా, వాస్తు, కళారంగాల అభివృద్ధి... ఇలా మరెన్నో ఆసక్తికర అంశాల సమాహారమే ఈ 'శాతవాహనులు' పాఠం. 
       

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది. వీరు బ్రాహ్మణులైనప్పటికీ రాజకీయంగా సమర్థవంతమైన పాలనను అందించడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రదేశ ఔన్నత్యానికి ఎంతో కృషి చేశారు.
 

ఆధారాలు: శాతవాహనుల చరిత్రను పునఃనిర్మించడానికి ఉన్న ఆధారాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఞ్మయ లేదా లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు లాంటివి ఉన్నాయి. లిఖిత ఆధారాల్లో దేశీయ, విదేశీ రచనలు ఉన్నాయి.

పురావస్తు ఆధారాలు

అనేక శాసనాలు శాతవాహనుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను వివరిస్తున్నాయి. దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ఆమె భర్త మొదటి శాతకర్ణి విజయాలను వివరిస్తుంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను, వివిధ బిరుదులను తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి వేయించిన కార్లే శాసనం, వాశిష్ఠీపుత్ర పులోమావి/ రెండో పులోమావి వేయించిన అమరావతి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనం, మూడో పులోమావి కాలంలో వేసిన మ్యాకదోని శాసనాలు శాతవాహనుల చరిత్రను వివరిస్తున్నాయి. ఇవే కాకుండా వారి సమకాలీన పాలకుల శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి. అశోకుడి 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనాలు, ఖారవేలుడి హతిగుంఫా శాసనం, చస్తనుడి అంథే శాసనం, రుద్రదాముని జునాగఢ్ శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి.  

శాతవాహనుల కాలంలో సీసం-రాగితో తయారుచేసిన ఫోటేన్ నాణేలతోపాటు అనేక రోమన్ నాణేలు, జోగల్ తంబి నాణేలు నాటి ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి. శాద్వాహణ శ్రీముఖ పేరుతో ఉన్న నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మునులగుట్ట ప్రదేశాల్లో లభించాయి. నహపాణుడిని ఓడించి గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించిన జోగల్ తంబి నాణేలు మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి. రెండో పులోమావి వేయించిన ఓడ బొమ్మ నాణేలు, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన తెరచాప ఓడ బొమ్మ నాణేలు నాటి నౌకా వాణిజ్య అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. శాతవాహనుల కాలంనాటి ప్రధాన బంగారు నాణెం సువర్ణం కాగా నాటి వెండి నాణెం కర్షాపణం.

 నాడు ఒక సువర్ణం 35 కర్షాపణాలతో సమానమని తెలుస్తోంది. శాతవాహన రాజు అపీలకుని నాణెం చత్తీస్‌గఢ్ ప్రాంతంలో లభించింది. నాటి కట్టడాల్లో ముఖ్యమైన అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, శాలిహుండం లాంటి స్తూప, చైత్య విహారాలు శాతవాహన కాలం నాటి వాస్తు, కళారంగాల అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. కోటిలింగాల ప్రాంతంలో బట్టి ఇటుకలతో నిర్మించిన బావులు బయల్పడినవి.
 

లిఖిత/ వాఞ్మయ/ సాహిత్య ఆధారాలు

* శాతవాహనుల చరిత్రను తెలియజేస్తూ అనేక రచనలు వెలువడ్డాయి. పురాణాలు, జైన, బౌద్ధ సాహిత్యం, విదేశీయుల రచనలు అనేకం శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. మత్స్యపురాణం 30 మంది శాతవాహన చక్రవర్తులు 400 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించారని వివరిస్తుంది. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథాసప్తశతి, గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ, శాతవాహన కాలంనాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి.  

* శాతవాహనుల సాంఘిక, మత పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం గాథాసప్తశతి, శర్వవర్మ సంస్కృత భాషలో రచించిన కాతంత్ర వ్యాకరణం, కుతూహలుడి రచన - లీలావతి పరిణయం, సోమదేవసూరి రచించిన కథా సరిత్సాగరం నాటి ప్రధాన సాహిత్య ఆధారాలు. ఇవే కాకుండా విదేశీయులు, గ్రీకు నావికులు, రచయితలు రచించిన గ్రంథాలు కూడా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్లినీ రచించిన నేచురల్ హిస్టరీ, టాలమీ గ్రంథం జాగ్రఫీ, పేరు తెలియని గ్రీకు నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథాలు కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి. 
 

శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై ఉన్న భిన్నాభిప్రాయాలు
           
శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాసన, సాహిత్య ఆధారాలను అనుసరించి శాతవాహనులు ఆంధ్రులని అనేకమంది చరిత్రకారులు చెప్పారు. ముఖ్యంగా స్మిత్, రాప్సన్; భండార్కర్, గుత్తి వెంకటరావు, నేలటూరి వెంకట రామయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ... వీరంతా శాతవాహనులు ఆంధ్రులు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. 'శాతవాహనులు ఆంధ్రులకు భృత్యులు' అని భండార్కర్ పేర్కొన్నాడు. కానీ, శ్రీనివాస అయ్యంగార్, పుసాల్కర్ లాంటి చరిత్రకారులు శాతవాహనులు మహారాష్ట్రులు అని పేర్కొన్నారు. సుక్తాంకర్ లాంటి చరిత్రకారులు మాత్రం శాతవాహనులను కన్నడిగులు అన్నారు. వి.వి.మిరాసి అనే చరిత్రకారుడు శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని తెలిపాడు. అయితే పురావస్తు, సాహిత్య ఆధారాలను అనుసరించి చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. ఇక రాజధాని విషయంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బార్నెట్, బర్జెస్, స్మిత్ లాంటి చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం అని పేర్కొన్నారు. ఆర్.జి.భండార్కర్ ధాన్యకటకాన్ని శాతవాహనుల రాజధాని అని వివరించాడు. రాయ్ చౌదరి ప్రకారం శాతవాహనుల రాజధాని విజయవాడ. కానీ జైన వాఞ్మయం ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్ఠానపురం లేదా పైఠాన్. ఆధునిక చరిత్రకారులు కొందరు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని పేర్కొంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అత్యధికులు శాతవాహనుల తొలి రాజధాని నేటి మహారాష్ట్రలోని పైఠాన్ లేదా ప్రతిష్ఠానపురం అని, మలి రాజధాని అమరావతి లేదా ధాన్యకటకం (గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్) అని అంగీకరిస్తున్నారు. శాతవాహనుల పరిపాలన ప్రారంభకాలం గురించి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బి.ఎస్.ఎల్.హనుమంతరావు శ్రీముఖుడి పాలన క్రీ.పూ.271లో ప్రారంభమైనట్లు పేర్కొనగా, బుహ్లర్, ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి చరిత్రకారులు క్రీ.శ.225లో ప్రారంభమైనట్లుగా పేర్కొన్నారు. 

రాజకీయ చరిత్ర

శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వైదిక మతస్తులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా, శాతవాహన అనేది వంశ నామం. శాతవాహనుల పాలన శ్రీముఖుడితో ప్రారంభం కాగా, చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో వంశం అంతరించింది.

 

శ్రీముఖుడు 

శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు. ఇతడిని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణుపురాణం బలిపుచ్ఛక అని, మత్స్య పురాణం సిమకుడు అని, 'భాగవత పురాణం' బలి అని పేర్కొంటున్నాయి. ఇతడు క్రీ.పూ.271 నుంచి 248 వరకు పరిపాలించినట్లు బీఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. 23 సంవత్సరాలు పాలన చేశాడు. తన కుమారుడు మొదటి శాతకర్ణికి మహారథి త్రణకైరో కుమార్తె నాగానికతో వివాహం జరిపించాడు. 'శాద్వాహణ' పేరుతో ముద్రించిన నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతాల్లో లభించాయి. శ్రీముఖుడు తొలుత జైనమతాభిమాని. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక గ్రంథం శ్రీముఖుడు జైనుడని పేర్కొంది. శ్రీముఖుడి కాలంలో కుంద కుందాచార్యుడు/కొండ కుందాచార్యుడు దిగంబర జైనాన్ని ప్రచారం చేశాడు.

కృష్ణ (లేదా) కన్హ (248 - 230 BC)

శ్రీముఖుడి అనంతరం అతడి సోదరుడు కన్హ రాజ్యానికి వచ్చాడు. ఇతడు మౌర్య చక్రవర్తి అశోకుడికి సమకాలికుడు అని చరిత్రకారులు పేర్కొంటారు. కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కన్హేరి గుహాలయాలు నిర్మించాడు. మాళ్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి ఇతడే.

మొదటి శాతకర్ణి

తొలి శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఇతడి విజయాలను తెలుపుతూ ఇతడి భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు ఇతడే. మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి. కళింగ పాలకుడు ఖారవేలుడు ఇతడిని ఓడించినట్లు హతిగుంఫా, గుంటుపల్లి శాసనాలు పేర్కొంటున్నాయి. మొదటి శాతకర్ణిని పుష్యమిత్ర శుంగునికి సమకాలీనుడిగా పేర్కొంటారు. శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని ముద్ర ఉంది. మొదటి శాతకర్ణి తర్వాత పూర్ణోత్సుంగుడు అనే రాజు పాలనకు వచ్చాడు.
 

రెండో శాతకర్ణి

ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువకాలం అంటే 56 సంవత్సరాలు పాలించిన శాతవాహన చక్రవర్తి రెండో శాతకర్ణి. శక-శాతవాహన ఘర్షణలు ఇతడి కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇతడు మగధపై దండెత్తి సాంచీ స్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేయించినట్లుగా యుగపురాణం పేర్కొంటుంది. ఇతడు పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు.  విదిశ, కళింగలను ఓడించాడు. ఇతడి కాలంనాటి శక-శాతవాహన ఘర్షణల గురించి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ గ్రంథం వివరిస్తుంది. భిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహనరాజు రెండో శాతకర్ణే. 

మొదటి పులోమావి

కణ్వ చక్రవర్తి సుశర్మను చంపి మగధను ఆక్రమించిన శాతావాహన రాజు మొదటి పులోమావి. (కానీ పురాణాల ప్రకారం శ్రీముఖుడే సుశర్మను చంపి మగధను ఆక్రమించాడు). మొదటి పులోమావినే కుంతల శాతకర్ణి అని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే కుంతల శాతకర్ణి తర్వాత మొదటి పులోమావి పాలకుడయ్యాడని మరికొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
 

కుంతల శాతకర్ణి

కుంతల శాతకర్ణిని 13వ శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. ఇతడి ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే పండితులు ఉండేవారు. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృత భాషలో బృహత్‌కథను రచించగా, శర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. సంస్కృత భాషకు ప్రాధాన్యం ఇచ్చిన తొలి శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి. ఇతడికి సంస్కృత భాష నేర్పడానికే శర్మవర్మ కాతంత్ర వ్యాకరణంను రచించాడు. కుంతల శాతకర్ణి కరిర్త అనే కామక్రీడ ద్వారా భార్య మరణానికి కారకుడయ్యాడని ఏటుకూరి బలరామమూర్తి పేర్కొన్నారు. క్రీ.పూ.58లో శకులను ఓడించి ఉజ్జయినిని జయించి విక్రమ శకం ప్రారంభించిన విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి అని కాలకాచార్య కథానిక(జైన గ్రంథం) పేర్కొంటుంది.

హాలుడు

శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథాసప్తశతి (సట్టసి) అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. హాలుడి వివాహం సింహళ రాకుమారితో సప్తగోదావరి (ద్రాక్షారామం)లో జరిగినట్లు కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం గ్రంథం వివరిస్తుంది. ఇతడు క్రీ.శ.7 నుంచి 12 వరకు (5 సంవత్సరాలు) పాలన చేశాడు. రాధను గురించి ప్రస్తావించిన తొలి వాజ్ఞ్మయం గాథాసప్తశతి.

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.75 - 110)

శాతవాహన చక్రవర్తులందరిలోకి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడి విజయాలను వివరిస్తూ తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాలు వేయించింది. బాలశ్రీ నాసిక్ శాసనాన్ని తన మనుమడు వాసిష్ఠీపుత్ర పులోమావి 19వ పాలనా సంత్సరంలో వేయించింది. ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఆగమనిలయ, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయ పీతవాహన (త్రిసముద్రలోయ శాతవాహన), వర్ణాశ్రమ ధర్మోద్ధారక, క్షత్రియ దర్పమానమర్థన లాంటి బిరుదులతో ప్రస్తావించారు. క్షహరాట పాలకుడు (శకరాజు) నహపాణుడిని ఓడించి 'క్షహరాట వంశ నిరవశేషకర' బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలను పునర్ముద్రించాడు. వాటినే జోగల్ తంబి నాణేలు అంటారు. నాసిక్ శాసనాన్ని శివస్వామి, మహాగుప్తులు రచించారు. గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడి కాలంలోనే రాజధానిని ప్రతిష్ఠానపురానికి మార్చారని తెలుస్తోంది. రుద్రదాముని చేతిలో గౌతమీపుత్ర శాతకర్ణి ఓడిపోయినట్లుగా జునాగఢ్ శాసనం పేర్కొంటుంది. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు ఇతడే. ఇతడు 23వ శాతవాహన రాజు.
 

వాసిష్ఠీపుత్ర పులోమావి (రెండో పులోమావి)

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతడి కుమారుడు రెండో పులోమావి 24వ శాతవాహన రాజుగా వచ్చాడు. నాసిక్ శాసనంలో ఇతడిని దక్షిణా పథేశ్వరుడుగా పేర్కొనడమైంది. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడు వేయించిన అమరావతి శాసనంలోనే తొలి తెలుగు పదం నాగబు ఉంది. ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే. ఇతడి 19వ పాలనా సంవత్సంలోనే ఇతడి నానమ్మ గౌతమీ బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనాన్ని రచించినవారు శివస్వామి, మహాగుప్తులు. చస్తనుడు అనే పశ్చిమ క్షాత్రపురాజు (శకరాజు) రెండో పులోమావిని ఓడించి కథియవాడ్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అంధే శాసనం తెలియజేస్తుంది.
 

యజ్ఞశ్రీ శాతకర్ణి

చివరి గొప్ప శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడి ఆస్థానంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. నాగార్జున కొండ లేదా శ్రీపర్వతం వద్ద ఆచార్య నాగార్జునుడి కోసం పారావతి విహారంను నిర్మించాడు. బాణుడు తన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని 'త్రిసముద్రాధీశ్వరుడు' అనే బిరుదుతో ప్రస్తావించాడు. సంగం సాహిత్యంలో యజ్ఞశ్రీని పోసోండ సత్తాన్‌గా వ్యవహరించారు. ఆచార్య నాగార్జునుడు ధాన్యకటక మహాస్తూపానికి శిలాప్రాకారం నిర్మించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్తూపాన్ని నిర్మించి చలువరాయితో బుద్ధుడి విగ్రహాన్ని రూపొందింపజేశాడు. (వాస్తవానికి అమరావతి స్తూపానికి పునాది వేసింది నాగాశోకుడనే యక్షుడు). యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనంలో మోటుపల్లిరేవు ప్రస్తావన ఉంది. జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడితో యుద్ధం చేసింది గౌతమీపుత్ర శాతకర్ణి కాగా, పురాణాల ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముడితో యుద్ధం చేసినట్లు తెలుస్తోంది. రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. (శివశ్రీనే వాసిష్టీపుత్ర శాతకర్ణి అని, అతడు యజ్ఞశ్రీ కంటే ముందు శాతవాహన రాజ్యాన్ని పాలించాడని బి.ఎస్.ఎల్. హనుమంతరావు పేర్కొన్నారు). ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం తెలియజేస్తోంది.
 

మూడో పులోమావి

చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావి లేదా శ్రీ పులోమావి. ఇతడి కాలంలోనే మ్యాకదోని శాసనం వేశారు. శ్రీ పులోమావి ఎనిమిదో పాలనా సంవత్సరంలో వేసిన ఈ శాసనం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో లభించింది. దీని ప్రకారం శాతవాహన ఆహారం (రాష్ట్రం) పాలకుడు ఖండనాగుడు లేదా కుబేరనాగుడు వేపుర గ్రామ అధిపతి. వేపుర గ్రామంలోని కాంత తెగ అధిపతి/ గాహపతి సమ్హ. సమ్హ తన తెగ ప్రజల అభివృద్ధికి వేపుర గ్రామంలో చెరువు తవ్వించినట్లు ఈ శాసనం వివరిస్తుంది.

పాలనాంశాలు

 శాతవాహనుల కాలంనాటి పాలనా విశేషాలను ఉన్నాఘర్ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాలనే అనుసరించారు. కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామిక, వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు), విషయాలు (జిల్లాలు), గ్రామాలుగా విభజించారు. సామంతరాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు. కేంద్రంలో రాజుకు పాలనలో సహాయపడటానికి మంత్రిమండలి, ఉద్యోగ బృందం ఉండేది. నాటి మంత్రిమండలిని రాజోద్యోగులు అనేవారు. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులను మహామాత్యులు అని, రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిచ్చే మంత్రులను రాజామాత్యులు అని, అధికార, అనధికార రహస్యాలను కాపాడే మంత్రులను విశ్వాసామాత్యులని పిలిచేవారు. రాష్ట్రాలు/ ఆహారాల పాలకులను అమాత్యులు అనేవారు. వస్తురూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని భండాగారికుడు అని, ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని హేరణికుడు అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రభుత్వ రికార్డులను భద్రపరిచే కార్యాలయ ఉద్యోగులుగా నిబంధనకార అక్షపటలిక (శ్రవణామాత్యులు) అనే ఉద్యోగులు ఉండేవారు. నాటి సామంత రాజ్యాల పాలకుల గురించి కార్లే, కన్హేరి శాసనాలు వివరిస్తున్నాయి. సామంత రాజులను మహారథి, మహాభోజక లాంటి బిరుదులతో ప్రస్తావించారు. విషయం (జిల్లా) అధిపతిని విషయపతి అని, గ్రామ అధిపతిని గ్రామిఖ/ గ్రామణి అని పిలిచేవారు. నగర పాలనకు నిగమసభలు ఉండేవి.
ఈ నిగమసభలు ప్రముఖ వర్తక కేంద్రాలుగా పనిచేసేవి. నిగమ సభ సభ్యులైన పెద్దలను గాహపతులు అనేవారు. గ్రామాల్లో మత వ్యవహారాలు చూసే అధికారిని మహా ఆర్యక అని పిలిచేవారు. సామంత రాజ్యాల్లో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిని మహాతలవరి అనేవారు. ఆహార పాలకులైన అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. వారు బదిలీ అయ్యేవారు. మ్యాకదోని శాసనంలో పేర్కొన్న గౌల్మిక అనే పదం నాటి భూస్వాములు, సామంత రాజ్య పాలనాధికారులను సూచిస్తుంది.

 

సైనిక పాలన

శాతవాహనుల సైనిక పాలన గురించి హతిగుంఫా శాసనం, అమరావతి శిల్ప ఫలకాలు, విదేశీ, దేశీయ సాహిత్యాలు వివరిస్తున్నాయి. హతిగుంఫా శాసనం నాటి చతురంగ బలగాల గురించి పేర్కొంటుంది. నాటి యుద్ధ వ్యూహ రచనను అమరావతి శిల్ప ఫలకం వివరిస్తుంది. యుద్ధసమయంలో పదాతిదళానికి పార్శ్వ భాగంలో అశ్వ, గజ దళాలు; పృష్ట భాగంలో ధనుష్క దళం ఉండేవని తెలుస్తోంది. నాటి తాత్కాలిక సైనిక శిబిరాల (camps) ను స్కంధావరాలు అని, సైన్యాగారాల (కంటోన్మెంట్ల)ను కటకాలు అని పిలిచేవారు. ఖారవేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి వచ్చి పిథుండ నగరాన్ని ధ్వంసం చేసినట్లు హతిగుంఫా శాసనం వివరిస్తుంది.
 

ఆర్థిక పరిస్థితులు

శాతవాహనులు వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమల రంగాలను సమపాళ్లలో వృద్ధి చేయడం ద్వారా రాజ్య ఆర్థిక సౌష్ఠవాన్ని పెంపొందించారు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. పంటలో 1/6వ వంతు భూమి శిస్తు (భాగ)గా వసూలు చేసేవారు. కారుకర అనే వృత్తి పన్నును వసూలు చేసేవారు. రాజు సొంత భూమిని రాజ కంఖేట అనేవారు. ప్రజలు రాజుకు చెల్లించే శిస్తును దేవమేయ/ రాజమేయ/ దాయమేయ అనేవారు (భూమిశిస్తు - భాగ, రాజు సొంత భూమి వాడుకున్నందుకు చెల్లించే శిస్తు - దేవమేయ). పంటలు పండే పొలాలను సీతాక్షేత్రాలు అని వాటి అధిపతిని సీతాధ్యక్షుడు అని పిలిచేవారు. మొదటి శాతకర్ణి అధికంగా పశువులను దానం చేశాడు. వ్యవసాయ అభివృద్ధికి, నీటి పారుదల సౌకర్యాల కల్పనకు కృషి చేశాడు. శాతవాహనుల కాలంలో వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. దేశీయంగా అనేక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. మచిలీపట్నం, వినుకొండ - హైదరాబాద్ రహదారుల గురించి ప్లీట్ పండితుడు పేర్కొన్నాడు. తూర్పు తీరంలో మైసోలియా (మచిలీపట్నం), ఘంటశాల లాంటి రేవులు, పశ్చిమ తీరంలో సోపార, కళ్యాణి, బరుకచ్ఛ లాంటి ఓడ రేవులు విదేశీ వాణిజ్యానికి తోడ్పడేవి. శాతవాహనులు రోమ్, వియత్నాం దేశాలతో విరివిగా విదేశీ వాణిజ్యం నిర్వహించేవారు. మద్రాస్ వద్ద ఉన్న అరికమేడు ప్రాంతంలో అనేక రోమన్ బంగారు నాణేలు లభించాయి. కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూరు, దూళికట్ట, కడప జిల్లాలోని అత్తిరాల ప్రాంతాల్లో కూడా రోమన్ నాణేలు లభించాయి. నాటి సంచార వ్యాపారులను సార్థవాహులు అనేవారు. తూర్పు తీరంలోని కోడూరు, కోరంగి/ అల్లోసిగ్ని ఓడరేవులు కూడా ప్రధానమైనవే. నాటి శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి. 12% వడ్డీ చెల్లించేవి. ఋషభదత్తుడు చెల్లించిన వడ్డీతో గోవర్థన ఆహారంలోని కోలిక శ్రేణి శ్రమణులకు వస్త్రదానం చేసేది. నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి. అల్లూరు శాసనం ప్రకారం అక్కడి బౌద్ధ సంఘం ఎడ్లబండ్లకు దానంగా స్వీకరించింది. ప్లినీ, టాలమీల రచనలతోపాటు నాటి శాతవాహనుల విదేశీ నౌకా వాణిజ్యం గురించి విపులంగా వివరించిన మరొక ప్రధాన గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రయన్ సీ (ఎర్ర సముద్రపు డైరీ). 

                                                        శాతవాహనుల కాలంలో పరిశ్రమల అభివృద్ధి కూడా బాగా జరిగింది. లోహ, వస్త్ర, వజ్ర పరిశ్రమలతోపాటు అనేక చేతి వృత్తి పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. నాటి కులారుల (కుమ్మరుల) పనితనం గురించి పేర్కొంటూ కళా దృష్టిలో శిల్పులకు ఏ మాత్రం తీసిపోరు' అని యజ్ధానీ పండితుడు పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలో గూడూరు సన్నని వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్ర పరిశ్రమకు ఎంతో పేరుగాంచాయి. మచిలీపట్నం మజ్లిన్ వస్త్రాలకు పేరొందింది. శాతవాహనుల కాలంలో శుల్క, బలి, కర లాంటి ఇతర పన్నులు వసూలు చేసేవారు. యజ్ఞాల సమయంలో వసూలు చేసే పన్నును బలి, నీటి తీరువా పన్నును శుల్క, కూరగాయలు, పండ్ల తోటలపై విధించే పన్నును కర అని పిలిచేవారు.
 

సాంఘిక పరిస్థితులు

 శాతవాహనుల కాలంలో పితృస్వామిక, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. సమాజంలో చాతుర్వర్ణ, కుల వ్యవస్థలు ఉండేవి. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా వీరి కాలంలోనే వృత్తిని బట్టి కుల వ్యవస్థ ఆవిర్భవించింది. నాటి శాసనాల్లో, సాహిత్యంలో అనేక కులాలు, వృత్తుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
 స్త్రీలు సతీసహగమనం, బాల్య వివాహలు, బహు భార్యత్వం, వేశ్యావృత్తి లాంటి సాంఘిక దురాచారాలను ఎదుర్కొనప్పటికి, గౌరవ స్థానం పొందిన సంఘటనలు ఉన్నాయి. నాగానిక, గౌతమీ బాలశ్రీ లాంటివారు పాలకులుగా పనిచేశారు. నాటి శాసన, సాహిత్య ఆధారాల్లో ఆరు రకాల స్త్రీ ధనం గురించి పేర్కొన్నారు. అమరావతి శిల్పం, గాథాసప్తశతి నాటి సాంఘిక వ్యవస్థను తెలుపుతున్నాయి. కులాలు మారకుండా సమయ ధర్మం పాటించేవారు. అనులోమ, విలోమ వివాహాలు అమల్లో ఉండేవి. అగ్రవర్ణం వరుడు నిమ్నవర్ణం వధువును వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని, అగ్రవర్ణ వధువు నిమ్నవర్ణ వరుడిని వివాహం చేసుకుంటే విలోమ వివాహం అని పేర్కొనేవారు. అనులోమ వివాహం చేసుకున్న దంపతులకు జన్మించినవారిని ఉగ్ర సంతానం అనేవారు. హాలుని గాథాసప్తశతిలో మాధవి, శ్రోత, ఆంగిక లాంటి రచయిత్రుల గురించి పేర్కొన్నారు. నాటి ప్రజలు బంగారు, వెండి ఆభరణాలు ధరించేవారు. నాట్యగత్తెలు అరదళం అనే మైపూతను వాడేవారు. రామిరెడ్డిపల్లి, గుమ్మడిదుర్రు, అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాల్లో నాడు వాడిన హారాలు, ఆభరణాలు లభించాయి. అగస్త్యుడి ద్వారా ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరించింది.

 

మత పరిస్థితులు

శాతవాహనుల కాలంలో వైదిక, జైన, బౌద్ధ మతాలను ఆదరించారు. తొలి శాతవాహనులు జైన మతాన్ని అవలంబించారు. శాతవాహనులది వైదిక మతం. నాడు రాజులు వైదిక మతాన్ని అవలంబిస్తే, రాణులు, వైశ్యులు, సామాన్య ప్రజలు బౌద్ధమతాన్ని ఆచరించారు. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు జైనుడని కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాత్రంశిక పేర్కొంటుంది. కొండ కుందాచార్యుడు అనే జైన పండితుడు అతడి కాలంలోనే నివసించాడు. కృష్ణ లేదా కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కానీ మొదటి శాతకర్ణి అశ్వమేధ, రాజసూయ లాంటి వైదిక క్రతువులను నిర్వహించాడు. మహా ఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి ఇతడి ఆస్థానంలో ఉండేవాడు. రాజధానిలో జైనులకు చైత్యాలను నిర్మించాడు. రెండో శాతకర్ణి సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ భద్రనీయ బౌద్ధ శాఖకు నాసిక్ గుహలను దానం చేసింది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. శాతవాహనులు అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, గుడివాడ, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప, చైత్య, విహారాలు నిర్మించారు. నాడు ధాన్యకటకాన్ని - పూర్వ శైలం, జగ్గయ్యపేట - ఉత్తర శైలం , నాగార్జున కొండ - అపరశైలం, గుంటుపల్లి - రాజగిరిక, గుడివాడను - సిద్దార్థిక అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం భట్టిప్రోలు (ప్రతీపాలపురం). శాతవాహనులు వేదశ్రీ, యజ్ఞశ్రీ లాంటి వైదిక నామాలను ఉపయోగించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆగమనిలయ, ఏక బ్రాహ్మణ లాంటి బిరుదులు ధరించాడు. నానాఘాట్ శాసనంలో ఇంద్ర, వాసుదేవ, సూర్యచంద్ర, యమ, వరుణ, కుబేర లాంటి వైదిక దేవతల పేర్లున్నాయి. హాలుడి గాథాసప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. క్రీ.శ.మొదటి శతాబ్దంలోని లకులిశ శివాచార్యుడి (లకులీశుడు) పాశుపత శైవధర్మం ప్రచారం పొందింది. శాతవాహనుల కాలంలో పూజలందుకున్న గుడిమల్లం శివలింగం నేటి చిత్తూరు జిల్లాలో ఉంది. కానీ, నానాఘాట్ శాసనంలో శివుడి ప్రస్తావన లేదు. అశోకుడి మనుమడైన సంప్రతి వల్ల దక్షిణ దేశంలో జైనం ప్రచారమైంది. అమరావతి సమీపంలో వడ్డమాను కొండ వద్ద సంప్రతి విహారం ఏర్పడింది. కొండ కుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని కొనగండ్ల వద్ద ఆశ్రమం (జైనం) నడిపి సమయసార అనే గ్రంథాన్ని రచించాడు.
 శాద్వాద తాంత్రిక సంప్రదాయం ప్రచారం చేసి శాద్వాద సింహ బిరుదు పొందాడు. పద్మనంద భట్టారకుడనే మరొక జైన మతాచార్యుడు నాడు జీవించాడు. కాలసూరి ప్రబంధం అనే గ్రంథం శాతవాహనుల కాలంనాటి జైనమతాన్ని గురించి వివరిస్తుంది. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక, శూన్యవాదాలను ప్రచారం చేశాడు (బౌద్ధ మతం). శంకరుడి మాయావాదానికి మార్గదర్శి ఆచార్య నాగార్జునుడే. ఈ విధంగా శాతవాహనుల కాలంలో జైన, బౌద్ధ, వైదిక మతాలను ఆదరించి, పరమత సహనాన్ని చూపారు.

 

విద్య, సారస్వతాల అభివృద్ధి

తవాహనుల అధికార భాష ప్రాకృతం. నాడు ప్రజలు మాట్లాడేది దేశీభాష. కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృత భాషకు ప్రాధాన్యం లభించింది. మత్స్యపురాణంను యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రచించారని పారిట్జర్ అనే పండితుడి అభిప్రాయం. నాటి శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. శాతవాహనుల కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా వర్ణించారు. రత్నావళి రాజపరికథ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని నాగార్జునుడు ప్రతిపాదించాడు. సుహృల్లేఖ గ్రంథాన్ని ప్రతి విద్యార్థి కంఠస్తం చేసేవాడని ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు పేర్కొన్నాడు. ఇండియన్ ఐన్‌స్టీన్‌గా, భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడిగా నాగార్జునుడు పేరుగాంచాడు. వాత్సాయన కామసూత్రాలు శాతవాహనుల కాలంలోనే రాశారని చరిత్రకారుల అభిప్రాయం. ఇంకా నాటి గ్రంథాల్లో సోమదేవుడి కథాసరిత్సాగరం, బుద్ధస్వామి బృహత్ కథాశ్లోక సంగ్రహ, ప్రవరసేనుడి సేతుబంధం, జయవల్లభుడి వెజ్జలగ్గ లాంటివి ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామానికి చెందినవాడని లంకావతార సూత్ర గ్రంథం తెలుపుతోంది. సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్లు వివరిస్తోంది.


 

వాస్తు, కళారంగాల అభివృద్ధి

శాతవాహనుల కాలంలో వాస్తుశిల్పం, చిత్రలేఖనం లాంటి కళారంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అనేక స్తూప, చైత్య, విహారాలు, గుహాలయాలు నిర్మితమయ్యాయి. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన పొడవాటి స్తంభాన్ని స్తూపం అంటారు. స్తూపాలు మూడు రకాలు. అవి (1) ధాతుగర్భాలు (2) ఉద్దేశిక స్తూపాలు (3) పారిభోజకాలు. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన వాటిని ధాతుగర్భాలు అంటారు. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటశాల, శాలిహుండం లాంటివి ధాతుగర్భాలు. బుద్ధుడు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన వాటిని పారిభోజకాలు అంటారు. ధాతువులు/ వస్తువులు లేకుండా నిర్మించేవి ఉద్దేశిక స్తూపాలు. లింగాలమెట్టు (విశాఖ జిల్లా), గుంటుపల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్దేశిక స్తూపాలకు ఉదాహరణ. అమరావతి స్తూపంపై బుద్ధుడి జీవితానికి చెందిన పంచ కళ్యాణాలను (జననం, మహాభినిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరి నిర్యాణం) చిత్రించారు. 

బుద్ధుడి ప్రతిమలను ఉంచి పూజించే గృహాన్ని చైత్యం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి. బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు. స్తూపం, చైత్యం, విహారం ఒకేచోట ఉంటే దాన్ని ఆరామం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ బౌద్ధారామం నాగార్జున కొండ. అక్కడ ఒక స్తూపం, రెండు చైత్యాలు, మూడు విహారాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా శంకరంలో బౌద్ధ గుహాలయాలున్నాయి. ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని హుయాన్‌త్సాంగ్ (Huyantsang) పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునకొండపై తొలిపించిన ఏడు అంతస్తుల విహారంలో 1500 గదులున్నాయని పాహియాన్ పేర్కొన్నాడు. అజంతా గుహల్లోని 9, 10, 12, 13 గుహలు వీరి కాలానికి చెందినవి. 8, 12, 13 గుహలు విహారాలు కాగా, 9, 10 గుహ చిత్రాలు. శాతవాహనుల కాలంనాటి అమరావతి శిల్పాలపై పెర్గుసన్ అనే చరిత్రకారుడు పరిశోధనలు చేశాడు. 1797లో కల్నల్ మెకంజీ అనే ఆంగ్లేయుడు అమరావతి స్తూపాన్ని కనుక్కున్నాడు. ధాన్యకటకం తూర్పున వజ్రపాణి ఆలయం ఉందని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. అజంతా 10వ గుహలో ఉన్న శ్వేత గజ జాతక చిత్రం శాతవాహనుల కాలానిదే. అమరావతి శిల్పంలోనే నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతింపజేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అమరావతి శిల్పం నగర జీవనాన్ని వివరించగా సాంచి, బార్పూత్ శిల్పాలు గ్రామీణ జీవనవిధాన్ని వివరిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరూ జంటలుగా నాట్యం చేస్తున్న 12 దృశ్యాలు కార్లే గుహల్లో ఉన్నాయి. మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో శాతవాహనుల కాలంనాటి టంకశాల బయల్పడింది. బర్మాలోని ప్రోం స్తూప శిల్పాలు అమరావతి శైలిని పోలి ఉన్నాయి. జావాలోని బోరోబుదురు బౌద్ధ స్తూపం సంకరం/ లింగాలమెట్ట (విశాఖ జిల్లా) నమూనాలో నిర్మించారు. శాతవాహనుల అధికార చిహ్నం పంజా ఎత్తిన సింహం, సూర్యుడు.

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహన అనంతర యుగం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిని జతపరచండి.
1) శ్రీపర్వతీయులు                           ఎ) ఆనందగోత్రజులు

2) బప్ప భట్టారక పాదభక్తులు            బి) తూర్పు చాళుక్యులు 

3) త్రికూట పర్వతాధిపతులు             సి) ఇక్ష్వాకులు

4) హారితీపుత్రులు                             డి) శాలంకాయనులు

జ: 1-సి; 2-డి; 3-ఎ; 4-బి
 

2. 'ఇక్షు చిహ్నాన్ని పూజించే కృష్ణా నదీతీరంలోని వారే ఇక్ష్వాకులు' అని అన్నదెవరు?
జ: కాల్డ్‌వెల్

 

3. శతసహస్ర హాలక బిరుదు పొందిన ఇక్ష్వాక రాజు-
జ: మొదటి శాంతమూలుడు

 

4. మాంధాత శిల్పం ఏ ప్రాంతంలో బయల్పడింది?
జ: జగ్గయ్యపేట

 

5. ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన వంశీయులు 
జ: ఇక్ష్వాకులు

 

6. నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించిన స్త్రీ-
జ: శాంతిశ్రీ

 

7. దక్షిణ భారతదేశంలో తొలి తామ్రశాసనం వేయించిన పాలకులు-
జ: బృహత్పలాయనులు

 

8. శాలంకాయనుల ఆరాధ్య దైవం
జ: చిత్రరథస్వామి

 

9. సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని తెలుగు నేలపై పాలించిన తొలి వంశం-
జ: విష్ణుకుండినులు

 

10. చేజర్ల కపోతేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు?
జ: దామోదర వర్మ

 

11. బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు
జ: గోవిందవర్మ

 

12. తన కుమారుడికి మూడో మాధవవర్మ ఉరిశిక్ష విధించినట్లు తెలుపుతున్న గ్రంథం-
జ: నచికేతోపాఖ్యానం

 

13. ఇక్ష్వాకుల కాలం నాటి దేవాలయాలు బయల్పడిన వీరాపురం ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు

 

14. నెల్లూరు జిల్లా భైరవ కొండ గుహాలయాలు ఏ మతానికి సంబంధించినవి?
జ: శైవం

 

15. తొలి తెలుగు వాక్యం విజయోత్సవ సంవత్సరంబుల్ ఏ శాసనంలో ఉంది?
జ: చిక్కుళ్ల శాసనం

 

16. ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నం పూర్ణకుంభం ఏ గుహాలయాల్లో ఉంది?
జ: ఉండవల్లి గుహలు

 

17. ఆనందగోత్రజుల రాజ లాంఛనం-
జ: వృషభం

 

18. ఆంధ్రదేశంలో విష్ణుదేవాలయాలు ఉన్నట్లు తెలిపే తొలి శాసనం
జ: పెదవేగి శాసనం

 

19. ఇక్ష్వాకుల రాజధాని-
జ: విజయపురి

 

20. కిందివాటిని జతపరచండి.
1) చేజర్ల శాసనం                   ఎ) దామోదరవర్మ

2) మట్టిపాడు శాసనం              బి) కందారరాజు

3) గోరంట్ల శాసనం                 సి) అత్తివర్మ

4) చిక్కుళ్ల శాసనం                 డి) రెండో విక్రమేంద్రవర్మ

జ: 1-బి; 2-ఎ; 3-సి; 4-డి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనులు 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1797లో అమరావతి స్తూపాన్ని ఎవరు కనుక్కున్నారు?
జ: కల్నల్ మెకంజీ

 

2. శాలిహుండం బౌద్ధ స్తూపం ఉన్న జిల్లా ఏది?
జ: గుంటూరు

 

3. శాతవాహనుల కాలంలో రాణులు పోషించిన మతం-
జ: బౌద్ధం

 

4. కిందివాటిని జతపరచండి.
1) పూర్వశైలం     a) ధాన్యకటకం

2) ఉత్తరశైలం      b) జగ్గయ్యపేట

3) అపరశైలం      c) నాగార్జునకొండ

4) రాజగిరిక       d) గుంటుపల్లి 

5) సిద్ధార్థిక        e) గుడివాడ       

జ: 1-a, 2-b, 3-c, 4-d, 5-e
 

5. శాతవాహనుల కాలంనాటి ప్రాకృత భాషపై అధ్యయనం చేసింది ఎవరు?
జ: బుహ్లర్

 

6. శాతవాహన కాలంనాటి ఫోటేన్ నాణేలు ఏయే లోహాల మిశ్రమం?
జ: రాగి - సీసం

 

7. జోగల్ తంబి నాణేలు ఏ రాష్ట్రంలో లభించాయి?
జ: మహారాష్ట్ర

 

8. శాతవాహనుల కాలంలో ఒక సువర్ణానికి ఉన్న కర్షాపణాలు-
జ: 35

 

9. శ్రీముఖుడు జైనమతస్థుడు అని పేర్కొంటున్న గ్రంథం ఏది?
జ: సింహాసనాద్వాంత్రంశిక

 

10. సాంచీస్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేయించిన శాతవాహనరాజు-
జ: రెండో శాతకర్ణి

 

11. రాధను గురించి ప్రస్తావించిన తొలి వాఞ్మయం/ గ్రంథం-
జ: గాథాసప్తసతి

 

12. నాసిక్ శాసనంలో రెండో పులోమావిని ఏ బిరుదుతో ప్రస్తావించారు?
జ: దక్షిణాపథేశ్వరుడు

 

13. కిందివాటిలో ఆచార్య నాగార్జునుడి మరణం గురించి వివరిస్తున్న గ్రంథం -
1) కువలయమాల 2) గాథాసప్తసతి 3) బృహత్‌కథ 4) కథాసరిత్సాగరం
జ: 4 (కథాసరిత్సాగరం)

 

14. శాతవాహనుల కాలంనాటి తాత్కాలిక సైనిక శిబిరాలు -
జ: స్కంథావరాలు

 

15. కిందివాటిని జతపరచండి.

1) శుల్క a) వృత్తిపన్ను
2) కర b) భూమిశిస్తు
3) కారుకర c) నీటిపన్ను
4) భాగ  d) తోటలపై పన్ను

జ: 1-c, 2-d, 3-a, 4-b
 

16. శాతవాహనుల పూజలందుకున్న గుడిమల్లం శివలింగం ఏ జిల్లాలో ఉంది?
జ: చిత్తూరు

 

17. ఆంధ్రదేశంలోని అతిప్రాచీన చైత్యం -
జ: గుంటుపల్లి

 

18. రాజధానిలో జైనులకు చైత్యాలు నిర్మించిన పాలకుడు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి

 

19. సమయసార గ్రంథాన్ని రచించినదెవరు?
జ: కుందు కుందాచార్యుడు

 

20. ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారం నిర్మించింది ఎవరు?
జ: నాగార్జునుడు

 

21. శాతవాహనుల అధికార చిహ్నం -
జ: సూర్యుడు, పంజా ఎత్తిన సింహం

 

22. భట్టిప్రోలు ప్రాచీన నామం -
జ: ప్రతీపాలపురం

 

23. గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రాశాడు?
జ: పైశాచి ప్రాకృతం

 

24. కామక్రీడలో భార్య మరణానికి కారకుడైన శాతవాహన రాజు -
జ: కుంతల శాతకర్ణి

 

25. ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారి-
జ: హేరణిక

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అమరావతి వద్ద బౌద్ధ స్తూపానికి పునాదులు వేసింది
జ: నాగాశోకుడు

 

2. భట్టిప్రోలు శాసనం వేయించింది
జ: కుబేరుడు

 

3. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి గ్రంథం
జ: ఐతరేయ బ్రాహ్మణం

 

4. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు ఎవరు?
జ: మెగస్తనీస్

 

5. దక్షిణ భారతదేశానికి జైనమత విస్తరణను గురించి పేర్కొన్న గ్రంథం
జ: పరిశిష్ఠ పర్వం

 

6. తొలి తెలుగు పదం 'నాగబు' ఏ శాసనంలో కనిపించింది?
జ: అమరావతి

 

7. జంతుబలి అవశేషాలు బయల్పడిన 'బిల్లసర్గం' గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కర్నూలు

 

8. ప్రాచీన కాలం నాటి రాగి పనిముట్లు లభించిన 'కీసరపల్లి' ఏ జిల్లాలో ఉంది?
జ: కృష్ణా

 

9. గొర్రె ఆకారం సమాధిపెట్టె లభించిన 'శంఖవరం' ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు

 

10. ఆదిమానవుడి చిత్రకళా అవశేషాలు/ ఆధారాలు లభించిన చింతకుంట ఏ జిల్లాలో ఉంది?
జ: కడప

 

11. రాతి గొడ్డలి బయల్పడిన 'కామకూరు' ఏ జిల్లాలో ఉంది?
జ: నెల్లూరు

 

12. బూడిద దిబ్బలు బయల్పడిన 'పాళ్వాయి' ఉన్న జిల్లా
జ: అనంతపురం

 

13. సతీసహగమనాన్ని సూచించే స్త్రీ, పురుష కళేబరాలు లభించిన సమాధి
జ: ఏలేశ్వరం

 

14. ఆర్య సంస్కృతిని దక్షిణాపథానికి విస్తరించింది
జ: అగస్త్యుడు

 

15. స్థానిక మతాచారాలను అధర్వణ వేదంలో చేర్చింది
జ: అపస్తంభుడు

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు 

          ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు, శాసనాలు, విదేశీయుల రచనల్లో కూడా ఆంధ్ర దేశ, ఆంధ్ర జాతి ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్ర ప్రాంతాన్ని మంజీర దేశం, వజ్ర దేశం, నాగభూమిగా పేర్కొన్నారు. ప్రాచీన ఆంధ్ర దేశంలోని కృష్ణా, గోదావరి మైదానాలను 'నాగభూములు'గా టాలమీ తన జాగ్రఫీ (A guide to geography) గ్రంథంలో ప్రస్తావించారు. గుంటుపల్లి గుహాలయ శాసనాలు అదే ప్రాంతాన్ని 'మహానాగ పర్వతం'గా పేర్కొన్నాయి. ఆంధ్ర అనే పదాన్ని జాతి పరంగా, దేశ పరంగా, భాషాపరంగా అనేక రచనలు పేర్కొన్నాయి. మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం, వ్యాసుని మహాభారతం, కువలయమాల లాంటి గ్రంథాలు ఆంధ్రులను జాతిపరంగా ప్రస్తావించాయి. వాల్మీకి రామాయణం, శివస్కంధవర్మ మైదవోలు శాసనం, వరాహమిహిరుని 'బృహత్ సంహిత' లాంటి గ్రంథాలు ఆంధ్రులను దేశ పరంగా పేర్కొన్నాయి. కానీ నన్నయ నందంపూడి శాసనం, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం, విన్నకోట పెద్దన 'కావ్యాలంకార చూడామణి' లాంటి గ్రంథాలు ఆంధ్రను భాషాపరంగా పేర్కొన్నాయి. సుత్తనిపాత' అనే బౌద్ధ రచన అస్మక, ములక అనే అంధక రాష్ట్రాల గురించి వివరించింది. ఆంధ్ర నగరి తేలివాహన నదిపై ఉందని 'సెరివణిజ జాతకం' వివరిస్తుంది. ఆంధ్ర పథాన్ని ప్రస్తావించిన 'భీమసేన జాతకం' ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందిందని వ్యాఖ్యానించింది.
 

ఆంధ్రులను గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం 'ఐతరేయ బ్రాహ్మణం'. ఇందులో ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతి వారని, దక్షిణాదిలో అతడి సంతానమే పుండ్రులు, పుళిందులు, మూతిబలు, శబరులు, గదబలుగా స్థిరపడ్డారని పేర్కొంది. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు మెగస్తనీస్. తన 'ఇండికా' గ్రంథంలో ఆంధ్రులు 30 నగరాలను అత్యంత సైనిక సంపత్తితో పాలిస్తున్నారని పేర్కొన్నాడు. ఎరియన్ కూడా ఆంధ్రులు 30 రాజ్యాలను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం అశోకుడి 13వ శిలాశాసనం (దౌళి/జౌగాడ శాసనం). దీంతోపాటు 'ఎర్రగుడి', 'రాజులమందగిరి' శాసనాలు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించాయి. అశోకుడి శాసనాలు ఆంధ్రులను 'ఆంధ్రభృత్యులు' అని పేర్కొన్నాయి. పురాణాల్లో ఆంధ్రులను ఆంధ్ర దేశీయులు, ఆంధ్ర జాతీయులుగా పేర్కొన్నారు. 'మత్స్య పురాణం' ప్రకారం ఆంధ్ర దక్షిణాది తొలి తెగ 'నాగులు'. కశ్యపుడి భార్యలు కద్రుక, వినత. వినతకు గరుత్మంతుడు జన్మించగా, కద్రుకకు వెయ్యిమంది నాగులు జన్మించారు. గరుత్మంతుడి నుంచి తన సంతానాన్ని కాపాడుకోవడానికి కద్రుక దండకారణ్య ప్రాంతానికి వచ్చినట్లు మత్స్య పురాణ కథనం చెబుతుంది. 'సుత్తనిపాత' గ్రంథం ప్రకారం నాగముచలిందుడు బుద్ధుడిని తన ఏడు పడగలతో రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. దీపాల దిన్నె/వజ్రాలదిన్నె/అమరావతి పాలకుడైన నాగాశోకుడు అక్కడ బౌద్ధ స్తూపానికి పునాదులు వేశాడు. 'చద్దా నిర్దేశన' అనే బౌద్ధ గ్రంథం దక్షిణ దేశంలో నివసించిన యక్షుల గురించి వివరిస్తుంది. కుబేరుడనే యక్షరాజు భట్టిప్రోలు (ప్రతీపాలపురం) శాసనం వేయించాడు. 'ధర్మామృతం' అనే జైన గ్రంథం యశోధర్ముడనే రాజు ప్రతీపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతోంది. మూడో బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రధాన పాత్ర పోషించారని 'కథావత్తు' గ్రంథం తెలియజేస్తుంది. విమానవత్తు భాష్యం ప్రకారం మహాకాత్యాయనుడు అస్మక రాజుకు బౌద్ధమత దీక్షను ఇచ్చాడు. అలాగే, దక్షిణ దేశంలో భావరి అనేవాడు బౌద్ధాన్ని ప్రచారం చేసినట్లు 'సుత్తనిపాత' గ్రంథం తెలుపుతుంది. దక్షిణ భారతదేశంలో జైనమత విస్తరణ గురించి 'పరిశిష్ఠ పర్వం' అనే గ్రంథం వివరిస్తుంది. గుంటుపల్లి శాసనంలో కళింగాధిపతికి 'మహిశకాధిపతి' అనే బిరుదు ప్రస్తావన ఉంది.
 

రాతియుగంలో ఆంధ్ర దేశం
       
 ఆదిమానవుడి కాలాన్ని 'రాతియుగం' లేదా 'ప్రాక్‌చ‌రిత్ర' అంటారు. ఈ మొత్తం కాలాన్ని ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలుగా విభజిస్తారు. ఆంధ్రదేశంలోని రాతియుగంపై పరిశోధనలు చేసి ప్రాక్‌చరిత్ర పితామహుడుగా 'రాబర్ట్ బ్రూస్‌పుట్' పేరొందారు. క్రీ.శ.1892లో రాబర్ట్ బ్రూస్‌పుట్, కమియెడ్‌ల కృషి ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు మొరటు రాళ్లను పెచ్చులుగా కొట్టి ఆయుధాలుగా వాడాడు. వాటిని చేధకాలు, దరకాలు, చేతిగొడ్డళ్లు, గీకుడు రాళ్లుగా చరిత్రకారులు వర్ణించారు. అలాంటి పాత రాతియుగ పనిముట్లు నందికనుమ (గిద్దలూరు) వద్ద అధిక మొత్తంలో లభ్యమయ్యాయి. మధ్యరాతియుగంలో మానవుడు అతిచిన్న రాతి పనిముట్లను ఉపయోగించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం, నిప్పును కనుక్కోవడం చేశాడు. నవీన శిలాయుగం నాటికి ఆహార అన్వేషణ దశ నుంచి ఆహార ఉత్పాదక దశకు చేరాడు. కర్నూలు జిల్లా భిల్లసర్గం గుహల్లో జంతుబలి ఆధారాలు లభించాయి.

గిద్దలూరు, సంగనకల్లు ప్రాంతాల్లో ఆహార ఉత్పాదకత దశకు చేరిన ఆనవాళ్లు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్నూరు, అనంతపురం జిల్లాలోని పాల్వాయి ప్రాంతాల్లో మసిదిబ్బలు లేదా బూడిద దిబ్బలు నాటి పశుపాలక సమాజ ఆచారాలను తెలుపుతున్నాయి. రాతియుగ మానవుడు నిర్మించిన సమాధులను రాక్షసగుళ్లు అంటారు. వాటిలో 12 రకాల సమాధులు బయల్పడ్డాయి. వాటిలో డోల్మెన్‌లు, మెన్‌హిర్‌లు, సర్కోఫగిలు, సిస్త్‌లు, గుండ్రనిరాళ్లు లాంటివి ఉన్నాయి. శవాన్ని రాతి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టి దానిపై పెద్ద బండరాయిని ఉంచితే దాన్ని 'మెన్‌హిర్' అంటారు. శవాన్ని మూత ఉన్న రాతి పెట్టెలో (గది) పెట్టి భూమి మీద ఉంచితే, దాన్ని 'డోల్మెన్' అంటారు. మట్టితో తయారుచేసిన పెట్టెలో శవాన్ని ఉంచితే 'సర్కోఫగి' అంటారు. గొర్రె ఆకారం సమాధిపెట్టె కర్నూలు జిల్లాలోని శంఖవరంలో, ఏనుగు ఆకారంలోని సమాధిపెట్టె నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో బయల్పడ్డాయి. సతీ సహగమనాన్ని సూచించే స్త్రీ, పురుష కళేబరాలున్న సమాధి ఏలేశ్వరంలో లభించింది. రాతియుగం నాటి చిత్రాలంకృత మృణ్మయ పాత్రలు కర్నూలు జిల్లాలోని పాతపాడులో దొరికాయి. నవీన శిలాయుగంలో వాడిన రాతి గొడ్డలి నెల్లూరు జిల్లాలోని కామకూరులో లభించింది. ఆదిమానవుడి 10 రాతి చిత్రకళా స్థావరాలు కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో బయల్పడ్డాయి. లోహయుగంలో వాడిన రాగి పనిముట్లు కృష్ణా జిల్లాలోని కీసరపల్లిలో బయల్పడ్డాయి.

 

వైదిక సంస్కృతి విస్తరణ
 

 ఆర్యులు ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చేసిన సంస్కృతిని వైదిక సంస్కృతి అంటారు. స్థానికులైన దాసి దాస్యుల నుంచి వ్యవసాయం సహా వృత్తిపరమైన, సామాజిక విభజన, పురోహిత వ్యవస్థ, పూజా విధానం లాంటివి గ్రహించి ఆర్యులు నూతన సంస్కృతిని స్థాపించారు. రుగ్వేద ఆర్యులకు దక్షిణాపథం గురించి తెలియదు. హ్మణాల కాలం నుంచి దక్షిణ ప్రాంతంపై దృష్టి సారించారు. క్రీ. పూ. 800 సంవత్సరాలనాటి ఐతరేయ బ్రాహ్మణంలో విదర్భ రాజ్యాన్ని, దాని రాజు భీముడి గురుంచి పేర్కొన్నారు. మహాభారతంలో అగస్త్యుడి కథ ఉంది. ఆర్య సంస్కృతిని దక్షిణాదికి విస్తరింప చేసింది అగస్త్యుడే అని కథనం. తమిళభాషలోని తొలి వ్యాకరణ గ్రంథం 'అగత్తీయం' అతడు రచించిందే. స్థానిక సంస్థల మనుగడ కోసం అపస్తంభుడు అనే రుషి స్థానిక మతాచారాలను అధర్వణ వేదంలో చేర్చి వాటికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు. కాత్యాయనుడు, కౌటిల్యుడు కూడా దక్షిణ ప్రాంతానికి చెందినవారనే సంప్రదాయం ఉంది. గౌతమబుద్ధుడు స్వయంగా ధాన్యకటకం దగ్గర 'కాలచక్ర తంత్రం' బోధించి ధారణులను నిక్షేపితం చేశాడు కాబట్టి దానికి 'ధరణికోట' అనే పేరు వచ్చిందని కథనం ఉంది. మహాపద్మనందుడు కళింగను జయించి జైన ప్రతిమలను తీసుకెళ్లినట్లు ఖారవేలుని 'హతిగుంఫా' శాసనం తెలుపుతోంది. అస్మక రాజ్యాన్ని ఆక్రమించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మౌర్యుల కాలంలో ఆంధ్రులు వారి సామంతులుగా ఉన్నట్లు శాసన ఆధారం ద్వారా తెలుస్తోంది. మహిష మండలానికి (దక్షిణ ప్రాంతం) అశోకుడు మహాదేవ భిక్షువును పంపాడు. అనురాధాపురం (శ్రీలంక)లోని స్తూప ఆవిష్కరణకు పల్లవ బొగ్గ నుంచి అనేక మంది మహాదేవభిక్షు నాయకత్వంలో వెళ్లినట్లు సింహళ గ్రంథం 'మహావంశం' తెలియజేస్తుంది.

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 624 - 1076)

మాదిరి ప్రశ్నలు

1. ఐహోల్‌ శాసనాన్ని వేయించింది ఎవరు?
1) మొదటి పులకేశి   2) రెండో పులకేశి
3) మంగళేశుడు     4) కీర్తివర్మ


2. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పశ్చిమ చాళుక్యులతో రాయబారాలు నడిపినట్లు తెలిపే గుహచిత్రాలు ఎక్కడ ఉన్నాయి?
1) అజంతా గుహలు    2) ఎల్లోరా గుహలు
3) బాగ్‌ గుహలు   4) ఎలిఫెంటా గుహలు


3. చైనా యాత్రికుడైన హుయాన్‌త్సాంగ్‌ ఏ చాళుక్య రాజు దర్బార్‌ను సందర్శించారు?
1) మొదటి పులకేశి   2) సత్యాశ్రయుడు
3) విక్రమాదిత్యుడు   4) రెండో పులకేశి


4. కల్యాణి చాళుక్యుల మొదటి రాజధాని?
1) మాన్యఖేటం         2) ప్రతిష్ఠానం
3) కల్యాణి         4) సరసాల


5. విక్రమశకాన్ని ప్రారంభించింది ఎవరు?
1) ఒకటో సోమేశ్వరుడు    2) రెండో సోమేశ్వరుడు
3) ఆరో విక్రమాదిత్యుడు 4) రెండో తైలపుడు


6. ఏ గ్రంథాన్ని మానసోల్లాసం అని పిలుస్తారు?
1) పంచతంత్రం       2) అభిలషిలూర్థ చింతామణి 
3) ధర్మామృతం     4) చందోబుద్ధి


7. మేగుటి దేవాలయాన్ని ఏ శైలిలో నిర్మించారు?
1) చాళుక్య శైలి      2) ద్రావిడ శైలి  
3) నగర శైలి      4) మధ్యభారత శైలి 


8. నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?
1) అలంపురం        2) బాదామి  
3) పట్టడకల్‌        4) ఐహోల్‌


9. ‘ఇరివబెందగ’ అనే బిరుదు ఎవరిది?
1) సత్యాశ్రయుడు    2) విమలాదిత్యుడు  
3) విక్రమాదిత్యుడు    4) తైలపుడు


10. కల్యాణి చాళుక్య పాలకుల్లో చివరివారు? 
1) జగదేక మల్లుడు   2) జయసింహుడు  
3) విక్రమసింహుడు   4) రాజసింహుడు


11. అజిత పురాణాన్ని రచించింది ఎవరు?
1) పంప         2) పొన్న 
3) రన్న        4) హేమచంద్రుడు


12. చందోబుద్ధి గ్రంథ రచయిత ఎవరు?
1) నాగవర్మ          2) దేవగుప్త  
3) విష్ణుశర్మ          4) మయూరవర్మ


13. అభినవ పంపగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు?
1) హేమచంద్రుడు    2) నాగచంద్రుడు  
3) రవిచంద్రుడు      4) దుర్గసింహుడు


14. కవి చక్రవర్తి బిరుదు ఎవరికి ఉంది?
1) పంప        2) పొన్న 
3) రన్న        4) నాగసేనుడు


15. ధర్మామృతాన్ని రచించింది ఎవరు?
1) నాగచంద్రుడు    2) హేమచంద్రుడు  
3) నయసేనుడు     4) నాగసేనుడు


16. వచనాలు అనే నీతి పద్యాలను రచించింది ఎవరు?
1) వీరశైవులు         2) వీరవైష్ణవులు  
3) చాదాత్తవైష్ణవులు    4) భాగవతులు


17. కిందివాటిలో బిల్హణుడి రచన ఏది?
1) గాథాసప్తశతి   2) విక్రమాంకదేవ చరిత్ర  
3) బృహత్కథ    4) అష్టాంగ సంగ్రహం


18. లాడ్‌ఖాన్‌ దేవాలయం ఎక్కడ ఉంది?
1) బాదామి         2) పట్టడకల్‌  
3) ఐహోల్‌         4) సంగమేశ్వరం


19. తుంగభద్రా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మొదటి సోమేశ్వరుడు ఏ వంశానికి చెందినవాడు?
1) బాదామి చాళుక్య         2) కల్యాణి చాళుక్య   
3) తూర్పు చాళుక్య          4) వేములవాడ చాళుక్య


20. పాపనాథాలయం ఏ పట్టణంలో ఉంది?
1) అలంపురం         2) కూడలి సంగం  
3) సంగమేశ్వరం     4) పట్టడకల్‌ 


21. బాదామి వద్ద ఏ మతానికి చెందిన గుహాలయాన్ని నిర్మించారు?
1) జైన       2) బౌద్ధ         3) శైవ           4) వైష్ణవ   


22. కిందివాటిలో ఏ దేవాలయాల్ని ఔత్తరాహిక శైలిలో నిర్మించారు?
1) నవబ్రహ్మ దేవాలయాలు          2) సంగమేశ్వరాలయం
3) విరూపాక్షాలయం               4) పాపనాథాలయం


23. కల్యాణి దుర్గ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
1) జయసింహుడు   2) సోమేశ్వరుడు 
3) విమలాదిత్యుడు   4) విక్రమాదిత్యుడు

 

24. హారితీపుత్ర అనే మాతృసంజ్ఞను వాడిన వంశం ఏది?
1) శాతవాహనులు       2) ఇక్ష్వాకులు     
3) తూర్పు చాళుక్యులు    4) పశ్చిమ చాళుక్యులు


25. తెలుగు భాషలో మొదటి రాజకవిగా ఏ కవి పేరొందాడు?
1) నన్నయ        2) నన్నెచోడుడు        3)తిక్కన          4) శర్వవర్మ


26. దశకుమార చరిత్ర గ్రంథాన్ని రాసి, అభినవదండి బిరుదు పొందిన కవి...
1) కేతన          2) మంచన       3) తిక్కన         4) మనుమ సిద్ది


27. కవిగాయక కల్పతరువు బిరుదు పొందిన రాజు ఎవరు?
1) మొదటి అమ్మరాజు   2) రెండో యుద్ధమల్లుడు
3) రెండో అమ్మరాజు    4) మూడో విష్ణువర్థనుడు


28. వేంగి చాళుక్య, రాష్ట్రకూట సంఘర్షణలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి?
1) మొదటి జయసింహ వల్లభుడు 
2) మొదటి విజయాదిత్యుడు
3) అమ్మరాజు - I         4) అమ్మరాజు - II


29. రాష్ట్రకూటరాజు ధ్రువుడు చేతిలో ఓడి, అతనికి తన కూతురు శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేసిన రాజు...
1) విష్ణువర్థన - I        2) విష్ణువర్థన - II       
3) విష్ణువర్థన - IV       4) ఎవరూ కాదు


30. 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?

1) మొదటి విజయాదిత్యుడు     2) విజయాదిత్య  -II
3) విజయాదిత్య - III         4) విజయాదిత్య  - IV

 

సమాధానాలు: 1-2; 2-1; 3-4; 4-1; 5-3; 6-2; 7-2; 8-1; 9-1; 10-1; 11-3; 12-1; 13-2; 14-3; 15-3; 16-1; 17-2; 18-3; 19-2; 20-4; 21-1; 22-1; 23-1;  24-3;   25-2;    26-1;    27-3;   28-2;    29-3;   30-2.

Posted Date : 02-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 624 - 1076)  

తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని నాలుగున్నర శతాబ్దాల పాటు పాలించారు. తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న వేంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. బాదామి చాళుక్యుల్లో ఒకడైన రెండో పులకేశి వివిధ యుద్ధాల్లో వేంగి ప్రాంతాన్ని ఆక్రమించి, తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని రాజుగా నియమించాడు. విష్ణువర్ధనుడు, అతడి వారసులే వేంగి చాళుక్యులుగా ప్రసిద్ధి పొందారు.


కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ.624 - 641)
ఇతడికి విషమసిద్ధి, కామదేవ, మకరధ్వజ అనే బిరుదులు ఉన్నాయి. చీపురుపల్లి, తిమ్మాపురం శాసనాలు వేయించాడు. వీటిలో వీరి రాజ్యం ఉత్తరాన విశాఖపట్నం నుంచి కమ్మనాటి వరకు విస్తరించినట్లు ఉంది.
* తిమ్మాపురం శాసనంలో ఈయన విష్ణు భక్తుడు, పరమ భాగవతుడు అని ఉంది. విష్ణువర్ధనుడు కార్తికేయకాకి (దుర్గభక్తుడు)గా ప్రసిద్ధి పొందాడు. ఇతడి భార్య అయ్యణ మహాదేవి జైన మతాభిమాని. ఈమె బెజవాడలో జైన సన్యాసుల కోసం నెడుంబవసది అనే మఠాన్ని నిర్మించి, ఒక గ్రామాన్ని దానం చేసింది.
* ఇతడి ఆస్థానాన్ని హుయాన్‌త్సాంగ్‌ అనే చైనా యాత్రికుడు సందర్శించాడు.
* విష్ణువర్ధనుడి కుమారుడైన మొదటి జయసింహుడు విప్పర్ల శాసనాన్ని వేయించాడు. ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటి తొలి తెలుగు శాసనం. 
* మరో పాలకుడైన రెండో విష్ణువర్ధనుడిని ‘ధర్మ శాస్త్రవేత్త’ అని ప్రజలు కీర్తించారు.


రెండో విజయాదిత్యుడు (క్రీ.శ. 808 - 847)
* ఇతడు 108 యుద్ధాలు చేసి నరేంద్ర మృగరాజుగా ప్రసిద్ధి చెందాడు. యుద్ధాలు చేసిన ప్రాంతాల్లో శివాలయాలను నిర్మించాడు.
* ఇతడి వల్లే బెజవాడకు ఆ పేరు వచ్చిందని చరిత్రకారులు పేర్కొంటారు.
* ఇతడికి నరేంద్రేశ్వర, చాళుక్యరామ, విక్రమ దావళి అనే బిరుదులు ఉన్నాయి.


గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ. 849 - 892)
* ఈయన వేంగి చాళుక్యుల్లో గొప్పవాడు.
* ఇతడి సైన్యాధిపతి పాండురంగడు. ఇతడు బెజవాడతో సమానంగా కందుకూరును పటిష్ఠమైన దుర్గంగా తీర్చిదిద్దాడు.
* పాండురంగడు పులికాట్‌ తీరంలో పాండురంగం అనే పట్టణాన్ని నిర్మించాడు.
* గుణగ విజయాదిత్యుడు రాష్ట్రకూటరాజైన రెండో కృష్ణుడిని జయించి, వారి సార్వభౌమ చిహ్నాలైన పాళిధ్వజం (ఉత్తరభారత సార్వభౌమత్వ చిహ్నాం), గంగా - యమున తోరణం (గంగా - యమున చిహ్నాలు ఆ నదులపై అధికారాన్ని సూచిస్తాయి.) మొదలైన వాటిని గ్రహించాడు. 
* అద్దంకి శిలాశాసనాన్ని, సీసలి తామ్ర శాసనాన్ని వేయించాడు.
* సమధిగత పంచమహాశబ్ద (దక్షిణాపథ పతిత్వ సూచిక) అనే బిరుదును ధరించాడు. 
* బిరుదాంకప్రోలు (బిక్కవోలు) పట్టణాన్ని నిర్మించి, చంద్రశేఖరాలయాన్ని కట్టించాడు.

 

చాళుక్య భీముడు (క్రీ.శ.892 - 921)
* ఇతడు సమస్త విద్యల్లో ప్రావీణ్యుడైన మల్లపను, అతని కూతురైన చల్లవను పోషించాడు. ఆమెకు గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు ఉంది. 
* చల్లవకు భీముడు అత్తిలి గ్రామాన్ని దానం చేశాడు.
* భీముడు చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని నిర్మించి, భీమేశ్వరాలయాన్ని కట్టించాడు.గోదావరి ఒడ్డున ద్రాక్షారామంలో సోమేశ్వరాలయాన్ని నిర్మించాడు.
* ఇతడి సామంతుడైన చాత్రపుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం వద్ద పార్థేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు.


పరిపాలన
* సిద్ధాంతరీత్యా రాజ్యానికి రాజు సర్వాధికారి.
* తూర్పు చాళుక్యుల శాసనాల్లో సప్తాంగాలు, మంత్రి, పురోహిత, దౌవారిక, సేనాపతి మొదలైన 18 మంది తీర్థులను పేర్కొన్నారు. 
* పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులు లేదా మండలాలు, విషయాలు, కొట్టములుగా విభజించారు.
* మహామండలేశ్వర, మహాదండనాయక, విషయాధిపతి, నాల్గవుండు, నూర్గవుండు, గవుండు అనే అధికారులు ఉండేవారు.
* గ్రామంలో గ్రామేయకుడు, రాష్ట్రకూట ప్రముఖులు (రట్టుగుళ్లు) పన్నులు వసూలు చేసి రాజుకు చెల్లించేవారు.

 

దేవాలయాలు
తూర్పు చాళుక్యుల నిర్మాణాల్లో చాళుక్య ప్రభావం కనిపిస్తుంది.
* యుద్ధమల్లుడు బెజవాడలో కార్తికేయ దేవాలయాన్ని నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు బిక్కవోలులో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను స్థాపించాడు.
* చాళుక్య భీముడు సామర్లకోట, ద్రాక్షారామం, చేబ్రోలు ప్రాంతాల్లో భీమేశ్వరాలయాలను నిర్మించాడు.
* పంచారామాలైన భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు కూడా చాళుక్యులు నిర్మించినవే.
* అలంపురంలో నవబ్రహ్మ ఆలయం, సంగమేశ్వర, కడమల కాల్వ, మహానంది ఆలయాలను నిర్మించారు. 
* చాళుక్య భీమవరం (సామర్లకోట) ఆలయంలో నంది, గాయక, నర్తకి శిల్ప ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇవి తూర్పు చాళుక్యుల శిల్పకళకు నిదర్శనం.

 

మత పరిస్థితులు
* వీరు హిందూమతాన్ని అనుసరించారు. 
* పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేసిన కుమారీలభట్టు ఈ యుగంలోనే (క్రీ.శ.8వ శతాబ్దం) జీవించాడు.
* ఈ పాలకులు బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి వేద విద్యను పోషించారు.
* ప్రజల్లో హిందూధర్మ సందేశాన్ని ప్రచారం చేసేందుకు మహాభారతాన్ని (పంచమ వేదం) ఆంధ్రీకరించారు. 
* చాళుక్యుల ఇష్టదైవం మహాసేనుడు.
* శైవంలో పాశుపతం ప్రాచీన శాఖ. దీన్ని లకులీశ్వరుడు స్థాపించాడు. వీరు తీవ్రవాద శైవులు. తమ ప్రాబల్యాన్ని చాటడం కోసం బల ప్రయోగానికి కూడా వెనకాడేవారు కాదు. ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ మతాల విధ్వంసంలో వీరు ప్రధానపాత్ర పోషించారు.
* బెజవాడ, అమరావతి మొదలైన చోట్ల సింహ పరిషత్తులను స్థాపించి మత ప్రచారం చేశారు. అలంపురం, శ్రీశైలం, ద్రాక్షారామాలు వీరి కేంద్రాలుగా ఉండేవి.
* రాజులు శైవ మఠాలను, శైవాగమన శాస్త్రవేత్తలను, శైవాచార్యులను పోషించారు. 
* ఆంధ్రదేశంలో వీరశైవం బాగా విస్తరించింది. పండితత్రయంగా ప్రసిద్ధులైన శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యులు శైవమత పునరుద్ధరణకు కృషిచేశారు. 
* ఈ ముగ్గురిలో మల్లికార్జునుడు ద్రాక్షారామ నివాసి. ఇతడు భక్తి ప్రధాన శైవాన్ని చేపట్టాడు. 
* తమిళదేశంలో రామానుజుడు ప్రారంభించిన మతం ఇక్కడ వ్యాపించి శైవంతో పోటీపడింది. 
* రామానుజుడు శంకరుడి అద్వైతాన్ని ఖండిస్తూ, జీవితం వాస్తవమని, కులభేదాల విషయంలో పట్టింపు లేదని ప్రచారం చేశాడు.
* ఈ యుగంలో అనేక ద్రవిడ వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డాయి.


జైన మతం:
* వేంగి చాళుక్యుల కాలంలో జైనమతం రాజాదరణ పొందింది. 
* అమ్మరాజు ‘సర్వలోకాశ్రయ’ కటకాభరణ అనే జీనాలయాలను నిర్మించాడు. వాటిలో సత్రాలను కట్టించాడు. అందులో నాలుగు వర్ణాల శ్రమణులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించారు.
* అమ్మరాజు భార్య చామెకాంబ. ఈమె సర్వాలోకాశ్రయ జీన భవనానికి కలుచుంబుర్రు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారు.
* విమలాదిత్యుడు జైనమతాన్ని స్వీకరించాడు.
* జైనులు సారస్వత కృషి జరిపారు.
* రామతీర్థ వాసి అయిన ఉగ్రాదిత్యుడు, కల్యాణ కారిక అనే వైద్యగ్రంథాన్ని రాశాడు.
* పద్మప్రభామలదరి దేవుడు కుందకుందాచార్యుడి నియమసారంపై తాత్పర్యవృత్తి అనే భాష్యాన్ని రాశాడు.
* జైన ధర్మానికి అత్తిలి, రాజమహేంద్రవరం, బెజవాడ, కొల్లిపాక, పూడూరు మొదలైన ప్రాంతాలు ముఖ్య కేంద్రాలుగా ఉండేవి.

 

సాంఘిక పరిస్థితులు
* సమాజంలో నాలుగు వర్ణాలు ఉండేవి. చిన్న కులాలు ఏర్పడటం ఈ కాలంలోనే ప్రారంభమైంది.
* బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలకు సమాజంలో ఉన్నత స్థానం ఉండేది.
* శూద్రులు వ్యవసాయానికే పరిమితమయ్యారు. వీరు మొదటి నుంచి ప్రత్యేక హక్కులు ఉన్న బ్రాహ్మణ, క్షత్రియులతో సమాన ప్రతిపత్తి పొందేందుకు ప్రయత్నించి, సఫలమయ్యారు.
* ఈ యుగంలోనే పల్నాటి బ్రహ్మనాయుడు దళితులకు ఆలయ ప్రవేశాన్ని ప్రోత్సహించాడు. ఈయన వర్ణ వ్యత్యాసాలను నిరసించి,  వీర వైష్ణవమతాన్ని ప్రచారం చేశాడు.
* బాల్య వివాహాలు, బహు భార్యత్వం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి.
* దేవుళ్ల జాతరల్లో రాజులు, రాణులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొనేవారు.
* చేబ్రోలులో మహాసేనుడి జాతర జరిగేది. ఇక్కడి నుంచి దేవుడి రథాన్ని ఊరేగింపుగా బెజవాడ వరకు తీసుకొచ్చేవారు. ఈ యాత్ర  25 మైళ్లు సాగేది.  

రాజకీయ చరిత్ర 

‣ రెండో పులకేశి (పశ్చిమ చాళుక్య రాజు) సోదరుడైన కుబ్జ విష్ణువర్థనుడు క్రీ.శ. 624  642 మధ్య విషమసిద్ధి, మకరధ్వజుడు లాంటి బిరుదులతో పాలించాడు.

‣ కుబ్జ విష్ణువర్థనుని భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైనులకు నెడుంబవసది గుహాలయాలను నిర్మించి, ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. క్రీ.శ. 642  673 మధ్య పాలించిన మొదటి జయసింహ వల్లభుడు సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి లాంటి బిరుదులను పొందాడు. ఇతను విప్పర్ల శాసనాన్ని వేయించాడు. తూర్పు చాళుక్య కాలంనాటి తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. ఇతని కాలంలోనే పల్లవులతో సంఘర్షణ ప్రారంభమైంది.

‣ తూర్పు చాళుక్యుల్లో అతి తక్కువ కాలం పాలించిన రాజు ఇంద్ర భట్టారకుడు (7 రోజులు పాలన). రెండో జయసింహుడు ‘నిరవద్య’ బిరుదుతో పాలించాడు. మూడో విష్ణువర్థనుడు కవి పండిత కామధేనువు, త్రిభువనాంకుశ లాంటి బిరుదులను పొందాడు. ఇతను పల్లవుల చేతిలో ఓడిపోయి, భోయకొట్టాల ప్రాంతాన్ని కోల్పోయాడు.

‣ మొదటి విజయాదిత్యుని కాలంలో తూర్పు చాళుక్య- రాష్ట్రకూట ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతను రాష్ట్రకూట రాజు గోవిందుని చేతిలో ఓడిపోయాడు. నాలుగో విష్ణువర్థనుడు రాష్ట్రకూట రాజు ధ్రువుని చేతిలో ఓడిపోయి, తన కూతురు శీలమహాదేవిని అతనికిచ్చి వివాహం చేశాడు. ధ్రువుని తరపున వచ్చిన మొదటి అరికేసరి నాలుగో విష్ణువర్థనుడిని ఓడించినట్లు పంప రచించిన విక్రమార్జున విజయం అనే గ్రంథం వివరిస్తోంది.

‣ రెండో విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించి నరేంద్ర మృగరాజు అనే బిరుదు పొందాడు. ఇతని పేరు మీదుగానే బెజవాడ విజయవాడ అయ్యింది.

‣ తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడైన గుణగ/ మూడో విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వర బిరుదు పొందాడు. సాతలూరు శాసనం ఇతని విజయాలను వివరిస్తోంది. ఇతని సేనాని పాండురంగడు అద్దంకి, కందుకూరు శాసనాలను వేయించాడు. గుణగ వింగవల్లి యుద్ధంలో రాష్ట్రకూట అమోఘవర్షుని చేతిలో ఓడిపోయినా, అతని వారసుడు రెండో కృష్ణుడిని ఓడించి, వారి పాళీధ్వజాన్ని, గంగా-యమునా తోరణాన్ని తన ధ్వజంపై ముద్రించాడు. ఇతని ఆస్థానాన్ని సులేమాన్‌ అనే అరబ్బు యాత్రికుడు సందర్శించాడు.

‣ మొదటి చాళుక్య భీముడు లేదా ఆరో విష్ణువర్థనుడు పంచారామాలను అభివృద్ధి చేశాడు. ద్రాక్షారామం, చేబ్రోలు ఆలయాలను నిర్మించాడు. గాంధర్వ విద్యా విశారదగా పేరొందిన చల్లవను పోషించాడు. ఆమెకు అత్తిలి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పందిపాక శాసనం ఇతని విజయాలను వివరిస్తుంది.

‣ మొదటి అమ్మరాజు ‘రాజమహేంద్ర’ బిరుదుతో పాలించాడు. ఇతను రాజమహేంద్రవరాన్ని నిర్మించినట్లు విన్నకోట పెద్దన రచించిన కావ్యాలంకార చూడామణి గ్రంథం పేర్కొంటోంది.

‣ మొదటి యుద్ధమల్లు బెజవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు. రెండో యుద్ధమల్లు బెజవాడలో నాగమల్లీశ్వరి ఆలయాన్ని నిర్మించాడు. ఇతను వేయించిన బెజవాడ శాసనంలో మధ్యాక్కరలు అనే చంధస్సు ఉంది. ఇతను చేబ్రోలును రాజధానిగా చేసుకుని పాలించినట్లు బెజవాడ శాసనం పేర్కొంటోంది.

‣ క్రీ.శ. 945  970 మధ్య పాలించిన రెండో అమ్మరాజు / ఆరో విజయాదిత్యుడు ‘కవిగాయక కల్పతరువు’ బిరుదు పొందాడు. ఈయన జైన మతాన్ని అవలంబించిన ఏకైక తూర్పు చాళుక్యరాజు. ప్రకాశం జిల్లాలో కఠకాభరణ జినాలయాన్ని నిర్మించి, మలియంపూడి గ్రామాన్ని దానం చేశాడు. ఇతని భార్య చామెకాంబ కూడా సర్వలోకాశ్రయ జినాలయాన్ని నిర్మించి, కలఛుంబుర్రు గ్రామాన్ని దానం చేసింది. బాడపుని ఆరుంబాక శాసనం, దానార్ణవుని మాగల్లు శాసనాలు కూడా రెండో అమ్మరాజు గురించి వివరిస్తాయి.

‣ దానార్ణవుడు రెండో అమ్మరాజును వధించి 970  973 మధ్య పరిపాలించాడు. ఇతను మాగల్లు శాసనాన్ని వేయించాడు. తెలుగు చోడ[ వంశస్థుడైన జటాచోడ భీముడు దానార్ణవుడిని వధించి, తూర్పు చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇతనికి ‘చోడ త్రినేత్ర’ అనే బిరుదు ఉంది.

‣ మొదటి శక్తివర్మ (దానార్ణవుడి కుమారుడు) చాళుక్యచంద్ర బిరుదుతో పాలన చేశాడు. మొదటి శక్తివర్మ అనంతరం అతని సోదరుడు విమలాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను రాజరాజు కూతురు కుందవ్వను, జటాచోడ భీముని కుమార్తె మేళమలను వివాహం చేసుకున్నాడు. గురువు త్రికాలయోగి / సిద్ధాంతదేవుడి కోసం రామతీర్థంలో రామకొండ గుహాలయాన్ని నిర్మించాడు.

‣ క్రీ.శ. 1019  1060 మధ్య రాజరాజ నరేంద్రుడు రాజ్యపాలన చేశాడు. ఇతని బిరుదు కావ్యగీతి ప్రియుడు. రాజేంద్రచోళుడి కూతురు అమ్మాంగదేవిని వివాహం చేసుకున్నాడు. కలిదిండి యుద్ధంలో మరణించిన చోళ సేనాను కోసం కలిదిండిలో మూడు శివాలయాలను నిర్మించాడు. క్రీ.శ. 1021 లో పట్టాభిషేకం జరుపుకున్నాడు. రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు. నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లనలాంటి కవులను పోషించాడు. కళ్యాణి చాళుక్యరాజు సోమేశ్వరుడు నారాయణభట్టును రాయబారిగా ఇతని ఆస్థానానికి పంపాడు. రాజరాజ నరేంద్రుడు నారాయణభట్టుకు నందంపూడి అగ్రహారాన్ని, పావులూరి మల్లనకు నవఖండ్రవాడను దానం చేశాడు.

‣ ఏడో విజయాదిత్యుడు చివరి తూర్పు / వేంగి చాళుక్యరాజు. క్రీ.శ. 1076 లో రాజరాజ నరేంద్రుని కుమారుడు రాజేంద్రుడు ‘కులోత్తుంగ చోళుని’ పేరుతో చోళ-చాళుక్య పాలన ప్రారంభించి, వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

కళాభివృద్ధి
కల్యాణి చాళుక్యులు అనేక దేవాలయాలను కట్టించారు. కర్ణాటకలోని ఐహోల్‌ ప్రాంతంలో సుమారు 70, పట్టడకల్‌లో 10 ఆలయాలను నిర్మించారు. 
ఈ ఆలయాలన్నింటిలో దీర్ఘచతురస్రాకార వేదికను ఏర్పాటుచేసి, స్తంభాలను వరుస క్రమంలో ఉంచి, వాటిపై కప్పు వేశారు. వీటికి నాలుగు వైపులా గోడలు ఉండవు. దీన్నే సంధాగారం అంటారు.
తుంగభద్రా నదీ తీరంలో ఉన్న అలంపూర్‌లో తొమ్మిది నవబ్రహ్మ దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల్లో విశ్వబ్రహ్మ ఆలయం పెద్దది. ఒక్క ఆలయం మినహా  మిగిలిన వాటన్నింటినీ ఔత్తరావాహిక శైలిలో నిర్మించారు. వీటిలో ఆరు దేవాలయాలకు చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో శివలింగాలను ప్రతిష్ఠించారు. 
ఆలయాల పై శిఖరాలను ఆములకం (ఉసిరిక ఆకారాన్ని పోలింది) వంపులతో ఉండేలా ఏర్పాటుచేశారు.
ఐహోల్‌లోని లాడ్‌ఖాన్‌ దేవాలయం అతి   ప్రాచీనమైంది. 
మేగుటిలో ఉన్న జైన దేవాలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. అక్కడే గజవృష్ఠాకారంలో దుర్గాదేవి ఆలయం ఉంది.
పట్టడకల్‌లో పాపనాథాలయం, సంగమేశ్వరాలయం, విరూపాక్షాలయాలను కట్టారు. 
బాదామి వద్ద జైనమతానికి చెందిన గుహాలయాన్ని నిర్మించారు. 
ఐహోల్‌లోని జైనాలయాన్ని రవికీర్తి నిర్మించాడు.

 

సాహిత్యం

కల్యాణి చాళుక్యుల కాలంలో కన్నడ సాహిత్యం బాగా వృద్ధి చెందింది. అజిత పురాణం, గదాయుద్ధ కావ్యాలను రచించిన ‘రన్న’ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందాడు.
నాగవర్మ అనే కవి చందోబుద్ధి, కర్ణాటక కాదంబరి మొదలైన రచనలు చేశారు.
దుర్గసింహుడు పంచతంత్రాన్ని రచించాడు. 
అభినవ పంపగా ప్రసిద్ధి చెందిన నాగచంద్రుడు, ధర్మామృతాన్ని రచించిన నయసేనుడు, అక్కమహాదేవి ఈ కాలానికి చెందినవారే.

పాలనాంశాలు 

‣ రాజ్యాన్ని విషయాలు - నాడులు - కొట్టాలు - గ్రామాలుగా విభజించారు. అష్టాదశ తీర్థులు అనే మంత్రి పరిషత్తు రాజుకు పరిపాలనలో సాయపడేది. అష్టాదశ తీర్థుల గురించి మొదటి అమ్మరాజు మాగల్లు శాసనం వివరిస్తోంది. 
(దానార్ణవుడు కూడా మాగల్లు శాసనం వేయించాడు) 

‣ రెండో అరికేసరి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రాహి, తంత్రపాల అనే ఉద్యోగనామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ బృందాన్ని వియోగాధిపతులు అనేవారు.

‣ గ్రామ సభను వారియం అని, గ్రామ కార్యనిర్వాహక మండలిని పంచవారియం అని, గ్రామాధికారిని గ్రాముండ అని పిలిచేవారు. ఆస్థాన న్యాయాధికారులను ప్రాఢ్వివాక్కులు అని, న్యాయమూర్తులు చదివే తీర్పులను జయపత్రాలు అని పిలిచేవారు.

‣ నందంపూడి శాసనం పంచ ప్రధానులను, రెండో అమ్మరాజు బందరు శాసనం ద్వాదశ స్థానాధిపతులను, రెండో చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం అగ్రహారాల్లోని బ్రాహ్మణ పరిషత్తుల గురించి తెలియజేస్తున్నాయి.

ఆర్థిక పరిస్థితులు 

‣ నాటి వర్తక సంఘాలను నకరాలు అని, వర్తక సంఘాల నియమాలను సమయకార్యం అని పిలిచేవారు. నాటి నగర ప్రధాన కేంద్రం పెనుగొండ.

‣ విదేశాలతో వర్తకం చేసేవారిని నానాదేశి పెక్కండ్రు అని, వర్తక సంఘాలపై పన్ను వసూలు అధికారిని సుంకప్రెగ్గడ అని పిలిచేవారు. మాండలికుడు అనే అధికారి ప్రాంతీయంగా వర్తక నిర్వహణకు అనుమతి ఇచ్చేవాడు. గద్యాణము, మాడలు, ద్రమ్మములు అనే నాణాలు చలామణిలో ఉండేవి.

‣ గ్రామరక్షణ అధికారిని తలారి అని, గ్రామాల్లో పన్ను వసూలు అధికారులను రట్టగుళ్లు అని పిలిచేవారు.

‣ భూ ఫలసాయంలో రాజుకు చెల్లించే భాగాన్ని కోరు అనేవారు. కల్లు (కల్లానక్కానం), వివాహం (కళ్యాణక్కానం), యువరాజు భృతి కోసం (దొగరాజు పన్ను), సైన్యాన్ని నిర్వహించడానికి (పడేవాళే పన్ను) పన్నులు వసూలు చేసేవారు. యుద్ధ సమయంలో సైన్యాన్ని పోషించే గ్రామాలను జీతపుటూళ్లు అనేవారు.

‣ యుద్ధంలో రాజు ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఊదే కొమ్మును ధర్మదార అనేవారు. మార్కెట్‌ కూడళ్లకు సరుకులు రవాణా చేసేవారిని పెరికలు అంటారు.

‣ చినగంజాం నాటి ముఖ్య రేవుపట్టణమని అహదనకర శాసనం తెలుపుతోంది.

‣ నాణాలను గద్యాణం (బంగారు నాణెం), మాడ (వెండి నాణెం), కాసు (రాగి నాణెం) అని పిలిచేవారు. పంటకు ముందు నిర్ణయించే పన్ను సిద్దాయ, కాగా పంట వచ్చిన తర్వాత విధించేదాన్ని అరి పన్ను అనేవారు.

‣ సామాజిక పరిస్థితులు: బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. వైశ్యులు జైన మతాన్ని అవలంబించారు. వారి కులదేవత వాసవీ కన్యకాపరమేశ్వరి.

‣ పంచానం వారు అంటే విశ్వకర్మలు. వీరు కంసాలి, కమ్మరి, కంచరి, కాసె, వడ్రంగి అనే అయిదు శాఖలుగా ఏర్పడ్డారు.

‣ మత పరిస్థితులు: పరమ భాగవత, పరమ మహేశ్వర బిరుదులు ధరించిన తూర్పు చాళుక్యులు స్మార్త సంప్రదాయాన్ని పాటించారు. వీరు శైవమతాన్ని ఆచరించారు.

‣ బౌద్ధమతం క్షీణించి జైనమతం రాజాదరణ పొందింది. బౌద్ధరామాలు పంచారామాలుగా మారిపోయాయి.

‣ కులోత్తుంగ చోళుడు మునుగోడు (గుంటూరు జిల్లా) దగ్గర పృధ్వీతిలక బసది పేరుతో శ్వేతాంబర జైన బసదిని, రాష్ట్రకూట మూడో ఇంద్రుడు కడప జిల్లా దానవులపాడులో గొప్ప జైనక్షేత్రాన్ని నిర్మించారు.

‣ బోధన్‌లో ఉన్న గోమఠేశ్వరం విగ్రహం నమూనాలోనే చాముండరాయుడు శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వర విగ్రహాన్ని నిర్మించాడు.

‣ గణపతి, శివుడు, విష్ణువు, ఆదిత్యుడు, దేవి అనే అయిదుగురు దేవతలను ఒకేసారి ఆరాధించే పంచాయతన పూజా విధానం ప్రారంభమైంది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరాల వల్ల ఆంధ్రదేశం త్రిలింగ దేశంగా పేరొందింది.

‣ శైవ మతంలో పాశుపత, కాపాలిక, కాలాముఖ శాఖలు ఏర్పడ్డాయి. ప్రాచీనమైన పాశుపత శాఖను లకులీశుడు, కాలాముఖ శాఖను కాలాననుడు స్థాపించారు. భవభూతి రచన ‘మాలతీ మాధవం’ శ్రీశైలాన్ని కాపాలిక క్షేత్రంగా పేర్కొంటోంది.

‣ రెండో యుద్ధమల్లు బెజవాడ శాసనం చేబ్రోలు మహసేన జాతర గురించి వివరిస్తోంది. సర్పవరం (కాకినాడ) భవన్నారాయణ స్వామి ఆలయం, పిఠాపురం కుంతీ మాధవస్వామి ఆలయం, శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) ఆంధ్ర మహావిష్ణు దేవాలయాలను ఈ కాలంలోనే నిర్మించారు.

విద్యా-సారస్వతాలు 

‣ నాటి విద్యాలయాలు-ఘటికలు, నాటి రాజభాష- సంస్కృతం. కవిగాయక కల్పతరువుగా పేరొందిన రెండో అమ్మరాజు పోతనభట్టు, మాధవభట్టు, భట్టిదేవుడు లాంటి కవులను పోషించాడు. మూడో విష్ణువర్థనుడు కవి పండిత కామధేనువు బిరుదు పొందాడు.

‣ నన్నయ నారాయణభట్టు సాయంతో మహాభారతంలో మొదటి రెండున్నర పర్వాలను తెలుగులో రాశాడు. ఆంధ్రభాషానుశాసనం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.

‣ పావులూరి మల్లన ‘గణితసార సంగ్రహం’ అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు. దీన్ని సంస్కృతంలో మహావీరాచారి రచించాడు. ఉగ్రాదిత్యుడు కళ్యాణకారక్‌ అనే వైద్య గ్రంథాన్ని రచించాడు.

‣ శాద్వాదాచల సింహ, తార్కిక చక్రవర్తి బిరుదులు పొందిన సోమదేవసూరి యశస్తిలక, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి సూత్ర వంటి గ్రంథాలను రచించాడు. కుమారిలభట్టు పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేశాడు.

‣ వాస్తు, కళారంగాలు: శైవ, వైష్ణవ ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది. పంచారామాలు అభివృద్ధి చెందాయి. బిక్కవోలు (బిరుదాంకనిప్రోలు) ఆలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు.

‣ పంచారామాలు: ద్రాక్షారామం/ భీమారామం- ద్రాక్షారామం, కుమారారామం - సామర్లకోట, అమరారామం- అమరావతి, క్షీరారామం-పాలకొల్లు, సోమారామం - గునుపూడి (భీమవరం).

‣ నాటి ముఖ్య వినోదం కోలాటం. మొదటి చాళుక్య భీముని కాలంలో హల్లీశకం అనే కోలాటరీతి అభివృద్ధి చెందింది.

‣ నాటి శిల్పాల్లో వీణ, పిల్లనగ్రోవి, మృదంగం, తాళాలు లాంటి వాద్య పరికరాలు ఎక్కువగా కనిపిస్తాయి.  విజయవాడ, జమ్మిదొడ్డిలో సంగీత శిల్పాలున్నాయి. కందుకూరు, బిక్కవోలు పట్టణాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించి అభివృద్ధి చేశాడు.

Posted Date : 28-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆంధ్రలో చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగం

ఆనాడే ఆంధ్రలో ఆదిమానవుడు!

  మూడు లక్షల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడు ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించాడు. చరిత్ర పూర్వయుగం నుంచి బృహత్‌ శిలా యుగం వరకు ఎన్నో పరిణామాలకు సాక్ష్యంగా నిలిచాడు. సంచార జీవనాన్ని దాటి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆహార అన్వేషణను వదిలి పండించడం నేర్చుకున్నాడు. నిప్పును కనిపెట్టాడు. చక్రాన్ని తిప్పాడు. మోటు రాతి పనిముట్లతో మొదలుపెట్టి ఇనుప ఆయుధాలనూ ప్రయోగించడం ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఆ యుగాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

రాతి యుగాలు - లోహ యుగాలు

  ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం ప్లిస్టోసిన్‌ లేదా హిమ యుగం నుంచే మానవులు నివసించినట్లు ఆధారాలున్నాయి. ఆంధ్రాలో వీరి సంచారం, ఉపయోగించిన వస్తువులపై పరిశోధనలు జరిపిన మొదటి వ్యక్తి రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌. ఆ తర్వాత పరిశోధనలు చేసినవారిలో మెడోస్‌ టేలర్, కాగ్లిన్‌ బ్రౌన్, పి.టి.శ్రీనివాస అయ్యంగారు ఉన్నారు.

చారిత్రక యుగం మూడు భాగాలు

1. చరిత్ర పూర్వయుగం (Pre Historic Period) 

2. సంధికాల చారిత్రక యుగం (Proto Historic Period)

3. చారిత్రక యుగం (Historic Period)

* చరిత్ర పూర్వయుగం అంటే ఆ కాలం నాటి మానవుడికి లిపి, అక్షరాల గురించి తెలియదు.

* సంధికాల చారిత్రక యుగం నాటి మానవుడికి లిపి తెలుసు, కానీ అక్షరాల గురించి తెలియదు. ఉదా: సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. కానీ అక్షరాలు లేవు. 

* చారిత్రక యుగంలో మానవులకు లిపి, అక్షరాలు తెలుసు.

ఉదా: ఆర్య నాగరికత. వీరి కాలంలో వేద సాహిత్యాన్ని బ్రాహ్మీ లిపిలో, సంస్కృత భాషలో రాశారు.

చరిత్ర పూర్వయుగం: ఈ కాలం నాటి మానవుడు తన దైనందిన జీవన విధానంలో భాగంగా రాతితో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించేవాడు. అందుకే ఈ యుగాన్ని ‘శిలాయుగం’ (స్టోన్‌ ఏజ్‌) అని పిలుస్తారు. ఈ యుగం క్రీ.పూ. 3 లక్షల సంవత్సరాల నుంచి 5 వేల సంవత్సరాల వరకు కొనసాగింది. డేనియల్‌ విల్సన్‌ అనే స్కాటిష్‌ చరిత్రకారుడు ప్రి-హిస్టారిక్‌ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.  క్రీ.శ.1851లో The Archaeology and Pre Historic Annals of Scotland అనే గ్రంథాన్ని రచించాడు.  1865లో ఇంగ్లండ్‌కు చెందిన జాన్‌ లబ్బక్‌ రచించిన  Pre Historic Times గ్రంథంలో Pre Historic పదాన్ని ఉపయోగించాడు.


 చరిత్ర పూర్వయుగాన్ని ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగాలుగా వర్గీకరించారు.

1) ప్రాచీన శిలాయుగం: ప్రాచీన శిలాయుగాన్ని Paleolithic Age/Prestone Age లేదా పాత రాతియుగంగా పిలుస్తారు. ఈ కాలంలో మానవుడు ఆహార అన్వేషణ దశలో ఉండేవాడు. ఉపయోగించే రాతి పనిముట్లు మోటుగా ఉండేవి. నాటి రాతి పనిముట్లు కర్నూలు జిల్లాలోని బేతంచర్లకు సమీపంలో బిల్ల సర్గం (బిల్ల సొరంగం)లో లభించాయి. ఆ పరికరాలను స్ఫటికశిల (క్వార్ట్‌జైట్‌)తో చేశారు. ప్రాచీన శిలాయుగంలో మొదటి భాగమైన పూర్వ ప్రాచీన శిలాయుగంలో గులకరాళ్లతో పరికరాలు తయారయ్యాయి. వీటిని ‘పెచ్చల్‌ టూల్స్‌’ అంటారు.ఈ కాలపు రాతి పరికరాల్లో ముఖ్యమైంది ‘గొడ్డలి’.

  మధ్య ప్రాచీన శిలాయుగంలో రాళ్లను పెచ్చులుగా ఊడగొట్టి రాతి పరికరాలు తయారుచేసేవారు. వీటిలో ముఖ్యమైనవి ‘చక్రాలు’, బరమా. ఉత్తర ప్రాచీన శిలా యుగంలో మానవుడు ఉపయోగించిన ముఖ్యమైన రాతి పనిముట్లు ‘బ్లేడు’, బ్యూరిన్‌. కర్నూలు జిల్లా చింతమానుగవి వద్ద నాటి రాతి సూది లభించింది. 1892లో రాబర్ట్‌ బ్రూస్‌ఫుట్‌ కర్నూలు జిల్లాలోని బిల్లసర్గంలో జరిపిన పరిశోధనల్లో తలలు లేని జంతు కళేబరాలు బయల్పడ్డాయి.

2) మధ్య శిలాయుగం: దీన్ని సూక్ష్మ రాతియుగం అని, మిసోలిథిక్‌ ఏజ్, మిడిల్‌ స్టోన్‌ ఏజ్‌ అని పిలుస్తారు. ఈ యుగంలో ఉపయోగించిన రాయిని చెకుముకి రాయి (క్రిస్టల్‌ చెర్ట్‌) అని పిలుస్తారు. ఈ కాలం రాతి పరికరాల్లో ముఖ్యమైనవి కత్తులు, బొరిగెలు, గీకుడు రాళ్లు. నాటి స్థావరాల్లో గంభీరం నదీ లోయ, విశాఖపట్నం జిల్లా(ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా) లోని బొర్రా గుహలు, కర్నూలు జిల్లాలోని కేతవరంలో చిత్రాలు ముఖ్యమైనవి. రాతి పనిముట్లు త్రిభుజాకార, చతుర్భుజాకారంలో ఉండేవి. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.

3) నవీన శిలాయుగం: దీన్నే కొత్త రాతియుగం అని, Neolithic Age/ New Stone Age అని పిలుస్తారు. ఈ కాలంలో మానవుడు స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. రాబర్ట్‌ బ్రూస్‌ఫుట్‌ అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను కనుక్కున్నాడు. నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల వద్ద కనిపించాయి. ఉట్నూరు వద్ద బూడిద కుప్పలు బయటపడ్డాయి. అప్పటి మానవుడు చక్రాన్ని కనుక్కున్నాడు. కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. చక్రం ఆవిష్కరణను నాగరికతా విప్లవంగా పిలిచినవారు సర్‌ గార్డెన్‌ చైల్డ్‌. ఈ యుగానికి చెందిన పూడ్చిపెట్టిన మట్టి పాత్రలు నాగార్జున కొండ వద్ద తవ్వకాల్లో, పెన్నానది ఆనకట్ట నిర్మాణ తవ్వకాల్లో బయటపడ్డాయి.

తామ్ర శిలాయుగం (Chalco Lithic Age): తామ్రం అంటే రాగి. ప్రపంచంలో మానవుడు మొదటగా కనుక్కున్న లోహం రాగి. ఏపీలో కృష్ణా జిల్లాలోని కేశరపల్లి వద్ద రాగి పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లాలోని పాతపాడు వద్ద చిత్రాలు ఉన్న మృణ్మయ పాత్రలు బయటపడ్డాయి. రాగి, తగరం మిశ్రమంతో కంచు లోహం తయారవుతుంది.

ఇనుపలోహ యుగం: క్రీ.పూ.1000 సంవత్సరాల నుంచి క్రీ.పూ.900 సంవత్సరాల మధ్య ఈ యుగం ఆంధ్రాలో ప్రారంభమైనట్లు అల్లూరు వద్ద జరిపిన రేడియో కార్బన్‌ డేటింగ్‌-14 పరిశోధనలో తేలింది. అప్పట్లో ఆంధ్ర దేశంలో వరి పండించి తినేవారని డాక్టర్‌ సంకాలియా అనే పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు. నాటి మానవుడు నలుపు, ఎరుపు మట్టి పాత్రలు ఎక్కువగా ఉపయోగించేవాడు. భారతదేశంలో ఈ యుగం గురించి ఎక్కువగా పరిశోధనలు జరిపినవారు ఎస్‌.ఆర్‌.బెనర్జీ. ఆ కాలంలో అతి ముఖ్యమైనది బృహత్‌ శిలా సంస్కృతి (లేదా) రాక్షస గుళ్ల సంస్కృతి.

బృహత్‌ శిలాయుగం: ఆంధ్రదేశంలో ఇనుపలోహ యుగం నాటి ఆయుధాలు వింతైన సమాధుల్లో లభించాయి. వాటినే బృహత్‌ శిలలు/రాక్షస గుళ్లు/మెగాలిత్స్‌ అని పిలుస్తారు. అవి ఎక్కువగా బ్రహ్మగిరి, గుడివాడ, నాగార్జునకొండ ప్రాంతాల్లో లభించాయి. ఏలేశ్వరం వద్ద ఒకే సమాధిలో స్త్రీ, పురుష కళేబరాలు ఉన్న శవపేటిక దొరికింది. ఈ రాక్షస గుళ్లు సుమారు 12 రకాలున్నాయి. చనిపోయిన వారి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభాలను నిలబెట్టేవారు. వీటినే ‘మెన్‌హిర్‌’లు అని పిలుస్తారు. మెన్‌హిర్‌లు కృష్ణా జిల్లాలోని రేవరాల వద్ద లభించాయి.

రాక్షసగుళ్లు లేదా మెగాలిత్స్‌లో పలు రకాలు ఉన్నాయి.

సిస్ట్‌: ఇది మొదటిరకం సమాధి/శవపేటిక. గ్రానైట్‌ బండరాయితో శవపేటిక తయారుచేసి భూమిలో పాతిపెడతారు. శవపేటిక పైన కప్పిన రాయికి ‘రంధ్రం’ ఉంటుంది. ఈ రకమైన సమాధులు విశాఖపట్నం తప్ప ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో కనిపించాయి.

డోల్మన్‌: ఇది రెండో రకం శవపేటిక. దీన్ని భూమిలో పూడ్చరు. భూమిపైనే ఉంచుతారు. ఇవి తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో కనిపించాయి.

సార్కోఫగి: ఇది మూడో రకం సమాధి/శవపేటిక. దీన్ని కాల్చిన బంకమట్టి లేదా టెర్రకోటతో తయారుచేస్తారు. ఇవి గొర్రె ఆకారంలో ఉంటాయి. కర్నూలు జిల్లా శంకవరంలో గుర్తించారు.

మెన్విర్‌: ఇది నాలుగో రకం శవపేటిక. దీన్ని భూమిలో పాతిపెట్టి, ఆ సమాధిపై వివిధ ఆకారాల్లో 2 నుంచి 6 మీటర్ల ఎత్తున్న రాతి స్తంభాలు నిలబెడతారు.

* పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయల్పడిన అవశేషాల వయసును తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని ‘కార్బన్‌ డేటింగ్‌-14’ అని పిలుస్తారు.

మరికొన్ని ముఖ్యాంశాలు

* గుంటూరు జిల్లా వడ్లమానులో రాతిగొడ్డలిని   కనుక్కున్నవారు రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌.

* కమియెడ్, బర్కిట్‌ అనే పరిశోధకులు తమ పరిశోధనల్లో బయటపడిన రాతి వస్తువులను నాలుగు భాగాలుగా విభజించి వాటికి ‘సిరీస్‌’ అని పేరు పెట్టారు.

* ప్రాంక్‌ పి.మాన్లే అనే అమెరికన్‌ పెన్నానది ప్రాంతంలో పరిశోధనలు జరిపి పాతరాతి యుగపు అవశేషాలు కనుక్కున్నాడు.

* 1865లో గోదావరి నదీ తీరంలో పరిశోధనలు జరిపిన వ్యక్తి ‘వైన్‌’.

* నాగార్జున కొండ వద్ద పరిశోధనలు జరిపినవారు బి.ఆర్‌. సుబ్రహ్మణ్యం.

* కృష్ణా జిల్లాలోని ఉస్తపల్లి ప్రదేశంలో మాత్రమే ప్రాచీన శిలాయుగపు అవశేషాలు లభించాయి.

* 1960లో గుండ్లకమ్మ నదీ తీరాన పరిశోధనలు జరిపినవారు హైజాక్‌.

* చిత్తూరు జిల్లా రాళ్లవాగు వద్ద పరిశోధనలు జరిపినవారు కృష్ణమూర్తి.

* 1968లో కడప జిల్లా ‘సగిలేరు’ లోయలో పరిశోధనలు జరిపివారు తిమ్మారెడ్డి.

* 1985లో తిరుపతిలో పరిశోధనలు జరిపినవారు జాకబ్‌ జయరాజు.

రచయిత: రెడ్డి ఉమా మహేశ్వరరావు  

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనులు

తొలి తెలుగు చక్రవర్తులు

  ప్రాచీన భారతదేశ చరిత్రలో శాతవాహనులకు విశిష్ట స్థానం ఉంది. దక్షిణాదిన తొలి సామ్రాజ్యాన్ని స్థాపించి నాలుగు శతాబ్దాలకు పైగా జనరంజక పాలన సాగించారు. అశోకుడి అనంతరం స్వతంత్ర పాలకులైన వీరు శాంతికాముకులుగా మెలుగుతూనే శక్తిమంతమైన విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. స్వదేశీ, విదేశీ దండయాత్రలను ఎదుర్కొని శాంతిని నెలకొల్పారు. వైదిక సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించి తర్వాతి తరాలకు అందించారు. బౌద్ధ మతోద్ధరణకు తోడ్పడ్డారు. నాటి ప్రజాజీవనం, సంస్కృతి, భాషా, సాంస్కృతిక వికాసం వంటి అంశాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  ప్రప్రథమ ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలు శాతవాహనులు. ఈ సామ్రాజ్య స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. దక్షిణ పథాన్ని శక, యవన, పహ్లవ విదేశీ దాడుల నుంచి కాపాడారు. వీరిని సాతవాహనులు, శాలివాహనులు, శాతకర్ణులు, ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులని కూడా అంటారు. ఆంధ్ర అనేది జాతినామం. శాతవాహన అనేది వంశనామం.

శాతవాహన రాజుల గురించి తెలుసుకోవడానికి వివిధ ఆధారాలు ఉన్నాయి. 

1) పురావస్తు ఆధారాలు

శాసనాలు: శాసనాల గురించి చేసే అధ్యయనాన్ని శాస్త్రం ఎపిగ్రఫీ అంటారు.

* ఎర్రగుడి శాసనం - అశోకుడు  

* 13వ శిలశాసనం - అశోకుడు 

* నానాఘాట్‌ శాసనం - నాగానిక 

* నాసిక్‌ శాసనం - గౌతమీ బాలశ్రీ 

* అమరావతి శాసనం - రెండో పులోమావి 

* మ్యాకదోని శాసనం - మూడో పులోమావి 

* హాతిగుంఫా శాసనం - ఖారవేలుడు 

* జునాగఢ్‌ శాసనం - రుద్రదమన

నాణేలు: నాణేల గురించి అధ్యయనాన్ని న్యూమెస్‌ మ్యాటిక్స్, నాణేలపై ఉన్న బొమ్మల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని అంటారు. శాతవాహనుల కాలం నాటి నాణేలను సీసం, వెండి పోటిన్‌ అనే మిశ్రమ లోహంతో తయారు చేసేవారు. మొదటి శాతకర్ణి అశ్వమేథ యాగం గుర్తుతో, గౌతమీపుత్ర శాతకర్ణి తన చిహ్నంతో, యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాప గుర్తుతో నాణేలను ముద్రించారు.

2) లిఖిత ఆధారాలు 

ఎ) పురాణాలు: మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, ఐతరేయ బ్రాహ్మణం 

బి) బౌద్ద మత గ్రంథాలు 

సి) జైన మత గ్రంథాలు 

డి) స్వదేశీ సాహిత్యం: బృహత్కథ - గుణాడ్యుడు, కథాసరిత్సాగరం - సోమదేవసూరి, గాథాసప్తశతి - హాలుడు, లీలావతి పరిణయం - కుతూహలుడు, సుహృల్లేఖ - ఆచార్య నాగార్జునుడు, కాతంత్ర వ్యాకరణం - శర్వవర్మ 

ఇ) విదేశీయుల రచనలు: ఇండికా - మెగస్తనీస్, ది గైడ్‌ టు జాగ్రఫీ - టాలమీ, నేచురల్‌ హిస్టరీ - ప్లీనీ, పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ - అజ్ఞాత నావికుడు, సి-యు-కి - హుయాన్‌త్సాంగ్‌

శాతవాహనుల జన్మస్థలం మీద విభిన్న వాదనలున్నాయి. వీరిది కర్ణాటక ప్రాంతమని వి.ఎన్‌.సుక్తాంకర్, మహారాష్ట్ర వారని పి.టి.శ్రీనివాస అయ్యంగార్, విదర్భ వాసులని .వి.వి.మిరాసి, ఆంధ్రులేనని గుత్త వెంకటరావు, ఎం.రామారావు, డాక్టర్‌ స్మిత్‌ తదితరులు పేర్కొన్నారు.

శాతావాహనుల రాజధానులు 

1) శ్రీకాకుళం (కృష్ణా జిల్లా) 

2) ధరణికోట/ధాన్యకటకం (గుంటూరు జిల్లా) 

3) ప్రతిష్టానపురం (మహారాష్ట్ర) 

రాజుల్లో ప్రముఖులు


శ్రీముఖుడు (క్రీ.పూ.271-248): ఇతడికి చిముకుడు, శిముకుడు, శిశుక, సింధుక, సిప్రక, సుద్ర వంటి పేర్లు ఉన్నాయి. ఇతడే ఆంధ్ర శాతవాహన వంశ స్థాపకుడు. తండ్రి పేరు శాతవాహనుడు/శాలివాహనుడు. వీరి రాజధాని ప్రతిష్టానపురం. శ్రీముఖుడు అశోకుడికి సమకాలీనుడు. మౌర్యులకు సామంతుడిగా మెలిగాడు. 23 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. మొదట జైనమతం స్వీకరించాడు. ఆ తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఈయన వేయించిన నాణేలు (పోటిన్‌) కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించాయి. ‘సాధ్వహణ’ అనే పేరుతో నాణేలను ముద్రించాడు.

కృష్ణుడు/కన్హ (క్రీ.పూ.248-230): శ్రీముఖుడి సోదరుడు. 18 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. మహారాష్ట్రలో నాసిక్‌ వరకు రాజ్య విస్తరణ చేశాడు. నాసిక్, కన్హేరి వద్ద బౌద్ధవిహారాలను నిర్మించారు. అశోకుడి మరణం తర్వాత తన రాజ్యానికి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ‘విదర్భ’ కోసం పుష్యమిత్ర శుంగుడితో యుద్ధం చేశాడు. ఇతడి కాలంలో నే భాగవత మతం ఆంధ్రలోకి ప్రవేశించింది. ఆ మత స్థాపకుడు వాసుదేవుడు. 

మొదటి శాతకర్ణి (క్రీ.పూ.230-220): శ్రీముఖుడి కుమారుడు. పదేళ్ల పాటు పరిపాలించాడు. మత్స్య పురాణంలో ఇతడిని మల్లకర్ణి అని పేర్కొన్నారు. ‘శాతవాహన’ అనే వంశం నామాన్ని తన పేరుకు జోడించిన మొదటి రాజు. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించాడు. ఏకవీర, అప్రతిహతచక్ర సామ్రాట్, శూరుడు, దక్షిణ పథపతి అనే బిరుదులు ఉన్నాయి. మహారాష్ట్రను పాలిస్తున్న సామంతుడైన ‘మహారథి త్రయినోకరో’ కుమార్తె నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈమె ‘నానాఘాట్‌ శాసనం’ను ప్రాకృత భాషలో వేయించింది. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయినిని ఆక్రమించాడు. ఉజ్జయిని పట్టణ తోరణాన్ని నాణేలపై ముద్రించాడు. కళింగ రాజు ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లుగా హాథిగుంపా శాసనంలో ఉంది. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం నిర్వహించాడు. ఇతడి మరణానంతరం కుమారులు చిన్నవాళ్లు కావడంతో భార్య నాగానిక కొంతకాలం పరిపాలన చేసింది. తర్వాత రాజ్యానికి వచ్చినవారు పూర్ణోత్సాంగుడు (వేదసిరి), స్కందస్తంభి.

రెండో శాతకర్ణి (క్రీ.పూ.184-128): ఈయన ఆరో శాతవాహన రాజు. తొలి శాతవాహన రాజుల్లో సుప్రసిద్ధుడు. స్కందస్తంభి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు. 56 ఏళ్ల పాటు పాలించాడు. నానాఘాట్‌ శాసనంలో నాగానిక పేర్కొన్నది ఇతడి గురించేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శకులు, కళింగులు, శుంగులతో యుద్ధాలు చేశారు. ఇతడి కాలం నాటి నాణేలు మాళ్వా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో లభించాయి.

* రెండో శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చినవారు లంబోదరుడు (క్రీ.పూ.128-110), అపీలకుడు (క్రీ.పూ.110-98), మేఘ స్వాతి (క్రీ.పూ.98-80), స్వాతి (క్రీ.పూ.80-62), స్కందస్వాతి (క్రీ.పూ. 62-55).* మృగేంద్ర (క్రీ.పూ.55-52). మృగేంద్ర కాలంలోనే బెత్లహామ్‌ వద్ద ఏసుక్రీస్తు జన్మించారు.

కుంతలస్వాతి (క్రీ.పూ.52-44): ఇతడు 13వ రాజు. ఎనిమిదేళ్లు పరిపాలించాడు. ఇతడి కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజ భాష అయ్యింది. కుంతలస్వాతికి సంస్కృతం నేర్పిన పండితుడు శర్వవర్మ. ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. దక్షిణాన మొదట సంస్కృత గ్రంథం ఇదే. కానీ భారతదేశంలో మొదటి సంస్కృత గ్రంథం పాణిని రచించిన ‘అష్టాధ్యాయి’. కుంతలస్వాతి కాలం నాటి మరో కవి గుణాఢ్యుడు. ఇతడి రచన ‘బృహత్కథ’. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని హరిసేనుడు బృహత్కథా కోశం, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరి, సోమదేవుడు కథాసరిత్సాగరం గ్రంథాలను రచించారు.

* కుంతలస్వాతి తర్వాత స్వాతికర్ణి రాజు అయ్యాడు.

మొదటి పులోమావి (క్రీ.పూ.43-19): ఇతడు స్వాతికర్ణి తర్వాత రాజు. శాతవాహునుల్లో 15వ పాలకుడు. తన రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చాడు. అవంతి, అకర రాజ్యాలను ఆక్రమించాడు. మగధ రాజధాని పాటలీపుత్రంపై ఆంధ్ర విజయకేతనం ఎగురవేశాడు. నాటి మగధ రాజు కణ్వ వంశీయుడైన సుశర్మ.

* మొదటి పులోమావి తర్వాత గౌర కృష్ణుడు (క్రీ.పూ.19 - క్రీ.శ.6) రాజు అయ్యాడు.

హాలుడు (క్రీ.శ.7-12): ఈయన 17వ రాజు. అయిదేళ్ల పాటు పరిపాలించాడు. స్వయంగా కవి. ఎక్కువ మంది కవులను పోషించి కవివత్సలుడిగా పేరు పొందాడు. గాథా సప్తశతి అనే గ్రంథం రాశాడు. ప్రాకృత భాషకి ఇతడి కాలం స్వర్ణయుగం. హాలుడు-లీలావతి (శ్రీలంక రాకుమారి)ల ప్రేమగాథను కుతూహలుడు అనే కవి ‘లీలావతి పరిణయం’ గ్రంథంగా రాశాడు. వారి వివాహం ద్రాక్షారామంలో జరిగింది.

* హాలుడి తర్వాత రాజులు మందలకుడు (క్రీ.శ.7-12), పురీంద్రసేనుడు (క్రీ.శ.12-33), సుందర స్వాతికర్ణి (క్రీ.శ.33-34), చకోర స్వాతికర్ణి (క్రీ.శ.34), శివస్వాతి (క్రీ.శ.34-62).

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.62-86): శాతవాహనుల్లో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. 23వ పాలకుడు. 24 ఏళ్లు పరిపాలించాడు. శాలివాహన శకాన్ని (క్రీ.శ.78) ప్రారంభించాడు. ఈయన బిరుదులు దక్షిణ సముద్రాదీశ్వర, ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ క్షత్రియ దర్పమాన వర్థన, త్రిసముద్ర తోయ పీతవాహన. షహరాట వంశానికి చెందిన నహపాణుడిని నాసిక్‌లోని జోగల్‌ తంబి యుద్ధంలో ఓడించాడు. దీంతో ‘షహరాట వంశ నిరీవ శేషకర’ అనే బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలపై తన చిహ్నాలతో నాణేలను మళ్లీ ముద్రించాడు. శక, యవన, పహ్లవులను ఓడించాడు. ఇతడి విజయాల గురించి నాసిక్‌ శాసనం తెలుపుతుంది. ఆ శాసనం వేయించినవారు గౌతమీ బాలాశ్రీ. శాసనం రాసినవారు శివస్వామి - మహాస్వామి.

వాసిష్టపుత్ర పులోమావి/రెండో పులోమావి (క్రీ.శ.86-114): గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడి గురించి తెలిపే శాసనాలు నాసిక్‌లో 4, కార్లేలో 2, అమరావతి, ధరణికోటల్లో ఒక్కొక్కటి చొప్పున లభించాయి. నాసిక్‌ శాసనంలో ఇతడిని ‘దక్షిణ పథేశ్వరుడు’గా పేర్కొన్నారు. ప్రాచీనాంధ్రలో 9 నగరాలను నిర్మించి నవనగర స్వామిగా  ప్రసిద్ధికెక్కాడు. శక రాజు రుద్రదాముడు ఇతడి కాలంలో రెండుసార్లు శాతవాహన రాజ్యంపై దండెత్తాడు. అమరావతి వద్ద స్తూపం నిర్మించారు. ఇతడి నాణేలు, శాసనాలు ఆంధ్ర జిల్లాల్లో విస్తారంగా లభించాయి. అమరావతి వద్ద లభ్యమైన శాసనంలోనే ‘నాగబు’ అనే తెలుగు పదం కనిపిస్తుంది.

శివశ్రీ (క్రీ.శ.114-121): వాసిష్టపుత్ర పులోమావి తర్వాత శివశ్రీ రాజయ్యాడు. ఇతడికి క్షత్రప అనే బిరుదు ఉంది. రుద్రదాముడి కుమార్తె రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గురించి తెలిపే శాసనం గిర్నార్‌ లేదా జునాగఢ్‌ శాసనం. ఇతడి అనంతరం శివస్కందుడు (క్రీ.శ.121-128) రాజయ్యాడు.

యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ.శ.128-157): ఇతడు 27వ రాజు. చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. రుద్రదాముడి వెండి నాణేలను పోలిన నాణేలను ముద్రించాడు. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు ఇతడి కాలం నాటివాడే. నాగార్జునాచార్యుడి కోసం నాగార్జునకొండలో బౌద్ధవిహారం నిర్మించాడు. రోమన్‌లతో వ్యాపారం చేశాడు. తెరచాపతో కూడిన నాణేలను ముద్రించాడు. ఇతడి తర్వాత విజయశ్రీ (క్రీ.శ.157-163), చందశ్రీ (క్రీ.శ.163-166) రాజులయ్యారు.

* ఆచార్య నాగార్జునుడిని రెండో బుద్ధుడు అంటారు. ఈయన మహాయాన బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. బౌద్ధంలో మార్టిన్‌ లూథర్‌ అని కూడా అంటారు. నాగార్జునుడు శూన్యవాద సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతానికి కారకుడు. అందువల్లే ఈయనను ‘ఐన్‌స్టీన్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు.

మూడో పులోమావి (క్రీ.శ.166-174): శాతవాహనుల్లో చివరి రాజు. ఇతడి పరిపాలన విషయాలను మ్యాకదోని శాసనం తెలుపుతుంది. మూడో పులోమావిని ఓడించి, రాజ్యం నుంచి తరిమేసిన ఇక్ష్వాక రాజు శ్రీచాంత మూలుడు.

మాదిరి ప్రశ్నలు


1. పురాణాలు అనుసరించి శాతవాహనుల్లో చివరి రాజు.

1) శివశ్రీ 2) విజయశ్రీ 3) చంద్రశ్రీ 4) మూడో పులోమావి

2. శాతవాహనుల ప్రధాన భాష?

1) తెలుగు 2) సంస్కృతం 3) ప్రాకృతం 4) తమిళం

3. నాసిక్‌ శాసనం వేయించినవారు?

1) సుందర శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) గౌతమీ బాలశ్రీ 4) ఒకటో శాతకర్ణి 

4. కవివత్సలుడు అనే బిరుదు పొందినవారు?

1) హాల శాతవాహనుడు 2) గౌతమీపుత్ర శాతకర్ణి 3) రాజరాజనరేంద్రుడు 4) మూడో మాధవవర్మ

5. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలిపే శాసనం?

1) పితలోభోరా 2) నాసిక్‌ 3) నానాషూట్‌ 4) జున్నార్‌

1) మంత్రి  2) సైనికాధికారి 3) జిల్లా అధికారి 4) గ్రామ పెద్ద

6. అమరావతి వద్ద బౌద్ధ మత స్తూపం నిర్మించినవారు?

1) వాసిష్టపుత్ర శాతకర్ణి  2) యజ్ఞశ్రీ శాతకర్ణి  3) శ్రీముఖుడు  4) గౌతమీపుత్ర శాతకర్ణి

7. రెండో శాతకర్ణి వివాహం చేసుకున్న నాగానిక ఎవరు?

1) నహపాణుని కుమార్తె 2) మహారథి త్రయిణోకరి కుమార్తె 3) చష్టుముని కుమార్తె 4) రుద్రదమన సోదరి

8. ఆంధ్రా శాతవాహనుల రాజధాని?

1) వేంగి 2) వరంగల్లు  3) ధరణికోట  4) కొండపాడు

9. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యం

1) బాలశ్రీ శాసనం  2) కార్లే శాసనం  3) యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ నాణేలు 4) ది షెరిప్లెస్‌ ఆఫ్‌ ది ఎరిత్రయన్‌ సీ

10. శాతవాహనుల శాసనాల్లో వాడిన భాష

1) ప్రాకృతం  2) సంస్కృతం  3) తెలుగు   4) మరాఠి

11. కళింగ రాజు ఖారవేలుడి శాసనం

1) నాసిక్‌ శాసనం 2) నానాఘాట్‌ శాసనం  3) హాతిగుంఫా శాసనం  4) అమరావతి శాసనం

12. మ్యాకదోని శాసనాన్ని ఎవరు వేయించారు?

1) మూడో పులోమావి  2) నాగానిక  3) శివశ్రీ  4) స్కంధుడు

13. శాతవాహనుల్లో 2వ రాజు ఎవరు

1) రెండో శాతకర్ణి  2) రెండో పులోమావి  3) కన్హ  4) హాలుడు

సమాధానాలు

1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-1, 7-2, 8-3, 9-3, 10-1, 11-3, 12-1, 13-3. 

ర‌చ‌యిత‌: గ‌ద్దె న‌ర‌సింహారావు

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహనుల పరిపాలన

నిరంకుశత్వం లేని సర్వాధికారి!


  చరిత్ర పూర్వయుగంలో దక్షిణాపథాన్ని పాలించిన గొప్ప పాలకుల్లో శాతవాహనులకు విశిష్ట స్థానం ఉంది. మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నం అనంతరం దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినవారు పరిపాలనలో తొలుత మౌర్యులనే అనుసరించారు. సుపరిపాలన, శాంతియుత స్వభావం, పాలనలో వికేంద్రీకరణ, సాంస్కృతిక వైభవం, విదేశీ వాణిజ్యం, పరమత సమాదరణతో తమదైన ప్రత్యేకతను చూపి గొప్ప పాలకులుగా చరిత్రలో నిలిచిపోయారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన శాతవాహనుల పరిపాలన విశేషాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి. 


  శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. మను ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం వీరికి మార్గదర్శకాలు. రాజ్యాధికారం వంశపారంపర్యం. రాజు సర్వాధికారి కానీ నిరంకుశుడు, నిరపేక్షుడు కాదు. రాజనీతి శాస్త్రం, ధర్మశాస్త్రం ఆధారంగా రాజ్య పరిపాలన జరిగేది. అందులో రాజుకు అనేకమంది సహాయపడేవారు.


* విశ్వ అమాత్యులు - రాజుకి ఆంతరంగిక సలహాదారు


* రాజా అమాత్యులు - రాజాజ్ఞలను అమలుపరిచేవారు


* మహా అమాత్యులు - ఆర్థిక మంత్రి


* అమాత్యులు - ఆహారాలకు (రాష్ట్రాలు) అధిపతులు


* భాండాగారికుడు - వస్తు సంచయనాన్ని భద్రపరిచే అధికారి.


* హిరణికుడు - ద్రవ్య ఆదాయం భద్రపరిచే అధికారి.


* మహాసేనాపతి - సైనిక వ్యవహారాలు చూసేవాడు.


* లేఖకుడు - రాజ పత్రాలు, రాజ శాసనాలు రచించేవారు, ఆంతరంగిక కార్యదర్శి.


* నిబంధకారులు - రాజ వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవారు. వీరిని అక్షిపటలకులు అని కూడా అంటారు.


శాతవాహనులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. వాటిని ‘ఆహారాలు’ లేదా ‘విషయాలు’ అంటారు. ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం ఉండేది.

ఉదా: గోవర్ధనాహారం, సోపారాహారం, మామలాహారం


* ఆహారం అధికారి అమాత్యులు (వీరి అధికారం వంశపారంపర్యం కాదు)


* పరిపాలనలో అతి చిన్న విభాగం - గ్రామం


* గ్రామ పాలనాధికారి - గ్రామిణి. ఇతడి అధికారంలో 5 - 10 గ్రామాలుండేవి.


గ్రామంలో అధికారులు: గుమిక - గ్రామ పాలకుడు, మహాతరిక - గ్రామ రక్షకుడు, మహా ఆర్యక - మత వ్యవహారాలు, భాండాగారిక - గ్రామస్థాయిలో గిడ్డంగుల పరిరక్షకుడు, రజ్జగాహక - భూమి సర్వే అధికారి.


* రాజ్యంలోని పట్టణాలను నిగమాలు అంటారు. పట్టణ వ్యవహారాలు చూసే సభలను నిగమ సభలని అంటారు. నిగమ సభ సభ్యులను గహపతులు అని పిలిచేవారు. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనంలో, మెగస్తనీస్‌ ‘ఇండికా’లో పేర్కొన్నారు.


సైనిక వ్యవస్థ: రథ, గజ, తురగ, పదాతి దళాలు ఉండేవి. శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి వివరించే శాసనం ఖారవేలుడు చెక్కించిన హాథిగుంఫా శాసనం. వీరి యుద్ధ తంత్రం గురించి తెలుసుకోవడానికి అమరావతి శిల్పం ఉపయోగపడుతుంది. ముందు భాగంలో పదాతి దళం, పక్క భాగంలో అశ్వ దళం, గజ దళం, వెనుక భాగంలో థానుష్క దళం ఉండేవి. సర్వసైన్యాధ్యక్షుడిగా మహాసేనాపతి ఉండేవాడు. వీరికాలంలో కటకం అంటే సైన్యాగారం. స్కంధావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం.


ఆర్థిక పరిస్థితులు: ప్రజల జీవనాధారం వ్యవసాయం. రాజుకి సొంత భూములుండేవి. దాన్ని రాజకంఖేట అంటారు. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించేవారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. పంటలో రాజు భాగాన్ని (1/6) రాజభాగం/దీయమేయం అని పిలిచేవారు. భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించే అధికారిని రజ్జగాహకుడు అంటారు. పంటలు పండే క్షేత్రాలను సీత క్షేత్రాలుగా వ్యవహరించేవారు. వ్యవసాయ పర్యవేక్షణాధికారి సీతాధ్యక్ష. ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండేది.


* శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తి పనివారు ఉండేవారు. వృత్తి సంఘాలను శ్రేణులు అంటారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్టి. శ్రేణి కట్టుబాట్లను ‘శ్రేణిధర్మ’గా పిలిచేవారు. వృత్తి పనివారు ‘కురుకర’ అనే వృత్తి పన్ను చెల్లించేవారు. ఈ వృత్తి సంఘాలే తర్వాతి కాలంలో కులాలుగా మారాయి.


* స్వదేశీ, విదేశీ వ్యాపారం జరిగేది. పశ్చిమ తీరంలో ఫైఠాన్, తగర, నాసిక్, గోవర్ధన మొదలైనవి ప్రధాన వ్యాపార కేంద్రాలు. తూర్పు తీరంలో విజయపురి, గూడూరు, ధాన్యకటకం, వినుకొండ ప్రధాన వ్యాపార కేంద్రాలు.


* గూడూరు సన్న వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్రాల గనులకు, గుంటుపల్లి రాగి, ఇనుము పరిశ్రమకు, ప్రతిష్టానపురం తగరం, జౌళి పరిశ్రమలకు ప్రసిద్ధి.


* విదేశాలతో వ్యాపారం చేసేవారిని సార్ధవాహులు అనేవారు. వీరు శ్రేణులుగా ఏర్పడి శ్రేష్టి నాయకత్వంలో వ్యాపారం చేసేవారు. వీరి విదేశీ వ్యాపారం గురించి తెలిపే గ్రంథాలు పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ, ది గైడ్‌ టు జాగ్రఫీ. శాతవాహనులు తూర్పు ద్వీపాలతో, రోమ్‌తో వ్యాపారం చేశారు. రోమన్‌ చక్రవర్తుల బంగారు, వెండి నాణేలు లభించిన ప్రాంతాలు - శ్రీకాకుళం జిల్లాలోని సాలిహుండం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నాగార్జునకొండ; కడప జిల్లాలోని అత్తిరాల; విజయవాడ, నెల్లూరు.


ప్రధాన ఎగుమతులు: సుగంధద్రవ్యాలు, రత్నాలు, ముత్యాలు, పట్టువస్త్రాలు. 


ప్రధాన రేవు పట్టణాలు: తూర్పు తీరంలో కోడూరు, మైసోలియా, ఘంటశాల, కోరంగి, పాండిచ్చేరి; పశ్చిమ తీరంలో బారుకచ్చా, సోపారా, కల్యాణి.


నాణేలు: వర్తకంలో అధికభాగం వస్తుమార్పిడి ద్వారానే జరిగేది. సీసం, పొటిన్, రాగి, వెండి, బంగారు నాణేలు ముద్రించారు. వెండి నాణేన్ని కర్ష పణం, బంగారు నాణేన్ని సువర్ణ అనేవారు. ఒక బంగారు నాణెం 35 కర్షపణాలకు సమానం.


సాంఘిక పరిస్థితులు: వర్ణాశ్రమ ధర్మాలు పాటించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో పాటు వృత్తులను బట్టి అనేక ఉపకులాలు ఉండేవి. పితృస్వామిక కుటుంబ వ్యవస్థను అవలంబించారు. సంఘంలో మహిళలకు గౌరవం ఉండేది. స్త్రీలకు ఆరు విధాలైన స్త్రీ ధనం ఉండేది. భర్తల ఉద్యోగాలను అనుసరించి భార్యలు సేనాపత్ని, భోజకి, మహాభోజకి వంటి బిరుదులు పొందేవారు.


మత పరిస్థితులు:  అధికారికంగా వీరిది వైదిక మతం. వైదిక మతోద్ధరణకు కృషి చేశారు. వైదిక మత క్రతువులు నిర్వహించారు. నాసిక్, నానాఘాట్‌ శాసనాలు వైదిక మతం గురించి వివరిస్తాయి. హాలుడి గాథా సప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఈ గ్రంథంలో గౌరి, పశుపతి, రుద్ర, పార్వతి, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంది.


శైవం: పాశుపతాన్ని లకులీశ్వరుడు ప్రారంభించారు. ప్రధాన ఆరాధకుడు పశుపతి. నాటి ప్రాచీన శివాలయం గుడిమల్లం.


వైష్ణవం: వాసుదేవుడు ప్రధాన దైవంగా ఉన్న మతం. వీరి శాసనాలలో వాసుదేవ, కేశవ, వర్ధన, కృష్ణ, గోపాల అనే పేర్లున్నాయి. హాలుడి గ్రంథంలో కృష్ణలీలలు, రాధాకృష్ణుల ప్రణయగాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంది. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు విరివిగా చేశారు.


జైన మతం: శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించాడు. కరీంనగర్‌ జిల్లాలోని మునుల గుట్ట, ఏలూరు సమీపంలోని గుంటుపల్లి గుహలు జైన స్థావరాలుగా వెలుగొందాయి. ప్రముఖ జైనాచార్యుడు పద్మనంది భట్టారకుడు గుంతకల్లు సమీపంలో నివసించేవాడు. ఇతడిని కొండ కుందాచార్యులు అని కూడా అంటారు.


బౌద్ధ మతం:  శాతవాహనులు వైదిక మతస్థులైనప్పటికీ బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మతం బౌద్ధమే. వర్తకులు, స్త్రీలు, వృత్తి పనివారు ఈ మతాన్ని ఆదరించారు. ఆంధ్రాలో తొలి గొప్ప బౌద్ధ భిక్షువు మహాదేవ భిక్షువు. వీరి కాలంలో చైత్యకవాదం అభివృద్ధి చెందింది. చైత్యాన్ని పూజించడం ప్రధాన ఆచారం. ఆంధ్రాలో ప్రచారంలో ఉన్న బౌద్ధ మత శాఖ- మహాయానం/మహాసాంఘికం. దీని ప్రధాన కేంద్రం ధాన్యకటకం. మహాయాన బౌద్ధమతాన్ని విస్తరించినవారు ఆచార్య నాగార్జునుడు.

* రెండో శాతవాహన రాజైన కృష్ణుడు బౌద్ధభిక్షువుల అవసరాలను చూసేందుకు నాసిక్‌లో ఒక మహామంత్రిని నియమించారు. హాలుడి గాథాసప్తశతిలో బుద్ధుని పాదారాధన ఉంది.

* గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ భయదనిభ తెగకు చెందిన భిక్షువులకు ఒక విహారం నిర్మించారు. భూదానాలు చేశారు. రెండో పులోమావి మహాసాంఘిక బౌద్ధ భిక్షువుల పోషణార్థం ఒక గ్రామం దానం చేశారు. బౌద్ధమత నిర్మాణాలైన చైత్యాలు, స్తూపాలు, ఆరామాలు, విహారాలు నిర్మించారు.


చైత్యాలు: ఇవి బౌద్ధమత దేవాలయాలు. చందవరం, గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, కార్లే, కవ్హేరి, భజ, నాసిక్‌లో ఉన్నాయి.


స్తూపాలు: ఇవి మూడు రకాలుగా ఉండేవి.


1) ధాతు గర్భితాలు: బుద్ధుడి అవశేషాలపై నిర్మించినవి. ఉదా: అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు.


2) పారిభోజకాలు: బౌద్ధభిక్షువుల అస్థికలపై నిర్మించినవి.


3) ఉద్దేశిక స్తూపాలు: బుద్ధుడి ధాతువు లేకుండా నిర్మించినవి.

* విహారం అంటే విశ్రాంతి మందిరం. ఆరామం అంటే విద్యాలయం.


ఆచార్య నాగార్జునుడు: ఈయన బిరుదులు - ఇండియన్‌ ఐన్‌స్టీన్, ఇండియన్‌ మార్టిన్‌ లూథర్, రెండో బుద్ధుడు, మాధ్యమిక వాద ప్రవక్త, గతితార్కికవాద ప్రవక్త.


గ్రంథాలు: సుహృల్లేఖ, మాధ్యమిక శాస్త్రం, ఉపదేశం, ద్వాదశముఖ శాస్త్రం, రత్నావళి, మహాయాన భవబేధశాస్త్రం.

* శ్రీపర్వతం (నాగార్జునకొండ) వద్ద నివసించేవారు. నాలుగో బౌద్ధ సంగీతికి హాజరయ్యారు. ఇతడి శూన్యవాదం జగత్‌గురువు ఆదిశంకరాచార్య మాయావాదానికి మూలం.


సాహిత్యం: ప్రాకృత సాహిత్యం ఉండేది. హాలుడి కాలం సాహిత్యానికి స్వర్ణయుగం. శాసనాలు ఎక్కువగా ప్రాకృత భాషలోనే ఉండేవి.


ప్రాకృత కవులు, కవయిత్రిలు: చుల్లవా, అమరరాజ, మకరందసేన, శ్రీరాజ, రేవ, మాధవి, ఆంధ్రలక్ష్మి.


ప్రాకృత గ్రంథాలు: గుణాఢ్యుడు - బృహత్కథ, సోమదేవసూరి - కథాసరిత్సాగరం, క్షేమేంద్రుడు - బృహత్కథామంజరి, బుద్ధస్వామి - బృహత్కధాశ్లోక సంగ్రహం, ఉద్యోధనుడు - కువలయమాల.


సంస్కృత సాహిత్యం: సంస్కృతం రెండో అధికార భాష. మహాయాన బౌద్ధమత కాలంలో సంస్కృతం ఆదరణ పొందింది. శకరాజు రుద్రదాముడు మొదటి సంస్కృత శాసనం వేయించారు.


ప్రముఖ సంస్కృత గ్రంథాలు: శర్వవర్మ- కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు- కామసూత్రాలు.


ప్రధాన భాషలు: తెలుగు, కన్నడం, సంస్కృతం.


* అజంతాలోని 9, 10 గుహాలయాల్లోని వర్ణచిత్రాలు శాతవాహనుల కాలం నాటివి.


మాదిరి ప్రశ్నలు


1. శాతవాహనుల కాలం నాటి నిగమసభను ప్రస్తావించిన శాసనం?

1) నానాఘాట్‌ శాసనం 2) ఎర్రగుడి శాసనం 3) భట్టిప్రోలు శాసనం 4) అమరావతి శాసనం


2. శాతవాహనుల కాలం నాటి మ్యాకదోని శాసనం ప్రకారం గుమిక/గుల్మిక అంటే?

1) గ్రామపెద్ద 2) బానిస 3) వాణిజ్య సుంకం 4) భూస్వామ్య వ్యవస్థ


3. శాతవాహనుల సామాజిక, ఆర్థిక విధానాల్లో సరికానిది

1) శాతవాహనులు హిందూ, బౌద్ధ మతాలను ఆదరించారు.

2) చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉండేది.

3) స్త్రీలు తక్కువ స్థానం పొందారు.

4) నౌకా వాణిజ్యం అభివృద్ధి చేశారు.


4. శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించేవి?

1) గ్రామాలు  2) నగరాలు  3) ప్రాదేశికాలు  4) మత విషయాలు


5. శాతవాహనుల కాలంలో అమాత్య అంటే?

1) మంత్రి  2) సైనికాధికారి 3) జిల్లా అధికారి 4) గ్రామ పెద్ద


6. శాతవాహనుల రాజమతం

1) జైనం  2) బౌద్ధం  3) వైదికం 4) వైష్ణవం


7. శాతవాహనుల కాలంలో ద్రవ్య ఆదాయం భద్రపరిచే వ్యక్తిని ఏమంటారు?

1) భాండాగారికుడు  2) హిరణికుడు  3) లేఖికుడు  4) నిబంధకారులు

సమాధానాలు: 1-3, 2-1, 3-3, 4-2, 5-3, 6-3, 7-2.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాతవాహన అనంతర యుగం 

 ఆంధ్ర దేశాన్ని పాలించిన తొలి క్షత్రియులు ఇక్ష్వాకులు. మొదటి శాంతమూలుడు (వాశిష్ఠీ శ్రీ క్షాంతామూలుడు) ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. వీరి రాజధాని విజయపురి. అధికార భాష ప్రాకృతం. అధికార చిహ్నం సింహం. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, విష్ణుకుండినుల రాజవంశాలు పాలించాయి. వీరి కాలంలో ఆంధ్రదేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. 



ఇక్ష్వాకులు (క్రీ.శ. 225 - 300) 

పురాణాల్లో ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నారు. వాయుపురాణం ప్రకారం అయోధ్యను పాలించిన ఇక్ష్వాకుడి కుమారుడు వికుక్షి తండ్రి తర్వాత పాలకుడయ్యాడు. విష్ణుపురాణంలో ఇక్ష్వాకులను బుద్ధుడి వారసులుగా పేర్కొన్నారు. బ్యూలర్, రాప్సన్ లాంటి చరిత్రకారులు ఇక్ష్వాకులు అయోధ్య ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చారని ప్రకటించారు. కానీ, జైన మత గ్రంథమైన ధర్మామృతం ఇక్ష్వాక వంశస్థుడైన యశోధనుడు వేంగి దేశానికి వచ్చి ప్రతీపాలపురంను నిర్మించినట్లు వివరిస్తోంది. వీర పురుషదత్తుడి 'నాగార్జున కొండ శాసనం' ఇక్ష్వాకులను శాక్యముని వంశస్థులని పేర్కొంటుంది. కాల్డ్‌వెల్ పండితుడు మాత్రం కృష్ణానదీ తీరంలో ఇక్షు (చెరకు) చిహ్నాన్ని ఆరాధించే స్థానిక గణరాజులే ఇక్ష్వాకులు అని పేర్కొన్నాడు. ఇక్ష్వాకులు కన్నడవాసులని వోగెల్ పండితుడు; తమిళ ప్రాంతవాసులని గోపాలాచారి పేర్కొన్నారు. పురాణాలు ఏడుగురు ఇక్ష్వాక రాజులను గురించి పేర్కొంటుండగా, శాసనాలు మాత్రం నలుగురి రాజుల గురించి ప్రస్తావిస్తున్నాయి.
 

రాజకీయ చరిత్ర

ఆంధ్రను పాలించిన తొలి క్షత్రియులు ఇక్ష్వాకులు. పల్లవ రాజులు వీరకూర్చవర్మ మంచికల్లు శాసనం, శివస్కంధవర్మ మైదవోలు శాసనాలు పల్లవుల చేతిలో ఇక్ష్వాకులు ఓడిపోయినట్లు పేర్కొంటున్నాయి. చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావిని ఓడించి మొదటి శాంతమూలుడు / వాశిష్ఠీపుత్ర శ్రీ క్షాంతామూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. రామిరెడ్డి పల్లి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాలు ఇక్ష్వాకుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. అధికార భాష ప్రాకృతం. అధికార చిహ్నం సింహం.
 


మొదటి శాంతమూలుడు

ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. చివరి శాతవాహన రాజు మూడో పులోమావిని ఓడించి రాజ్యస్థాపన చేశాడు. రెంటాల, కేశనపల్లి శాసనాల ప్రకారం ఇతడు అశ్వమేధ, వాజపేయాది క్రతువులను నిర్వహించాడు. నాగార్జున కొండ వద్ద అశ్వమేధయాగం వేదికలు బయల్పడ్డాయి. ఇతడు మహారాజ బిరుదు ధరించాడు. లక్ష నాగళ్లతో భూమిని దున్ని శతసహస్ర హాలక బిరుదును కూడా పొందాడు. బంగారు నాణేలు, లక్షలాది గోవులను దానం చేశాడు. ఇతడి భార్య మాఠరీ దేవి. సోదరీమణులు హర్మ్యశ్రీ, శాంతశ్రీ. కుమారుడు వీరపురుషదత్తుడు, కుమార్తె అడవి శాంతిశ్రీ. తన కుమార్తెను స్కంధ విశాఖుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఉజ్జయిని శక రాకుమార్తె రుద్రభట్టారికను తనకోడలిగా చేసుకున్నాడు. శాంతమూలుడు వైదిక మతస్తుడు. కార్తికేయుడి ఆరాధకుడు. నాగార్జునకొండ / శ్రీ పర్వతం వద్ద కార్తికేయ ఆలయం నిర్మించాడు. 
 


వీరపురుషదత్తుడు

శాంతమూలుడి తర్వాత అతడి కుమారుడు వీరపురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు మొదట శైవమతాన్ని అనుసరించినప్పటికీ ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతడి కాలం దక్షిణ దేశంలో బౌద్ధమతానికి స్వర్ణయుగంగా పేరొందింది. భావ వివేకుడు అనే పండితుడు విజయపురి వద్ద ఒక విహారాన్ని నిర్మించినట్లు సీయూకీ గ్రంథం తెలుపుతోంది. వీరపురుషదత్తుడు శివలింగాన్ని తొక్కుతున్నట్లుగా ఉన్న మాంథాత శిల్పం (పుణ్యశిల) కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో బయల్పడింది. మేనరికపు వివాహాలను ప్రారంభించింది వీరపురుషదత్తుడే. నాగార్జునకొండలో పుష్పభద్రస్వామి, అష్టభుజ స్వామి, హారితీ దేవాలయాలను నిర్మించాడు. ఇతడి విజయాలు, ఆరోగ్యం కోసం శాంతిశ్రీ అనేక దానాలు చేసింది. ఇతడి 6వ పాలనా సంవత్సరంలో నాగార్జునకొండ మహాచైత్యాన్ని పునరుద్ధరించి ఆయక స్తంభాలు నిలిపారు. రాజ భాండాగారికుడు 'బోధిశర్మ' మేనకోడలైన ఉపాసికా బోధిశ్రీ శ్రీ పర్వతంలో చుళధమ్మగిరిపై చైత్యాన్ని నిర్మించింది. వీరపురుషదత్తుడి భార్యలు భట్టిమహాదేవి, రుద్ర భట్టారిక, బాపిశ్రీ, షష్ఠిశ్రీ (బాపిసిరి, షష్ఠిసిరి). ఇతడి కుమార్తె పేరు కొడబలశ్రీ / కొండబాలశ్రీ. అల్లుడు శివస్కంధ శాతకర్ణి.
 

ఎహూవల శాంతమూలుడు/ రెండో శాంతామూలుడు

వీరపురుషదత్తుడు, భట్టిమహాదేవిల సంతానం రెండో శాంతమూలుడు. ఇతడు వమ్మభట్టాదేవి అనే క్షాత్రప రాకుమారిని వివాహం చేసుకున్నాడు. ఇతడి సోదరి పేరు కొండ బాలశ్రీ/ కొడబలశ్రీ. ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన పాలకుడు ఇతడే (భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించింది రుద్రదాముడు). ఇతడి సేనాని ఎలిసిరి కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. కొండ బాలశ్రీ మహీశాసకులకు విహారాన్ని నిర్మించింది. కాగా రెండో శాంతమూలుడు మహాసేన దేవాలయాన్ని నిర్మించాడు.
 


రుద్రపురుషదత్తుడు

చివరి ఇక్ష్వాక పాలకుడు రుద్రపురుషదత్తుడు. పల్లవ రాజు సింహవర్మ చేతిలో ఓడిన ఇక్ష్వాక రాజు ఇతడే. తనను తాను శివభక్తుడిగా ప్రకటించుకున్నాడు. నాగార్జునకొండ, గురజాలల్లో ఇతడి శాసనాలు లభించాయి.
 

ఇక్ష్వాకుల సాంస్కృతిక సేవ

వీరి కాలంలో రాష్ట్ర పాలకులను మహాతలవర అని పిలిచేవారు. మాతృమూర్తుల పేర్లను తమ పేర్ల ముందు పెట్టుకునేవారు. బౌద్ధమత నిర్మాణాలు విరివిగా జరిగి స్వర్ణయుగంగా పేరొందింది. ఉపాసికా బోధిశ్రీ బౌద్ధమత ప్రచారకులకు ధన సహాయం చేసి కాశ్మీర్‌తోపాటు చైనాలో బౌద్ధాన్ని ప్రచారం చేయించింది. వీరి కాలం నాటి మహాసాంఘికులను అంధకులు అనేవారు. శాతవాహనుల్లా వీరు కూడా తమ పేర్ల ముందు మాతృమూర్తుల పేర్లను ఉంచుకున్నారు. దక్షిణ భారతదేశంలో హిందూదేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించినవారు ఇక్ష్వాకులే.  

  దేశంలో ఏర్పాటు చేసిన తొలి ద్వీపపు మ్యూజియం నాగార్జునకొండ మ్యూజియం వీరి కాలానికి చెందింది. నాటి వర్తక బృందాలను నేగమాలు అనేవారు. గ్రామ సముదాయాలను గ్రామపంచిక అనేవారు. సువర్ణం, ఫణం, దీనార్, మారకం లాంటి నాణేలను వినియోగించారు. శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించింది. కొండబాలశ్రీ విహారాన్ని నిర్మించింది. శ్రీ శాంతమూలుడి భార్య మాఠరీ దేవి అమరావతిలో నివసించే బౌద్ధ బిక్షువులకు నెలరోజుల పాటు అన్నదాన వ్రతం చేపట్టింది. భారతదేశంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున కొండ విశ్వవిద్యాలయం. వీర పురుషుదత్తుడి కాలంలో ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి రెండో నాగార్జునుడు. ఈ విశ్వవిద్యాలయం విజయపురి దక్షిణాది బుద్ధగయగా పేరొందింది. మోటుపల్లి, ఘంటశాల నాటి ప్రధాన ఓడరేవులు. నాటి సమాజంలో సతీసహగమనం ఉన్నట్లు ఆధారాలు లభించాయి.


బృహత్పలాయనులు (క్రీ.శ. 300 - 325)

ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న బృహత్పలాయనులు వారి తర్వాత కృష్ణానది ఉత్తరభాగంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరిని శకులుగా భావిస్తున్నారు. వీరి చరిత్రకు గల ఒకే ఒక ఆధారం కొండముది తామ్ర శాసనం. దక్షిణ భారతదేశంలో తొలి తామ్ర శాసనం కొండముది త్రామ శాసనం. దీన్ని వేయించింది జయవర్మ. గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో ఈ శాసనం లభించింది. జయవర్మ బ్రాహ్మణ మతస్థుడు. వీరి రాజధాని కోడూరు (కూడూరు). జయవర్మ ఇష్ట దైవం మహేశ్వరుడు. ఇతడు కృష్ణా జిల్లాలోని పంతూర (పాంటూరు) గ్రామాన్ని ఎనిమిది మంది బ్రాహ్మణులకు బ్రహ్మధేయంగా దానం చేశాడు. మహేశ్వర పాద పరిగ్రహీత ఇతడి బిరుదు. కొండముది తామ్ర శాసనాన్ని ప్రాకృత భాషలో వేశారు. దీనిలో స్కందావరాలు, కటకాలు; పల్లవుల బ్రాహ్మణ మత విజృంభన, బౌద్ధమత క్షీణతల గురించి వివరణ ఉంది. బృహత్పలాయనుల గురించి తన శాసనాల్లో పేర్కొన్న ఇక్ష్వాక రాజు రుద్రపురుషదత్తుడు. జయవర్మ సేనాధిపతి పేరు బాపమహావర్మ. జయవర్మ కొండముది తామ్ర శాసనాన్ని తన పదో పాలనా సంవత్సరంలో ప్రాకృత భాషలో వేయించాడు. కానీ శాసన ముద్రిక మాత్రం సంస్కృత భాషలో ఉంది. నాటి కుడూరను నేటి కోడూరు అని బి.కృష్ణారావు పేర్కొనగా, గూడూరు అని పేర్కొంది జోవోదూబ్రే. బృహత్పలాయనులను ఓడించి శాలంకాయనులు వారి రాజ్యాన్ని ఆక్రమించారు. వీరి రాజభాష ప్రాకృతం.
 

శాలంకాయనులు (క్రీ.శ. 300 - 440)

శాలంకాయనులను బప్ప భట్టారక పాదభక్తులుగా పిలిచేవారు. విజయదేవవర్మ శాలంకాయన రాజ్య స్థాపకుడు. వీరి రాజధాని వేంగి. రాజభాష సంస్కృతం. రాజలాంఛనం వృషభం. వీరి ఆరాధ్య దైవం చిత్రరథ స్వామి. శాలంకాయనుల చరిత్రకు మూడు ప్రాకృత భాషా శాసనాలు, ఆరు సంస్కృత భాషా శాసనాలు, ఒక ప్రాకృత, సంస్కృత మిశ్రమ భాషా శాసనం మొత్తంగా 10 శాసనాలు ఆధారం. శాలంకాయన అంటే నంది అని అర్థం. టాలమీ తన జాగ్రఫీ గ్రంథంలో బెన్‌గురాన్ (వేంగి) దగ్గరలో సలెకినాయ్ (శాలంకాయనులు) ఉన్నట్లు పేర్కొన్నాడు. విజయదేవ వర్మ తర్వాత పాలించిన శాలంకాయన రాజు హస్తివర్మ. సముద్రగుప్తుడి దక్షిణ భారతదేశ దండయాత్రలో ఓడిపోయిన (వేంగి) శాలంకాయన రాజు ఇతడే. హస్తివర్మ ఆస్థానంలో భావ వివేకుడు, బుద్ధదత్తుడు అనే పండితులున్నట్లు తెలుస్తోంది. భావ వివేకుడి పేరుతోనే భావయపట్ల (బాపట్ల) వెలసింది. బర్మాకు చెందిన బుద్ధదత్తుడిని హస్తివర్మ సన్మానించాడు. ఏలూరు సమీపంలో చిత్ర రథస్వామి ఆలయాన్ని హస్తివర్మ నిర్మించాడు. బర్మా గ్రంథాల్లో శాలంకాయన రాజ్యాన్ని సాన్-లాన్-క్రోన్ అని ప్రస్తావించారు. శాలంకాయనుల కాలంలోనే దిజ్ఞాగుడు వేంగిపురాన్ని సందర్శించాడు.

   ఏలూరు ప్రాకృత శాసనం ప్రకారం రాజ్య స్థాపకుడు విజయదేవవర్మ. కానుకొల్లు, గుంటుపల్లి శాసనల ప్రకారం శాలంకాయన స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది హస్తివర్మ. శాసనాల్లో హస్తివర్మను నానా ప్రకార విజయస్య, ధర్మమహారాజ లాంటి బిరుదులతో ప్రస్తావించారు. హస్తివర్మ కుమారుడు నందివర్మ. ఇతడే కానుకొల్లు శాసనం వేయించాడు. నందివర్మకు గోసహస్రప్రదాయి, వివిధ ధర్మ ప్రధానస్య అనే బిరుదులు ఉన్నాయి. నంది వర్మ మనుమడు, రెండో హస్తివర్మ కుమారుడు అయిన ఖండపోత్త ఆయురారోగ్యాల కోసం బ్రాహ్మణులకు దానం చేశాడు. మొదటి నందివర్మను ఓడించి అతడి సోదరుడు రెండో దేవవర్మ సింహాసనం ఆక్రమించాడు. రెండో దేవవర్మను ఓడించి అఛండవర్మ రాజ్యానికి వచ్చినట్లు అతడి ధారికాటూరి శాసనం తెలుపుతోంది. అచంఢవర్మ తర్వాత అతడి సోదరుడు రెండో హస్తివర్మ రాజ్యానికి వచ్చినట్లు అతడి పెనుగొండ శాసనం తెలియజేస్తోంది. (నంది వర్మను ఓడించిన దేవవర్మ అశ్వమేధయాగం చేసి రెండో విజయదేవవర్మ పేరుతో రాజ్యపాలన చేశాడు). తర్వాత రాజ్యానికి వచ్చిన విజయనంది వర్మ/ రెండో నందివర్మ ఎక్కువ శాసనాలు వేయించిన శాలంకాయన రాజుగా పేరొందాడు. చివరి శాలంకాయన రాజు విజయస్కంధ వర్మ.
   గుంటుపల్లిలోని బౌద్ధ క్షేత్రానికి దానధర్మాలు చేసింది రెండో నందివర్మ. ఆంధ్రదేశంలో విష్ణుదేవాలయాలు ఉన్నట్లు తెలిపే తొలి శాసనం పెదవేగి శాసనం. దీన్ని రెండో నందివర్మ వేయించాడు. విజయదేవవర్మ వేయించిన ఏలూరు శాసనంలో మున్యద అనే రాజకీయోద్యోగి పేరు ప్రస్తావించారు. నాటి ప్రముఖ రేవుపట్నం ప్రాలూర. ప్రాలూరలోని విష్ణుగృహస్వామి ఆలయానికి విజయనందివర్మ/ రెండో నందివర్మ గ్రామాలను దానం చేశాడు. కొల్లేరు, పెదవేగి శాసనాలను రెండో నందివర్మ; కంతేరు శాసనాన్ని విజయస్కంధవర్మ వేయించారు. వీరి సమకాలీనుడైన దిజ్ఞాగుడు శుద్ధ ఆర్కవిద్యకు పునాది వేశాడు. చంఢవర్మ బిరుదు ప్రతాపోనత సామంతస్య, రెండో నందివర్మ బిరుదు పరమభాగవతుడు కాగా విజయదేవవర్మ బిరుదు పరమ మహేశ్వరుడు. బప్ప భట్టారకులు అంటే తండ్రిని దైవంగా భావించే వారని అర్థం.

 

ఆనంద గోత్రజులు/ ఆనందగోత్రికులు
 

   త్రికూట పర్వతాధిపతులుగా పేర్కొన్నవారు ఆనందగోత్రికులు. రాజ్యస్థాపకుడు కందారరాజు. వీరి రాజధాని కందారపురం (గుంటూరు జిల్లా). రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం వృషభం. కందార రాజు చేజర్ల శాసనం వేయించాడు. వీరిలో గొప్ప పాలకుడు దామోదర వర్మ. ఇతడు మట్టిపాడు శాసనం వేయించాడు. అందులో ఇతడి బిరుదు హిరణ్యగర్భోద్భవ. బౌద్ధాలయంగా ఉన్న చేజర్లలో కపోతేశ్వరాలయం నిర్మించింది దామోదర వర్మ. ఈ దేవాలయంలో శిబి చక్రవర్తి కథ శిల్పంగా మలిచి ఉంది. తర్వాతి పాలకుడైన అత్తివర్మ గోరంట్ల తామ్రశాసనం వేయించాడు. ఇతడిని కూడా హిరణ్యగర్భోద్భవ అనే బిరుదుతోనే ప్రస్తావించారు. శాసనాల్లో ఆనందగోత్రజులు- కపిధ్వజులు, త్రికూట పర్వతాధిపతులమని పేర్కొన్నారు. త్రికూట పర్వతం అంటే నేటి కోటప్పకొండ. కందారపురం అనేది నేటి కంతేరు. ధాన్యకటక యుద్ధంలో ఆంధ్రరాజు శాలంకాయన నందివర్మను ఓడించింది దామోదర వర్మ. మట్టిపాడు శాసనం ప్రాకృత, సంస్కృత భాషల్లో ఉండగా, గోరంట్ల తామ్ర శాసనం పూర్తిగా సంస్కృతంలో ఉంది. అత్తివర్మ తాడికొండలో కొంతభూమిని, అంతకూర గ్రామాన్ని కోటిశర్మ అనే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాడు. కంగూర గ్రామాన్ని దామోదర వర్మ బ్రాహ్మణులకు దానం చేశాడు. మార్కండేయ పురాణంలో ఆనందగోత్రజులను గోలాంగుల వంశస్థులుగా పేర్కొన్నారు. దామోదర వర్మ బిరుదు సమ్యక్సం బుద్ధస్య పదాను దాతస్య. అత్తివర్మ వంకేశ్వర శంభువును ఆరాధించాడు.
 


విష్ణుకుండినులు (క్రీ.శ. 440 - 616)

తెలుగునేలపై సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని పాలించిన మొదటి వంశీయులు విష్ణుకుండినులు. వీరి జన్మస్థలం వినుకొండ (గుంటూరు జిల్లా) అని కీల్‌హారన్ పండితుడు పేర్కొన్నాడు. వీరి చరిత్రకు 10 శాసనాలు ఆధారంగా లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి: తుమ్మలగూడెం శాసనం - గోవిందవర్మ; ఈపూరు, ఖానాపూర్, పొలమూరు తామ్ర శాసనాలు; వేల్పూరు శిలాశాసనాలు - మాధవవర్మ; రామతీర్థం శాసనం - ఇంద్రవర్మ; చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్ర భట్టారక వర్మ. వీరి కాలనిర్ణయానికి ప్రధాన ఆధార శాసనం ఇంద్రపాలనగర శాసనం. దీన్ని వేయించింది విక్రమేంద్ర భట్టారక వర్మ. వీరి నాణేలపై సింహం, శంఖం ముద్రలు; శాసనాలపై లక్ష్మీ, శ్రీవత్సాల ముద్రలు ఉన్నాయి. విష్ణుకుండినులు బ్రాహ్మణులు. వీరి రాజధానులు వరుసగా వినుకొండ, కీసరగుట్ట, దెందులూరు (వేంగి), విజయవాడ (కనకపురి). మూలపురుషుడు ఇంద్రవర్మ. 
   
విష్ణుకుండిన వంశ స్థాపకుడు మొదటి మాధవవర్మ. ఇతడి తొలి రాజధాని వినుకొండ. తర్వాత కీసరగుట్ట (కరీంనగర్)కు మార్చాడు. ఇతడు 11 అశ్వమేధ యాగాలు చేసినట్లు పేర్కొంటారు. వాకాటక రాకుమార్తెను పెండ్లాడిన తొలి విష్ణుకుండిన రాజు మాధవ వర్మే. ఇతడు వేల్పూరు శిలాశాసనాన్ని వేయించాడు. పరమ బ్రాహ్మన్య, పరమేష్ఠి బిరుదులు. విష్ణుకుండినుల్లో తొలి సుప్రసిద్ధ రాజు గోవిందవర్మ. పల్లవులను ఓడించి గుండ్లకమ్మ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. శాస్త్రాల్లో పండితుడు. బౌద్ధమతాభిమానియైన వైష్ణవుడు. ఇతడి రాణి పరమభట్టారికా మహాదేవి వేల్పూరులో బౌద్ధవిహారాన్ని నిర్మించింది. గోవిందవర్మ వేల్పూరు బౌద్ధ విహారానికి పెణుకుపర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. తుమ్మల గూడెం శాసనం వేయించాడు. బౌద్ధాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు గోవిందవర్మ.
 
  విష్ణుకుండిన రాజుల్లో గొప్పవాడు రెండో మాధవవర్మ. ఇతడు అశ్వమేధ, రాజసూయ, నరమేధ యాగాలు చేశాడు. త్రికూటమలయాధిపతి, జనాశ్రయ బిరుదులు పొందాడు. రాజధానిని అమరపురం నుంచి దెందులూరు (వేంగి)కు మార్చాడు. ఉండవల్లి గుహల్లోని బుద్ధుడి శిల్పాన్ని శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం(అనంత సాయి)గా మార్చాడు. ఉండవల్లి గుహలపై పూర్ణకుంభాన్ని చెక్కించాడు (రాష్ట్ర అధికార చిహ్నం). ఇతడి కాలంలో అమరావతిలో బౌద్ధ, శైవ సంఘర్షణలు జరిగినట్లు, అమరావతిని అమరలింగేశ్వరస్వామి ఆలయంగా మార్చినట్లు ఫాహియాన్ పేర్కొన్నాడు. తర్వాత పాలించిన మూడో మాధవర్మ న్యాయసింహుడు, అవసిత వివిధ దివ్య లాంటి బిరుదులు పొందాడు. తన కుమారుడికే ఉరి శిక్ష విధించినట్లు దగ్గుపల్లి దుగ్గన రచించిన నచికేతోపాఖ్యానం గ్రంథం వివరిస్తోంది. నందిమల్లయ్య, ఘంట సింగన రచించిన ప్రబోధ చంద్రోదయం గ్రంథం ప్రకారం ఇతడి కాలంలో విజయదుర్గ కనకవర్షం కురిపించిందని, కాబట్టి విజయవాడను కనకపువాడగా పిలిచారని తెలుస్తుంది. చివరి విష్ణుకుండిన రాజు విక్రమేంద్రవర్మ/ రెండో విక్రమేంద్రుడు. ఇతడికే మంచన భట్టారకుడు అనే నామాంతరం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు సకల భువన రక్షాభరణై కాశ్రయ అనే బిరుదు పొందాడు. ఇతడు వేయించిన చిక్కుళ్ల తామ్ర శాసనంలోనే విజయోత్సవ సంవత్సరంబుల్ అనే తొలి తెలుగు వాక్యం ఉంది.
యుగ విశేషాలు
   
రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. హస్తికోశ, వీరకోశ లాంటి అధికారులను నియమించారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారి కొండలను తొలిచి ఆలయాలను నిర్మించింది విష్ణుకుండినులే. ఉండవల్లి గుహల్లో అనంతపద్మనాభ స్వామి ఆలయం, మొగల్ రాజపురంలో అర్ధనారీశ్వర మూర్తి గుహలు, విజయవాడలోని అక్కన్న, మాదన్న గుహలు; నెల్లూరులోని భైరవకొండ గుహలు... వీరి కాలంలో నిర్మించినవే. చివరి పాలకుడైన ఇంద్ర భట్టారక వర్మ/ మంచన భట్టారక వర్మ/రెండో విక్రమేంద్ర వర్మ కోస్తాలో ఘటికలు స్థాపించినట్లు ఉదంకుని సామవేద గ్రంథం తెలుపుతోంది. రెండో పులకేశి చేతిలో కునాల/ కొల్లేరు యుద్ధంలో ఓడిన పాలకుడు ఇంద్రభట్టారక వర్మ. భైరవకొండలో 8 గుహాలయాలున్నాయి. విజయవాడలో నాలుగు అంతస్థుల దేవాలయాన్ని నిర్మించారు. వీరు నిర్మించిన లింగాలమెట్టు బౌద్ధ స్తూపం (గోవింద వర్మ) నమూనాలోనే బోరోబుదురు (జావా) బౌద్ధస్తూపం నిర్మించారు. ఆంధ్రదేశంలోని తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథంగా పేరొందిన జనాశ్రయ చంధోవిచ్ఛిత్తిని గణస్వామి వీరికాలంలోనే రచించాడు. రెండో విక్రమేంద్ర వర్మ రాజధానిని దెందులూరు నుంచి అమరపురానికి మార్చినట్లు తెలుస్తోంది. తూర్పుచాళుక్యులు, రణదుర్జయులు లాంటి వారి దాడులతో విష్ణుకుండిన వంశం అంతమైంది.
 
  (రణ దుర్జయులు పిఠాపురం రాజధానిగా పాలించారు. రణదుర్జయుడు, విక్రమేంద్రుడు, పృథ్వీ మహారాజులు పాలించారు. గొప్పవాడు పృథ్వీ మహారాజు. ఇతడు రెండో విక్రమేంద్రవర్మను వధించాడు. కానీ, రెండో పులకేసి చేతిలో కునాల యుద్ధంలో మరణించాడు.)

ముఖ్యాంశాలు

* విష్ణుకుండిన రాజులు ధర్మవిజయ బిరుదులను పొందారు. (పల్లవులు ధర్మమహారాజు బిరుదు పొందారు)

* బృహత్పలాయనులు రాష్ట్రాలను ఆహారములు అని, దాని అధిపతిని వ్యాపృతుడు అని పిలిచేవారు.

* శాలంకాయనుల కాలంలో గ్రామాధికారిని ముతుడ అని పిలిచేవారు.

* ఆంధ్రాధిపతి గజ ఘటములను సంగ్రహించిన పాలకుడిగా కందారరాజు పేరొందాడు.

* పల్లవులు తమ రాజ్యాన్ని పథములు, భోగాలు, మాడబములుగా విభజించారు.

* పల్లవుల కాలం నాటి స్థానికోద్యోగులను గుమిక అరణ్యాధికృత అని పిలిచేవారు.

* సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక రాజు ప్రతినిధిని గుల్మికుడు అనేవారు.

* రాజశాసనాలు బహిరంగపరిచే వాడిని శాసన సమరాంతకుడు అని, శాసనాలను అమలుపరిచే అధికారిని మహాబలాధికృత, దండనేత్ర అని పిలిచేవారు.

* వృత్తిపన్నుల ప్రస్తావన ఉన్న శాసనం - విళవట్టి శాసనం

* వేల్పూరు వద్ద గణపతి ప్రతిష్ఠ చేసిన రాజు - మొదటి మాధవవర్మ (వేల్పూరు శాసనం)

* ఇటీవల కర్నూలు జిల్లాలోని వీరాపురంలో ఇక్ష్వాకుల కాలంనాటి దేవాలయం బయల్పడింది.

* భూత గ్రాహక స్వామి/ యముడు ఆలయం వేల్పూరులో ఉంది.

* గౌతమ బుద్ధుడు ధాన్యకటక ప్రాంతంలో కాలచక్ర తంత్రాన్ని బోధించాడు.

* వజ్రయాన సిద్ధాంతకర్త సిద్ధ నాగార్జునుడు ఆంధ్రదేశవాసి అని రామిరెడ్డి పల్లెశాసనం పేర్కొంది.

* శాసనాల్లో సంస్కృతాన్ని వాడటం ప్రారంభించింది ఇక్ష్వాకులు.

* తెలుగు భాషా పరిణామాన్ని వివరిస్తున్న పొట్లదుర్తిని రేనాటి చోఢరాజు పుణ్యకుమారుడు వేయించాడు.

* భూస్పర్శ ముద్రలతో బుద్ధ ప్రతిమలు బొజ్జనకొండ (విశాఖపట్నం జిల్లా) వద్ద లభించాయి.

* మొగల్రాజపురంలో 5 గుహలున్నాయి. 4వ గుహలో దుర్గ, 5వ గుహలో శివ తాండవం/ నటరాజ/ అర్ధనారీశ్వర మూర్తి విగ్రహాలున్నాయి.

* ఉండవల్లి గుహలు 3. మధ్య గుహలో నాలుగు అంతస్థులతో అనంతసాయి గుడి(బుద్ధుడి శిల్పాన్ని శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహంగా మలిచారు.) ఉంది.

* గుంటుపల్లి గుహాలయం సింహం ప్రతిరూపంతో ఉంటుంది. గుహ ముఖంపై ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఉంటుంది.

* నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో 8 గుహలున్నాయి. వీటిలో రేనాటిచోడులు, విష్ణుకుండిన కాలం నాటి శైవమతానికి సంబంధించిన ఆధారాలున్నాయి.

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చాళుక్యులు

* చాళుక్యుల్లో మూడు రాజవంశాలు ప్రధానమైనవి. అవి: 

1. పశ్చిమ చాళుక్యులు (క్రీ.శ. 500-755) 

2. వేంగి చాళుక్యులు (క్రీ.శ. 624-1076)

3. కల్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973-1200) 

వీరు దక్షిణ భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, మత, సాహిత్య, వాస్తు, శిల్పకళా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు.

వీరేకాక వేములవాడ, ఎలమంచిలి, నిడదవోలు, అన్హిల్వాడా చాళుక్యులు కూడా వివిధ ప్రాంతాల్లో పరిపాలించారు. 


బాదామి లేదా పశ్చిమ చాళుక్యులు

వీరు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు రాజ్యపాలన చేశారు. కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లాలో ఉన్న వాతాపి లేదా బాదామి వీరి రాజధాని.

వీరిని ‘బాదామి’ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. 

ఉత్తరాన కనౌజ్, దక్షిణాన పల్లవులతో వీరికి శత్రుత్వం ఉండేది.

వీరితో నిరంతరం పోరాటాలు చేయడంవల్ల పశ్చిమ చాళుక్య వంశం పతనమైంది.


బాదామి చాళుక్య పాలకులు జయసింహ వల్లభుడు

పశ్చిమ చాళుక్య స్థాపకుడు, తొలి పాలకుడు.

ఇతడు మొదట్లో వాకాటకులకు సామంతుడిగా ఉన్నాడు. ‘వాతాపి’ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.


రణరాగుడు

ఇతడికి ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. రణరాగుడి కాలంలో రాజ్యం ప్రస్తుత బీజాపూర్‌ జిల్లాలోని బాదామి వరకు విస్తరించింది.


మొదటి పులకేశి 

క్రీ.శ. 535566 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్య రాజవంశంలో మొదటి సార్వభౌమ చక్రవర్తి. చాళుక్య రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అశ్వమేధ యాగాన్ని చేశాడు. బాదామిని రాజధానిగా చేసుకుని పాలించాడు. 

బాదామిలో లభించిన క్రీ.శ. 543 నాటి శాసనంలో మొదటి పులకేశి దండయాత్రలు, విజయాల గురించి ఉంది. క్రీ.శ. 543 - 544 కాలంలో ఇతడు ‘వాతాపి కోట’ నిర్మాణం ప్రారంభించాడు. ఇతడు చాళుక్య రాజ్యాన్ని కర్ణాటక వరకు విస్తరింపజేశాడు.


మొదటి కీర్తివర్మ  

క్రీ.శ. 566598 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడ్ని‘The First and Finest Maker of Vatapi’ గా పేర్కొంటారు. 

ఇతడు నలవాడ (బళ్లారి, కర్నూలు) పాలకుడైన నలరాజుని; బనవాసి పాలకుడైన కదంబుడిని; కొంకణ మౌర్యులను ఓడించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు.


మంగళేశుడు 

కీర్తివర్మ మరణించేనాటికి అతడి కొడుకు రెండో పులకేశి బాలుడు. దీంతో తమ్ముడైన మంగళేశుడు రాజ్యపాలన చేశాడు. క్రీ.శ. 598-609 వరకు రాజుగా ఉన్నాడు.

ఇతడు గుజరాత్‌ను పాలించిన ‘కాలచూరులను’ ఓడించి రేవతీద్వీపాన్ని (గోవా) ఆక్రమించాడు. ఇతడికి ‘పరమభాగవత’ అనే బిరుదు ఉంది. 

మంగళేశుడు తన కుమారుడ్ని రాజుగా చేయాలనుకున్నాడు. దీంతో క్రీ.శ. 609లో రెండో పులకేశితో వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులో మంగళేశుడ్ని రెండో పులకేశి వధించి, రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.


మొదటి విక్రమాదిత్యుడు 

*  క్రీ.శ. 642680 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కూడా పల్లవులతో పోరాటాన్ని కొనసాగించాడు. 

 ఇతడు పల్లవరాజు రెండో మహేంద్రవర్మను ఓడించాడు. కానీ తర్వాత జరిగిన ‘పెరువళనల్లూరు’ యుద్ధంలో విక్రమాదిత్యుడు ఓడిపోయాడు. 

 మహేంద్రవర్మ తర్వాత పరమేశ్వరవర్మ పల్లవ పాలకుడయ్యాడు. విక్రమాదిత్యుడు ఇతడ్ని ఓడించి ‘కంచి’ని ఆక్రమించాడు. 

ఇదేకాలంలో తన తమ్ముడు జయసింహుడ్ని లాట, గుజరాత్‌ ప్రాంతాలకు గవర్నర్‌గా నియమించాడు. ఇది క్రమంగా లాటచాళుక్య వంశ ఏర్పాటుకు కారణమైంది.

వినయాదిత్యుడు 

 క్రీ.శ. 680696 వరకు రాజ్యన్ని పాలించాడు. ఇతడి కాలంలో ఎలాంటి యుద్ధాలు లేవు. ‘అలంపూర్‌’ వద్ద ఆలయ నిర్మాణం ఇతడి కాలంలోనే జరిగింది. 

విజయాదిత్యుడు 

 క్రీ.శ. 696-733 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇతడు పట్టడకల్‌ లేదా కీసువల్‌ను సుందరంగా తీర్చిదిద్దాడు. పల్లవ రాజ్యంపై దండెత్తి అపార సంపద కొల్లగొట్టాడు.

 పల్లవ రాజు పరమేశ్వరవర్మతో మిళింద యుద్ధం చేశాడు. ఇందులో గాంగరాజు పరమేశ్వర వర్మకు సాయం చేసి, విజయాదిత్యుడ్ని చంపాడు.


రెండో విక్రమాదిత్యుడు

 క్రీ.శ. 733744 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలంలో అరబ్బులు రాజ్యంపైకి దండెత్తారు. వీరిని లాటరాజైన జయసింహవర్మ కుమారుడు పులకేశి ఓడించాడు. 

​​​​​​్ర రెండో విక్రమాదిత్యుడు పులకేశికి ‘అవనీజనాశ్రయ’ అనే బిరుదు ఇచ్చాడు. 

 రెండో విక్రమాదిత్యుడు పల్లవరాజు నందివర్మను ఓడించి, కాంచీపురాన్ని దోచుకున్నాడు. 

 చేర, చోళ, పాండ్య, కలభ్రులను ఓడించి, చాళుక్యుల అధికారాన్ని కన్యాకుమారి వరకు వ్యాపింపజేశాడు.

రెండో కీర్తివర్మ 

 క్రీ.శ. 744757 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్యుల్లో చివరివాడు. ఇతడి కాలంలో చాళుక్యులకు సామంతుడిగా ఉన్న రాష్ట్రకూట రాజు ‘దంతిదుర్గుడు’  స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 

దంతిదుర్గుడి కుమారుడు మొదటి కృష్ణుడు కీర్తివర్మను ఓడించి చాళుక్యరాజ్యాన్ని ఆక్రమించడంతో బాదామి చాళుక్య రాజవంశం పతనమైంది. 

రెండో పులకేశి (క్రీ.శ. 609-642) 

బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు. అనేక దండయాత్రలు చేసి, చాళుక్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ‘దక్షిణాపథ చక్రవర్తి’గా పేరుగాంచాడు.

రెండో పులకేశి దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధనుడు పాలించాడు.


దండయాత్రలు: రెండో పులకేశి అనేక దండయాత్రలు చేశాడు. ముఖ్యంగా వారసత్వ యుద్ధ సమయంలో అతడిపై చాళుక్య సామంతుడు ‘అప్పాయిక’ తిరుగుబాటు చేశాడు. అందులో అప్పాయిక ఓడిపోయాడు.

దీని తర్వాత కదంబులను, కొంకణ ప్రాంత మౌర్యులను, గాంగరాజులను, లాటపాలకులు, ఘర్జరులను ఓడించాడు. వీరంతా రెండో పులకేశికి సామంతులుగా మారారు.

గాంగరాజైన దుర్వినేతను ఓడించి, అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

ఈ యుద్ధాల ఫలితంగా రెండో పులకేశి రాజ్యం ఉత్తర సరిహద్దు ‘మహీనది’ వరకు విస్తరించింది. కళింగ రాజధాని పిఠాపురాన్ని ఆక్రమించి, తన సోదరుడైన ‘విష్ణువర్ధనుడికి’ అప్పగించాడు. 

రెండో పులకేశి పుల్లలూరు యుద్ధంలో పల్లవ రాజైన మహేంద్రవర్మను ఓడించి, వధించాడు.

వేంగి పాలకుడైన ‘మూడో మాధవవర్మ’ను కునాల యుద్ధంలో ఓడించాడు.

ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం కోసం రెండో పులకేశిపై దండెత్తాడు. వీరిద్దరి మధ్య నర్మదా నది తీరాన యుద్ధం జరిగింది. ఐహోల్‌ శాసనం ప్రకారం, ఈ పోరులో రెండో పులకేశి విజయం సాధించి, ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. యుద్ధం తర్వాత నర్మదానది రెండు రాజ్యాల మధ్య సరిహద్దుగా మారింది. 

ఈ యుద్ధం వల్ల చాళుక్యుల అధికారం మహారాష్ట్ర, మైసూరు ప్రాంతాలకు విస్తరించింది. చోళ, చేర, పాండ్యులతో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని చిన్న రాజ్యాల పాలకులు కూడా రెండో పులకేశికి సామంతులుగా మారారు. 

క్రీ.శ. 641 లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యంపై దండెత్తాడు. ఆ సమయంలో మొదటి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ పల్లవ రాజుగా ఉన్నాడు. అతడు ‘మణి మంగళయుద్ధం’లో పులకేశిని ఓడించాడు. దీనికి ప్రతిగా రెండో పులకేశి రాయలసీమలోని పల్లవ సామంతులైన బాణులను ఓడించి, కంచిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

క్రీ.శ. 642 లో మొదటి నరసింహవర్మ పులకేశిపై దండెత్తి, అతడ్ని ఓడించి, వధించాడు. ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి పశ్చిమ చాళుక్యులకు 12 ఏళ్లు పట్టింది. చాళుక్య, పల్లవుల మధ్య యుద్ధం సుదీర్ఘ కాలం జరగడంవల్ల ఈ రెండు రాజ్యాలు ఆర్థికంగా నష్టపోయాయి. 

రెండో పులకేశి సామ్రాజ్యం ఉత్తరాన నర్మదానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది. 


ఇతర విషయాలు: పర్షియా చక్రవర్తి ‘రెండో ఖుస్రూ’ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు పర్షియన్‌ చరిత్రకారుడు ‘తబారి’ పేర్కొన్నాడు. పర్షియా రాయబారి ఇతడి ఆస్థానానికి వచ్చినట్లు ఉండే వర్ణచిత్రం ‘అజంతా గుహ’లో ఉంది. 

చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ క్రీ.శ. 640-41లో రెండో పులకేశి ఆస్థానానికి వెళ్లాడు. ‘‘చాళుక్య రాజ్యం విశాలమైంది, రెండో పులకేశికి శత్రువులంటే భయంలేదు, ప్రజలు యుద్ధప్రియులు, కష్టజీవులు’’ అని అతడు సి-యూ-కి గ్రంథంలో పేర్కొన్నాడు. 

 పుట్టుపూర్వోత్తరాలు

బాదామి చాళుక్య రాజవంశ పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

ప్రముఖుల అభిప్రాయాలు:

 బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’ ప్రకారం, చాళుక్యులు బ్రహ్మచాళకం వంశం నుంచి ఆవిర్భవించారు. అందుకే వీరిని ‘చాళుక్యులు’గా పేర్కొన్నారు. ఈ వంశం అనేక శాఖలుగా విడిపోయి, వివిధ ప్రాంతాలను పరిపాలించాయి. ఆయా ప్రాంతాల పేరు మీదుగా వీరికి గుర్తింపు వచ్చింది. ఉదాహరణకు వేంగి, కల్యాణి, బాదామి చాళుక్యులు. 

 ‘‘చలిక, నలుకి, సతికి, చల్కి అనేవి చాళుక్య పదానికి పర్యాయపదాలు’’ - మల్లంపల్లి సోమశేఖరశర్మ

 ‘‘బాదామి చాళుక్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఘార్జరులు అనే శాఖకు చెందినవారు’’ - డాక్టర్‌ వి.ఎ.స్మిత్‌.

 ‘‘వీరు మధ్య ఆసియాకు చెందిన సెల్యుకస్‌ వంశానికి చెందినవారు’’ - జాన్‌ప్లీట్, రైస్‌.

‘‘చాళుక్యులు కన్నడ కుటుంబానికి చెందినవారు’’ - డి.సి.సర్కార్‌ 


శాసన ఆధారాలు:

 బాదామిలో లభించిన శాసనాల్లో ‘చాళక, చాళక్య’ పదాలు విరివిగా ఉన్నాయి. 

 వివిధ శాసనాల్లో వీరిని వానవ్యసగోత్రులు, హరిపుత్రులని పేర్కొన్నారు. 

 కొన్ని శాసనాల్లో చాళుక్యులు చంద్రవంశ క్షత్రియులని ఉంది. 

 నాగార్జునకొండ శాసనంలో ఇక్ష్వాకు చక్రవర్తుల కింద ఉన్న హిరణ్య రాష్ట్ర (కడప) పాలకుడు ‘చలికి రెమ్మణుకుడు’ చాళుక్యవంశ మూలపురుషుడు అని ఉంది. 

 చాళుక్యులు మొదట శూద్రులు, తర్వాత క్షత్రియులుగా మారారు అని వివిధ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వేంగి/ తూర్పు చాళుక్యులు

* బాదామి చాళుక్య వంశం పతనమయ్యాక కూడా తూర్పు చాళుక్యులు స్వతంత్రంగా పరిపాలించారు. వేంగి రాజ్యం కళింగ - నెల్లూరు మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతమంతా విస్తరించింది. వీరికి రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, చోళులు, గాంగులతో తరచూ యుద్ధాలు జరిగేవి. తూర్పు చాళుక్యులు వీటన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని నాలుగున్నర శతాబ్దాలపాటు రాజ్యపాలన చేశారు.


పాలకులు

కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ.624-642): ఇతడు తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు. తిమ్మాపురం, చీపురుపల్లి, చేజెర్ల శాసనాల్లో ఇతడి దండయాత్రలు, పాలనా విధానాల గురించి ఉన్నాయి.

కుబ్జ విష్ణువర్ధనుడు తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన విశాఖపట్నం నుంచి దక్షిణాన గుంటూరు వరకు విస్తరించాడు. స్థల, జల, వన, గిరి దుర్గాలను జయించడంలో ఇతడు సమర్థుడు. అందుకే కుబ్జ విష్ణువర్ధనుడికి ‘విషమసిద్ధి’ అనే బిరుదు వచ్చింది.

ఇతడు విష్ణుభక్తుడు. ఇతడి భార్య అయ్యణ మహాదేవి. ఈమె జైనుల కోసం విజయవాడలో ‘నెడుంబ బసది’ నిర్మించింది.

జయసింహవల్లభుడు: ఇతడు సుమారు 13 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. ఇతడు విష్ణు భక్తుడు. జయసింహవల్లభుడికి ‘సర్వసిద్ధి’ అనే బిరుదు ఉంది. ఇతడి తర్వాత ఇంద్రభట్టారకుడు, రెండో జయసింహుడు, మొదటి విష్ణువర్ధనుడు రాజ్యాన్ని పాలించారు.

మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ.753 - 770):  ఇతడు మూడో విష్ణువర్ధనుడి కుమారుడు. ఇతడికి ‘మహారాజాధిరాజ’, ‘పరమేశ్వర భట్టారక’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి కాలంలో చాళుక్య, రాష్ట్రకూటుల మధ్య వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు గోవిందుడు వేంగిపై దండెత్తి, విజయాదిత్యుడ్ని ఓడించాడు. విజయాదిత్యుడి తర్వాత నాలుగో విష్ణువర్ధనుడు రాజయ్యాడు. ఇతడు రాష్ట్రకూటులను ఎదుర్కోలేకపోయాడు. దీంతో తన కుమార్తె ‘శీల మహాదేవిని’ రాష్ట్రకూట రాజు ధృవుడికిచ్చి వివాహం చేశాడు. ఇతడి తర్వాత రెండో విజయాదిత్యుడు రాజయ్యాడు.

రెండో విజయాదిత్యుడు: ఇతడు కళింగ గాంగులు, రాష్ట్రకూటులతో 12 ఏళ్లపాటు 108 యుద్ధాలు చేసి, అన్నింటిలో విజయం సాధించాడు. ఇతడు తన విజయాలకు చిహ్నంగా 108 శివాలయాలు నిర్మించాడని వివిధ శాసనాల్లో ఉంది. ఇతడికి కలి విష్ణువర్ధనుడు అనే కుమారుడు ఉన్నాడు.

మూడో గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ.849 -892): ఇతడు కలి విష్ణువర్ధనుడి కుమారుడు. తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడు. 

* ఇతడు రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడ్ని ఓడించి, అతడి రాజధాని మాన్యఖేటం (మాల్కేడ్‌)ను ధ్వంసం చేశాడు. 

* మూడో గుణగ విజయాదిత్యుడికి గుణకేనల్లాట, పరచక్రరాయ, వల్లభ అనే బిరుదులు ఉన్నాయి.

ఇతడు రెండో కృష్ణుడి బంధువు, కోసల రాజైన సంకిలుడ్ని ఓడించాడు.

* చక్రకుట, కిరణపురం, అచలపురాలను దగ్ధం చేసి, ‘త్రిపుర మర్త్యమహేశ్వర’ అనే బిరుదు పొందాడు. ఈ యుద్ధాల్లో గుణగ విజయాదిత్యుడికి పండరంగడు అనే సేనాని ఎంతగానో సహాయపడ్డాడు.

* గుణగ విజయాదిత్యుడికి సంతానం లేదు. దీంతో తన సోదరుడు విక్రమాదిత్యుడ్ని తన వారసుడిగా ప్రకటించాడు. అయితే విక్రమాదిత్యుడు రాజు కాకముందే మరణించడంతో, అతడి కుమారుడు మొదటి చాళుక్య భీముడు రాజ్యపాలన చేశాడు.


మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ. 892 - 921):  మొదటి చాళుక్య భీముడి పాలనా కాలం యుద్ధాలతో గడిచింది. మూడో గుణగ విజయాదిత్యుడి చేతిలో ఓడిన రాష్ట్రకూటులు వేంగిపై దండెత్తారు. వారిని నిరవధ్యపురం, పురువంగూరు యుద్ధాల్లో చాళుక్య భీముడు ఓడించాడు. 

* చాళుక్య భీముడి మనవడు మొదటి అమ్మరాజు మరణించాక రాజ్యం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మొదటి యుద్ధమల్లుడు విజయం సాధించి, వేంగి పాలకుడయ్యాడు. ఇతడికి రాష్ట్రకూటులు సాయం చేశారు. తర్వాతి కాలంలో రెండో చాళుక్య భీముడు రాష్ట్రకూటులను, యుద్ధమల్లుడ్ని ఓడించి సింహాసనం అధిష్టించాడు. తర్వాత ఇతడి కుమారుడు రెండో అమ్మరాజు రాజయ్యాడు. రెండో అమ్మరాజు రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు. అమ్మరాజు సోదరుడు దానర్ణవుడు. ఇతడు అమ్మరాజును చంపి, రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనికి ప్రతీకారంగా అమ్మరాజు బావమరిది జటాచోడ భీముడు దానర్ణవుడ్ని వధించి, అతడి కొడుకులైన శక్తివర్మ, విమలాదిత్యలను రాజ్యం నుంచి బహిష్కరించాడు. జటాచోడ భీముడు క్రీ.శ. 973-1000 వరకు రాజ్యాన్ని పాలించాడు. 

* రాజ్యం కోల్పోయిన విమలాదిత్య, శక్తివర్మలు చోళ రాజ్యానికి  పారిపోయి, చోళరాజు మొదటి రాజరాజ సహాయం కోరారు.

* రాజరాజ తన కుమార్తె ‘కుందవ్వ’ను విమలాదిత్యుడికిచ్చి వివాహం చేశాడు. జటాచోడ భీముడ్ని ఓడించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు. రాజరాజ వేంగి సింహాసనాన్ని శక్తివర్మకు అప్పగించాడు. శక్తివర్మ మరణించాక, విమలాదిత్యుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. విమలాదిత్యుడి భార్యలు కుందవ్వ, మేళాంబ. కొడుకులు రాజరాజ నరేంద్రుడు (కుందవ్వ తల్లి), విజయాదిత్యుడు (మేళాంబ తల్లి).

* తండ్రి మరణించాక సోదరుల మధ్య వారసత్వం కోసం పోరు మొదలైంది. మేనమామ రాజేంద్రచోళుడి సాయంతో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. రాజేôద్రచోళుడు తన కుమార్తె అమ్మంగ దేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.


రాజరాజనరేంద్రుడు (క్రీ.శ. 1022 - 1061):

* ఇతడు విజయాదిత్యుడితో చాలాకాలం వైరం కొనసాగించాడు. ఆ సమయంలో ఇతడి సైన్యం కూడా బలహీనపడింది.

* క్రీ.శ.1030లో కల్యాణి చాళుక్యుల సాయంతో విజయాదిత్యుడు తిరుగుబాటుచేసి వేంగిని ఆక్రమించాడు. ఇతడు క్రీ.శ. 1035 వరకు రాజుగా ఉన్నాడు. రాజేంద్రచోళుడి సాయంతో రాజరాజ నరేంద్రుడు మళ్లీ రాజై కొంతకాలం పాలించాడు. కానీ ఎన్నోసార్లు సింహాసనాన్ని కోల్పోయాడు. రాజేంద్రచోళుడు మరణించాక నరేంద్రుడు కల్యాణి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడితో సంధి చేసుకుని సింహాసనాన్ని నిలుపుకున్నాడు. రాజరాజ నరేంద్రుడి అస్థానంలో నన్నయ్యభట్టు ఉండేవారు. ఈయన మహాభారతాన్ని రాశారు. ఈ రచనలో నన్నయ్యభట్టుకి మొదటి సోమేశ్వరుడి ఆస్థానంలో ఉండే నారాయణభట్టు సాయం చేశారు.

* క్రీ.శ. 1061లో రాజరాజ నరేంద్రుడు  మరణించాక, అతడి కుమారుడు రెండో రాజేంద్రుడు రాజయ్యాడు.


ఏడో విజయాదిత్యుడు:

* ఇతడు వేంగి చాళుక్య వంశంలో చివరి రాజు. క్రీ.శ.1076 వరకు రాజ్య పాలన చేశాడు. క్రీ.శ.1076లో రెండో రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడి పేరుతో వేంగి రాజ్యాన్ని చోళరాజ్యంలో అంతర్భాగం చేశాడు.


కల్యాణి చాళుక్యులు

కల్యాణి చాళుక్యులు బాదామి చాళుక్యుల శాఖకు చెందినవారు. ఈ వంశ స్థాపకుడు ‘రెండో తైలపుడు’. ఇతడి కంటే ముందు పాలకులు రాష్ట్రకూటులకు సామంతులు. తైలపుడు మాన్యఖేటం రాజధానిగా పాలన ప్రారంభించాడు. ఇతడి సంతతి ‘కల్యాణి’ నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు. అందుకే వీరి వంశానికి కల్యాణి చాళుక్యులు అనే పేరు వచ్చింది.  


పాలకులు

రెండో తైలపుడు (క్రీ.శ. 973-997): ఇతడు రాష్ట్రకూట రాజు రెండో కర్ణుడ్ని ఓడించి క్రీ.శ. 973లో మాన్యఖేటాన్ని ఆక్రమించి, స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇతడికి అహనమల్ల, భువనైకమల్ల, రణరంగభీమ అనే బిరుదులు ఉన్నాయి. మేరతుంగుడి ప్రబంధ చింతామణిలో రెండో తైలపుడు మాళవరాజు (పరమార) ముంజరాజును వధించినట్లు ఉంది. రెండో తైలపుడు దక్షిణాన చోళ రాజ్య విస్తరణను అడ్డుకోవడంతో వారితో వైరం ఏర్పడింది.


సత్యాశ్రయ (క్రీ.శ. 997-1008): ఇతడి కాలంలో చోళులతో వైరం తీవ్రమైంది. చోళరాజు రాజరాజ చోళుడు కల్యాణి చాళుక్యుల అధీనంలోని ముఖ్య ప్రాంతాలపై దాడిచేసినట్లు హోట్టూరు శాసనంలో ఉంది. చోళయువరాజు రాజేంద్ర చోళుడు కూడా చాళుక్య రాజ్యంపై దండెత్తి మాన్యఖేటం, కొలనుపాకలను నాశనం చేశాడు. సత్యాశ్రయుడు వేంగిపై దండెత్తాడు. కానీ జయించలేకపోయాడు. ఇతడి తర్వాత అయిదో విక్రమాదిత్యుడు, రెండో అయ్యన, రెండో జయసింహ రాజ్యపాలన చేశారు.


రెండో జయసింహ వల్లభుడు (క్రీ.శ. 1015-42): జయసింహుడు సేనాని ‘చావర్ణసు’. ఇతడు అనేక దండయాల్లో ముఖ్యపాత్ర షోషించాడు. జయసింహ వల్లభుడు సప్తకొంకణ తీరభాగాలను జయించినట్లు ‘మీరజ్‌’ శాసనంలో ఉంది. జయసింహుడు శైవమతస్థుడు. ఇతడికి ‘జగదేకమల్ల’ అనే బిరుదు ఉంది.


మొదటి సోమేశ్వరుడు (క్రీ.శ. 1042-68):ఇతడ్ని అహనమల్ల సోమేశ్వరుడు అని కూడా అంటారు. ఇతడు ‘కల్యాణి’ని నిర్మించి, రాజధానిని మాన్యఖేటం నుంచి కల్యాణికి మార్చాడు. పరమార భోజుడ్ని ఓడించి ‘ధారా’ నగరాన్ని ఆక్రమించి, ధ్వంసం చేశాడు. బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’లో ఈ విషయం ఉంది.

*  క్రీ.శ. 1050లో జరిగిన ‘కోప్పం’ యుద్ధంలో ఇతడు వేంగిరాజు రాజరాజ నరేంద్రుడ్ని ఓడించి, తన సామంతుడిగా చేసుకున్నాడు. కానీ సోమేశ్వరుడు చోళరాజు రాజేంద్ర చేతిలో ‘సంగం యుద్ధం’లో ఓడిపోయాడు. 

*  సోమేశ్వరుడి మంత్రి (మహామాత్య) దెమరస క్రీ.శ. 1057లో హిరేహడగలి (కర్ణాటక) వద్ద కల్లేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. 

*  సోమేశ్వరుడు క్రీ.శ. 1068లో మరణించాడు. ఇతడు శివభక్తుడు. కాకతీయరాజు మొదటి ప్రోలరాజు అనేక యుద్ధాల్లో సోమేశ్వరుడికి సాయం చేశాడు.

*  ఇతడి తర్వాత భువనైకమల్ల సోమేశ్వరుడు, విక్రమాదిత్యుడు రాజ్యపాలన చేశారు.


ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076 -1126):

* ఇతడు క్రీ.శ.1076లో చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. త్రిభువనమల్ల అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. 

* ‘విక్రమాంక దేవ చరిత్ర’ను రచించిన బిల్హణుడు ఇతడి ఆస్థానంలో ఉండేవారు.

విక్రమాదిత్యుడు చోళరాజు వీరరాజేంద్రుడి కుమార్తెను వివాహం చేసుకుకన్నాడు. 

సింహళరాజు విజయబాహువు ఇతడి మిత్రుడు. ఇతడు సోలంకి, కాలచూరి రాజులను జయించాడు. మొదటి భల్లాలుడు విక్రమాదిత్యుడికి సామంతుడిగా ఉండి, హొయసల రాజ్యాన్ని పాలించాడు. 

* క్రీ.శ. 1084లో విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని దోచుకొన్నాడు. కులోత్తుంగ చోళుడు మరణించాక వేంగిని ఆక్రమించాడు. 

* కాకతీయులు ఇతడికి విధేయులుగా ఉండేవారు. ఇతడు మంచి పాలన అందించి, కవిపండితులను పోషించాడు. విక్రమాదిత్యుడికి హొనుంగలుగొండ, వీరగంగ, విజయనోళంబ, సాహసకదంబ అనే బిరుదులు ఉన్నాయి. 


చివరి రాజులు 

* విక్రమాదిత్యుడు మరణించాక మూడో సోమేశ్వరుడు (క్రీ.శ.1126-38), జగదేకమల్లు (క్రీ.శ.1138-50), తైలపదేవుడు (క్రీ.శ.1150-57) పరిపాలించారు. వీరి కాలంలో కాకతీయులు, యాదవులు, హొయసలులు, కాలచూరులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. 

*తైలపదేవుడి తర్వాత మూడో జగదేకమల్లుడు (క్రీ.శ.1163-83), నాలుగో సోమేశ్వరుడు (క్రీ.శ. 1184-1200) పరిమిత ప్రాంతాలను పాలించారు.  

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 విష్ణుకుండినులు - 01

వైదిక సంస్కృతికి రాజపోషకులు!



 


  చరిత్ర పూర్వయుగంలో ఆంధ్ర దేశంలో పుట్టి స్వశక్తితో అధికారంలోకి వచ్చిన పాలకుల్లో విష్ణుకుండినులకు ప్రత్యేక స్థానం ఉంది. శాతవాహనుల తర్వాత తెలుగు నేలలో అత్యధిక ప్రాంతాన్ని పాలించిన రాజవంశమిది. నేటి దక్షిణ తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలను సుమారు రెండు శతాబ్దాలు పరిపాలించారు. పరమ శివ భక్తులుగా, వైదిక సంస్కృతికి రాజపోషకులుగా నిలిచారు. విశేషమైన యజ్ఞాలు, యాగాలు చేశాడు. పరిజ్ఞాన సంపన్నులుగా పాలన సాగిస్తూ, రాజ్య సంరక్షణ కోసం పరాక్రమాలను ప్రదర్శించారు. వీరి పాలనలో విద్యకు ప్రాధాన్యం, పండితులకు ప్రోత్సాహంతో పాటు వ్యవసాయ వాణిజ్యాలు వర్దిల్లాయి. బెజవాడ కనకదుర్గ ఆలయం సహా అనేక గుహాలయాలను నిర్మించి చిరస్మరణీయులయ్యారు. ఈ వంశ వృక్షం, రాజుల క్రమంలో పాలనా విశేషాలు, నాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఇక్ష్వాకుల తర్వాత తూర్పు దక్కన్‌ ప్రాంతంలో అధికారం స్థాపించినవారు విష్ణుకుండినులు. వీరి వంశ నామం ‘విష్ణుకుండి’. పల్నాడు జిల్లాలోని వినుకొండకు సంస్కృతీకరణమే విష్ణుకుండి. వీరు బ్రాహ్మణులు, ఆంధ్రులు, శ్రీపర్వతస్వామి భక్తులు. శ్రీశైలం మల్లికార్జున స్వామినే శ్రీపర్వతస్వామి అంటారు. ఈ వంశ స్థాపకుడు ఇంద్రవర్మ. వీరిలో చివరివాడు మంచన భట్టారకుడు, గొప్పవాడు రెండో మాధవ వర్మ. హిందూ శిల్పకళను ప్రారంభించి అనేక గుహాలయాలు నిర్మించారు. గణపతిని పూజించడం వీరి కాలం నుంచే ప్రారంభమైంది. పురుష మేధ యాగాలు నిర్వహించారు. వీరి రాజధానుల్లో మొదటిది ఇంద్రపాలపురం, రెండోది వినుకొండ, మూడోది దెందులూరు. వీరి భాష సంస్కృతం. అధికారిక మతం వైదికం. నాణేలపై ఉన్న చిహ్నం నంది. రాజలాంఛనం పంజా ఎత్తిన సింహం.

శాసనాలు:

* చిక్కుళ్ల శాసనం - రెండో విక్రమేంద్ర వర్మ - తూర్పుగోదావరి 

* రామతీర్థం శాసనం - ఇంద్ర వర్మ - విశాఖపట్నం 

* పోలమూరు శాసనం - నాలుగో మాధవ వర్మ - తూర్పుగోదావరి 

* వేల్పూరు శాసనం - రెండో మాధవ వర్మ - గుంటూరు జిల్లా 

* ఈపూరు శాసనం - మొదటి మాధవ వర్మ - గుంటూరు జిల్లా.

రాజకీయ చరిత్ర:

ఇంద్రవర్మ: విష్ణుకుండి పాలకుల్లో మొదటి రాజు. వాకాటకులకు సామంతుడు. ఇంద్రపాల నగరాన్ని నిర్మించి రాజధానిగా మార్చాడు. ఇంద్రపాల శాసనం ఇతడి గురించి తెలియజేస్తుంది.రామతీర్థ శాసనాన్ని వేయించాడు.

మొదటి మాధవ వర్మ: ఇంద్రవర్మ కుమారుడు, గొప్ప ప్రతిభాశాలి, న్యాయదక్షుడు, రాజనీతిజ్ఞుడు. నూరువేల అగ్నిస్థోమ యాగాలు, 11 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.  వైదిక మతాన్ని ప్రోత్సహించాడు. పల్లవులు, శాలంకాయనులు, కళింగ రాజులను ఓడించాడు. వాకాటక రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. చిక్కుళ్ల శాసనం వీరి బంధుత్వం గురించి వివరిస్తుంది. ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలు ఇతడి కాలం నాటివే.

మొదటి గోవింద వర్మ: మొదటి మాధవ వర్మ కుమారుడు. తొలి విష్ణుకుండి రాజుల్లో గొప్పవాడు. రాజ్య విస్తరణ చేశాడు. బౌద్ధ మతాభిమాని. మూలరాజ వంశస్థుడైన పృథ్వి మాలుడి కుమార్తె పరమ భట్టారక మహాదేవిని వివాహం చేసుకున్నాడు.

రెండో మాధవ వర్మ: ఈ వంశంలో గొప్పవాడు. వాకాటక రాజులతో మంచి సంబంధాలతో అధికారాన్ని స్థిరం చేసుకున్నాడు. ఇతడి రాజ్యం నర్మదా నది వరకు విస్తరించింది. రాజధానిని అమరాపురానికి (అమరావతి)కి మార్చాడు. పల్లవుల దండయాత్రల బెడద వల్ల సరిహద్దులను పటిష్ఠపరిచేందుకు దక్షిణా త్రికూటమలయ (కోటప్పకొండ) సంరక్షకుడిగా, రాజప్రతినిధిగా తన కుమారుడు దేవవర్మను నియమించాడు. దేవవర్మ మరణానంతరం అతడి కొడుకు మూడో మాధవ వర్మ త్రికూట మలయాధిపతి అయ్యాడు. రెండో మాధవ వర్మ శాలంకాయనులను తుదముట్టించి వేంగి రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నాడు. అనేక అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేశాడు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు సముద్రగుప్తుడికి సమకాలికుడు.

మొదటి విక్రమేంద్ర వర్మ: ఇతడు రెండో మాధవ వర్మ, వాకాటక రాజకుమార్తెకు జన్మించాడు. రామతీర్థం శాసనంలో మొదటి విక్రమేంద్ర వర్మను సత్పుత్రుడిగా అభివర్ణించారు. సింహాసనం అధిష్ఠించేనాటికి వయోవృద్ధుడు. ఇంద్రపాలన నగర శాసనంలో ఇతడిని వయోవృద్ధుడిగా పేర్కొన్నారు. జైన, బౌద్ధ మతాలను ఆదరించాడు. మొదటి విక్రమేంద్ర వర్మ మరణాంతరం సింహాసనం కోసం దాయాదుల మధ్య పోరు జరిగింది. ఇందులో హరిసేనుడు జోక్యం చేసుకున్నాడు. చివరకు ఇంద్రవర్మ/ఇంద్ర భట్టారకుడు రాజు అయ్యాడు.

ఇంద్ర భట్టారక వర్మ: ఇతడి గురించి చిక్కుళ్ల శాసనం తెలియజేస్తోంది. పరమ మహేశ్వరుడిగా పేరుగాంచాడు. శివారాధకుడు, దానశీలి. గోవులు, భూములను దానం చేశాడు. సత్యాశ్రయుడు, చతుర్దాయక యుద్ధవీరుడు అనే బిరుదులున్నాయి. ఆంధ్ర దేశంలో ఘటికలు అనే విద్యాసంస్థలను స్థాపించాడు. ఈ ఘటికల గురించి ఉద్ధంకుడు ‘సోమదేవం’ అనే గ్రంథంలో పేర్కొన్నాడు.

రెండో విక్రమేంద్ర వర్మ: విష్ణుకుండిన వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించారు. కళింగలో కోల్పోయిన అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. తుని (తుండి) గ్రామాన్ని శివవర్మ అనే బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. కళింగ రాజ్యానికి చేరువగా ఉండాలని రాజధానిని బెజవాడ నుంచి దెందులూరుకి మార్చాడు. పల్లవ రాజు నరసింహ వర్మ దాడిని తిప్పికొట్టాడు. ఉత్తమాశ్రయుడు అనే బిరుదు పొందాడు. ఇతడి కుమారుడు రెండో గోవింద వర్మ కొద్దికాలమే పరిపాలించాడు.

నాలుగో మాధవ వర్మ: ఇతడి పాలనా కాలం విష్ణుకుండినుల చరిత్రలో సువర్ణాధ్యాయం. 65 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. బిరుదు జనాశ్రయ. వేంగిలో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నాడు. పరిపాలన ద్వితీయార్ధంలో అనేక యుద్ధాలు చేశాడు. చాళుక్యుల దాడిని ఎదుర్కొన్నాడు. రెండో పులకేశి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్దనుడి తోడ్పాటుతో పిఠాపురం, వేంగి ప్రాంతాలను ఆక్రమించాడు. వీరిని క్రీ.శ. 621లో తన భూభాగం నుంచి తరిమేయడానికి నాలుగో మాధవ వర్మ ప్రయత్నించి ఈ ప్రయత్నంలో యుద్ధభూమిలోనే మరణించాడు.

మంచన భట్టారక వర్మ: ఈ వంశంలో చివరివాడు. అనేక మంది సామంతులు ఇతడికి ఎదురుతిరిగారు. సిష్టీపురం దుర్జయుడైన పృథ్విమాల, భట్టారక వర్మను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తాండివాడ శాసనం తెలియజేస్తోంది. క్రీ.శ. 624లో తూర్పు చాళుక్యులు వేంగిని ఆక్రమించారు.

పరిపాలన: విష్ణుకుండినులు పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజ్యాన్ని రాజు, రాష్ట్రాన్ని రాష్ట్రీకులు, విషయాలను విషయాధిపతి, గ్రామాన్ని గ్రామణి పరిపాలించేవారు. శుక్రనీతిని అనుసరించి పరిపాలన జరిగేది. కీలక ప్రాంతాలకు రాజ కుటుంబీకులనే రాజ ప్రతినిధులుగా నియమించేవారు. గ్రామాలకు స్వయంప్రతిపత్తి ఉండేది. న్యాయపాలనలో రాజే అత్యున్నత న్యాయాధికారి. పాలకులకు న్యాయశాస్త్ర పరిజ్ఞానం, విచక్షణా జ్ఞానం మెండుగా ఉండేవి. వివాదాలను పరిష్కరించడంలో నిందితుడి చేతిని సలసలకాగే నీటిలో ముంచేవారు. నిష్పాక్షికంగా, ఉత్తమ తీర్పు ఇవ్వడంలో వీరు ప్రసిద్ధి. సైన్యంలో చతురంగ బలం ఉండేది. హస్తికోశ (గజబలాధ్యక్షుడు), వీరకోశ (పదాతి దళపతి) వంటి సైనికాధికారులు ఉండేవారు.


ఆర్థిక పరిస్థితులు: గ్రామాల్లో స్వయంసమృద్ధ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ప్రజల ప్రధాన ఆర్థిక కార్యకలాపం వ్యవసాయం. వ్యవసాయాభివృద్ధికి బావులు, చెరువులు తవ్వించేవారు. స్వదేశీ, విదేశీ వాణిజ్యం ఉండేది. ఈ కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని పాహియాన్‌ రాశాడు. వీరు తూర్పు ఆసియా దేశాలు, పశ్చిమ దేశాలైన గ్రీకు, రోమ్, ఈజిప్టులతో వ్యాపారం చేశారు. సంగమేశ్వరం (ఆలంపూర్‌ జిల్లా, తెలంగాణ) వద్ద రోమన్‌ చక్రవర్తి కానిస్టాంటైన్‌ నాణేలు లభించాయి.నాటి నాణేలను వెలుగులోకి తెచ్చింది రాయప్రోలు సుబ్రమణ్యం. రాగి పూత పూసిన ఇనుప నాణేలను చెలామణిలోకి తెచ్చారు. వీరి నాణేలపై ఓడ, సింహం చిహ్నాలు ఉండేవి.

మత పరిస్థితులు: రెండో మాధవ వర్మకి పూర్వం పరిపాలించిన రాజులు బౌద్ధ మతాభిమానులు. వీరిలో గోవింద వర్మ బౌద్ధ స్తూపాలు, విహారాలు నిర్మించారు. రెండో విక్రమేంద్ర వర్మ, మహాదేవి విహారానికి ఉదారంగా దానాలు ఇచ్చారు. వీరి కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ. పరమ భట్టారక మహాదేవి ఇంద్రపురంలో చతుర్ధ శౌర్య భిక్షువుల కోసం విహారం నిర్మించింది. ఈ విహారం కోసం మొదటి గోవింద వర్మ పెన్కపుర, ఎన్నదల గ్రామాలను దానం చేశాడు. గోవింద వర్మ తన పేరుతో చైతన్యపురి వద్ద విహారం నిర్మించాడు. విష్ణుకుండినులు ప్రధానంగా హిందూ మతాన్ని పోషించారు. కులదైవం శ్రీపర్వతస్వామి. రాజసూయ, పురుష మేధ, సర్వమేధ, అశ్వమేధ వంటి వైదిక క్రతువులు నిర్వహించారు. కొందరు రాజులు తమను తాము పరమ మహేశ్వరులుగా అభివర్ణించుకున్నారు. వీరికాలంలో శైవం, వైష్ణవం ఆదరణ పొందాయి. దక్షిణ భారతదేశంలో మొదటిగా గుహాలయాలు నిర్మించారు. వేల్పూరు శాసనం ప్రకారం రెండో మాధవ వర్మ గణపతి విగ్రహాలను నిర్మించాడు.

సాహిత్యం: వీరు గొప్ప సాహితీ అభిమానులు, విద్వాంసులైన బ్రాహ్మణులకు భూదానాలిచ్చారు. వేదాధ్యయనానికి ఘటికలు నిర్మించారు. సనాతన ధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ రాజులు సాహితీ అభిమానులే కాక వీరిలో కొందరు స్వయంగా విద్వాంసులు. విక్రమేంద్ర వర్మ మహాకవిగా కీర్తి పొందాడు. నాలుగో మాధవ వర్మ జనాశ్రయ ఛందోవిచ్ఛితి అనే అలంకార శాస్త్ర గంథ్రాన్ని రచించాడు. సంస్కృతం ప్రజాదరణ పొందింది. వీరు బ్రాహ్మణులకు విరివిగా అగ్రహారాలు దానం చేశారు. ఈ కాలంలో నిర్మించిన ఘటికలు విద్యాకేంద్రాలుగా భాసిల్లాయి. వీటిలో 14 రకాల విద్యలను బోధించేవారు.

వాస్తు శిల్పం: అనేక శైవ గుహాలయాలను నిర్మించారు. బెజవాడ దుర్గ కొండకు దిగువన అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం, ఉండవల్లి, భైరవకొండ గుహలు వీరికాలం నాటివే.

మొగల్రాజపురం గుహలు- విజయవాడ: దుర్గ గుహలో వెనుక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని, అతిపెద్దదైన అయిదో గుహలో శివతాండవ నటరాజు విగ్రహాన్ని, కపోతం మీద కూడలిలో దేవీసహితులైన త్రిమూర్తుల విగ్రహాలను చెక్కారు.

ఉండవల్లి గుహలు: ఇక్కడ మూడు గుహలున్నాయి. వీటిల్లో బుద్ధుడు పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని పడగొట్టి విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కారు. ప్రస్తుతం ఇది అనంత పద్మనాభస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పూర్ణకుంభాన్ని చెక్కారు.

భైరవకోన: ఇక్కడ ఎనిమిది గుహలున్నాయి. కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలున్నాయి. ఈ గుహలు కాపాలిక మతానికి చెందినవి. వీటిని శివుడికి అంకితం ఇచ్చారు.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 16-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 తూర్పు చాళుక్యులు

సామంతులే.. సార్వభౌములై!


 కుట్రలు, కుతంత్రాలు, దాడులు, దండయాత్రలు, విజయాలు, వీరస్వర్గాలతో సుమారు అయిదు వందల సంవత్సరాలపాటు ఆంధ్ర ప్రాంతంలో అత్యంత ఆసక్తికరమైన తూర్పు చాళుక్యుల రాచరిక పాలన సాగింది. వీరు సామంతులుగా మొదలై సార్వభౌములుగా అవతరించారు. దాయాదుల పోరుతో సతమతమైనప్పటికీ సామ్రాజ్యాన్ని విస్తరించి, సమర్థ పరిపాలన అందించారు. ఆంధ్రమహాభారతం వంటి రచనలు చేయించి చిరస్థాయి కీర్తిని గడించారు. చాళుక్య, చోళ రాజ్యాలను ఏకం చేసి దక్షిణ భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వారి రాజకీయ వంశ క్రమాన్ని, పాలనాకాలాలను, బిరుదులు, శాసనాలు సహా ఇతర విశేషాలను పోటీ పరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


 బాదామి చాళుక్యుల నుంచి తూర్పు చాళుక్య వంశం ఆవిర్భవించింది.మూలపురుషుడు కుబ్జ విష్ణువర్ధనుడు. మొత్తం 30 మంది రాజులు దాదాపుగా 500 సంవత్సరాలు పరిపాలించారు. రాజధాని పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘పెదవేగి’ కావడంతో వీరిని వేంగి చాళుక్యులని కూడా అంటారు. ఉత్తరాన మహేంద్రగిరి, దక్షిణాన శ్రీకాళహస్తి, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన శ్రీశైలం మధ్య ప్రాంతాలను పరిపాలించారు. విలియం ప్లేట్‌ అనే చరిత్రకారుడు పరిశోధనలు చేసి తూర్పు చాళుక్యుల కాలాన్ని నిర్ణయించాడు. వీరి రాజచిహ్నం ‘వరాహం’.


శాసనాలు: చీపురుపల్లి శాసనం - కుబ్జ విష్ణువర్ధనుడు, సతారా శాసనం - రెండో పులకేశి, నాగార్జునకొండ శాసనం - చెలికె రెమ్మనకుడు వేయించారు.


కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ.624-642): మొదట్లో రెండో పులకేశికి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. తర్వాత స్వతంత్రుడయ్యాడు. బిరుదులు విషమ సిద్ధి, మకరధ్వజుడు, పరమ భాగవతుడు. ఈ కాలంలో వేసిన తిమ్మాపురం శాసనం ఇతడిని మహారాజుగా పేర్కొంటోంది, విష్ణుభక్తుడని, దుర్గాదేవిని, కార్తికేయుడిని పూజించాడని చెబుతోంది. భార్య అయ్యణ మహాదేవి. ఈమె జైన సన్యాసుల కోసం విజయవాడలో ‘నడుంబి వసతి’ అనే ఆలయాన్ని నిర్మించింది. నిర్వహణకు ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతీ మాధవ ఆలయాన్ని నిర్మించాడు. పరిపాలన చివరి కాలంలో చైనా యాత్రికుడైన హుయాన్‌త్సాంగ్‌ ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు.


మొదటి జయసింహ వల్లభుడు (క్రీ.శ.642-673): కుబ్జ విష్ణువర్ధనుడి పెద్ద కుమారుడు. సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి అనే బిరుదులున్నాయి. ఇతడు వేయించిన విప్పర్ల శాసనం (గుంటూరు జిల్లా) పూర్తి తొలి తెలుగు శాసనం. రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఘటికాస్థానాలు అనే సంస్కృత విద్యాలయాలను నెలకొల్పాడు.


ఇంద్రభట్టారకుడు (క్రీ.శ.673): జయసింహ వల్లభుడి సోదరుడు. కేవలం ఏడు రోజులు మాత్రమే రాజ్యపాలన చేశాడు. కొండనాగురు శాసనాన్ని వేయించాడు. త్యాగధేను, మకరధ్వజ అనే బిరుదులు పొందాడు.


రెండో విష్ణువర్ధనుడు (క్రీ.శ.673-681): ఇంద్రభట్టారకుడి కుమారుడు. ఇతడికి సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయసిద్ధి అనే బిరుదులున్నాయి. కొల్లేరు చెరువుకు ఆనకట్ట నిర్మించాడు. రేయూరు శాసనం వేయించాడు.


మంగి యువరాజు (క్రీ.శ.681-705): రెండో విష్ణువర్ధనుడి కుమారుడు. బిరుదులు సకల లోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయసిద్ధి. రాజ్యాన్ని విశాఖపట్నం నుంచి ఒంగోలు వరకూ విస్తరించాడు. కుమారులు కొక్కిలి విక్రమాదిత్యుడు, రెండో జయసింహ వల్లభుడు, మూడో విష్ణువర్ధనుడు, కుమార్తె పృథ్వీపారి.


రెండో జయసింహవల్లభుడు (క్రీ.శ.705-718): మంగి యువరాజు తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఇతడి బిరుదులు సకల లోకాశ్రయ, సర్వసిద్ధి.


కొక్కిలి విక్రమాదిత్యుడు (క్రీ.శ.718): రెండో జయసింహ వల్లభుడి సోదరుడు. ఆరు నెలలు రాజ్యపాలన చేశాడు. ఇతడిని సోదరుడైన మూడో విష్ణువర్ధనుడు ఓడించి తరిమేశాడు. పారిపోయిన కొక్కిలి మధ్య కళింగలో స్థిరపడి ‘యలమంచిలి’ రాజధానిగా చిన్న రాజ్యాన్ని స్థాపించాడు.


మూడో విష్ణువర్ధనుడు (క్రీ.శ.718-753): బిరుదులు సమస్త భువనాశ్రయ, త్రిభువనశంకు, పరమ భట్టారకుడు. ఇతడి కాలంలో పల్లవులతో ఘర్షణ మొదలైంది. సమకాలీన పల్లవరాజు రెండో నందివర్మ. పల్లవుల దండనాథుడైన ఉదయచంద్రుడు చాళుక్య రాజ్యంలోని బోయకొట్టాల (నెల్లూరు)పై దండెత్తి, ఆక్రమించాడు.


మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ.753-770): పరాక్రమవంతుడు, త్రిభువనాంకుశ, మహారాజాధిరాజ, పరమేశ్వర, పరమభట్టారక అనే బిరుదులున్నాయి. ఇతడి కాలంలో బాదామి చాళుక్య రాజ్యాన్ని రాష్ట్రకూటులు ఆక్రమించారు. రెండో కీర్తివర్మను తొలగించి దంతిదుర్గుడు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


నాలుగో విష్ణువర్ధనుడు (క్రీ.శ.771-806): మొదటి విజయాదిత్యుడి కుమారుడు. రాష్ట్రకూట రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధంలో తలదూర్చాడు. చివరికి మొదటి కృష్ణుడి కుమారుడైన ధ్రువుడికి తన కుమార్తె శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. వేంగి రాజ్యం రాష్ట్రకూటులకు సామంత రాజ్యమైంది.


రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.806-846): నాలుగో విష్ణువర్ధనుడి పెద్ద కుమారుడు. బిరుదులు చాళుక్యరామ, విక్రమధవళ, నరేంద్ర మృగరాజు. ఇతడి సోదరుడు భీమసలకుడు రాష్ట్రకూటుల సాయంతో తానే రాజుగా ప్రకటించుకున్నాడు. సోదరుల మధ్య పన్నెండేళ్లు అంతర్యుద్ధం జరిగింది. ఈ పన్నెండేళ్లలో 108 యుద్ధాల్లో శత్రుసంహారం చేసి చివరకు విజయాదిత్యుడు విజయం సాధించాడు. రాష్ట్రకూట అమోఘవర్షుడు తన సోదరిని, విజయాదిత్యుడి కుమారుడు కలివిష్ణువర్ధనుడికి ఇచ్చి వివాహం చేశాడు. విజయాదిత్యుడు మహేశ్వరుడి భక్తుడు. 108 యుద్ధాల్లో తను చేసిన జీవహింసకు పాపపరిహారంగా 108 శివాలయాలను నిర్మించాడు. వీటిని నరేంద్రేశ్వర ఆలయాలు అంటారు.


కలి విష్ణువర్ధనుడు/అయిదో విష్ణువర్ధనుడు (క్రీ.శ.846-848): రెండో విజయాదిత్యుడి తర్వాత రాజు అయ్యాడు. స్వల్పకాలం పరిపాలన చేశాడు.


గుణగ విజయాదిత్యుడు/మూడో విజయాదిత్యుడు (క్రీ.శ.848-892): బిరుదులు గుణగ, పరచక్రరామ, త్రిపుర మర్త్య, మహేశ్వర, వల్లభి. ఇతడి పరిపాలన కాలంలో తూర్పు చాళుక్యుల అధికారం అత్యున్నత స్థితికి చేరింది. రాజైన మొదటి సంవత్సరంలోనే తన సేనాధిపతి పాండురంగడిని దక్షిణ దిగ్విజయ యాత్రలకు పంపాడు. గతంలో పల్లవులు ఆక్రమించిన నెల్లూరు మండలంలోని 12 కొట్టాలు, బోయ రాష్ట్రాన్ని తిరిగి పొందాడు. ఆ ప్రాంతాలకు కందుకూరుని కేంద్రంగా చేశాడు. నెల్లూరు ప్రాంతాన్ని తగలబెట్టాడు. పులికాట్‌ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. పులికాట్‌ వద్ద పాండురంగ మహేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. విజయాదిత్యుడు రాష్ట్రకూటులతో ఘర్షణకు దిగి మొదటి అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా అతడి సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. అమోఘవర్షుడి మరణం తర్వాత రాజైన రెండో కృష్ణుడిపై మూడో విజయాదిత్యుడు యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధ విజయం గురించి సాతులూరు శాసనంలో ఉంది. విజయాదిత్యుడి దండయాత్రలో ప్రసిద్ధమైంది ‘దాహళదేశ దండయాత్ర’. నర్మదా-గంగా నదుల మధ్య ఉన్న ప్రదేశానికి దాహళ దేశం అని పేరు. ఈ దండయాత్రను సేనాధిపతి పాండురంగడు నడిపించాడు. గాంగులను, వేములవాడ చాళుక్యులను జయించాడు. బస్తరులోని చక్రకూట దుర్గాన్ని ఆక్రమించాడు. వేముల చాళుక్య రాజు, రాష్ట్రకూట సామంతుడు, దక్షిణ కోసల దేశపాలకుడైన సోలదగండ బద్దెగుడిని ఓడించాడు. చివరకు దాహళదేశ రాజధాని కిరణపురాన్ని ముట్టడించాడు. వరాటదేశంలో ప్రవేశించి అచలపురాన్ని తగలబెట్టాడు. ఈ విజయాల తర్వాత రాష్ట్రకూట చక్రవర్తుల బిరుదులైన పృథ్వీ వల్లభ, దక్షిణాపతి బిరుదులను స్వీకరించాడు. సూర్యచంద్ర గంగా యమున పాళిధ్వజాది సామ్రాజ్య చిహ్నాలను స్వీకరించి దక్షిణాధిపతిగా ప్రకటించుకున్నాడు.  విజయాదిత్యుడి సార్వభౌమత్వాన్ని అంగీకరించి అతడి రాజ్యాన్ని రెండో కృష్ణుడు తిరిగి ఇచ్చేశాడు.  గుణగ విజయాదిత్యుడి విజయాలు పాండురంగడి అద్దంకి శాసనంలో ఉన్నాయి. ఇది తెలుగులో తొలి పద్య శాసనం.


మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ.892-922): ఇతడిని ఆరో విష్ణువర్ధనుడు అని కూడా అంటారు. గుణగ విజయాదిత్యుడికి కుమారులు లేరు. దాంతో పెద్ద సోదరుడి కుమారుడు చాళుక్య భీముడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి కాలంలో రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు రెండు సార్లు దండెత్తి వచ్చాడు. ఆ రెండు దండయాత్రలు మొదటి చాళుక్య భీముడి కుమారుడైన ‘ఇరిమర్త గండని’ శౌర్యం వల్ల విఫలమయ్యాయి. కానీ ఇరిమర్త గండ యుద్ధభూమిలో మరణించాడు. కుమారుడి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లాలో చాళుక్య భీమవరం పట్టణాన్ని నిర్మించారు. అక్కడ ‘కుమారారామం’ అనే పేరుతో శివాలయాన్ని నిర్మించాడు. దీన్ని నేడు కొమరారామం అంటున్నారు.


నాలుగో విజయాదిత్యుడు (క్రీ.శ.922): బిరుదు కొల్లభిగండ. ఆరు నెలలు రాజ్యపాలన చేశాడు. కళింగ రాజు మొదటి వజ్రహస్తుడిని విరజాపురి వద్ద ఓడించాడు. ఇతడు రాష్ట్ర కూటులతో యుద్ధం చేస్తూ మరణించాడు.


మొదటి అమ్మ రాజు (క్రీ.శ.922-928): బిరుదులు విష్ణువర్ధన, రాజమహేంద్ర. చేకుర్రు తామ్ర శాసనం వేయించాడు. ఈ కాలంలో దాయాదుల మధ్య పోరు ప్రారంభమైంది. ఇతడు రాజమహేంద్రవరాన్ని నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతారు..


బేత విజయాదిత్య/కంఠిక విజయాదిత్య (క్రీ.శ.928): కేవలం 15 రోజులు పరిపాలించాడు.


రెండో విక్రమాదిత్యుడు (క్రీ.శ.928-929): కంఠిక విజయాదిత్యుడిని తొలగించి ఇతడు రాజు అయ్యాడు. ఏడాది పాటు పాలించాడు. ఈ కాలంలో వేంగి రాజ్యంలో త్రికళింగ  చేరింది.


భీముడు (క్రీ.శ.929-930): రెండో విక్రమాదిత్యుడిని వధించి రాజు అయ్యాడు. ఎనిమిది నెలల పాటు పరిపాలించాడు. ఇతడి కాలంలో రాజ్యం అల్లకల్లోలమైంది.


రెండో యుద్ధమల్లుడు (క్రీ.శ.930-934): భీముడిని చంపి రాజయ్యాడు. ఇతడికి సహాయం చేసింది రాష్ట్ర కూట రాజు నాలుగో గోవిందుడు. రాజధాని చేబ్రోలు. బెజవాడ పట్టణంలో కార్తికేయుడి ఆలయాన్ని నిర్మించాడు. బెజవాడ వద్ద శాసనం వేయించాడు.


రెండో చాళుక్య భీముడు (క్రీ.శ.935-945): యుద్ధమల్లుడిని పారద్రోలి రాజ్యానికి వచ్చాడు. బిరుదులు రాజమహేంద్ర, గండ మార్తాండ. ఇతడికి ఇమ్మడి చాళుక్య భీముడు అనే పేరు కూడా ఉంది. ఇద్దరు భార్యలు. ఒకరు అంకిదేవి. కళింగ వంశస్థురాలైన కుమారుడు దానార్ణవుడు. మరో భార్య లోకాంబిక తెలుగు చోళ రాజ పుత్రిక. ఈమె పుత్రుడు రెండో అమ్మరాజు విజయాదిత్యుడు.


రెండో అమ్మరాజు (క్రీ.శ.945-970): రెండో చాళుక్య భీముడి చిన్న కుమారుడు. రెండో అమ్మరాజు అభిషేక నామం విజయాదిత్యుడు. ఈయన కాలంలో దాయాదుల పోరు జరిగింది. దానార్ణవుడు రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడి సాయంతో ఇతడిని తరిమేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. దాంతో కళింగœ దేశంలో అమ్మరాజు తలదాచుకున్నాడు. ఇతడు మళ్లీ వేంగిపై దాడి చేశాడు. కానీ రణరంగంలో దానార్ణవుడి చేతిలో హతమయ్యాడు. రెండో అమ్మరాజు మంచి పరిపాలకుడు. అన్ని మతాలను ఆదరించాడు. సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. కవిగాయక కల్పతరువు అనే బిరుదు ఉంది. బమ్మెర పోతన ఇతడి సమకాలీకుడు.


దానార్ణవుడు (క్రీ.శ.970-973): రెండో చాళుక్య భీముడి పెద్ద కొడుకు, తన సోదరుడైన రెండో అమ్మరాజును చంపి ఇతడు రాజయ్యాడు. పెదకల్లు పరిపాలకుడు జటాచోడ భీముడు (రెండో అమ్మరాజు బావమరిది) దండెత్తి వేంగిని ఆక్రమించాడు. ఆ సమయంలో దానార్ణవుడి ఇద్దరు కుమారులు చోళ రాజ్యానికి పారిపోయారు. రాజరాజ చోళుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు. తన కుమార్తె కుందవ్వని దానార్ణవుడి కుమారుల్లో ఒకడైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.


జటాచోడ భీముడు (క్రీ.శ.973-998): ఇతడు తెలుగు చోడ వంశానికి చెందినవాడు. మహేంద్రగిరి నుంచి కంచి, బంగాళాఖాతం నుంచి కర్ణాటక సరిహద్దు వరకు సువిశాల రాజ్యాన్ని స్థాపించాడు. రాజధాని పెదకల్లు. ‘చోడ[త్రినేత్ర’ బిరుదాంకితుడు. రాజరాజ చోళుడు ఇచ్చి పంపిన సైన్యంతో దానార్ణవుడి మరో కుమారుడైన మొదటి శక్తివర్మ వేంగిపై దాడి చేసి జటాచోడ భీముడిని వధించాడు.


మొదటి శక్తివర్మ (క్రీ.శ.999-1011): తూర్పు చాళుక్యుల పరిపాలనను పునరుద్ధరించాడు. కానీ వేంగి రాజ్యం స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. 1006లో కల్యాణి చాళుక్య పాలకుడైన సత్యాశ్రయుడు బయ్యాలనంబిని వేంగి పైకి దండయాత్రకు పంపాడు. చోళరాజుల సహాయంతో ఈ దండయాత్రను శక్తివర్మ తిప్పికొట్టాడు. ఇతడికి చాళుక్య చంద్ర అనే బిరుదు ఉంది.


విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018): మొదటి శక్తి వర్మకు సోదరుడు. రాజమార్తాండ, ముమ్మడి భీమ అనే బిరుదులున్నాయి. ఇతడి ఇద్దరు భార్యలు కుందవ్వ (రాజరాజ చోళుడి కుమార్తె), మేళమ (జటాచోడ భీముడి కుమార్తె). కుందవ్వ కుమారుడు రాజరాజ నరేంద్రుడు, మేళమ కుమారుడు విజయాదిత్యుడు. రాజరాజ నరేంద్రుడికి పట్టాభిషేకం చేశారు. విమలాదిత్యుడు జైన మతం స్వీకరించినట్లు రామతీర్థం శాసనం తెలియజేస్తోంది. ఇతడి జైన గురువు ‘త్రికాల యోగి సిద్ధాంత దేవుడు’. ఆయన కోసం విమలాదిత్యుడు విశాఖపట్నం జిల్లాలోని రామతీర్ధంలో ‘రామకొండ గుహాలయం’ నిర్మించాడు.


రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ.1019-1061): ఇతడు తన సోదరుడైన విజయాదిత్యుడి ప్రతిఘటన వల్ల నాలుగేళ్లు పట్టాభిషేకం చేసుకోలేదు. ఆ సమయంలో విజయాదిత్యుడికి కల్యాణి చాళుక్యులు సాయం చేస్తే, రాజరాజ నరేంద్రుడికి చోళులు అండగా ఉన్నారు. రాజేంద్రచోళుడు తన కుమార్తె అమ్మంగ దేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతడు 42 సంవత్సరాలు సుదీర్ఘ పాలన సాగించాడు. కల్యాణి చాళుక్య రాజు ఆహావమల్ల సోమేశ్వరుడితో సంధి చేసుకున్నాడు. ఈ సోమేశ్వరుడే నారాయణ భట్టును రాజరాజ నరేంద్రుడి ఆస్థానానికి పంపాడు. ఆస్థాన కవి అయిన నన్నయకు నారాయణ భట్టు సహాధ్యాయి. అతడు ఆంధ్ర మహాభారతం రచనలో నన్నయకు సాయపడ్డాడు. భట్టుకు నందపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు అగ్రహారంగా ఇచ్చాడు.


రెండో శక్తివర్మ (క్రీ.శ.1061-1062): రాజరాజనరేంద్రుడి మరణం తర్వాత వేంగి రాజ్యంలో సింహాసనం కోసం మరోసారి దాయాదుల పోరు జరిగింది. రాజరాజ నరేంద్రుడి  సవతి సోదరుడు ఏడో విజయాదిత్యుడు రాజయ్యాడు. ఇతడికి కల్యాణి చాళుక్యులు సాయపడ్డారు. కానీ, తర్వాత కల్యాణి చాళుక్య రాజు ఆహావమల్ల సోమేశ్వరుడు తన కుమారుడైన రెండో శక్తి వర్మను వేంగి ప్రాంతానికి రాజుగా ప్రకటించాడు.


రాజేంద్రుడు (క్రీ.శ.1068-1070): రాజరాజ నరేంద్రుడి కుమారుడైన ఇతడిని ఏడో విజయాదిత్యుడు తరిమేశాడు. రాజేంద్రుడు తమిళ దేశం పారిపోయి కుళోత్తుంగ చోళ పేరుతో చోళ సామ్రాజ్యానికి వారసుడయ్యాడు. వీర రాజేంద్రుడు తన కుమార్తె మధురాంతకను ఇతడికి ఇచ్చి వివాహం చేశాడు. అనంతర కాలంలో కుళోత్తుంగుడు చోళ, చాళుక్య రాజ్యాలను కలిపి పరిపాలించాడు.తన పేరు మీదుగా కుళోత్తుంగ చోళపురాన్ని (విశాఖపట్నం) నిర్మించాడు.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 04-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు బానిస వంశం - ఇల్‌టుట్‌మిష్‌

ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211 నుంచి క్రీ.శ.1236 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు టర్కీ జాతీయుడు. ఇల్బారి తెగకు చెందినవాడు.

* ఇల్‌టుట్‌మిష్‌ సోదరులు అతడ్ని కుతుబుద్దీన్‌ ఐబక్‌కు బానిసగా అమ్మేశారు. కుతుబుద్దీన్‌ను మెప్పించిన ఇల్‌టుట్‌మిష్‌ అనతికాలంలోనే గ్వాలియర్, బులంద్‌ షహర్‌లకు గవర్నర్‌ అయ్యాడు. అంతేకాక తన యజమాని కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

* ఇల్‌టుట్‌మిష్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాక ఆరాంషా మద్దతుదారులు ఇతడిపై కక్ష కట్టారు. సరిహద్దుల్లో శత్రువుల దాడులు ఎక్కువయ్యాయి. 

* బెంగాల్‌ పాలకుడు అలీమర్దీఖాన్‌ తనకు తాను స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నసీరుద్దీన్‌ కబచా సింధును ఆక్రమించాడు. గజనీ పాలకుడు తాజుద్దీన్‌ యాల్దజ్‌ ఢిల్లీ ఆక్రమణకు ప్రయత్నాలు చేశాడు. రాజపుత్ర పాలకులైన చందేలులు, పార్థియన్లు, చౌహాన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ సమయంలోనే మంగోలులు భారతదేశంపై దాడులు ప్రారంభించారు.


రక్‌ఉద్దీన్‌ ఫిరోజ్‌షా 

ఇల్‌టుట్‌మిష్‌ మరణించాక అతడి పెద్ద కొడుకైన రక్‌ఉద్దీన్‌ ఫిరోజ్‌షా క్రీ.శ.1236లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడికి పాలనపై ఆసక్తి లేదు. అతడి తల్లి షాతుర్కన్‌ పాలనా వ్యవహారాలు చూసుకునేది. ఈమె మహాక్రూరురాలు. అధికారాన్నంతా తన చేతిలో ఉంచుకుని ఇష్టానుసారం రాజ్యాన్ని పాలించింది. దీంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె రజియా సుల్తానా ఢిల్లీ సుల్తాన్‌ అయ్యింది.

రజియా సుల్తానా (క్రీ.శ.1236-1240) 

ఈమె భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు. రజియా సుల్తానా తన పాలనను సుస్థిరం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. మొదటగా వజీర్‌ జునైద్‌ని పదవి నుంచి తొలగించింది. 

* ఆ సమయంలో సుల్తాన్‌కు పాలనలో సహాయం చేసేందుకు ఒక వర్గం ఉండేది. ఇందులో 40 మంది మతపెద్దలు ఉండేవారు. దాన్ని చిహల్‌గని కూటమి అంటారు. ఈ కూటమి రజియా సుల్తానాను రాణిగా గుర్తించలేదు. 

 చిహల్‌గని కూటమి ప్రాబల్యం తగ్గించేందుకు ఆమె తురుష్కేతరులను ఉన్నత పదవుల్లో నియమించింది. 

* తనకు నమ్మకస్తుడైన జమాలుద్దీన్‌ యాకుబ్‌ను అశ్వదళాధిపతి (అమీర్‌-ఇ-అఖాత్‌)గా నియమించింది. ఇతడు అబిసీనియాకి చెందిన నీగ్రో జాతీయుడు.


ఇఖ్తియారుద్దీన్‌ అల్తూనియా:

రజియా సుల్తానాకు వ్యతిరేకంగా భటిండా పాలకుడు ఇఖ్తియారుద్దీన్‌ అల్తూనియా తిరుగుబాటు చేశాడు. దీన్ని రజియా అణచలేకపోయింది. ఈ యుద్ధంలో యాకుబ్‌ మరణించగా, రజియా బందీగా చిక్కింది.  

* అల్తూనియా రజియా సుల్తానాను వివాహం చేసుకుని, ఇల్‌టుట్‌మిష్‌ మూడో కుమారుడైన మొయినుద్దీన్‌ బెర్హాంను ఢిల్లీ సింహాసనంపై కూర్చోపెట్టాడు.

* మొయినుద్దీన్‌ రాజయ్యాక అల్తూనియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ కారణంగా అల్తూనియా, రజియా సుల్తానాలు మొయినుద్దీన్‌పై దండెత్తారు. 

* మొయినుద్దీన్‌ సైన్యం వారిని ఓడించగా, తిరిగి భటిండాకు వెళ్లిపోయారు. 

* క్రీ.శ. 1240లో వీరిద్దరినీ తియావాల్‌ వద్ద దొంగలు హతమార్చారు. 


రజియా సుల్తానా పాలనా విధానం: 

రజియాకు ధైర్యసాహసాలు ఎక్కువ. ఈమె కొంతకాలమే రాజ్యపాలన చేసినప్పటికీ, ఢిల్లీ సుల్తాన్‌ల ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 

* రజియా సుల్తానా గొప్ప రాణి. తెలివైన స్త్రీ, విద్యావంతులను పోషించి, న్యాయంగా పాలించింది. కేవలం స్త్రీ అనే కారణంగా ఈమెను పాలనలో కొనసాగనివ్వలేదు. 

* రాజుకు ఉండాల్సిన అన్ని అర్హతలు రజియాకు ఉన్నాయని ‘మినాజ్‌ ఉస్‌ సిరాజ్‌’ లాంటి చరిత్రకారులు వ్యాఖ్యానించారు. 

* ఈమె పురుషవేషం ధరించి యుద్ధాల్లో పాల్గొనేది. 

* రజియా తరువాత 1204-66 మధ్య బహరాంషా, మసూద్‌ షా, నసీరుద్దీన్‌ మహమ్మద్‌ ఢిల్లీని పాలించారు. బహరాంషా కాలంలో ‘మంగూ’ నాయకత్వంలో మంగోలులు దండెత్తారు. నసీరుద్దీన్‌ ‘మివాటీలు’ అనే దారిదోపిడీ దొంగలను అణచివేశాడు.


విజయాలు

మొదటగా ఆరాంషా అనుచరులను అణచి ఢిల్లీ, ఔద్, బదాయన్, బెనారస్‌లో తన అధికారాన్ని స్థిరం చేసుకున్నాడు.

‘ గజనీ పాలకుడు తాజుద్దీన్‌ యాల్దజ్‌ ఢిల్లీని ఆక్రమించాలని దండయాత్ర చేశాడు. వీరిద్దరి మధ్య క్రీ.శ.1125లో తెరైన్‌ వద్ద యుద్ధం జరిగింది. ఇందులో యాల్దజ్‌ను ఇల్‌టుట్‌మిష్‌ ఓడించి, వధించాడు.

మంగోలులతో యుద్ధం: మంగోలులు మధ్య ఆసియాకి చెందిన ఆటవిక తెగవారు. వీరి నాయకుడు చెంఘిజ్‌ ఖాన్‌. ఇతడికి క్రూరుడు, నాశనం చేసేవాడు అనే పేరుంది. వీరు చైనా, మధ్య ఆసియా, పశ్చిమాసియాలపై దండెత్తి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి వారు క్వారజాన్‌వైపు ప్రయాణించి, దాన్ని నాశనం చేశారు.

* ఆ సమయంలో క్వారజాన్‌ను అల్లాఉద్దీన్‌ మహమ్మద్‌ పాలిస్తున్నాడు. అతడి కుమారుడైన జలాలుద్దీన్‌ మంగబారిని ఢిల్లీ వెళ్లి ఇల్‌టుట్‌మిష్‌ సాయం కోరాడు. 

* జలాలుద్దీన్‌కి ఆశ్రయం ఇస్తే మంగోలుల వల్ల తనకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ఇల్‌టుట్‌మిష్‌ అందుకు నిరాకరించాడు.

* దీంతో మంగబారిని సింధు చేరుకుని నసీరుద్దీన్‌ కబచా ఆశ్రయం పొందాడు. మంగోలులు జలాలుద్దీన్‌ కోసం సింధుపై దాడి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదు. దానికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన వేడి గాలులు. 

* మంగోలులు వెళ్లిపోయాక జలాలుద్దీన్‌ నసీరుద్దీన్‌ కబాచాపై దాడి చేసి, సింధును ఆక్రమించాడు.

* మంగోలులు భారత్‌పైకి రాకుండా ఇల్‌టుట్‌మిష్‌ తెలివిగా వ్యవహరించాడు.


సింధు ఆక్రమణ: ఇల్‌టుట్‌మిష్‌ సింధుపై దాడి చేసి జలాలుద్దీన్‌ మంగబారిని ఓడించాడు. తర్వాత సింధు, ముల్తాన్‌లను ఢిల్లీలో కలుపుకున్నాడు.

బెంగాల్‌పై దండయాత్ర: అలీమర్దీఖాన్‌ మరణించాక హిసాయుద్దీన్‌ ఐవాజ్‌ ఖిల్జీ బెంగాల్‌ పాలకుడయ్యాడు.

* బెంగాల్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారుడైన నసీరుద్దీన్‌ మహమ్మద్‌ను పంపాడు. ఈ యుద్ధంలో ఇవాజ్‌ మరణించాడు.

* ఇవాజ్‌ వారసుడైన బల్కా ఖిల్జీ ఇల్‌టుట్‌మిష్‌పై తిరుగుబాటు చేయగా, దాన్ని అతడు అణచివేశాడు. దీంతో  బెంగాల్, బిహార్‌ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్‌ల పాలన కిందకు వచ్చాయి.

రాజపుత్రులతో యుద్ధం: చందేలులు కలంజర్‌లో; పార్థియన్లు గ్వాలియర్, ఝాన్సీలో; చౌహాన్లు జలోర్, అజ్మీర్, భీమ్మల్లలో స్వతంత్రంగా పాలించుకుంటున్నారు. 

* రాజపుత్రులపై దృష్టిసారించిన ఇల్‌టుట్‌మిష్‌ మొదట రణ్‌తంబోర్, మండవార్లను ఆక్రమించాడు. తర్వాత గ్వాలియర్‌తో మొదలుపెట్టి మాళ్వా వరకు దాడులు కొనసాగించాడు. అయితే ఇవన్నీ విఫలం అయ్యాయి. 

* ఇతడు గుజరాత్‌లోని చాళుక్యులను, బుండిలోని చౌహాన్లను, కలంజర్‌లోని చందేలులను ఓడించలేకపోయాడు.

* బనియాన్‌కు చెందిన రాజపుత్రులను అణచివేసే ప్రయత్నంలో ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ. 1236లో మరణించాడు.


ఇల్‌టుట్‌మిష్‌ పాలన - ఇతర విశేషాలు

ఢిల్లీ రాజ్యాధికారాన్ని సుస్థిరం చేయడంలో ఇల్‌టుట్‌మిష్‌ దాదాపు విజయం సాధించాడని చరిత్రకారులు పేర్కొన్నారు.

కుతుబుద్దీన్‌ ప్రారంభించిన కుతుబ్‌ మినార్‌ నిర్మాణాన్ని ఇతడు పూర్తి చేశాడు. కుతుబ్‌ మినార్‌కి దక్షిణంగా హౌజ్‌-ఐ-షంసీ రిజర్వాయర్‌ను తవ్వించాడు.

తన తెలివితేటలతో మంగోలుల దండయాత్రల నుంచి ఢిల్లీ రాజ్యాన్ని కాపాడాడు. 

ఇల్‌టుట్‌మిష్‌ అధికారాన్ని గుర్తించిన ఖలీఫా, ఇతడికి ‘విశ్వాసపాత్రుడైన సైనికాధికారి’ అని బిరుదు ఇచ్చాడు. ఇతడికి ‘నసీర్‌ అమీర్‌ ఉల్‌ మొమ్మిన్‌’ (విశ్వసనీయుడైన ఉపనాయకుడు) అనే బిరుదు కూడా ఉంది.

చరిత్రకారులు ఇతడ్ని ఢిల్లీ సుల్తానత్‌ నిజమైన స్థాపకుడిగా పేర్కొన్నారు.

రాజ్యాన్ని ‘ఇక్తాలు’గా (సైనిక రాష్ట్రాలుగా) విభజించాడు. వాటికి ‘ముక్తి’లు అనే పాలకులను నియమించాడు. 

టంకా (వెండి నాణెం), జిటాల్‌ (రాగి నాణెం) అనే నాణేలను విడుదల చేశాడు. వాటిపై ఖలీఫా పేరును అరబ్బీ భాషలో ముద్రించాడు. 

ఇతడు ధర్మగంటను నెలకొల్పి పాలన చేశాడని ‘ఇబన్‌ బటూటా’ పేర్కొన్నాడు. 

ఉజ్జయినిలోని సుప్రసిద్ధ మహంకాళీ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 

ఇల్‌టుట్‌మిష్‌ సమాధి న్యూదిల్లీలోని మెహ్రౌలీ ఉంది.


కుతుబుద్దీన్‌ మరణం నాటి పరిస్థితులు

కుతుబుద్దీన్‌ ఐబక్‌కు కొడుకులు లేరని అటా-మాలిక్‌-జువ్యని తన గ్రంథం ‘తారిఖ్‌-ఐ-జహంగ్‌షే’లో పేర్కొన్నాడు. 

* కుతుబుద్దీన్‌ మరణించాక ఆరాంషా సుల్తాన్‌ అయ్యాడు. దీనికి వ్యతిరేకంగా ముల్తాన్‌ గవర్నర్‌ నసీరుద్దీన్‌ కబచా తిరుగుబాటు చేశాడు. మిలటరీ న్యాయమూర్తి (అమీర్‌-ఐ-డడ్‌) అలీ-ఇస్మాయిల్‌ ఇల్‌టుట్‌మిష్‌ను సింహాసనం అధిష్టించాల్సిందిగా కోరాడు. 

* ఇలాంటి పరిస్థితుల్లో ఇల్‌టుట్‌మిష్‌ కొంతమంది సైన్యంతో ఢిల్లీపైకి దండెత్తాడు. బాగ్‌-ఐ-జడ్‌ వద్ద ఆరాంషాను ఓడించి, వధించాడు. దీంతో ఇల్‌టుట్‌మిష్‌ అధికారానికి తిరుగులేకుండా పోయింది. కుతుబుద్దీన్‌కి అల్లుడు కావడం, ఇతడికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేయడం లాంటి కారణాల వల్ల ఇల్‌టుట్‌మిష్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించగలిగాడు. ఇతడు కూడా బానిస జీవితం నుంచి ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాడు.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు - ఖిల్జీ వంశం (క్రీ.శ. 1290 - 1320)

అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 

ఇతడు క్రీ.శ. 1296-1316 మధ్య రాజ్య పాలన చేశాడు. ఢిల్లీ సుల్తానుల్లోనే కాక, మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే ఇతడ్ని గొప్ప రాజుగా పేర్కొంటారు. 

అల్లాఉద్దీన్‌ గొప్ప యోధుడు, సమర్థ పాలకుడు, తెలివైనవాడిగా పేరొందాడు. ఇతడు ఢిల్లీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. 

ఢిల్లీ సార్వభౌమాధికారాన్ని ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరింపజేశాడు. ఇతడికి అలెగ్జాండర్‌లా ప్రపంచ విజేత కావాలనే కోరిక ఉండేది. 

ఇతడికి ఖాజీ ఉల్‌ముల్క్‌ సేవకుడిగా ఉండేవాడు. దేశీయ, విదేశాంగ విధానాలు ఇతడి పర్యవేక్షణలో రూపొందేవి. 

అల్లాఉద్దీన్‌ ఒక నూతన మతాన్ని స్థాపించి, ఖ్యాతి పొందాలని భావించాడు. ప్రపంచవ్యాప్తంగా తన పేరు శాశ్వతంగా ఉండేందుకు ఏదైనా చేయాలని కాంక్షించాడు. ఖాజీ ఉల్‌ముల్క్‌ అతడికి భారతదేశాన్ని జయించమని సలహా ఇచ్చాడు. 

ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్, అల్తాఫ్‌ఖాన్, జాఫర్‌ఖాన్, మాలిక్‌-ఉల్‌-ముల్క్, మాలిక్‌ ఫకృద్దీన్, మాలిక్‌ అల్‌గారి లాంటి సమర్థులైన సైన్యాధికారులు ఇతడి వద్ద ఉండేవారు. వారి సహాయంతో అల్లాఉద్దీన్‌ అనేక విజయాలు సాధించాడు.

అల్లాఉద్దీన్‌ మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలనుకున్నాడు. ప్రజలపై పన్నుల భారాన్ని పెంచాడు. 

రాజు దైవాంశసంభూతుడని; సుల్తాన్‌ న్యాయమూర్తి, భగవంతుడి ప్రతినిధి అని పేర్కొన్నాడు.

*  ఇతడు ఇస్లాం రక్షకుడిగా పేరొందాడు. ఇతడికి యామిన్‌ ఉల్‌ ఖిలాఫత్‌ నాసిర్, అమీర్‌ ఉల్‌ మూమ్నాని, సికిందర్‌-ఇ-సని (రెండో అలెగ్జాండర్‌) అనే బిరుదులు ఉన్నాయి.

అల్లాఉద్దీన్‌ రాజయ్యాక జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షా భార్య మాలిక్‌ జహన్‌ని ఖైదు చేసి, అతడి కొడుకులు ఇబ్రహీం, అర్కలీని గుడ్డివాళ్లను చేశాడు.

‘‘ఇతడు తన వ్యతిరేకులను కఠినంగా శిక్షించేవాడు. సర్దారులు, అమీర్‌లను పదవుల నుంచి తొలగించాడు’’ అని జియాఉద్దీన్‌ బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


ఉత్తర భారతదేశ దండయాత్రలు

గుజరాత్‌పై దండయాత్ర: క్రీ.శ. 1297లో అల్లాఉద్దీన్‌ తన సైనికాధికారులైన ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్‌లను గుజరాత్‌పైకి దండయాత్రకి పంపాడు. 

గుజరాత్‌ పాలకుడైన వాఘీల కర్ణదేవుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఖిల్జీ సేనలు కర్ణదేవుడి భార్య కమలాదేవితో పాటు అపార సంపదను అల్లాఉద్దీన్‌కి అప్పగించాయి. 

అల్లాఉద్దీన్‌ కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. కర్ణదేవుడు, అతడి కుమార్తె దేవలదేవి గుజరాత్‌ నుంచి పారిపోయి దేవగిరిలో ఆశ్రయం పొందారు. 

గుజరాత్‌ ఆక్రమణ తర్వాత ఖిల్జీ సైన్యం సోమనాథ్‌ ఆలయాన్ని దోచుకుంది. 

నస్రత్‌ఖాన్‌ ఈ దండయాత్ర తర్వాత కాంబే మార్కెట్‌లో మాలిక్‌ కపూర్‌ అనే బానిసను కొని, అతడిని అల్లాఉద్దీన్‌కి బహుమతిగా ఇచ్చాడు. మాలిక్‌ కపూర్‌ అనేక యుద్ధాల్లో పాల్గొని అల్లాఉద్దీన్‌ విజయానికి కృషి చేశాడు.

రణతంబోర్‌పై దండయాత్ర: రణతంబోర్‌ పాలకుడు హంవీరదేవుడు. ఇతడు రాజపుత్రుడు. 

క్రీ.శ. 1298లో ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్‌ రణతంబోర్‌పై దండయాత్ర చేశారు.

వీరిని హంవీరదేవుడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఏడాదిపాటు అల్లాఉద్దీన్‌ సేనలు రణతంబోర్‌ కోటను ఛేదించలేకపోయాయి. 

హంవీరదేవుడి సేనాని రణమల్లుడ్ని నస్రత్‌ఖాన్‌ ధనంతో తనవైపు తిప్పుకుని కోట రహస్యాలు తెలుసుకున్నాడు. 

తర్వాత జరిగిన యుద్ధంలో ఖిల్జీ సేనలు విజయం సాధించాయి. ఇందులో నస్రత్‌ఖాన్, హంవీరదేవుడు మరణించారు. 

 ఈ యుద్ధానంతరం రణతంబోర్‌ రాజపుత్ర స్త్రీలు ఖిల్జ్జీ సైన్యాలకు చిక్కకుండా జౌహార్‌కు (అగ్నిలో దూకి ప్రాణాలు పోగొట్టుకోవడం) పాల్పడ్డారు.

చిత్తోడ్‌పై దండయాత్ర: క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్‌ సైన్యం చిత్తోడ్‌పై దాడులు చేసింది. ఆ సమయంలో రాజపుత్ర రాజ్యల్లో చిత్తోడ్‌ బలంగా ఉండేది.

చిత్తోడ్‌ రాజపుత్ర రాజైన రాణారతన్‌సింగ్‌ అధీనంలో ఉండేది. ఇతడు శత్రువుల బారి నుంచి తన కోటను ఏడు నెలలపాటు కాపాడాడు. క్రీ.శ.1303, ఆగస్టులో ఖిల్జీ సైన్యం చిత్తోడ్‌ను ఆక్రమించింది. ఈ యుద్ధంలో రాణారతన్‌సింగ్‌ మరణించాడు. అతడి భార్య రాణి పద్మినితో పాటు అంతఃపుర స్త్రీలు జౌహార్‌ నిర్వహించి, ప్రాణత్యాగం చేశారు.

అల్లాఉద్దీన్‌ చిత్తోడ్‌ను ఆక్రమించాక దాని పేరును ఖిజీరాబాద్‌గా మార్చాడు. దీనికి తన కుమారుడు ఖజీర్‌ఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. 

రాణి పద్మిని గురించి మాలిక్‌ మహమ్మద్‌ జైసీ తన గ్రంథం పద్మావత్‌లో రాశాడు. ఆమె ఎంతో అందమైన స్త్రీ అని అందులో పేర్కొన్నాడు. ఇది చదివిన ఖిల్జీ ఆమె కోసమే చిత్తోడ్‌పై దండయాత్ర నిర్వహించాడని మాలిక్‌ మహమ్మద్‌ విశ్వసించాడు. అయితే ఇది కల్పితమని అనేకమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.


ఇతర దండయాత్రలు: అల్లాఉద్దీన్‌ సైన్యాలు క్రీ.శ.1305లో మాల్వా రాజైన మహాలక్ష్మీదేవుడ్ని (మహలకదేవుడు) ఓడించి, ఉజ్జయిని, ధార్‌ చందేరి ప్రాంతాలను ఆక్రమించాయి. అల్లాఉద్దీన్‌ వీటికి గవర్నర్‌గా ఐన్‌ఉల్‌-ముల్క్‌ను నియమించాడు 

క్రీ.శ. 1308లో పారమార రాజపుత్ర రాజ్యమైన సివాణుపై ఖిల్జీ సేనలు దండెత్తాయి. దాని పాలకుడైన శివదేవుడ్ని ఓడించి, రాజ్యాన్ని ఆక్రమించుకున్నాయి.


సైనిక విజయాలు

 సామ్రాజ్య విస్తరణ కోసం అల్లాఉద్దీన్‌ అనేక యుద్ధాలు చేశాడు. చరిత్రకారులు ఇతడి దండయాత్రలను రెండు భాగాలుగా విభజించారు. అవి: 1. ఉత్తర భారతదేశ దండయాత్రలు 2. దక్షిణ భారతదేశ దండయాత్రలు

జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షా ఖిల్జీ 

ఇతడు క్రీ.శ. 1290-96 మధ్య రాజ్యపాలన చేశాడు. వీరి వంశం ఆఫ్గనిస్థాన్‌లోని హోలోమండ్‌ దగ్గర ఉన్న ఖిల్జీ ప్రాంతం అని ఫకృద్దీన్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. అందుకే వీరి వంశానికి ఖిల్జీ అనే పేరు వచ్చింది.

 ఫిరోజ్‌షా ఢిల్లీ సుల్తాన్‌ అయ్యే సమయానికి అతడి వయసు 70 ఏళ్లు. అతడు తన పట్టాభిషేకాన్ని కిలోకారి కోటలో జరుపుకున్నాడు.

ఫిరోజ్‌షా ఉదారవాది. ఇతడు రాజ్య విస్తరణపై దృష్టి పెట్టకుండా రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడాలనుకున్నాడు. దీని కోసం సమర్థులైన వారిని అధికారులుగా నియమించాడు. వారిలో ప్రముఖులు మాలిక్‌ ఫకృద్దీన్, సిరాజుద్దీన్‌. ఖ్వాజాఖతీర్‌ ఇతడి వద్ద వజీర్‌ (మంత్రి)గా పనిచేశాడు. 

కారా రాష్ట్ర గవర్నర్‌ క్రీ.శ.1290లో ఇతడిపై తిరుగుబాటు చేశాడు. ఫిరోజ్‌షా అతడ్ని అణచివేసి కారాకు తన అల్లుడైన అల్లాఉద్దీన్‌ ఖిల్జీని గవర్నర్‌గా నియమించాడు.

క్రీ.శ. 1292లో ఢిల్లీపై మంగోలులు దాడిచేయగా ఫిరోజ్‌షా వారిని ఓడించాడు. ఆ యుద్ధంలో బందీలుగా చిక్కినవారితో ఇస్లాంను స్వీకరింపజేశాడు. వీరినే నయా ముస్లింలుగా పిలుస్తారు. వీరి నాయకుడు ఉల్లుగ్‌. ఇతడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. 

థగ్గులు అనే దారిదోపిడీ దొంగలను అణచివేశాడు.

ఇతడి పాలనలో ఢిల్లీ సేనలు చారిత్రక విజయాలను సాధించాయని చరిత్రకారుల అభిప్రాయం. వాటిలో బిల్సా, దేవగిరి దాడులు ముఖ్యమైనవి. ఇవి అల్లాఉద్దీన్‌ ఖిల్జీ నేతృత్వంలో జరిగాయి.అల్లాఉద్దీన్‌ ఖిల్జీ క్రీ.శ. 1296లో ఫిరోజ్‌షాను హత్య చేసి, తనను తాను ఢిల్లీకి సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. 

ఎస్‌.ఆర్‌.శర్మ అనే చరిత్రకారుడు జలాలుద్దీన్‌ ఫిరోజ్‌షాను ‘దయాగుణాల రాజు’గా పేర్కొన్నాడు.


దక్షిణ భారతదేశ  దండయాత్రలు 

ఉత్తర భారతదేశంపై పట్టు సాధించాక ఖిల్జీ దక్షిణ భారతదేశంపై తన దృష్టి కేంద్రీకరించాడు. మొత్తం భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని భావించాడు. ఆ సమయంలో దక్షిణ భారతదేశాన్ని యాదవ, హొయసల, కాకతీయ, పాండ్య రాజ వంశాలు పాలిస్తున్నాయి. మాలిక్‌ కపూర్‌ నేతృత్వంలో ఈ రాజ్యాలపై దండయాత్రలు జరిగాయి. సుమారు 4,75,000 సైన్యంతో ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండెత్తాడు.

దేవగిరిపై దండయాత్ర: అల్లాఉద్దీన్‌ సేనలు మాలిక్‌ కపూర్‌ నాయకత్వంలో క్రీ.శ. 1306లో మొదట దేవగిరిపై దండెత్తాయి. 

 దేవగిరి పాలకుడైన రామచంద్ర దేవుడు ఈ యుద్ధంలో ఓడిపోయాడు. అతడు అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి సామంతుడిగా మారి, కప్పం కట్టాడు. రామచంద్రదేవుడి కుమారుడు శంకరదేవుడు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో మాలిక్‌ కపూర్‌ దేవగిరిపై రెండోసారి దండెత్తి, శంకరదేవుడ్ని వధించాడు. దీంతో దేవగిరి రాజ్యం ఖిల్జీ రాజ్యంలో కలిసిపోయింది. 

గుజరాత్‌ రాజైన వాఘీల కర్ణదేవుడికి రామచంద్రుడు ఆశ్రయమివ్వడం కూడా ఈ యుద్ధానికి ప్రధాన కారణం. కర్ణదేవుడి కుమార్తె దేవలదేవిని అల్లాఉద్దీన్‌ కుమారుడు ఖిజిర్‌ఖాన్‌ వివాహం చేసుకున్నాడు.

కాకతీయ రాజ్యంపై దండయాత్ర: క్రీ.శ. 1310లో కాకతీయ రాజ్యాన్ని రెండో ప్రతాపరుద్రుడు పాలిస్తున్న సమయంలో మాలిక్‌ కపూర్‌ అతడిపై దండెత్తాడు.

ప్రతాపరుద్రుడు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. దీంతో అతడు సామంతుడిగా ఉండటానికి అంగీకరించి కప్పం కట్టడానికి సిద్ధపడ్డాడు. మాలిక్‌ కపూర్‌ ఇతనికి సామంతరాజు హోదా ఇచ్చాడు. ఇతడు 300 ఏనుగులు, 700 గుర్రాలు ఖిల్జీకి ఇచ్చాడు. అల్లాఉద్దీన్‌ పాలన ముగిసేవరకు ప్రతాపరుద్రుడు విశ్వాసపాత్రుడిగా పనిచేశాడు. 

ద్వారసముద్రంపై దండయాత్ర: ద్వారసముద్రాన్ని హొయసల రాజ్యం అని కూడా అంటారు. దీన్ని మూడో భల్లాలుడు పాలిస్తున్న సమయంలో మాలిక్‌ కపూర్‌ హొయసల రాజధాని దేవగిరిపై దండెత్తాడు. 

భల్లాలుడు ఈ యుద్ధంలో ఓడిపోయి, మాలిక్‌ కపూర్‌తో సంధి చేసుకున్నాడు. సుల్తాన్‌కు సామంతరాజుగా ఉండటానికి అంగీకరించాడు. 

మధురపై దండయాత్ర: హొయసల రాజ్యాన్ని జయించిన మాలిక్‌ కపూర్‌ క్రీ.శ.1311లో మధురపై దండెత్తాడు. ఆ సమయంలో మధురను పాండ్యులు పాలిస్తున్నారు. అప్పటికే వారి మధ్య వారసత్వ తగాదాలు ఉన్నాయి.

సింహాసనం కోసం ఆశపడుతున్న సుందరపాండ్యుడు, వీరపాండ్యుడు మాలిక్‌ కపూర్‌ను మధురపై దండయాత్రకు ఆహ్వానించారు. 

ఖిల్జీతో జరిగిన ఒప్పందం మేరకు సుందరపాండ్యుడు మధుర పాలకుడయ్యాడు. ఇతడు సుల్తాన్‌కు సామంతుడిగా కప్పం చెల్లించే షరతుకు అంగీకరించాడు. తర్వాత మాలిక్‌ కపూర్‌ శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని, రామేశ్వరం ఆలయాలను దోచుకుని అపార ధనరాశులతో ఢిల్లీ చేరుకున్నాడు. 

మాలిక్‌ కపూర్‌ రామేశ్వరంలో ఒక మసీదును నిర్మించాడు. ఇతడు 2750 పౌండ్ల బంగారం, 312 ఏనుగులు, 20 వేల గుర్రాలతో ఢిల్లీకి చేరుకున్నాడు.

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు - తుగ్లక్‌ వంశం

ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌


క్రీ.శ. 1320 నుంచి 1325 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఘియాజుద్దీన్‌ మొదట అల్లాఉద్దీన్‌ కొలువులో పని చేశాడు. 


* అల్లాఉద్దీన్‌ ఇతడ్ని దీపాల్‌పూర్‌ గవర్నర్‌గా నియమించాడు. ఆ సమయంలోనే ఘియాజుద్దీన్‌ మంగోలుల దండయాత్రలను సమర్థవంతంగా అణచివేశాడు. 


* ఇతడు సుల్తాన్‌ అయ్యాక అల్లాఉద్దీన్‌ మాదిరే తన దండయాత్రలను కొనసాగించాడు. 


* 29 సార్లు మంగోలుల దాడులను ఎదుర్కొన్నాడు. ఢిల్లీకి వారి నుంచి ప్రమాదం ఉందని గ్రహించి, తుగ్లకాబాద్‌ అనే పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. 


* ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ తపాలా విధానాన్ని పునరుద్ధరించాడు. 


* అల్లాఉద్దీన్‌ తన దక్షిణ భారతదేశ దండయాత్రల్లో భాగంగా కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడ్ని ఓడించాడు. కప్పం చెల్లించాలనే షరతుపై అతడ్ని సామంతుడిగా చేసుకున్నాడు. ఘియాజుద్దీన్‌ ఢిల్లీ సుల్తాన్‌ అయ్యాక రెండో ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం ఆపేశాడు. దీంతో ఘియాజుద్దీన్‌ తన కుమారుడైన జునాఖాన్‌ను (మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌) కాకతీయ రాజ్యంపైకి యుద్ధానికి పంపాడు. 


* క్రీ.శ. 1323లో జునాఖాన్‌ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుడ్ని ఓడించాడు. 


* ప్రతాపరుద్రుడ్ని, అతడి అనుచరులను బందీలుగా తీసుకుని జునాఖాన్‌ ఢిల్లీ వస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 


* జునాఖాన్‌ ఓరుగల్లు (వరంగల్‌) పేరును ‘సుల్తాన్‌పూర్‌’గా మార్చి, తన ప్రతినిధిని అక్కడ నియమించాడు. అపార సంపదను తన సొంతం చేసుకున్నాడు. 


* మార్గమధ్యలో ఒడిశా, బెంగాల్‌ మొదలైన ప్రాంతాలను జయించి, అపార ధనాన్ని దోచుకున్నాడు. 


* క్రీ.శ. 1325లో జునాఖాన్‌ తన తండ్రిని చంపించి సింహాసనాన్ని అధిష్టించినట్లు అబ్దుల్‌ మాలిక్‌ ఇసామి, అబ్ద్‌ అల్‌-ఖాదిర్‌ బదౌనీ అనే చరిత్రకారులు తమ రచనల్లో రాశారు.


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌


క్రీ.శ. 1325 నుంచి 1351 వరకు రాజ్యపాలన చేశాడు. 


* ఇతడు విద్యావంతుడు. తుర్కీ, పారశీకంలో పండితుడు. గణిత, ఖగోళ, తర్క, వైద్య, జాతక శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అనేక చర్చా వేదికల్లో పాల్గొన్నాడు.


* అయితే ఇతడి తొందరపాటు నిర్ణయాలు; ఇతరుల సలహాలు పాటించకపోవడం; ఏది మంచిదో, ఏది ఆచరించదగిందో, సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడం వల్ల ఇతడి పాలనా సంస్కరణలన్నీ విఫలమయ్యాయి.


* తుగ్లక్‌ తన వ్యక్తిత్వం కారణంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో వివాదాస్పద సుల్తాన్‌గా పేరొందాడు. 


* ఇతడి పాలనా సంస్కరణలైన రాజధాని మార్పిడి, రాగి నాణేల ముద్రణ, రెవెన్యూ విధానాలు మొదలైనవన్నీ ఆ కాలంలో వివాదాస్పదం అయ్యాయి. ఇతడి పాలనా కాలంలో ప్రజలు తీవ్ర కష్టాలకు గురయ్యారు.


* బదౌనీ అనే చరిత్రకారుడు తుగ్లక్‌ను ‘సృష్టి వైపరీత్యం’ అని పేర్కొనగా, ఇతర చరిత్రకారులు ఇతడ్ని ‘పిచ్చి సుల్తాన్‌’, ‘అసమర్థుడు’, ‘పిచ్చివాడు’, ‘విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తి’ అని అభివర్ణించారు.


* మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఢిల్లీలో జహన్‌పనా అనే కోటను నిర్మించాడు. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది.


ఆశయాలు

మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌కి నాలుగు ఆశయాలు ఉండేవని బదౌనీ పేర్కొన్నాడు. అవి:


1. భూగోళంలో 4వ భాగాన్ని జయించాలి.


2. సాల్మన్‌ రాజులా పాలించాలి.


3. మొత్తం ప్రపంచం తనకు పన్నులు కట్టాలి.


4. తన ఆజ్ఞకు అందరూ బద్ధులుగా ఉండాలి.


పరిపాలనా సంస్కరణలు


తుగ్లక్‌ విశాల సామ్రాజ్యానికి సుల్తాన్‌. దీన్ని సమర్థవంతంగా పాలించాలనేది అతడి లక్ష్యం. 


* ఇతడు పర్షియా, అరబ్బీ, సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేశాడు. 


* ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించాలని భావించాడు. 


* ఢిల్లీ కోశాగారాన్ని పటిష్ఠం చేయాలని భావించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాడు. ఇందుకోసం భారతదేశంలోనే అత్యంత సారవంతమైన భూములుగా పేరొందిన గంగా, యమునా నదీ పరీవాహక ప్రాంతాలపై దృష్టి సారించాడు.

గంగా, యమున పరీవాహక ప్రాంతంలో 


పన్నులు పెంచడం


క్రీ.శ. 1326లో తుగ్లక్‌ ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయాలని భావించాడు. దీంతోపాటు సైన్య సమీకరణకు, పాలనకు ఇతడికి ధనం అవసరమైంది. 


* అందువల్ల గంగా, యమున పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం చేసే ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని భావించాడు.


* మొదట ఆ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాడు. కాలువల పూడికలు తీయించాడు. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరిచాడు. రైతులకు రుణ సౌకర్యాలు కల్పించాడు. 


* రైతులకు పంటలు బాగా పండుతాయని చెప్పి, శిస్తు కచ్చితంగా చెల్లించాలని ఆదేశించాడు. పన్ను వసూలులో కఠినంగా వ్యవహరించేవాడు. దీనికోసం వివిధ అధికారులను నియమించాడు.


* నీటిపారుదల సౌకర్యాలు కల్పించినప్పటికీ వరదల తాకిడి ఎక్కువై పండిన పంటలు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితులు తుగ్లక్‌ దృష్టికి వెళ్లలేదు. 


* వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. శిస్తు వసూలు ద్వారా దాన్ని అధిగమించాలనుకున్నా లోటు పూడలేదు. 


* ఈ పరిస్థితులు రాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. తర్వాత వరుసగా వచ్చిన అనావృష్టి పరిస్థితులు రాజ్యాన్ని కుంగదీశాయి. ఇవన్నీ తుగ్లక్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. దీని నివారణకు మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహి’ని (వ్యవసాయశాఖ) ఏర్పాటు చేశాడు. 


* ఇతడు కల్పించిన నీటిపారుదల సౌకర్యం వల్ల దాదాపు 60 వేల చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న భూమి సాగులోకి వచ్చింది. 


* వీటి ఫలితంగా ఆదాయం పెరిగింది. కానీ రెవెన్యూ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రజల్లో సుల్తాన్‌పై గౌరవం తగ్గింది.


రాజధాని మార్పిడి


క్రీ.శ.1206 నుంచి భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా ఉంది. అయితే ఆ కాలంలో ఢిల్లీ కేంద్రంగా విదేశీ దండయాత్రలు జరిగాయి. ముఖ్యంగా మంగోలులు ఢిల్లీని దోచుకోవాలని అనేక దాడులు చేశారు.

* విదేశీయులకు అందుబాటులో లేని నగరం తన రాజ్యానికి రాజధానిగా ఉండాలని తుగ్లక్‌ భావించాడు. 


* అందుకే క్రీ.శ. 1327లో రాజధానిగా దేవగిరిని ఎంచుకుని దాని పేరును దౌలతాబాద్‌గా మార్చాడు. ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బందితో పాటు ఢిల్లీ ప్రజలంతా దౌలతాబాద్‌ చేరుకోవాలని ఆదేశించాడు.


* ఢిల్లీ నుంచి ప్రయాణించే సమయంలో వారికి దారి పొడవునా ఆహారం, మంచినీరు, వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. 


*  అదేవిధంగా దౌలతాబాద్‌ రాజధానిగా సౌకర్యవంతంగా లేదు. అక్కడి భవనాలు, వసతి, వాతావరణం వారికి నచ్చలేదు. అక్కడ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.


* వేలాది మందికి నీటి సదుపాయాలు, వసతులు కల్పించడం సాధ్యపడదని తెలుసుకున్న తుగ్లక్‌ రాజధాని క్రీ.శ. 1335లో తిరిగి ఢిల్లీకి మార్చినట్లు ప్రకటించాడు. 


* దీంతో సుల్తాన్‌ తీరుపై ప్రజల్లో విసుగు, అసహనం కలిగాయి. ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. తుగ్లక్‌ చర్యలను ప్రజలు అనుమానించడం ప్రారంభించారు. 


* రాజధాని మార్పిడి వృథా ప్రయాసలకు చిహ్నంగా మిగిలిందని ‘స్టాన్లీ ఎడ్వర్డ్‌ లేన్‌ పూల్‌’ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు.


తిరుగుబాట్లు 


మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ దక్షిణాదిలో తన సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అతడి పాలనాకాలంలో అనేక తిరుగుబాట్లు చెలరేగాయి. తుగ్లక్‌ మేనత్త కొడుకు బహాఉద్దీన్‌ గుర్షప్స్‌ (1326); కిష్లూఖాన్‌ (1327-28); జియాఉద్దీన్‌ హసన్‌షా (1335); ఫకృద్దీన్, ఐన్‌-ఉల్‌-ముల్క్‌ ముల్తానీ, కృష్ణనాయక (1343-44); కుతుబ్‌ఖాన్‌ మొదలైనవారు ఇతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 


* అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. సింధ్, ముల్తాన్, ఓరుగల్లు, అయోధ్య, గుల్బర్గాలు అందులో ఉన్నాయి. 


* క్రీ.శ. 1351లో గుజరాత్‌లో తిరుగుబాటు చెలరేగింది. దీనికి ధాగి నాయకత్వం వహించాడు. దాన్ని అణచివేయడానికి వెళ్లిన సుల్తాన్‌ అక్కడే అనారోగ్యంతో మరణించాడు. 


* ‘‘ఇతడి మరణ వార్త విన్న ప్రజలెవరూ చింతించలేదు. ప్రజల బాధలు అతడికి, అతడి బాధలు ప్రజలకు తప్పాయి’’ అని లేన్‌ పూల్‌ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. 


* తుగ్లక్‌ తెలివైనవాడని, అయితే ఇతడు విజ్ఞత, వివేకం ప్రదర్శించడంలో విఫలం అయ్యాడని బదౌనీ పేర్కొన్నాడు. బదౌనీ ఇతడ్ని అరిస్టాటిల్‌తో పోల్చాడు.


 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానుల పాలన

ఢిల్లీ సుల్తానులు దాదాపు 320 ఏళ్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని భారతదేశాన్ని పాలించారు. వీరి పాలనా విధానం మొత్తం ఇస్లాం మతపరమైన చట్టాలపై ఆధారపడి ఉండేది. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతినిధిగా భావించేవారు. వారికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇస్లాం చట్టంలో నిర్దేశించిన సూచనల మేరకు వారు రాజ్యాన్ని పరిపాలించారు.


* ఢిల్లీ సుల్తానులు తురుష్క, పారశీక పరిపాలనా విధానాన్ని భారతీయ పరిపాలనలతో జోడించారు. వీరి పరిపాలనంతా చాలావరకు ఏకరూపకతను కలిగి ఉంది. అయితే పాలనా సంస్కరణల్లో మాత్రం అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. బాల్బన్, అల్లాఉద్దీన్‌ ఖిల్జీ, ఫిరోజ్‌షా తుగ్లక్‌ మొదలైనవారు పాలనలో తమదైన ముద్ర వేశారు. 


*  ఢిల్లీని పాలించిన సుల్తానులంతా మతాధికారస్వామ్యంగా లేదా కేంద్రీకృత, నిరంకుశంగా పాలించారు. వీరి కాలంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాలు నాటి వాస్తు-శిల్పకళాభివృద్ధిని తెలుపుతున్నాయి.  


పాలనలోని భాగాలు


సుల్తాన్‌ 


ఇతడు ఢిల్లీ సామ్రాజ్యానికి అధినేత. సిద్ధాంతపరంగా సుల్తాన్‌ ఖురాన్‌ను అనుసరించి పరిపాలించాడు. నిరంకుశుడిగా వ్యవహరించేవాడు. అన్ని అధికారాలు అతడి వద్దే ఉండేవి. రాజ్యాధినేత, సర్వసైన్యాధ్యక్షుడు కూడా సుల్తానే. 


* సుల్తాన్‌ ఇష్టమే చట్టం. అతడి ఆజ్ఞలను అనుసరించడం అందరి కర్తవ్యం. 


* దార్‌-ఉల్‌-హర్బను (ఇస్లామేతర ప్రాంతం) దార్‌-ఉల్‌-ఇస్లాం (ఇస్లాం ప్రాంతం)గా మార్చడం సుల్తాన్‌ లక్ష్యం.


* సుల్తాన్‌ అధికారాలపై ఉలేమాలు, ప్రభువర్గం, సిద్ధసైన్యం ప్రభావం ఉండేది. ఉలేమాలు అప్పటి పాలనలో ముఖ్య పాత్ర పోషించారు. 


* సింహాసనం వారసత్వంగా దక్కేది కాదు. బలవంతుడిదే రాజ్యం అనే సూత్రంపై రాజ్యాధికారం ఆధారపడింది. ప్రభువర్గం వారు సుల్తాన్‌ నియామకంలో కీలక పాత్ర పోషించేవారు. 


రాష్ట్రపాలన


రాష్ట్ర పాలకుడిని ‘వలి’ లేదా ‘ముక్తి’ అంటారు. ఇతడు రాష్ట్రానికి సైన్యాధిపతి. 


* ఢిల్లీ సుల్తాన్‌లు ప్రారంభంలో ‘రాజ్యాన్ని’ సైనిక విభాగాలుగా విభజించారు. అల్లాఉద్దీన్‌ కాలంలో పదకొండు రాష్ట్రాలుగా, మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ సమయంలో ఇరవైమూడు రాష్ట్రాలుగా విభజించారు. 


* రాష్ట్ర పాలకుడు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి, రాచరిక ఆజ్ఞలను అమలు చేసేవాడు. ఇతడు సుల్తాన్‌కు మాత్రమే జవాబుదారీగా ఉండేవాడు.


* సుల్తాన్‌కు సైనికంగా సహాయం చేసేవాడు. సుల్తాన్‌ గూఢచారుల ద్వారా రాష్ట్రపాలకుల గురించి తెలుసుకునేవాడు. 


స్థానిక ప్రభుత్వం 


ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో స్థానిక ప్రభుత్వ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. వీరు ప్రతి రాష్ట్రాన్ని ‘షిక్‌’ అనే విభాగాలుగా విభజించారు. ‘షిక్‌’కు అధిపతి ‘షిక్‌దార్‌’. తన విభాగంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ఇతడి ముఖ్య బాధ్యత.


* వంద గ్రామాలను ఒక ‘పరగణా’గా ఏర్పాటు చేసి, దానికి ‘కస్బా’ అనే పేరు పెట్టినట్లు ఇబన్‌ బటూటా తన గ్రంథాల్లో రాశారు. అమీల్‌ (రెవెన్యూ అధికారి), ముస్రిఫ్‌ (ప్రభుత్వ జమాఖర్చు లెక్కలు రాసే గణాంక అధికారి), ఖజాన్‌దార్‌ (ప్రభుత్వ ఖజానా అధికారి), ఖాజీ (న్యాయాధిపతి), కొత్వాల్‌ (పోలీస్‌ అధికారి) మొదలైనవారు కస్బాలో ముఖ్య అధికారులు. పరిపాలనా క్రమంలో చివరిది గ్రామం. 


* గ్రామ వ్యవహారాలను చౌదరీ, పట్వారీలు నిర్వహించేవారు. గ్రామ పంచాయతీలు పరిపాలన, న్యాయసంబంధ విషయాలను చూసేవి. నాటి ప్రభుత్వ ఆదాయానికి గ్రామాలు మూలంగా ఉండేవి. అయితే వీటి అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి.


ఇక్తా వ్యవస్థ 


ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇక్తా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. యుద్ధంలో తనకు సహాయం చేసిన సామంతులకు సుల్తాన్‌ విశాల ప్రాంతాన్ని దానం చేసేవాడు. దీన్నే ఇక్తా అని, ఇక్తాలను పొందినవారిని ఇక్తాదార్లు అని పిలిచేవారు. ఈ ప్రాంతం తర్వాతి తరాలకు వారసత్వంగా లభించేది.


న్యాయపాలన 


న్యాయవ్యవస్థలో అత్యున్నత అధికారి సుల్తాన్‌. న్యాయాధికారాలన్నీ ఇతర అధికారులకు సుల్తాన్‌ నుంచే సంక్రమించేవి. రాజ్యంలోని అత్యున్నత న్యాయస్థానం సుల్తాన్‌ దర్బార్‌. అన్ని రకాల కేసులను ఇక్కడ విచారించేవారు.


* సుల్తాన్‌ తర్వాత రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి ఖాజీ. ప్రతి పట్టణంలో ఒక ఖాజీ ఉండేవాడు. న్యాయస్థానాల్లో మహమ్మదీయుల చట్టమైన ‘షరియత్‌’ను పాటించేవారు. శిక్షాస్మృతి చాలా కఠినంగా ఉండేది.


సైనిక పాలన 


తమ అధికార పరిరక్షణకు, రాజ్యాన్ని రక్షించడానికి ఢిల్లీ సుల్తాన్‌లకు శక్తిమంతమైన సైన్యం అవసరమైంది. అందుకే వీరు సైనిక వ్యవస్థపట్ల చాలా శ్రద్ధ వహించారు. వీరి సైనిక వ్యవస్థ చాలా వరకు టర్కీ సైనిక వ్యవస్థను పోలి ఉంది. వీరి సైన్యంలో ముఖ్య భాగం అశ్వికదళం, తర్వాత కాల్బలం ఉండేవి.


మంత్రులు - అధికారాలు


మంత్రులు సుల్తాన్‌కు సలహాలిచ్చి, పరిపాలనలో తోడ్పడేవారు. వారి సలహాలను సుల్తాన్‌ తప్పనిసరిగా పాటించాలనే నిబంధన లేదు. నాటి పాలనలో కింది వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించారు.


వజీర్‌: ఇతడు ప్రధానమంత్రి. ప్రజలకు, సుల్తాన్‌కి మధ్య వారధి లాంటివాడు.


దివాన్‌-ఇ-రిసాలత్‌: విదేశాంగ మంత్రి.


సదర్‌-ఉస్‌-సదర్‌: ఇస్లాం నీతి, నియమాలను అమలు చేసే వ్యక్తి.


దివాన్‌-ఇ-ఇన్‌షా: రాచరిక ఉత్తరప్రత్యుత్తరాల మంత్రి. సుల్తాన్‌ ఉత్తర్వులను ఈయన తయారు చేసేవారు.


ఆరిజ్‌-ఇ-మమాలిక్‌: యుద్ధ మంత్రిత్వ శాఖ (దివాన్‌-ఇ-ఆరిజ్‌) అధిపతి. యుద్ధ నిర్వహణ, సైన్యసమీకరణ ఇతడి విధులు.


నాయిబ్‌-ఉల్‌-మమాలిక్‌: ప్రభువర్గంలోని వారిని ఈ ఉద్యోగంలో నియమించేవారు. ఇతడి అధికారాలను సుల్తాన్‌ నిర్ణయించేవాడు. సుల్తాన్‌ రాజధానిలో లేనప్పుడు ఇతడు ప్రతినిధిగా ఉండేవాడు.


బరీద్‌-ఇ-మమాలిక్‌: వార్తా విభాగానికి అధిపతి. సామ్రాజ్యంలో జరిగే అన్ని విషయాలను సుల్తాన్‌కు తెలపడం ఇతడి విధి. ఇతడికి సహాయంగా స్థానిక ‘బరీదులు’ ఆయా ప్రాంతాల్లో ఉండేవారు.


వకీల్‌-ఇ-దర్‌: అంతఃపుర వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి.


సర్‌-ఇ-జందర్‌: ఇతడు న్యాయస్థానానికి అనుబంధంగా ఉండేవాడు. సుల్తాన్‌ రక్షకభటులైన జందరులు ఇతడి  అధీనంలో ఉండేవారు. సుల్తాన్‌ను కాపాడటం ఇతడి విధి.


* వీరు కాకుండా అమీర్‌-ఇ-అఖురా (అశ్వశాఖాధిపతి), శహన్‌-హ-ఇపిలాన్‌ (గజాధ్యక్షుడు), అమీర్‌-ఇ-షికార్‌ (సుల్తాన్‌ వేటకు వెళ్లేటప్పడు సహాయంగా ఉండే వ్యక్తి) అనే ఉద్యోగులు ఉండేవారు.


శిస్తు విధానం 


ఇస్లాం మత గ్రంథం ప్రకారం ఢిల్లీ సుల్తాన్‌లు 4 రకాల పన్నులు వసూలు చేశారు. అవి: జకాత్, ఖరజ్, ఖామ్స్, జిజియా. మహమ్మదీయులు తమ తోటి ముస్లింల సంక్షేమం కోసం చెల్లించే పన్ను ‘జకాత్‌’. ప్రతి ముస్లిం తన ఆస్తి లేదా ఆదాయంలో రెండున్నర శాతాన్ని ‘జకాత్‌’గా చెల్లించేవారు.


భూమిశిస్తును ‘ఖరజ్‌’ అంటారు. ఉత్పత్తిలో 10 - 50 శాతం వరకు భూమి శిస్తును వసూలు చేసేవారు. ఇది ధన లేదా ధాన్యరూపంలో ఉండేది. 


* యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సంపదలో అయిదో వంతు ప్రభుత్వవాటాగా ఉండేది. దీన్ని ‘ఖామ్స్‌’ అంటారు.


ముస్లింలు కానివారిపై విధించే పన్ను జిజియా.


మాదిరి ప్రశ్నలు


1. కింది అంశాలను జతపరచండి.

వంశం              స్థాపకులు

a) బానిస వంశం     i) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌

b) ఖిల్జీ వంశం        ii) ఖిజిర్‌ఖాన్‌

c) తుగ్లక్‌ వంశం      iii) బహాల్‌ లోడీ 

d) సయ్యద్‌ వంశం  iv) కుతుబుద్దీన్‌ ఐబక్‌

e) లోడీ వంశం       v) జలాలుద్దీన్‌ ఖిల్జీ

1) a-iii, b-i, c-v, d-iii, e-iv

2) a-i, b-iv, c-v, d-iii, e-ii

3) a-iv, b-v, c-i, d-ii, e-iii

4) a-i, b-ii, c-iv, d-v, e-iii


2. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) బానిస వంశంలో చివరివాడు కైకుబాద్‌ 

బి) ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూ ఖాన్‌ 

సి) సయ్యద్‌ వంశంలో చివరివాడు అల్లాఉద్దీన్‌ అలమ్‌షా 

డి) లోడీ వంశంలో చివరివాడు ఇబ్రహీం లోడీ

1) ఎ, బి, సి    2) బి, డి    3) డి మాత్రమే    4) పైవన్నీ



3. ఢిల్లీలో ‘కువ్వల్‌-ఉల్‌-ఇస్లాం’ మసీదు, ఆజ్మీర్‌లో ‘అర్హయిల్‌-దిన్‌కా-జోంప్డా’ మసీదును నిర్మించింది ఎవరు?

1) రజియా సుల్తానా      2) ఇల్‌టుట్‌మిష్‌

3) కుతుబుద్దీన్‌ ఐబక్‌     4) బాల్బన్‌ 


4. కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‘కుతుబ్‌మినార్‌’ నిర్మాణాన్ని ప్రారంభించగా, దాన్ని పూర్తిచేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) ఇల్‌టుట్‌మిష్‌        2) బాల్బన్‌ 

3) రజియా సుల్తానా      4) ఆరామ్‌షా 


5. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) ఇల్‌టుట్‌మిష్‌ తన రాజ్యాన్ని ‘ఇక్తాలు’గా విభజించాడు.

బి) ఇక్తాలు అంటే సైనిక రాష్ట్రాలు.

సి) ఇల్‌టుట్‌మిష్‌ లాహోర్‌ నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

డి) ఇల్‌టుట్‌మిష్‌ టంకా అనే వెండి నాణేలను, జిటాల్‌ అనే రాగి నాణేలను జారీచేశాడు.

1) ఎ, బి, సి    2) బి, సి    3) ఏదీకాదు    4) పైవన్నీ


6. ‘బరీద్‌’లనే గూఢచారి వ్యవస్థను స్థాపించింది ఎవరు?

1) బాల్బన్‌            2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

3) ఇల్‌టుట్‌మిష్‌    4) ఆరామ్‌షా


7. కింది ఏ కవి ‘భారతదేశ రామచిలుక’ (Parrot of India) గా పేరొందారు?

1) మిన్హాస్‌-ఉస్‌-సిరాజ్‌    2) ఫిరదౌసి

3) అమీర్‌ఖుస్రూ      4) ఫకృద్దీన్‌


8. ‘సితార్‌’ అనే వాయిద్య పరికరాన్ని కనుక్కున్న కవి?

1) మిన్హాస్‌-ఉస్‌-సిరాజ్‌   2) అమీర్‌ఖుస్రూ

3) అల్‌బెరూని    4) సిరాజ్‌-ఆసిఫ్‌



9. ‘సిజ్దా’ (సాష్టాంగ నమస్కారం), పైబోస్‌ (సుల్తాన్‌ పాదాలను ముద్దు పెట్టుకోవడం) లాంటి వాటిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌     2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ 

3) ఆరామ్‌షా   4) కైకుబాద్‌



10. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) ఇల్‌టుట్‌మిష్‌    2) మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌

3) బాల్బన్‌      4) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ


సమాధానాలు

1-3   2-4   3-3   4-1   5-4   6-1   7-3   8-2   9-1   10-4


 

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్య నాగరికత

సనాతన భారతీయతకు సమున్నత మూలాలు!


ఆధునిక భారతీయ సంస్కృతికి అనాది కాలంలోనే ఆర్య నాగరికత పునాదులు వేసింది. నాడు ప్రభవించిన వేద సాహిత్యం సామాజిక నిర్మాణానికి, వర్ణ, కుల వ్యవస్థలకు మూలమై నిలిచింది. ప్రకృతికి దైవత్వాన్ని జోడించి వేదాలు శ్లోకాలుగా, ఆచారాలుగా, తాత్విక బోధనలుగా మార్గనిర్దేశం చేశాయి.  ఆధ్యాత్మిక, సాంస్కృతిక నైతికతలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించాయి. కాలాతీతమైన జ్ఞానాన్ని పంచాయి. వాటిని శక్తిమంతమైన వాఙ్మయ రూపంలో ఆర్యులు తరతరాలకు అందించారు. ఈ నేపథ్యంలో ఆ విశిష్ట నాగరికత మూలాలు, వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు, వాటి అనుబంధ సాహిత్యాల విశేషాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.


సింధు నాగరికత అనంతరం ఉత్తర భారతదేశంలో ఆర్య నాగరికత వర్ధిల్లింది. ఇది క్రీస్తు పూర్వం సుమారు 1500 నుంచి 600 వరకు కొనసాగింది. సింధు నాగరికత, సంస్కృతి మాదిరిగానే ఆర్య నాగరికత, సంస్కృతులు కూడా భారతీయ సమాజంపై ప్రగాఢ ముద్ర వేశాయి. ఆర్య అనే పదం ఉత్తముడు, ఉన్నతుడు, పూజ్యుడు అనే అర్థాలు ఇస్తుంది. ఆర్య నాగరికత లేదా వేద నాగరికతను నిర్మించినవారు నార్డిక్‌ తెగకు చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. వీరి జన్మస్థలం గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ తన గ్రంథం ‘ద ఆర్కిటిక్‌ హోమ్‌ ఇన్‌ ద వేదాస్‌’లో ఆర్యుల జన్మస్థలం ఉత్తర ధ్రువ ప్రాంతమని పేర్కొన్నారు. ఆర్యులు ఐరోపా ఖండ వాసులని విలియం జోన్స్‌ చెబితే, మధ్య ఆసియా ప్రాంత వాసులని మాక్స్‌ముల్లర్‌ అన్నారు. 


ఎక్కువమంది చరిత్రకారుల ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారత దేశానికి వలస వచ్చి, స్థానిక జాతులను ఓడించి, క్రీ.పూ.1500 నాటికి భారతదేశ పశ్చిమోత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి క్రమక్రమంగా మధ్య భారతదేశంలోకి వ్యాపించి స్థిర నివాసాలను ఏర్పరచుకుని వ్యవసాయ, వాణిజ్యాలు సాగించి తమదైన నాగరికత సంస్కృతులను స్థాపించారు. వీరిది గ్రామీణ సంస్కృతి. అందుకే ఆ కాలం నాటి పురావస్తు ఆధారాలు ఎక్కువగా లభ్యం కాలేదు. అయినప్పటికీ ఆర్య నిర్మితమైన అద్భుతమైన వాఙ్మయం వారి చరిత్రకు ఆధారంగా నిలిచింది. వేద వాఙ్మయం సాయంతో ఆర్య నాగరికత, సంస్కృతులను, ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్య నాగరికత కాలాన్ని రెండు దశలుగా విభజించి అధ్యయనం చేస్తారు. అవి రుగ్వేద నాగరికత కాలం (సుమారు క్రీ.పూ.1500 నుంచి క్రీ.పూ. 1000 వరకు), మలివేద కాలం (క్రీ.పూ.1000 నుంచి క్రీ.పూ. 600 వరకు).


వేద సాహిత్యం: వేదం అనే పదం విద్‌ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. దీని అర్థం జ్ఞానం. వేదాలు సాక్షాత్తు భగవంతుడే ప్రవచించాడని, మానవ నిర్మితాలు కావన్నది నమ్మకం. అందుకే వేదాలను ‘అపౌరుషేయాలు’ అంటారు. వేద సాహిత్యాన్ని ప్రధానంగా శ్రుతి సాహిత్యం, స్మృతి సాహిత్యాలుగా విభజిస్తారు. వేదాలు నాలుగు అవి.. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. వీటినే వేద సంహితలు అని కూడా అంటారు. వీటి అనుబంధ గ్రంథాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇవన్నీ శ్రుతి సాహిత్యాలు. ఇక వేదాంగాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు స్మృతి సాహిత్యం కిందకు వస్తాయి.

రుగ్వేదం: వేదాల్లో ప్రాచీనమైంది. ఇందులోని సూక్తాలు లేదా శ్లోకాలు వివిధ ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించి చేసిన ప్రార్థనలు. మొత్తం 10 మండలాలుగా విభజించి, 1028 సూక్తాలతో ఉంది. ఈ గ్రంథంలో రెండో మండలం నుంచి ఏడో మండలం వరకు మూలమని,   మిగతావి తర్వాత చేసిన చేర్పులని చరిత్రకారుల అభిప్రాయం. ఏడో మండలంలో దశ రాజ గణ యుద్ధం, పదో మండలంలో భారతీయ సామాజిక వ్యవస్థ మూలమైన ‘పురుషసూక్త శ్లోకం’ ఉంది. క్రీ.పూ. 1500 - 1000 సంవత్సరాల మధ్య నాటి ‘సప్త సింధు ప్రాంతం’లో ఆర్యులు సంచరించారు (ఆధునిక  అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతం, పంజాబ్, హరియాణా ప్రాంతాలు). పశుపోషక, సంచార జీవితాన్ని ప్రతిబింబింపజేసే తొలి ఆర్యుల గురించి ముఖ్య సమాచారాన్ని రుగ్వేదం అందిస్తుంది. రుగ్వేద పండితుడిని ‘హోత్రి’ అంటారు.

సామ వేదం: సామన్‌ అంటే శ్రావ్యం అని అర్ధం. రుగ్వేదంలోని సూక్తాలను ఏ విధంగా ఉచ్చరించాలో సామవేదం చెబుతుంది. సామవేద పండితుడిని ఉద్ఘాత్రి అంటారు. ఇందులో భారతీయ శాస్త్రీయ సంగీత మూలాలున్నాయి.

యజుర్వేదం: పద్య, గద్య సంకలనం. ఈ గ్రంథంలో వివిధ శ్లోకాలు, మత క్రతువుల నిర్వహణ కోసం రూపొందించినవి ఉన్నాయి. యజుర్వేదాన్ని పఠించే పండితుడిని ‘అధ్వార్యు’ అంటారు. యజుర్వేదం శ్వేత యజుర్వేదం, కృష్ణ    యజుర్వేదం అని రెండు రకాలు.

అధర్వణ వేదం: దీనినే బ్రహ్మ వేదం అంటారు. మతేతర విషయాలైన వైద్యం, క్షుద్రవిద్యలు, యుద్ధ విద్యలు లాంటివి ఇందులో ఉన్నాయి. కొన్ని ఆర్యేతర విశ్వాసాలు కూడా ఉండటం గమనిస్తే ఈ గ్రంథంపై అనార్యుల ప్రభావం కనిపిస్తుంది. అధర్వణ వేదం పఠించే పండితుడిని ‘బ్రాహ్మణ’ అంటారు.


బ్రాహ్మణాలు: బ్రాహ్మణాలు అనేవి సంహితలకు వ్యాఖ్యాన రూప గ్రంథాలు. ఇవి గద్య రూపంలో, వేద సంహితకు అనుబంధంగా ఉండి, యజుర్వేదంలో చెప్పిన క్రతువుల నిర్వహణ విధానాన్ని తెలియజేస్తాయి. ఇందులో పాలకులు నిర్వర్తించే రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. ఇవి మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని బోధిస్తాయి. ఒక్కో సంహితకు కొన్ని బ్రాహ్మణాలు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం; సామ వేదానికి తాండ్యమాహ బ్రాహ్మణం, జైమిని బ్రాహ్మణం; యజుర్వేదానికి శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం అనుబంధాలు.

అరణ్యకాలు: ఇవి బ్రాహ్మణాల చివరి భాగాలు. ఇవి కూడా బ్రాహ్మణాల మాదిరిగానే కర్మవిధుల్ని ప్రస్తావిస్తాయి. కానీ వీటిలో కర్మల భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.

ఉపనిషత్తులు: ‘ఉపనిషత్‌’ అనే పదం ‘ఉపనిషాద్‌’ అనే ధాతువు నుంచి పుట్టింది. దీనికి అర్థం గురువు చుట్టూ విద్యార్థులు చేరి జ్ఞానమార్జించడం. ‘ఉప’ అంటే గురువు సమీపంలో, ‘ని’ అంటే నిష్ఠతో   శ్రవణం చేసినవారికి అజ్ఞానం నశించి, ‘షత్‌’ అంటే పరమాత్మ ప్రాప్తి చేకూరడం అని అర్థం. ఇవి పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, జన్మ, పునర్జన్మ, మోక్షం, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరించేవి. ఉపనిషత్తులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ ఇంతవరకు 108 మాత్రమే   లభ్యమయ్యాయి. ఇవి కూడా వేద సంహితలకు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ, కౌశతకి ఉపనిషత్తులు; సామ వేదానికి చాందోగ్య, కేనా ఉపనిషత్తులు; యజుర్వేదానికి కదా ఉపనిషత్తు, బృహదారణ్య ఉపనిషత్తులు; అధర్వణ వేదానికి ముండకా, మాండూక్య ఉపనిషత్తులు అనుబంధాలుగా ఉన్నాయి.


వేదాంగాలు: వేదాంగాలు ఆరు. ఇందులో మొదటిది ‘శిక్ష’. వేదాల్లో స్వరం ప్రధానం. ఇది వేదాన్ని ఉచ్ఛరించాల్సిన పద్ధతిని బోధిస్తుంది. రెండోది ఛందస్సు అంటే గణ విభజన. మూడోది నిరుక్తం అంటే పద వ్యుత్పత్తి శాస్త్రం. నాలుగోది వ్యాకరణం, అయిదు జ్యోతిషం (వేదాల్లో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాల నిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాల నియమాలు జ్యోతిషంలో ఉంటాయి), ఆరోది కల్పసూత్రాలు. ఈ ఆరు గ్రంథాలూ వేదపఠనానికి, వేదాలను అర్థం చేసుకోవడానికి, వేద జ్ఞానం సమాజ హితం కోసం ఉపయోగించడానికి మార్గాన్ని సూచిస్తాయి.

ఉపవేదాలు: మొత్తం నాలుగు. అవి ధనుర్వేదం - యుద్ధ విద్యకు, ఆయుర్వేదం - వైద్య విద్యకు, గాంధర్వ వేదం - గాన విద్యకు, శిల్ప వేదం - శిల్ప కళకు సంబంధించినవి. ఇవన్నీ మత ప్రసక్తి లేని దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలతో ఉన్న గ్రంథాలు.


ఇతిహాసాలు: వాల్మీకి మహర్షి రాసిన శ్రీ మద్రామాయణం, వ్యాసుడు రచించిన మహాభారతం ఇతిహాసాలు. ఆర్య సంస్కృతి దక్షిణాదికి వ్యాపించిన విధానాన్ని ‘శ్రీ మద్రామాయణం’, ఉత్తర దేశ సార్వభౌమాధికారం కోసం ఆర్య గణాలు తమలో తాము జరిపిన పోరాటాలను ‘మహాభారతం’ తెలియజేస్తాయి. 

క్రీ.పూ. 1500-600 మధ్య కాలానికి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా గ్రంథాలు లేవు. దాంతో నాటి ఉత్తర భారతంలో ఆర్యుల జీవన విధానాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి వేద సాహిత్యమే ఆధారంగా నిలిచింది.



 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రుగ్వేద, మలివేద యుగాలు

ఆర్య జీవన వేదం.. భారత సంస్కృతీ సౌధం!

గ్రామీణ జీవనం, ప్రకృతి ఆరాధన, వృత్తి ఆధారిత వర్ణాలు, సరళమైన ఆచారాలతో రుగ్వేద కాలం సాగింది. దురాచారాలు లేవు. వితంతు వివక్ష లేదు. వివాహం పవిత్రంగా ఉండేది. ఏకపత్నీవ్రతాన్ని ఆచరించారు. స్త్రీలకు పురుషులతో సమాన గౌరవం ఉంది. కానీ మలివేద కాలానికి విరుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్ణం దృఢమైన గోడగా మారిపోయింది. బాల్య వివాహాలు, బహుభార్యత్వం ప్రబలిపోయాయి. నిర్దిష్ట మతవిధానం రూపొందింది. అంతిమంగా ఆనాటి సమాజాల్లోని బహుముఖ దృక్పథాలు మిళితమై, సమున్నత భారతీయ సంస్కృతి ఆవిర్భవించింది. ఈ అంశాలు, పరిణామాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 



రుగ్వేద, మలివేద యుగాలు

క్రీ.పూ. 1500 నుంచి 600 వరకు వర్ధిల్లిన ఆర్య నాగరికత, సంస్కృతుల ప్రతిష్ఠాపనాకాలం ఒక సుదీర్ఘ ప్రయాణంగా సాగింది. కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ యుగాన్ని రుగ్వేద, మలివేద కాలాలుగా అధ్యయనం చేస్తారు. రుగ్వేద ఆర్యులు ప్రధానంగా పశుపోషణపై ఆధారపడిన సంచారజీవులు. మలివేద ఆర్యులు ఉత్తర భారతదేశంలో వ్యవసాయం చేపట్టి, స్థిరజీవనం ఏర్పరుచుకున్నారు. రెండు దశల్లో వారు సంచరించిన భౌగోళిక ప్రాంతాల్లో, రాజకీయ, సామాజిక, ఆర్థిక మత విశ్వాసాల్లో గొప్ప భిన్నత్వం ఉన్నప్పటికీ వారి సంస్కృతి, నాగరికత, జీవన విలువలు రెండు దశల్లోనూ ఒకే విధంగా ఉన్నాయి.


ఆర్యులు సంచరించిన భౌగోళిక ప్రాంతాలు:   ఆర్యులు సంచరించిన ప్రాంతాన్ని ‘సప్త సింధు ప్రాంతం’గా రుగ్వేదం పేర్కొంది. అది సింధు నది, దాని ఉపనదులు, సరస్వతి నదుల పరీవాహక ప్రాంతం. ఆధునిక అఫ్గానిస్థాన్‌లోని తూర్పు ప్రాంతం, భారత్, పాకిస్థాన్‌లలో విస్తరించిన పంజాబ్, హరియాణాలను సప్త సింధు ప్రాంతంగా చరిత్రకారులు నిర్ణయించారు. రుగ్వేద అనంతర వేదసాహిత్యం ప్రకారం ఆర్యులు తూర్పు వైపు ప్రయాణించి గంగా యమునా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ‘ఆర్యావర్తం’లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. నేటి తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర బిహార్‌ ప్రాంతాలే నాటి ఆర్యావర్తం అని చరిత్రకారులు నిర్ధారించారు.


వేదకాలం నాటి రాజకీయ పరిస్థితులు:  రుగ్వేద రాజ్యానికి మూలం పితృక్రమానుగత కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ పెద్దను ‘కులాపా’ అని పిలిచారు. అనేక కుటుంబాలు ఒక గ్రామం. అనేక గ్రామాలు ఒక ‘విస్‌’. అనేక విస్‌లు కలిసి ఒక ‘జన’ అంటే తెగ లేదా సమూహం ఏర్పడింది. దీనికి ‘రాజన్‌’ అధిపతిగా ఉండి ధర్మకర్తగా విధులు నిర్వర్తించేవాడు. అతడికి సహాయం చేసేందుకు పురోహిత, సేనాని, గ్రామిణి ఉండేవారు. ఆర్య తెగల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ‘పరుషిణి’ నది ఒడ్డున ఆర్య తెగల మధ్య జరిగిన ‘దశరాజ గణ యుద్ధం’ను రుగ్వేదం ప్రస్తావించింది. తెగ రక్షణ, తెగ సంపద అయిన గోవుల రక్షణ, తెగ సంక్షేమం కోసం మత విధులు నిర్వర్తించడం రాజన్‌ విధులు. రాజన్‌ అధికారాలను నియంత్రించడానికి సభ, సమితి, విధాత, గణ అనే ప్రజాసభలు ఉండేవి. ఆనాటికి వ్యవస్థీకృత పన్నుల విధానం లేదు. రాజన్‌ విధుల నిర్వహణకు తెగలోని ప్రజలు ‘బాలి’ అనే స్వచ్ఛంద పన్ను చెల్లించేవారు.


క్రీ.పూ.900 నాటికి ఇనుము వాడకం మొదలవడం ఈ మహాప్రస్థానంలో ముఖ్య పరిణామం. ఈ లోహ పరిజ్ఞానం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై పెద్ద ప్రభావం చూపింది. దృఢమైన ఇనుప పనిముట్లతో అడవులు నరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. దీంతో అధికోత్పత్తి జరిగి, మిగులు ఉత్పత్తి వాణిజ్యానికి దారితీసింది. వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. రాజన్‌ పన్నులు (భాగ) విధించడం ప్రారంభించడంతో అతడి వద్ద సంపద పెరిగింది. దాంతో సైన్యాన్ని, ఉద్యోగ బృందాన్ని పెంచాడు. మలి వేదకాలం సాహిత్యం రత్నిన్‌లు (మంత్రులు), భాగ దూగ (పన్నులు వసూలుచేసే అధికారి), సంగ్రహిత్రి (కోశాధికారి) లాంటి అనేక ఉద్యోగులను ప్రస్తావించింది. వ్యవసాయం అభివృద్ధి చెంది ఆర్యులు స్థిరనివాసం ఏర్పరచుకోవడంతో భూమితో అనుబంధం పెరిగింది. భూమి కోసం ఆర్య, ఆర్యేతర తెగల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. రాజు అశ్వమేధ, అనారంభ, వాజపేయి మొదలైన విస్తృత క్రతువులు నిర్వహించేవాడు. రాజు అధికారాలు పెరిగి ప్రజాసభలు నియంత్రణ కోల్పోయాయి. రాజ్యాలు పెద్దవి కావడంతో ప్రాంతీయ పాలన ప్రారంభమైంది. ఆ విధంగా రుగ్వేదకాలం నాటి తెగల రాజకీయ వ్యవస్థ, మలివేద కాలానికి గొప్ప రాచరిక వ్యవస్థగా మారింది.


సామాజిక పరిస్థితులు:  పితృక్రమానుగత కుటుంబవ్యవస్థ ఆర్య సమాజానికి మూలం. గోధుమ, బార్లీ, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం, చేపలు ప్రజల ముఖ్య ఆహారాలు. నూలు, ఉన్నితో చేసిన వస్త్రాలను, వివిధ రకాల ఆభరణాలను ధరించేవారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించేవారు. ప్రజలు సాధారణంగా ఏకపత్నీవ్రతులు. వితంతు వివాహాలను నిషేధించలేదు. పరదా వ్యవస్థ, బాల్యవివాహాలు, సతి వంటి దురాచారాలు లేవు. పురుషుడితో సమానంగా స్త్రీ నాటి ప్రజాసభల కార్యకలాపాల్లో పాల్గొనేది. స్త్రీలలో గొప్ప పండితులు ఉండేవారు. ఆపాల, విశ్వవర, ఘోష వంటి స్త్రీలు రుగ్వేదంలోని కొన్ని శ్లోకాలను సంకలనం చేశారు. రుగ్వేద ఆర్యులు నిరక్షరాస్యులు. ఆ కాలం నాటికి లిపి ఏర్పడలేదు. రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా ఆర్య సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన చాతుర్వర్ణ వ్యవస్థగా ఏర్పడింది. వృత్తి, వర్ణం మార్చుకునే వెసులుబాటు ఉండేది. అయితే మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలు నిర్మించుకొంది. వర్ణం అనువంశికంగా మారింది. రుగ్వేద కాలంలో వృత్తికి వర్ణాన్ని నిర్ణయించగా, మలివేదకాలంలో పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది. మొదటి మూడు వర్ణాలను ‘ద్విజులు’గా పిలిచేవారు. వీరికి విద్యాభ్యాసానికి ముందు ఉపనయన ప్రక్రియ ఉంటుంది. వేద అభ్యసనమే నాటి ప్రధాన విద్య. ఇది ద్విజులకే పరిమితం. బాల్య వివాహాలు, పర్దా వ్యవస్థ, బహు భార్యత్వం వంటి ఆచారాలు అధికమయ్యాయి. వితంతు వివాహాలను నిరాకరించారు. రాజకీయ, ప్రజాసభల్లో స్త్రీ స్థానం కోల్పోయింది. వేదసాహిత్యం ఎనిమిది రకాల వివాహాలను గుర్తించి అందులో బ్రహ్మ, ప్రజాపత్య, దైవ, అర్స వివాహాలను ఆమోదించింది. అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలను తిరస్కరించింది. తెగల జీవన విధానం మలివేదకాలం చివరినాటికి సంక్లిష్ట వర్ణవ్యవస్థగా మారిపోయింది.


ఆర్థిక పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రధానంగా గ్రామీణ జీవితం గడిపారు. ముఖ్య వృత్తి పశుపోషణ. వ్యవసాయం కూడా చేసేవారు. గోవులు వారి సంపద. ఆవు, ఎద్దు, గుర్రం, గాడిద, కుక్క వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. వడ్రంగం, చర్మకార, చేనేత, లోహపు పనులు వృత్తులుగా మారాయి. ప్రధానంగా కుండలు, ఆయుధాలు, రథాలు చేసేవారు. రుగ్వేద కాలంలో వ్యవసాయం పరిమితంగా ఉండేది. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. నువ్వులు, పత్తి కూడా పండించేవారు. ఆనాటి వ్యాపారాన్ని అనార్య జాతుల వారు నిర్వహించేవారు. వస్తుమార్పిడి విధానం అనుసరించేవారు. గోవు కూడా ద్రవ్య యూనిట్‌గా చెలామణి అయ్యేది. వెండి, బంగారం వంటి లోహాలను ‘ఆయాస్‌’ అని పిలిచేవారు. గుర్రాలు, ఎడ్ల బళ్లు, ఎద్దులు రవాణా సాధనాలు. మలివేద కాలంలో గోధుమ, బార్లీతో పాటు వరి కూడా ప్రధాన పంటగా మారింది. లోహ పరిజ్ఞానం పెరిగి ఇనుము వాడకం ఎక్కువైంది. వ్యవసాయాభివృద్ధి జరిగి ఆర్యులు, సంచార జీవితం వదిలి స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. వ్యాపారాభివృద్ధితో అనేక వృత్తులు ఏర్పడి పట్టణాలు వెలిశాయి (హస్తినాపురం, అహిచ్ఛత్రం, తక్షశిల, కౌశాంబి మొదలైనవి).


మత పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించి ప్రార్థించారు. ఆ కాలంలో 33 మంది దేవతలను ఆరాధించారు. వీరిని రుగ్వేదం అంతరిక్ష దేవతలు (సూర్య, వరుణ), వాతావరణ దేవతలు (ఇంద్ర, రుద్ర), భూలోక దేవతలు (అగ్ని, పృథ్వి)గా వర్ణించింది. రుగ్వేద  దేవతల్లో ముఖ్యులు ఇంద్రుడు, అగ్ని, సోమ. ఈ కాలం నాటికి విగ్రహారాధన, ఆలయాలు లేవు. తొలి ఆర్యులు సంపద (గోవులు), సంతానం, ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించారు. వీరి ఆరాధనలో ప్రార్థనలు, క్రతువులు ముఖ్య భాగం. ప్రకృతి శక్తుల ఆరాధనతో కూడిన సరళమైన మతవిధానం ఉండేది. మలివేద కాలంలో ఆర్యుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు మత పరిస్థితులను ప్రభావితం చేశాయి. ఇంద్రుడు, అగ్ని, సోమ వంటి రుగ్వేద దేవతల స్థానంలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) ప్రాధాన్యం పెరిగింది. క్రతువులు, యాగాలు, యజ్ఞాలు, కర్మకాండలు పెరిగాయి. గృహస్థు ఆచరించే సరళమైన ప్రార్థనల్లో సంక్లిష్ట తంతు ప్రవేశించింది. పురోహిత వర్గం ప్రాముఖ్యం పెరిగింది. మరణం తర్వాత ఏమిటనే ఆసక్తి పెరిగింది. ఆత్మ, పరమాత్మ, కర్మ, జన్మ, పునర్జన్మ వంటి విషయాలు ఆర్యుల ఆలోచనల్లో ప్రముఖ స్థానం ఆక్రమించాయి.  మోక్ష సాధన జీవిత లక్ష్యం అయ్యింది. దానిని సాధించడానికి కర్మ, తపస్య, జ్ఞాన మార్గాలు ఏర్పడ్డాయి. మలివేద కాల తత్వచింతన ‘షడ్దర్శనాలు’గా రూపొందింది. అవి 1) సాంఖ్య (స్థాపకుడు - కపిల) 2) యోగ (పతంజలి) 3) న్యాయ (గౌతమ) 4) వైశేషిక (కణాద) 5) పూర్వ మీమాంస (జైమిని) 6) ఉత్తర మీమాంస (బాదరాయణ). షడ్డర్శనాలు భారతీయ తత్వశాస్త్రానికి పునాదులు.

ప్రకృతి ఆరాధనతో కూడిన రుగ్వేద ఆర్యుల మత విధానం మలివేదకాలం చివరి నాటికి విభిన్న దృక్పథాలతో కూడిన ఒక నిర్దిష్ట మత విధానంగా పరిణామం చెందింది. భిన్న సంస్కృతీ స్రవంతులు, బహుముఖ దృక్పథాలు మిళితమై భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహోన్నత భారతీయ సంస్కృతికి పునాదులు పడ్డాయి.

 ‘‘రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా వర్ణాలు ఉండేవి. వృత్తిని, వర్ణాన్ని మార్చుకునే వెసులుబాటు ఉండేది.’’

‘‘మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలను నిర్మించుకుంది. వర్ణం అనువంశికంగా మారింది. పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది.’’

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు

భూమి దున్నడం ప్రకృతి విరుద్ధం.. నేరం!

ఆదిమ జీవనం నుంచి స్థిర జీవనానికి మారే   పరిణామ క్రమంలో మనిషి, మొదట జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యవసాయం చేశాడు. ఆ విధంగా పశుపోషణను ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా మలచుకున్న జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆధునిక యుగంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలస పాలన ప్రారంభమైన తర్వాత వీరికి కష్టకాలం వచ్చింది. అప్పటి వరకు అడవుల్లో, మైదానాల్లో, స్వేచ్ఛగా, ఎలాంటి హద్దులు లేకుండా సంచార జాతులుగా సాగుతున్న వీరి జీవనంపై నియంత్రణలు మొదలయ్యాయి. సాగు భూములు పెంచి పన్నులు రాబట్టుకునే చట్టాల కారణంగా మేత భూములు తగ్గాయి. దీంతో పశుపోషకులు చాలా వరకు వ్యవసాయదారులుగా మారారు. ఈ అంశాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. వివిధ ఖండాల్లో ప్రధాన పశుపోషక జాతులు, వారి విశ్వాసాలు, జీవన విధానం, మన దేశంలో రాష్ట్రాల వారీగా పశుపోషణ ప్రధానాధార జాతులు, వాటి ప్రత్యేకతలను తెలుసుకోవాలి.


1. పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను ఏమంటారు?

1) గద్వాల్‌     2) గడ్వాల్‌    

3) బుగ్వాల్‌     4) పైవన్నీ


2. జమ్ము-కశ్మీర్‌లోని గిరిజన జాతులు ప్రధానంగా....

1) గుజ్జర్‌ బకర్వాల్‌     2) కోలు    

3)  గోండ్‌     4) లంబాడి


3. కశ్మీర్‌కు చెందిన పశుపోషకులు ఏ పేరుతో సమూహాలుగా ఏర్పడి ప్రయాణం సాగిస్తారు?

1)  కపిల     2) గద్వాల్‌    

3) కానుగ     4) పైవన్నీ


4. హిమాచల్‌ ప్రాంతానికి చెందిన ‘గడ్డి పోషకులు’ (పశు పోషకులు) ఏప్రిల్‌లో ఎక్కడ విడిది చేసేవారు?

1)  లాహుల్‌     2) స్పితి    

3) 1, 2    4) లాహూర్‌


5. గడ్వాల్, కుమయాన్‌ ప్రాంతాల్లోని గుజ్జర్‌లు శీతాకాలంలో ఏ శుష్క అటవీ ప్రాంతాలకు వలస వెళ్లేవారు?

1)  బాబర్‌  2) ఖాదర్‌  3) టెరాయి  4) బుగ్వాల్‌


6. కులు ప్రాంతంలోని ‘గడ్డీలు’ వేటిని మేపుతారు?

1)  గొర్రెలు     2)  ఆవులు    

3) పందులు     4) గాడిదలు


7. ధంగర్లు ఏ రాష్ట్రానికి చెందిన పశుపోషక జాతి?

1)  రాజస్థాన్‌     2) గుజరాత్‌    

3) మహారాష్ట్ర     4) ఆంధ్రప్రదేశ్‌


8. ధంగర్లు సాధారణంగా ఏ పనులు చేస్తారు?

1)  గొర్రెల కాపరులు     2) కంబళ్లు నేస్తారు

3) గేదెలను పెంచుతారు     4) పైవన్నీ


9. మహారాష్ట్రలోని ధంగర్లు జొన్న పంట కోత తరువాత ఏ తీరానికి వలస వెళతారు?

1)  కెనరా తీరం         2) కొంకణ్‌ తీరం

3) మలబార్‌ తీరం      4) కచ్‌ తీరం


10. కిందివాటిలో సరైనవి?

ఎ) ఖరీఫ్‌ - వర్షాకాలపు పంట. సెప్టెంబరు, అక్టోబరుల మధ్య కోతకు వస్తుంది.

బి) రబీ - వసంతకాలపు పంట. మార్చి తరువాత కోతకు వస్తుంది.

1) ఎ, బి లు సరైనవి     2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ, బి లు సరికావు    4) ఎ సరికాదు, బి సరైంది


11. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పశుపోషకులను గుర్తించండి.

1) గొల్ల   2) కురుమ  3) కురుబ  4) పైవన్నీ


12. బంజారాలు ఏ రాష్ట్రాల్లోని పశుపోషక సమాజం?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) పంజాబ్, రాజస్థాన్‌

3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర   4) పైవన్నీ


13. ‘రైకాలు’ నివసించే ప్రాంతం?

1) రాజస్థాన్‌     2) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర    

3) గుజరాత్‌     4) పైవన్నీ


14. 19 వ శతాబ్దం తొలినాళ్లలో మైసూర్‌లోని గొల్లలను కలిసిన బుచనన్‌ రాసిన అంశంలో సరైంది గుర్తించండి.

ఎ) గొల్లలు అడవులకు దగ్గరగా ఉన్న చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారు.

బి) కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ పాల ఉత్పత్తులను దగ్గరలోని పట్టణాల్లో అమ్ముతారు.

సి) సాధారణంగా ప్రతి కుటుంబంలో 7 నుంచి 8 మంది యువకులు ఉంటారు.

డి) యువకుల్లో కొందరు పశువులను మేతకు తీసుకెళ్లేవారు.

1) ఎ, బి, సి, డి    2) ఎ, బి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి    4) ఎ, డి సరైనవి


15. పశ్చిమ రాజస్థాన్‌ బాలోత్ర సంతలో ఏం అమ్ముతారు?

1) ఒంటెలు     2) గుర్రాలు    

3) గాడిదలు     4) 1, 2


16. ‘‘పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఏ ఇతర పనులకు ఉపయోగపడవు. కలప, ఇంధనం లాంటి శాస్త్రీయ ఉత్పత్తులు లభించవు.’’ అని అన్నవారు?

1) హెచ్‌.ఎస్‌.డాల్టన్‌     2) హెచ్‌.ఎస్‌.గిబ్సన్‌

3) హెచ్‌.టి.కోల్‌బ్రూక్‌     4) డెట్రిచ్‌


17. వలస పాలన పశుపోషకుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?

ఎ) వలస ప్రభుత్వం పచ్చిక బయళ్లను వ్యవసాయ భూములుగా మార్చడం.

బి) 19వ శతాబ్దం మధ్యకాలానికి అటవీ చట్టాలు అమల్లోకి తీసుకురావడం.

సి) చేతివృత్తులు, పశుపోషకుల పట్ల ప్రభుత్వం అపనమ్మకం.

డి) ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం వీలైనన్ని పన్నులు విధించడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి    

3) ఎ, సి, డి    4) ఎ, బి, సి, డి


18. వలస తెగల చట్టాన్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది?

1) 1871  2) 1872  3) 1873  4) 1875


19. కిందివాటిని జత చేయండి. 

రాష్ట్రం       గిరిజన జాతి

1)మహారాష్ట్ర    ఎ) డాంగ్రాలు

2) మధ్యప్రదేశ్‌    బి) బంజారాలు

3) ఆంధ్రప్రదేశ్‌    సి) కురుమ

4) గుజరాత్‌    డి) మాల్దారీలు

1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 

2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


20. వలసవాద ప్రభుత్వం చేసిన చట్టాలతో పశుపోషకులు ఎలా మారారు?

ఎ) పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు.

బి) కొందరు పశుపోషకులు కొత్త పచ్చిక బయళ్లు వెతుక్కున్నారు.

సి) ధనవంతులైన పశుపోషకులు భూములు కొనుగోలు చేసి స్థిర జీవనానికి మారారు.

డి) కొందరు పశుపోషకులు భూమిని సాగు చేస్తూ వ్యవసాయదారులుగా మారారు.

1) ఎ, సి, డి సరైనవి    2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి    4) ఎ, బి, డి సరైనవి


21. ప్రపంచంలో సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?

1) ఆసియా    2) ఆఫ్రికా    

3) దక్షిణ అమెరికా    4) ఆస్ట్రేలియా


22. ఆఫ్రికాలోని పశుపోషక సమాజంవారు?

1) బిడౌన్లు, బెర్బర్లు    2) మసాయి, సోమాలి

3) బోరాన్, టర్కానా    4) పైవన్నీ


23. ‘భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధం, నేరం’ అని భావించే జాతి?

1) మసాయి     2) సోమాలి 

3) బెర్బర్లు     4) పైవారంతా


24. మసాయి తెగ వారు ప్రధానంగా నివసించే ప్రాంతాలు?

1) దక్షిణ కెన్యా    2) టాంజానియా    3) 1, 2    4) ఏదీకాదు


25. వలస చట్టాలు ఆఫ్రికాలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని గుర్తించండి.

1) మేత భూమి అంతమైంది

2) సరిహద్దులను మూసేశారు

3) పచ్చిక బయళ్లు ఎండిపోయాయి   

4) పైవన్నీ


26. వలస పాలనకు ముందు మసాయి తెగవారి భూములు ఎక్కడ విస్తరించాయి?

1) దక్షిణ కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు

2) ఉత్తర కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు

3) ఉత్తర కెన్యా నుంచి దక్షిణ టాంజానియా వరకు

4) తూర్పు కెన్యా నుంచి తూర్పు టాంజానియా వరకు


27. ఆఫ్రికాలో 1885లో ఏర్పడిన అంతర్జాతీయ సరిహద్దులు?

1) బ్రిటిష్‌ - కెన్యా      2) బర్మన్‌ - టంగ్వానిక 

3) 1, 2      4) బ్రిటిష్‌ - ఆఫ్రికా


28. టాంజానియా బ్రిటిష్‌ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చింది?

1) 1917    2) 1919    3) 1918   4) 1920


29. సంబూరు జాతీయ ఉద్యానవనం, సెరెంగెటి ఉద్యానవనం ఉన్న ప్రాంతాలు వరుసగా?

1) టాంజానియా, కెన్యా    2) కెన్యా, టాంజానియా

3) ఉగాండా, కెన్యా    4) టాంజానియా, ఉగాండా


30. మా-సాయి (మసాయి) అంటే?

1) దేశ ప్రజలు      2) నా ప్రజలు  

3) గ్రామ ప్రజలు     4) అందరూ


31. ‘కావోకారాండ్‌’ అనే గిరిజన జాతి ఉన్న ప్రాంతాలు?

1) నమీబియా      2) నైరుతి ఆఫ్రికా 

3) 1, 2      4) దక్షిణ ఆఫ్రికా


32. ఆఫ్రికా ప్రజలను వలస పాలకులు ఏ శతాబ్దం నుంచి నియంత్రించారు?

1) 17వ   2) 18వ   3) 19వ   4) 20వ


33. భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?

1) 1873   2) 1871  3) 1901  4) 1842


34. ప్రపంచంలోనే సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?

1) ఆసియా      2) ఆఫ్రికా   

3) దక్షిణ అమెరికా    4) ఆస్ట్రేలియా


35. మసాయి తెగ ఏ పర్వతాల్లో జీవనం సాగిస్తుంది?

1) ఆల్ఫేన్స్‌      

2) హిమాలయ పర్వతాలు  

3) రాకీ పర్వతాలు, కిలిమంజారో పర్వతాలు  

4) యూరల్‌ పర్వతాలు 


36. సంబూర జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?

1) మధ్య ఆసియా    2) దక్షిణ ఆఫ్రికా 

3) కెన్యా      4) టాంజానియా


37. పర్యాటక రంగం నుంచి గత ఏడాది 240 మిలియన్లు కెన్యా షిల్లింగుల ఆదాయాన్ని పొందిన జాతీయ ఉద్యానవనం?

1) పంచ్‌ మర్ష    2) గ్రేట్‌ నికోబార్‌ 

3) కాలిడో     4) అంబొగ్సాలి


38. 19వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్‌ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ఏ సమూహాలను ప్రోత్సహించారు?

1) అటవిక సమూహాలను      

2) ఝూం వ్యవసాయదారులను  

3) స్థానిక రైతుల సమూహాలను 

4) గ్రామాధికారులు


39. భారతీయ వ్యవసాయానికి సంబంధించిన కమిషన్‌ నివేదిక? రచయిత: గద్దె నరసింహారావు

ఎ) హెచ్‌.ఎస్‌. గిబ్బన్‌ నివేదిక

బి) రాయల్‌ కమిషన్‌ నివేదిక

1) ఎ సరైంది, బి సరికాదు    

2) ఎ, బి సరికావు

3) బి మాత్రమే సరైంది    

4) బి సరికాదు


సమాధానాలు

1-3, 2-1, 3-1, 4-3, 5-1, 6-1, 7-3, 8-4, 9-2, 10-1, 11-4, 12-4, 13-1, 14-1, 15-4, 16-2, 17-4, 18-1, 19-3, 20-3, 21-2, 22-4, 23-1, 24-3, 25-4, 26-2, 27-3, 28-2, 29-2, 30-2, 31-3, 32-3, 33-2, 34-2, 35-3, 36-3, 37-4, 38-3, 39-3.


 

Posted Date : 15-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం (సామాజిక, మత పరిస్థితులు, సాహిత్యం)

సామరస్య జీవనం.. సాహితీ స్వర్ణయుగం 

దక్షిణాదిన కాకతీయుల తర్వాత సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పి సుదీర్ఘకాలం స్థిరంగా, సుభిక్షంగా పరిపాలించిన ఘనత విజయనగర రాజులకే దక్కుతుంది.  వీరు చివరి వరకు హైందవ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించి, సాహిత్యం, కళలను పోషించి భావితరాలకు అపూర్వ సంపదను అందించారు. వ్యవస్థాగత పాలనా పద్ధతులు, పన్నుల విధానం, కట్టుబాట్ల పరంగా ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించి, పరమత సహనాన్ని పాటించి ఆదర్శ పాలకులయ్యారు. నాటి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన స్థితిగతులు, మత నియమాలు, సాహిత్యానికి లభించిన విశేష ఆదరణతో పాటు సాంఘిక దురాచారాలపైనా పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అష్టదిగ్గజ కవుల ప్రత్యేకతలు, వారి రచనలనూ తెలుసుకోవాలి.
 

మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలిస్తున్నప్పుడు, దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నదికి దక్షిణ భాగంలో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది. దీనినే కర్ణాటక సామ్రాజ్యంగా కూడా పిలుస్తారు. రాజధాని హంపి/విజయనగరం. 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో పలు మార్పులు వచ్చాయి. ఆంధ్ర దేశంలో కొంత భాగం ముస్లిం పాలకుల అధికారంలోకి వెళ్లింది. మరికొంత గజపతుల హస్తగతమైంది. అధికభాగాన్ని విజయనగర రాజులు పరిపాలించారు.

సామాజిక పరిస్థితులు:

​​​​వర్ణ వ్యవస్థ: విజయనగర రాజ్యంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. దాదాపు 18 కులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు. వైదికులు, నియోగులు అని రెండు రకాలుగా ఉండేవారు. వైదికులు అర్చకత్వం, వేదాధ్యయనం చేస్తే, నియోగులు రాజాస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవారు. క్షత్రియులు సూర్యవంశ క్షత్రియులు, చంద్రవంశ క్షత్రియులని రెండు రకాలు. సూర్యవంశ క్షత్రియులు చోళులు, గజపతులు అయితే, చంద్రవంశ క్షత్రియులు పాండ్యులు, విజయనగర రాజులు. క్షత్రియుల్లో సాధారణంగా సతీసహగమనం ఉండేది. ఈ దురాచారం గురించి తెలియజేసిన విదేశీ యాత్రికుడు ‘బార్బోస’. రాజ్యంలో మరొక ప్రముఖ కులం వైశ్య కులం. వీరిని కోమట్లు, శెట్లు అని పిలిచేవారు. వీరిలో ఆర్య వైశ్యులు శాకాహారులు, కళింగ వైశ్యులు మాంసాహారులు. వీరి ప్రధాన వృత్తి వ్యాపారం. చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుల్లో ఉన్నత స్థానం పొందినవారు కమ్మ, రెడ్డి, వెలమ. రెడ్డి కులంలో పంట రెడ్లు, దీసటి రెడ్లు అనే రకాలు, కాపుల్లో వెలనాటి కాపులు, కమ్మనాటి కాపులు, పంట కాపులు లాంటి రకాలున్నాయి. శూద్ర కులాల వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి వెన్నెముక శూద్ర కులం. కొందరు శూద్రులను ‘అమర నాయకులు’గా నియమించేవారు. విజయనగర రాజుల కాలంలో ‘పంచాణం’ అనే 5 కులాలు ఏర్పడ్డాయి. వారు కంసాలి, కమ్మరి, కాసె, స్వర్ణకారుడు, వడ్రంగి. ఈ పంచాణం వారు దొంగ వస్తువులు కొనేవారు. వీరిపై రక్షకభటుల నిఘా ఉండేది. పంచములు అనే 6వ కులం ఉండేది. పద్మశాలీలు, కుంభలు, మాల వారి వృత్తి చేనేత. నేత పనివారిని ‘కైక్కోళ్లు’ అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్యంలో ఆంధ్రదేశ సాంఘిక వ్యవస్థలో ప్రత్యేకించి తెలంగాణాలో ముస్లింలు ఒక ప్రత్యేక తరగతిగా రూపొందారు. ముస్లింల కోసం ఆంధ్ర దేశంలో ‘లంగర్‌ ఖానాలు’ అనే సత్రాలు, మసీదులు నిర్మించారు. షేక్‌లు, సయ్యద్‌లు అనే ముస్లిం సాధువులు దేశసంచారం చేస్తూ మతబోధ చేసేవారు.  ముస్లిం మత గురువుల సమాధులైన దర్గాల వద్ద ఉరుసు పేరుతో వార్షిక ఉత్సవాలు జరిగేవి. ఇస్లాంలో సున్నీలు, షియా వర్గాలు ఉండేవి.


విజయనగర సామ్రాజ్యంలో వేశ్యా వృత్తికి గౌరవప్రదమైన స్థానం ఉండేది. వీరికి ప్రభుత్వ గుర్తింపు ఇచ్చి, పన్నులు వసూలు చేసేవారు. సంవత్సరానికి ఒక వేశ్య 12,000 పణాల పన్ను చెల్లించేది. వేశ్యా వృత్తి ద్వారా వచ్చిన మొత్తం పన్ను సైనికుల జీతాలకు సరిపోయేదని అబ్దుల్‌ రజాక్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. వీరిపై విధించే పన్నును ‘గణాచారి’ పన్ను అనేవారు. వేశ్యా వృత్తి వారి గురించి సమాచారం అందించిన విదేశీయుడు డొమింగో పేస్‌. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉండేది. వివాహాలు ఆడంబరంగా జరిగేవి. కన్యాశుల్కం, వరశుల్కం ఉండేవి. రాజకుటుంబ స్త్రీలు పరిపాలనలో జోక్యం చేసుకునేవారు. వీరికి సాహిత్యంలో ప్రావీణ్యం ఉండేది. ఆనాటి ప్రముఖ మహిళలైన తిరుమలాంబ, గంగాదేవి, తాళ్లపాక తిమ్మక్క అనేక రచనలు చేశారు. బానిస విధానం అమలులో ఉండేది. దీన్ని ‘బేనబాగ’ అనేవారు. సాధారణంగా యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసి అమ్మేవారు. 


మత పరిస్థితులు: 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ఆంధ్ర దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. దిల్లీ సుల్తానులు, బహమనీ రాజులు పరమత ద్వేషానికి, విధ్వంసానికి ప్రసిద్ధులు. వీరి పాలనలో హిందువులు బాధలు పడ్డారు. హిందూ మత పరిరక్షణ, వైదిక ధర్మ సంస్థాపన ప్రధాన అంశాలుగా, విద్యారణ్యస్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపితమైంది. రాజులు హిందూ మతస్థులైనప్పటికీ పరమత సహనం పాటించారు. రాజ్యంలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు ఉండేవారు. బౌద్ధమతానికి ఆదరణ లేదు. వీరి ప్రధాన దేవుడు విరూపాక్షుడు. కులగురువు క్రియాశక్తి.


శైవ మతం: విజయనగర వంశాల్లో మొదటిదైన సంగమవంశం శైవ మతాన్ని అనుసరించింది. శైవంలో స్మార్త శైవం, వీరశైవం అనే ప్రధాన శాఖలతో పాటు పాశుపతులు, కాలాముఖ శాఖవారు ఉండేవారు. కాకతీయుల కాలంలో ఆదరణ పొందిన పాశుపతానికి వీరికాలంలో ప్రాధాన్యం తగ్గింది. స్మార్త శైవానికి ప్రాధాన్యం ఉండేది. సంగమ వంశస్థులు కాలాముఖ శాఖ శైవులు. 


వైష్ణవ మతం: 14వ శతాబ్దంలో వేదాంత దేశికాచార్యులు వైదిక సంప్రదాయానికి చెందిన వైష్ణవ శాఖ అయిన ‘వడగలై’ను ఆంధ్ర దేశంలో స్థాపించారు. ఈయన కుమారుడు 8వరదాచార్యులు రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడికి వైష్ణవ మతదీక్ష ఇచ్చాడు. దీనివల్ల తెలంగాణలో వైష్ణవం ప్రారంభమై సాళువ, తుళువ, అరవీటి వంశీకుల కాలంలో వ్యాప్తి చెందింది. మొదటగా సాళువ నరసింహరాయలు వైష్ణవ మతాన్ని ఆదరించారు. ఇతడి కాలానికి చెందినవారే తాళ్లపాక అన్నమాచార్యులు, తాతాచార్యులు. అన్నమాచార్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిపై 32,000 సంకీర్తనలు రాశారు. ఈ కాలంలోనే తిరుమల వేంకటేశ్వరస్వామికి అధిక ప్రాచుర్యం లభించింది. తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలతో కూడిన విగ్రహాలను ప్రతిష్ఠించాడు. తుళువ, అరవీటి వంశస్థులు వేంకటేశ్వరస్వామిని కులదైవంగా భావించారు. తుళువ వంశరాజులు తిరుమలలో అనేక నిర్మాణాలు చేశారు. వైష్ణవ ఆలయాల్లో పూజలు వైఖానస సంప్రదాయం ప్రకారం జరగడం ఈ కాలంలో ప్రారంభమైంది. వైష్ణవం తెంగల, వడగళ శాఖలుగా చీలింది. తెంగలశాఖకు రామానుజాచార్యులు ప్రధానప్రవక్త. వీరు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. వడగళశాఖకు ప్రవక్త వేదాంత దేశికుడు. వీరు వైష్ణవంలో వైదిక పద్ధతులను పునరుద్ధరించారు. కొందరు రాజులు జైనమతాన్ని ఆదరించారు. రెండో దేవరాయలు జైనుల కోసం ‘పాన్‌సుపారీ’ ఆలయం నిర్మించి పార్శ్వనాథుడి విగ్రహం నెలకొల్పాడు. క్రైస్తవం కూడా ఆదరణ పొందింది.సెయింట్‌ జేవియర్‌ అనే క్యాథలిక్‌ మతాచార్యుడు అనేక మందిని క్రైస్తవ మతంలోకి మార్చాడు. క్రైస్తవాన్ని ఆదరిస్తున్నందువల్ల పోర్చుగీసు రాజు రెండో ఫిలిప్‌ విజయనగర పాలకులకు సందేశంతో కూడిన లేఖను పంపారు.


సాహిత్యం: విజయనగర రాజులు సాహిత్యం, విద్యావ్యాప్తికి కృషి చేశారు. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. తెలుగు సాహిత్యానికి వీరికాలం స్వర్ణయుగం. విజయనగర పాలకులంతా తెలుగు సాహిత్యాన్ని పోషించారు. ‘ఉత్తర హరివంశం’ రచించిన నాచన సోముడిని మొదటి బుక్కరాయలు ఆదరించారు. నాచన సోముడికి ‘అష్ట భాషా మహాకవి’ అనే బిరుదు ఉంది. ఇతడికి మొదటి బుక్కరాయలు ‘పెంచికల్‌ దిన్నె’ అనే అగ్రహారం ఇచ్చారు. ఎర్రన రాసిన ‘హరివంశం’ అనే గ్రంథాన్ని నాచన సోముడు ‘ఉత్తర హరివంశం’ పేరుతో అనువదించాడు. సాళువ నరసింహరాయల ఆస్థాన కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఆయన రాసిన గ్రంథాలు జైమనీభారతం, శకుంతలా పరిణయం. జైమనీభారతంలో ‘వాణి నా రాణి’ అని పలికారు. నంది మల్లయ్య, ఘంట సింగన జంట కవులుగా ప్రసిద్ధి చెందారు. వీరిని సాళువ నరసింహరాయలు పోషించారు. వీరి రచనలు వరాహ పురాణం, వరలక్ష్మీ పురాణం. వరాహ పురాణాన్ని తుళువ నరసనాయకుడికి అంకితం ఇచ్చారు. సంస్కృత నాటకాన్ని తెలుగు కావ్యంగా రచించిన మొదటి కవులు వీరు. దూబగంటి నారాయణ కవి ‘పంచతంత్రం’ గ్రంథం రాసి ‘బసవరాజ’ అనే ఉదయగిరి పాలకుడికి అంకితం ఇచ్చారు. చరిగొండ ధర్మన ‘చిత్రభారతం’ అనే గ్రంథాన్ని రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ అనే గ్రంథం రాశారు. అష్టదిగ్గజాలుగా పిలిచే 8 మంది కవులను పోషించారు. కృష్ణదేవరాయల ఆస్థానం పేరు ‘భువనవిజయం’.
 



రచయిత: గద్దె నరసింహారావు 

 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  మౌర్యుల  పూర్వయుగం

(క్రీ.పూ.6వ శతాబ్దం - అనంతర రాజకీయ పరిస్థితులు)

గణ రాజ్యాలే మహా సామ్రాజ్యాలై!

ప్రాచీన భారతదేశంలో మలివేద ఆర్యులు గంగా మైదాన ప్రాంతానికి  వలసవచ్చి స్థిరపడటంతో చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ వృద్ధి, ఇనుము వినియోగం కారణంగా ఆర్థిక, సైనిక వనరులు పోగుపడటం, బలవంతులైన పాలకుల కారణంగా రాజ్యకాంక్ష రగిలి రాజ్యాలు విస్తరించాయి. ఈ పరిణామంలో మగధ పాలకులు తొలి మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి ఉపఖండంలో రాజకీయ ఏకీకరణకు నాంది పలికారు. నాటి గణ రాజ్యాలు, పరిధి, వాటన్నింటిపై మగధ పాలకులు ఆధిపత్యం సాధించేందుకు అనుకూలించిన పరిస్థితులు, ఈ క్రతువులో భాగమైన పాలక వంశాలు, గొప్ప పాలకులు, వారు అనుసరించిన    విధానాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మౌర్య వంశ పాలనకు ముందు ఉన్న పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకోవాలి.


ప్రాచీన భారతదేశ రాజకీయ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం అనంతర కాలం ప్రాముఖ్యమైంది. ఈ యుగ రాజకీయ పరిస్థితుల అధ్యయనానికి ప్రధాన ఆధారాలు ఆనాటి బౌద్ధ, జైన సాహిత్యం. వాటి ప్రకారం నాటి రాజకీయాలకు గంగ, యమున మైదానాలు ప్రధాన కేంద్రాలని, ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు (షోడశ మహాజనపదాలు) ఉండగా, అందులో 14 రాచరిక వ్యవస్థ ఉన్న రాజ్యాలు, 2 గణతంత్ర రాజ్యాలని తెలుస్తోంది. అంగుత్తర నికాయ (సుత్త పిటక) లాంటి పురాతన బౌద్ధ గ్రంథాలు 16 మహాజనపదాల గురించి పేర్కొన్నాయి. ఈ షోడశ మహాజనపదాలు నిరంతరం, పరస్పరం కలహించుకుంటూ ఉండేవి. మలివేద యుగంలో ఇనుము వాడకంలోకి రావడంతో దానితో పనిముట్లు చేసి  అడవులు నరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. వ్యవసాయ మిగులు వాణిజ్యానికి దారితీసి వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా వృద్ధి చెందాయి. ప్రజలకు భూమితో అనుబంధం ఏర్పడింది. సంచార జీవనం వదిలి స్థిరజీవనానికి అలవాటుపడ్డారు. క్రమంగా వివిధ వృత్తులు   ఏర్పడ్డాయి. రాజు పన్నులు (భాగ) వసూలు చేసి ఆర్థికంగా, సైనికంగా బలవంతుడయ్యాడు. ఇలాంటి పరిస్థితులే ప్రాదేశిక రాజ్య (మహాజనపదాలు) ఆవిర్భావానికి దారితీశాయి.


షోడశ మహాజనపదాలు: అంగ, అస్సక (అస్మక), అవంతి, ఛేది, గాంధార, కాశీ, కాంభోజ, కోసల, కురు, మగధ, మల్ల, మత్స్య, పాంచాల, శూరసేన, వజ్జి, వత్స. ఈ మహాజనపదాలు ప్రధానంగా ఎగువ మధ్య గంగా మైదానాల్లో, గంగ - యమున, వాటి అంతర్వేదిలో ఏర్పడ్డాయి. ఇందులో మగధ, కాశి, కోసల, అవంతి, వత్స రాజ్యాలు శక్తిమంతమైనవి.


1) అంగ: రాజధాని చంపనగరం. గంగానది ఒడ్డున ఉంది. గొప్ప  వాణిజ్యకేంద్రం. మగధను పాలించే బింబిసారుడు అంగను జయించి  మగధలో కలిపాడు.


2) అస్సక: దక్షిణ భారతదేశంలో ఉంది. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు భాగంగా ఉండేవి. అస్సకుల రాజధాని పొటానా లేదా పొటాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బోధన్‌ అని నిర్ధారించారు.


3) అవంతి: మాల్వా ప్రాంతం. రాజధాని ఉజ్జయిని. అవంతి, కోసల, మగధ రాజ్యాల మధ్య తరచూ సంఘర్షణలు జరిగేవి. శిశునాగ వంశ కాలంలో మగధ అవంతిని జయించింది.


4) ఛేది: బుందేల్‌ఖండ్‌ ప్రాంతం (మధ్యప్రదేశ్‌). రాజధాని సుక్తిమతి.


5) గాంధార: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత పాకిస్థాన్‌లోని రావల్పిండి-పెషావర్‌ ప్రాంతం)లో ఉంది. రాజధాని తక్షశిల గొప్ప విద్యాకేంద్రం.


6) కాశీ: తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌. వారణాసి (వరుణ, అసి నదుల సంగమ ప్రాంతం) రాజధాని. కోసల రాజ్యం దీన్ని జయించింది.


7) కాంభోజ: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత పాకిస్థాన్‌) ఉంది. రాజధాని రాజపుర.


8) కోసల: ప్రస్తుత అయోధ్య ప్రాంతం. రాజధాని మొదట అయోధ్య, తర్వాత శ్రావస్తి. సరయు నది అయోధ్యను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. కోసల, మగధ రాజ్యాల మధ్య దీర్ఘకాలం సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. చివరకు కోసల రాజ్యాన్ని మగధ ఆక్రమించింది.


9) కురు: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, మీరట్, స్థానేశ్వర్‌ ప్రాంతం.   రాజధాని ఇంద్రప్రస్థం/హస్తినాపురం.


10) మగధ: నేటి పట్నా, గయా, షహబాద్‌ జిల్లాలున్న ప్రాంతం. షోడశ మహాజనపదాలలో మహాశక్తిమంతమైన రాజ్యం. గంగ సొన్, గంఢక్‌ నదుల సంగమంలో ఉంది. క్రీ.పూ.6వ శతాబ్దిలో హర్యంక వంశం పాలనలో ఉంది. మగధను పాలించిన రాజవంశాలు, మగధను మహా సామ్రాజ్య స్థాయికి తీసుకెళ్లాయి.


11) మల్ల సమాఖ్య: కుశీనగర రాజధాని. బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత మగధలో కలిసిపోయింది.


12) మత్స్య: ప్రస్తుత రాజస్థాన్‌లోని జైపుర్‌ ప్రాంతం.   రాజధాని విరాట్‌ నగరం.


13) పాంచాల: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్, ఫరూఖాబాద్‌ జిల్లాల ప్రాంతం. గంగానది ఈ రాజ్యాన్ని రెండు  భాగాలుగా విభజిస్తుంది. దీని రాజధాని అహిచ్ఛత్రము.


14) శూరసేన: యమునా నది తీరాన ఉంది. రాజధాని మధుర.


15) వజ్జి: ఇది తొమ్మిది గణరాజ్యాల సమాఖ్య. ప్రతి తెగకు ప్రభుత్వం, రాజధాని ఉండేవి. వజ్జి సమాఖ్యకు రాజధాని వైశాలి.


16) వత్స: యమునా నదికి దక్షిణంగా ఉంది. రాజధాని కౌశాంబి.


క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి గంగ యమునా మైదానాల ఆక్రమణకు మహాజనపదాలు ఒకదాంతో మరొకటి సంఘర్షణకు దిగేవి. ఈ పోరాటంలో ప్రధానంగా మగధ, అవంతి, కాశి, కోసల, వజ్జి రాజ్యాలు చురుగ్గా పాల్గొన్నాయి. పరస్పర వైరాలతో బలహీనమైన ఈ జనపదాలన్నింటినీ మగధ జయించి, ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దింది. ఈ ఘనత క్రీ.పూ.6వ శతాబ్ది నుంచి 4వ శతాబ్ది వరకు మగధను పాలించిన హర్యంక, శిశునాగ , నంద వంశాలది. రాజ్యకాంక్షతో రగిలిన ఆ వంశాల రాజులు మగధను ఒక సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దారు.


మగధ మహాజనపదం విజృంభణకు కారణాలు:  

1) హర్యంక, శిశునాగ, నంద వంశాల్లో బింబిసారుడు, అజాతశత్రువు, శిశునాగుడు, మహాపద్మనందుడు లాంటి రాజులు రాజ్యకాంక్షతో మగధ మహాజనపదాన్ని గొప్ప సామ్రాజ్యశక్తిగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారు.

2) భౌగోళికంగా సొన్, గండక్, గంగ, గోగ్రా నదుల మధ్య ఉండి, విదేశీ దండయాత్రలకు దూరంగా ఉండటం.

3) గంగ, దాని ఉపనదుల ప్రవాహంతో సారవంతమైన భూములు ఏర్పడి, వ్యవసాయాభివృద్ధి జరగడం. 4) మగధ ప్రాంతం ఖనిజాల పుట్టిల్లు. ఇనుము కనుక్కోవడం, దాంతో అనేక    పనిముట్లు తయారుచేసి అడవులు నరికి, అధిక వ్యవసాయ భూమి సాగులోకి తేవడం, అధిక ఉత్పత్తి జరిగి, వ్యాపారవాణిజ్యాలు వృద్ధి చెందడం.5) పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్థికంగా బలపడటం, తద్వారా అధికార బృందం, సైనిక శక్తి పెరిగి రాజ్యవిస్తరణకు దారితీయడం.


హర్యంక వంశం (క్రీ.పూ. 544-430): ఈ వంశంలో ముఖ్య రాజులు బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు. మగధ ఔన్నత్యానికి పునాదులు వేసింది బింబిసారుడు. రాజ్యవ్యాప్తికి వైవాహిక సంబంధాలను ఒక మార్గంగా ఎంచుకుని కోసల, లిచ్ఛవి, మాద్ర రాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలతో తన పలుకుబడిని పశ్చిమాన పంజాబ్‌ నుంచి తూర్పున బెంగాల్‌ వరకు విస్తరించాడు. తూర్పున ఉన్న అంగ రాజ్యంపై దండెత్తి బ్రహ్మదత్తుడిని ఓడించాడు. గాంధార, అవంతి రాజులు అతడితో మైత్రి ఏర్పరచుకున్నారు. బింబిసారుడి రాజ్యం 80 వేల గ్రామాలతో ఉండేదని; బుద్ధుడికి, మహావీరుడికి ఇతడు సమకాలికుడని, బింబిసారుడిని చంపి అతడి కుమారుడు అజాతశత్రువు రాజు అయ్యాడని జైన, బౌద్ధ గ్రంథాలు పేర్కొంటున్నాయి. బింబిసారుడి రాజధాని రాజగృహం.


అజాతశత్రువు: తండ్రి మాదిరిగా గొప్ప సామ్రాజ్యకాంక్ష కలిగినవాడు. దిగ్విజయ యాత్రలతో రాజ్యవిస్తరణ చేశాడు. కోసల రాజైన ప్రసేనజిత్తుడిని, లిచ్ఛవిలను ఓడించాడు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలోనే జరిగింది. తండ్రిని చంపినందుకు అజాతశత్రువు పశ్చాత్తాపపడినట్లు బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అనంతరం వచ్చిన ఉదయనుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాతి రాజులు కూడా పితృహంతకులు అవడంతో, వారి అకృత్యాలు భరించలేక మంత్రి శిశునాగుడి ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేసి, శిశునాగుడిని రాజుగా చేశారు.


శిశునాగ వంశం (క్రీ.పూ. 430-364): వంశ స్థాపకుడు శిశునాగుడు. అవంతి, వత్స, కోసల రాజ్యాలను మగధలో విలీనం చేశాడు. ఇతడి గొప్ప విజయం అవంతిని జయించడం. తర్వాత కాలఅశోకుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి హయాంలోనే రెండో బౌద్ధ సంగీతి జరిగింది.


నంద వంశం (క్రీ.పూ. 364-324): నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతడు క్షత్రియేతరుడు. కాశీ, పాంచాల, మిథిల, కురు, అస్మక రాజ్యాలను జయించి ఉత్తరాన సట్లెజ్‌ నుంచి దక్షిణాన గోదావరి వరకు మగధ రాజ్యాన్ని విస్తరించి మొదటి భారత సామ్రాజ్య నిర్మాతగా చరిత్రకెక్కాడు. ఇతడి తర్వాత తొమ్మిది మంది నంద రాజులు అసమర్థులు. ఆఖరి రాజైన ధననందుడు అలెగ్జాండర్‌ సమకాలికుడు. గ్రీకులు ధన  నందుడిని అగ్రేమ్స్‌ అని పిలిచారు. అతడి నిరంకుశ పాలన, పన్నుల భారం, ప్రజల అసంతృప్తి వల్ల చంద్రగుప్త మౌర్యుడు, తన గురువు చాణుక్యుడి సహాయంతో నంద వంశం పాలనను నిర్మూలించాడు. పాటలీపుత్ర సింహాసనంపై మౌర్యుల పాలన ప్రారంభమై భారత ఉపఖండాన్ని రాజకీయంగా ఒకే పాలనా ఛత్రం కిందకి తెచ్చారు. ఈ పరిణామంతో భారతదేశ చరిత్ర మహా సామ్రాజ్య యుగం వైపు ప్రయాణించింది.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌