• facebook
  • whatsapp
  • telegram

కాకతీయులు

11 - 15 శతాబ్దాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు

         కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడి మాగల్లు శాసనం (క్రీ.శ. 950)లో ఉంది. ఇది గుండియ - ఎరియ - కాకర్త్య గుండనల గురించి వివరిస్తుంది. గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువు శాసనం వెన్న భూపతి వంశీయులే కాకతీయులని పేర్కొంటుంది. కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, తర్వాత కల్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారు. రాష్ట్రకూటులది గరుడకేతనం. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. కాకతీయులు కల్యాణి చాళుక్యుల వరాహ లాంఛనాన్ని స్వీకరించారు. కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులు అయ్యారు. కాకతి అంటే కూష్మాండం/ గుమ్మడి అనే అర్థం కూడా ఉంది. 22వ తీర్థంకరుడైన నేమినాథుడి శాసనాధికారిణి పేరు కూష్మాండిణి. కాకతీయులు మొదట జైనులు కాబట్టి కూష్మాండి దేవతను కూడా పూజించారు. ఆంధ్రరాజులగా కీర్తి నొందారు.


         కాకతి వంశ ప్రతిష్ఠకు పునాది వేసింది మొదటి బేతరాజు. ఇతడికి కాకతి పురాధినాథ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజుకు కాకతి వల్లభ అనే బిరుదుంది. సిద్ధేశ్వర చరిత్ర గ్రంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవర్మ అని ఉంది. కాకతీయుల కాలంలో చేబ్రోలును మహాసేనం అని, అనుమకొండను రుద్రేశ్వరం అని పిలిచేవారు. అనుమకొండ రాజు పద్మసేనుడు సిద్ధేశ్వరుడిని గుమ్మడిపూలతో పూజించడం వల్ల సంతానం కలిగింది. కాబట్టి వారి సంతానాన్ని గుమ్మడితీగ సంతానం అని పిలిచేవారు. కాకతీయులను ఆంధ్రదేశాధీశ్వరులు, మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధకులు అని పిలుస్తారు. రట్టడి (గ్రామపెద్ద) పదవితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది.

మొదటి బేతరాజు (క్రీ.శ. 992 - 1052):
         కాకతీపురాధినాథ బిరుదాకింతుడు. ఇతడు వేయించిన శనిగరం శాసనం ద్వారా సెబ్బిమండలం (కరీంనగర్)లో కొంత భాగం ఇతడి పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. మొదటి బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జైనాలయాన్ని పునర్ నిర్మించాడు.

 

మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 - 1076):
         ఇతడు అరికేసరి/ అరిగజకేసరి బిరుదు పొందాడు. ఓరుగల్లు సమీపంలో కేసరి తటాకాన్ని తవ్వించాడు. చాళుక్య మొదటి సోమేశ్వరుడికి కొప్పం యుద్ధంలో సహకరించి అతడి నుంచి అనుమకొండ ప్రాంతాన్ని పొందాడు.

 

రెండో బేతరాజు (1076 - 1108):
         త్రిభువనమల్ల, విక్రమచక్ర రెండో బేతరాజు బిరుదులు. మంత్రి వైజదండాధిపుడు. రెండో బేతరాజు మరణానంతరం పెద్ద కుమారుడు దుర్గరాజు పాలనకు వచ్చాడు. మొదటి బేతరాజు నిర్మించిన బేతెశ్వరాలయానికి దుర్గరాజు రామేశ్వర పండితుడి పేరుమీద దానధర్మాలు చేసినట్లు ఖాజీపేట దర్గాశాసనం తెలుపుతోంది. దుర్గరాజు పాలనా కాలం 1108 - 1116 (గురువు - ధ్రువేశ్వరుడు)

 

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 - 1157):
         మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు రెండో ప్రోలరాజు. రుద్రదేవుడి అనుమకొండ శాసనం ఇతడి విజయాలను తెలుపుతోంది. ఇతడు ఓరుగల్లు పట్టణ నిర్మాణం ప్రారంభించాడు. అందులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించాడు.

      మహామండలేశ్వర బిరుదుతో పాలించాడు. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు. అనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర, కేశవ ఆలయాలను నిర్మించాడు. ఓరుగల్లును క్రీడాభిరామం గ్రంథం ఆంధ్రనగరి అని పేర్కొంది. దీన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు. మైలమ అనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. రెండో ప్రోలరాజు కాలం నుంచే వరాహం అధికార చిహ్నమైంది.
 

రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు (1157 - 1195):
        స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు. వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. కాలచూరి బిజ్జలుడు ఇతడి చేతిలో ఓడినట్లు బిజ్జలుని లక్ష్మీశ్వర శాసనం తెలుపుతోంది. 1176 - 82 సంవత్సరాల మధ్య జరిగిన పలనాటి యుద్ధంలో కాకతిరుద్రుడు నలగాముడి పక్షాన పోరాడాడు. త్రిపురాంతకం శాసనాన్ని 1185లో వేయించాడు. 1186లో ద్రాక్షారామ శాసనం వేయించాడు. యాదవరాజు జైత్రపాలుడి చేతిలో మరణించాడు. ఇతడి కాలంలోనే శైవ - జైన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. జైనాచార్యుడైన ఉపమన్యముని సహాయంతో మహాదేవుడు రుద్రుడిపై తిరుగుబాటు చేశాడు. మల్లిఖార్జున పండితారాధ్యుడు రుద్రుడి సమకాలికుడు. రుద్రుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. రుద్రుడి మంత్రి గంగాధరుడు బుద్ధదేవుడి ఆలయం నిర్మించాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడికి విద్యాభూషణం అనే బిరుదు ఉంది. అనుమకొండ శాసనాన్ని రచించిన కవి అచితేంద్రుడు. తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి పేర్కొన్న గ్రంథం - ప్రతాపరుద్రీయం.

మహదేవుడు (1195 - 1199):
         శైవ మతాభిమాని. ఇతడి గురువు ధృవేశ్వర పండితుడు. ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవుడికి రాజ్యం అప్పగించాడు. మహదేవుడి భార్య భయ్యాంబిక, కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు - మైలాంబ, కుందమాంబ. ఇతడు కూడా యాదవరాజు జైతుగి చేతిలో మరణించాడు. అతి తక్కువ కాలం పాలించిన పాలకుడు ఇతడే.

 

గణపతిదేవుడు (1199 - 1262):
     
   అతి ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజు. జైతుగి కుమారుడు సింఘనకు తెలుగు రాయస్థాపనాచార్య అనే బిరుదు ఉంది. గణపతి దేవుడి గురువు విశ్వేశ్వర శంభు. రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, కాకతీయరాజ్య భారధేరేయ అనే బిరుదులు ఉన్నాయి. 1199 నాటి గణపతి దేవుడి మంథెన శాసనంలో అతడి బిరుదు సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య. గణపతి సేనాని ముత్యాల చెండరాయడు వెలనాడు, దివిసీమ ప్రాంతాలపై దాడిచేసి విజయం సాధించాడు. చందోలు పాలకుడు పృథీశ్వరుడిని, దివిసీమ అయ్యవంశానికి చెందిన ఫిన్నచోడుడిని ఓడించాడు. ఫిన్న చోడుడి కుమార్తెలు నారమ, పేరమలను గణపతి వివాహం చేసుకున్నాడు. వారి సోదరుడు జాయపను తన గజసాహిణిగా నియమించుకున్నాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ప్రకారం ఛోడతిక్కన పృథీశ్వరుడి శిరస్సుతో ఆటలాడినట్లు తెలుస్తోంది. గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరఃకందుక క్రీడా వినోద అనే బిరుదు కూడా ఉంది. అతడు 1254లో రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చాడు. కుమార్తెలు రుద్రమదేవిని నిడదవోలు - వీరభద్రుడికి, గణపాంబను కోట పాలకుడు బేతరాజుకు ఇచ్చి వివాహాలు చేశాడు.

       సోదరి మేళాంబికను నతవాడి పాలకుడు పృథ్వీరాజుకిచ్చి వివాహం చేశాడు. మనుమసిద్ధి ఆస్థానంలోని తిక్కన రాయభారం వల్ల మోటుపల్లి రేవును పొందాడు. మోటుపల్లికి - దేశీయ కొండాపురం అనే పేరుంది. బమ్మెర పోతన (ఒంటిమిట్ట - కడప) ఇతడి కాలం వాడే. కానీ గణపతి 1262లో జటావర్మ సుందర పాండ్యుడి చేతిలో ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడు. జాయప దక్షిణ దండయాత్రలను చేబ్రోలు శాసనం తెలియజేస్తుంది. గణపేశ్వర శాసనం కూడా జాయప విజయాలను తెలుపుతోంది. గణపతి దేవుడికి చోడకటక చూరకార బిరుదు కూడా ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం ఛోడ తిక్కన కురువులూరు యుద్ధం గురించి వివరిస్తుంది. గణపతి నెల్లూరు ఛోడతిక్కన కుమారుడైన మనుమసిద్ధి (వీరగండ గోపాలుడు)కి సాయంచేశాడు. ఈ విషయాన్ని న్యాయనిపల్లి శాసనం తెలుపుతోంది. గణపతి గురువు విశ్వేశ్వర శంభు (శివదేవుడు) గోళకీమఠాలు ఏర్పాటు చేశాడు. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప గణపతి దేవుడు అభయశాసనం, మోటుపల్లి శాసనాలు వేయించాడు. నాటి మోటుపల్లి పాలకుడు సిద్ధయ దేవుడు. గణపతి దేవుడు వరంగల్లులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. మోటుపల్లి, అభయ శాసనాలు వేయించాడు. తిక్కన గణపతి దేవుడి సమకాలీనుడు.


రుద్రమదేవి (1262 - 1289):
         ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి మహిళ. శాసనాల్లో రుద్రదేవ మహారాజు, రాయగజకేసరి లాంటి బిరుదులతో ఈమెను ప్రస్తావించారు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కఠోధృతి/ పట్లోధృతిగా వర్ణిస్తుంది. రుద్రమ సేనాని రేచర్ల ప్రసాదిత్యుడికి రాయపితామహాక, కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదులు ఉన్నాయి.

        ఓరుగల్లు కోట లోపల మెట్లు కట్టించింది. కులశేఖర పాండ్యుడిని ఓడించింది. కానీ, కాయస్థ అంబదేవుడు ఈమెను యుద్ధభూమిలోనే వధించినట్లు చందుపట్ల శాసనం (నల్గొండ జిల్లా) ద్వారా తెలుస్తోంది. త్రిపురాంతకం శాసనం కూడా అంబదేవుని విజయాలను వర్ణిస్తోంది. అంబదేవుడు కొప్పెరుంజింగని వధించి కాడవరాయి విధ్వంసక బిరుదు పొందాడు. యాదవరాజులపై రుద్రమ విజయాన్ని బీదర్ శాసనం తెలుపుతుంది. హేమాద్రి తన వ్రతఖండం గ్రంథంలో రుద్రమదేవిని ఆంధ్రమహారాణి అని పేర్కొన్నాడు. బీదర్‌కోట శిలాశాసనంలో రాయగజకేసరి బిరుదును ప్రస్తావించడమైంది. రుద్రమ మల్కాపురం శాసనం (నల్గొండ) ప్రసూతి వైద్యకేంద్రాల గురించి వివరిస్తుంది. విశ్వేశ్వర శివాచార్యులకు మందడం అనే గ్రామాన్ని దానం చేసింది.
 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 - 1323):
         చివరి కాకతీయ రాజు. ఇతడు రుద్రమ కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడు. రాజ్యాన్ని 77 నాయంకరాలుగా విభజించాడు. తురుష్కులు కాకతీయ రాజ్యంపై 8 సార్లు దండెత్తినట్లు విలస తామ్రశాసనం, కలువ చెరువు శాసనాలు పేర్కొంటున్నాయి. కానీ ముస్లిం రచనలు మాత్రం 5 దండయాత్రలనే తెలుపుతున్నాయి. 1303లో కాకతీయ, ఖిల్జీ సైన్యాలు కరీంనగర్‌లోని ఉప్పరపల్లి వద్ద తలపడ్డాయి. రేచర్ల వెన్నసేనాని, పోలుగంటి మల్లి మాలిక్ ఫక్రుద్దీన్ జునాను ఓడించారు. 1309లో మాలిక్ కపూర్ దండయాత్రను అమీర్ ఖుస్రూ పేర్కొన్నాడు. తర్వాత ముబారక్ ఖిల్జీ ఖుస్రూఖాన్‌ను పంపాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉలూగ్/ జునాఖాన్/ మహ్మద్ బిన్ తుగ్లక్‌ను పంపాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం 'బొబ్బారెడ్డి' అనే సేనాని కాకతీయ సైన్యం నుంచి వైదొలగి ద్రోహం చేసినట్లు తెలుస్తోంది. 1323లో ప్రతాపరుద్రుడిని ఖాదర్‌ఖాన్ దిల్లీకి తీసుకుపోతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

          ఆంధ్రనగరి లేదా ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చారు. గంగాదేవి మధురా విజయం, ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం ప్రతాపరుద్రుడి ఆత్మహత్య గురించి పేర్కొన్నాయి. వరంగల్‌లో బుర్హనుద్దీన్‌ను పాలకుడిగా నియమించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు తుగ్లక్‌ల ఆస్థానంలో ఉప ప్రధాని (మాలిక్ మక్బూల్)గా పనిచేశాడు. ఇతడు తెలంగాణ బ్రాహ్మణుడు. అనితల్లి కలువచేరు శాసనం కూడా ముస్లిం దండయాత్రలను వివరిస్తోంది. ప్రతాపరుద్రుడి ప్రధాని ముప్పిడినాయకుడు.
 

కాకతీయుల పాలన:
         బద్దెన - నీతిశాస్త్ర ముక్తావళి, శివదేవయ్య - పురుషార్థసారం, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం, మడికిసింగన - సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు కాకతీయుల పాలనా విశేషాలను వివరిస్తాయి. రాచరికం సప్తాంగ సమన్వితం. మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. 18 మంది తీర్థుల గురించి సకలనీతి సమ్మతం పేర్కొంటోంది. రాజు - మంత్రులు, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని పురుషార్థసారం పేర్కొంది. రాజోద్యోగులను 72 నియోగాలుగా విభజించారు. బహత్తర నియోగాధిపతి 72 నియోగాలపై పర్యవేక్షకుడిగా ఉండేవాడు. కాకతీయులు మహామండలేశ్వర  బిరుదు ధరించారు.
           రాజ్యాన్ని నాడులు - స్థలాలు - గ్రామాలుగా విభజించారు. నాడులకు సీమ, పాడి, భూమి అనే పర్యాయ పదాలున్నాయి. గ్రామంలో 12 మంది ఆయగాండ్రు ఉండేవారు. కరణం, రెడ్డి (పెదకాపు), తలారి మాత్రమే ప్రభుత్వ ప్రతినిధులు. మిగిలిన 9 మంది తమ వృత్తుల ద్వారా విధులు నిర్వహించేవారు. న్యాయ విషయాల్లో ప్రాడ్వివాక్కులు రాజుకు సలహాలిచ్చేవారు.

          గ్రామాల్లో తగాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ఉద్యోగులను నియమించేవారని దుగ్గిరాల శాసనం పేర్కొంది. సమయసభలు అనే న్యాయ సభలు ఉండేవి. ప్రత్యేక నేరాల విచారణకు నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేసినట్లు క్రీడాభిరామం పేర్కొంది. ఆయగాండ్రు రైతుల నుంచి పంటలో కొంత భాగం 'మేర' వసూలు చేసేవారు. రాచపొలాన్ని కౌలు (కోరు)కు తీసుకున్న రైతులను అర్థశీరి అనేవారు. పెనుంబాకం మానదండం, కేసరిపాటిగడలు ఉపయోగించి పొలాన్ని సర్వే చేయించేవారు. రాచపొలం, నీరుపొలం, వెలిపొలం, తోటపొలం అని భూములను వర్గీకరించేవారు. సన్నిగండ్ల శాసనం కొలగాండ్రు, కరణాలను ప్రస్తావించింది. గొర్రెల మందలపై అడ్డవట్ల పన్ను విధించేవారు. కోటగణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం వృత్తి పన్నుల గురించి వివరిస్తోంది. వడ్రంగులను తక్షక అనేవారు. రేవు పట్టణాలను కర పట్టణాలు అనేవారు. పన్నులు వసూలు చేసే స్థలాలను ఘట్టాలు అని పిలిచేవారు.
           సైనిక వ్యవస్థలో దుర్గాలకు అధిక ప్రాముఖ్యం ఉందని పురుషార్థసారం, నీతిసారం తెలుపుతున్నాయి. రథాలు వాడుకలో లేవు. చతురంగ బలాలన్నీ మహారాజ పట్టసాహిణి పర్యవేక్షణలో ఉండేవి. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యంలో వెలమల ప్రాబల్యం అధికంగా ఉండేది. రాజు అంగరక్షకదళం (వెంకి) గురించి సకలనీతి సమ్మతం తెలుపుతోంది. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. 75 మంది నాయంకరులు ఉన్నట్లు బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి తెలుపుతోంది. రాజుతోపాటు స్వచ్ఛందంగా మరణించే సైనిక బృందాలు లెంకలు.

ఆర్థిక పరిస్థితులు:
        వ్యవసాయం ప్రధాన వృత్తి. మొదటి ప్రోలరాజు కేసరి సరస్సును, రేచర్ల రుద్రుడు పాకాల చెరువును తవ్వించారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారు. కందిపప్పు వాడకంలో లేదు. పాల్కురికి సోమనాథుడు 'పండితారాధ్య చరిత్ర'లో 20కి పైగా వస్త్ర రకాలను పేర్కొన్నాడు. మచిలీపట్నం వస్త్రాల గొప్పతనం గురించి మార్కోపోలో తెలియజేశాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖమల్ వస్త్రాలు నేసేవారు. నిర్మల్ కత్తులు డమాస్కస్‌కు ఎగుమతి అయ్యేవి. త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడు ఎత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటోంది.
          ఆదిలాబాద్ జిల్లా కూనసముద్రం కత్తులకు ప్రసిద్ధి. మోటుపల్లి (ప్రకాశం), కృష్ణపట్నం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మైసోలియా లాంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించాలని నీతిసారం గ్రంథం పేర్కొంది. గోల్కొండ ప్రాంత వజ్రపు గనుల గురించి మార్కోపోలో పేర్కొన్నాడు. వర్తకులు నకరం - స్వదేశీ - పరదేశీ - నానాదేశీ పెక్కుండ్రు అనే శ్రేణులుగా ఏర్పడేవారు. త్రిపురాంతకంలో అయ్యావళి అయినూరరు (500) అనే కన్నడదేశ వర్తక శ్రేణి ఉంది. యనమదల శాసనం వర్తక శ్రేణుల గురించి పేర్కొంది. నాటి నాణేలన్నింటిలో పెద్దది గద్యాణం. ఇది బంగారు నాణెం. దీన్ని నిష్క లేదా మాడ అని కూడా పిలిచేవారు. రూక అనేది వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల శాసనం పేర్కొంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాదిక, వీస, చిన్నం అనే నాణేలు ఉండేవి.

మత, సాంఘిక పరిస్థితులు:
       కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారు. హనుమకొండలో అనేకమంది జైనులు ఆశ్రయం పొందారు. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై జైనాలయ బసది (కడలాలయ బసది) నిర్మించింది. రెండో ప్రోలరాజు హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. కానీ రెండో బేతరాజు, దుర్గరాజులు రామేశ్వర పండితుడి (శ్రీశైల మఠాధిపతి)ని గురువుగా భావించారు. నాడు ఆలంపురం గొప్ప కాళాముఖ శైవ క్షేత్రం. పండితారాధ్యుడు పానగల్లురాజును శపించినట్లు తెలుస్తోంది. బ్రహ్మయ అనే శైవుడు గోవూరు(కోవూరు-నెల్లూరు)లోని జైనబసదులను నేలమట్టం చేశాడు. పొట్ల చెరువు, తిరువూరుల్లో బసదులను కూల్చి జైనులను హింసించారు. సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం గణపతిదేవుడు హనుమకొండలోని జైనులను క్రూరంగా హింసించాడు. గణపతి గురువు విశ్వేశ్వరశివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. దాహళ దేశంలో సద్భావశంభు గోళకీమఠాన్ని స్థాపించగా ఆంధ్రలో విశ్వేశ్వర శివదేవుడు ప్రధానాచార్యుడయ్యాడు. ఆంధ్రలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రం మందడం. వైష్ణవం కూడా ఆదరణకు నోచుకుంది. శ్రీకూర్మం, శ్రీకాకుళం, తిరుపతి, మంగళగిరి, సింహాచలం నాటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు. రామానుజాచార్యులు శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చినట్లు శ్రీపతి భాష్యం తెలుపుతోంది. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడు. తిక్కన ప్రభావం వల్ల గణపతిదేవుడు వైదిక మతాభిమాని అయ్యాడు. విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పాడు. ప్రతాపరుద్రుడి కాలానికి బ్రాహ్మణాధిక్యం పెరిగినట్లు పిడుపర్తి సోముడి బసవపురాణం తెలుపుతోంది. మైలారదేవుని ఆరాధనలో తలలు కత్తిరించుకునేవారు. ఆలయ ఉద్యోగ బృందంలో స్థానాపతులు ప్రధానాధికారులు. నాడు ఆలయ ఉద్యోగి బృంద పర్యవేక్షణకు బహత్తర నియోగాధిపతి ఉండేవాడు.

       నాటి కుల సంఘాలను సమయములు అనేవారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు అనీ, వైశ్య సంఘానికి నకరము అనే ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సానుల వృత్తి సంఘాలను సానిమున్నూరు అనేవారు. రుద్రదేవుడి కాలం నుంచే కాకతీయులు వైదిక మతాభిమానులు అయ్యారు. వీరి కాలంలోనే వెలమ, రెడ్డి కులాల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. సమయాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి సమయ దండన విధించేవారు. బాపట్ల శాసనం సమయ సేనాపతి అనే ఉద్యోగిని పేర్కొంటోంది.
 అరిగాపులు అంటే పన్ను కట్టాల్సిన రైతులు. కొలగాండ్రు అంటే పన్ను వసూలు చేసేవారు. పట్టప హుండీ - ధన రూపంలో విధించే పన్ను, పట్టు కొలచు - ధాన్య రూపంలో విధించే పన్ను.

 

పన్నులు:
          దర్శనం - రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అప్పణం - రాజు అకారణంగా వేసేది. ఉపకృతి - యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్ను. అడ్డు సుంకం - యాదవ వర్గాలపై పన్ను. కాకతీయుల కాలంలో పన్ను 1/6 వ వంతు. రాజన్నశాలి అనేది ఒక వరి వంగడం. ఇటీవల తవ్వకాల్లో బయల్పడిన ద్రెక్మ నాణెం గ్రీకు నాణేలను పోలి ఉంది. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు మొగిలిచర్లలో ఉన్న ఏకవీరాదేవిని ఆరాధించేవారు. ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. మాడ అనే బంగారు నాణేన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.

భాష - సాహిత్యాలు:
        కాకతీయుల అధికార భాష సంస్కృతం. విద్యామంటపాలను ఏర్పాటు చేశారు. మందడం వేద పాఠశాలను విశ్వేశ్వర శివుడు నిర్మించాడు. పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి గణపతిదేవుడి ఆస్థాన కవి. రుద్రదేవుడు నీతిసారంను రచించాడు. ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని అగస్త్యుడు నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత మొదలైన గ్రంథాలు రాశాడు. గంగాదేవి మధురా విజయంలో అగస్త్యుడిని తన గురువుగా కీర్తించింది. మరో కవి శాకల్య మల్లుభట్టు ఉత్తర రాఘవకావ్య, నిరోష్ట్య రామాయణం లాంటి కావ్యాలు రాశాడు. విద్దనాచార్యులు ప్రమేయచర్చామృతం గ్రంథాన్ని రాశాడు. గంగయభట్టు శ్రీహర్షుడి ఖండన ఖండ ఖాద్య గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
గమనిక: విద్యానాథుడు, అగస్త్యుడు ఒక్కరే అని కొందరి భావన. కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యాత అయిన మల్లినాథుడే విద్యానాథుడని కొందరి భావన.
 జైన కవి అధర్వణుడు విరాట పర్వతాన్ని అనువదించినట్లు తెలుస్తోంది. అప్పయార్యుడు జైనేంద్ర కళ్యాణాభ్యుదయం కావ్యాన్ని రాశాడు. మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచించాడు. యధాహక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. శివదేవయ్య శివదేవధీమణి మకుటంతో శతకాన్ని రచించాడు. పాల్కురికి సోమనాథుడు (పాలకుర్తి) పండితారాధ్య చరిత్ర, బసవపురాణం గ్రంథాలను రాశాడు. అనుభవసారం అనే పద్య కావ్యాన్ని, వృషాధిప శతకాన్ని కూడా రచించాడు. సంస్కృతంలో రుద్రభాష్యం రచించాడు. హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణం రచించాడు. తిక్కన శిష్యువైన మారన మార్కండేయ పురాణాన్ని తెనిగించి నాగయగన్న మంత్రికి అంకితం చేశాడు.

         మూలఘటిక కేతన దశకుమార చరిత్రను తెనిగించాడు. అభినవ దండిగా పేరొందిన కేతన రచనయే తెలుగులో మొదటి కథాకావ్యంగా ప్రసిద్ధి. మంచన కేయూర బాహుచరిత్రను రాసి గుండనమంత్రికి అంకితమిచ్చాడు. కాకతీయ యుగంలోనే శివకవులు శతక ప్రక్రియను ప్రారంభించారు. తిక్కన సోమయాజి కృష్ణ శతకాన్ని, బద్దెన నీతి శతకాన్ని (సుమతీ శతకం) రచించారు. యాజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రాన్ని కేతన విజ్ఞానేశ్వరీయం పేరుతో అనువదించాడు. ఆంధ్ర భాషా భూషణం గ్రంథం ద్వారా తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేశాడు. తిక్కన కవి వాగ్బంధం అనే ఛంధో గ్రంథాన్ని రాశాడని ప్రతీతి. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి ప్రముఖ రాజనీతి గ్రంథం. క్షేమేంద్రుడు ముద్రామాత్యం, శివదేవయ్య పురుషార్థసారం, ఆంధ్రభోజుడు (అప్పనమంత్రి) నీతి భూషణం గ్రంథాలను రచించారు. భోజకవి (భోజుడు) చారుచర్య అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. కేతన కాదంబరి, రావిపాటి త్రిపురాంతకుడు మదన విజయం నాటి ప్రధాన శృంగార కావ్యాలు. త్రిపురాంతకుడు (తిప్పన్న) ప్రేమాభిరామం పేరుతో సంస్కృతంలో వీధి నాటకం రచించాడు.
 తిప్పన్న అంబికా శతకం కూడా రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడి క్రీడాభిరామం ఓరుగల్లు మత, సాంఘిక జీవితాన్ని; ద్వారసముద్రంలోని నటుల గురించి వివరిస్తుంది. మల్కాపురం శాసనం మందడంలోని విశ్వేశ్వర దేవస్థానంలోని ఆటగత్తెలు (10), పాటగత్తెల (12) గురించి పేర్కొంటుంది. జాయపసేనాని నృత్యరత్నావళి చిందు, కోలాటం లాంటి అనేక జానపద నృత్యాలను పేర్కొంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు.

వాస్తు నిర్మాణాలు:
         దేశ రక్షణలో దుర్గాలకు ప్రాముఖ్యం ఉంది. మూడు రక్షణ శ్రేణులతో (పుట్టకోట, మట్టికోట, అగడ్త రాతికోట) ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించారు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బురుజులు ఉండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో మెట్లను నిర్మించారు. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వర, పద్మాక్షి ఆలయాలు; ఓరుగల్లులో స్వయంభూ, కేశవ ఆలయాలను నిర్మించారు. 1162లో కాకతి రుద్రుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడి (త్రికూటాలయం)ని నిర్మించాడు. రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులే త్రికూటాధిపతులు. గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు. పాలంపేట రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల గృహాలు ఉన్నాయి.  రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచల్దేవి చిత్రశాలను నిర్మించినట్లు క్రీడాభిరామం గ్రంథం తెలుపుతోంది. మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూ దేవుడి విగ్రహం దిల్లీ మ్యూజియంలో ఉంది. హనుమకొండలో నంది విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఓరుగల్లు గురించి అమీర్ ఖుస్రూ తన రచనల్లో పేర్కొన్నాడు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుతుబ్‌షాహీలు (1512 - 1687)

      కుతుబ్‌షాహీలు 'ఆంధ్ర సుల్తానులు'గా పేరుపొందారు. ఆంధ్ర దేశాన్ని సుమారు 175 సంవత్సరాలు పాలించారు. పర్షియన్ రాజభాషగా ఉండేది. సుల్తాన్ కులీకుతుబ్‌షా గోల్కొండ రాజధానిగా 1512లో కుతుబ్‌షాహీ వంశపాలన ప్రారంభించాడు.  1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొగలు సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 

సుల్తాన్ కులీ (1512 - 43):
   
   సుల్తాన్ కులీ 'కారాకునీల్' తెగకు చెందినవాడు. బహమనీ రాజ్యంలోని మూడో మహమూద్ వద్ద ఆస్థాన ఉద్యోగిగా పనిచేశాడు. ఖవాస్‌ఖాన్, కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదులు పొందాడు. గోల్కొండ జాగీర్దారుగా నియమితుడయ్యాడు. చాళుక్య యుగంలో గోల్కొండను 'మంగళవరం' అని పిలిచేవారు. బీజాపూర్, బీదర్, ఒరిస్సా పాలకులను ఓడించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కోవిల్‌కొండ, మెదక్, బెజవాడ, ఏలూరు, కొండవీడు, బెల్లంకొండ లాంటి అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. గజపతుల సామంతుడు చితాబ్‌ఖాన్‌ను ఓడించాడు. ఆరవీటి రామరాయలు కొంతకాలం ఇతడి వద్ద పనిచేశాడు. కులీని 'బడేమాలిక్' అని ప్రజలు పిలిచేవారు. 1543లో ఇతడి కుమారుడు జంషీద్ కులీని వధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. హందం వంశస్థుడు.

జంషీద్ (1543 - 1550):    

కులీ ఇతడిని దేవరకొండలో రాజప్రతినిధిగా నియమించాడు. మీర్ మహ్మద్ హందనీ ద్వారా తండ్రిని చంపించాడు. చిన్న నేరాలకు సైతం క్రూర శిక్షలు విధించేవాడని 'పెరిస్టా' తన రచనల్లో తెలిపాడు. జంషీద్ సేనాని జగదేవరావు. సోదరుడు ఇబ్రహీం కుతుబ్‌షా బీదర్ పారిపోయి మాలిక్ బరీద్ సాయంతో జంషీద్‌పై తిరుగుబాటు చేశాడు. జంషీద్ క్యాన్సర్ (రాజ క్షయ వ్యాధి)తో మరణించాడు. కవిగా, ఆసుకవితా పండితుడిగా పేరొందాడు.
 

ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (మల్కిభరాముడు) (1550 - 1580): 
      జంషీద్ మరణానంతరం రాణి బిల్‌కీస్ జమాన్ తన కుమారుడు సుభాన్ కులీని పాలకుడిని చేసింది. ఇబ్రహీం అతడిని జయించి సుల్తాన్ అయ్యాడు. రామరాయల సాయంతో రాజయ్యాడు. గూఢచారి దళాన్ని (ఖాసాఖైల్) ఏర్పాటు చేశాడు. న్యాయశాఖను పునర్ వ్యవస్థీకరించాడు. తళ్లికోట యుద్ధంలో (1565) ముఖ్యపాత్ర పోషించాడు. అనేక మంది తెలుగు కవులను పోషించి 'మల్కిభరాముడు' అనే బిరుదు పొందాడు. పొన్నగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవులను పోషించాడు. అద్దంకి గంగాధర కవి ఆ కాలం నాటివాడే. హుస్సేన్‌సాగర్, మూసీనదిపై వంతెన; పూల్‌బాగ్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీం ఉద్యానవనాలు, గోల్కొండ కోట ప్రాకారాలను నిర్మించాడు. హిందూ వనిత భగీరథిని వివాహం చేసుకుని గోల్కొండకు 'భగీరథీ' నగరం అని పేరుపెట్టాడు. ఇతడి సేనాని మురహరిరావు 'అహోబిలం' దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. 'లంగరులు' అనే భిక్షా గృహాలను నిర్మించాడు.

* అహ్మద్‌నగర్ సుల్తాన్ మొదటి హుస్సేన్ నిజాంషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
* విజయనగర రాజ్యంలో తలదాచుకున్నాడు.
* గోల్కొండ రాజ్యం రెండో ఈజిప్ట్‌గా పేరొందింది.
* జగదేకరావు (గోల్కొండ)కు రామరాయలు ఆశ్రయం కల్పించడంతో తళ్లికోట యుద్దం జరిగింది.
* వరంగల్లు శాశ్వతంగా గోల్కొండ రాజ్యంలో విలీనం.
* గోల్కొండ దుర్గ ప్రాకారం తిరిగి నిర్మించాడు.
* దక్కనీ ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేశాడు.
* సుగ్రీవ విజయం - తెలుగులో తొలి యక్షగానం, యయాతి చరిత్ర - తొలి అచ్చతెలుగు కావ్యం ఇతడి కాలంలోనివే.
* ''పెట్టెడు బంగారంతో వృద్దురాలైన గోల్కొండ నుంచి బెంగాల్, బీజపూర్‌లకు నిర్భయంగా వెళ్లగలిగేది" - పెరిస్టా.


మహ్మద్ కులీ కుతుబ్‌షా (1580 - 1612):
      ఇతడి కాలాన్ని గోల్కొండ చరిత్రలో 'స్వర్ణయుగం'గా పిలుస్తారు. తెలుగులో కవిత్వం చెప్పిన తొలి ముస్లిం సుల్తాన్ ఇతడే. కులియాత్ - కులి పేరుతో ఉర్దూ భాషలో కవితలు రాశాడు. 'భాగ్యమతి' పేరిట మూసీనది ఒడ్డున భాగ్య నగరాన్ని నిర్మించాడు. తన కుమారుడు హైదర్ పేరుతో 1591లో 'హైదరాబాద్‌'ను నిర్మించాడు. దీని ముఖ్య రూపశిల్పి 'మీర్‌మునీమ్'. ప్లేగు నిర్మూలనకు గుర్తుగా 1591లో 'చార్మినార్' నిర్మాణాన్ని ప్రారంభించాడు.

    జామా మసీదు (ఫలక్‌నుమా ప్యాలస్), దారుల్ పిఫా (ప్రజా వైద్యశాల), దాఢ్ మహల్ (న్యాయస్థానం) నిర్మించాడు. 1611లో ఆంగ్లేయులకు మచిలీపట్నం వద్ద వర్తక కేంద్ర స్థాపనకు అనుమతి ఇచ్చాడు. అక్బర్ ఇతడి ఆస్థానానికి 'మసూద్‌బేగ్‌'ను రాయబారిగా పంపాడు. ట్రావెర్నియర్ (యాత్రికుడు), థేవ్‌నాట్ (వ్యాపారి) అనే ఫ్రెంచి వ్యక్తులు ఇతడి రాజ్యాన్ని సందర్శించారు. 'వైజయంతీ విలాసం' గ్రంథ రచయిత సారంగు తమ్మయ్య ఇతడి ఆస్థానంలోనివాడే. వజీ మహ్మద్ అనే ఉర్దూ కవిని పోషించాడు.
 

సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612 - 1626): 
      మహ్మద్ కులీకుతుబ్‌షాకి కుమారులు లేనందున తన అల్లుడు మహ్మద్ కుతుబ్‌షాను వారసుడిగా ప్రకటించాడు. మొగలు సేనాని మహబత్‌ఖాన్ చేతిలో ఓటమి చెందాడు. హైదరాబాద్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. ఖైరతాబాద్ మసీదును, మక్కా మసీదును నిర్మించాడు. 'భారతదేశ ప్రసిద్ధ నిర్మాణాల్లో మక్కా మసీదు ఒకటి' అని ట్రావెర్నియర్ (నగల వ్యాపారి) పేర్కొన్నాడు. ఇతడి కాలంలో మీర్ మహ్మద్ ముమీన్ తూనికలు, కొలతలపై 'రిసాల మిక్థరీయ' గ్రంథాన్ని, హకీం తకయుద్దీన్ వైద్యశాస్త్రంపై 'మిజానుత్ తబాయీ కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించారు. 'తారిక్ ఇ మహ్మద్ కుతుబ్‌షా' అనే చారిత్రక గ్రంథాన్ని కూడా ఇతడి కాలంలోనే రచించారు. 1614లో పారశీక రాయబారి 'మీర్ జయనూర్ అబిదీన్' హైదరాబాద్ సందర్శించాడు.

అబ్దుల్లా కుతుబ్‌షా (1626 - 1672): 
      ఇతడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా కుమారుడు. ఇతడి తల్లి హయత్ బక్షీ బేగం. ఈ కాలంలో గోల్కొండ రాజ్య క్షీణదశ ప్రారంభమైంది. షాజహాన్‌తో సంధి చేసుకున్నాడు. తర్వాత 1655లో ఔరంగజేబు దాడి చేసి గోల్కొండను దోచుకున్నాడు. 1636లో మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్‌తో సంధి చేసుకున్నాడు. శుక్రవారం ప్రార్థనలో పారశీక చక్రవర్తి పేరు బదులు మొగలు చక్రవర్తి పేరు నమోదు చేయడానికి అంగీకరించాడు. 'అబ్దుల్లా కుతుబ్‌షా మీర్‌జుమ్లా'గా పనిచేసిన 'మహ్మద్ సయ్యద్', ఔరంగజేబుతో రహస్య సంధి చేసుకుని మోసం చేశాడు. 1634లో ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా జారీ చేశాడు. నెక్నంఖాన్‌ను కర్ణాటక రాష్ట్ర పాలకుడిగా నియమించాడు. అబ్దుల్లా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగంగా పేరొందింది. క్షేత్రయ్య ఇతడి స్థానాన్ని సందర్శించాడు. గోల్కొండ వజ్రం ఇతడి కాలంలోనే దొరికింది. మహ్మద్ సయీద్ అనే అధికారిదాన్ని షాజహాన్‌కు సమర్పించాడు.
 

అబుల్ హసన్ తానీషా (1672 - 1687): 
      అబ్దుల్లా అల్లుడు భోగ విలాస పురుషుడు. అందుకే ఇతడిని 'తానీషా'గా పిలిచేవారు. 'తానీషా' అంటే 'బాలయోగి' అనే అర్థంలో గురువు షారజు కట్టాల్ ఆయనకు బిరుదు ఇచ్చినట్లు పేర్కొంటారు. సయ్యద్ ముజఫర్ స్థానంలో మాదన్నను మీర్‌జుమ్లాగా నియమించుకున్నాడు. 1674లో సూర్యప్రకాశరావు బిరుదుతో మాదన్నను నియమించాడు. అక్కన్న సర్వసైన్యాధ్యక్షుడు (సర్ లష్కర్)గా నియమితులయ్యారు. మాదన్న మేనల్లుడు పొదిలి లింగన్న కర్ణాటక పాలకుడిగా, కంచర్ల గోపన్న భద్రాచలం తరఫ్‌దార్‌గా నియమితులయ్యారు. మరో సోదరుడు వెంకన్న రస్తుంరావు బిరుదుతో సైనికోద్యోగిగా నియమితుడయ్యాడు.

      మాదన్న ప్రోత్సాహంతో 1676లో శివాజీ గోల్కొండను సందర్శించి తానీషాతో సంధి చేసుకున్నాడు. మొగల్ రాకుమారుడు మౌజం (షా ఆలం) చేతిలో ఓడి తానీషా సంధి చేసుకున్నాడు. 1686 మార్చి 24న అక్కన్న, మాదన్న హత్యకు గురయ్యారు (షేక్ మిన్హజ్ కుట్ర). 1687లో ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై దాడిచేసి 'అబ్దుల్లా ఫాణి' అనే సేనానికి లంచమిచ్చి కోట తలుపులు తెరిపించాడు. అబ్దుల్ రజాక్, లారీ వంటి సేనానులు కోట రక్షణకు పోరాడినా ఫలితం లేకపోయింది. తానీషాను గ్వాలియర్ (దౌలతాబాద్)కు బందీగా పంపించారు. 1687 అక్టోబరులో గోల్కొండ మొగలుల వశమైంది.
 

పాలనా విధానం
బహమనీ పాలనా విధానాలను అనుసరించారు. సుల్తాన్ అత్యున్నత అధికారి. 'మజ్లిస్ దివాన్‌దరి' అనే మంత్రి పరిషత్తు పాలనలో సహాయపడేది. వారిలో పీష్వా (ప్రధాని) ముఖ్యమైనవాడు. ప్రధానినే దివాన్ అనేవారు. ఆర్థికశాఖ మంత్రిని మీర్‌జుమ్లా అనీ, సైనికశాఖ మంత్రిని ఐనుల్‌ముల్క్ అనీ, గణాంక అధ్యక్షుడిని ముజుందర్ అనీ, రక్షణ అధికారిని కొత్వాల్ అని పిలిచేవారు. పీష్వా కింద దబీర్ అనే ఇద్దరు కార్యదర్శులు ఉండేవారు. రక్షకభట శాఖ సమర్థవంతంగా పనిచేసేదని ట్రావెర్నియర్ రాశాడు. మహ్మద్ కులీ 'దాఢ్ మహల్' అబ్దుల్లా కుతుబ్‌షా' 'అమన్ మహల్' అనే న్యాయస్థానాలను నిర్మించారు. మీర్జా ఇబ్రహీం జుబేరి 'బసాటిన్ సలాతిన్' గ్రంథంలో న్యాయనిర్వహణ ఆదర్శప్రాయంగా ఉండేదని రాశాడు. రాజ్యాన్ని 6 రాష్ట్రాలు లేదా తరఫ్‌లుగా విభజించారు. రాష్ట్ర అధిపతి తరఫ్‌దార్. ఇతడికి దివాన్, ఖాజీ, పండిట్ సహాయపడేవారు. సర్కారుకు అధిపతి 'ఫౌజ్‌దార్'. అబుల్‌హసన్ కాలంలో 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవి. ఫర్మానాల అమలు బాధ్యతను ఖలీల్ అనే ఉద్యోగి చూసేవాడు. రేవు పట్టణాల్లో హవర్‌దార్, షా బందర్ అనే ఉద్యోగులు ఉండేవారు.

      వేలం పద్ధతి ద్వారా శిస్తు వసూలు అధికారం పొందిన వారిని 'ముస్తజీర్లు' అనేవారు. కుతుబ్‌షాహీలకు అయిదు లక్షల సైన్యం ఉన్నట్లు థేవ్‌నట్ పేర్కొన్నాడు. అంగరక్షక దళాన్ని 'ఖానాఖైల్' అనేవారు. అశ్వికదళం 'నర్‌ఖైల్'. వీరు ఎర్రప్యాంట్లు, నల్ల తలపాగాలు ధరించేవారు. దళాధిపతులను 'నాయక్' అనేవారు. అబుల్‌హసన్ తానీషా కాలం నాటి సైనిక శక్తి గురించి 'తారీఖీ జప్రా (గిరిధర్‌లాల్)' అనే గ్రంథం తెలుపుతోంది.
 

ఆర్థిక పరిస్థితులు
      వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ ఆదాయం 5 కోట్ల హొన్నులనీ, అందులో 19 లక్షల నికరాదాయం ఖజానాలో చేరేదని మెధోల్డ్ రాశాడు. వజ్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, దారు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కోహినూర్ వజ్రం కొల్లూరు (గుంటూరు) గనుల్లో దొరికింది. ఈ గనిలో 30 వేల మంది పనిచేస్తున్నట్లు మెధోల్డ్ పేర్కొన్నాడు. నిర్మల్, ఇందూర్, ఇందల్‌వాయ్ ఆయుధ పరిశ్రమకు కేంద్రాలు. కొండపల్లి, నర్సాపురం, దారు పరిశ్రమకు కేంద్రాలు. మచిలీపట్నంలో కలంకారీ, తెరచాప గుడ్డ ఎగుమతులు జరిగేవి. ఎగుమతి, దిగుమతుల సుంకం 3 1/2 శాతం ఉండేది. కానీ పులికాట్ రేవులో 2% మాత్రమే ఉండేది. ప్రధాన బంగారు నాణెం హొన్ను (ప్రగోడా). హొన్నులో 16వ వంతు ఫణం. ఫణంలో 32వ వంతు తార్. తార్‌కు రెండు కాసులు. రూపాయి (వెండి) విలువ పన్నులో నాలుగో వంతు.

సాంఘిక, మత పరిస్థితులు
      సుల్తానులు షియాలైనప్పటికీ మత సామరస్యాన్ని పాటించారు. వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ సుస్థిరతను కోల్పోయింది. పరదా పద్ధతి, వేశ్యా వృత్తి, మూఢనమ్మకాలు లాంటి దురాచారాలు ఉండేవి. అనేక కులాలున్నట్లు 'హంసవింశతి' గ్రంథం తెలుపుతోంది. హైదరాబాద్ నగరంలో 2 వేలమంది వేశ్యలున్నట్లు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. సతీసహగమన ఆచారం ఉన్నట్లు రాశాడు. నౌరోజ్, వసంతోత్సవాలు, హోలీ, దీపావళి లాంటి పండగల్లో పాల్గొనేవారు. పరమత సహనం పాటించేవారు. మసీదులు నిర్మించడమే కాకుండా హిందూ దేవాలయాలకు, బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి ఆదరించారు. తానీషా భద్రాచలం రామాలయానికి భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ గ్రామాలను; మల్లేశ్వరస్వామి ఆలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న పట్టణాలను దానం చేశాడు. మహ్మద్ కులీకుతుబ్ షా ఉద్యోగి అయిన లాల్‌ఖాన్ ఉప్పునూతల గ్రామాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. చిష్టీ శాఖకు చెందిన గురువులు దక్షిణ భారతదేశంలో అనేక మఠాలు స్థాపించారు. షేక్ ఫక్రుద్దీన్ పెనుగొండలో ఒక కంఖాను స్థాపించాడు. బహమనీ కాలంనాటి సూఫీ యోగుల్లో బందెనవాబ్ గెసూధరాజ్ చాలా గొప్పవాడు. సూఫీ గురువులు మత సామరస్యానికి కృషిచేశారు.

 

సాహిత్యం, లలిత కళా వికాసం (సంస్కృతి)
      భాషా సాహిత్యాలను, లలితకళలను బాగా అభివృద్ధి చేశారు. పారశీకం అధికార భాష. సైనిక శిబిర భాషగా ఉర్దూ అభివృద్ధి చెందింది. తెలుగు భాషకు కూడా సముచిత స్థానం ఇచ్చారు. ఖుర్వా అనే పారశీక కవి తన గ్రంథం 'తారిఖ్ ఎల్చి నిజాంషా'ను ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. ఆలీవుర్సీ ఉర్దూ భాషలో 'నసబ్‌నామా కుతుబ్‌షాహీ' గ్రంథాన్ని రచించాడు. మీర్జా మహ్మద్ అమీన్ 'లైలా మజ్ను' గ్రంథాన్ని రచించాడు.

సుల్తాన్ కులీ గజల్ రచనలో సిద్ధహస్తుడు. ఉర్దూ భాషకు కులీ ఛాసర్ లాంటివాడని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. అబ్దుల్లా కుతుబ్‌షా పీష్వా అయిన మహ్మద్ ఇబన్ ఖాటూన్ 'ఖుర్వాన్ భాటూన్' అనే పారశీక నిఘంటువును రూపొందించాడు. 'సైపుల్‌ముల్క్ నాబదియుల్ జమాల్' గ్రంథాన్ని రచించిన గవాసీని అబ్దుల్లా కుతుబ్‌షా ఆదరించాడు. 'తూత్‌నామాను' పర్షియన్ భాషలోకి అనువదించాడు. అబ్దుల్లా కూడా స్వయంగా ఉర్దూ భాషలో ద్విపదలు రచించాడు. తానీషా ఆస్థానంలో ఉన్న అలీచిన్ తైపూర్ 'హదైఖుల్ సలాతిన్' గ్రంథాన్ని రచించాడు. మాలిక్ మహ్మద్ జయసి గ్రంథం 'పద్మావత్‌'ని గులాం అలీ ఉర్దూ భాషలోకి అనువదించాడు.
      తెలుగులో శంకర కవి 'హరిశ్చంద్రోపాఖ్యానం' రచించి కోర్కాలను జాగీర్దార్ ఈడూరు ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. అద్దంకి గంగాధరుడు 'తపతీ సంవరణోపాఖ్యానం' గ్రంథాన్ని మల్కిభరాముడికి అంకితమిచ్చాడు. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం చింతలపాలెం అగ్రహారాన్ని ఇచ్చాడు (నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం - కందుకూరి). పొన్నగంటి తెలగనార్యుడు తన 'యయాతి చరిత్ర'ను అమీన్‌ఖాన్ (పటాన్ చెరువు పాలకుడు)కు అంకితం ఇచ్చాడు. అమీన్‌ఖాన్ భార్య బడే బీబీ దయాగుణంలో గొప్ప స్త్రీ. మహ్మద్ కులీ ఆస్థాన విద్వాంసుడు గణేష పండితుడు. మహ్మద్ కులీ ఆస్థానంలో ఉన్న సారంగు తమ్మయ్య 'వైజయంతీ విలాసం' గ్రంథాన్ని రచించాడు. బిక్కనవోలు సంస్థానంలో తెలుగు భాషను బాగా ఆదరించారు. షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తం, పద్మపురాణం లాంటి గ్రంథాలను మల్లారెడ్డి రచించారు. అబ్దుల్లా ఆస్థానాన్ని సందర్శించిన క్షేత్రయ్య 'మువ్వగోపాల' పదాలను రచించాడు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. తానీషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాలు తెలుగు భాషాభివృద్ధికి కృషిచేశాయి. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) దాశరథి శతకాన్ని రచించాడు. వేమన ఈ కాలానికి చెందినవాడే. క్షేత్రయ్యలో పచ్చి శృంగారం, రామదాసులో భక్తి పారవశ్యం, వేమనలో నీతిబోధనకు, సంఘ సంస్కార ప్రభోధానికి సాధనాలయ్యాయి. ఆటవెలది వృత్తంలో వేమన పద్యాలను రచించాడు. వేమన పద్యాల్లో కబీర్, నానక్‌ల భోదనల ఛాయలు కనిపిస్తాయి. వేదాలు వేశ్యలు లాంటివని, ఎంగిలి విద్యలని వేమన పేర్కొన్నాడు.

 

      కుతుబ్‌షాహీల నిర్మాణాల్లో పారశీక, పఠాన్, హిందూ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. గుమ్మటాలు, కమానులు, మీనార్లు లాంటి విదేశీ లక్షణాలతోపాటు పక్షి, పుష్పలతాది అలంకారాలు లాంటి భారతీయ లక్షణాలను తమ నిర్మాణాల్లో పొందుపరిచారు. సుల్తాన్ కులీ 'జామా మసీదు'ను నిర్మించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా హుస్సేన్ సాగర్, మూసీ నదిపై వంతెన (పూల్‌బాగ్)లను నిర్మించాడు. మహ్మద్ కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని, చార్‌మినార్‌ను నిర్మించాడు. ఉద్యానవనాలు, పండ్లతోటలతో పరివేష్ఠితమైనందున హైదరాబాద్‌ను బాగ్‌నగర్ (ఉద్యానవన నగరం) అన్నారని థేవనట్ పేర్కొన్నాడు. చార్‌మినార్ సమీపంలోనే చార్ కమాన్‌ను నిర్మించారు. మక్కా మసీదు (కచాబా ఆలయంలా)ను మహ్మద్ కుతుబ్‌షా నిర్మించాడు. మక్కా మసీదును దిల్లీలోని 'జామా మసీదు'తో పోల్చవచ్చని షేర్వాణీ పండితుడు పేర్కొన్నాడు. చిత్రలేఖనంలో పారశీక, హిందూ పద్ధతులతోపాటు పాశ్చాత్య సంప్రదాయాలు కూడా ప్రవేశించాయి. దీన్ని 'దక్కనీ వర్ణ చిత్రకళ' అంటారు. దక్షిణాపథంలో సూక్ష్మ వర్ణచిత్రాలకు ఉదాహరణగా పేర్కొనే 'తారిఫ్ హుస్సేన్ షా పాద్‌షాహీ దక్కన్' గ్రంథం నైజాషా ఆస్థానంలో రూపొందింది. దక్కనీ వర్ణ చిత్రకళకు పితామహుడిగా పేరొందిన మీర్‌హసీంను మొగలు చక్రవర్తులు తమ ఆస్థానంలో నియమించుకున్నారు.  తానీషా కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాకతీయులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కాకతీయుల తొలి ప్రస్తావన ఉన్న దానార్ణవుడి శాసనమేది?
జ: మాగల్లు

 

2. కాకతీయులు ఎవరి కాలం నుంచి వరాహాన్ని తమ రాజ లాంఛనంగా స్వీకరించారు?
జ: రెండో ప్రోలరాజు

 

3. కిందివాటిని జతపరచండి.
1. నీతిసారం                           ఎ. ప్రతాపరుద్రుడు

2. ప్రతాపరుద్ర యశోభూషణం           బి. విద్యానాథుడు

3. మధురా విజయం                    సి. పాల్కురికి సోమనాథుడు

4. అనుభవసారం                       డి. గంగాదేవి

జ: 1 - ఎ, 2 - బి, 3 - డి, 4 - సి.
 

4. మాచల్దేవి పాత్ర గురించి వివరిస్తున్న గ్రంథం
జ: క్రీడాభిరామం

5. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందిన వెలమ నాయకుడు ఎవరు?
జ: రెండో సింగముడు

 

6. ఆంధ్ర దేశంలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రమేది?
జ: మందడం

 

7. కాకతీయుల నాటి వర్తక శ్రేణుల గురించి వివరిస్తున్న శాసనం
జ: యనమదల శాసనం

 

8. కాకతీయుల కాలంలో రుద్రేశ్వరంగా పిలిచిన ప్రాంతం
జ: హనుమకొండ

 

9. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు?
జ: దుర్జయుడు

 

10. గుమ్మడి తీగ సంతానం అని ఎవరిని పిలుస్తారు?
జ: కాకతీయులు

 

11. అరిగజ కేసరి బిరుదు పొందిన కాకతీయ పాలకుడు ఎవరు?
జ: మొదటి ప్రోలరాజు

 

12. శ్రీశైలంలో విజయ స్తంభాన్ని నాటిన కాకతీయ చక్రవర్తి
జ: రెండో ప్రోలరాజు

13. ఓరుగల్లును ఆంధ్ర నగరిగా పేర్కొన్న గ్రంథం
జ: క్రీడాభిరామం

 

14. హనుమకొండలో కడలాలయ బసదిని నిర్మించినవారు
జ: మైలమ

 

15. పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరి పక్షం వహించాడు?
జ: నలగాముడు

 

16. వరంగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసినవారు
జ: రుద్రదేవుడు

 

17. రుద్రదేవుడు యాదవరాజు జైతుగి చేతిలో మరణించినట్లు తెలిపే ఆధారం
జ: చతుర్వర్గసారం గ్రంథం

 

18. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని, రుద్రేశ్వరాలయాన్ని నిర్మించినవారు
జ: మొదటి ప్రతాపరుద్రుడు

 

19. కాకతీయుల కాలంనాటి తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి వివరిస్తున్న గ్రంథం
జ: ప్రతాపరుద్రీయం

 

20. తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన పాలకుడు
జ: గణపతిదేవుడు

21. కిందివాటిని జతపరచండి.
1. శివదేవయ్య       ఎ. నీతిశాస్త్ర ముక్తావళి

2. బద్దెన            బి. పురుషార్థసారం

3. రుద్రదేవుడు       సి. నీతిసారం

4. మడికి సింగన     డి. సకలనీతి సమ్మతం

జ: 1 - బి, 2 - ఎ, 3 - సి, 4 - డి
 

22. గణపతిదేవుని గురువు ఎవరు?
జ: విశ్వేశ్వర శంభు

 

23. రెండో ప్రోలరాజు రెండో గొంక చేతిలో ఓడిపోయినట్లు చెబుతున్న గ్రంథం
జ: కేయూర బాహు చరిత్ర

 

24. గణపతి దేవుడు హనుమకొండలో జైనులను హింసించినట్లు చెబుతున్న గ్రంథం
జ: సిద్ధేశ్వర చరిత్ర

 

25. రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చిన పాలకుడు
జ: గణపతిదేవుడు

 

26. కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదు పొందినవారు
జ: రేచర్ల ప్రసాదిత్యుడు

27. జాయపసేనాని దక్షిణ దండయాత్రల గురించి వివరిస్తున్న శాసనం
జ: చేబ్రోలు శాసనం

 

28. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన పాలకుడు
జ: గణపతిదేవుడు

 

29. రుద్రమదేవి కాలంలో వచ్చిన మార్కోపోలో ఏ దేశానికి చెందినవాడు?
జ: ఇటలీ

 

30. కిందివాటిలో సరి కాని దాన్ని గుర్తించండి.
1) రుద్రమదేవి మరణం గురించి చందుపట్ల శాసనం తెలియజేస్తోంది.
2) రుద్రమదేవి మల్కాపురం శాసనం ప్రసూతి వైద్య కేంద్రాల గురించి వివరిస్తుంది.
3) రుద్రమదేవిని రాయగజకేసరి, రుద్రదేవమహారాజు బిరుదులతో ప్రస్తావించారు.
4) రుద్రమదేవి జటావర్మసుందర పాండ్యుడు అనే పాండ్య రాజును ఓడించింది.
జ: 4 (రుద్రమదేవి జటావర్మసుందర పాండ్యుడు అనే పాండ్య రాజును ఓడించింది)

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368)

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ముసునూరి నాయకుల చరిత్రకు ఆధారం-
1) విలస తామ్రశాసనం    2) పోలవరం శాసనం    3) కలువ చెరువు శాసనం    4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)

 

2. ముసునూరి వంశ స్థాపకుడు
జ: ప్రోలయనాయకుడు

 

3. ముసునూరి నాయక రాజ్య రాజధాని-
జ: రేఖపల్లి

 

4. 'ఆంధ్రసురత్రాణ' బిరుదాంకితుడు
జ: కాపయ

 

5. రేచర్ల పద్మనాయక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?
జ: మొదటి సింగమనాయక

 

6. దేవరకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయక రాజు-
జ: మాదానీడు

7. రేచర్ల సింగమ నాయకుడి రాజధాని-
జ: పిల్లలమర్రి

 

8. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందినవాడు-
జ: రెండో సింగమనాయక

 

9. 1368 నాటి భీమవరం యుద్ధంలో కాపయనాయకుడిని వధించిన పద్మనాయక రాజు
జ: అనవోతానీడు

 

10. కాపయ నాయకుడి రాజధాని
జ: వరంగల్లు

 

11. కోరుకొండ దుర్గాన్ని నిర్మించిన ముసునూరి పాలకుడు
జ: కాపయనాయకుడు

 

12. కిందివాటిని జతపరచండి.
1) ఆంధ్ర సురత్రణ               ఎ) అనవోతానీడు
2) సర్వజ్ఞ చక్రవర్తి                బి) మొదటి సింగమనాయక
3) సర్వజ్ఞ సింగభూపాలుడు       సి) రెండో సింగమనాయక
4) సోమకులపరశురామ           డి) కాపనాయకుడు
జ: 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

13. చమత్కార చంద్రిక గ్రంథ రచయిత ఎవరు?
జ: విశ్వేశ్వరుడు

 

14. సంగీత సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: సర్వజ్ఞ సింగముడు

 

15. కాపయ నాయకుడి కాలంలో 'సకల నీతిసారం' అనే గ్రంథాన్ని రాసినదెవరు?
జ: మడికి సింగన

 

16. రెడ్డి రాజ్య స్థాపకుడు
జ: ప్రోలయ వేమారెడ్డి

 

17. ప్రోలయ వేమారెడ్డి ముసునూరి కాపయ ఆస్థానంలో ఉన్నట్లు తెలిపే ఆధారం
జ: కలువచేరు శాసనం

 

18. కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు, రాజధాని
జ: ప్రోలయ వేమారెడ్డి, అద్దంకి

 

19. శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించినవారు?
జ: ప్రోలయ వేమారెడ్డి

 

20. ప్రోలయ వేమారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించిన అతడి సోదరుడు
జ: మల్లారెడ్డి

21. ఎర్రాప్రగడ, శ్రీగిరి పండితులను పోషించిన రెడ్డిరాజు-
1) పెదకోమటి వేమారెడ్డి      2) అనవేమారెడ్డి      3) కుమారగిరి రెడ్డి     4) ఎవరూకాదు
జ: 4(ఎవరూకాదు)

 

22. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చినదెవరు?
జ: అనపోతారెడ్డి

 

23. శ్రీశైల శిలాశాసనం ఏ రెడ్డి రాజు విజయాలను వివరిస్తుంది?
జ: అనవేమారెడ్డి

 

24. గొట్టివాడ గ్రామాన్ని సింహాచలేశుడికి దానం చేసినదెరు?
జ: చెన్నమ నాయకుడు

 

25. శ్రీశైలం, సింహాచలంలో వీరశిరోమండపాలు నిర్మించిన రెడ్డిరాజు-
జ: అనవేమారెడ్డి

 

26. కిందివాటిని జతపరచండి.
1) వసంతరాయలు               ఎ) అనవేమారెడ్డి
2) కర్పూర వసంతరాయలు      బి) కుమారగిరిరెడ్డి
3) ద్వీపజేత, జగనొబ్బగండ     సి) ప్రోలయవేమారెడ్డి
4) మ్లేచోబ్ధి కుంభోద్భవ          డి) అనవోతారెడ్డి
జ: 1-ఎ, 2-బి; 3-డి; 4-సి

27. కిందివాటిని జతపరచండి.
1) నవనాథ చరిత్రం     ఎ) ఎర్రాప్రగడ
2) నృసింహపురాణం    బి) శ్రీ గిరి దేవయ్య
3) విష్ణుపురాణం        సి) కుమారిగిరి రెడ్డి
4) వసంతరాజీయం     డి) వెన్నెలకంటి సూరన
జ: 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

 

28. లకుమాదేవి అనే నర్తకి ఎవరి ఆస్థానంలో ఉండేది?
జ: కుమారగిరి రెడ్డి

 

29. శ్రీనాథుడి 'హరివిలాసం' గ్రంథం ప్రకారం కుమారగిరి కాలంనాటి వసంతోత్సవాలను నిర్వహించింది?
జ: అవచి తిప్పయ్య శెట్టి

 

30. రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినదెవరు?
జ: కాటయ వేమారెడ్డి

 

31. 1416లో మోటుపల్లిలో అభయశాసనం వేయించిన పాలకుడు ఎవరు?
జ: రెండో దేవరాయలు

32. శివలీలా విలాసం గ్రంథ రచయిత ఎవరు?
జ: శివలెంకకొమ్మన

 

33. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో నిర్వహించిన పదవి-
జ: ఆస్థాన విద్యాధికారి

 

34. 'సంగీత చింతామణి, సాహిత్య చింతామణి' లాంటి గ్రంథాలు రచించిన రెడ్డిరాజు-
జ: పెదకోమటి వేమారెడ్డి

 

35. ఫిరంగిపురం వద్ద సంతానసాగరం చెరువును తవ్వించినదెవరు?
జ: సూరాంబిక

 

36. శ్రీనాథుడు తన 'శృంగార నైషథం' గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
జ: మామిడి సింగన

 

37. పురిటి సుంకం విధించిన రెడ్డిరాజు
జ: రాచ వేమారెడ్డి

 

38. అద్దంకి వీధుల్లో సవరం ఎల్లయ్య అనే బలిజనాయకుడి చేతిలో హతమైన రెడ్డిరాజు-
జ: రాచవేమారెడ్డి

 

39. కుమారగిరి రాజీయం గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: కాటయవేమారెడ్డి

40. మూడో అనవోతారెడ్డి రాజధాని రాజమండ్రి అని వివరిస్తున్న శాసనం-
జ: కొమ్ముచిక్కాల

 

41. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించినదెవరు?
జ: మల్లారెడ్డి

 

42. గ్రామ అధికారులైన 12 మంది ఆయగాండ్రుల్లో 'ఆరెకుడు'గా ఎవరిని పిలుస్తారు?
జ: తలారి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368)

      ముసునూరి నాయకరాజుల చరిత్రకు ప్రధాన ఆధారాలు... ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం, కాపయనాయకుడి పోలవరం శాసనం, ఛోడ భక్తిరాజు పెంటపాడు శాసనం, అనితల్లి కలువచేరు శాసనం. క్రీ.శ.1325లో ముసునూరి రాజ్యాన్ని ప్రోలయ నాయకుడు స్థాపించాడు. ఇతడు నేటి ఖమ్మం జిల్లాలోని రేకపల్లిని రాజధానిగా చేసుకుని పాలించాడు. వెన్నయ అనే వ్యక్తికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని విలస గ్రామాన్ని దానం చేసి విలస తామ్ర శాసనాన్ని వేయించాడు. ప్రోలయ తర్వాత ముసునూరి కాపయనాయకుడు రాజయ్యాడు. ఇతడు ఓరుగల్లుపై దండెత్తి మాలిక్ మక్బూల్ (గన్నమనాయుడు)ను ఓడించి ఆంధ్రసురత్రాణ, ఆంధ్రదేశాధీశ్వర బిరుదులను పొందాడు. కోరుకొండ దుర్గాన్ని నిర్మించి కూనయ నాయకుడిని రాజ ప్రతినిధిగా నియమించాడు. కానీ కాపయ నాయకుడు బహమనీసుల్తాన్ హసన్‌గంగూ బహమన్ పంపిన సికిందర్‌ఖాన్ చేతిలో ఓడిపోయాడు. దాంతో నిజామాబాద్ జిల్లాలోని కౌలస్ దుర్గాన్ని, అపార ధనరాశులను సుల్తానుకు సమర్పించుకున్నాడు. కాపయ కుమారుడైన వినాయక దేవుడిని బహమనీ సుల్తాన్ మహ్మద్‌షా వధించాడు. దీంతో కాపయనాయకుడు తన రాజధానిని రేఖపల్లి నుంచి వరంగల్‌కు మార్చాడు. రేచర్ల సింగముని కుమారుడైన అనవోతానీడు భీమవరం యుద్ధంలో కాపయనాయకుడిని వధించి ఓరుగల్లు, భువనగిరి దుర్గాలను ఆక్రమించాడు. కాపయనాయకుడి కాలంలోనే మడికిసింగన సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రచించాడు.

రేచర్ల పద్మనాయకులు (వెలమ దొరలు క్రీ.శ. 1325-1475)

      రేచర్ల పద్మనాయక వంశ మూలపురుషుడు బేతాళనాయకుడు. కానీ వెలుగోటి వంశావళి ప్రకారం చెవ్విరెడ్డిని మూలపురుషుడిగా చెబుతారు. రుద్రమదేవి కాలంలో పని చేసిన రేచర్ల ప్రసాదిత్యుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులున్నాయి. స్వతంత్ర రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని 1325లో మొదటి సింగమ నాయకుడు/ మొదటి సింగమ స్థాపించాడు. ఇతడు పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించాడు. సర్వజ్ఞ సింగభూపాలుడు అనే బిరుదు ఉంది. శ్రీనాథుడు ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు. వీరి కాలంలో రాజభాష సంస్కృతం. ఉదార రాఘవం, నిరోష్ట్య రామాయణం అనే గ్రంథాలను రచించిన కవి శాకల్యభట్టు ఈయన ఆస్థానంలో ఉన్నాడు. శాకల్యభట్టుకు చతుర్భాష కవితా పితామహుడు అనే బిరుదు ఉంది.
 

అనవోతానాయకుడు / మొదటి అనవోతానాయకుడు (క్రీ.శ.1361 - క్రీ.శ.1384)

      అనవోతా నాయకుడికి సోమకుల పరశురామ, ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదులున్నాయి. ఇతడిని కొండవీటి రెడ్డిరాజు ఓడించి శ్రీశైలం ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనవోతా నాయకుడి కాలంలోనే వెలమ-రెడ్డి సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతడి మంత్రి పేరు తిప్పరాజు.
       అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. దేవరకొండను రాజధానిగా చేసి, సోదరుడు మాదా నాయకుడిని అక్కడ నియమించాడు. తను రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. మాదానాయకుడి మంత్రి పోతరాజు. గురువు వెంకటాచార్యులు. తాడూరు గ్రామాన్ని మాదానాయకుడు శ్రీరంగనాథస్వామి ఆలయానికి దానం చేశాడు. అతడి భార్య నాగాంబిక నాగ సముద్రం అనే తటాకాన్ని తవ్వించింది. రామాయణంపై మాదానాయకుడు రాఘవీయం అనే వ్యాఖ్యానాన్ని రచించాడు.

కుమార సింగమ నాయకుడు / రెండో సింగముడు (క్రీ.శ.1384-1399)

     యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణ దుర్గాన్ని జయించి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు. మొదటి బుక్కరాయలను ఓడించి పానగల్లును జయించాడు. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందాడు. ఇతడి ఆస్థాన కవి విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి సాహిత్య శిల్పావధి అనే బిరుదు ఉంది.
 

 రెండో అనవోతుడు (క్రీ.శ.1399-1421)

       రెండో అనవోతా నాయకుడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షాకు సహాయం చేసి మొదటి దేవరాయల ఓటమికి కారకుడయ్యాడు. కానీ, బహమనీ సుల్తానులు రెడ్డి రాజులతో స్నేహం చేయడంతో మొదటి దేవరాయలకు సహాయపడి బహమనీలను ఓడించాడు. ఇతడి తర్వాత మాదానాయకుడు క్రీ.శ.1421 నుంచి 1430 వరకు పరిపాలించాడు.
 

సర్వజ్ఞసింగ/ మూడో సింగమ (క్రీ.శ. 1430-1475)

     రేచర్ల పద్మనాయక రాజుల్లో మూడో సింగమ చివరివాడు. కొన్ని ఆధారాల ప్రకారం సర్వజ్ఞసింగముడిని నాలుగో సింగముడిగా ప్రస్తావించారు. ఇతడు రసార్థవ సుధాకరం, సంగీత సుధాకరం అనే గ్రంథాలు; రత్న పాంచాలిక అనే నాటకాన్నీ రచించాడు. ప్రసిద్ధకవి బమ్మెర పోతన ఇతడి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. పోతన భోగినీ దండకం, వీరభద్ర విజయం, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, ఆంధ్ర భాగవతం గ్రంథాలు రచించాడు. 1475లో మూడో సింగమ గజపతులసేనాని తమ్మ భూపాలుడి చేతిలో మరణించాడు.

రెడ్డి రాజులు

కాకతీయుల పతనానంతరం సింహాచలం - విక్రమ సింహపురం (నెల్లూరు) మధ్య ఉండే తీరాంధ్ర దేశాన్ని రెడ్డిరాజులు పాలించారు. వీరిలో కొండవీటి రెడ్డిరాజులు, రాజమండ్రి రెడ్డి రాజులు అనే రెండు వంశాలు ఉన్నాయి. రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. వంశ మూలపురుషుడు మాత్రం కోమటి ప్రోలారెడ్డి.
 

రాజకీయ చరిత్ర

ప్రోలయ వేమారెడ్డి(1325 - 1353): ఇతడు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఒక నాయంకరుడిగా ఉండేవాడు. అనితల్లి అనే రెడ్డి రాణి వేయించిన కలువచేరు శాసనం ప్రకారం వేమారెడ్డి ముసునూరి కాపయ నాయకుడి కొలువులో ఉన్నట్లు తెలుస్తోంది. అద్దంకిని రాజధానిగా చేసుకుని కొండవీటి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. ఇతడి సోదరుడు మల్లయ్య రెడ్డి బహమనీ సుల్తానులను ఓడించి మోటుపల్లి రేవును స్వాధీనం చేసుకున్నాడు. మ్లేచోబ్ధి కుంభోద్భవ, ధర్మ ప్రతిష్టాన గరుడు అనేవి ప్రోలయ వేమారెడ్డి బిరుదులు. ఇతడు శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించాడు. ఎర్రాప్రగడ, శ్రీగిరి ప్రథమ కవులను పోషించాడు. శ్రీగిరి దేవయ్యకు మోగల్లు(పశ్చిమ గోదావరి)లో భూదానం చేశాడు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు, భవ్య చారితుడు బిరుదులు పొందిన ఎర్రన హరివంశం, నృసింహపురాణం గ్రంథాలు రచించాడు. శ్రీగిరి కవి నవనాద చరిత్రము అనే గ్రంథాన్ని రచించాడు. ప్రోలయ వేమారెడ్డి తన అన్న మాచారెడ్డిని చందోలు దుర్గానికి, తమ్ముడు మల్లారెడ్డిని కందుకూరుకు అధిపతులుగా నియమించాడు. మల్లారెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రోలయ వేమారెడ్డి 44 గ్రామాలను దానం చేసినట్లు తెలుస్తోంది. ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలంలో పాతాళగంగకు మెట్లు కట్టించడం 1346లో పూర్తయినట్లు ముట్లూరి శాసనం తెలుపుతోంది.

అనపోతారెడ్డి (క్రీ.శ. 1353-1364): అనవోతారెడ్డిగా కూడా పిలిచే ఇతడు ద్రాక్షారామ శాసనం వేయించాడు. అందులో ఇతడి బిరుదు ద్వీపజేత. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. అనవోతుడి మంత్రి మల్లయ్యవేమన. ఇతడు బహమనీ సుల్తాన్ దాడిని తిప్పికొట్టి అమరేశ్వర దేవాలయాన్ని పున:ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అనవోతుడి శాసనాలను రచించింది బాలసరస్వతి అనే కవి. ఇతడికి జగనొబ్బగండ అనే బిరుదు కూడా ఉంది. మంత్రి సోమయ్య మోటుపల్లిలో శాసనం వేయించాడు.


అనవేమారెడ్డి (క్రీ.శ.1364-1386): రెడ్డి రాజుల్లో సుప్రసిద్ధుడు అనవేమారెడ్డి. ఇతడి సైనిక విజయాలను శ్రీశైలం శిలాశాసనం తెలుపుతుంది. ఇతడికి దివిదుర్గ విశాల, సకల జలదుర్గసాధన, ఛురికాసహాయ, ప్రజాపరిచిత చతుర్విధోపాయ అనే బిరుదులు ఉన్నాయి. భక్తిరాజు కుమారుడైన ఛోడభీముడిని నిరవధ్యపురం అధిపతిగా నియమించాడు. అనవేముని కళింగ దండయాత్రను నిర్వహించింది అతడి బ్రాహ్మణ సేనాని - చెన్నమ నాయకుడు (సింహాచలం శాసనం). చెన్నమ వడ్డాది పాలకుడు. వీరార్జున దేవుడిని ఓడించి గొట్టివాడ గ్రామాన్ని సింహచలేశునికి దానం చేశాడు. అనవేముడి మంత్రులు - మామిడి పెద్దనామాత్యుడు, ఇమ్మడేంద్రుడు. అనవేముడు శ్రీశైలంలో వీరశిరోమండపాన్ని, సింహాచలంలో అనవేమపురి మండపాన్ని నిర్మించాడు. ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను జరిపి వసంత రాయలు అనే బిరుదు కూడా పొందాడు. విష్ణుపురాణం గ్రంథాన్ని రచించిన వెన్నెలకంటి సూరన ఇతడి సమకాలీకుడు.


కుమారగిరి రెడ్డి (1386-1402): ఇతడు అనపోతారెడ్డి కుమారుడు. రాజ్యం కోసం అనవేమారెడ్డి కుమారుడైన పెదకోమటి వేమారెడ్డితో కలహించాల్సి వచ్చింది. విజయనగర రాజులు శ్రీశైలం, త్రిపురాంతకాలను ఇతడి కాలంలోనే ఆక్రమించారు.

రెండో హరిహరరాయల సహాయంతోనే కుమారగిరి బావ కాటయవేమారెడ్డి రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ విజయనగర పాలకులు, పెదకోమటి వేమారెడ్డిల దండయాత్రల వల్ల కుమారగిరిరెడ్డి 1402లో కొండవీడును వదలి రాజమండ్రికి వచ్చాడు. అతడి మరణానంతరమే కాటయ రాజమండ్రిలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. కుమారగిరిరెడ్డి వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. కర్పూర వసంతరాయల అనే బిరుదు పొందాడు. ఇతడి ఆస్థాన నర్తకి లకుమాదేవి. కుమారగిరి వసంతోత్సవాలను అవచి తిరుమల/తిప్పయశెట్టి నిర్వహించినట్లు శ్రీనాథుని హరవిలాసం గ్రంథం తెలుపుతుంది. 1396లో బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా దండయాత్రను గజపతిరావు తిప్ప అనే కుమారగిరి సామంతుడు తిప్పికొట్టాడు. 1399లో గజపతుల దండయాత్రను దేవయసేనాని తిప్పికొట్టాడు. విజయనగర రాజులు, రెండో హరిహరరాయలు, మొదటి దేవరాయలు కూడా దాడిచేశారు. రెండో హరిహరుడి శాసనం యనమదలలో దేవరాయల శాసనాలు మార్కొండపాడు, పరుచూరులో లభించాయి.
 

పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ.1402-1420): ఇతడు కుమారగిరిరెడ్డిని తరిమివేసి కొండవీడుకు పాలకుడయ్యాడు. కాటయ వేమారెడ్డికి సహాయంగా రెండోహరిహరరాయలు చౌండప సేనాని పంపాడు. కాని పెదకోమటి వేముడి సేనాని గజరావు తిప్పన గుండుగొలను, కోనూరు (కానూరు- పశ్చిమ గోదావరి) యుద్ధాల్లో కాటయ వేముడిని ఓడించాడు. పెదకోమటి వేమారెడ్డి తన తమ్ముడు మాచారెడ్డిని కొండపల్లి పాలకుడిగా నియమించాడు. తర్వాత కాటయవేమారెడ్డి దేవరాయల సైన్యాన్ని అత్తిలి, కాకరపర్రు (పశ్చిమ గోదావరి) యుద్ధాల్లో పెదకోమటి అన్న దేవఛోడుడు (భక్తిరాజు కుమారుడు) కలిసి ఓడించాడు. పెదకోమటి వేమారెడ్డి మంత్రి మామిడి సింగన. ఫిరోజ్‌షా, పెదకోమటి వేమారెడ్డిల సంయుక్త సైన్యాన్ని అల్లాడరెడ్డి రామేశ్వరం (తూర్పు గోదావరి) యుద్ధంలో ఓడించినట్లు శివలీలా విలాసం (శివలెంక కొమ్మన) గ్రంథం తెలుపుతోంది. 1416లో మొదటి దేవరాయలు మోటుపల్లిలో అభయశాసనాన్ని వేయించాడు.

        పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి వామనభట్టబాణుడు. అతడి ఆస్థానంలో విద్యాధికారి శ్రీనాథుడు. ఇతడు శృంగార నైషథం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, పలనాటి వీరచరితం, శివరాత్రి మహాత్మ్యం... గ్రంథాలు రచించాడు. శ్రీనాథుడు తన శృంగార నైషథం గ్రంథాన్ని మామిడి సింగనకు అంకితం ఇచ్చాడు. ఇంకా హరవిలాసం, మరుత్తరాట్ చరిత్ర గ్రంథాలు కూడా రాశాడు. రాజమండ్రి రెడ్డిరాజైన వీరభద్రారెడ్డి శ్రీనాథుడిని ఆదరించాడు. శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థానకవి డిండిమభట్టును తన పాండిత్యంతో ఓడించాడు. రాయలు గండపెండేరం తొడిగి కవిసార్వభౌమ బిరుదు ఇచ్చాడు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సప్తశతి చరితిక అనే గ్రంథాలు రచించి సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు పొందాడు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక ఫిరంగిపురం వద్ద సంతాన సాగరం చెరువు తవ్వించింది. సంతాన సాగరం శాసనం రచయిత - శ్రీనాథుడు. ఇదే కాలంలో వెలమ రాజుల ఆస్థానంలోని పోతన ఆంధ్ర భాగవతాన్ని రచించాడు.
 

రాచవేమారెడ్డి (క్రీ.శ.1420 - క్రీ.శ.1424): కొండవీటిరెడ్డి రాజుల్లో చివరి పాలకుడు రాచవేమారెడ్డి. ఇతడు సూరాంబిక, పెదకోమటిల కుమారుడు. సూరాంబిక తవ్వించిన సంతాన సాగరం చెరువుకు జగనొబ్బగండ అనే కాలువను తవ్వించాడని అమీనాబాద్ శాసనం తెలుపుతోంది. పురిటి సుంకాన్ని విధించడంతో కోపోద్రేకుడైన సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేమారెడ్డిని అద్దంకి వీధిలో వధించాడు. ఈ విషయం కొండవీటి కైఫియత్(శాసనం) ద్వారా తెలుస్తోంది.

రాజమండ్రి రెడ్డి రాజులు

కాటయ వేమారెడ్డి (1402-1414)
     కొండవీటి రెడ్డిరాజైన కుమారగిరిరెడ్డి బావ కాటయ వేమారెడ్డి. కుమార‌గిరి రెడ్డి మరణానంతరం రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని కాటయ వేమారెడ్డి స్థాపించాడు. కాని గుండుగొలను యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డి, అన్నదేవచోడుల కూటమి చేతిలో పరాజయంపొంది మరణించాడు. కాటయ వేముడు కుమారగిరి రాజీయం అనే గ్రంథాన్ని రచించాడు.
 

రెండో కుమారగిరిరెడ్డి:
    కాటయవేమారెడ్డి రెండో కుమారుడు. ఇతడు బాలుడు కావడంతో కాటయ సేనాని అల్లాడరెడ్డి అధికారాన్ని చెలాయించేవాడు. ఇతడి కాలంలోనే అన్నదేవఛోడుడు పట్టిసం (పట్టిసీమ - పశ్చిమ గోదావరి) ను ఆక్రమించాడు. రెండో కుమారగిరిరెడ్డి 1416లో మరణించాడు.

 

అల్లాడరెడ్డి:
     రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని పటిష్టం చేశాడు. ఇతడు పలివెల, వేమవరం శాసనాలు వేయించాడు. ఇతడి సేనాని నరహరినీడు 'పాలకొల్లు' శాసనం (1416) వేయించాడు. అల్లాడరెడ్డి ధారానగరధీశుడైన ఆలఫ్‌ఖాన్‌ను ఓడించాడు. రామేశ్వర యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డిని ఓడించాడు. అల్లాడ‌రెడ్డి 1420 ప్రాంతంలో మరణించాడు. తర్వాత మూడో కుమారగిరిరెడ్డి, మూడో అనవోతారెడ్డి పాలించారు. కొమ్ము చిక్కాల శాసనం (1422) ప్రకారం మూడో అనవోతారెడ్డి రాజధాని రాజమండ్రి. 1420లో లాంగూల గజపతి (ఒరిస్సా) రాజమహేంద్రవరాన్ని ఆక్రమించాడు.

వీరభద్రారెడ్డి (1423-1448)
     వీరభద్రారెడ్డి, అతడి అన్న వేమారెడ్డి రాజ్యపాలన చేశారు. రెండో దేవరాయలతో స్నేహం చేసి గజపతుల, పద్మనాయకుల దండయాత్రలను ఎదుర్కొన్నారు. రెండో దేవరాయల సామంతుడైన తెలుంగరాయలు వేయించిన శాసనం సింహాచలంలో ఉంది. రెండోసారి రాయలు తన సేనాని మల్లప ఒడయార్‌ను సహాయంగా పంపాడు. మల్లప వేమారెడ్డి అనుమతితో ద్రాక్షారామంలో దానశాసనం వేయించాడు. కాని రెండో దేవరాయల మరణానంతరం కపిలేశ్వర గజపతి రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేశాడు.

 

దేవరకొండ లింగమనీడు
    వేమారెడ్డి, వీరభద్రారెడ్డిని ఓడించి రాజమహేంద్రాన్ని ఆక్రమించినట్లు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది.

 

కందుకూరు రెడ్డిరాజ్యం
     ప్రోలయ వేమారెడ్డి సోదరుడు ప్రోలయ మల్లారెడ్డి. ఇతడు అద్దంకి రాజ్యానికి (కొండవీడుకు) సర్వసైన్యాధ్యక్షుడు. మోటుపల్లిని జయించాడు. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించాడు. ఫలితంగా ప్రోలయ వేమారెడ్డి ఇతడిని బోయ విహారదేశంపై ప్రతినిధిగా నియమించాడు. కందుకూరు రాజధానిగా అతడి వారసులు రాజ్యపాలన చేశారు. మల్లారెడ్డి మనుమడు శ్రీగిరి కాలంలో రాజ్యం బలపడి విస్తరించింది. శ్రీగిరి వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చెరువులు తవ్వించాడు. తర్వాత ఈ రాజ్యాన్ని రెండో కోమటిరెడ్డి, మూడో కోమటిరెడ్డి (శ్రీగిరి కుమారుడు) పాలించారు. ఆ తర్వాత ఈ రాజ్యం విజయనగర రాజుల సామంత రాజ్యంగా మారిపోయింది.

యుగవిశేషాలు:

    రెడ్డి రాజ్య యుగాన్ని కాకతీయ యుగానికి అనుబంధ యుగంగా చెప్పవచ్చు. సాంప్రదాయక పాలనవిధానం ఉండేది. రాజు సర్వాధికారి. ప్రధాని, సేనాపతి, పురోహితుడు తోడ్పడేవారు. అత‌డికి యంత్రాంగంలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజ్యం సీమలు - నాయంకరాలు - గ్రామాలుగా విభజన చెంది ఉండేది. గ్రామపాలన ఆయగాండ్రు (12 మంది) చేసేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు. తలారినే ఆరెకుడు అనేవారు. న్యాయనిర్వహణలో దివ్యపరీక్షల ద్వారా నేర నిరూపణ జరిగేది. పంటలో 1/6వ‌ వంతు పన్ను వసూలు చేసినట్లు విలస తామ్రశాసనం తెలుపుతోంది. దేవబ్రాహ్మణ మాన్యాలపై పన్ను మినహాయింపు ఉండేది. దశబంధమాన్యాలను అనుభవించేవారు 1/10వ‌ వంతు నీటిసుంకం చెల్లించేవారు.
     రణముకుడుపు అనే ఆచారం పాటించేవారు. అంటే యుద్ధంలో చనిపోయినవారి రక్త, మాంసాలతో అన్నం వండి యుద్ధదేవతలకు నివేదనం చేసేవారు. రాజుల్ మత్తుల్, వారిసేవ నరకప్రాయంబు అన్నది - ధూర్జటి.
ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం ప్రధానవృత్తి. ప్రధాన ఆహారధాన్యం జొన్నలు. రెడ్డిరాజులు సంతాన సాగరం చెరువును తవ్విస్తే, వెలమలు అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగసముద్రం చెరువులను తవ్వించారు. నాటి పరిశ్రమల్లో అగ్రస్థానం వస్త్ర పరిశ్రమది. పలనాడు, వినుకొండ ప్రధాన కేంద్రాలు. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశక అనేక రకాల పట్టుబట్టలను పేర్కొంటుంది. పంచాణం వారు అంటే కమ్మరులు. నిర్మల్ కత్తులు ప్రసిద్ధి చెందినవి. నాడు విదేశీ వాణిజ్యంలో అత్యంత ప్రముఖుడు అవచితిప్పయ్య శెట్టి(కొండవీడు). కప్పలి, జోంగు, వల్లి, వలికా అనేవి నాటి నౌకా రకాలని శ్రీనాథుడి హరవిలాసం పేర్కొంటుంది. జోంగు అనేది చైనా నౌక. ప్రధాన వాణిజ్యపంట ద్రాక్ష. నాణెం - దీనార్.

మత పరిస్థితులు:
రెడ్డిరాజులు మొదట్లో శైవమతాన్ని అనుసరించారు. ప్రోలయ వేమారెడ్డి శైవుడే. కానీ కుమారగిరిరెడ్డి, కాటయవేమారెడ్డి వైష్ణవ మతాభిమానులు. రెడ్డిరాజుల కులదేవత మూలగూరమ్మ. స్మార్తవిధానం అగ్రవర్ణాల్లో ఉండేది. భక్తి ఉద్యమ ప్రభావం కనిపిస్తుంది. రణముకుడుపు ఆచారం ఉంది. తాంత్రికపూజా విధానాలు కూడా ఉండేవి. దైవంపేర ఆత్మార్పణ చేసినవారి గౌరవార్థం వారి ప్రతిమలున్న శిలలు (వీరకల్) నిలిపేవారు. శ్రీశైలంలో భృగుపాతం (కొండపైనుంచి దూకి మరణించడం) జరిపేవారని పండితారాధ్య చరిత్ర గ్రంథం పేర్కొంటుంది. త్రిపురాంతకం కేంద్రంగా ఘోడెరాయవంశం శైవమతాన్ని ప్రచారం చేసేది. వేమభూపాల చరిత్ర గ్రంథంలో వామన భట్టబాణుడు వింధ్యవాసినీ పూజను వివరించాడు. శ్రీరంగం కేంద్రంగా భట్టారు కుటుంబం వైష్ణవాన్ని ప్రచారం చేసేది. కోరుకొండ పాలకుడైన ముమ్మడి నాయకుడు తన గురువైన శ్రీరంగవర్థనుడు (ఏడో పరాశరభట్టు) మరణానంతరం కోరుకొండ నరసింహాలయాన్ని నిర్మించాడు.
  పద్మనాయక రాజైన సర్వజ్ఞసింగముని ఆస్థానంలో నైనాచార్యులు (వరదాచార్యులు) వైష్ణవాన్ని స్థాపించారు. సర్వజ్ఞసింగముని కోరిక మేరకు నైనాచార్యుడి తండ్రి అయిన వేదాంత దేశికుడు సుభాషిత నీతి, తత్త్వసందేశ, రహస్య సందేశ అనే గ్రంథాలు రచించాడు.   వైష్ణవం కూడా ప్రచారమైంది. ఆళ్వారులు నాల్లాయిర ప్రబంధం పేరుతో రచనలు చేశారు. రామానుజాచార్యులు శ్రీవైష్ణవాన్ని రూపొందించి దేవాలయాల్లో పంచముల ప్రవేశానికి అనుమతించాడు. తర్వాత శ్రీ వైష్ణవం తెంగల, వడగల శాఖలుగా చీలిపోయింది. వడగల శాఖకు నాయకుడు వేదాంత దేశికుడు. ఈ శాఖ వారు అహోబిలంలో మఠం నెలకొల్పి తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. పద్మనాయకుల ఆస్థానంలో శాకల్యమల్లు భట్టుకు పరాశర భట్టుకు మధ్య శైవ, వైష్ణవ వివాదం జరిగింది.

సమాజం:
చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యత, వర్ణవ్యవస్థ కఠినం, జూదం సర్వ సాధారణ వినోదం, బ్రాహ్మణుల్లో కూడా వేశ్యాలంపటత్వం మితిమీరినట్లు శివరాత్రి మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. వడ్డీ వ్యాపారులు అధిక మోసాలు చేసేవారు. శకునాలను ఎక్కువగా నమ్మేవారు. పంచాంగం ప్రాధాన్యం, నైతిక విలువలు తగ్గాయి.

 

విద్యా-సారసత్వాలు: సంస్కృతం రాజభాష. లలితకళలను కూడా పోషించారు. వసంతోత్సవాలు నిర్వహించేవారు. నటులు, గాయకులకు ప్రోత్సాహం లభించేది. గొండ్లి, జిక్కిణి, పేరిణి, చిందు లాంటి దేశీ నాట్యరీతులే కాకుండా పారశీక మత్తల్లి అనే విదేశీ నాట్యరీతులు అమల్లో ఉండేవి. పలురకాల వీణల గురించి కూడా పేర్కొన్నారు.
 

సంస్కృత భాష: ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి మహాదేవుడు సంస్కృత విద్వాంసుడు. అనవోత కాలంలో బాలసరస్వతి, అనవేమ కాలంలో త్రిలోచనాచార్యులు గొప్ప పండితులు. కుమారగిరి-వసంతరాజీయం, కాటయ వేమారెడ్డి- కుమారగిరి రాజీయం అనే గ్రంథాలు రచించారు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి రచించారు. పెదకోమటి వేముడి ఆస్థాన కవి వామనభట్ట బాణుడు. ఇతడు ఉషా పరిణయం, పార్వతీ పరిణయం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, వేమ భూపాల చరిత్ర, శబ్ద రత్నాకరం, చంబ్ద చంద్రిక అనే రచనలు చేశారు. కందుకూరు పాలకుడైన శివలింగారెడ్డి తత్వ ప్రకాశిక అనే వ్యాఖ్యానం రాశారు. (గిరీశశృతి సూక్తిమాల గ్రంథం- హరదత్తుడు). సాహిత్య, సంగీత, లక్ష్యలక్ష్మణ భంగీ సర్వజ్ఞుడిగా వీరభద్రారెడ్డి పేరొందాడు.
అనవోతుని ఆస్థానంలో ఉన్న నాగనాథకవి-మదన విలాసబాణం గ్రంథం రచించారు. రెండో సింగభూపాలుడు- రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరం, అనే రచనలు చేశారు.

 సారంగధరుని 'సంగీత రత్నాకరం'పై రాసిన వ్యాఖ్యానమే సంగీత సుధాకరం. సింగభూపాలుడి ఆస్థానంలో ఉన్న విశ్వేశ్వరుడు- చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించగా, మరొక కవి బొమ్మకంటి అప్పయార్యుడు- అమరకోశానికి వ్యాఖ్యానం రచించాడు. రేచర్ల సింగముని ఆస్థానంలో ఉన్న శాకల్యమల్లు భట్టు- నిరోష్ఠ్య రామాయణం, ఉదార రాఘవం, అవ్యయ సంగ్రహ నిఘంటువు అనే రచనలు చేశాడు.
 

తెలుగు భాష: దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన తొలి వ్యక్తి వినుకొండ వల్లభామాత్యుడు (క్రీడాభిరామం గ్రంథంలో). దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది శ్రీకృష్ణదేవరాయలే. కాంచీ మహాత్మ్యం గ్రంథాన్ని దగ్గుపల్లి దుగ్గన్న రచించారు. ఎర్రన- ఉత్తర హరివంశం గ్రంథాన్ని రచించి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రన తన చివరి రచన నృసింహ పురాణంలో ప్రబంధ శైలికి బీజం వేశాడు. శ్రీగిరికవి- నవనాథ చరిత్ర, విన్నకోట పెద్దన- కావ్యాలంకార చూడామణి రచించారు. విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి గ్రంథాన్ని చాళుక్య విశ్వేశ్వరుడికి అంకితం ఇచ్చాడు. శివలీలా విలాసం (విన్నకోట) దొడ్డారెడ్డి (అల్లాడరెడ్డి కుమారుడు)కి అంకితం చేశారు. మడికి సింగన- పద్మపురాణం గ్రంథాన్ని కందయామాత్యుడికి అంకితం ఇచ్చాడు. ఇంకా ఇతను వాశిష్ఠ రామాయణం, 'సకల నీటి సమ్మతం' గ్రంథాలను రచించాడు. కుమారగిరికి సమకాలీనుడైన వినుకొండ వల్లభామాత్యుడు మోపూరి (కడప జిల్లా) గ్రామాధికారి. ఇతడు రావిపాటి త్రిపురాంత కవి సంస్కృత రచన 'ప్రేమాభిరామం'ను తెలుగులో క్రీడాభిరామంగా అనువదించాడు. అనంతామాత్యుడనే కవి 'భోజ రాజీయం' గ్రంథాన్ని రచించారు. శ్రీనాథుడి తాత కమలనాభుడు కూడా 'పద్మపురాణం' గ్రంథాన్ని రచించాడు (ఏ భాషలోనో తెలియదు). దేవరకొండ పద్మనాయకరాజు పెదవేదగిరి ఆస్థానంలో కవి అయ్యలార్యుడు రామాయణ ఆంధ్రీకరణ పూర్తిచేశాడు. 
                      
సరస సాహిత్య లక్షణ చక్రవర్తి బిరుదు పొందిన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, లక్షణ దీపిక లాంటి రచనలు చేశారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించాడు. సర్వజ్ఞ సింగని ఆస్థానంలో ఉన్న పోతన అతడి కోరికపై భోగినీ దండకాన్ని రచించాడు. ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం గ్రంథాలను కూడా పోతన రచించాడు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం

1. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?
జ: 1336

 

2. విజయనగర సామ్రాజ్య తొలి రాజధాని-
జ: అనెగొంది

 

3. విజయనగర సామ్రాజ్యం ఎవరి పేరుతో స్వతంత్ర రాజ్యంగా స్థాపితమైంది?
జ: విరూపాక్ష స్వామి

 

4. విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్రా నదికి ఏ దిక్కున స్థాపించారు?
జ: దక్షిణం

 

5. 1344లో రాజధానిని విజయనగరానికి మార్చిన పాలకుడు ఎవరు?
జ: మొదటి హరిహరుడు

 

6. భాగపెల్సి తామ్రశాసనాన్ని వేయించిన పాలకుడెవరు?
జ: మొదటి హరిహరుడు

 

7. దేవులపల్లి తామ్ర శాసనాలు వేయించిన పాలకుడు-
జ: ఇమ్మడి నరసింహుడు

8. విజయనగర కాలం నాటి ప్రధాన బంగారు నాణెం
జ: మాడ

 

9. గజబేటకార బిరుదుతో రెండో దేవరాయలు వేయించిన నాణెం-
జ: పావలా వరహా

 

10. కిందివాటిని జతపరచండి.
1) ఇబన్ బటూట    ఎ) మొదటి హరిహరుడు

2) నికోలో కాంటె     బి) రెండో దేవరాయలు

3) అబ్దుల్ రజాక్     సి) మొదటి దేవరాయలు

4) వర్థెమా           డి) శ్రీకృష్ణదేవరాయలు

జ: 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
 

11. సతీసమేతంగా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
జ: నికోలో కాంటె

 

12. విజయనగర కాలం నాటి గణికావృత్తి గురించి వివరించినదెవరు?
జ: అబ్దుల్ రజాక్

13. సతీసహగమనం, వసంతోత్సవాల గురించి రాసినదెవరు?
జ: నికోలో కాంటే

 

14. 'ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్ (విస్తృత విజయనగర సామ్రాజ్యం)' అనే గ్రంథాన్ని ఎవరు రాశారు?
జ: రాబర్ట్ సూయెల్

 

15. మహానాటక సుధానిధి గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: రెండో దేవరాయలు

 

16. రెండో విరూపాక్ష రాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు?
జ: అథనేషియన్ నికెటిన్

 

17. 'మధురా విజయం' గ్రంథకర్త ఎవరు?
జ: గంగాదేవి

 

18. తెలుగు భాషలో పంచతంత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) విష్ణుశర్మ       2) మహాలింగదేవుడు      3) నాచనసోముడు       4) ఎవరూకాదు
జ: 4 (ఎవరూకాదు)

 

19. 'విజయనగర రాజులు తెలుగువారు' అని అన్నదెవరు?
జ: రాబర్ట్ సూయెల్

20. 'మధురా విజయం' గ్రంథం ప్రకారం సంగమవంశ కుల గురువు ఎవరు?
జ: క్రియాశక్తి

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం

      విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీడు అనే నాలుగు రాజ వంశాలు పాలించాయి. విద్యారణ్యస్వామి సహాయంతో తుంగభద్రా నదీ తీరంలోని అనెగొంది రాజధానిగా సంగమ సోదరులు సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యస్వామి పేరు మీదుగా విద్యానగరం/ విజయనగరం అనే నూతన నగరాన్ని నిర్మించారు. 1344లో రాజధానిని అనెగొంది నుంచి విజయనగరానికి మార్చారు.
 

ఆధారాలు


శాసనాలు
      బాగపెల్సి తామ్రశాసనం మొదటి హరిహరరాయల విజయాలను వివరిస్తోంది. రెండో సంగముడు వేయించిన బిట్రగుంట దాన శాసనం సంగమ సోదరుల గురించి తెలుపుతుంది. రెండో హరిహరుడు వేయించిన చెన్నరాయపట్టణ శాసనం, రెండో దేవరాయలు వేయించిన శ్రీరంగం తామ్ర ఫలకాలు, ఇమ్మడి నరసింహుడు వేయించిన దేవులపల్లి తామ్ర శాసనాలు (సాళువ వంశావళి) ప్రధాన ఆధారాలు.

 

నాణేలు
       విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం గద్యాణం. దీన్నే వరహా అనేవారు. ప్రతాప, ఫణం, చిన్నం కూడా బంగారు నాణాలే. తార్ వెండినాణెం. జిటాలు, కాసు రాగి నాణేలు. దీనారం ఈజిప్షియన్ నాణెం, నాణేలపై హిందూ దైవాల ప్రతిమలు, ఏనుగులు, నంది, గండబేరుండ పక్షి ఒక పక్క, రాజుల పేర్లు, బిరుదులు మరో పక్క ఉండేవి. రెండో దేవరాయలు వేయించిన పావలా వరహాలపై అతడి బిరుదైన గజబేటకార ముద్రితమై ఉండేది.

సాహిత్య ఆధారాలు - దేశీయ, విదేశీ రచనలు

    మొదటి హరిహరుని కాలంలో ఇబన్ బటూట (మొరాకో) రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి దేవరాయల కాలంలో నికోలోడీ కాంటే (ఇటలీ), రెండో దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ (పర్షియా), శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగోపేస్, న్యూనిజ్‌లు వచ్చారు.
     సతీసమేతంగా విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు నికోలోడీ కాంటే. ఇతడు విజయనగర చుట్టుకొలత, వసంతోత్సవాలు, సతీ సహగమనం గురించి రాశాడు. అబ్దుల్ రజాక్ విజయనగర ఐశ్వర్యం, 300 ఓడరేవులు, గులాబీపూల ప్రాముఖ్యం, పాలెగాళ్లు, తలారుల గురించి వివరించాడు. డొమింగోపేస్ శ్రీకృష్ణదేవరాయలు రూపం, వ్యక్తిత్వం, బలులు, బ్రాహ్మణులు, అధ్యాపక, పూజారి, సైనిక వృత్తులు, దేవాదాసీల ఉన్నత స్థానం గురించి వివరించాడు. బార్బోజా (పోర్చుగల్) విజయనగరరాజుల పరమత సహనం, న్యాయ విధానం గురించి పేర్కొన్నాడు. అథనేషియన్ నికెటిన్ (రష్యా) విజయనగర సామ్రాజ్యంలోని ఆర్థిక అసమానతలు, ఆర్థిక డొల్లతనం గురించి వివరించాడు.
      పెరిస్టా అనే పర్షియన్ చరిత్రకారుడు బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా ఆస్థానంలో నివసించాడు. ఇతడు హిస్టరీ ఆఫ్ ది రైజ్ ఆఫ్ మహ్మడన్ పవర్ గ్రంథాన్ని రచించాడు. విజయనగర నిర్మాతలు ముస్లిం బందిఖానా నుంచి విడుదలైన హిందూ రాజులని, వీరు తమ సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నారని పెరిస్టా పేర్కొన్నాడు.
     న్యూనిజ్ ప్రకారం రెండో దేవరాయలు బర్మా, శ్రీలంకల నుంచి కప్పం వసూలు చేశాడని; శ్రీకృష్ణ దేవరాయల కళ్లు తీసేయమని సాళువ తిమ్మరుసుకు వీరనరసింహుడు ఆదేశించాడని; పల్లకి మోసేవారుగా స్త్రీలను నియమించారని; అట్టావనంలో సైనిక లెక్కలు చూసే కరణాలు, 200 మంది అమర నాయకులున్నారని తెలుస్తోంది. రాబర్ట్ సూయెల్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు విజయనగర సామ్రాజ్య పతనం గురించి ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్ (విస్మృత విజయనగర సామ్రాజ్యం) అనే రచన చేశాడు.

దేశీయ సాహిత్యం
     గంగాదేవి - మధురా విజయం, తిరుమలాంబ - వరదాంబికా పరిణయం, రెండో దేవరాయలు - మహానాటక సుధానిధి, 2వ రాజనాథ డిండిముడు - సాళువాభ్యుదయం, 3వ రాజనాథ డిండిముడు - రామాభ్యుదయం, శ్రీకృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద, నాచనసోముడు - ఆంధ్రభాషా చరిత్ర, స్థానాపతి - రాయవాచకం, మహాలింగదేవుడు - ఏకోత్తర నటస్థల, లక్ష్మణ దండనాయకుడు - శివతత్త్వ చింతామణి, చామరసు - ప్రభులింగలీల, హరిదాసు - ఇరుశమయ విళక్కమ్, దూబగుంట నారాయణకవి - పంచతంత్రమ్ (తెలుగు), అల్లసాని పెద్దన - మనుచరిత్రం, గంగాధరుడు - గంగాదాస ప్రలాప విలాసం.. రచనలు విజయనగర సామ్రాజ్యం గురించి వివరిస్తున్నాయి.

 

రాజకీయ చరిత్ర 

సంగమ వంశం
    కర్ణాటకలోని మంగళ నిలయ నివాసి సంగముని కుమారులు హరిహరరాయులు, బుక్కరాయలు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో పనిచేశారు. మహ్మద్ బీన్ తుగ్లక్ దాడిచేసినప్పుడు కంపిలి రాజ్యంలో ఆశ్రయం పొందారు. తుగ్లక్ కంపిలిని కూడా ఆక్రమించి, సంగమ సోదరులను దిల్లీకి తీసుకొనిపోయి ఇస్లాం మతంలోకి మార్చాడు. దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ముస్లిం వ్యతిరేక తిరుగుబాట్లను అణచడం కోసం వీరిని తుగ్లక్ తిరిగి పంపాడు. ముసునూరి పాలకుల చేతిలో ఓడిపోయిన సంగమ సోదరులు విద్యారణ్యస్వామి సహాయంతో హిందూమతంలోకి మారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విరూపాక్షస్వామి పేరున స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.

మొదటి హరిహరరాయలు (1336 - 1356):
     ఇతడి కాలంలోనే బహమనీ సామ్రాజ్యం స్థాపించారు. హోయసాల చివరి రాజు విరూపాక్ష వల్లభుడిని (నాలుగో భళ్లాలుడు) మధురై సుల్తాన్ హత్యచేసిన అనంతరం 1346లో హరిహరుడు హోయసాల రాజ్యాన్ని ఆక్రమించాడు. 1336, ఏప్రిల్ 18న పట్టాభిషేకం జరిగింది. తుంగభద్రా నది దక్షిణ తీరంలో విద్యానగరం/ కోవెలపురం నిర్మించాడు. పంపావతి ఆలయం కట్టించాడు. ఇబన్‌బటూట అనే మొరాకో దేశస్థుడు 1347లో ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి హరిహరుడు బాగపెల్సి, అటకల గూడు శాసనాలు వేయించాడు. బాదామి శాసనం ఇతడిని పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని పేర్కొంటోంది.

 

మొదటి బుక్కరాయలు (1356 - 77)(1353 - 79):
       ఇతడు విజయనగర పట్టణ నిర్మాణం పూర్తి చేశాడు. శ్రావణ బెళగోళ కోసం జైనులు - వైష్ణవులు, శ్రీరంగం కోసం శైవులు - వైష్ణవుల మధ్య జరిగిన ఘర్షణలను తీర్చాడు. విజయనగర, బహమనీ ఘర్షణలు ఇతని కాలంలోనే (1367) ప్రారంభమయ్యాయి. ఇతని కుమారుడు కంపన మధురపై దండెత్తి విజయం సాధించాడు. కంపన భార్య గంగాంబ మధురా విజయం గ్రంథాన్ని రచించింది. నాచనసోముడు ఇతడి ఆస్థానకవి. అతడు ఉత్తర హరివంశం, ఆంధ్రభాషా చరిత్ర లాంటి గ్రంథాలు రచించాడు. సాయణుడు, మాధవుడు అనే కవులు (మంత్రులు) వేదాలకు భాష్యాలు రాశారు. వైదిక మార్గ ప్రవర్తక అనే బిరుదు బుక్కరాయలు పొందారు. బుక్కరాయల కాలంలోనే సోదరుడు మారప్ప సహాయంతో మాధవమంత్రి గోవా (రేవతి ద్వీపం) రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. మాధవుడు తాత్పర్యదీపిక, శైవామ్నయ సారం గ్రంథాలు రచించాడు. బుక్కరాయలు పిచ్చుకల దిన్నె గ్రామాన్ని నాచన సోముడికి దానంచేసి పిచ్చుకల దిన్నె శాసనం వేయించాడు. చైనాకు వర్తక బృందాన్ని పంపాడు.

రెండో హరిహరరాయలు (1377 - 1404):
    రాజాధిరాజ, రాజపరమేశ్వర, రాజ వ్యాస, రాజవాల్మీకి లాంటి బిరుదులతో పాలించాడు. మొదటి బుక్కరాయలు విజయాలను తెలుపుతూ చెన్నరాయ పట్టణ శాసనం వేయించాడు. కాటయ వేమారెడ్డి చేతిలో ఓడిపోయి తన కుమార్తె హరిహరాంబికను ఇచ్చి పెళ్లి చేశాడు. విరూపాక్షుడు సింహళంపై దండెత్తి కప్పం వసూలు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో తీవ్ర కరవు సంభవించింది (దుర్గాదేవి కరవు). రెండో హరిహరుడి గురువు శవణాచారి. 1404లో ఇతని మరణం తర్వాత మొదటి వారసత్వ యుద్ధం జరిగింది. రెండో బుక్కరాయల్ని తొలగించి విరూపాక్షుడు రాజయ్యాడు. మళ్లీ అతడిని తొలగించి రెండో బుక్కరాయలు 1406 వరకు పాలించాడు.

 

మొదటి దేవరాయలు (1406 - 22):
      ఇతడు వెలమలతో మైత్రి కుదర్చుకున్నాడు. ముద్గల్ కంసాలి కుమార్తె నెహాల్ విషయంలో బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షాతో యుద్ధం చేసి, ఓడిపోయాడు. రాజమండ్రి కాటయవేముడితో సంధి చేసుకుని సహాయం చేశాడు. విజయనగరం చుట్టూ బురుజులు నిర్మించాడు. తుంగభద్రా నదికి ఆనకట్టలు కట్టించి నగరానికి నీటి సౌకర్యం కల్పించాడు. చామన దండనాయకుడు ఇతడి మంత్రి. విక్రమార్క చరిత్ర గ్రంథాన్ని రాసిన జక్కన, దాన్ని సిద్దనకు కృతి ఇచ్చాడు. సిద్దనను చామన ఆదరించాడు. 1422లో రాయల మరణం తర్వాత కుమారుడు రామచంద్ర రాయలు రాజయ్యాడు. అతడిని తొలగించి సోదరుడు విజయ రాయలు పాలన చేశాడు. విజయ రాయల కుమారుడే రెండో దేవరాయలు.

రెండో దేవరాయలు (1426 - 46):
    ఇతడు సంగమ వంశంలో గొప్పవాడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. గజబేటకార బిరుదాంకితుడు (ఏనుగుల వేటలో సిద్ధహస్తుడు). కొండవీడును ఆక్రమించి, సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని సామంతరాజ్యంగా చేసుకున్నాడు. కపిలేశ్వర గజపతి దండయాత్రలను అరికట్టడానికి మల్లప్పవడయ సేనానిని పంపాడు. లక్కన్న దండనాయకుడు జాఫ్నా నుంచి కప్పం వసూలు చేశాడు. దక్షిణ సముద్రాధీశ్వర బిరుదు ధరించాడు. బహమనీ సుల్తాన్ అహ్మద్ షా రాజధానిని బీదర్‌కు మార్చి రెండో దేవరాయల్ని ఓడించాడు. రాయలు త‌న సైన్యంలో ముస్లింల‌ను నియ‌మించాడు (పెరిస్టా). ప్రభులింగలీల గ్రంథాన్ని రచించిన చామరసు ఇతడి ఆస్థానంలోని వ్యక్తే. ఇతడి మంత్రి ప్రోలుగంటి తిప్పన. రాజధాని(పాన్ సుపారీ బజార్)లో జైనులకు జినాలయం నిర్మించుకోవడానికి అనుమతించాడు. తురకవాడ అభివృద్ధికి, ప్రార్థనా సౌకర్యాలు కల్పించడానికి కృషిచేశాడు. రాయల ఆస్థాన కవి అరుణగిరినాథు డిండిముడు. శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థానానికి వచ్చి డిండిముడిని ఓడించి కవిసార్వభౌమ బిరుదు పొంది గండపెండేరం తొడిగించుకున్నాడు. అబ్దుల్ రజాక్, నికోలోడీ కాంటే ఇతడి కాలంలో రాజ్యాన్ని సందర్శించారు. రెండో దేవరాయలు తన సింహాసనం ముందు ఖురాన్‌ను ఉంచేవాడు.
      రెండో దేవరాయల తర్వాత అతడి కుమారుడు మల్లికార్జునరాయలు 1446-1465 వరకు పాలించాడు. ఇతడి కాలంలో కపిలేశ్వర గజపతి వెలమల సహాయంతో తీరాంధ్రను జయించినట్లు పెనుగొండ శాసనం తెలుపుతోంది. తర్వాత రెండో దేవరాయల తమ్ముడి కుమారుడు రెండో విరూపాక్షరాయలు పాలించినట్లు ప్రసన్నామృతం గ్రంథం తెలుపుతోంది. ఇతడి దుష్పరిపాలనను సహించలేక కుమారుడే హత్యచేసి ప్రౌఢ దేవరాయలకు అధికారం అప్పగించాడు. ఈ పరిస్థితుల్లో సాళువ నరసింహరాయలు తన సేనాని తుళువ నరసింహనాయకుడిని పంపి ప్రౌఢ దేవరాయలును ఓడించి సాళువ వంశపాలన ప్రారంభించాడు.

సాళువ వంశం (1485 - 1505)
      సాళువ వంశస్థుల జన్మస్థలం కళ్యాణి (కర్ణాటక). ఈ వంశం వారు కళ్యాణపురవరాధీశ్వర బిరుదు ధరించారు. మంగిరాజుకు ప్రతిపక్షసాళువ బిరుదు ఉంది. సాళువ నరసింహుడి ఆస్థాన కవి రెండో రాజనాథ డిండిమ భట్టు- సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాశాడు. నరసింహరాయలు రాజధానిని కళ్యాణి నుంచి చంద్రగిరికి మార్చాడు. తెలంగాణపై దండెత్తి బాలకొండ దగ్గర ముస్లిం సైన్యాలను ఓడించి రాయ మహారసు బిరుదు పొందాడు. విజయనగర చరిత్రలో మొదటి దురాక్రమణదారుడుగా పేరొందాడు. 15 సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యంలో తిరుగుబాట్లను అణిచి శాంతిభద్రతలు నెలకొల్పాడు. సాముగరిడీలను ప్రోత్సహించాడు. రాజనాథ డిండిముడే రాఘవాభ్యుదయం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార శాకుంతలం గ్రంథాలను ఇతడి కాలంలోనే రచించాడు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఇతడి కాలంలోనే జీవించారు.


    సాళువ నరసింహుడి పెద్దకుమారుడు తమ్మరాజును సింహాసనం ఎక్కించి, సర్వాధికారాలు తుళువ నరసనాయకుడు చెలాయించాడు. ఇదేకాలంలో ఖాశింబరీద్ బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాను బంధించి సర్వాధికారాలు హస్తగతం చేసుకున్నాడు. నరసనాయకుడు యూసఫ్ ఆదిల్‌షాతో మానవ దుర్గం యుద్ధంలో గెలిచినప్పటికీ రెండోసారి యుద్ధంలో తమ్మరాజు మరణించాడు. ఫలితంగా అతడి సోదరుడు ఇమ్మడి నరసింహరాయలును సింహాసనం ఎక్కించాడు.

ఇమ్మడి నరసింహుడు తుళువ నరసను తొలగించి నాదెండ్ల తిమ్మరుసును మంత్రిగా నియమించుకున్నాడు. చివరికి 1505లో తుళువ వీరనరసింహుడు పెనుగొండలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయలను హత్య చేయించి, తుళవ వంశపాలన ప్రారంభించాడు. (వాస్తవానికి తుళువ నరసనాయకుడే ఇమ్మడి నరసింహుడిని పెనుగొండలో బంధించి, అధికారాలను హస్తగతం చేసుకుని రెండో దురాక్రమణదారుడుగా పేరొందాడు)
 

తుళువ వంశం (1505 - 1575)
     మైసూర్‌లోని తుళు ప్రాంతం జన్మస్థలం. మూలపురుషుడు తిమ్మరాజు. ఇతడి కుమారుడు ఈశ్వర నాయకుడు సాళువ నరసింహుడి సేనానిగా అనేక విజయాలు సాధించి దేవకీపురాధిపుడు అనే బిరుదు పొందినట్లు వరాహపురాణం గ్రంథం తెలుపుతోంది. ఈ గ్రంథాన్ని నంది మల్లయ్య, ఘంట సింగనలు రచించి తుళువ నరసనాయకుడికి అంకితం చేశారు. వీరనరసింహుడు 1505-09 వరకు రాజ్యపాలన చేశాడు. దేవులపల్లి శాసనం వేయించింది ఇతడే. బహమనీ సుల్తాన్ మహమూద్ షా హిందువులపై ఏటా జీహాద్ ప్రకటించాలని బీదర్ సమావేశంలో పిలుపునిచ్చాడు. నంది మల్లయ్య, ఘంట సింగన (తొలి తెలుగు జంట కవులు)లు ప్రబోధ చంద్రోదయం గ్రంథాన్ని రచించారు. వైవాహిక సుంకాన్ని రద్దుచేసిన తొలి విజయనగర చక్రవర్తి వీర నరసింహుడు.

 

శ్రీకృష్ణ దేవరాయలు (1509 - 1529): 

  తుళువ నరసనాయకుడు, నాగలాంబిక కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. 1509, ఆగస్టు 8 (శ్రీ జయంతి) రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడు. మహామంత్రి తిమ్మరుసు (మనోహరా గ్రంథం) సహాయంతో రాజయ్యాడు. రాయల పట్టాభిషేకానికి లూయిఫ్రెజర్/ ప్రేయర్ లూయిస్ అనే పోర్చుగీసు రాయబారిని ఆల్బూకర్క్ పంపాడు. 1510లో శ్రీకృష్ణదేవరాయలు ఆల్బూకర్క్‌తో సంధి చేసుకుని, బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి గోవాను పోర్చుగీసువారి పరం చేశాడు. భట్‌కల్‌లో కోట నిర్మాణానికి కూడా రాయలు అనుమతి ఇచ్చాడు. కోవిలకొండ, దీవాన్ యుద్ధాల్లో బహమనీ సైన్యాలను ఓడించి కోవిలకొండను ఆక్రమించాడు.

ఆదిల్‌ఖాన్ చనిపోయాడు. బీదర్‌లో అలీబరీద్ సుల్తాన్‌ను బంధించిన కారణంగా బెల్గాం పౌరులు శ్రీకృష్ణదేవరాయలను దండయాత్రకు ఆహ్వానించారు. మహమూద్‌షాను విడిపించి, సుల్తాన్‌గా నియమించాడు. దీంతో యవన రాజ్యస్థాపనాచార్య అనే బిరుదు రాయలు పొందాడు. దక్షిణ భారత దేశంలో యూరోపియన్లతో తన సైన్యానికి శిక్షణ ఇప్పించిన తొలిరాజుగా శ్రీకృష్ణదేవరాయలు పేరొందారు. గాంగరాజును ఓడించి ఉమ్మత్తూర్, శివసముద్రం ప్రాంతాలను ఆక్రమించి, శ్రీరంగపట్నం రాజధానిగా చేసి, కెంపెగౌడ, వరప్పగౌడలను నియమించాడు. వీరిద్దరూ ఆధునిక బెంగళూరు నిర్మాతలు. శ్రీకృష్ణదేవరాయలు తన ప్రతినిధిగా సాళువ గోవింద రాజును నియమించినట్లు బీఎస్ఎల్ హనుమంతరావు తన రచనలో పేర్కొన్నారు. క్రీ.శ. 1513-1519 మధ్య రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలు నిర్వహించాడు. క్రిస్టియన్ ఓడ్ ఫిగరిడో సహాయంతో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, సింహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు. తిరుమల రాహత్తరాయలను ఓడించి, ఉదయగిరిలో కొండ మరుసయ్యను నియమించాడు. బాలకృష్ణ విగ్రహాన్ని తెచ్చి హంపిలో కృష్ణాలయం నిర్మించాడు. వీరరుద్ర గజపతిని ఓడించి, కొండవీడును ఆక్రమించి తిమ్మరాజు పినకొండ్రాజును నియమించాడు. ప్రహరేశ్వరపాత్రుడు, అతని సేనాని బిజిలిఖాన్‌లను ఓడించి కొండపల్లిని ఆక్రమించాడు. చితాబ్‌ ఖాన్ పాలనలో ఉన్న తెలంగాణను కూడా రాయలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. సింహాచలం వద్ద ఉన్న పొట్నూరులో శ్రీకృష్ణదేవరాయలు చితాబ్‌ ఖాన్‌ను ఓడించి విజయస్తంభాన్ని నాటాడు. తర్వాత ఒరిస్సాను పాలిస్తున్న ప్రతాపరుద్ర గజపతిని ఓడించి రాజధాని కటక్‌ను ఆక్రమించాడు. గజపతి కుమార్తె అన్నపూర్ణాదేవి/ చిన్నదేవి/ భద్రదేవి/ తుక్క దేవిని వివాహం చేసుకున్నాడు (గజపతి కుమార్తె పేరు భద్రదేవి అని ప్రబోధ చంద్రోయ వ్యాఖ్యానంలో నాదెండ్ల గోపమంత్రి పేర్కొన్నాడు).

తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగానే కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో స్వప్నం రావడం ఫలితంగా ఆముక్త మాల్యద/ విష్ణుచిత్తీయం అనే గ్రంథ రచనకు శ్రీకారం చుట్టాడు. 1520-1521లో ఇస్మాయిల్ ఆదిల్ షాతో గొబ్బూరు యుద్ధం చేశాడు. విజయప్ప, వేంకటప్ప, వీర రాఘవప్పల సహాయంతో చోళ, చేర, పాండ్య రాజ్యాలను ఓడించాడు. సింహాచల దేవాలయానికి ముఖ మండపం, మంగళగిరి దేవాలయానికి మండపాలు, సోపానాలు నిర్మించాడు. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువును అన్నపూర్ణాదేవి నిర్మించింది. తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం పట్టణం, తటాకాన్ని నిర్మించాడు. పెనుగొండలో గగన్‌మహల్‌ను నిర్మించాడు. 1522లో రాయలు రాయచూర్‌ని ఆక్రమించినట్లు ఓరుగంటి రామచంద్రయ్య రాశారు. ఇస్మాయిల్ ఆదిల్ షా అసద్ ఖాన్ లారీ అనే రాయబారిని శ్రీకృష్ణదేవరాయల వద్దకు పంపాడు.
     శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి కామరాజు/ అళియరామరాయలతో వివాహం చేశాడు. వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల వైష్ణవమత గురువు. పోర్చుగీసు ఇంజినీర్ల సాయంతో కాలువలు, చెరువులు తవ్వించాడు. 1513లో సాధించిన కళింగ విజయానికి గుర్తుగా భువనవిజయం అనే ఆస్థాన భవనాన్ని నిర్మించాడు. వల్లభాచార్యుడు రాయల ఆస్థానాన్ని సందర్శించాడు. హంపిలో హజార రామాలయం, విఠలస్వామి దేవాలయాలను పూర్తిచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇస్లామిక్ పద్ధతిలో పద్మమహల్‌ను నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. దేశ భాషలందు తెలుగులెస్స అని రాయలు పేర్కొన్నారు. బండారు లక్ష్మీ నారాయణ కవి సంస్కృత భాషలో సంగీత సూర్యోదయం గ్రంథాన్ని రచించాడు. దీన్ని రాయలకు అంకితమిచ్చారు.

     శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, సత్యవధు ప్రియతము, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి వంటి సంస్కృత భాషా గ్రంథాలు రచించాడు. అల్లసాని పెద్దన - మనుచరిత్ర, ధూర్జటి - శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం (శతకం), నంది తిమ్మన - పారిజాతాపహరణం, అయ్యలరాజు రామభద్రుడు- రామాభ్యుదయం, మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్ర, పింగళి సూరన - రాఘవ పాండవీయం, కళా పూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తెనాలి రామలింగడు - పాండురంగ మహాత్మ్యం, రామరాజభూషణుడు/ భట్టుమూర్తి - వసుచరిత్ర, హరిశ్చంద్రనలోపాఖ్యానం, నరసభూపాళీయం గ్రంథాలు రచించారు.
 

అచ్యుతరాయలు (1530-1542):
     అచ్యుతరాయలు తిరుపతిలో పట్టాభిషేకం జరుపుకుని సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతడు గజపతిని ఓడించినట్లు రాధామాధవకవి తారకాభ్యుదయం చెబుతోంది. సాళువ నరసింగరాయల తిరుగుబాటును బావమరుదులు సలకం చిన్న, పెద్ద తిరుమల సహాయంతో అణచివేశాడు. ఇతడి ఆస్థానాన్ని కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసు సందర్శించాడు.

 

సదాశివరాయలు (1542 - 1576):
     అళియరామరాయలు సహాయంతో సదాశివరాయలు 'గుత్తి' దుర్గంలో రాజుగా ప్రకటించబడ్డాడు. సదాశివుడు అచ్యుతరాయల అన్న రంగరాయ కుమారుడు. కానీ సలకం తిరుమలుడు రామరాయల్ని, సదాశివరాయల్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేశాడు. ఈ అంతర్యుద్ధ సమయంలో వరదాంబిక ఆదిల్ షాను దండయాత్రకు ఆహ్వానించింది. చివరికి సదాశివుడు ఆదిల్ షాను ఓడించి పట్టాభిషేకం జరుపుకున్నాడు.

అళియ రామరాయలు సర్వాధికారాలు చెలాయించాడు. ముస్లింలను అధిక సంఖ్యలో సైన్యంలో చేర్చుకోవడమే కాకుండా తురకవాడలో గోవధను సైతం అనుమతించాడు. ఇతడి కాలంలో పోర్చుగీసు గవర్నర్ మార్టిన్ అపాన్జో డిసౌజా శ్రీరంగం, కాంచీపురం ఆలయాలపై దాడిచేశాడు. కానీ అనంతరం గవర్నర్‌గా వచ్చిన జావోడ కాస్ట్రో రామరాయలతో సంధి చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తళ్లికోట/ రాక్షస తంగడి యుద్ధం 1565లో ఇతడి కాలంలోనే జరిగింది. యుద్ధంలో అళియ రామరాయలు మరణించగా, సోదరుడు తిరుమలరాయలు సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండకు పోయి అరవీటి వంశాన్ని స్థాపించాడు. రాక్షస తంగడి యుద్ధం గురించి కేలదినృపవిజయం గ్రంథం వివరిస్తోంది. యుద్ధంలో సుల్తానుల సైన్యానికి గోల్కొండ రాజ్యం నాయకత్వం వహించింది. బీరార్ రాజ్యం మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు.
 

అరవీటి వంశం 

     అరవీటి తిమ్మరాజు సాళువ నరసింహుని కొలువులో పనిచేశాడు. అతడి కుమారులే రామరాయలు, వెంకటాద్రి, తిరుమలరాయలు. తళ్లికోట యుద్ధంలో రామరాయలు, వెంకటాద్రి చనిపోగా తిరుమలరాయలు పెనుగొండకు పోయి అరవీటి వంశ పాలన ప్రారంభించాడు. తన రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి తన కుమారులను పాలకులుగా నియమించాడు. పెనుగొండ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను శ్రీరంగరాయలు, శ్రీరంగపట్నం కేంద్రంగా కన్నడ ప్రాంతాలను రామరాయలు, చంద్రగిరి కేంద్రంగా తమిళ ప్రాంతాలను వెంకటపతి రాయలు పాలించారు. రామరాజ భూషణుడు తన వసుచరిత్ర గ్రంథాన్ని తిరుమలరాయలకు అంకితం ఇచ్చాడు.

    క్రీ.శ.1572 నుంచి 1585 వరకు శ్రీరంగరాయలు అరవీటి వంశం పాలన చేశాడు. ఇతడి కాలంలోనే కోడూరు యుద్ధం (1579) జరిగింది. తర్వాత రెండో వెంకటపతి రాయలు (1586 - 1614) పాలనకు వచ్చాడు. రాజధానిని పెనుగొండ నుంచి వెల్లూరుకు మార్చాడు. అక్బర్ తన సార్వభౌమత్వాన్ని అంగీకరించాల్సిందిగా పంపిన రాయబారాన్ని తిరస్కరించిన వ్యక్తిగా ఇతడిని పేర్కొంటారు. రెండో వెంకటపతి భార్య బాయమ్మ. వీరికి సంతానం లేదు. దీంతో రాయలు తన అన్న కొడుకు శ్రీరంగరాయల్ని వారసుడిగా ప్రకటించి మరణించాడు. బాయమ్మ రహస్యంగా ఒక బ్రాహ్మణ బాలుడ్ని పెంచి అతడిని రాజును చేయాలని ప్రయత్నించింది.
 

తోపూరు యుద్ధం 1686:
      బాయమ్మ సోదరుడు గొబ్బూరు జగ్గరాజు తన మేనల్లుడ్ని సింహాసనం ఎక్కించడానికి కుట్రపన్ని శ్రీరంగరాయల కుటుంబాన్ని ఖైదు చేశాడు. కానీ వెలుగోటి కస్తూరి రంగప్ప కొడుకు యాచమ నాయకుడు శ్రీరంగరాయల కుమారుడు రామదేవరాయల్ని బందీ నుంచి తప్పించాడు. దాంతో జగ్గరాజు శ్రీరంగరాయల కుటుంబాన్ని మొత్తం హత్య చేయించాడు. జగ్గరాజును యాచమ నాయకుడు ఓడించి, వెల్లూరును ఆక్రమించి, రామదేవరాయల్ని రాజును చేశాడు. కానీ జగ్గరాజు మధుర, జింజి పాలకులతో కూటమి ఏర్పాటు చేసి 1686లో తోపూరు యుద్ధం చేశాడు. దక్షిణ దేశంలో పెద్ద ఎత్తున ఫిరంగులు వాడింది ఈ యుద్ధంలోనే. జగ్గరాజు కూటమి పూర్తిగా ఓడిపోయింది. ఈ యుద్ధం గురించి వెలిగోటివారి వంశావళి వివరిస్తుంది. రామదేవరాయల కాలంలోనే కందనవోలు బీజాపూర్‌లో విలీనమైంది.

మూడో వెంకటపతి రాయలు (1630-1642):
    రామదేవరాయల అనంతరం అళియ రామరాయల పెద మనవడైన మూడో వెంకటపతిరాయలు పాలనకు వచ్చాడు. బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. చివరికి పరాజయం పొంది చిత్తూరు జిల్లా అడవుల్లోకి పోయి మరణించాడు.

 

మూడో శ్రీరంగరాయలు:
      చివరి విజయనగర పాలకుడు మూడో శ్రీరంగరాయలే. వెంగల్లు యుద్ధంలో గోల్కొండ సైన్యాలను ఓడించాడు. మీర్ జుమ్లా నాయకత్వంలో గోల్కొండ సైన్యాలు, ముస్తఫాఖాన్ నాయకత్వంలో బీజాపూర్ సైన్యాలు రాయల రాజ్యంపై దండెత్తాయి. 1642లో వెల్లూరు వద్ద జరిగిన యుద్ధంలో రాయలు పరాజయం పొందాడు. రాయల ప్రోత్సాహంతో మధుర, వెల్లూరు నాయకులు మీర్‌జుమ్లాతో పోరాడినా వందవాసి యుద్ధంలో పరాజయం పొందారు. 1665లో రాయలు మళ్లీ పెనుగొండను ఆక్రమించి 1680 వరకు పాలించాడు. సామ్రాజ్యం అస్తమించింది.

 

విజయనగర యుగ విశేషాలు 

పాలన: సంప్రదాయ రాచరికం. వంశానుగత పాలన, రాజు దైవాంశ సంభూతుడునే భావన ఉంది. ఆముక్తమాల్యద, పరాశరమాధవీయం, సకలనీతిసమ్మతం లాంటి గ్రంథాల్లో నాటి పాలనా విధానాలను వర్ణించారు. రాజ్యాన్ని రాష్ట్రం - మండలం - నాడు - స్థలం - సీమ - గ్రామం అనే రకాలుగా వర్గీకరించారు. మంత్రిమండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి (సర్వశిరః). ఇతడినే సభానాయక, తంత్రనాయక అని పిలిచేవారు. సమావేశాలు కొలువు కూటాల్లో జరిగేవి. రెండో దేవరాయల సభా భవనాన్ని ముత్యాలశాల అనీ, శ్రీకృష్ణదేవరాయల సభా భవనాన్ని భువన విజయం అనీ, అచ్యుతరాయల సభను వెంకట విలాస మంటపం అని పిలిచేవారు.

    ప్రభుత్వ నిర్వహణలో అట్టావన (రెవెన్యూ శాఖ), కందాచార (మిలటరీ సైనిక శాఖ), భాండార (ఖజానా), ధర్మాసన (న్యాయ శాఖ) లాంటి శాఖలు ఉండేవి. ప్రతి శాఖకు సంప్రతులు, కరణాలు ఉండేవారు. తొమ్మిది మంది సంప్రతులు ఉండటం వల్ల 9 శాఖలున్నట్లు భావించవచ్చు. సీమలు, స్థలాల పొలిమేరలు; భూకామాందులు, శిస్తుల గురించి సంప్రతులు చిట్టాలు తయారుచేసేవారు. రాష్ట్ర పాలనను నాయంకర రాజులు నిర్వహించేవారు. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రాలను రాజ్యాలు అనేవారు. అచ్యుతరాయల కాలంలో 17 రాజ్యాలు (రాష్ట్రాలు) ఉన్నట్లు శాసనాధారాలు ఉన్నాయి. రాజ్యంపై అధికారిని దుర్గదన్నాయకుడు అనేవారు. అతడి కార్యస్థానాన్ని చావడి అనేవారు. సీమ అధిపతిని పారుపత్యదారు అనేవారు. సీమ ఆదాయ వ్యయాలను చూడటం, రైతులకు పట్టాలివ్వడం, పన్నులు విధించడం ఇతడి విధులు. స్థలాలకు అధిపతులుగా రెడ్డి/ గౌడ/ స్థల కరణాలు ఉండేవారు. గ్రామ పాలనకు 12 మంది ఆయగాండ్రులను నియమించేవారు. కరణం, రెడ్డి, తలారి అనే ఆయగాండ్రకు స్థల ఉద్యోగులు, ప్రభుత్వంతో సంబంధం ఉండేది. ఆయగాండ్రకు జీతాలు లేవు. ప్రజల నుంచి మేర పేరుతో పంటలో కొంతభాగం పొందేవారు.
     గ్రామాల్లో భాండారవాడలు, అమర గ్రామాలు, మాన్య గ్రామాలు అనే మూడు రకాలు ఉండేవి. మాన్య గ్రామాల్లో దేవ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఉబ్బలి గ్రామాలు అనే రకాలుండేవి. ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చే గ్రామాలను ఉబ్బలి గ్రామాలు అనేవారు. మాన్య గ్రామాలు జోడి అనే నామమాత్రపు పన్నును చెల్లించేవి. ఆయగాండ్రకు ఇచ్చే భూమి మిరాసీ అనేవారు.

ఆర్థిక పరిస్థితులు:
      ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. భూములను సర్వే చేయించి పన్ను విధించేవారు. తెలుగు ప్రాంతాల్లో తిమ్మరుసు మంత్రి సర్వే నిర్వహించాడు. సర్వే కోసం తీరాంధ్రలో కేసరిపాటిగడ, రేనాడులో దోరగడ అనే కొలమానాలను వినియోగించారు. బ్రాహ్మణ ఈనాములపై 1/6వ వంతు, దేవాలయ భూములపై 1/30వ వంతు పన్ను వసూలు చేసేవారు. భూమి శిస్తు మాత్రం 1/3వ వంతు ఉండేది. మాగాణి (నీరాంబర), మెట్ట (కాడాంబర) పన్నుల్లో తేడాలుండేవి. ప‌న్నులు ధ‌న‌, ధాన్యరూపంలో చెల్లించవ‌చ్చు. పన్నులు ధన రూపంలోనే చెల్లించాల్సిందిగా కట్టడి చేసినట్లు పరాశరమాధవీయం ద్వారా తెలుస్తోంది. సువర్ణాదాయాన్ని సిద్ధాయం అనేవారు. గ్రామాల్లో పొలాలు, శిస్తు వివరాలను కవిలెలో నమోదు చేసి ఉంచేవారు (కవిలె సంప్రతులు). పశువులను మేపినందుకు పుల్లరి చెల్లించాలి. బిచ్చగాళ్లపై గణాచారి పన్ను విధించేవారు. కొండోజు అనే మంగలి అభ్యర్థన మేరకు అళియరామరాయలు కొన్ని ప్రాంతాల్లో మంగలి పన్నును తొలగించాడు. సాలెవారు మగ్గరి, పింజ సిద్ధాయం పన్నులను; కుమ్మరి చక్రకానిక పన్నును; ఉప్పుకొటార్లపై ఉప్పరి పన్ను; ఇండ్లపై ఇల్లరి పన్ను; నిధి నిక్షేపాలు, తోటలు, పశువులు, నీటిబుగ్గలపై సంపత్తి పన్ను విధించేవారు. నాగలాపురంలో ప్రవేశించే వస్తువులపై 42 వేల పగోడాల ఆదాయం వచ్చేదని న్యూనిజ్ రాశాడు. వివాహాల సమయంలో కల్యాణానికే, గుడి కళ్యాణం అనే పన్నులు విధించేవారు. శ్రీకృష్ణదేవరాయలు కందనవోలు, చంద్రగిరి ప్రాంతాల్లో కళ్యాణ పన్నులను తొలగించాడు. మహానవమితో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేదని పేస్ రాశాడు.
     విజయనగర రాజ్యంలో బంగారం, వెండి, రాగి నాణేలు అమల్లో ఉండేవి. గద్వాణం బంగారు నాణెం. దాన్నే వరాహ అనేవారు. గద్వాణంలో సగం ప్రతాప. ఫణం, చిన్నం అనే ఇతర బంగారు నాణేలు కూడా వాడుకలో ఉండేవి.

ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం మాత్రం ఫణం. తార్ అనేది వెండి నాణెం. ఇది ఫణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణేలు. దీనారం అనే ఈజిప్షియన్ నాణెం కూడా వాడుకలో ఉండేది.
     వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కాలువలు, తటాకాలను తవ్వించారు. బుక్కరాయల కాలంలో పెనుగొండ వద్ద శిరువేరు తటాకం, సాళువ నరసింహుడి కాలంలో అనంతపురం దగ్గర నరసాంభుది తటాకం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాగలాపురం తటాకాలను నిర్మించారు. కొండవీటి రాజ్యంలో కొండమరసు తిమ్మసముద్రం, కొండ సముద్రాలను నిర్మించాడు. నాటి తటాకాల గురించి కోడుమామిళ్ల శాసనం తెలుపుతోంది. చెరువు కింద సాగు చేసుకునే రైతులు చెరువు నిర్మించిన వారికి దశబంధ మాన్యం (1/10) చెల్లించేవారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో తుంగభద్ర నదిపై తూరుట్టు ఆనకట్టను నిర్మించాడు. వ్యవసాయేతర, వృత్తి పన్నులను శుల్కాదాయం అనేవారు. సాలె, కమ్మరి, కుమ్మరి... వృత్తులవారు జాతి సిద్ధాయం అనే వృత్తి పన్నును చెల్లించేవారు. కావేరి నదిపై కృష్ణరాయలు కృష్ణరాయ సాగర్‌డ్యామ్, కోరుగల్లు వద్ద ఆనకట్టను నిర్మించాడు. మొదటి బుక్కరాయల మంత్రి చిక్కప్పవడయార్ బుక్కసాగరం, అనంతసాగరం చెరువులను తవ్వించాడు. దేశమంతటా తోటలు విస్తారంగా ఉన్నాయనీ, పండ్లు చవకగా లభించేవని పేస్ పేర్కొన్నాడు. వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ నూలు పరిశ్రమకు కేంద్రాలుగా ఉండేవి. కలంకారీ వస్త్ర పరిశ్రమ కూడా వృద్ధి చెందింది. కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాలు అధికంగా దొరికేవి. వజ్రకరూర్ గనులు ప్రసిద్ధి చెందాయి. నకిలీ వజ్రాలు తయారవుతున్నట్లు బార్బోసా రాశాడు.

    గ్రామాల్లో జరిగే స్థానిక సంతల గురించి ఆముక్త మాల్యద పేర్కొంటోంది. వ్యాపార కేంద్రాల గురించి హంశవింశతి గ్రంథం వివరిస్తోంది. విజయనగరంలో 300 ఓడరేవులున్నాయని అబ్దుల్ రజాక్ రాశాడు. మోటుపల్లి రేవు కోసం కొండవీడు, విజయనగర రాజ్యాల మధ్య చాలా కాలం ఘర్షణ జరిగింది. మొదటి దేవరాయలు మోటుపల్లిని ఆక్రమించి ధర్మశాసనం (1416) వేయించాడు. పులికాట్ రేవులో హిందు, ముస్లింల వర్తక వాణిజ్యాలు; ఎగుమతి, దిగుమతుల గురించి బార్బోసా రాశాడు. టోకు వర్తకులు హెర్నుకం అనే పన్ను చెల్లించేవారు. నాడు కాలికట్ ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలను నకరములు అనేవారు.
 

సాంఘిక పరిస్థితులు:
    సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది. డొమింగో పేస్ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి వివరించాడు. నాటి గ్రామీణ జీవనం గురించి బార్బోసా రాశాడు. భోక్తలు భోజనం మినహా ఏ ఇతర పనీ చేయరని రాశాడు. క్షత్రియ స్త్రీలు సతీసహగమనం పాటించేవారని, నరబలి ఆచారం ఉందని పేర్కొన్నాడు. యుద్ధ ఖైదీలను ఎక్కువగా బలి ఇచ్చేవారని, ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామీణులు పేదరికం అనుభవించేవారని, పూరి గుడిసెల్లో నివసిస్తూ అర్ధ నగ్నంగా ఉండేవారని బార్బోసా తెలిపాడు. మొదటి దేవరాయల కాలంలో వచ్చిన నికోలోడీ కాంటే విజయనగరం చుట్టుకొలత, అందచందాలను; దీపావళి, నవరాత్రి ఉత్సవాలను ప్రజలు జరుపుకునే విధానం గురించి రాశాడు. రెండో దేవరాయల కాలంలో వచ్చిన అబ్దుల్ రజాక్ విజయనగరం లాంటి పట్టణం ప్రపంచంలో మరెక్కడా లేదని కితాబిచ్చాడు. ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని పేర్కొన్నాడు. వేశ్యా వృత్తిపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని పోలీస్ వ్యవస్థకు జీతభత్యాలుగా చెల్లించేవారని తెలిపాడు. వేశ్యలను రూపాజీవాళి అని పిలిచేవారని చెప్పాడు. వేట, కుస్తీ, మల్లయుద్ధం, తోలుబొమ్మలాట, సంగీతం, నాట్యం, వీధి నాటకం, యక్షగానం, చదరంగం నాటి ప్రజల ముఖ్య వినోదాలని రజాక్ పేర్కొన్నాడు.

     శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన డొమింగో పేస్ చాతుర్వర్ణ వ్యవస్థ, దేవదాసీ విధానం, బ్రాహ్మణులు నిర్వహించిన ఇతర వృత్తుల గురించి వివరించాడు. విజయనగరాన్ని రోమ్ పట్టణంతో పోల్చాడు. అతడి కాలంలోనే వచ్చిన బార్బోసా కూడా నాటి సాంఘిక, మత పరిస్థితులను వివరించాడు. అచ్యుతరాయల కాలంలో వచ్చిన న్యూనిజ్ సమాజంలో ఉన్న భూస్వాములు, ప్రభువుల శృంగార ప్రియత్వం; సాంఘిక దురాచారాల గురించి రాశాడు. విజయనగర కాలంలో అద్భుతంగా చేసిన పండగ దసరా. కృష్ణరాయలు పంచములు కూడా దేవుడి పూజకు అర్హులని మాలదాసరి కథలో పేర్కొన్నాడు. విజయనగర కాలంలోనే మొదటిసారిగా పంచమ కులస్థులు (మాల, మాదిగ, వలయ, చక్కిటి, పరయ) ఏర్పాడ్డారు. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, పశుకాపరులను పాంచాలులు లేదా పంచాననంవారు అనేవారు. నాటి సమాజంలో సాలెవారిని కైకోలులు అనీ, గారడీ చేసేవారిని విప్రవినోదులు అనీ, వ్యవసాయదారులను వక్కలి లేదా వెళ్లాల అనీ, పశుకాపరులను కురుబలు, ఇదయనులు అని పిలిచేవారు. వైశ్యులను నకరములు అనేవారు.
    బహుభార్యత్వం, కన్యాశుల్కం, వరశుల్కం, సతీసహగమనం లాంటి ఆచారాలు ఎక్కువగా ఉండేవి. రెండో దేవరాయలు బ్రాహ్మణులతో కన్యాదాన విధానాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయించాడు. రాయల ఆస్థానంలోని అనేక వందల మంది స్త్రీలు అతడితో సహగమనం చేయడానికి సిద్ధం అని నికోలో కాంటే రాశాడు. భర్త శవంతో పాటు భార్యను పూడ్చిపెట్టే ఆచారం తెలుగువారిలో ఉన్నట్లు న్యూనిజ్ రాశాడు. కుల కట్టుబాట్లు పాటించని వారిపై సమయ సుంకం విధించేవారు.

సైనిక, న్యాయపాలన:
      న్యాయ నిర్వహణకు క్రమబద్ధమైన న్యాయస్థానాలు లేవనే చెప్పాలి. నాలుగు రకాల న్యాయస్థానాలున్నట్లు పరాశరమాధవీయం పేర్కొంటోంది. రాయలు అత్యున్నత న్యాయాధికారి. కానీ రాయలకు బదులు ప్రధాని న్యాయ నిర్వహణ జరిపేవాడని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. మహామంత్రి తిమ్మరుసుకు ధర్మప్రతిపాలక అనే బిరుదు ఉండేది. రాయలకు న్యాయనిర్వహణలో తోడ్పడే ఉద్యోగులను ప్రాడ్వివాక్కులు అనేవారు. నేర నిరూపణకు దివ్య పరీక్షలు అమల్లో ఉన్నట్లు నికోలోడీ కాంటే రాశాడు. గ్రామంలో శాంతి భద్రతలకు తలారి, స్థలానికి కావలివారు, పర్వతారణ్య సరిహద్దు ప్రాంతాల్లో పాళెగార్లు బాధ్యత వహించేవారు. ఆయగాండ్రకు ఈనాములు, పాలెగార్లకు జాగీర్లు ఇచ్చేవారు.
   విజయనగర సైన్యంలో సిద్ధ సైన్యం, కైజీత సైన్యం అనే రెండు భాగాలుండేవి. సిద్ధ సైన్యంపై అజమాయిషీకి కందాచారశాఖ ఉండేది. రాయలు సొంతంగా జీతం ఇచ్చి పోషించే సైన్యం కైజీత సైన్యం. కందాచార శాఖకు సేనాపతి లేదా దళవాయి అధిపతిగా ఉండేవాడు. ఇతడు మంత్రిమండలిలో కూడా సభ్యుడు. ముస్లిం సైన్యాలకు రాయలు ఈనాములిచ్చాడని పెరిస్టా రాశాడు. ఇవేకాకుండా అమరనాయక సైన్యం కూడా ఉండేది. ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. సైనిక సహాయానికి ఇచ్చే భూమి లేదా దానిపై వచ్చే ఆదాయాన్ని అమరము అనేవారు. అచ్యుతరాయల కాలంలో ఆరు లక్షల అమర నాయక సైన్యం ఉండేదని న్యూనిజ్ రాశాడు. నౌకా బలం కూడా ఉండేది. కృష్ణదేవరాయల కాలంలో హోనోవర్ రాష్ట్రాధిపతి తిమ్మోజు నౌకాదళపతిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోవా ఆక్రమణలో పోర్చుగీసు వారికి రాయల నౌకాబలం సహాయం చేసిందని ఫాదర్ హీరాస్ పేర్కొన్నాడు. రాయవాచకం చతుర్విద దుర్గాలను పేర్కొంటోంది. శత్రువులపై రాళ్లురువ్వే దంబోళి అనే యుద్ధ పరికరం ఉన్నట్లు రాశాడు. ద్వంద్వ యుద్ధం, సాము గరిడీలు ఉండేవి.

మత పరిస్థితులు:
    విజయనగర పాలకులు వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య అనే బిరుదు ధరించారు. రాజులు హిందూ మతాభిమానులు అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించారు. సైన్యంలో అన్ని మతాలవారినీ చేర్చుకున్నారు. శ్రీరంగంలోని వైష్ణవులు జైనులను హింసిస్తుంటే బుక్కరాయలు కల్పించుకుని వారి మధ్య సంధి కుదిర్చాడు. దేవరాయలు జైనులకు, ముస్లింలకు ప్రార్థనా సౌకర్యాలు కల్పించాడు. శ్రీశైలంలోని జైనులను శాంతలింగప్ప హింసిస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు వెలుగోటి గని తిమ్మానాయుడిని పంపించి శిక్షించాడు. అళియరామరాయలు రాజధానిలోని తురకవాడలో గోవధను సమ్మతించాడు. కాకతీయుల కాలంలో ప్రారంభమైన స్మార్త మతం రాయల కాలంలో పోషణకు నోచుకుంది. సంగమ వంశీయులు కాలాముఖ శైవులు. వారి కుల దైవం విరూపాక్షుడు. కుల గురువు క్రియాశక్తి ఆచార్యులు. స్మార్త గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం పొందింది. హరిహరరాయలు శృంగేరిని దర్శించి విద్యాతీర్థులకు దానధర్మాలు చేశాడు. మాధవాచార్యులు (బుక్కరాయల మంత్రి), అతడి తమ్ముడు శాయణాచార్యులు వేదాలకు, స్మృతులకు భాష్యాలు రాశారు. మాధవాచార్యులు కర్మ మీమాంస పద్ధతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. అతడు జైమినీయ న్యాయ మాలావిస్తర, యజ్ఞతంత్ర సుధానిధి అనే గ్రంథాలు రచించాడు. రెండో వెంకటపతి రాయల ఆస్థానంలో ప్రముఖ అద్వైత ప్రవక్త అయిన అప్పయ్యదీక్షితులు నివసించాడు.
       సామాన్య ప్రజలు మాత్రం శైవ, వైష్ణవ మతాలను ఆదరించారు. కాలాముఖ శాఖకు పరిమిత ఆదరణే ఉండేది. దేవరాయల కాలం వరకు క్రియాశక్తి కుల గురువుగా ఉన్నాడు. హరిహరుని సోదరుడైన మారప్ప మంత్రి మాధవమంత్రికి కూడా క్రియాశక్తి పండితుడే గురువు.

తుళువ వంశ పాలనా కాలం నుంచి వైష్ణవం రాజాదరణ పొందింది. మధ్వాచార్యులు ఆంధ్రదేశం పర్యటించి గోదావరి తీరంలో శ్యామశాస్త్రి (నరహరితీర్థ), శోభనభట్టు (పద్మనాభతీర్థులు)లను శిష్యులుగా స్వీకరించాడు. మధ్వాచార్యుల అనంతరం ద్వైత గురుపీఠాన్ని అలంకరించింది పద్మనాభ తీర్థులే. నరహరి తీర్థులు శ్రీకూర్మం కేంద్రంగా ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు. విజయనగర కాలంలో ప్రసిద్ధ ద్వైతాచార్యులు మాత్రం వ్యాసతీర్థులే. సాళువ నరసింహుడి గురువు వ్యాస తీర్థులు. ఆంధ్రదేశంలో ప్రచారమైన విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ శాఖ వడగల శాఖ. కృష్ణరాయలు గోవింద దేశికుడిని తొలగించి తాతాచార్యులను రాజగురు పీఠంలో నియమించాడు. వల్లభాచార్యులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించాడు. అళియరామరాయల గురువు కూడా తాతాచార్యులే. దొడ్డయాచార్య అప్పయ్య దీక్షితులను ఓడించి శైవక్షేత్రమైన చిదంబరంలో గోవిందరాజస్వామి పూజోత్సవాలు నిర్వహించాడు. శ్రీరంగరాయల గురువు తిరుమల తాతాచార్యులు. రెండో వెంకటపతి కాలం నుంచి శాసనాల్లో విరూపాక్షుని బదులు వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడి నాణేలపై కూడా శ్రీవేంకటేశాయనమ: అనే లేఖనం కనిపిస్తుంది. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, శ్రీకాళహస్తి నాటి ప్రసిద్ధ దేవాయాలు. కడప జిల్లాలోని పుష్పగిరి వద్ద శృంగేరిస్మార్త మఠ శాఖ ఏర్పడింది. స్మార్త మతస్థులు పంచాయతన దేవతలకు కుమారస్వామిని చేర్చి షణ్మాతా విధానాన్ని పాటించగా, మద్వాచార్యుడి వల్ల హనుమంతుడి పూజకు ఆదరణ పెరిగింది. మహారాష్ట్ర నుంచి విఠోబా ఆరాధన ప్రవేశించింది. నవరాత్రుల్లో జంతువులను బలి ఇస్తారని పేస్ పేర్కొన్నాడు. రాజధానిలో శివరాత్రి నాడు సిడమెక్కేవారని, రథానికున్న ఇనుప గాలాలకు వీపు చర్మం గుచ్చి వేలాడేవారని నికోలోడీ కాంటి రాశాడు. తిరుపతి కొండకు వెళ్లి వింత మొక్కలు మొక్కే భక్తుల గురించి తరిగొప్పల మల్లన్న తన చంద్రభాను చరిత్ర గ్రంథంలో పేర్కొన్నాడు. అరవీటి వంశస్థుల కాలంలో రాబర్ట్ డినోబిలి అనే ఇటాలియన్ తత్వబోధ స్వామిగా పేరు మార్చుకుని క్రైస్తవ మత ప్రచారం చేశాడు.

     రాయల నాణేలపై రాజు పేరు లేదా బిరుదు (కన్నడంలో మాత్రమే) ఒకవైపు; ఎద్దు, ఏనుగు, గద్ద గుర్తులు మరో వైపు ముద్రించారు. ఆలయ ప్రాంగణ గోడలపై గుర్రం ప్రతిమ ఎక్కువగా కనిపిస్తుంది. విజయనగర పట్టణం నిర్మాణానికి ముందే నిర్మించిన పంపావతి ఆలయం విరూపాక్షుడికి అంకితం చేశారు. దీన్ని మొదటి హరిహరరాయలు నిర్మించగా దాని ముందు రంగమండపంను తన పట్టాభిషేకానికి గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు.
 

విద్యాసారస్వతాలు - కళలు:
    అధికార భాష సంస్కృతం అయినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు. శృంగేరి పీఠ గ్రంథాలయ అధిపతి, కవి అయిన కృష్ణభట్టుకు ఈనాములిచ్చి రెండో బుక్కరాయలు గౌరవించాడు. తాళ్లపాక అన్నమాచార్యులు తన కీర్తనలను రాగి రేకులపై రాసి సరస్వతీ గ్రంథాలయంలో భద్రపరిచాడు.

 

సంస్కృత భాషా రచనలు 

విద్యారణ్యస్వామి - ఐతరేయదీపిక, తైతరేయదీపిక, పంచదశి, జీవన్ముక్తి వివేక.
మాధవాచార్యులు - పరాశర మాధవీయం, జైమినీయ న్యాయమాలా విస్తర, సర్వదర్శన సంగ్రహ.
శాయణుడు - వేదార్థ ప్రకాశిక (ధాతువృత్తి) (సత్యార్థ ప్రకాశిక - స్వామి దయానంద సరస్వతి)
వెంకటముఖి - శుల్బమీమాంస (లింగాధ్వరి - వేదార్థ తత్వ నిర్ణయం)
వేదాంతదేశికుడు - తత్వటీక, తాత్పర్య చంద్రిక, న్యాయ సిద్ధాంజనం, యాదవాభ్యుదయం, రామాభ్యుదయం.
వ్యాసతీర్థులు - తర్కతాండవ, తాత్పర్య చంద్రిక, న్యాయామృతం.

అప్పయ్య దీక్షితులు - శైవార్కమణిదీపిక
మాధవ మంత్రి - శైవామ్నాయ సారం
రెండో దేవరాయలు - మహానాటక సుధానిధి
ఉద్దండ కవి - మల్లికామారుత (నాటకం)
గంగాదేవి - మధురా విజయం
తిరుమలాదేవి - వరదాంబికా పరిణయం
అరుణ గిరినాథ డిండిముడు - సోమవల్లీ యోగానంద ప్రహసన
రెండో రాజనాథ డిండిముడు - సాళువాభ్యుదయం
మూడో రాజనాథ డిండిముడు - అచ్యుతరామాభ్యుదయం
శ్రీకృష్ణదేవరాయలు - జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర, ఉషా పరిణ‌యం రసమంజరి, సత్యవధూప్రియతం, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి.
గోవింద దీక్షితులు (రఘనాథ రాయల మంత్రి) - సాహిత్య సుధ
సాయణుడు - ధాతువృత్తి
బోగనాథుడు - ఉదాహరణమాల గ్రంథాలు, అలంకారశాస్త్ర గ్రంథాలు
దేవనభట్టు - సంగీత ముక్తావళి
గోపతిప్ప - తాళదీపిక

లక్ష్మీధరుడు - సంగీత సూర్యోదయం
రఘునాథరాయలు - సంగీత సుధ
    శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో గోదాదేవి, రంగనాథుల ప్రేమ గురించి వివరించింది. తిరుమలాంబ అచ్యుతరాయలు, అతడి ఆస్థాన నర్తకి వరదాంబిక మధ్య గల ప్రేమ గురించి రాసింది.

 

తెలుగు భాషాభివృద్ధి:
     తెలుగు భాషా చరిత్రలో విజయనగర యుగం స్వర్ణయుగం. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు ఆంధ్రవాణికి కనకాభిషేకం చేయించాడు. నాచన సోముడు రెండో బుక్కరాయలచే పంచాకలదిన్నెను అగ్రహారంగా పొందాడు. ఉత్తర హరివంశం గ్రంథాన్ని రచించి హరిహర దేవుడికి అంకితం ఇచ్చాడు. ఉదయగిరి పాలకుడు పూసపాటి బసవరాజుకు, దూబగుంట నారాయణ కవి తన పంచతంత్రాన్ని అంకితం చేశాడు. దగ్గుపల్లి దుగ్గన్న - నచికేతోపాఖ్యానం; నంది మల్లయ, ఘంట సింగయల - ప్రబోధ చంద్రోదయం గ్రంథాలు గంగన్న మంత్రికి అంకితం ఇచ్చారు. సంస్కృత నాటకాన్ని తెలుగు కావ్యంగా రచించిన మొదటి జంట కవులు వీరే. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార శాకుంతలం గ్రంథాలను రచించాడు.
    వాణి నారాణి అని పలికిన పిల్లలమర్రి, అన్నమాచార్యులు సాళువ నరసింహుడి కాలంవారు. ప్రోలుగంటి చెన్నమంత్రి నారసింహ పురాణం, బాలభారతం, సౌరభ చరిత్ర (యక్షగానం)లను రచించి నరసింహుడు దగ్గర అగ్రహారాదులు పొందాడు. 'తెలుగులో ప్రథమ యక్షగానంగా సౌరభ చరిత్ర రచయితగా చెన్నమంత్రి ఆంధ్ర సాహిత్య చరిత్రలో విశిష్ఠ స్థానాన్ని అలంకరిస్తారు' అని ఆరుద్ర పేర్కొన్నాడు.

మల్లయ, సింగయ జంట కవులు తుళువ నరస నాయకుడిని ఆశ్రయించి వరాహ పురాణాన్ని అంకితం ఇచ్చారు. శతలేఖనీ సురత్రాణ బిరుదు పొందిన చరిగొండ ధర్మన్న చిత్రభారతం గ్రంథాన్ని రచించాడు. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రంశిక త్సాలభంజిక గ్రంథాన్ని రచించాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం (భువన విజయం)లో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. ఆస్థాన కవి అల్లసాని పెద్దన మనుచరిత్ర (స్వారోచిత మనుసంభవం) గ్రంథాన్ని రచించి రాయలకు అంకితం చేశాడు. ఇది తెలుగులో ప్రథమ ప్రబంధం. నంది తిమ్మన పారిజాతాపహరణం గ్రంథాన్ని రచించాడు. మాదయగారి మల్లన తన రాజశేఖర చరిత్రను నాదెండ్ల అప్పరుసు (కొండవీడు)కు అంకితమిచ్చాడు. ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకాలను దైవానికి అంకితమిచ్చాడు. కృష్ణరాయ విజయంను కూడా కుమార ధూర్జటి రచించాడు. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం కావ్యాన్ని రచించి గొబ్బూరు నరసరాజుకు అంకితమిచ్చాడు. పింగళి సూరన కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావతీ ప్రద్యుమ్నం అనే గ్రంథాలను రచించాడు. రాఘవ పాండవీయం తెలుగులో మొదటి ద్వ్యర్థి కావ్యం. పెదవెంకటాద్రికి అంకితం ఇచ్చారు. పద్య నవలగా పేర్కొన్న కళాపూర్ణోదయంను కృష్ణభూపతికి అంకితం ఇచ్చారు.
    తెనాలి రామకృష్ణుడి అసలు పేరు గార్లపాటి రామలింగయ్య. నాదెండ్ల గోపరుసు మంత్రి అయిన ఊరదేచయ్యకు అంకితంగా ఉద్భటారాధ్య చరిత్ర గ్రంథాన్ని రామలింగడు రచించాడు. తర్వాత ఘటికాచల మహాత్మ్యం, పాండురంగ మహాత్మ్యంలను రచించి విరూరి వేదాద్రికి అంకితం ఇచ్చాడు. భట్టుమూర్తి లేదా రామరాజ భూషణుడు మొదటి కావ్యం నరస భూపాలీయం లేదా కావ్యాలంకార సంగ్రహం. తర్వాత వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం గ్రంథాలు రచించాడు.

సంకుసాల నరసింహ కవి - కవికర్ణ రసాయన గ్రంథాన్ని, చింతలపూటి ఎల్లన రాధామాధవ కావ్యాన్ని కృష్ణరాయల ఆస్థానంలో రచించారు. నాదెండ్ల గోపరుసు - కృష్ణార్జున సంవాదం పేరుతో గయోపాఖ్యానంను ద్విపదలో రాశాడు. మనుమంచిభట్టు అశ్వలక్షణసారం గ్రంథాన్ని రచించి కంపరాయలు (ఉదయగిరి)కు అంకితం ఇచ్చాడు.
     అరవీటి వంశస్థుల కాలంలో నాయక రాజ్యాలు ఆంధ్రభాషకు ప్రధాన కేంద్రాలయ్యాయి. తంజావూరు యక్షగానానికి, మధుర వచనానికి పేరొందాయి. 132 ఆయుధాలను వర్ణిస్తూ వననప్ప - ఖడ్గ లక్షణం గ్రంథాన్ని రచించాడు. గోపనమంత్రి - సింధుమతీ విలాసం, తిరువెంగళనాథుడు - చొక్కనాథ చరిత్ర, భద్రకవిలింగయ - సానంద చరిత్ర గ్రంథాలను రచించారు. రఘనాథ నాయకుని ఆస్థాన కవి చేమకూర వెంకటకవి - సారంగధర చరిత్ర, విజయవిలాస కావ్యాలను రఘునాథ నాయకుడికి అంకితం ఇచ్చాడు. కృష్ణాధ్వరి - నైషధ పారిజాతం గ్రంథాన్ని, విజయరాఘవుడు - రఘనాథాభ్యుదయం గ్రంథాన్ని రచించాడు. రఘునాథ నాయకుడు - వాల్మీకి చరిత్ర గ్రంథాన్ని రాశాడు. అతడి ఆస్థానంలో రామభద్రాంబ, మధురవాణి అనే కవయిత్రులున్నారు.
     మధురవాణి రాయలతో కనకాభిషేకం పొందింది. విజయ రాఘవుడు చెంగళ్వకాళకవి, రంగాజమ్మలను పోషించాడు. రంగాజమ్మ - మన్నారుదాస విలాసం గ్రంథాన్ని రచించింది. ప్రతాపసింహుడి ప్రియురాలు ముద్దుపళని - రాధికాస్వాంతనం అనే శృంగార కావ్యాన్ని రాసింది. రెండో శరభోజి కాలంలో త్యాగరాజు నివసించాడు. ఇతడిది కాకర్ల వంశం. మధుర నాయకరాజు విశ్వనాథుడి స్థానాపతి - రాయవాచకం గ్రంథాన్ని రచించాడు. ఏకామ్రనాథుడు ప్రతాప చరిత్ర పేరుతో కాకతీయుల చరిత్ర రాశాడు. కాసె సర్వప్ప - సిద్ధేశ్వర చరిత్ర, కామేశ్వర కవి - సత్యభామా స్వాంతనం, విజయరంగ చొక్కనాథుడు - శ్రీరంగ మహాత్మ్యం, మాఘమహాత్మ్యం గ్రంథాలను రచించాడు.

రఘనాథ తొండమాన్ (పుదుక్కోట) - పార్వతీ పరిణయం అనే తెలుగు ప్రబంధాన్ని రచించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న నుదురుపాటి వెంకన్న - ఆంధ్రభాషార్ణవం (తెలుగులో ప్రథమకోశం లేదా నిఘంటువు)ను రూపొందించాడు. కళువె వీరరాజు (మైసూర్) మహా భారతాన్ని తెలుగు వచనంలో రాశాడు.
     విద్యారణ్య మహర్షి తన సంగీతసారం గ్రంథంలో అనేక రాగాలను వివరించాడు. కృష్ణరాయలు కృష్ణ అనే విద్వాంసుడి వద్ద వీణ నేర్చుకున్నాడు. రామయ మంత్రి సర్వమేళా కళానిధి కర్ణాటక సంగీతానికి వేదం లాంటిది. వీణ ప్రధాన వాయిద్యంగా పేరొందింది. వీరనరసింహుడి కాలానికే కూచిపూడి భాగవతులు ప్రాచుర్యంలోకి వచ్చారు.

 

వాస్తు నిర్మాణాలు - కళలు
     ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది. చోళ, చాళుక్య శైలిని అనుసరించారు. ఈ ఆలయాలను సువిశాల ప్రాంగణంలో ఎత్తయిన గోపురాలతో ప్రాకారాల మధ్య గంభీర విమానాలు, దేవీ ఆలయం, రంగ కళ్యాణ మండపాలతో సర్వాంగ సుందరంగా రూపొందించారు. మండపాలు విశాలంగా ఉండి సహస్ర స్తంభ మండపాలుగా ప్రసిద్ధి చెందాయి. పంపావతి ఆలయాన్ని మొదటి హరిహరరాయలు నిర్మించి విరూపాక్షుడికి అంకితమివ్వగా, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయం ముందు రంగమండపం నిర్మించాడు. హంపిలో హజరరామాలయం, విఠలస్వామి దేవాలయాలను నిర్మించాడు. హజరరామాలయం గోడలపై రామాయణ గాథలను శిల్పాలుగా చెక్కారు. విఠలస్వామి ఆలయం విజయనగర వాస్తు నిర్మాణాల్లో మకుటాయమైంది. దీన్నే సప్తస్వర మండపం అంటారు. ఫెర్గూసన్ ఈ ఆలయ గొప్పతనాన్ని పొగిడాడు. దీన్ని రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలకు చిహ్నంగా నిర్మించాడు. ఇండో - ఇస్లామిక్ శైలిలో నిర్మించిన కట్టడం 'పద్మమహల్'. పట్టపుటేనుగుల శాలలో కూడా ఇస్లామిక్ వాస్తు ప్రభావం కనిపిస్తుంది.   

    అచ్యుతరాయల ఉద్యోగి విరూపన్న అనంతపురం జిల్లా లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం వర్ణచిత్రాలకు నిలయం. చిదంబరంలో పార్వతి ఆలయం, కాంచీపురంలో ఏకాంబరనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. రాతి గోపురాలను నిర్మించారు. నాటి చిత్రలేఖనాలు హంపి, సోమపాలెం, లేపాక్షి, తాడిపత్రి మొదలైన చోట్ల కనిపిస్తాయి. విఠలాలయంలో ఉన్నట్లే తాడిపత్రి ఆలయంలో కూడా ఏకశిలారథం ఉంది. లేపాక్షి బసవన్న పెద్ద శిల్పం. సుందరమైన శిల్ప సంపదకు బేలూరు, హళేబీడుల ఆలయాలతో పోటీగా విజయనగర ఆలయాల్లో నిలవగలిగింది ఒక తాడిపత్రియే అని ఫెర్గూసన్ అభిప్రాయం.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంఘ సంస్కరణ - సాంస్కృతిక వికాసం

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 

(1877 - 1923)


* ఈయన 1877, మే 18న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. తల్లిదండ్రులు గంగమ్మ, వెంకట సుబ్బయ్య.

* భువనగిరిలో ప్రాథమిక విద్యను, నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర)లో ఉన్నత విద్యను అభ్యసించారు.

* తెలుగు, మరాఠీ, ఆంగ్లం, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యాన్ని సాధించారు.

* మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానంలో ఉద్యోగం చేస్తూ సాహితీ వ్యాసాôగాన్ని కొనసాగించారు.

* రామాయణంలోని పర్ణశాల మహారాష్ట్రలోని నాసికాత్రయంబకం వద్ద ఉందని బాలగంగాధర్‌ తిలక్‌ చెప్పగా, దాంతో లక్ష్మణరావు విభేదించారు. ఆ పర్ణశాల గోదావరి సమీప ప్రాంతంలో ఉందని నిరూపించారు. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

* తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని రచించారు. ఉత్తమ విజ్ఞానవేత్తగా, రచయితగా, చరిత్రకారుడిగా, సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా, బహుభాషా కోవిదుడిగా పేరొందారు.

1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయం, 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.

* మహారాష్ట్రలో సమాచార్, విజ్ఞాన విస్తార్‌ అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహారాష్ట్ర కవి మెరోపంత్‌ రాసిన భారతాన్ని సరిదిద్దారు. కర్ణ పర్వానికి శుద్ధిప్రతిని తయారుచేసి సంపాదకత్వం వహించారు.

తన సోదరి బండారు అచ్చమాంబతో కలిసి స్త్రీ విద్యావ్యాప్తి, సంఘ సంస్కరణ, సాహిత్యాభివృద్ధిపై తెలుగు జనానా పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. ఈ పత్రికను రాయసం వెంకటశివుడు నడిపారు.

* లక్ష్మణరావు రాసిన తొలి తెలుగు గ్రంథం శివాజీ చరిత్రం.

* హిందూ మహాయుగం - క్రీ.శ.1000, ముస్లిం మహాయుగం - క్రీ.శ.1100 - 

క్రీ.శ.1560 లాంటి వ్యాసాలు రాశారు. ఇవి లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో ప్రచురితమయ్యాయి.

విజ్ఞాన చంద్రికా మండలి 

తెలుగులో అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని, చరిత్ర పరిశోధన, ప్రకృతిశాస్త్ర, చారిత్రక, రాజకీయ ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం దీని లక్ష్యం.

* దీన్ని 1906లో హైదరాబాద్‌లో స్థాపించారు.

స్థాపకులు కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు మొదలైనవారు.

* విజ్ఞానచంద్రికా మండలి ప్రచురించిన మొదటి పుస్తకం ‘అబ్రహం లింకన్‌ చరిత్ర’.

* దీన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు రచించగా, తొలిపలుకు లక్ష్మణరావు రాశారు.

* లక్ష్మణరావు రచనలైన మహా పురుషుల జీవిత చరిత్రలు, రావిచెట్టు రంగారావు జీవిత చరిత్రను ఈ మండలే ప్రచురించింది.

* 190610 మధ్య కాలంలో ఈ మండలి 30కి పైగా గ్రంథాలను ప్రచురించింది. ఇందులో లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారు.

* 1908లో ఈ సంస్థను హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌కు మార్చారు. 1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్‌ను స్థాపించారు.

* గ్రంథ పఠనాన్ని పెంపొందించడం, సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం లాంటి రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా ఈ పరిషత్‌ పనిచేసింది. 

* 1916లో కొవ్వూరులో ‘ఆంధ్రసారస్వత పరిషత్తు’ను ఏర్పాటు చేశారు. దీని స్థాపకుల్లో లక్ష్మణరావు ఒకరు. ఈయన ఇందులో సభ్యుడిగా, కార్యదర్శిగా సేవలు అందించారు.

ఆంధ్రా విజ్ఞాన సర్వస్వం 

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ఆద్యుడు. ఈయన 191213లో ఈ గ్రంథ రచనకు పూనుకొని రచయితగా, ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. అనేక ప్రతులను, పుస్తకాలను చదివి ‘అ’కారంతో మూడు సంపుటాలను ప్రచురించారు. ఇందులో 100 వ్యాసాలు ఉన్నాయి. వీటిలో 40 వ్యాసాలను లక్ష్మణరావు రచించారు. ఈయన 1923, జులై 12న కందుకూరి వీరేశలింగం చనిపోయిన ఇంట్లోనే మరణించారు. 

* లక్ష్మణరావు తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు, డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి 

విషయానుక్రమంగా సంపుటాలు ప్రచురించారు. ‘‘తెలుగు భాషా సమితి’’ ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. మొత్తం 14 సంపుటాలు ప్రచురితం అయ్యాయి. 

* 193841 మధ్యకాలంలో ‘ఆంధ్రా విజ్ఞానం’ పేరుతో 5 సంపుటాలను ప్రచురించారు. ఇది 1986లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం అయ్యింది.

సంఘసంస్కరణ - స్వాతంత్య్రోద్యమం 

లక్ష్మణరావు భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు తెలిపి, 1906లో కలకత్తా కాంగ్రెస్‌ సభలో పాల్గొన్నారు. 1907లో కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా పనిచేశారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంటరానితనం, అసమానతల నివారణకు కృషి చేశారు. సముద్రయానం లాంటి వాటిని ప్రోత్సహించారు.

* హరిజనులకు వయోజన విద్యను బోధించారు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం తన సోదరి అచ్చమాంబతో కలసి అనేక వ్యాసాలు రాశారు, ప్రసంగాలు చేశారు.

* బాలబాలికలకు ప్రాథమిక విద్యను మాతృ భాషలోనే బోధించాలని తెలిపారు. ‘దేశ భాషల్లో శాస్త్రపఠనం’ అనే వ్యాసాన్ని ప్రచురించి వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ ఈయన రచనల్లో గ్రాంథిక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

* లక్ష్మణరావు కృషి వల్లే తెలంగాణ ప్రాంతంలో తెలుగుభాషా వికాసానికి పునాదులు పడ్డాయి. ఈయన ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో వాడారు.

* విజ్ఞాన సర్వస్వం మొదట తెలుగులోనే ప్రారంభం కాగా, తర్వాత ఇతర భాషలకు విస్తరించింది.

* ప్రభుత్వం 2014లో కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్‌ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు భాషకు విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.

కొండా వెంకటప్పయ్య 

(1866-1949)

* వెంకటప్పయ్య 1886, ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రత్యేక ఆంధ్రోద్యమానికి ఆద్యుడు. గుంటూరు, మద్రాస్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

* 1902లో వాసు నారాయణరావుతో కలసి ‘కృష్ణాపత్రిక’ ప్రచురణను ప్రారంభించి, 1905 వరకు నడిపారు. తర్వాత ఈ పత్రిక సంపాదకత్వాన్ని ‘ముట్నూరు కృష్ణారావు’కు అప్పగించారు.

* 1910లో బందరులో జాతీయ కళాశాలను ప్రారంభించారు.

* ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును మొదటగా ప్రతిపాదించారు.

* ఆంధ్రాలో గాంధీజీ పర్యటన కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది.

* పెదనందిపాడులో సహాయ నిరాకరణ, పన్నుల ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.

* 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభల్లో వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వీరు స్వల్పకాలం మాత్రమే ఈ పదవుల్లో ఉన్నారు. 

* 1933లో గాంధీజీ ఆంధ్రాలో హరిజన యాత్ర సాగించారు. కొండా వెంకటప్పయ్య అనేక వేల రూపాయిలు విరాళాలుగా సేకరించి వాటిని హరిజన నిధికి ఇచ్చారు. 

* వెంకటప్పయ్య ఆంధ్రాలో మొదటి నియంతగా పేరు పొందారు.

* 1929 సైమన్‌ కమిషన్‌ రాక, 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుకెళ్లారు. ‘దేశభక్త’ అనే బిరుదు పొందారు.

* గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. కులవివక్షను ఖండించారు.

* ‘డచ్‌ రిపబ్లిక్‌’ అనే గ్రంథాన్ని రాశారు. ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే మరో గ్రంథాన్ని రచించారు. ‘శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి’ అనే భక్తి శతకాన్ని రచించారు. స్వీయ చరిత్రను రాసుకున్నారు. 

* 1949, ఆగస్టు 15న మరణించారు.

త్రిపురనేని రామస్వామి చౌదరి 

(1887-1943)

త్రిపురనేని రామస్వామి చౌదరి న్యాయవాది, హేతువాది, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, కవి, సాహితీవేత్త, మానవతావాదిగా గుర్తింపు పొందారు.

* 1887, జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జన్మించారు.

* కారెంపూడి కథనం, కురుక్షేత్ర సంగ్రామం అనే నాటికలను రచించారు.

* తెనాలిలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. సామాజిక అన్యాయాలను, అరాచకాలను ప్రశ్నించి, సాంఘిక విప్లవాలకు నాంది పలికారు. 

* రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర 

విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి భావాలను, వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌కి వెళ్లి న్యాయ శాస్త్రం, ఆంగ్లంపై పట్టు సాధించారు. 

* స్మృతులు, పురాణాలు, మతం, కుల వ్యవస్థ, సామాజిక అన్యాయాలపై ఉద్యమించారు. యజ్ఞ యాగాదులు, కర్మకాండలను ఖండించారు.

* 1925లో జస్టిస్‌ పార్టీ నుంచి పోటీ చేసి తెనాలి పురపాలక సంఘం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

తన నివాసాన్ని (సూతాశ్రమం) రాజకీయ, సాహిత్య చర్చలకు వేదికగా మార్చారు. దీన్ని 1945లో ఎం.ఎన్‌.రాయ్‌ సందర్శించారు.

* అనేక వివాహాలకు స్వయంగా పౌరోహిత్యం వహించారు. సంస్కృతంలోని పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించారు. అచ్చులో సరళమైన ‘వివాహవిధి’ అనే పద్ధతిని రూపొందించారు.

* 1930లో కుప్పుస్వామి శతకాన్ని రచించారు. అదే ఏడాది శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ‘వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడీ’ అనే ప్రముఖ గీతాన్ని రాశారు.

* సాహిత్యానికి ఈయన చేసిన కృషికి ఆంధ్ర మహాసభ ‘కవిరాజు’ బిరుదుతో సత్కరించింది.

* పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఈయన పేరిట ‘కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి’ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. 

* 1987లో భారత ప్రభుత్వం ఈయన స్మారక చిహ్నంగా ‘తపాలా బిళ్ల’ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

* ఈయన సూత పురాణం, శంభుకవధ, సూతాశ్రమ గీతాలు, భగవద్గీత, రాణాప్రతాప్, ఖూనీ, గోపాలరాయ శతకం, కొండవీటి పతనం, పల్నాటి పౌరుషం, వివాహవిధి మొదలైన రచనలు చేశారు.

* 1943, జనవరి 16న మరణించారు.

* ఈయన పెద్ద కుమారుడు త్రిపురనేని గోపిచంద్‌ ‘అసమర్థుడి జీవయాత్ర’ అనే నవలను రాశారు. ఇది తెలుగులో మొదటి మనస్తత్వ నవల. ఇది తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది.

శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయం

తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు 1901, సెప్టెంబరు 1న దీన్ని స్థాపించారు. దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి కలసి హైదరాబాద్‌లో అప్పటి రెసిడెన్సీ బజార్‌లోని రావిచెట్టు రంగారావు నివాసంలో ఏర్పాటు చేశారు. 

* తెలుగు భాషాభివృద్ధికి అధునాతన పద్ధతుల్లో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. 

* దీనికి ఆదిరాజు వీరభద్రరావు లాంటివారు కార్యదర్శులుగా పనిచేశారు.

ఆంధ్ర పరిశోధక మండలి

దీన్ని 1922, డిసెంబరు 27న హైదరాబాద్‌లో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను, అముద్రిత గ్రంథాలను ప్రచురించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ సంస్థ పేరును ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’గా మార్చారు. 

Posted Date : 16-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తొలి సమాజంలో ఆ కానుకలపై హక్కులు ఆడవారికే!

తొలి సమాజం - మతోద్యమాలు

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే సనాతన సంస్కృతి వర్ధిల్లి హిందూ మతం విస్తరించింది. అనంతరం అభ్యుదయభావాలతో కూడిన బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. పురాతన ధర్మంలోని లోపాలను, వర్ణం, మత ఆధారిత వివక్షలను ప్రశ్నించాయి. ఈ పరిణామ క్రమాన్ని, సమాజంలో వచ్చిన మార్పులను అభ్యర్థులు తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుల జీవిత విశేషాలు, వారి బోధనలు, మతవ్యాప్తి పద్ధతులు, సంబంధిత ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. సత్యాన్వేషణకు స్థిరనివాసం లేకుండా ఒక గ్రామం నుంచి మరొక గ్రామం; ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉండేవారిని ఏమంటారు?

1) పరివ్రాజకులు        2) భిక్షువులు    

3) తిరిగేవాళ్లు       4) పైవారందరూ


2. కిందివారిలో పరివ్రాజకులు కానివారు?

1) మక్కలి గోసల        2) అజిత కేశకంబలి

3) కౌటిల్యుడు        4) గౌతమ బుద్ధుడు


3. ‘పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచన ఎలా’ .... అని అన్వేషణ చేసినవారు?

1) వర్ధమాన మహావీరుడు    2) అజిత కేశకంబలి

3) బుద్ధుడు             4) గోసల


4. ‘పాపాల నుంచి విముక్తిని పొందడానికి శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి’ అని చెప్పినవారు-

1) వర్ధమాన మహావీరుడు     2) కంబలి     

3) బుద్ధుడు         4) గోసల


5. ‘ప్రపంచమంతా దుఃఖమయం.. దుఃఖాన్ని జయించడం ఎలా’ అని అన్నదెవరు?

1) వర్ధమాన మహావీరుడు   2) అజిత కేశకంబలి

3) గౌతమ బుద్ధుడు         4) మక్కలి గోసల


6. గౌతమ బుద్ధుడు ప్రబోధించిన మార్గం?

1) ప్రారంభ మార్గం        2) మధ్యేమార్గం

3) అంతిమ మార్గం        4) బోధనలు


7. బుద్ధుడి అనుచరులు అతడి బోధనలను ఏ పేరుతో సంకలనం చేశారు?

1) గ్రంథాలు       2) బోధనలు  

3) త్రిపీఠకాలు       4) పంచవ్రతాలు


8. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఆర్యులు ఏ ప్రాంతమంతటా విస్తరించారు?

1) మధ్య భారతదేశం   2) ఉత్తర భారతదేశం

3) దక్షిణ భారతదేశం   4) నైరుతి భారతదేశం


9. క్రీ.పూ.6వ శతాబ్దంలో 60 మత శాఖలు ఉన్నాయని పేర్కొన్న చరిత్రకారులు?

1) ఆర్‌.డి.బెనర్జీ      2) సర్‌ జాన్‌ మార్షల్‌

3) నీలకంఠ శాస్త్రి      4) రోమిల్లా థాపర్‌


10. పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు ఉంది. వాటిలో తప్పుగా జత చేసింది? 

1) బ్రాహ్మణులు తల    2) క్షత్రియులు దేహం

3) వైశ్యులు పొట్ట 4) శూద్రులు పాదాలు


11. గోత్రం అనే పదం ఏ కులం నుంచి పుట్టింది?    

1) బ్రాహ్మణ  2) క్షత్రియ  3) వైశ్య  4) శూద్ర


12. గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబంధించింది?

1) ఆవు   2) ఎద్దు   3) పులి   4) పాము


13. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి?    

1) 7     2) 8      3) 6      4) 4


14. కిందివాటిలో తొలి సమాజ కాలానికి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం?

ఎ) రక్త సంబంధీకులను వివాహం చేసుకునే ఆచారం ఉండేది కాదు.

బి) కులం కుటుంబాలను, వంశం పుట్టుకను తెలియజేస్తుంది.

సి) పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది.

డి) కన్యాదానం చేయడం ఆచారంగా ఉండేది.

1) బి మాత్రమే       2) ఎ మాత్రమే

3) బి, డి         4) ఎ, డి


15. బహు భార్యత్వం ఉండటాన్ని ఏమంటారు?

1) పాలిగమీ       2) పాలియాండ్రి

3) ఎండోగమీ       4) ఎక్సోగమీ


16. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) తొలి సమాజ కాలంలో పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయమవుతుంది.

బి) తొలి సమాజ కాలంలో వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్‌ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి.

సి) శూద్రులు ద్విజులకు బానిసలుగా, కూలీలుగా ఉండేవారు.

డి) తొలి సమాజాల కాలంలో వర్ణ ధర్మాలను బట్టి గౌరవం, పదవులు ఉండేవి కావు

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, సి, డి


17. తొలి సమాజ కాలంలో వ్యవసాయదారులుగా పురోగమించిన వర్ణం? 

1) వైశ్యులు       2) శూద్రులు   

3) క్షత్రియులు       4) బ్రాహ్మణులు


18. తొలి సమాజ కాలంలో పురుషులు, స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని కలిగి ఉండేవారు (వరుసగా)?

1) 6 - 7   2) 7 - 6   3) 8 - 7   4) 8 - 6


19. తొలి సమాజ కాలంలో వివాహ సందర్భంలో స్త్రీకి ఇచ్చే కానుకలపై ఎవరికి హక్కు ఉండేది?    

1) భర్తకు              2) స్త్రీకి మాత్రమే 

3) భార్యాభర్తలిద్దరికీ       4) స్త్రీ తల్లిదండ్రులకు


20. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?

1) ఎండోగమీ       2) పాలియాండ్రి  

3) పాలిగమీ       4) ఎక్సోగమీ


21. బౌద్ధమత గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఎన్ని మతాలుండేవి?

1) 60     2) 62     3) 63    4) 363


22. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని చెప్పినవారు?

1) బుద్ధుడు         2) వర్ధమాన మహావీరుడు   

3) మక్కలి గోసల     4) ఆరుణి


23. పురాణ కశ్యపుడు ఏ వ్యక్తికి గురువు?

1) మక్కలి గోసల       2) వర్ధమానుడు   

3) బుద్ధుడు       4) ఉద్దాలక


24. కర్మ సిద్ధాంతాలను నమ్మని మతం?

1) హిందూ       2) ఇస్లాం   

3) అజీవక        4) బౌద్ధ, జైన


25. లోకాయుతులు లేదా చార్వాకుల మత శాఖ స్థాపకుడు?

1) బృహస్పతి       2) అజిత కేశకంబలి 

3) పకుద కాత్యాయన       4) గౌతముడు


26. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన మతం-

1) బౌద్ధమతం       2) జైనమతం       

3) చార్వకమతం       4) హిందూమతం


27. లోకాయుత మత ప్రధాన ప్రచారకుడు

1) చార్వాకుడు       2) బృహస్పతి   

3) గోసల       4) అజితకేశ కంబలి


28. లోకాయుతులు చెప్పిన వాస్తవిక భౌతిక వాదం ఏ శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది?

1) భూగోళశాస్త్రం       2) గణితశాస్త్రం   

3) సామాన్య విజ్ఞానశాస్త్రం    4) పౌరశాస్త్రం


29. రుగ్వేద శ్లోకాల్లో ప్రస్తావించిన జైనమత తీర్థంకరులు?

1) వృషభనాథుడు, వర్ధమానుడు       2) వర్ధమానుడు, పార్శ్వనాథుడు

3) వృషభనాథుడు, అరిష్టనేమి   4) అరిష్టనేమి, వర్ధమానుడు


30. కిందివాటిని జతపరచండి.

1) ఒకటో తీర్థంకరుడు ఎ) వర్ధమాన మహావీరుడు
2) రెండో తీర్థంకరుడు బి) అరిష్టనేమి
3) 23వ తీర్థంకరుడు సి) వృషభనాథుడు
4) 24వ తీర్థంకరుడు డి) పార్శ్వనాథుడు
  ఇ) అజితనాథుడు

1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ     2) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

3) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


31. కిందివాటిలో సరికానిది?

ఎ) వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.450లో జన్మించాడు.

బి)  వర్ధమాన మహావీరుడు కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు.

డి) వర్ధమాన మహావీరుడి వంశం జ్ఞాత్రిక.

1) ఎ, సి      2) ఎ, డి   

3) ఎ మాత్రమే       4) సి మాత్రమే


32. మహావీరుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడి వయసు ఎన్నేళ్లు?

1) 29     2) 40    3) 30    4) 39 


33. వర్ధమాన మహావీరుడు ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 29     2) 10    3) 12    4) 7


34. వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో కైవల్యాన్ని పొందిన ప్రాంతం?

1) కుందగ్రామం - వేపవృక్షం     2) జృంభిక గ్రామం - సాలవృక్షం

3) కుశీనగరం - మర్రివృక్షం 4) పావపురి - రావివృక్షం


35. వర్ధమాన మహావీరుడి (జైనమతం) పంచ వ్రతాల్లో లేనిది?

1) అస్తేయా, అపరిగ్రహ     2) జీవహింస చేయరాదు 

3) అసత్యం ఆడరాదు     4) బ్రహ్మచర్యం పాటించరాదు


36. జైన మతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) సరైన క్రియ     2) సరైన నమ్మకం 

3) సరైన జ్ఞానం     4) సరైన శీలం


37. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని ఏమంటారు?

1) మధ్యేమార్గం     2) సామ్యవాదం 

3) స్వాదవాదం     4) తపస్సు


38. మహావీరుడి శిష్యుల సంఖ్య?

1) 9     2) 10     3) 11     4) 12


39. మహావీరుడి శిష్యులను ‘గాంధారులు’ అని అంటారు. వారిలో ముఖ్యమైనవాడు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) సధాకర శాస్త్రి 

3) తులసీదాస్‌     4) ఆర్య సుధారామన్‌


40. వర్ధమాన మహావీరుడి తర్వాత జైన మతం కింది ఏ విధంగా విడిపోయింది?

1) తీర్థంకరులు - దిగంబరులు     2) శ్వేతంబరులు - గాంధారులు

3) శ్వేతంబరులు - దిగంబరులు     4) శ్వేతంబరులు - తీర్థంకరులు


41. ‘సృష్టిలో ఉన్న ప్రతివాటికి ఆత్మ ఉంటుంది’ అని బోధించిన మతం-    

1) బౌద్ధం  2) హిందూ  3) జైనం  4) అజవిక


42. జైనమత సమావేశాలు జరిగిన ప్రాంతాలు, వాటి అధ్యక్షులను పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.

ఎ) ఒకటో సమావేశం - పాటలీపుత్రం - స్థూల భద్ర

బి) రెండో సమావేశం - వల్లభి - దేవార్ధి క్షమాశ్రమణ

1) ఎ సరైంది, బి సరికాదు         2) బి సరైంది, ఎ సరికాదు

3) ఎ, బిలు రెండూ సరైనవి     4) ఎ, బిలు రెండూ సరికావు


43. జైనమత ప్రచారానికి సహాయం చేసిన మగధ రాజు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) ఆరో బిందుసారుడు

3) అజాత శత్రువు     4) మహాపద్మనందుడు


44. జైనమతాన్ని పోషించిన ప్రముఖ రాజవంశీయులు?

1) కళింగ, గాంగులు  2) కదంబులు, చాళుక్యులు 

3) రాష్ట్ర కూటులు    4) పైవారందరూ


45. జైనమతంలో చేరిన సామాజిక వర్గం?

1) వ్యవసాయదారులు     2) వ్యాపారులు 

3) దళితులు     4) క్షత్రియులు



సమాధానాలు

1-4; 2-3; 3-1; 4-1; 5-3; 6-2; 7-3; 8-2, 9-4; 10-3; 11-1; 12-1; 13-2; 14-1; 15-2; 16-1; 17-2; 18-2, 19-2; 20-4; 21-2; 22-3; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-3, 29-1; 30-1; 31-3; 32-3; 33-3; 34-2; 35-4; 36-1; 37-3; 38-3, 39-4; 40-3; 41-3; 42-3; 43-1; 44-4; 45-2.
 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 03-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చోళులు -పరిపాలనా విధానం

రాజు 

* చోళులు రాచరిక విధానాన్ని అనుసరించారు. రాజు కేంద్ర ప్రభుత్వానికి అధిపతి, సర్వాధికారి. ఇతడ్ని ‘దేవరాజు’గా పిలిచేవారు. 


రాజును దైవాంశ సంభూతుడిగా భావించే వారు. వారి పేర్లతో దేవాలయాలు నిర్మించిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు తొండమనాడు వద్ద ఉన్న అదిత్వేశ్వర, రాజేశ్వర దేవాలయాల్లో రాజులతోపాటు రాణుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. 


రాచరికం వంశపారంపర్యంగా ఉండేది. యువరాజులు పాలనలో సాయం చేసేవారు. రాజుకు సలహాలు ఇచ్చేందుకు మంత్రి పరిషత్‌ ఉండేది. ‘రాజుగారు’ అనే పురోహితుడు; ‘అదిగరైగళ’ అనే ఉద్యోగుల సభ; పెరుండరమ్, సిరున్‌ తరమ్‌ అనే ఉద్యోగవర్గాలు రాజుకు సాయం చేసేవి. 


మంత్రి పరిషత్‌: మంత్రి పరిషత్‌లో ఓళయనాయకన్‌ (కార్యదర్శి), ఉన్నత ఉద్యోగులు (పెరుండరమ్‌), చిన్న ఉద్యోగులు (సిరున్‌ తరమ్‌), వివిధ తరగతుల ఉద్యోగులు (కోరుమిగల్‌ లేదా పనితుక్కల్‌) రాజుకు పాలనలో సాయం చేసేవారు. దీని గురించి తిరుముక్కడల్‌లోని వీరరాజేంద్ర శాసనంలో ఉంది. మంత్రులు, ఉన్నతోద్యోగులకు భూములను ఇనామ్‌గా ఇచ్చేవారు.


ఆదాయ-వ్యయాలు


భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం. చోళులు నీటిపారుదల సౌకర్యం కల్పించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.


* రాజరాజ కాలంలో పంటపై 1/3వంతు పన్ను ఉండగా, తర్వాతి రాజులు 1/6 వంతు వసూలు చేశారు. వివిధ రకాల వృత్తి పన్నులు ఉండేవి. 


తరైయిరై (మగ్గం పన్ను), సెక్కెరై (తైలిక వారిపై పన్ను), తట్టార్‌ పొట్టం (స్వర్ణకారులపై పన్ను) లాంటివి వృత్తి పన్నులు. వళక్కునీర్‌ పట్టం (నీటి వనరులు), అంగాడిపట్టం (సంతలు), శెట్టిరామ్‌ (వర్తక సుంకాలు), ఉప్పాయం (ఉప్పు), పొడికావలి (రక్షకభట పన్ను) లాంటి పన్నులు వసూలు చేశారు. భూమి శిస్తు వివరాలను ‘వరిన్‌ - పొట్టగమ్‌’ అనే రికార్డులో పొందుపరిచేవారు. పన్నులు ఎక్కువగా ఉండేవి. కులోత్తుంగ చోళుడు తన హయాంలో కొన్ని పన్నులు రద్దు చేశాడు. 


ఆదాయంలో ఎక్కువ భాగం సైన్య పోషణకు, ఉద్యోగుల జీతాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు.


న్యాయపాలన


రాజే సర్వోన్నత న్యాయాధికారి. గ్రామాల్లో ‘న్యాయత్తార్‌’ అనే గ్రామసభ తగాదాలను పరిష్కరించి, తీర్పులు ఇచ్చేది. శిక్షలు కఠినంగా ఉండేవి.


రాజ్యపాలనా విభాగాలు


పాలనా సౌలభ్యం కోసం చోళులు రాజ్యాన్ని మండలాలు (రాష్ట్రాలు), వలనాడులు (జిల్లా), నాడులు (సమితి), గ్రామాలు (కుర్రమ్‌ లేదా కొట్టమ్‌)గా విభజించారు. 


రాజరాజ చోళుడి కాలంలో 8 మండలాలు ఉండేవి. వీటికి ‘రాజప్రతినిధి’ ఉండేవాడు. వలనాడుల అధికారులను ‘నాడు ఉదయన్‌’, ‘నాడు కిలవన్‌’, ‘నలవన్‌’ అనేవారు. 


‘నట్టార్‌’ అనే స్వపరిపాలనా సభ ఉండేది. పెద్ద పట్టణాలకు ‘నగరత్తాల్‌’ అనే నగర సభ ఉండేది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వివిధ అధికారులు రాజుకు పాలనలో తోడ్పడేవారు.


చోళుల స్థానిక స్వపరిపాలన


దీన్నే ‘గ్రామపాలన’ అని కూడా అంటారు. పరాంతక చోళుడి ‘ఉత్తర మేరూర్‌’ శాసనంలో ఈ విషయాలు ఉన్నాయి. ఇతడు ఈ శాసనాన్ని కాంచీపురంలోని ఉత్తర మేరూర్‌ - వైకుంఠ పెరుమాళ్‌ ఆలయంలో వేయించాడు. ఇతడు ఆలయం బయటి గోడలపై వివిధ శాసనాలు చెక్కించాడు. కులోత్తుంగుడి శాసనాల్లోనూ దీని గురించిన వివరాలు ఉన్నాయి. 


చోళుల కాలంలో గ్రామాలు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండేవి. ప్రతి గ్రామానికి ‘గ్రామసభ’ ఉండేది. ఇందులో ప్రజలంతా సభ్యులుగా ఉండేవారు. 


అప్పటి గ్రామాల్లో ఉన్న సభను ‘పెరుంగూర్‌’ అని అందులో సభ్యులను ‘పెరమక్కల్‌’ అని పిలిచేవారు. 


చోళుల శాసనాల్లో మూడు రకాల సభల గురించి వివరించారు. అవి:


1. ఉర్‌: బ్రాహ్మణేతర రైతు ప్రతినిధులు ఇందులో సభ్యులు.


2. సభ: బ్రాహ్మణులు సభ్యులుగా ఉంటారు. ఇవి బ్రాహ్మణులు నివసించే అగ్రహారాల్లో ఉంటాయి.


3. నగరం: వర్తక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.


పరిపాలనా సౌలభ్యం, సక్రమ గ్రామపాలన కోసం  చోళులు ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. వీటిని ‘కుడుంబులు’ అంటారు. ప్రతి కుడుంబు నుంచి ఒక సభ్యుడ్ని గ్రామసభకు ఎన్నుకునేవారు. సభ్యుడిగా ఎన్నికయ్యే వ్యక్తికి కొన్ని అర్హతలు, అనర్హతలు నిర్దేశించారు. అవి:


ఎన్నిక విధానం: అర్హులైన సభ్యులందరినీ గుర్తించి ‘మహాసభ’ (ప్రజల) సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక విధానాన్ని ‘కుడువోలై’ అంటారు. ప్రతి గ్రామానికి 30 మంది సభ్యులను ఎన్నుకుంటారు. లాటరీ పద్ధతిలో ఎన్నిక ఉంటుంది. వార్డులకు పోటీచేసే వ్యక్తుల పేర్లు చీటీల్లో రాసి ఒక కుండలో వేసి బాలుడు/ బాలికతో వాటిని తీయించి అందరి సమక్షంలో ఆ పేర్లను చదువుతారు. వారు గ్రామసభకు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.


ఉపసంఘాలు, ఎన్నుకునే సభ్యుల సంఖ్య గ్రామాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎన్నికైన అభ్యర్థుల్లో 12 మంది జ్ఞాన వృద్ధులు సంవత్సర వారియం (వార్షిక కమిటీ)లో సభ్యులుగా ఉండేవారు. మిగిలిన వారిలో అనుభవం ఉన్న 12 మందిని ఉద్యాన కమిటీలో, మిగిలిన 8 మంది సభ్యులను చెరువుల కమిటీలో నియమించేవారు.


చోళుల గ్రామపాలనలో 6 సంఘాలు ఉండేవి. అవి: 


1. గ్రామ వ్యవహారాలు 


2. చెరువుల అజమాయిషి (పరివారియం) 


3. ఉద్యానవనాల పెంపకం (తోటవారియం) 


4. దేవాలయ నిధుల నిర్వహణ 


5. నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడం 


6. న్యాయవిచారణ సంఘం. 


ప్రతి కమిటీలో అయిదుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం ఏడాది.


ఈ సంఘాలు గ్రామస్థాయిలో పన్నులు విధించడం - వసూలు చేయడం, వ్యవసాయ, భూతగాదాలు తీర్చడం, ఇంకా అన్ని రకాల గ్రామ వ్యవహారాలను నిర్వహించేవి. 


గ్రామరక్షణకు ‘పాడికావలికూలి’ అనే పన్నును రాజుకు చెల్లించేవారు. ఈవిధంగా గ్రామాలు పూర్తిగా రాజు ఆధ్వర్యంలో స్వతంత్రపాలన సాగించేవి. గ్రామసభ సార్వభౌమాధికారం అనుభవించేది.


అర్హతలు:


* 1/4 వంతు ‘వెలి’ అనే భూమిని కలిగి ఉండాలి. అంటే 1.5 ఎకరాల భూమి.


* సొంత ఇల్లు ఉండాలి.


* 35-70 ఏళ్ల వయసు ఉండాలి.


అనర్హతలు:


* గత మూడేళ్లలో సభ్యులుగా ఎన్నికైనవారు తిరిగి పోటీచేయకూడదు.


* ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగ్గా సమర్పించని వ్యక్తి, అతడి బంధువులు సభ్యులుగా ఎన్నికల్లో పోటీచేయకూడదు.


* అక్రమంగా, అన్యాయంగా ఆస్తులు సంపాదించినవారు అనర్హులు.


* పంచమహాపాపాలు చేసినవారు, వారి బంధువులు కూడా అనర్హులు.


* మానసిక రుగ్మతలు ఉండి, నిషిద్ధ ఆహారం స్వీకరించేవారు అనర్హులు. 


* చెడు వ్యసనాలు ఉండేవారు అనర్హులు.


సైనిక పాలన


చోళుల సైన్యంలో అశ్వ, గజ, పదాతి, నౌకా దళాలు ఉండేవి. వీరి సైన్యాన్ని ‘మున్రుస్తకాయ్‌’, ‘మహాసేనాయ్‌’ అని పిలిచేవారు. నౌకాదళానికి సైన్యంలో అత్యంత ప్రాధాన్యం ఉండేది. సైనికులు ఉండే స్థానాన్ని ‘కడగం’ అని, రాజు అంగరక్షక దళాన్ని ‘వెలైకార్‌’ అని అంటారు. సైనిక స్థావరాలు సుమారు 70 వరకు ఉండేవి. సైనిక పాలనను కైక్నొలుర్‌ అనేవారు. సైన్యం మొత్తానికి ‘కైక్కొలన్‌’ లేదా ‘శ్కెంకుండర్‌’ అధిపతి. చోళుల కాలంలో 60 వేల గజబలం, 1,50,000 వేల కాల్బలం ఉండేవి. అరేబియా నుంచి మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకునేవారు. సైన్యంలో ‘నాయక’, ‘సేనాపతి’ లేదా ‘మహాదండనాయక’ అనే హోదాలు ఉండేవి. యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించేవారికి ‘క్షత్రియ శిఖామణి’ అనే బిరుదు ఇచ్చేవారు.


‘‘భారతదేశంలో మొట్టమొదట సముద్ర విధానాన్న్బి(Oceanic policy) అనుసరించింది చోళులు’’ - కె.ఎం.ఫణిక్కర్‌


 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాకతీయ సామ్రాజ్యం

  
త్రిలింగ దేశంలో ఘన చక్రవర్తులు!
 

మధ్యయుగంలో తెలుగు జాతిని, తెలుగు నేలను ఏకం చేసి జనరంజకంగా పరిపాలించిన కాకతీయులు శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. ఆంధ్ర సంస్కృతికి సమగ్రరూపాన్ని అందించారు. తొలుత గ్రామస్థాయి నాయకులుగా, తర్వాత పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉన్న వీరు అంచలంచెలుగా ఎదిగి చక్రవర్తులుగా నిలిచారు. ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని నలు దిక్కుల్లో చాటారు. ధీరులుగా, పోరాటయోధులుగా, పాలనాదక్షులుగా, రాజనీతిజ్ఞులుగా నిలిచిన కాకతీయ చక్రవర్తుల విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆవిర్భావం నుంచి  పతనం వరకు కాకతీయ రాజ్యం, పాలకులు, నాటి పొరుగు రాజ్యాలతో వారు సాగించిన స్నేహాలు, శతృత్వాలు, చేసిన యుద్ధాలపై అవగాహన పెంచుకోవాలి.

  ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. శాతవాహనుల తర్వాత వీరు ఆంధ్ర దేశాన్నంతా పరిపాలించారు. కవిపండితులను పోషించి, లలితకళలను ప్రోత్సహించారు. ‘ఆంధ్రులు’, ‘ఆంధ్రదీశదీశ్వర’ అనే బిరుదులు పొందారు. వీరి రాజ్యాన్ని ‘త్రిలింగదేశం’ అని అంటారు. అంటే కోస్తాంధ్రలో ద్రాక్షారామం, రాయలసీమలో శ్రీశైలం, తెలంగాణలో కాళేశ్వరం మధ్య ఉన్న ప్రాంతం.


కాకతీయుల రాజ్య సరిహద్దులు:

* తూర్పు - బంగాళాఖాతం 


* పశ్చిమ - తూర్పు కర్ణాటక 


* దక్షిణం -  ఉత్తర తమిళనాడు  


* ఉత్తర - దక్షిణ ఒడిశా తమిళనాడు


కాకతి పదానికి గుమ్మడి లేదా కుష్మాండినీ అని అర్థం ఉంది. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల వీరికి కాకతీయులనే పేరు వచ్చిందని అంటారు. అలాగే కర్ణాటకలోని కాకతి అనే కోటను పరిరక్షించడం వల్ల ఆ విధంగా పిలిచారని, తమిళనాడులోని కాకతీపురం అనే ప్రాంతం నుంచి రావడం వల్ల కాకతీయులుగా మారారని కూడా చరిత్రలో ఉంది.


 కాకతీయుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన శాసనం మాగల్లు తామ్ర శాసనం  దానిని వేయించింది తూర్పు చాళుక్య రాజు అయిన దానార్ణవుడు. కాకతీయులు మొదటగా నిర్వహించిన పదవి రట్టడి. అంటే గ్రామపెద్ద. వీరు రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు. ఈ వంశపు మూలపురుషుడు కాకర్త్య గుండన.


కాకర్త్య గుండన: కాకతీయ వంశ మూలపురుషుడు. రాష్ట్ర కూటరాజు అయిన మూడో కృష్ణుడి సేనాని. సామంతుడిగా కొరివి ప్రాంతాన్ని పాలించాడు. రెండో తైలపుని సేనాని మిరియాల ఎర్రనతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఇతడి కుమారుడు మొదటి బేతరాజు.


మొదటి బేతరాజు (995-1052): ఇతడి బిరుదు కాకతి పురాధినాథ. గుండన చనిపోయే సమయానికి బేతరాజు చిన్నవాడు. దీంతో రాజ్య సంరక్షణ భారం మేనత్త కామసాని, ఆమె భర్త మిరియాల ఎర్రభూపతిపై పడింది. ఈ విషయం గురించి గూడూరు శాసనం, సిద్ధేశ్వర చరిత్ర గ్రంథం వివరిస్తున్నాయి. ఇతడు పశ్చిమ చాళుక్యులకు సామంతుడు. హనుమకొండను పరిపాలించాడు. దీనికి ఆధారం శనిగరం, ఖాజీపేట శాసనాలు. కాకతీయ రాజు అయిన బేతరాజును పదవీభ్రష్డుడిని చేయాలని సంకల్పించింది జటాచోడ భీముడు. ఇతడి మంత్రి నారాయణయ్య.


మొదటి ప్రోలరాజు (1052-1076): ఇతడి బిరుదు సమధిగత పంచ మహాశబ్ద, అరిగజకేసరి. బేతరాజు కుమారుడు. ఖాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతడి విజయాల గురించి తెలుపుతాయి. కల్యాణి చాళుక్యరాజైన ఒకటో సోమేశ్వరుడి వద్ద నుంచి హనుమకొండను శాశ్వతంగా పొందాడు. ఇతడి గురువు రామేశ్వరుడు. ‘కేసరి తటాకాలు’ తవ్వించాడు.


రెండో బేతరాజు (1076-1108): బిరుదులు మహామండలేశ్వర, త్రిభువన మల్ల, విక్రమచక్ర, చలమర్తి గండ అనే బిరుదులున్నాయి. రెండో ప్రోలరాజు కుమారుడు. కల్యాణి చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడి దండయాత్రలో పాల్గొని అతడి అభిమానాన్ని సంపాదించాడు. సబ్బి మండలంలో 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు. హనుమకొండకు సమీపంలో శివపురి అనే నగరాన్ని నిర్మించాడు. గొప్ప శివభక్తుడు. పరమ మాహేశ్వరుడనే రామేశ్వర దీక్షితుడి శిష్యుడు.


దుర్గరాజు (1108 - 1116): రెండో బేతరాజు కుమారుడు. తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో పాల్గొన్నాడు. బిరుదులు త్రిభువన మల్ల, చలమర్తిగండ. హనుమకొండలోని బేతేశ్వర ఆలయాన్ని కాలాముఖచార్యుడైన రామేశ్వర పండితుడికి దానం చేశాడని ఖాజీపేట శాసనంలో ఉంది. రామేశ్వర పండితుడు శ్రీపర్వత శైవ మఠాధిపతి.


రెండో ప్రోలరాజు (1116 - 1157): బిరుదులు మహామండలేశ్వర శూరుడు, దారిద్య్ర విద్రావణ. ఇతడి గురించి తెలుసుకోవడానికి ఆధారం రుద్రదేవుడి హనుమకొండ శాసనం. ఈ శాసనంలో ఇతడి ‘నిశ్శంకప్రథన ప్రబంధన మహాహంకా లంకేశ్వర’గా వర్ణించారు. మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు. తొలుత కొలనుపాకపై దండెత్తి పరమార జన్నగదేవుడిని ఓడించాడు. కల్యాణ చాళుక్యరాజు తైలవుని బంధీ చేసి వదిలిపెట్టాడు. మేడరాజు, గండరాజు, ఏడారాజు, కొండపల్లి అధిపతి అయిన గోంద దండ నాయకుడు, కందూరి చోడ భీమనలతో స్నేహ సంబంధాలను సాగించాడు. శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించి, అక్కడ విజయ స్తంభం స్థాపించాడు. ఆంధ్రదేశమంతటా తన అధికారాన్ని విస్తరించాడు. వరంగల్లు వద్ద స్వయంభు శివాలయం, సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం నిర్మించాడు. వెలనాటి యువరాజు రాజేంద్రచోళుడు, వెలనాటి సామంతుడైన కోట చేతుల్లో మరణించాడు.


రుద్రదేవుడు (1158 - 1195):  రెండో ప్రోలరాజు జ్యేష్ఠ పుత్రుడు. ‘వినయ విభూషణ’ అనే బిరుదు ఉంది. ఇతడి విజయాలను గురించి హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. తెలుగుచోడ వంశానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు. కరీంనగర్‌ జిల్లాకి చెందిన గొప్ప అశ్వదళాధిపతిగా పేరు పొందిన దొమ్మరాజుతో రెండేళ్లు పోరాడి అతడి పట్టణాన్ని జయించాడు. రాజ్యాన్ని గోదావరి నదీ తీరం వరకు విస్తరించాడు. చోడభీముడి ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వర్ధమానపురంపై దండెత్తి దాన్ని తగలబెట్టాడు. చోడ ఉదయుడు రుద్రదేవుడితో సంధి చేసుకుని తన పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకి సహాయం చేశాడు. ధరణి కోట ప్రభువు దొడ్డ భీముడిని చంపి ‘దొడ్డభీమా శిరచ్ఛేదక’ బిరుదు పొందాడు.


* ధరణికోట కాకతీయుల వశం అయినప్పటికీ దాన్ని రుద్రదేవుడు దొడ్డభీముడి కుమారుడైన రెండో కేతనకు ఇచ్చాడు. త్రిపురాంతకం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఓరుగల్లు/ఏకశిలా నగరం కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇతడు సంస్కృతంలో ‘నీతిసారం’ అనే గ్రంథం రచించాడు. యాదవ రాజు జైత్రపాలుడి చేతిలో హతుడయ్యాడు.


మహాదేవుడు (1196-1199): రుద్రదేవుడికి కుమారులు లేకపోవడంతో అతడి తమ్ముడు మహాదేవుడు సింహాసనం ఎక్కాడు. స్వల్పకాలమే పాలించాడు. దేవగిరి రాజ్యంపై దండెత్తి జైత్రపాలుడి చేతిలో మరణించాడు. మహాదేవుడు గొప్ప శివభక్తుడు. ఇతడికి కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు మైలాంబిక, కుందాంబిక ఉన్నారు. మహాదేవుడి మరణం తర్వాత గణపతిదేవుడిని యాదవులు బంధించారు.


గణపతిదేవుడు (1199-1262): ఇతడి బిరుదులు రాయగజకేసరి, మహామండలేశ్వర. 63 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. మహాధీరుడు, రాజనీతి దురంధరుడు. రాజ్యాన్ని పాండ్య, హోయసాల, యాదవ రాజులు ఆక్రమించకుండా కాపాడాడు. ఇతడికి సంబంధించిన తొలి శాసనం పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో లభించింది. రేచర్ల రుద్రుడి కారణంగా యాదవుల చెరసాల నుంచి విడుదలయ్యాడు. యాదవరాజు జైత్రపాలుడు తన కుమార్తె సోమలదేవిని ఇచ్చి వివాహం చేశాడు.


గణపతిదేవుడు రాజ్యానికి వచ్చినప్పుడు తీరాంధ్ర చిన్నచిన్న రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. కొలనివారు, బాగివారు, వెలనాటి చోళులు, కోట వంశం, తెలుగు చోళులు పరస్పరం కలహించుకునేవారు. గణపతిదేవుడు మొదటగా వెలనాటి చోళరాజు పృథ్వీశ్వరుడిపై దండెత్తాడు. 1201లో బెజవాడను ఆక్రమించాడు. దివిసీమపై దండెత్తాడు. అయ్యవంశపు రాజు పినచోడుడిని ఓడించాడు. ఇతడి కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహం చేసుకున్నాడు. ఇతడి కుమారుడు జయపను గజసాహసిగా నియమించుకున్నాడు. ఈ విజయంలో గణపతిదేవుడికి సహకరించింది మలయాళ చౌండ సేనాని.


* నెల్లూరు తెలుగు చోళులతో ఉన్న మైత్రి కారణంగానే గణపతిదేవుడు దక్షిణ దేశ దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ దండయాత్రల గురించి చేబ్రోలు శాసనం వివరిస్తుంది. నెల్లూరును పరిపాలించిన తిక్కసిద్ధి కుమారుడైన రెండో మనుమసిద్ధి సింహాసనం అధిష్టించడానికి గణపతిదేవుడు సహాయపడ్డాడు. రెండో మనుమసిద్ధి ఆస్థాన కవి తిక్కన గణపతిదేవుడి వద్దకు వచ్చాడు. మనుమసిద్ధి మోటుపల్లి రేవు పట్టణాన్ని గణపతిదేవుడికి ఇచ్చాడు. వర్తక అభివృద్ధి కోసం మోటుపల్లి వద్ద అభయ శాసనం వేయించాడు. గణపతిదేవుడు చివరికాలంలో నెల్లూరు రాజులతో కలిసి పాండ్యులతో యుద్ధం చేశాడు. 1263లో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధంలో రెండో మనుమసిద్ధి హతుడయ్యాడు. అతడికి సహాయంగా వచ్చిన గణపతిదేవుడి సేనలను కృష్ణా నది తీరం వరకు పాండ్యులు తరిమేశారు. నెల్లూరు రాజ్యం పాండ్యులకు సామంత రాజ్యమైంది.


* గణపతి దేవుడు కాకతీయలందరిలో గొప్పవాడు. కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. పొరుగు రాజులతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు. వర్తకం, వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించాడు. ఇతడికి కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలు రుద్రాంబ, గణపాంబ. రుద్రాంబ తూర్పు చాళుక్య రాజు వీరభద్రుడిని, గణపాంబ కోట వంశపు బేతనను వివాహం చేసుకున్నారు. గణపతిదేవుడి మరణానంతరం రుద్రాంబ సింహాసనాన్ని అధిష్టించింది.


రుద్రమదేవి (1262 - 1289): ఈమె బిరుదు రుద్రదేవ మహారాజా. గణపతి దేవుడు, సోయాంబల కుమార్తె. 1259 నుంచే రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించింది. 1269లో గణపతిదేవుడి మరణం తర్వాత కిరీటాన్ని ధరించింది. ఈ విషయాన్ని గణపతిదేవుడి మహాప్రధాని ‘పెద్ద మల్లయ్య వ్రేగ్గడ’ త్రిపురాంతకం శాసనంలో రాయించాడు. రుద్రమదేవి సవతి సోదరులైన హరిహరదేవుడు, మురారి దేవుడిని రేచర్ల ప్రసాదిత్యుడి సహాయంతో అణచివేసింది. ఈ విషయాన్ని తెలిపే గ్రంథం ప్రతాపరుద్ర చరిత్ర. 


* రుద్రమదేవిపై దాడికి దిగిన పొరుగు రాజులు గాంగులు, పాండ్యులు, యాదవులు. వీరిని అణచివేయడంలో రుద్రమకు సహాయపడినవారిలో రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డి, జన్నగ దేవుడు త్రిపురారి, అంబదేవుడు మొదలైనవారు ముఖ్యులు. వీరంతా రాయస్థాపనచార్య అనే బిరుదు పొందినవారే. కళింగ గజపతులను ఓడించింది. కళింగరాజైన మొదటి నరసింహుడు, మొదటి వీరభాను దేవుడు గోదావరి మండలంపై దండెత్తి వచ్చినప్పుడు రుద్రమదేవి సేనాధిపతులు పోతినాయకుడు, పోలినాయుడు వీరిని ఓడించారు.


ముత్తుకూరు యుద్ధం తర్వాత నెల్లూరు ప్రాంతంపై కాకతీయులు పట్టు కోల్పోయారు. నెల్లూరు రాజ్యాన్ని పాండ్యులకి సామంతుడైన వీర రాజేంద్రుడు పరిపాలించేవాడు. ఇతడిని రుద్రమదేవి సామంతుడైన నాగదేవ మహారాజు ఓడించి తరిమేశాడు. నాగదేవుడు నెల్లూరును కొంతకాలం పరిపాలించాడు. యాదవ రాజు మహాదేవుడు రుద్రమదేవిపై దండెత్తగా, అతడిని ఓడించి దేవగిరి వరకు వెంటాడింది. రుద్రమదేవిని వ్యతిరేకించిన కడప, నెల్లూరు ప్రాంతానికి చెందిన నాయకుడు కాయస్థ అంబదేవుడు. ఇతడు గొప్ప పరాక్రమవంతుడు. అంబదేవుడి విజృంభణను అడ్డుకోవడానికి రుద్రమదేవి ప్రతాపరుద్రుడిని పంపింది. ఓడిపోయిన ప్రతాపరుద్రుడు ములికినాడుకి పారిపోయాడు. ఆ తర్వాత రుద్రమదేవి స్వయంగా సైన్యాన్ని నడిపించింది. ఈ క్రమంలో త్రిపురాంతకాన్ని ఆక్రమించింది. అంబదేవుడు రెండోసారి రుద్రమదేవిపై దండెత్తాడు. చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ఆమె మరణించింది.


ప్రతాపరుద్రుడు (1289 - 1323): రుద్రమదేవి మరణం తర్వాత ఆమె మనమడు, ముమ్ముడమ్మ మహదేవుడి కుమారుడైన ప్రతాపరుద్రుడు రాజు అయ్యాడు. కాకతీయ చక్రవర్తుల్లో ఇతడు చివరివాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అంబదేవుడిని అణచివేశాడు. ఇతడి ఆస్థానంలో 72 మంది నాయకులు ఉండేవారు. నెల్లూరుపై దాడి చేసి అంబదేవుడి పక్షీయుడైన మనుమగొండ గోపాలుడిని చంపి రంగనాథుడిని గద్దెక్కించాడు. అయితే రంగనాథుడు పాండ్యులతో చేతులు కలిపి ప్రతాపరుద్రుడిని ఎదిరించాడు. మరోసారి ప్రతాపరుద్రుడు నెల్లూరుపై జైత్రయాత్ర చేశాడు. కృష్ణ, తుంగభద్ర అంతర్వేదిని జయించి రాయచుర్‌ దుర్గం కట్టుదిట్టం చేశాడు. కాంచీపురాన్ని ఆక్రమించాడు. ఓరుగల్లుపై గాంగుల దాడిని తిప్పికొట్టాడు.


తురుష్కుల దండయాత్రలు: 1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ దిల్లీ సింహానాన్ని అధిష్టించిన తర్వాత ఉత్తరాదిని జయించి, దక్షిణాది వైపు మళ్లాడు. దక్షిణ పదంలోని అపార ధనరాశులపై అల్లావుద్దీన్‌ ఆశపడ్డాడు. దక్షిణ భారతదేశంపై సుమారు అయిదు సార్లు దిల్లీ సుల్తానులు దండెత్తారు. ఇవన్నీ ప్రతాపరుద్రుడి కాలంలోనే జరిగాయి. 1303లో ఖిల్జీ తన సైన్యాన్ని బెంగాల్‌ మీదుగా ఓరుగల్లు పైకి పంపాడు. ఉప్పరపల్లి (కరీంనగర్‌) వద్ద ఖిల్జీ సేనలను ప్రతాపరుద్రుడి సైన్యం ఓడించింది. 1309లో మాలిక్‌ కాఫర్‌ నేతృత్వంలో మరో సైన్యం దిల్లీ నుంచి వచ్చి ఓరుగల్లును ముట్టడించింది. ప్రతాపరుద్రుడు అపార ధనం ఇచ్చి ఏటా దిల్లీకి కప్పం చెల్లించేందుకు అంగీకరించాడు. 1316లో అల్లావుద్దీన్‌ మరణానంతరం కప్పం చెల్లించడం మానేశాడు.  ఖుస్రూఖాన్‌ని ముబారక్‌ ఖిల్జీ ఓరుగల్లుపై దాడికి పంపాడు. ప్రతాపరుద్రుడు బకాయిలు చెల్లించి మళ్లీ సంధి చేసుకున్నాడు. 1320లో దిల్లీలో తుగ్లక్‌లు అధికారంలోకి వచ్చాడు. దిల్లీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించలేదు. దీంతో ఘియాజుద్దీన్‌ 1321-22లో ప్రిన్స్‌ జునాఖాన్‌ను ఓరుగల్లుపై దాడికి పంపాడు. ఆరు నెలల తర్వాత జునాఖాన్‌ వెనుదిరిగి వెళ్లాడు. తిరిగి 1323లో దాడి చేసి ప్రతాపరుద్రుడిని బంధించాడు. చివరకు ప్రతాపరుద్రుడు దిల్లీకి బంధీగా తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.



రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 19-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాకతీయ అనంతర యుగం

తెలుగు సంస్కృతి పరిరక్షకులు

మధ్యయుగంలో తెలుగు జాతిని ఏకం చేసి పాలించిన కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్‌ల దాడులతో అంతమవడంతో తెలుగునాట రాజకీయ స్తబ్దత నెలకొంది. కొంతకాలానికే ముస్లిం పాలకులపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత రావడంతో పలు హిందూ స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. అలా కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుంచి ఏర్పాటైనవే విజయనగర, నాయక, రెడ్డి, వెలమ రాజ్యాలు. ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి ఆవిర్భవించిన ముసునూరి నాయకులు, రెడ్డి రాజుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సుల్తాన్‌ పాలనను అంతమొందించి, హిందూ సంస్కృతిని పరిరక్షించి, తెలుగు నేలను సుభిక్షం చేసి, సంస్కృతీ సాహిత్యాల వికాసానికి పెద్దపీట వేసిన పాలకులుగా వీరు చరిత్రకెక్కారు. ఈ అచ్చ తెలుగు రాజుల వంశ క్రమం, పరిపాలనా విధానం, సమకాలీన రాజులతో నెరపిన సంబంధాలు, చేసిన యుద్ధాలు, నాటి సామాజిక పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి.

ముసునూరి నాయక రాజ్యం ముసునూరు అనే గ్రామం కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలో ఉంది. నేటికీ అక్కడ కోట శిథిలాలు ఉన్నాయి. వీరు కమ్మ కులస్థులు. ఈ వంశస్థాపకుడు ప్రోలయ నాయకుడు. ఈ రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఆధారాలు 


1) విలాస తామ్ర శాసనం (ప్రోలయ నాయకుడు) 


2) పోలవరం శాసనం (కాపయ నాయకుడు) 


3) పెంటపాడు శాసనం (చోడ భక్తి రాజు) 


4) కలువచేరు శాసనం (రెడ్డిరాణి అనతల్లి).


ప్రోలయ నాయకుడు: ఇతడి గురించి విలాస తామ్ర శాసనం తెలియజేస్తోంది. తండ్రి పోతి నాయకుడు. రాజధాని రేకపల్లె. ‘ఆంధ్ర భూమండలధ్యక్ష’గా ప్రసిద్ధికెక్కాడు. వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చాడు. ముస్లిం దండయాత్రలతో మైల పడిందంటూ ఆంధ్ర ప్రాంత భూములను యజ్ఞాయాగాది, క్రతువులతో పునీతం చేశాడు. రైతులు పంటలో ఆరో భాగం పన్నుగా చెల్లించేవారు. విలాస గ్రామాన్ని భరద్వాజస గోత్రానికి చెందిన ‘వెన్నమ’ అనే బ్రాహ్మణుడికి ఇచ్చాడు.


కాపయ నాయకుడు: ప్రోలయ నాయకుడికి సంతానం లేదు. పినతండ్రి దేవనాయనాయకుడి కుమారుడైన కాపయ నాయకుడు రాజు అయ్యాడు. ఇతడు 1336లో ఓరుగల్లు కోట నుంచి ఢిల్లీ సుల్తానులను పారదోలాడు. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాణ అనే బిరుదులు పొందాడు. ఓరుగల్లు రాజధానిగా చేసుకుని తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలను పరిపాలించాడు. కాపయ నాయకుడిని కన్యానాయక్, కృష్ణనాయక్, కన్యాపాయక్, కనాబాయర్‌ అనే పేర్లతో మహమ్మదీయ చరిత్రకారులు పేర్కొన్నారు. ఇతడి కాలంలోనే హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1347లో అల్లావుద్దీన్‌ హసన్‌ గంగూ గుల్బర్గా రాజధానిగా రాజ్యాన్ని స్థాపించడంలో కాపయ నాయకుడు సహాయపడ్డాడు. కాపయ నాయకుని ఓడించడానికి అల్లావుద్దీన్‌ 1350లో సికిందర్‌ఖాన్‌ను పంపాడు. ఓడిపోయిన కాపయ నాయకుడు కైలాస దుర్గాన్ని, అపారమైన ధనరాశులను ఇచ్చి సంధి చేసుకున్నాడు. 1356లో బహమనీ షా మళ్లీ దాడి చేసినప్పుడు భువనగిరి దుర్గం ఇచ్చి సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. బహమనీ షా మరణం తర్వాత విజయనగర రాజులతో మైత్రి చేసి తాను పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి పొందాలని ప్రయత్నించాడు. కాపయ నాయకుడి కుమారుడు వినాయకదేవుడు భువనగిరిని ఆక్రమించాడు. బహమనీ రాజు మహ్మద్‌ షా వినాయకదేవుడిని ఓడించి చంపాడు. వరంగల్లును చుట్టుముట్టాడు. ఈ సమయంలో కాపయ నాయకుడు అపార ధనరాశులతో పాటు గోల్కొండ కోటను శాశ్వతంగా బహమనీ రాజులకు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఇతడు తరచూ యుద్ధాల్లో మునిగి ఉన్నప్పుడు సామంతులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.


 రెడ్డి రాజులు


రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. వీరి రాజధానులు అద్దంకి, కొండవీడు, రాజమండ్రి. కాకతీయుల పతనం తర్వాత రాజ్యానికి వచ్చారు. నెల్లూరు నుంచి ఉత్తరాన సింహాచలం వరకు ఉన్న సముద్ర తీరాంధ్ర ప్రాంతాన్ని సుమారు 150 ఏళ్లు పరిపాలించారు. తెలుగు భాష, సంస్కృతికి అపారమైన సేవ చేశారు. మొత్తం రెడ్డి రాజులు 9 మంది. వీరిది పంట వంశం. పంటకాపులు అని వ్యవహరిస్తారు.


ప్రోలయ వేమారెడ్డి: ఈ వంశంలో మొదటివాడు. ఇతడి రాజధాని అద్దంకి. వైదిక మతాన్ని ద్వేషించే ముస్లింలను ఓడించి తీరాంధ్ర నుంచి తరిమేశాడు. కాపయ నాయకుడికి సహాయపడిన 75 మంది నాయకుల్లో వేమారెడ్డి ఒకరు. కాపయ నాయకుడి కాలంలోనే ఇతడూ స్వాతంత్య్రం పొందాడు. వేమారెడ్డికి రాజ్య విస్తరణలో అతడి సోదరులు, బంధువులు సహాయపడ్డారు. తమ్ముడు మల్లారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడు, మోటుపల్లిని ఆక్రమించాడు. బహమనీ రాజ్యస్థాపకుడు హసన్‌ గంగూ అమరావతి వరకు వచ్చినప్పుడు అతడిని ఓడించి తరిమేశాడు. వేమారెడ్డి వినుకొండ, కొండవీడు, కొండపల్లి, బెల్లంకొండ, ధాన్యకటకం మొదలైన ప్రాంతాల్లో 84 దుర్గాలు నిర్మించాడు. రాజ్యం పశ్చిమాన శ్రీశైలం, అహోబిలం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకూ వ్యాపించింది. ధర్మ ప్రతిష్టాగురు, నిస్సమాభూదాన పరశురామా, అనవరత పురోహిత కృత సోమపాన అనే బిరుదులు పొందాడు.  ఆస్థానంలోని ఎర్రాప్రగడ ‘హరివంశం’ రచించి వేమారెడ్డికి అంకితం ఇచ్చారు. వేమారెడ్డికి ముగ్గురు కుమారులు. అనవోతారెడ్డి, అనమాబారెడ్డి, అనవేమారెడ్డి.


అనవోతారెడ్డి: ప్రోలయ వేమారెడ్డి పెద్ద కుమారుడు. 11 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. ఇతడు ఎదుర్కొన్న మొదటి యుద్ధం కళింగ దండయాత్ర. ఆనాటి కళింగ రాజు మూడో నరసింహదేవుడు. అనవోతారెడ్డి వసంతరాయలు, ద్వీపవిజేత, వీరన్నపోతుగా ప్రసిద్ధి చెందాడు. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చాడు. వాణిజ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అనవోతారెడ్డి తెలుగు, తమిళం, సంస్కృత భాషల్లో అభయశాసనం ప్రకటించాడు. బంగారంపై పన్ను రద్దు చేశాడు. ఆస్థాన కవి బాలసరస్వతి.


అనవేమారెడ్డి: అనవోతారెడ్డి తమ్ముడు. శాసనాలు ఇతడిని ‘రాజశ్రీ రమణ స్వయంపరపతి’ అని పేర్కొన్నాయి. అనవోతారెడ్డి మరణించేనాటికి అతడి కుమారుడైన కుమారగిరిరెడ్డి బాలుడు. దీంతో రాజ్య ప్రధాని, దండనాయకుడు, సామంతులు కలిసి అనవేమారెడ్డిని రాజుగా ఎన్నుకున్నారు. 20 సంవత్సరాల పాలనా కాలంలో అన్యాక్రాంతమైన రాజ్య విభాగాలను తిరిగి సంపాదించాడు. దివి దుర్గాన్ని జయించి ‘దివిదుర్గ విభాళా’ అనే బిరుదు పొందాడు. సింహాచలం నుంచి మొదలైన పర్వత పాదాల వద్ద కీర్తి స్తంభాలను ప్రతిష్ఠించి ‘సింహాచలాది వింధ్యపాద ప్రతిష్ఠత కీర్తి స్తంభ’ అనే బిరుదు పొందాడు. సంగీత, సాహిత్య, పోషకుడు. ఏటా వసంతోత్సవాలను జరిపి కవులు, పండితులు, కళాకారులను ప్రోత్సహించాడు. ఇతడికి ‘వసంతరాయుడు’ అనే బిరుదు కూడా ఉంది. వైదిక మతాభిమాని, శివభక్తుడు. శ్రీశైలంలో వీరశిరోమండపం, సింహాచలంలో అనవేమగిరి మండపం నిర్మించాడు. ‘ధర్మాన వేముడు’ అనే బిరుదు పొందాడు.


కుమారగిరిరెడ్డి: ఇతడి బిరుదు కర్పూర వసంతరాయలు. కుమారగిరిరెడ్డి సింహాసనం అధిష్టించడంపై వ్యతిరేకతలు ఎదురయ్యాయి. అంతర్యుద్ధంలో విజయం సాధించాడు. అందుకు కాటయ వేమారెడ్డి సహాయపడ్డాడు. రెడ్డి రాజులు అంతఃకలహాలలో మునిగి ఉన్నప్పుడు సామంతులు, దుర్గాధిపతులుగా స్వతంత్రులయ్యారు. విజయనగర రాజులు శ్రీశైలం, త్రిపురాంతకం ప్రాంతాలను ఆక్రమించారు. కలహాలు ముగిసిన అనంతరం రెడ్డి రాజులు పశ్చిమ ప్రాంతాలపై దృష్టి సారించారు. కాటయ వేమారెడ్డి నాయకత్వంలో పెద్ద సైన్యం విజయనగర రాజ్యంపై దండెత్తింది. ఫలితం తేలకముందే రెండో హరిహరరాయలతో సంధి చేసుకున్నారు. హరిహరాంబను కాటయ వేముడికిచ్చి వివాహం చేశారు. తర్వాత కాటయ వేమారెడ్డి తూర్పు దండయాత్రలు ప్రారంభించాడు. తూర్పు ప్రాంత దండయాత్రల్లో రాజమండ్రి రాజులు ప్రముఖ పాత్ర వహించినట్లు శ్రీనాథుడి ‘కాశీఖండం’, కొమ్మన రచించిన ‘శివలీలా విలాసం’ తెలియ జేస్తున్నాయి. కాటయ వేమారెడ్డి రంప నుంచి కటకం (కటక్‌) వరకు ఆక్రమించాడు. గోపవరం వద్ద ఉన్న శాసనంలో ఇతడికి ‘కటకచూరకార’ అన్న బిరుదు ఉంది. యుద్ధాల ద్వారా వచ్చిన ధనరాశులను కుమారగిరిరెడ్డికి సమర్పించాడు. కాటయ వేమారెడ్డి రాజ్యనిర్వహణ భారం వహిస్తే, కుమారగిరిరెడ్డి సాహిత్యంలో మునిగి తేలేవాడు. ఏటా వసంతోత్సవాలు నిర్వహించేవాడు. ఆస్థానంలో లకుమాదేవి అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. కుమారగిరిరెడ్డి అకాల మరణంతో రాజ్యంలో మళ్లీ అంతర్యుద్ధం జరిగింది. చివరికి పెదకోమటి వేమారెడ్డి రాజయ్యాడు.


పెదకోమటి వేమారెడ్డి: ఇతడి బిరుదు సర్వజ్ఞ చక్రవర్తి. 18 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. విజయనగర రాజ్యంలో ఏర్పడిన కలహాలను అవకాశంగా తీసుకుని పర్చూరును ఆక్రమించాడు. రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి కారణం కాటయ వేమారెడ్డి, పేదకోమటి వేమారెడ్డిని తన ప్రభువుగా అంగీకరించక పోవడం. వీరి మధ్య కలహం ఉభయ రాజ్యాలను బలహీనపరిచింది. పెదకోమటి వేమారెడ్డి స్వయంగా కవి, పండితుడు, అలంకార శాస్త్రవేత్త, సంగీత శాస్త్రజ్ఞుడు. సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సంగీత చింతామణి, సప్తశతీ సారదీపిక అనే కావ్యాలు రచించారు. ఆస్థాన కవులు వామనభట్టు, శ్రీనాథుడు.


రాచవేమారెడ్డి: కొండవీటి రెడ్డి రాజుల్లో చివరివాడు. పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. 5 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అసమర్థుడు, వివేక శూన్యుడు. పురిటిసుంకం విధించి ప్రజాదరణ కోల్పోయాడు.


పరిపాలనా విధానం: సాంప్రదాయ పాలన జరిగేది. రాజు సర్వాధికారం చలాయించేవాడు. పరిపాలనలో రాజుకి ప్రధాని, సేనాధిపతి, పురోహితుడు తోడ్పడేవారు. పరిపాలనలో యువరాజుకి ప్రత్యేక స్థానం ఉండేది. పాలనలో ప్రధాన విభాగం ‘సీమ’. ప్రతి సీమను కొన్ని నాయంకరాలుగా విభజించేవారు. రాజ్యానికి గ్రామం పునాది. గ్రామ పరిపాలనను 12 మంది ఆయగాండ్రు చూసేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు. తలారినే ‘ఆరెకుడు’ అనేవారు. ఆరెకులు రాత్రుల్లో అవసరమైతే దివిటీలు పట్టుకొని కాపలా కాసేవారు. న్యాయపాలనకు ధర్మాసనాలు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. నేర విచారణకు అవసరమైతే దివ్యపరీక్షలు పెట్టేవారు.


ఆర్థిక పరిస్థితులు: వ్యవసాయం ప్రజల జీవనాధారం, ప్రధాన వృత్తి. రాజాస్థాన జీవితంతో విరక్తి చెందిన బ్రాహ్మణులు కూడా వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించేవారు. వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కాలువులు, బావులు తవ్వించేవారు. నేత పరిశ్రమ ప్రధానంగా ఉండేది. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రంగుల పరిశ్రమ ఉండేది. సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథం పలు రకాల పట్టువస్త్రాల గురించి పేర్కొంది. కత్తులు, గాజులు, అద్దాల పరిశ్రమలు ఉండేవి. దేశ, విదేశీ వాణిజ్యం జరిగేది. శ్రీనాథుని హరవిలాసం గ్రంథం ఆధారంగా నాడు సింహళం, సమత్రా, మలయా, ఇండోచైనా, ఆర్మజ్‌ దేశాలతో వాణిజ్యం చేసినట్టు తెలుస్తోంది. అనేక విలాస వస్తువులు దిగుమతి చేసుకొనేవారు. వ్యవసాయంపై పన్ను 1/6 వంతు.


మత పరిస్థితులు: రెడ్డి రాజులు శైవమతాభిమానులు. వీరి కాలంలో శైవం బాగా వ్యాప్తి చెందింది. పాశుపతంతో పాటు వీరశైవం ప్రజాదరణ పొందింది. అనవేమారెడ్డి శ్రీశైలంలో వీరశిరోమండపాన్ని నిర్మించాడు. కాళ్లు చేతులు నరుక్కోవడం, తలలు నరుక్కోవడం, నాలుకలు కత్తిరించుకోవడం, కండలు కోసి అర్పించడం వంటి క్రూర విధానాలు ఉండేవి. భృగుపాతం (కొండమీద నుంచి దూకి చనిపోవడం) వల్ల మోక్షం లభిస్తుందని కొందరు విశ్వసించేవారు. శ్రీశైలంలోని భృగుపాతం గురించి ‘పండితారాధ్య చరిత్ర’ గ్రంథంలో ఉంది. ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉండేది. రెడ్డి రాజులకు మూలగూరమ్మ కులదేవత. గ్రామదేవత కొలువుల్లో జంతుబలులు సర్వసాధారణం. వైష్ణవానికి కూడా ఆదరణ ఉండేది. శ్రీ వైష్ణవాన్ని రామానుజాచార్యులు స్థాపించారు. దీనిలో 2 రకాలున్నాయి 1) తెంగళులు 2) వడగళులు


సాహిత్యం: రెడ్డి రాజులు సాహిత్య ప్రియులు, సంగీత పోషకులు. వీరు ఆదరించిన ప్రముఖ కవులలో ఎర్రాప్రగఢ, శ్రీనాథుడు ప్రముఖులు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనేవి బిరుదులు. హరివంశం, నృశింహపురాణం ఇతని రచనలు. శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌముడు. ప్రాఢదేవరాయల వద్ద ఉండే గౌడడిండిమ భట్టును ఓడించి కనకాభిషేకం చేయించుకున్నాడు. అనే గ్రంథాలు రచించాడు.


రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం (సంగమ వంశం)

తుంగభద్ర తీరంలో రాయల రాజ్యం!


కాకతీయ సామ్రాజ్య శిథిలాలపై విజయనగర రాజ్యం ఆవిర్భవించింది. వరుస విజయాలతో, విస్తరణలతో దక్షిణాన మహోన్నత చరిత్రను సృష్టించింది. ముసిం పాలకులను జయించి, ఇస్లాం మత వ్యాప్తిని అడ్డుకుంది. హైందవ సంస్కృతి, సంప్రదాయాలు, ద్రవిడ భాషలు, కళలను పరిరక్షించింది. మూడు శతాబ్దాలపాటు నాలుగు వంశాల పాలనలో  తుంగభద్ర తీరంలో రాయల రాజ్యం వర్ధిల్లింది. మొదట అధికారంలోకి వచ్చిన సంగం వంశ పాలకులు అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని దక్షిణంలో రెండు సముద్రాల మధ్య విస్తరించారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆధునిక యుద్ధ తంత్రాలను అనుసరించారు ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


దక్షిణ భారతంలోనే కాకుండా, దేశం మొత్తం మీద ఒక నూతన శకానికి విజయనగర సామ్రాజ్యం నాంది పలికింది. 14వ శతాబ్దం ప్రారంభంలో ఆవిర్భవించిన ఈ సామ్రాజ్యం దక్షిణాదిన ఇస్లాం మతవ్యాప్తిని అరికట్టి, హిందూమతాన్ని, హిందూ సంస్కృతిని కాపాడింది. దక్షిణ దేశ రాజకీయాల్లో, సాంఘిక, ఆర్థిక, మత, సాహిత్య, కళల్లో శాశ్వతమైన ముద్ర వేసింది. తెలుగు, కన్నడం, సంస్కృత భాషలను పోషించింది. విజయనగర సామ్రాజ్యం అనేక కళలకు కేంద్రంగా విరాజిల్లింది. చాలామంది విదేశీయులు ఈ సామ్రాజ్యాన్ని సందర్శించారు. ప్రధానంగా 4 రాజ్యవంశాలు సుమారు 300 ఏళ్ల పాటు పరిపాలించాయి. శాసన, లిఖిత ఆధారాలు (స్వదేశీ, విదేశీ) ఆ వివరాలను అందిస్తున్నాయి.


శాసన ఆధారాలు:

నెల్లూరి శాసనాలు - మొదటి హరిహర రాయలు. ఈ శాసనం మొదటి హరిహరరాయలను రాజుగా పేర్కొంది.

బిట్రగుంట శాసనం - మొదటి బుక్కరాయలు

మోటుపల్లి శాసనం - మొదటి దేవరాయలు

తిరుమల తిరుపతి శాసనాలు - విజయనగరంలోని అన్ని వంశాల రాజులు

హంపీ శాసనం - శ్రీకృష్ణదేవరాయలు

కొండవీడు, మంగళగరి శాసనాలు - శ్రీకృష్ణదేవరాయలు

విలపాకం శాసనం - రెండో వేంకటపతిరాయలు


గ్రంథాలు (లిఖిత ఆధారాలు):

విద్యారణ్యస్వామి కాలజ్ఞానం - విద్యారణ్యస్వామి

మధుర విజయం - గంగాదేవి *సాళువాభ్యుదయం - రాజనాథ డిండిముడు

జైమినీ భారతం - పిల్లలమర్రి పినవీరభద్రుడు  

ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు

వసుచరిత్ర - రామరాజ భూషణుడు

రామవాచకం - స్థానపతి

రాజశేఖర చరితం - మాదయగారి మల్లన

విస్తృత విజయనగర చరిత్ర - రాబర్ట్‌ సీవెల్‌

సోషల్‌ - అండ్‌ - పొలిటికల్‌ లైఫ్‌ ఇన్‌ ది విజయనగర - బి.ఎన్‌.సెలటోర్‌

విదేశీ యాత్రికులైన ఇబన్‌ బటూటా, అబ్దుల్‌ రజాక్, న్యూనిజ్, డోమింగో ఫెయిజ్, బార్బోసా లాంటి వారి రచనలు.

1805లో విజయనగర సామ్రాజ్య అవశేషాలు బయటకు తీసింది - కల్నల్‌ కొలెన్‌ మెకంజీ



విజయనగర రాజుల జాతి పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సామ్రాజ్య స్థాపకులైన హరిహర,  బుక్కరాయ సోదరులు ఆంధ్రులన్న సిద్ధాంతాన్ని నేలటూరి వెంకటరమణ, నీలకంఠశాస్త్రి, ఆర్‌.సుబ్రమణ్యం, రంగాచారి, రాబర్ట్‌ సీవెల్‌ లాంటివారు బలపరిచారు. అయితే హరిహర, బుక్కరాయ సోదరులు కన్నడిగులనే సిద్ధాంతాన్ని ఫాదర్‌ హీరాఫ్, శ్రీకృష్ణస్వామి అయ్యంగార్, వాయిస్‌రైస్‌ మొదలైనవారు బలపరిచారు. హరిహర, బుక్కరాయలు తొలుత కాకతీయ ప్రతాపరుద్రుడి ఆస్థాన ఉద్యోగులు. ఓరుగల్లు రాజ్యం పతనం తర్వాత 1323లో వీరు కంపిల దేవుని ఆశ్రయం పొందారు. 1328లో ఢిల్లీ సుల్తాను కంపిలను ఆక్రమించినప్పుడు రాయల సోదరులు బందీలుగా చిక్కారు. వీరిని ఢిల్లీ సుల్తాను దక్షిణ భారతదేశంలో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి పంపాడు. ఈ ఇద్దరు సోదరులు విద్యారణ్యస్వామి ప్రేరణతో 1336లో తుంగభద్ర ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా అంటారు. దీని రాజధాని విజయనగరం. అంటే విజయాల నగరం. ఇదే నేటి ‘హంపి’. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయి.


సంగమ వంశం (1336-1485): ఈ వంశ స్థాపకులైన హరిహర రాయలు, బుక్కరాయలు ‘సంగము’ని కుమారులు. అందుకే ఈ వంశానికి ‘సంగమ వంశం’ అని పేరొచ్చింది. ఇందులో తొలి రాజు మొదటి హరిహరరాయలు.


మొదటి హరిహర రాయలు (1336 - 1356): ఇతడి గురించి తెలుసుకోవడానికి భాగపల్లి శాసనం ఉపయోగపడుతుంది. 1336, ఏప్రిల్‌ 18న విరూపాక్ష దేవుడి సన్నిధిలో మొదటి హరిహర రాయలు పట్టాభిషేకం జరిగింది. ఇతడికి నలుగురు సోదరులు. కంపరాయలు, బుక్కరాయలు, మారప్ప, ముర్దప్ప. రాజ్య స్థాపనలో, విస్తరణలో ఇతడికి బుక్కరాయలు సహాయపడ్డాడు. హరిహరరాయల బిరుదు ‘పూర్వ పశ్చిమ సముద్రాధిపతి’. 1339 నాటికి హరిహరరాయల రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు వ్యాపించింది. ఈ విషయాన్ని ‘అటకల గుండు’ శాసనం తెలియజేస్తోంది. బాదామి శాసనం ప్రకారం ఇతడి రాజ్యం 1340 నాటికి బాదామి వరకు వ్యాపించింది. 1343లో ఉదయగిరి దుర్గం ఆక్రమణ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని నేలటూరి వెంకటరమణ పేర్కొన్నారు. హరిహర రాయలు 1346లో ‘హోయసాల’ రాజ్యాన్ని జయించి విజయనగరంలో విలీనం చేశాడు. ఆనాటి హోయసాల రాజైన నాలుగో భల్లాలుడు, బనవాసి ప్రాంతానికి పారిపోయాడు.1347లో గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్‌ హసన్‌గంగూ స్థాపించాడు. రాయచూర్‌ అంతర్వేది కోసం బహమనీ, విజయనగర రాజులకు యుద్ధం ప్రారంభమైంది. హసన్‌గంగూ సేనాని ముబారక్‌ ఖాన్‌ విజయనగరంపై దండెత్తి రాయచూర్‌ వరకు ఆక్రమించాడు.


హరిహరుడి సోదరుడు మారప్ప 1347లో కదంబుల రాజ్యమైన బనవాసిపై దాడి చేసి ఆక్రమించాడు. దీనికి కారణం హోయసాల రాజు నాలుగో భల్లాలుడికి కదంబులు ఆశ్రయం ఇవ్వడమే. హరిహరరాయల కాలంలోనే  తొండై మండల రాజు అయిన సాంబవరాయుడిని రక్షించడానికి మధురైని కూడా ఆక్రమించారు. 1352లో మధురైపై దాడి చేసింది కంపరాయల కుమారుడు ‘సావణ్ణ’, బుక్కరాయల కొడుకు ‘కుమార కంపన’. హరిహరరాయలు సోదరుల సహాయంతో రాజ్య విస్తరణ చేశాడు. ఇతడి మంత్రుల్లో సుప్రసిద్ధుడు అనంతరసు. అతడి బిరుదు ‘చిక్క ఉదయుడు’.


మొదటి బుక్కరాయలు (1356-1377): హరిహరరాయలకు కుమారులు లేరు. దీంతో అతడి రెండో తమ్ముడు బుక్కరాయలు రాజు అయ్యాడు. రాజ్య విస్తరణలో మొదటి నుంచి హరిహరరాయలకు సహాయపడ్డాడు. ఇతడి బిరుదులు ‘వైదికమార్గ ప్రవక్త’, ‘వేదమార్గ ప్రతిస్థాపక’, ‘ఆధునిక మనువు’. ఇతడి పరిపాలన గురించి చెన్నరాయపట్నం శాసనం వివరిస్తుంది. రాజధాని విజయనగరం నిర్మాణాన్ని పూర్తిచేశాడు. హరిహరరాయల మరణానంతరం విజయనగర సింహాసనానికి విధేయుడైన సాంబవరాయలు తిరుగుబాటు చేశాడు. అతడిని శిక్షించేందుకు బుక్కరాయల కుమారుడు కంపన వెళ్లాడు. ఈ క్రమంలో బహమనీ సామ్రాజ్యంపై దాడి చేసి మహ్మద్‌ షాను ఓడించి సంధి చేసుకున్నాడు. ఈ సంధితో ఇరురాజ్యల సరిహద్దు కృష్ణానది అయ్యింది. 1364లో రెడ్డిరాజు అయిన అనవోతారెడ్డిని బుక్కరాయలును ఓడించి అహోబిలం, వినుకొండ ప్రాంతాలను ఆక్రమించాడు. 1371లో కుమార కంపన, గోపన దండ నాయకుడు, సాళువ మంగురాజు మధురపై దాడి చేసి మధుర సుల్తాన్‌లను వధించారు. ఈ సమయంలో పరాక్రమం చూపిన సాళువ మంగుకు ‘పరపక్షిసాళువ’ అనే బిరుదు ఇచ్చారు. కుమార కంపన మధురైకి పాలకుడయ్యాడు. 1374లో అకాల మరణం చెందాడు. బుక్కరాయలు చైనాకు రాయబారిని పంపినట్లు చైనాను పరిపాలించిన మింగ్‌ వంశ చరిత్ర తెలియజేస్తుంది. బుక్కరాయల ప్రధాని అనంతరాయలు. ప్రముఖ కవి నాచన సోముడు బుక్కరాయల ఆస్థానంలో ఉండేవారు. బుక్కరాయలు 1377లో మరణించారు.



రెండో హరిహర రాయలు (1377-1404): ఇతడి బిరుదులు రాజవ్యాస్, రాజపరమేశ్వర, రాజవాల్మీకి, రాజాధిరాజా. బుక్కరాయల తర్వాత రాజ్యానికి వచ్చాడు. 27 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. దాయాదులను, తిరుగుబాటుదారులను తొలగించి కుమారులను, అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రులను, దండనాథులను వివిధ ప్రాంతాలకు పాలకులుగా నియమించాడు. వెలమ, బహమనీ రాజ్యాల మధ్య ఉన్న మైత్రిని విచ్ఛిన్నం చేశాడు. శ్రీశైలాన్ని ఆక్రమించే సమయంలో కాటమ వేమారెడ్డి చేతిలో ఓడిపోయాడు. సంధి చేసుకుని వేమారెడ్డి కుమారుడికి కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. కుమారగిరిరెడ్డి చివరికాలంలో జరిగిన అంతర్యుద్ధాలను ఆసరాగా తీసుకుని మోటుపల్లి దుర్గం ఆక్రమించాడు. రెండో హరిహర రాయలు మంత్రి మాధవుడు గోవాను ఆక్రమించాడు. కుమారుడు విరూపాక్షరాయలు సింహళ ద్వీపాన్ని ఆక్రమించి, అక్కడి నుంచి కప్పం వసూలు చేశాడు. ఈ కాలంలోనే రెండో బుక్కరాయలు బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షాపైకి రెండుసార్లు దండెత్తి పానగల్లు అనే ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు.


రెండో బుక్కరాయలు (1404-1406): రెండో హరిహరరాయలు మరణం తర్వాత విజయనగర చరిత్రలో మొదటి వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. యువరాజుగా ఉన్న బుక్కరాయలను కాదని విరూపాక్షరాయలు సింహాసనం ఆక్రమించాడు. తర్వాత రెండో బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్టించి రెండేళ్లు పాలించాడు. 


మొదటి దేవరాయలు (1406-1422): ఇతడి పాలన అంతా యుద్ధాలతో గడిచిపోయింది. సింహాసనాన్ని అధిష్టించిన వెంçనే బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌ షా దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1406లో ఫిరోజ్‌ షా విజయనగరంపై దండెత్తాడు. ఈ యుద్ధానికి కారణం ముద్గల్లులోని కంసలి కుమార్తె ‘నేహల్‌’ గురించి ఫిరోజ్‌ షా, మొదటి దేవరాయలు పోటీపడటం. ఇందులో మొదటి దేవరాయలు ఓడి, కుమార్తెను ఫిరోజ్‌ షాకి ఇచ్చి వివాహం చేశాడు. రెడ్డి రాజుల మధ్య ఉన్న అంతఃకలహాల్లో దేవరాయల జోక్యం కారణంగా, వీరికి గజపతులతో పోరు మొదలైంది. కళింగ రాజైన నాలుగో భానుదేవుడు రాజమహేంద్రవరంపై దండెత్తాడు. ఈ సమయంలో రెడ్డి రాజుకి మొదటి దేవరాయలు సహాయం చేశాడు. మొదటి దేవరాయల మరణం తర్వాత రామచంద్రరాయలు, విజయ రాయలు అతిస్వల్పకాలం పరిపాలించారు.


రెండో దేవరాయలు (1423-1446): ప్రౌఢ దేవరాయలుగా ప్రసిద్ధి పొందాడు. సంగమ వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడి కాలంలో విజయనగర సామ్రాజ్యం విస్తరించింది. బహమనీ సుల్తానులతో యుద్ధాలు చేశాడు. 1422లో మొదటి మహ్మద్‌ షా విజయ నగరంపై దండెత్తినప్పుడు, రెండో దేవరాయలు అతడిని ఓడించాడు. ఈ యుద్ధం అనంతరం బహమనీ సుల్తానులు వారి రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చారు. రెడ్డి రాజుల తీరాంధ్రని రెండో దేవరాయలు జయించాడు. కొండవీడును ఆక్రమించి సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని తన సామంత రాజ్యంగా చేసుకున్నాడు. సింహళం నుంచి కప్పం వసూలు చేశాడు. సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు. యుద్ధతంత్రాల్లో ఫిరంగులు, తుపాకులను ప్రవేశపెట్టాడు. ముస్లింల కోసం సైనిక శిబిరాల్లో మసీదులను నిర్మించాడు. ఇతడి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు నికోలోకాంటే (ఇటలీ), అబ్దుల్‌ రజాక్‌ (పర్షియా). ఇతడి సాహిత్య సమావేశ మందిరం ‘ముత్యాలశాల’. ఆస్థాన కవి గౌడ డిండిమ భట్టు. రెండో దేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్నది శ్రీనాథుడు. రెండో దేవరాయల తర్వాత మల్లికార్జునరాయ, రెండో విరూపాక్షరాయ రాజ్యాన్ని పాలించారు.


 

రచయిత: నరసింహా రావు


 

Posted Date : 31-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం (తుళువ వంశం)

దక్షిణ భారతంలో రాయల యుగం!


దక్షిణ భారతదేశాన్నంతటినీ ఏకం చేసి సమర్థంగా పాలించిన ఘనత మధ్యయుగంలో ఒక్క విజయనగర పాలకులకే దక్కింది. ఆ సామ్రాజ్య వైభవం, స్థాయి తుళువ వంశ పాలకుల హయాంలో పతాక స్థాయికి చేరింది. సాగునీటిపారుదల, ఆలయ నిర్మాణాల్లో వీరు చేసిన కృషి నేటికీ ప్రయోజనాలను అందిస్తోంది. ప్రాచీన కళలు, సాహిత్యాన్ని అమితంగా పోషించి, తెలుగు భాష, సంస్కృతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఈ వంశపు రాజులు, వారి విశేషాలు, సైనిక విధానాలు, రాజ్యవిస్తరణ తీరు, వారసత్వ అంతర్యుద్ధాలు, తుదివరకు ముస్లిం పాలకులతో కొనసాగిన శత్రుత్వం, పతనానికి దారితీసిన పరిస్థితుల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విజయనగర పాలకుల్లో అత్యంత గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయల విజయ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 


తుళువ వంశ మూలపురుషుడు తిమ్మరాజు. మైసూరు రాష్ట్రంలోని తుళువ ప్రాంతానికి చెందినవారు కావడంతో వీరి వంశానికి ఆ పేరొచ్చింది. తాము చంద్రవంశ క్షత్రియులమని చెప్పేవారు. 1342లో మొదటి హరిహరరాయలు తుళువ ప్రాంతాన్ని జయించడంతో, అది విజయనగర పాలకుల ఆధీనంలోకి వచ్చింది. తిమ్మరాజు కుమారుడైన ఈశ్వర నాయకుడు సాళువ నరసింహరాయలు వద్ద సేనాపతిగా పనిచేశాడు. ఇతడి బిరుదు దేవకీ పురాధిపుడు. 1481లో బహమనీ రాజు మహ్మద్‌ షాను కందుకూరు వద్ద ఓడించాడు. ఇతడి పేరు మీద దేవకీపురం అనే నగరాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీనిని దేవికాపురం అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలో ఉంది. ఈశ్వర నాయకుడి కుమారుడు నరసనాయకుడు. ఇతడి కుమారుడైన వీర నరసింహరాయలు తుళువ రాజ్య స్థాపకుడిగా నిలిచాడు. వీరి మాతృభాష కన్నడం. అయితే అధికంగా ఆదరించిన, అభిమానించిన భాష తెలుగు. తొలి తెలుగు జంట కవులైన నంది మల్లయ్య, ఘంట సింగనలు ‘వరాహ పురాణం’ రచించి తుళువ నరసనాయకుడికి అంకితం ఇచ్చారు.


వీరనరసింహరాయలు (1505 - 1509): తక్కువ కాలం రాజ్యపాలన చేశాడు. అనేకమంది విజయనగర సామంతులు ఇతడిపై తిరుగుబాటు చేశారు. వారిలో ఆదోని రాజు కానప్ప వడయార్, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం రాజు గుండరాజు ముఖ్యులు. దీనికితోడు బహమనీ సుల్తాన్‌ మహ్మద్‌ షా, బీదర్‌లో ఒక సమావేశం ఏర్పాటుచేసి ఏటా హిందువులపై జిహాద్‌ జరపాలని నిర్ణయించాడు. బహమనీ రాజు యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ విజయనగరంపై దండెత్తాడు. ఈ సమయంలో ఆదోని పాలకుడు కానప్ప వడయార్‌ ఆదిల్‌ఖాన్‌కు సహాయపడ్డాడు. ఆదిల్‌ఖాన్‌ను ఓడించి తరిమివేసింది కందనవోలు ప్రాంతానికి చెందిన రామరాజు, అతడి కుమారుడు తిమ్మరాజు. ఈ విజయంతో వీరనరసింహరాయలు కుందనవోలు, ఆదోని ప్రాంతాలను వారికి ఇచ్చారు.


వీరనరసింహరాయలకు పోర్చుగల్‌ గవర్నర్‌ ‘ఆల్మిడా’తో స్నేహ సంబంధాలు ఉండేవి. పోర్చుగీసు వారు పశ్చిమ తీరం నుంచి దిగుమతి చేసుకునే గుర్రాలను తనకు అమ్మాలని ఒప్పందం చేసుకున్నాడు. దాంతో విజయనగర సామ్రాజ్యంలో పటిష్టమైన అశ్వదళం సిద్ధమైంది. రైతుల కోసం వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ప్రజా సంక్షేమం కోసం సుంకాలు రద్దు చేశాడు. కూచిపూడి నృత్యాన్ని ఆదరించాడు. చివరి రోజుల్లో ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్టణంపై దాడి చేసి ఓటమి పాలయ్యాడు. వ్యాధిగ్రస్థుడై 1509లో మరణించారు.


శ్రీకృష్ణదేవరాయలు (1509 - 1529): విజయనగరాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో గొప్పపాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రభోజుడు, యవనరాజ్య స్థాపనాచార్య, సాహితీ సమరాంగణ సార్వభౌమ, గజపతిగజకూటహర మొదలైనవి ఈయన బిరుదులు. తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగమాంబ. ఆస్థాన మంత్రి సాళువ తిమ్మరసు. కృష్ణదేవరాయలు రాసిన గ్రంథాలు ఆముక్తమాల్యద (తెలుగు), ఉషాపరిణయం (సంస్కృతం), జాంబవతి పరిణయం (సంస్కృతం). ఈయన సాహిత్యభవనం పేరు ‘భువన విజయం’. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని పేర్కొన్నాడు. వీరనరసింహరాయల సవతి తల్లి కుమారుడైన శ్రీకృష్ణదేవరాయలకు 1509, ఆగస్టు 8న పట్టాభిషేకం జరిగింది. హంపీ శిలాశాసనం ఆయన గుణగణాలను వివరిస్తుంది. రాజు కావడానికి సహకరించింది సాళువ తిమ్మరుసు. ఈ విషయం గురించి న్యూనిజ్‌.రచనల్లో తెలిసింది. కృష్ణదేవరాయల బాల్యమంతా తిమ్మరసు పరిరక్షణలో గడిచింది. ఆయన శిక్షణలో సకల విద్యల్లో ఆరితేరాడు. తిమ్మరుసుని కృష్ణదేవరాయలు ‘అప్పాజీ’ అని సంబోధించేవాడు. కృష్ణదేవరాయల సమకాలీన రాజులు బాబర్‌ (మొగల్‌ చక్రవర్తి), మహ్మద్‌ షా (బహమనీ).


కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై 5 రాజ్యాలుగా విడిపోయింది. రాయచూర్, అంతర్వేదిని యూసఫ్‌ ఆదిల్‌ షా ఆక్రమించాడు. విజయనగర సామంతులైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణం పాలకులు తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తూర్పున కళింగరాజు ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరిని ఆక్రమించాడు. ఆనాటి విదేశీ వర్తకులైన పోర్చుగీసు వారు స్థానిక రాజులను ఎదిరించి కోటల నిర్మాణం చేస్తున్నారు. ఈ సమయంలో కృష్ణదేవరాయలు ‘శత్రువు శత్రువులు మిత్రులు’ అన్న రాజనీతిని అనుసరించి బీజాపూర్‌ సుల్తానుకు శత్రువులైన పోర్చుగీసు వారితో స్నేహం చేశాడు. వారు ‘గోవా’ని ఆక్రమించుకోడంలో సహాయపడ్డాడు. ఆనాటి పోర్చుగల్‌ గవర్నర్‌ ఆల్బూకర్క్‌. 1510లో ఆల్బూకర్క్‌కి, కృష్ణదేవరాయలకి మధ్య పోర్చుగల్‌ రాయబారి ‘లూయిడ్‌ ప్రయర్‌’ సంధి కుదిర్చారు. దీంతో కృష్ణదేవరాయలు పోర్చుగల్‌ నుంచి మేలుజాతి గుర్రాలు, మందుగుండు సామగ్రి దిగుమతి చేసుకున్నాడు. పోర్చుగీసువారితో తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు.


కృష్ణదేవరాయల దండయాత్రలు: సైన్యాన్ని పటిష్టం చేసుకుని, ఆర్థిక వనరులు సమకూర్చుకున్న తర్వాత రాజ్య విస్తరణకు సిద్ధమయ్యాడు.


బహమనీ సుల్తానులతో యుద్ధాలు: 1509లో బీజాపూర్‌ సుల్తాన్‌ యూసఫ్‌ ఆదిల్‌ షా, బీదర్‌ సుల్తాన్‌ మామూద్‌ షా ‘జిహాద్‌’ను ప్రకటించి విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. వారిని కృష్ణదేవరాయలు దివానీ, కొవిలకొండ యుద్ధాల్లో ఓడించి తరిమివేశాడు. శత్రువులైనప్పటికీ బీజాపూర్‌ సుల్తాన్‌ మరణం తర్వాత అతడి కుమారుడు ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా, బీదర్‌ పాలకుడు మామూద్‌ షా సింహాసనం అధిష్టించడానికి సహాయపడి రాజనీతిని ప్రదర్శించారు. ఆ సమయంలో పొందిన బిరుదు ‘యవనరాజ్య స్థాపనాచార్య’ఉమ్మత్తూరుపై దాడి: ఈ ప్రాంత పాలకుడైన గంగరాజు శివసముద్ర దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని రాయల అధికారాన్ని ధిక్కరించాడు. కృష్ణదేవరాయలు గంగరాజుపై దాడి చేసి ఉమ్మత్తూరు, శివసముద్ర దుర్గాలను నేలమట్టం చేశారు.  కావేరి నదిలో దూకి గంగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణదేవరాయలు శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత దానిని రాజధానిగా చేసుకుని రాష్ట్రంగా పునర్నిర్మించాడు. తన ప్రతినిధిగా సాళువ గోవిందుడిని అక్కడ నియమించాడు. సైనిక అధికారులైన విజయప్ప, వేంకటప్ప, వీరరాఘవలతో కన్యాకుమారి వరకు రాజ్యాన్ని విస్తరించి ‘ **దక్షిణ దేశాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.


ఉదయగిరిపై దండయాత్ర: ఈ ప్రాంత పాలకుడు తిరుమలరాయలు గజపతులకు సామంతుడు. ఇతడిని కృష్ణదేవరాయలు ఓడించారు. ఈ కోటలో లభించిన బాలకృష్ణుడి విగ్రహాన్ని హంపీకి తీసుకొచ్చి కృష్ణాలయం నిర్మించారు. ఈ విజయం తర్వాత కృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నాదేవిలతో తిరుపతిని సందర్శించారు. వీరి విగ్రహాలు తిరుమలలో ప్రధాన ద్వారం వద్ద ఉన్నాయి. మహామంత్రి తిమ్మరుసు ఆధ్వర్యంలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించారు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న తీరాంధ్ర దేశం రాయల వశమైంది. అనంతరం కొండపల్లి, రాజమహేంద్రవరం, సింహాచలం, పోట్నూరు, కళింగ రాజధాని కటక్‌లను కైవసం చేసుకున్నాడు.కృష్ణదేవరాయలతో ప్రతాపరుద్ర గజపతి సంధి చేసుకుని, తన కుమార్తె అన్నపూర్ణదేవిని ఇచ్చి వివాహం చేశాడు.

రాయచూరు యుద్ధం: కృష్ణదేవరాయలు రాయచూర్‌ను ఆక్రమించుకున్నారు. ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా గతంలో ఆక్రమించిన అంతర్వేదిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోర్చుగల్‌ సేనాని క్రిస్టోసిరి పోగారిడో సాయం చేశాడు. 1523లో గుల్బర్గా కూడా రాయల వశమైంది.

శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తె తిరుమలాంబను అరవీటి అళియ రామరాయలుకు ఇచ్చి వివాహం చేశాడు. 1528లో కుమారుడు తిరుమల రాయలకి పట్టాభిషేకం చేయించాడు. తిరుమల రాయలు అకాల మరణంతో సోదరుడు అచ్యుతరాయలను తన వారసుడిగా ప్రకటించాడు. 1529లో మరణించారు. భారతదేశంలోని మేటి చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరుగా నిలిచారు. ఇతడి పాలనా కాలం విజయనగర చరిత్రలో స్వర్ణయుగం. బాబర్‌ కూడా ‘తుజిక్‌-ఇ-బాబరీ’లో కృష్ణదేవరాయల గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఇతడి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు డోమింగ్‌ఫేస్‌ (కృష్ణదేవరాయల భౌతిక స్వరూపం గురించి వివరించారు), సి.బార్బోసా (పరిపాలన గురించి వివరించారు).


అచ్యుత దేవరాయలు (1529 - 42): ఇతడి గురించి వివరించిన పోర్చుగల్‌ యాత్రికుడు న్యూనిజ్‌. కృష్ణదేవరాయల మరణం తర్వాత అచ్యుత దేవరాయలు రాజు అయ్యాడు. ఇతడి సేనాని అళియ రామరాయలు కూడా సింహాసనం కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో రామరాయలకు, అచ్యుతరాయలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత అచ్యుత రాయలు రాజ్య వ్యవహారాలను తన బావమరిది చినతిరుపతిరాయల పరం చేశాడు. వ్యసనాలకు బానిసై, చివరకు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.


మొదటి వేంకటపతిరాయలు (1542 - 1543): అచ్యుతదేవరాయ కుమారుడు. బాలుడు కావడంతో అతడి మేనమామ చినతిరుమలరాయలు రక్షకుడిగా రాజ్యపాలన సాగించాడు. చినతిరుమల రాయలు, అతడి సోదరుడు పెదతిరుమల రాయలు మొదటి వేంకటపతి రాయలను చంపి సింహాసనం అధిష్టించారు. ఈ విషయం తెలుసుకున్న అళియ రామరాయలు గుత్తి నుంచి బయలుదేరి పెనుగొండను ఆక్రమించి పెద తిరుమలరాయలను, చిన తిరుమలరాయలను వధించి సదాశివరాయలను రాజుగా ప్రకటించాడు.


సదాశివ రాయలు (1543-1576): తుళువ వంశంలో చివరివాడు. పేరుకు మాత్రమే రాజు. అధికారమంతా అళియ రామరాయలదే. ఇతడు సమర్థుడు, యోధుడు, రాజనీతి చతురుడు. మొదట గోల్కొండ సుల్తానులు కుతుబ్‌ షాహీల ఆస్థానంలో సేనాపతిగా ఉండేవాడు. ఆదిల్‌ షాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి అవమానం ఎదుర్కొన్నాడు. దాన్ని సహించలేక వచ్చి కృష్ణదేవరాయల కొలువులో చేరాడు.


అళియ రామరాయలు బహమనీ సుల్తానులతో యుద్ధాలు చేసి రాజ్యం విస్తరించాడు. 1565, జనవరి 26న జరిగిన యుద్ధాన్ని తళ్లికోట యుద్ధం/బన్నిహట్టి యుద్ధం/రాక్షస తంగడి యుద్ధం అని అంటారు. ఇందులో బహమనీ సుల్తానులు ఇబ్రహీం కుతుబ్‌ షా (గోల్కొండ), హుస్సేన్‌ నిజాం షా (అహ్మద్‌ నగర్‌), ఆలీబరీద్‌ షా (బీదర్‌), ఆలీదిల్‌ షా (బీజాపూర్‌) పాల్గొన్నారు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు, అతడి సోదరుడు వేంకటాద్రి రాయలు మరణించారు.. తిరుమలరాయలు, సదాశివ రాయలు పెనుగొండకు పారిపోయారు. కొంతకాలానికి సదాశివరాయలు మరణించాడు.



 

 


రచయిత: గద్దె నరసింహారావు
 

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విజయనగర సామ్రాజ్యం

సంప్రదాయ రాచరికంలో ప్రగతి పాలన!


దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర యుగం మహోజ్వల ఘట్టం. సుమారు మూడు వందల ఏళ్ల పాటు కృష్ణా నదికి దక్షిణ ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించింది. ముస్లిం దాడుల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడి, హిందూ సంస్కృతిని సంరక్షించింది. నీటిపారుదల రంగానికి సాంకేతికతను జోడించి వ్యవసాయంలో వెలుగులు నింపింది. సువిశాల సామ్రాజ్యాన్ని విభజించి వ్యవస్థాగత పాలన అందించింది. సమగ్ర పన్నుల విధానంతో ఆర్థికంగా, సైనికంగా శక్తిమంతంగా మారింది. నాటి రాజకీయ వ్యవస్థ, పరిపాలనా విధానాలు, చక్రవర్తితో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులు, ముఖ్యమైన పన్నులు, పరిశ్రమలు, స్వదేశీ, విదేశీ వాణిజ్యాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


విజయనగర సామ్రాజ్యం అంటే కేవలం ఆంధ్రా ప్రాంత సామ్రాజ్యమే కాదు. దక్షిణ భారతదేశంలో భిన్న భాషా ప్రజల సముదాయం. ఇందులో ఆంధ్రులు, కన్నడికులు, తమిళులు ఉన్నారు.


పరిపాలన: విజయనగర పరిపాలన తెలుసుకోవడానికి ఆధార గ్రంథాలు ఆముక్తమాల్యద (శ్రీకృష్ణదేవరాయలు), రాయవాచకం (స్థానపతి), న్యూనిజ్సకలనీతి సమ్మతం (మడిక సింగన), పోర్చుగల్‌కు చెందిన డొమింగో పేజ్, న్యూనిజ్‌ రచనలు. వీరి పరిపాలన సంప్రదాయబద్ధ రాచరికం. సర్వాధికారి రాజు. సైనిక కేంద్రంగా పరిపాలన జరిగేది. రాజ్య రక్షణ, విస్తరణ కోసం రాజ్యాల మధ్య ఎడతెగని పోరాటాలు జరిగేవి. పరిపాలనలో రాజుకి సలహా ఇవ్వడానికి మంత్రి పరిషత్తు ఉండేది. దానికి అధ్యక్షుడు సర్వశిర (ప్రధాని). కృష్ణదేవరాయల కాలంలో ‘తిమ్మరసు’ సర్వశిరగా ఉన్నారు.  ఈ ప్రధానిని ‘సభానాయక’, ‘తంత్రనాయక’, కార్యకర్త అని పిలిచేవారు. మంత్రి పరిషత్తు సమావేశాలు తరచుగా రహస్యంగా జరిగేవి. ముఖ్యమైన వాటికి అధ్యక్షుడు - చక్రవర్తి. పరిపాలనా సౌలభ్యం కోసం రాజులు రాజ్యాన్ని విభజించారు.


రాష్ట్రం: బలమైన, ప్రధానమైన విభాగం. రాష్ట్రాలను రాజ్యాలుగా వ్యవహరించేవారు. వీటి పాలకులను రాజ్య ప్రతినిధులు లేదా దుర్గ దండనాయకులు అనేవారు. వీరు సాధారణంగా రాజకుమారులై ఉండేవారు. వీరికి నాణేలు ముద్రించే అధికారం, పన్నులు మినహాయించే అధికారం, కొత్త పన్నులు విధించే అధికారం ఉండేది. ఈ ప్రాంత అధికారులకు ఓడియ లేదా వడియార్‌ అన్న బిరుదులుండేవి. ఇలాంటి రాజ్యాలు అచ్యుతరాయల కాలంలో 17 ఉన్నట్లు శాసనాల్లో ఉంది.


సీమ: రాష్ట్రాలను సీమలుగా విభజించారు. రాజ్యంలో ముఖ్య విభాగం, స్థలాల సముదాయం. సీమ ముఖ్య అధికారి పారుపత్వంగారు. ఇతడు రెవెన్యూ విధులు నిర్వహిస్తాడు.పనిచేసే ప్రదేశాన్ని ‘చావడి’ అని పిలిచేవారు. విధి నిర్వహణలో కరణాలు అనే ఉద్యోగులు సహాయపడేవారు. ఆజ్ఞలను రాసే వ్రాయసగాండ్రు, రాజు దర్శన సమయం నిర్ణయించే ‘అవసరలు’ అనే అధికారులు ఉండేవారు.


స్థలం: కొన్ని గ్రామాల సముదాయం. ఒక్కో ‘స్థలం’లో 10 నుంచి 60 గ్రామాలుండేవి. ఈ ప్రాంతానికి పెద్దలు రెడ్డి లేదా గౌడ. స్థల కరణాలు అధికారులు. కావలిదారు శాంతిభద్రతల విధులు నిర్వహించేవారు.


గ్రామం: చివరి పరిపాలన విభాగం. గ్రామంలో ‘ఆయగాండ్రు’ అనే 12 మంది అధికారులు ఉండేవారు. వారు కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కంసాలి, కుమ్మరి, వడ్రంగి, కాసె (ఇళ్లు కట్టేవారు), కమ్మరి, చాకలి, మంగళి, మాదిగ. వీరిలో ముఖ్యలు రెడ్డి - గ్రామ పెద్ద, కరణం - భూసంబంధ లెక్కలు చూసే అధికారి, తలారి - గ్రామ పోలీసు, పురోహితుడు - మంచి చెడులు చూసే అధికారి. వీరి పదవి సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చేది. గ్రామ అధికారులకు ‘మిరాశి’ మాన్యాలు ఉండేవి. వీటినే భట్టు వృత్తి మాన్యాలు లేదా జాతికట్టు మాన్యాలు అనేవారు. ఆయగాండ్రు మిరాశి భూములపై చెల్లించే పన్ను ‘జోడి’. సామ్రాజ్యంలో అయిదు రకాల గ్రామాలుండేవి.


అమర గ్రామాలు: సైనిక వ్యయానికి కేటాయించిన ప్రత్యేకమైన రెవెన్యూ గ్రామాలు. వీటి అధికారులను అమరనాయకుడు లేదా పాలెగారు అనేవారు. సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు ఇక్కడి నుంచి వచ్చినవే.


బ్రహ్మదీయ గ్రామాలు: ఇవి పండితులకు ఇచ్చిన గ్రామాలు. వీరు ప్రభువులకు శాస్త్రాలు, విద్యలు నేర్పుతారు. ఆ ప్రాంతాలను అగ్రహారాలు లేక శ్రోత్రియాలని పిలిచేవారు. వీటికి పన్నుల మినహాయింపు ఉండేది.


దేవాదాయ, మఠపుర గ్రామాలు: ఇవి మఠాధిపతులకు ఇచ్చిన గ్రామాలు. వీరు శైవవైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేసేవారు. ఈ గ్రామాలపై బోడి లేదా శ్రోత్రియం అనే పన్ను విధించేవారు.


ఉబ్బిలి గ్రామాలు: రాజుకు సేవ చేసిన ఉద్యోగులు, కవులు, కళాకారులకు ఇచ్చిన గ్రామాలు.


భండారవాడ గ్రామాలు: రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే గ్రామాలు. వీటి ద్వారా వచ్చే ఆదాయం రాజుకి చెందుతుంది. రాజోద్యోగులు నేరుగా నిర్వహించేవారు. ఈ గ్రామాల్లో కొన్నింటిని పన్ను వసూలుకు గుత్తకు ఇచ్చేవారు. ఇవి సాధారణంగా ‘స్థలపతి’ అధీనంలో ఉండేవి.


ఆర్థిక పరిస్థితులు: ప్రధాన వృత్తి వ్యవసాయం. ముఖ్య ఆదాయ వనరైన భూమిశిస్తుకు సంబంధించిన పత్రాలను అథువన తంత్రం అంటారు. వ్యవసాయ అభివృద్ధికి కాలువలు, చెరువులు నిర్మించారు. పెనుకొండ సమీపంలో శిరువేరు తటాకాన్ని మొదటి బుక్కరాయలు నిర్మించాడు. అనంతపురంలో నరసాంబుధి తటాకాన్ని సాళువ నరసింహరాయలు,  నాగులపురం, కంభం చెరువులను శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. పోర్చుగీసు వారి సహాయంతో తుంగభద్ర నదిపై ఆనకట్టను కూడా ఆయనే కట్టించాడు. బుక్కరాయల ప్రతినిధి భాస్కరుడు పోరుమామిళ్ల వద్ద అనంతసాగరం చెరువు తవ్వించాడు. చెరువు మరమ్మతులకు ఇచ్చే భూమి దశబంధు మాన్యం లేదా కట్టుకోడగ. వీరికాలంలో విలాస వస్తువు వరి అన్నం.

రాజ్యంలోని భూములను రెండు తరగతులుగా విభజించారు. 

1) వ్యవసాయ యోగ్యమైన భూమి 

2) వ్యవసాయ యోగ్యం కాని భూమి.


వ్యవసాయ యోగ్యం కాని భూములపై పుల్లరి అనే స్వల్ప ఆదాయం వచ్చేది. నీటివసతి ఉన్న భూమిని నిరాంబిక (మాగాణి), నీటి వసతి లేని భూమిని కాడాంభర (మెట్ట) అని పిలిచేవారు. నిరాంబికపై  ధాన్యరూపంలో, కాడాంభరపై ధనరూపంలో పన్ను ఉండేది. నిరాంబిక భూములపై సాధారణంగా 1/2 (సంగోరు), 1/3 (ముంగోరు) వసూలు చేసేవారు. కొన్నిరకాల ఇనాము భూములపై 1/6 వంతు పన్ను వసూలు చేసేవారు. రాజుకి మరో ప్రముఖ ఆదాయం ‘శుల్కాదాయం’. ఇది వర్తకం మీద విధించే పన్ను. శ్రీరంగపట్నం వద్ద ఉన్న తామ్రశాసనం వీరి కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి వివరిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు వివాహ పన్నును పూర్తిగా రద్దు చేశాడు. సమయసుంకం అనే కొత్త పన్ను ప్రవేశపెట్టారు. ఇది కుల కట్టుబాట్లు పాటించని వారిపై వేసే శిక్షల వల్ల వచ్చే ఆదాయం. 


ప్రతి ప్రభుత్వ శాఖ అధ్యక్షుడిని ‘సంప్రతి’ అని పిలిచేవారు. ప్రభుత్వ శాఖల సమాచారం స్థానపతి రాసిన రాయవాచకంలో ఉంది. ప్రతి శాఖలో ఒక సంప్రతి, అతడి కింద లెక్కలు రాయడానికి కరణాలు ఉండేవారు. ప్రతి శాఖ కార్యాలయం పేరు ‘రాయసం’. నాటి ప్రముఖ శాఖలు అట్టవన- రెవెన్యూ అధికారి, కందాబార- సైనిక శాఖ, పటేల్‌ - గ్రామపెద్ద, తలారి-గ్రామ పోలీసు, సుంకాధికారి - పన్నువసూలు, ప్రాడ్వివాక్కులు- న్యాయాధికారులు. భాండారశాఖ- కోశ శాఖ, ధర్మాసన- న్యాయశాఖ, బేగరి - వెట్టిచాకిరి పర్యవేక్షణ, మదనార్కుడు- అశ్వశాల ప్రధానాధికారి. రాయబారులను స్థానపతులు అనేవారు.


పరిశ్రమలు: లోహ, వస్త్ర, వజ్ర, దంత పరిశ్రమలు ప్రధానమైనవి. నూనెలు, బెల్లం తయారీ కుటీర పరిశ్రమలుగా ఉండేవి. కలంకారీ వస్త్రాలు, మస్లిన్‌ వస్త్రాలు ప్రసిద్ధి. నాటి వస్త్రపరిశ్రమ కేంద్రాలు తాటిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ మొదలైనవి. వజ్రాల పరిశ్రమకు కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రముఖ కేంద్రాలు. బంగారం, వెండి నగలు, ఇనుము, కంచు, లోహాలతో గృహోపకరణాలు తయారీకి ‘పంచాణం’ అనే లోహపరిశ్రమ ఉండేది. ఆనాటి ప్రముఖ వర్తక కేంద్రాలుగా పెనుగొండ, వినుకొండ, ఆధోని, మార్కాపురం, మంగళగిరి ఉండేవి. ప్రధాన రేవు పట్టణాలు కాలికట్, కన్ననూర్, మచిలీపట్నం, మోటుపల్లి. వీరికాలం నాటి విదేశీ వర్తకం గురించి వివరించిన విదేశీయులు బార్బోసా, అబ్దుల్‌ రజాక్‌. వర్తక సంఘాల ద్వారా విదేశీ, స్వదేశీ వ్యాపారం జరిగేది. వర్తకసంఘ అధికారిని శెట్టి/శ్రేష్ఠి అనేవారు.


ఎగుమతులు: సుగంధద్రవ్యాలు, కళంకారీ వస్త్రాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు, వజ్రాలు.


దిగుమతులు: గుర్రాలు, ముత్యాలు, చైనాపట్టు పాదరసం, మందుగుండు సామగ్రి. 


నాణేలు: బంగారం - వరాహ, ప్రతాప, పణం, చిన్నం, కాట; వెండి - తార్, మాన్, ఘట్టె, పన్, పెసాడో. రాగి - జిటలు కాసులు.  అన్నిటికంటే పెద్ద నాణెం వరాహ. 


 


రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌