• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు
భారతదేశంలో వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశికసూత్రాలను అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, వీటిని న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణమైంది. కోర్టుల తీర్పులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది. వాటిలో కీలకమైనవి..

1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
కామేశ్వరిసింగ్‌  vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1951, జూన్‌ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆర్టికల్‌ 15కు క్లాజు (4) ను చేర్చింది. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం పొందింది.
* ఆర్టికల్‌ 19ని సవరించి ఆర్టికల్‌ 19(6)కి వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వానికి ఉన్న హక్కును ధ్రువీకరించింది.
* ఆర్టికల్‌ 31ని సవరించి, ఆర్టికల్స్  31(A), 31(B)లను కొత్తగా చేర్చి, వాటిని IXవ షెడ్యూల్‌లో పొందుపరచి, భూసంస్కరణలు, జమీందారీ విధానం రద్దుకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. IXవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.

4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
* బేలాబెనర్జీ కేసులో ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1955, ఏప్రిల్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు, అందుకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని నిర్దేశించింది. అంటే ఈ చట్టాలకు న్యాయసమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది.

16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963
* 1963లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1963, అక్టోబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని సవరించి, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల సంరక్షణ కోసం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
* భారతదేశ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికయ్యే వ్యక్తులు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతామనే మాటలతో చేయాల్సిన ప్రమాణపత్రాన్ని పొందుపరిచారు.

17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964
* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1964, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు..
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌  31(A)ని సవరించి ప్రజాశ్రేయస్సు కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* గోలక్‌నాథ్‌ vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1971, నవంబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.

25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1972, ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి చేర్చారు.
* ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడు  తగినంత ‘నష్ట పరిహారం’ ఇవ్వలేదనే కారణంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
* ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్‌ రూపొందించే శాసనాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ‘నష్టపరిహారం’ నిర్ణయంపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించారు. అయితే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి.
* అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు. ఇందులోని అనేక అంశాలు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్‌ 31, 31(C) లను సవరించారు.
* ఆర్టికల్స్‌ 31(D), 32(A)లను ప్రాథమిక హక్కులకు చేర్చారు.
* ఆదేశిక సూత్రాలను అమలుచేస్తున్న సందర్భంలో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని నిర్దేశించారు. దీని ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యాన్ని కల్పించారు. న్యాయస్థానాలకు ఉన్న ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని తొలగించారు.

43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977
* 1977లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1978, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్‌ 31(D), 32(A) లను రాజ్యాంగం నుంచి తొలగించారు.
* న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని పునరుద్ధరించారు.

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులోని అనేక అంశాలు 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* ఆర్టికల్,  19(1)(f) ను స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు నుంచి తొలగించారు.
* ఆస్తిహక్కును వివరించే ఆర్టికల్‌ 31ని తొలగించారు.
* ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, దీన్ని ఆర్టికల్‌  300(A) లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22ను సవరించి, నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి:
1. సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. 
2. సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే అధ్యక్ష పదవిలో నియమించాలి. సభ్యులుగా పదవిలో ఉన్న లేదా పదవీవిరమణ చేసిన జడ్జిలు ఉండొచ్చు.
3. పార్లమెంట్‌ రూపొందించిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే, ఏ వ్యక్తినీ ఎక్కువ రోజులు నిర్బంధించకూడదు. ఎవరైనా వ్యక్తిని 2 నెలలకు మించి నివారక నిర్బంధ చట్టం ప్రకారం అరెస్టు చేయాలనుకుంటే సలహాసంఘం అనుమతి తప్పనిసరి.

77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1995, జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 16ను సవరించి, ఆర్టికల్‌ 16(4)  ను రాజ్యాంగానికి చేర్చి ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.

86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
* 2002లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2002 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21ని సవరించి, 21(A) చేర్చారు. దీని ద్వారా 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలందరికీ ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు’ను నిర్దేశించారు.

93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2006 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 15ని సవరించి, ఆర్టికల్‌ 15(5)ను కొత్తగా చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించారు.

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2012 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19ని సవరించి, ఆర్టికల్‌ 19(1)(C) లో “Co-operative societies”  అనే పదాన్ని చేర్చి, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

మాదిరి ప్రశ్నలు

1. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: గోలక్‌నాథ్ కేసు

2. రాజ్యాంగ మౌలిక స్వభావం గురించి సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
జ: కేశవానంద భారతి కేసు

3. '31 C' ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు?
జ: 25

4. స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలు కల్పించాలని చెబుతోన్న అధికరణం ఏది?
జ: 42

5. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
జ: పంచాయతీరాజ్ వ్యవస్థ

6. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ అధికరణం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు?
జ: గాంధేయవాద నియమం

7. నిరుద్యోగులు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఏ అధికరణం చెబుతోంది?
జ: 41

8. కార్మికుల కనీస వేతన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1948

9. కుటీర పరిశ్రమలు ఏ జాబితాకు చెందినవి?
జ: రాష్ట్ర జాబితా

10. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు వేసిన మహిళ?
జ: షయారా బానో

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - సుప్రీంకోర్టు తీర్పులు

        భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం ద్వారా లేదా మరే విధంగానైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఒరిజినల్ అధికార పరిధి లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (కేసును నేరుగా తనే స్వీకరించి, విచారించి, తీర్పు ఇవ్వడం) కిందకు వస్తాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, పార్లమెంటు చేసిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాలు చేస్తూ అనేక వివాదాలు కోర్టుల్లో విచారణకు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి......

I. సమానత్వ హక్కు (నిబంధనలు 14-18)
నిబంధన 14: చిరంజిత్ లాల్ చౌదరి Vs కేంద్ర ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు (హెచ్.జె.కానియా) తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేస్తారని తెలిపింది.
* బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రక్షణ దళాలు, రాయబారులకు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
* సాఘీర్ అహ్మద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కేసు (1955)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా భావించి, తనకు అనుకూలంగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని తెలియజేసింది.
సుభాచంద్ Vs ఢిల్లీ ఎలక్ట్రికల్ సప్త్లె కేసు (1981) లో ప్రభుత్వ సర్వీసుల నియామకంలో వయసు, విద్యార్హతలు, కులం, లింగం మొదలైన అంశాల్లో వివక్ష చూపించడం, సమాన అవకాశాన్ని కల్పించే పరిధిలో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
* అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Vs కేంద్ర ప్రభుత్వ కేసు (1988) లో విధులు, కర్తవ్యాలు ఒకే స్వభావం కలిగి ఉన్నా, బాధ్యతల పరిమాణం వేరుగా ఉన్నప్పుడు సమాన పనికి, సమాన వేతన నియమం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* సమాన పని, సమాన విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఇతర తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులకు కూడా, శాశ్వత ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించాలని పంజాబ్‌లోని తాత్కాలిక ఉద్యోగులు వేసిన రిట్ పిటీషన్ కేసు - 2016 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నిబంధన 15: చంపకందొరై రాజన్ Vs మద్రాసు ప్రభుత్వం కేసు (1951)లో ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చి చెప్పింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 15 (4) క్లాజును చేర్చింది.
* యం.ఆర్.బాలాజీ Vs మైసూరు రాష్ట్ర ప్రభుత్వం (1963) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రిజర్వేషన్లు 50% కి మించరాదు అని స్పష్టం చేసింది.
* అయితే 76 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 ద్వారా తమిళనాడులో కల్పించిన 69% రిజర్వేషన్లు రాజ్యాంగంలోని IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీని ద్వారా న్యాయసమీక్షాధికారానికి వీలు లేకుండా చేసింది. కానీ, 2006 లో సుప్రీంకోర్టు IXవ షెడ్యూల్ లోని అంశాలపై కూడా న్యాయసమీక్షాధికారం వర్తిస్తుందని తెలిపింది.
ఇనాందార్ Vs మహారాష్ట్ర ప్రభుత్వం (2005) కేసులో మైనారిటీ, మైనారిటీయేతర నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 ద్వారా 15 (5) క్లాజును చేర్చింది. దీని ప్రకారం 30 (1) నిబంధనను అనుసరించి ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.

నిబంధన 16: దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1964) లో సుప్రీంకోర్టు క్యారీ ఫార్వర్డ్ రూల్ (రిజర్వేషన్ల విషయంలో) చెల్లదని తెలిపింది.
* ఎ.వి.ఎస్.నరసింహారావు Vs ఆంధ్రప్రదేశ్ (1970) కేసులో ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను రాష్ట్రం మొత్తంలో నివసిస్తున్న అందరికీ రిజర్వ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనల చట్టాన్ని రద్దు చేసింది.
* ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ క్రీమీ లేయర్‌ను గుర్తించాలని పేర్కొంది.
* షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లవని కొట్టివేసింది.
* దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 77 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా 16 (4) క్లాజును చేర్చింది.

నిబంధన 18: బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పురస్కారాలు మాత్రమే అని, బిరుదులు కావని, వీటిని పేరుకు ముందు లేదా తర్వాత వాడటం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.

II. స్వేచ్ఛ-స్వాతంత్య్ర హక్కు (నిబంధనలు 19-22)
నిబంధన 19: బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు (1950)లో సుప్రీంకోర్టు (సయ్యద్ ఫజుల్ అలీ నాయకత్వంలోని బెంచ్) తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని తెలిపింది.
* కానీ కె.ఎ.అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1970)లో సుప్రీంకోర్టు (హిదయతుల్లా) తీర్పునిస్తూ సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తెలిపింది.
* మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోపల, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భావవ్యక్తీకరణకు భౌగోళిక హద్దులు లేవని తెలిపింది.
* బిజయ్ ఎమాన్యూల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో సుప్రీంకోర్టు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలో మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది అని అభిప్రాయపడింది. ఇది జాతీయ గీతం కేసుగా ప్రచారం పొందింది.
* అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో సుప్రీంకోర్టు, ప్రజా సంక్షేమం దృష్ట్యా వాహన డ్రైవర్లు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
* సోదన్ సింగ్ Vsన్యూదిల్లీ మున్సిపల్ కమిటీ (ఎన్‌డీఎంసీ) కేసు (1989) కు సంబంధించి సుప్రీంకోర్టు 1992లో తీర్పునిస్తూ క్రమబద్దీకరించిన రహదార్ల కాలిబాటలపై వ్యాపారం చేసుకునేందుకు (జీవనోపాధి) హాకర్లకు హక్కు ఉందని తెలియజేసింది.
సి.పి.ఐ.(యం) Vs భరత్ కుమార్ (1997) కేసులో సుప్రీంకోర్టు బంద్, హర్తాల్ మధ్య తేడాలను తెలియజేయడంతో పాటు బంద్ అనేది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
* రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (2003) కేసులో సుప్రీంకోర్టు, సమ్మె ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ కార్మికులు లేదా ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది.
* శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66A భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, చెల్లదని స్పష్టం చేసింది. (నేపథ్యం- 2012 లో స్వర్గీయ బాల్ థాకరే మరణం తర్వాత ముంబయి బంద్‌కు పిలుపునివ్వడంపై షహీన్ దాదా, రీను శ్రీనివాసన్ తమ అసంతృప్తిని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. కానీ ప్రజావ్యతిరేకత రావడంతో విడుదల చేశారు).

నిబంధన 20: నందిని సాత్పతి Vs డాని పి.ఎల్. (1978) కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని వివరించింది.
* స్వయంగా నిందను ఆపాదించుకోకూడదు.
* మౌనాన్ని పాటించే హక్కు నిందితుడికి ఉంటుంది.
* శారీరకంగా బెదిరించి, హింసించి పొందిన సాక్ష్యం, మానసిక క్షోభ కలిగించడం, ప్రతికూల పరిసరాలను కల్పించి ఒత్తిడి తేవడం, పదేపదే ప్రశ్నలు అడిగి విసిగించడం, శక్తికి మించిన బరువు, బాధ్యతలు మోపడం, బలవంతంగా నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ఉపయోగించే ప్రత్యక్ష లేదా పరోక్ష, మానసిక లేదా శారీరక క్షోభకు గురిచేయడం బలవంతపు సాక్ష్యం కిందికి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది.
ఎ.ఎ.ముల్లా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1996) కేసులో సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టం కింద విచారించి నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని, తిరిగి కస్టమ్స్ చట్టం, విదేశీమారక క్రమబద్దీకరణ చట్టం కింద రెండో విచారణ నిర్వహించడం 20 వ నిబంధనకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. రెండు విచారణల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని మొదటి, రెండో విచారణల్లోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి రెండో విచారణ నిర్వహించవచ్చని వ్యాఖ్యానించింది.

నిబంధన 21: ఎ.కె.గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు (1950) కేసులో సుప్రీంకోర్టు 19, 21 ప్రకరణలు లేదా నిబంధనల పరిధులు వేరని తెలిపింది. 21 వ నిబంధనను అనుసరించి చేసిన శాసనం ప్రకారం నిర్బంధితులైనప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో చట్టం చేస్తే, అది చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
* నీరజా చౌదరి Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1984) కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ పి.భగవతి) తీర్పునిస్తూ వెట్టిచాకిరీ జీవించే హక్కు (నిబంధన 21)కు భంగకరం కాబట్టి, ప్రభుత్వాలు వెట్టిచాకిరీని  నిర్మూలించే శాసనాలను రూపొందించాలని ఆదేశించింది.
* ఉన్నిక్రిష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, (1993) కేసులో సుప్రీంకోర్టు (ఎల్.ఎం.శర్మ) చరిత్రాత్మక తీర్పునిస్తూ విద్యాహక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, అది లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని తెలియజేసి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అయితే విద్యార్జన హక్కు వయసును 14 సంవత్సరాలకు పరిమితం చేసింది. 14 సంవత్సరాల తర్వాత విద్యార్జన హక్కు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. (దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది)
వీడియోకాన్ Vs మహారాష్ట్ర (2013) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 21వ నిబంధనలోని జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని తెలియజేసింది.

నిబంధన 22: ఎ.కె.గోపాలన్ Vs మద్రాసు ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం అరెస్టు చేసే పోలీసు అధికారి బాధ్యత. ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో తెలియజేయలేకపోతే, కారణాలను కోర్టుకు తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
* అబ్దుల్ సమద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1962) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలు గడిస్తే, ఆ వ్యక్తికి (అరెస్టు అయిన వ్యక్తి) విడుదల కావడానికి హక్కు ఉంటుందని తెలిపింది.
* జోగిందర్ కుమార్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1994) కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, ఆ సమాచారాన్ని, దానికిగల కారణాలను కుటుంబ సభ్యులకు (లేదా) స్నేహితులకు (లేదా) సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పింది.

III. పీడన నిరోధక హక్కు (నిబంధనలు 23-24)
* పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం ప్రాథమిక హక్కుల్లోని 23వ నిబంధన ఉల్లంఘనగా తెలియజేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2001) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైంది. ఆకలి, పోషకాహార లోపాలను అరికట్టడానికి, ఆహార హక్కును చట్టబద్దంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీనివల్ల అనేక రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని (బడిపిల్లలకు) ప్రవేశపెట్టాయి.
* సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కార్మికులు Vss జమ్మూ & కశ్మీర్ (1983) కేసులో సుప్రీంకోర్టు నిర్మాణ రంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లల్లోపు వారిని పనిలో చేర్చుకోకూడదని ఆదేశించింది.
* బందువా ముక్తిమోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని, బాల కార్మికులను పనిలో చేర్చుకునే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించి, ఆ నిధిలోకి జమచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

నమూనా ప్రశ్నలు

1. కింద పేర్కొన్న ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 15, 16   2) ఆర్టికల్స్‌ 19, 29, 30       3) ఆర్టికల్స్‌ 14, 20    4) 1, 2

2. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల సంరక్షణ ఉంటుంది.
    2) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి, అంటే అపరిమితమైనవి.
    3) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని తాత్కాలికంగా నిలిపివేయచ్చు.
    4) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని పూర్తిగా రద్దు చేయలేం.

3. ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత పౌరులతో పాటు భారత భూభాగంలో నివసిస్తున్న విదేశీయులకు సైతం లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 14, 20, 21
    2) ఆర్టికల్స్‌ 22, 23, 24, 25 
    3) ఆర్టికల్స్‌ 26, 27, 28           4) పైవన్నీ

4. ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకునే వీల్లేదు. సాధారణ హక్కులను వదులుకోవచ్చు.
    2) ప్రభుత్వ అధికారంపై ప్రాథమిక హక్కులు పరిమితులు విధిస్తాయి. సాధారణ హక్కులు ప్రభుత్వ అధికారానికి లోబడి ఉంటాయి.
    3) ప్రాథమిక హక్కులను రాజ్యాంగ ప్రవేశికలో, సాధారణ హక్కులను రాజ్యాంగ షెడ్యూల్స్‌లో వివరించారు.
    4) ప్రాథమిక హక్కులను రద్దుచేసే వీల్లేదు. సాధారణ హక్కులు రద్దు చేయవచ్చు.

5. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరైంది?
    1) ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని మూడో భాగంలో, ఆదేశిక సూత్రాలను నాలుగో భాగంలో వివరించారు.
    2) ప్రాథమిక హక్కులను సోవియట్‌ రష్యా నుంచి, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ నుంచి గ్రహించారు. 
    3) ప్రాథమిక హక్కులను ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య, ఆదేశిక సూత్రాలను ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య పేర్కొన్నారు.
    4) 1, 3

6. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) వ్యక్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించేందుకు తోడ్పడతాయి.
    2) వీటితో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు. 
    3) వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు. 
    4) ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.

7. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైంది? 
    1) సమాజ సమష్టి ప్రయోజనాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
    2) ఇవి ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
    3) ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి. 
    4) పైవన్నీ

8. ‘ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
    1) శంకరీ ప్రసాద్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా  
    2) చంపకం దొరైరాజన్ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ 
    3) ఎస్‌ఆర్‌ బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 
    4) ఇందిరా సహాని  vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

సమాధానాలు :  1-4,  2-2,  3-4,  4-3,  5-4, 6-3,  7-4,  8-2

సంప్రదాయమైవి, ఆధునికమైనవి: స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు, మతస్వాతంత్య్రపు హక్కు లాంటి సంప్రదాయ హక్కులతో పాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కులు సైతం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి.

సార్వత్రికం కావు:  ఆర్టికల్స్‌ 15, 16, 19, 29, 30లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నివసించే విదేశీయులకు వర్తించవు.
* ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు సాయుధ దళాల సిబ్బందికి లభించదు. 
* ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత ప్రజలతోపాటు భారత భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

న్యాయ సంరక్షణ:  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీచేస్తాయి.

నిరపేక్షమైనవి కావు: ప్రాథమిక హక్కులు అపరిమితమైనవికావు. దేశ సమగ్రత, సుస్థిరత దృష్ట్యా ప్రభుత్వం వీటిపై చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ప్రభుత్వ అధికారంపై పరిమితులు: ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాసనాలు రూపొందించడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాథమిక హక్కులు పేర్కొంటాయి.

రద్దుకు అవకాశం లేనివి, కానీ సస్పెండ్‌ చేయొచ్చు: భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేయొచ్చు. కానీ పూర్తిగా రద్దుచేసే వీల్లేదు.

అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల సంరక్షణ: దేశంలోని మెజారిటీ వర్గాల ఆధిపత్యం నుంచి అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటం, జాతి సమగ్రతను సంరక్షించడం, వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రాథమిక హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి. 
ఉదా: విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు రక్షణ కల్పించడం.

పౌరుల సమగ్రాభివృద్ధి సాధనాలు: పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి, వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీఇవ్వడం ద్వారా ప్రాథమిక హక్కులు పౌరుల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

వివరణ
*  1951లో చంపకం దొరైరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు అని పేర్కొంది.
* 1973 లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఇస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పోషకాలని ప్రకటించింది.
* 1980 లో మినర్వామిల్స్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
* 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించింది.

ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటికి రాజ్యాంగం నుంచి హామీ లభిస్తుంది. ఇవి ప్రభుత్వ అధికారంపై పరిమితులు విధిస్తాయి.
* దేశ పౌరులు వీటిని వదులుకునే వీలులేదు.
* ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులను ఆశ్రయించవచ్చు.
* రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి, ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల కంటే ఉన్నతమైన ఆధిక్యత, స్వభావం కలిగి ఉన్నాయి.

సాధారణ హక్కులు
* సాధారణ హక్కులు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల ద్వారా రూపొందుతాయి. వీటికి హామీ ఉంటుంది. ఈ హక్కులు ప్రభుత్వానికి అదనపు అధికారాలు కల్పిస్తాయి.
* సాధారణ హక్కులను పౌరులు తమ ఇష్టానుసారం వదులుకోవచ్చు.
* సాధారణ హక్కుల అమలు కోసం పౌరులు కేవలం పరిమిత న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించవచ్చు.
* వీటిని ఎలాంటి పరిస్థితిలోనైనా తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, రద్దు చేసే వీలు కూడా ఉంటుంది. 
* సాధారణ హక్కులు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి.

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* వీటిని రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్నారు.
* ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య పొందుపరిచి ఉన్నాయి.
* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయ సంరక్షణ ఉంది.
* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.
* ఇవి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. 
* వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
* ఇవి నకారాత్మక దృక్పథం కలిగినవి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.
* వీటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది.

ఆదేశిక సూత్రాలు
* వీటిని రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పేర్కొన్నారు.
* వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు.
* ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
* ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
* సమాజ సమష్టి ప్రయోజనాలు సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* ఇవి ఎప్పుడూ అమల్లోనే ఉంటాయి.
* ఇవి సామాజికపరమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.
* ఇవి సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి.
* ఇవి కేవలం సూచనప్రాయమైనవి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు

భారతదేశంలో వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశికసూత్రాలను అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, వీటిని న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణమైంది. కోర్టుల తీర్పులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది. వాటిలో కీలకమైనవి..

1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951
కామేశ్వరిసింగ్  Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1951, జూన్‌ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆర్టికల్‌ 15కు క్లాజు ్బ4్శను చేర్చింది. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం పొందింది.
* ఆర్టికల్‌ 19ని సవరించి ఆర్టికల్‌ 19్బ6్శకి వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వానికి ఉన్న హక్కును ధ్రువీకరించింది.
* ఆర్టికల్‌ 31ని సవరించి, ఆర్టికల్స్‌ 31(A), 31(B)లను కొత్తగా చేర్చి, వాటిని IXవ షెడ్యూల్‌లో పొందుపరచి, భూసంస్కరణలు, జమీందారీ విధానం రద్దుకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. IXవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.

4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
* బేలాబెనర్జీ కేసులో ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1955, ఏప్రిల్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు, అందుకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని నిర్దేశించింది. అంటే ఈ చట్టాలకు న్యాయసమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది.

16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963
* 1963లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1963, అక్టోబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని సవరించి, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల సంరక్షణ కోసం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
* భారతదేశ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికయ్యే వ్యక్తులు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతామనే మాటలతో చేయాల్సిన ప్రమాణపత్రాన్ని పొందుపరిచారు.

17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964
* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1964, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు..
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31(A)ని సవరించి ప్రజాశ్రేయస్సు కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* గోలక్‌నాథ్ Vs‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1971, నవంబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజ(4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.

25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1972, ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి చేర్చారు.
* ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడు  తగినంత ‘నష్ట పరిహారం’ ఇవ్వలేదనే కారణంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
* ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్‌ రూపొందించే శాసనాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ‘నష్టపరిహారం’ నిర్ణయంపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించారు. అయితే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి.
* అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు. ఇందులోని అనేక అంశాలు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్‌ 31, 31(c) లను సవరించారు.
* ఆర్టికల్స్‌ 31(D), 32(A)లను ప్రాథమిక హక్కులకు చేర్చారు.
* ఆదేశిక సూత్రాలను అమలుచేస్తున్న సందర్భంలో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని నిర్దేశించారు. దీని ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యాన్ని కల్పించారు. న్యాయస్థానాలకు ఉన్న ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని తొలగించారు.

43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977
* 1977లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1978, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్‌ 31(D) 32(A)లను రాజ్యాంగం నుంచి తొలగించారు.
* న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని పునరుద్ధరించారు.

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులోని అనేక అంశాలు 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* ఆర్టికల్, 19(1) (f)ను స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు నుంచి తొలగించారు.
* ఆస్తిహక్కును వివరించే ఆర్టికల్‌ 31ని తొలగించారు.
* ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, దీన్ని ఆర్టికల్‌ 300(A)లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22ను సవరించి, నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి:

1. సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. 
2. సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే అధ్యక్ష పదవిలో నియమించాలి. సభ్యులుగా పదవిలో ఉన్న లేదా పదవీవిరమణ చేసిన జడ్జిలు ఉండొచ్చు.
3. పార్లమెంట్‌ రూపొందించిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే, ఏ వ్యక్తినీ ఎక్కువ రోజులు నిర్బంధించకూడదు. ఎవరైనా వ్యక్తిని 2 నెలలకు మించి నివారక నిర్బంధ చట్టం ప్రకారం అరెస్టు చేయాలనుకుంటే సలహాసంఘం అనుమతి తప్పనిసరి.

77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1995, జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 16ను సవరించి, ఆర్టికల్‌ 16(4) ను రాజ్యాంగానికి చేర్చి ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.

86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002
* 2002లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2002 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21ని సవరించి, 21(A) చేర్చారు. దీని ద్వారా 6  - 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలందరికీ ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు’ను నిర్దేశించారు.

93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2006 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 15ని సవరించి, ఆర్టికల్‌ 15(5)ను కొత్తగా చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించారు.

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2012 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19ని సవరించి, ఆర్టికల్‌ 19(1) (C)లో Co- Operative Societies’ అనే పదాన్ని చేర్చి, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

బిట్లు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?

జ: ఆర్టికల్స్‌ 25 - 28
 
2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు                   2) జైనులు, బౌద్ధులు
3) సిక్కులు                        4) అందరూ
జ: 4 (అందరూ)

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                             
2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ                                2) ప్రొహిబిషన్‌
3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌                4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

27. PIL అంటే?
జ: Public Interest Litigation

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

ప్రాథమిక హక్కులు - వర్గీకరణ

పీడన నిరోధపు హక్కు (నిబంధనలు 23-24) 
వ్యక్తి హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, దోపిడీకి గురికాకుండా కాపాడటమే ఈ హక్కు ఉద్దేశం.

నిబంధన 23(1)
ఈ నిబంధన ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మనుషుల క్రయ, విక్రయాలు జరపడం, వెట్టిచాకిరి, నిర్బంధంగా పని చేయించడాన్ని నిషేధించారు. దీని ప్రకారం వ్యభిచారం, దేవదాసి లేదా జోగిని పద్ధతులను నిషేధించారు (వీటిని అమలు చేయడానికి పార్లమెంటు 1956 లో అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది. దీన్ని 2006 లో సవరించారు).
* వెట్టిచాకిరీ నిరోధక చట్టం 1976
* కనీస వేతనాల చట్టం 1948, 1976
* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978
* సమాన పనికి సమాన వేతన చట్టం 1976
* 23 (2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం నిర్బంధంగా పౌరులు, ఉద్యోగులతో రుసుము చెల్లించి లేదా చెల్లించకుండా సేవ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షలను చూపకూడదు. నిర్బంధ మిలిటరీ సేవ, నిర్బంధ సామాజిక సేవ బలవంతపు వెట్టిచాకిరీ కిందికి రావు.

నిబంధన 24 
దీని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేయించకూడదు.ఉదాహరణకు భవన నిర్మాణం, రైల్వేలు మొదలైనవి. అయితే, ఈ నిబంధన హానికరంకాని పనుల్లో నియమించుకోవడాన్ని నిషేధించలేదు. ఈ నిబంధన అమలుకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు అనేక చట్టాలు చేసింది. అవి:
1. బాలల ఉపాధి చట్టం - 1938
2. ఫ్యాక్టరీల చట్టం - 1948
3. ప్లాంటేషన్ కార్మిక చట్టం - 1951
4. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం - 1951
5. గనుల చట్టం - 1952
6. మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956
7. మర్చంట్ షిప్పింగ్ చట్టం - 1958
8. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం - 1958
9. అప్రెంటిస్ చట్టం - 1961
10. బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం - 1966
11. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం - 1986
12. బాలకార్మిక హక్కుల చట్టం - 2005
13. 2006 లో ప్రభుత్వం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో గృహ సంబంధ పనులు, వ్యాపార సంస్థల్లో (ఉదాహరణకు హోటళ్లు, దాబాలు, దుకాణాలు, టీ దుకాణాలు మొదలైనవి) పనులకు నియమించుకోవడాన్ని నిషేధించింది.

మత స్వాతంత్య్రపు హక్కు (నిబంధనలు 25-28) 
భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండదు. అయితే 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగంలో (ప్రవేశిక) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
* నిబంధన 25(1) ప్రకారం ప్రజా సంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన అంశాలకు లోబడి, ప్రజలు తమ అంతరాత్మను, తమకు ఇష్టమైన మత విశ్వాసాలను అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే, ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి చేర్చుకునే హక్కు లేదు.
* 25(2)(a) ప్రకారం మత సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర సంక్షేమ కార్యకలాపాలకు పరిమితం చేయడం లేదా నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
* 25(2)(b) సామాజిక సంక్షేమం, సాంఘిక సంస్కరణల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి, హిందూ మత సంబంధ వర్గాల ప్రవేశానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు (సిక్కులు కృపాణాలను లేదా ఖడ్గాలను ధరించడం, తీసుకువెళ్లడం సిక్కు మత సంప్రదాయంలో భాగంగానే పరిగణించాలి).
* 25(2)(b) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగానే పరిగణిస్తారు.

నిబంధన 26 
ఇది మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛకు సంబంధించిన నిబంధన. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి వ్యక్తులు కింది హక్కులను కలిగి ఉంటారు.
     (a) మత, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు.
     (b) తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకోవచ్చు.
     (c) స్థిర, చర ఆస్తులను మత సంస్థలు సమకూర్చుకోవచ్చు.
     (d) చట్ట ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే హక్కు ఉంటుంది.

నిబంధన 27 
ఈ నిబంధన మతం పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది.
* మత వ్యాప్తి లేదా పోషణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించారు. కానీ, మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలను అందించినందుకు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీ వసూలు చేయవచ్చు. ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రత్యేక ఫీజు వసూలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం కాదు. 

నిబంధన 28 
ఈ నిబంధన విద్యాలయాల్లో మత బోధన గురించి తెలియజేస్తుంది.
* 28 (1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28 (2) ప్రకారం ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల మండలి స్థాపించి, పాలనాపరంగా ప్రభుత్వమే నిర్వహించే కొన్ని విద్యాలయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత బోధన చేయవచ్చు.
* 28 (3) ప్రకారం ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకుండా ఉండవచ్చు. మైనర్లు అయిన విద్యార్థులు సంరక్షకుల అభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంది. వారిని మత ప్రార్థనల్లో, కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనమని బలవంతం చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (నిబంధనలు 29-30)   
భాష, మతపరమైన అల్ప సంఖ్యాకులు తమ మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ హక్కును కల్పించినప్పటికీ, అధిక సంఖ్యాకులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు.
* 29(1) ప్రకారం భారత ప్రజలకు (ఏ వర్గం వారైనా) తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న/ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు.
* 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
* 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలునిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

ఆస్తి హక్కు (నిబంధన 31): ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
 
రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32) 
ప్రాథమిక హక్కులను పొందడంలో రాజ్యం లేదా సంస్థ లేదా వ్యక్తులు ఆటంకం కల్పిస్తే నిబంధన 32 ద్వారా సుప్రీం కోర్టు, నిబంధన 226 ద్వారా హైకోర్టులు రక్షణ కల్పిస్తాయి. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించారు.
* 32(1) ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
* 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు 5 రకాల రిట్లను జారీ చేయగలదు. అవి... హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో-వారెంటో.
* 32(3) ప్రకారం సుప్రీం కోర్టు తన అధికారాలకు భంగం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు) కూడా రిట్లను జారీచేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు. (రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఉత్తర్వు).
* 32(4) ప్రకారం రాజ్యాంగంలో సూచించిన విధంగా తప్ప, ఏ ఇతర పద్ధతుల్లోనూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ హక్కును (లేదా) రాజ్యాంగ పరిరక్షణ హక్కును తొలగించరాదు. అయితే, అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఈ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* పైన తెలిపిన ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు.

రిట్లు
హెబియస్ కార్పస్:  హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం.ఇది అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అంటే To have the body (భౌతికంగా కనిపించడం). ఈ రిట్ ద్వారా స్వేచ్ఛా హక్కును (19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు) కాపాడుకోవచ్చు.
* ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధానికి ఉన్న కారణాలు చట్ట సమ్మతమా, కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చట్ట సమ్మతం అయితే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా లేదా చట్ట సమ్మతం కాకపోతే వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తారు.
* ఈ రిట్‌ను ప్రభుత్వ అధికారులకు, సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయవచ్చు. కానీ, రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు జారీ చేయకూడదు.

మాండమస్: మాండమస్ అంటే ఆదేశించడం (Command). ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ విధి నిర్వహణలో తీవ్రమైన జాప్యం లేదా పని చేయడానికి నిరాకరిస్తే లేదా నిర్వహించనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశమే మాండమస్.
* మాండమస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేస్తారు. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లపై జారీ చేయకూడదు.

ప్రొహిబిషన్: ప్రొహిబిషన్ అంటే నిషేధం. దీన్ని కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేస్తారు. కింది న్యాయస్థానాలు (సుప్రీం కోర్టు, హైకోర్టులు కాకుండా) విచారణ జరుపుతున్న కేసును నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు ఈ రిట్‌ను జారీ చేస్తాయి. అలాగే విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి ఆ కేసుతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఈ రిట్‌ను జారీ చేస్తారు.
 
సెర్షియోరరీ: సెర్షియోరరీ అంటే సుపీరియర్. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ఒక కేసును విచారించి అంతిమ తీర్పును ఇచ్చినప్పటికీ, దాన్ని రద్దుచేసి సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు తమ పరిధిలోకి తీసుకోవడానికి సెర్షియోరరీ అవకాశం కల్పిస్తుంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు, శాసనసభలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.
* ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లను జ్యుడీషియల్ రిట్లు అని కూడా అంటారు.

కోవారెంటో:  కో-వారెంటో అంటే 'ఏ అధికారంతో?' అని అర్థం. దీని ద్వారా కోర్టు, ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడో పరిశీలిస్తుంది. ఈ రిట్‌ను ప్రభుత్వ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినవారిని, తొలగించడానికి ఉద్దేశించి రూపొందించారు.
* పైన తెలియజేసిన విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు రిట్లను జారీ చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. అయితే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వీటిని జారీ చేయలేవు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ ఆత్మ, హృదయంగా వర్ణించారు.
* భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదాన్ని వాడకపోయినా, అంతర్గతంగా న్యాయసమీక్షాధికారాన్ని కల్పించింది - నిబంధన 13.
* విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా తెలిపేది - నిబంధన - 21(A).
* నిబంధన 15 ప్రకారం రాజ్యాంగం 5 రకాల వివక్షలను నిషేధించింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

నమూనా ప్రశ్నలు

1. కింద పేర్కొన్న ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 15, 16   2) ఆర్టికల్స్‌ 19, 29, 30       3) ఆర్టికల్స్‌ 14, 20    4) 1, 2

2. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులకు న్యాయస్థానాల సంరక్షణ ఉంటుంది.
    2) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి, అంటే అపరిమితమైనవి.
    3) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని తాత్కాలికంగా నిలిపివేయచ్చు.
    4) జాతీయ అత్యవసరస్థితి కాలంలో వీటిని పూర్తిగా రద్దు చేయలేం.

3. ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత పౌరులతో పాటు భారత భూభాగంలో నివసిస్తున్న విదేశీయులకు సైతం లభిస్తాయి?
    1) ఆర్టికల్స్‌ 14, 20, 21
    2) ఆర్టికల్స్‌ 22, 23, 24, 25 
    3) ఆర్టికల్స్‌ 26, 27, 28           4) పైవన్నీ

4. ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరికానిది?
    1) ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకునే వీల్లేదు. సాధారణ హక్కులను వదులుకోవచ్చు.
    2) ప్రభుత్వ అధికారంపై ప్రాథమిక హక్కులు పరిమితులు విధిస్తాయి. సాధారణ హక్కులు ప్రభుత్వ అధికారానికి లోబడి ఉంటాయి.
    3) ప్రాథమిక హక్కులను రాజ్యాంగ ప్రవేశికలో, సాధారణ హక్కులను రాజ్యాంగ షెడ్యూల్స్‌లో వివరించారు.
    4) ప్రాథమిక హక్కులను రద్దుచేసే వీల్లేదు. సాధారణ హక్కులు రద్దు చేయవచ్చు.

5. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సరైంది?
    1) ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని మూడో భాగంలో, ఆదేశిక సూత్రాలను నాలుగో భాగంలో వివరించారు.
    2) ప్రాథమిక హక్కులను సోవియట్‌ రష్యా నుంచి, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ నుంచి గ్రహించారు. 
    3) ప్రాథమిక హక్కులను ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య, ఆదేశిక సూత్రాలను ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య పేర్కొన్నారు.
    4) 1, 3

6. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది?
    1) వ్యక్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించేందుకు తోడ్పడతాయి.
    2) వీటితో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు. 
    3) వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు. 
    4) ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.

7. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైంది? 
    1) సమాజ సమష్టి ప్రయోజనాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
    2) ఇవి ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
    3) ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి. 
    4) పైవన్నీ

8. ‘ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
    1) శంకరీ ప్రసాద్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా  
    2) చంపకం దొరైరాజన్ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ 
    3) ఎస్‌ఆర్‌ బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 
    4) ఇందిరా సహాని  vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా

సమాధానాలు :  1-4,  2-2,  3-4,  4-3,  5-4, 6-3,  7-4,  8-2

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు

బిట్లు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
జ: ఆర్టికల్స్‌ 25 - 28

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు                   2) జైనులు, బౌద్ధులు
3) సిక్కులు                        4) అందరూ
జ: 4 (అందరూ)

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                             
2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ                                2) ప్రొహిబిషన్‌
3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌                4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

27. PIL అంటే?
జ: Public Interest Litigation

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

1. ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశ సూత్రాలలో చేర్చడంలో రాజ్యాంగ నిర్మాతల ఆశయం ఏమిటి?
జ‌: జాతీయ సమైక్యత, సమగ్రత

2. మాతా, శిశు సంరక్షణ రాజ్య కర్తవ్యం అని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 42

3. నిబంధన 39 (d) కిందివాటిలో ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
  ఎ) సమాన పనికి అసమాన వేతనం
  బి) శారీరక, మానసిక శ్రమకు సమాన వేతనం
  సి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
  డి) ఎ, బి సరైనవి
జ‌: సి (స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం)

4. ఆదేశ సూత్రాలు న్యాయార్హమైనవి కావు అని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 37

5. కిందివాటిలో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చని నిబంధన ఏది?
ఎ) 38 (2)   బి) 39 (f)    సి) 39 (e)     డి) 39 (A)
జ‌: సి (39 (e))

6. గ్రామ పంచాయతీలను స్వయంపాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
జ‌: నిబంధన 40

7. కిందివాటిలో ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
  ఎ) 40 వ రాజ్యాంగ సవరణ చట్టం
  బి) 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
  సి) 43 వ రాజ్యాంగ సవరణ చట్టం
  డి) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
జ‌: డి ( 42 వ రాజ్యాంగ సవరణ చట్టం)

8. కిందివాటిలో 43 వ రాజ్యాంగ నిబంధనలో లేని అంశం ఏది?
  ఎ) కార్మికులకు కనీస వేతనం
  బి) కార్మికుల జీవన ప్రమాణాలు
  సి) కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య
  డి) తగిన విరామం
జ‌: సి (కార్మికుల కుటుంబాలకు ఉన్నత విద్య)

9. ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది?
జ‌: గోవా

10. మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి చట్టాలు చేయాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 47

11. నిబంధన 49 ప్రకారం కింద పేర్కొన్న వాటిలో వేటిని సంరక్షించాలి?
  ఎ) ప్రభుత్వ ఆస్తులు     బి) చారిత్రక కట్టడాలు
  సి) చారిత్రక స్థలాలు      డి) చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి
జ‌: డి (చారిత్రక కట్టడాలు, చారిత్రక స్థలాలు సరైనవి)

12. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలని తెలిపే నిబంధన ఏది?
జ‌: నిబంధన 51 (d)

13. ఆదేశ సూత్రాలను భారత ప్రభుత్వ చట్టం - 1935 లోని ''ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌"తో పోల్చిన రాజ్యాంగవేత్త ఎవరు?
జ‌: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

14. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ నిబంధన 45 ని సవరించారు?
జ‌: 86 వ రాజ్యాంగ సవరణ చట్టం

15. కిందివాటిలో ఆదేశ సూత్రాలలో లేని అంశం ఏది?
   ఎ) ఉమ్మడి పౌరస్మృతి
   బి) స్త్రీ, పురుషులకు జీవనోపాధి
   సి) లౌకిక విధానం
   డి) సంపద వికేంద్రీకరణ
జ‌: సి (లౌకిక విధానం)

16. ప్రాథమిక విధుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తున్నారు?
జ‌: జనవరి 3

17. రాజ్యాంగంలోని 51 (A) a నిబంధనలో లేని అంశం ఏది?
    ఎ) రాజ్యాంగాన్ని గౌరవించాలి          బి) జాతీయ గీతాన్ని గౌరవించాలి
    సి) జాతీయ పతాకాన్ని గౌరవించాలి     డి) తల్లిదండ్రులను గౌరవించాలి
జ‌: డి (తల్లిదండ్రులను గౌరవించాలి)

18. ప్రాథమిక విధులపై 1998 లో నియమించిన కమిటీ ఏది?
జ‌: జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ

19. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన మేధాశక్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశ క్షిపణి కార్యకలాపాలకు ఎనలేని కృషి చేశారు. ఇది ఏ ప్రాథమిక విధిని సూచిస్తుంది?
జ‌: 51 - (A)J

20. ప్రాథమిక విధులను మొదటిసారిగా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు?
జ‌: 1976

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆదేశిక సూత్రాలు

         సాధారణంగా ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విభేదం ఏర్పడితే ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని 37వ అధికరణం పేర్కొంటోంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉండదని కూడా ఈ అధికరణం ద్వారా స్పష్టం అవుతుంది. చంపకం దొరైరాజన్ కేసులో, కేరళ విద్యా బిల్లు కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ధ్రువపరిచింది.
     కాలానుగుణంగా ప్రభుత్వ పరిధి పెరగడంతో 1970వ దశకంలో ప్రజా సంక్షేమ చట్టాల అమలుకు కొన్ని ప్రాథమిక హక్కులు ఆటంకంగా మారాయి. దీంతో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేసింది. దీనికి న్యాయవ్యవస్థ విముఖత చూపింది.
* 1970 నుంచి ఆదేశిక సూత్రాల స్వభావాన్ని, దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఇటు కార్యనిర్వాహక వర్గం, అటు న్యాయవ్యవస్థల దృక్పథాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు ఆదేశిక సూత్రాల అమలు విషయమై ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది.
* 1970వ దశకంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సామ్యవాద విధానాల అమలు పట్ల మొగ్గు చూపించింది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినప్పుడు అప్పటి సామ్యవాద USSR ఇచ్చిన మద్దతు వల్ల, కాంగ్రెస్‌లో వచ్చిన అంతర్గత చీలిక వల్ల ఇందిరాగాంధీ సామ్యవాదం వైపు మొగ్గు చూపినట్లు అర్థమవుతుంది. 1971లో చేసిన 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 (c) అనే అధికరణాన్ని జోడించారు. 
* ఈ అధికరణం ఆదేశిక సూత్రాల్లోని 39 (b) (సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న సహజ వనరులపై రాజ్యానికి యాజమాన్య నియంత్రణ ఉండాలి. సమాజంలో అందరికీ వాటిని సమానంగా పంపిణీ చేయాలి), 39(c) (ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఆర్థిక విధాన రూపకల్పన) అమలుకు ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31వ అధికరణాలు అడ్డు తగిలితే వాటిని న్యాయసమీక్ష నుంచి మినహాయించాలని పేర్కొంటోంది.
* అయితే ఇది అంతకు ముందు గోలక్ నాథ్ కేసులో (1967) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమిస్తూ చేసిన రాజ్యాంగ సవరణగా మనకు కనిపిస్తుంది. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి 25వ రాజ్యాంగ సవరణ ద్వారా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయస్థానానికి మధ్య ఒక రకమైన సంకట పరిస్థితి నెలకొంది. అయితే సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసు (1973)లో తీర్పు సందర్భంగా - రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగానికి 'ఒక మౌలిక స్వభావం' ఉందని, దాన్ని దెబ్బతీసే ఎలాంటి రాజ్యాంగ సవరణ చెల్లదని పేర్కొంది. పైన పేర్కొన్న మౌలిక స్వభావంలో న్యాయ సమీక్ష కూడా ఒక లక్షణమని కోర్టు స్పష్టం చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఉద్దేశం - 25వ రాజ్యాంగ సవరణ (39 (b), (c) లలోని సామ్యవాద ఆదర్శాలను చట్టం ద్వారా అమలు చేయడానికి ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 31 అధికరణాలు అడ్డుపడినా ప్రభుత్వం అమలు చేసుకోవచ్చు)  హేతుబద్ధమైందే, కానీ పై విషయంలో కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. 
* కేశవానంద భారతి కేసులో పేర్కొన్న అంశాలను పక్కనబెట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం కేవలం 39(b), (c) కాకుండా ఏ ఆదేశిక సూత్రాల అమలు కోసమైనా చట్టాలు చేసినప్పుడు అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలకు విరుద్ధంగా ఉన్నా అవి ఆమోదయోగ్యమైనవే. అయితే మినర్వా మిల్స్ కేసులో సుప్రీం కోర్టు 42వ రాజ్యాంగ సవరణలో ఆదేశిక సూత్రాలకు ఇచ్చిన ఆధిపత్యాన్ని కొట్టివేసింది.
* ఫలితంగా 39 b, c అధికరణాల అమలు కోసం (ఒకవేళ అవి ప్రాథమిక హక్కుల్లోని 14, 19 అధికరణాలతో సంఘర్షించినా) చట్టాలను రూపొందించుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే వీటిపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం ఉంటుంది.
* 1980వ దశకంలో, ఆ తర్వాత ఆదేశిక సూత్రాల స్వభావం పట్ల న్యాయస్థానాల దృక్పథంలో గణనీయమైన మార్పు కనిపిస్తూ వస్తోంది. న్యాయస్థానాలు ఇప్పుడు వ్యక్తి హక్కులకు (ప్రాథమిక హక్కులు) ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో సామాజిక హక్కులకు (ఆదేశిక సూత్రాలు) కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఆదేశిక సూత్రాలను అమలు చేయమని న్యాయస్థానాలు, ప్రభుత్వాలకు పదేపదే చెబుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి (44వ అధికరణం), మద్యపాన నిషేధం (47వ అధికరణం) అమలు చేయమని న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి.
* 39వ అధికరణానికి అదనంగా 'A' భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. దీని ప్రకారం న్యాయవ్యవస్థ పేదవర్గాల ప్రయోజనాలను కాపాడి, సామాజిక న్యాయాన్ని సమకూర్చేలా వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 

40వ అధికరణం 
ఈ అధికరణం ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థలను నెలకొల్పి స్వపరిపాలనా విధానంలో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి. ఇది మహాత్మాగాంధీ ఆశయం. ప్రతి గ్రామం ఒక చిన్న గణతంత్రంగా (Little Republic) ఎదగాలని ఆయన భావించేవారు. స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంగా మారితేనే దేశం బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అభీష్టాన్ని ఆదేశిక సూత్రాల్లో జోడించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించారు. తద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పి, గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా యంత్రాంగానికి అనేక విధులను కేటాయించారు.

41వ అధికరణం
నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటి అశక్తతతో బాధపడేవారికి తగిన ఉద్యోగ, విద్యా సదుపాయాలను కల్పించేందుకు తమ ఆర్థిక పరిస్థితికి లోబడి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాలు ఈ కోవకే చెందుతాయి. 

42వ అధికరణం 
రాజ్యం కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించడం (Human conditions of work), స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టాలను చేపట్టాయి.
* గర్భిణులకు ఉచిత వైద్యపరీక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు ఈ కోవకు చెందినవే.
* 1961లో ప్రసూతి రక్షణ చట్టాన్ని రూపొందించారు.

43వ అధికరణం
వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు హేతుబద్ధమైన, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వేతనాలు చెల్లింపునకు సంబంధించి అవసరమైన శాసనాలను రూపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. వారికి తగినంత విరామ సమయం, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘ ప్రాతిపదికపై లేదా వ్యక్తి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల సంఖ్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
* కార్మికుల కోసం కనీస వేతన చట్టాన్ని (1948) రూపొందించారు.
* గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ వికాస పథకాన్ని (1952) ప్రవేశపెట్టారు. 
* కుటీర పరిశ్రమలు రాష్ట్ర జాబితాకు చెందినప్పటికీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, చేనేత మగ్గాల బోర్డు, కాయిర్ బోర్డును ఏర్పాటు చేశారు.
* 42వ రాజ్యాంగ సవరణ ద్వారా '43 (A)' ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పరిశ్రమల నిర్వహణలో కార్మికులను భాగస్వాములను చేసే చట్టాలను రూపొందించాలి.

44వ అధికరణం
* భారతదేశంలో పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
* ఆదేశిక సూత్రాల్లో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశమిది.
* వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల విషయంలో న్యాయస్థానాలు ప్రస్తుతం మన చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
* ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తే మన చట్టాల (Personal Law) స్థానంలో దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి వస్తుంది.
* మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్) మత పెద్దలు ఇందుకు సుముఖంగా లేరు.
* రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాల్లో (Constituent Assembly debates) డా.బి.ఆర్.అంబేడ్కర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా తమ వాదనలను వినిపించారు. తర్వాతి కాలంలో దేశ న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించినా రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదం తెలపకపోవడంతో అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 
* ఎస్.ఆర్.బొమ్మై కేసులో (1994) సుప్రీం కోర్టు ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
* అంతకుముందు 1985లో షాబానో కేసులో సి.ఆర్.పి.సి. ప్రకారం విడాకులు పొందిన తన భర్త నుంచి భరణం (ధరావత్తు) పొందాలన్న షాబానో వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే ఈ తీర్పును నీరుగారుస్తూ అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో Muslim Women (Protection of Rights on Divorce) 1986 చట్టాన్ని తీసుకొచ్చింది.
బీ శారదా ముద్గల్ కేసులో పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది.
* ప్రస్తుత పరిస్థితి: మూడు సార్లు 'తలాక్' చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ షయారా బానో పెట్టుకున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ముందు పరిశీలనలో ఉంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏక‌కేంద్ర‌, స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌లు

 విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.
          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.

సమాఖ్య లక్షణాలు
ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ:
మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.
రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.

లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.
భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

అధికారాల విభజన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.
రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.
ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.

సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.
 
ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - వర్గీకరణ

పీడన నిరోధపు హక్కు (నిబంధనలు 23-24) 
వ్యక్తి హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, దోపిడీకి గురికాకుండా కాపాడటమే ఈ హక్కు ఉద్దేశం.

నిబంధన 23(1)
ఈ నిబంధన ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మనుషుల క్రయ, విక్రయాలు జరపడం, వెట్టిచాకిరి, నిర్బంధంగా పని చేయించడాన్ని నిషేధించారు. దీని ప్రకారం వ్యభిచారం, దేవదాసి లేదా జోగిని పద్ధతులను నిషేధించారు (వీటిని అమలు చేయడానికి పార్లమెంటు 1956 లో అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది. దీన్ని 2006 లో సవరించారు).
* వెట్టిచాకిరీ నిరోధక చట్టం 1976
* కనీస వేతనాల చట్టం 1948, 1976
* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978
* సమాన పనికి సమాన వేతన చట్టం 1976
* 23 (2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం నిర్బంధంగా పౌరులు, ఉద్యోగులతో రుసుము చెల్లించి లేదా చెల్లించకుండా సేవ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షలను చూపకూడదు. నిర్బంధ మిలిటరీ సేవ, నిర్బంధ సామాజిక సేవ బలవంతపు వెట్టిచాకిరీ కిందికి రావు.

నిబంధన 24 
దీని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేయించకూడదు.ఉదాహరణకు భవన నిర్మాణం, రైల్వేలు మొదలైనవి. అయితే, ఈ నిబంధన హానికరంకాని పనుల్లో నియమించుకోవడాన్ని నిషేధించలేదు. ఈ నిబంధన అమలుకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు అనేక చట్టాలు చేసింది. అవి:
1. బాలల ఉపాధి చట్టం - 1938
2. ఫ్యాక్టరీల చట్టం - 1948
3. ప్లాంటేషన్ కార్మిక చట్టం - 1951
4. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం - 1951
5. గనుల చట్టం - 1952
6. మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956
7. మర్చంట్ షిప్పింగ్ చట్టం - 1958
8. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం - 1958
9. అప్రెంటిస్ చట్టం - 1961
10. బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం - 1966
11. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం - 1986
12. బాలకార్మిక హక్కుల చట్టం - 2005
13. 2006 లో ప్రభుత్వం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో గృహ సంబంధ పనులు, వ్యాపార సంస్థల్లో (ఉదాహరణకు హోటళ్లు, దాబాలు, దుకాణాలు, టీ దుకాణాలు మొదలైనవి) పనులకు నియమించుకోవడాన్ని నిషేధించింది.

మత స్వాతంత్య్రపు హక్కు (నిబంధనలు 25-28) 
భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండదు. అయితే 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగంలో (ప్రవేశిక) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
* నిబంధన 25(1) ప్రకారం ప్రజా సంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన అంశాలకు లోబడి, ప్రజలు తమ అంతరాత్మను, తమకు ఇష్టమైన మత విశ్వాసాలను అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే, ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి చేర్చుకునే హక్కు లేదు.
* 25(2)(a) ప్రకారం మత సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర సంక్షేమ కార్యకలాపాలకు పరిమితం చేయడం లేదా నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
* 25(2)(b) సామాజిక సంక్షేమం, సాంఘిక సంస్కరణల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి, హిందూ మత సంబంధ వర్గాల ప్రవేశానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు (సిక్కులు కృపాణాలను లేదా ఖడ్గాలను ధరించడం, తీసుకువెళ్లడం సిక్కు మత సంప్రదాయంలో భాగంగానే పరిగణించాలి).
* 25(2)(b) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగానే పరిగణిస్తారు.

నిబంధన 26 
ఇది మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛకు సంబంధించిన నిబంధన. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి వ్యక్తులు కింది హక్కులను కలిగి ఉంటారు.
     (a) మత, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు.
     (b) తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకోవచ్చు.
     (c) స్థిర, చర ఆస్తులను మత సంస్థలు సమకూర్చుకోవచ్చు.
     (d) చట్ట ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే హక్కు ఉంటుంది.

నిబంధన 27 
ఈ నిబంధన మతం పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది.
* మత వ్యాప్తి లేదా పోషణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించారు. కానీ, మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలను అందించినందుకు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీ వసూలు చేయవచ్చు. ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రత్యేక ఫీజు వసూలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం కాదు. 

నిబంధన 28 
ఈ నిబంధన విద్యాలయాల్లో మత బోధన గురించి తెలియజేస్తుంది.
* 28 (1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28 (2) ప్రకారం ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల మండలి స్థాపించి, పాలనాపరంగా ప్రభుత్వమే నిర్వహించే కొన్ని విద్యాలయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత బోధన చేయవచ్చు.
* 28 (3) ప్రకారం ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకుండా ఉండవచ్చు. మైనర్లు అయిన విద్యార్థులు సంరక్షకుల అభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంది. వారిని మత ప్రార్థనల్లో, కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనమని బలవంతం చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (నిబంధనలు 29-30)   
భాష, మతపరమైన అల్ప సంఖ్యాకులు తమ మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ హక్కును కల్పించినప్పటికీ, అధిక సంఖ్యాకులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు.
* 29(1) ప్రకారం భారత ప్రజలకు (ఏ వర్గం వారైనా) తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న/ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు.
* 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
* 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలునిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

ఆస్తి హక్కు (నిబంధన 31): ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
 
రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32) 
ప్రాథమిక హక్కులను పొందడంలో రాజ్యం లేదా సంస్థ లేదా వ్యక్తులు ఆటంకం కల్పిస్తే నిబంధన 32 ద్వారా సుప్రీం కోర్టు, నిబంధన 226 ద్వారా హైకోర్టులు రక్షణ కల్పిస్తాయి. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించారు.
* 32(1) ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
* 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు 5 రకాల రిట్లను జారీ చేయగలదు. అవి... హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో-వారెంటో.
* 32(3) ప్రకారం సుప్రీం కోర్టు తన అధికారాలకు భంగం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు) కూడా రిట్లను జారీచేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు. (రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఉత్తర్వు).
* 32(4) ప్రకారం రాజ్యాంగంలో సూచించిన విధంగా తప్ప, ఏ ఇతర పద్ధతుల్లోనూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ హక్కును (లేదా) రాజ్యాంగ పరిరక్షణ హక్కును తొలగించరాదు. అయితే, అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఈ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* పైన తెలిపిన ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు.

రిట్లు
హెబియస్ కార్పస్:  హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం.ఇది అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అంటే To have the body (భౌతికంగా కనిపించడం). ఈ రిట్ ద్వారా స్వేచ్ఛా హక్కును (19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు) కాపాడుకోవచ్చు.
* ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధానికి ఉన్న కారణాలు చట్ట సమ్మతమా, కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చట్ట సమ్మతం అయితే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా లేదా చట్ట సమ్మతం కాకపోతే వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తారు.
* ఈ రిట్‌ను ప్రభుత్వ అధికారులకు, సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయవచ్చు. కానీ, రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు జారీ చేయకూడదు.

మాండమస్: మాండమస్ అంటే ఆదేశించడం (Command). ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ విధి నిర్వహణలో తీవ్రమైన జాప్యం లేదా పని చేయడానికి నిరాకరిస్తే లేదా నిర్వహించనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశమే మాండమస్.
* మాండమస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేస్తారు. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లపై జారీ చేయకూడదు.

ప్రొహిబిషన్: ప్రొహిబిషన్ అంటే నిషేధం. దీన్ని కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేస్తారు. కింది న్యాయస్థానాలు (సుప్రీం కోర్టు, హైకోర్టులు కాకుండా) విచారణ జరుపుతున్న కేసును నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు ఈ రిట్‌ను జారీ చేస్తాయి. అలాగే విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి ఆ కేసుతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఈ రిట్‌ను జారీ చేస్తారు.
 
సెర్షియోరరీ: సెర్షియోరరీ అంటే సుపీరియర్. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ఒక కేసును విచారించి అంతిమ తీర్పును ఇచ్చినప్పటికీ, దాన్ని రద్దుచేసి సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు తమ పరిధిలోకి తీసుకోవడానికి సెర్షియోరరీ అవకాశం కల్పిస్తుంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు, శాసనసభలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.
* ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లను జ్యుడీషియల్ రిట్లు అని కూడా అంటారు.

కోవారెంటో:  కో-వారెంటో అంటే 'ఏ అధికారంతో?' అని అర్థం. దీని ద్వారా కోర్టు, ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడో పరిశీలిస్తుంది. ఈ రిట్‌ను ప్రభుత్వ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినవారిని, తొలగించడానికి ఉద్దేశించి రూపొందించారు.
* పైన తెలియజేసిన విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు రిట్లను జారీ చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. అయితే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వీటిని జారీ చేయలేవు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ ఆత్మ, హృదయంగా వర్ణించారు.
* భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదాన్ని వాడకపోయినా, అంతర్గతంగా న్యాయసమీక్షాధికారాన్ని కల్పించింది - నిబంధన 13.
* విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా తెలిపేది - నిబంధన - 21(A).
* నిబంధన 15 ప్రకారం రాజ్యాంగం 5 రకాల వివక్షలను నిషేధించింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ పరిణామ క్రమం 

ఈస్టిండియా కంపెనీ 

బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - I బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం 1600 డిసెంబరు 31 న 'చార్టర్' ద్వారా అనుమతిని జారీ చేసింది. ఈ చార్టర్ కాలపరిమితి 15 సంవత్సరాలు. దీన్ని తర్వాతి కాలంలో పొడిగిస్తూ వచ్చారు.
*  కంపెనీ (ఈస్టిండియా కంపెనీ) బక్సార్ యుద్ధం (1765) లో విజయం సాధించి, 'బెంగాల్ దివానీ అధికారాన్ని' పొందడం ద్వారా ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది కంపెనీ పాలనకు పునాదైంది. 1765 నుంచి 1773 వరకు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
*  భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం తన సార్వభౌమాధికారాన్ని రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ప్రకటించింది. అనేక మార్పులతో కంపెనీపాలన 1858 వరకు కొనసాగింది. 1858 నుంచి 1947 లో భారతదేశం స్వాతంత్య్రం పొందేవరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలన సాగించింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల డిమాండ్లు, విన్నపాలు, చర్చలు, విమర్శలు, ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది. ఈ చట్టాల క్రమాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పవచ్చు.
*  భారత రాజ్యాంగ చరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:
    1) ఈస్టిండియా కంపెనీ పాలన (1773 - 1858)
    2) బ్రిటిష్ ప్రభుత్వ పాలన (1858 - 1947)

ఈస్టిండియా కంపెనీ పాలన 
కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి / చక్రవర్తి సర్వాధికారి. కానీ 1773 నాటికి బ్రిటిష్ పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. దీంతో బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి, చక్కదిద్దడానికి అనేక చట్టాలు చేసింది. అందులో మొదటిది రెగ్యులేటింగ్ చట్టం 1773.

రెగ్యులేటింగ్ చట్టం 1773
 దీన్ని భారతదేశంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు. దీన్ని బ్రిటిష్ పార్లమెంటులో అప్పటి ప్రధాని 'లార్డ్ నార్త్' ప్రవేశపెట్టాడు. ఇది 1773 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే భారత రాజ్యాంగానికి పునాదైంది. 
ముఖ్యాంశాలు: ఈ చట్టం ఇంగ్లండ్, భారతదేశంలో కంపెనీకి సంబంధించి అనేక మార్పులను చేసింది.
ఇంగ్లండ్‌లో వచ్చిన మార్పులు:
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ (కంపెనీ పాలక వర్గం) పదవీకాలాన్ని ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. ప్రతి సంవత్సరం మొత్తం సభ్యుల్లో 1/4 వ వంతు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
* కంపెనీ ప్రొప్రైటర్లు (యజమానులు) ఓటు హక్కు అర్హత పొందడానికి కనీసం 6 నెలలకు బదులు సంవత్సర కాలం పాటు, 500 పౌండ్లకు బదులు 1000 పౌండ్లకు మించిన వాటాలున్న వారికి పరిమితం చేశారు.
భారతదేశంలో వచ్చిన మార్పులు:
* బెంగాల్ గవర్నర్ హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల నిర్వహణపై బెంగాల్ గవర్నర్ జనరల్‌కు పర్వవేక్షణ అధికారాన్ని కల్పించారు. 
* 'గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి'ని ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. గవర్నర్ జనరల్‌కు విధి నిర్వహణలో సాయపడటం దీని ప్రధాన విధి. కౌన్సిల్‌లో నిర్ణయాలు మెజారిటీ ప్రాతిపదికపై తీసుకుంటారు. గవర్నర్ జనరల్‌కు నిర్ణాయక ఓటు (Casting Vote) ను కల్పించారు.
* కలకత్తాలోని ఫోర్ట్ విలియం (బ్రిటిష్ వర్తక స్థావరం)లో సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించింది. ఇది 1774 లో ఏర్పాటైంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. సుప్రీంకోర్టు తీర్పులపై 'కింగ్ కౌన్సిల్' (రాజు లేదా రాణి కౌన్సిల్ నిర్ణయాలను పాటించడం) కు అప్పీల్ చేసుకోవచ్చు.
* గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, ఇతర ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, స్థానికుల (భారతీయులు) నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహుమతులు తీసుకోవడాన్ని నిషేధించింది.
* కంపెనీకి 20 సంవత్సరాల కాలపరిమితికి (పొడిగిస్తూ) చార్టర్ జారీ చేశారు.

పిట్స్ ఇండియా చట్టం 1784 
రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను సవరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడమే ఈ చట్టం ఉద్దేశమని అప్పటి ఇంగ్లండ్ ప్రధాని 'విలియం పిట్' తెలియజేశారు. అతడి పేరు మీద ఈ చట్టం 'పిట్స్ ఇండియా' చట్టంగా ప్రాచుర్యం పొందింది. 
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి 'బోర్డ్ ఆఫ్ కమిషనర్స్' ఏర్పాటైంది. దీన్నే 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అని కూడా అంటారు. దీనికి 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' అధ్యక్షుడు. ఇతడికి నిర్ణాయక ఓటును కల్పించారు. సభ్యుల కాల పరిమితి 4 సంవత్సరాలు.
* ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య, రాజకీయ విధులుగా విభజించి, వాణిజ్య విధులను పూర్తిగా 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌'కు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌'కు అప్పగించారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలు, ఆదాయంపై ఈ బోర్డుకు సంపూర్ణ అధికారాన్ని కల్పించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఆదేశాలను పాటించని గవర్నర్లను, ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
* 1786 లో జరిగిన సవరణ ఫలితంగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్ జనరల్‌కు వచ్చింది. అంతేకాకుండా గవర్నర్ జనరల్‌నే సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు. ఈ సవరణ చట్టంతో గవర్నర్ జనరల్‌కు తన కౌన్సిల్ నిర్ణయాలను 'వీటో' చేసే అధికారం వచ్చింది. గవర్నర్ జనరల్ పదవి, అధికారాలు సుస్థిరం, విస్తృతమయ్యాయి.
* గవర్నర్ జనరల్, గవర్నర్ల కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3 కు తగ్గించారు.

చార్టర్ చట్టం 1793 
ఫ్రాన్స్ పరిణామాలు (ఫ్రెంచి విప్లవం) ఇంగ్లండ్ వాణిజ్యంపై వ్యతిరేక ప్రభావం చూపడంతో విదేశీ వ్యాపారాన్ని, సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కంపెనీ సహకారం అవసరమైంది.
ముఖ్యాంశాలు: కంపెనీ అధీనంలోని ప్రాంతాలు, వాటిపై వచ్చే ఆదాయాన్ని మరో 20 సంవత్సరాలపాటు కంపెనీకే అప్పగించారు.
¤ స్వదేశీ ఖర్చుల పేరుతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుల, కార్యాలయ సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులను కంపెనీ ప్రభుత్వం (భారతదేశం నుంచి వచ్చే రెవెన్యూ) భరించే విధంగా చట్టంలో మార్పు చేశారు. ఇది 1793 నుంచి భారత ప్రభుత్వ చట్టం 1919 అమల్లోకి వచ్చేవరకు కొనసాగింది.
¤ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సమావేశాలకు గవర్నర్ జనరల్ లేని సమయంలో 'వైస్ ప్రెసిడెంట్' అధ్యక్షత వహిస్తాడు. వైస్ ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు.
¤ భారతదేశంలో ఆంతరంగిక పాలనకు తగిన నిబంధనలను తయారు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కు ఇచ్చారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీచేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. దీని ఆధారంగానే 'కారన్ వాలీస్ కోడ్' రూపొందింది. దీంతో భారతదేశంలో రాతపూర్వక శాసన నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
¤ కంపెనీ ఉద్యోగులకు 'సీనియారిటీ' ప్రాతిపదికపై ప్రమోషన్లను కల్పిస్తారు.

చార్టర్ చట్టం 1813 
భారత రాజ్యాంగ క్రమపరిణామంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు.
ముఖ్యాంశాలు: భారతదేశంలో కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. కంపెనీ పాలన కొనసాగినప్పటికీ కంపెనీ ప్రాంతాలపై రాణి / చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ప్రకటించింది.
* కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధికారాన్ని తొలగించారు. బ్రిటిష్ పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని అనుమతించింది. అయితే కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా తేయాకు, చైనాతో వ్యాపారంలోనూ కంపెనీకి ఉన్న గుత్తాధికారం కొనసాగింది.
* భారతీయులను సంస్కరించడం, విజ్ఞానవంతులను చేయడం కోసం మిషనరీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. అవి భారతదేశంలో చర్చ్‌లు, ఆసుపత్రులు, విద్యాలయాలను స్థాపించడం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది.
* భారతీయులకు విజ్ఞానశాస్త్రాన్ని పరిచయం చేయడం, ప్రోత్సహించడం కోసం రూ.1,00,000 తో ఒక నిధిని భారతదేశంలో ఏర్పాటు చేశారు.
* పన్నులను విధించడానికి, వాటిని చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
* కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. పౌర ఉద్యోగులకు హేలీబ్యూరి కాలేజ్‌లోను (ఇంగ్లండ్), సైనికోద్యోగులకు ఎడిస్ కోంబ్‌లోని మిలిటరీ సెమినరీలోను శిక్షణను ఏర్పాటు చేశారు. * ఈ రెండింటినీ 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' అధీనంలో ఉంచారు.

చార్టర్ చట్టం 1833 
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసింది. కంపెనీ భూభాగాలు బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి వారసులకు చెందుతాయని ప్రకటించింది.  
ముఖ్యాంశాలు: ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అయితే తేయాకు, చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* 'బోర్డ్ ఆఫ్ కంట్రోల్' నిర్మాణంలో మార్పు తెచ్చారు. అనేక మంది మంత్రులు పదవిరీత్యా సభ్యులయ్యారు. ఉదాహరణకు - లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మొదలైనవారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' హోదాను 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'విలియం బెంటింక్'.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కు పెంచారు. నాలుగో సభ్యుడిగా 'లా మెంబరు'ను చేర్చారు. కౌన్సిల్‌లో మొదటి లా మెంబరు లార్డ్ మెకాలే.
* బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిళ్లను రద్దు చేశారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్‌కే పూర్తి శాసనాధికారం లభించింది. గవర్నర్ జనరల్ అధ్యక్షతనున్న కౌన్సిల్ శాసనాలు 'బ్రిటిష్ - ఇండియా' మొత్తానికి, అందరు వ్యక్తులకు, న్యాయస్థానాలకు వర్తిస్తాయి.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా కమిషన్‌'ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
* సివిల్ సర్వీస్ నియామకాల్లో బహిరంగ పోటీ పద్ధతి (open competition) ని ప్రతిపాదించారు. కానీ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు.
* భారత వ్యవహారాల మంత్రిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా చేశారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను గవర్నర్ జనరల్ కౌన్సిల్‌పై ఉంచింది.
* యూరోపియన్లకు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతించారు.

చార్టర్ చట్టం 1853 
బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా జారీ చేసిన చట్టం ఇది.
ముఖ్యాంశాలు: గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలను రూపొందించడానికి 'ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'ను ఏర్పాటు చేశారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులు ఉంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఉంటుంది. 'సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌'నే మినీ పార్లమెంటు అంటారు. దీంతో భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థను మొదటిసారిగా పరిచయం చేసినట్లయ్యింది.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (కేంద్ర శాసన మండలి)లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం 12 మందిలో గవర్నర్ జనరల్, సర్వసైన్యాధ్యక్షుడు, కౌన్సిల్‌లోని నలుగురు సాధారణ సభ్యులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సాధారణ న్యాయమూర్తి, నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు.
* బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. అంతవరకూ 'కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్' నియమించేవారు.
* కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను 24 నుంచి 18 కి తగ్గించారు. వీరిలో ఆరుగురిని నియమించే అధికారం రాణి లేదా చక్రవర్తికి ఇచ్చారు.
* 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు ఉన్న 'గవర్నర్ ఆఫ్ బెంగాల్' అనే హోదాను రద్దు చేశారు.
* భారతదేశంలో వ్యాపార సంస్థగా ప్రారంభమైన ఈస్టిండియా కంపెనీ 1858 నాటికి కేవలం పరిపాలనా సంస్థగానే మిగిలింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు (లేదా) ప్రథమ స్వాతంత్య్ర పోరాటం తర్వాత రద్దయింది. కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలనాధికారాలను స్వీకరిస్తూ 1858 నవంబరు 1 న ఒక ప్రకటన జారీ చేసింది.  
 * భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినప్పటికీ ఇది ఒక సుదీర్ఘ చారిత్రక క్రమపరిణామ ఫలితమని చెప్పొచ్చు.
 *  బ్రిటిష్ - ఇండియా ప్రాంతాల పాలన కోసం 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను చేసింది.
 * ఇవి భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్‌కు ఆధారంగా నిలిచాయి. 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - సుప్రీంకోర్టు తీర్పులు

        భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం ద్వారా లేదా మరే విధంగానైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఒరిజినల్ అధికార పరిధి లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (కేసును నేరుగా తనే స్వీకరించి, విచారించి, తీర్పు ఇవ్వడం) కిందకు వస్తాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, పార్లమెంటు చేసిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాలు చేస్తూ అనేక వివాదాలు కోర్టుల్లో విచారణకు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి......

I. సమానత్వ హక్కు (నిబంధనలు 14-18)
నిబంధన 14: చిరంజిత్ లాల్ చౌదరి Vs కేంద్ర ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు (హెచ్.జె.కానియా) తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేస్తారని తెలిపింది.
* బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రక్షణ దళాలు, రాయబారులకు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
* సాఘీర్ అహ్మద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కేసు (1955)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా భావించి, తనకు అనుకూలంగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని తెలియజేసింది.
సుభాచంద్ Vs ఢిల్లీ ఎలక్ట్రికల్ సప్త్లె కేసు (1981) లో ప్రభుత్వ సర్వీసుల నియామకంలో వయసు, విద్యార్హతలు, కులం, లింగం మొదలైన అంశాల్లో వివక్ష చూపించడం, సమాన అవకాశాన్ని కల్పించే పరిధిలో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
* అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Vs కేంద్ర ప్రభుత్వ కేసు (1988) లో విధులు, కర్తవ్యాలు ఒకే స్వభావం కలిగి ఉన్నా, బాధ్యతల పరిమాణం వేరుగా ఉన్నప్పుడు సమాన పనికి, సమాన వేతన నియమం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* సమాన పని, సమాన విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఇతర తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులకు కూడా, శాశ్వత ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించాలని పంజాబ్‌లోని తాత్కాలిక ఉద్యోగులు వేసిన రిట్ పిటీషన్ కేసు - 2016 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నిబంధన 15: చంపకందొరై రాజన్ Vs మద్రాసు ప్రభుత్వం కేసు (1951)లో ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చి చెప్పింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 15 (4) క్లాజును చేర్చింది.
* యం.ఆర్.బాలాజీ Vs మైసూరు రాష్ట్ర ప్రభుత్వం (1963) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రిజర్వేషన్లు 50% కి మించరాదు అని స్పష్టం చేసింది.
* అయితే 76 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 ద్వారా తమిళనాడులో కల్పించిన 69% రిజర్వేషన్లు రాజ్యాంగంలోని IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీని ద్వారా న్యాయసమీక్షాధికారానికి వీలు లేకుండా చేసింది. కానీ, 2006 లో సుప్రీంకోర్టు IXవ షెడ్యూల్ లోని అంశాలపై కూడా న్యాయసమీక్షాధికారం వర్తిస్తుందని తెలిపింది.
ఇనాందార్ Vs మహారాష్ట్ర ప్రభుత్వం (2005) కేసులో మైనారిటీ, మైనారిటీయేతర నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 ద్వారా 15 (5) క్లాజును చేర్చింది. దీని ప్రకారం 30 (1) నిబంధనను అనుసరించి ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.

నిబంధన 16: దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1964) లో సుప్రీంకోర్టు క్యారీ ఫార్వర్డ్ రూల్ (రిజర్వేషన్ల విషయంలో) చెల్లదని తెలిపింది.
* ఎ.వి.ఎస్.నరసింహారావు Vs ఆంధ్రప్రదేశ్ (1970) కేసులో ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను రాష్ట్రం మొత్తంలో నివసిస్తున్న అందరికీ రిజర్వ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనల చట్టాన్ని రద్దు చేసింది.
* ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ క్రీమీ లేయర్‌ను గుర్తించాలని పేర్కొంది.
* షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లవని కొట్టివేసింది.
* దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 77 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా 16 (4) క్లాజును చేర్చింది.

నిబంధన 18: బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పురస్కారాలు మాత్రమే అని, బిరుదులు కావని, వీటిని పేరుకు ముందు లేదా తర్వాత వాడటం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.

II. స్వేచ్ఛ-స్వాతంత్య్ర హక్కు (నిబంధనలు 19-22)
నిబంధన 19: బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు (1950)లో సుప్రీంకోర్టు (సయ్యద్ ఫజుల్ అలీ నాయకత్వంలోని బెంచ్) తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని తెలిపింది.
* కానీ కె.ఎ.అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1970)లో సుప్రీంకోర్టు (హిదయతుల్లా) తీర్పునిస్తూ సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తెలిపింది.
* మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోపల, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భావవ్యక్తీకరణకు భౌగోళిక హద్దులు లేవని తెలిపింది.
* బిజయ్ ఎమాన్యూల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో సుప్రీంకోర్టు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలో మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది అని అభిప్రాయపడింది. ఇది జాతీయ గీతం కేసుగా ప్రచారం పొందింది.
* అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో సుప్రీంకోర్టు, ప్రజా సంక్షేమం దృష్ట్యా వాహన డ్రైవర్లు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
* సోదన్ సింగ్ Vsన్యూదిల్లీ మున్సిపల్ కమిటీ (ఎన్‌డీఎంసీ) కేసు (1989) కు సంబంధించి సుప్రీంకోర్టు 1992లో తీర్పునిస్తూ క్రమబద్దీకరించిన రహదార్ల కాలిబాటలపై వ్యాపారం చేసుకునేందుకు (జీవనోపాధి) హాకర్లకు హక్కు ఉందని తెలియజేసింది.
సి.పి.ఐ.(యం) Vs భరత్ కుమార్ (1997) కేసులో సుప్రీంకోర్టు బంద్, హర్తాల్ మధ్య తేడాలను తెలియజేయడంతో పాటు బంద్ అనేది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
* రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (2003) కేసులో సుప్రీంకోర్టు, సమ్మె ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ కార్మికులు లేదా ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది.
* శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66A భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, చెల్లదని స్పష్టం చేసింది. (నేపథ్యం- 2012 లో స్వర్గీయ బాల్ థాకరే మరణం తర్వాత ముంబయి బంద్‌కు పిలుపునివ్వడంపై షహీన్ దాదా, రీను శ్రీనివాసన్ తమ అసంతృప్తిని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. కానీ ప్రజావ్యతిరేకత రావడంతో విడుదల చేశారు).

నిబంధన 20: నందిని సాత్పతి Vs డాని పి.ఎల్. (1978) కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని వివరించింది.
* స్వయంగా నిందను ఆపాదించుకోకూడదు.
* మౌనాన్ని పాటించే హక్కు నిందితుడికి ఉంటుంది.
* శారీరకంగా బెదిరించి, హింసించి పొందిన సాక్ష్యం, మానసిక క్షోభ కలిగించడం, ప్రతికూల పరిసరాలను కల్పించి ఒత్తిడి తేవడం, పదేపదే ప్రశ్నలు అడిగి విసిగించడం, శక్తికి మించిన బరువు, బాధ్యతలు మోపడం, బలవంతంగా నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ఉపయోగించే ప్రత్యక్ష లేదా పరోక్ష, మానసిక లేదా శారీరక క్షోభకు గురిచేయడం బలవంతపు సాక్ష్యం కిందికి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది.
ఎ.ఎ.ముల్లా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1996) కేసులో సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టం కింద విచారించి నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని, తిరిగి కస్టమ్స్ చట్టం, విదేశీమారక క్రమబద్దీకరణ చట్టం కింద రెండో విచారణ నిర్వహించడం 20 వ నిబంధనకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. రెండు విచారణల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని మొదటి, రెండో విచారణల్లోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి రెండో విచారణ నిర్వహించవచ్చని వ్యాఖ్యానించింది.

నిబంధన 21: ఎ.కె.గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు (1950) కేసులో సుప్రీంకోర్టు 19, 21 ప్రకరణలు లేదా నిబంధనల పరిధులు వేరని తెలిపింది. 21 వ నిబంధనను అనుసరించి చేసిన శాసనం ప్రకారం నిర్బంధితులైనప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో చట్టం చేస్తే, అది చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
* నీరజా చౌదరి Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1984) కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ పి.భగవతి) తీర్పునిస్తూ వెట్టిచాకిరీ జీవించే హక్కు (నిబంధన 21)కు భంగకరం కాబట్టి, ప్రభుత్వాలు వెట్టిచాకిరీని  నిర్మూలించే శాసనాలను రూపొందించాలని ఆదేశించింది.
* ఉన్నిక్రిష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, (1993) కేసులో సుప్రీంకోర్టు (ఎల్.ఎం.శర్మ) చరిత్రాత్మక తీర్పునిస్తూ విద్యాహక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, అది లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని తెలియజేసి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అయితే విద్యార్జన హక్కు వయసును 14 సంవత్సరాలకు పరిమితం చేసింది. 14 సంవత్సరాల తర్వాత విద్యార్జన హక్కు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. (దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది)
వీడియోకాన్ Vs మహారాష్ట్ర (2013) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 21వ నిబంధనలోని జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని తెలియజేసింది.

నిబంధన 22: ఎ.కె.గోపాలన్ Vs మద్రాసు ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం అరెస్టు చేసే పోలీసు అధికారి బాధ్యత. ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో తెలియజేయలేకపోతే, కారణాలను కోర్టుకు తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
* అబ్దుల్ సమద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1962) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలు గడిస్తే, ఆ వ్యక్తికి (అరెస్టు అయిన వ్యక్తి) విడుదల కావడానికి హక్కు ఉంటుందని తెలిపింది.
* జోగిందర్ కుమార్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1994) కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, ఆ సమాచారాన్ని, దానికిగల కారణాలను కుటుంబ సభ్యులకు (లేదా) స్నేహితులకు (లేదా) సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పింది.

III. పీడన నిరోధక హక్కు (నిబంధనలు 23-24)
* పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం ప్రాథమిక హక్కుల్లోని 23వ నిబంధన ఉల్లంఘనగా తెలియజేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2001) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైంది. ఆకలి, పోషకాహార లోపాలను అరికట్టడానికి, ఆహార హక్కును చట్టబద్దంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీనివల్ల అనేక రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని (బడిపిల్లలకు) ప్రవేశపెట్టాయి.
* సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కార్మికులు Vss జమ్మూ & కశ్మీర్ (1983) కేసులో సుప్రీంకోర్టు నిర్మాణ రంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లల్లోపు వారిని పనిలో చేర్చుకోకూడదని ఆదేశించింది.
* బందువా ముక్తిమోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని, బాల కార్మికులను పనిలో చేర్చుకునే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించి, ఆ నిధిలోకి జమచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

సంప్రదాయమైవి, ఆధునికమైనవి: స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు, మతస్వాతంత్య్రపు హక్కు లాంటి సంప్రదాయ హక్కులతో పాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కులు సైతం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి.

సార్వత్రికం కావు:  ఆర్టికల్స్‌ 15, 16, 19, 29, 30లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నివసించే విదేశీయులకు వర్తించవు.
* ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు సాయుధ దళాల సిబ్బందికి లభించదు. 
* ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత ప్రజలతోపాటు భారత భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

న్యాయ సంరక్షణ:  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీచేస్తాయి.

నిరపేక్షమైనవి కావు: ప్రాథమిక హక్కులు అపరిమితమైనవికావు. దేశ సమగ్రత, సుస్థిరత దృష్ట్యా ప్రభుత్వం వీటిపై చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ప్రభుత్వ అధికారంపై పరిమితులు: ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాసనాలు రూపొందించడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాథమిక హక్కులు పేర్కొంటాయి.

రద్దుకు అవకాశం లేనివి, కానీ సస్పెండ్‌ చేయొచ్చు: భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేయొచ్చు. కానీ పూర్తిగా రద్దుచేసే వీల్లేదు.

అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల సంరక్షణ: దేశంలోని మెజారిటీ వర్గాల ఆధిపత్యం నుంచి అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటం, జాతి సమగ్రతను సంరక్షించడం, వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రాథమిక హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి. 
ఉదా: విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు రక్షణ కల్పించడం.

పౌరుల సమగ్రాభివృద్ధి సాధనాలు: పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి, వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీఇవ్వడం ద్వారా ప్రాథమిక హక్కులు పౌరుల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

వివరణ
*  1951లో చంపకం దొరైరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు అని పేర్కొంది.
* 1973 లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఇస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పోషకాలని ప్రకటించింది.
* 1980 లో మినర్వామిల్స్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
* 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించింది.

ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటికి రాజ్యాంగం నుంచి హామీ లభిస్తుంది. ఇవి ప్రభుత్వ అధికారంపై పరిమితులు విధిస్తాయి.
* దేశ పౌరులు వీటిని వదులుకునే వీలులేదు.
* ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులను ఆశ్రయించవచ్చు.
* రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి, ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల కంటే ఉన్నతమైన ఆధిక్యత, స్వభావం కలిగి ఉన్నాయి.

సాధారణ హక్కులు
* సాధారణ హక్కులు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల ద్వారా రూపొందుతాయి. వీటికి హామీ ఉంటుంది. ఈ హక్కులు ప్రభుత్వానికి అదనపు అధికారాలు కల్పిస్తాయి.
* సాధారణ హక్కులను పౌరులు తమ ఇష్టానుసారం వదులుకోవచ్చు.
* సాధారణ హక్కుల అమలు కోసం పౌరులు కేవలం పరిమిత న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించవచ్చు.
* వీటిని ఎలాంటి పరిస్థితిలోనైనా తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, రద్దు చేసే వీలు కూడా ఉంటుంది. 
* సాధారణ హక్కులు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి.

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* వీటిని రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్నారు.
* ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య పొందుపరిచి ఉన్నాయి.
* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయ సంరక్షణ ఉంది.
* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.
* ఇవి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. 
* వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
* ఇవి నకారాత్మక దృక్పథం కలిగినవి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.
* వీటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది.

ఆదేశిక సూత్రాలు
* వీటిని రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పేర్కొన్నారు.
* వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు.
* ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
* ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
* సమాజ సమష్టి ప్రయోజనాలు సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* ఇవి ఎప్పుడూ అమల్లోనే ఉంటాయి.
* ఇవి సామాజికపరమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.
* ఇవి సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి.
* ఇవి కేవలం సూచనప్రాయమైనవి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాథ‌మిక విధులు

ప్రాథమిక విధులు రాజ్యం, సమాజం, ఇతర వ్యక్తుల పట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను తెలియజేస్తాయి. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-A నిబంధనలో వీటిని చేర్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 42 వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులను చేర్చారు. 86 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా మరో ప్రాథమిక విధిని చేర్చడంతో, వీటి సంఖ్య 11 కు చేరింది. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ (1998) సిఫారసుల మేరకు 'జనవరి 3 ను ప్రాథమిక విధుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* 51-(A) (a): రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
(b): స్వాతంత్య్రోద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి.
(c): దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను గౌరవించాలి, కాపాడాలి.
(d): దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
(e): భారత ప్రజల మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలి. మతం, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా ఉండాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలను విడనాడాలి.
(f): మన వారసత్వ సమష్టి సంస్కృతి (భిన్నత్వంలో ఏకత్వం) గొప్పతనాన్ని గౌరవించాలి, కాపాడాలి.
(g): అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులను కాపాడాలి, ఇతర జీవుల పట్ల దయ ఉండాలి.
(h): శాస్త్రీయ, మానవతా దృక్పథం, పరిశీలనా దృక్పథం, సంస్కరణ దృక్పథల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి.
(i): ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, హింసను విడనాడాలి.
(j): అన్ని రంగాలలో వ్యక్తిగత, సమష్టి కార్యకలాపాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి.
(k): 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల విద్యార్జనకు తగిన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉంటుంది.
* అయితే ప్రాథమిక విధులు న్యాయ అర్హమైనవి కావు. అందువల్ల వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* క్లుప్తంగా చెప్పాలంటే... ఆదేశ సూత్రాలు ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు, ప్రాథమిక విధులు ప్రజలకు నిర్దేశించిన బాధ్యతలు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగ ర‌చ‌న‌

బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత దేశం తన జాతీయ పునర్నిర్మాణం, సాంఘిక, ఆర్థిక, మార్పు సాధన, అనువైన నిర్మాణాల కోసం విశేషమైన కృషి జరిపింది. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు). ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (1787 నాటిది).  
 ''ప్రజల జీవితానికి, వారి ఆశయాలకు అనుగుణంగా లేని రాజ్యాంగం ప్రజలను అధోగతి పాలుచేస్తుంది". అని జవహర్ లాల్ పేర్కొన్నారు.

రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు)
1918, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో భారతీయ ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించారు. 1922, జనవరి 5న గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు" అని పేర్కొంటూ... రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి, ప్రజల అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగాన్ని రూపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
* స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది: దాదాభాయ్ నౌరోజీ.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించిన భారతీయుడు: ఎం.ఎన్. రాయ్.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ: స్వరాజ్య పార్టీ
* 1927, మే 17న బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను గురించి మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించారు. భారతరాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ నాయకులు 1928, ఫిబ్రవరి, 28న ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని 29 పార్టీలతో కలిసి ఏర్పాటు చేశారు. 1928, మే 19న డాక్టర్ ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఉపసంఘంలోని సభ్యులు: 
1. లాలా లజపతిరాయ్ 
2. తేజ్ బహదూర్ సప్రూ
3. సుభాష్ చంద్రబోస్
4. ఎం.ఆర్. జయకర్
5. షోయాబ్ ఖురేషి 
6. సర్దార్ మంగళ్‌సింగ్
7. ఎం.ఎన్. అణే 
8. సర్.అలీ. ఇమాం 
9. జి.ఆర్. ప్రధాన్

*  మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928, ఆగస్టు 10న సమర్పించింది. దీన్ని భారతీయులు రాజ్యాంగ రచన కోసం చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
* 1925లో అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్‌లో "Common Wealth of India" అనే బిల్లును ప్రతిపాదించి ''ఐర్లాండ్" ప్రజల మాదిరిగానే భారత్ ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని సూచించారు.
* 1936లో జవహర్‌లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ ''భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కారం ఉంది. అది భారత్ ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు తమను తాము పాలించుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే స్వేచ్ఛను కల్పించాలి".
* 1937లో ఫైజ్‌పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది.
* 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన 'హరిపుర' వద్ద జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది.
* 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా రూపొందించాలని ప్రతిపాదించారు. 
* 1939, నవంబరు 12న గాంధీజీ 'భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది' అని హరిజన్ పత్రికలో వ్యాఖ్యానించారు.
* 1940, ఆగస్టు ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును గుర్తించారు. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా గుర్తించారు.
* 1945, సెప్టెంబరు 19న లార్డ్ వేవెల్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారని ప్రకటించాడు.
* 1946 జనవరి, ఫిబ్రవరి నెలల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ రిచర్డ్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యులతో ఒక ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి పంపింది. ఈ బృందం 'భారతీయులు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు' అని నివేదించింది.
* 1946, మార్చి 24న మనదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం సిఫార్సులను అనుసరించి, 1946 జూన్, జులై నెలల్లో రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి.
* ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. రాష్ట్రాల్లో కేవలం 28.5% ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికైన మొత్తం సభ్యులు: 389.

 రాజ్యాంగ పరిషత్‌లో ప్రాంతాలవారీగా కేటాయించిన స్థానాలు 

 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన 292 మంది వివరాలు 

నాలుగు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాలు

రాజకీయ పార్టీల వారీగా రాజ్యాంగ పరిషత్తు-ఎన్నికల ఫలితాలు 

*డిసెంబరు 9, 1946 నాటి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైనవారు - మతాలు, సామాజిక వర్గాల వారీగా మొత్తం సభ్యులు: 208 

* ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌తో రాజ్యాంగ పరిషత్తు సమావేశాలను బహిష్కరించింది. ఇలా జరగక ముందు జాతీయ కాంగ్రెస్‌కు రాజ్యాంగ పరిషత్తు‌లో 69% ప్రాతినిధ్యం ఉంది. సమావేశాల నుంచి ముస్లింలీగ్ వైదొలగడంతో దాని ప్రాతినిధ్యం 82%కి పెరిగింది.
* 1947 ఆగస్టులో భారతదేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తు‌ను కూడా విభజించారు. స్వాతంత్య్రనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య: 299
* స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తు‌లోని 299 మంది సభ్యుల్లో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు/ఇండియన్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నిక కాగా, 70 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
* 1947, డిసెంబరు నాటికి భారత రాజ్యాంగ పరిషత్తులోని 299 మంది సభ్యుల వివరాలు

రాజ్యాంగ పరిషత్తులో - వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించినవారు 

రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వంలేని ప్రముఖులు:
    1. భారత జాతిపిత: మహాత్మగాంధీ
    2. పాకిస్థాన్ జాతిపిత : మహ్మద్ అలీ జిన్నా 
* రాజ్యాంగ పరిషత్తుకు బెంగాల్ నుంచి ఎన్నికైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయి, తర్వాత బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయ్యారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పోటీచేయకుండా, అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయినవారు:
    1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
    2. కె.టి. షా
    3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యాంగ పరిషత్తుకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సోమనాథ్‌లహరి దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిషత్తులో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహిళలు: 15 మంది
    1. విజయలక్ష్మి పండిట్
    2. సరోజినీ నాయుడు
    3. దుర్గాబాయి దేశ్‌ముఖ్   
    4. రాజకుమారి అమృతకౌర్   
    5. హంసా మెహతా
    6. అమ్ము స్వామినాథన్
    7. ఆన్ మస్కార్నే నాథ్
    8. బేగం అజీజ్ రసూల్
    9. సుచేతా కృపలాని
    10. రేణుకారే
    11. పూర్ణిమా బెనర్జీ
    12. లీలా రే
    13. మాలతీ చౌదరి
    14. కమలా చౌదరీ
    15. దాక్షాయణి వేలాయుధన్ 

రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు:
    1. టంగుటూరి ప్రకాశం పంతులు
    2. నీలం సంజీవరెడ్డి
    3. భోగరాజు పట్టాభిసీతారామయ్య
    4. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    5. కళా వెంకట్రావు
    6. ఎన్.జి.రంగా
    7. కల్లూరి సుబ్బారావు
    8. మోటూరి సత్యన్నారాయణ
    9. బొబ్బిలి రాజ రామకృష్ణ రంగారావు
    10. సి. దానయ్య

రాజ్యాంగ పరిషత్తు తొలిసమావేశం
* గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశం మేరకు రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946, డిసెంబరు 9 (సోమవారం)న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి 9 మంది మహిళలతో సహా మొత్తం 211 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జె.బి.కృపలాని సూచన మేరకు ఫ్రెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 
* 1946, డిసెంబరు 11న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
* ''సహకార ప్రాతిపదికపై భారతదేశం కామన్వెల్త్ రాజ్యం కావాలని, కుల, మత, వర్గరహిత సమాజం ఏర్పడే దిశగా పయనించాలని" డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
* 1946, డిసెంబరు 13న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని (Objectives & Resolutions) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానం మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ' అని జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానాన్ని భారతజాతి జాతక చక్రం'గా కె.ఎం. మున్షీ అభివర్ణించారు.
* అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకూ, అమెరికా రాజ్యాంగానికి ఏవిధమైన సంబంధం ఉందో; అదేవిధమైన సంబంధం లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి, భారత రాజ్యాంగానికి ఉందని పేర్కొంటారు.

లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని సారాంశం
* భారతదేశం స్వతంత్య్ర, సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్యం అవుతుంది.
* సార్వభౌమ-స్వతంత్య్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే.
* రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగ మూలశాసనం భారత ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి. 
* ప్రజలందరికీ చట్టరీత్యా సమానత్వాన్నీ, స్వేచ్ఛను కల్పించడానికి హామీ ఇవ్వడం.
* భారత ప్రజలందరికీ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం.
* రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్, ముఖ్య లేఖకుడిగా ఎన్.సి.ముఖర్జీ, సలహాదారుడిగా బి.ఎన్.రావు వ్యవహరించారు.

* సువిశాల భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బ్రిటిష్ సంప్రదాయ రీతిలో కమిటీ పద్ధతిని అనుసరించి, రాజ్యాంగ పరిషత్తు రెండు రకాల కమిటీలను ఏర్పరిచింది.

I. విషయ నిర్ణాయక కమిటీలు (Committees on Substantive Affairs) 

ఇవి మొత్తం 12 కమిటీలు: అవి 

II. విధాన నిర్ణాయక కమిటీలు: (Committees on Procedural Affairs)
ఇవి మొత్తం 10 కమిటీలు. అవి: 

* రాజ్యాంగ పరిషత్తు విధులపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు: జి.వి. మౌలాంకర్
* రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలన్నింటిలోకి పెద్దది - సలహా సంఘం. వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఏర్పడిన ఈ కమిలోని సభ్యులు 1 + 54 = 55 రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి: డాక్టర్ సచ్చిదానంద సిన్హా
* 1947, జులై 22న రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ జెండాను ప్రదర్శించి, ప్రతిపాదించినవారు: హంసా మెహతా
* రాజ్యాంగ రచనా ప్రక్రియ, ఆమోదంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు జరిపిన మొత్తం సమావేశాల సంఖ్య: 11
* చివరి సమావేశమైన 12వ సమావేశం 1950, జనవరి 24న జరిగింది.
* దేశ విభజన జరిగి ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు కావడంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో 'కేంద్ర అధికారాల కమిటీ' తన నివేదికను పునఃపరిశీలన చేసి, తన రెండో నివేదికలో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. 
* వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు సలహాదారుడైన బెనగల్ నరసింగరావు 1947, అక్టోబరు నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇతడు రూపొందించిన తొలి ముసాయిదా రాజ్యాంగంలో 243 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. 

రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947, ఆగస్టు 29
* రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీల్లో అత్యంత కీలకమైంది 1947, ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రముఖ వ్యక్తులకు సభ్యత్వం కల్పించారు. వారి వివరాలు:
     1. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ - అధ్యక్షులు
     2. ఎ. కృష్ణస్వామి అయ్యర్ - సభ్యులు
     3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ - సభ్యులు
     4. మహ్మద్ సయ్యద్ సాదుల్లా - సభ్యులు
     5. కె.ఎం. మున్షీ - సభ్యులు
     6. బి.ఎల్. మిట్టల్ - ఇతడు దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడంతో ఇతడి స్థానంలో 1947, డిసెంబరు 5న ఎన్. మాధవరావు నియమితులయ్యారు.
     7. డి.పి. ఖైతాన్ - ఇతడు 1948లో మరణించడంతో ఇతడి స్థానంలో టి.టి. కృష్ణమాచారిని నియమించారు.
* ముసాయిదా కమిటీలో న్యాయ విద్యను అభ్యసించని ఏకైక సభ్యులు టి.టి. కృష్ణమాచారి.

రాజ్యాంగ పరిషత్తు పని విధానం - 3 దశలు
మొదటి దశ:
డిసెంబరు 9, 1946 నుంచి ఆగస్టు 15, 1947 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది.
రెండో దశ: ఆగస్టు 15, 1947 నుంచి నవంబరు 26, 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులతోపాటు, దేశ పాలనకు అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది.
మూడో దశ: నవంబరు 26, 1949 నుంచి మే 13, 1952 వరకు. ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్తు కేవలం శాసనవిధులను మాత్రమే నిర్వహిస్తూ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను నిర్వహించేటప్పుడు బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు.
* రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించేటప్పుడు అధ్యక్షులుగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షులుగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు.

రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందిన రాజ్యాంగం
* 1949, నవంబరు 26న (శనివారం) రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
* ప్రతి సంవత్సరం నవంబరు, 26ను జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహిస్తారు.
* రాజ్యాంగ తయారీకి అయిన వ్యయం: 64 లక్షల రూపాయలు
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదాను చర్చించి, ఆమోదించడానికి 165 రోజులు పట్టింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్న సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
* రాజ్యాంగ పరిషత్తు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది.
* రాజ్యాంగ రాతప్రతికి సంబంధించి, రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు రాగా, వాటిలో 2,473 ప్రతిపాదనలను చర్చించి పరిష్కరించింది.
* రాజ్యాంగ పరిషత్తు ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు: హెచ్.వి. కామత్.

 రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు:
       1) పౌరసత్వం
       2) ఎన్నికలు
       3) తాత్కాలిక పార్లమెంటు
       4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు.
* 1950, జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో మొత్తం 299 మంది సభ్యులకు, 284 మంది రాజ్యాంగ రాత ప్రతిపై సంతకాలు చేశారు.

రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 
* 'జనగణమన'ను జాతీయగీతంగా ఆమోదించడం  
* 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఆమోదించడం
* డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను 'రాష్ట్రపతి'గా ఎన్నుకోవడం

*  1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించిన రాజ్యాంగం, 1950, జనవరి, 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి కారణం 1929, డిసెంబరు 31న లాహోర్‌లోని రావి నది ఒడ్డున జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ తీర్మానం ప్రకారం 1930, జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ విధంగా జనవరి 26కు ఉన్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా నూతన రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది 1950, జనవరి 26. రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసినవారు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.
* కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం 1949, మేలో రాజ్యాంగ పరిషత్తు అంగీకరించింది.
* రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు (ఐరావతం)ను నిర్ణయించారు.
* రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఎన్నికైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశ మొదటి రాష్ట్రపతిగా 1950, జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల జనవరి 26న మనం 'గణతంత్ర దినోత్సవం'గా జరుపుకుంటున్నాం.
* స్వాతంత్య్రానంతరం 1948, జూన్ 21 వరకు మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు.
* 1948, జూన్ 22 నుంచి బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు భారత గవర్నర్ జనరల్‌గా సి. రాజగోపాలాచారి వ్యవహరించారు.
* అంబేడ్కర్ బృందం 1948, ఫిబ్రవరి 21 నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగంలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ సభ - చర్చలు
* అంబేడ్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగసభలో జరిగిన అనేక చర్చలు, వ్యాఖ్యానాలు కింది విధంగా ఉన్నాయి.
*  'ఈ రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీలా ఉంది'. - మౌలానా హ్రస్రత్ మొహాని
*  'సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదు. భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారు'. - దామోదర్ స్వరూప్ సేథ్
* 'కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు'.    - ప్రొమథ్ రంజన్ ఠాగూర్                                                                                                     
*  'మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు'. - శ్రీ రోహిణి కుమార్ చౌదరి                                                                                                                    
 * 'గతంలో మనం ప్రజలకు చేసిన ప్రతిజ్ఞ, ఈ రోజు మనం ప్రజలకు చేస్తున్న ప్రతిజ్ఞ నెరవేర్చాలి. ఈ రోజు నుంచి మనం విశ్రాంతి భవనాల్లో సుఖశాంతులతో ఉండే రోజులు పోయాయి. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులోని కోట్లాది మంది వ్యథార్థులకు సేవ చేయడమే'. - జవహర్‌లాల్ నెహ్రూ
 *  'తన ప్రాచీన కాలం నాటి సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని పరిత్యజించి, నూతన వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ పరిషత్తు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఉంది'. - జవహర్‌లాల్ నెహ్రూ
 * ఈ రోజు నుంచి (1950, జనవరి 26) మనం వైరుధ్యాలతో కూడిన సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. 'రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది'. - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్        
 *  ఎం.వి. పైలీ "Constitutional Government in India" అనే గ్రంథంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను 'భారత రాజ్యాంగ పితగా, ఆధునిక మనువు'గా కీర్తించారు.
*  భారత రాజ్యాంగాన్ని ఆంగ్లంలో అందంగా చేతితో రాసింది ప్రేమ్ బిహారి నారాయణరైజ్దా. దీనికి ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ తన పేరును, చివరి పేజీలో తన పేరుతోపాటు తన తాత పేరును రాసుకుంటానని కోరగా దానికి నెహ్రూ సమ్మతించారు.
*  భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దింది నందలాల్ బోస్. ఇతడికి సహకరించింది శాంతినికేతన్‌లోని చిత్రకారులు.
*  సాంఘిక, ఆర్థిక విప్లవ సాధనే రాజ్యాంగ సభకు మూలాధారమని చెప్పవచ్చు. ఈ లక్ష్యసాధన కోసం రాజ్యాంగ సభలో మూడు రకాల వ్యూవహాలపై చర్చ జరిగింది. అవి:

ఎ. గాంధేయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని స్వయంప్రతిపత్తి ఉండేదిగా రూపొందించాలి. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలు మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పగించాలి.
*  గ్రామీణ ప్రజానీకానికి తమను తాము పునర్ నిర్మించుకోవడానికి తగిన చొరవ, తెలివితేటలు లేవని భారతదేశ సమగ్రత, రక్షణ లాంటి అవసరాలను తీర్చడానికి గాంధేయ సిద్ధాంతం సరిపోదని దీన్ని తిరస్కరించారు.

బి. సోవియట్ సామ్యవాద నమూనా: ఇది ఏకపార్టీ వ్యవస్థ మీద ఆధారపడింది. అత్యధిక కేంద్రీకరణతో కూడుకొని, అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాంగాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. దీన్ని కూడా తిరస్కరించారు.
 
సి. యూరో-అమెరికన్ నమూనా: కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు, ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత, అధికారానికి మూలం ప్రజలు అనేదానిపై ఇది (ఈ నమూనా) ఆధారపడింది.
*  రాజ్యాంగ సభ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు పాశ్చాత్య ఉదారవాద సంప్రదాయం పట్ల నమ్మకం ఉంది. భారతదేశ ఆధునికీకరణ కోసం పాశ్చాత్య నమూనా అయిన యూరో-అమెరికన్ నమూనానే స్వీకరించారు.

రాజ్యాంగ రచన కోసం - రాజ్యాంగ పరిషత్తు ఉపయోగించిన పద్ధతి
*  ఒ.పి.గోయెల్ తన గ్రంథం "Indian Government and Politics"లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతి (Method of Adoption)ని ఎక్కువగా అనుసరించింది అని తెలిపారు. 
*  సర్ధుబాటు పద్ధతిలో పరిస్థితులకు అనుగుణంగా రాజీపడటం, కొన్ని విభేదాలు ఉన్నట్లయితే వాటిని అలాగా ఉండనీయడం ఈ పద్ధతి విధానం.

రాజ్యాంగ పరిషత్తుపై వ్యాఖ్యానాలు
* ''రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది" - విన్‌స్టన్ చర్చిల్
* ''రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు నియంత్రణ మండలిగా వ్యవహరించారు" - గాన్ విల్ ఆస్టిన్
* ''రాజ్యాంగ పరిషత్తు‌పై ప్రజాభిప్రాయ నీడలు లేవు" - కె. సంతానం
* ''రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యం వహించింది" - లార్డ్ సైమన్
* ''రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారింది" - జయప్రకాష్ నారాయణ్
                                                                                                                   
భారత రాజ్యాంగానికి ఆధారాలు
 ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైంది భారత రాజ్యాంగం. సుమారు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950, జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు మన దేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.

1. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి
* దీన్ని భారత రాజ్యాంగానికి నకలు (Xerox copy)గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని సుమారు 70%కి పైగా అంశాలు ఈ చట్టం నుంచే గ్రహించారు.
భారత ప్రభుత్వ చట్టం - 1935 నుంచి గ్రహించిన అంశాలు
* సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; అత్యవసర అధికారాలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, పరిపాలనాంశాలు.

2. బ్రిటన్ రాజ్యాంగం నుంచి
* పార్లమెంటరీ ప్రభుత్వ విధానం - ద్విసభా విధానం
* ఏక పౌరసత్వం - సమన్యాయ పాలన - కేబినెట్ ప్రభుత్వం
* శాసనసభ్యుల హక్కులు - ఎన్నికల వ్యవస్థ - శాసన నిర్మాణ ప్రక్రియ
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
* అటార్నీ జనరల్ - రిట్స్ జారీ విధానం - దిగువ సభ ఆధిక్యత
* ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థ - దిగువ సభకు మంత్రిమండలి బాధ్యత వహించడం
* ఉద్యోగుల ఎంపిక పద్ధతులు - ఉద్యోగి స్వామ్యం
* దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం

3. అమెరికా రాజ్యాంగం నుంచి
* లిఖిత రాజ్యాంగం
* ప్రాథమిక హక్కులు
* రాజ్యాంగ ఆధిక్యం - ప్రవేశిక - న్యాయ సమీక్షాధికారం
* స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
* రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం
* న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ
* ఉపరాష్ట్రపతి పదవి
* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం
* దేశాధినేత పేరు మీదుగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించడం
* ప్రజాప్రయోజన వ్యాజ్యం (public interest litigation)

4. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి
* ఉమ్మడి జాబితా
* ఉభయ సభల సంయుక్త సమావేశం
* స్వేచ్ఛా వాణిజ్య, వ్యాపార చట్టాలు 
* అంతర్ రాష్ట్ర వాణిజ్యం
* భాషలకు సంబంధించిన అంశాలు
* కేంద్ర ఆర్థిక సంఘం

5. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి
* ఆదేశిక సూత్రాలు
* రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం
* నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నిక పద్ధతి

6. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి
* ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం
* రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం

7. సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి
* సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలు
* సామ్యవాద సూత్రాలు
* ప్రాథమిక విధులు
* దీర్ఘకాలిక ప్రణాళిక

8. జపాన్ రాజ్యాంగం నుంచి
* చట్టం నిర్ధారించిన పద్ధతి
* ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు

9. కెనడా రాజ్యాంగం నుంచి
* అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం
* ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం
* కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం
* బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య విధానం.

10. జర్మనీ రాజ్యాంగం నుంచి
* అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం.

11. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి
* ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు
* గణతంత్ర (Republic) విధానం
* తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం

భారత రాజ్యాంగంపై - వ్యాఖ్యానాలు
* ''భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైంది, తలమానికమైంది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
* ''భారత రాజ్యాంగం ఇంద్రుడి వాహనమైన ఐరావతం లాంటిది" - హెచ్.వి. కామత్
* ''భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత" - గాన్‌విల్ ఆస్టిన్
* ''భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది" - జవహర్‌లాల్ నెహ్రూ
* ''భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం లాంటిది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
* ''భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య" - కె.సి. వేర్
* ''భారత రాజ్యాంగం సహకార సమాఖ్య" - డి.ఎన్. బెనర్జీ, గాన్‌విల్ ఆస్టిన్
* ''ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అని ఎవరైనా అంటే అందుకు నేను గర్విస్తాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* ''భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ ప్రవేశిక - మూలతత్వం

   భారత రాజ్యాంగం ప్రవేశిక (Preamble)తో ప్రారంభమవుతుంది. దీన్ని రాజ్యాంగానికి మూలతత్వం, ఉపోద్ఘాతం, ఆత్మ, పీఠికగా పేర్కొంటారు. 1946, డిసెంబరు 13న రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన చారిత్రక లక్ష్యాలు, ఆశయాల తీర్మానం మన రాజ్యాంగ ప్రవేశికకు మూలంగా చెప్పవచ్చు.

   మనదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. ప్రవేశిక భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి దిక్సూచిలా ఉపయోగపడటమే కాకుండా, రాజ్యాంగ తాత్విక పునాదులను వెల్లడిస్తుంది.
 
ప్రవేశికకు ప్రేరణను అందించిన అంశాలు
* అమెరికా విప్లవం - రాజ్యాంగ ప్రవేశికను అమెరికా నుంచి గ్రహించాం.
* ప్రవేశికకు మూలాధారమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే భావనలను ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకున్నాం.

* సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను రష్యా విప్లవం నుంచి సంగ్రహించాం.
* జవహర్‌లాల్ నెహ్రూ అందించిన 'చారిత్రక లక్ష్యాల, ఆశయాల తీర్మానం' రాజ్యాంగ రూపకర్తలకు ప్రవేశికను రూపొందించడంలో దిక్సూచిలా పనిచేసింది.

ప్రవేశికలోని సారాంశం
  భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వాసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనల్లో స్వాతంత్య్రాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని 26 నవంబరు, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.

ప్రవేశిక - అర్థ వివరణ
  భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రొఫెసర్ జె.ఆర్. శివాక్ 'నాలుగు' విభాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి:

1. అధికారానికి మూలం:
  భారత ప్రజలమైన మేము చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించి, అంగీకరించి, చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం. దీని ప్రకారం భారత రాజ్యాంగం ప్రజలకు బాధ్యత వహించే వ్యవస్థను రూపొందించింది. అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారానికి మూలం 'ప్రజలు'.

2. ప్రభుత్వ స్వరూపం: 'సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర'గా పేర్కొన్నారు.

సార్వభౌమాధికారం:
   భారతదేశం 1947, ఆగస్టు 15న సర్వస్వతంత్ర దేశంగా అవతరించింది. దీని ప్రకారం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదు. మనదేశం కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం పొందినప్పటికీ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఆ కూటమి నుంచి స్వచ్ఛందంగా మనం బయటకు వచ్చేయొచ్చు. ప్రపంచ దేశాలతో స్నేహం, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఐక్యరాజ్యసమితి (UNO)లో మనం సభ్యత్వం తీసుకున్నాం. అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశం సభ్యత్వం తీసుకున్నప్పటికీ భారతదేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదు.
 
సామ్యవాదం
   1955లో మద్రాసు సమీపంలోని ఆవడి వద్ద జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యం తమ లక్ష్యం అని మన తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికను సవరించి 'సామ్యవాద' అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు. 'సామ్యవాదం' అంటే ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించి, వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించడం.
1982లో సుప్రీంకోర్టు డి.ఎస్.నకార Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునిస్తూ, ఆర్థిక, సాంఘిక, జీవన ప్రమాణాల అసమానతలను రూపుమాపడం, కార్మికులందరికీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు సరైన జీవన ప్రమాణాన్ని సమకూర్చడమే 'సామ్యవాద లక్ష్యం' అని పేర్కొంది.

లౌకికతత్వం:
   ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక (Secular) అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చింది. మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. దీని ప్రకారం రాజ్యానికి అధికార మతం ఉండదు. మత వ్యవహారాల్లో రాజ్యం తటస్థంగా ఉంటుంది. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ ధనసహాయం పొందే విద్యాలయాల్లో మతబోధన నిషేధం. మనదేశం అనాదికాలం నుంచి మతసామరస్యాన్ని అనుసరిస్తుంది. భారతదేశం బౌద్ధ, జైన మతాలకు పుట్టినిల్లు. విభిన్న మతాలు మనదేశంలో వర్థిల్లుతున్నాయి.
   ఎస్.ఆర్.బొమ్మైVs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణమని పేర్కొంది.

ప్రజాస్వామ్యం
  అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యం అంటే 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం'. ఆర్టికల్ 326 ప్రకారం మనదేశంలో 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షతో సంబంధం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఎన్నికలు నిర్వహించి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రజల విశ్వాసం మేరకే ప్రభుత్వాల మనుగడ కొనసాగుతుంది. దీనిలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రజలు పౌరులుగా ఎదుగుతారు.

  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 1952లో జరిగిన తొలి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో 17.32 కోట్లమంది ఓటర్లు ఉండగా, 2014 నాటి 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి వారి సంఖ్య 83 కోట్లకు చేరింది.
 
గణతంత్ర రాజ్యం:
భారతదేశం 1950, జనవరి 26న గణతంత్ర రాజ్యంగా (Republic) అవతరించింది. దీని ప్రకారం సర్వోన్నతాధికారం ప్రజలకు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు ఉంటుంది. రాజ్యాధినేత వారసత్వంగా కాకుండా, నిర్ణీత పదవీకాలానికి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్థతిలో ఎన్నిక అవుతాడు.
ఉదా: భారత రాజ్యాధినేత రాష్ట్రపతిని నిర్ణీత పదవీ కాలానికి ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

3. రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు:
    ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సంఘ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం వీటి లక్ష్యం.
    సామాజిక న్యాయాన్ని సాధించే అంశాలను - ప్రాథమిక హక్కుల్లోనూ
    ఆర్థిక న్యాయాన్ని సాధించే అంశాలను - ఆదేశిక సూత్రాల్లోనూ
    రాజకీయ న్యాయాన్ని సాధించే అంశాలను - ఎన్నికల ప్రక్రియలోనూ పొందుపరిచారు.

4. చట్టం అమల్లోకి వచ్చిన తేది:
1949 నవంబరు, 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది.

కీలకమైన ఆదర్శాలు
 
స్వేచ్ఛ (Liberty)
   ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో స్వేచ్ఛ కీలకమైంది. ప్రతి పౌరుడికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్బంధాలు లేకుండా పరిపూర్ణ వ్యక్తి వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో 6 రకాల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పొందుపరిచారు.
 
సమానత్వం (Equality)
 పుట్టుకతో మానవులంతా సమానమే. అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి ప్రతి వ్యక్తి తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి అవసరమైన అవకాశాలను కల్పించడమే సమానత్వం.
 
సౌభ్రాతృత్వం ((Fraternity)
 సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర సోదర భావం, గౌరవ భావం ఉండాలి. 1948, డిసెంబరు 10న ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటనలో పేర్కొన్న సౌభ్రాతృత్వ భావన ఆధారంగా సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరిచాలని ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 51 ప్రకారం ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని, స్నేహ భావాన్ని పెంపొందించడానికి కృషి జరుగుతుంది.

జాతీయ ఐక్యత, సమగ్రత (Unity and Integrity)
  దేశంలోని ప్రజలందరూ కలిసి ఉండటానికి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, జాతీయ ఐక్యత తప్పనిసరి.
  సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికలో పొందుపరిచింది. సమగ్రత ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది.
  మన దేశంలో 1970వ దశకంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. వీటి ఫలితంగా సమగ్రత అనే పదాన్ని ప్రవేశికకు చేర్చారు. దీని ప్రకారం భారత సమాఖ్య నుంచి ఏ ఒక్క ప్రాంతం లేదా రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు. ఐక్యత, సమగ్రతల ప్రధాన లక్ష్యం వేర్పాటువాదాన్ని ఖండించడం.
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా?

బెరుబారి కేసు - 1960
  బెరుబారి అనేది భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ భాగాన్ని భారత్ - పాకిస్థాన్ మధ్య మార్పిడి విషయంలో వచ్చిన విభేదాల విషయమై అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 143(1) ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరారు. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

కేశవానంద భారతి కేసు Vs కేరళ రాష్ట్రం - 1973
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చునని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదని పేర్కొంది. న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని మౌలిక అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు - 1995
  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

ప్రవేశికపై సమీక్ష
  రాజ్యాంగ ప్రవేశికకు న్యాయస్థానాల రక్షణ లేదు. ప్రవేశికలో పొందుపరిచిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటి అమలు కోసం పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. అయితే రాజ్యాంగాన్ని సక్రమంగా వాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి.

రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు:
 ''ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణం, రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది" - పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ.
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది" - డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
* ''ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం" - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది" - జె.డయ్యర్
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక (key note) లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను" - ఎర్నెస్ట్ బార్కర్
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు" - మహావీర్ త్యాగి
* ''ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం" - డాక్టర్ బాబురాజేంద్రప్రసాద్
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది" - ఎమ్.ఎ.నానీ పాల్కీవా
* ''భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వంతంత్ర ప్రకటనలా రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ, స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు" - జస్టిస్ హిదయతుల్లా
* ''రాజ్యాంగ ప్రధానాంశాల లక్షణ సారం" - ముధోల్కర్
* ''అమెరికా స్వతంత్ర ప్రకటనకు, అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది" - కె.ఆర్. బాంజ్‌వాలా
* ''ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ" - జవహర్‌లాల్ నెహ్రూ

ప్రవేశికలోని ప్రధాన పదాలకు వర్తించే భాగాలు, ప్రకరణలు
* సంక్షేమ స్వభావం - 4వ భాగంలోని ఆదేశిక సూత్రాలు
* లౌకికతత్వం - 3వ భాగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ప్రకరణలు మత స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా, లౌకిక భావనలను పెంపొందించడానికి వీలుగా హామీ ఇస్తున్నాయి.
* ప్రజాస్వామికత - 15వ భాగంలోని ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కును, నిర్ణీత కాలానికి ఎన్నికలను జరపడాన్ని తెలియజేస్తుంది.
* గణతంత్ర - 5వ భాగంలోని ఆర్టికల్ 54 ప్రకారం ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి దేశాధినేతగా ఉంటారు.
* భావ ప్రకటనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రాలను కల్పించారు.
* విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్ఛ - 3వ భాగంలోని ఆర్టికల్ 25లోని మత స్వాంతంత్య్రాపు హక్కు వీటిని కల్పిస్తుంది.
* హోదా, అవకాశాల్లో సమానత్వం - ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే.
* ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షలకు వ్యతిరేకంగా రక్షణ
* ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు
* ఆర్టికల్ 39 ప్రకారం సమాన పనికి సమాన వేతనం
* ఆర్టికల్ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు
* వ్యక్తి గౌరవం - సౌభ్రాతృత్వం - 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి గౌరవానికి హామీ ఇస్తున్నాయి.
* 4వ భాగంలోని ఆర్టికల్ 51 (ఇ) - భారత ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించి సోదర భావాన్ని కల్పిస్తుంది.
* ఆర్టికల్ 42 - పనిచేసేచోట సరైన పని పరిస్థితులు కల్పించడం.
* ఆర్టికల్ 43 - గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి.

ప్రవేశికను సవరించగలమా?
  1973 నాటి కేశవానంద భారతి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది. ఇంతవరకు రాజ్యాంగ ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
ప్రవేశికకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు, వాటి సారాంశం

ఎ.కె.గోపాలన్ కేసు - 1950
* ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది.

బెరుబారి యూనియన్ కేసు - 1960:
* ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగం కాదు.

గోలక్‌నాథ్ కేసు: 1967
* ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలు, ఆశయాలకు సూక్ష్మరూపం.

కేశవానందభారతి కేసు: 1973
* ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. ఇది మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది.

ఎక్సెల్‌వేర్ కేసు: 1979
* ప్రవేశికలోని సామ్యవాద పదానికి నిర్వచనాన్ని ఇచ్చింది.

మినర్వా మిల్స్ కేసు : 1980
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

డి.ఎస్. నకారా కేసు: 1983
* సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజంల కలయిక.

ఎస్.ఆర్. బొమ్మై కేసు: 1994
* లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం

ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు: 1995
* ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పునరుద్ఘాటించింది.

అశోక్ కుమార్ గుప్తా కేసు: 1997
* సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు.
* అన్ని మతాల పట్ట సమాన దృక్పధాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ కేసు: 1975
* ప్రవేశికలోని చట్ట సమానత్వం మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా ఉంటుంది.

పాల్ Vs కొచ్చిన్ యూనివర్సిటీ కేసు
ప్రవేశికలో పొందుపరిచిన అంశాలన్నీ మనకు మార్గదర్శకాలే అయినందున ప్రవేశికను మన రాజ్యాంగానికి మార్గదర్శకంగా భావించవచ్చు.

చరణ్ లాల్ సాహు Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ప్రత్యక్షంగా అమలుపరచడం సాధ్యం కాదు. వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి అమలు చేయాలి.

ఎస్.లింగప్ప Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
సామాజిక న్యాయం అనే అంశం సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. మన దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలి.

అరుణారాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* భారతదేశం అనుసరించే లౌకిక విధానం సకారాత్మకమైంది. వివిధ మత ప్రవక్తలకు సంబంధించిన భావాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం తప్పేమీ కాదు.

వాసుదేవ్ Vs వామన్‌జీ కేసు
* మన రాజ్యాంగంలోని లౌకికవాదం అనే భావన సకారాత్మకమైంది. అంటే అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఏ మతానికి ప్రత్యేక ఆదరణ కల్పించదు.

కామన్ కాజ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:
 దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా, ప్రైవేటీకరణ కారణంగా సామ్యవాద పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదు.

సహజ న్యాయ సిద్ధాంతం
* సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని జస్టిస్ పి.డి.దినకర్ Vs జడ్జస్ ఎంక్వైరీ కమిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో 2011లో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
''భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక అనే వెలుగులో పరిష్కరించుకోవాలి" - జస్టిస్ హిదయతుల్లా

రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం
1967 నాటి గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, వాటిని సవరించాలంటే ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు. ఈ తీర్పును అధిగమించడానికి పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణను చేసింది.

1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు:
1973 నాటి కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది. ఈ తీర్పునే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రవచించిన కేసుగా ప్రస్తావిస్తారు. ఈ తీర్పునాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.సిక్రి.

ఈ కేసు సందర్భంగా మౌలిక స్వరూప లక్షణాలను కింది విధంగా పేర్కొన్నారు:
* రాజ్యాంగ ఆధిక్యం
* ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రభుత్వం
* రాజ్యాంగ పరంగా లౌకిక స్వభావం
* శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య అధికార పృథక్కరణ
* సమాఖ్య లక్షణం
* వైయక్తిక స్వేచ్ఛ
* భారతదేశ సార్వభౌమాధికారం, ఏకత్వం
* ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ వ్యవస్థను కలిగి ఉండటం.
* రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి 1980 నాటి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కింది అంశాలను మౌలిక స్వరూప లక్షణాలుగా పేర్కొన్నారు.
* పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణాధికారం
* న్యాయసమీక్ష
* ప్రాథమిక హక్కులు, ఆదేశసూత్రాలు మధ్య సమతౌల్యం
* రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టింది సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు (1965) లో జస్టిస్ జనార్ధన్ రఘునాథ్ ముధోల్కర్.
* ఐ.ఆర్.కొయల్హో Vs తమిళనాడు కేసు (2007)లో కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడిన తర్వాత IXవ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల రాజ్యాంగ బద్ధతను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చునని పేర్కొంది.
* 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటు సుప్రీంకోర్టు ఉన్న న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 1980లో మినర్వా మిల్స్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు లేదని 42వ రాజ్యాంగ సవరణలోని ఆ అంశాన్ని కొట్టివేసింది. న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది.
* వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా కింది అంశాలను అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
* జాతి ఐక్యత, సమగ్రత
* న్యాయసమీక్ష
* రాజ్యాంగ సంక్షేమ స్వభావం
* రాజ్యాంగ లౌకికత్వం
* రాజ్యాంగ ఆధిక్యం
* నిష్పక్షపాత ఎన్నికలు
* సార్వభౌమ, గణతంత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థ
* పార్లమెంటరీ వ్యవస్
* రాజ్యాంగ సమాఖ్య స్వరూపం
* సామాజిక, ఆర్థిక న్యాయం
* స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
* హేతుబద్ధత
* శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అధికార పృథక్కరణ
* వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవం
* న్యాయాన్ని పొందే హక్కు
* ప్రాథమిక హక్కులు, నిర్ధేశిత నియమాల మధ్య సమన్వయం
* సమానహోదా, సమాన అవకాశాలు
* వైయక్తిక స్వేచ్ఛ
* ఇందిరాగాంధీ Vs రాజ్‌నారాయణ్ కేసు (1975)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయస్థానం ముందుకు వచ్చిన కేసును బట్టి రాజ్యాంగ మౌలిక లక్షణం నిర్ణయించబడుతుందని పేర్కొంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం:
      ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతి పెద్దది. సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని అత్యంత సుదీర్ఘమైంది అని అభివర్ణించగా హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ చిహ్నమైన ఐరావతంతో పోల్చాడు. మన దేశ రాజ్యాంగాన్ని ప్రారంభంలో ప్రవేశిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా విభజించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి.
* రాజ్యాంగం నుంచి 7వ భాగాన్ని తొలగించి 4(A), 9(A), 9(B), 14(A) అనే భాగాలను చేర్చారు.

* భిన్నత్వంలో ఏకత్వమున్న భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, భాషలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు, వివిధ పరిమితులు, మినహాయింపులను సంపూర్ణంగా వివరించడం వల్ల మన రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రూపొందించారు.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో శాసన, ఆర్థిక, పరిపాలనా సంబంధాలను విస్తృతంగా వివరించారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించడం, కొన్ని అంశాలను తొలగించడం, మరికొన్ని అంశాలను చేర్చడం వల్ల మన రాజ్యాంగం సువిశాలంగా రూపొందింది.
* 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
* 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చింది.
* 11వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.
* 12వ షెడ్యూల్‌ను పి.వి.నరసింహారావు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా చేర్చింది.
* మన దేశానికి సర్వోన్నత శాసనం రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు, విధులు రాజ్యాంగం నుంచే సంక్రమిస్తాయి.
* అధికారం ప్రజల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియమిత కాలానికి జరిగే ఎన్నికల ద్వారా బదిలీ అవుతుంది. కాబట్టి మనదేశంలో అధికారానికి మూలం ప్రజలు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం
* భారత రాజ్యాంగం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రసాదించింది. ఈ విధానంలో కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నాయకత్వంలోని మంత్రిమండళ్లు వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తాయి.

* కేంద్రంలో ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి.
* రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండళ్లు వ్యక్తిగతంగా గవర్నర్లకు, సమష్టిగా విధానసభలకు బాధ్యత వహించాలి.

సార్వజనీన వయోజన ఓటుహక్కు
* ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, జన్మ, భాష, ప్రాంత, ఆస్తి సంబంధ వివక్ష లేకుండా వయోజన ఓటుహక్కును ప్రసాదించడమైంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే వారి కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలుగా నిర్ణయించారు.
* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా వయోజన ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.
* ప్రపంచంలో మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్.
* అమెరికాలో 1965 నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.
* స్విట్జర్లాండ్‌లో 1971 తర్వాత నుంచి మాత్రమే మహిళలకు ఓటుహక్కును కల్పించారు.
* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి మన దేశ ఓటర్లు 83 కోట్ల మంది.

ఏక పౌరసత్వం
* భారతదేశ సమగ్రత, సుస్థిరతల దృష్ట్యా భారత ప్రజలకు రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల ప్రజలకు ఒకే పౌరసత్వం ఉంటుంది. వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు.
* అయితే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల ఆ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.
* అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.

లౌకిక రాజ్యం
* మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు.
* భారత రాజ్యాంగ ప్రవేశికలో 'లౌకిక' అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం రాజ్యం మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. రాజ్యం ఏ ఒక్క మతానికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు.
* లౌకికతత్వ పరిధిని మరింత విస్తృతపరుస్తూ ప్రాథమిక హక్కుల్లో భాగంగా మత స్వాతంత్య్రపు హక్కును ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించారు. దీని ప్రకారం భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు.
* ప్రభుత్వ విద్యాలయాల్లోనూ, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్ విద్యాలయాల్లోనూ మతబోధన నిషిద్ధిం.

దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం
* దృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి కష్టమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో ప్రత్యేక మెజార్టీ 2/3 లేదా 3/4 వంతుతో సవరించేది.
ఉదా: అమెరికా రాజ్యాంగం.
* అదృఢ రాజ్యాంగం అంటే సవరించడానికి సులభమైంది లేదా సరళమైంది. దీని ప్రకారం ఆ దేశ శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది.
ఉదా: బ్రిటన్ రాజ్యాంగం.
* భారత రాజ్యాంగం అమెరికా మాదిరి దృఢమైందీ కాదు, బ్రిటన్‌లా అదృఢమైందీ కాదు. దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం.
* భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ప్రకారం 3 పద్ధతుల్లో సవరించవచ్చు. అవి:

1. సాధారణ మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను పార్లమెంటుకు హాజరై ఓటు వేసిన వారి సాధారణ మెజార్టీతో సవరించవచ్చు.
    1. ఆర్టికల్ - 2 ప్రకారం కొత్త రాష్ట్రాల విలీనం, ఏర్పాటు
    2. ఆర్టికల్ 3 - రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
    3. ఆర్టికల్ 169 - రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ల ఏర్పాటు, రద్దు.
    4. 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నత పదవులు, వారి జీతభత్యాలు
    5. ఆర్టికల్ 100(3) - పార్లమెంటు కోరం నిర్ణయించడం
    6. ఆర్టికల్ 105 - సభా హక్కులు
    7. ఆర్టికల్ 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
    8. ఆర్టికల్ 118 (12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు
    9. ఆర్టికల్ 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం
    10. ఆర్టికల్ 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
    11. ఆర్టికల్ 348 - అధికార భాషా విషయం
    12. ఆర్టికల్ 11 - పౌరసత్వాన్ని పొందే విధానాలు, రద్దు చేసే పద్ధతులు
    13. ఆర్టికల్ 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం
    14. ఆర్టికల్ 81 - నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)
    15. ఆర్టికల్ 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం
    16. 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనా విషయాలు
    17. 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పరిపాలన
    18. ఆర్టికల్ 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం.

2. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని మరికొన్ని నిబంధనలను (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు.
ఉదా: ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు

3. ద్విపక్ష మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతోపాటు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీ అవసరం. అవి:
1. ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం
2. ఆర్టికల్ 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ,
ఆర్టికల్ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని విస్తృతం చేయడం.
3. 5వ భాగం 4వ అధ్యాయం ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు - సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు
4. 6వ భాగం 5వ అధ్యాయం ఆర్టికల్స్ 214 నుంచి 232 వరకు - హైకోర్టుకు సంబంధించిన అంశాలు
5. 7వ షెడ్యూల్ - కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన
6. 4వ షెడ్యూల్‌ - రాజ్యసభలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు
7. ఆర్టికల్ 368 - రాజ్యాంగ సవరణ అంశాలు

అర్ధ సమాఖ్య:
* రాజ్యాంగ రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగే వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.
* కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య (Quasi Federal)గా పేర్కొన్నాడు.
భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అవి:
    1. లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం
    2. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన
    3. దృఢ రాజ్యాంగం
    4. స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ
    5. న్యాయ సమీక్ష విధానం
    6. ద్విసభా విధానం
భారత రాజ్యాంగానికి కింద పేర్కొన్న ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. అవి:
    1. ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం
    2. ఏకీకృత న్యాయవ్యవస్థ
    3. అఖిల భారత సర్వీసుల భర్తీకి ఒకే యూపీఎస్సీ
    4. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒకే కేంద్ర ఎన్నికల సంఘం
    5. ఒకే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

    6. రాష్ట్రపతితో కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం
    7. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం
    8. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను కలిగి ఉండటం
ఉదా: ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం
     ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం
     ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం
     ఆర్టికల్ 365 - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం
     ఆర్టికల్ 248 - అవశిష్టాధికారాలను కేంద్రమే కలిగి ఉండటం
ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది.
* ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లు గవర్నరు సంతకంతో చట్టంగా మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ బిల్లును గవర్నరు ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేస్తారు. అలాంటి సందర్భంలో ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖపై అధికారాన్ని కలిగి ఉంటారు.
* పైన పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాల సమ్మేళనం.

స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ:
   మన దేశ న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి గలది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. కానీ వారిని తొలగించేది పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారానే. దీనివల్ల న్యాయవ్యవస్థ పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉందని తెలుస్తోంది.

న్యాయ సమీక్ష అధికారం:
* భారత న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాధికారాన్ని రాజ్యాంగం ప్రసాదించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశమే

న్యాయ సమీక్ష.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించింది.
* న్యాయ సమీక్ష అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.
* 1803లో మార్బురీ Vs మాడిసన్ వివాదంలో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఇచ్చిన తీర్పు ప్రపంచంలో న్యాయ సమీక్ష భావనకు పునాదులు వేసింది.

అల్ట్రా వైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవనీ, రాజ్యాంగ విరుద్ధమని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని అల్ట్రా వైర్స్‌గా పేర్కొంటారు.
 
ఇంట్రావైర్స్: శాసనశాఖ శాసనాలు, ప్రభుత్వ పాలనా చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నట్లయితే అవి చెల్లుతాయనీ, అవి రాజ్యాంగబద్ధమేనని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఇంట్రావైర్స్ అంటారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశారు.
* 1951 నాటి శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మొదలు 2007 నాటి అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వరకు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకుంది.
* 1980లో మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368లో చేర్చిన 4, 5 క్లాజులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఏకీకృత న్యాయ వ్యవస్థ:
* భారతదేశం న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని బ్రిటన్ నుంచి గ్రహించింది.
* భారతదేశం అనుసరించే న్యాయ వ్యవస్థను ఏకీకృత, సమీకృత న్యాయ వ్యవస్థగా పేర్కొంటారు.
* జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, డివిజనల్ స్థాయిలో మున్సిఫ్ కోర్టులు న్యాయ విధులను నిర్వహిస్తున్నాయి.
* ఒకే రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటాయి.
ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా అమలుపరచాల్సి ఉంటుంది.
* న్యాయమూర్తుల నియామకంలో ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించాల్సి ఉంటుంది.

ద్విసభా విధానం:
* 1919 మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా కేంద్ర శాసనశాఖలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్రంలో లోక్‌సభ, రాజ్యసభలతో ద్విసభా విధానానికి దారితీసింది.
* రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానం ఏర్పాటు విషయమై రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల అభిమతాలకే వదిలిపెట్టారు. ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్ర విధానసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే, పార్లమెంటు సాధారణ తీర్మానంతో రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ను ఏర్పాటు చేయగలదు లేదా ఉన్నదాన్ని రద్దు చేయగలదు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు:
* కారన్ వాలీస్ మన దేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
* 1853 చార్టర్ చట్టం ద్వారా భారతీయులకు సివిల్ సర్వీసుల్లో అవకాశం కల్పించారు.
* 1926 నాటి లీ కమిషన్ సిఫార్సుల మేరకు మన దేశంలో సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.
* భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో సివిల్ సర్వీసుల నిర్మాణానికి విశేష కృషి చేశారు. ప్రస్తుత ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ), ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ బ్రిటిష్ వారసత్వం నుంచే మనకు సంక్రమించింది.

స్వయం ప్రతిపత్తి ఉన్న కమిషన్లు:
* ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ను ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 280 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల పంపిణీకి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 315 - మన దేశంలో ప్రతిభావంతులను పాలనలో భాగస్వామ్యం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగులను ఎంపిక చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి.
* ఆర్టికల్ 324 - దేశంలో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత, ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 124 - రాజ్యాంగ సంరక్షణకు, వ్యాఖ్యానానికి, అర్థ వివరణకు సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

అధికారాల విభజన:
 
భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించింది.
  రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు రకాలైన అధికారాల విభజన గురించి పేర్కొన్నారు.

1. కేంద్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.
2. రాష్ట్ర జాబితా: ఈ జాబితా ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.
3. ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.
    పై మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఇవి కేంద్రానికి చెందుతాయి.

ప్రాథమిక హక్కులు:
 రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ప్రకరణలను 7 వర్గాల ప్రాథమిక హక్కులుగా కల్పించారు. వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. ప్రారంభంలో ప్రాథమిక హక్కుల సంఖ్య 7 వర్గాలుగా ఉండగా ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300 (A)లో ఒక సాధారణ చట్టబద్ధ హక్కుగా మార్చింది.

ఆదేశిక సూత్రాలు:
 రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల గురించి పేర్కొంటున్నాయి. సంక్షేమ రాజ్య స్థాపన, పరిపాలనా వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన వీటిని మన దేశ రాజ్యాంగంలో చేర్చారు.

ప్రాథమిక విధులు:
 భారత రాజ్యాంగంలోని 4(A) భాగంలో 51(A) ఆర్టికల్‌లో ప్రాథమిక విధులను ప్రస్తావించారు. మొదట్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు. జస్టిస్ స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా రష్యా నుంచి 10 ప్రాథమిక విధులను గ్రహించి రాజ్యాంగానికి చేర్చింది.
* ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల సంఖ్య: 11
* 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం - 2002 ద్వారా చేర్చారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపం:
 భారతదేశానికి అత్యున్నత శాసనం రాజ్యాంగం. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా మాత్రమే సవరించాలని పేర్కొంది.
* రాజ్ నారాయణ్ Vs ఇందిరాగాంధీ, మినర్వా మిల్స్, ఎల్ఐసీ, ఎస్.ఆర్.బొమ్మై కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పునరుద్ఘాటించింది.

రాజ్యాంగ విహంగ వీక్షణం

భాగం విషయం ఆర్టికల్స్
1వ భాగం భారత భూభాగ పరిధి 1 నుంచి 4 వరకు
2వ భాగం పౌరసత్వం 5 నుంచి 11 వరకు
3వ భాగం ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు
4వ భాగం ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు
4(A) భాగం ప్రాథమిక విధులు 51(A)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా కొత్తగా చేర్చారు.

5వ భాగం కేంద్ర ప్రభుత్వం 52 నుంచి 151 వరకు
మొదటి అధ్యాయం కేంద్ర కార్య నిర్వాహక శాఖ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, అటార్నీ జనరల్ 52 నుంచి 78 వరకు
రెండో అధ్యాయం కేంద్ర శాసన నిర్మాణ శాఖ (పార్లమెంటు) 79 నుంచి 122 వరకు
మూడో అధ్యాయం రాష్ట్రపతి - శాసన నిర్మాణ అధికారాలు 123
నాలుగో అధ్యాయం కేంద్ర న్యాయశాఖ (సుప్రీంకోర్టు) 124 నుంచి 147 వరకు
అయిదో అధ్యాయం కాగ్ 148 నుంచి 151 వరకు
6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 వరకు
ఒకటో అధ్యాయం రాష్ట్ర ప్రభుత్వ నిర్వచనం 152
రెండో అధ్యాయం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ 153 నుంచి 167 వరకు
మూడో అధ్యాయం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ (విధాన సభ, విధాన పరిషత్) 168 నుంచి 212 వరకు
నాలుగో అధ్యాయం గవర్నర్ శాసన నిర్మాణ అధికారాలు 213
అయిదో అధ్యాయం రాష్ట్ర న్యాయశాఖ (హైకోర్టు) 214 నుంచి 232 వరకు
ఆరో అధ్యాయం దిగువ కోర్టులు 233 నుంచి 237 వరకు
7వ భాగం B - రాష్ట్రాలు 238

» 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం - 1956 ద్వారా తొలగించారు.

8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు 239 నుంచి 242 వరకు
9వ భాగం పంచాయతీరాజ్ 243, 243 (A) నుంచి 243(O) వరకు

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

9(A) భాగం పట్టణ ప్రభుత్వాలు 243(P), 243(Z, G) వరకు

» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు.

10వ భాగం షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు 244 నుంచి 244(A) వరకు
11వ భాగం కేంద్ర, రాష్ట్ర సంబంధాలు 245 నుంచి 263 వరకు
ఒకటో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (శాసన సంబంధాలు) 245 నుంచి 255 వరకు
రెండో అధ్యాయం కేంద్ర, రాష్ట్రాల మధ్య (పరిపాలక సంబంధాలు) 256 నుంచి 263 వరకు
12వ భాగం కేంద్ర, రాష్ట్రాల మధ్య (ఆర్థిక సంబంధాలు) 264 నుంచి 300 (A)
ఒకటో అధ్యాయం ఆర్థికం 264 నుంచి 291 వరకు
రెండో అధ్యాయం అప్పులు 292 నుంచి 293 వరకు
మూడో అధ్యాయం ఆస్తి, ఒప్పందాలు, దావాలు, వివాదాలు 294 నుంచి 300 వరకు
నాలుగో అధ్యాయం ఆస్తి హక్కు 300(A)

» 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978 ప్రకారం ఈ 4వ అధ్యాయాన్ని 12వ భాగంలో చేర్చారు.

13వ భాగం వ్యాపారం, వాణిజ్యం 301 నుంచి 307 వరకు
14వ భాగం కేంద్ర, రాష్ట్ర సర్వీసులు 308 నుంచి 323 వరకు
ఒకటో అధ్యాయం అఖిల భారత సర్వీసులు 308 నుంచి 314 వరకు
రెండో అధ్యాయం యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 315 నుంచి 323 వరకు
14(A) భాగం ట్రైబ్యునళ్లు 323(A), 323 (B)

» ఈ భాగాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా నూతనంగా చేర్చారు.

15వ భాగం ఎన్నికల సంఘం, ఎన్నికలు 324 నుంచి 329 వరకు
16వ భాగం ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు ప్రత్యేక సదుపాయాలు 330 నుంచి 342 వరకు
17వ భాగం అధికార భాష 343 నుంచి 351 వరకు
18వ భాగం అత్యవసర పరిస్థితులు 352 నుంచి 360 వరకు
19వ భాగం ఇతర అంశాలు 361 నుంచి 367 వరకు
20వ భాగం రాజ్యాంగ సవరణ విధానం 368
21వ భాగం తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు (జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలు) 369 నుంచి 392 వరకు
22వ భాగం హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా, రాజ్యాంగం అమల్లోకి రావడం 393 నుంచి 395 వరకు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగ రచన

        బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత దేశం తన జాతీయ పునర్నిర్మాణం, సాంఘిక, ఆర్థిక, మార్పు సాధన, అనువైన నిర్మాణాల కోసం విశేషమైన కృషి జరిపింది. రాజ్యాంగ నిర్మాణం కోసం ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు). ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (1787 నాటిది).

 ''ప్రజల జీవితానికి, వారి ఆశయాలకు అనుగుణంగా లేని రాజ్యాంగం ప్రజలను అధోగతి పాలుచేస్తుంది". అని జవహర్ లాల్ పేర్కొన్నారు.

రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్తు)
        1918, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో భారతీయ ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించారు.

     1922, జనవరి 5న గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదు" అని పేర్కొంటూ... రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి, ప్రజల అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగాన్ని రూపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
* స్వరాజ్ అనే పదాన్ని మొదట ఉపయోగించింది: దాదాభాయ్ నౌరోజీ.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించిన భారతీయుడు: ఎం.ఎన్. రాయ్.
* రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ: స్వరాజ్య పార్టీ
* 1927, మే 17న బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను గురించి మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించారు. భారతరాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన భారత జాతీయ నాయకులు 1928, ఫిబ్రవరి, 28న ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని 29 పార్టీలతో కలిసి ఏర్పాటు చేశారు. 1928, మే 19న డాక్టర్ ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఉపసంఘంలోని సభ్యులు:
1. లాలా లజపతిరాయ్
2. తేజ్ బహదూర్ సప్రూ
3. సుభాష్ చంద్రబోస్
4. ఎం.ఆర్. జయకర్
5. షోయాబ్ ఖురేషి
6. సర్దార్ మంగళ్‌సింగ్
7. ఎం.ఎన్. అణే
8. సర్.అలీ. ఇమాం
9. జి.ఆర్. ప్రధాన్

      మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928, ఆగస్టు 10న సమర్పించింది. దీన్ని భారతీయులు రాజ్యాంగ రచన కోసం చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
* 1925లో అనిబిసెంట్ బ్రిటిష్ పార్లమెంట్‌లో "Common Wealth of India" అనే బిల్లును ప్రతిపాదించి ''ఐర్లాండ్" ప్రజల మాదిరిగానే భారత్ ప్రజలకు శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పించాలని సూచించారు.
* 1936లో జవహర్‌లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ ''భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికి ఒకే ఒక రాజకీయ పరిష్కారం ఉంది. అది భారత్ ప్రజలచే ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు తమను తాము పాలించుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే స్వేచ్ఛను కల్పించాలి".
* 1937లో ఫైజ్‌పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు కోసం డిమాండ్ చేసింది.
* 1938లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన 'హరిపుర' వద్ద జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని తీర్మానంగా ఆమోదించింది.
* 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగాన్ని ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా రూపొందించాలని ప్రతిపాదించారు.
* 1939, నవంబరు 12న గాంధీజీ 'భారతీయులతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది' అని హరిజన్ పత్రికలో వ్యాఖ్యానించారు.
* 1940, ఆగస్టు ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును గుర్తించారు. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా ఆంగ్లేయులు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా గుర్తించారు.
* 1945, సెప్టెంబరు 19న లార్డ్ వేవెల్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, వాటికి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారని ప్రకటించాడు.
* 1946 జనవరి, ఫిబ్రవరి నెలల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాబర్ట్ రిచర్డ్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యులతో ఒక ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి పంపింది. ఈ బృందం 'భారతీయులు స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు' అని నివేదించింది.
* 1946, మార్చి 24న మనదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ బృందం సిఫార్సులను అనుసరించి, 1946 జూన్, జులై నెలల్లో రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి.
* ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఏక ఓటు బదిలీ పద్ధతిలో జరిగాయి. రాష్ట్రాల్లో కేవలం 28.5% ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. రాజ్యాంగ పరిషత్తు‌కు ఎన్నికైన మొత్తం సభ్యులు: 389.
* రాజ్యాంగ పరిషత్‌లో ప్రాంతాలవారీగా కేటాయించిన స్థానాలు

* 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికైన 292 మంది వివరాలు

నాలుగు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాలు

రాజకీయ పార్టీల వారీగా రాజ్యాంగ పరిషత్తు-ఎన్నికల ఫలితాలు

* డిసెంబరు 9, 1946 నాటి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైనవారు - మతాలు, సామాజిక వర్గాల వారీగా మొత్తం సభ్యులు: 208

ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్‌తో రాజ్యాంగ పరిషత్తు సమావేశాలను బహిష్కరించింది. ఇలా జరగక ముందు జాతీయ కాంగ్రెస్‌కు రాజ్యాంగ పరిషత్తు‌లో 69% ప్రాతినిధ్యం ఉంది. సమావేశాల నుంచి ముస్లింలీగ్ వైదొలగడంతో దాని ప్రాతినిధ్యం 82%కి పెరిగింది.

* 1947 ఆగస్టులో భారతదేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తు‌ను కూడా విభజించారు. స్వాతంత్య్రనంతరం భారత రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య: 299
* స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ పరిషత్తు‌లోని 299 మంది సభ్యుల్లో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు/ఇండియన్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నిక కాగా, 70 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
* 1947, డిసెంబరు నాటికి భారత రాజ్యాంగ పరిషత్తులోని 299 మంది సభ్యుల వివరాలు

స్వాతంత్య్రానంతరం - స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ పరిషత్తు‌కు ప్రాతినిధ్యం

రాజ్యాంగ పరిషత్తులో - వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించినవారు

రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వంలేని ప్రముఖులు:
    1. భారత జాతిపిత: మహాత్మగాంధీ
    2. పాకిస్థాన్ జాతిపిత : మహ్మద్ అలీ జిన్నా
* రాజ్యాంగ పరిషత్తుకు బెంగాల్ నుంచి ఎన్నికైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయి, తర్వాత బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయ్యారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పోటీచేయకుండా, అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్తుకు నామినేట్ అయినవారు:
    1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
    2. కె.టి. షా
    3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
* రాజ్యాంగ పరిషత్తుకు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సోమనాథ్‌లహరి దేశవిభజన ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిషత్తులో సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహిళలు: 15 మంది
    1. విజయలక్ష్మి పండిట్
    2. సరోజినీ నాయుడు
    3. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    4. రాజకుమారి అమృతకౌర్
    5. హంసా మెహతా
    6. అమ్ము స్వామినాథన్
    7. ఆన్ మస్కార్నే నాథ్
    8. బేగం అజీజ్ రసూల్
    9. సుచేతా కృపలాని
    10. రేణుకారే
    11. పూర్ణిమా బెనర్జీ
    12. లీలా రే
    13. మాలతీ చౌదరి
    14. కమలా చౌదరీ
    15. దాక్షాయణి వేలాయుధన్

రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన తెలుగువారు:
    1. టంగుటూరి ప్రకాశం పంతులు
    2. నీలం సంజీవరెడ్డి
    3. భోగరాజు పట్టాభిసీతారామయ్య
    4. దుర్గాబాయి దేశ్‌ముఖ్
    5. కళా వెంకట్రావు
    6. ఎన్.జి.రంగా
    7. కల్లూరి సుబ్బారావు
    8. మోటూరి సత్యన్నారాయణ
    9. బొబ్బిలి రాజ రామకృష్ణ రంగారావు
    10. సి. దానయ్య

రాజ్యాంగ పరిషత్తు తొలిసమావేశం
* గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశం మేరకు రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946, డిసెంబరు 9 (సోమవారం)న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి 9 మంది మహిళలతో సహా మొత్తం 211 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జె.బి.కృపలాని సూచన మేరకు ఫ్రెంచి సంప్రదాయాన్ని అనుసరించి హాజరైన సభ్యుల్లో అత్యంత వయోవృద్ధుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

* 1946, డిసెంబరు 11న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఎన్నికయ్యారు.
* ''సహకార ప్రాతిపదికపై భారతదేశం కామన్వెల్త్ రాజ్యం కావాలని, కుల, మత, వర్గరహిత సమాజం ఏర్పడే దిశగా పయనించాలని" డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
* 1946, డిసెంబరు 13న జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని (Objectives & Resolutions) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని 1947, జనవరి 22న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానం మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ' అని జవహర్‌లాల్ నెహ్రూ అభివర్ణించారు.
* 'లక్ష్యాల, ఆశయాల తీర్మానాన్ని భారతజాతి జాతక చక్రం'గా కె.ఎం. మున్షీ అభివర్ణించారు.
* అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకూ, అమెరికా రాజ్యాంగానికి ఏవిధమైన సంబంధం ఉందో; అదేవిధమైన సంబంధం లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి, భారత రాజ్యాంగానికి ఉందని పేర్కొంటారు.

లక్ష్యాలు, ఆశయాల తీర్మానంలోని సారాంశం
* భారతదేశం స్వతంత్య్ర, సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్యం అవుతుంది.
* సార్వభౌమ-స్వతంత్య్ర భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలే.
* రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగ మూలశాసనం భారత ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి.

* ప్రజలందరికీ చట్టరీత్యా సమానత్వాన్నీ, స్వేచ్ఛను కల్పించడానికి హామీ ఇవ్వడం.
* భారత ప్రజలందరికీ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం.
* రాజ్యాంగ పరిషత్‌కు కార్యదర్శిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్, ముఖ్య లేఖకుడిగా ఎన్.సి.ముఖర్జీ, సలహాదారుడిగా బి.ఎన్.రావు వ్యవహరించారు.
* సువిశాల భారతదేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బ్రిటిష్ సంప్రదాయ రీతిలో కమిటీ పద్ధతిని అనుసరించి, రాజ్యాంగ పరిషత్తు రెండు రకాల కమిటీలను ఏర్పరిచింది.

I. విషయ నిర్ణాయక కమిటీలు (Committees on Substantive Affairs)
ఇవి మొత్తం 12 కమిటీలు: అవి

II. విధాన నిర్ణాయక కమిటీలు: (Committees on Procedural Affairs)
ఇవి మొత్తం 10 కమిటీలు. అవి:

* రాజ్యాంగ పరిషత్తు విధులపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు: జి.వి. మౌలాంకర్
* రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీలన్నింటిలోకి పెద్దది - సలహా సంఘం. వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఏర్పడిన ఈ కమిలోని సభ్యులు 1 + 54 = 55 రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి: డాక్టర్ సచ్చిదానంద సిన్హా
* 1947, జులై 22న రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ జెండాను ప్రదర్శించి, ప్రతిపాదించినవారు: హంసా మెహతా
* రాజ్యాంగ రచనా ప్రక్రియ, ఆమోదంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు జరిపిన మొత్తం సమావేశాల సంఖ్య: 11
* చివరి సమావేశమైన 12వ సమావేశం 1950, జనవరి 24న జరిగింది.
* దేశ విభజన జరిగి ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు కావడంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో 'కేంద్ర అధికారాల కమిటీ' తన నివేదికను పునఃపరిశీలన చేసి, తన రెండో నివేదికలో బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది.
* వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు సలహాదారుడైన బెనగల్ నరసింగరావు 1947, అక్టోబరు నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇతడు రూపొందించిన తొలి ముసాయిదా రాజ్యాంగంలో 243 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ 1947, ఆగస్టు 29
* రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన కమిటీల్లో అత్యంత కీలకమైంది 1947, ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రముఖ వ్యక్తులకు సభ్యత్వం కల్పించారు.
వారి వివరాలు:
 
    1. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ - అధ్యక్షులు
     2. ఎ. కృష్ణస్వామి అయ్యర్ - సభ్యులు
     3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ - సభ్యులు
     4. మహ్మద్ సయ్యద్ సాదుల్లా - సభ్యులు
     5. కె.ఎం. మున్షీ - సభ్యులు
     6. బి.ఎల్. మిట్టల్ - ఇతడు దీర్ఘకాలిక అస్వస్థతకు గురికావడంతో ఇతడి స్థానంలో 1947, డిసెంబరు 5న ఎన్. మాధవరావు నియమితులయ్యారు.
     7. డి.పి. ఖైతాన్ - ఇతడు 1948లో మరణించడంతో ఇతడి స్థానంలో టి.టి. కృష్ణమాచారిని నియమించారు.
* ముసాయిదా కమిటీలో న్యాయ విద్యను అభ్యసించని ఏకైక సభ్యులు టి.టి. కృష్ణమాచారి.

రాజ్యాంగ పరిషత్తు పని విధానం - 3 దశలు
మొదటి దశ: డిసెంబరు 9, 1946 నుంచి ఆగస్టు 15, 1947 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది.
రెండో దశ: ఆగస్టు 15, 1947 నుంచి నవంబరు 26, 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులతోపాటు, దేశ పాలనకు అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది.
మూడో దశ: నవంబరు 26, 1949 నుంచి మే 13, 1952 వరకు. ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్తు కేవలం శాసనవిధులను మాత్రమే నిర్వహిస్తూ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ విధులను నిర్వహించేటప్పుడు బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు.
* రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నిర్వహించేటప్పుడు అధ్యక్షులుగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షులుగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు.

రాజ్యాంగ పరిషత్తు ఆమోదం పొందిన రాజ్యాంగం
* 1949, నవంబరు 26న (శనివారం) రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
* ప్రతి సంవత్సరం నవంబరు, 26ను జాతీయ న్యాయదినోత్సవంగా నిర్వహిస్తారు.
* రాజ్యాంగ తయారీకి అయిన వ్యయం: 64 లక్షల రూపాయలు
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ముసాయిదాను చర్చించి, ఆమోదించడానికి 165 రోజులు పట్టింది.
* రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్న సమయం: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
* రాజ్యాంగ పరిషత్తు సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది.
* రాజ్యాంగ రాతప్రతికి సంబంధించి, రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు రాగా, వాటిలో 2,473 ప్రతిపాదనలను చర్చించి పరిష్కరించింది.
* రాజ్యాంగ పరిషత్తు ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు: హెచ్.వి. కామత్.

* రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు:
       1) పౌరసత్వం
       2) ఎన్నికలు
       3) తాత్కాలిక పార్లమెంటు
       4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు.
* 1950, జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో మొత్తం 299 మంది సభ్యులకు, 284 మంది రాజ్యాంగ రాత ప్రతిపై సంతకాలు చేశారు.
రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.
* 'జనగణమన'ను జాతీయగీతంగా ఆమోదించడం
* 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ఆమోదించడం
* డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను 'రాష్ట్రపతి'గా ఎన్నుకోవడం
    1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించిన రాజ్యాంగం, 1950, జనవరి, 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి కారణం 1929, డిసెంబరు 31న లాహోర్‌లోని రావి నది ఒడ్డున జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది.

  ఈ తీర్మానం ప్రకారం 1930, జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈ విధంగా జనవరి 26కు ఉన్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా నూతన రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది 1950, జనవరి 26. రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసినవారు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.
* కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం 1949, మేలో రాజ్యాంగ పరిషత్తు అంగీకరించింది.
* రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగు (ఐరావతం)ను నిర్ణయించారు.
* రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఎన్నికైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశ మొదటి రాష్ట్రపతిగా 1950, జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల జనవరి 26న మనం 'గణతంత్ర దినోత్సవం'గా జరుపుకుంటున్నాం.
* స్వాతంత్య్రానంతరం 1948, జూన్ 21 వరకు మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్‌గా కొనసాగారు.
* 1948, జూన్ 22 నుంచి బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు భారత గవర్నర్ జనరల్‌గా
సి. రాజగోపాలాచారి వ్యవహరించారు.
* అంబేడ్కర్ బృందం 1948, ఫిబ్రవరి 21 నాటికి ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ రాజ్యాంగంలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.

రాజ్యాంగ సభ - చర్చలు
*  అంబేడ్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగసభలో జరిగిన అనేక చర్చలు, వ్యాఖ్యానాలు కింది విధంగా ఉన్నాయి.
* 'ఈ రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీలా ఉంది'. - మౌలానా హ్రస్రత్ మొహాని
* 'సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదు. భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారు'. - దామోదర్ స్వరూప్ సేథ్
* 'కుల వ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు'.   - ప్రొమథ్ రంజన్ ఠాగూర్
* 'మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు'. - శ్రీ రోహిణి కుమార్ చౌదరి
* 'గతంలో మనం ప్రజలకు చేసిన ప్రతిజ్ఞ, ఈ రోజు మనం ప్రజలకు చేస్తున్న ప్రతిజ్ఞ నెరవేర్చాలి. ఈ రోజు నుంచి మనం విశ్రాంతి భవనాల్లో సుఖశాంతులతో ఉండే రోజులు పోయాయి. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులోని కోట్లాది మంది వ్యథార్థులకు సేవ చేయడమే'. - జవహర్‌లాల్ నెహ్రూ
* 'తన ప్రాచీన కాలం నాటి సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని పరిత్యజించి, నూతన వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ పరిషత్తు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఉంది'. - జవహర్‌లాల్ నెహ్రూ
* ఈ రోజు నుంచి (1950, జనవరి 26) మనం వైరుధ్యాలతో కూడిన సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. 'రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది'.  - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* ఎం.వి. పైలీ "Constitutional Government in India" అనే గ్రంథంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను 'భారత రాజ్యాంగ పితగా, ఆధునిక మనువు'గా కీర్తించారు.
* భారత రాజ్యాంగాన్ని ఆంగ్లంలో అందంగా చేతితో రాసింది ప్రేమ్ బిహారి నారాయణరైజ్దా. దీనికి ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా రాజ్యాంగంలోని ప్రతి పేజీలోనూ తన పేరును, చివరి పేజీలో తన పేరుతోపాటు తన తాత పేరును రాసుకుంటానని కోరగా దానికి నెహ్రూ సమ్మతించారు.
* భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దింది నందలాల్ బోస్. ఇతడికి సహకరించింది శాంతినికేతన్‌లోని చిత్రకారులు.
* సాంఘిక, ఆర్థిక విప్లవ సాధనే రాజ్యాంగ సభకు మూలాధారమని చెప్పవచ్చు. ఈ లక్ష్యసాధన కోసం రాజ్యాంగ సభలో మూడు రకాల వ్యూవహాలపై చర్చ జరిగింది. అవి:

ఎ. గాంధేయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని స్వయంప్రతిపత్తి ఉండేదిగా రూపొందించాలి. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలు మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పగించాలి.
* గ్రామీణ ప్రజానీకానికి తమను తాము పునర్ నిర్మించుకోవడానికి తగిన చొరవ, తెలివితేటలు లేవని భారతదేశ సమగ్రత, రక్షణ లాంటి అవసరాలను తీర్చడానికి గాంధేయ సిద్ధాంతం సరిపోదని దీన్ని తిరస్కరించారు.

బి. సోవియట్ సామ్యవాద నమూనా: ఇది ఏకపార్టీ వ్యవస్థ మీద ఆధారపడింది. అత్యధిక కేంద్రీకరణతో కూడుకొని, అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాంగాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. దీన్ని కూడా తిరస్కరించారు.
 
సి. యూరో-అమెరికన్ నమూనా: కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలు, ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత, అధికారానికి మూలం ప్రజలు అనేదానిపై ఇది (ఈ నమూనా) ఆధారపడింది.
* రాజ్యాంగ సభ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు పాశ్చాత్య ఉదారవాద సంప్రదాయం పట్ల నమ్మకం ఉంది. భారతదేశ ఆధునికీకరణ కోసం పాశ్చాత్య నమూనా అయిన యూరో-అమెరికన్ నమూనానే స్వీకరించారు.

రాజ్యాంగ రచన కోసం - రాజ్యాంగ పరిషత్తు ఉపయోగించిన పద్ధతి
* ఒ.పి.గోయెల్ తన గ్రంథం "Indian Government and Politics"లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం సర్వసమ్మతి సమన్వయ పద్ధతుల కంటే సర్దుబాటు పద్ధతి (Method of Adoption)ని ఎక్కువగా అనుసరించింది అని తెలిపారు. 
* సర్ధుబాటు పద్ధతిలో పరిస్థితులకు అనుగుణంగా రాజీపడటం, కొన్ని విభేదాలు ఉన్నట్లయితే వాటిని అలాగా ఉండనీయడం ఈ పద్ధతి విధానం.

రాజ్యాంగ పరిషత్తుపై వ్యాఖ్యానాలు:
''రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది" - విన్‌స్టన్ చర్చిల్
''రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు నియంత్రణ మండలిగా వ్యవహరించారు" - గాన్ విల్ ఆస్టిన్
* ''రాజ్యాంగ పరిషత్తు‌పై ప్రజాభిప్రాయ నీడలు లేవు" - కె. సంతానం
* ''రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యం వహించింది" - లార్డ్ సైమన్
* ''రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారింది"  - జయప్రకాష్ నారాయణ్

భారత రాజ్యాంగానికి ఆధారాలు
      ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైంది భారత రాజ్యాంగం. సుమారు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950, జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు మన దేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.

1. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి:
* దీన్ని భారత రాజ్యాంగానికి నకలు (Xerox copy)గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని సుమారు 70%కి పైగా అంశాలు ఈ చట్టం నుంచే గ్రహించారు.

భారత ప్రభుత్వ చట్టం - 1935 నుంచి గ్రహించిన అంశాలు
* సమాఖ్య వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; అత్యవసర అధికారాలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, పరిపాలనాంశాలు.

2. బ్రిటన్ రాజ్యాంగం నుంచి:
* పార్లమెంటరీ ప్రభుత్వ విధానం - ద్విసభా విధానం
* ఏక పౌరసత్వం - సమన్యాయ పాలన - కేబినెట్ ప్రభుత్వం
* శాసనసభ్యుల హక్కులు - ఎన్నికల వ్యవస్థ - శాసన నిర్మాణ ప్రక్రియ
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
* అటార్నీ జనరల్ - రిట్స్ జారీ విధానం - దిగువ సభ ఆధిక్యత
* ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థ - దిగువ సభకు మంత్రిమండలి బాధ్యత వహించడం
* ఉద్యోగుల ఎంపిక పద్ధతులు - ఉద్యోగి స్వామ్యం
* దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం

3. అమెరికా రాజ్యాంగం నుంచి:
* లిఖిత రాజ్యాంగం
* ప్రాథమిక హక్కులు
* రాజ్యాంగ ఆధిక్యం - ప్రవేశిక - న్యాయ సమీక్షాధికారం
* స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
* రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం
* న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ
* ఉపరాష్ట్రపతి పదవి
* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం
* దేశాధినేత పేరు మీదుగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించడం
* ప్రజాప్రయోజన వ్యాజ్యం (public interest litigation)

4. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి:
* ఉమ్మడి జాబితా
* ఉభయ సభల సంయుక్త సమావేశం
* స్వేచ్ఛా వాణిజ్య, వ్యాపార చట్టాలు

* అంతర్ రాష్ట్ర వాణిజ్యం
* భాషలకు సంబంధించిన అంశాలు
* కేంద్ర ఆర్థిక సంఘం

5. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి:
* ఆదేశిక సూత్రాలు
* రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం
* నైష్పత్తిక ప్రాతినిధ్య ఎన్నిక పద్ధతి

6. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి:
* ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం
* రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం

7. సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి:
* సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలు
* సామ్యవాద సూత్రాలు
* ప్రాథమిక విధులు
* దీర్ఘకాలిక ప్రణాళిక

8. జపాన్ రాజ్యాంగం నుంచి:
* చట్టం నిర్ధారించిన పద్ధతి
* ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు

9. కెనడా రాజ్యాంగం నుంచి:
* అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం
* ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం
* కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం
* బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య విధానం.

10. జర్మనీ రాజ్యాంగం నుంచి:
* అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం.

11. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి:
* ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు
* గణతంత్ర (Republic) విధానం
* తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం

భారత రాజ్యాంగంపై - వ్యాఖ్యానాలు
''భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో సుదీర్ఘమైంది, తలమానికమైంది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం ఇంద్రుడి వాహనమైన ఐరావతం లాంటిది" - హెచ్.వి. కామత్
''భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత" - గాన్‌విల్ ఆస్టిన్
''భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను తీర్చేది" - జవహర్‌లాల్ నెహ్రూ
''భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం లాంటిది" - సర్ ఐవర్ జెన్నింగ్స్
''భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య" - కె.సి. వేర్
''భారత రాజ్యాంగం సహకార సమాఖ్య" - డి.ఎన్. బెనర్జీ, గాన్‌విల్ ఆస్టిన్
''ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అని ఎవరైనా అంటే అందుకు నేను గర్విస్తాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
''భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది"   - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం స్వభావం

రాజ్యాంగం అంటే
ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టం. దీనిలో ప్రభుత్వ విభాగాలు, దాని స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అనేది లేకపోతే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.
 
రాజ్యాంగం - మూలాలు
ప్రపంచంలో రాజనీతిని శాస్త్రీయంగా మొదటిసారిగా అధ్యయనం చేసినవారు గ్రీకు దేశీయులు. రాజనీతిశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించి, వివరించాడు.

ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. అయితే ఇది పరిణామాత్మక రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం అవతరించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటారు.

దృఢ రాజ్యాంగం
ఏదైనా రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3వ లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.

అదృఢ రాజ్యాంగం
ఏదైనా రాజ్యాంగాన్ని సాధారణ మెజార్టీ ద్వారా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం.
రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు క్రీ.శ.1787 నాటి అమెరికాలోని

ఫిలడెల్ఫియా కన్వెన్షన్.
మన దేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించిన భారతీయుడు ఎమ్.ఎన్. రాయ్ (1934) కాగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును ప్రతిపాదించిన తొలి రాజకీయ పార్టీ స్వరాజ్యపార్టీ. 1942 నాటి క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా ప్రతిపాదించింది. 1918 డిసెంబరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

గాంధీజీ అభిప్రాయం
గాంధీజీ 1922, జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు ఇచ్చే భిక్షకాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు" అని అన్నారు. 'రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించగలదు' అని పేర్కొన్నారు. 1937లో ఫైజాపూర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.

రాజ్యాంగ అభివృధ్ధి క్రమం
భారత రాజ్యాంగ అభివృధ్ధి క్రమాన్ని బి.సి. రావత్ అనే పండితుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. అవి:
    1. మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    2. రెండో దశ: క్రీ.శ.1773 నుంచి 1858 వరకు
    3. మూడో దశ: క్రీ.శ.1858 నుంచి 1909 వరకు
    4. నాలుగో దశ: క్రీ.శ.1909 నుంచి 1935 వరకు
    5. అయిదో దశ: క్రీ.శ.1935 నుంచి 1947 వరకు
    6. ఆరో దశ: క్రీ.శ.1947 నుంచి 1950 వరకు

మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని దక్కించుకుంది.
ఈస్టిండియా కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా క్రీ.శ.1773 నాటికి 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది.
అవి: 1) మద్రాసు
     2) బొంబాయి
     3) బెంగాల్
క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయం సాధించి, భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. క్రీ.శ.1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్లేయులు మొగల్ చక్రవర్తి నుంచి దివానీ హక్కులు పొందారు. ఈస్టిండియా కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడేది.
ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈస్టిండియా కంపెనీలో భారీగా అవినీతి జరగుతుందని పేర్కొంటూ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేసింది.

రెండో దశ: 1773 నుంచి 1858 వరకు
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం చేయడం అని అర్థం. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి మనదేశంలో బ్రిటిష్‌వారు మొదటగా చేసిన చట్టం ఇది.

రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773, మే 18న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.
* ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ (E.I.C.)కి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది.
* ఈ చట్టాన్ని అనుసరించి మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకువచ్చారు.
* బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు.
* వారన్ హేస్టింగ్స్ 1773 అక్టోబరు 20న బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
* వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే మనదేశంలో 1772లో కలెక్టర్ పదవిని సృష్టించారు.
* ఈ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
* ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులను నియమించారు. వారు:

* బెంగాల్ గవర్నర్ జనరల్‌కు సలహా ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అందులో క్లావెరింగ్, బార్‌వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్‌సన్ ఉన్నారు.
 
సెటిల్‌మెంట్ చట్టం - 1781
* ఈ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్‌వారు అధికారికంగా మనదేశంపై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు.

పిట్స్ ఇండియా చట్టం - 1784
* ఈ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ప్రయత్నించారు.
* ఈ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ కాలంలో 1784లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టం అనే పేరు వచ్చింది.
* బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ఉన్న సమయంలో ఈ చట్టాన్ని చేశారు.

పిట్స్ ఇండియా చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనాంశాలను 2 రకాలుగా విభజించారు.

1. వ్యాపార వ్యవహారాలు:
* వీటి నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.
 
2. రాజకీయ వ్యవహారాలు
* వీటి నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ పాలన, న్యాయం, శాంతిభద్రతలు లాంటి వ్యవహారాలను ఇది నియంత్రిస్తుంది.
* ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డ్ ఆదేశాలను భారతదేశానికి తెలియజేసేది.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.

చార్టర్ చట్టం - 1793
* చార్టర్ అంటే 'ఒప్పందం' అని అర్థం.
* ఈ చట్టాన్ని గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కాలంలో చేశారు.
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను మరోసారి 20 సంవత్సరాలు పొడిగించారు.
* గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించేవారు.
* కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో సభ్యుడు కాదు.

చార్టర్ చట్టం - 1813
* ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
* ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా) బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపార అవకాశాలను కల్పించారు.
* స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని అప్పగించారు.
* భారతదేశంలో విద్యావ్యాప్తికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేటాయించారు.
* ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు.
* భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
* ఇది మనదేశంలో మతమార్పిడులకు కారణమైంది.
* కంపెనీ ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించారు.
* ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిని మరింత విస్తృతపరచారు.

చార్టర్ చట్టం - 1833
* ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లపాటు పొడిగించారు.
* బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు.
* దీని ఫలితంగా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా మారారు.
* ఇతడికి సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు.
* రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి, కార్యనిర్వహణ అధిపతియైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలను అప్పగించారు.
* కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
* గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులను నాలుగుకు పెంచి, అందులో ఒక న్యాయ సభ్యుడు ఉండేలా సవరణ చేశారు.
* మొదటి న్యాయ సభ్యుడిగా మెకాలేను నియమించారు.
* తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కంపెనీ ఆధీనంలో నుంచి తొలగించారు.
* భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్‌బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
* ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
* యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు; భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పించారు.
* దీని వల్ల బ్రిటిష్ వలస రాజ్య స్థాపనకు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది.
* భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను ఏర్పరిచారు. దీని మొదటి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలేను నియమించారు.
* భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో ప్రతిభ ఉన్న భారతీయులను నియమించాలని రాజా రామ్ మోహన్‌ రాయ్ మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
* ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు.

చార్టర్ చట్టం - 1853
* ఈస్టిండియా కంపెనీ పాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం.
* ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరుచేశారు.
* శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పరిచారు.
* ఇది బ్రిటిష్ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని మినీ పార్లమెంటు అంటారు.
* సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా భారతీయులకు అనుమతి కల్పించి సార్వజనీన పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో నలుగురిని మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
* శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయాధికారం మాత్రం గవర్నర్ జనరల్‌దే.
* వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
* కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధిని పేర్కొనక పోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఈ చార్టర్ చట్టం అవకాశం కల్పించింది.
* 1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
* 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ సమర్థవంతంగా అణిచివేయలేదని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. 1858 నుంచి బ్రిటిష్ రాజు / రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం ప్రారంభమైంది. అందుకే 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పేరొందాయి.

మూడో దశ: 1858 నుంచి 1909 వరకు

భారత ప్రభుత్వ చట్టం: 1858
*1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేత అనంతరం 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది.

అందులోని మఖ్యాంశాలు:
* ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు ప్రకారం ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు.
* భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయిగా మార్చారు.
* భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి అనే పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తారు. మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ కానింగ్.
* బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయిగా ఆ వ్యక్తి వ్యవహరిస్తారు.
* వైస్రాయి దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి. ఇతడు దేశ పాలనను బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తాడు.
* ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయింది.
* భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
* ఇంగ్లండ్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు.
* భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ కేబినెట్‌లో భాగంగా భారతదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తాడు.
* భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని (కౌన్సిల్) ఏర్పాటు చేశారు.
* మొదటి భారత రాజ్య కార్యదర్శి: చార్లెస్ ఉడ్.
* భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారు.
* ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా లాంటిదిగా అభివర్ణించింది.
* ఈ చట్టం ద్వారా మనదేశంలో 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయ్యింది.
* ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది.
* భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానంలో భాగంగా క్రమానుగత శ్రేణి పద్ధతి కింది విధంగా ఉంది.

కౌన్సిల్ చట్టం: 1861
* ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది.
* 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. దీనిలో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు.
* భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరుమీద చట్టాలను రూపొందిచడం వల్ల ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు.
* 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మనదేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్దత కల్పించారు.
* ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్‌ఫోలియో విధానం అంటారు.
* 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1866లో అలహాబాద్‌లో నాలుగో హైకోర్టును ఏర్పాటు చేశారు.
* 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేసిన బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు బీజాలు వేశారు.
* గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం కల్పించారు.
* 1862లో వైస్రాయి లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు దేవ్ నారాయణ్‌సింగ్, పాటియాలా రాజు నరేంద్రసింగ్, సర్ దినకర్ రావు ఉన్నారు.
* బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.

కౌన్సిల్ చట్టం: 1892
* 1885లో మనదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ (I.N.C.) ఏర్పడి జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో పోరాడి ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
* మితవాదులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ భారతీయ మేధావులను చైతన్యపరచి ప్రజాఉద్యమాన్ని నిర్మించారు. వీరిని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులు 1892 కౌన్సిల్ చట్టాన్ని చేశారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
* ఈ చట్టం ద్వారా మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, 16 మందికి మించకుండా, అలాగే రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
* లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయి, గవర్నర్ల కౌన్సిళ్లలో స్థానం కల్పించారు. కౌన్సిల్‌లో ఆరుగురు భారతీయులకు ప్రాతినిధ్యం దక్కింది. వారు:
     1. సురేంద్రనాథ్ బెనర్జీ
     2. దాదాభాయ్ నౌరోజీ
     3. గోపాలకృష్ణ గోఖలే
     4. ఫిరోజ్‌షా మెహతా
     5. రాస్‌బిహారి ఘోష్
     6. బిల్‌గ్రామీ

* ఈ చట్టం ద్వారా శాసనమండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు.
* ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ప్రశ్నలు అడగడానికి గవర్నర్, గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమే అని భావించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.

ఈ దశలోని మరికొన్ని ముఖ్యాంశాలు
* లార్డ్ మెకాలే కృషి వల్ల భారత్‌లో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.
* మెకాలే లా కమిషన్ చైర్మన్‌గా అనేక చట్టాలను క్రోడీకరించారు.

* 1854 నాటి ఉడ్స్ డిస్పాచ్ భారత్‌లో ఆంగ్ల విద్యావిధానానికి మాగ్నాకార్టాగా పేరొందింది.
* కారన్ వాలీస్ భారత్‌లో సివిల్ సర్వీసులకు ఒక రూపం తీసుకొచ్చారు.
* లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది.
* 1906లో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ ఢాకాలో ముస్లింలీగ్‌ను ఏర్పరిచాడు. దీని మొదటి అధ్యక్షుడు ఆగాఖాన్.
* 1907లో సూరత్‌లో రాస్‌బిహారి ఘోష్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

నాలుగో దశ: 1909 - 1935

భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో - మార్లే సంస్కరణలు: 1909
* 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం, భారత్‌లో ఉద్ధృతమవుతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడం, మితవాదులను సంతృప్తిపరచడం అనే లక్ష్యాల సాధనగా 1909లో మింటో మార్లే సంస్కరణలు చేశారు.
* ఆనాటి భారత వైస్రాయి మింటో, భారత రాజ్య కార్యదర్శి మార్లే పేర్లతో ఈ చట్టాన్ని చేయడం వల్ల దీన్ని మింటో - మార్లే సంస్కరణల చట్టం అంటారు.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
* వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు.
* మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్లలో సభ్యత్వ సంఖ్యను 50కి; పంజాబ్, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
* గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు:
     1. నామినేటెడ్ అధికార సభ్యులు
     2. నామినేటెడ్ అనధికార సభ్యులు
     3. హోదారీత్యా సభ్యులు
     4. ఎన్నికైన సభ్యులు
* వైస్రాయి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా (న్యాయసభ్యుడు).
* 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ కృషి మేరకు మనదేశంలో ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునేందుకు వీలైంది. అందుకే లార్డ్ మింటోను భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు. ఈ విధానం 1947లో దేశ విభజనకు పునాది వేసింది.
* శాసనసభలో బడ్జెట్‌తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని భారతీయులకు కల్పించారు.
* ఈ చట్టం ద్వారా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను నిర్దేశించారు.
* 1911లో రెండో లార్డ్ హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిగా కలకత్తాకు బదులు దిల్లీని నిర్దేశించారు.
* మింటో మార్లే చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఇది కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించింది. ఈ చట్టం హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.

మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం: 1919
* భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫర్డ్ ఈ చట్టాన్ని రూపొందిచడం వల్ల దీనికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని పేరు వచ్చింది.

ఈ చట్టం రూపొందించడానికి కారణాలు
* 1916 ఏప్రిల్‌లో పుణె కేంద్రంగా బాలగంగాధర తిలక్, సెప్టెంబరులో మద్రాస్ కేంద్రంగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత జాతీయోద్యమాన్ని బలోపేతం చేయడం.
* 1909 నాటి మింటో మార్లే సంస్కరణల చట్టం భారతీయులను సంతృప్తి పరచలేకపోవడం.
* 1919, ఏప్రిల్ 13న పంజాబ్‌లో జనరల్ డయ్యర్ వికృత చేష్ట జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలను చల్లబరచడం.
* రౌలత్ చట్టాన్ని గాంధీజీ BLACK ACT (నల్ల చట్టం)గా అభివర్ణించి 1919, ఏప్రిల్ 6న జాతిని అవమానించిన దినంగా పాటించాలని భారతీయులకు పిలుపు నివ్వడం.

మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టంలోని ముఖ్యాంశాలు
* భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ విధానం ప్రారంభమైంది.
* భారత రాజ్య కార్యదర్శి వేతనాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటన్ నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి:

1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ)
* దీనిలో 60 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 34 మంది ఎన్నికైనవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేసినవారు ఉంటారు.
* వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
* దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
* దీనికి గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

2. లెజిస్లేటివ్ కౌన్సిల్ (దిగువ సభ)
* ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికైనవారు కాగా, 41 మంది నామినేటెడ్ సభ్యులు.
* ఈ సభ పదవీకాలం 3 సంవత్సరాలు.
* ఈ సభకు తొలి అధ్యక్షుడు - విఠల్‌భాయ్ పటేల్, తొలి ఉపాధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా.
* కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలను 1921లో ఏర్పాటు చేశారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలుగా విభజించారు.

1. కేంద్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 47 అంశాలను చేర్చారు.
* జాతీయ ప్రాముఖ్యం గల అంశాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ఉదా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, రక్షణ, కరెన్సీ, ఎగుమతులు, దిగుమతులు.

2. రాష్ట్ర జాబితా
* ఈ జాబితాలో మొత్తం 51 అంశాలను చేర్చారు.
* ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
ఉదా: ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, రోడ్డు రవాణా, నీటిపారుదల.
* ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy)ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. అవి:

1. రిజర్వ్‌డ్ జాబితా
* దీనిలో మొత్తం 28 పాలనాంశాలను నిర్దేశించారు.
* అత్యంత ప్రాధాన్యం ఉన్న అధికారాలు, ఆదాయమున్న విత్తం, భూమిశిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
* ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనాంశాలను కార్యనిర్వాహక మండలి సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

2. ట్రాన్స్‌ఫర్డ్ జాబితా
* దీనిలో మొత్తం 22 అంశాలు ఉంటాయి.
* అధికారాలు లేని, ప్రాముఖ్యం లేని కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలను దీనిలో చేర్చారు.
* స్థానిక పాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం దీనిలో ఉన్నాయి.
* రాష్ట్ర గవర్నర్లు ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. వీరు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
* చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
* చట్టసభల్లో క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతపరిచారు.
* ఆస్తి, పన్నులు చెల్లించే ప్రాతిపదికపై పరిమిత ఓటుహక్కును కల్పించారు.
* ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటుచేశారు.
* లండన్‌లో భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు. లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
* 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) ఏర్పాటు చేశారు.
* కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.
* గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య; అంతర్ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇచ్చారు.
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి లీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 1926లో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి.
* రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేశారు.
* మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం కేవలం మనదేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.

1919 చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా పరిపాలన కింది విధంగా ఉంది.

1919 చట్టంపై ఉన్న విమర్శ:
* ''నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కరూ నేరుస్థులే" - గాంధీజీ.
* ఈ చట్టం సూర్యుడు లేని ఉదయం లాంటిది అని బాలగంగాధర్ తిలక్ అభివర్ణించారు.
* 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
* ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
* భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది చాలావరకు దూషించే మాట అయింది. ''ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నీవు డైయార్కివి అని అనడం విన్నాను" అని సర్ బట్లర్ అనే రచయిత పేర్కొన్నాడు.
* ద్వంద్వ పాలనను ఎప్పుడూ ఆదర్శంగా భావించలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే (రచయిత) పేర్కొన్నాడు.
* ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీ మాన్ కమిటీ సమర్థించింది.

సైమన్ కమిషన్: 1927
* 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించేందుకు నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్ 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను నియమించాడు.
* ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
* సైమన్ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
    1) 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు
    2) 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్ 6 వరకు
* సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.

సైమన్ కమిషన్ నివేదికలో ముఖ్యాంశాలు:
* భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
* 1919లో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
* మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించాలి.
* భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
* హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పరచాలి.
* భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
* సార్వత్రిక వయోజన ఓటుహక్కు సాధ్యం కాదు.
* ప్రాథమిక హక్కులను నిరాకరించారు.
* కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించాలి.
* అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్)తో కూడుకున్న స్వాతంత్య్రాన్ని తిరస్కరించాలి.
 సైమన్ కమిషన్ నివేదిక అనేది భారతదేశ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనం అని కూప్లాండ్ (రచయిత) పేర్కొన్నాడు.
 1935లో చేసిన భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫారసులను పొందుపరిచారు.

నెహ్రూ నివేదిక : 1928
* సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించడంతో... భారతరాజ్య క్యార్యదర్శి లార్డ్ బిర్కెన్‌హెడ్ 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువ సభలో ప్రసంగిస్తూ ''భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా'' అని భారతీయులకు సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు:
* భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి.
* కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించాలి.
* ఇందులో 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు.
* దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* పంజాబ్, బెంగాల్‌లోని ప్రత్యేక మత నియోజక వర్గాలను రద్దు చేయాలి.
* అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి.

దీపావళి ప్రకటన:
* సైమన్ కమిషన్ నివేదికపైనా, భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపైనా చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని... భారత్‌కు త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న ఒక ప్రకటన చేశాడు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.
* 1929లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లేబర్ పార్టీ గెలుపొంది రామ్‌సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్‌తో సంప్రదింపులు జరిపాడు. సైమన్ కమిషన్‌ను భారతీయులు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాడు. లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.

మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. దీనిలో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
* ఈ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున ఎమ్.ఆర్ .జయకర్, మూంజే; ఉదారవాదుల తరఫున తేజ్‌బహదూర్ సప్రూ, చింతామణి, బి.ఆర్. అంబేడ్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా హాజరయ్యారు.
* ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీని ఇవ్వనందున భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. కాంగ్రెస్ పాల్గొనక పోవడం వల్ల ఈ సమావేశం విఫలమైంది. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటించాడు.

గాంధీ - ఇర్విన్ ఒప్పందం:
* కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే తాము నిర్వహించే సమావేశాలు సఫలం కావని గుర్తించిన ఆంగ్లేయ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీని ఒప్పించాలని వైస్రాయి ఇర్విన్‌ను ఆదేశించింది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీని విడుదల చేయడంతో 1931, మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు.

దీనిలోని ముఖ్యాంశాలు:
* రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
* కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
* తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
* శాసనోల్లంఘన ఉద్యమంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం.

రెండో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఇది లండన్‌లో 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీజీ హాజరయ్యారు. స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది ప్రతినిధులు, మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరఫున బి.ఆర్.అంబేడ్కర్ పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆంగ్లేయులు విభజించు -  పాలించు సూత్రాన్ని పాటించడం వల్ల గాంధీ సమావేశం నుంచి ఉపసంహరించుకుని భారత్‌కు రావడంతో ఆంగ్లేయులు అతడిని అరెస్ట్ చేశారు.

కమ్యూనల్ అవార్డు: 1932
* ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ కారాగారంలో 1932, సెప్టెంబరు 20న ఆమరణ నిరాహర దీక్షకు పూనుకున్నారు. దీంతో గాంధీజీ - అంబేడ్కర్ మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం - 1932 అంటారు. దీని ఫలితంగా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డు కులాలకు అవకాశాలు లభించాయి. కమ్యూనల్ అవార్డు షెడ్యూల్డ్ కులాలను దళితులుగా పేర్కొంది.

మూడో రౌండ్ టేబుల్ సమావేశం:
* ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిన్నా, అంబేడ్కర్‌లతో సహా మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
* మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్‌లిత్‌గో అధ్యక్షతన బ్రిటిష్ పార్లమెంటుకు చెందిన సెలెక్ట్ కమిటీ పరిశీలించి... 1934, నవంబరు 11న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించింది. ముస్లిం లీగ్ సమాఖ్య అనే భావనను తిరస్కరించి, ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించింది.

5వ దశ: 1935 - 1947

భారత ప్రభుత్వ చట్టం - 1935
* బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో సమగ్రమైంది, భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైంది.
* 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదం పొందిన అతిపెద్ద చట్టం.
* ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
* ఈ చట్టం 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 70 శాతం పైగా అంశాలను ఈ చట్టం నుంచి గ్రహించారు. అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదని హస్రత్ మొహాని పేర్కొన్నాడు.
* భారతదేశంలో బాధ్యతాయుతమైన పాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా ప్రకటించారు.

చట్టంలోని ముఖ్యాంశాలు:

అఖిల భారత సమాఖ్య ఏర్పాటు:
* సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మనదేశంలో ఆంగ్లేయులు సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికార విభజన జరిగింది.
ఎ) కేంద్ర జాబితా: దీనిలో రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న 59 అంశాలు ఉన్నాయి.
బి) రాష్ట్ర జాబితా: దీనిలో నీటిపారుదల, వ్యవసాయం, విద్య, స్థానిక పాలన లాంటి ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 54 అంశాలు ఉన్నాయి.
సి) ఉమ్మడి జాబితా: దీనిలో వివాహం, విడాకులు, వారసత్వం లాంటి 36 అంశాలు ఉన్నాయి.
పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్‌కు బదలాయించారు.
రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలను రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
ఎ) రిజర్వ్‌డ్ జాబితా: దీనిలో ప్రాధాన్యం గల అధికారాలు, ఆదాయమున్న అంశాలు చోటుచేసుకున్నాయి. వీటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్‌కు అధికారం కల్పించారు.
బి) ట్రాన్స్‌ఫర్డ్ జాబితా: అధికారాలు, ఆదాయం లేని; అంతగా ప్రాధాన్యం లేని అంశాలను ఈ జాబితాలో చేర్చారు. దీనిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీటిని భారతీయ మంత్రులకు అప్పగించారు.
కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు.

ఎ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్:
  ఎగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 260. దీనిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు.

బి) లెజిస్లేటివ్ అసెంబ్లీ:
* దిగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 375.

రాష్ట్రాల్లో ద్విసభా విధానం
* ఈ చట్టం ద్వారా భారత్‌లోని రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
* భారత్‌లోని మొత్తం 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
అవి: 1. అస్సాం
     2. బెంగాల్
     3. బీహార్
     4. ఉత్తర్‌ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్)
     5. మద్రాస్
     6. బొంబాయి

* 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దుచేశారు.
* రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి... రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.

ఫెడరల్ కోర్టు:
* ఢిల్లీలో 1935, అక్టోబరు 1న ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇది 1937 నుంచి పని విధానాలను ప్రారంభించింది.
* మనదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టినందున కేంద్రం - రాష్ట్రాలు; దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది.
* దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
* మొదటి ప్రధాన న్యాయమూర్తి - మారిస్ గ్వేయర్.
* ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్‌లోని ప్రీవి కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* ఓటు హక్కును విస్తృతపరిచి, జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపజేశారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరుచేశారు.
* ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
* భారతదేశంలో ఆర్థిక విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
* కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్‌కు పంపే అధికారాన్ని కల్పించారు.
* సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
* భారత రాజ్య కార్యదర్శికి సలహాను ఇచ్చే భారత కౌన్సిల్‌ను రద్దు చేశారు.
* 1937 నుంచి భారత ప్రభుత్వ చట్టం - 1935 అమల్లోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.
* 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* 1939, అక్టోబరులో బ్రిటిష్ వైఖరికి నిరసనగా 8 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన అంశం ప్రాంతీయ స్వపరిపాలన.

1935 చట్టంపై విమర్శలు
''ఇది పొట్టి మనుషులు (పిగ్మీస్) కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం (రాక్షస స్తంభం)" - విన్‌స్టన్ చర్చిల్
''భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం" - కె.టి. షా
''మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది" - మహ్మద్ అలీ జిన్నా
''ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు" - జవహర్‌లాల్‌ నెహ్రూ
''భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం" - సుభాష్ చంద్రబోస్

లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు: 1940
* భారత గవర్నర్ జనరల్, వైస్రాయి అయిన లార్డ్ లిన్‌లిత్‌గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆగస్టు ప్రతిపాదనలు అంటారు.

ముఖ్యాంశాలు:
* రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనే విషయాన్ని పరిశీలించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
* రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించాలి.
* అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
* వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతపరచడం.
* ఆగస్టు ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

క్రిప్స్ ప్రతిపాదనలు: (1942)
    రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ యుద్ధంలో భారతీయ సైన్యాల సహకారం పొందేందుకు క్రిప్స్ ప్రతిపాదనలు అనే పేరుతో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తన కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారత్‌కు పంపాడు. 1942, మార్చి 22న భారత్‌కు వచ్చిన క్రిప్స్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు

* భారత ప్రజల ప్రతిపాదన అయిన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.
* గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
* బ్రిటిష్‌వారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ, దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరించాలని అని పేర్కొన్నారు.
* భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి (పాక్షిక స్వాతంత్య్రం) కల్పిస్తామని ప్రకటించారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
* 1942, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ Do or Die నినాదాన్ని ఇచ్చారు.
* క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ''దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేది వేసి ఇచ్చిన ఒక చెక్కు లాంటిది" అని వ్యాఖ్యానించారు. (Post - dated cheque drawn on the crashing bank).

సి.ఆర్.ఫార్ములా: 1944
* 1944 మార్చిలో కాంగ్రెస్ తరఫున ముస్లిం లీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం, సమష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిధ్ధిస్తుంది అనే భావనతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ఫార్ములాను రూపొందించారు.
ఈ సూత్రాన్ని రాజగోపాలాచారి తన The way out pamphlet అనే కరపత్రాల ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

సి.ఆర్.ఫార్ములాలోని ముఖ్యాంశాలు
* భారతదేశం స్వాతంత్య్రం కోరడాన్ని ముస్లిం లీగ్ ఆమోదించాలి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలి.
* దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత పాకిస్థాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనీ, మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి.ఆర్.ఫార్ములాలో పేర్కొన్నారు.
* ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) ను చేపట్టే ముందుగానే అన్ని పార్టీలకు దేశ విభజనపై వారి అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కల్పిస్తారు.
* విభజన కారణంగా ప్రజలు తరలిపోవాల్సి వస్తే అది వారి అభీష్టం మేరకే జరగాలి.
* ఒకవేళ విభజన సంభవిస్తే దేశ రక్షణకు, వాణిజ్యానికి, ఇతర ముఖ్య ప్రయోజనాలకు పరస్పర ఒడంబడికలు జరగాలి.
* పాకిస్థాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను వ్యతిరేకించాయి.

అమేరి - వేవెల్ ప్రణాళిక: 1945
  భారత వ్యవహారాల కార్యదర్శి అమేరి, భారత వైస్రాయి లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌తో చర్చించి, రూపొందించిన ప్రతిపాదనలను అమేరి - వేవెల్ ప్రణాళిక అంటారు.
దీనిలోని ముఖ్యాంశాలు:
* గవర్నర్ జనరల్‌కు వీటో అధికారం ఇచ్చారు.
* దేశ సార్వభౌమ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఉంటూ మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలు కల్పించడం.
* భారతదేశంలో బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక హై కమిషనర్‌ను నియమించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరించడం.
* వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయుడితో నింపడం.
* ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులను జైళ్ల నుంచి విడుదల చేయడం.

సిమ్లా సమావేశం (Simla Conference): 1945
* వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు వైస్రాయి వేవెల్ 1945, జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
* కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య సయోధ్య కుదర్చడం కోసం భూలాభాయ్ దేశాయ్ (కాంగ్రెస్), లియాఖత్ అలీఖాన్ (ముస్లిం లీగ్) మధ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* భారత ముస్లింలకు ప్రతినిధిగా ముస్లిం లీగ్‌ను మాత్రమే పరిగణించాలని... లీగ్ సభ్యులు కాని ముస్లింలను రాజ ప్రతినిధి కార్యనిర్వాహక కౌన్సిల్‌లో చేర్చుకోరాదని మహ్మద్ అలీ జిన్నా పట్టు పట్టారు.
* పాకిస్థాన్ ఏర్పాటు గురించి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్, స్వాతంత్య్రం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుంచి నిష్క్రమించాయి.

కేబినెట్ మిషన్ (మంత్రిత్రయ రాయబారం): 1946
   రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. క్లెమెంట్ అట్లీ బ్రిటన్ ప్రధాని అయ్యారు. 1946, మార్చిలో బ్రిటన్ ప్రధాని అట్లీ పార్లమెంటులో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అందులోని సారాంశం:
1. అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు గుర్తింపు ఉంది.
2. అల్ప సంఖ్యాకులు నిర్భయంగా జీవించాల
3. అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా అనుమతించలేం.

క్లెమెంట్ అట్లీ భారత్‌కు పంపిన మంత్రిత్రయ రాయబారం లోని సభ్యులు:
     1. సర్ పెథిక్ లారెన్స్ (ఛైర్మన్)
     2. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ (సభ్యుడు)
     3. ఎ.వి. అలెగ్జాండర్ (సభ్యుడు)
* కేబినెట్ మిషన్ 1946, మే 16న తన ప్రణాళికను వెలువరించింది.

కేబినెట్ మిషన్‌లోని ముఖ్యాంశాలు:
* భారతీయులు తమను తాము పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి భారతీయులతో ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు.
* బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర శాసనసభలతో రాజ్యాంగ పరిషత్తు సభ్యులను ఎన్నుకుంటారు.
* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తు‌కు తమ ప్రతినిధులను పంపే అవకాశం కల్పించారు.
* ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి.
* కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని పాలనాంశాలపై శాసనాధికారం రాష్ట్రాలకు సంక్రమిస్తుంది.
* ప్రాంతీయ ప్రభుత్వాలకు శాసన నిర్మాణ శాఖలు ఏర్పాటవుతాయి.
* పాకిస్థాన్ దేశ ఏర్పాటును తిరస్కరించింది.
* అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని 14 మంది సభ్యులతో ఏర్పాటుచేయడం జరుగుతుంది.
* 1946, సెప్టెంబరు 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రారంభంలో సందేహించిన ముస్లిం లీగ్ 1946, అక్టోబరు 29న తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది.

1946 నాటి తాత్కాలిక ప్రభుత్వంలోని మంత్రులు - శాఖలు

క్లెమెంట్ అట్లీ ప్రకటన: 1947
  బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1947, ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948, జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు.
  ఈ ప్రకటనను మహాత్మాగాంధీ బ్రిటిష్‌వారు జారీచేసిన వాటిలో అత్యుత్తమమైందిగా ప్రశంసించారు.

మౌంట్‌బాటన్ ప్రణాళిక: 1947
* లార్డ్ వేవెల్ స్థానంలో 1947, మార్చి 22న గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియమితుడయ్యాడు.
* ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకుని మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు.
* భారతదేశం రెండు డొమినియన్లుగా ఏర్పాటవుతుంది. హిందువులు ఎక్కువగా నివసించేవారు ఇండియన్ యూనియన్‌గా, ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం పాకిస్థాన్‌గా అవతరిస్తాయి.
* స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టానుసారం భారత్ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు.
* అస్సాం భారతదేశ అంతర్భాగంగా ఉండిపోగా బెంగాల్, పంజాబ్‌లను మతప్రాతిపదికపై విభజించారు.
* బెలుచిస్థాన్, వాయవ్య ప్రాంతాలు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో చేరే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.
* బ్రిటన్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ కూటమిలో చేరే విషయంలో భారత్, పాకిస్థాన్‌లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
* మౌంట్‌బాటన్ పథకాన్ని ముస్లిం లీగ్ స్వాగతించగా, భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంలో జిన్నా ఒక ప్రకటన చేస్తూ దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేకుంటే ధ్వంసం చేస్తాం అని వ్యాఖ్యానించాడు. జిన్నా ప్రకటనతో దేశంలో తీవ్ర హింస చెలరేగి, దేశ విభజన అనివార్యమైంది.
* ఈ సందర్భంలో ఢిల్లీలో జరిగిన మత సంఘర్షణ, హింస, రక్తపాతాలు గాంధీజీని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. మహాత్ముడు బాధాతప్త హృదయంతో దేశ విభజనకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు.
* సింధు రాష్ట్రం పాకిస్థాన్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* అస్సాంలోని సేలట్ జిల్లాలో వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాకిస్థాన్‌లోనే విలీనం కావాలని అభిప్రాయం వచ్చింది.
* జునాగఢ్‌లో రెఫరెండం నిర్వహించగా భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు.
* బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్‌ను పాకిస్థాన్‌లోనూ, పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లోనూ విలీనం చేయాలని తీర్మానించింది.
* మౌంట్ బాటన్ పథకాన్ని డిక్కి బర్డ్ పథకమని అంటారు.

భారత స్వాతంత్య్ర చట్టం: 1947
  ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చివరి చట్టం ఇది. లార్డ్ మౌంట్ బాటన్ సలహామేరకు భారత స్వాతంత్య్ర బిల్లును 1947, జులై 4న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా జులై 15న బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. 1947, జులై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించగా 1947, ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
* 1947, ఆగస్టు 14న గురువారం పాకిస్థాన్ ఏర్పడింది.
* 1947, ఆగస్టు 15న శుక్రవారం భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
* ఇండియా, పాకిస్థాన్ దేశాల కోసం వేర్వేరు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటయ్యాయి.
* మౌంట్ బాటన్ భారతదేశానికి, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్‌కు గవర్నర్ జనరల్స్‌గా నియమితులయ్యారు.
* రెండు దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్‌లు తాత్కాలిక పార్లమెంట్లుగా వ్యవహరిస్తాయి.
* సొంత రాజ్యాంగాలను రూపొందించుకునే వరకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి, పరిపాలన ఉంటుంది.
* రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్ క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది.
* ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు.
* క్లెమెంట్ అట్లీ ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఉదాత్తమైంది, ఉత్తమమైందిగా అభివర్ణించాడు.
* భారత స్వాతంత్య్రాన్ని దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతజాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగాన్ని ద ట్రిస్ట్ విత్ డిస్టినీ (విధితో ఒప్పందం) అంటారు.
* స్వాతంత్య్రం నాటికి దేశంలో 562 సంస్థానాలుండగా, వాటిలో 554 భారత్‌లో విలీనం అయ్యాయి.
* స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దయింది.
* భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దయింది.
* బ్రిటిష్ రాజు లేదా రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది.
* ట్రావెన్‌కోర్ సంస్థానం ఎలాంటి షరతులు విధించకుండా భారత్‌లో విలీనమైంది.
* జునాఘడ్, జమ్మూకశ్మీర్ సంస్థానాలు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయం) ద్వారా భారత్‌లో విలీనమయ్యాయి. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనమైంది.

వ్యాఖ్యానాలు:
    ''ప్రపంచం ఆదమరచి నిద్రిస్తున్న ఈ అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ, భారతజాతి మేల్కొంటోంది. ఈ మేల్కొలుపు ఏనాడో విధితో చేసుకున్న ఒప్పందం" - నెహ్రూ
ఇలా జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ఈ ఉపన్యాసాన్ని ఆనాడు ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

''మన స్వల్పమైన బాధలు, త్యాగాల వల్ల ఈ విజయం లభించినా, ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సాంప్రదాయ సిద్ధి కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి" - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

1947, ఆగస్టు 15న ఏర్పడిన స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం

     నెహ్రూ ప్రజాస్వామిక స్వభావం మొదటి మంత్రిమండలి కూర్పులో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందని ప్రముఖులను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారు:
    1. డా.బి.ఆర్. అంబేడ్కర్
    2. సీహెచ్. బాబా
    3. జాన్ ముత్తాయ్
    4. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ
    5. షణ్ముగం షెట్టియార్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ సవరణ చట్టాలు - II

1. 31వ రాజ్యాంగ సవరణ చట్టం (1973) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్స్‌ 81, 330, 332 లను సవరించారు.

బి) లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 500 నుంచి 525 కి పెంచారు.

సి) లోక్‌సభలో కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని 25 నుంచి 20కి తగ్గించారు. 

డి) లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు.

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ:  ఎ, బి, సి 

2. 32వ రాజ్యాంగ సవరణ చట్టానికి (1973) సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగానికి కొత్తగా ఆర్టికల్స్‌ 371D, 371E లను చేర్చారు.

బి) ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంట్రల్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

సి) ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.

డి) ఈ సవరణ చట్టం 1974, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి     3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ:  పైవన్నీ

3. వివిధ రాష్ట్రాలు చేసిన సుమారు 20 భూ సంస్కరణల చట్టాలకు ‘న్యాయ సమీక్ష(Judicial Review)  పరిధి నుంచి మినహాయింపు కల్పించారు. దీన్ని కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు?

1) 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973 

2) 34వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974

3) 30వ రాజ్యాంగ సవరణ చట్టం, 1972 

4) 31వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973

జ:  34వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974

4. 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా ‘సహరాష్ట్ర హోదా’(Associate State) పొందిన రాష్ట్రం ఏది?

1) గోవా     2) తమిళనాడు     3) సిక్కిం    4) జమ్మూ-కశ్మీర్‌

జ:  సిక్కిం

5. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్‌ 371F ని కొత్తగా చేర్చారు.

బి) మనదేశంలో 22వ రాష్ట్రంగా ‘సిక్కిం’ అవతరించింది.

సి) సిక్కిం నుంచి ఒక సభ్యుడు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించారు.

డి) ఆర్టికల్‌ 371F లో సిక్కింకి సంబంధించిన ప్రత్యేక రక్షణలు చేర్చారు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి    3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ:  పైవన్నీ 

6. రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్టినెంట్‌ గవర్నర్లు జారీచేసే ‘ఆర్డినెన్స్‌’లను ‘న్యాయసమీక్ష’ పరిధి నుంచి మినహాయించారు. దీనికి కారణమైన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?

1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

2) 37వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

3) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

4) 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974

జ: 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 ​​​​​​​

7. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను ‘న్యాయ సమీక్ష’ పరిధి నుంచి మినహాయించారు. దీన్ని కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు?

1) 34వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 

2) 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 

3) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

4) 37వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

జ:  38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

8. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సభాధిపతుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ‘న్యాయసమీక్ష’ పరిధి నుంచి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మినహాయించారు?

1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

2) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

3) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

4) 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974

జ: 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

9. 40వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కి  ఎన్ని చట్టాలను చేర్చారు?

1) 64      2) 69   3) 71      4) 92

జ:  64   

10. 41వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా ఆర్టికల్‌ 316 ని సవరించి, ‘రాష్ట్ర, జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల’ సభ్యుల పదవీ విరమణ వయసును ఎంతకు పెంచారు?

1) 58 నుంచి 60 ఏళ్లకు     2) 60 నుంచి 62 ఏళ్లకు

3) 62 నుంచి 65 ఏళ్లకు     4) 60 నుంచి 65 ఏళ్లకు

జ:  60 నుంచి 62 ఏళ్లకు

11. 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) రాజ్యాంగంలోని 41 ఆర్టికల్స్‌ను సవరించారు.

బి) రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ను సవరించారు.

సి) రాజ్యాంగ ప్రవేశికను తొలిసారిగా సవరించారు.

డి) ఈ సవరణ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి      3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: పైవన్నీ

12. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా కిందివాటిలో ఏ ఆదేశిక సూత్రాలను కొత్తగా రాజ్యాంగానికి చేర్చారు? (భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చే లక్ష్యంతో దీన్ని చేశారు.)

ఎ) పేదలకు ఉచిత న్యాయ సహాయం 

బి) కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం

సి) పర్యావరణాన్ని, వన్యప్రాణుల్ని సంరక్షించడం.

డి) గ్రామ పంచాయతీల ఏర్పాటు

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి      3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ:  ఎ, బి, సి

13. ఇండియాని ‘దేశ ఐకమత్యం - అఖండత’ (Unity and Integrity of the Nation) గా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పేర్కొన్నారు?

1) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 

2) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977

3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 

4) 41వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

జ: 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ​​​​​​​

14. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా రాజ్యాంగ ‘ప్రవేశికను’ సవరించి, అందులో కొత్తగా కొన్ని పదాలను చేర్చారు. కిందివాటిలో ఆ పదాల్లో లేనిదాన్ని గుర్తించండి.

1) సామ్యవాద   2) లౌకిక        3) గణతంత్ర    4) సమగ్రత

జ: గణతంత్ర

15. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) లోక్‌సభ, రాష్ట్ర శాసన సభల పదవీకాలాన్ని అయిదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచారు. 

బి) IV(A) భాగం, XIV(A) భాగాలను కొత్తగా చేర్చారు.

సి) స్వరణ్‌సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 10 ప్రాథమిక విధులను రాజ్యాంగానికి చేర్చారు.

డి) లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ్యుల సీట్ల సంఖ్యను 2001 వరకు మార్పు చేయకూడదని నిర్ణయించారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి      3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ

16. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో రూపొందించారు? (52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా  దీన్ని చేశారు.)

1) చరణ్‌సింగ్‌     2) రాజీవ్‌గాంధీ      3) ఇందిరాగాంధీ    4)మొరార్జీదేశాయ్‌

జ:   రాజీవ్‌గాంధీ

17. ఆర్టికల్‌ 352 ద్వారా విధించే ‘జాతీయ అత్యవసర పరిస్థితి’కి సంబంధించి ‘అంతర్గత అల్లకల్లోలాలు’(Internal Distrurbances) అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సాయుధ తిరుగుబాటు (Armed Rebellion) అనే పదాన్ని కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?

1) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976     2) 43వ రాజ్యాంగ చట్టం, 1977 

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978      4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980 

జ: 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 

18. భారత రాజ్యాంగంలో ‘కేబినెట్‌’ (Cabinet) అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 

1) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978    2) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980 

3) 46వ రాజ్యాంగ సవరణ చట్టం, 1983    4) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977 

జ: 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

19. కేంద్ర కేబినెట్‌ ‘లిఖిత పూర్వక’ సలహా మేరకే రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని  కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 47వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984      2) 46వ రాజ్యాంగ సవరణ చట్టం, 1982 

3) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980      4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

జ: 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

20. భూసంస్కరణలకు సంబంధించిన 14 కొత్త చట్టాలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చారు? 

1) 46వ రాజ్యాంగ సవరణ చట్టం, 1982      2) 47వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984 

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978      4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980 

జ: 47వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984 

21. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 33ని సవరించి ‘సాయుధ దళాల’ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించారు?

1) 51వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984     2) 50వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984

3) 49వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984      4) 48వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984

జ:  50వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984

22. 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా కింది ఏ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చారు?

1) 7వ షెడ్యూల్‌     2) 8వ షెడ్యూల్‌       3) 9వ షెడ్యూల్‌     4) 10వ షెడ్యూల్‌

జ: 10వ షెడ్యూల్‌

23. ‘పార్టీ ఫిరాయింపుల’ నిరోధక చట్టం గురించిన సమగ్ర వివరణను 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 10    2) 7     3) 5    4) 4

జ: 10

24. వివిధ రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రులకు సంబంధించి సరైన జతను గుర్తించండి?

ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976     - ఇందిరాగాంధీ

బి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978     - మొరార్జీ దేశాయ్‌

సి) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975     - ఇందిరాగాంధీ

డి) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975     - ఇందిరాగాంధీ

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి       3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ

మరికొన్ని..

1. ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో  ప్రాథమిక హక్కులను ఉల్లంఘించిన్పటికీ, ఆదేశిక సూత్రాలే అంతిమంగా చెల్లుబాటు అవుతాయని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించారు?

1) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976      2) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977     

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978     4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980

జ:  42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

2. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆర్టికల్స్‌ 323(A), 323(B) లను కొత్తగా చేర్చారు.

బి) ఆర్టికల్స్‌ 323(A) ద్వారా పరిపాలనా ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు.

సి) ఆర్టికల్, 323(B) ద్వారా పన్నులు, భూసంస్కరణలు, పట్టణ భూపరిమితికి సంబంధించిన ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు.

డి) విద్య (education) ను రాష్ట్రజాబితా నుంచి ఉమ్మడి జాబితాకి బదిలీ చేశారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి      3) బి, సి, డి     4) పైవన్నీ

జ:  పైవన్నీ    

3. 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) కి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 368(4) ప్రకారం, రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదని నిర్ణయించారు.

బి) న్యాయస్థానాలకు ఉండే ‘న్యాయసమీక్ష అధికారం’ (Judicial Review) తొలగించారు.

సి) కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు.

డి) ఆర్టికల్‌ 352 ప్రకారం, భారత రాష్ట్రపతి ‘జాతీయ అత్యవసర పరిస్థితిని దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధించవచ్చు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ   

4. న్యాయస్థానాలకు ఉండే ‘న్యాయ సమీక్ష (Judicial Review)  అధికారాన్ని కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పునరుద్ధరించారు?

1) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977     2) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

3) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980     4) 46వ రాజ్యాంగ సవరణ చట్టం, 1980

జ:  43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977  

5. 44వ రాజ్యాంగ చట్టం, 1978కి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ‘ఆస్తిహక్కు’ను తొలగించారు.

బి) లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల పదవీకాలాన్ని 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు.

సి) ఆర్టికల్‌ 19 (1)(f), ఆర్టికల్‌ 31 ని రద్దు చేశారు.

డి) ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు. 

1) ఎ, బి, డి    2) ఎ, బి, సి    3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ:  ఎ, బి, సి   

Posted Date : 13-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం -  అభివృద్ధి క్రమం - III  

1. ‘‘మడ్డీమాన్‌ కమిటీ - 1924’’కి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ‘‘మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919’’ అమలు తీరును సమీక్షించేందుకు ఉద్దేశించింది.

బి) అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఈ కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు.

సి) ఈ కమిటీ ద్వంద్వ పాలనను సమర్థించింది.

డి) ఏకాభిప్రాయంతో తన నివేదికను సమర్పించింది

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి   3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: ఎ, బి, సి

2. ‘‘సైమన్‌ కమిషన్‌ - 1927’’కి సంబంధించి సరైంది?

ఎ) సర్‌ జాన్‌ సైమన్‌ నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు.

బి) ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నాటి బ్రిటన్‌ ప్రధాని బాల్డ్విన్‌

సి) ఈ కమిషన్‌లో ఉన్న ఏకైక భారతీయుడు తేజ్‌బహదూర్‌ సప్రూ

డి) 1930లో ఇది నివేదికను సమర్పించింది

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి     3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: ఎ, బి, డి   

3. సైమన్‌ కమిషన్‌ నివేదికలోని అంశాలను గుర్తించండి.

ఎ) భారత్‌లో సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలి.

బి) భాషా ప్రాతిపదికన ఒడిశా, సింధూ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.

సి) భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కుల నిరాకరణ సమంజసమే.

డి) హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను కల్పించాలి.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ

4. బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాలు) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సిఫార్సు చేసేందుకు 1927లో ఏర్పాటైన ‘‘భారత రాజ్యాల కమిటీ’’కి ఎవరు నేతృత్వం వహించారు?

1) సర్‌ జాన్‌ సైమన్‌    2)  హార్‌కోర్ట్‌ బట్లర్‌    3) హాల్‌ వర్త్‌        4) పరంజపే

జ: హార్‌కోర్ట్‌ బట్లర్‌

5. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని 1927, నవంబరు 14న ప్రకటించిన అప్పటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు?

1) శ్రీనివాస అయ్యంగార్‌    2) మోతీలాల్‌ నెహ్రూ 

3) దాదాభాయ్‌ నౌరోజీ       4) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

జ: శ్రీనివాస అయ్యంగార్‌

6. ‘‘భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా?’’ అని 1927, నవంబరు 24న బ్రిటిష్‌ ఎగువసభలో సవాలు విసిరిన నాటి భారత రాజ్యకార్యదర్శి ఎవరు?

1) లార్డ్‌ మార్లే     2) జాన్‌ వెల్లింగ్టన్‌    3) లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌       4) లార్డ్‌ టేలర్‌

జ:  లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌   

7. 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు?

1) మోతీలాల్‌ నెహ్రూ     2) లాలా లజపతిరాయ్‌

3) సర్‌ తేజ్‌బహదూర్‌ సప్రూ   4) శ్రీనివాస అయ్యంగార్‌

జ: మోతీలాల్‌ నెహ్రూ

8. 1929, అక్టోబరు 31న దీపావళి ప్రకటనను ఎవరు వెలువరించారు?

1) లార్డ్‌ మన్రో     2) లార్డ్‌ ఇర్విన్‌     3) చార్లెస్‌ మెట్‌కాఫ్‌    4) లార్డ్‌ వెస్లీ 

జ: లార్డ్‌ ఇర్విన్‌

9. లండన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాల నిర్వహణకు(1930-1932) శ్రీకారం చుట్టిన బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

1) రాంసే మెక్‌డొనాల్డ్‌     2) విన్‌స్టన్‌ చర్చిల్‌     3) క్లెమెంట్‌ అట్లీ      4) బాల్డ్విన్‌

జ: రాంసే మెక్‌డొనాల్డ్‌ 

10. కింది వాటిలో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంబంధించి సరైంది?

ఎ) 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు నిర్వహించారు.

బి) 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

సి) డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ హాజరయ్యారు. 

డి) దీన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ (INC) బహిష్కరించింది.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ: పైవన్నీ

11. రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంబంధించి సరైంది?

ఎ) 1931, సెప్టెంబరు 7 నుంచి 1931, డిసెంబరు 1 వరకు జరిగాయి.

బి) భారత జాతీయ కాంగ్రెస్‌ (INC) తరపున గాంధీజీ ప్రాతినిధ్యం వహించారు.

సి) అల్ప సంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ, మహ్మద్‌ అలీ జిన్నా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

డి) ఈ సమావేశాన్ని బహిష్కరించిన గాంధీజీని అరెస్ట్‌ చేసి ఎరవాడ జైలులో బంధించారు. 

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి     3) ఎ, సి, డి     4) పైవన్నీ

జ:  ఎ, బి, డి

12. మైనార్టీ వర్గాల వారికిప్రాతినిధ్యం పెంచాలనే ఉద్దేశంతో 1932, ఆగస్టు 16న కమ్యూనల్‌ అవార్డ్‌ను ప్రకటించిన బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

1) రాంసే మెక్‌డొనాల్డ్‌     2) విలియం థాంప్సన్‌    3)  క్లెమెంట్‌ అట్లీ    4) విన్‌స్టన్‌ చర్చిల్‌

జ: రాంసే మెక్‌డొనాల్డ్‌

13. 1932, సెప్టెంబరులో ‘‘పూనా ఒడంబడిక’’ ఎవరి మధ్య జరిగింది?

1) గాంధీజీ - అంబేడ్కర్‌         2) క్లెమెంట్‌ అట్లీ - గాంధీజీ   3) గాంధీజీ - మహ్మద్‌ అలీ జిన్నా     4) గాంధీజీ - ఇర్విన్‌

జ: గాంధీజీ - అంబేడ్కర్‌   

14. కింది వాటిలో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంబంధించి సరైంది?

ఎ) 1932, నవంబరు 17 నుంచి 1932, డిసెంబరు 24 వరకు జరిగింది.

బి) 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

సి) సరోజినీ నాయుడు పాల్గొన్నారు.

డి) భారత జాతీయ కాంగ్రెస్‌ (INC) పాల్గొనలేదు

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి      3) ఎ, బి, డి    4) పైవన్నీ

జ: ఎ, బి, డి

15. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1935, ఏప్రిల్‌ 1     2) 1936, ఏప్రిల్‌ 1       3) 1937, ఏప్రిల్‌ 1    4) 1938, ఏప్రిల్‌ 1

 జ: 1937, ఏప్రిల్‌ 1  

16. ‘‘అమేరి - వేవెల్‌’’ ప్రణాళిక - 1945లోని అంశాన్ని గుర్తించండి.

ఎ) వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌ తాత్కాలిక జాతీయ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది.

బి) వైస్రాయ్‌ కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని ముఖ్యమైన అధికారి పదవిని భారతీయుడికి కేటాయించారు.

సి) భారతదేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేశారు.

డి) అటార్నీ జనరల్‌ పదవిని నూతనంగా ఏర్పాటు చేశారు.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) ఎ, సి, డి    4) పైవన్నీ

జ: ఎ, బి, సి  

మరికొన్ని...

1. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’కి సంబంధించి సరైంది?

ఎ) ఫెడరల్‌ జాబితాలో 59 అంశాలను పేర్కొన్నారు.

బి) రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి

సి) ఉమ్మడి జాబితాలో 36 అంశాలను పేర్కొన్నారు.

డి) అవశిష్ట జాబితాలో 22 అంశాలు ఉన్నాయి.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) ఎ, సి, డి    4) పైవన్నీ

జ: ఎ, బి, డి

2. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’కి సంబంధించి సరైంది?

ఎ) భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు.

బి) కొత్తగా ఒడిశా, సింధూ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

సి) రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్‌ జనరల్‌ పదవిని సృష్టించారు.

డి) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను (ఆర్బీఐ) ఏర్పాటు చేశారు.

1) ఎ, బి, డి      2) ఎ, సి, డి     3) ఎ, బి, సి    4) పైవన్నీ

జ: ఎ, సి, డి

3. ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మర్చిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం - 1935 గురించి ఎవరు వ్యాఖ్యానించారు?

1)  మహమ్మద్‌ అలీ జిన్నా     2)  జవహర్‌లాల్‌ నెహ్రూ  3) మహాత్మా గాంధీ     4) మోతీలాల్‌ నెహ్రూ

జ: జవహర్‌లాల్‌ నెహ్రూ

4. 1942, మార్చి 22న భారతదేశానికి క్రిప్స్‌ రాయబారాన్ని పంపిన బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

1) విన్‌స్టన్‌ చర్చిల్‌     2) రాంసే మెక్‌డొనాల్డ్‌     3) క్లెమెంట్‌ అట్లీ        4) బాల్డ్విన్‌

జ: విన్‌స్టన్‌ చర్చిల్‌

5. క్రిప్స్‌ ప్రతిపాదనలు అనేవి ‘‘దివాళా తీస్తున్న బ్యాంకుపై ముందు తేదీ వేసిన చెక్కు లాంటిది’’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ     2) సుభాష్‌ చంద్రబోస్‌     3) మహాత్మా గాంధీ        4) సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ

జ: మహాత్మా గాంధీ

6. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య సమన్వయాన్ని సాధించేందుకు 1944లో "The way out Pamphlet"  అనే కరపత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు?

1) చక్రవర్తుల రాజగోపాలాచారి   2) శ్రీనివాస అయ్యంగార్‌   3)  మహ్మద్‌ అలీ జిన్నా      4) సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌

జ: చక్రవర్తుల రాజగోపాలాచారి

7. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య సమన్వయాన్ని సాధించేందుకు 1945, జులైలో సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అప్పటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

1) లార్డ్‌ వేవెల్‌       2) లార్డ్‌ లిన్‌లిత్‌గో    3) లార్డ్‌ మౌంట్‌బాటన్‌   4) లార్డ్‌ వెల్లింగ్టన్‌

జ:  లార్డ్‌ వేవెల్‌

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  భారత రాజ్యాంగ రచన - స్వభావం

పరిపాలనకు పరమ శాసనం

ప్రజాస్వామ్య పాలనకు, అందరికీ ఆమోదనీయమైన, అనుకూలమైన చట్టాల రూపకల్పనకు, పౌర హక్కుల నిర్వచనానికి, సామాజిక న్యాయానికి, సంక్షేమానికి 

మౌలిక ఆధారం మన రాజ్యాంగం. ఎందరో మహానుభావుల మహోన్నత కృషితో రూపొందింది. దశాబ్దాల కాలపరీక్షలను దాటి ఇప్పటికీ, ఎప్పటికీ  తిరుగులేని పరమ శాసనంగా నిలిచింది. అంతటి అత్యున్నతమైన ఆ రాజ్యాంగ రచన జరిగిన విధానం, దాని స్వభావంపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నల సరళిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి. 

1. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) దేశ పరిపాలనను వివరించే అత్యున్నతమైన శాసనం.

బి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా.

సి) బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.

డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారత్‌.

జవాబు : ఎ, బి, సి, డి

2. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?

జవాబు : అరిస్టాటిల్‌ 

3. ‘స్వరాజ్‌’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?

జవాబు : యంగ్‌ ఇండియా  

4. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్‌ చేసిన భారతీయుడు?

జవాబు : మానవేంద్రనాథ్‌ రాయ్‌ 

5. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్‌ చేసింది. అది ఎక్కడ జరిగింది?    

జవాబు :  ఫైజ్‌పుర్‌  

6. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్‌’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : మహాత్మా గాంధీ

7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?

జవాబు : యంగ్‌ ఇండియా   

8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?

జవాబు : ఆగస్టు ప్రతిపాదనలు - 1940

9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?

జవాబు : క్రిప్స్‌ రాయబారం - 1942  

10. మహాత్మా గాంధీ కింద పేర్కొన్న దేన్ని ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’గా అభివర్ణించి తిరస్కరించారు?

1) ఆగస్టు ప్రతిపాదనలు - 1940          2) క్రిప్స్‌ రాయబారం - 1942 

3) మంత్రిత్రయ రాయబారం - 1946       4) సిమ్లా సమావేశం - 1944

జవాబు : క్రిప్స్‌ రాయబారం - 1942 

11. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?

జవాబు : లార్డ్‌ వేవెల్‌   

12.  బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?

జవాబు : 1946, మార్చి 24   

13. కిందివారిలో మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌లో లేని సభ్యులు?

1) పెథిక్‌ లారెన్స్‌   2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌    3) బిర్కెన్‌హెడ్‌    4) ఎ.వి.అలెగ్జాండర్‌

జవాబు : బిర్కెన్‌హెడ్‌ 

14. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) కేబినెట్‌ మిషన్‌ సిఫార్సుల మేరకు 1946లో జరిగాయి.     2) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

3) పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.     4) పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి.

 జవాబు : ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

15. రాజ్యాంగ పరిషత్‌కు నిర్దేశించిన ప్రాతినిధ్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

 1) బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది      2) స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది

3) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు       4) స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

జవాబు : స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

16. రాజ్యాంగ పరిషత్‌/రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరైన జతను గుర్తించండి.

a) స్వతంత్ర అభ్యర్థులు       i) 3

b) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌    ii) 73

c) ముస్లిం లీగ్‌     iii) 7

d) యూనియనిస్ట్‌ మహ్మదీయ పార్టీ     iv) 202

జవాబు : a - iii, b - iv, c - ii, d - i 

17. రాజ్యాంగ సభ ఎన్నికలకు (1946) సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య - 38    2) ఎస్సీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 26

3) ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23     4) రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య - 15

 జవాబు : ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23

18. కిందివారిలో రాజ్యాంగ సభకు విశిష్ట వ్యక్తులుగా నామినేట్‌ అయిన వారిలో లేనివారు? 

1) అనంతశయనం అయ్యంగార్‌    2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌      3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌    4) కె.టి.షా 

జవాబు : అనంతశయనం అయ్యంగార్‌  

19. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్‌ రసూల్‌.      2) రాజ్యాంగ సభకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా.

3) రాజ్యాంగ సభలో ప్రతి ప్రావిన్స్‌ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు.    4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289. 

జవాబు : స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289. 

20. హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు? 

జవాబు : 1948 నవంబరు    

21. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.

a) భారత్‌లో తొలి మహిళా గవర్నరు       i) సరోజిని నాయుడు

b) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి     ii) సుచేతా కృపలానీ 

c) భారత్‌లో తొలి మహిళా కేబినెట్‌ మంత్రి     iii) విజయలక్ష్మి పండిట్‌

d) యూఎన్‌ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలు     iv) రాజకుమారి అమృతకౌర్‌ 

జవాబు : a - i, b - ii, c - iv, d - iii 

22. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?

జవాబు : దుర్గాబాయి దేశ్‌ముఖ్‌   
 
23. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ మహిళ హంసామెహతాకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) రాజ్యాంగ సభ సమావేశాల్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించారు.    2) 1947 జులై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేశారు. 

3) 1, 2       4) రాజ్యాంగ సభకు రాజీనామా చేసిన ఏకైక మహిళ. 

జవాబు : 1, 2

24. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?

జవాబు : భోగరాజు పట్టాభి సీతారామయ్య

25. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ తెలుగు వ్యక్తులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. 

a) టంగుటూరి  ప్రకాశం పంతులు i) కర్నూలు సర్క్యులర్‌ రూపకర్త

b) నీలం సంజీవరెడ్డి      ii) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి

c) కళా వెంకట్రావు       iii) ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు

d) ఆచార్య ఎన్‌.జి.రంగా   iv) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి

జవాబు : a - ii, b - iv, c - i, d - iii  

26. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన ప్రయత్నాల్లో కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు - 11        2) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలు - 22

3) రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13         4) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం - రూ.64 లక్షలు

జవాబు : రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

అది ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ! 

భారత రాజ్యాంగ రచన వెనుక ఎందరో మేధావుల అపారమైన కృషి ఉంది. అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఎన్నో చర్చలు, జరిపి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఏర్పాటైన వివిధ కమిటీలు విస్తృత పరిశీలన, మేధోమథనంతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునిక, అభ్యుదయ, పురోగామి అంశాలతో రాజ్యాంగ స్వరూప స్వభావాలను మలిచాయి. ఈ మహాక్రతువు జరిగిన క్రమం, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖులు, వారి అభిప్రాయాలు, వ్యాఖ్యల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.

1. కింద పేర్కొన్న వాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌      2) రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా

3) రాజ్యాంగ సభకు ముఖ్య లేఖకుడు ఎస్‌.ఎన్‌.ముఖర్జీ      4) రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

జవాబు : రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

2.  బెనగళ నరసింగరావు (బి.ఎన్‌.రావు)కు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు సలహాదారుడిగా వ్యవహరించారు.      2) చిత్తు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు.

3) రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.       4) అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

జవాబు : రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

3. రాజ్యాంగ రూపకల్పనలో ‘రాజ్యాంగ సభ’ నిర్వహించిన విధులకు సంబంధించి కిందివాటిలో సరైంది? 

1) 1946, డిసెంబరు 9 నుంచి 1947, ఆగస్టు 15 మధ్య రాజ్యాంగ రచనా విధులను మాత్రమే నిర్వహించింది.  

2) 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబరు 26 మధ్య రాజ్యాంగ రచనా విధులతోపాటు దేశపాలనకు అవసరమైన శాసన రూపకల్పన విధులను నిర్వర్తించింది.

3) 1949, నవంబరు 26 నుంచి 1952, మే 13 మధ్య శాసన విధులను నిర్వర్తిస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. 

4) పైవన్నీ

జవాబు : పైవన్నీ 

4. రాజ్యాంగ రచన కోసం ‘రాజ్యాంగ సభ’ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి  అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a)  కేంద్ర రాజ్యాంగ కమిటీ      i) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

b) రాజ్యాంగ సలహా  సంఘం    ii) జవహర్‌లాల్‌ నెహ్రూ

c) రాజ్యాంగ ముసాయిదా  కమిటీ     iii) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

d)  ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ      iv) నళినీ రంజన్‌ సర్కార్‌

జవాబు : a - ii, b - i, c - iii, d - iv  

5. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు   చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?  

a) కేంద్ర ప్రభుత్వ  అధికారాల కమిటీ      i) జవహర్‌లాల్‌ నెహ్రూ

b) భాషా ప్రయుక్త ప్రాంతాలపై ఏర్పడిన కమిటీ    ii) ఎస్‌.కె.థార్‌

c) సుప్రీంకోర్టుపై ఏర్పడిన కమిటీ     iii) ఎస్‌.వరదాచారి అయ్యర్‌

d) జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ      iv) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

జవాబు :  a - i, b - ii, c - iii, d - iv   

6. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) ఆర్డర్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమిటీ     i) డాక్టర్‌ బాబూ  రాజేంద్రప్రసాద్‌

b) సభా కమిటీ     ii) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

c) క్రెడెన్షియల్‌ కమిటీ     iii) భోగరాజు పట్టాభి సీతారామయ్య

d) సాంఘిక, ఆర్థిక కమిటీ    iv) కె.ఎం.మున్షీ    

జవాబు : a - iv, b - iii, c - ii, d - i   
  
7. 1947, జనవరి 24న ఏర్పడిన రాజ్యాంగ సలహా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) దీనికి అధ్యక్షుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.     2) ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54.

3) ఈ కమిటీని 4 ఉప కమిటీలుగా వర్గీకరించారు.     4) కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

జవాబు : కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

8.  రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

 a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ     i) హెచ్‌.సి.ముఖర్జీ

b) అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ       ii) ఎ.వి.ఠక్కర్‌

c) ఈశాన్య రాష్ట్రాల  ఉప కమిటీ     iii) జె.బి.కృపలాని

d) అస్సాం ప్రాంతం మినహాయించి ఇతర   ప్రాంతాలపై ఏర్పడిన ఉప కమిటీ        iv) గోపీనాథ్‌ బార్డోలోయ్‌

జవాబు : a - iii, b - i, c - iv, d - ii
     
9. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా  కమిటీలో సభ్యులు కానివారు? 

జవాబు : కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ

10. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది? 

జవాబు : 1948, నవంబరు 4    

11. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాన్ని గుర్తించండి.

జవాబు : 1, 2     

12. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : ఎం.వి.పైలీ 

13. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరికానిది?

జవాబు : అల్పసంఖ్యాక వర్గాలు - కె.టి.షా, కె.ఎం.మున్షీ

14. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జత?

a) పారశీకులు    i) హెచ్‌.సి.ముఖర్జీ

b) యూరోపియన్లు    ii) హెచ్‌.పి.మోదీ

c) అల్పసంఖ్యాక వర్గాలు  iii) డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

d) అఖిల భారత   కార్మిక వర్గం   iv) ఫ్రాంక్‌ ఆంటోని 

జవాబు : a - ii, b - iv, c - i, d - iii  

15. కిందివాటిలో సరికానిది? 

1) ప్రారంభంలో రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 69 శాతం.

2) రాజ్యాంగ సభ నుంచి ముస్లింలీగ్‌ వైదొలగడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 82 శాతానికి చేరింది.

3) రాజ్యాంగ సభ సమావేశాల్లో అఖిల భారత షెడ్యూల్డు కులాల వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

4) రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌.

జవాబు : రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌. 

16. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

జవాబు : 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు

17. కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌. 

2) రాజ్యాంగ సభకు శాశ్వత ఉపాధ్యక్షులు హెచ్‌.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి.

3) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి హాజరైన సభ్యులు 208 మంది.

4) రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌. 

జవాబు : రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌. 

18. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జవాబు : 1946, డిసెంబరు 13    

19. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?

జవాబు : జవహర్‌లాల్‌ నెహ్రూ

20. జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానానికి సంబంధించి సరైంది?

జవాబు :  పైవన్నీ 

21. ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్‌ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?

జవాబు : మౌలానా హస్రత్‌ మొహాని 

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 3

సేకరించి.. మథించి.. సవరించి!

ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను శోధించి, సేకరించి, అందులోని ఆదర్శ విధానాలను, అనుసరణీయ లక్షణాలను అధ్యయనం చేసి, మథించి, అవసరమైన సవరణలు చేసి మన రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు నిర్దేశకాలుగా మార్చారు.  దేశ పరిస్థితులకు తగిన పాలనా ఏర్పాట్లను సంస్థాగతంగా సమకూర్చారు. వీటిపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన దేశాల నుంచి గ్రహించిన లక్షణాలు, రాజ్యాంగ నిర్మాణ సభ స్వరూపం, గొప్పతనం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

1. కిందివాటిలో సరికానిది?

1) ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణలు ప్రతిపాదించారు. 

2) ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

3) ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించినవారు హెచ్‌.వి.కామత్‌

4) రాజ్యాంగ సభ చర్చల్లో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు.

జవాబు : ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

2.  కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు జరిగాయి. 

2) ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది.

3) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించింది.

4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

జవాబు : ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

3.  మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?

జవాబు : నవంబరు 26  

4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?

జవాబు : లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్‌ తీర్మానం    

5. 1949, నవంబరు 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది?

జవాబు : అత్యవసర పరిస్థితి అధికారాలు

6.1950, జనవరి 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది?

జవాబు : షెడ్యూల్స్‌ 12

7. రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?

జవాబు : 1950, జనవరి 24  

8. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం? 

జవాబు : 1, 2 సరైనవి

9. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?

జవాబు : 284    

10.  భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

జవాబు : భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

11.   ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

జవాబు : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

12.  రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?

జవాబు : నందలాల్‌ బోస్‌   

13.  మన రాజ్యాంగ నిర్మాతలు ‘భారత ప్రభుత్వ చట్టం - 1935 ’ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

జవాబు : స్వేచ్ఛా, వాణిజ్య, వ్యాపార చట్టాలు    

14.  రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

జవాబు : దేశాధినేత పేరుమీదుగా పరిపాలన నిర్వహించడం

15.  రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

జవాబు : అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యం

16. రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది? 

జవాబు :  రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం
  
17. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత?  

a) ఉమ్మడి జాబితా    i) దక్షిణాఫ్రికా

b) న్యాయమూర్తుల తొలగింపు   ii) జపాన్‌

c) చట్టం నిర్ధారించిన పద్ధతి    iii) అమెరికా

d) రాజ్యాంగ సవరణ విధానం   iv) ఆస్ట్రేలియా

జవాబు : a - iv, b - iii, c - ii, d - i 

18.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

a) ప్రొటెం స్పీకర్‌ నియామకం     i) ఐర్లాండ్‌

b) ఆదేశిక సూత్రాలు      ii) ఫ్రాన్స్‌

c) రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం   iii) జపాన్‌

d) జీవించే హక్కు    iv) దక్షిణాఫ్రికా

జవాబు : a - ii, b - i, c - iv, d - iii

19. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

a) రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన      i) కెనడా

b) సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి       ii) ఫ్రాన్స్‌

c) దేశాధినేత పేరు మీదుగా  దేశ పరిపాలన నిర్వహణ  iii) ఆస్ట్రేలియా

d) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం     iv) అమెరికా

జవాబు : a - ii, b - i, c - iv, d - iii

20.  కిందివాటిలో భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

జవాబు : పైవన్నీ

21. మన దేశ సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన ‘యూరో - అమెరికన్‌’ నమూనాలో లేని అంశం?

జవాబు : పార్లమెంటు ఆధిక్యత

22.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : శిఖర్‌ మిశ్రా  

23.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్‌ గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : అవస్తీ, మహేశ్వరి

24. ‘ప్రాచీన కాలం నాటి సాంఘిక, ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

జవాబు : జవహర్‌లాల్‌ నెహ్రూ 
 
Posted Date : 10-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిల్లులు - వివరణ

చట్టాల తయారీలో సభాపర్వం!

ప్రజల ఆకాంక్షలు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఎప్పటికప్పుడు పార్లమెంటు కొత్త చట్టాలను  చేస్తుంది. ఒక చట్టాన్ని రూపొందించేందుకు ముందు ఉభయ సభల్లో ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లులు రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆ ప్రక్రియలపై, సాంకేతిక పదజాలంపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లులు, పబ్లిక్, ప్రైవేట్‌ బిల్లుల రకాలు, నిర్వచనాలు, సంబంధిత రాజ్యాంగ నిబంధనలు, మౌలికాంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. 

భారతదేశంలో ‘బిల్లులు’ పార్లమెంటులోని ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు అంగీకరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో ‘శాసనాలు’గా మారతాయి.

సాధారణ బిల్లులు:

ఆర్టికల్‌ 107: సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా మారుతుంది.

ఆర్టికల్‌ 108: రాష్ట్రపతి పలు సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

* ఒక సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించి, రెండో సభ తిరస్కరించినప్పుడు. 

* ఒక సభ ఆమోదించిన బిల్లును రెండో సభ 6 నెలలకుపైగా ఆమోదించకుండా నిలువరించినప్పుడు. 

* బిల్లులో ప్రతిపాదించిన సవరణల విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు. 

* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్‌ అందుబాటులో లేకపోతే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఆ వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

* పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం కేవలం సాధారణ బిల్లుల ఆమోద ప్రక్రియల సందర్భంలో మాత్రమే ఏర్పాటవుతుంది. ద్రవ్యబిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోద ప్రక్రియల్లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించాలంటే రెండు సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదో వంతు (10%) సభ్యుల కోరం ఉండాలి. సమావేశం నిర్వహణ లోక్‌సభలోని నియమావళి ప్రకారం ఉంటుంది. సమావేశంలో సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొని, సాధారణ మెజార్టీతో బిల్లులను ఆమోదిస్తే రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. అనంతరం ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టంగా మారుతుంది.

ద్రవ్య బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 110 ద్రవ్య బిల్లుల గురించి నిర్వచించింది. భారత సంఘటిత నిధిపై భారం మోపే ప్రతి బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటారు. రాష్ట్రపతి పూర్వానుమతితో ముందుగా లోక్‌సభలో మాత్రమే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి. దీనిని పబ్లిక్‌ బిల్లుగా పరిగణిస్తారు. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. రాజ్యసభ 14 రోజుల్లోగా ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని/ ఆమోదాన్ని తెలియజేయాలి.

ద్రవ్య బిల్లుపై రాజ్యసభ అధికారాలు:  ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు కేవలం నామమాత్రపు అధికారాలే ఉన్నాయి. ఈ బిల్లుపై రాజ్యసభ చర్చించవచ్చు. కొన్ని సిఫార్సులు చేయవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించవచ్చు. ‘ద్రవ్య బిల్లు’ను తిరస్కరించే అధికారంలేదా సవరించే అధికారం రాజ్యసభకు లేదు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయాన్ని వెల్లడించాలి. లేకపోతే బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపుతారు. 

*  ఆర్టికల్‌ 110(1) ప్రకారం పన్నుల విధింపు, రద్దు, తగ్గింపు, మార్పు చేయడం, క్రమబద్ధీకరించడం మొదలైన అంశాల్లో ఏ ఒక్క అంశం ఉన్నా దాన్ని ‘ద్రవ్య బిల్లు’గా పేర్కొంటారు.

* ఆర్టికల్‌ 110(2) ప్రకారం జరిమానాలు, లైసెన్స్‌ ఫీజులు, స్థానిక  స్వపరిపాలనా సంస్థలు విధించే సుంకాలు ఉన్నంత మాత్రాన దాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించరు. 

*  ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనే ప్రశ్న వచ్చినప్పుడు లోక్‌సభ స్పీకర్‌ తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆ అధికారం స్పీకర్‌కే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో లేదా పార్లమెంటులో సవాలు చేయడానికి వీల్లేదు. రాష్ట్రపతి కూడా దీనిపై ప్రశ్నించకూడదు. ప్రతి ద్రవ్య సంబంధ బిల్లుని ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. దీనిని మంత్రివర్గ సభ్యుడు మాత్రమే సభలో ప్రవేశపెట్టాలి. 

* ఆర్టికల్‌ 110(4)ను అనుసరించి ద్రవ్య బిల్లును ఆర్టికల్‌ 109 ప్రకారం రాజ్యసభకు పంపేటప్పుడు, ఆర్టికల్‌ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపేటప్పుడు సంబంధిత బిల్లును ద్రవ్య బిల్లుగా లోక్‌సభ స్పీకర్‌ ధ్రువీకరించాలి.

ఆర్థిక బిల్లు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ‘ఆర్థిక బిల్లులు’ అంటారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు.

మొదటి తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే నియమ నిబంధనలు ఉంటాయి. దీనిని రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. ఇది లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో ఓటింగ్‌కు వచ్చినప్పుడు సాధారణ బిల్లుగానే పరిగణించి, రాజ్యసభ కూడా లోక్‌సభతో సమానంగా అధికారాలను కలిగి ఉంటుంది. బిల్లును సవరించే ప్రక్రియను రాజ్యసభ సూచించవచ్చు లేదా బిల్లును తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అంగీకారం కుదరకపోతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

రెండో తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ఆర్టికల్‌ 110లో పేర్కొన్న అంశాలు ఉండవు. ఈ బిల్లును సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తరహా బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. నీ ద్రవ్య బిల్లులను, మొదటి తరగతి ఆర్థిక బిల్లులను కేవలం రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. 

* రెండో తరగతి ఆర్థిక బిల్లులను, సాధారణ బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధం లేకుండానే పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులో అయినా ప్రవేశపెట్టవచ్చు.

వార్షిక బడ్జెట్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ‘వార్షిక బడ్జెట్‌’(Anual Financial Statement) గురించి వివరిస్తుంది. బడ్జెట్‌ అనేది ఒక రకమైన ఆర్థిక బిల్లు. వార్షిక ఆదాయ, వ్యయాల అంచనాల విత్త పట్టికను ‘బడ్జెట్‌’ అంటారు. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ విధానం 1863 నుంచి కొనసాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను 1947లో నాటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె.షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. 1921లో విలియం ఆక్వర్త్‌ కమిటీ సూచనల మేరకు 1924 నుంచి సాధారణ వార్షిక బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు. 2017లో దెబ్రాయ్‌ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్‌ను వార్షిక బడ్జెట్‌లో విలీనం చేశారు.

* వార్షిక బడ్జెట్‌లో వ్యయ అంచనాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి 

1) భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు. 

2) భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు.

భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు: 

* రాష్ట్రపతి జీతభత్యాలు, రాష్ట్రపతి కార్యాలయ ఖర్చులు, రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ జీతభత్యాలు. 

*  సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్, హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్‌.నీ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలు, పెన్షన్‌.నీ భారత ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు, రుణాలపై వడ్డీ.

* ఏదైనా న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పును అమలు చేయడానికి అయ్యే ఖర్చులు, సుప్రీంకోర్టు, కాగ్, యూపీఎస్సీకి సంబంధించిన పాలనా ఖర్చులు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌లు.

భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు: 

పార్లమెంటులో బడ్జెట్‌ ద్వారా ప్రవేశపెట్టే ‘డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌’లో ఉండే 109 రకాల ఖర్చులపై ఓటింగ్‌ నిర్వహించవచ్చు. ఆ సందర్భంలో ఖర్చులు తగ్గించుకోమని సూచిస్తూ కోత తీర్మానాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఈ కోత తీర్మానాలు 3 రకాలుగా ఉంటాయి. అవి 

1) విధాన కోత తీర్మానం 

2) పొదుపు కోత తీర్మానం 

3) టోకెన్‌ కోత తీర్మానం.

వార్షిక బడ్జెట్‌ ఆమోదంలో 6 దశలు ఉంటాయి. అవి 

1) ప్రవేశ దశ 

2) సాధారణ చర్చ 

3) డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీల ద్వారా పరిశీలన 

4) గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్‌ 

5) ఉపకల్పన బిల్లు ఆమోదం 

6) ద్రవ్య బిల్లు ఆమోదం.

వార్షిక బడ్జెట్‌తో పాటు ఆమోదించే ఇతర గ్రాంట్లు: సాధారణ ఆదాయ, వ్యయ అంచనాలతో ఉండే వార్షిక బడ్జెట్‌తోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు కొన్ని ఇతర గ్రాంట్లను కూడా ఆమోదిస్తుంది. అవి  

1) అనుబంధ గ్రాంట్లు 

2) అదనపు గ్రాంట్లు 

3) ఎక్సెస్‌ గ్రాంట్లు 

4) నామమాత్రపు గ్రాంట్లు 

5) ఓట్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 19-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పౌరసత్వ సవరణ చట్టాలు 

పౌర ప్రమాణాలకు శాసన చట్రాలు!

పౌరసత్వం అంటే ఒక గుర్తింపు, హక్కు, అనేక ప్రయోజనాలను అందించే అర్హత. జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగిన ఈ పౌరసత్వ స్థితిని నిర్ణయించడానికి, అందించడానికి, రద్దు చేయడానికి భారత ప్రభుత్వం పలు ప్రమాణాలను పాటిస్తుంది. అందుకోసం అనేక చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు మార్పులుచేర్పులు, సవరణలు చేస్తుంటుంది. కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసే ఆ శాసన చట్రాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు ద్వంద్వ పౌరసత్వం, జాతీయ జనాభా పట్టిక తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

భారత పార్లమెంటు దేశ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు సవరణలు చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ మూలాలు ఉండి, ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను దేశ ప్రగతిలో భాగస్వాములను చేయడానికి ‘ద్వంద్వ పౌరసత్వం’ కల్పించే చట్టాన్ని కూడా చేసింది. 

భారత పౌరసత్వ సవరణ చట్టం-1986:  రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని సవరించింది. విదేశీయులు అక్రమంగా ఇక్కడి పౌరసత్వాన్ని పొందకుండా నియంత్రించేందుకు 1955లో రూపొందించిన భారత పౌరసత్వ చట్టాన్ని సవరించింది.

ముఖ్యాంశాలు: 

* నమోదు ద్వారా భారత పౌరసత్వాన్ని పొందాలంటే ఈ చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తి భారతదేశంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు.

* ఈ చట్టం ద్వారా ‘మహిళలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘వ్యక్తులు’ అనే పదాన్ని చేర్చారు. 

1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో భారతీయుడిని వివాహమాడిన విదేశీ ‘మహిళ’ అని పేర్కొన్నారు

* సహజ సిద్ధంగా భారత పౌరసత్వాన్ని పొందాలనుకునే విదేశీయులు ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 10 సంవత్సరాలు శాశ్వత స్థిరనివాసం ఉండాలని నిర్దేశించారు. 

*1955 నాటి భారత పౌరసత్వ చట్టంలో 5 సంవత్సరాలు శాశ్వత స్థిర నివాసం అని పేర్కొన్నారు).

భారత పౌరసత్వ సవరణ చట్టం-2003:  ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ సిఫార్సుల మేరకు దేశప్రగతిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేసే లక్ష్యంతో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు 2003లో ‘భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ)కు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు. దీని ఫలితంగా, వారు విదేశీ పౌరసత్వంతో పాటు భారతీయ పౌరసత్వాన్ని కూడా పొందారు. ఈ చట్టం ప్రకారం 2004లో 16 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మనదేశం భారతీయ పౌరసత్వాన్ని (ద్వంద్వ పౌరసత్వం) కల్పించింది. అవి.. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, గ్రీస్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, సైప్రస్, ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్‌. 

ప్రవాస భారతీయ దివస్‌:

  * గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని వదిలి, దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని 2003 నుంచి జనవరి 9ని ‘ప్రవాస భారతీయ దివస్‌’గా పాటిస్తున్నారు. 

* 2006, జనవరి 9న నిర్వహించిన ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను మినహాయించి, మిగిలిన అన్ని దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు. 

ద్వంద్వ పౌరసత్వం-ప్రయోజనాలు-పరిమితులు:

* ద్వంద్వ పౌర    సత్వాన్ని పొందిన ప్రవాస భారతీయులు భారతదేశంలో ఆస్తులను సంపాదించుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భారతీయ   పాస్‌పోర్టును పొందవచ్చు. విద్య, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారతీయులతో సమానమైన అవకాశాలు ఉంటాయి. అయితే ప్రవాస భారతీయులు ఎన్నికల్లో పోటీ చేయడానికి, రాజ్యాంగ అత్యున్నత పదవులను చేపట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారతీయులతో సమానంగా అవకాశాలు పొందే హక్కు లేదు. 

* 2010, జనవరి 1 నుంచి ప్రవాస భారతీయులకు మనదేశంలో ఓటు హక్కు కల్పించారు.

* ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 2004లో ఏర్పాటు చేశారు.

ద్వంద్వ పౌరసత్వాన్ని పొందే పద్ధతులు:

1) భారతీయ సంతతి వ్యక్తుల పథకం (పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌): 

* 1999, మార్చిలో భారత ప్రభుత్వం ‘పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’ (పీఐఓ) కార్డు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. దీనిని 2002, సెప్టెంబరు 15న పునః సమీక్షించి కొత్త పీఐఓ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 

* పీఐఓ కార్డు పొందడానికి ప్రవాస భారతీయులు అర్హులు. పెద్దలు రూ.15,000, 18 ఏళ్ల లోపు పిల్లలు రూ.7,500 చెల్లించాలి. ఈ కార్డు కాలపరిమితి 15 ఏళ్లు. దీన్ని 6 నెలలకోసారి పునరుద్ధరించుకోవాలి.

* బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, పాకిస్థాన్‌లలోని ప్రవాస భారతీయులకు పీఐఓ కార్డులు మంజూరు చేయరు.

* పీఐఓ కార్డు పొందినవారికి మనదేశంలో వ్యాపార, వాణిజ్య హక్కులు; విద్య, స్థిర నివాసానికి సంబంధించిన హక్కులు ఉంటాయి. కానీ రాజకీయ హక్కులు లభించవు. 

2) ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం (ఓసీఐ):

* 2003 భారత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా పథకం’ (ఓసీఐ) కార్డులను ప్రవేశపెట్టారు.2004 నుంచి పీఐఓ కార్డుల స్థానంలో ఓసీఐ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

* ఈ కార్డును పొందినవారు భారతదేశాన్ని సందర్శించడానికి ‘వీసా’ పొందాల్సిన అవసరం లేదు.

* 5 సంవత్సరాలు ఓసీఐగా కొనసాగిన ప్రవాస భారతీయులు భారతదేశంలో 2 సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడిపితే భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.

*1950, జనవరి 26 తర్వాత భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్లినవారికి ఓసీఐ కార్డు ఇస్తారు. 

భారత పౌరసత్వ సవరణ చట్టం-2015: 

* 2015, మార్చి 10న రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ‘భారత పౌరసత్వ సవరణ చట్టం-2015’ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పౌరసత్వ చట్టం 1955లోని 7A, 7B, 7C, 7D సెక్షన్లలో మార్పులు చేశారు. 

భారత పౌరసత్వ సవరణ చట్టం-2019:

* భారత పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు 2019, డిసెంబరు 12న పార్లమెంటు ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను ఆమోదించింది. తర్వాత అది సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ)గా అమల్లోకి వచ్చింది.

* ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి శరణు కోరివచ్చే ముస్లిమేతరులైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు భారత పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. 2014, డిసెంబరు 31 కంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.

* పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వలసవచ్చిన ముస్లింలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం భారత పౌరసత్వం లభించదు.

* అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయలను మినహాయించారు.

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌):

* దేశంలోని ప్రతి పౌరుడి వివరాలను సేకరించి ‘జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)’ను రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ప్రజల డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్‌ వివరాలను సేకరిస్తారు. ప్రభుత్వం 2010లో ఎన్‌పీఆర్‌ కోసం ప్రజల వివరాలను సేకరించింది. 2011 జనాభా గణాంకాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు.

* 2010లో ‘జాతీయ జనాభా పట్టిక’ రూపకల్పనలో భాగంగా 15 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. 2020-21లో జాతీయ జనాభా పట్టిక రూపకల్పనలో భాగంగా 21 అంశాలతో కూడిన వివరాలను నమోదు చేశారు.

* 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ కోసం దేశంలో పౌరులు ఎవరైనా ఒక ప్రాంతంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం నివాసం ఉంటే వారంతా తప్పనిసరిగా ‘జాతీయ జనాభా పట్టిక’లో పేరు నమోదు చేయించుకోవాలని నిర్దేశించారు. 

జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ):

* 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరులుగా అర్హత సాధించిన వారి సమగ్ర సమాచారాన్ని ఎన్‌ఆర్‌సీలో నమోదు చేస్తారు. ఎన్‌ఆర్‌సీ అనేది ఒక చట్టబద్ధమైన భారతీయ పౌరుల అధికారిక రికార్డు.

* 1951లో జరిగిన భారత జనాభా గణాంకాల సేకరణ తర్వాత మొదటిసారిగా ఎన్‌ఆర్‌సీ రూపొందింది.

* అస్సాంలో ఎన్‌ఆర్‌సీని రూపొందించడం తప్పనిసరని భారత పౌరసత్వ సవరణ చట్టం - 2003లో పేర్కొన్నారు.

* అస్సాం రాష్ట్రంలో చేపట్టిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ తుది జాబితా 2019, ఆగస్టు 31న విడుదలైంది. దాని ప్రకారం అస్సాం పౌరుల్లో 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కలేదు. వారిని ఇకపై విదేశీయులుగా గుర్తిస్తారు. 

అస్సాం ఒప్పందం-1985: 

* 1971, మార్చి 24 తర్వాత అస్సాంకి వచ్చిన విదేశీయులను మతంతో సంబంధం లేకుండా బయటకు పంపాలని 1985లో జరిగిన ‘అస్సాం ఒప్పందం’లో పేర్కొన్నారు.

* ఈ ఒప్పందాన్ని కొత్త పౌరసత్వ సవరణబిల్లు ఉల్లంఘిస్తోందని నిరసనలు చెలరేగాయి. 

సుప్రీంకోర్టు తీర్పు:

డేవిడ్‌ జాన్‌ హాప్‌కిన్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు-1997: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విదేశీయులకు పౌరసత్వాన్ని ఇచ్చే విషయంలో భారతదేశం విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుందని, విదేశీయులు మనదేశ పౌరసత్వాన్ని పొందడమనేది ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని పేర్కొంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగ సవరణ విధానం

ప్రగతి సాధక మార్పు మంచిదే! 

చట్టాలు దేశ ప్రగతికి సాధనాలుగా ఉపయోగపడాలి. ప్రజాస్వామ్య పరిణామాలకు, నిబద్ధతకు ప్రతిబింబాలుగా నిలవాలి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ సమకాలీన సామాజిక, రాజకీయ గతిశీలతకు అనుగుణంగా ఉండాలి. అభివృద్ధికి అవరోధాలుగా మారకూడదు.  ఈ లక్ష్యంతో అసలు సవరించకపోతే సమస్యలు ఎదురవుతాయి, మారుస్తూ కూర్చుంటే మౌలిక స్వరూపమే మారిపోవచ్చనే ఆందోళనల మధ్య సమర్థ సవరణ విధానాలను భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. పౌరుల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతూ స్థిరత్వం, పురోగతి మధ్య సమతౌల్యతను సాధించే విధంగా వాటిని రూపొందించారు. ఈ అంశాలను సంబంధిత ఆర్టికల్స్, సుప్రీంకోర్టు తీర్పులతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రజల అవసరాలకు ప్రతిస్పందించగలిగినట్లుగా ప్రస్తుతం అనుసరిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రక్రియను తీర్చిదిద్దిన తీరును అర్థం చేసుకోవాలి.

‘‘ ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేని విధంగా తయారు చేస్తే, అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచం కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగు పెడుతుంటే, మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రూపొందించిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలి. ’’

- జవహర్‌లాల్‌ నెహ్రూ (నాటి రాజ్యాంగ పరిషత్తు చర్చలో) 

ఆధునిక యుగంలో భారత ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్ని సవరించే సర్వాధికారం రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. అందుకోసం సవరణ విధానాలను, ప్రక్రియలను, నియమాలను నిర్దేశించారు.

రాజ్యాంగ వివరణ :  భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్‌ 368లో భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరించారు. సంబంధిత బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఆమోదించే క్రమంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ బిల్లులు వీగిపోతాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టాలుగా అమల్లోకి వస్తాయి. 

1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందాయి. వీటి ద్వారా ఆర్టికల్‌ 368లో మార్పులు, చేర్పులు జరిగాయి.

రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ బిల్లుల ఆమోద విషయమై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపడం, తిరస్కరించడం కుదరదు. తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.

దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం :  రాజ్యాంగాన్ని సవరించే విధానం కఠినంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదా: అమెరికా రాజ్యాంగం. అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ దేశ శాసన వ్యవస్థ (కాంగ్రెస్‌) 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు, ఆ దేశంలోని 3/4వ వంతు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.

 రాజ్యాంగాన్ని సవరించే విధానం సులభంగా ఉంటే అది అదృఢ రాజ్యాంగం. ఉదా: బ్రిటన్‌ రాజ్యాంగం. బ్రిటన్‌ దేశంలో పార్లమెంటు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఎలాంటి అంశాన్నయినా సవరిస్తుంది.  

 రాజ్యాంగ పరిషత్తులో భారత రాజ్యాంగం ఏవిధంగా ఉండాలనే అంశంపై విస్తృతమైన చర్చ జరిగింది. గోపాలస్వామి అయ్యంగార్‌ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు దృఢ రాజ్యాంగం ఉండాలంటే, జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు అదృఢ రాజ్యాంగం ఉండాలని సూచించారు. చివరకు రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు.

‣ రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.

గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ :  మన రాజ్యాంగ సవరణ ప్రక్రియ దక్షిణాఫ్రికా అంత సరళం కాదు. అమెరికా తరహాలో అత్యంత దృఢమైన విధానం కాదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ను అనుసరించారు.

 సవరణ విధానం దృఢంగా ఉంటే కాలమాన పరిస్థితులకు వీలుగా మార్పులు కుదరవు. అదృఢంగా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.

సవరణ పద్ధతులు : రాజ్యాంగాన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం మూడు రకాల పద్ధతుల ద్వారా పార్లమెంటు సవరిస్తుంది.

1) సాధారణ మెజార్టీ పద్ధతి: సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది (50% +) ఆమోదంతో రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించవచ్చు. అవి

ఆర్టికల్‌ 3- రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ

ఆర్టికల్‌ 100 (3)- పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కోరంలో మార్పులు, చేర్పులు

ఆర్టికల్‌ 102- పార్లమెంటు సభ్యుల అర్హతలు, అనర్హతలు నిర్ణయించడం.

ఆర్టికల్‌ 105- పార్లమెంటు సభ్యుల సభా హక్కులు.

ఆర్టికల్‌ 106- పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు.

ఆర్టికల్‌ 120- పార్లమెంటులో ఆంగ్ల భాష వినియోగం.

ఆర్టికల్‌ 169- రాష్ట్ర శాసనసభలో విధాన పరిషత్తు ఏర్పాటు/రద్దు.

2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు.

5వ, 6వ షెడ్యూళ్లలోని షెడ్యూల్డ్‌ జాతులు, షెడ్యూల్డ్‌ తెగల పరిపాలనాంశాలు.

 3వ షెడ్యూల్‌లోని రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం.

 2వ భాగంలోని పౌరసత్వ విషయాలు.

 ఆర్టికల్‌ 82- నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ

 ఆర్టికల్‌ 124 (1)- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య.

 ఆర్టికల్‌ 239 (ఎ)- కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ, మంత్రిమండలి ఏర్పాటు.

 ఆర్టికల్‌ 343-కేంద్రం అధికార భాషను నిర్ణయించడం.

2) ప్రత్యేక మెజార్టీ పద్ధతి: ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై, ఓటు వేసిన వారిలో 2/3వ వంతు ఆమోదిస్తే రాజ్యాంగ సమాఖ్య లక్షణాలను సవరించవచ్చు. అవి

రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 మధ్య ఉన్న ప్రాథమిక హక్కులు.

రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య ఉన్న ఆదేశిక సూత్రాలు.

 రాజ్యాంగ 4(ఎ) భాగంలో ఆర్టికల్‌ 51 (ఎ)లోని ప్రాథమిక విధులు.ః మొదటి, మూడు పద్ధతుల్లో పేర్కొననివి.

3) ప్రత్యేక మెజార్టీ, రాష్ట్రాల ఆమోదం: పార్లమెంటు ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు దేశంలోని సగానికంటే (1/2వ వంతు) ఎక్కువ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.. ఈ పద్ధతి ద్వారా పలు అంశాలను సవరించే వీలుంది.అవి -

ఆర్టికల్‌ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్‌ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

 ఆర్టికల్‌ 73 - కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు

 ఆర్టికల్‌ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

 ఆర్టికల్‌ 241 - కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టుల అంశాలు.

 ఆర్టికల్‌ 137 - సుప్రీంకోర్టు తీర్పులపై పునఃసమీక్ష.

 11వ భాగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (శాసన, పరిపాలన సంబంధాలు)

 ఆర్టికల్‌ 131 - సుప్రీంకోర్టు ఒరిజినల్‌ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

ఆర్టికల్‌ 368- రాజ్యాంగ సవరణ విధానంలో మార్పులు, చేర్పులు.

 4వ షెడ్యూల్‌లో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాలు.

 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన మూడు రకాల అధికారాల విభజన.ః 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

 12వ షెడ్యూల్‌లోని పట్టణ, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు కొత్తగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని పేర్కొంది.

 గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.

కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973): ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకు ఉన్న అధికారాలపై హేతుబద్ధమైన పరిమితులను పేర్కొంది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా జరగాలని చెప్పింది. ఆ సందర్భంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌. సిక్రీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అంతర్భాగమని పేర్కొన్నారు. ః ఎస్‌.ఆర్‌. బొమ్మై కేసు (1994)లో సుప్రీంకోర్టు లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.

రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోతే : రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైనా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం పొందాలి. ఈ బిల్లులు లోక్‌సభలో వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో సాధారణ మెజార్టీ కూడా సాధించడంలో విఫలమైతే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

విద్యా ఉద్యోగ సమాచారం

నమూనా ప్రశ్నపత్రాలు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌