• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్ ర‌సాయ‌న‌శాస్త్రం

1. విద్యుద్విశ్లేష్య వియోజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?

1) అర్హీనియస్‌     2) కోల్‌రాష్‌       3) గిబ్స్‌         4) గ్రిగ్నార్డ్‌ 


2. విద్యుద్విశ్లేషణ నియమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) కోల్‌రాష్‌         2) ఫారడే        3) అర్హీనియస్‌         4) నెల్సన్‌


3. కింది అంశాలను జతపరచండి.

జాబితా - 1                                జాబితా -2

a) విద్యుత్‌ చాలకబలం            i) ఓమ్‌

b) విశిష్ట వాహకత                     ii) వోల్ట్‌

c) విద్యుత్‌ వాహకత                 iii) ఓమ్‌-1. మీ-1.

d) విద్యుత్‌ నిరోధం                  iv) ఓమ్‌-1

1) a-ii b-iii c-i d-iv          2) a-i b-iv c-iii d-i 

3) a-ii b-iii c-iv d-i         4) a-iii b-ii c-iv d-i


4. కింది వాటిలో విద్యుత్‌ అవిశ్లేష్యక పదార్థం కానిది?

1) సుక్రోజ్‌        2) యూరియా     3) గ్లూకోజ్‌        4) నత్రికామ్లం


5. కింది వాటిలో క్షయకరణకు ఉదాహరణ ఏది?

1) Zn  Zn+2 + 2e-

2) Zn Zn++ e-

3) Cu+2 + 2e Cu

4)Fe Fe+2 + 2e-
 

6. డేనియల్‌ ఘటంలో ఉపయోగించే ఎలక్ట్రోడ్‌లు ఏవి?

1) జింక్‌ ఎలక్ట్రోడ్, కాపర్‌ ఎలక్ట్రోడ్‌ 

2) అల్యూమినియం ఎలక్ట్రోడ్, కాపర్‌ ఎలక్ట్రోడ్‌

3) సిల్వర్‌ ఎలక్ట్రోడ్, కాపర్‌ ఎలక్ట్రోడ్‌ 

4) కాపర్‌ ఎలక్ట్రోడ్, మెర్క్యూరీ ఎలక్ట్రోడ్‌


7. డేనియల్‌ ఘటంలో కాథోడ్‌ వద్ద ఏ ప్రక్రియ జరుగుతుంది?

1) ఆక్సీకరణం        2) క్షయకరణం       3) తటస్థీకరణం        4) 1, 2


8. కింది పటంలో A, B, C లను గుర్తించండి.

1) A - వాహకాలు, B - అవాహకాలు, C - అర్ధవాహకాలు

2) A - వాహకాలు, B - అర్ధవాహకాలు, C - అవాహకాలు 

3) A - అవాహకాలు, B - వాహకాలు, C - అర్ధవాహకాలు

4) A - అర్ధవాహకాలు, B - అవాహకాలు, C - వాహకాలు


9. విద్యుత్‌ కరెంట్‌ను కొలిచేందుకు ఉపయోగించే సాధనం ఏది?

1) పొటెన్షియోమీటర్‌      2) అమ్మీటర్‌      3) వోల్ట్‌మీటర్‌      4) పెరిస్కోప్‌


10. విద్యుత్‌ పొటెన్షియల్‌కు ప్రమాణం ఏమిటి?

1) ఓమ్‌        2) వోల్ట్‌        3) కెల్విన్‌        4) ఆంపియర్‌


11. కిందివాటిలో అధమ విద్యుత్‌ వాహకం ఏది?

1) వెండి        2) రాగి        3) బంగారం        4) సీసం (లెడ్‌)


12. లోహాలు మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకాలు. దీనికి కారణం?

1) లోహాల్లో స్వేచ్ఛగా సంచరించే ప్రోటాన్లు ఉంటాయి.

2) లోహాల్లో స్వేచ్ఛగా సంచరించే ఎలక్ట్రాన్లు ఉంటాయి.

3) లోహాలకు అధిక ద్రవీభవన స్థానం ఉంటుంది.

4) 1, 2


13. గాల్వానిక్‌ ఘటం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

1) రసాయన శక్తి, విద్యుత్‌ శక్తిగా మారడం

2) యాంత్రిక శక్తి, విద్యుత్‌ శక్తిగా మారడం

3) విద్యుత్‌ శక్తి, యాంత్రిక శక్తిగా మారడం

4) రసాయన శక్తి, యాంత్రిక శక్తిగా మారడం


14. డేనియల్‌ ఘటంలో ఉపయోగించే విద్యుద్విశ్లేష్యకాలు ఏవి?

1) జింక్‌ సల్ఫేట్‌           2) కాపర్‌ సల్ఫేట్‌ 

3) 1, 2                 4) హైడ్రోజన్‌ వాయువు


15. లెడ్‌ నిక్షేప బ్యాటరీల్లో ఉపయోగించే ఆమ్లం?

1) నత్రికామ్లం (HNO3)

2) గంధకీకామ్లం (H2SO4)

3) ఎసిటిక్‌ ఆమ్లం (CH3cOOH)

4) జింక్‌ సల్ఫేట్ (ZnSO4)


16. అతివాహకతను (Superconductivity) కనుక్కున్న శాస్త్రవేత్త?

1) థామస్‌ ఆల్వా ఎడిసన్‌           2) మైఖేల్‌ ఫారడే       

3) కామర్లింగ్‌ ఓన్స్‌               4) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌


17. విద్యుత్‌ హీటర్‌లో ఉపయోగించే ఫిలమెంట్‌ ఏది?

1) టంగ్‌స్టన్‌      2) నిక్రోమ్‌      3) సిలికాన్‌        4) పైవన్నీ


18. నిక్రోమ్‌ తీగ లక్షణం?

1) అధిక ద్రవీభవన స్థానం, అధిక నిరోధం

2) అధిక ద్రవీభవన స్థానం, అల్ప నిరోధం

3) అల్ప ద్రవీభవన స్థానం, అధిక నిరోధం

4) అల్ప ద్రవీభవన స్థానం, అల్ప నిరోధం


19. సాధారణ అనార్ధ్ర ఘటం ఎంత పొటెన్షియల్‌ను సమకూరుస్తుంది?

1) 0.5V      2) 1.0V     3) 1.5V     4) 3.0V


20. కింది వాటిలో ప్రాథమిక ఘటం ఏది?

1) అనార్ధ్ర ఘటం        2) లెక్లాంచి ఘటం

3) 1, 2    4) లిథియం అయాన్‌ ఘటం


21. అనార్ధ్ర ఘటంలో ఆక్సీకరణ చర్య ఎక్కడ జరుగుతుంది?

1) జింక్‌ పాత్ర      2) గ్రాఫైట్‌ కడ్డీ       3) 1, 2        4) కాపర్‌ కడ్డీ


22. కిందివాటిలో సెకండరీ బ్యాటరీకి ఉదాహరణ?

1) అనార్ధ్ర ఘటం           2) లిథియం అయాన్‌ బ్యాటరీ

3) లెడ్‌ నిక్షేప బ్యాటరీ     4) 2, 3


23. కిందివాటిలో లోహక్షయానికి గురికాని లోహం ఏది?

1) జింక్‌        2) టంగ్‌స్టన్‌        3) ఇనుము        4) పైవన్నీ


సమాధానాలు
1-1 2-2 3-3 4-4 5-3 6-1 7-2 8-1 9-2 10-2 11-4 12-2 13-1 14-3 15-2 16-3 17-2 18-1 19-3 20-3 21-1 22-4 23-2

Posted Date : 17-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌