• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

* ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి రేటు (ప్రొడక్టివిటీ రేట్‌)ని యూనిట్‌ ఏరియాలో జీవ ద్రవ్యరాశి ఉత్పత్తిగా నిర్వచిస్తారు.

ఆవరణ వ్యవస్థలో ఒక యూనిట్‌ ఏరియాలో కర్బన పదార్థం ఉత్పత్తి చేసే శక్తిని గ్రాస్‌ ప్రైమరీ ప్రొడక్టివిటీ (జీపీపీ)గా నిర్వచిస్తారు.

ప్రథమ వినియోగదారుల కోసం ఉత్పత్తిదారులు మిగిల్చిన శక్తిని నెట్‌ ప్రైమరీ ప్రొడక్టివిటీ (ఎన్‌పీపీ)గా పిలుస్తారు.

వినియోగదారులు కొత్త రకమైన జీవ ద్రవ్యరాశిని ఉత్పత్తి చేసే సమయంలో విడుదలైన శక్తిని ద్వితీయ ప్రొడక్టివిటీ అంటారు.

* పెరుగుతున్న మానవ జనాభా అవసరాలైన ఆహారం, కలప, పశుగ్రాసం, నారలు, ఎరువులు మొదలైన వాటి కోసం సహజ అటవీ ప్రాంతానికి దూరంగా మానవులు పెంచే అడవులను సామాజిక అటవీ వ్యవస్థ అంటారు.

* బూడిద వర్ణ విప్లవం ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది.


1. భారతదేశంలో ‘ప్లాంట్‌ టిష్యూ కల్చర్‌’ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) ఎస్‌.సి.మహేశ్వరి  2) రాందేవ్‌ మిశ్రా     3) అరిస్టాటిల్‌      4)  మెండల్‌ 


2. బయో జియో కెమికల్‌ సైకిల్స్‌లో గ్రీన్‌ హౌస్‌ ప్రభావం పెరగడానికి కారణమైన జీవ భూగర్భ రసాయన వలయం ఏది?

1)  ఫాస్ఫరస్‌    2)  సల్ఫర్‌      3)  నైట్రోజన్‌      4) కార్బన్‌ 


3. కిందివాటిలో జల మండలం ఏది? 

1) మంచి నీటి ఆవరణ వ్యవస్థ      2) ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ    3) నదీవాయి (estuary) ఆవరణ వ్యవస్థ  4) పైవన్నీ 


4. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) ప్రస్తుతం మానవ జనాభా విస్ఫోటన దశలో ఉంది. దీన్ని రి ఆకారంలో ఉండే గ్రోత్‌ కర్వ్‌తో సూచిస్తారు.

బి) జంతువుల జనాభా గ్రోత్‌ కర్వ్‌ S ఆకారంలో ఉంటుంది. 

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే    3) రెండూ సరైనవి       4) ఏదీకాదు 


5. జనాభా పెరుగుదలను కింది ఏ దశల ద్వారా సూచిస్తారు?

1) lag దశ   2) log దశ     3) విస్ఫోటన దశ   4) పైవన్నీ 


6. ఒక ఆవరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే జీవులను ఏమంటారు? (వీటి ఉనికి ఆవరణ వ్యవస్థలో లేకపోతే, ఆవరణ వ్యవస్థ మొత్తం అంతరించి పోతుంది లేదా నిష్క్రియాశీలకంగా మారిపోతుంది.)

1) కీస్టోన్‌ స్పీసిస్‌     2) ప్రొడ్యూసర్స్‌    3) కన్జ్యూమర్స్‌   4) కార్నివోర్స్‌ 


7. ఫోటోసింథటిక్‌ యాక్టివ్‌ రేడియేషన్‌ (పీఏఆర్‌)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీని పరిధి 400 nm నుంచి 700 nm వరకు ఉంటుంది.

బి) మొక్కల్లో జరిగే కిరణజన్యసంయోగక్రియకు ఉపయోగపడే 50 శాతం సౌరశక్తిని పీఏఆర్‌గా పిలుస్తారు.

సి) పచ్చటి మొక్కలు కేవలం 2 - 10% మాత్రమే పీఏఆర్‌ని ఉపయోగించుకుంటాయి.

1) ఎ, బి    2) ఎ, సి     3) బి, సి     4) పైవన్నీ


8. మానవుడు కృత్రిమంగా నియంత్రించే భౌతిక, జీవ వాతావరణం కలిగిన ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణ?

1) పంట భూములు    2) జంతు ప్రదర్శనశాల     3) ఉద్యానవనాలు    4) పైవన్నీ 


9. బయోమాస్‌ లేదా జీవద్రవ్యరాశికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఒక ట్రాఫిక్‌ స్థాయిలో లేదా భౌగోళిక ప్రదేశంలో ఉన్న జీవులన్నింటినీ బయోమాస్‌గా పరిగణిస్తారు.

బి) ఆ ప్రాంతంలో ఉన్న జీవుల బరువును (dry weight) జీవద్రవ్యరాశిగా పేర్కొంటారు. 

సి) బయోమాస్‌ పిరమిడ్‌ భూ ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా, జలావరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

1) ఎ, బి    2) ఎ, సి    3) బి, సి    4) పైవన్నీ


10. జీవులకు మాంసకృత్తులు అత్యంత ఆవశ్యకమైనవి. వీటిలో ఇమిడి ఉండే ముఖ్యమైన రసాయన పదార్థం? 

1) కార్బన్‌   2) హైడ్రోజన్‌     3) నైట్రోజన్‌    4) ఆక్సిజన్‌ 


11. కిందివాటిలో వృక్షాలకు సంబంధించి సరైనవి?

ఎ) కారును 26 వేల మైళ్ల దూరం నడిపినప్పుడు ఉత్పన్నమయ్యే సరాసరి కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒక ఎకరా విస్తీర్ణంలో ఉన్న వృక్షాలు ఏడాది కాలం వినియోగించుకోగలవు.

బి) ఒక ఎకరా విస్తీర్ణంలో ఉన్న వృక్షాలు సుమారుగా 18 మంది మానవులు ఒక సంవత్సర కాలంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు.

1) ఎ మాత్రమే  2) బి మాత్రమే    3) రెండూ సరైనవి     4)  ఏదీకాదు


12. బయోమాస్‌ పిరమిడ్‌లో తలకిందులుగా ఉండే పిరమిడ్‌ కింది ఏ ఆవరణ వ్యవస్థలో కనిపిస్తుంది?

1) గడ్డి మైదాన    2) పర్వత ప్రాంత     3) ఎడారి    4) సరస్సు


13. పశువులకు మేతగా ఉపయోగపడే ఆవరణ వ్యవస్థల్లో శక్తి ఎన్ని ట్రాఫిక్‌ స్థాయుల్లో ప్రవహిస్తుంది?

1) ఒకటి    2) రెండు     3) మూడు     4) నాలుగు


14. ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన  ప్రజాతులను (species) ఏమంటారు?

1) Ecotypes     2) Ecotones    3) Ecads     4) Endemics


15. అత్యంత స్థిరమైన సహజ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ?

1) ఎడారి ఆవరణ వ్యవస్థ  2) సరస్సు ఆవరణ వ్యవస్థ    3)  సముద్ర ఆవరణ వ్యవస్థ   4) అటవీ ఆవరణ వ్యవస్థ 


16. జీవుల మరణంతో ప్రారంభమయ్యే ఆహార గొలుసు?

1) పశువుల మేత   2) మృత్తిక     3) సరస్సు     4) పూతికాహార 


17. కింది ఏ ట్రాఫిక్‌ స్థాయికి చెందిన జీవుల్లో శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుంది?

1) ఉత్పత్తిదారులు     2) ప్రథమ వినియోగదారులు    3) ద్వితీయ వినియోగదారులు    4) తృతీయ వినియోగదారులు


18. ఒక ఆవరణ వ్యవస్థకు బాహ్య వాతావరణం నుంచి కచ్చితంగా ఆవశ్యకమైన  ఎకలాజికల్‌ ఫ్యాక్టర్‌ ఏది?

1) శక్తి    2) పోషకాలు    3) గాలి    4) ఆహారం


19. ప్రోటీన్లలో ఉండే నైట్రోజన్‌ శాతం?

1) 61    2) 16   3) 21   4) 12 


20. ఆవరణ వ్యవస్థలో మూలకాలు నిరంతరం నిర్జీవ, జీవ కారకాల మధ్య వలయాకారంలో గమనం చేస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారు? 

1) బయో జియో కెమికల్‌ సైకిల్‌ (జీవ భూగర్భ రసాయన వలయం)

2) జీవిత చక్రం      3) ఆహార వలయం      4) పోషక వలయం 


21. కింది ఏ ద్రావణం ఆవరణ వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక పాత్రను పోషిస్తుంది? (ఇది పోషకాల రవాణాకి ఉపయోగపడుతూ, వివిధ మూలకాలను తనలో కరిగించుకుంటుది.)

1) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం  2) నత్రికామ్లం   3) కార్బోనిక్‌ ఆమ్లం   4) నీరు


22. కార్బన్‌ జీవ భూగర్భ రసాయన వలయానికి సంబంధించి కిందివాటిలో సరైనవి? 

ఎ) వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్‌తో పోలిస్తే కార్బన్‌ అతి తక్కువ పాత్ర పోషిస్తుంది.

బి) మొక్కల్లో కిరణజన్యసంయోగక్రియ, పిండి పదార్థాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది.

సి) జీవుల్లో న్యూక్లియిక్‌ ఆమ్లం నిర్మాణంలో ముఖ్యపాత్ర నిర్వహిస్తుంది.

డి) జీవావరణంలో అతి కీలక పాత్ర పోషించే కర్బన పదార్థాల నిర్వహణకు కార్బన్‌ అత్యంత ఆవశ్యకం.

1)ఎ, సి     2) బి, డి    3) ఎ, డి    4) పైవన్నీ


23. అవక్షేపణ జీవ భూగర్భ రసాయన వలయాలకు ముఖ్య ఉదాహరణ? (ఇవి వాతావరణంలో ప్రయాణించకుండా నేల క్రమక్షయం, అవక్షేపణ, పర్వత నిర్మాణం, అగ్నిపర్వత ప్రాంతాల్లో అవశేషాల రూపంలో ఏర్పడతాయి.)

1) ఫాస్ఫరస్‌ సైకిల్‌   2) సల్ఫర్‌ సైకిల్‌      3) 1, 2     4) ఏదీకాదు


24. వాతావరణంలో కింది ఏ మూలకం అసమతౌల్యం వల్ల ఆమ్ల వర్షాలు, హానికర ఆల్గల్‌ బ్లూమ్స్, యూట్రాఫికేషన్‌ లాంటివి ఏర్పడతాయి?

1) కార్బన్‌     2) హైడ్రోజన్‌     3) నైట్రోజన్‌    4) ఆక్సిజన్‌ 


25. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సింబయాటిక్‌ నత్రజని స్థాపన: రైజోబియం 

బి) ఆకుపచ్చ - నీలి శైవలాలు: అనబీనా 

సి) డీనైట్రిఫయింగ్‌ బ్యాక్టీరియా: సూడోమోనాస్‌ 

డి) నైట్రోజన్‌ ఫిక్సింగ్‌ ఫ్రీ లివింగ్‌ బ్యాక్టీరియా: అజటో బ్యాక్టర్‌

1) ఎ, బి    2) బి, సి    3) సి, డి   4) పైవన్నీ


26. కిందివాటిలో వాయు - జీవ భూగర్భ రసాయన వలయాలను గుర్తించండి. 

1) నీటి వలయం    2) కర్బన వలయం    3) నత్రజని వలయం      4) పైవన్నీ 


27. భూ వాతావరణంలో నత్రజని స్థాపన కింది ఏ పద్ధతుల్లో జరుగుతుంది? 

ఎ) సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, ఆకుపచ్చ  - నీలి శైవలాలు నత్రజని స్థాపనను చేస్తాయి. 

బి) కృత్రిమ ఎరువుల పరిశ్రమల ద్వారా నత్రజని స్థాపన జరుగుతుంది. 

సి) వాతావరణంలో ఏర్పడే ఉరుములు, మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. 

1) ఎ, బి      2) బి, సి     3) ఎ, సి    4) పైవన్నీ


28. శక్తి ప్రవాహానికి సంబంధించి కిందివాటిలో సరైనవి? 

1) శక్తి ప్రవాహం ముఖ్యంగా కింది ట్రాఫిక్‌ స్థాయి నుంచి పై ట్రాఫిక్‌ స్థాయికి ప్రవహిస్తుంది. 

2) శక్తి ఒక ట్రాఫిక్‌ స్థాయి నుంచి మరొక ట్రాఫిక్‌ స్థాయికి ప్రవహించేటప్పుడు కొంతమేర నష్టపోతుంది. 

3) శక్తి ప్రతి ట్రాఫిక్‌ స్థాయిలో 10 శాతం మాత్రమే ప్రవహిస్తుంది. అంటే కింది ట్రాఫిక్‌ స్థాయి నుంచి పై ట్రాఫిక్‌ స్థాయికి 10 శాతం మాత్రమే ప్రవహిస్తుంది. దీన్నే ‘టెన్‌ పర్సెంట్‌ లా’ అంటారు.

4) పైవన్నీ 


29. తమ శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకునే జీవులను ఏమంటారు?

1) హోమియోథర్మ్స్‌   2) ఎండోథర్మ్స్‌     3) 1, 2    4) ఏదీకాదు 


30. కిందివాటిలో సరైనవి ఏవి? 

1) ఒంటెను ఎడారి ఓడగా పిలుస్తారు.

2) ఒంటె తన మూపురం (hump) లో సుమారు 80 పౌండ్ల కొవ్వు పదార్థాలను నిల్వ చేసుకుంటుంది. దీంతో ఇది ఆరు నుంచి ఏడు నెలల వరకు ఆహారం లేకుండా జీవించగలదు. 

3) ఒంటె వేసవికాలంలో 110°F ఉష్ణాన్ని తట్టుకోగలదు. ఇది అత్యంత ఉష్ణంలో అయిదు రోజుల వరకు జీవించగలదు.

4) పైవన్నీ


31. ప్రపంచంలో సజీవంగా ఉన్న నాలుగు కాళ్ల జంతువుల్లో అతి పెద్ద కార్నివోర్‌ ఏది? 

1) పెద్దపులి      2) చింపాంజీ   3) సింహం    4) ధృవపు ఎలుగుబంటి (పోలార్‌ బేర్‌)

సమాధానాలు

1-1  2-4  3-4  4-3  5-4  6-1  7-4  8-4  9-4  10-3  11-3  12-4  13-3  14-4  15-3  16-4  17-1  18-1  19-2  20-1  21-4  22-4  23-3  24-3  25-4  26-4  27-4  28-4  29-3 30-4 31-4. 

Posted Date : 23-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌