• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో ఐసీటీ పరిణామం - చట్టాలు - విధి విధానాలు

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో ఐటీ చట్టం- 2000లో ముఖ్యంగా వేటిని ప్రస్తావించారు?
1) ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు, డిజిటల్‌ సంతకాలకు కావాల్సిన చట్టబద్ధమైన గుర్తింపు గురించి
2) ఐటీ నేరాలు, ఉల్లంఘనలను
3) సైబర్‌ నేరాలు- వాటి న్యాయ పంపిణీ వ్యవస్థను
4) పైవన్నీ


2. ఐటీ చట్టం- 2000ను ఏయే సంవత్సరాల్లో సవరించారు?
i) 2008           ii) 2011          iii) 2018           iv) 2021
1) i, ii             2) ii, iii         3) i, ii, iii          4) i, ii, iii, iv

 

3. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కావాల్సిన ఈ- లావాదేవీలకు (e-transactions) ఐటీ చట్టం- 2000 చట్టబద్ధత కల్పించింది. అయితే అవి కింది ఏ చట్టాలకు లోబడి ఉండాలి?
1) ఎవిడెన్స్‌ చట్టం 1894    2) ఆర్‌బీఐ చట్టం 1934
3) 1, 2             4) ఏదీకాదు


4. దేశంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒక సభ్యుడ్ని ఈ- అక్షరాస్యుడిగా మార్చాలని ప్రభుత్వం ఏ పాలసీ ద్వారా ప్రతిపాదించింది?
1) ఐటీ చట్టం- 2000
2) నేషనల్‌ పాలసీ ఆన్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌
3) నేషనల్‌ ఐటీ పాలసీ- 2012
4) సైబర్‌క్రైమ్‌ పాలసీ


5. OTT ఫ్లాట్‌ఫాంలు తమ వీడియో స్ట్రీమింగ్‌ను ఐదు రకాలుగా (U, U/A 7+, U/A 13+, U/A 16+, A)  వర్గీకరించాలని, పేరెంటల్‌ లాక్‌ సౌకర్యం కల్పించాలని ఏ మార్గదర్శకాల్లో సూచించారు?
1) డేటా పరిరక్షణ చట్టం        2) ఐటీ పాలసీ- 2012
3) సైబర్‌ క్రైమ్‌ పాలసీ         4) ఐటీ చట్టం-2021


6. ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌- 2021 ప్రకారం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను ఏ రకంగా వర్గీకరించారు?
1) సోషల్‌ మీడియా ఇంటర్‌మీడియరీస్‌ చీ 50లక్షల  యూజర్లు
2) సిగ్నిఫికెంట్‌ సోషల్‌ మీడియా ఇంటర్‌మీడియరీస్‌ జి 50 లక్షల యూజర్లు
3) 1, 2            4) ఏదీకాదు


7. డిజిటల్‌ సంతకం (e- Signature)  అంటే ఏమిటి?
1) సంబంధిత అధికారులు జారీ చేసిన ఎలక్ట్రానిక్‌ కాపీ కలిగిన రికార్డ్‌.
2) వ్యక్తిగత గుర్తింపునకు ఉపయోగపడేది. దీనిద్వారా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను సాధించి, సమాచారాన్ని పొందొచ్చు.
3) సంబంధిత సమాచారం అసలైంది అని సూచించే ఎలక్ట్రానిక్‌ సంతకం.
4) పైవన్నీ


8. ఈ- కామర్స్‌ అంటే ఎలక్ట్రానిక్‌ పద్ధతి ద్వారా....
1) అమ్మడం             2) కొనడం
3) బదిలీచేయడం / వస్తు మార్పిడి / లావాదేవీలు నిర్వహించడం.
4) పైవన్నీ


9. సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసే వ్యక్తిపై ఏ సెక్షన్‌ ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు?
1) సెక్షన్‌ 79        2) సెక్షన్‌ 66
3) సెక్షన్‌ 43        4) ఏదీకాదు


10. సోషల్‌ మీడియా ద్వారా జరిగే ప్రచారాల్లో నిజానిజాల గురించి తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్‌...
1)  PIB  ఫాక్ట్‌ చెక్‌        2) ఉమాంగ్‌
3) భువన్‌        4) పైవేవీకావు


11. ఏ ప్రభుత్వ యాప్‌ 170 మిలియన్‌ డౌన్‌లోడ్‌లతో రికార్డు సృష్టించింది?
1) Umang (ఉమాంగ్‌)
2) BHIM-UP (భీమ్‌-యూపీఐ) 
3) ఆయకర్‌ సేతు        4) ఆరోగ్య సేతు


12. భారత్‌ క్యూఆర్‌ కోడ్‌లో క్యూఆర్‌ అంటే....
1) క్విక్‌ రెస్పాన్స్‌        
2) క్విక్‌ బార్‌కోడ్‌ రెస్పాన్స్‌
3) క్యూరేటివ్‌ రెస్పాన్స్‌   
4) పైవేవీ కావు 


13. డిజిటల్‌ ఇండియా ప్రోగ్రాం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 2015, జనవరి 1     2) 2015, జూన్‌ 1
3) 2015, మే 1        4) 2015, జులై 1


14. భారత ప్రభుత్వం 2006, మే 18 నాటికి   National e-governance plan(NeGP)ను మొదటి విడతగా ఎన్ని మిషన్‌మోడ్‌ ప్రాజెక్టులతో ఆమోదించింది?
1) 27     2) 29     3) 31     4) 35


15. e-Rashtriya Kisan Agri Mandi (e-RaKAM)  పోర్టల్‌ ఎవరికి సంబంధించింది?
1) విద్యార్థులు         2) వ్యాపారవేత్తలు
3) రైతులు           4) పన్ను చెల్లింపుదారులు


16. సమాచార సాంకేతికతనుపయోగించి ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచి, ప్రజా అవసరాలను వేగవంతం చేయడాన్ని ఏమంటారు?
1) ఈ-బిజినెస్‌                2) ఈ-అడ్మినిస్ట్రేషన్‌
3) ఈ-గవర్నెన్స్‌           4) ఈ-కామర్స్‌


17. ఎం-గవర్నెన్స్‌ సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఎలక్ట్రానిక్స్‌ - సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ (MeiTy) ఏ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది?
1) ఆరోగ్య సేతు       2) MyGov.in
3) UMANG - (Unified Mobile Application for New Age Governance)
4) BHIM - Bharat Interface for Money

18. కింది వాటిలో సరైంది ఏది?
1) BHIM మొబైల్‌ యాప్‌ను 2016 డిసెంబరు  30న ప్రధాని మోదీ ప్రారంభించారు.
2) భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక, డిజిటల్‌ లావాదేవీల నిర్వహణకు దీన్ని ఏర్పాటు చేశారు.
3) దీన్ని ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ మొబైల్‌ యాప్‌ను  National Payments Corporation of India(NPCI), Unified Payments Interface (UPI) లు నిర్వహిస్తున్నాయి.
4) పైవన్నీ


19. కిందివాటిలో డిజిటల్‌ ఇండియా లక్ష్యం కానిది?
1) భారత పౌరులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చటం. 
2) డిజిటల్‌ అక్షరాస్యతకు కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చటం.
3) ప్రజలకు ఈ-గవర్నెన్స్‌ సేవలను కల్పించటం.
4) ప్రజలందరికీ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందించడం.


20. ఛాండ్లర్‌ గుడ్‌గవర్నమెంట్‌ ఇండెక్స్‌ (CGGI)కు సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఈ ఇండెక్స్‌లో 104 దేశాలు ఉన్నాయి. వాటిలో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో ఉంది.
2) సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే ఒక ఎన్‌జీఓ దిబిబిఖిను నిర్వహిస్తోంది.
3) ఈ ఇండెక్స్‌లో భారత్‌ స్థానం 49.
4) పైవన్నీ


21. భారతదేశంలో ‘గుడ్‌ గవవర్నెన్స్‌ డే’ను ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 15         2) అక్టోబరు 2
3) డిసెంబరు 25        4) నవంబరు 14


22. కిందివాటిలో ‘అవలోకన సాఫ్ట్‌వేర్‌’ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌ కోసం ప్రారంభించింది.
2) నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ గ్రాంట్లు, ఖర్చులను ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే లెక్కిస్తారు.
3) దీని ద్వారా SDGల అమలు తీరును, కేంద్ర ప్రభుత్వం అందిందే ఎస్సీ, ఎస్టీ  సబ్‌ప్లాన్‌ పథకాలను నిశితంగా గమనిస్తారు. 
4) పైవన్నీ


23. ఇటీవల ఏ రాష్ట్రం సమగ్రమైన డేటా పాలసీని ఆమోదించింది? 
1) ఆంధ్రప్రదేశ్‌          2) తెలంగాణ     
3) కర్ణాటక         4) పంజాబ్‌


24. కిందివాటిలో సరైంది ఏది?
1) MCA 21ను 2006లో కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. 
2) దీని ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. దీన్ని Digital Corporate Compliance Portal గా పిలుస్తారు.
3) MCA 21 Version 3.Oను 2021 బడ్జెట్‌లో ప్రస్తావించారు.
4) పైవన్నీ


25. CARD గురించి సరైన దాన్ని గుర్తించండి.
1)  CARD అంటే Computer Aided Administration of Registration Department.
2) ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ విభాగానికి చెందింది.
3) ఆస్తుల విలువను పారదర్శకంగా తెలపడానికి, డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సేవల్ని సమగ్రంగా పొందడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.
4) పైవన్నీ


26. కింది అంశాలను జతపరచండి.
  జాబితా  I        జాబితా  II
a) CGG         i) Secretariat Campus Network
b) SWAN        ii) Centre for Good Governance
c) SCAN      iii) Real Time Governance Society
d) RTGS     iv) State Wide Area Network
1) a - ii, b - iv, c - i, d - iii
2) a - iv, b - i, c - iii, d - ii
3) a - i, b - ii, c - iii, d - iv
4) a - iii, b - ii, c - iv, d - i

 

27. కిందివాటిలో UIDAI గురించి సరైంది ఏది?
1)  UIDAI - Unique Identification Authority of India
2) ఇది దేశ పౌరులందరికీ 12 సంఖ్యల ఆధార్‌ ద్వారా విశిష్టమైన గుర్తింపును అందిస్తోంది.
3) ప్రస్తుతం దీని సీఈఓగా సౌరభ్‌ గార్గ్‌ ఉన్నారు.
4) పైవన్నీ


28. National Optical Fibre Network (NOFN)ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2011, అక్టోబరు     2) 2010, జూన్‌
3) 2006, మార్చి      4) 2015, జులై


29. National Information Centre Networking System - NICNETను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1977      2) 1980      3) 1987          4) 1990

 

30. ప్రభుత్వం నుంచి పౌరులకు అందించే సేవలు ఏ కోవకు చెందుతాయి?
1) G2G        2) G2B         3) G2C       4) G2E

 


31. ప్రస్తుతం దేశంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులు లేదా డిజిటల్‌ విద్యను ఏ ఉపగ్రహం ద్వారా నిర్వహిస్తున్నారు?
1)  GSAT-3 (జీశాట్‌-3)            2) EDUSAT (ఎడ్యుశాట్‌)
3) 1, 2             4) ఏదీకాదు


32. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయం (Precision agriculture) లేదా SSCM (Site-Specific Crop Management) ఏ సాంకేతికత అనుసంధానంతో పని చేస్తుంది?
1) రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు
2) కృత్రిమ మేధ (Artificial intelligence)
3) ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IOT)
4)  పైవన్నీ


33. జియోట్యాగింగ్‌ ద్వారా ఏయే పనులు చేయొచ్చు?
1) భూస్వరూపాలను, వివిధ ప్రాంతాలను ఉపగ్రహ వ్యవస్థ ద్వారా గుర్తించడం.
2) వాటిని వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలకు ఉపయోగించడం.
3) క్యూఆర్‌ కోడ్‌ సాయంతో ఫొటోగ్రాఫ్‌లు, వీడియోలు, వివిధ వెబ్‌సైట్లను నిక్షిప్తం చేయడం.
4) పైవన్నీ


34. జియో ట్యాగింగ్‌కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాప్‌ ఏది?
1) ఉమాంగ్‌       2) సాకార్‌      3) భువన్‌      4) కృషి


35. ఐటీ చట్టం  2000లోని ఏ సెక్షన్‌ కంప్యూటర్ల హ్యాకింగ్, వాటి జరిమానాల గురించి ప్రస్తావించింది?
1) సెక్షన్‌ 65        2) సెక్షన్‌ 62  
3) సెక్షన్‌ 66        4) సెక్షన్‌ 67


సమాధానాలు: 1-4; 2-4; 3-3; 4-3; 5-4; 6-3; 7-4; 8-4; 9-1; 10-1; 11-4; 12-1;  13-4; 14-1;  15-3; 16-3; 17-3; 18-4; 19-4; 20-4; 21-3; 22-4; 23-4; 24-4; 25-4; 26-1; 27-4; 28-1; 29-3; 30-3; 31-3; 32-4; 33-4; 34-3; 35-3. 

Posted Date : 21-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌