• facebook
  • whatsapp
  • telegram

హాలోజన్‌లు - వాటి సమ్మేళనాలు

1. కిందివాటిలో హాలోజన్‌ కానిది ఏది?

1) ఫోర్లిన్‌        2) క్లోరిన్‌            

3) అయోడిన్‌      4) ఆక్సిజన్‌

2. కిందివాటిలో సూపర్‌ హాలోజన్‌ అని దేన్ని అంటారు?

1) ఫ్లోరిన్‌     2) క్లోరిన్‌ 

3) బ్రోమిన్‌     4) అయోడిన్‌

3. హాలోజన్లలో రేడియోధార్మికతను ప్రదర్శించేది?

1) క్లోరిన్‌       2) అయోడిన్‌   

3) అస్టాటిన్‌       4) బ్రోమిన్‌

4. మూలకాల్లో అత్యధిక రుణ విద్యుదాత్మకత దేనికి ఉంటుంది?

1) క్లోరిన్‌     2) ఫ్లోరిన్‌ 

3) అయోడిన్‌     4) బ్రోమిన్‌

5. కిందివాటిలో అత్యధిక ఎలక్ట్రాన్‌ ఎఫినిటీ ఉన్న మూలకం ఏది?

1) బ్రోమిన్‌     2) అయోడిన్‌ 

3) క్లోరిన్‌       4) ఫ్లోరిన్‌

6. హాలోజన్ల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం ఏది?

1) ns2np2    2) ns2np3 

3) ns2np4        4) ns2np5

7. కిందివాటిలో ఫ్లోరైడ్‌ లవణాలు ఏవి?

1) ఫ్లోరోస్ఫార్‌     2) ఫ్లోరాపటైట్‌  

3) క్రయోలైట్‌      4) పైవన్నీ

8. కింది అంశాలను జతపరచండి. 

హాలోజన్‌ పదార్థస్థితి
a) ఫ్లోరిన్‌ i) ద్రవస్థితి
b) క్లోరిన్‌ ii) వాయుస్థితి
c) బ్రోమిన్‌ iii) ఘనస్థితి
d)  అయోడిన్‌ iv) ప్లాస్మాస్థితి

1) a-ii, b-iii, c-iv, d-i 

2) a-ii, b-iv, c-i, d-iii

3) a-ii, b-ii, c-i, d-iii  

4) a-iii, b-iv, c-i, d-ii

9. కిందివాటిలో అలోహాలకు ఉదాహరణ ఏది?

1) ఫ్లోరిన్‌       2) క్లోరిన్‌   

3) అయోడిన్‌      4) పైవన్నీ

10. కింది అంశాలను జతపరచండి.

హాలోజన్‌ రంగు
a) ఫోర్లిన్‌ i) ఊదా రంగు
b) బ్రోమిన్‌ ii) పసుపు రంగు
c) అయోడిన్‌ iii) ఎరుపు రంగు

1) a-i, b-iii, c-ii        2) a-ii, b-iii, c-i

3) a-iii, b-ii, c-i        4) a-ii, b-i, c-iii

11. కిందివాటిలో కార్బన్‌ - కార్బన్‌ బంధాల మధ్య అసంతృప్త లక్షణాన్ని గుర్తించడానికి ఉపయోగించేది?

1) బ్రైన్‌ ద్రావణం        2) బ్రోమిన్‌ జలం  

3) టోలెన్స్‌ కారకం    4) ఏదీకాదు

12. గాజు వస్తువులపై చిత్రాలను గీయడానికి ఉపయోగించే ఆమ్లం?

1) హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (HF) 

2) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం (H2SO4)

3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (HCl)

4) నైట్రిక్‌ ఆమ్లం (HNO3

13. తాగేనీటిలో ఫ్లోరైడ్‌ గాఢత ఎంత కంటే ఎక్కువైతే ఆరోగ్యానికి హానికరం?

1) 1 ppm     2) 2 ppm   

3) 1 ppb      4) 2 ppb

14. నీటిలో ఫ్లోరైడ్‌ గాఢత ఎక్కువైతే ఎముకలు బలహీనపడి, దంతాలపై పసుపు చారలు ఏర్పడతాయి. ఈ వ్యాధిని ఏమంటారు?

1) సిరోసిస్‌      2) ఫ్లోరిసిస్‌  

3) డయాలసిస్‌     4) ఏదీకాదు

15. నాన్‌-స్టిక్‌ వంటపాత్రల తయారీలో ఉపయోగించే ఫ్లోరో సమ్మేళనం ఏది?

1) టెఫ్లాన్‌     2) రేయాన్‌ 

3) నియాన్‌       4) పాలిథీన్‌

16. బ్రైన్‌ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేసి ఏ వాయువును తయారు చేస్తారు?

1) క్లోరిన్‌         2) ఫ్లోరిన్‌  

3) హీలియం      4) నైట్రోజన్‌

17. టెఫ్లాన్‌ అంటే?

1) టెట్రాఫ్లోరోఈథేన్‌ 

2) పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్‌

3) టెట్రాఫ్లోరోప్రొపేన్‌ 

4) పాలీటెట్రాఫ్లోరోప్రొపేన్‌

18. కిందివాటిలో సరైంది?

ఎ) ఫ్రియాన్‌ రసాయన నామం డైక్లోరోడైఫ్లోరోమీథేన్‌.

బి) ఫ్రియాన్‌ను శీతలీకరణిగా ఉపయోగిస్తారు.

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే  

3) 1, 2      4) ఏదీకాదు

19. హాలోజన్లలో అత్యధిక చర్యాశీలత కలిగిన మూలకం?

1) క్లోరిన్‌      2) ఫ్లోరిన్‌   

3) బ్రోమిన్‌       4) అయోడిన్‌

20. నీటిలో బ్యాక్టీరియాను చంపే స్వభావం ఉన్న వాయువు?

1) హైడ్రోజన్‌       2) ఆక్సిజన్‌   

3) క్లోరిన్‌        4) ఫ్లోరిన్‌  

21. కిందివాటిలో అత్యధిక ఆమ్ల స్వభావం దేనికి ఉంది?

1) హైడ్రోఅయోడిక్‌ ఆమ్లం 

2) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం  

3) హైడ్రోబ్రోమిక్‌ ఆమ్లం

4) హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం

22. కిందివాటిలో క్లోరిన్‌కు సంబంధించి సరైంది?

ఎ) క్లోరిన్‌ ఒక బలమైన విరంజనకారి.

బి) క్లోరిన్‌ నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

1) ఎ   2) బి   3) 1, 2   4) ఏదీకాదు

23. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I జాబితా -  II
a) ఫాస్‌జీన్‌ i) కీటక నాశని
b) దీదీగి ii) మత్తు మందు
c) క్లోరోఫామ్‌ iii) విషవాయువు

1) a-iii, b-ii, c-i    2) a-ii, b-i, c-iii   

3) a-iii, b-i, c-ii    4) a-i, b-iii, c-ii   

24. బ్లీచింగ్‌ పౌడర్‌ రసాయన నామం?

1) కాల్షియం హైడ్రాక్సైడ్‌ 

2) కాల్షియం సల్ఫేట్‌

3) కాల్షియం హైపోక్లోరైట్‌   

4) కాల్షియం కార్బొనేట్‌

25. బాష్పవాయువు రసాయన నామం?

1) CHCl3       2) CCl3NO2

3) CCl    4) COCl2

26. క్లోరోఫామ్‌ రసాయన నామం?

1) CH3Cl     2) CH2Cl2

3) CHCl3      4) CCl4

27. యుద్ధాల్లో విషవాయువుగా ఉపయోగించే ఫాస్‌జీన్‌ రసాయన నామం?

1) CaCO3      2) COCl2

3) SO2Cl     4) SOCl2

28. కిందివాటిలో దేన్ని ‘రెడ్‌ లిక్విడ్‌’ అంటారు?

1) క్లోరిన్‌        2) బ్రోమిన్‌   

3) అయోడిన్‌      4) ఫ్లోరిన్‌

29. ద్రవస్థితిలో ఉండే ఏకైక అలోహం?

1) పాదరసం       2) గాలియం  

3) బ్రోమిన్‌       4) నియాన్‌

30. కిందివాటిలో సరైంది ఏది?

ఎ) క్లోరిన్‌ వాయువు పొడిసున్నంతో చర్య జరిపి బ్లీచింగ్‌ పౌడర్‌ను ఏర్పరుస్తుంది.

బి) క్లోరిన్‌ ఊదా రంగులో ఉండే ఒక అలోహం.

1) ఎ మాత్రమే     2) బి మాత్రమే   

3) 1, 2      4) ఏదీకాదు

31. ఇథిలీన్‌ వాయువుతో సల్ఫర్‌ డైక్లోరైడ్‌ చర్య జరిపి దేన్ని ఏర్పరుస్తుంది?

1) బాష్పవాయువు      2) ఫాస్‌జీన్‌   

3) మస్టర్డ్‌ వాయువు    4) ఏదీకాదు

32. క్రిమిసంహారిణిగా ఉపయోగించే గమాక్సిన్‌ రసాయన నామం?

1) సైక్లోహెక్సేన్‌     2) హెక్సాక్లోరోసైక్లోహెక్సేన్‌

3) క్లోరైడ్‌ ఆఫ్‌ లైమ్‌ 

4) హెక్సాక్లోరో బెంజీన్‌

33. బ్లీచింగ్‌ పౌడర్‌ను నీటిలో కరిగిస్తే వెలువడే వాయువు?

1) ఆక్సిజన్‌     2) క్లోరిన్‌  

3) నైట్రోజన్‌       4) ఫాస్‌జీన్‌

34. బ్రైన్‌ ద్రావణం అంటే?

1) గాఢ సోడియం కార్బొనేట్‌ ద్రావణం      

2) విలీన పొటాషియం క్లోరైడ్‌ ద్రావణం          

3) గాఢ సోడియం క్లోరైడ్‌ ద్రావణం        

4) విలీన సోడియం కార్బొనేట్‌ ద్రావణం

35. కిందివాటిలో ‘1’ ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శించే హాలోజన్‌?

1) ఫ్లోరిన్‌      2) క్లోరిన్‌   

3) అయోడిన్‌      4) బ్రోమిన్‌

సమాధానాలు

1 - 4   2 - 1  3 - 3  4 - 2  5 - 3  6 - 4  7 - 4  8 - 3  9 - 4  10 - 2  11 - 2  12 - 1  13 - 2  14 - 2  15 - 1  16 - 1  17 - 2  18 - 3  19 - 2  20 - 3  21 - 1  22 - 3  23 - 3  24 - 3  25 - 2  26 - 3  27 - 2  28 - 2  29 - 3  30 - 1  31 - 3  32 - 2  33 - 2  34 - 3  35 - 1 

 
మరికొన్ని...

1. ప్రతిపాదన (A): ఫ్లోరిన్‌ రసాయనికంగా చాలా చురుకైన హాలోజన్‌.
కారణం (B): ఫ్లోరిన్‌ రేడియోధార్మికతను ప్రదర్శిస్తుంది.

1) A సత్యం, కానీ R అసత్యం.

2) A అసత్యం కానీ R సత్యం.

3) A, R రెండూ సత్యం, Aకు R సరైన వివరణ.

4) A, R రెండూ సత్యం, కానీ A కు R సరైన వివరణ కాదు.

2. తాగునీటిలో కింది ఏ హాలైడ్‌ అయాన్‌ కొరత ఉంటే, దంతక్షయం ఏర్పడుతుంది?

1) క్లోరైడ్‌     2) బ్రోమైడ్‌

3) ఫ్లోరైడ్‌     4) అయోడైడ్‌

3. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I      జాబితా - II

a) అయోడిన్‌     i) విరంజన చూర్ణం

b) క్లోరిన్‌     ii) థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి

c) ఫ్లోరిన్‌     iii) పసుపు రంగు వాయువు

1) a-iii, b-i, c-ii      2) a-ii, b-i, c-iii

3) a-i, b-ii, c-iii      4) a-ii, b-iii, c-i

4. బ్లీచింగ్‌ పౌడర్‌ రసాయన ఫార్ములా ఏమిటి?

1) Ca(OH)2       2) Ca(OCl)2

3) CaCO3        4) CaO

5. కింది ఏ హాలోజన్‌ థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది?

1) ఫ్లోరిన్‌          2) క్లోరిన్‌   

3) అయోడిన్‌       4) బ్రోమిన్‌

6. థైరాక్సిన్‌ లోపిస్తే అవటు గ్రంథి వాస్తుంది. దీన్ని ఏమంటారు?

1) గాయిటర్‌       2) ఆర్ధ్రరైటిస్‌    

3) ఎనీమియా      4) స్కర్వీ 

7. సముద్రపు కలుపు మొక్కల్లో లభించే హాలోజన్‌ ఏది?

1) ఫ్లోరిన్‌         2) క్లోరిన్‌   

3) బ్రోమిన్‌       4) అయోడిన్‌

8. టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్‌ దేని మిశ్రమం?

1) అయోడిన్‌ + పొటాషియం అయోడైడ్‌

2) అయోడిన్‌ + పొటాషియం అయోడైడ్‌ + రెక్టిఫైడ్‌ స్పిరిట్‌

3) అయోడిన్‌ + పొటాషియం అయోడైడ్‌ + నీరు

4) పొటాషియం బ్రోమైడ్‌ + అయోడిన్‌ + పొటాషియం అయోడైడ్‌

9. సిల్వర్‌ నైట్రేట్‌ ద్రావణంతో తెల్లటి అవక్షేపం ఏర్పర్చే హాలైడ్‌ అయాన్‌ ఏది?

1) ఫ్లోరైడ్‌ (F-)      2) బ్రోమైడ్‌ (Br-

3) క్లోరైడ్‌ (Cl-)     4) అయోడైడ్‌ (I-)

సమాధానాలు

1 - 1   2 - 3   3 - 2   4 - 2   5 - 3   6 - 1   7 - 4   8 - 2   9 - 3

Posted Date : 05-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌