• facebook
  • whatsapp
  • telegram

క్రమానుగత శ్రేణి పరీక్ష

ఎటు నుంచైనా కనిపెట్టేలా!

*ఒక సమస్య ఎదురైతే పక్కన పడేసి పారిపోతారా, పద్ధతిగా ఆలోచించి పరిష్కరిస్తారా? ఏదైనా అంశంపై ఏది పడితే అది మాట్లాడతారా, విమర్శనాత్మకంగా ఆలోచించి చెబుతారా? విశ్లేషణాత్మక శక్తి ఉందా లేదా? అని ఒక అభ్యర్థిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు పరీక్షిస్తారు. దాంతోపాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సునిశిత పరిశీలన లక్షణాలను గమనించడానికి లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులో భాగంగా క్రమానుగత శ్రేణి అధ్యాయంలో ఎడమ లేదా కుడి వైపు నుంచి అక్షరాలు, అంకెల వరుస నమూనాల మధ్య సంబంధాన్ని కనిపెట్టమంటారు. కొన్ని ప్రాథమిక వివరాలను తెలుసుకొని, కొద్దిగా ప్రాక్టీస్‌ చేస్తే తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. మార్కులు సంపాదించుకోవచ్చు.  

నిర్దిష్ట నియమాన్ని పాటించే సంఖ్యల లేదా అక్షరాల సముదాయాన్ని ‘శ్రేణి’ అంటారు. ప్రశ్నలో ఉన్న నియమాన్ని గుర్తించడానికి ఇచ్చిన అక్షరశ్రేణి లేదా అంకెల శ్రేణిలోని అంకెలు, అక్షరాల స్థానాలపై అవగాహన ఉండాలి. దానితో పాటుగా అభ్యర్థి ఆంగ్ల అక్షరమాలపై పట్టు సాధించాలి. 

పై అక్షరమాల క్రమం ఎడమ నుంచి కుడి వైపునకు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కుడి నుంచి ఎడమకు కూడా అక్షరాల స్థానంపై అవగాహన ఉండాలి. 

ఒకే అక్షరం యొక్క స్థానాల మొత్తం ఎడమ, కుడివైపు నుంచి 27 అవుతుంది. 

ఉదా: ఎడమ వైపు నుంచి T స్థానం = 20

        కుడి వైపు నుంచి T స్థానం =  7

            20 + 7 = 27


మాదిరి ప్రశ్నల

గమనిక: ఆంగ్ల అక్షరమాల క్రమంలో ఎడమ నుంచి కుడికి వెళ్తున్నప్పుడు కలపాలి. కుడి నుంచి ఎడమకు తీసివేయాలి.

1.  C, N ల మధ్య ఎన్ని అక్షరాలు ఉంటాయి? 

 1) 11     2) 10     3) 12     4) 9

సమాధానం: 10

వివరణ: C = 3, N = 14

         14 - 3 = 11

అక్షరాల మధ్య కాబట్టి 11 - 1 = 10

2.   G  నుంచి Vవరకు ఉన్న అక్షరాల సంఖ్య ఎంత?  

  1) 15     2) 14     3) 10     4) 16

సమాధానం: 16

వివరణ: G = 7, V = 22

       22 - 7 = 15

   G నుంచి V వరకు కాబట్టి 15 + 1 = 16

3.   K నుంచి 10వ అక్షరం ఏది?

  1) S   2) U    3) T    4) V

సమాధానం: T

వివరణ: K= 11 

         11 + 10 = 21

  K నుంచి కాబట్టి 21 - 1 = 20 = T

4.    D తర్వాత 10వ అక్షరం ఏది?

 1) N      2) M      3) O      4) L

సమాధానం: N

వివరణ: D = 4

        10+ 4 = 14

Dతర్వాత కాబట్టి = 14 = 

5.   ఆంగ్ల అక్షరమాలలో కుడి నుంచి ఎడమకు 16వ అక్షరం ఏది?

   1) P      2) K      3) L      4) Q

సమాధానం: K 

వివరణ: ఎడమ నుంచి కుడికి 16వ అక్షరం = P(16) 

 కుడి నుంచి ఎడమకు 16వ అక్షరం = 27 - 16 = 11 = K

6. BYAZYBCBYAYMNDYC శ్రేణిలో ఎక్కువ సార్లు పునరావృతమైన అక్షరం ఏది? 

 1) Y     2) A     3) B     4) C

సమాధానం: Y

వివరణ: Y అనేది 5 సార్లు పునరావృతమైంది.  

           A అనేది 2 సార్లు పునరావృతమైంది. 

          B అనేది 3 సార్లు పునరావృతమైంది. 

         C అనేది 2 సార్లు పునరావృతమైంది. 

7.    7345678934789101245 అనే శ్రేణిలో సరిసంఖ్యల మధ్య ఎన్ని 7లు ఎన్ని ఉన్నాయి? 

   1) 1     2) 3     3) 2     4) 0

సమాధానం: 3) 2

వివరణ: పరిశీలన ద్వారా 

సరిసంఖ్యల మధ్య రెండు 7 లు ఉన్నాయి.

8.    321323973234523032343 శ్రేణిలో ముందు 3 ఉండి తర్వాత 3 లేని 2లు ఎన్ని ఉన్నాయి?

  1) 0     2) 1     3) 2     4) 3

సమాధానం: 2) 1 

వివరణ: ఇచ్చిన శ్రేణి నుంచి పరిశీలన ద్వారా

       ముందు 3 ఉండి తర్వాత 3 లేని 2 ఒకసారి మాత్రమే వస్తుంది.   

9.    9 నుంచి 70 వరకు ఉండే సంఖ్యల్లో 7తో భాగించబడి 2తో భాగించబడని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?

   1) 4     2) 5     3) 3     4) 7

సమాధానం:  1) 4

వివరణ: 9 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యల్లో 7తో భాగించబడే సంఖ్యలు 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70.

వీటిలో 2తో భాగించబడని సంఖ్యలు 21, 35, 49, 63.

10.  ACKNOWLEDGEMENTఅనే పదంలోని అక్షరాలను అక్షరమాల క్రమంలో అమరిస్తే సరిగ్గా మధ్యలో ఉండే అక్షరం ఏది?

   1) L     2) K      3) G     4) E

సమాధానం: K

వివరణ: ACDEEEGKLMNNOTW

 సరిగ్గా మధ్యలో ఉండే అక్షరం = K

(11 - 14): కింది చిహ్నాలు, అక్షరాలు, అంకెల క్రమాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 

H@F!3U6%GITHPL8$Λ9S27&AMK+J©D4#5&E

11.  అక్షరానికి ముందు, తర్వాత చిహ్నాలు ఉన్న హల్లులు ఎన్ని ఉన్నాయి? 

    1) 0     2) 1     3) 2    4) 5

సమాధానం:  3) 2 

వివరణ: పరిశీలన ద్వారా

12.  ఇచ్చిన శ్రేణిలో చిహ్నాలన్నింటినీ తొలగిస్తే ఎడమవైపు నుంచి 12వ అక్షరం/అంకె ఏది?

   1) S     2) L     3) 8     4) 9

సమాధానం: 9

వివరణ: HF3U6GITPL89S27AMKJD45E

13.  ఇచ్చిన శ్రేణి ఆధారంగా కింది నాలుగింటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

 1) JD©   2) @!F   3) 6%G   4) AKM

సమాధానం: 6%G

వివరణ: శ్రేణిలో అంశాల స్థానాలు ఒక క్రమ పద్ధతిలో మారాయి కానీ, 6%బి  మాత్రం మారకుండా ఉంది.  

14.    ఇచ్చిన శ్రేణి ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన క్రమాన్ని గుర్తించండి.

          F3U, %IT, L$Λ, ?

 
    1) 7AM    2)  927    3) 7&A     4) 27&

సమాధానం: 7AM

వివరణ: పరిశీలన ద్వారా 7AM అవుతుంది.

గమనిక: * ఎడమ, కుడి ( L & R) లేదా కుడి, ఎడమ(R & L) అంటే  +

              * ఎడమ, ఎడమ(L & L) అంటే -

              * కుడి, కుడి (R & R) అంటే  -

15.    ఆంగ్ల అక్షరమాలలో ఎడమవైపు నుంచి 9వ అక్షరానికి కుడివైపున ఉండే 8వ అక్షరం ఏది?

          1) P    2) Q     3) L     4) R 

సమాధానం: Q

వివరణ: ఎడమ, కుడి కాబట్టి కలపాలి. 

   9 + 8 = 17 (ఇది ఎడమ నుంచి) = Q

16.  ఆంగ్ల అక్షరమాలలో కుడివైపు నుంచి 12వ అక్షరానికి ఎడమవైపున ఉండే 9వ అక్షరం ఏది?

1) U        2) V      3) F       4) G

సమాధానం:  F

వివరణ: కుడి, ఎడమ కాబట్టి కలపాలి

 12+ 9 = 21 (ఇది కుడివైపు నుంచి) 

         27 - 21 = 6 = F

17.   ఆంగ్ల అక్షరమాలలో ఎడమవైపు నుంచి 13వ అక్షరానికి ఎడమవైపున ఉండే 8వ అక్షరం ఏది?     

  1)  V      2) G      3) F       4)E

సమాధానం: E

వివరణ: ఎడమ, ఎడమ కాబట్టి తీసివేయాలి

 13 - 8 = 5 (ఇది ఎడమవైపు నుంచి)

18.   ఆంగ్ల అక్షరమాలలో కుడివైపు నుంచి 16వ అక్షరానికి కుడివైపున ఉండే 5వ అక్షరం ఏది? 

  1) P     2) K     3) L     4) Q

సమాధానం: P

వివరణ: కుడి, కుడి కాబట్టి తీసివేయాలి

            16 - 5 = 11 (ఇది కుడివైపు నుంచి)  

             27 - 11 = 16 = P

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 29-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌