• facebook
  • whatsapp
  • telegram

న్యాయసమీక్ష 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత రాజ్యాంగంలోని న్యాయసమీక్ష అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
జ: అమెరికా

 

2. సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రకటించింది?
జ: కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం

 

3. భారతదేశంలో న్యాయసమీక్షాధికారాలు ఎవరికి ఉన్నాయి?
జ: సుప్రీంకోర్టు, హైకోర్టులు

 

4. గోలక్‌నాథ్ వివాదం దేనికి సంబంధించింది?
జ: ప్రాథమిక హక్కులు

 

5. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయసమీక్షకు అవకాశం కల్పిస్తుంది?
జ: 13 వ ఆర్టికల్

 

6. సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారానికి నిదర్శనం?
జ: అమెరికా కంటే తక్కువగా ఉంటుంది.

 

7. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చకూడదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: శంకరీ ప్రసాద్ Vs భారత యూనియన్ - 1952

8. ఏ కేసులో సుప్రీంకోర్టు 'ఇప్పటి నుంచి చెల్లదనే' సిద్ధాంతాన్ని అవలంబించింది?
జ: గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం

 

9. ఏ కేసులో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్షల్ న్యాయసమీక్షాధికారాలను గుర్తించారు?
జ: మార్బురీ Vs మాడిసన్

 

10. జతపరచండి.

జాబితా-I జాబితా-II
ఎ) కేశవానంద భారతి కేసు 1) పార్లమెంటరీ సార్వభౌమాధికార సిద్ధాంతం
బి) గోలక్‌నాథ్ కేసు 2) భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం
సి) బ్యాంకుల జాతీయీకరణ 3) ప్రాథమిక హక్కులను సవరించకూడదు
డి) 25వ రాజ్యాంగ సవరణ 4) మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడం

 జ: ఎ-2 బి-3 సి-4 డి-1
 

11. భారతదేశంలో న్యాయసమీక్ష కిందివాటిలో దేనిపై ఆధారపడింది?
1) శాసనం రూపొందించిన కార్య విధానం (Procedure established by law)
2) శాసనానికి సంబంధించి తగిన విధానం (Due Process of law)
3) సమన్యాయపాలన
4) పూర్వ ఉదాహరణలు, సాంప్రదాయాలు
జ: 1 (శాసనం రూపొందించిన కార్య విధానం (Procedure established by law))

12. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 368 కింద ప్రాథమిక హక్కులను సవరించకూడదనే సత్యాన్ని ప్రతిపాదించింది?
1) గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం                 2) కేశవానంద భారతి Vs కేరళ రాష్ట్రం
3) గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం              4) మేనకా గాంధీ Vs కేంద్ర ప్రభుత్వం
జ: 3 (గోలక్‌నాథ్ Vs పంజాబ్ రాష్ట్రం)

13. కిందివాటిలో న్యాయసమీక్షకు కచ్చితమైన నిర్వచనం ఏది?
1) రాజకీయ నేరస్థులను రక్షించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
2) ప్రభుత్వ తప్పిదాలను సవరించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
3) వివిధ రకాలైన ఆదేశాలను జారీ చేయడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
4) శాసనాల న్యాయబద్ధతను వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం.
జ: 4 (శాసనాల న్యాయబద్ధతను వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు ఉండే అధికారం)

 

14. ప్రకరణ 368 ప్రకారం పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం లేదు. ఎందుకంటే?
జ: రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కాబట్టి

 

15. భారత సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ అంశాన్ని నిర్ధారించాలంటే?
1) కింది కోర్టు పనితీరును సమీక్షిస్తుంది.
2) తన సొంత నిర్ణయాలతో కేసులను పరిష్కరిస్తుంది.
3) తన తీర్పును తానే సమీక్షిస్తుంది.
4) శాసనసభ రూపొందించిన చట్టం, కార్యనిర్వహణ వర్గం జారీ చేసిన ఆర్డరు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టివేస్తుంది
జ: 4 (శాసనసభ రూపొందించిన చట్టం, కార్యనిర్వహణ వర్గం జారీ చేసిన ఆర్డరు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టివేస్తుంది)

16. కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు నుంచి చేసిన రాజ్యాంగ సవరణలకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు వామన్‌రావు కేసులో స్పష్టం చేసింది. కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు?
జ: ఏప్రిల్ 24, 1973

 

17. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించే సిద్ధాంతం?
జ: రాజ్యాంగ మౌలిక స్వరూపం, స్వభావాన్ని మార్చడానికి వీల్లేదు

 

18. ఏ కేసులో సుప్రీంకోర్టు 'రాజ్యాంగ సభ' ప్రాథమిక హక్కులను సవరణ చేస్తుందని తీర్పు ఇచ్చింది?
జ: గోలక్‌నాథ్ కేసు

 

19. కిందివాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది?
1) సమాఖ్య      2) లౌకికవాదం    3) న్యాయసమీక్షాధికారం     4) న్యాయస్థాన క్రియాశీలత
జ: 4 (న్యాయస్థాన క్రియాశీలత)

 

20. భారతదేశంలో న్యాయసమీక్షను ఎందులో పొందుపరిచారు?
జ: రాజ్యాంగం

 

21. 24వ రాజ్యాంగ సవరణను ఏ కేసులో ప్రశ్నించారు?
జ: కేశవానంద భారతి కేసు

 

22. సుప్రీంకోర్టు మినర్వామిల్స్ కేసులో ఏ కేసుకు సంబంధించిన అంశాలను మార్పు చేసింది?
జ: కేశవానంద భారతి కేసు

23. కింది నిర్వచనాలలో సరైంది గుర్తించండి.
1) మౌలిక స్వరూపం అంటే ఏమిటో రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది
2) సుప్రీంకోర్టు, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరణాత్మకంగా నిర్వచించింది
3) భారత అటార్నీ జనరల్ సహాయంతో భారత లా కమిషన్ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.
4) సుప్రీంకోర్టుగానీ పార్లమెంటుగానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించలేదు
జ: 4 (సుప్రీంకోర్టుగానీ పార్లమెంటుగానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించలేదు)

 

24. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కల్పించారు?
జ: 42వ

 

25. ఆర్టికల్ 31c, 368 కి జరిపిన రాజ్యాంగ సవరణ చెల్లదని 1980 లో సుప్రీంకోర్టు ఏ కేసులో వెల్లడించింది?
జ: మినర్వామిల్స్ కేసు

 

26. రాజ్యాంగంలోని 39(c) అధికరణ ఉద్దేశం?
జ: సంపద కొందరి వద్దే కేంద్రీకృతం కాకుండా అడ్డుకోవడం

 

27. అధికరణ 13(3)(a) దేని అర్థాన్ని తెలుపుతుంది?
జ: చట్టం

28. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని/ ఏదైనా ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: మినర్వామిల్స్

 

29. చట్టసభలు చేసే చట్టాలు, రెగ్యులేషన్స్‌ను చెల్లుబాటు చేసే అధికరణం?
జ: ఆర్టికల్ 31B

 

30. ఏ సవరణ రాజ్యాంగ సవరణ చట్టం కాదని తెలియజేసింది?
జ: 24

 

31. గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అంటే ఇచ్చిన వివరణ?
జ: లా కాదు

32. రాజ్యాంగంలోని సాంఘిక, ఆర్థిక సంక్షేమాల అంశం/అధికరణ?
జ: 39(b), (c)

 

33. 31వ అధికరణం కల్పించిన ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు?
జ: 44వ సవరణ

 

34. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోని అంశాలు చట్టాల చెల్లుబాటును ఏ అధికరణం ప్రకారం ప్రశ్నించకూడదు?
జ: 31(b)

35. కింద పేర్కొన్న ఏ కేసులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
ఎ) గోలక్‌నాథ్ కేసు        బి) సజ్జన్ సింగ్ కేసు       సి) శంకరీ ప్రసాద్ కేసు
జ: బి, సి మాత్రమే

 

36. ఏ అధికరణం ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరించకూడదు?
జ: 13(2)

 

37. రాజ్యాంగానికి ముందునుంచి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే అధికరణం?
జ: 13(1)

 

38. 31(C), 39(B), 39(C) అధికరణాల కింద చేసే చట్టం 14వ అధికరణాన్ని తిరస్కరించవచ్చు. ఇది ఏ రాజ్యాంగ సవరణ కింద సాధ్యపడుతుంది?
జ: 24వ

 

39. 'Procedure established by law' నుంచి 'Due process of law' వరకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించిన వివాదం?
జ: మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా

40. కిందివాటిని కాలక్రమం ఆధారంగా గుర్తించండి.
ఎ) కేశవానంద భారతి కేసు    బి) గోలక్‌నాథ్ కేసు    సి) మినర్వామిల్స్ కేసు     డి) సజ్జన్‌సింగ్ కేసు
జ: డి, బి, ఎ, సి

 

41. కిందివాటిని కాలక్రమం ఆధారంగా గుర్తించండి.
ఎ) చంపకం దొరైరాజన్ కేసు           బి) శంకరీ ప్రసాద్ కేసు
సి) సజ్జన్ సింగ్ కేసు                  డి) గోలక్‌నాథ్ కేసు
జ: ఎ, బి, సి, డి

 

42. 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలను చేసినప్పుడు భారత ప్రధాని ఎవరు?
జ: ఇందిరాగాంధీ

 

43. 24, 25, 26 వ రాజ్యాంగ సవరణ చట్టాలు చేసిన సంవత్సరం?
జ: 1971

 

44. ప్రకరణ 368 కి లోబడి చేసిన సవరణకు ప్రకరణ 13 లోని ఏదీ వర్తించదని చెప్పే నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
జ: 24 వ సవరణ చట్టం

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌