• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ సాయుధ దళాల సైనిక విన్యాసాలు

* ఇవి యుద్ధ క్షేత్రంలో జరగని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ సైనిక విన్యాసాలు. 

* భారతదేశ  ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాలు వివిధ దేశాలు లేదా శత్రుదేశాల యుద్ధ తంత్రాలను పరిశీలించడానికి, వివిధ యుద్ధ రీతుల్లో నూతన సాంకేతికతను తెలుసుకోవడానికి, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న మెరుగైన యుద్ధ నైపుణ్యాల్లో సాయుధ దళ సిబ్బందికి తర్ఫీదు ఇవ్వడానికి ఎంతగానో తోడ్పడతాయి.

* విపత్తు సమయాల్లో సత్వర ప్రతిస్పందనకు, అలాంటి సమయాల్లో పౌర సమాజంలో మానవ విలువలను పెంపొందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. 

ద్వైపాక్షిక విన్యాసాలు

వీటిని భారత్‌ ఇతర దేశాలతో కలిసి నిర్వహిస్తుంది. ఈ విన్యాసాల్లో ముఖ్యమైనవి:

సంప్రీతి: ఇది భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే సంయుక్త మిలటరీ శిక్షణ విన్యాసం. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో భాగంగా దీన్ని నిర్వహిస్తారు. 

*  సంప్రీతిని 2022, జూన్‌ 5 నుంచి 16 వరకు బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌ మిలటరీ కేంద్రంలో నిర్వహించారు. 

*  ఇందులో ఉగ్రవాద నిరోధానికి, విపత్తు నివారణకు, ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ నిర్వహణకు కావాల్సిన సహాయ సహకారాలను రెండు దేశాలు పరస్పరం అందిపుచ్చుకుంటాయి.

నొమాడిక్‌ ఎలిఫెంట్‌: భారత్, మంగోలియా మధ్య నిర్వహించే ఆర్మీ విన్యాసం. 

*  దీని 14వ ఎడిషన్‌ను 2019, అక్టోబరులో హిమాచల్‌ ప్రదేశ్‌లో నిర్వహించారు. 

*  ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఉగ్రవాద నిరోధం, రెండు దేశాల మైత్రిలో భాగంగా పరస్పర రక్షణ సహకారాన్ని అందించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.

ధర్మ గార్డియన్‌: భారత్, జపాన్‌ దేశాలు ఏటా నిర్వహించే మిలటరీ ఎక్సర్‌సైజ్‌. దీన్ని 2022, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు కర్ణాటకలో నిర్వహించారు.

*  ఈ విన్యాసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన అధునాతన చర్యలు, యుద్ధ నైపుణ్యాలను రెండు దేశాలు పరస్పరం పంచుకున్నాయి. 

సూర్య కిరణ్‌: భారత్, నేపాల్‌ సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక మిలటరీ విన్యాసం. ఇందులో రెండు దేశాలకు చెందిన సైన్యాలు పాల్గొంటాయి. 

*  సూర్య కిరణ్‌ పదిహేనో విడత విన్యాసాలను 2021, సెప్టెంబరు 20న ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో నిర్వహించారు. 

హ్యాండ్‌ ఇన్‌ హ్యాండ్‌: భారత్, చైనా సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక మిలటరీ విన్యాసం. దీని ఎనిమిదో విడత విన్యాసాలను 2019, డిసెంబరులో మేఘాలయలో నిర్వహించారు. 

*  వీటిని ముఖ్యంగా ఉగ్రవాద అణచివేతకు, విపత్తు నిర్వహణలకు ఉద్దేశించారు. 


Naseem-Al-Bahr or Sea Breeze:

*  భారత్, ఒమన్‌ సంయుక్తంగా నిర్వహిస్తాయి. రెండు దేశాల మధ్య 1993 నుంచి సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. 

*  ఇందులో ఇండియన్‌ నేవీ, రాయల్‌ నేవీ ఆఫ్‌ ఒమన్‌ పాల్గొంటాయి.  

*  దీని పదో ఎడిషన్‌ విన్యాసాలు 2018, జనవరి 22 నుంచి 27 మధ్య జరిగాయి.

*   ఇందులో ముఖ్యంగా ఉగ్రవాద అణచివేతకు, వివిధ యుద్ధాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. 

ఇంద్ర: ఇది 2003లో ప్రారంభమైంది. ఇందులో భారత్, రష్యా సైన్యాలు పాల్గొంటాయి. 

*  ఇంద్ర 11వ ఎడిషన్‌ జాయింట్‌ ఎక్సర్‌సైజ్‌ను రష్యాలోని వోల్గోగ్రాడ్‌లో 2021, ఆగస్టు 1 నుంచి 13 వరకు నిర్వహించారు.

* ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయాలనే వ్యూహంతో దీన్ని రూపొందించారు. 

* రెండు దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. 

* ఈ విన్యాసాల ద్వారా భారత్‌కు కావాల్సిన అధునాతన సాంకేతికతను రష్యా రూపొందించి, అందిస్తుంది.


SIMBEX  (Singapore India Maritime Bilateral Exercise):

* ఇది 1994లో ప్రారంభమైది. భారత్, సింగపూర్‌కు చెందిన నావికా దళాలు ఇందులో పాల్గొంటాయి. 

* SIMBEX 28వ ఎడిషన్‌ మారీటైం ద్వైపాక్షిక విన్యాసాలను దక్షిణ చైనా సముద్రంలో నిర్వహించారు. 

* భారత నావికా దళం విదేశీ నావికాదళంతో చేసే దీర్ఘకాల విన్యాసంగా దీన్ని పేర్కొంటారు 

* వీటి ద్వారా సబ్‌మెరైన్‌ల రక్షణ, సమన్వయం; రెండు దేశాల మధ్య ఉండే భాగస్వామ్యం, వారి వ్యూహాత్మక విధానాల పరస్పర చర్యలు మొదలైన వాటిని రూపొందిస్తారు.  

లామిటై: ఇందులో ఇండియన్‌ ఆర్మీ, సీషెల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పాల్గొంటాయి. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2001 నుంచి ఈ జాయింట్‌ ఎక్సర్‌సైజ్‌ను నిర్వహిస్తున్నారు.

* లామిటై తొమ్మిదో ఎడిషన్‌ విన్యాసాలు సీషెల్స్‌ డిఫెన్స్‌ అకాడమీలో 2022, మార్చి 22 - 31 మధ్య జరిగాయి. 

* రెండు దేశాల మధ్య రక్షణ రంగ సంబంధ నైపుణ్యాలు, అనుభవాలను పంచుకోవడంతో పాటు స్నేహ భావాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.


Desert Eagle:

* భారత్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాయు దళాలు సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక విన్యాసం. 

* ఈ విన్యాసాలను అబుదాబిలోని అల్‌ - దాఫ్రా ఎయిర్‌ బేస్‌లో 2016, మే 22 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించారు.

* ఎయిర్‌ కంబాట్‌ ఆపరేషన్లలో శిక్షణ ఇవ్వడం, రెండు దేశాల ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది పరస్పర సహకారం అందించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.

యుద్ధ్‌ అభ్యాస్‌: భారత్, అమెరికా సైన్యాలు ఇందులో పాల్గొంటాయి. దీని 17వ ఎడిషన్‌ను అలస్కాలోని జాయింట్‌ బేస్‌ ఎల్మండోర్స్‌ రిచర్డ్‌ సన్‌లో 2021, అక్టోబరు 15 నుంచి 29 వరకు నిర్వహించారు.

* ఇది భారత రక్షణ భాగస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సైనిక విన్యాసం. 

* రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా అతిశీతల ప్రదేశాలు, పర్వత ప్రాంతాల్లో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవటం ఈ సైనిక విన్యాస వ్యూహంగా ఉంటుంది.  

శక్తి: ఇది ఇండో - ఫ్రాన్స్‌ జాయింట్‌ మిలటరీ ఎక్సర్‌సైజ్‌. దీని ఆరో ఎడిషన్‌ను 2021, నవంబరు 15 - 21 మధ్య నిర్వహించారు. 

*  దీని ముఖ్య ఉద్దేశం రెండు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధం, పరస్పర సైనిక సహకారం.

మిత్ర శక్తి: ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీని ఎనిమిదో ఎడిషన్‌ విన్యాసాలు శ్రీలంకలోని అంపారలో 2021, అక్టోబరు 4 - 16 మధ్య జరిగాయి. 

* దీని ముఖ్య ఉద్దేశం రక్షణ రంగంలో పరస్పర సహకారం, ఐక్యరాజ్యసమితి నిర్దేశిత ఉగ్రవాద అణిచివేత.

అజేయ వారియర్‌: ఇది భారత్, యూకే జాయింట్‌ కంపెనీ లెవల్‌ మిలటరీ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌.

* దీని ఆరో ఎడిషన్‌ను ఉత్తరాఖండ్‌లోని చౌబాటియాలో 2021, అక్టోబరు 6 నుంచి 20 వరకు నిర్వహించారు. 

* రెండు దేశాల మధ్య మైత్రీ భావాన్ని పెంపొందించుకోవడానికి ఈ విన్యాసాలు జరుపుతారు.

బహుపాక్షిక విన్యాసాలు


RIMPAC (Rim Of The Pacific): 

* ఆసియా ఖండంలో పసిఫిక్‌ మహా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు చేసే విన్యాసం. ఇందులో 26 సభ్య దేశాలు పాల్గొంటాయి.

* ఈ విన్యాసాలు 2016లో ప్రారంభమయ్యాయి.

* ఇందులో పాల్గొనే సభ్యదేశాలు అతి క్లిష్టమైన యుద్ధ నైపుణ్యాలు, విపత్తు సమయంలో ఉపశమన చర్యలు, సముద్ర ప్రాంత నిర్వహణల్లో పరస్పర భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

సంవేదన: దక్షిణాసియా దేశాల ఎయిర్‌ ఫోర్సులు కలిసి నిర్వహిస్తాయి. అవి: శ్రీలంక బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, భారతదేశం. 

* ఈ విన్యాసాలను విపత్తు నిర్వహణలో భాగంగా 2018, మార్చిలో కేరళలో జరిపారు.

* వీటి ముఖ్య ఉద్దేశం విపత్తు నిర్వహణ సమయంలో మానవతా సహాయం.  

మలబార్‌ విన్యాసం: ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్‌ నావికాదళాలు పాల్గొంటాయి. ఈ నాలుగు శీగీతిదీ దేశాలుగా పేరొందాయి. 

* ఈ విన్యాసాలను 2020, నవంబరులో నిర్వహించారు. 

కోబ్రా గోల్డ్‌: ఈ విన్యాసాన్ని ఏటా థాయ్‌లాండ్‌లో నిర్వహిస్తారు. ఇది ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో నిర్వహించే అతిపెద్ద సైనిక విన్యాసం. ఇందులో 27 దేశాలకు చెందిన సాయుధ దళాలు పాల్గొంటాయి.

* 2020, ఫిబ్రవరి 25 - మార్చి 6 వరకు ఈ విన్యాసాలను నిర్వహించారు.

స్వదేశీ సైనిక విన్యాసాలు

గాండీవ్‌ విజయ్‌: భారత సాయుధ దళాలను అత్యంత వేగంగా మోహరించడానికి, శత్రుదేశాల సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి, వివిధ విభాగాల మధ్య సమన్వయానికి ఇండియన్‌ ఆర్మీ ఈ విన్యాసాన్ని నిర్వహిస్తుంది.

* దీన్ని 2018లో రాజస్థాన్‌లో నిర్వహించారు. ఇది రెండు నెలలు నిర్వహించే దీర్ఘకాల శిక్షణా విన్యాసం. 

* యుద్ధ సమయంలో పదాతి దళం (infantry), శతాగ్ని దళం (artillery), యాంత్రిక వాహనాల తక్షణ ప్రతిస్పందనకు కావాల్సిన సమన్వయం కోసం ఈ విన్యాసాలను జరుపుతారు. 

పశ్చిమ్‌ లెహర్‌: దీన్ని వెస్ట్రన్‌ నావెల్‌ కమాండ్‌ నిర్వహిస్తుంది. ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, కోస్ట్‌ గార్డ్స్‌ మధ్య సమన్వయం కోసం దీన్ని చేపడతారు. ఇది 20 రోజులు నిర్వహించే స్వదేశీ విన్యాసం. 

* దీన్ని 2018, 2022లో నిర్వహించారు. 

* భారత వాయు దళానికి చెందిన అత్యంత అధునాతన ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, ళ్యీ30లీరీఖి వాహక నౌక పాల్గొన్నాయి.  

వాయు శక్తి: దీన్ని మూడేళ్లకోసారి భారత వాయు దళం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతంలో నిర్వహిస్తుంది. 

* దీన్ని 2019లో జరిపారు. ప్రస్తుత రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 2022లో నిర్వహించాల్సిన  వాయుశక్తి విన్యాసాన్ని వాయిదా వేశారు. 

* ఈ విన్యాసాలను భారత ఎయిర్‌ ఫోర్స్‌ ప్రదర్శిస్తుంది. ఇందులో భారత వాయుదళానికి చెందిన హెలికాప్టర్లు, అతి తక్కువ బరువున్న ఎయిర్‌క్రాఫ్ట్స్, అధునాతన సాంకేతికత కలిగిన డ్రోన్లను ప్రదర్శిస్తారు.  

విజయ్‌ ప్రహార్‌: ఇది సౌత్‌ వెస్ట్రన్‌ కమాండ్‌ నిర్వహించే స్వదేశీ సైనిక విన్యాసం. దీన్ని రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌ ప్రాంతంలో నెలపాటు జరుపుతారు. 

* అణ్వాయుధ, రసాయన, జీవ సంబంధ దాడులను భారత్‌ ఎలా ఎదుర్కోగలదో తెలపడమే ఈ విన్యాసం ముఖ్య ఉద్దేశం. 

* దీన్ని 2018, మేలో నిర్వహించారు.

Posted Date : 25-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌