• facebook
  • whatsapp
  • telegram

అణుజీవశాస్త్రం

1. అణుజీవశాస్త్రం ప్రకారం జన్యు సమాచారం మానవుల్లో ఏ రూపంలో ఉంటుంది?

జ‌: డీఎన్‌ఏ     


2. జన్యు సమాచారం డీఎన్‌ఏ నుంచి mRNAరూపంలోకి బదిలీ అవడం ఏ ప్రక్రియలో జరుగుతుంది?

జ‌: ప్రోటీన్‌ జీవసంశ్లేషణ


3. జన్యువు అనేది కింది దేనిలో భాగం?

జ‌: డీఎన్‌ఏ    

4. జన్యు సమాచారం డీఎన్‌ఏ నుంచి mRNAరూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు?

జ‌: అనులేఖనం

5. జన్యు వ్యక్తీకరణ ప్రధానంగా ఏవిధంగా జరుగుతుంది?

జ‌: జన్యువు నుంచి చైతన్యవంతమైన పాలీపెప్టైడ్‌ శృంఖలం ఏర్పడటం ద్వారా

6. జన్యు వ్యక్తీకరణ ఏ విధంగా దృశ్యమానం అవుతుంది?

జ‌:  జన్యువుల వివిధ బాహ్యస్వరూప లక్షణాల ద్వారా  

7. mRNA అంటే ఏమిటి?

i) రాయబారి ఆర్‌ఎన్‌ఏ     ii) వార్తాహర ఆర్‌ఎన్‌ఏ  iii) బదిలీ ఆర్‌ఎన్‌ఏ

జ‌:   i, ii   


8. అనులేఖనానికి కావాల్సిన ఎన్‌జైమ్‌.....

జ‌:   ఆర్‌ఎన్‌ఏ పాలిమరేజ్‌ 


9. సిగ్మాకారకం కింది ఏ ఎన్‌జైమ్‌లో భాగం?

జ‌:  ఆర్‌ఎన్‌ఏ పాలిమరేజ్‌


10. ప్రోటీన్‌ల జీవసంశ్లేషణలో tRNAలు ఎక్కడ పాల్గొంటాయి?

జ‌:  అనువాదం     


11. పాలీసిస్ట్రానిక్‌ mRNA  అంటే ఏమిటి?

జ‌: mRNAపై ఎక్కువ సంఖ్యలో సిస్ట్రాన్‌లు అమరి ఉండటం 

12. సిస్ట్రాన్‌ అంటే ఏమిటి?

జ‌:  జన్యువు వ్యక్తీకరణలో భాగంగా ఒక క్రియాత్మక పాలీపెప్టైడ్‌ను ఏర్పరిచే జన్యుపదార్థ భాగం. 


13. ఎమైనో ఆమ్లాలను గుర్తించి, వాటిని mRNA అణువు దగ్గరకు చేర్చే విధిని నిర్వర్తించేవి.....

జ‌: tRNA        


14. mRNA ఉద్భవించాక, దాని నుంచి ప్రోటీన్‌ ఏర్పడే విధానాన్ని ఏమంటారు?

జ‌: అనువాదం 


15. కిందివాటిలో ప్రోటీన్‌ల జీవసంశ్లేషణలో పాల్గొనేవి ఏవి?

i) రైబోజోమ్‌లు    ii) mRNA      iii) tRNA    iv) కణత్వచం 

జ‌: i, ii, iii    


16. జన్యుసంకేతం ఏ రూపంలో ఉంటుంది? 

జ‌: కోడాన్‌ 


17. జన్యుసంకేతాన్ని గుర్తించే యాంటీ కోడాన్‌లను కలిగిఉండే భాగాలు.....

జ‌: ట్రాన్స్‌ఫర్‌ ఆర్‌ఎన్‌ఏ  


18. రైబోజోమ్‌లు సాధారణంగా రెండు ఉపప్రమాణాలు కలవడం వల్ల ఏర్పడతాయి. అయితే సంపూరణ రైబోజోమ్‌లు కింది ఏ జీవక్రియలో భాగంగా ఏర్పడతాయి?

జ‌: ప్రోటీన్‌ జీవసంశ్లేషణ  


19. కోడాన్‌లో ఉండే నత్రజని క్షారాల సంఖ్య...

జ‌: 3  


20. mRNA పై ‘AUG’ అనే కోడాన్‌ను గుర్తించగల యాంటీకోడాన్‌.......

జ‌:  UAC   

21. ప్రోటీన్‌ జీవసంశ్లేషణను సూచించే రేఖాపటాన్ని గుర్తించండి.

జ‌:  డీఎన్‌ఏ   mRNA ప్రోటీన్‌ 


22. అనువాదం జరిగే సమయంలో ప్రారంభ కోడాన్‌లుగా వ్యవహరించేవి........

జ‌:  AUG, GUG   


23. mRNA కింది ఏ జీవుల్లో పాలీసిస్ట్రానిక్‌గా ఉంటుంది?

జ‌: బ్యాక్టీరియా  


24. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?

i) కేంద్రక పూర్వ జీవుల ప్రోటీన్‌ జీవసంశ్లేషణలో అనులేఖనం, అనువాదాలు ప్రధాన ఘట్టాలు. ఇవి ఒకే చోట అంటే కణద్రవ్యంలోనే జరుగుతాయి.

ii) నిజకేంద్రక జీవుల ప్రోటీన్‌ జీవసంశ్లేషణలో ప్రధాన ఘట్టాలైన అనులేఖనం, అనువాదాలు వేర్వేరు స్థానాల్లో జరుగుతాయి.

iii) కేంద్రక పూర్వ జీవుల్లో కంటే నిజకేంద్రక జీవుల్లో సంక్లిష్టమైన ప్రోటీన్‌ జీవన సంశ్లేషణ విధానాన్ని గమనించవచ్చు.

జ‌:  i, ii, iii, iv


25. కింది అంశాలను జతపరచండి.

      జాబితా - ఎ                 జాబితా - బి

i) మోనోశాఖరైడ్‌లు             a) కొవ్వులు 

ii) ఎమైనో ఆమ్లాలు             b) కేంద్రకామ్లాలు

iii) న్యూక్లియోటైడ్‌లు           c) పాలీపెప్టైడ్‌లు

iv)  గ్లిసరాల్‌                      d) కార్బోహైడ్రేట్‌లు

జ‌:  i-d, ii-c, iii-b, iv-a


26. ఒపెరాన్‌ భావన దేన్ని విశదీకరిసుంది?

జ‌: జన్యు వ్యక్తీకరణ సమయంలో జన్యువుల నియంత్రణ గురించి తెలుపుతుంది.


27. కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఒపెరాన్‌ భావన లేదా ఒపెరాన్‌ పరికల్పనను జాకబ్, మోనాజ్‌ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

ii) ఒపెరాన్‌ పరికల్పన ఆవిష్కరణకుగానూ వారికి నోబెల్‌ పురస్కారం దక్కింది.

iii) కేంద్రక పూర్వ కణం అయిన ఎశ్చరీషియా కొలై అనే బ్యాక్టీరియంలో ఒపెరాన్‌ భావనను కనుక్కున్నారు.

జ‌:  i, ii, iii


28. ఒపెరాన్‌ అంటే.....

జ‌: ‘ఆపరేటర్‌’ ద్వారా జన్యు వ్యక్తీకరణను సమన్వయం చేస్తున్న నిర్మాణాత్మక జన్యువులు లేదా సిస్ట్రాన్‌ల సమూహం.

29. ఒపెరాన్‌ పరికల్పన ప్రకారం కంట్రోలింగ్‌ యూనిట్‌లో ఉండే ప్రధాన భాగాలు కిందివాటిలో ఏవి?

i) రెగ్యులేటరీ జీన్‌      ii) ఆపరేటర్‌ జీన్‌      iii) సిస్ట్రాన్‌లు

జ‌: i, ii     


30. ఒపెరాన్‌ భావన ప్రకారం రిప్రెసర్‌ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు ఏది?

జ‌: రెగ్యులేటరీ జీన్‌


31. ఆర్‌ఎన్‌ఏ పాలిమరేజ్‌ అనులేఖనం జరిగే సమయంలో ఏ స్థానంలో అతుక్కుంటుంది?

జ‌:  ప్రొమోటర్‌


32. కింది అంశాలను జతపరచండి.

           జాబితా - ఎ                      జాబితా - బి

i) కేంద్రక పూర్వ జీవులలో కనిపించే              a) Mg2+

 రైబోజోమ్‌ ఉప ప్రమాణాలు                            

ii) నిజకేంద్రక జీవులలో కనిపించే                 b) tRNA  

 రైబోజోమల్‌ ఉప ప్రమాణాలు                              

iii) ఎమైనో ఆమ్లాలను మోసుకు పోయేది   c) 40S + 60S

iv) రైబోజోమ్‌ల ఉప ప్రమాణాలను                d) 30S + 50S

 కలిపే సమయంలో అవసరమైంది                 e) Ca2+

                                    f) mRNA 

జ‌: i-d; ii-c; iii-b; iv-a

33. hn RNA ఏ జీవుల్లో కనిపిస్తుంది?

జ‌: నిజకేంద్రక జీవులు


34. hn RNA అంటే ఏమిటి?

జ‌: హెటిరోజెనస్‌ న్యూక్లియర్‌ ఆర్‌ఎన్‌ఏ


35. hn RNA ఎక్కడ ఉత్పత్తి అవుతుంది?

జ‌: కేంద్రక ద్రవ్యం    


36. అనులేఖనం జరిగిన వెంటనే నిజకేంద్రక కణాల్లో కింది ఏ దశలు జరగడం ద్వారా mRNA ఏర్పాటు అవుతుంది?

i)  స్ల్పైసింగ్‌     ii) కాసింగ్, టైలింగ్‌     iii) కాపీయింగ్, కటింగ్‌

జ‌:  i, ii


37. నిజకేంద్రక జీవుల్లో mRNA దేని నుంచి ఏర్పడుతుంది?

జ‌:  hn RNA


38. ఒక జన్యువులో ఉత్పరివర్తనాలు జరగగలిగే భాగం....

జ‌: మ్యూటాన్‌

Posted Date : 27-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌