• facebook
  • whatsapp
  • telegram

జీవాణువులు

1. కిందివాటిలో స్థూల పోషకాలు కానివి?

1) కొవ్వులు   2) పిండి పదార్థాలు     3)1, 2    4)విటమిన్లు


2. కిందివాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి?

1) విటమిన్లు   2) ఖనిజ మూలకాలు 

3) 1, 2    4) మాంసకృతులు


3. కిందివాటిలో జీవుల శక్తి వనరులు ఏవి?

1) పిండి పదార్థాలు    2) విటమిన్లు 

3) మాంసకృతులు   4)ఖనిజ లవణాలు


4. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్‌ లేదా కీటోన్లను ఏమంటారు?

1) విటమిన్లు     2) మాంసకృతులు 

3) పిండి పదార్థాలు    4) రంజనాలు


5. అయోడిన్‌ పరీక్ష ద్వారా కింది ఏ పోషక పదార్థాలను గుర్తించవచ్చు?

1) కొవ్వులు      2) మాంసకృతులు 

3) పిండి పదార్థాలు   4) పైవన్నీ


6. కింది అంశాలను జతపరచండి.

  జాబితా - I      జాబితా - II

a) పిండిపదార్థం    i) కెరాటిన్‌

b) ప్రోటీన్‌        ii) ఆస్కార్బిక్‌ ఆమ్లం

c) విటమిన్‌ - సి   iii) కాల్షియం

d) సూక్ష్మ పోషకం  iv) గ్లూకోజ్‌

1) a-iv, b-ii, c-i, d-iii      2) a-iv, b-i, c-ii, d-iii

3) a-i, b-iv, c-ii, d-iii     4) a-iv, b-i, c-iii, d-ii


7. కింది ఏ కార్బోహైడ్రేట్‌లను మోనోశాకరైడ్‌లు అంటారు?

1) గ్లూకోజ్‌   2) ఫ్రక్టోజ్‌    3) గాలక్టోజ్‌    4) పైవన్నీ


8. కిందివాటిలో సరైంది ఏది?

i) జలవిశ్లేషణ చెందినప్పుడు రెండు మోనోశాకరైడ్‌ అణువులను ఏర్పరిచే కార్బోహైడ్రేట్‌లను డైశాకరైడ్‌లు అంటారు.

ii) జలవిశ్లేషణ చెందినప్పుడు అధిక సంఖ్యలో మోనోశాకరైడ్‌ అణువులను ఏర్పరిచే కార్బోహైడ్రేట్‌లను పాలీశాకరైడ్‌లు అంటారు.

1)  i మాత్రమే     2) ii మాత్రమే 

3) i, ii     4) ఏదీకాదు


9. కిందివాటిలో డైశాకరైడ్‌ ఏది?

1) లాక్టోజ్‌    2) మాల్టోజ్‌    3) సుక్రోజ్‌    4) పైవన్నీ


10. కిందివాటిలో సరైనవి ఏవి?

i) సుక్రోజ్‌ను జలవిశ్లేషణ చెందిస్తే గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ అనే మోనోశాకరైడ్‌లు ఏర్పడతాయి.

ii) లాక్టోజ్‌ను జలవిశ్లేషణ చెందిస్తే గ్లూకోజ్, గాలక్టోజ్‌ అనే మోనోశాకరైడ్‌లు ఏర్పడతాయి.

iii)  మాల్టోజ్‌ను జలవిశ్లేషణ చెందిస్తే రెండు గ్లూకోజ్‌ అణువులు ఏర్పడతాయి.

iv) గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు సులభంగా నీటిలో కరిగి, శక్తిని ఇస్తాయి.

1) i, ii      2) i, iii     3) iii, iv   4) పైవన్నీ


11. క్రీడాకారులకు తక్షణ శక్తి వనరుగా కింది దేన్ని ఇస్తారు?

1) ఫ్రక్టోజ్‌    2) గ్లూకోజ్‌   3) లాక్టోజ్‌    4) పైవన్నీ


12. కిందివాటిలో గ్రేప్‌ షుగర్‌  (grape sugar) అని దేన్ని పిలుస్తారు?

1) ఫ్రక్టోజ్‌   2) సుక్రోజ్‌    3) గ్లూకోజ్‌     4) లాక్టోజ్‌


13. కిందివాటిలో సరైంది ఏది?

i) కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి.

ii) రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ నియంత్రిస్తుంది.

1)  i మాత్రమే   2)  ii మాత్రమే   3) i, ii     4) ఏదీకాదు


14. కిందివాటిలో దేన్ని పండ్ల చక్కెర (Fruit Sugar) అంటారు?

1) గ్లూకోజ్‌   2) ఫ్రక్టోజ్‌    3) సుక్రోజ్‌    4) లాక్టోజ్‌


15. కిందివాటిలో అతి తియ్యటి చక్కెర ఏది?

1) గ్లూకోజ్‌   2) ఫ్రక్టోజ్‌    3) లాక్టోజ్‌     4) మాల్టోజ్‌


16. కింది అంశాలను జతపరచండి.

 జాబితా - I        జాబితా -II 

a) బ్లడ్‌ షుగర్‌      i) లాక్టోజ్‌

b) మిల్క్‌ షుగర్‌     ii) మాల్టోజ్‌

c) మాల్ట్‌ షుగర్‌     iii) గ్లూకోజ్‌

1) a-iii, b-ii, c-i   2) a-ii, b-i, c-iii   3) a-iii, b-i, c-ii   4) a-i, b-iii, c-ii

17. కిందివాటిలో పాలీశాకరైడ్‌కు ఉదాహరణ ఏది?

1) స్టార్చ్‌   2)  సెల్యులోజ్‌    3) 1, 2     4) సుక్రోజ్‌


18. కిందివాటిలో సరైంది ఏది?


i) స్టార్చ్‌ మొక్కల్లో మాత్రమే ఉంటుంది, జంతువుల్లో ఉండదు.


ii)  గ్లైకోజన్‌ మొక్కల్లో ఉండదు, జంతువుల్లో మాత్రమే ఉంటుంది.

1)  i మాత్రమే     2)  ii మాత్రమే    3) i, ii     4) ఏదీకాదు


19. కిందివాటిలో ‘కేన్‌ షుగర్‌’ లేదా ‘టేబుల్‌ షుగర్‌’ అని దేన్ని అంటారు?

1) సుక్రోజ్‌    2) ఫ్రక్టోజ్‌   3) స్టార్చ్‌     4) సెల్యులోజ్‌


20. అత్యంత సమృద్ధిగా లభించే సహజ పాలిమర్‌ ఏది?

1) మాల్టోజ్‌     2) సెల్యులోజ్‌    3) స్టార్చ్‌     4) గ్లైకోజన్‌


21. కింది ఏ జీవాణువులను ‘దేహ నిర్మాణాలు’ అంటారు?

1) పిండి పదార్థాలు   2) మాంసకృతులు లేదా ప్రోటీన్‌లు

3) విటమిన్లు   4) సూక్ష్మ పోషకాలు


22. కింది అంశాలను జతపరచండి.

 ప్రోటీన్‌        లభించే పదార్థం

a) కేసిన్‌        i) ఎర్ర రక్తకణాలు

b) హీమోగ్లోబిన్‌   ii) గుడ్డులోని తెల్లసొన

c) ఆల్బుమిన్‌       iii) పాలు

1) a-i, b-iii, c-ii     2) a-iii, b-ii, c-i    3) a-ii, b-i, c-iii    4) a-iii, b-i, c-ii


23. కింది ఏ పదార్థాల్లో ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి?

1) సోయాబీన్‌     2) మాంసం    3) పుట్టగొడుగులు     4) పైవన్నీ


24. ‘బిల్డింగ్‌ బ్లాక్స్‌ ఆఫ్‌ ప్రోటీన్స్‌’ అని దేన్ని అంటారు?

1) చక్కెరలు    2) అమైనో ఆమ్లాలు 

3)  విటమిన్లు    4) ఫాటీ ఆమ్లాలు


25. ప్రోటీన్లలో ఉండే బంధాలు ఏవి?

1) ఎస్టర్‌ బంధాలు   2)పెప్టైడ్‌ బంధాలు 

3) లోహబంధాలు     4) ఏదీకాదు


26. కిందివాటిలో సరైంది ఏది?

i) ఆవశ్యక అమైనో ఆమ్లాలు మానవ శరీరంలో తయారు కావు.

ii) అనావశ్యక అమైనో ఆమ్లాలు మానవ శరీరంలో తయారవుతాయి.

1)  i మాత్రమే     2)  ii మాత్రమే    3)  i, ii    4) ఏదీకాదు


27. కిందివాటిలో ప్రోటీన్‌లకు సంబంధించి సరైంది ఏది?

i) జీవి దేహ పెరుగుదలకు, అభివృద్ధికి ప్రోటీన్‌లు ఉపయోగపడతాయి.

ii) ఎంజైమ్‌లు, హార్మోన్‌ల తయారీకి ప్రోటీన్‌లు అవసరం.

iii) వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

1) i, ii   2) ii, iii    3) i, iii    4) పైవన్నీ


28. సహజంగా లభించే ప్రోటీన్‌లు కింది దేనితో నిర్మితమవుతాయి?

1) D -అమైనో ఆమ్లాలు     2) L - అమైనో ఆమ్లాలు

3) 1, 2      4) D - గ్లూకోజ్‌


29. కిందివాటిలో సల్ఫర్‌ను కలిగిన అమైనో ఆమ్లం ఏది?

1)  అలనిన్‌     2)  మిథియోనైన్‌  

3) సిస్టిన్‌      4) 1, 3


30. కిందివాటిలో ‘శక్తి నిల్వలు’ అని ఏ జీవాణువులు పిలుస్తారు?

1) ప్రోటీన్‌లు   2) కార్బోహైడ్రేట్‌లు 

3) కొవ్వులు లేదా లిపిడ్‌లు 4) పైవన్నీ


31. కిందివాటిలో సరైంది?

i) సంతృప్త ఫాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి హానికరం. వీటిలో కార్బన్‌ల మధ్య ఏకబంధాలు ఉంటాయి.

ii) అసంతృప్త ఫాటీ ఆమ్లాలు ఆరోగ్యరీత్యా ఉపయోగకరం. వీటిలో కార్బన్‌ల మధ్య ద్విబంధాలు ఉంటాయి.

1) i మాత్రమే   2) ii మాత్రమే     3) 1, 2     4) ఏదీకాదు


సమాధానాలు

1-4  2-3  3-1  4-3  5-3  6-2  7-4  8-3  9-4  10-4  11-2  12-3  13-3  14-2  15-2  16-3  17-3  18-3  19-1  20-2  21-2  22-4  23-4  24-2  25-2  26-3  27-4  28-2  29-4  30-3 31-3


మరికొన్ని..

1. కొవ్వుల్లో ఉండే బంధాలు ఏవి?

1) పెప్టైడ్‌ బంధాలు      2) ఎస్టర్‌ బంధాలు

3) లోహ బంధాలు      4) పైవన్నీ


2. కొవ్వుల్లో నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి?

1) ఫాటీ ఆమ్లాలు + గ్లిజరాల్‌    2) ఫాటీ ఎస్టర్‌+ గ్లిజరాల్‌

3) ఎసిటిక్‌ ఆమ్లం+ గ్లిజరాల్‌     4) ఫాటీ ఆమ్లాలు+అమైనో ఆమ్లాలు


3. కింది ఏ ద్రావణాల్లో కొవ్వులు కరుగుతాయి?

1) నీరు   2)  క్లోరోఫాం   3) ఆల్కహాల్‌     4)  1, 3


4. కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఫాటీ ఆమ్లాలు లేదా కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలుగా వర్గీకరిస్తారు.

ii) గది ఉష్ణోగ్రత వద్ద సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఘనస్థితిలో ఉంటాయి.

iii) గది ఉష్ణోగ్రత వద్ద అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ద్రవస్థితిలో ఉంటాయి.

1) i, ii     2) ii, iii    3) i, iii   4) పైవన్నీ


5. గోధుమపిండి జిగటగా ఉండటానికి కారణమైన ప్రోటీన్‌ ఏది?

1) కేసిన్‌   2) ఫైబ్రోయిన్‌    3) ఆల్బుమిన్‌    4)  గ్లుటినిన్‌


6. కిందివాటిలో నైట్రోజన్‌ను కలిగిన స్థూల పోషకాలు ఏవి?

1) ప్రోటీన్‌లు   2) కార్బోహైడ్రేట్‌లు   3) రాగి    4)పైవన్నీ


7. కిందివాటిలో లిపిడ్‌లు ఏవి?

1) కొవ్వులు   2) నూనెలు   3) మైనం  4) పైవన్నీ


8. కిందివాటిలో సరైంది ఏది?


i) గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉండే సరళ లిపిడ్‌లను కొవ్వులు అంటారు.


ii)  గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే సామాన్య లిపిడ్‌లను నూనెలు అంటారు.

1) i     2) ii    3) i, ii   4) ఏదీకాదు


9. కిందివాటిలో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు అధికంగా దేనిలో లభిస్తాయి?

1) చేపనూనె    2) అవిసె గింజలు     3) 1, 2    4) గోధుమలు


10. సబ్బుల తయారీలో ఉపయోగించే ముడిపదార్థం ఏది?

1) ఫాటీ ఆమ్లాలు    2) అమైనో ఆమ్లాలు

3) ఆల్డిహైడ్‌లు    4) ఫినాల్‌లు


సమాధానాలు

1-2    2-1    3-4    4-4    5-4   6-1    7-4    8-3    9-3   10-1

Posted Date : 20-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌