• facebook
  • whatsapp
  • telegram

మొక్కల్లో పరాగ సంపర్కం

1. ఆవృత బీజాల్లో ఫలదీకరణంలో పాల్గొనే సంయోగ బీజాలు కింది ఏ విధంగా ఉంటాయి?

1) విషమరూపంలో   2) సమరూపంలో 

3)నిరాకారంగా    4) జన్యుపదార్థ రహితంగా


2. కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఫలదళాల కీలాగ్రంపై పరాగరేణువులు మొలకెత్తడం ప్రారంభిస్తాయి.

ii) కేసరాల నుంచి పరాగరేణువులు విడుదలైనప్పుడు ఏక కేంద్రయుతంగా ఉండి, తర్వాత రెండు కేంద్రకాలుగా మారతాయి.

iii) బీజరంధ్రం ద్వారా జీవపదార్థం బయటకు వచ్చి, పరాగనాళం ఏర్పడుతుంది.

1)  i, ii    2) ii, iii    3) i, iii     4) పైవన్నీ


3. ఆవృత బీజాల్లో ఒక పరాగరేణువు నుంచి ఎన్ని పురుష సంయోగబీజాలు ఏర్పడతాయి?

1) 1    2) 2    3) 3    4) 4


4. కింది ఏ కణం ఫలదీకరణం చెందడం ద్వారా సంయుక్త బీజం లేదా జైగోట్‌ ఏర్పడుతుంది?

1) పరాగరేణువులు    2) స్త్రీ సంయోగబీజం లేదా ఎగ్‌సెల్‌

3)  అండకోశం      4) పరాగకోశం


5. మెగాస్పోర్‌లలో క్రోమోజోమ్‌లు ఏ స్థితిలో ఉంటాయి?

1) n    2) 2n      3) 3n    4) 4n


6. న్యూసెల్లస్‌ లేదా అండాంతఃకణజాలం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? 

1) ఎండోస్పెర్మ్‌     2) పెరిస్పెర్మ్‌ 

3)  ఆల్బుమిన్‌     4) ఎల్యురాన్‌


7. టెస్టా, టెగ్మిన్‌లు వేటి భాగాలు?

1) అండకవచాలు     2) విత్తనాల కవచాలు 

3) పరాగ కోశత్వచం   4) అంకురచ్ఛద పొర


8. పిండకోశంలో ద్వయస్థితికంలో ఉండే భాగం?

1) స్త్రీ బీజకణం     2) సహాయకణం 

3)  ద్వితీయ కేంద్రకం    4) రిక్తిక


9. పిండకోశం కింది ఏ భాగంలో అమరి ఉంటుంది?

1) అంకురచ్ఛదం    2) అండం 

3) పిండ అక్షం   4) పిండం


10. ఫలదీకరణ లేకుండా అండకణం/ స్త్రీ బీజకణం అభివృద్ధి జరిగే విధానాన్ని ఏమంటారు?

1) అనిషేకఫలనం   2) మెటాజెనిసిస్‌ 

3) సంయోగబీజ అభివృద్ధి    4) అండోత్సర్గం


11. పురుష బీజ కేంద్రకం, స్త్రీ బీజ కేంద్రకం సంయోగం చెందడానికి ప్రధాన కారణం?

1) డీఆక్సీరైబోన్యూక్లిక్‌ ఆమ్లం  (DNA),  రైబోన్యూక్లిక్‌ ఆమ్లం  (RNA) మధ్య ఉండే నత్రజని క్షారాల సంపూరకాలు.

2) హైడ్రోజన్‌ బంధాల ఏర్పాటు

3) విద్యుదావేశాల మధ్య తేడాల వల్ల కలిగే పరస్పర ఆకర్షణ

4) స్త్రీ, పురుష బీజకణాల జీవపదార్థాల మధ్య ఆకర్షణ


12. పరాగరేణువు కొనభాగంలో ప్రధానంగా ఉండే పదార్థాలు....

i) ప్రోటీన్‌లు     ii) కార్బోహైడ్రేట్‌లు 

iii) రైబోన్యూక్లిక్‌ ఆమ్లం (RNA)

1) i, ii    2) ii, iii     3) i, iii     4) పైవన్నీ


13. పరాగరేణువు మొలకెత్తేలా కింది ఏ అయాన్‌ ప్రేరేపిస్తుంది?

1) క్లోరైడ్‌లు   2) జింకేట్‌లు 

3) మాలిబ్డేట్‌లు    4) బోరేట్‌లు


14. ఫిలిఫారమ్‌ పరికరం పుష్పాల్లో ఎక్కడ కనిపిస్తుంది?

1) కేసరాలు   2) పిండకోశం 

3) అంకురచ్ఛదం    4) పరిపత్ర పుచ్ఛావళి


15. పరాగరేణువుల పరాగనాళం ఏ ప్రాంతంలో పురుష బీజ కేంద్రకాలను విడుదల చేస్తుంది?

1) అండకణం     2) సహాయ కణాలు 

3) ప్రతిపాద కణాలు    4) కేంద్రక కణం


16. పరాగరేణువుల నుంచి పరాగనాళం ఏర్పడ్డాక, అవి మధ్యత్వచాల ద్వారా లోనికి ప్రవేశిస్తాయి. దీన్ని ఏమంటారు?

1) పోరోగమీ     2) చలాజోగమీ 

3) మీసోగమీ     4)సోనోగమీ


17. ‘హౌజింగ్‌ డ్రాప్‌’ ప్రయోగం కింది దేనికి సంబంధించింది?

1) పరాగ రేణువులు మొలకెత్తడం   2) ఫలదీకరణం 

3) అంకురచ్ఛద పరిచ్ఛేదం     4) క్రౌడింగ్‌ ప్రభావం


18. సింగమీ అంటే?

1) సంయోగబీజాల కలయిక    2) సంయుక్త బీజాల కలయిక 

3) పిండకోశం విచ్ఛేదం    4) అంకురచ్ఛద ఏర్పాటు


19. ప్రైమరీ ఎండోస్పెర్మ్‌ న్యూక్లియస్‌ ్బశినివ్శి ఏ స్థితిలో ఉంటుంది?

1) 1n    2) 2n    3) 3n     4) 4n


20. పురుషబీజ కేంద్రకం ఏ స్థితిలో ఉంటుంది?

1) n   2) 2n   3) 3n   4) 4n


21. కిందివాటిలో జియోకార్పిక్‌ ఫలానికి ఉదాహరణ ఏది?

1) మామిడి    2) వేరుశెనగ    

3) అరటిపండు    4) కంది గింజలు


22. జియోకార్పిక్‌ ఫలం అంటే?

1) భూమి అంతర్భాగంలో ఏర్పడే ఫలం

2) భూమిలోపల పుష్పించడం

3) ఆకాశానికి వ్యతిరేకంగా పండే ఫలం

4) ఆకర్షణకు అనుకూలంగా పండే ఫలం


23. మోనోకార్పిక్‌ ఫలం అంటే?

1) జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే ఫలాలను ఇచ్చే మొక్కలు.

2) ఒక సంవత్సరంలో మూడుసార్లు ఫలాలను ఇస్తుంది.

3) జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఫలించే మొక్క.

4) జీవితకాలంలో రెండుసార్లు పుష్పించే మొక్క.


24. అండాంతఃకణజాలాన్ని ఏమంటారు?

1) ఎండోస్పెర్మ్‌   2) న్యూసెల్లస్‌    3) హెస్పెర్మ్‌     4) టెస్టా


25. సూక్ష్మసిద్ధబీజ మాతృకణం ఏరకమైన కణ విభజన ద్వారా తర్వాతి తరం కణాలను ఏర్పరుస్తుంది?

1) సమ విభజన    2) అసమ విభజన

3) క్షయకరణ కణవిభజన   4) మైటాసిస్‌


26. ఆకర్షణ పత్రాలు వివిధ రంగుల్లో కనిపించడానికి ప్రధాన కారణం....

1)  క్లోరోప్లాస్ట్‌లను కలిగి ఉండటం      

2) క్రోమోప్లాస్ట్‌లను కలిగి ఉండటం

3) ల్యూకోప్లాస్ట్‌లను కలిగి ఉండటం      

4)  ఏదీకాదు


27. వాయు పరాగ సంపర్కం ప్రదర్శించే పుష్పాలు ఏ విధంగా ఉటాయి?

1) ఆకర్షణీయ రంగులతో ఉంటాయి

2) మకరంద గ్రంథులు అధికంగా పీఠభాగంలో ఉంటాయి

3) నీటిలో మాత్రమే వికసించే పుష్పాలుగా ఉంటాయి

4) రంగులు లేకుండా, సామాన్యంగా సరళంగా ఉంటాయి


సమాధానాలు

1-1,  2-4,  3-2,  4-2,  5-1,  6-2,  7-2,  8-3,  9-2,  10-1,  11-3,  12-4,  13-4,  14-2,  15-2,  16-3,  17-1,  18-1,  19-3, 20-1,  21-2,  22-1,  23-3,  24-2,  25-3, 26-2, 27-4.


మరికొన్ని..

1. మకరంద గ్రంథులు ఏరకమైన కణజాలానికి ఉదాహరణ?

1)  మృదుకణజాలం  

2) సంక్లిష్ట కణజాలం

3) ప్రత్యేక కణజాలాలు 

4) దృఢ కణజాలం


2. పిండం ఆవృతబీజాల్లో దేని నుంచి ఏర్పడుతుంది?

1) పిండకోశం   2) అండకోశం

3) జైగోట్‌    4) సమ్మేళనబీజం


3. టపేటం అనే కణజాలం ఎక్కడ కనిపిస్తుంది?

1) స్థూలసిద్ధ బీజాశయం          

2) సూక్ష్మసిద్ధ బీజాశయం

3) అండన్యాస స్థానం

4) పరాగ రేణువులు


4. సాధారణంగా ఒక పరాగరేణువులో ఎన్ని కేంద్రకాలు ఉంటాయి?

1) 1 లేదా 2     2) 2 లేదా 3

3) 3 లేదా 4     4) 1 లేదా 5


5. పిండకోశ నిర్మాణం సూక్ష్మసిద్ధబీజ మాతృకణాల నుంచి ఏర్పడితే, దాన్ని ఏమంటారు?

1) నిమెక్‌ దృగ్విషయం        

2) రామన్‌ ఎఫెక్ట్‌

3) అసాధారణ పిండజననం      

4) రాబర్ట్‌ దృగ్విషయం


6. ఎపోమిక్సిస్‌ అనేది.....

1) ఒక లైంగిక ప్రక్రియ        

2) ఒక అలైంగిక ప్రక్రియ

3) ఒక సర్వసాధారణ లైంగిక ప్రక్రియ      

4) శాఖీయ ప్రత్యుత్పత్తి కారకం


7. ఖీరాప్టెరిఫిలీని చూపించే వృక్షం........

1) హైబిస్కస్‌ రోజాసైనెన్సిస్‌       

2) నిక్టాంథస్‌

3) కైగేలియా పిన్నేటా            

4) సెరటోఫిల్లం


8. వృక్షశాస్త్రపరంగా కొబ్బరినీళ్లు కింది ఏభాగానికి చెందుతాయి?

1) పిండకోశం   2) పరిచర్మం

3) అండకోశం   4) అంకురచ్ఛదం


9. తృణధాన్యాల విత్తనాల్లో ఉండే అంకురచ్ఛద రూపం....

1) ఎల్యురాన్‌ పొర     

2) అండకోశత్వచం

3) హీలోబియల్‌ త్వచం     

4) పరిచర్మత్వచం


B ఆవృత బీజ మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఏవి?

1) కేసరాలు    2) అండకోశం

3) కీలాగ్రం   4) ఆకర్షణ పత్రావళి


11. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించి ఆవశ్యక భాగాలు.....

i) కేసరాలు     ii) అండకోశం    

iii) రక్షక పత్రావళి     iv) ఆకర్షణ పత్రావళి

1) i, ii     2)  ii, iii    3)  iii, , iv     4) i, , iv


12. పుష్పాల్లో రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి ఏమంటారు?

1)ఆవశ్యక భాగాలు    2) అనావశ్యక భాగాలు

3) పరిపుచ్ఛాలు    4) పరిపత్ర పుచ్ఛాలు


13. కిందివాటిలో మిథ్యాఫలానికి ఉదాహరణ..

1) మామిడి      2) జీడిమామిడి/ ముంతమామిడి

3) నరమామిడి     4)గున్నమామిడి


సమాధానాలు

1-3  2-3  3-2  4-2  5-1  6-2  7-3  8-4  9-1  10-1  11-1  12-2   13-2

Posted Date : 20-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌