• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య శాస‌న‌, ప‌రిపాల‌న‌, ఆర్థిక సంబంధాలు

1. మన దేశంలో ఏ సంవత్సరంలో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం ఏడు  రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడి, కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలైంది?

1) 1967    2) 1971    3) 1980    4) 1991

2. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిపిన కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే విభజనను ఏ షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 5వ షెడ్యూల్‌         2) 6వ షెడ్యూల్‌ 

3) 7వ షెడ్యూల్‌         4) 8వ షెడ్యూల్‌

3. కేంద్ర, రాష్ట్ర శాసనసంబంధాల గురించి రాజ్యాంగంలోని శ్రీఖివ భాగంలో ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 245  265   2) ఆర్టికల్‌ 245  255 

3) ఆర్టికల్‌ 255  265   4) ఆర్టికల్‌ 240  255


4. ఆర్టికల్‌ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్‌ శాసనాలు రూపొందించాలంటే రాజ్యసభ ఎంత మెజార్టీతో తీర్మానించాలి?

 1) 2/3 వ వంతు           2)1/3 వ వంతు

  3) 1/4 వ వంతు           4) 1/2 వ వంతు


5. అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

1) ఆర్టికల్‌ 247         2) ఆర్టికల్‌ 248 

3) ఆర్టికల్‌ 249         4) ఆర్టికల్‌ 250


6. పార్లమెంట్‌ వివిధ చట్టాలను రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరికానిది? 


7. భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయపన్ను చట్టాలు భారత్‌లో శాఖలను కలిగి ఉన్న విదేశీ సంస్థలకూ వర్తిస్తాయని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?

1) వాదియా జు( స్టేట్‌ ఆఫ్‌ బాంబే 

2) కామేశ్వరి సింగ్‌ జు( స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ 

3) రుత్వియా జు( స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ 

4) ముద్రా జు( స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర


8. మనదేశంలో ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని ఎవరు ధ్రువీకరిస్తారు?

1) పార్లమెంట్‌         2) రాష్ట్రపతి   

3) సుప్రీంకోర్టు         4) అటార్నీ జనరల్‌


సమాధానాలు 

1-1  2-3  3-2  4-1  5-2  6-4  7-1  8-3.


 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌