• facebook
  • whatsapp
  • telegram

ద్రావణాలు

మాదిరి ప్రశ్నలు

1. అత్యంత అస్థిరమైన ద్రావణం ఏది?

ఎ) అసంతృప్త ద్రావణం     

బి) సంతృప్త ద్రావణం

సి) అతిసంతృప్త ద్రావణం   

డి) విలీన ద్రావణం

2. ఒక అతిసంతృప్త ద్రావణంలో ఆ ద్రావితపు చిన్న స్పటికాన్ని జారవిడిస్తే ఏమవుతుంది?

ఎ) అతిసంతృప్త ద్రావణం మరుగుతుంది.

బి) అతిసంతృప్త ద్రావణంలోని ద్రావితం అవక్షేపితమవుతుంది.

సి) అతిసంతృప్త ద్రావణంలో స్పటికం కరుగుతుంది.

డి) అతిసంతృప్త ద్రావణం ఉష్ణోగ్రత పెరుగుతుంది.

3. సంతృప్త ద్రావణాన్ని వేడిచేస్తే ఏమవుతుంది?

ఎ) అసంతృప్త ద్రావణంగా మారుతుంది     

బి) కొల్లాయిడ్‌ ద్రావణంగా మారుతుంది

సి) అతిసంతృప్త ద్రావణంగా మారుతుంది   

డి) ఎలాంటి మార్పు జరగదు

4. సహజ వాయువులోని ద్రావితం, ద్రావణి ఏ భౌతిక స్థితిలో ఉంటాయి?

ఎ) వాయువు, వాయువు  

బి) ద్రవం, ద్రవం

సి) ద్రవం, వాయువు       

డి) ఘనపదార్థం, వాయువు

5. చక్కెర + నీరు ----> చక్కెర ద్రావణం. ఇందులో ద్రావితం ఏది?

ఎ) నీరు          

బి) చక్కెర

సి) ఎ, బి       

డి) ఏదీకాదు

6. కింది వాటిలో ధ్రువ ద్రావణికి ఉదాహరణ ఏది?

ఎ) నీరు       

బి) ఎసిటోన్‌    

సి) మిథైల్‌ ఆల్కహాల్‌

డి) పైవన్నీ

7. కింది వాటిలో అధ్రువ ద్రావణికి ఉదాహరణ ఏది?

ఎ) బెంజీన్‌     

బి) టోలీన్‌

సి) డైక్లోరోమీథేన్‌      

డి) పైవన్నీ

8. కింది వాటిలో సరికానిది ఏది?

ఎ) ప్రతి ఘనపదార్థం అన్ని ద్రవాల్లో కరుగుతుంది

బి) ధ్రువ ద్రావితాలు ధ్రువ ద్రావణిలో కరుగుతాయి

సి) అధ్రువ ద్రావితాలు అధ్రువ ద్రావణిలో కరుగుతాయి

డి) బి, సి

9. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ద్రావణంలో ఇంకా ఏ మాత్రం ద్రావితాన్ని తనలో కరిగించుకోలేని ద్రావణాన్ని ఏమంటారు?

ఎ) విలీన ద్రావణం 

బి) అతిసంతృప్త ద్రావణం

సి) సంతృప్త ద్రావణం

డి) అసంతృప్త ద్రావణం

10. ఒక పదార్థం ద్రావణీయత దేనిపై ఆధారపడుతుంది?

ఎ) ఉష్ణోగ్రత       

బి) పీడనం

సి) పదార్థ స్వభావం  

డి) పైవన్నీ

11. నీరు, ఆల్కహాల్‌ల మిశ్రమ ద్రావణాన్ని వేరుచేసే పద్ధతి ఏది?

ఎ) వడపోత       

బి) అంశిక స్వేదనం    

సి) స్వేదనం       

డి) ప్లవనం

12. ఒక నిజ ద్రావణంలో తక్కువపాళ్లలో ఉన్న పదార్థాన్ని ఏమంటారు?

ఎ) ద్రావణి           

బి) ద్రావితం

సి) విక్షేపణ యానకం    

డి) ఏదీకాదు

13. తక్కువ పరిమాణంలో ద్రావితం ఉన్న ద్రావణాన్ని ఏమంటారు?

ఎ) గాఢ ద్రావణం

బి) విలీన లేదా సజల ద్రావణం

సి) ప్రమాణ ద్రావణం

డి) కొల్లాయిడ్‌ ద్రావణం

14. కింది వాటిలో ఏది సరైంది?

ఎ) ద్రావణం ద్రవరూపంలో మాత్రమే ఉంటుంది

బి) ద్రావణం ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది

సి) గాలి వాయు రూపంలోని ద్రావణానికి ఒక ఉదాహరణ

డి) బి, సి

15. కింది వాటిలో సజాతీయ మిశ్రమం లేదా ద్రావణానికి ఉదాహరణ?

ఎ) స్టీల్‌         

బి) కంచు

సి) రాగి             

డి) ఎ, బి

16. సోడియం అమాల్గం ఏ రకం ద్రావణానికి ఉదాహరణ?

ఎ) ఘనంలో ద్రవం  

బి) ద్రవంలో ద్రవం

సి) ద్రవంలో ఘనం  

డి) ద్రవంలో వాయువు

సమాధానాలు

1-సి, 2-బి, 3-ఎ, 4-ఎ, 5-బి, 6-డి, 7-డి, 8-డి, 9-సి, 10-డి, 11-బి, 12-బి, 13-బి, 14-డి, 15-డి, 16-ఎ. 

 

రచయిత: పి. భానుప్రకాష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 18-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌