• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర మంత్రిమండలి

1. భారత రాజ్యాంగంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి గురించి ఎక్కడ  వివరించారు?

1) జువ భాగం, ఆర్టికల్స్‌ 73 నుంచి 78 వరకు

2) జువ భాగం, ఆర్టికల్స్‌ 74 నుంచి 78 వరకు

3) జువ భాగం, ఆర్టికల్స్‌ 75 నుంచి 79 వరకు 

4) జువ భాగం ఆర్టికల్స్‌ 75 నుంచి 80 వరకు

2. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి ఇచ్చే పరిపాలనా పరమైన సలహాలను దేశంలో ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూడదని పేర్కొన్న ఆర్టికల్‌?

1) ఆర్టికల్‌ 74(1)   2) ఆర్టికల్‌ 74(2) 

3) ఆర్టికల్‌ 74(3)   4) ఆర్టికల్‌ 74(4)

3. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడిని ప్రధానిగా ఎవరు నియమిస్తారు?

1) రాష్ట్రపతి     2) లోక్‌సభ స్పీకర్‌ 

3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  

4) పైవన్నీ

4. కింది అంశాల్లో సరికానిది?

1) ఆర్టికల్‌ 75్బ1్శ: ప్రధాని, మంత్రుల  నియామకం

2) ఆర్టికల్‌ 75్బ2్శ: మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించడం

3) ఆర్టికల్‌ 75్బ3్శ: మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించడం

4) ఆర్టికల్‌ 75్బ2త్శి: మంత్రిమండలి సంయుక్తంగా పార్లమెంట్‌కు బాధ్యత వహించడం

5. ఆర్టికల్‌ 75్బ4్శ ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది?

1) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా 

2) లోక్‌సభ స్పీకర్‌ 

3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

4) రాష్ట్రపతి

6. ఆర్టికల్‌ 75(6) ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్రమంత్రి మండలి సభ్యుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) రాష్ట్రపతి     2) పార్లమెంట్‌ 

3) ప్రభుత్వ ఖాతాల సంఘం 

4) కేంద్ర ఆర్థిక సంఘం

7. కేంద్రమంత్రిమండలికి అధిపతిగా ఎవరు  వ్యవహరిస్తారు?

1) రాష్ట్రపతి    2) కేబినెట్‌ కార్యదర్శి 

3) ప్రధానమంత్రి 

4) సీనియర్‌ కేబినెట్‌మంత్రి

8. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ప్రధాని వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు.

బి) పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు.

సి) పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో రాష్ట్రపతి వాస్తవ అధికారాలు కలిగి ఉంటారు.

డి) పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ప్రధాని నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 

3) ఎ, బి     4) బి, డి

9. రాష్ట్రపతికి, కేంద్ర మంత్రిమండలికి మధ్య ‘సంధానకర్త’గా ఎవరు వ్యవహరిస్తారు?

1) పార్లమెంట్‌ వ్యవహారాల శాఖామంత్రి 

2) ప్రధానమంత్రి 

3) లోక్‌సభ స్పీకర్‌ 

4) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

10. 1949లో ్డబ్ని్ర’౯-్ఝ’-్మ లీi((i్న-్చ౯్వ i- ఖి-్టi్చృ అనే అంశంపై ఎవరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ మంత్రిమండలి వర్గీకరణ గురించి పేర్కొంది?

1) గోపాలస్వామి అయ్యంగార్‌ 

2) అనంతశయనం అయ్యంగార్‌ 

3) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 

4) జవహర్‌లాల్‌ నెహ్రూ

11. పార్లమెంటరీ ప్రభుత్వం అనే పడవకు  ‘కేబినెట్‌’ చుక్కాని లాంటిది అని ఎవరు పేర్కొన్నారు?

1) హెరాల్డ్‌ జె లాస్కి   2) జీన్‌ బోడిన్‌ 

3) రాంసే మ్యూర్‌    4) గ్రాన్‌విల్లే ఆస్టిన్‌

12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352్బ7్శలో ‘కేబినెట్‌’ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?

1) 1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951 

2) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 

3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 

4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

13. ‘కేబినెట్‌’ నుంచి ఏర్పడే ‘రాజకీయ వ్యవహారాల కమిటీని’ ఏ విధంగా పేర్కొంటారు?

1) కిచెన్‌ కేబినెట్‌      2) సూపర్‌ కేబినెట్‌ 

3) షాడో కేబినెట్‌      4) ప్రథమ్‌ కేబినెట్‌

14. ‘సమాంతర కేబినెట్‌’గా దేన్ని పేర్కొంటారు?

1) ప్రధానమంత్రి కార్యాలయం 

2) జాతీయాభివృద్ధి మండలి 

3) అంతర్‌రాష్ట్ర మండలి 

4) ప్రణాళికా సంఘం

15. బ్రిటన్‌లో ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే ‘అనధికార మంత్రిమండలి’ని ఏమంటారు?

1) కిచెన్‌ కేబినెట్‌  2) కాస్టింగ్‌ కేబినెట్‌ 

3) షాడో కేబినెట్‌  4) సంస్థాన్‌ కేబినెట్‌

16. రాజ్యాంగం ప్రకారం ‘అత్యధిక హోదా’ ఉన్న మంత్రులను గుర్తించండి.

1) కేబినెట్‌ మంత్రులు 

2) సహాయ మంత్రులు 

3) డిప్యూటీ మంత్రులు 

4) మంత్రులందరూ సమానం

17. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటించిన చట్టసభ సభ్యుడ్ని ఆ సభ ముగిసే వరకు మంత్రిమండలిలోకి తీసుకోకూడదని 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా ఏ ఆర్టికల్‌లో నిర్దేశించారు?

1) ఆర్టికల్‌ 75(1)(A) 

2) ఆర్టికల్‌ 75(1)(B) 

3్శ ఆర్టికల్‌ 75(1)(C) 

4) ఆర్టికల్‌ 75 (1)(D)

18. ‘కేబినెట్‌’ విధులకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏది?

ఎ) దేశపరిపాలనకు అవసరమైన బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం

బి) లోక్‌సభను రద్దుచేయడం

సి) దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడం

డి) పార్లమెంట్‌లో రాష్ట్రపతి చేసే ‘ప్రసంగాన్ని’ రూపొందించడం

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి      4) పైవన్నీ

19. కేంద్రమంత్రిమండలి అధికారాన్ని కోల్పోయే అంశాలకు సంబంధించి కిందివాటిలో  సరికానిది?

1) లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు 

2) లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు 

3) లోక్‌సభలో బడ్జెట్‌ తిరస్కరణకు గురైనప్పుడు 

4) లోక్‌సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పుడు

20. కింది ఏ సందర్భాల్లో కేంద్రమంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది?

1్శ లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు 

2్శ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినప్పుడు

3్శ లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బిల్లులు వీగిపోయినప్పుడు 

4్శ పైవన్నీ

21. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఏ కారణం వల్ల అయినా ప్రధాని పదవికి ఖాళీ ఏర్పడితే కేబినెట్‌ రద్దవుతుంది.

బి) మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి బాధ్యతా సూత్రంపై ఆధారపడి ఉన్నాయి.

సి) అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినప్పటికీ మంత్రిమండలి రాజీనామా చేసి, మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలి.

డి) మంత్రులకు ఆయా శాఖలను నిర్ణయించడంలో ప్రధానమంత్రి తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటారు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి 

3) ఎ, సి, డి      4) పైవన్నీ

22. ‘హిందూకోడ్‌ బిల్లు’ విషయంపై అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో విభేదించి కేంద్రమంత్రిమడలి నుంచి వైదొలిగిన వారు?

1) శ్యాంప్రసాద్‌ ముఖర్జీ  

2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

3) బల్‌దేవ్‌సింగ్‌ 

4) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

23. ప్రధానిగా ఉన్న సమయలో లాల్‌బహదూర్‌ శాస్త్రి పాకిస్థాన్‌తో ‘తాష్కెంట్‌ ఒప్పందాన్ని’ కుదుర్చుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు?

1) మహావీర్‌ త్యాగి    2) మొరార్జీ దేశాయ్‌

3) సి.డి.దేశ్‌ముఖ్‌        4) జాన్‌మథాయ్‌

సమాధానాలు

1 - 2   2 - 2  3 - 1    4 - 4    5 - 4    6 - 2   7 - 3    8 - 3   9 - 2    10 - 1   11 - 3    12 - 4    13 - 2    14 - 1   15 - 3   16 - 4     17 - 2   18 - 2    19 - 4    20 - 4   21 - 4    22 - 2   23 - 1

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జవహర్‌లాల్‌ నెహ్రూ 1946లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు హోం శాఖమంత్రి ఎవరు? (జూనియర్‌ లెక్చరర్స్‌ 2007)

1) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 

2) వి.వి.గిరి      3) బల్‌దేవ్‌సింగ్‌  

4) లియాఖత్‌ అలీఖాన్‌

2. మంత్రులందరూ వ్యక్తిగతంగా ఎవరికి జవాబుదారీగా ఉంటారు?    (ఏఈఈ - 2009)

1) లోక్‌సభ      2) ప్రధానమంత్రి 

3) రాష్ట్రపతి 

4) తాను ప్రాతినిధ్యం వహించే సభకు

3. కేబినెట్‌ సచివాలయం ఎవరి ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తుంది? (పీఆర్‌ఓ-2008)

1) రాష్ట్రపతి        2) ప్రధానమంత్రి  

3) లోక్‌సభ స్పీకర్‌    4) గవర్నర్‌

4. కేంద్రమంత్రివర్గంలో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు? (టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ 2012)

1) 2    2) 3    3) 4    4) 5

5. భారత ప్రధానమంత్రి ........గా ఉంటారు?  (గ్రూప్‌-ఖి, 1984)

1) రాజ్యసభ అధ్యక్షుడు 

2) పాలకపక్షం అధ్యక్షుడు 

3) లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడు 

4) పాలకపక్షం ఉపాధ్యక్షుడు

6. స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా శాఖమంత్రి?     (ఏపీ, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2018)

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

2) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 

3) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 

4) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌

7. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది? (ఏపీ, కానిస్టేబుల్స్‌ 2016)

1) మొరార్జీ దేశాయ్‌ 

2) ఆర్‌.కె.షణ్ముగం శెట్టి 

3) ప్రణబ్‌ ముఖర్జీ 

4) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌

8. మంత్రిమండలి ఏర్పాటు దేనితో ప్రారంభమవుతుంది? (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2016)

1) సాధారణ ఎన్నికల నిర్వహణ ఉత్తర్వు జారీతో 

2) ప్రధానమంత్రి నియామకంతో 

3) రాష్ట్రపతి లాంఛన ప్రకటనతో 

4) పార్లమెంట్‌ సమావేశం నిర్వహణతో

9. రాజ్యాంగం ప్రకారం కేంద్రమంత్రిమండలి ఎవరికి సమష్టి జవాబుదారీగా ఉంటుంది? (ఏపీపీఎస్సీ గ్రూప్‌ ఖిఖి 2016)

1) పార్లమెంట్‌ ఉభయ సభలకు 

2) రాష్ట్రపతికి     3) అధికార పార్టీకి 

4) లోక్‌సభకు

10. పార్లమెంట్‌ సభ్యుడు కానప్పటికీ ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా  ఎంతకాలం కొనసాగొచ్చు? (ఏపీపీఎస్సీ గ్రూప్‌-ఖిఖి 2012)

1) 4 నెలలు     2) 9 నెలలు 

3) 6 నెలలు     4) ఏడాది

11. 2003లో చేసిన కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రమంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని నిర్ణయించారు? (ఏపీ, గ్రామ సచివాలయం ఎగ్జామ్‌-2019)

1) 91వ రాజ్యాంగ సవరణ చట్టం  

2) 92వ రాజ్యాంగ సవరణ చట్టం 

3) 93వ రాజ్యాంగ సవరణ చట్టం 

4) 94వ రాజ్యాంగ సవరణ చట్టం

సమాధానాలు

1 - 1 2 - 3 3 - 2 4 - 2 5 - 3 6 - 2 7 - 2  8 - 2   9 - 4   10 - 3   11 - 1

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌