సింధూ నదీ వ్యవస్థ
* సింధూ నదిని ఆంగ్లంలో ఇండస్ అంటారు. దీనివల్లే మనదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.
* ఇది టిబెట్‌లోని కైలాస పర్వతాల తూర్పు భాగాన ఉన్న మానస సరోవరంలోని ‘బొఖార్ చూ’ వద్ద జన్మించింది.
* సింధూ నది టిబెట్, భారతదేశం, పాకిస్థాన్ దేశాల్లో ప్రవహిస్తుంది.
* ఇది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం - థాంచోక్ (లద్దాఖ్).
* ఈ నది మొత్తం పొడవు 2880 కి.మీ. భారతదేశంలో - 709 కి.మీ.
* ఈ నది మొత్తం పరీవాహక ప్రాంతం 11,65,00 చ.కి.మీ., భారతదేశంలో - 3,21,000 చ.కి.మీ.
* ఇది మనదేశంలో లద్దాఖ్్ ప్రాంతంలోని జస్కార్ పర్వతాల మధ్య ప్రవహించి, సింధూ తర్బల మైదానం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. చివరకు కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది.
ఇతర పేర్లు: సింధూ నదిని వివిధ భాషల్లో అనేక పేర్లతో పిలుస్తున్నారు.
సంస్కృతం - సింధు, లాటిన్ - సిందూస్, పర్షియన్ - హైందవి, గ్రీక్ - సింథోస్, టిబెట్ - సింగి ఖంబన్ (Lion’s Mouth)
పరీవాహక ప్రాంతం: సింధూనది భారతదేశంలో 39% పరీవాహక ప్రాంతాన్ని కలిగిఉంది. మన దేశంలోని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, 5 రాష్ట్రాలు సింధూనది పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్నాయి. అవి: లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్.
* సింధూనది నాగపర్బత్ ప్రాంతాన్ని తాకుతూ ప్రవహిస్తూ, ఉత్తరాన బుంజి వద్ద అత్యంత లోతైన సింధూగార్జ్ను ఏర్పరిచింది.
* సింధూ పాకిస్థాన్ జాతీయ నది.
సింధూనది - ఉపనదులు
కుడి వైపు నుంచి కలిసేవి/ పర్వత ప్రాంత ఉపనదులు: సోనక్, శిగర్, గిల్గట్, హంజ, విబోవ, గోమల్, ద్రోచి, కాబూల్.
* కాబుల్ నది ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చి, అటోక్ వద్ద సింధూనదిలో కలుస్తుంది.
ఎడమవైపు నుంచి కలిసేవి/ మైదాన ప్రాంత ఉపనదులు: జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, జస్కర్, ద్రాస్.
జీలం: దీన్ని వితస్థ అని కూడా అంటారు. పొడవు 724 కి.మీ. శ్రీనగర్ లోయ మీదుగా ప్రవహిస్తుంది. దీనిపై ఉలార్ సరస్సు ఉంది.
చినాబ్: దీన్ని చంద్రభాగ అంటారు. పొడవు 1180 కి.మీ.
రావి: దీన్ని పరూష్ని అంటారు. పొడవు 720 కి.మీ.
* పాకిస్థాన్‌లోని లాహోర్ ఈ నది ఒడ్డునే ఉంది. దీన్ని లాహోర్ నది అని కూడా పిలుస్తారు.
* తొలి వేదకాలంలో దశరాజ యుద్ధం ఈ నది ఒడ్డునే జరిగింది.
బియాస్: దీని మరోపేరు విపాస. పొడవు 460 కి.మీ.
* భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.
సట్లెజ్: పూర్వ నామం శతుద్రి. పొడవు 1450 కి.మీ.
* సింధూ నదికి సమాంతరంగా ప్రవహించే ఉపనది.
* సింధూ నది ఉపనదుల్లో పొడవైంది.
* భాక్రా నంగల్ ప్రాజెక్టు ఈ నదిపైనే ఉంది
గంగా నదీ వ్యవస్థ
ఇది అలక్‌నంద, భాగీరథి అనే రెండు ప్రధాన సెలయేర్ల కలయికతో ఏర్పడింది. ఈ రెండూ ఉత్తరాఖండ్‌లోని శివాలిక్ పాదాల వద్ద ఉన్న దేవప్రయాగ దగ్గర ఒకటిగా కలుస్తాయి.
అలక్‌నంద: ఉత్తరాఖండ్‌లోని కుమయూన్ హిమాలయాల్లో ఉన్న ఘర్వాల్ జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలో సంతోపత్ అనే హిమనీనదంలో జన్మించింది.
భాగీరథి: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి హిమనీనదం వద్ద జన్మించింది.
* హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించి; ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగా మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.
* ఇది మనదేశంలో అతి పొడవైన నది. మొత్తం పొడవు 2525 కి.మీ. పరీవాహక ప్రాంతం 8,61,000 చ.కి.మీ.
* గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మ అని పిలుస్తారు.
* దీన్నే జాహ్నవి, అతితరుణ అని కూడా అంటారు.
గంగానది ఉపనదులు
దీని ఉపనదులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:
1. హిమాలయాల్లో పుట్టి, దక్షిణ దిశగా ప్రవహించి ఎడమవైపు నుంచి గంగా నదిలో కలిసేవి.
ఉదా: రామ్‌గంగా, గోమతి, ఘాగ్ర, గండక్, కోసి, మహానంద, బుర్హ్.
2. హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి, కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేవి.
ఉదా: యమునా నది.
3. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి, కుడివైపు నుంచి గంగా నదిలో కలిసే ఉపనదులు.
ఉదా: సోన్, దామోదర్, చంబల్, బెట్వా.
* గంగా నది ఉపనదులలో అతి పొడవైంది - యమునా (1376 కి.మీ.)
* కోసి నదిని బిహార్ దుఃఖదాయిని అంటారు.
* దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అంటారు. ఈ నది చోటానాగ్‌పుర్ పీఠభూమిలోని పలమూరు కొండల్లో జన్మించింది. ఇది చోటానాగ్‌పుర్ పీఠభూమిని రెండుగా విభజిస్తుంది.
* సంస్కృతంలో దామోదర్ అంటే“Rope around belly” అని అర్థం.
* రామ్‌గంగా నది జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్ మీదుగా ప్రవహిస్తుంది.
* ద్వీపకల్ప పీఠభూమి నుంచి గంగా నదిలో కలిసే ఉపనదుల్లో పెద్దది - సోన్.
* భారతదేశంలో అతిపెద్ద ముఖద్వారం కలిగి ఉన్న నది - హుగ్లీ.
పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ద్వీపకల్ప నదులు నర్మద
* మధ్యప్రదేశ్‌లోని మైకాల్ శ్రేణిలో ఉన్న అమరకంఠక్ పీఠభూమిలో జన్మించింది.
* మొత్తం పొడవు 1312 కి.మీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది.
* ఈ నది వింధ్య, సాత్పుర పర్వతాల మధ్య ఉన్న పగులులోయ మీదుగా ప్రవహిస్తుంది.
* ఇది భారతదేశ భూభాగానికి మధ్యలో ప్రవహిస్తుంది.
* ఇది పశ్చిమంగా ప్రవహించే నదుల్లో అతి పెద్దది. ఈ నది డెల్టాను ఏర్పరచదు.
ఇతర పేర్లు: రివర్ ఆఫ్ ప్లెజర్, రేవానది, నేరబుద్ద, లైఫ్ ఆఫ్ గుజరాత్, మధ్యప్రదేశ్.
దీనిపై ఉన్న జలపాతాలు: కపిలధార, దూద్ధర్, మార్బుల్, మంతర్, దర్ది. ఇవన్నీ మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
ఉపనదులు: కుడివైపు - హిరాన్, బర్నా, కోలర్, బర్సాంగ్. ఎడమవైపు - షక్కర్, తవ, బంజర్. తవ అతిపెద్ద ఉపనది కాగా బంజర్ పొడవైంది.
తపతి
మధ్యప్రదేశ్‌లోని భేతుల్ పీఠభూమిలో ఉన్న ముల్తాయి వద్ద జన్మించింది. మొత్తం పొడవు 724 కి.మీ.
* ఈ నదిని సూర్యపుత్రి లేదా నర్మదకు కవల (The Twin of Narmada) అంటారు.
* ఈ నదికి ఉత్తరాన సాత్పుర పర్వతాలు, దక్షిణాన అజంతా కొండలు, సాత్మల కొండలు సరిహద్దులుగా ఉన్నాయి.
* తపతి నదికి వ్యతిరేక దిశలో ప్రవహించేది - వార్దానది.
* తపతి నది ఖాందేష్ మైదానాన్ని ఏర్పరస్తుంది.
* ఈ నది ఒడ్డున ఉన్న నగరం - సూరత్
ఉపనదులు: వాఘర్, గోమమ్, పూర్ణ, గిర్నా, పంజ్రా, అరుణవతి, నేసు.
ఈ నదిపై ఉన్న డ్యాంలు: కాక్రపార, ఉకాయ్.
సబర్మతి
* ఆరావళి పర్వతాల్లో మెహర్ వద్ద ఉన్న దేబార్ సరస్సు వద్ద జన్మించింది.
* దీన్ని గిరి కర్ణిక అని కూడా అంటారు.
* గరుడ పురాణంలో దీని ప్రస్తావన ఉంది.
* మొత్తం పొడవు 371 కి.మీ. అధిక పరీవాహక ప్రదేశం గుజరాత్లో ఉంది.
* సర్దార్ సరోవర్ కెనాల్ ద్వారా నర్మదా నది నీటిని సబర్మతి నదిలో కలుపుతారు.
* కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
* అహ్మదాబాద్, గాంధీనగర్ పట్టణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.
ఉపనదులు:
హర్నవ్, వాకల్, హత్మతి, నేష్వా, సెయ్.
మహినది
* మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల్లో ఉన్న భోపవర్ వద్ద జన్మించింది.
* మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రవహించి, కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
* భారతదేశం మధ్యగా వెళ్లే అక్షాంశ రేఖ అయిన కర్కాటక రేఖను రెండుసార్లు ఖండిస్తూ ప్రవహిస్తుంది.
* ఈ నది వాల్వోడ్, గజాన అనే నదీ ఆధారిత దీవులను ఏర్పరిచింది.
ఉపనదులు:
సోమ్, అనాస్, మోరన్, భదర్.
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ
* టిబెట్‌లోని కైలాస కొండల్లో ఉన్న మానస సరోవరంలోని ‘షమయంగ్ జంగ్’ అనే హిమనీనదం వద్ద జన్మించింది.
* మొత్తం పొడవు 2900 కి.మీ. భారతదేశంలో - 916 కి.మీ.
* ఈ నది టిబెట్ నుంచి తూర్పుకు ప్రవహించి, అరుణాచల్‌ప్రదేశ్‌లోని సిడియా వద్ద భారతదేశంలోకి వస్తుంది. అక్కడి నుంచి అసోం మీదుగా ప్రవహిస్తూ, బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
ప్రాంతీయ పేర్లు:
టిబెట్ - త్సాంగ్పో (స్వచ్ఛమైన) అరుణాచల్ ప్రదేశ్ - దిహాంగ్, సియాంగ్
అసోం - సైడాంగ్, ఎరుపు నది, అసోం దుఃఖదాయిని
ఉత్తర బంగ్లాదేశ్ - జమున
దక్షిణ బంగ్లాదేశ్ - మేఘన
* ఇది అబోర్ కొండలు, మిష్మి కొండల మధ్య ప్రవహిస్తూ, ఫసిఘూట్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
* భారతదేశంలో దీని పరీవాహాక ప్రాంతం 2,400 చ.కి.మీ.
* ఇది అసోం లోయలోకి ప్రవేశించే సమయంలో ఇందులో దిబాంగ్, లోహిత అనే నదులు కలుస్తాయి.
* బ్రహ్మపుత్ర నది అసోంలోని ఎర్రనేలల మీదుగా ప్రవహిస్తూ మియాండర్స్, ఆక్స్బౌ అనే సరస్సులను ఏర్పరుస్తుంది.
* జమునగా పిలిచే బ్రహ్మపుత్ర, పద్మ అనే గంగా నదులు బంగ్లాదేశ్‌లోని గులంబో వద్ద ఒకటిగా కలిసి, మేఘన అనే నదిని ఏర్పరుస్తాయి.
* బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం దాకిన్ షాహాద్పూర్.
మజూలీ దీవి:
* బ్రహ్మపుత్ర నది అసోంలో రెండు శాఖలుగా విడిపోయి 90 కి.మీ. తర్వాత మళ్లీ కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని జోర్హాట్ అంటారు. ఈ రెండు శాఖల మధ్య ఉన్న దీవిని ‘మజూలీ’ అంటారు. ఇది మనదేశంలో ఏకైక నదీ ఆధారిత దీవి.
* ఈ దీవిలో మిషింగ్ తెగ నివసిస్తుంది.
* దీని పొడవు - 90 కి.మీ., వెడల్పు - 20 కి.మీ. వైశాల్యం - 1250 చ.కి.మీ.
జాంగ్ము డ్యాం: దీన్ని చైనా బ్రహ్మపుత్ర నదిపై భారత్, భూటాన్ సరిహద్దుల్లో నిర్మించింది. ఈ నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకించింది.
ఉపనదులు: ఎడమవైపు కలిసేవి: దిబాంగ్, లోహిత, దిహాంగ్, ధన్సిరి, కొపిలి, బాక్. కుడివైపు కలిసేవి: సుబన్సిరి, కామెంగ్, మనాస్, సంకోష్, తీస్తా.
* హిమాలయాల్లో జన్మించి, ప్రవహించే నదుల్లో పొడవైంది బ్రహ్మపుత్ర.
* బ్రహ్మపుత్ర ఉపనదుల్లో అతి పొడవైంది బరాక్ (902 కి.మీ.).