• facebook
  • whatsapp
  • telegram

రక్తసంబంధాలు

నిలువు గీతలో వేర్వేరు తరాలు!


వారసత్వం, బంధుత్వం వంటి సామాజిక నిర్మాణాల గురించి అందరికీ తెలియాలి. అప్పుడే కుటుంబాల్లో తమ పాత్రలను, బాధ్యతలను సక్రమంగా అర్థం చేసుకొని, నిర్వహించగలుగుతారు. అత్తమామలు, మేనమామలు, బావమరుదులు తదితర సంబంధాలపై అవగాహన ఉంటే కుటుంబ కార్యక్రమాలను, సమావేశాలను జరపడం సులువవుతుంది. వీలునామాలు, ఆస్తులకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలనూ తేలిగ్గా చేయడం సాధ్యమవుతుంది. ఈ విధమైన తార్కిక నైపుణ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేసేందుకే రీజనింగ్‌లో రక్తసంబంధాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. కొన్ని మౌలికాంశాలను తెలుసుకొని, నిత్యజీవిత సంఘటనలతో అనువర్తన చేసుకుంటే ఈ అధ్యాయంపై వేగంగా పట్టు సంపాదించుకోవచ్చు.


పోటీ పరీక్షల్లో రీజనింగ్‌లో భాగంగా రక్త సంబంధాలు అనే అధ్యాయం నుంచి తరచూ ప్రశ్నలు అడుగుతుంటారు. దీని కోసం అభ్యర్థులు పలు రకాల సంబంధాలు, వాటిని సూచించే కోడ్‌లు, జనరేషన్స్‌ (తరాలు), ప్రశ్నలోని సమాచారాన్ని ‘ట్రీ’ పటం రూపంలో రాసే విధానం తదితరాలను నేర్చుకోవాలి. అప్పుడే రక్త సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించగలుగుతారు. సాధారణంగా రక్త సంబంధాలు అంశానికి సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి కింద ఇచ్చిన పలు రకాల కోడ్‌లు లేదా గుర్తులు ఉపయోగపడతాయి.

A అనే వ్యక్తి పురుషుడు అయితే A+

P అనే వ్యక్తి స్త్రీ అయితే P-

ఒకే తరానికి సంబంధించిన వారిని ‘అడ్డుగీత’ రూపంలో సూచిస్తాô.

ఉదా: A అనే వ్యక్తి B యొక్క సోదరుడు

A+ ____________ B

వేర్వేరు తరాలకు సంబంధించిన వారిని ‘నిలువు గీత’ రూపంలో సూచిస్తాం.

ఉదా: L అనే వ్యక్తి M యొక్క కుమారుడు
                   

             

    సాధారణంగా భార్యాభర్తలను అనే గుర్తుతో సూచిస్తాం.

ఉదా: M అనే వ్యక్తి L యొక్క భర్త

M+ L-

పైవాటితో పాటు కింది అంశాలపై అవగాహన ఉండాలి.

    కుమారుడు కాదు అంటే కుమార్తె

    తల్లి కాదు అంటే తండ్రి

   భర్త కాదు అంటే భార్య 


1.  A అనే వ్యక్తి B కి సోదరుడు. C సోదరి B; C అనే వ్యక్తి D కి తండ్రి. అయితే D అనే వ్యక్తి Aకు ఏమవుతాడు?

1) బాబాయి     2) మేనల్లుడు     

3) మేనకోడలు     4) చెప్పలేం


వివరణ: 

ఇక్కడ D యొక్క లింగం తెలియదు కాబట్టి సమాధానం చెప్పలేం.        

జ: 4



2.  B యొక్క సోదరి A. B యొక్క తల్లి C. D అనే వ్యక్తి C కి తండ్రి. D యొక్క తల్లి E. అయితే A అనే వ్యక్తి D కి ఏమవుతారు? 

1) మనుమడు      2) తల్లి   

3) సోదరి       4) మనుమరాలు

వివరణ:                
 



జ: 4


3. దీపక్‌ సోదరుడు అనిల్‌. ప్రేమ్‌ అనే వ్యక్తి దీపక్‌ తండ్రి. విమల్‌ అనే వ్యక్తి ప్రేమ్‌ యొక్క తండ్రి. అయితే అనిల్‌ అనే వ్యక్తి విమల్‌కి ఏమవుతాడు? 

1) తాతయ్య        2) మనుమడు 

3) కుమారుడు   4) సోదరుడు

వివరణ:            

జ:



4. ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నకు జవాబును గుర్తించండి.

 A, B, C, D, E, F అనే వారు ఒక కుటుంబంలోని సభ్యులు.

 వారిలో ప్రస్తుతం ఒక పెళ్లైన జంట ఉంది.

 ఆ కుటుంబంలో స్త్రీ, పురుషుల సంఖ్య సమానం. 

 A, E అనే వారు F యొక్క కుమారులు. 

 D కి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

 B అనే వ్యక్తి A యొక్క కుమారుడు. అయితే కిందివాటిలో ఏది సత్యం? 

1) A, B, C లు స్త్రీలు  2) A అనే వ్యక్తి D యొక్క భర్త  

3) F యొక్క మనుమరాలు D  4) D యొక్క కుమారులు E, F 

వివరణ: 

  A అనే వ్యక్తి  D యొక్క భర్త  

జ: 2



5.  కింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.    

ఎ) ఒక కుటుంబంలో A, B, C, D, E, F లు ఉన్నారు. వీరిలో రెండు పెళ్లైన జంటలు ఉన్నాయి. 

బి) D అనే వ్యక్తి B యొక్క తల్లి, A కు నాయనమ్మ.  

సి) C అనే వ్యక్తి B యొక్క భార్య, F యొక్క తల్లి. 

డి) F అనే వ్యక్తి E యొక్క మనుమరాలు 

వివరణ:  

i)     C అనే వ్యక్తి A కు ఏమవుతుంది? 

1) కూతురు     2) సోదరి         

3) తల్లి     4) నాయనమ్మ 

పై వివరణ ఆధారంగా C అనే వ్యక్తి A యొక్క తల్లి అవుతుంది.    

జ:

ii)     ఆ కుటుంబంలో ఎంత మంది పురుషులు ఉన్నారు? 

1) 2      2) 3  

3) 4      4) చెప్పలేం

పై వివరణ ఆధారంగా A యొక్క లింగం తెలియదు కాబట్టి సమాధానం చెప్పలేం.           

జ:

iii)  కిందివాటిలో జంటను గుర్తించండి. 

1) CD 2) DE 3) EB 4) CF

పై వివరణ ఆధారంగా DE జంట.

జ: 2


6.  A + B అంటే A అనే వ్యక్తి  B యొక్క సోదరుడు. A - B అంటే A అనే వ్యక్తి B యొక్క సోదరి. 

A × B అంటే A అనే వ్యక్తి  B యొక్క తండ్రి. అయితే కిందివాటిలో ఏది C అనే వ్యక్తి M యొక్క కుమారుడిని సూచిస్తుంది? 

1) M − N × C + F

2) F − C + N × M

3) N + M − F × C

4) M × N − C + F

వివరణ: మొదటి ఆప్షన్‌ నుంచి 

C అనే వ్యక్తి  M యొక్క మేనల్లుడు అవుతాడు.

రెండో ఆప్షన్‌ నుంచి

C అనే వ్యక్తి M యొక్క పెదనాన్న/ చిన్నాన్న అవుతాడు.


మూడో ఆప్షన్‌ నుంచి



C యొక్క లింగం తెలియదు కాబట్టి సమాధానం చెప్పలేం.


నాలుగో ఆప్షన్‌ నుంచి 

C అనే వ్యక్తి M యొక్క కుమారుడు.

జ: 4

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 27-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌