• facebook
  • whatsapp
  • telegram

వర్గీకరణ

సూచనలు (ప్ర. 1 - 10): కింది సమూహంలో ఇతర పదాలతో సరిపోలని పదాన్ని గుర్తించండి.

1. 1) రామచిలుక       2) కాకి  

3) పావురం       4) గబ్బిలం

సాధన: ఇక్కడ గబ్బిలం మినహా మిగిలినవన్నీ ఏప్స్‌ (పక్షులు) తరగతికి చెందుతాయి. గబ్బిలం క్షీరదం.

సమాధానం: 4

2. 1) జనవరి      2) మే  

3) జులై          4) నవంబరు 

సాధన: ఇచ్చిన వాటిలో నవంబరు మినహా మిగిలిన నెలలకు 31 రోజులు ఉంటాయి. నవంబరులో 30 రోజులు ఉంటాయి.

సమాధానం: 4

3. 1) మసీదు        2) చర్చి  

3) దేవాలయం      4) మఠం

సాధన: మఠం మినహా మిగిలినవన్నీ పూజించే ప్రదేశాలు. మఠం సాధువులు బసచేసే ప్రదేశం.

సమాధానం: 4

4. 1) రీడర్‌      2) రైటర్‌  

3) ప్రింటర్‌      4) పబ్లిషర్‌  

సాధన: రీడర్‌ మినహా మిగిలిన వాళ్లు జర్నల్, వార్తాపత్రిక లేదా మ్యాగజైన్‌ తయారీలో పాల్గొనే వ్యక్తులు.

సమాధానం: 1

5. 1) జింక్‌      2) ఐరన్‌  

3) రాగి      4) పాదరసం

సాధన: సమూహంలో ఏకైక ద్రవలోహం పాదరసం.

సమాధానం: 4

6. 1) బ్లంట్‌      2) వల్గర్‌  

3) ఓఫిష్‌        4) కోర్స్‌ 

సాధన: బ్లంట్‌ మినహా మిగిలినవి పర్యాయ పదాలు.

సమాధానం: 1

7. 1) హంస        2) కప్ప  

3) మొసలి         4) కోడి

సాధన: కోడి మినహా మిగిలినవి నీటిలోనూ జీవిస్తాయి.

సమాధానం: 4

8. 1) గీతం           2) ఇతిహాసం  

3) హాస్య కవిత       4) కీర్తన  

సాధన: ‘ఇతిహాసం’ మినహా మిగిలినవి వివిధ రకాల పద్యాలు.

సమాధానం: 2

9. 1) నమ్మకద్రోహం     2) మోసం  

3) దగా      4) అనారోగ్యకరం  

సాధన: ‘అనారోగ్యకరం’ మినహా మిగిలినవన్నీ మోసానికి పర్యాయపదాలు

సమాధానం: 4

10. 1) చతురస్రం        2) త్రికోణం  

3) దీర్ఘచతురస్రం       4) వృత్తం

సాధన: ‘వృత్తం’ మినహా మిగిలినవాటిని భుజాల సంఖ్య ద్వారా లెక్కిస్తారు.

సమాధానం: 4


సూచనలు (ప్ర. 11 - 15): కింద ఇచ్చిన నాలుగు పదాల్లో భిన్నమైన దాన్ని కనుక్కోండి.

11. 1) విశ్వం      2) సూర్యుడు  

3) చంద్రుడు      4) గ్రహాలు

సాధన: విశ్వంలోని భాగాలు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు. 

సమాధానం: 1

12. 1) సజ్జలు      2) ఆవాలు  

3) గోధుమ         4) వరి

సాధన: ఇచ్చినవాటిలో ఆవాలు భిన్నమైనవి. అది ఒక్కటే ద్విదళ బీజం. మిగిలినవి ఏకదళ బీజాలు.

సమాధానం: 2

13. 1) కింద      2) దిగువ  

3) చిన్న        4) పైన

సాధన: ‘చిన్న’ మినహా మిగిలినవి ప్రదేశాన్ని సూచిస్తాయి.

సమాధానం: 3

14. 1) విక్రమాదిత్య        2) చాణుక్యుడు

3) హర్షవర్ధనుడు         4) సముద్రగుప్తుడు

సాధన: చాణుక్యుడు మినహా మిగిలినవారంతా ప్రాచీన రాజులు.

సమాధానం: 2

15. 1) రాజీవ్‌గాంధీ      2) వి.వి.గిరి

3) జైల్‌సింగ్‌      4) జాకీర్‌ హుస్సేన్‌

సాధన: రాజీవ్‌గాంధీ మినహా మిగిలినవారంతా భారత మాజీ రాష్ట్రపతులు.

సమాధానం: 1


సూచనలు (ప్ర. 16 - 20): కిందివాటిలో అయిదు పదాలు ఉన్నాయి. వాటిలో నాలుగు ఏక రీతిలో, ఒకే వర్గానికి చెందినవి. అయితే  వాటిలో భిన్నంగా ఉన్న అయిదో పదాన్ని గుర్తించండి.

16. 1) అంగుళం      2) అడుగు

3) గజం          4) మీటర్‌

5) క్వార్ట్జ్‌

సాధన: ‘క్వార్ట్జ్‌’ మినహా మిగిలినవి దూరాలను కొలిచే యూనిట్లు.

సమాధానం: 5

17. 1) అప్సర        2) జెర్లినా

3) అపోలో       4) సైరస్‌

5) పూర్ణిమ

సాధన: ‘అపోలో’ మినహా మిగిలినవన్నీ భారతదేశంలోని అణు రియాక్టర్ల పేర్లు.

సమాధానం: 3

18. 1) ప్లాసీ         2) హల్దీఘాట్‌

3) కురుక్షేత్రం      4) సారనాథ్‌

5) పానిపట్‌

సాధన: ‘సారనాథ్‌’ మినహా మిగిలినవన్నీ ప్రసిద్ధ యుద్ధ భూములు.

సమాధానం: 4

19. 1) శ్వాసరంధ్రం        2) మొప్పలు

3) పత్ర రంధ్రాలు         4) ఊపిరితిత్తులు

4) శ్వాసనాళం

సాధన: ‘పత్ర రంధ్రాలు’ మినహా మిగిలినవి జంతువుల్లో శ్వాసకోశ అవయవాలు.

సమాధానం: 3

20. 1) యాపిల్‌      2) బొప్పాయి

3) పీయర్‌       4) నారింజ

5) మామిడిపండు

సాధన: మామిడిపండుకి ఒకే గింజ (విత్తనం) ఉంటే, మిగిలినవాటిలో ఒకటి కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి.

సమాధానం: 5

సూచనలు (ప్ర. 21 - 25): కిందివాటిలో భిన్నమైన పదాన్ని కనుక్కోండి.

21. 1) ఇల్లు        2) పైకప్పు  

3) దూలం          4) గోడ

సాధన: ఇల్లు తప్ప మిగిలినవన్నీ ఇంటి భాగాలు.

సమాధానం: 1

22. 1) అట్లీ      2) చర్చిల్‌  

3) బెవిన్‌         4) చాంబర్లిన్‌

సాధన: బెవిన్‌ బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి. మిగిలినవారంతా బ్రిటన్‌ ప్రధానులుగా పనిచేశారు.

సమాధానం: 3

23. 1) సెయిలర్‌      2) బ్లాక్‌స్మిత్‌  

3) టైలర్‌        4) గోల్డ్‌స్మిత్‌

సాధన: సైలర్‌ మినహా మిగిలిన వారందరికీ పనిచేయడానికి ముడిసరుకు అవసరం.

సమాధానం: 1

24. 1) టైప్‌రైటర్‌     2) కాలిక్యులేటర్‌ 

3) పియానో      4) కంప్యూటర్‌

సాధన: సమూహంలోని ఏకైక సంగీత వాయిద్యం ‘పియానో’.

సమాధానం: 3

25. 1) స్కూప్‌      2) కార్నర్‌  

3) బుల్లీ      4) బంకర్‌

సాధన: బంకర్‌ మినహా మిగిలినవి హాకీకి సంబంధించిన పదాలు.

సమాధానం: 4

సూచనలు (ప్ర. 26 - 29): కిందివాటిలో భిన్నంగా ఉన్న పదాల జతను కనుక్కోండి.

26. 1) రష్యా : మాస్కో 

2) స్పెయిన్‌ : మాడ్రిడ్‌  

3) జపాన్‌ : సింగపూర్‌  

4) చైనా : బీజింగ్‌

సాధన: ఆప్షన్‌ 3 మినహా మిగిలినవాటిలో మొదటిది దేశం అయితే రెండోది దాని రాజధాని. జపాన్‌ రాజధాని టోక్యో.

సమాధానం: 3

27. 1) నూనె : దీపం 

2) పవర్‌ : యంత్రం   3) నీరు : కుళాయి  

4) ఆక్సిజన్‌ : ప్రాణం

సాధన: ఆప్షన్‌ 2 మినహా మిగిలిన జతల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది.

సమాధానం: 2 

28. 1) పుస్తకం : పేజీ   

2) కారు : చక్రం  

3) మగ్గం : వస్త్రం   

4) బల్ల : డ్రాయర్‌

సాధన: ఆప్షన్‌ 3 మినహా, మిగిలిన జతల్లో రెండోది మొదటిదానిలో భాగం.

సమాధానం: 3

29. 1) బాబర్‌ : మొఘల్‌  

2) మహావీరుడు : జైనమతం  

3) చంద్రగుప్తుడు : మౌర్య

4) కనిష్కుడు : కుషాణ్‌

సాధన: ఆప్షన్‌ 2 మినహా, ఇచ్చిన జతల్లో రెండోది రాజవంశం కాగా, మొదటిది దాన్ని స్థాపించినవారు.

సమాధానం: 2

సూచనలు (ప్ర. 30 - 39): కిందివాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి.

30. 1) భారతదేశం      2) శ్రీలంక  

3) నేపాల్‌      4) అండమాన్‌ 

సాధన:  అండమాన్‌ ఒక్కటే దీవి. మిగిలినవి దేశాలు.

సమాధానం: 4

31. 1) హరియాణా     2) నాగాలాండ్‌ 

3) సింధ్‌      4) కేరళ

సాధన: సింధ్‌ మినహా మిగిలినవి రాష్ట్రాలు.

సమాధానం: 3

32. 1) క్రీ.శ 400      2) క్రీ.శ 900 

3) క్రీ.శ 1900     4) క్రీ.శ 1100

సాధన: క్రీ.శ. 400 లీపు సంవత్సరం.

సమాధానం: 1

33. 1) స్పెయిన్‌      2) టర్కీ 

3) భూటన్‌       4) నార్వే

సాధన: టర్కీ మినహా మిగిలిన దేశాలను రాజులు పాలించారు.

సమాధానం: 2

34. 1) భరతనాట్యం     2) ఒడిస్సీ 

3) సురభి     4) కథాకళి

సాధన: సురభి నాటకం. మిగిలినవి నృత్యాలు.

సమాధానం: 3

35. 1) డెమోక్రసీ    2) బ్యూరోక్రసీ 

3) డియోక్రసీ     4) డిప్లమసీ

సాధన: డిప్లమసీ మినహా మిగిలినవి పరిపాలనా రూపాలు.

సమాధానం: 4

36. 1) బాకు     2) సుత్తి  

3) బ్లేడు      4) కత్తి 

సాధన: సుత్తి మినహా మిగిలినవి పదునుగా ఉంటూ, కోయడానికి వాడే పనిముట్లు.

సమాధానం: 2

37. 1) అనుభూతి     2) ఆనందం 

3) బాధ     4) కోపం 

సాధన: అనుభూతి మినహా మిగిలినవి వివిధ భావాలను సూచిస్తాయి.

సమాధానం: 1

38. 1) బంగాళదుంప       2) బీట్‌రూట్‌  

3) ఉల్లిపాయ        4) కొత్తిమీర 

సాధన: కొత్తిమీర మినహా మిగిలినవి సవరించిన కాండాలు.

సమాధానం: 4

39. 1) ఆయిల్‌      2) జిగురు 

3) పేస్టు        4) సిమెంట్‌ 

సాధన: ఆయిల్‌ మినహా మిగిలినవి ఏదో ఒకదాన్ని కలపడానికి వాడతారు.

సమాధానం: 1

రచయిత

బూసర గణేష్‌

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌