1. భూమి వయసు సుమారుగా
జ: 4.6 బిలియన్ సంవత్సరాలు
2. కాస్మిక్ సిద్ధాంతం దేని ఆవిర్భావానికి సంబంధించింది?
జ: భూమి
3. భూమిపై మొదట ఏర్పడిన జీవి?
జ: అవాయు పరపోషక బ్యాక్టీరియా
4. భూమి ఏర్పడినప్పుడు ఏ వాయువుల ఉనికి ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు?
ఎ) హైడ్రోజన్ బి) మీథేన్ సి) అమ్మోనియా డి) ఆక్సిజన్
జ: ఎ, బి, సి
5. హాల్డేన్ ప్రకారం జీవపూర్వ ద్రవం (ప్రీ బయాటిక్ సూప్)లో ఉండే ప్రధాన భాగాలు?
జ: కోసర్వేట్లు
6. భూమిపై నివసిస్తున్న జీవుల్లో క్రమంగా జీవపరిణామం చెందుతూ కొత్తజీవుల ఏర్పాటు జరుగుతుందన్న వాదనకు ఏ ఆధారాలను సాక్ష్యాలుగా పరిగణించవచ్చు?
ఎ) జీవులు నిర్మాణ, క్రియా సామ్య అవయవాలను కలిగి ఉండటం.
బి) అవశేష అవయవాలు జీవుల్లో వ్యవస్థితం కావడం.
సి) ఉపయుక్త వికిరణాన్ని జీవులు ప్రదర్శించడం.
జ: ఎ, బి, సి
7. కిందివాటిలో క్రియా సామ్య అవయవాలకు ఉదాహరణ
1) కీటకం, పక్షి, గబ్బిలం రెక్కలు
2) సీల్ చేప ఫ్లిప్పర్లు, పావురం రెక్క, మనిషి చేయి
3) చిరుత కాళ్లు, పక్షి రెక్క, మనిషి చేయి
4) పక్షి, గబ్బిలం రెక్కలు; మనిషి చేయి
జ: 1 (కీటకం, పక్షి, గబ్బిలం రెక్కలు)
8. ఒకే రకమైన జీవి నుంచి వివిధ వాతావరణ పరిస్థితుల్లో జీవించగలిగే జీవజాతుల ఆవిర్భావం దేనివల్ల సంభవిస్తుంది?
ఎ) ఉపయుక్త వికిరణం బి) అపసారి వికిరణం
సి) ఉపయుక్త విస్ఫోటనం డి) అభిసారి వికిరణం
జ: ఎ, బి
9. అకస్మాత్తుగా పూర్వీకుల లక్షణాలు పరిణామక్రమంలో బయటపడటాన్ని శాస్త్ర పరిభాషలో ఏమంటారు?
జ: ఆటవిజం
10. కిందివాటిని జతపరచండి.
జ: i-d, ii-c, iii-b, iv-a
11. కిందివాటిలో లామార్కిజంలోని ముఖ్య ప్రతిపాదనలు?
ఎ) పరిసర ప్రభావ సూత్రం బి) ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం సి) ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం
జ: ఎ, బి, సి
12. లామార్క్ రచించిన గ్రంథం?
జ: ఫిలాసఫీ జులాజిక్
13. బీజద్రవ్యంలో జరిగిన మార్పులే సంతానానికి చేరతాయని చుంచెలుకలపై ప్రయోగాలు చేసి బీజద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
జ: అగస్ట్ వీస్మన్
14. జీవ సృష్టి వాదాన్ని (బయోజెనిసిస్ సిద్ధాంతం) ప్రతిపాదించినవారు?
జ: లూయీపాశ్చర్
15. డార్విన్ సిద్ధాంతంలోని ప్రధానాంశాలు
ఎ) మనుగడ కోసం పోరాటం బి) యోగ్యతమముల సార్థక జీవనం
సి) ప్రకృతివరణం ద్వారా జాతుల ఉత్పత్తి
జ: ఎ, బి, సి
16. ‘ఆన్ ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్’ వ్యాసాన్ని రాసినవారు?
జ: మాల్థస్
17. ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన హ్యూగోడీవ్రీస్ ఏ మొక్కపై పరిశోధనలు చేశారు?
జ: ఈనోథిరా లామార్కియానా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆక్సిజన్‌ను కలిగి ఉండే జీవులు సుమారు ఎన్ని బిలియన్ సంవత్సరాల కింద ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు? (ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, 2012)
జ: 350
2. మొదటిసారి పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించినవారు? (ఏపీపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్)
జ: జె.బి.డి.లామార్క్
3. కిందివాటిలో అవశేషాంగం కానిది? (గ్రూప్ 1, 1995)
1) మానవుడి తోక 2) గుర్రంలో స్ల్పింట్ ఎముక
3) మానవుడి శరీరంపై రోమాలు 4) కప్పలో నిమేషక త్వచం
జ: 4 (కప్పలో నిమేషక త్వచం)
4. కిందివాటిలో ‘గ్రేట్ ఐస్ ఏజ్’ అని దేన్ని పేర్కొంటారు?(గ్రూప్ 1, 2008)
1) కేంబ్రియన్, ఆర్కియోజోయిక్ 2) సైలూరియన్, డెవోనియన్
3) మయోసీన్, హోలోసీన్ 4) ప్లీస్టోసీన్, ప్లియోసీన్
జ: 4 (ప్లీస్టోసీన్, ప్లియోసీన్)
5. భూమి ఆవిర్భావం వాయువులు, ధూళికణాలతో ఏర్పడిందని తెలియజేసినవారు? (గ్రూప్ 2, 2008)
జ: జేమ్స్ జీన్స్
6. కిందివాటిలో పురాతన జంతువు? (గ్రూప్ 4, స్టెనో, టైపిస్ట్ 2012)
1) డాల్ఫిన్ 2) ఒట్టర్ 3) టర్టిల్ 4) వాల్రస్
జ: 3 (టర్టిల్)