• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - ప్రాథమిక భావనలు

1. పర్యావరణం (Environment) అనే పదానికి కింది ఏ భాషా పదం ఆధారం?
జ: ఫ్రెంచ్

 

2. 'జీవావరణం' కింది ఏ ఆవరణల్లో విస్తరించి ఉంటుంది?
1) శిలావరణం, జలావరణం                          2) జలావరణం, వాతావరణం    3) వాతావరణం, శిలావరణం, జలావరణం      4) వాతావరణం, శిలావరణం
జ: 3(వాతావరణం, శిలావరణం, జలావరణం)

 

3. పర్యావరణం లక్షణం కానిది?
జ: పర్యావరణం మార్పులకు లోనుకాని వ్యవస్థ.

 

4. నిర్జీవ లేదా భౌతిక పర్యావరణానికి సంబంధించని ఆవరణం ఏది?
జ: జీవావరణం

 

5. ఏ ఆవరణాన్ని 'కార్బన్ సింక్‌'గా వ్యవహరిస్తారు?
జ: జలావరణం

 

6. ఒక రైతు పొలంలో 'నైట్రేట్స్' పుష్కలంగా ఉన్నాయి. అంటే అతడు తన పొలంలో ఏ పంటను పండించి ఉండొచ్చు?
1) లెగ్యూమినేసి పంటలు    2) చిక్కుడు జాతి పంటలు   3) ఫాబేసి జాతి పంటలు     4) పైవన్నీ సరైనవి
జ: 4(పైవన్నీ సరైనవి)

 

7. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న జడవాయువు ఏది?
జ: ఆర్గాన్

 

8. వాతావరణంలో ఉష్ణోగ్రతల స్థిరీకరణకు, మొక్కల ఆహారోత్పాదనకు, భూతాపానికి కారణమవుతున్న ప్రధాన వాయువు ఏది?
జ: కార్బన్ డై ఆక్సైడ్

 

9. కిందివాటిలో సరిగ్గా జతపరిచిన అంశం ఏది?
1) ప్రపంచ జల దినోత్సవం - మార్చి 22      2) లిమ్నాలాజి - మంచినీటి అధ్యయన శాస్త్రం     3) భూమిపై ఉన్న మంచినీరు 1% (మానవ అవసరాలకు ఉపయోగపడేది)    4) పైవన్నీ సరైనవి
జ: 4(పైవన్నీ సరైనవి)

 

10. భూ వాతావరణంలో లభించని వాయువు ఏది?
జ: క్లోరిన్


రచయిత: పి. బాబా ఫక్రుద్దీన్
 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌