సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ వ్యవస్థ)
భారతదేశ ఆర్థికాభివృద్ధికి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కృషి చేస్తాయి.

నిర్దేశిత సూత్రాల ప్రకారం ఈ మూడు స్థాయుల్లో ప్రభుత్వాలు పన్నులు విధించి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. దీంతో అవి ప్రజా అవసరాలు తీరుస్తూ, ఆర్థికాభివృద్ధికి పాటుపడతాయి.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు. 1948లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల మనదేశంలో తొలిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది.
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ, స్థూల జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయాలు పెంచడానికి ఆరోగ్యకరమైన పోటీతో పనిచేస్తాయి.
ప్రజలకు అవసరమైన వస్తువులను ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేస్తాయి. ప్రభుత్వరంగ పెట్టుబడులు తగినంతగా లేనప్పుడు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన మొత్తాన్ని ప్రైవేట్‌రంగం సమకూరుస్తుంది.
ప్రభుత్వరంగ సంస్థలు సేవాభావంతో పని చేస్తే, ప్రవేట్‌రంగ సంస్థలు లాభాపేక్షతో ఉంటాయి.
ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు, నియంత్రణకు లోబడి పని చేస్తాయి.
మన ఆర్థిక వ్యవస్థలో 1991 సరళీకృత విధానం అమలయ్యాక ప్రైవేట్‌రంగ ప్రాధాన్యం పెరిగింది.
వ్యవసాయ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థ
ప్రాచీన కాలం నుంచే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగంగా ఉంది. కాలక్రమేణా దీనిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం 54.6% ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు.
ఈ రంగంపై ఆధారపడే వ్యవసాయ కూలీల శాతం క్రమంగా పెరిగింది. ఇందుకు భిన్నంగా వ్యవసాయదారుల శాతం తగ్గింది. నీటిపారుదల సౌకర్యాలు ఉన్న భూమి శాతం పెరిగింది.
హరిత విప్లవం వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరిగాయి.
రసాయనిక ఎరువుల వాడకం, అధిక దిగుబడినిచ్చే వంగడాల వినియోగం వల్ల గోధుమతో పాటు ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది.
పంటల సాంద్రత శాతం కూడా పెరిగింది.
1999-2000లో జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.
2000లో జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు.
2004లో డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ ఆధ్వర్యంలో రైతుల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
1995-96లో గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు.
1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పథకాన్ని తెచ్చారు.
వ్యవసాయానికి అనుబంధ వృత్తులైన పాడిపరిశ్రమ, గొర్రెలు-కోళ్లు-చేపల పెంపకం కార్యక్రమాలను విస్తృతం చేసి, వీటి ఆదాయం పెరిగేలా చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆహారభద్రత (Public Distribution System - Food Security)

రైతుల ఆదాయం పెంచి, పేదలకు తక్కువ ధరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి ప్రభుత్వం ‘ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను ఏర్పాటు చేసింది.

1992లో Revamped Public Distribution System (RPDS)ను తీసుకొచ్చారు.

నిరుపేదలు, పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, ఆహార భద్రత సాధించడానికి పీడీఎస్ వ్యవస్థ ఉపయోగపడుతోంది.
సముచిత స్థాయిలో పారిశ్రామికీకరణ
మనదేశంలో రెండో పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం కల్పించారు.
1951-65 మధ్యకాలంలో పారిశ్రామికాభివృద్ధికి పటిష్ఠమైన పునాదులు ఏర్పడటంతో వార్షిక పారిశ్రామికాభివృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది.
1991, జులై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) లో జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించి, వృద్ధి రేటు పెంచే చర్యలు చేపట్టారు.
మూలధన కల్పన విస్తరణ
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల అభివృద్ధికి మూలధన కల్పన పెంచడం ముఖ్యం.
అల్పాదాయ వర్గాల ప్రజలు చిన్నమొత్తాలు పొదుపు చేసేలా ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తిలో అనేక చర్యలు చేపట్టింది.
వేగంగా వృద్ధి చెందుతున్న సేవా రంగం
గత కొన్ని దశాబ్దాలుగా రవాణా, బ్యాంకింగ్, బీమా, ఇ-సేవలు, సమాచార సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో ఉపాధి కల్పన కూడా అధికంగా ఉంది.
2020-21లో జాతీయాదాయ కూర్పులో సేవారంగం వాటా 54% ఉండగా, ఇది క్రమంగా పెరుగుతోంది.
‘‘ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం తగ్గుతూ, సేవా రంగంపై ఆధారపడే వారి శాతం పెరగడమే ఆర్థిక వృద్ధికి సూచిక’’ అని అమెరికా ఆర్థికవేత్త ‘సైమన్ కుజ్నెట్స్’ పేర్కొన్నారు.
పెరుగుతున్న ఎగుమతులు - రాబడి

మొత్తం ఎగుమతుల విలువలో యంత్ర, ఇంజినీరింగ్ వస్తువుల విలువ గణనీయంగా పెరిగింది.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకు 2021, జులై 1న 2020లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాను ప్రకటించిది. వాటిలో మొదటి పది స్థానాల్లో ఉన్నవి:

