• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక విత్తవనరులు - విదేశీ మూలధనం

1. ప్రజలకు వాటాలు విక్రయించడం ద్వారా సమకూర్చుకునే మూలధనాన్ని ఏమంటారు?

1) వాటా మూలధనం  2) ఆధిక్యపు వాటాలు   3) ఈక్విటీ వాటాలు    4) డిబెంచర్లు


2. వాటాల్లో రకాలు ఏవి?

1) ఆధిక్యపు వాటాలు   2) ఈక్విటీ వాటాలు     3) 1, 2   4) విత్తసంస్థల రుణాలు


3. కంపెనీ మూసివేత సమయంలో మూలధనంలో చివరగా చెల్లింపు పొందే వాటాదారు.....

1) స్వల్పకాలిక రుణాలు  2)బాండ్లు   3) ఈక్విటీ వాటాదారు   4) ప్రత్యక్ష రుణాలు


4. ప్రజల నుంచి రుణాల రూపంలో సమకూర్చుకునే మూలధనం ఏది?

1) డిబెంచర్లు   2) వర్తకపు పరపతి  3) విత్తసంస్థల రుణాలు  4) బ్యాంకు రుణాలు


5. వాటాలు, డిబెంచర్ల మీద చెల్లించే ప్రతిఫలం....

1) వాటాలు : డివిడెండ్లు   2) డిబెంచర్లు : వడ్డీ     3) 1, 2     4) పరోక్ష విత్తం


6. కింది వాటిలో కంపెనీ రుణాల్లో రకాలు ఏవి?

1) బ్యాంకు రుణాలు   2) విత్తసంస్థల రుణాలు   3) 1, 2     4) వాటా మూలధనం


7. కంపెనీలు వ్యాపారస్తుల వద్ద ముడిపదార్థాలు, వస్తువులను అరువు పద్ధతిలో కొనుగోలు చేసే విధానాన్ని ఏమంటారు?

1) వర్తకపు పరపతి    2) సహకార పరపతి    3) దీర్ఘకాలిక పరపతి   4) మధ్యకాలిక పరపతి


8. భారత పారిశ్రామిక విత్త సంస్థను (ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  IFCI) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1948   2) 1949    3) 1950    4) 1951


9. ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ICICI) ఏర్పాటు ఎప్పుడు జరిగింది?

1) 1955   2) 1956   3) 1957   4)1958


10. భారత జీవిత బీమా సంస్థను (ఎల్‌ఐసి) ప్రవేశపెట్టిన సంవత్సరం...

1) 1954   2) 1955   3) 1956    4) 1957


11. ‘యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ను ఎప్పుడు స్థాపించారు?

1) 1961    2) 1962   3) 1963    4) 1964


12. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1961   2) 1962  3) 1963   4) 1964


13. ఎక్సిమ్‌ బ్యాంకు (ఎక్స్‌పోర్ట్‌ - ఇంపోర్ట్‌ బ్యాంకు) ఏర్పాటైన సంవత్సరం?

1) 1981     2) 1982   3) 1983  4) 1984


14. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకును(NHB) ప్రారంభించిన సంవత్సరం?

1) 1988   2) 1989   3) 1990  4)1991


15. ఇండస్ట్రియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1982    2) 1983   3) 1984   4) 1985


16. స్మాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SIDBI) ప్రారంభమైన సంవత్సరం?

1) 1990   2) 1991   3) 1992  4) 1993


17. డిస్కౌంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియాను (DFHI) ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1988    2) 1989   3) 1990  4) 1991


18. సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఎప్పుడు స్థాపించారు?

1) 1988    2) 1989  3) 1991    4) 1992


19. సెబీని ఎప్పుడు చట్టబద్ధం చేశారు?

1) 1992    2) 1993   3) 1994  4) 1995


20. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను (NSE) ఎప్పుడు స్థాపించారు?

1) 1990    2) 1991  3) 1992  4) 1993


21. సెబీ (SEBI)  ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) చెన్నై    2) ముంబయి   3) న్యూదిల్లీ    4) కోల్‌కతా


22. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కోల్‌కతా    2) ముంబయి   3) చెన్నై      4) హైదరాబాద్‌


23. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను(BSE) ఎప్పుడు స్థాపించారు?

1) 1875    2) 1876   3) 1877   4) 1878


24. బీఎస్‌ఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ    2) ముంబయి   3) చెన్నై     4) కోల్‌కతా


25. సెబీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ ఎవరు?

1) మదభి పూరి బుచ్‌    2) ఎస్‌.ఎస్‌. ముంద్రా   3) శక్తికాంతదాస్‌   4) రంగరాజన్‌


26. బీఎస్‌ఈ ప్రస్తుత చైర్‌పర్సన్‌ ఎవరు?

1) ఎస్‌.ఎస్‌. ముంద్రా   2) కె.వి.కామత్‌    3) రతన్‌టాటా    4) రమేష్‌ చంద్‌


27. ముద్రా బ్యాంకును (మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ) ఎప్పుడు స్థాపించారు?

1) 2016   2) 2015   3)  2014    4) 2013


28. ముద్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి    2) న్యూదిల్లీ     3) చెన్నై    4) కోల్‌కతా


29. సాధారణ బీమా సంస్థను (జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ - GIC)  ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1972    2) 1973   3) 1974    4) 1975


30. జీఐసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) కోల్‌కతా    2) చెన్నై    3) ముంబయి    4) న్యూదిల్లీ


31. ఉత్పత్తికి ఉపయోగపడే మానవ నిర్మితమైన యంత్రాలు, పనిముట్లు, ముడిపదార్థాలను అర్థశాస్త్రంలో ఏమంటారు?

1) మూలధనం    2) వడ్డీ    3) లాభం   4) భాటకం


32. ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వు బ్యాంకుకు ఒక అనుబంధ సంస్థగా ఏర్పాటైన బ్యాంకు ఏది?

1) ఎస్‌బీఐ    2) ఐడీబీఐ బ్యాంకు   3) నాబార్డు  4) ఎల్‌ఐసీ


33. సిడ్బీ (SIDBI)  ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) లఖ్‌నవూ     2) ముంబయి     3) న్యూదిల్లీ     4) కోల్‌కతా


సమాధానాలు

1-1  2-3  3-3  4-1  5-3  6-3  7-1  8-1  9-1  10-3  11-4  12-4  13-2  14-1  15-4 16-1  17-1  18-1  19-1  20-3  21-2  22-2  23-1  24-2  25-1  26-1  27-2  28-1  29-1 30-3 31-1 32-2 33-1. 


మరికొన్ని..

1. రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థల (స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌  SFC) చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

1) 1950   2) 1951   3) 1952    4) 1953


2. ఎక్సిమ్‌ బ్యాంకు (Exim Bank)  ప్రధాన లక్ష్యం.....

1) ఎగుమతి, దిగుమతిదారులకు విత్త సహాయం అందించడం

2) అంతర్జాతీయ వ్యాపారానికి విత్త సహాయం

3) స్వల్పకాలిక రుణాలు అందించడం 

4) 1, 2


3. ఐడీబీఐ బ్యాంకు ప్రధాన లక్ష్యం ఏమిటి?

1) పరిశ్రమల అభివృద్ధికి మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించడం

2) పరోక్ష రుణ సహాయం అందించడం

3) వ్యవసాయాభివృద్ధికి ఆర్థిక సహాయం

4) ఏదీకాదు


4. యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాను (UTI) ఏ కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టారు?

1) షరాఫ్‌ కమిటీ    2) నరసింహన్‌ కమిటీ    3) రంగరాజన్‌ కమిటీ    4) శివరామన్‌ కమిటీ


5. యూటీఐ ప్రధాన లక్ష్యం...

1) మధ్యతరగతి కుటుంబాల నుంచి పొదుపు సేకరించడం

2) పారిశ్రామికీకరణతో ఏర్పడే ప్రయోజనాలను అందరితో పంచుకోవడానికి అవకాశమివ్వడం

3) 1, 2     4) రుణ సహాయం


6. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థల ప్రధాన లక్ష్యం ఏమిటి?

1) పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయడం    

2) మార్కెటింగ్‌ వసతుల ఏర్పాటుకు తోడ్పడటం

3) నూతన అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

4) పైవన్నీ


7. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1982, జులై 12    2) 1983, జులై 13   3) 1984, జులై 14   4) 1985, జులై 15


8. నాబార్డ్‌ ప్రధాన లక్ష్యం ఏమిటి?

1) గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలందించే సంస్థలకు పునర్‌విత్త సౌకర్యం కల్పించడం

2) ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం    

3) మధ్యకాలిక రుణాలు అందించడం

4) ఏదీకాదు


సమాధానాలు

1-2  2-4  3-1  4-1  5-3  6-4  7-1  8-1.

* ఏదైనా సంస్థలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటా ప్రభుత్వం కలిగి ఉంటే ఆ సంస్థను ఏమంటారు?

1) ప్రభుత్వరంగ సంస్థ    2) ప్రైవేట్‌రంగ సంస్థ 

3) శాఖాపరమైన సంస్థ    4) ప్రైవేట్‌ కంపెనీలు     

జవాబు: 1


* మనదేశంలో అధిక లాభాన్ని గడిస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఏది?

1) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ONGC)

2) బీఎస్‌ఎన్‌ఎల్‌    3) హెచ్‌సీఎల్‌   4) ఏదీకాదు

జవాబు: 1


కింది వాటిలో అధిక నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఏది?

1) ఎన్‌టీపీసీ    2) బీఎస్‌ఎన్‌ఎల్‌

3) గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌

4) కోల్‌ ఇండియా లిమిటెడ్‌

జవాబు: 2

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌