• facebook
  • whatsapp
  • telegram

మానవ కారక విపత్తులు  

రోడ్డుపై దాగి ఉన్న మహమ్మారి!
 

విపత్తుల కారణంగా ఏటా అత్యధికంగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటోంది. ప్రపంచ    వ్యాప్తంగా ప్రకృతి ప్రకోపాలకు తోడు రోడ్డు ప్రమాదాలు, యుద్ధాలు, జాతుల హింస లాంటి మానవ కారక విపత్తులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయవాదం, ఉగ్రవాదం, ఆధిపత్య భావజాలం తదితరాలన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా ఈ తరహా దుర్బలత్వానికి అవకాశం ఉన్న అంశాలపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహనతో ఉండాలి. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలతో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎదురైన విపత్తులు, సంభవించిన సంవత్సరాలు, ప్రాంతాలు, మిగిల్చిన ప్రాణనష్టం గణాంకాలను గుర్తుంచుకోవాలి.


1. మానవప్రేరిత విపత్తులకు కారణాలు?
1) వనరుల దోపిడీ        2) సామ్రాజ్యవాదం 
3) జాతీయాభిమానం     4) పైవన్నీ


2. దేశంలో అతిపెద్ద మానవకారక విపత్తు ‘భోపాల్‌ పారిశ్రామిక దుర్ఘటన’ జరిగిన రోజు?
1) 1984, డిసెంబరు 2    
2) 1984, డిసెంబరు 3    
3) 1984, డిసెంబరు 4     
4) 1984, డిసెంబరు 5
 

3. భోపాల్‌ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలను బలిగొన్న విషవాయువు?    
1) ఇథైల్‌ ఐసోసైనేట్‌    2) పాస్జీన్‌    
3) మిథైల్‌ ఐసోసైనేట్‌    4) సెరీన్‌


4. భోపాల్‌ గ్యాస్‌ విషాదం జరిగిన కంపెనీ?
1) నెరోలాక్‌ కెమికల్‌ కంపెనీ 
2) యూనియన్‌ కార్బైడ్‌ 
3) ఎన్‌రాక్‌ సంస్థ       
4) రాజోల్‌ కంపెనీ


5. కిందివాటిలో ‘పేదవాడి ఆయుధాలు’ అని వేటిని పిలుస్తారు?
1) అణ్వాయుధాలు     2) రసాయన ఆయుధాలు 
3) జీవాయుధాలు     4) అటామిక్‌ ఆయుధాలు

6. దక్షిణ కొరియాలో 2014, ఏప్రిల్‌ 16న జరిగిన పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు?
1) 380        2) 75    3) 150        4) 200

7. ఏ సందర్భం తర్వాత ‘సామూహిక జనహనన’ ఆయుధాలను ‘సంప్రదాయేతర’ ఆయుధాలుగా పిలుస్తున్నారు?
1) 2004, ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత
2) 2003, ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత
3) 2004, వియత్నాంపై అమెరికా దాడి తరువాత
4) ఏదీకాదు

8. ‘దాగి ఉన్న మహమ్మారి’ గా కిందివాటిలో దేన్ని  పిలుస్తారు?
1) రోడ్డు ప్రమాదాలు     2) రైల్వే ప్రమాదాలు 
3) జీవాయుధాలు     4) అణ్వాయుధాలు


9. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
1)  కర్ణాటక       2) తమిళనాడు 
3) మహారాష్ట్ర     4) ఆంధ్రప్రదేశ్‌


10. 1945, ఆగస్టు 6న ‘ఎనలాగో’ అనే అమెరికన్‌ విమానం ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది?
1) నాగసాకి      2) హిరోషిమా 
3) జెరూసలేం     4) టోక్యో


11. ‘సామూహిక జనహనన’ ఆయుధాలు అనే మాట ఎప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది?
1) 2003   2) 2004  3) 2005  4) 2006


12. ఉక్రెయిన్‌లోని ‘చెర్నోబిల్‌’ న్యూక్లియర్‌ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1994   2) 1995  3) 1984  4) 1986


13. ‘డర్టీబాంబ్స్, బ్యాక్‌ పాప్‌ బాంబ్స్‌’ అని వేటిని  పిలుస్తారు?
1) జీవాయుధాలు 
2) రేడియోధార్మిక పేలుడు పదార్థాలు 
3) పారిశ్రామిక దుర్ఘటనలు      4) పైవేవీకావు
 

14. తమిళనాడులోని కుంభకోణంలో అగ్నిప్రమాదం సంభవించి 93 మంది పిల్లలు ప్రాణాలు  కోల్పోయిన సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 2000  2) 2001  3) 2002  4) 2004


15. దిల్లీలోని ఉపహార్‌ థియేటర్‌ అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది?
1) 1997, జూన్‌ 23       2) 1997, జూన్‌ 13      
3) 1999, జూన్‌ 23      4) 1999, జులై 16


16. దేశంలో అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణ పథకాన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది?
1) 2009, నవంబరు      2) 2006, డిసెంబరు   
3) 2004, నవంబరు       4) 2008, డిసెంబరు
 

17. కిందివాటిలో ఏది మానవకారక విపత్తు?
1) వరద       2) భూకంపం   
3) కరవు       4) అగ్నిప్రమాదం


18. ఏ అడవులు అధికంగా అగ్నిప్రమాదాలకు     గురవుతున్నాయి?
1) కొనిఫెరస్‌ అడవులు     2) మడ అడవులు   
3) చిట్టడవులు         4) ఆకురాల్చు అడవులు


19. ఇచ్చినవాటిలో ఏది మానవ కారక విపత్తు?
1) వరద       2) భూకంపం   
3) కరవు       4) రోడ్డు ప్రమాదం


20. కిందివాటిలో ఏది మానవ కారక విపత్తు?
1) భూపాతం            2) భూకంపం   
3) రైలు ప్రమాదం      4) తుపాను ఉప్పెన


21. కిందివాటిలో ఏది భూనిర్మితిలో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యం?
1) అగ్నిపర్వత పేలుళ్లు      2) బాంబు విస్ఫోటం   
3) క్షామం                    4) అగ్నిప్రమాదం


22. అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు ఏ వయసుల మధ్య వారికి జరుగుతున్నాయి?
1) 18 - 35 ఏళ్లు       2) 12 - 15 ఏళ్లు   
3) 30 - 45 ఏళ్లు       4) 45 ఏళ్లకు పైబడి


23. విమానం అగ్నిప్రమాదంలో చిక్కుకున్నపుడు ప్రయాణికుల్ని పడుకోమని చెప్పడానికి కారణం?
1) వారిని ఎవరూ నెట్టకుండా ఉండటానికి
2) వారిని సీట్ల కింద దాక్కుని ఉండమనడానికి
3) పొగ పైకి వెళుతుంది కాబట్టి
4) గాజు కిటికీలకు వెళుతుంది కాబట్టి

24. జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది?
1) నాగ్‌పుర్‌       2) చెన్నై   
3) హైదరాబాద్‌       4) బెంగళూరు


25. 2005, అక్టోబరు 29న రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడ ప్రమాదానికి గురైంది?
1) రామన్నపేట - నల్గొండ 
2) బొత్తలపాలెం - నల్గొండ
3) నకిరేకల్‌ - నల్గొండ      
4) పానగల్లు - నల్గొండ


26. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్యలో మొదటి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఎంత? 
1) 7వ    2) 13వ    3) 14వ   4) 15వ 

27. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్యలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) 8వ   2) 9వ    3) 10వ   4) 11వ

28. 2004, జులై 16న జరిగిన పాఠశాల అగ్నిప్రమాదంలో 93 మంది విద్యార్థులు మరణించిన సంఘటన జరిగిన ప్రాంతం?
1) తిరువనంతపురం - కేరళ     
2) కుంభకోణం - తమిళనాడు
3) ఉడుపి - కర్ణాటక      
4) నాందేడ్‌ - మహారాష్ట్ర


29. దిల్లీలో సౌదీ అరేబియా - కజకిస్థాన్‌ విమానాలు ఢీకొని 349 మంది మరణించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1996, నవంబరు 12        
2) 1997, నవంబరు 20 
3) 1997, నవంబరు 12        
4) 1996, నవంబరు 20      

30. దేశవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రం?
1) మహారాష్ట్ర     2) తమిళనాడు
3) కర్ణాటక           4) ఆంధ్రప్రదేశ్‌ 


31. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారత దేశంలో ఏటా ఎన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు?
1) 20    2) 15  3) 12   4) 10


32. మంగళూరు విమాన ప్రమాదం జరిగిన తేదీ?
1) 2010, మే 22        2) 2010, మే 20 
3) 2009, మే 22        4) 2009, మే 20

33. అండమాన్‌ తీరంలో బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ మునిగిపోయిన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు?
1) 30     2) 21    3) 25     4) 45 


34. అండమాన్‌ తీరంలో 21 మంది మరణానికి కారణమైన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది? 
1) 2014, ఫిబ్రవరి 9     
2) 2013, అక్టోబరు 10 
3) 2014, జులై 17      
4) 2014, జనవరి 26


35. ఒడిశాలోని హీరాకుడ్‌ రిజర్వాయర్‌లో 31 మంది మరణానికి కారణమైన పడవ ప్రమాద సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 2013, అక్టోబరు 30     2) 2014, జనవరి 26 
3) 2014, ఫిబ్రవరి 9      4) 2014, జులై 17

36. ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దుల్లో మలేసియాకు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని ఉగ్రవాదులు ఎప్పుడు కూల్చివేశారు? 
1) 2014, జులై 17     2) 2013, జులై 17 
3) 2011, జులై 17     4) 2012, జులై 17


37. 2014, జులై 17న ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దుల్లో ఉగ్రవాదులు కూల్చివేసిన మలేసియాకు చెందిన బోయింగ్‌ 777 విమానంలో ఎంతమంది ప్రయాణికులు మరణించారు? 
1) 195     2) 95 
3) 295     4) 275  

38. మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం గ్రామంలో 2013, అక్టోబరు 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు? 
1) 45     2) 35 
3) 55     4) 15 


39. మెదక్‌ జిల్లాలో మూసాపేట్‌ రైల్వేక్రాసింగ్‌ వద్ద స్కూల్‌ బస్సు, రైలు ఢీకొని పలువురు విద్యార్థుల మరణానికి కారణమైన సంఘటన ఎప్పుడు    జరిగింది?
1) 2014, జూన్‌ 24     2) 2014, ఆగస్టు 24 
3) 2014, మే 24     4) 2014, జులై 24


40. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు 2014, ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీని నిర్ణయించింది? 
1) ముగ్గురు     2) ఐదుగురు 
3) ఆరుగురు     4) ఏడుగురు 


41. కిందివాటిలో నాడీవ్యవస్థపై ప్రభావం చూపే విష వాయువులు ఏవి? 
1) టబున్‌     2) సరీన్‌ 
3) సొమన్‌     4) పైవన్నీ 
 

42. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల సైనికులపై జపాన్‌ సైనికులు ప్రయోగించిన విషవాయువు? 
1) మస్టర్డ్‌ గ్యాస్‌     
2) సరీన్‌ 
3) ప్యాసిజిన్‌     
4) లెవిసైడ్‌ 

సమాధానాలు
1-4; 2-2; 3-3; 4-2; 5-3; 6-1; 7-2; 8-1; 9-2; 10-2; 11-1; 12-4; 13-2; 14-4; 15-2; 16-1; 17-4; 18-1; 19-4; 20-3; 21-1; 22-1; 23-3; 24-1; 25-1; 26-1; 27-3; 28-2; 29-1; 30-2; 31-3; 32-2; 33-2; 34-4; 35-3; 36-1; 37-3; 38-1; 39-4; 40-1; 41-4; 42-2.

Posted Date : 20-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు