• facebook
  • whatsapp
  • telegram

యాంత్రిక శాస్త్రం

ఏదైనా భౌతిక రాశిని కొలవడంలో నిర్దిష్టమైన, అనియతంగా ఎంచుకున్న, అంతర్జాతీయంగా ఆమోదం పొందిన, నిర్దేశ ప్రామాణిక విలువనే 'ప్రమాణం' అంటారు.
భౌతిక రాశి విలువ = సంఖ్యాత్మక విలువ × ప్రమాణం
* ప్రాథమిక లేదా మూల భౌతిక రాశులకుండే ప్రమాణాలను ప్రాథమిక లేదా మూల ప్రమాణాలు అంటారు.
* ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను 'ఉత్పన్న ప్రమాణాలు' అంటారు.
* మూల, ఉత్పన్న ప్రమాణాల సంపూర్ణ సమితిని 'ప్రమాణాల వ్యవస్థ' అంటారు.
* ఇటీవలి కాలంలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ప్రమాణ వ్యవస్థలు C.G.S., F.P.S., M.K.S. పద్ధతులు.
* CGS పద్ధతిలో వరుసగా cm, gm, sec
* FPS పద్ధతిలో వరుసగా Foot, Pound, Second
* MKS పద్ధతిలో వరుసగా Metre, Kilogram, Second.
* ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రమాణాల వ్యవస్థను SI పద్ధతి అని పిలుస్తారు. దీన్ని ఫ్రెంచి భాషలో Systeme International 'd' Units అంటారు.
* SI పద్ధతిని 1971న సదస్సులో వృద్ధిపరిచారు.
* SI ప్రమాణాల్లో దశాంశ పద్ధతిని ఉపయోగిస్తారు.
               1 అడుగు (Foot) = 30 సెం.మీ. = 12 అంగుళాలు
                      1 అంగుళం = 2.5 సెం.మీ.
                         1 కి.మీ.     = 1000 మీ.
                                         = 1000 × 100 సెం.మీ.
* సమతల కోణం, ఘన కోణం అనేవి మితి రహిత రాశులు.

 

ప్రాథమిక భౌతిక రాశులు - ప్రమాణాలు
పొడవు: SI ప్రమాణం - మీటరు
ఒక సెక‌నులోని 2,99,792,458వ వంతు కాలవ్యవధిలో శూన్యంలో కాంతి పథం పొడవు ఒక మీటరు.
ద్రవ్యరాశి: కిలోగ్రాము
ఫ్రాన్స్ దేశంలోని పారిస్ సమీపంలో సెవర్స్ వద్ద ఉండే తూనికలు, కొలతలు అంతర్జాతీయ బ్యూరో వద్ద ఉంచిన ప్లాటినం - ఇరీడియం కడ్డీ నమూనాకు సరిపోయే ద్రవ్యరాశి ఒక కిలోగ్రాము.
కాలం: సెకను
భూస్థితిలోని సీజియం పరమాణువు వికిరణంలోని 9,192,631,770 ఆవర్తనాలకు పట్టే కాల వ్యవధిని 'సెకను' అంటారు.
విద్యుత్ ప్రవాహం: ఆంపియర్
వృత్తాకార మధ్యచ్ఛేద వైశాల్యం కలిగి అనంతమైన పొడవు ఉన్న రెండు తిన్నని సమాంతరంగా విద్యుత్ వాహకాలను ఒక మీటరు దూరంలో ఉంచినప్పుడు వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఈ వాహకాల మధ్య మీటరు పొడవుకు న్యూటన్ బలానికి సమానమైన విద్యుత్ ప్రవాహం 'ఆంపియర్' అవుతుంది.
ఉష్ణగతిక ఉష్ణోగ్రత: కెల్విన్
నీటి త్రిక బిందువుకు ఉండే ఉష్ణగతిక ఉష్ణోగ్రతలో 273.16వ వంతు కెల్విన్‌కు సమానం.
పదార్థ పరిమాణం: మోల్
0.012 kg C - 12లో ఎన్ని పరమాణువులు ఉంటాయో అదే సంఖ్యలో ప్రాథమిక కణాలు కలిగి ఉండే వ్యవస్థ పదార్థ పరిమాణం ఒక మోల్.
కాంతి తీవ్రత: క్యాండెలా
పౌనఃపున్యం ఉన్న ఏకవర్ణ వికిరణాన్ని ఉద్గారం చేస్తూ ఏదైనా ఒక దిశలో 1/683 వాట్/స్టెరేడియన్ వికిరణశీల తీవ్రత కలిగిన జనకానికి ఆ దిశలో ఉండే కాంతి తీవ్రత 'ఒక కాండెలా'.

 

మిత రహిత రాశులు
సమతల కోణం - రేడియన్, ఘనకోణం - స్టెరేడియన్

కాలం ప్రమాణం - సెకను
1 నిమిషం       =     60 సెకండ్లు
1 గంట           =     60 నిమిషాలు = 3600 సెకండ్లు
1 రోజు            =       24 గంటలు  = 1440 నిమిషాలు   = 86,400 సెకండ్లు



లీటరు           =      103 సెం.మీ.3 = 10-3 మీ.3
టన్ను           =      103 కి.గ్రా.
1 కారట్        =       200 మి.గ్రా.
బార్              =      0.1 mpa       = 105 పాస్కల్
క్యూరీ            =      3.7 × 1010 సెకన్-1
రాంట్‌జన్ (R)  =     2.58 × 10-4 Ci/ kg
క్వింటాల్        =      100 కి.గ్రా.
బార్న్             =      10-28 మీ.2
ఏర్ (are) a   =     102 మీ.2
హెక్టార్ (ha)      =     104 మీ.2
ప్రామాణిక వాతావరణ పీడనం = 1 atm = 101325 పాస్కల్
                                               = 1.013 × 105 పాస్కల్
* 10-3m నుంచి m వరకు ఉండే (1 mm - 100 m) పొడవులను మీటర్ స్కేలు ఉపయోగించి కొలుస్తారు.
* వెర్నియర్ కాలిపర్సు ఉపయోగించి  m యదార్థత వరకు కొలవవచ్చు.
*  స్క్రూగేజి, స్పెరామీటరు లాంటి పరికరాలతో  m వరకు కచ్చితంగా కొలవవచ్చు.
* అధిక దూరాలను కొలవడానికి 'దృష్టి విక్షేప పద్ధతి' (Parallax Method)ఉపయోగిస్తారు.

దృష్టి విక్షేప పద్ధతిలో రెండు విషయాలు ఉంటాయి అవి:
1) దృష్టి విక్షేపం
2) ప్రాతిపదిక

1º= 60'  = 1.745 × 10-2 rad
1' = 60'' = 2.908 × 10-4  rad
1'' = 4.85 × 10-6 rad.
* అత్యల్ప దూరాలను nm, A° లలో కొలుస్తారు.
10-3     -    మిల్లీ
10-6     -     మైక్రో
10-8     -   ఆంగ్‌స్ట్రామ్
10-9     -       నానో
10-12   -     పికో అని పిలుస్తారు.
* 1 ఫెర్మి= 1 F = 10-15 m
  1 ఆంగ్‌స్ట్రామ్ (- 1 Aº) = 10-10 m
  1 ఖగోళ ప్రమాణం = 1 Au = 1.496 × 1011 m
  1 కాంతి సంవత్సరం = 9.46 × 1015 m
  1 పార్‌సెక్‌ = 3.26 కాంతి సంవత్సరాలు = 3.08 ×  1016 m
* దూరాన్ని కొలిచే ప్రమాణాల్లో అత్యంత పెద్ద ప్రమాణం పార్‌సెక్.

 

ర‌చ‌యిత‌ : పోతా ఢిల్లీబాబు
 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌