• facebook
  • whatsapp
  • telegram

నూతన సాంకేతిక పరిజ్ఞానం

మాదిరి ప్రశ్నలు 

1. ట్విట్టర్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి? 
ఎ) దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది.
బి) ట్విట్టర్‌ని ఇంటర్నెట్‌ ఎస్‌ఎంఎస్‌గా పిలుస్తారు.
సి) దీన్ని జాక్‌ డోర్సే, నోవా గ్లాస్, బిజ్‌ స్టోన్, ఇవాన్‌ విలియమ్స్‌ ప్రారంభించారు.
1) ఎ, బి       2) ఎ, సి  
3) బి, సి      4) పైవన్నీ 

2. మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థకి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) 1జీ - వాక్యూమ్‌ ట్యూబ్స్‌ (శూన్య నాళికలు)
బి) 2జీ - ట్రాన్సిస్టర్స్‌ 
సి) 3జీ - ఇంటెగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌
డి) 4జీ - మైక్రో ప్రాసెసర్లు 
1) ఎ, బి      2) బి, సి  
3) ఎ, డి      4) పైవన్నీ 

3. 5జీ సాంకేతికతకి సంబంధించి కిందివాటిలో సరైనవి?
ఎ) ఈ సాంకేతికత కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆగ్మెంటెడ్, వర్చువల్‌ రియాల్టీ ఆధారంగా దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా ఉన్న అనుభూతి పొందొచ్చు.

బి) నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ పాలసీ - 2018లో దేశంలో 5జీ విస్తరణ, వ్యాప్తి కోసం కావాల్సిన విధి విధానాలను చర్చించారు. 
సి) ఈ సాంకేతికత ద్వారా 10 జీబీపీఎస్‌ వేగాన్ని కూడా అత్యంత తక్కువ ఖర్చుతో పొందొచ్చు.
డి) భారతదేశమంతా 5జీ ని విస్తరించడం ద్వారా డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గ్రామాలకు కూడా విస్తరిస్తుంది.
1) ఎ, బి      2) బి, సి  
3) ఎ, డి      4) పైవన్నీ 

4. నెట్‌ న్యూట్రాలిటీ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? (ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు - ఐఎస్‌పీ తమ ద్వారా ప్రయాణించే నెట్‌వర్క్‌లు అన్నింటినీ ఎలాంటి వివక్షా లేకుండా అన్ని అప్లికేషన్లు, సైట్లు, ఇతర సేవలకు కావాల్సిన అనుసంధానాన్ని ఒకే విధంగా కల్పించడాన్ని నెట్‌ న్యూట్రాలిటీ అంటారు.)
1) ఏకే భార్గవ కమిటీ 
2) శ్రీకృష్ణ కమిటీ 
3) అనురాగ్‌ శర్మ కమిటీ 
4) ఎస్‌ఎన్‌ వర్మ కమిటీ 

5. క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో కింది ఏ సాంకేతికతను వాడతారు?
1) బిట్‌ కాయిన్‌ టెక్నాలజీ
2) బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ
3) CRISP - R టెక్నాలజీ 
4) PCR టెక్నాలజీ 

6. Non  - Fungible Tokens (NFT) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?
1) వీటి ద్వారా డిజిటల్‌ వస్తువుల తయారీకి కావాల్సిన గుర్తింపు లభిస్తుంది.
2) డిజిటల్‌ కూపన్లు లేదా వీడియో క్లిప్స్‌ను చేసినప్పుడు వాటిని బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఆధారంగా అనుసంధానించినప్పుడు అవి అత్యంత భద్రంగా ఉంటాయి.
3) ఎన్‌ఎఫ్‌టీ ద్వారా ఎలాంటి మోసం లేకుండా డిజిటల్‌ వస్తువులను అమ్మడం లేదా కొనడం చేయొచ్చు. 
4) పైవన్నీ

7. కిందివాటిలో వాటి సాంకేతికత ఆధారంగా సరైన జతలను గుర్తిండండి.
1) క్వాంటం టెక్నాలజీ - క్యూబిట్స్‌
2) టెలిగ్రామ్‌ అప్లికేషన్‌ - క్లౌడ్‌ ఆధారిత సేవలు 
3) వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వి.పి.ఎన్‌) - ఇంటర్నెట్‌ ఆధారంగా పని చేసే ఎన్‌క్రిప్టెడ్‌ రియల్‌ టైం కనెక్షన్‌
4) పైవన్నీ 

8. కింది ఏ వ్యవస్థను జియో స్పేషియల్‌ టెక్నాలజీ అని పిలుస్తారు?
1) GIS - జియో గ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం
2) RS - రిమోట్‌ సెన్సింగ్‌ సిస్టం
3) GPS - గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం
4) పైవన్నీ

9. భారతదేశంలో కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (సీఏడీ) మోడల్‌ను ఉపయోగించుకుని తయారు చేసే త్రీడీ ప్రింటింగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ల్యాబ్‌ను ఎక్కడ నెలకొల్పారు?
1) హైదరాబాద్‌      2) ముంబయి
3) ఔరంగాబాద్‌      4) న్యూదిల్లీ

10. కొవిడ్‌-19 సమయంలో కింది ఏ సంస్థ ఆక్సిజన్‌ను ద్రవ ఆక్సిజన్‌ రూపంలో తయారు చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసింది?

1) ICMR - Indian Council Of Medical Research
2) AIIMS - All India Institute Of Medical Sciences
3) NIV -  National Institute Of Virology
4) ISRO - Indian Space Research Organisation

11. అంతరిక్షంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను ట్రాక్‌ చేయడానికి ఇస్రో రూపొందించిన ప్రాజెక్ట్‌? 
1) ఆదిత్య  L1      2) నేత్ర ప్రాజెక్ట్‌ 
3) శుక్రయాన్‌         4) ఆర్‌ఎల్‌వీ 

12. భారతదేశంలో బయో ఇన్ఫర్మాటిక్స్‌ రంగంలో పరిశోధనల కోసం రూపొందించిన సూపర్‌ కంప్యూటర్‌ ఏది? 
1) పరమ్‌ బయో క్రోమ్‌ 
2) పరమ్‌ శివాయ్‌  
3) పరమ్‌ శ్రావక్‌   
4) పరమ్‌ అనంత్‌ 

13. స్మార్ట్‌ ఫోన్‌ను కింది ఏ సాంకేతికతగా పేర్కొంటారు? 
1) సూపర్‌ కంప్యూటర్‌  
2) మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్‌ 
3) మైక్రో కంప్యూటర్‌  
4) మినీ కంప్యూటర్‌ 

14. కిందివాటిలో బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ్బతీతిళిద్శి రూపొందించిన సూపర్‌ కంప్యూటర్‌ ఏది?
1) అనుపమ్‌       2) సాగా  
3) పరమ్‌            4) ఈకేఏ

15. నానో టెక్నాలజీకి సంబంధించి కిందివాటిలో సరైనవి? 
ఎ) భారత ప్రభుత్వం 2004లో నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ సహకారంతో నానో సాంకేతికత అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
బి) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ - బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - బాంబేలో నానో సాంకేతికత అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.
సి) 2007లో భారత ప్రభుత్వం నానో మిషన్‌ను ప్రారంభించింది.
1) ఎ, సి        2) ఎ, బి  
3) బి, సి        4) పైవన్నీ 

16. కింది ఏ సంస్థ రక్షణ రంగ అవసరాల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను తయారు చేసింది? (కాన్పూర్‌లోని డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ - దీలీళీళిదీని లో దీన్ని రూపొందించారు. దీని బరువు 9 కేజీలు.)
1) ఇస్రో          2) డీఆర్‌డీఓ  
3) బార్క్‌         4) సీఎస్‌ఐఆర్‌

17. బ్యాంకింగ్‌ రంగంలో ఉపయోగించే రోబోలకు సంబంధించి కిందివాటిలో సరైన జత? 
ఎ) లక్ష్మి - సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 
బి) మిత్ర అండ్‌ క్యాండీ - కెనరా బ్యాంక్‌ 
సి) ఇరా - హెచ్‌డీఎఫ్‌సీ
డి) రోబోటిక్‌ ఆర్మ్‌ - ఐసీఐసీఐ
1) ఎ, డి        2) బి, సి  
3) ఎ, సి        4) పైవన్నీ 

18. నానో సాంకేతికత అధ్యయనం కోసం నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ నానో మెటీరియల్స్‌ను ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉంది? 
1) న్యూదిల్లీ       2) ముంబయి  
3) చెన్నై           4) హైదరాబాద్‌ 

19. ఒక నానో మీటర్‌ = .... (మీటర్‌ లో ఒక బిలియన్‌ వంతును నానో మీటర్‌ అంటారు.) 
1) 106 మీ.      2) 103 మీ.
3) 109 మీ.      4) 1012 మీ.

20. భారతదేశంలో నానో సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఎన్నో పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి సూచించారు?

1) ఏడో             2) ఎనిమిదో 

3) తొమ్మిదో      4) పదో

సమాధానాలు

14 24 34 41 52 64 74 84 93 104 112 121 133 141 154 162 174 184 193 203

చాట్‌ జీపీటీ

* కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సంభాషణ చాట్‌ బోట్‌ను చాట్‌ జీపీటీగా పిలుస్తారు.

* ఇది మానవ రోజువారీ జీవితంలో తలెత్తే అనేక ప్రశ్నలకు అత్యంత చాకచక్యంతో వేగంగా, సమర్థవంతంగా సమాధానాలు అందిస్తుంది.

* చాట్‌ జీపీటీ అంటే చాట్‌ జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌.

* కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ ఆధారంగా డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌ ్బలిలిశి - లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం - 3్శ సహాయంతో మానవుడిలా సమాధానాలు చెప్పడం దీని ప్రత్యేకత.

* మనం అడిగిన ప్రశ్నలకు, వేర్వేరు సమాధానాలు ఉన్న వనరులను (ఆప్షన్స్‌) చూపించకుండా అత్యంత కచ్చితత్వం కలిగిన ఆన్సర్స్‌ను అందిస్తుంది. సంబంధం లేని ప్రశ్నలను తిరస్కరిస్తుంది. 

* ప్రపంచవ్యాప్తంగా 2021 వరకు ఉన్న గణాంకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఇందులో సమాధానాలు లభిస్తాయి. 

* తోటి మనిషితో మాట్లాడినట్లు (చాట్‌ చేసినట్లు) ఈ వ్యవస్థతో చాట్‌ చేయొచ్చు. 

* డిజిటల్‌ మార్కెటింగ్, ఆన్‌లైన్‌ కంటెంట్‌ క్రియేషన్, కస్టమర్‌ ఎంక్వైరీ సర్వీస్, కోడింగ్‌ మొదలైనవి మాత్రమే కాకుండా ప్రాథమిక ఈ-మెయిల్స్, స్కూల్‌-కాలేజ్‌ అసైన్‌మెంట్స్, బయోడేటా రూపకల్పన లాంటి అనేక విధులను ఇది నిర్వహిస్తుంది.

సవాళ్లు

* ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇవ్వొచ్చు లేదా లింగ, జాతి వివక్ష మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని ఆన్సర్స్‌ చెప్పొచ్చు.

* ఇచ్చే సమాధానాల్లో మానవీయ కోణం లోపించవచ్చు.

* సమాధానాలు 2021 వరకు ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటాయి. 

* ఇది అత్యంత నవీన సాంకేతికత కాబట్టి దీని వినియోగంపై ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం.

రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు 
 

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌